Crowdfunding
-
సాయం కాపాడుతున్న ప్రాణం
క్రౌడ్ ఫండింగ్పెద్ద జబ్బుతో ఆసుపత్రి పాలైన నిరుపేదల దగ్గర లక్షల్లో ఖర్చుచేసేటంత డబ్బు ఉండదు. ప్రాణాలు నిలబడాలంటే ఏం చేయాలి మరి? ఇందుకు సమాధానమే క్రౌడ్ ఫండింగ్. ఆరోగ్యం, విద్య, జంతువుల సంక్షేమం, ప్రకృతి వైపరీత్యాలు, మహిళా సాధికారత కోసం విరాళాలను క్రౌడ్ ఫండింగ్ ద్వారా సమకూర్చుతున్నాయి కొన్ని ఆన్లైన్ వేదికలు.కర్నూలు జిల్లాకు చెందిన తొమ్మిదేళ్ల సానియా వెంట్రిక్యులర్ సెస్టల్ డిఫెక్ట్ వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి చికిత్సకు రూ.12 లక్షలు కావాలి. తండ్రి రాళ్లు కొట్టే పని చేస్తుంటాడు. తల్లి గృహిణి. కుమార్తెకు చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో వీరికి ‘ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్’ అండగా నిలిచింది. ఈ ఫౌండేషన్ విభిన్న వేదికల్లో క్రౌడ్ ఫండింగ్ చేపట్టింది. రూ.12 లక్షలు క్రౌడ్ ఫండింగ్ ద్వారా జమ అయ్యి, చిన్నారికి చికిత్స జరిగింది. ప్రాణాలు నిలబడ్డాయి. రహ్మద్ బాషా విజయవాడలో పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇటీవల అతనికి నెలల నిండకుండానే 704 గ్రాముల బరువుతో కూతురు పుట్టింది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీయు లో చికిత్స పోందుతోంది. పాప చికిత్సకు రూ.14 లక్షలు అవసరం. దయచేసి, సహాయం చేసి, మా పాపను బతికించండి’ అని క్రౌడ్‌ఫండింగ్ నిధుల సమీకరణ లింక్‌లో విన్నవించుకున్నాడు. చికిత్సకు అవసరమయ్యే డబ్బు వారికి అందుతోంది. కేరళలోని ఎర్నాకుళానికి చెందిన సారంగ్ మీనన్, అదితి నాయర్ల ఏడాదిన్నర కుమారుడు నిర్వాణ్ వెన్నెముక కండరాల క్షీణత అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ చికిత్సకు దాదాపు రూ.17.5 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చె΄్పారు. ఈ వ్యాధి నివారణకు ఉపయోగించే వన్‌టైమ్ డ్రగ్ జోల్జెన్మ్సా ఇండియాలో అందుబాటులో లేదు. దీనిని అమెరికా నుంచి తెప్పించాలి. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ΄్లాట్‌ఫామ్ ద్వారా తెలియజేయడంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా 72 వేల మంది విరాళాలు అందించారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా, మా వల్ల ఏమవుతుంది... అంటూ కుదేలవ్వాల్సిన పని లేదని చెప్పే ఇలాంటి కథనాలు ఎంతో ధైర్యాన్నిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఎంత అవసరం వచ్చినా, దాతల నుంచి విరాళాలు తెచ్చి పెట్టేందుకు నేడు ఎన్నో వేదికలు పనిచేస్తున్నాయి. వేలాది మంది బాధితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి. అదే సమయంలో ఇలాంటి బాధితులకు సాయం చేశామనే సంతృప్తి దాతలకు లభిస్తోంది. కాకపోతే విరాళం ఇచ్చే ముందు విచారించి, నిజమైనదేనని నిర్ధారించుకోవడం ద్వారా తమ దానం నిష్ఫలం కాకుండా చూసుకోవచ్చు. మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ΄్లాట్ఫామ్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే.. సాయం పోందచ్చు. తోచినంత సాయమూ చేయచ్చు.నిధుల సేకరణ ఇలా..!దాతల సాయం అవసరమైన ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ΄్లాట్ఫామ్లను (ఇంపాక్ట్ గురూ, మిలాప్, కెట్టో, గో ఫండ్ మి, కిక్‌స్టార్టర్... మొదలైనవి) సంప్రదించవచ్చు ∙΄ాన్, ఆధార్, మెడికల్ డాక్యుమెంట్లు సమర్పించాలి. ఎంక్వైరీ అనంతరం వారి తరఫున నిధుల సమీకరణ పేజీని అవి సిద్ధం చేస్తాయి సాయం అవసరమైన వారు ఈ పేజీ లింక్‌ను తమ నెట్‌వర్క్‌లో షేర్ చేసుకోవాలి ∙విరాళంలో కొంత మొత్తాన్ని కమీష్‌న్ రూపంలో మినహాయించుకునేందుకు సమ్మతి తెలియజేస్తే, వారి తరఫున