Unique Marriage: 85 Years Old Woman Married 35 Years Young Man In London - Sakshi
Sakshi News home page

ప్రేమ వివాహం: ఆమెకు 81, అతనికి 35

Published Thu, Jan 7 2021 2:27 PM | Last Updated on Thu, Jan 7 2021 6:02 PM

Woman marrying lover 45 years younger than her - Sakshi

లండన్‌ : ప్రేమకు భాషా, వయసు, సరిహద్దులతో సంబంధంలేదంటారు. ఎప్పుడు ఎవరు ఏ వయసులో ప్రేమలో పడతారో ఊహించడం చాలా కష్టతరమైన విషయం. కొందరికి యుక్త వయసులో ప్రేమ చిగురిస్తే మరికొందరికి లేటు వయసులో ప్రేమ పుడుతుంది. మనిషి అన్నాక జీవితంలో ఒక్కసారైనా ప్రేమరుచి చూడాల్సిందేనని చెబుతుంటారు కొందరు. అయితే బ్రిటన్‌లో ఓ మహిళ ఏకంగా 81 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ జాతీయ మీడియా తెలిపిన కథనం ప్రకారం.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)కు చెందిన ఐరిష్‌ జోనిస్‌ (81) అనే వృద్ధురాలు ఈజిప్ట్‌కు చెందిన మహమ్మద్‌ అహ్మద్‌ ఇబ్రహీం (35) అనే వ్యక్తితో తొలుత పరిచయం ఏర్పడింది. రెండేళ్ల క్రితం ఈజిప్ట్‌ పర్యటనకు వెళ్లిన జోనిస్‌కు ఇబ్రహీంకు మధ్య ఏర్పడిన పరిచయం కొంత కాలంలోనే ప్రేమగా మారింది.

ఈ క్రమంలోనే లేటు వయసులోనూ రెండు మూడుసార్లు ప్రియుడ్ని కలవడానికి ఈజిప్ట్‌ వెళ్లారు. అయితే అక్కడి వాతావరణం ఆమెకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. వేడి వాతావరణంతో పాటు విపరీతమైన ట్రాఫిక్‌, ఆహారపు అలవాట్లు జోనిస్‌ను చాలా ఇబ్బందులకు గురిచేశాయి. దీంతో విసుగుచెందిన ఆమె ఇబ్రహీంతో యూకేలోనే సెటిల్‌ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తనకంటే వయసులో 45 ఏళ్లు చిన్నవాడైన ప్రియుడిని వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే జోనిస్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి వయసు 50 ఏళ్లకు పైబడే. కానీ ప్రేమ తల్లి వివాహానికి వారు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. అవికాస్తా వైరల్‌ అయ్యాయి. లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ కొందరు కామెంట్‌ చేయగా.. ముసలిభార్య యంగ్‌ భర్త అంటూ మరికొందరు కామెంట్స్‌ చేశారు. పెళ్లి వయసుకు అడ్డు అదుపు లేనక్కర్లేదా అంటూ మరికొందరూ ఘాటుగా స్పందించారు.

దీనిపై జోనిస్‌ మాట్లాడుతూ.. ‘నా మనసుకి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరి మధ్య 45 ఏళ్లు తేడా ఉన్నా నాకేమీ అభ్యంతరం లేదు. 50 ఏళ్ల కిందటే నాభర్తతో విడాకులు తీసుకున్నాను. నా కుమారులు కూడా పెళ్లికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదు’ అని సంతోషం వ్యక్తం చేశారు. అయితే అయితే వీరి వివాహం వస్తున్న కామెంట్స్‌ ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నాయి. యూకేలో స్థిరపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఇబ్రహీంకు ఎంతకీ వీసా దొరకడంలేదు. అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అక్కడి మహిళను వివాహం చేసుకుంటే అక్కడే స్థిరపడొచ్చని ఓ మిత్రుడి సలహాను ఆచరించి జోనిస్‌ను వివాహం చేసుకున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరు వివాహం చేసుకుని లండన్‌లో సెటిల్‌ అయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement