love marrige
-
ప్రియుడితో కలిసి భర్తపై భార్య దారుణం
-
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం.. చివరికి ఇలా..
సాక్షి, చెన్నై: ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తతో గొడవ పడ్డ ఓ భార్య తన ఇద్దరు పిల్లలను బావిలో పడేసి హతమార్చింది. ఆ పై తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తెన్కాశి జిల్లా వాసుదేవ నల్లూరుకు చెందిన మురుగన్, మీనా దంపతులు గతంలో ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు. తర్వాత పెద్దల సహకారం లేకుండానే ఈ దంపతులు జీవనం సాగిస్తూ వచ్చారు. వీరికి త్యాగు మీనా(6), ముఖీషా(2) అనే కుమార్తెలున్నారు. ఇటీవల కాలంలో దంపతుల మధ్య తరచూ గొడవలు వస్తున్నాయి. ఇరుగు పొరుగు వారు సర్ది చెప్పే వారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాత్రి భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ అనంతరం మౌనంగా ఇంటి నుంచి మురుగన్ బయటకు వెళ్లి పోయాడు. బావిలో మృతదేహాలు.. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన మురుగన్.. భార్య, పిల్లలు కనిపించక పోవడంతో ఇరుగు పొరుగు వారి సాయంతో ఆ పరిసరాల్లో గాలించాడు. బుధవారం వేకువజామున గ్రామ శివార్లలో ఉన్న పాడు బడ్డ బావిలో త్యాగుమీనా, ముఖీషా మృతదేహం బయట పడింది. అగి్నమాపక సిబ్బంది మీనా మృతదేహాన్ని బావిలో గాలించి గుర్తించారు. పిల్లలను బావిలో తోసి మీన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అని నిర్ధారించారు. ఈమేరకు మురుగన్‌ను పోలీసులు ప్రశి్నస్తున్నారు. -
కొండారెడ్డిపల్లి అబ్బాయి.. ఐర్లాండ్ అమ్మాయి.. అక్కడే మొగ్గ తొడిగిన ప్రేమ
రంగారెడ్డి: కొండారెడ్డిపల్లి అబ్బాయి.. ఐర్లాండ్ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివరాలివీ. కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంబరాజు చంద్ర ప్రకాష్ రావు, ఉషశ్రీ దంపతుల రెండో కుమారుడు రాహుల్ హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ చదివి సైక్రియాటిస్ట్లో పీహెచ్డీ చేశాడు. అనంతరం ఉద్యోగం నిమిత్తం ఆరేళ్ల క్రితం ఐర్లాండ్ దేశానికి వెళ్లాడు. అక్కడ మెడికల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. రాహుల్‌కు అదే దేశానికి చెందిన ఎడ్మండ్ వాల్ష్, కార్మెల్ వాల్ష్ ల కూతురు క్లెయర్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వివాహం చేసుకునేందుకు ఇద్దరూ వారి కుటుంబ సభ్యులను ఒప్పించారు. హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని వంగ అనంతరెడ్డి గార్డెన్లో ఆదివారం వారి వివాహం ఘనంగా జరిగింది. కల్యాణ మండపం కళకళ వధువు క్లెయర్ తరఫున 60 మంది అతిథులు విమానంలో శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. విదేశీ అతిథుల రాకతో కల్యాణ మండపం కళకళలాడింది. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
మారణాయుధాలతో వచ్చి, అక్షితపై దాడిచేసి...
జగిత్యాల క్రైం: జగిత్యా ల రూరల్ మండలంలని బాలపల్లిలో ఆదివారం మధ్యాహ్నం ఓ యువతిని బెదిరించి, కొట్టి తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. బాలపల్లికి చెందిన జక్కుల మధు, రాయికల్ మండలంలోని ఇటిక్యాలకు చెందిన జవ్వాజి అక్షిత గత జూలై 3న ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో ఆమెపై కక్ష పెంచుకున్న తండ్రి భూమయ్య, మేనమామ సుంకశీల సత్తయ్యతోపాటు మరికొందరు రెండు కార్లలో మారణాయుధాలతో ఆదివారం బాలపల్లికి వచ్చారు. అక్షితపై దాడిచేసి, బలవంతంగా కారులో ఎక్కించారు. అడ్డుకోబోయిన ఆమె అత్త్త, ఆడపడుచులపై దాడి చేయడంతో గాయపడ్డారు. అక్కడికి చేరుకున్న స్థానికులపైనా ఆయుధాలతో వెంట పడటంతో వారు పరుగులు పెట్టారు. అనంతరం యువతిని తీసుకొని, వెళ్లిపోయారు. స్థానికులు జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్‌కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. అక్షిత భర్త మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల కోసం రెండు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
గ్రేట్ లవర్స్.. ఫేస్బుక్ లవ్ మ్యారేజ్ చివరకు ఇలా..
