విషమం : సాయం చేసి ప్రాణాలు నిలపండి..! | Go Fund Me Crowdfunding Site Request To Save Two Brain Injured Persons | Sakshi
Sakshi News home page

విషమం : సాయం చేసి ప్రాణాలు నిలపండి..!

Published Fri, Jul 26 2019 9:10 AM | Last Updated on Fri, Jul 26 2019 9:23 AM

Go Fund Me Crowdfunding Site Request To Save Two Brain Injured Persons - Sakshi

విషమ పరిస్థితుల్లో అశోక్ అధికారి‌, సౌజన్య బండ

ఓహియో/కొలంబస్‌ : చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు వ్యక్తులకు ఆర్థిక చేయూతనందించాలని ‘గో ఫండ్‌ మీ’ అనే స్వచ్ఛంద సంస్థ కోరింది. కారు ప్రమాదంలో ట్రామాటిక్‌ బ్రెయిన్‌ ఇంజ్యూరీకి లోనైన అశోక్ అధికారి‌, సౌజన్య బండ ఆరోగ్యం విషమంగా ఉందని వెల్లడించింది. పెద్ద సంఖ్యలో జనం తమకు తోచినంత సాయం చేస్తే ‘ఆర్థిక అత్యవసర స్థితి’లో ఉన్న ఈ ఇద్దరి ప్రాణాలు నిలుస్తాయని తెలిపింది. ‘ఉన్నత చదువుల కోసం అమెరికా వచ్చిన అశోక్‌, వివాహిత సౌజన్య కుంటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. దాతలు ముందుకొచ్చి చేయూతనందిస్తే.. వారు కోలుకుంటారు. మీ వంతుగా సాయమందించడంతో పాటు ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌కు షేర్‌ చేసి చేయండి. ఆపదలో ఉన్నవారికి తమ వంతుగా ఫండ్స్‌ కలెక్ట్‌ చేసి ఇవ్వడమే మా కర్తవ్యం’అని గో ఫండ్‌ మీ తెలిపింది. 

మీ వంతు సాయాన్ని ఈ కింది లింక్‌ ద్వారా అందించండి :
https://www.gofundme.com/f/critical-car-crash-ashok-and-soujanya?utm_source=customer&utm_medium=copy_link&utm_campaign=p_cp+share-sheet

ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం..
ఆఫీస్‌ అనంతరం తన సహోద్యోగులు అశోక్‌ అధికారి, సౌజన్య బండను ఇళ్ల వద్ద దింపేందుకు నిఖిల్‌ గోపిషెట్టి తన కారులో ఎక్కించుకొని వెళ్తున్నాడు. అశోక్‌ ఇంటికి మరో నిముషంలో చేరుతామనగా బెతెల్‌ రోడ్డు (కొలంబస్)పై వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని రివర్‌సైడ్‌ మెథడిస్టు ఆస్పత్రికి తరలించారు. అఖిల్‌ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కానీ, అశోక్‌, సౌజన్య తలకు తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా మారింది. 

మెదడుకు గాయాలు : రివర్‌సైడ్‌ మెథడిస్టు ఆస్పత్రి
అశోక్‌, సౌజన్య ట్రామాటిక్‌ బ్రెయిన్‌ ఇంజ్యూరీకి లోనవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తలకు బలమైన గాయాలతో పాటు సౌజన్యకు మడమ, చెవి భాగంలోనూ గాయాలయ్యాయి. ఆమె శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతోంది. అశోక్‌ వెన్నుపూస, భుజం, పక్కటెముకలు విరిగిపోయాయి. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అమెరికా రావాల్సిందిగా సమాచారమిచ్చాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement