lover cheating
-
ప్రేమించి..సహ జీవనం సాగించి
యశవంతపుర: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసగించాడని మహిళా టెక్కీ (27) ఒకరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు... బెంగళూరులో ఉత్తర భారత్‌కు చెందిన యువతి టెక్కీగా పని చేస్తోంది. 2022లో ఆమె జిమ్‌కు వెళ్లతుండగా ఆదిత్య సింగ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు కూడా టెక్కీగా పని చేస్తున్నాడు. స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో కలిసి బండేపాళ్యలో బాడుగ ఇంటిలో ఇద్దరు సహజీవనం సాగిస్తున్నారు. ఇటీవల పెళ్లి చేసుకుందామని ఆమె ఆదిత్యసింగ్‌ను కోరింది. అందుకు ఆతడు నిరాకరించడంతో పాటు ఆమెను ఇష్టానుసారం తిట్టి కొట్టాడు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితురాలు ప్రేమ పేరుతో వంచించాడని బండేపాళ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోమంటే తలను గోడకేసి కొట్టి దౌర్జన్యం చేశాడని వాపోయింది. పోలీసులు ఆదిత్యసింగ్‌కు నోటీసులిచ్చి విచారణకు రావాలని ఆదేశించారు. -
ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు, అచ్చెన్నాయుడి అనుచరుడి బెదిరింపులు
శ్రీకాకుళం క్రైమ్: సంతబొమ్మాళి మండలం పిట్టవానిపేటకు చెందిన యువకుడు తనను ప్రేమించానని చెప్పి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశా డని విజయవాడకు చెందిన ప్రత్తిపాటి క్రిష్టినా ఏంజిల్ ఆరోపించారు. ఆమె మంగళవారం శ్రీకాకుళంలోని ఓ హొటల్లో మీడియాతో మాట్లాడారు. పిట్టవానిపేటకు చెందిన శాంతికుమార్, తన సోదరుడు రూఫిన్ బెంగళూరులో బైబిల్ కాలేజీలో శిక్షణ తీసుకున్నారని, ఆ సమయంలోనే తనతో శాంతికుమార్ పరిచయం పెంచుకున్నాడని తెలిపారు. ఆ తర్వాత శాంతికుమార్ తన ప్రేమను వ్యక్తం చేశాడని, తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించాడని చెప్పారు. తాను కూడా పెళ్లికి ఒప్పుకున్నానని, ఆ తర్వాత శారీరకంగా కూడా ఇద్దరం ఒక్కటయ్యామ ని తెలిపారు. ఏప్రిల్‌లో అతను తనకు రింగు కూడా తొడిగాడని, ఆ తర్వాత ముఖం చాటేశాడని, ఏప్రిల్ 28 నుంచి కుటుంబ సభ్యులంతా తన ఫోన్ నంబర్ బ్లాక్ చేశారని పేర్కొన్నారు. వేరే సంబంధం కుదరడంతో తనను వదిలేశారని, దీంతో జూన్‌లో శాంతికుమార్ ఇంటికి వెళ్లి మరీ బతిమలాడానని, అయి నా ఒప్పుకోకపోవడంతో విజయవాడ దిశ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, అప్పట్లో పలాస తెలుగుదేశం పార్టీ నాయకుడు, అచ్చెన్నాయుడు అనుచరుడు బో సుబాబుతో తనను బెదిరించారన్నారు. ఈ విష యంపై బోసుబాబుతో పాటు శాంతికుమార్ ఆయ న తండ్రిపై కూడా తాను విజయవాడ పడమట స్టేషన్లో కేసు పెట్టానని చెప్పారు. రెండు కేసులు పెట్టడంతో శాంతికుమార్ కుటుంబ సభ్యులు తనపై సంతబొమ్మాళి పీఎస్‌లో కేసు పెట్టారని, టెక్కలి డీఎస్పీ విచారణకు రావాలంటే సోమవారం విచారణకు హాజరై తన వద్ద ఉన్న ఆధారాలు అన్నీ సమర్పించానని చెప్పారు. శాంతికుమార్ తనను పెళ్లి చేసుకునే వరకు వదిలి పెట్టబోనని, అతని ఇంటి ముందు మౌన పోరాటం చేస్తానని తెలిపారు. పోలీసు అధికారులు సహకరించి తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. -
గద్వాల యువతి బలవన్మరణంలో ట్విస్ట్
క్రైమ్: జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఉదంతంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె కడుపు నొప్పితో బలవన్మరణానికి పాల్పడలేదని.. ప్రియుడి మోసం భరించలేకే అఘాయిత్యానికి పాల్పడిందని తేలింది. ధరూర్ మండల కేంద్రానికి చెందిన సునంద(23) డిగ్రీ పూర్తి చేసి.. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో చదువుతోంది. తాజాగా సొంతూరికి వెళ్లిన ఆమె.. ఇంట్లోనే ఉరేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడే ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి.. ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రకటించారు. అయితే.. సునంద తొలుత కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం నడిచింది. కానీ, ప్రియుడి ఆ మోసం భరించలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తర్వాత తేలింది. అంతేకాదు.. ఆ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి.. రూ.9 లక్షలను యువతి తరపు బంధువులకు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. యువతి బంధువులను గ్రామ పెద్దలు బలవంతంగా ఒప్పించారని.. ఈ వ్యవహారంలో పోలీసులకు వాటా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సునందకు న్యాయం చేయాలని పలువురు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది. ఇదీ చదవండి: అదే పనిగా భర్త నైట్‌షిఫ్ట్ వెళ్తున్నాడని.. -
నాలుగేళ్ల ప్రేమ.. మరో యువతితో పెళ్లి.. కూతురికి అవమానం జరగడంతో
గన్నేరువరం(మానకొండూర్): కూతురు ప్రియుడి చేతిలో మోసపోయిందనే అవమాన భారంతో ఓ తల్లి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన చాడ బాపురెడ్డి, అదే గ్రామానికి చెందిన బండి లత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల చాడ బాపురెడ్డి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే చాడ బాపురెడ్డి తనను మోసం చేశాడని ఈనెల 15న లత పోలీసుల ఆశ్రయించింది. ప్రియుడితోనే ఉంటానని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టంచేసింది. దీంతో పోలీసులు ఆమెను కరీంనగర్‌లోని సఖి కేంద్రానికి తరలించి భద్రత కల్పించారు. ఇంతలోనే లత తల్లి సారవ్వ(42) కూతురికి అన్యాయం జరిగిందని మనోవేదనకు గురై శుక్రవారం రాత్రి పురుగుల మందుతాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యంలో సారవ్వ మృతి చెందింది. శనివారం మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ప్రియుడు బాపురెడ్డి ఇంటి ఎదుట సారవ్వ శవాన్ని ఉంచేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎస్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ సర్ది చెప్పేప్రయత్నం చేసినా.. వినిపించుకోలేదు. మృతురాలి కూతురు బండి లత ప్రియుడు బాపురెడ్డి ఇంటి ఎదుట బైఠాయించింది. మాయమాటాలతో తనను మోసం చేశాడని ఆరోపించింది. కుటుంబం వి చ్ఛిన్నం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది. పురుగుల మందు తాగించి హత్య చేసేందుకు యత్నించాడని పేర్కొంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. -
ఒక అమ్మాయితో ప్రేమ.. మరో యువతితో నిశ్చితార్థం
చిత్తూరు: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని ఓ యువతి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. పట్టణలోని ఆజాద్ రోడ్డుకు చెందిన మణి కుమార్తె నక్షత్ర బెంగళూరులో డిగ్రీ చదువుతోంది. అలాగే స్థానిక జయప్రకాష్రోడ్డుకు చెందిన మూర్తి కుమారుడు ఆకాష్ తరచూ నక్షత్ర వెంటపడేవాడు. ప్రేమిస్తున్నానని చుట్టూ తిరిగేవాడు. కొన్నాళ్లకు అతడి మాటలు నమ్మిన యువతి ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబీకులు వారి వివాహానికి అంగీకరించారు. అయితే అమ్మాయి చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేద్దామని నక్షత్ర తల్లిదండ్రులు చెప్పడంతో, ముందు నిశ్చితార్థం జరిపించారు. ఈ క్రమంలో ఏడాది నుంచి ఆకాష్ మరో యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు నక్షత్రకు తెలిసింది. దీనిపై ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. సమస్యలు పరిష్కరించుకుందామని ఒకరోజు ఆకాష్ తన వెంట నక్షత్రను బెంగళూరులో ఓ భవనం పైకి తీసుకెళ్లాడు. మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఆమెను కిందకు తోసేశాడు. దీంతో నక్షత్ర తీవ్రంగా గాయపడింది. కాలు విరిగిపోవడంతో వీల్‌చైర్‌కే పరిమితమైంది. ఇదే సాకుగా చూపుతూ ఆకా‹Ù, తల్లిదండ్రులు అడ్డంతిరిగారు. నడవలేని అమ్మాయిని పెళ్లి చేసుకోలేమని తేలి్చచెప్పేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. -
ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష
వరంగల్: వారిద్దరూ దూరపు బంధువులు.. ఓ వివాహ వేడుకలో కలిశారు. హనుమకొండలో ఉంటూ వేర్వేరుగా ప్రైవేట్‌గా ఉద్యోగాలు చేసే వారు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, ఇంతలోనే ఆ యువకుడు కన్పించకుండా పోయాడు. దీంతో తనను తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోనని పట్టుబట్టిన యువతి సదరు యువకుడి ఇంటి ఎదుట దీక్షకు దిగింది. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని ఉప్పరగూడెం గ్రామానికి చెందిన బయన హరిశంకర్ హనుమకొండ జిల్లా కేంద్రానికి చెందిన అనుశెట్టి సుప్రియ ప్రేమించుకుని, పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో హరిశంకర్ అదృశ్యమయ్యాడు. దీంతో సుప్రియ ప్రియుడి గ్రామానికి చేరుకుని శుక్రవారం దీక్షకు దిగింది. తల్లిదండ్రుల మాటలు విని నన్ను దూరం చేస్తున్నాడని, న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించేది లేదని సుప్రియ పేర్కొంటూ కన్నీటి పర్యంతమైంది. హరిశంకర్ పెళ్లి చేసుకోవడం లేదని హనుమకొండలోని పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని దీంతో అతని ఇంటివద్ద దీక్ష చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ప్రియుడితో మాట్లాడే ప్రయత్నం చేయగా సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. స్థానిక ఎస్సై రాజును వివరణ కోరగా.. యువతికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు చెప్పారు. -
వరంగల్‌లో మరో దారుణం.. ప్రియుడు మోసం చేశాడని..
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్‌లో దారుణం వెలుగుచూసింది. మెడికల్ విద్యార్థి ప్రీతి, బీటెక్ స్టూడెంట్ రక్షిత సుసైడ్ ఘటనలు మరవక ముందే మరో యువతి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ప్రేమికుడు మోసం చేశాడన్న కారణంతో ఉరివేసుకొని ప్రాణాలు వదిలింది. ఎల్కతుర్తి మండలం గోపాలపూర్‌కు చెందిన పోగుల ఉషారాణి అనే యువతి.. డిగ్రీ పూర్తి చేసి ల్యాబ్ టెక్నీషియన్ ఒకేషనల్ కోర్సు చేస్తోంది. ఈ క్రమంలో భూపాలపల్లికి చెందిన ప్రశాంత్ కిషోర్‌తో పరిచయం ఏర్పడింది. ఈ స్నేహం ప్రేమగా మారింది. అయితే ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఉషారాణి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూతురు మరణంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఉషారాణి ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సీనియర్ వేధింపులతో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య.. రాష్ట్రంలో ర్యాగింగ్ విష సంస్కృతికి నిరసనగా నేడు(సోమవారం) తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ కళాశాలల బంద్‌కు ఏబీవీపీతో పాటు ఓయూ జేఏసీ పిలుపునిచ్చాయి. ప్రీతి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వైద్య విద్యార్థి మృతికి కారణమైన సైఫ్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నాయి. -
Vikarabad: ‘ప్రియురాలిలో అమ్మా నాన్నల ప్రేమను చూశా.. కానీ’
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని ప్రేమించి వివాహం చేసుకుంటుందన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాలప్పడ్డాడు. ఈ సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మాధవరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ గ్రామానికి చెందిన కటిక కృష్ణాజీ కుమారుడు ప్రవీణ్‌కుమార్ (26) బీఈడీ పూర్తి చేశాడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు సరూర్‌నగర్ శ్రీనివాస కాలనీలోన ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. బీఈడీ చదివే సమయంలో పరిచయమైన ఓ యువతిని ప్రేమించాడు. నాలుగు సంవత్సరాలుగా వీరు కలిసిమెలసి ఉంటున్నారు. అయితే కొంత కాలంగా తనను కాదని వేరే యువకుడిని యువతి ప్రేమిస్తుండటంతో ప్రవీణ్‌కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం తెల్లవారు జామున ఒక సెల్ఫీ వీడియా తీసి, సూసైడ్ నోట్ రాసుకున్నాడు. సెల్ఫీ వీడియోను తన స్నేహితులు, బంధువులకు పంపంచి..వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. అనంతరం నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. వాట్సాప్ స్టేటస్‌లో వీడియో చూసిన స్నేహితులు ప్రవీణ్ ఉండే గదికి చేరుకుని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవీణ్ రాసిన సూసైడ్ నోట్‌ను స్వా«దీనం చేసుకున్నారు. తనతోనే జీవితం ఊహించుకున్నా ‘చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాను. బీఈడీలో పరిచయం అయిన యువతిని మనసారా ప్రేమించాను. ఇద్దరం నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నాం. అమ్మ, నాన్నల ప్రేమను తాను చూపించింది. నా జీవితం మొత్తాన్ని తనతో ఊహించుకున్నాను. ఆ అమ్మాయి లేకుండా బతకలేను. వేరొకరితో ప్రేమలో పడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నా... అందుకే చనిపోతున్నా. నన్ను క్షమించండి. మిస్ యూ ఫ్రండ్స్...నా చివరి చూపు చూసేందుకు రండి..బై.’ అని ప్రవీణ్‌కుమార్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. చదవండి: Hyderabad: నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం -
ప్రేమించింది బావనే కదా అని దగ్గరైంది.. ప్రైవసీ ఫొటోలు తీసి..
తిరువళ్లూరు: ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి వద్ద యువతి ఆందోళనకు దిగింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కొట్టయూర్ గ్రామానికి చెందిన పార్థసారథి కుమార్తె తులసీ(29). తల్లిదండ్రులిద్దరూ దివ్యాంగులు. కాగా, తులసీ అదే ప్రాంతానికి చెందిన తన మామ బాలకృష్ణన్ కుమారుడు సతీష్‌కుమార్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో శారీరకంగా దగ్గరయ్యారు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి రెండు నెలల నుంచి కోరుతోంది. అడిగిన ప్రతిసారి యువకుడు వివిధ కారణాల చెబుతూ వచ్చాడు. ఆమె ఒత్తిడి చేయడంతో తన వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని.. తీసుకొస్తే ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరింపులకు దిగాడు. ఈ నెల 4న యువతి తల్లిదండ్రులు యువకుడి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని కోరారు. నిరాకరించిన యువకుడి తల్లిదండ్రులు 50 సవర్ల బంగారు నగలు, కారు కట్నంగా ఇస్తే పెళ్లికి ఒప్పుకుంటామని తేల్చిచెప్పారు. దీంతో మనస్తాపం చెందిన యువతి తనకు జరిగిన అన్యాయంపై తిరువళ్లూరు కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీయ, ఎస్పీ ఫకెర్లా సెఫాస్ కల్యాన్, తిరువళ్లూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా న్యాయం జరగకపోవడంతో గురువారం ఉదయం యువకుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ మౌన దీక్ష చేపట్టింది. విషయం తెలుసుకున్న మప్పేడు ఎస్ఐ శక్తివేల్ సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించింది. కాగా యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రమంలో సతీష్‌కుమార్ కుటుంబ సభ్యులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రియుడి మోసం.. గర్భవతి కావడంతో యువతి ఆత్మహత్య
కరీంనగర్: ప్రేమ పేరుతో గర్భవతిని చేసి ఆపై ప్రియుడు ముఖం చాటేయడంతో గిరిజన యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కౌటాల మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గురుడుపేట గ్రామానికి చెందిన ఎర్మ సత్తయ్య భక్కుబాయి దంపతులకు కూతురు అంజలి(19) ఇంటర్ పూర్తి చేసి మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రిలో లాబ్ టెక్నిషీయన్‌గా పని చేస్తుంది. ఇదే క్రమంలో అదే ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషియన్‌గా విధులు నిర్వహిస్తున్న చింతలమానెపల్లి మండలంలోని రుద్రాపూర్ గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో శరీరకంగా దగ్గరయ్యారు. దీంతో అంజలి గర్భవతి కావడంతో ఆ విషయాన్ని ప్రియుడికి తెలిపింది. పెళ్లి చేసుకోవాలని కోరడంతో ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయానని మూడు నెలల క్రితం స్వగ్రామమైన గురుడుపేటకు వచ్చింది. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతోంది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. బంధువులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో కాగజ్‌నగర్ మండలంలోని ఈజ్‌గాంలోని ప్రైవేట్ క్లినిక్‌లో చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కాగజ్‌నగర్‌కు శనివారం రాత్రి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందింది. డీఎస్పీ విచారణ... యువతి మృతిచెందిన వార్తను తెలుసుకున్న కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, కౌటాల సీఐ బుద్దే స్వామి, ఎస్సై ప్రవీణ్‌కుమార్ గురుడుపేట గ్రామానికి చేరుకుని యువతి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్(టి) సామాజిక ఆసుపత్రికి తరలించారు. -
చదువు పేరుతో హైదరాబాద్‌లో సహజీవనం.. మాట మార్చిన మహేష్
తుంగతుర్తి (సూర్యాపేట): ప్రేమ పేరుతో ప్రియుడు వంచించాడని యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నారం గ్రామానికి చెందిన వెలిశాల ఉమారాణి, అదే గ్రామానికి చెందిన ఉప్పుల మహేష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. చదువు పేరుతో ఇద్దరు హైదరాబాద్‌లో ఉండి సహజీవనం చేశారు. ఇటీవల ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని స్వగ్రామానికి వచ్చారు. కులాలు వేరు కావడంతో మహేష్ కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఈ విషయాన్ని మహేష్ ప్రియురాలైన ఉమారాణికి చెప్పడంతో పంచాయితీ పెద్ద మనుషుల వద్దకు చేరింది. దీంతో ఉమారాణిని పెళ్లిచేసుకుంటానని మహేష్ ఒప్పకున్నాడు. అనంతరం తాను పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఉమారాణి తుంగతుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు మహేష్‌ను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించగా పెళ్లి చేసుకుంటానిని ఒప్పుకొని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. చదవండి👉ఉత్తరాఖండ్‌లో దారుణం.. కదులుతున్న కారులో తల్లీ, కూతురిపై సామూహిక అత్యాచారం మరొకరితో పెళ్లికి యత్నిస్తున్నారని.. మహేష్ తల్లిదండ్రులు అతడికి వేరే అమ్మాయితో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం తెలియడంతో ఉమారాణి శనివారం సాయంత్రం తిరిగి పెద్ద మనుషులను ఆశ్రయించింది. దీంతో కొంత మంది పెద్ద మనుషులు ఉమారాణిని నువ్వు ఒంటరిగా పోరాటం చేయలేవు.. మహేష్ తల్లీదండ్రుల నుంచి రూ.10లక్షలు ఇప్పిస్తాము ఊరుకోమని సలహా ఇచ్చారు. కానీ ఉమారాణి వినడకుండా మరికొంత మంది పెద్ద మనుషులతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు మహేష్‌ను స్టేషన్‌కు పిలిపించి ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో మహేష్, ఉమారాణిలు పెళ్లికి ఒప్పకున్నారు. అనంతరం పెద్ద మనుషుల సమక్షంలో లగ్నపత్రికను రాసుకున్నారు. తిరిగి ఇంటికి వెళ్లాకా మహేష్ మళ్లీ మాట మార్చి ఉమారాణికి ఫోన్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పాడు. దీంతో ఉమారాణి మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఊరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఉమారాణి తల్లి కేకలు వేయడంతో చుట్టూ పక్కలవారు వచ్చి ఆమెను కాపాడారు. అప్పటికే ఉమారాణి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమి త్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉమారాణి తండ్రి వెలిశాల సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు మహేష్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డానియేల్‌కుమార్ తెలిపారు. చదవండి👉ఇష్టం లేని పెళ్లి.. పిల్లలు పుట్టడానికి మందు అని చెప్పి, ప్రియుడితో కలిసి -
ఒకరితో ప్రేమ, మరోకరితో పెళ్లి నిశ్చయం..అడిగితే రెండు రోజుల్లో వస్తానని చెప్పి
సాక్షి, ఆసిఫాబాద్ అర్బన్: ప్రియుడు మోసగించాడని ఓ యువతి శుక్రవారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో ప్రియుని ఇంటి ఎదుట భైఠాయించింది. మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన యువతి, పట్టణంలోని జన్కాపూర్ కు చెందిన ఓ యువకుడు ఏడాదికాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నాడు. దీంతో వారం రోజుల క్రితం సదరు యువతి ఆసిఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం మళ్లీ వచ్చి వివాహం చేసుకుంటానని చెప్పాడు. ఎంతకూ రాకపోవడంతో శుక్రవారం ఆసిఫాబాద్‌కు వచ్చినట్లు పేర్కొంది. సదరు యువకుడికి వివాహం నిశ్చయించినట్లు తెలిసి న్యాయం చేయాలని అతని ఇంటి ఎదుట బైఠాయించింది. మహిళా సంఘాల సభ్యులు మద్దతు తెలిపారు. -
పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు
రామకుప్పం(చిత్తూరు) : పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటశివకుమార్ తెలిపారు. మండలంలోని విజలాపురానికి చెందిన యువతి(26)ని పెళ్లి చేసుకుంటానని అదే గ్రామానికి చెందిన నారాయణస్వామిరెడ్డి (57) నమ్మించాడు. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. తీరా ఆ యువతి గర్భం దాల్చడంతో ముఖం చాటేశాడు. ఈ క్రమంలో నిలదీసిన యువతిని నారాయణస్వామిరెడ్డి అతడి కుటుంబసభ్యులు కులం పేరుతో దూషించారు. దీంతో బాధితురాలు రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నారాయణస్వామిరెడ్డి అతని కుటుంబసభ్యులు మహేశ్వరరెడ్డి, నళిని, గీతమ్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు పలు సెక్షన్ల కింద కే సు నమోదు చేశారు. పలమనేరు డీఎస్పీ గంగయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఫోన్ మాట్లాడేందుకు సెల్ తీశాడని.. దాడి చేసిన కానిస్టేబుల్ -
ప్రేమపేరుతో నాటకం.. రెండు రోజుల్లో పెళ్లి అనగా..
నిమ్మనపల్లె(చిత్తూరు): ప్రేమ పేరుతో నయవంచనకు దిగాడో ప్రబుద్ధుడు. పదేళ్ల పాటు ప్రేమపేరుతో నాటకమాడి.. శారీరకంగా అనుభవించాడు. రెండు రోజుల్లో పెళ్లి అనగా ఊరు నుంచి ఉడాయించాడు. న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది. సోమవారం తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి ప్రియుడి ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాలు.. నిమ్మనపల్లె మండలం, చౌకిళ్లవారిపల్లెకు చెందిన దాసరి వెంకటరమణ రెండవ కుమారుడు డీ.కేదార్నాథ్(31) తమిళనాడులోని చెన్నై నగరంలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాడు. చెన్నైలోని వెస్ట్‌తాంబరం, గాంధీనగర్, సలప్పస్ట్రీట్, ఎంసీపీ కాలనీకి చెందిన జయరాజ్, కుమారి దంపతుల ద్వితీయ కుమార్తె జీ.చందన(28)తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి పదేళ్లకు పైగా కొనసాగింది. గత నెల ఫిబ్రవరి 21న చెన్నైలోని వెస్ట్‌తాంబరం, ముడిచెర్ రోడ్డు, పళనిగ్రాండ్ పార్టీ హాల్లో పెళ్లి జరిగేలా నిర్ణయించారు. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు రోజుల్లో పెళ్లి అనగా అక్కడి నుంచి ప్రియుడు మాయమయ్యాడు. తర్వాత ఫోన్ చేసి తన తండ్రికి గుండెపోటు వచ్చిందని, స్వగ్రామం వెళ్తున్నాని ప్రియురాలికి చెప్పాడు. రెండు రోజులు తర్వాత కేదార్‌నాథ్‌తో మాట్లాడే ప్రయత్నం చేయగా అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. కుటుంబ సభ్యులు సైతం స్పందించలేదు. దీంతో మోసిపోయానని చందన గ్రహించింది. తనకు న్యాయం చేయాలని చెన్నై పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం బాధితురాలు చందన నిమ్మనపల్లె మండలం, చౌకిళ్లవారిపల్లెలోని ప్రియుడి ఇంటికి చేరింది. అప్పటికే ప్రియుడు కుటుంబ సభ్యులతో సహా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయి ఉండడంతో అతని ఇంటిముందు కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఆపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను పదేళ్లుగా ప్రేమ పేరుతో వంచించి, శారీరకంగా వాడుకుని మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. స్పందించిన ఎస్ఐ ఫాతిమా నిందుడిని పట్టుకుని చెన్నై పోలీసులకు అప్పగిస్తామని తెలిపారు. ఈ నిరసనలో దళిత నాయకులు ఎర్రయ్య, గంగులప్ప పాల్గొన్నారు. -
ప్రేమ పేరుతో వంచన.. పిల్లలు పుడితే ఒప్పుకుంటారని చెప్పి
సాక్షి, నల్గొండ: ప్రేమ పేరుతో వంచించిన వ్యక్తిపై చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ కూతురుతో కలిసి ప్రియుడి ఇంటి ఎదుట సోమవారం ఆందోళన చేసింది. బాధితురాలి కథనం మేరకు.. నిడమనూరు మండలం మాడ్గులపల్లికి చెందిన దర్శనం బేబీరాణి మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తుండగా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన కారింగుల శ్రీనుతో 2012లో పరిచయం ఏర్పడింది. బేబీరాణి 2015లో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తుండగా అక్కడే విద్యాసంస్థలో పీఈటీగా పనిచేస్తున్న శ్రీను ఆమెను కలిసాడు. ప్రేమ విషయం తెలిసి 2016లో నిడమనూరులో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా శ్రీను ఆమెకు దూరంగా ఉండాలని సూచించారు. శ్రీను 2018లో బేబీరాణిని ఒప్పించి గుడిలో వివాహం చేసుకున్నాడు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోవడం లేదని, పిల్లలు పుడితే వాళ్లే ఒప్పుకుంటారని నమ్మించాడు. దీంతో బేబీరాణి 2020లో పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి శ్రీను తనకు ముఖం చాటేసి రెండో పెళ్లి చేసుకున్నాడని బేబీరాణి వాపోయింది. చదవండి: 65 ఏళ్ల వృద్ధుడి కిరాతకం..మాయమాటలు చెప్పి.. లోబర్చుకుని.. తనకు న్యాయం చే యాలని కోరుతూ బంధువులతో కలిసి శ్రీను ఇంటి ఎదుట ఆందోళనకు దిగినట్లు వివరించింది. కాగా, ఆ సమయంలో శ్రీను, అతడి తండ్రి ఇంట్లో లేరు. తన కుమారుడికి బేబీరాణితో ఎలాంటి సంబంధం లేదని శ్రీను తల్లి తెలిపింది. విషయం పోలీసులకు తెలపడంతో ఏఎస్ఐ జోజి వచ్చి పోలీస్‌స్టేషన్‌లో సమస్య పరిష్కరించుకోవాలని సూచించడంతో బేబీరాణి ఆందోళన విరమించింది. చదవండి: విషాదం నింపిన పుట్టినరోజు వేడుకలు.. 4 కార్లు ధ్వంసం.. ముగ్గురు మృతి -
ప్రేయసి కోసం కిడ్నీ దానం చేసిన ప్రియుడు.. ట్విస్ట్ ఏంటంటే
మెక్సికో సిటి: ప్రేమ అనేది ఒక అనిర్వచనీయ అనుభూతి. తమ ప్రేమ చరిత్రలో నిలిచిపోయేందుకు.. కొందరు చారిత్రక కట్టడాలు నిర్మిస్తే.. మరికొందరు అదే ప్రేమను పొందడానికి యుద్ధాలుసైతం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే, ప్రస్తుత సమాజంలో నిజమైన ప్రేమ దొరకడం అనేది ఒక మిథ్య మాదిరిగానే అనే ఉంటుంది. కొందరు యువతీ యువకులు పాశ్చాత్యధోరణులకు అలవాటుపడి.. తమకు బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ ఉండటం ఒక స్టెటస్ సింబల్‌గా భావిస్తున్నారు. మరికొందరు ఒక అడుగుముందుకు వేసి.. ఒకరికి తెలవకుండా మరి కొందరితో ప్రేమాయణాలు నడిపిస్తున్నారు. కొందరు పవిత్రమైన ప్రేమను తమ అవసరాలకోసం వాడుకుంటూ.. దిగజారీ ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రేమముసుగులో విచ్చలవిడిగా తిరిగి.. ఆ తర్వాత ఏవో కారణాలతో విడిపోయి.. ప్రేమకున్న పరువును బజారుకిడుస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు మనం వార్తల్లో చదువుతునే ఉన్నాం. ప్రేమను వాడుకోవడంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరూ అతీతులు కారు. కొన్నిచోట్ల అబ్బాయిలు.. అమ్మాయిలను మోసం చేస్తే.. మరికొన్ని చోట్ల అమ్మాయిలు.. అబ్బాయిలను మోసం చేస్తున్నారు. కొందరు నిజమైన ప్రేమికులు తమ ప్రేమ కోసం.. తాము ప్రేమించిన వారి కళ్లలో ఆనందం కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైన వెనుకాడటం లేదు. ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. బాజా కాలిఫోర్నియాకు చెందిన ఉజీల్ మార్టినేస్ అనే వ్యక్తి ఒక యువతిని ప్రేమించాడు. చాలా సంవత్సరాల పాటు వీరి ప్రేమ బాగానే కొనసాగింది. ఈ క్రమంలో ఉజీల్.. ప్రియురాలి తల్లి కిడ్నీసమస్యతో ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరిక్షీంచిన వైద్యులు వెంటనే కిడ్నీని మార్చాలన్నారు. ఆమె ప్రియురాలు ఎంతోగానో బాధపడింది. తన ప్రియురాలి బాధను చూడలేక.. ఉజీల్ తన కిడ్నిని దానం చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో ఉజీల్కు శస్త్రచికిత్స చేసి అతని కిడ్నీని ప్రియురాలి తల్లికి అమరుస్తారు. ఒకనెల రోజులు గడచిపోయింది. ఉజీల్, ప్రియురాలి తల్లి ఇద్దరు కూడా ఆరోగ్యంతో కొలుకున్నారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స తర్వాత ఉజీల్ ప్రియురాలు అతడినితో మాట్లాడటం మానేసింది. ఈ విధంగా ఒకనెల రోజులు గడిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాత.. తన ప్రియురాలికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైన విషయం ఉజీల్కు తెలుస్తుంది. దీంతో ఉజీల్ తీవ్ర మానసిక వేదనకు గురౌతాడు. తన ప్రియురాలి చేతిలో మోసపోయాయని తెలుసుకుని కుంగిపోయాడు. కాగా, తన మానసిక క్షోభను టిక్‌టాక్ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. ‘తన ప్రేయసి కళ్లలో ఆనందం కోసం ఇంతటి త్యాగం చేశాను.. ఇలా మోసం చేస్తుందని ఊహించలేకపోయాయని కన్నీటి పర్యంతమయ్యాడు.’ ప్రస్తుతం తాము.. మాట్లాడుకోవట్లేదని.. అలాగని తనను.. వ్యతిరేకించడం కానీ, ద్వేషించడంగానీ చేయట్లేదని చెప్పుకొచ్చాడు. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘నీలాంటి గొప్ప వ్యక్తితో ఉండే అర్హత ఆ అమ్మాయికి లేదు..’, ‘ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు..’, ‘నువ్వు ఏం బాధపడకంటూ’ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఎన్నికల ప్రచారంతో చీరల వ్యాపారానికి పెరిగిన డిమాండ్!! -
ప్రియురాలు మరో యువకుడిని ప్రేమిస్తుందని తెలిసి..
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): త్రికోణ ప్రేమకథలో భగ్నప్రేమికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దొడ్డ తాలూకా సూలుకుంట గ్రామంలో చోటుచేసుకుంది. ఆనంద్ (23) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనంద్ ప్రేమిస్తున్న యువతి మరో వ్యక్తిని ప్రేమిస్తోందని తెలుసుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కనబడకుండాపోయిన ఆనంద్ శవం సోమవారం చెరువులో తేలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. షోరూంకు నిప్పుపెట్టిన ఉద్యోగి కోలారు: నగరంలోని ఎల్రక్టానిక్ షోరూంలోని పనిచేస్తూ నగదు కోసం షోరూంకే నిప్పు పెట్టిన వ్యక్తిని ధల్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని సల్మాన్ సాదిక్ పోలీసులు గుర్తించారు. ఇతను రెండేళ్లుగా షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 35 లక్షలకు పైగా ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. మొదట ఇది ప్రమాదం అనుకున్నారు. కానీ క్యాష్‌బాక్స్‌లో ఉన్న నగదు కనిపించకపోయేసరికి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు. చదవండి: పొరపాటున.. దారుణ హత్య -
Punjagutta: రూ.కోట్ల ఆస్తి ఉంది.. నిన్ను పెళ్లి చేసుకుంటా
సాక్షి, పంజగుట్ట: ఆన్లైన్లో పరిచయం చేసుకొని, కోట్ల రూపాయల ఆస్తి ఉంది.. నిన్ను పెళ్లి చేసుకుంటా.. ఇద్దరం జీవితాంతం సంతోషంగా ఉందామని మాయమాటలు చెప్పి యువతిని మోసం చేసిన యువకుడిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన ఆదిత్యకు సోమాజిగూడకు చెందిన బీటెక్ పూర్తిచేసిన ఓ యువతి ఆన్లైన్లో పరిచయం అయ్యింది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి నెల రోజులు సహజీవనం చేశారు. మాస్టర్స్ చదివేందుకు యువతి జనవరి 13న అమెరికాకు వెళ్లింది. ప్రతి రోజూ ఆమెకు ఫోన్ చేసి ఇండియాకు రావాలని, తనపేరుమీద రూ.13 కోట్ల ఫిక్స్‌డిపాజిట్లు ఉన్నాయని, బెంగళూరులో ఆస్తులు ఉన్నాయని నమ్మబలికాడు. నమ్మిన యువతి ఫిబ్రవరి 12వ తేదీన చదువు ఆపేసి ఇండియాకు వచ్చింది. మణికొండలో ఇల్లు తీసుకుని ఉన్నారు. ఇద్దరూ కలిసి టూర్ వెళ్లి జూలైలో నగరానికి వచ్చారు. తర్వాత ఇల్లు బంజారాహిల్స్‌కు మార్చారు. బెంగళూరుకు వెళ్లి డబ్బులు తీసుకు వస్తానని చెప్పి ఆదిత్య వెళ్లాడు. తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ముఖం చాటేశాడు. దీంతో యువతి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత ఆత్మహత్య పంజగుట్ట: వరకట్న వేధింపులకు యువతి బలైన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈస్ట్‌గోదావరి జిల్లా పైడికొండకు చెందిన పి.గంగబాబుకు శివకుమారి(24), శంకరవేణి ఇద్దరు కుమార్తెలు. శివకుమారిని అదే ప్రాంతానికి చెందిన కె.శ్రీనివాస్(35)కి ఇచ్చి వివాహం చేశారు. రూ.2 లక్షల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు కట్నం కింద ఇచ్చారు. అనంతరం శ్రీనివాస్ నగరంలోని శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉంటూ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. అదనపు కట్నం తీసుకురావాలని శివకుమారిని తరచూ శ్రీనివాస్ వేధించేవాడు. ఈ క్రమంలో ఆర్నెళ్ల క్రితం గ్రామంలోని 5 సెంట్ల భూమిని శ్రీనివాస్‌కు ఇచ్చారు. అయినా వేధింపులు ఆపకపోవడంతో గురువారం శివకుమారి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ అతడి తల్లి బాలమ్మపై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడి మోసం.. ఇంటి ముందు యువతి రచ్చ
లక్నో: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఈ మహమ్మారి కట్టడికి అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌తో పాటు, కరోనా నిబంధనలు కఠినంగా అమలు పరుస్తున్నాయి. అయితే, అనేక ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్న కొన్ని పెళ్లిళ్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఒక యువతి తాను ప్రేమించిన యువకుడి ఇంటి ముందు చేసిన రచ్చ వార్తల్లో నిలిచింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గోరఖ్‌పూర్‌కు చెందిన సదరు యువతి, సందీప్ మౌర్యలు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు రెండు సంవత్సరాల క్రితం ఆమె బంధువుల ఇంట్లో కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి ప్రేమ కొనసాగుంది. సందీప్ కూడా తరచుగా ఆ యువతి ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో, సందీప్‌కు భారత సైన్యంతో ఉద్యోగం వచ్చింది. అయితే, అప్పటి నుంచి ఆ యువకుడు యువతిని పట్టించుకోవడం లేదు. కాగా, సందీప్‌కు అతని కుటుంబ సభ్యులు, వేరే అమ్మాయితో వివాహం చేయడానికి సిద్ధపడ్డారు. ఈ విషయం సదరు యువతికి తెలిసింది. వెంటనే, ఆమె ‘ పెళ్లి బాజా, భజంత్రీలు, బరాత్.. తన మిత్రులు, బంధువులతో కలిసి ప్రియుడి ఇంటి ముందుకు చేరుకుంది. అంతటితో ఆగకుండా తనను పెళ్లి చేసుకోవాలంటూ బ్యాండ్ వాయిస్తు రచ్చ చేసింది. దీంతో అక్కడ కొద్దిసేపు గందర గోళ పరిస్థితి ఏర్పడింది. కాసేపటికి రంగంలోకి దిగిన పోలీసులు యువతిని సముదాయించడానికి ప్రయత్నించారు. ఆమె మాత్రం అక్కడి నుంచి వెళ్లనని భీష్మీంచుకుని కూర్చుంది. ‘ తాను, ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటానని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెగేసి’ చెప్పింది. తనను.. ప్రేమ పేరుతో శారీరకంగా కూడా వాడుకుని .. ఇప్పుడిలా మోసం చేస్తున్నాడని పోలీసుల ఎదుట కన్నీటి పర్యంత మయ్యింది. అయితే, పోలీసులు కాసేపటి తర్వాత ఆ యువతిని ఆమె ఇంటికి తరలించారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు సందీప్‌ను మౌర్యను అదుపులోకి తీసుకొన్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. చదవండి: పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు షాక్.. వైరల్ వీడియో -
వైరల్ వీడియో: లవర్‌ను కలిసేందుకు వచ్చి బుక్కయిన యువకుడు
-
వైరల్: లవర్‌ను కలిసేందుకు వచ్చి బుక్కైన ప్రియుడు
లక్నో: ప్రేమించుకున్నారు.. వారి ప్రేమ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసిపోయింది. దీంతో అతడి నుంచి ఆమెను దూరం చేశారు. అమ్మాయిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చేశారు. దీంతో ఆ యువకుడు తన ప్రేయసిని కలిసేందుకు అన్నీ విధాల ప్రయత్నించాడు. చివరకు ఇలా అయితే కుదరదని వేషం మార్చాడు. అబ్బాయి కాస్త అమ్మాయిలా తయారై తన లవర్ ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడే తప్పు చేశాడు. బదౌహీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమించుకున్నారు. తరచూ వీరిద్దరు కలుసుకుంటుండడంతో అమ్మాయి ఇంట్లో తెలిసింది. తన ప్రేయసిని ఎలాగైనా చూడాలని ఆ యువకుడు పై విధంగా చేశాడు. అచ్చం అమ్మాయి మాదిరి తయారయ్యాడు. జుట్టు మొదలుకుని వస్త్రధారణ, పాదరక్షలు, అమ్మాయిలు వాడే వస్తువులు ఇలా మొత్తం అమ్మాయి మాదిరి తయారయ్యాడు. అయితే సాధారణంగా తయారైతే ఎవరూ గుర్తు పట్టకపోయి ఉండవచ్చు. కానీ నవ వధువు మాదిరి తయారై తమ ఇంటికి రావడంతో కుటుంబసభ్యులు అనుమానించారు. ఏం కావాలి అని ప్రశ్నించగా తన ప్రేయసి పేరు చెప్పాడు. అయితే అప్పటికే కుటుంబసభ్యులు గుమిగూడడంతో అతడు కొంత కంగారుపడ్డాడు. ఈ క్రమంలో ముఖం కనిపించకుండా చున్నీ వేసుకుంటుండడంతో జుట్టు పక్కకు జరిగింది. ముఖం చూపించాలని కుటుంబీకులు పట్టుబట్టి తీసేందుకు ప్రయత్నించగా జుట్టు కిందపడిపోయింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. చున్నీ తీసి చూడగా ఆ యువకుడు కనిపించాడు. వెంటనే ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్త చదివిన వారంతా పగలబడి నవ్వుకుంటున్నారు. మరికొందరు జాలి పడుతున్నారు. ఇంకొందరు ప్రేమ కోసం ఈ మాత్రం తిప్పలు పడాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు. ఏమున్నా ఆ అమ్మాయి కోసం అంత కష్టపడ్డాడంటే ఆ అబ్బాయి అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నాడోనని నెటిజన్లు చెబుతున్నారు. ఇచ్చేయండి మీ పిల్లను అని సూచనలు చేస్తున్నారు. సినిమాలో మాదిరి సీన్ నిజ జీవితంలో జరగడంతో ఆ వీడియో వైరలయ్యింది. మీరు చూసేయండి. -
టెకీ ఘనకార్యం; పెళ్లి పేరుతో ఇంటికి రప్పించుకొని..
సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: యువతిని ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని శారీరకంగా అనుభవించి ఆ యువతి వద్ద పెద్ద మొత్తంలో నగదు తీసుకుని మోసం చేసిన ఘటనలో ఓ వ్యక్తిని కూకట్పల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సీసిఐ నర్సింగ్‌రావు తెలిపిన వివరాలు.. మూసాపేటలోని ఆంజనేయనగర్‌లో నివాసముంటున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన జాయ్ (32) విప్రో సంస్థలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీకి ఆల్వాల్‌కు చెందిన ప్రీతి (28) ఉద్యోగం కోసం వెళ్లింది. జాయ్ ఇంటర్వ్యూ అనంతరం ఆమెకు ఉద్యోగం ఇచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య చనువు పెరిగింది. ఈ క్రమంలో వారిద్దరు ప్రేమించుకున్నారు. తాను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను మూసాపేటలోని తన ఇంటికి రప్పించుకున్నాడు. అనంతరం శారీరకంగా ఇద్దరూ కలిశారు. తాను బిజినెస్ చేస్తున్నానని, నీదగ్గర డబ్బు ఉంటే ఇయ్యాలని కోరగా ఆమె అతని మాటలు నమ్మిన దాచుకున్న 10 లక్షలు అతడికి అందజేసింది. ఇంకా డబ్బు అవసరముందని చెప్పడంతో మూడు బ్యాంకుల్లో రుణం తీసుకొని సుమారు రూ. 27 లక్షలు అందజేసింది. మొత్తం రూ. 37 లక్షలు అతడికి ఇచ్చింది. అయితే రుణం తీసుకున్న దగ్గర నుంచి బ్యాంకుల్లో వాయిదాలు చెల్లించాల్సి వచ్చంది. బ్యాంకు వారు వేధించటంతో ప్రీతి.. జాయ్‌ని నిలదీయగా అప్పటికే ఫోన్ స్విచాఫ్ చేసి ఆమెను దూరం పెట్టడమే కాకుండా పరారీలో ఉన్నాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు కూకట్పల్లి పోలీసులకు మార్చి 4న ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలించగా మహారాష్ట్ర నాసిక్‌లో ఉన్నట్లు తెలుసుకున్న అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఇప్పటికే తాను వివాహం చేసుకున్నానని తన భార్య ఊరు వెళ్లిన సమయంలో ప్రీతిని తన ఇంటికి పిలిపించుకున్నానని అంగీకరించాడు. తాను ఆర్థికంగా నష్టపోవటంతో ఈ మోసానికి పాల్పడ్డానని తెలిపాడు. నిందితుడిని పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. అతని బ్యాంకులో ఉన్న రూ. 32 లక్షల నగదును సీజ్ చేయించినట్లు సీఐ నర్సింగరావు తెలిపారు. చదవండి: రూ.30 లక్షలు డిమాండ్.. తీన్మార్ మల్లన్నపై కేసు ! -
ప్రేమ పేరుతో మోసం; యువతిని లైంగికంగా వాడుకొని..
సాక్షి, కంటోన్మెంట్: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని మోసం చేసిన నిందితుడిని బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం గాందీనగర్‌లో తల్లిదండ్రులతో నివాసముండే యువతి (25) గతంలో బోయిన్పల్లి దుబాయ్ గేటు సమీపంలో నివాసముండేది. ఆమె అక్క పిల్లలకు కటింగ్ చేయించేందుకు వెళ్లే క్రమంలో స్థానిక సెలూన్లో పనిచేసే సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌కు చెందిన కనకరాజు (26)తో పరిచయం ఏర్పడింది. గతేడాది లాక్డౌన్ కారణంగా మూడు నెలల పాటు సొంతూరుకు వెళ్లిన కనకరాజు అదే ఏడాది జూన్‌లో తిరిగి బోయిన్‌పల్లికి వచ్చాడు. దీంతో కనకరాజును మళ్లీ కలుసుకున్న యువతికి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి పలుమార్లు లైంగికంగా లోబరుచుకున్నాడు. గత ఫిబ్రవరి 24న తిరిగి సొంతూరుకు వెళ్లిన కనకరాజు మరుసటి రోజు యువతి ఫోన్ చేయగా షెడ్యూల్ కులానికి చెందిన ఆమెతో కులాంతర వివాహానికి తమ ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని చెప్పాడు. తర్వాత బాధితురాలు ఎన్ని సార్లు ఫోన్ చేసినా కనకరాజు స్పందించలేదు. ఈ నేపథ్యంలో గత నెల 16న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇటీవలే కనకరాజును అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చదవండి:కొవ్వును తగ్గిస్తానని చెప్పి.. గదిలోకి తీసుకెళ్లి ఆమెతో.. -
శారీరకంగా వాడుకొని మోసం చేశాడని..
సాక్షి, భీమరదేవరపల్లి(వరంగల్): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకొని మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. ఈ సంఘటన వరంగల్ అర్భన్ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపలతికి చెందిన సంకనేని సునంద.. చంటయపల్లికి చెందిన కొన్నె రమేష్ మద్య నాలుగేళ్ల క్రితం రాంగ్ కాల్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. చదవండి: ఖమ్మం జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య ఈ క్రమంలో రమేష్ ఆర్మీ జవాన్ కాగా సెలవుల్లో ఇంట్లికి వచ్చినపుడల్లా ఇరువురు కలుసుకునేవారు. అయితే తనను పెళ్లి చేసుకుంటాని నమ్మబలకడంతో దగ్గరయ్యానని బాధితురాలు తెలిపింది. ఇటీవల తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రమేష్ ఇంటికికి వెళ్లగా వేరే అమ్మాయితే నిశ్చితార్థం జరిగినట్లు తెలిసిందని చెప్పింది. తనకు రమేష్‌తో వివాహం జరిపించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని మౌన పోరాటానికి దిగింది. విషయం తెలుసుకున్న ముల్కనూర్ ఎస్సై రాజ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని రమేష్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. యువతి మౌన పోరాటానికి మద్దతు తెలిపారు. చదవండి: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. -
ప్రియుడి మోసం.. నర్సు ఆత్మహత్య
సాక్షి. అమలాపురం : ప్రియుడు మోసం చేశాడనే మనస్తాపంతో అల్లవరం మండలం డి.రావులపాలెం శివారుసావరం పేటకు చెందిన కందికట్ల శాంతికుమారి(32) అనేనర్సు ఆత్మహత్యకు పాల్పడింది. తాలూకా పోలీసు స్టేషన్ ఏఎస్సై విప్పర్తి సత్యనారాయణ కథనం ప్రకారం.. శాంతికుమారి అమలాపురం కిమ్స్ ఆసుత్రిలో పదేళ్లుగా నర్సుగా పనిచేసింది. ఐదేళ్ల పాటు దుబాయ్‌లో ఉద్యోగం కూడా చేసింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 11 నెలల క్రితం మళ్లీ కిమ్స్ ఆసుపత్రిలో నర్సుగా చేరింది. నెల రోజుల నుంచి అమలాపురం రూరల్ మండలం కామనగరువు శివారు అబ్బిరెడ్డివారి కాలనీలో ఓ గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటోంది. ఈమె కొన్నేళ్లుగా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన జంగా శ్రీనుతో సహజీవనం సాగిస్తోంది. చదవండి: టెన్త్ అబ్బాయి.. డిగ్రీ అమ్మాయి ఈనెల 21న పెద్ద మనుషుల సమక్షంలో వీరి పెళ్లి విషయమై చర్చలు జరిగాయి. ఆ సమయంలో శ్రీను ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, తనకు ఇది వరకే పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పడంతో మనస్తాపం చెందిన శాంతికుమారి మంగళవారం తన ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తెకు ఫోన్ చేసినా స్పందిచకపోవడంతో తండ్రి నాగరాజు ఇంటికి వచ్చి చూస్తే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపింంది. తండ్రి నాగరాజు ఫిర్యాదుతో రూరల్లౖ సీఐ జి.సురేష్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం కేసు నమోదు చేశారు. -
పెళ్లి చేసుకుందాం రమ్మని..
సాక్షి, వర్గల్ (గజ్వేల్): ప్రేమికుడి మాటలు నమ్మింది..పెళ్లి చేసుకుందాం అనగానే ఒంటరిగా గడప దాటింది.. గుడి వద్ద ప్రియుడి కోసం ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురుచూసినా అతను రాలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆ యువతి వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసుల సాయంతో సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరడంతో కథ సుఖాంతమైంది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌కు చెందిన యువతి (18) అదే జిల్లాలోని మేడ్చల్ సమీప గ్రామానికి చెందిన బాలకృష్ణ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 14న ఉదయం 10 గంటలకు సిద్దిపేట జిల్లా నాచారం గుట్ట దేవాలయంలో పెళ్లి చేసుకుందాం రమ్మని ప్రేమికుడు చెప్పిన మాటలను నమ్మింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా నాచారం గుట్టకు చేరుకుంది. చదవండి: భార్య అశ్లీల చిత్రాలు ఫేస్బుక్లో పోస్ట్ రాత్రి 9 గంటలు దాటుతున్నా ప్రేమికుడు రాలేదు. అతడు మొహం చాటేశాడని అర్థమైంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురై డయల్ 100కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించింది. దీంతో వర్గల్ మండలంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న గౌరారం ఏఎస్సై మధుసూదన్‌రావు, బ్లూ కోల్ట్ సిబ్బంది కానిస్టేబుల్ శ్రీనివాస్, హోంగార్డు దయాకర్, యాదగిరి వెంటనే గుడి వద్దకు చేరుకున్నారు. యువతితో మాట్లాడి వివరాలు తెలుసుకొని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సకాలంలో స్పందించి తమ కూతురును అప్పగించినందుకు యువతి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి : క్లాసులంటూ పిలిచి.. పసిమొగ్గలపై అఘాయిత్యం -
సాఫ్ట్వేర్ శ్వేత మృతి: కేసులో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్: ప్రేమ వంచనకు గురై ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్వేత మృతి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని ఆమె తల్లిదండ్రులు చెప్తున్నారు. తమ బిడ్డ ప్రాణాలు తీసుకునేంత పిరికిది కాదని అన్నారు. అజయ్ శ్వేతను రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లి చంపేసి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. తమ బిడ్డను అజయ్ హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని మీడియా ఎదుట వాపోయారు. అతనికి కొందరు పోలీసులు కూడా సాయం చేస్తున్నారని ఆరోపించారు. (చదవండి: మరో మహిళతో అడ్డంగా బుక్కైన కానిస్టేబుల్) ప్రేమ పేరుతో అజయ్ తమ కూతురుని వేధింపులకు గురిచేశాడని శ్వేత తల్లిదండ్రులు వెల్లడించారు. ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్ మెయిల్‌కు దిగాడని అజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని రాచకొండ కమిషనర్‌ను కలిశామని మంగళవారం మధ్యాహ్నం తెలిపారు. కాగా, మేడిపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శ్వేత ఘట్కేసర్ రైలు పట్టాలపై శవమై కనిపించిన సంగతి తెలిసిందే. లాలాపేటకు చెందిన అజయ్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమ పేరుతో ఆమెను వంచించడం వల్లనే బలవన్మరణానికి పాల్పడిందని ప్రచారం జరిగింది. (చదవండి: ప్రియుడి వంచన.. టెకీ ఆత్మహత్య) -
మోసం: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ప్రియుడి వంచనకు మరో యువతి బలైపోయింది. సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు గురి చేయడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగిణి రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన ఘట్కేసర్ రైల్వే ట్రాక్‌పై సెప్టెంబర్ 18న జరగగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం.. మేడిపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్వేత, లాలాపేటకు చెందిన అజయ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకుంటానని నమ్మబలికిన అజయ్ శ్వేతకు మరింత దగ్గరయ్యాడు. అనంతరం తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. (చదవండి: ప్రేమ పేరుతో మోసం..నిందితుడిని శిక్షించాలని డిమాండ్) ప్రేమ పేరుతో తీసుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో పెట్టి అజయ్ యువతిని వేధించసాగాడు. సోషల్ మీడియా నుంచి ఆ ఫొటోలు తొలగించేందుకు బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. తనతో దగ్గరగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో.. పరువు పోయిందని శ్వేత ఆవేదనకు గురైంది. గతంలో ఓసారి అజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పురాలేదు. నమ్మినవాడు మోసం చేయడం, వేధింపులకు దిగడం తీవ్ర అవమానంగా భావించిన శ్వేత బలవన్మరణానికి పాల్పడింది. కూతురు కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 19న మేడిపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులు శ్వేత ప్రియుడు అజయ్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. (చదవండి: మరో మహిళతో అడ్డంగా బుక్కైన కానిస్టేబుల్) -
కృష్ణా పోలీసుల పెద్ద మనసు
సాక్షి, కృష్ణా/కైకలూరు: దళితులపై దాడులకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించవద్దన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు అండగా నిలవడమే కాకుండా తమ సేవాగుణాన్ని కూడా చాటుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ఒక దళిత యువతి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం అయినంపూడి గ్రామానికి చెందిన దళిత యువతి (22) అదే మండలం వడాలికి చెందిన మంద సాయిరెడ్డి(24) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే యువతిని వివాహం చేసుకునేందుకు సాయిరెడ్డి నిరాకరించడంతో ఆమె ముదినేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు సాయిరెడ్డిని రిమాండ్‌కు తరలించారు. యువతిని కొంతమంది బెదిరించడంతో మరో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు యువతి ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నెల్లూరులో బాలుడి కిడ్నాప్ కలకలం) పోలీసుల సేవా గుణం ఇంటి దగ్ధం విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో గుడివాడ డీఎస్పీ ఎన్. సత్యానందం సిబ్బందితో గురువారం బాధితుల వద్దకు వెళ్లి రూ.25 వేలు నగదు, మరో రూ.25వేలు విలువ చేసే నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు అందించారు. ఇంటి నిర్మాణానికి పోలీసుల తరఫున పూర్తి సాయం అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇల్లు దగ్ధం కేసులో విచారణ జరుపుతున్నామని చెప్పారు. ముఖ్యంగా అర్ధరాత్రి ఇల్లు దగ్ధమవుతున్న సమయంలో ఎస్ఐ మణికుమార్ తన సిబ్బందితో కలిసి మంటలు అదుపు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. దాడులకు పాల్పడుతున్నవారి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాధితులకు భరోసా కల్పిస్తోందని దళిత సంఘాలు అభినందిస్తున్నాయి. -
ప్రియుడు మోసం చేశాడని యువతి..
సాక్షి, దస్తురాబాద్ (ఆదిలాబాద్) : ప్రేమించిన ప్రియుడి చేతిలో మోసపోయిన ఓయువతి ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు దిగిన ఘటన మండలంలోని బుట్టాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులోని భాగ్యపల్లికి చెందిన సునీత పని నిమిత్తం ముంబైకి వలస వచ్చి ఒకరి ఇంట్లో హౌజ్ కీపింగ్ పనులు చేస్తోంది. అదే ఇంట్లో పనిచేస్తున్న మండలంలోని బుట్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం మహేష్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో వీరిరువురు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గర్భవతిని చేశాడు. ఇంటి దగ్గర అప్పు చేసానని, తన దగ్గర రూ.లక్ష యాబై వేలు తీసుకుని ఇంట్లో పెద్దవారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ముంబాయి నుండి ఇంటికి వచ్చాడు. తీరా ఇంటికి వచ్చాక పెళ్లి చేసుకోనని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్‌లో పెట్టాడు. దీంతో తనకు ఏంచేయాలో తెలియక దుర్గం మహేష్‌తో అద్దె గదిలో ఉంటున్న తోటి 11మంది మిత్రులను తీసుకొని ముంబై నుంచి బుట్టాపూర్ గ్రామానికి చేరుకుంది. మహేష్ గురించి ఇంట్లో అడిగితే కుటుంబసభ్యులు దూషించారు. దీంతో ఏం చేయాలో తెలియక మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసు అధికారులు మూడు రోజుల నుంచి స్వీకరించలేదు. దీంతో మహిళా సంఘాల మద్దతుతో గురువారం పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నాకు దిగింది. పోలీసులు బాధితురాలు, మహిళా సంఘాలతో కలిసి బుట్టాపూర్ గ్రామంలో మహేష్ ఇంటి ఎదుట దీక్షకు దిగారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ సీఐ జయరామ్, దస్తురాబాద్ ఎస్సై అశోక్ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం బాధితురాలిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేపట్టారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయింపు
పెద్దపల్లిరూరల్ : ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు మొఖం చాటేస్తున్న ప్రియుడు ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయించిన సంఘటన బుధవారం పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. తన కూతురుకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తల్లి లక్ష్మి సైతం గ్రామంలోని వాటర్‌ట్యాంకు ఎక్కి నిరసన తెలిపింది. అప్పన్నపేటకు చెందిన దామ అనూష అదే గ్రామానికి చెందిన అనవేని శ్రీకాంత్‌లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పిన శ్రీకాంత్ ఇప్పుడు మాట మార్చడంతో వారం రోజుల క్రితం గ్రామంలోని వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించింది. దీంతో స్థానికులు పెద్దపల్లి సీఐ నరేందర్‌కు సమాచారం అందించగా అప్పన్నపేటకు వెళ్లిన అమ్మాయి అనూషతో మాట్లాడి న్యాయం చేస్తానని సముదాయించి కిందకు దించిన విషయం తెలిసిందే. వారం గడిచినా సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపలేదంటూ బుధవారం ప్రియుడు శ్రీకాంత్ ఇంటి ఎదుట దీక్షకు దిగింది. ప్రియురాలు తన ఇంటి ఎదుట బైఠాయిస్తుందని గ్రహించిన శ్రీకాంత్ కుటుంబీకులు నేరుగా పోలీసులనే ఆశ్రయించినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. కాగా కూతురు అనూష కోసం తల్లి లక్ష్మి ఆత్మహత్య చేసుకుంటానంటూ వాటర్‌ట్యాంకు ఎక్కడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. అనూషకు న్యాయం చేయాల్సిందిగా గ్రామస్తులంతా ముక్తకంఠంతో అనూషకు మద్దతు పలికారు. -
ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటం
బెజ్జూర్(సిర్పూర్): ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది.. వివరాల్లోకి వెళ్తే బెజ్జూర్ మండలం బారేగూడె గ్రామానికి చెందిన మౌనిక అదే గ్రామానికి చెందిన చిప్ప రమేష్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో తనను పెండ్లి చేసుకోవాలని మౌనిక కోరడంతో నిరాకరించాడు. కోరిక తీరక తనను మోసం చేశాడని మౌనిక మంగళవారం ప్రియుడి ఇంటిముందు మౌనపోరాటానికి దిగింది. గత 15 రోజుల క్రితం కులపెద్దలు, గ్రామస్తులతో పంచాయతీ నిర్వహించగా పెండ్లి చేసుకుంటానని రమేష్ అంగీకరించాడని, తల్లి మాటలు విని గ్రామం నుంచి ఏటో వెళ్ళాడని పేర్కొంది. రమేష్ వచ్చి తనను పెండ్లి చేసుకునేంతవరకు మౌనపోరాటం విరమించేది లేదని పేర్కొంది. గ్రామస్తులు కొంతమంది ఆమెకు మద్దతు తెలిపారు. ఈ విషయంపై బెజ్జూర్ పోలీసులను వివరణ కోరగా రమేశ్‌పై లికితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
ప్రేమించినవాడితో పెళ్లి జరిపించాలని..
పెద్దపల్లి: ‘మూడేళ్లుగా ప్రేమించుకున్నాం..ఆతడిని నమ్ముకుని సర్వం అర్పించా..ఇప్పుడు పెళ్లి చేసుకోనని మొండికేస్తున్న యువకుడితోనే పెళ్లి జరిపించాలని దామ అనూష అనే యువతి గురువారం పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. అప్పన్నపేట గ్రామానికి చెందిన దామ అనూష(20) అదే గ్రామానికి చెందిన అనవేని శ్రీకాంత్(24) మూడేళ్లుగా ప్రేమించుకుటున్నారు. కొద్దిరోజులుగా వేరే అమ్మాయితో పెళ్లి జరిపించేందుకు శ్రీకాంత్ తల్లిదండ్రులు ప్రయత్నాలు ప్రారంభించడంతో విషయం తెలుసుకున్న అనూష గురువారం వాటర్ ట్యాంకు ఎక్కింది. దీంతో స్థానికులు పెద్దపల్లి సీఐ నరేందర్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న సీఐ, అనూషతో మాట్లాడి సముదాయించి కిందకు దింపారు. గ్రామస్తులు అనూష, శ్రీకాంత్‌ల పెళ్లి జరిపించాలని పట్టుబట్టారు. చట్టంప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ హామీఇచ్చారు. మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించి జంటను కలపాలని యువతికి న్యాయం చేయాలని అనూష బంధువులు సీఐని వేడుకున్నారు. -
ప్రేమ పేరుతో మోసం..
కాళేశ్వరం: మూడు సంవత్సరాలుగా ఒకరికొకరు ప్రేమించుకున్నారు. చివరకు పెళ్లి చేసుకుంటానని ప్రియుడు ప్రియురాలిని మోసం చేసి ఊరు వదిలి పరారయ్యాడు. దీంతో గత్యంతరం లేక తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు వారం రోజులుగా ప్రియురాలు ఆందోళనకు దిగింది. ఈ ఘటన మండలంలోని కాళేశ్వరంలో ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. కాటారం మండలం నస్తూర్‌పల్లి గ్రామానికి చెందిన మేర్జాన సంధ్య, మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఎస్సీ కాలనీకి చెందిన చకినారపు రాజశేఖర్ ప్రేమించుకున్నారు. రాజశేఖర్ డిగ్రీ వరకు చదివి ఖాళీగా ఉన్నాడు. సంధ్య కాళేశ్వరంలోని అమ్మమ్మ సమ్మక్క ఇంటి వద్ద ఉంటూ తాపీమేస్త్రీ వద్ద రోజు వారి కూలీ పని చేస్తుండేది. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి అది కాస్తా ప్రేమగా మారింది. మూడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని రాజశేఖర్‌పై సంధ్య ఒత్తిడి తెచ్చింది. పెళ్లికి నిరాకరించిన ఆ యువకుడు ఇంటికి తాళం పెట్టి కుటుంబ సభ్యులతో కలసి ఊరు వదిలి వెళ్లాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె నుంచి వివరాలు సేకరించారు. ఈ విషయంపై శ్రీనివాస్‌ను వివరణ కోరగా సంధ్యకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులను తీసుకురావాలని పంపినట్లు తెలిపారు. -
యువకుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నా..!
సాక్షి, వరంగల్ : ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటిముందు ఆందోళన చేపట్టింది. మాయమాటలతో తనను లోబర్చుకుని గర్భం దాల్చడానికి కారకుడయ్యాడని, న్యాయం చేయాలని కోరుతూ ధర్నాకు దిగింది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. సద్దాం అనే యువకుడు అదే గ్రామానికి చెందిన అప్సరా అనే యువతిని ప్రేమ పేరుతో మోసం చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. అతని ఇంటిముందు ఆందోళన చేస్తున్న యువతికి ఎమ్మార్పీఎస్ నాయకులు, గ్రామం సర్పంచ్ యశోద తదితరులు మద్దతుగా నిలిచారు. అయితే, యువతిని ఇష్టపడిన మాట వాస్తవమేనని, ఆమెను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పానని సద్దాం వెల్లడించాడు. అప్సరా వేరేవారి మాయమాటల్లో పడి ఆందోళన చేస్తోందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నేను డీఎన్ఏ టెస్టుకు సిద్దం. నా వల్లనే ఆమె గర్భం దాల్చిందని రుజువైతే.. ఏ శిక్షకైనా రెడీ. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. కానీ, ఆమె వేరేవారి మాయమాటల్లో పడి ఆందోళన చేస్తోంది’ అన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. -
ప్రేమ వేధింపులకు బాలిక బలి
మంచిర్యాలక్రైం: ప్రేమికుని వేధింపులు భరించలేక ఓ బాలిక (17) తీవ్ర మనస్థాపానికి గురై సోమవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిని బూర్ల రాజయ్య, స్వరూప దంపతుల కూతురు సంధ్యకు అదే గ్రామానికి చెందిన ఎండీ.అక్బర్ కొంతకాలం క్రితం పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకుందామంటూ వెంట పడుతున్నాడు. ఏడాదిన్నర క్రితం సంధ్య సీసీసీ నస్పూర్‌లో ఉంటున్న చిన్నమ్మ ఇంటికెళ్లింది. ఆ సమయంలో అక్బర్ సంధ్యను కిడ్నాప్ చేశాడు. ఈ విషయంలో అక్బర్‌పై సీసీసీ పోలీస్‌స్టేషన్‌లో నాన్‌బెయిలేబుల్ కేసు నమోదైంది. అక్బర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అక్బర్‌ను మరిచిపోవాలని కుటుంబసభ్యులు సంధ్యకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మూడు నెలల జైలుశిక్ష అనంతరం బెయిల్‌పై వచ్చిన అక్బర్.. సంధ్యను వివాహం చేసుకుంటానంటూ మళ్లీ వేధించసాగాడు. అతడి వేధింపులు భరించలేని సంధ్య కుటుంబం ఇటీవల మంచిర్యాలలోని సున్నంబట్టివాడకు మకాం మార్చారు. అయినా అక్బర్ నుంచి వేధింపులు ఆగలేదు. ఇటీవల ఇంటికి వెళ్లి సంధ్యను తానే పెళ్లి చేసుకుంటానని, తనను కాదని ఎవరు చేసుకున్నా వారి అంతుచూస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంధ్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబస భ్యుల ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తు న్నట్లు మంచి ర్యాల ఎస్సై ఓంకార్‌యాదవ్ తెలిపారు. -
సాఫ్ట్వేర్ ప్రియుడి కోసం రూ.1.50లక్షల..