సాక్షి, హైదరాబాద్: క్షణ కాలం ఆవేశం వారి ప్రాణాలను బలిగింది. సికింద్రాబాద్‌లో మైనర్ ఫేస్బుక్ ప్రేమ జంట వివాహం విషాదంతో ముగిసింది. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల ప్రకారం.. శ్రీకాంత్‌కు ఫేస్బుక్లో ఓ యువతికి మధ్య పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే జూన్ 4వ తేదీన ఇంట్లో నుంచి పారిపోయి పెద్దలకు తెలియకుండా పెళ్లిచేసుకున్నారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న మైనర్ జంటకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కాగా, యువతిని వారి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్లడంతో శ్రీకాంత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉన్న శ్రీకాంత్ మనోవేదన చెందాడు. ఈ క్రమంలో తన ప్రేయసి ఆగస్టు 15న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి షాక్‌కు గురయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయి ఇక లేదన్న విషయాన్ని తట్టుకోలేని శ్రీకాంత్.. అమ్ముగూడ రైల్వే ట్రాక్‌పై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి మరణాలతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఇది కూడా చదవండి: సంచలనంగా మారిన తమ్మినేని మర్డర్ కేసు.. -
పది నెలల క్రితం ప్రేమ వివాహం.. ఆ తర్వాత ఏమైందంటే?
సాక్షి, ఖమ్మం: ప్రేమ వివాహం చేసుకున్న పది నెలలకే సదరు యువతి బలవన్మరణానికి పాల్పడింది. సీఐ రామకృష్ణ కథనం ప్రకారం..తల్లాడ మండలం లక్ష్మీపురానికి చెందిన బండి మౌనిక పది నెలల క్రితం అదే గ్రామానికి చెందిన ఆర్.నరేంద్రను ప్రేమ వివాహం చేసుకుంది. గత ఐదు నెలలుగా ఖమ్మంలోని వరదయ్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో ఈ నెల 3వ తేదీన మౌనిక ఆత్మహత్యాయత్నానాకి పాల్పడిందంటూ ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రి లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మృతి చెందింది. అయితే.. ఆమె మెడపై గాట్లు ఉన్నాయని, వరకట్నం కోసం వేధించారని తండ్రి చార్లెస్ ఖానాపురంహ హవేలి స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో నరేంద్రపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టారు. లక్ష్మీపురంలో భర్త ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన తల్లాడ: పోస్టుమార్టం అనంతరం మౌనిక మృతదేహాన్ని స్వగ్రామం లక్ష్మీపురం తీసుకెళ్లారు. భర్త నరేంద్ర పోలీసుల అదుపులో ఉండగా, అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి నాలుగు రోజుల కిందటే ఊరు విడిచి వెళ్లిపోయారు. అటు తరఫు వారు రాలేదని మృతదేహాన్ని నరేంద్ర ఇంటిముందు రాత్రి 9 గంటల వరకు ఉంచడంతో ఉద్రిక్తత నెలకొంది. వైరా సీఐ వసంత్‌కుమార్ ఆధ్వర్యంలో తల్లాడ, వైరా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 10గంటలదాకా సీఐ ఇరువైపుల పెద్దలతో చర్చించారు. -
వ్యాన్ డ్రైవర్‌తో జూనియర్ లెక్చరర్ ప్రేమ పెళ్లి, చివరకు..
సాక్షి, నెల్లూరు (క్రైమ్): ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడాది గడవకముందే అత్తింటి వేధింపులకు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన నెల్లూరు నగరం ఎన్టీఆర్ నగర్ చర్చి వీధిలో చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఉలవడపాడు మండలం చాకిచర్ల గ్రామానికి చెందిన జె.లక్ష్మికి మానస (28), మౌనిక, మహేంద్ర ముగ్గురు పిల్లలు. ఆమె కూలి పనులు చేసుకుంటూ పిల్లలను ఉన్నత చదువులు చదివించింది. పెద్ద కుమార్తె మానస పద్మావతి విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ధనలక్ష్మిపురంలోని నారాయణ విద్యా సంస్థలో జూనియర్ లెక్చరర్‌గా చేరారు. నెల్లూరు రూరల్ మండలం మాదరాజగూడూరుకు చెందిన మానికల చినబాబు అక్కడే వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మానస, చినబాబు నడమ ఏర్పడిన స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఏడాది కిందట వీరు వివాహం చేసుకున్నారు. మాదరాజగూడూరులో కాపురం పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మానస తల్లి మాదరాజ గూడూరు చేరుకుని తన కుమార్తెను బాగా చూసుకోమని అల్లుడు చినబాబుకు విన్నవించి వెళ్లింది. వివాహమైన కొంతకాలం నుంచే అత్తింటి వారు కట్నం కోసం ఆమెను వేధించడం ప్రారంభించారు. భర్త సైతం వారికి వత్తాసు పలకడంతో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. కొద్ది నెలల అనంతరం చినబాబు, మానస నెల్లూరు రామ్‌నగర్‌కు మకాం మార్చారు. రెండు నెలల కిందట అక్కడి నుంచి ఎన్టీఆర్ నగర్ చర్చి వీధిలోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. మానస తన ఉద్యోగాన్ని మానేసి ఏపీ సెట్‌కు సిద్ధమవుతోంది. చినబాబు యాక్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల రెండో తేదీ సాయంత్రం దంపతుల నడుమ చిన్నపాటి ఘర్షణ జరిగింది. చినబాబు ఇంటి వెనుక వైపునున్న గదిలో ఉండగా మానస తన గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపు తర్వాత చినబాబు తలుపులు తట్టినా తీయకపోవడంతో కిటీకీలో నుంచి చూడగా మానస ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికులతో కలిసి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా అప్పటికే మానస మృతి చెంది ఉంది. ఈ విషయంపై స్థానికులు గురువారం అర్ధరాత్రి బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం మానస తల్లి నెల్లూరుకు చేరుకుని కన్నీటి పర్యంతమైంది. బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జి.మంగారావు తన సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. తహసీల్దార్ వచ్చి మృతదేహానికి శవపంచనామా చేశారు. భర్త, అత్తమామ, ఆడబిడ్డలు తన కుమార్తె మృతికి కారణమని మానస తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతురాలి భర్త, అత్తింటి వారిపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం జీజీహెచ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ మంగారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బైక్ పైన రాలేదని భార్య గొంతుకొసిన భర్త.. -
అప్పుడేమో ప్రేమ కావాలి.. ఇప్పుడు పైసలు కావాలి
కామారెడ్డి: ఆమె ప్రేమ పెళ్లి చేసుకుంది. కొద్దిరోజులకు భర్త కట్నం తీసుకు రావాలని వేధిస్తుండడంతో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని ఎన్జీవోఎస్ కాలనీలో నివాసం ఉండే నూకలపాటి లావణ్య అదే కాలనీకి చెందిన దేవనంద్ ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి మేడ్చల్‌లో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజులు అంతాబాగానే గడిచింది. ఆ తర్వాత దేవానంద్ రూ.5 లక్షలు కట్నం తీసుకురావాలని లావణ్యను వేధించసాగాడు. లావణ్య గర్భం దాల్చడంతో అక్టోబర్‌లో తల్లిగారింటికి వచ్చింది. కట్నం తీసుకువస్తేనే కాపురానికి తీసుకువెళ్తానని తన భర్త వేధిస్తున్నాడని ఆదివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో మధుసూదన్ తెలిపారు. ( చదవండి: డబ్బు ఇవ్వలేదని.. కన్నతండ్రినే బకెట్‌తో కొట్టి.. ) -
ప్రేమ వివాహం: ఆమెకు 81, అతనికి 35
లండన్ : ప్రేమకు భాషా, వయసు, సరిహద్దులతో సంబంధంలేదంటారు. ఎప్పుడు ఎవరు ఏ వయసులో ప్రేమలో పడతారో ఊహించడం చాలా కష్టతరమైన విషయం. కొందరికి యుక్త వయసులో ప్రేమ చిగురిస్తే మరికొందరికి లేటు వయసులో ప్రేమ పుడుతుంది. మనిషి అన్నాక జీవితంలో ఒక్కసారైనా ప్రేమరుచి చూడాల్సిందేనని చెబుతుంటారు కొందరు. అయితే బ్రిటన్‌లో ఓ మహిళ ఏకంగా 81 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ జాతీయ మీడియా తెలిపిన కథనం ప్రకారం.. యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు చెందిన ఐరిష్ జోనిస్ (81) అనే వృద్ధురాలు ఈజిప్ట్‌కు చెందిన మహమ్మద్ అహ్మద్ ఇబ్రహీం (35) అనే వ్యక్తితో తొలుత పరిచయం ఏర్పడింది. రెండేళ్ల క్రితం ఈజిప్ట్ పర్యటనకు వెళ్లిన జోనిస్‌కు ఇబ్రహీంకు మధ్య ఏర్పడిన పరిచయం కొంత కాలంలోనే ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే లేటు వయసులోనూ రెండు మూడుసార్లు ప్రియుడ్ని కలవడానికి ఈజిప్ట్ వెళ్లారు. అయితే అక్కడి వాతావరణం ఆమెకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. వేడి వాతావరణంతో పాటు విపరీతమైన ట్రాఫిక్, ఆహారపు అలవాట్లు జోనిస్‌ను చాలా ఇబ్బందులకు గురిచేశాయి. దీంతో విసుగుచెందిన ఆమె ఇబ్రహీంతో యూకేలోనే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తనకంటే వయసులో 45 ఏళ్లు చిన్నవాడైన ప్రియుడిని వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే జోనిస్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి వయసు 50 ఏళ్లకు పైబడే. కానీ ప్రేమ తల్లి వివాహానికి వారు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అవికాస్తా వైరల్ అయ్యాయి. లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ కొందరు కామెంట్ చేయగా.. ముసలిభార్య యంగ్ భర్త అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. పెళ్లి వయసుకు అడ్డు అదుపు లేనక్కర్లేదా అంటూ మరికొందరూ ఘాటుగా స్పందించారు. దీనిపై జోనిస్ మాట్లాడుతూ.. ‘నా మనసుకి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరి మధ్య 45 ఏళ్లు తేడా ఉన్నా నాకేమీ అభ్యంతరం లేదు. 50 ఏళ్ల కిందటే నాభర్తతో విడాకులు తీసుకున్నాను. నా కుమారులు కూడా పెళ్లికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదు’ అని సంతోషం వ్యక్తం చేశారు. అయితే అయితే వీరి వివాహం వస్తున్న కామెంట్స్ ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నాయి. యూకేలో స్థిరపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఇబ్రహీంకు ఎంతకీ వీసా దొరకడంలేదు. అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అక్కడి మహిళను వివాహం చేసుకుంటే అక్కడే స్థిరపడొచ్చని ఓ మిత్రుడి సలహాను ఆచరించి జోనిస్‌ను వివాహం చేసుకున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరు వివాహం చేసుకుని లండన్‌లో సెటిల్ అయ్యారు. -
ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటం
బెజ్జూర్(సిర్పూర్): ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది.. వివరాల్లోకి వెళ్తే బెజ్జూర్ మండలం బారేగూడె గ్రామానికి చెందిన మౌనిక అదే గ్రామానికి చెందిన చిప్ప రమేష్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో తనను పెండ్లి చేసుకోవాలని మౌనిక కోరడంతో నిరాకరించాడు. కోరిక తీరక తనను మోసం చేశాడని మౌనిక మంగళవారం ప్రియుడి ఇంటిముందు మౌనపోరాటానికి దిగింది. గత 15 రోజుల క్రితం కులపెద్దలు, గ్రామస్తులతో పంచాయతీ నిర్వహించగా పెండ్లి చేసుకుంటానని రమేష్ అంగీకరించాడని, తల్లి మాటలు విని గ్రామం నుంచి ఏటో వెళ్ళాడని పేర్కొంది. రమేష్ వచ్చి తనను పెండ్లి చేసుకునేంతవరకు మౌనపోరాటం విరమించేది లేదని పేర్కొంది. గ్రామస్తులు కొంతమంది ఆమెకు మద్దతు తెలిపారు. ఈ విషయంపై బెజ్జూర్ పోలీసులను వివరణ కోరగా రమేశ్‌పై లికితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
కాపురానికి తీసుకెళ్లడం లేదని ..
కొండమల్లేపల్లి (దేవరకొండ) : ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను.. కాపురానికి తీసుకెళ్లడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ ఘటన సోమవారం దేవరకొండ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన మాచర్ల విజయ అదే గ్రామానికి చెందిన పిరాటి శంకర్లు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.ఇద్దరి కులాలు వేరైనప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్ 27న నల్లగొండలోని ఛాయాసోమేశ్వర స్వామి దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజల పాటు హైదరాబాద్‌లో నివాసం ఉన్నారు. ఈ క్రమంలో స్వగ్రామానికి శంకర్ తిరిగొచ్చాడు. అప్పటి నుంచి తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని ఇదేంటని ప్రశ్నిస్తే తమ కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారని శంకర్ విజయకు తెలిపాడు. దీంతో ఆందోళన చెందిన విజయ దేవరకొండ పోలీసులను ఆశ్రయించగా శంకర్‌కు కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ శంకర్ కాపురానికి తీసుకెళ్లేందుకు ససేమిరా అనడంతో విజయ సోమవారం భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తన భర్తను తనను కలపి తనకు న్యాయం జరిగేలా చూడాలని విజయ కోరుతుంది. -
ప్రేయసితో పెళ్లి కోసం.. సెల్‌టవర్ ఎక్కాడు
మదనాపురం (కొత్తకోట): ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి హల్చల్ సృష్టించాడు. ఈ సంఘటన బుధవారం మదనాపురంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శ్రీధర్ తాను ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని బుధవారం స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ సెల్‌టవర్ ఆత్మహత్యకు పాల్పడుతానని బెదిరించాడు. దీంతో ఈ విషయం గ్రామం మొత్తం వ్యాపించడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తోటి స్నేహితులు, తల్లిదండ్రులు ఎంతనచ్చజెప్పినా యువకుడు వినిపించుకోకుండా సెల్‌టవర్‌పైనే భీష్మించి కూర్చున్నాడు. చివరికి పోలీసులు రంగప్రవేశం వచ్చి నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో స్నేహితులు, పోలీసులు నీవు ప్రేమించిన యువతితోనే పెళ్లి చేయిస్తామని హామీ ఇవ్వడంతో యువకుడు కిందకి దిగాడు. అనంతరం పోలీసులు యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. -
ప్రేమికుడు కాదన్నాడని..
సింగరాయకొండ (ప్రకాశం): ప్రేమించిన వాడు వివాహం చేసుకోవటానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మండలంలోని పాకల పంచాయతీ ఆదిఆంధ్ర కాలనీలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం గ్రామానికి చెందిన దావులూరి భానుప్రకాష్, ఓ యువతి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఈ సమయంలో భానుప్రకాష్‌కు ఉపాధ్యాయునిగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దీంతో వీరిద్దరూ తమ పెద్దలకు తెలియకుండా విజయవాడలోని గుణదల మేరిమాత ఆలయంలో ఉంగరాలు మార్చుకున్నారు. తరువాత వీరి విషయం తెలిసిన పెద్దలు వివాహానికి ఒప్పుకున్నారు. అనంతరం సుప్రజ తల్లిదండ్రులు పెండ్లి ప్రయత్నంలో ఉండగా.. ఈనెల 21వ తేదీ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి వివాహం చేసుకొనేది లేదని తేల్చి చెప్పారు. గ్రామ పెద్దలతో సమస్య పరిష్కారానికి కృషి చేసినా ప్రయోజనం లేకపోవటంతో ఈనెల 24వ తేదీ బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా సమస్య పరిష్కారానికి కృషి చేసినా ప్రయోజనం లేకపోవటంతో మనస్థాపానికి గురైన ఆమె మంగళవారం బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి. నాగమల్లేశ్వరరావు తెలిపారు. -
ప్రియుడికోసం కొనసాగుతున్న ఆందోళన
