
సింగరాయకొండ (ప్రకాశం): ప్రేమించిన వాడు వివాహం చేసుకోవటానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మండలంలోని పాకల పంచాయతీ ఆదిఆంధ్ర కాలనీలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం గ్రామానికి చెందిన దావులూరి భానుప్రకాష్, ఓ యువతి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఈ సమయంలో భానుప్రకాష్‌కు ఉపాధ్యాయునిగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది.
దీంతో వీరిద్దరూ తమ పెద్దలకు తెలియకుండా విజయవాడలోని గుణదల మేరిమాత ఆలయంలో ఉంగరాలు మార్చుకున్నారు. తరువాత వీరి విషయం తెలిసిన పెద్దలు వివాహానికి ఒప్పుకున్నారు. అనంతరం సుప్రజ తల్లిదండ్రులు పెండ్లి ప్రయత్నంలో ఉండగా.. ఈనెల 21వ తేదీ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి వివాహం చేసుకొనేది లేదని తేల్చి చెప్పారు. గ్రామ పెద్దలతో సమస్య పరిష్కారానికి కృషి చేసినా ప్రయోజనం లేకపోవటంతో ఈనెల 24వ తేదీ బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు కూడా సమస్య పరిష్కారానికి కృషి చేసినా ప్రయోజనం లేకపోవటంతో మనస్థాపానికి గురైన ఆమె మంగళవారం బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి. నాగమల్లేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment