ప్రేమించి..సహ జీవనం సాగించి | Woman Techie Cheated By Boy Friend In Bengaluru, Case Filed In Police Station - Sakshi
Sakshi News home page

ప్రేమించి..సహ జీవనం సాగించి

Published Tue, Apr 16 2024 11:43 AM | Last Updated on Tue, Apr 16 2024 11:50 AM

woman techie cheated by Boy Friend - Sakshi

మహిళా టెక్కీకి మోసం 

యశవంతపుర: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసగించాడని మహిళా టెక్కీ (27) ఒకరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు... బెంగళూరులో ఉత్తర భారత్‌కు చెందిన యువతి టెక్కీగా పని చేస్తోంది. 2022లో ఆమె జిమ్‌కు వెళ్లతుండగా ఆదిత్య సింగ్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు కూడా టెక్కీగా పని చేస్తున్నాడు. స్నేహం ప్రేమగా మారింది.

పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో కలిసి బండేపాళ్యలో బాడుగ ఇంటిలో ఇద్దరు సహజీవనం సాగిస్తున్నారు. ఇటీవల పెళ్లి చేసుకుందామని ఆమె ఆదిత్యసింగ్‌ను కోరింది. అందుకు ఆతడు నిరాకరించడంతో పాటు ఆమెను ఇష్టానుసారం తిట్టి కొట్టాడు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితురాలు ప్రేమ పేరుతో వంచించాడని బండేపాళ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోమంటే తలను గోడకేసి కొట్టి దౌర్జన్యం చేశాడని వాపోయింది. పోలీసులు ఆదిత్యసింగ్‌కు నోటీసులిచ్చి విచారణకు రావాలని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement