లండన్: తలకు బలమైన గాయం తగలడంతో ఓ మహిళ కొన్ని నెలల తరబడి మాట్లాడలేకపోయింది. అయితే అనూహ్యంగా ఆమె ఇప్పుడు నాలుగు యాసల్లో గలగల మాట్లాడేస్తోంది. యూకేకు చెందిన ఎమిలీ ఈగన్ అనే మహిళ ఇంగ్లండ్‌లో నివసిస్తోంది. కొద్ది నెలల క్రితం ఆమె తల(మెదడు)కు గాయమైంది. అప్పటినుంచి ఆమె నోరు మూగబోయింది. గొంతు నుంచి మాట పెగిలేదే కాదు. అలా కొన్ని నెలలు గడిచాక ఆమె తిరిగి మామూలు మనిషైంది. పెదాలు కదిలిస్తూ మాట్లాడగలుగుతోంది. నిజం చెప్పాలంటే అంతకు ముందుకన్నా ఇప్పుడే ఎక్కువగా మాట్లాడుతోంది. దీంతో ఈ ఆనందాన్ని పంచుకునేందుకు థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సంభాషించింది. (30 ఏళ్ల తర్వాత ఆ రహస్య చీటీలు చూసి..)
ఆమె నోటి పలుకులు వినగానే వారు ఓ క్షణం సంతోషించినా మరో క్షణం అయోమయంలో పడ్డారు. దీనికి కారణం ఆమె తన అసలైన యాసలో మాట్లాడకపోవడమే. అంతకుముందు మాట్లాడే ఎస్సెక్స్ యాస ఇప్పుడామెకు పలకడానికే రావట్లేదు, కానీ ఎంతో కష్టమైన ఈస్టర్న్ యూరోపియన్ యాసల్లో గలగలా మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఫ్రెంచ్, ఇటాలియన్, రష్యన్ యాసల్లో సులువుగా మాట్లాడుతోంది. దీన్ని వైద్యులు "ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్"గా గుర్తించారు. ఇక ఈ విషయం గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "మాటల్లోనే కాదు, రాతలోనూ తేడా వచ్చింది. ఇప్పుడు నేను కొత్తకొత్త పదాలను కూడా ఉపయోగిస్తున్నాను. అంతేకాదు, ఆలోచనల్లోనూ మార్పు వచ్చింది" అని తెలిపింది. (వైరల్: పాము నీళ్లు తాగడం చూశారా?)
Comments
Please login to add a commentAdd a comment