Brain injury
-
నెలలుగా మూగబోయిన గొంతు.. చివరకు
లండన్: తలకు బలమైన గాయం తగలడంతో ఓ మహిళ కొన్ని నెలల తరబడి మాట్లాడలేకపోయింది. అయితే అనూహ్యంగా ఆమె ఇప్పుడు నాలుగు యాసల్లో గలగల మాట్లాడేస్తోంది. యూకేకు చెందిన ఎమిలీ ఈగన్ అనే మహిళ ఇంగ్లండ్‌లో నివసిస్తోంది. కొద్ది నెలల క్రితం ఆమె తల(మెదడు)కు గాయమైంది. అప్పటినుంచి ఆమె నోరు మూగబోయింది. గొంతు నుంచి మాట పెగిలేదే కాదు. అలా కొన్ని నెలలు గడిచాక ఆమె తిరిగి మామూలు మనిషైంది. పెదాలు కదిలిస్తూ మాట్లాడగలుగుతోంది. నిజం చెప్పాలంటే అంతకు ముందుకన్నా ఇప్పుడే ఎక్కువగా మాట్లాడుతోంది. దీంతో ఈ ఆనందాన్ని పంచుకునేందుకు థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సంభాషించింది. (30 ఏళ్ల తర్వాత ఆ రహస్య చీటీలు చూసి..) ఆమె నోటి పలుకులు వినగానే వారు ఓ క్షణం సంతోషించినా మరో క్షణం అయోమయంలో పడ్డారు. దీనికి కారణం ఆమె తన అసలైన యాసలో మాట్లాడకపోవడమే. అంతకుముందు మాట్లాడే ఎస్సెక్స్ యాస ఇప్పుడామెకు పలకడానికే రావట్లేదు, కానీ ఎంతో కష్టమైన ఈస్టర్న్ యూరోపియన్ యాసల్లో గలగలా మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఫ్రెంచ్, ఇటాలియన్, రష్యన్ యాసల్లో సులువుగా మాట్లాడుతోంది. దీన్ని వైద్యులు "ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్"గా గుర్తించారు. ఇక ఈ విషయం గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "మాటల్లోనే కాదు, రాతలోనూ తేడా వచ్చింది. ఇప్పుడు నేను కొత్తకొత్త పదాలను కూడా ఉపయోగిస్తున్నాను. అంతేకాదు, ఆలోచనల్లోనూ మార్పు వచ్చింది" అని తెలిపింది. (వైరల్: పాము నీళ్లు తాగడం చూశారా?) -
కోవిడ్‌తో మెదడుకు నష్టం?
బెర్లిన్: కోవిడ్ కారణంగా మెదడు దెబ్బతింటుందా? అవునంటున్నారు స్వీడన్‌లోని గొథెన్‌బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వ్యాధి చికిత్సకు ఆసుపత్రిలో చేరిన కొందరిలో తాము మెదడు దెబ్బతిన్న ఆనవాళ్లను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. తేలికపాటి, ఒక మోస్తరు, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 47 మందిపై తాము పరిశోధనలు చేశామని వారి రక్త నమూనాలను పరిశీలించినప్పుడు మెదడు దెబ్బతినేందుకు సూచికలైన కొన్ని రసాయనాలను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతోపాటు మెదడు నాడుల కొనలలో ఉండే ఎన్ఎఫ్ఎల్ అనే మరో ప్రొటీన్ కూడా రక్తంలో కనిపించిందని చెప్పారు. కోవిడ్ –19 కారణంగా వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సిన రోగుల్లో ఈ ఎన్ఎఫ్ఎల్ చాలా ఎక్కువగా కనిపించిందని, దీనికి వ్యాధి తీవ్రతకు సంబంధం ఉందన్న విషయాన్ని ఇలా తెలుసుకోవచ్చునని చెప్పారు. -
విషమం : సాయం చేసి ప్రాణాలు నిలపండి..!
ఓహియో/కొలంబస్ : చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు వ్యక్తులకు ఆర్థిక చేయూతనందించాలని ‘గో ఫండ్ మీ’ అనే స్వచ్ఛంద సంస్థ కోరింది. కారు ప్రమాదంలో ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీకి లోనైన అశోక్ అధికారి, సౌజన్య బండ ఆరోగ్యం విషమంగా ఉందని వెల్లడించింది. పెద్ద సంఖ్యలో జనం తమకు తోచినంత సాయం చేస్తే ‘ఆర్థిక అత్యవసర స్థితి’లో ఉన్న ఈ ఇద్దరి ప్రాణాలు నిలుస్తాయని తెలిపింది. ‘ఉన్నత చదువుల కోసం అమెరికా వచ్చిన అశోక్, వివాహిత సౌజన్య కుంటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. దాతలు ముందుకొచ్చి చేయూతనందిస్తే.. వారు కోలుకుంటారు. మీ వంతుగా సాయమందించడంతో పాటు ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు షేర్ చేసి చేయండి. ఆపదలో ఉన్నవారికి తమ వంతుగా ఫండ్స్ కలెక్ట్ చేసి ఇవ్వడమే మా కర్తవ్యం’అని గో ఫండ్ మీ తెలిపింది. మీ వంతు సాయాన్ని ఈ కింది లింక్ ద్వారా అందించండి : https://www.gofundme.com/f/critical-car-crash-ashok-and-soujanya?utm_source=customer&utm_medium=copy_link&utm_campaign=p_cp+share-sheet ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం.. ఆఫీస్ అనంతరం తన సహోద్యోగులు అశోక్ అధికారి, సౌజన్య బండను ఇళ్ల వద్ద దింపేందుకు నిఖిల్ గోపిషెట్టి తన కారులో ఎక్కించుకొని వెళ్తున్నాడు. అశోక్ ఇంటికి మరో నిముషంలో చేరుతామనగా బెతెల్ రోడ్డు (కొలంబస్)పై వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని రివర్సైడ్ మెథడిస్టు ఆస్పత్రికి తరలించారు. అఖిల్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కానీ, అశోక్, సౌజన్య తలకు తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా మారింది. మెదడుకు గాయాలు : రివర్సైడ్ మెథడిస్టు ఆస్పత్రి అశోక్, సౌజన్య ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీకి లోనవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తలకు బలమైన గాయాలతో పాటు సౌజన్యకు మడమ, చెవి భాగంలోనూ గాయాలయ్యాయి. ఆమె శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతోంది. అశోక్ వెన్నుపూస, భుజం, పక్కటెముకలు విరిగిపోయాయి. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అమెరికా రావాల్సిందిగా సమాచారమిచ్చాం. -
27 ఏళ్ల తర్వాత స్పృహలోకి వచ్చిన మహిళ
అబుదాబి: ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరిగిన కొన్నింటిని మాత్రమే మనం గుర్తించగలం. అలాంటి ఓ ఘటనే యూఏఈలో జరిగింది. దుబాయ్‌కు చెందిన ఓ మహిళ 27 ఏళ్ల తర్వాత కోమాలో నుంచి బయటికి వచ్చింది. బ్రెయిన్‌కు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన సదురు మహిళను ఆమె కుమారుడు కంటికి రెప్పల చూసుకున్నాడు. సుదీర్ఘ కాలం తర్వాత ఆ మహిళ స్పృహలోకి రావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాల్లోకి వెళితే.. 1991లో 32 ఏళ్ల మునీరా తన కుమారుడు ఒమర్‌ని పాఠశాల నుంచి ఇంటికి తీసుకువస్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని స్కూల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగిన సమయంలో మునీరా తన కుమారుడిని గట్టిగా అలుముకోవడంతో అతనికి పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో 4 ఏళ్ల ఒమర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే మునీరా బ్రెయిన్‌కు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్లో చేర్పించారు. కాగా, వైద్యులు మాత్రం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని.. మళ్లీ కళ్లు తెరిచే అవకాశం లేదని తెలిపారు. కానీ మునీరా కుటుంబ సభ్యులు నమ్మకం కోల్పోలేదు. ఆ ప్రమాదం జరిగిన కొన్ని రోజులకు యూఏఈ ప్రభుత్వం ఆమెను చికిత్స నిమిత్తం లండన్‌కు పంపింది. చికిత్స అనంతరం ఆమెను తిరిగి స్వదేశానికి తరలించారు. అక్కడి హాస్పిటల్లో మునీరాకు చాలా ఏళ్ల పాటు ట్యూబ్ ద్వారా ఫీజియోథెరపి నిర్వహించారు. తల్లి చికిత్స కోసం ఒమర్ ఎంతగానో శ్రమించారు. చివరకు 2017 ఏప్రిల్‌లో మునీరా పరిస్థితిని సమీక్షించిన క్రౌన్ ప్రిన్స్ కోర్టు ఆమెను జర్మనీ తీసుకెళ్లి చికిత్స చేయించడానికి అవకాశం కల్పించింది. అక్కడ కొన్ని సర్జరీలు నిర్వహించిన వైద్యులు, మెరుగైన చికిత్స అందించారు. ఇలా ఒక ఏడాది గడిచిన తర్వాత ఇంకో వారంలో జర్మనీలో మునీరా ట్రీట్మెంట్ ముగుస్తుందన్న సమయంలో అద్భుతం జరిగింది. 2018 జూన్‌లో ఆమె చికిత్స పొందుతున్న గదిలో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అయితే ఇదే సమయంలో మునీరాలో కదలిక ప్రారంభమైంది. ఆమె గొంతు నుంచి వింత శబ్దాలు రావడంతో.. ఒమర్ వెంటనే వైద్యుల వద్దకు వెళ్లారు. ఆ తర్వాత మునీరాను పరీక్షించిన వైద్యులు అంత నార్మల్‌గానే ఉందని తెలిపారు. ఇది గడిచిన మూడు రోజులకు ఒమర్‌కు తన పేరును ఎవరో పిలిచినట్టు వినబడింది. తీరా చూస్తే పిలిచింది మునీరానే కావడంతో ఒమర్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 27 ఏళ్లుగా తను దేని కోసమైతే కల కన్నాడో అది నిజం కావడంతో పట్టరాని సంతోషంతో పొంగిపోయారు. తర్వాత కుటుంబంతో కలిసి తిరిగి అబుదాబి చేరుకున్న మునీరాకు ప్రస్తుతం ఫీజియోథెరపి చేస్తున్నారు. ఒమర్ అప్పుడప్పుడు మునీరాను వీల్‌చైర్‌లో ఉంచి మసీదులకు కూడా తీసుకుని వెళ్తున్నారు. మునీరా నెమ్మదిగా కోలుకుంటున్నట్టు ఆమె చికిత్స పొందుతున్న హాస్పిటల్ యాజమాన్యం గత నెలలో విడుదల చేసిన మెడికల్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ విషయాల్ని ఒమర్ ‘ది నేషనల్’తో పంచుకున్నారు. ‘ఇప్పుడు అమ్మ కథను చెప్పడానికి ఓ కారణం ఉంది. ఎవరైనా సరే తమకు ఇష్టమైన వారిమీద ఆశలు వదలుకొవధ్దు. ప్రమాదం జరిగిన సమయంలో నా తల్లి వెనుక సీటులో కూర్చుని ఉంది. ప్రమాదం జరుగుతున్న సమయంలో వెంటనే నన్ను గట్టిగా హత్తుకుని కాపాడింది. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయినా నేను ఏ రోజు కూడా అమ్మ మీద ఆశ వదులుకోలేదు. ఆమె ఏదో ఒక రోజు కోలుకుంటుందనే నమ్మకం నాలో ఎప్పుడు ఉండేది. నాకు అమ్మ బంగారం లాంటిది. ఎంతో విలువైన అమ్మకోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. దీనికి నేను బాధపడటం లేద’ని తెలిపారు. -
కుక్కకాటుతో చిన్నారి జీవితంలో చీకట్లు
లంగర్‌హౌస్ (హైదరాబాద్) : కుక్క కాటుకు గురైన ఓ చిన్నారి తన జీవితాన్ని కోల్పోయింది. మెదడుకు తీవ్ర గాయం కావటంతో జీవచ్ఛవంలా గడపాల్సిన దయనీయ స్థితిలో కన్నవారికి తీవ్ర వేదనను మిగిల్చింది. ఈ సంఘటన లంగర్‌హౌస్‌లో చోటు చేసుకుంది. ఎస్సై ఐలయ్య తెలిపిన వివరాల ప్రకారం... లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీలో అమీన్ ఉల్ రెహమాన్ ఇంట్లో సమీఉల్ రెహమాన్ అనే వ్యక్తి కుటుంబంతో అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 7వ తేదీన సమీ కుమార్తె ఆయేషా (8) ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా అమీన్ పెంపుడు కుక్క దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. తలకు తీవ్ర గాయం కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాదాపు లక్ష రూపాయలు వెచ్చించి ఆమెకు ఆపరేషన్ చేయించారు. అయితే మెదడుకి తీవ్ర గాయం కావటంతో ఇక ఆ బాలికకు ఏమీ గుర్తుండవనే నిజాన్ని వైద్యులు చెప్పటంతో సమీఉల్ రెహమాన్ హతాశుడయ్యాడు. యజమాని పెంపుడు కుక్క పలువురిపై దాడి చేసి గాయపరిచిందని, అలా వదిలేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని సమీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అమీన్ ఉల్ రహమాన్, వాచ్‌మన్ హుస్సేన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. చలాకీగా కళ్ల ముందు ఆడుతూ, నవ్వుతూ తిరిగిన తమ కుమార్తె ఒక్కసారిగా ఇలా మారిపోవడంతో ఆమె తల్లిదండ్రుల రోదనకు అంతే లేకుండా పోయింది.