చిన్నచింతకుంట (దేవరకద్ర): ఆరేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియుడు సహజీవనం చేశాడు. తీరా పెళ్లి చేసుకోమని కోరగా పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆ యువతి యువకుడి ఇంటి ముందు ధర్నాకి దిగిన సంఘటన చిన్నచింతకుంట మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని మద్దూర్ గ్రామానికి చెందిన జుట్ల నర్మద, చిన్నచింతకుంట మండల కేంద్రానికి చెందిన మక్క మోహన్‌కుమార్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇలా ప్రేమించుకుంటున్న సమయంలోనే నర్మద, మోహన్‌కుమార్ ఇద్దరూ హైదరాబాద్‌లో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లారు. నర్మద చిక్కడపల్లి ప్రాంతంలోని ఓ ఉమెన్స్‌కాలేజీలో 2010 నుంచి 2014 సంవత్సరం వరకు విద్యనభ్యసిస్తూనే ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. అలాగే, మోహన్‌కుమార్ ఓ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించి కాగ్నిజెంట్ డీఎల్ఎఫ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రియుడి చదువు కోసం రూ.1.50లక్షల ఖర్చు ఈ క్రమంలోనే మోహన్ పైచదువు కోసం నర్మద రూ.1,50,000 వరకు సాయం అందించింది. 2014సంవత్సరంలో నర్మద కుటుంబసభ్యులకు ఫోన్ చేసిన మోహన్ మేమిద్దరం పెళ్లిచేసుకుంటామని, వేరే సంబంధాలు చూడవద్దని చెప్పడంతో నర్మద కుటుంబీకులు కూడా ఆమె సంబంధాల గురించి పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2014 నుంచి 2019వరకు దాదాపుగా 5ఏళ్లుగా వీరిద్దరు కలిసి సహజీవనం కొనసాగించారు. ఇదే తరుణంలో నన్ను పెళ్లిచేసుకోమని మోహన్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా మా చెల్లెలి పెళ్లి తర్వాత మనం పెళ్లి చేసుకుందామని దాటవేస్తూ వచ్చాడు. అనంతరం మోహన్‌కుమార్ చెల్లెలి పెళ్లి కూడా పూర్తయింది. తల్లి ఒప్పుకోవట్లేదని పెళ్లికి నిరాకరణ.. ఇదిలాఉండగా, గత 6నెలల క్రితం ఇరు గ్రామాలకు చెందిన పెద్దల సమక్షంలో మోహన్‌కుమార్ నర్మదతో పెళ్లికి అంగీకారం కుదుర్చుకున్నారు. అప్పటి నుండి పెళ్లి చేసుకుందామని నర్మద, మోహన్‌కుమార్‌ను పట్టుపడుతూ వచ్చింది. ఇటీవల నిన్ను పెళ్లిచేసుకుంటే మా అమ్మ చనిపోతానని అంటుందని, అందుకే నీతో పెళ్లికి నిరాకరిస్తున్నానని మోహన్ తేల్చిచెప్పాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించి కొన్నిరోజుల కిందట ఎస్పీని కలిసే ప్రయత్నం చేసింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించడంతో నర్మద గత మూడు రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌లో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఇక్కడ కూడా జాప్యం జరగడంతో గత్యంతరం లేక ప్రియుడు మోహన్‌కుమార్ ఇంటి ఎదుట గత మూడురోజులుగా ధర్నాకి కూర్చుంది. పెళ్లంటూ జరిగితే మోహన్‌తోనే జరగాలని, లేదంటే న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తానని నర్మద తెలిపారు. చిన్నచింతకుంటలో ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు నర్మద చిన్నచింతకుంటలో ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు నర్మద -
ప్రేమపేరుతో మోసం చేశాడని.. యువతి
మానకొండూర్: ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. కలకాలం తోడుంటానన్నాడు. నమ్మిన ఆ యువతి ప్రేమను అంగీకరించింది. ఐదేళ్లకు పైగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. చదువైపోగానే పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఇద్దరి చదువు పూర్తయ్యింది. ఇక పెళ్లి చేసుకుందామని యువతి కోరింది. అంతా సిద్ధం చేసుకుని ఆలయానికి వెళ్లారు. విషయం తెలిసిన యువకుడి తల్లిదండ్రులు అడ్డుకున్నారు. యువతి పోలీసులను ఆశ్రయించగా.. ఇప్పుడా యువకుడు పెళ్లికి ముఖం చాటేశాడు. తాను ప్రేమించిన అమ్మాయి వద్దని ఇంటినుంచి పారిపోయాడు. దీంతో సదరు యువతి ప్రియుడి ఇంటిఎదుట బైఠాయించింది.ఈ ఘటన మానకొండూర్ మండలం వెల్ది గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఐదేళ్లనుంచి ప్రేమ.. మానకొండూర్ మండలం వెల్ది గ్రామానికి చెందిన అంతగిరి లక్ష్మయ్య– పరమేశ్వరి దంపతుల పెద్దకూతురు నందిని(25) ఏంబీఏ పూర్తిచేసింది.ఇదే గ్రామానికి చెందిన ఎనగంటి గణపతి, గంగా దంపతుల చిన్నకొడుకు ఎనగంటి శ్రీధర్ ఊరాఫ్ లక్ష్మణ్(24) డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం పెద్దపల్లిలో ఉంటున్నాడు. ఐదేళ్లక్రితం నందినిని ప్రేమించమని శ్రీధర్ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో ప్రేమను అంగీకరించింది. ఇద్దరి చదువు పూర్తయ్యింది. మధ్యలో నందినికి వచ్చిన పెళ్లి సంబంధాలను శ్రీధర్ చెడగొడుతూ వచ్చాడు. తమ కూతురును పెళ్లి చేసుకుంటానని నందిని తల్లిదండ్రులకూ మాటిచ్చాడు. పెళ్లి వరకు వెళ్లి.. ఇటీవల శ్రీధర్ సోదరుడి వివాహమైంది. ఇదే క్రమంలో నందిని – శ్రీధర్ ప్రేమ వ్యవహారం ఇరువురి ఇంట్లో తెలిసింది. దీంతో బయటకు వెళ్లి పెళ్లి చేసుకుందాని అనుకున్నారు. గత ఆదివారం తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్‌లోని నృసింహుని ఆలయం వద్దకు వెళ్లారు. తాళి కట్టేసమయంలో శ్రీధర్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. వారి వర్గానికి చెందిన ఓ పెద్దమనిషి సాయంతో శ్రీధర్‌ను తీసుకెళ్లారు. పోలీసులను ఆశ్రయించిన యువతి.. నందిని మానకొండూర్ పోలీసులను ఆశ్రయించింది. ఇరుకు టుంబాలను పిలిపించి సీఐ ఇంద్రసేనారెడ్డి కౌన్సెలింగ్ ఇచ్చా రు. నందినిని పెళ్లి చేసుకోవాలని శ్రీధర్‌కు సూచించగా నిరాకరించాడు. మరుసటి రోజునుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు. మోసపోయానని బైఠాయింపు.. మోసపోయానని గ్రహించిన నందిని తనకు న్యాయం చేయా లని శనివారం ఉదయం ప్రియుడి ఇంటిఎదుట బైటాయించింది. శ్రీధర్ తనను పెళ్లి చేసుకునేంత వరకు ఇక్కడే ఉంటానని భీష్మించుకు కూర్చుంది. నందినికి రజక కులస్తులు, గ్రామస్తులు, మహిళా సంఘం నాయకులు మద్దతుగా నిలిచారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నందినితో మాట్లాడుతున్న క్రమంలోనే కిరోసిన్ పోసుకునేందుకు యత్నించింది. పోలీసులు అడ్డుకుని నచ్చజెప్పారు. నందినిని మద్దతుగా నిలిచిన రజకసంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రమేష్ మాట్లాడుతూ... శ్రీధర్‌కు దగ్గర బంధువైన శ్రీనివాస్ అనే వ్యక్తి కారణంగానే పెళ్లికి నిరాకరించాడని ఆరోపించారు. న్యాయం చేయకుంటే మూడువేల మందితో శ్రీధర్ ఇంటిఎదుట ఆందో ళన చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఉపాధ్యక్షుడు నడిగొట్టు రవి, శాతరాజు యాదగిరి, సంపత్, ముత్తూరి కొంరయ్య రాయికంటి కిరణ్, గంగధర లక్ష్మయ్య, అంతగిరి సంపత్ తదితరులు మద్దతుగా నిలిచిన వారిలో ఉన్నారు. -
ప్రియుడు మోసగించాడు..మరో యువకుడు రక్షించాడు!
సాక్షి, భైంసాటౌన్: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఓ బాలిక (17) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన భైంసాలో జరిగింది. పట్టణ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం భైంసా మండలం మహాగాం గ్రా మానికి చెందిన ఓ బాలిక శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గడ్డెన్నవాగు ప్రాజెక్టు చేరుకుని నీళ్లలో దూకి ఆత్మహత్యాయత్నాకి పాల్పడిం ది. అప్పుడే అక్కడ ఈత కొడుతున్న పట్టణానికి చెందిన షేక్ నవీద్ అనే యువకుడు బాలిక నీటిలో దూకడం గమనించి వెంటనే ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చాడు. తర్వాత పోలీసులకు సమాచారమివ్వగా, ఘటనాస్థలికి చేరుకున్న సీఐ శ్రీనివాస్ ఆమెను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బా లిక నీటిలో దూకే ముందు తన చావుకు శ్రీకాంత్ అనే వ్యక్తి కారణమంటూ రాసిన లెటర్ లభించింది. ఆ లెటర్లో తనది మహాగాం గ్రామమని, అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ తనను ప్రేమించానంటూ మోసం చేశాడని రాసి ఉంది. బాలికను ప్రాణాలకు తెగించి రక్షించిన నవీద్‌ను పట్టణ సీఐ శ్రీనివాస్ అభినందించారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. -
ప్రియుడు మోసగించాడని బాలిక ఆత్మహత్యాయత్నం
భైంసాటౌన్: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఓ బాలిక (17) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన భైంసాలో జరిగింది. పట్టణ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం భైంసా మండలం మహాగాం గ్రా మానికి చెందిన ఓ బాలిక శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గడ్డెన్నవాగు ప్రాజెక్టు చేరుకుని నీళ్లలో దూకి ఆత్మహత్యాయత్నాకి పాల్పడిం ది. అప్పుడే అక్కడ ఈత కొడుతున్న పట్టణానికి చెందిన షేక్ నవీద్ అనే యువకుడు బాలిక నీటిలో దూకడం గమనించి వెంటనే ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చాడు. తర్వాత పోలీసులకు సమాచారమివ్వగా, ఘటనాస్థలికి చేరుకున్న సీఐ శ్రీనివాస్ ఆమెను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బా లిక నీటిలో దూకే ముందు తన చావుకు శ్రీకాంత్ అనే వ్యక్తి కారణమంటూ రాసిన లెటర్ లభించింది. ఆ లెటర్లో తనది మహాగాం గ్రామమని, అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ తనను ప్రేమించానంటూ మోసం చేశాడని రాసి ఉంది. బాలికను ప్రాణాలకు తెగించి రక్షించిన నవీద్‌ను పట్టణ సీఐ శ్రీనివాస్ అభినందించారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. -
ప్రేమన్నాడు.. పెళ్లాడాడు.. పొమ్మన్నాడు...
నేలకొండపల్లి: అతడొక ఆర్ఎంపీ. ఆ ఊరు, ఈ ఊరు తిరుగుతూ వైద్యం చేస్తుంటాడు. ఓ విద్యార్థినిపై కన్నేశాడు. ఆమెతో పరిచయం స్నేహం పెంచుకున్నాడు. ఆ తరువాత, ప్రేమిస్తున్నానన్నాడు. చాలా ‘దగ్గర’య్యాడు. పెళ్లి చేసుకుందామన్నాడు. గుడిలో రహస్యంగా పెళ్లాడాడు. కొన్ని రోజులు గడిచిన తరువాత... వద్ద పొమ్మంటున్నాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆమె... అతడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. నేలకొండపల్లి మండలం రాయగూడెం గ్రామ యువకుడైన బొయిన చైతన్య, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం బలుసుపాడులో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వృత్తిరీత్యా అతనితో అందరూ చనువుగా ఉండేవాడు. మూడేళ్ల క్రితం, అదే గ్రామంలోని డిగ్రీ విద్యార్థిని గొడుగు సంధ్యపై కన్నేశాడు. ఆమెతో చనువు పెంచుకున్నాడు. ‘మనిద్దరం స్నేహితులమ’న్నాడు. ఆమె తలూపింది. ఆ తరువాత, ప్రేమిస్తున్నానన్నాడు. ఆమె నమ్మింది. ఇద్దరూ ‘దగ్గర’య్యారు. గత ఏడాది, ఖమ్మంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. తన ఫోన్ లో వేద మంత్రాల ఆడియో ఆన్ చేసి తాళి కట్టాడు. ఆమె గర్భవతయింది. అతడే అబార్షన్ చేశాడు. ఆ తరువాత ఇద్దరూ చెట్టపట్టాలేసుకసుని, పట్టపగ్గాల్లేకుండా తిరిగారు. గత నెల 21న బైక్‌పై జగ్గయ్యపేట వెళుతున్న వీరిద్దరిని ఆమె బంధువులు చూశారు. ఆమె ఇంటోళ్లకు తెలిసింది. వారు అతడిని నిలదీశారు. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని బుకాయించాడు. అప్పటి నుంచి అతడు బలుసుపాడులో ప్రాక్టీస్ మానేశాడు. ఆమెను పట్టించుకోవడం లేదు. ‘నీ దారిన నువ్వు వెళ్లు. నాతో ఉండొద్దు. వెళ్లిపో...’ అంటున్నాడు. దీంతో, ఆమె ఆదివారం సాయంత్రం తన కుటుంబీకులతో కలిసి చైతన్య ఇంటికి వచ్చింది. ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనను భార్యగా స్వీకరించేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ భీష్మించింది. చైతన్య, అతడి కుటుంబీకులు తమ ఇంటికి తాళం వేసుకుని ఎటో వెళ్లిపోయారు. ఆమె నుంచి వివరాలను ఎస్సై ఎన్.గౌతమ్ తెలుసుకున్నారు. న్యాయం జరిగేంత వరకు పోరాడతా... అంటోంది సంధ్య. ‘‘నన్ను నమ్మించి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు, మనిద్దరికి ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు. నా జీవితాన్ని నాశనం చేశాడు. నాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటాను. చైతన్యకు, నాకు.. పెద్దల సమక్షంలో మళ్లీ పెళ్లి చేయించాలి’’ అని డిమాండ్ చేస్తోంది. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
రామన్నపేట (నకిరేకల్) : ప్రేమించిన యువకుడితోనే వివాహం జరిపించాలని యువతి ఆందోళనకు దిగింది. ఈ ఘటన ఆదివారం రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాయిగూడెం గ్రామానికి చెం దిన వీరమల్ల ప్రసన్న, అదేగ్రామానికి చెందిన రేపాక గణేశ్‌లు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించు కుంటున్నారు. వీరిద్దరు వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారు. పాఠశాలలో చదువుతున్నప్పటి నుంచే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇటీవల గణేశ్‌కు వేరే యువతితో వివాహం కుదిరింది. విష యం తెలుసుకున్న యువతి రామన్నపేట పోలీ స్స్టేషన్లో గణేశ్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుం టానని మాయమాటలు చెప్పి మోసం చేశాడని అతడిపై ఈనెల 16న రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు, గ్రామపెద్దలు ఇద్దరికీ పలు దఫాలుగా కౌన్సిలింగ్ నిర్వహించారు. యువకుడు గణేశ్ ప్రసన్న తనకు సోదరితో సమానమని బుకాయించసాగాడు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆయువతి గణేశ్‌తో వివా హం జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆదివా రం కొమ్మాయిగూడెంలో అతడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఆమెకు గ్రామస్తులు, బంధువులు మద్దతు పలికారు. కుటుంబసభ్యులు అక్కడే వంటచేసుకుని భుజించారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సీహెచ్ సాయిలు యు వతి ధర్నా చేస్తున్న ఇంటివద్దకు వెళ్లి ఆమెతో మా ట్లాడారు. మోసంచేసిన యువకుడిపై ఫిర్యాదుచేస్తే కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. తనను ప్రేమించాలని చాలా కాలం వేధించాడని, కులాలు వేరైనా పెద్దలు అంగీకరించక పోయినా తప్పకుండా పెళ్లిచేసుకుంటానని మాయమాటలు చెప్పి గణేశ్ తనను మోసం చేశాడని, మధ్యలో తనకు వివాహ సంబంధాలు వచ్చినా చేసుకోనీ యలేదని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది. కట్నం డబ్బులకు ఆశపడి తనను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. అతనితో తన వివాహం జరిపించాలని వేడుకున్నది. జీడీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించి న్యాయం చేస్తామని సీఐ హామీ ఇచ్చిన యువతి ఆందోళన విరమించలేదు. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి నిరసన
పార్వతీపురం: వాళ్లిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. నువ్వు లేకపోతే నేను లేనంటూ బాసలు చేసుకున్నారు. ఇంతలో యువకుడు ముఖం చాటేయడంతో కథ అడ్డం తిరిగింది. బాధిత యువతి, కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జమదాల గ్రామానికి చెందిన కళింగపట్నం పద్మ (రజక కులానికి చెందిన యువతి) అదే గ్రామానికి చెందిన మత్స్యకార సామాజికవర్గానికి చెందిన కొర్ర సంతోష్‌కుమార్ ప్రేమించుకున్నారు. సంతోష్‌ను పూర్తిగా నమ్మిన పద్మ శారీరకంగా దగ్గరైంది. పద్మ తల్లిదండ్రులు సంబంధాలు తీసుకువచ్చినా ఎవర్నీ పెళ్లి చేసుకోవద్దని... తానే చేసుకుంటానని సంతోష్ చెప్పడంతో బాధిత యువతి వచ్చిన సంబంధాలను వదులుకుంది. అయితే తనను పెళ్లి చేసుకోవాలని పద్మ కోరగా కొద్దికాలం నుంచి సంతోష్ తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా సంతోష్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో రెండు రోజుల కిందట పద్మ ప్రియుడి ఇంటిముందు తనకు న్యాయం చేయాలంటూ బైఠాయించగా.. పెద్ద మనుషుల ముందు సం తోష్ పెళ్లికి ఒప్పుకున్నాడు. మరలా మాట తప్పడంతో పద్మ శుక్రవారం యువకుడి ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం చేసే వరకూ దీక్ష విరమించేది లేదని బాధితరాలు స్పష్టం చేస్తోంది. మాకు ఇష్టమే.. తమ కుమారుడు సంతోష్‌కి నచ్చితే పెళ్లి చేయడానికి తమకు ఇబ్బంది లేదని యువకుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే ఈ నాటకమంతా వారే ఆడిస్తున్నారని బాధిత యువతి ఆరోపించింది. తనను పెళ్లి చేసుకుంటే చనిపోతామని తల్లిదండ్రులు బెదిరించడం వల్లే సంతోష్ తనతో వివాహానికి వెనకడుగు వేస్తున్నాడని చెప్పింది. ఇదిలా ఉంటే తనతో పాటు తమ కుటుంబ సభ్యులపై దాడి కూడా చేస్తున్నారని ఆరోపించింది. చివరకు ఈ కేసు పార్వతీపురం రూరల్ పోలీసు స్టేషన్‌కు చేరింది. ఎస్సై లోవరాజు ఇరువర్గాలతో మాట్లాడినా సంతోష్ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. అనేక మలుపులు..! ప్రేమికుల వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఒకసారి చేసుకుంటాను.. మరోసారి చేసుకోను.. అంటూ ప్రియుడు మాట మార్చడం వెనుక కొంతమంది పెద్దల దన్ను ఉందని బాధిత యువతి తరఫు వారు ఆరోపిస్తున్నారు. ఇరువర్గాల మధ్య గొడవలు సృష్టించి ఆ నెపం మామీద వేసి కేసులు బనాయించాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రెచ్చిపోయిన ప్రేమోన్మాది..
గంగవరం: ఓ ప్రేమోన్మాది మళ్లీ రెచ్చిపోయాడు. ఈ పర్యాయం యువతి తల్లిదండ్రులు, సోదరుడు, మామయ్యపై తన అనుచరులతో దాడి చేశాడు. కర్రలతో కొట్టి, చితకబాదడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిపైనా తిరగబడ్డాడు. తనను ప్రేమించకపోతే అంతుచూస్తానంటూ యువతిని తీవ్రంగా హెచ్చరించాడు. శుక్రవారం ఈ సంఘటన మండలంలోని మార్జేపల్లెలో చోటుచేసుకుంది. బాధితులు కథనం..డిగ్రీ సెకండియర్ చదువుతున్న గ్రామానికి చెందిన ఓ యువతిని జులాయిగా తిరిగే చరణ్‌రాజ్ (25) ఏడాది కాలంగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేక ఆరు నెలల క్రితం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ సమయంలో అతనిపై చర్యలు తీసుకునే విషయంలో నిర్లక్ష్యం వహించడంతో హైకోర్టు నుంచి చరణ్‌రాజ్ యాంటిసిపేటరీ బెయిల్ పొంది దర్జాగా తిరగసాగాడు. అంతేకాకుండా ఆ యువతిని మరింత తీవ్రంగా వేధిస్తుండడంతో ఆమె తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో, శుక్రవారం ఆ యువతికి తోడుకు బస్ స్టాప్ వరకు ఆమె సోదరుడు చంద్రశేఖర్ వచ్చాడు. ఇది చూసిన చరణ్‌రాజ్ ..తోడుగా వస్తే భయపడతాననుకున్నావా? అంటూ అతడిని దుర్భాషలాడుతూ గొడవకు దిగాడు. దీంతో చంద్రశేఖర్ తన తల్లిదండ్రులు, మామయ్యకు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని చరణ్‌రాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమార్తెను వేధించడం మానుకోవాలని హితవు పలికారు. దీంతో ఆగ్రహించి చరణ్‌రాజ్ ఫోన్లో తన అనుచరులు సుబ్బరామయ్య, విశ్వేశ్వరయ్య, జగదీష్, అశోక్, యువరాజు, వెంకటరమణ, అక్కడికి రప్పించి కర్రలతో యువతి తల్లిదండ్రులు, సోదరుడు, మామయ్య మంజుపై దాడి చేశాడు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన గ్రామస్తులు కొందరు వారిని అడ్డుకుని చరణ్‌రాజ్ అతని అనుచరులను మందలించారు. వారిపై కూడా చిందులేసిన చరణ్‌రాజ్ అంతు చూస్తానంటూ యువతి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ వెళ్లిపోయాడు. దాడి ఘటనలో గాయపడిన యువతి తల్లిదండ్రులు, అన్న, మామయ్యను చికిత్స నిమిత్తం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం యువతి తల్లిదండ్రులను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులపై సెక్షన్ 354, సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశామని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. -
తాళి కట్టి.. తప్పుకున్నాడు
కోరుట్ల (కరీంనగర్) : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి.. తప్పుకుని మళ్లీ దొంగచాటుగా పెళ్లి చేసుకుని పరారైన ప్రియుడి ఇంటి ముందు కోరుట్ల పట్టణానికి చెందిన ఓ యువతి ఆందోళన చేసింది. బాధితురాలు వెల్లడించిన వివరాలు ప్రకారం.. పట్టణంలోని అంబేద్కర్ నగర్లో నివాసముండే పసుల శ్రీకాంత్(26) అదే ఏరియాలో ఉండే మంద రవళి(23)ని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబర్చుకుని, తరువాత మొహం చాటేయడంతో మరొకరితో వివాహానికి రవళి సిద్ధమైంది. ఆ సమయంలో పెళ్లికొడుకును బెదిరించి మళ్లీ రవళిని వివాహం చేసుకుంటానని చెప్పి దొంగచాటుగా తాళికట్టాడు. ఆ తరువాత రవళి అత్తగారింటికి వెళితే వారు బెదిరించడంతో పాటు శ్రీకాంత్‌తో సహా కుటుంబ సభ్యులందరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో బాధితురాలు శుక్రవారం మహిళా జాగృతి పట్టణాధ్యక్షురాలు మధురిమ అధ్వర్యంలో తన అత్తాగారింటి ముందు ఆందోళన చేసింది. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి దీక్ష
ఎల్కతుర్తి : తనను శారీరకంగా వాడుకుని తీరా పెళ్లి చేసుకొమ్మంటే తప్పించుకు తిరుగుతున్న ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు దీక్షకు దిగిన సంఘటన బుధవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శ్రీపతి శ్వేత ఇంటర్ చదివే రోజుల్లో అదే మండలానికి చెందిన సట్ల సుధీర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్వేత హైదరాబాద్‌లోని ఓ బ్యూటీషియన్ సంస్థలో సభ్యురాలిగా పని చేస్తోంది. సుధీర్ సైతం హెచ్‌డీఎఫ్‌సీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ హైదరాబాద్‌లో ఓ అద్దె గదిలో సహజీవనం చేస్తున్నారు. గదిలోనే తాళి సైతం కట్టాడని శ్వేత తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పెద్ద మనుషులు కలుగజేసుకుని పెళ్లి కోసం ప్రయత్నాలు చేశారు. దీనికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం తాను లేని సమయంలో గదిలోకి ఎవరో యువకుడు వచ్చాడంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, తనను అనుమానిస్తూ గొడవపడ్డాడని.. అప్పటి నుంచి తాను పెళ్లి చేసుకోనంటూ తప్పించుకు తిరుగుతున్నాడని స్వేత బోరున విలపించింది. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు.పెద్ద మనుషులు సైతం పట్టించుకోలేదు. దీంతో తాను ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు దిగినట్లు తెలిపింది. బాధితురాలి మౌనపోరాటానికి మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. ఇదిలా ఉండగా సుధీర్ తండ్రి మల్లయ్య తనను ఓ విలేకరి రూ. 5లక్షలు ఇస్తే సముదాయిస్తానని, లేకుంటే ఇంటి ముందు బైఠాయిస్తుందని చెప్పాడని, తాను డబ్బులు ఇవ్వకపోవడంతో అనుకున్న ప్రకారం ఇలా జరిగిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. -
నువ్వే నా ప్రాణం.. నువ్వు లేకుండా?
పరకాల (వరంగల్): నువ్వే నా ప్రాణం.. నువ్వు తోడుగా లేకపోతే బతకలేను అంటూ ఐదేళ్లుగా చెట్టపట్టాలేసుకొని తిరిగిన ప్రియుడు పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేయడంతో మోసపోయానని గ్రహించిన ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగిన సంఘటన పరకాల పట్టణంలో మంగళవారం జరిగింది. పరకాల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన అల్లె రాము, రావుల రాణి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు ప్రియురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరి మేజర్లు కావడంతో రాఖీ పౌర్ణమి మరుసటి రోజే ఓ మిత్రురాలి సమక్షంలో పెళ్లికి నిశ్చితార్థం పెట్టుకున్నారు. రాము కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో పెళ్లికి నిరాకరించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాము కుటుంబసభ్యుల ఒత్తిడితో తాను ప్రేమించలేదంటూ ముఖం చాటేశాడు. దీంతో అవాక్కయిన రాణి ప్రియుడి ఇంటి ఎదుట పురుగుల మందు డబ్బా పట్టుకొని వచ్చి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేసేంత వరకు ఇంటి ముందే ఉంటానని, లేదంటే ఆత్మహత్యకైనా సిద్ధమంటూ వాపోయింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. రాము కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు వేసి మాయమయ్యారు. మంగళవారం సాయంత్రం వరకు ప్రియుడి ఇంటి ఎదుటే బైఠాయించినా స్థానికులు, పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
ప్రేమ పేరుతో ఆడిన నాటకంలో...
వనపర్తి రూరల్ (మహబూబ్‌నగర్): ప్రేమ పేరుతో ఆడిన నాటకంలో ఓ బాలిక ప్రమాదవశాత్తు బావిలో పడి మృత్యువాతపడింది. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ దుర్ఘటన మంగళవారం రాత్రి వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. పట్టణంలోని ప్యాటగడ్డ కాలనీకి చెందిన దంపతులకు ముగ్గురు కూతుళ్లు. తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటుండగా ఇద్దరు కూతుళ్లు సరిత, శ్రీలత(17) స్థానికంగా వస్త్ర దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అయితే వనపర్తి మండలం మెట్‌పల్లికి చెందిన శ్రీకాంత్ శ్రీలతతో, ప్యాటగడ్డకు చెందిన నరేష్ సరితతో రెండేళ్లుగా ప్రేమ పేరుతో సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో శ్రీకాంత్ తన బైక్‌పై శ్రీలత, సరితను ఎక్కించుకుని పట్టణ శివారులోని ఖాసీంనగర్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. విషయం తెలుసు కున్న నరేష్ తన స్నేహితుడు శేఖర్‌తో కలిసి ద్విచక్రవాహనంపై శ్రీకాంత్ వద్దకు వెళ్లాడు. ఈ వి షయం గమనించిన కొందరు ప్యాటగడ్డ యువకులు వారిని అనుసరించారు. ఖాసీంనగర్ సమీ పంలోని వ్యవసాయం పొలం వద్ద బైక్‌లు ఉండటాన్ని గమనించిన యువకులు చుట్టుపక్కల వెతికారు. వీరి రాకను గమనించిన శ్రీలత, సరిత, శ్రీకాంత్, నరేష్, శేఖర్ పారిపోయారు. ఈ క్రమంలోనే శ్రీలత చీకట్లో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. మిగతా వారు పరారయ్యారు. అయితే తన సోదరి కనిపించడం లేదని సరిత ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. మృతదేహం వెలికితీత సమాచారం అందుకున్న వనపర్తి డీఎస్పీ సృజన, సీఐ సూర్యనాయక్, పట్టణ ఎస్ఐ నాగశేఖరరెడ్డి, రూరల్ ఎస్ఐ రాఘవేందర్‌రెడ్డి పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకుని బావిలో గాలించారు. ఈ క్రమంలో వ్యవసాయ బావిలో నుంచి శ్రీలత మృతదేహాన్ని వెలికితీశారు. బుధవారం ఉదయం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించగా ప్రజా, కుల సంఘాల నాయకులు, కాలనీవాసులు అడ్డుకున్నారు. బాలిక మృతికి కారణమైన యువకులపై చర్యలు తీసుకుని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని స్థానికులు వెంకటేష్, వెంకటస్వామి, చంద్రశేఖర్ తదితరులు డిమాండ్ చేశారు. ఈ విషయమై అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ తెలిపారు. అలాగే ముగ్గురు యువకులపై కూడా కేసు నమోదు చేశామన్నారు. -
చివరికి న్యాయమే గెలిచింది!
మార్కాపురం రూరల్ (ప్రకాశం): ప్రియుడి ఇంటి ఎదుట యువతి ధర్నా చేయగా అధికారుల చొరవతో వివాహం జరిగింది. ఈ సంఘటన మండలంలోని తిప్పాయపాలెంలో బుధవారం జరిగింది. సీడీసీఓ రమిజాభాను, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ తాజా మాజీ సర్పంచి కొర్రపోలు రామయ్య అదే గ్రామానికి చెందిన కొర్రపోలు కళావతిలు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి పదవి కాలం పూర్తి అయిన వెంటనే చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. పదవి కాలం పూర్తి అయినా ముఖం చాటేస్తున్నాడు. కళావతికి అనుమానం వచ్చి గత వారంలో ఆర్డీఓను మీ కోసం కార్యక్రమంలో కలిసి అర్జీ ఇచ్చింది. పెళ్లి చేసుకోవాలని యువతి బంధువులు అడుగుతున్నా అతడు పట్టించుకోలేదు. చేసేది లేక కళావతి తన కుటుంబ సభ్యులతో కలిసి రామయ్య ఇంటి ఎదుట దీక్షకు దిగింది. స్పందించిన సీడీపీఓ రమీజాభాను, పోలీసులు ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపారు. ఎట్టకేలకు పెద్దల సమక్షంలో చర్చిలో వివాహం చేశారు. కార్యక్రమంలో రైటర్ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్ హారతి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రేమికుడు కాదన్నాడని..
సింగరాయకొండ (ప్రకాశం): ప్రేమించిన వాడు వివాహం చేసుకోవటానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మండలంలోని పాకల పంచాయతీ ఆదిఆంధ్ర కాలనీలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం గ్రామానికి చెందిన దావులూరి భానుప్రకాష్, ఓ యువతి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఈ సమయంలో భానుప్రకాష్‌కు ఉపాధ్యాయునిగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దీంతో వీరిద్దరూ తమ పెద్దలకు తెలియకుండా విజయవాడలోని గుణదల మేరిమాత ఆలయంలో ఉంగరాలు మార్చుకున్నారు. తరువాత వీరి విషయం తెలిసిన పెద్దలు వివాహానికి ఒప్పుకున్నారు. అనంతరం సుప్రజ తల్లిదండ్రులు పెండ్లి ప్రయత్నంలో ఉండగా.. ఈనెల 21వ తేదీ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి వివాహం చేసుకొనేది లేదని తేల్చి చెప్పారు. గ్రామ పెద్దలతో సమస్య పరిష్కారానికి కృషి చేసినా ప్రయోజనం లేకపోవటంతో ఈనెల 24వ తేదీ బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా సమస్య పరిష్కారానికి కృషి చేసినా ప్రయోజనం లేకపోవటంతో మనస్థాపానికి గురైన ఆమె మంగళవారం బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి. నాగమల్లేశ్వరరావు తెలిపారు. -
నమ్మించి మోసం చేశాడు.. యువతి దీక్ష
ముండ్లమూరు (ప్రకాశం): ప్రేమ పేరుతో తనని మోసం చేసి మరో యువతిని రిజిస్టర్ వివాహం చేసుకున్న యువకుడి ఇంటి ఎదుట ఓ యువతి మౌనదీక్ష చేస్తోంది. బాధితురాలి కథనం ప్రకారం.. మండలంలోని కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన గుర్రం వెంకటేశ్వర్లు బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆ క్రమంలో వెంకటేశ్వర్లుకు విజయనగరం జిల్లా మొరకముడి మండలం యాడిక గ్రామానికి చెందిన బొత్స దేవీకుమారితో పరిచయమైంది. కొంతకాలం స్నేహంగా ఉన్నారు. ఆ తర్వాత ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని ఆ తర్వాత మోహం చాటేయడంతో బాధితురాలు శనివారం రాత్రి కమ్మవారిపాలెం వచ్చి వెంకటేశ్వర్లును నిలదీసింది. నీతో స్నేహం మాత్రమే చేశానని, తనకి మరో యువతితో రిజిష్టర్ వివాహం జరిగిందని అతడు బదులిచ్చాడు. ఆందోళన చెందిన యువతి తనని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గుట్టు చప్పుడు కాకుండా వేరే యువతిని పెళ్లి చేసుకున్నానని చెప్పడం ఏంటని అతడి ఇంటి ఎదుట దీక్షకు దిగింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ శివనాంచారయ్య తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకొని బాధిత యువతిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంకటేశ్వర్లు ప్రేమ పేరుతో మోసం చేసినట్లు ఏమైనా ఆధారాలు ఉంటే చూపితే కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని ఎస్ఐ ఆమకు హామీ ఇచ్చారు. అందుకు ఆ యువతి మౌనంగా ఉంది. ప్రియుడి ఇంటి ముందు దీక్ష కొనసాగిస్తోంది. పోలీసులు ఉమన్ వెల్ఫేర్ సొసైటీకి సమాచారం అందించారు. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు ఆమెకు రక్షణ కల్పించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ ఇందిరమ్మ వచ్చి బాధిత యువతికి కౌన్సిలింగ్ ఇచ్చారు. -
మోసగించిన బావ
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలో ఓ బాలిక(16) స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వరసకు మేనబావ అయిన ప్రతాప్‌ఠాకూర్ బాలికకు మాయమాటలు చెప్పి మోసగించాడని బాధితురాలి తల్లి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల మేరకు... స్థానిక ఎన్టీఆర్నగర్కు చెందిన బాలికకు, ఒడిశా రాష్ట్రంకు చెందిన ప్రతాప్‌ఠాకూర్ వరుసకు మేనబావ అవుతాడు. ఒడిశాలోనే పని చేస్తున్న ప్రతాప్ ఠాకూర్ ఎన్టీఆర్నగర్లో ఉంటున్న తమ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. ఈ క్రమంలోనే సదరు బాలికను ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పి మోసం చేశాడు. ఒడిశాకు వెళ్లిపోయిన ప్రతాప్‌ఠాకూర్ తిరిగి గోదావరిఖని రాలేదు. ఈ క్రమంలో సదరు బాలిక గర్భం దాల్చింది. కొడుపులో నొప్పిగా ఉంద ని ఈనెల 16న బాలికను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు బాలిక గర్భంతో ఉందని తెలియడంతో ప్రసవం జరిపించారు. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆం దోళనకు గురైన బాలిక తల్లి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రతాప్‌ఠాకూర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు. -
ప్రియుడి ఇంటి ఎదుట యువతి మౌన దీక్ష
షాబాద్(చేవెళ్ల) : ప్రేమించాను.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేసిన యువకుడి ఇంటి ఎదుట ఓ యువతి మౌనదీక్షకు దిగింది. తనకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేసింది. ఈ సంఘటన షాబాద్ మండల పరిధిలోని లక్ష్మారావుగూడలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మారావుగూడకు చెందిన శేఖర్‌రెడ్డి తాళ్లపల్లిలో నర్సరీ నిర్వహిస్తున్నాడు. ఇతడి వద్ద తాళ్లపల్లికి చెందిన మానస పనిచేస్తుండేది. ఈక్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించిన శేఖర్‌రెడ్డి మాయమాటలు చెప్పి తన వెంట తిప్పించుకొని లోబర్చుకున్నాడు. తల్లిలేని ఆమెకు జీవితాతం తోడుగా ఉండి కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని నమ్మించాడు. మూడు సంత్సరాలు వీరిద్దరు కలిసి తిరిగారు. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి నేడు..రేపు అంటూ శేఖర్‌రెడ్డి దాటవేస్తూ వచ్చాడు. దీంతో అనుమానం కలిగిన మానస అతడిపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో శేఖర్‌రెడ్డి తమ ఇద్దరి సామాజిక వర్గాలు వేరు.. మన పెళ్లికి తన తల్లిదండ్రులు, కుటుంబీకులు అంగీకరించరని స్పష్టం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకునేది లేదని చెప్పాడు. దీంతో మోసపోయానని గుర్తించిన యువతి షాబాద్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు శేఖర్‌రెడ్డిని పిలిపించి విచారణ జరిపారు. మానసతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన నర్సరీలో పనిచేస్తుండేదని, అంతవరకే తనకు తెలుసని స్పష్టం చేశాడు. ఇరువర్గాలకు చెందిన వాళ్లం మాట్లాడుకుంటామని చెప్పి ఠాణా నుంచి వచ్చిన శేఖర్‌రెడ్డి పరారయ్యాడు. కుటుంబీకులు ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయారు. దీంతో తనకు న్యాయం చేయాలని మానస తండ్రితో కలిసి శేఖర్‌రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించింది. శేఖర్‌రెడ్డి తనను మోసం చేశాడని కన్నీటిపర్యంతమైంది. అతడితో తనకు పెళ్లి చేసేవరకు ఆందోళన విరమించబోనని తెలిపింది. శేఖర్‌రెడ్డి తనను వివాహం చేసుకోకుండా ఆత్మహత్యే శరణ్యమని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించింది. పోలీసులు, అధికారులు తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. మానస ఆందోళనకు గ్రామస్తులు మద్దతు పలికారు. -
పెళ్లి చేసుకోకుంటే హతమారుస్తా..
సాక్షి, గుంటూరు: ‘ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకోకుంటే హతమారుస్తా’ అంటూ రమావత్ శివానాయక్ అనే యువకుడు నిత్యం వేధిస్తున్నాడని తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక తన తండ్రితో కలసి గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడుకు ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత బాలిక విలేకరులతో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మేకలదిన్నె తండాకు చెందిన తాను కారంపూడిలోని బ్రహ్మనాయుడు ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు తెలిపింది. అదే ప్రాంతంలోని గిరిజన సంక్షేమ గృహంలో ఉంటూ రోజూ పాఠశాలకు వెళ్తుండగా.. మేకదిన్నె తండాకు చెందిన శివానాయక్ వెంటపడుతూ ప్రేమించమని వేధిస్తున్నట్లు పేర్కొంది. వేధింపులు తట్టుకోలేక హాస్టల్ వార్డెన్‌కు విషయం తెలియజేయగా ఈ నెల 6న కారంపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. అనంతరం బెయిల్‌పై బయటికి వచ్చిన శివానాయక్ మళ్లీ హాస్టల్ వద్దకు వచ్చి గొడవ చేస్తున్నాడని, పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ దాడి చేసి హతమారుస్తానని బెదిస్తున్నాడని వివరించింది. కాగా, బాలికపై వేధింపులకు పాల్పడుతున్న రమావత్ శివానాయక్ తాత సింగూ నాయక్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుచరుడని, అధికార పార్టీ అండతోనే రెచ్చిపోతున్నాడని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మించి వంచించాడు.. మరో ఘటనలో ప్రేమ పేరుతో బసవబోయిన యుగేంద్ర అనే యువకుడు మోసం చేశాడని ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ బాలిక గుంటూరు అర్బన్ ఎస్పీ విజయారావుకు ఫిర్యాదు చేసింది. విశాఖపట్నం జిల్లా కశీంకోట గ్రాయానికి చెందిన బాలికకు, ఆమె స్నేహితురాలి ద్వారా గతేడాది డిసెంబర్లో అనకాపల్లి మండలం కూండ్రం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు, పద్మల తనయుడు బసవబోయిన యుగేంద్రతో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది జనవరి 20న తంతడి బీచ్‌లో పసుపు తాడు తాళిగా కట్టి బాలికను యుగేంద్ర వివాహం చేసుకున్నాడు. అనంతరం 45 రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో అద్దె గదుల్లో ఉంటూ కాపురం చేశారు. మార్చిలో బాలికను ఇంటి వద్ద వదిలి, మూడు నెలల్లో వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి యుగేంద్ర సెల్ స్విచ్ఆఫ్ చేశాడు. యుగేంద్ర ఆచూకీ కోసం ప్రయత్నించగా గుంటూరు జిల్లా బాపట్ల రూరల్ మండలం అడవిపల్లి గ్రామంలో ఉన్నట్లు తెలిసిందని బాలిక పేర్కొంది. పోలీసులు నిందితుడిని పట్టుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది. -
ప్రే‘ముంచాడు’.. కటకటాలపాలయ్యాడు
శ్రీకాకుళం రూరల్ : ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగినికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి.. లోబరుచుకుని కులం పేరుతో దూషించి చివరకు ముఖం చాటేశాడో ఏఆర్ కానిస్టేబుల్! సుమారు ఆరు సంవత్సరాలు ఈ కేసు వివిధ స్థాయిల్లో విచారణ చేపట్టిన అనంతరం ఎట్టకేలకు న్యాయస్థానం తుది తీర్పునిచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఏఆర్ కానిస్టేబుల్‌కు ఏడాది జైలు శిక్షణ విధించింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం రాత్రి జిల్లా పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. శ్రీకాకుళం నగర పరిధిలోని గొంటివీధికి చెందిన కొర్లకోట తులసీబాయ్ హోంగార్డుగా శ్రీకాకుళంలోనే ప్రస్తుతం పనిచేస్తోంది. జి.సిగడాం మండలం మదపాం గ్రామానికి చెందిన సెగళ్ల రాజు ఏఆర్ కానిస్టేబుల్‌గా జిల్లా సబ్జైల్లో 2013లో పనిచేస్తుండేవారు. అక్కడే తులసీబాయ్ కూడా హోంగార్డుగా పనిచేసేవారు. అక్కడే వీరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయం కాస్తా అందరికీ తెలిసిపోవడంతో పెళ్లి చేసుకోవాలని రాజును తులసీబాయ్ కోరింది.‘నువ్వు ఎస్సీ కుటుంబానికి చెందిన దానివి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నా కుటుంబం రోడ్డున పడుతుంది’ అని రాజు ముఖం చాటేశాడు. దీంతో 2013లో ఆమె టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో రాజుపై ఫిర్యాదు చేసింది. టూటౌన్ సీఐ రాధాకృష్ణ కేసు నమోదు చేశారు. ఎస్సీఎస్టీ డీఎస్పీ సి.హెచ్.పెంటారావు ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ కేసును రాజీ కుదిర్చేందుకు రాజు తీవ్రంగా శ్రమించారు. తనకు చెల్లి ఉందని, ఆమెకు వివాహం చేసేందుకు రెండేళ్లు సమయం కావాలని తులసీబాయ్ని కోరారు. తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో ఆమె రెండేళ్లు ఎదురుచూసింది. అయినా ఆమెకు నిరాశే ఎదురైంది. ఈ విషయం తెలియడంతో ఎస్పీ ఖాన్ హయాంలో ఆయన్ను ఆరు నెలలు సస్పెండ్ చేశారు. సుమారు ఆరేళ్లు ఈ కేసు వివిధ స్థాయిల్లో తిరిగి చివరకు ఓ కొలిక్కి వచ్చింది. సోమవారం ఈ కేసును పిపి ఐ.నాగమల్లేశ్వరరావు వాదించగా జడ్జి వి.గోపాలకృష్ణ విచారణ అనంతరం సెగెళ్లరాజుకు ఏడాది పాటు సాధారణ కారాగార జైలు శిక్షణ విధించినట్లు కోర్టు లైజన్ ఎస్ఐ జగన్నాథరావు తెలిపారు. -
న్యాయం చేయండి.. లేకపోతే దూకుతా
సాలూరు : ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీకంగా అనుభవించి ఇప్పుడేమో పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవాలని చూస్తున్న యువకుడితో వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ వాటర్‌ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన సాలూరు మండలం మజ్జలపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మావుడి గ్రామానికి చెందిన పెదపల్లి కృష్ణవేణి సాలూరు పట్టణంలోని మజ్జలపేట తాగునీటి రిజర్వాయర్‌పైకి గురువారం ఉదయం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడింది. విషయం తెలుసుకున్న పట్టణ, రూరల్ ఎస్సైలు ఫకృద్దీన్, గణేష్‌తో పాటు అగ్నిమాపకాధికారి నోమేశ్వరరావు కూడా సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కిందకు దిగాలని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె తనకు చావే శరణ్యమని, తనను మోసగించిన యువకుడితో వివాహం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేసింది. దీంతో పట్టణ ఎస్సై సమాచారాన్ని ఏఎస్పీ దీపికా పాటిల్‌కు ఫోన్లో సమాచారం అందించారు. ఆమె ఫోన్లో నేరుగా బాధిత మహిళతో మాట్లాడుతూ, ఆ యువకుడితో వివాహం చేయిస్తానని హామీ ఇవ్వడంతో బాధితురాలు కిందకు దిగింది. వెంటనే ఆమెను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటికే పార్వతీపురం నుంచి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ఏఎస్పీ బాధిత మహిళకు కౌన్సెలింగ్ చేశారు. మోసం చేయాలని చూస్తున్నాడు వాటర్ ట్యాంకు నుంచి కిందకు దిగిన అనంతరం కృష్ణవేణి మాట్లాడుతూ, తనకు ఇదివరకే వివాహమై ఒక కుమారుడు కూడా ఉన్నాడన్నారు. అయితే వారితో వేరుపడి జీవిస్తున్నానని, ఈ నేపథ్యంలో తాను హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేసుకునేందుకు వెళ్తుండగా.. విశాఖ బస్టాండ్‌లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సీతాపురం గ్రామానికి చెందిన దుంపల అప్పారావుతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి శరీరకంగా దగ్గరవడమే కాకుండా అతని ఇంటికి కూడా తీసుకువెళ్లాడని చెప్పింది. అలాగే తన ఇంటికి కూడా వారి కుటుంబ సభ్యులు వచ్చి వెళ్లేవారని తెలిపింది. అయితే కొంతకాలంగా తనను దూరంపెడుతున్నారని, పెళ్లి చేసుకోవాలంటే రూ. 5 లక్షల కట్నం, 2 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వాపోయింది. దీంతో తనకు న్యాయం చేయాలని ఆరు రోజుల కిందట రూరల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపింది. పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నారే తప్ప తనకు న్యాయం చేయడం లేదని ఆరోపించింది. అందుకే ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని వాటర్ ట్యాంక్ ఎక్కానని వివరించింది. -
నమ్మించి.. వంచించి..
విశాఖపట్నం, రావికమతం: రెండేళ్లుగా ప్రేమించాడు... కులాలు వేరైనా వివాహం చేసుకుంటానన్నాడు.తీరా వివాహ ముహూర్తం సమయానికి పరారై యువతికి తీరని ఆవేదన మిగిల్చాడు. న్యాయం చేయాలని కోరుతూ ఆ దళిత యువతి అత్తింటి ముందు గురువారం ఆందోళనకు దిగింది. కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని మర్రివలస గ్రామానికి చెందిన దళిత యువతి కొత్తి హరితేజ (20) అదే గ్రామం కాపు సామాజిక వర్గానికి చెందిన గూటాల శివాజి (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరైనా.. హరితేజ విశాఖలో బీఎస్సీ నర్సింగ్ చేస్తుండగా శివాజి పీజీ చేసి గుంటూరు జిల్లాలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కులాలు వేరైనా పెద్దల అంగీకారం లేకున్నా వివాహం చేసుకుంటానని నమ్మించడంతో ఇరువురూ మరింత దగ్గరయ్యారు. అయితే శివాజీకి గర్నికం గ్రామానికి చెందిన మరొక యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న హరితేజ గ్రామ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లింది. పెద్దలు సైతం ప్రేమించిన యువతికి న్యాయం చేయాలని హితవు పలికారు.తల్లిదండ్రులు ఇష్టపడటం లేదని అవసరమైతే హరితేజకు నష్టపరిహారం చెల్లిస్తామని శివాజి రాజీకి ప్రయత్నించినా ఆమె అంగీకరించలేదు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా.. వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. దీనిపై ఆమె కొత్తకోట సీఐ కోటేశ్వరరావును ఆశ్రయించింది. ఆయన శివాజీ, తల్లిదండ్రులకు ఇటీవల కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో వివాహానికి ఒప్పుకున్న శివాజి పెద్దల సమక్షంలో పూచీకత్తులు కూడా రాశాడు. ఈ మేరకు గురువారం రోలుగంటలోని దేవాలయంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. అయితే ముహూర్త సమయం వరకూ వచ్చేస్తున్నానంటూ చెప్పిన శివాజీ ఆపై ముహూర్తం దాటిపోయినా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయానని గుర్తించిన పెండ్లికుమార్తె హరితేజ మర్రివలసలో అత్తింటి ముందు ఆందోళన చేపట్టింది. అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ప్రియుడు శివాజి, అతని తల్లిదండ్రులు భవాని, తాతబ్బాయితోపాటు గర్నికం, బైలపూడి గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొత్తకోట ఏఎస్ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమికుడి మోసం.. ప్రేయసి బలవన్మరణం
ఆనందపురం (భీమిలి): విశాఖ జిల్లా ఆనందపురం మండలం పందలపాకలో మంగళవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పందలపాకలో నివసిస్తున్న యర్ర రాము, యర్ర కామమ్మలకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె కొన్నేళ్ల క్రితం మృతి చెందగా రెండో కుమార్తె వరలక్ష్మి (20) తల్లిదండ్రులతో ఉంటోంది. వీరి ఇంటికి ఎదురుగా నివసిస్తున్న నరసింగరావు మూడేళ్లుగా వరలక్ష్మి వెంటబడి ప్రేమిస్తున్నానని నమ్మించాడు. షికార్లకు తీసుకెళ్లి శారీరకంగా అనుభవించాడు. రెండేళ్ల నుంచి పెళ్లి ప్రస్తావన తెస్తున్నా పలకడంలేదు. పెద్దల వద్ద పలుమార్లు పంచాయితీ జరిగింది. ఎట్టకేలకు నరసింగరావు పెళ్లికి అంగీకరించడంతో 2017 అక్టోబర్ 7న పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. కట్నం కింద రూ.2 లక్షలిచ్చారు. నెలలు గడుస్తున్న పెళ్లి ప్రస్తావన తేకపోవడంతో మంగళవారం నరసింగరావు తల్లిదండ్రులు సూరి, లక్ష్మి వద్దకు వరలక్ష్మి తల్లిదండ్రులు వెళ్లి పెళ్లి ప్రస్తావన తేగానే కోపోద్రిక్తులై దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని కుమార్తె వరలక్ష్మికి తెలపడంతో ఆమె వెళ్లి నరసింగరావును నిలదీసింది. మరో రూ.5 లక్షలిస్తేగానీ పెళ్లి చేసుకోనని ఆయన తెగేసిచెప్పడంతో వరలక్ష్మి మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. -
ప్రేమ పేరిట వంచించాడు..
నస్పూర్(మంచిర్యాల): తనను ప్రేమించి, కొతకాలంగా సహజీవనం గడిపిన ప్రియుడు మోసం చేశాడని ఆరోపిస్తూ బెల్లంపల్లికి చెందిన గంపల సుజాత అనే యువతి గురువారం నస్పూర్‌లోని మోతునూరి నరేష్ ఇంటి ఎదుట బైఠాయించింది. సుజాత, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని ఒక స్కానింగ్ సెంటర్లో ఆరు సంవత్సరాలుగా ఇరువురు పనిచేశారు. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రస్తుతం నరేష్ వేరొక ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. సుజాత ప్రతిరోజు బెల్లంపల్లి నుంచి రాకపోకలు సాగించడంతో నరేష్ ఆమెను మంచిర్యాలలో ఒక అద్దె ఇంటిలో ఉంచి సంవత్సర కాలంగా సహజీవనం కొనసాగిస్తున్నారు. సుజాత చిట్టీ వేస్తూ పొదుపు చేసుకున్న రూ.1.80 లక్షలు తన ఖర్చులకోసం వాడుకున్నాడు. ఇటీవల నరేష్ తల్లిదండ్రులు అతనికి వేరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతో సుజాత తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని నిలదీసింది. దీనికి అతడు నిరాకరించాడు. దీంతో నరేష్‌పై మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నరేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. సీసీసీ ఎస్సై రాజేంద్రప్రసాద్ సుజాతతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే తనకు న్యాయం జరిగేంత వరకు దీక్ష కొనసాగిస్తానని సుజాత పేర్కొంది. -
ఓ మగాడిని నమ్మి వస్తే..
పిడుగురాళ్ల టౌన్: ఓ మగాడిని నమ్మి వస్తే అతడు అర్ధంతరంగా వదిలేశాడు. దీంతో మనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని 10వ వార్డులో గురువారం చోటు చేసుకుంది. వివరాలు...దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన పి. సంధ్యారాణి(27) భర్తతో విడాకులు తీసుకుని పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ముత్యాలంపాడు గ్రామానికి చెందిన అనుదీప్ పరిచయమయ్యాడు. అతడితో కలసి పిడుగురాళ్లలో ఉంటోంది. ఇటీవల సంధ్యారాణితో గొడవపడి చేయి చేసుకుని వెళ్లిపోయాడు. అతడు గుంటూరులో ప్రైవేటు జాబ్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన సంధ్యారాణి బుధవారం రాత్రి మైలతుత్తాన్ని పంచదారలో కలుపుకుని ఇడ్లీలో తినేసింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో విగతజీవిగా పడి ఉంది. ఉదయాన్నే స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఎం. హనుమంతరావు, ఎస్ఐ రవీంద్రబాబు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లో పరిసరాల్ని పరిశీలించారు. ఆమె వద్ద సూసైడ్ లెటర్‌ను గుర్తించారు. తన చావుకు ప్రేమికుడే కారణమని అందులో రాసింది. నమ్మి వచ్చినందుకు మోసం చేశాడని, వాడిని వదలొద్దంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. -
ప్రాణం తీసిన ప్రేమ!
తణుకు: తల్లిదండ్రులు లేని ఒంటరి జీవితం.. అయినా ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలనే లక్ష్యం.. విద్యార్థి దశలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నా అనాథగా మిగలకూడదని ఒక పాస్టర్ ఆమెను అక్కున చేర్చుకున్నారు. ఆమె కలలను నిజం చేయాలని భావించి ఆమెను నర్సింగ్ కోర్సు చదివిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఒక వ్యక్తి ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. ప్రేమ పేరుతో వంచించాడు. నువ్వే సర్వస్వం అంటూ నమ్మబలికాడు. చివరికి పెళ్లి విషయం తీసుకువస్తే తనకు అప్పటికే పెళ్లయ్యిందనే విషయాన్ని చెప్పాడు. దీనిని జీర్ణించుకోలేని ఆమె మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఇరగవరం మండలం అర్జునుడుపాలెం గ్రామానికి చెందిన మల్లిపూడి హెప్సిబారాణి (21) తణుకులోని ఒక ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో చదువుతూ ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. హెప్సిబారాణి ఆత్మహత్యకు కారణమైన ఆమె ప్రియుడు పిండి ఆంజనేయులు అలియాస్ అంజిని పోలీసులు అదుపులో కి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, తణుకు సీఐ సీహెచ్ రాంబాబు నర్సింగ్ కళాశాల వసతి గృహంలోని సంఘటనా స్థలాన్ని పరిశీలించి తోటి విద్యార్థులను విచారించారు. మత్తు ఇంజెక్షన్ చేసుకుని.. అర్జునుడుపాలెం గ్రామానికి చెందిన మల్లిపూడి రామారావు, కుమారి దంపతుల కుమార్తె హెప్సిబారాణి. తల్లిదండ్రులు గతంలోనే చనిపోవడంతో ఆమె అనాథగా మిగిలింది. కుటుంబ సభ్యుల నిరాదరణ కారణంగా పెరవలి మండలం అజ్జరం గ్రామానికి చెందిన పాస్టర్ ఒకరు ఆమెను చేరదీసి తణుకులో నర్సింగ్ కోర్సు చదిస్తున్నారు. జీఎన్ఎం ఆఖరి సంవత్సరం చదువుతూ ఇటీవల పరీక్షలు సైతం రాసింది. ప్రస్తుతం ప్రాక్టికల్స్ జరుగుతుండగా ఈ ఘాతుకానికి పాల్పడింది. నర్సింగ్ కోర్సు చదువుతున్న హెప్సిబారాణి తణుకులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో ఆమె ప్రియుడు అంజితో కొంతకాలంగా ఘర్షణ పడుతోంది. తనకు ఇంతకుముందే పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టిన అంజి వ్యవహారంపై స్నేహితుల వద్ద ప్రస్తావించినట్టు తెలు స్తోంది. హాస్టల్లో సహచర విద్యార్థినులను విచారిస్తున్న సీఐ రాంబాబు అంజి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉంటుండగా నాలుగు రోజుల క్రితమే స్వదేశానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం తనకు కడుపు నొప్పిగా ఉందని ఇంజెక్షన్ చేయాలని స్నేహితులను కోరింది. అయితే ఆమె తీసుకువచ్చిన ఇంజెక్షన్ అనుమానాస్పదంగా ఉండటంతో వారు నిరాకరించారు. దీంతో స్వయంగా హెప్సిబా రాణి తానే ఇంజెక్షన్ చేసుకుంది. కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెంది నట్టు వైద్యులు ధ్రువీకరించారు. రోగులకు ఆపరేషన్లు చేసే సమయంలో ఇచ్చే మత్తు ఇంజెక్షన్ నరానికి చేసుకోవడం వల్ల ఆమె మృతి చెందినట్టు పోలీసులు, వైద్యులు ప్రాథమిక విచారణలో తేల్చా రు. మృతదేహానికి పోలీసులు సోమవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పరువు కోసం ప్రాణం తీసుకుని.. ‘నన్ను పెంచి పోషిస్తున్న పాస్టర్ గారి పరువు కోసమే చనిపోతున్నాను.. నేను ఎన్నో కలలు కన్నాను.. మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలని.. అయితే నా కలలన్నీ కల్లలు చేశావు..’ అంటూ తన ప్రియుడు అంజిని ఉద్దేశించి రాసిన సూసైడ్ నోట్ గుండెల్ని కదిలిం చింది. మృతురాలు హెప్సిబారాణి తాను చనిపోవడానికి ముందు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులు ముందుగా పిండి ఆంజనేయులు అలియాస్ అంజిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ‘కేవలం నీవల్లే నా జీవితం ఇలా అయిందనీ.. నేను నిన్ను ప్రేమించి జీవితంలో పెద్ద తప్పు చేశానని.. ఇకపై ఎవరినీ ఇలా మోసం చేయవద్దని’ సూసైడ్‌నోట్‌లో ఆమె పేర్కొంది. ‘నాలాంటి అనాథలను ఉన్నత స్థానం కల్పించి ప్రేమగా ఆదరిస్తున్న పాస్టర్కు ఐ లవ్యూ’ అంటూ ప్రేమను వ్యక్తపరిచింది. తనలా ఎవరూ మోసపోవద్దని తన స్నేహితులకు ఆమె సలహా ఇచ్చి తనువు చాలించింది. -
పెళ్లి పేరుతో యువతికి మోసం
రాజాం సిటీ: పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోరిక తీర్చుకున్న అనంతరం మొహం చాటేసిన ఓ యువకుడిన పోలీసులు అరెస్టుచేశారు. ఆమెతో శృంగారం చేసిన దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కామాంధుడిని అదుపులోకి తీసుకున్నారు. నగ్నచిత్రాలు చూపించి బాధితురాలిని బ్లాక్మెయిల్ చేసిన ఘనుడు కటకటాల పాలుకానున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పాలకొండ డీఎస్పీ జి.స్వరూపారాణి శుక్రవారం తెలిపిన వివరాలు ఇలావున్నాయి. రాజాం పట్టణంలో తెలగవీధికి చెందిన గట్టి కృష్ణప్రసన్నకుమార్ అనే యువకుడు కొన్నాళ్లుగా ఇదే పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్టు నమ్మించాడు. పెళ్లిచేసుకుంటానని నమ్మబలికి శారీరక వాంఛ తీర్చుకున్నాడు. ఆమెతో శృంగారం చేసిన చిత్రాలు, వీడియోను మొబైల్ ఫోన్లో బంధించి భద్రపరిచాడు. ఇలా కొన్నాళ్లు జరిగిన అనంతరం ఆమెకు మొహం చాటేశాడు. కొద్ది రోజుల తర్వాత పెళ్లిచేసుకోవాలని బాధితురాలు నిలదీయడంతో వీరి శృంగారానికి సంబంధించిన నీలిచిత్రాలు చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. తనను ఒత్తిడి తెస్తే ఈ చిత్రాలు బహిర్గతం చేస్తానని హెచ్చరించాడు. అయితే ఈలోగా వీరి శృంగారానికి సంబంధించిన నీలిచిత్రాలు వాట్సాప్, ఫేస్బుక్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో మోసపోయిన యువతి తల్లిదండ్రులతో కలిసి రాజాం టౌన్ సర్కిల్ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించింది. సీఐ శంకరరావు కేసు నమోదు చేయగా పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి ప్రత్యేక పర్యవేక్షణలో రెండు రోజుల పాటు దర్యాప్తు నిర్వహించారు. అనంతరం నిందితుడు కృష్ణప్రసన్నకుమార్ను పట్టుకోవడంతో అతడు తప్పు ఒప్పుకోవడం వల్ల అరెస్టుచేసి శుక్రవారం విలేకరుల ముందు హాజరుపరిచారు. మోసపోయిన యువతి దళిత కుటుంబానికి చెందినది కావడంతో ఎస్సీ, ఎస్టీ, సైబర్ క్రైం విభాగంలో కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్టు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. మహిళా కమిషన్ అండగా ఉంటుంది దగాపడ్డ యువతికి మహిళా కమిషన్ అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి అన్నారు. విషయం తెలుసుకున్న ఈమె రాజాం పోలీసుస్టేషన్‌కు శుక్రవారం చేరుకుని బాధిత యువతితో మాట్లాడారు. యువతి తీవ్ర ఒత్తిడికి గురై భయపడుతుందని, ఈమెను స్టేట్‌హోంకు తరలించి రక్షణ కల్పిస్తామని విలేకరులకు తెలిపారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్రలో ఇటీవల ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. నిర్భయ వంటి చట్టాలు ఉన్నప్పటికీ ఎవరూ భయపడకపోవడం విచారకరమని, దోషులకు శిక్ష పడే విధంగా కృషిచేస్తామన్నారు. -
కడుపులో మగపిల్లాడుంటేనే పెళ్లి
ప్రేమ పేరుతో ఓ యువకుడు బాలికను నమ్మించి గర్భం చేశాడు. తీరా పెళ్లి విషయం వచ్చేసరికి కడుపులో మగపిల్లాడుంటే చేసుకుంటానని చెప్పాడు. అయితే స్కానింగ్‌లో ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించాడు. తర్వాత మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. తనకు జరిగిన మోసం తెలుసుకుని ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం యువకుడు కటకటాలు లెక్కిస్తుండగా, స్కానింగ్ చేసిన వైద్యురాలు, ఆసుపత్రి నిర్వాహకులు పరారీలో ఉన్నారు. వివరాల్లోకెళితే.. కర్నూలు(హాస్పిటల్): తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16) అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఆ బాలిక 8వ తరగతి చదువుతున్న సమయంలో నవాబ్‌పేటకు చెందిన ఎలక్ట్రీషియన్ శాకమోని శివకుమార్(19) పరిచయమయ్యాడు. తరచూ పాఠశాలకు ఎలక్ట్రికల్ పనులకు వెళ్లి ఆ బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమలో దించాడు. అనంతరం కొద్దిరోజులకు వారిద్దరి మధ్య చనువు మరింత పెరిగి శారీరకంగా దగ్గరయ్యారు. కాగా.. ఆ యువకుడితో బాలిక తరచూ ఫోన్లో మాట్లాడుతుండటంతో పాఠశాల నుంచి టీసీ ఇచ్చి ఇంటికి పంపించారు. కొన్నిరోజులకు బాలిక గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోవాలని యువకుడిపై ఒత్తిడి పెంచింది. కడుపులో మగపిల్లాడు ఉంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. స్థానిక ఆర్ఎంపీల సూచన మేరకు బాలికను కర్నూలులోని కొత్తబస్టాండ్ సమీపంలో ఉన్న రక్ష హాస్పిటల్లో డాక్టర్ మహేశ్వరికి చూపించాడు. స్కానింగ్ చేసిన అనంతరం కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించాడు. అనంతరం బాలికకు ఫోన్ చేయడం మానేశాడు. మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న బాలిక నవాబ్‌పేట పోలీస్‌స్టేషన్‌లో గత నెల 29న ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడితో పాటు వైద్యురాలు డాక్టర్ మహేశ్వరి, రక్ష ఆసుపత్రి యాజమాన్యంపై ఐపీసీ సెక్షన్ 376(2)(ఎన్), 313 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం డాక్టర్ మహేశ్వరితో పాటు రక్ష ఆసుపత్రి నిర్వాహకులు పరారీలో ఉన్నారు. -
దామెర లో పరిస్థితులు ఉద్రిక్తం
వివాహిద దీక్ష భగ్నానికి పోలీసుల యత్నం పోలీసులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం డీఎస్పీ జోక్యంతో సద్దుమణిగిన ఆందోళన దామెర(ఎల్కతుర్తి): తనకు న్యాయం చేయాలని మండలంలోని దామెరలో ఐత స్వర్ణలత అనే వివాహిత ప్రియుడి ఇంటి ఎదుట చేపట్టిన మౌనదీక్ష గురువారం రెండో రోజుకు చేరింది. వంగర ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని స్వర్ణలతను పోలీసు వాహనంలో తరలించడంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. గ్రామస్తులంతా ఏకమై అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లారని పోలీసులను నిలదీశారు. విషయం తెలపకపోవడంతో వర్షంలోనే ఆందోళనకు దిగారు. బాధితురాలి తండ్రి ఐత సంపత్ క్రిమిసంహారక మందు తాగగా..108లో ఆస్పత్రికి తరలించారు. ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న హుజూరాబాద్ రూరల్ సీఐ గౌస్‌బాబా సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ, సైదాపూర్ ఎస్సై శ్రీధర్‌ను పంచాయితీ కార్యాలయంలోనే చుట్టుముట్టి స్వర్ణలతను తీసుకురావాలని డిమాండ్ చేశారు. రెండు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. అనంతరం స్వర్ణలతను గ్రామానికి తీసుకొచ్చారు. ప్రియుడు పాటి ప్రవీన్‌తో స్వర్ణలత వివాహం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. డీఎస్పీ రవీందర్‌రెడ్డి వచ్చి బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి..
వెల్మజాల (గుండాల) : ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పాడు..పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.. ఆపై లొంగదీసుకుని గర్భవతిని చేశాడు.. పెళ్లి చేసుకోవాలని కోరితే కులం తక్కువదానివంటూ నిందించాడు.. ప్రేమకు గుర్తుగా ఆ బాలిక ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. తనకు న్యాయం చేయాలని కోరుతూ మహిళా సంఘాలతో కలిసి ప్రియుడి ఇంటి ఎదుట బుధవారం ఆందోళనకు దిగిoది. వివరాలు.. మండలంలోని వెల్మజాల గ్రామానికి చెందిన కోల పెంటయ్య చిన్న కొడుకు కోల సతీష్ గ్రామంలోనే జులాయిగా తిరుగుతుండేవాడు. ప్రేమిస్తున్నానంటూ ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. పర్యవసానంగా ఆ బాలిక గర్భం దాల్చింది. రోజురోజుకీ తన శరీరంలో వస్తున్న మార్పులను గుర్తించలేకపోయింది. అయితే ఆ చిన్నారి తల్లిదండ్రి కూడా ఈ విషయాన్ని గుర్తించలేకపోవడం గమనార్హం. కడుపునొప్పిరావడంతో.. ఇటీవల ఆ బాలికకు కడుపునొప్పి లేవడంతో తల్లిదండ్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు బాలిక గర్భవతి అని తేల్చిచెప్పారు. ఈ నెల 7వ తేదీన ఆ బాలిక ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మహిళా సంఘాలతో కలిసి ఆందోళన మహిళా సంఘాల బాధ్యులతో కలిసి ఆ బాలిక బుధవారం ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అయి తే విషయం తెలుసుకుని సతీష్ కుటుంబ సభ్యులు ఇంటి నుంచి పరారయ్యారు. బాధితురాలికి తగిన న్యాయం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని మహిళా సంఘాల సభ్యులు హెచ్చరించారు. -
ఒకరిని ప్రేమించి.. మరొకరితో నిశ్చితార్థం
ఎస్పీకి ఫిర్యాదు చేసిన యువతి నల్లగొండ క్రైం : తనను ప్రేమించి మోసం చేసి మరో అమ్మాయితో నిశ్చితార్థం పెట్టుకున్నాడని ఓ యువతి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో బుధవారం ఆ యువకుడిని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు, పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పీఏ మండలానికి చెందిన ధర్మాపురం ముత్యాలు, వరంగల్ జిల్లా కేంద్రంలోని శివనగర్ కాలనీకి చెందిన స్నేహ స్థానిక వీటీ కాలనీలోని వెన్నెల స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో 2008-2011లో జీఎన్ఎం విద్యనభ్యసించారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమించుకున్నారు. కాగా మమాబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రబాద్ మండలం పధిర గ్రామానికి చెందిన సరితతో ఈ నెల 30న వివాహం కోసం నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇందులోభాగంగా రూ. 3 లక్షల నగదు, 7 తులాల బంగారం, బైకును కట్నంగా మాట్లాడుకున్నారు. ఈ విషయం తెలిసిన స్నేహ యువకుడిపై ఎస్పీకి ఫిర్యాదు చేసింది. స్పందించిన ఎస్పీ.. కేసు విచారణ చేయూలని టూటౌన్ పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన టూటౌన్ ఎస్ఐ దుర్గాప్రసాద్ యువకుడు ముత్యాలును అదుపులోకి తీసుకోవడంతో పాటు సరిత కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. అయితే సరిత కుటుంబం హైరాబాద్లోని నాగోల్ పరిధిలో బండ్ల గూడెంలో జీవనోపాధి కోసం వెళ్లి అక్కడే ఉంటున్నారు. పెళ్లి ఏర్పాట్లు కూడా బండ్ల గూడెంలోనే చేశారు. సరిత కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ధర్మాపురం ముత్యాలును నిలదీయడంతో కట్నంగా ఇచ్చిన డబ్బులన్నీ తిరిగి ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. స్నేహను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. -
ప్రేమించి మోసగించాడంటూ బాలిక ఫిర్యాదు
తుని రూరల్ : తనను ప్రేమించానని నమ్మించి ఓ వ్యక్తి మోసగించాడని తేటగుంట గ్రామానికి చెందిన బాలిక పోలీసులను ఆశ్రయించింది. రూరల్ ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం..తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందడంతో ఓ బాలిక తేటగుంట గ్రామంలోని పి.గాంధీ అనే వ్యక్తి ఇంట్లో ఉంటోంది. ఇటీవల అదే గ్రామానికి చెందిన కె.శ్రీను బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమించానని నమ్మించి, ఆమెను లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని బాలిక కోరగా, తన తల్లిదండ్రులు అంగీకరించడం లేదంటూ శ్రీను ఆమెకు చెప్పాడు. దీంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. బాలికను తుని ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించినట్టు ఎస్సై అశోక్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని ఆయన వివరించారు. -
ప్రియుడి మోసం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!
మీర్‌పేట ప్రాంతంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. రాఘవి అనే యువతి బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియుడు సుశీల్ కుమార్ తనను మోసం చేశాడనే ఆవేదనతోనే ఆమె బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. రాఘవి మీర్‌పేట ప్రాంతంలోని ఓ హాస్టల్లో ఉంటూ నగరంలోని ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండేవారు. ఆమె సుశీల్ కుమార్ అనే యువకుడితో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించేసరికి.. అతగాడి అసలు స్వరూపం బయటపడింది. కోటి రూపాయల కట్నం ఇవ్వాలని సుశీల్ కుమార్ డిమాండ్ చేశాడు. దాంతో ఇన్నాళ్లూ ప్రేమించి, ఇప్పుడిలా అంటున్నాడని తీవ్ర మనస్తాపానికి గురైన రాఘవి.. ఆత్మహత్య చేసుకుంది.