చందుర్తి(వేములవాడ): ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలని గత నెల 30న వాటర్‌ట్యాంకు ఎక్కి ఆందోళన చేసిన యువతి శుక్రవారం మండలంలోని మరిగడ్డ గ్రామపంచాయతీ వద్ద మౌనదీక్షకు దిగింది. బాధితురాలు మానుక సత్య వివరాల ప్రకారం.. మరిగడ్డకు చెందిన ఏరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, సత్య ప్రేమించకున్నారు. పెళ్లి సమయానికి ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో జూన్ 21న పోలీసులను ఆశ్రయించింది. విషయాన్ని పోలీసులు కాలయాపన చేస్తున్నారని అదేనెల 26న ఠాణాలోనే నిద్రమాత్రలు మింగింది. పోలీసులు నిర్ధిష్ట గడువు విధించి న్యాయం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో జూన్30 ట్యాంకెక్కి ఆందోళన చేసింది. అదే సమయంలో ప్రియుడు ప్రశాంత్‌రెడ్డి పురుగుల మందు తాగగా.. విషయం తెలిసిన సత్య నిద్రమాత్రలు మింగింది. ఇద్దరినీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు తనకు ఎలాంటి న్యాయం చేయం లేదని శుక్రవారం మరిగడ్డకు వచ్చింది. గ్రామపంచాయతీ ఎదుట మౌన పోరాటానికి దిగింది. కాగా ప్రశాంత్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని రాగానే మాట్లాడతామని పోలీసులు సత్యకు సూచించారు. అయినా వినకుండా దీక్షకు పూనుకుంది. -
అక్క చెల్లెళ్ల ప్రేమపెళ్లి.. సహజీవనం
బెంగళూరు: ఇద్దరూ వరుసకు అక్కచెల్లెళ్లు. వావివరసలు మరిచారు. నేటి ఆధునిక పోకడల్లో ఒకటైన ‘లెస్బియన్’లయ్యారు. ప్రేమపేరుతో దగ్గరై పెళ్లి కూడా చేసుకున్నారు. వారి తల్లిదండ్రులు ఇదెక్కడి ఘోరమంటూ పోలీసులను ఆశ్రయించడంతో కథ రసకందాయంలో పడింది. భారత ఐటీ రాజధాని బెంగళూరులోని విజయనగర్ ఈ విడ్డూరానికి వేదికైంది. చిన్నప్పటి నుంచి పక్క పక్క ఇళ్లల్లోనే కలిసి పెరిగారు. బంధువులైన వారిద్దరూ వరుసకు అక్క, చెల్లెలు. వీరిలో ఒకరు ప్రైవేటు కాలేజీలో బీ.కాం చదువుతుండగా, మరొకరు కాల్సెంటర్లో ఉద్యోగిని. రెండేళ్ల నుంచి ఇద్దరి ప్రవర్తనలో మార్పు వచ్చింది. బీకాం విద్యార్థిని అబ్బాయిలాగ ప్రవర్తిస్తూ కాల్‌సెంటర్ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు ఒత్తిడి చేస్తూ వచ్చింది. మొదట కాల్‌సెంటర్ ఉద్యోగిని ఆమె ప్రవర్తనను చూసి తమాషా చేస్తోంది అనుకుంది. అయితే కొంతకాలానికి ప్రేమను అంగీకరించింది. అప్పటి నుంచి ప్రేమికుల్లాగా షాపింగ్‌మాల్స్, సినిమాలు, షికార్లు, బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభించారు. తమ ప్రేమను ఇళ్లల్లో అంగీకరించరని తెలుసుకుని ఈ ఏడాది మే నెలలో ఇంట్లో నుంచి పారిపోయి గుళ్లో పెళ్లి చేసుకుని, కోరమంగళలో అద్దె ఇంట్లో సహజీవనం చేయసాగారు. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు బీకాం విద్యార్థిని తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని విజయనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారి సహజీవనం తతంగాన్ని తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారిద్దరూ మేజర్లని, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నందున తామేం చేయలేమని పోలీసులు అమ్మాయిల తల్లిదండ్రులకు స్పష్టంచేశారు. ఈలోగా తమను విడదీస్తారేమోనని భయపడ్డ జంట.. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను, లాయర్లను కలసి న్యాయం చేయాలని కోరింది. తల్లిదండ్రులు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని వనితా సహాయవాణిని ఆశ్రయించడంతో సీనియర్ కౌన్సిలర్ బీ.ఎస్.సరస్వతి ఇద్దరు యువతులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇండియాలో స్వలింగ సంపర్కం నేరమని, అయితే బాధితులు ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదవుతుందని నిపుణులు తెలిపారు.