క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు విస్తృత ప్రచారాన్ని చేపడతాయి ∙విరాళం ఇచ్చేందుకు పేమెంట్ లింక్‌లు కనిపిస్తాయి. ఇలా చేసే చెల్లింపులన్నీ పన్ను రాయితీ కల్పిస్తాయి ∙కావాల్సిన మొత్తం వచ్చినా, గడువు ముగిసినా లేదంటే బాధితులు అకాలంగా మరణించినా నిధుల సమీకరణ ఆగిపోతుంది. అనంతరం ఈ మొత్తం నుంచి కమీష్‌న్ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని బాధితులకు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు చెల్లిస్తాయి. ఇలా చేసే ముందు హాస్పిటల్ బిల్లులను చెక్ చేస్తాయి.విశ్వసనీయమైన ఎంపికక్రౌడ్ ఫండింగ్‌లో ప్రతి ప్రయత్నం సవాల్‌తో కూడుకున్నదే. ప్రచారం చేసినప్పటికీ మొత్తం నిధుల సేకరణ లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో క్రౌడ్‌ఫండింగ్ విశ్వసనీయమైన ఆర్థిక ఎంపికగా మారినందున మోసం, దుర్వినియోగం వంటివీ జరగచ్చు. తప్పుదారి పట్టించే లేదా మోసపూరితమైన నిధుల సమీకరణను చూసినట్లయితే, దానిని వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. – సాయంతి రాయ్, హెడ్ కమ్యూనికేషన్స్, మిలాప్ -
Geniben Thakor: అమిత్ షాను సైతం డబ్బు సాయం కోరిందట!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఆమెది స్ఫూర్తిదాయక విజయం. అంతేకాదు.. గుజరాత్ నుంచి కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు కూడా అదే. అందుకే సర్వత్రా ఆసక్తికర చర్చ నడిచింది. బనస్కాంతా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జెనిబెన్ నాగాజీభాయ్ ఠాకోర్(48).. ఎన్నికల ప్రచారానికి కావాల్సిన సొమ్మును క్రౌడ్ ఫండింగ్(ప్రజా సేకరణ ద్వారా డబ్బు) ద్వారా సేకరించుకున్నారు. అంతేకాదు.. ఫలితాలు వెలువడ్డాక కౌంటింగ్ కేంద్రం వద్ద ఆమె గెలుపు ప్రకటన నేపథ్యంలో భావోద్వేగానికి గురైన దృశ్యాలు సైతం వైరల్ అయ్యాయి. అయితే ఆమె ఎన్నికకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది. Geniben Thakor of Congress won historic seat in Banaskantha, Gujarat. She had to crowdsource funds to contest.Such stories needs to be cherished. pic.twitter.com/MvZtlxtmqK— Nehr_who? (@Nher_who) June 4, 2024తన ప్రచారం కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించిన ఆమె.. బీజేపీ అగ్ర నేత.. కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా అడిగారట. ఆయన తన క్లాస్మేట్ అని, ఒక సోదరుడిగా(అమిత్ భాయ్ అని ప్రస్తావిస్తూ) భావించి సాయం కోరారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలియజేశారంటూ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇలాంటి అసాధారణమైన విజయం సాధించిన జెనిబెన్ను రోల్ మోడల్‌గా తీసుకోవాలని రాజకీయ నేతలకు సలహా ఇస్తున్నారాయన. -
Geniben Thakor: ఎన్నికల నిధుల కోసం ‘క్రౌడ్ ఫండింగ్’
అహ్మదాబాద్: ‘ఈ ఎన్నికల్లో నేను గెలవకుంటే మళ్లీ నాకు అవకాశం దక్కదు. నా సొంత ఠాకూర్ వర్గం సాధికారత సాధించేందుకే కాంగ్రెస్ టికెట్ సాధించా’ అంటున్నారు గుజరాత్‌లోని బనస్కాంత లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గెనీబెన్ ఠాకూర్. బనస్కాంత జిల్లా వావ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అయిన గెనీబెన్ ఎన్నికల ప్రచార నిధుల కోసం ‘క్రౌడ్ ఫండింగ్’ బాట పట్టారు. ఆన్లైన్లో తన వినతికి బనస్కాంత ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని ఆమె చెప్పారు. గత 40 రోజుల్లోనే రూ.50 లక్షలవిరాళాలు అందాయన్నారు. తన ప్రచార వాహన నిర్వహణ ఖర్చులు భరిస్తామని కొందరు ముందుకొస్తే, వేదికల ఏర్పాటు ప్రచార సామగ్రి, ఆహార పదార్థాలు తదితరాలకయ్యే వ్యయం సమకూరుస్తామంటూ మరికొందరు చెప్పారని ఆమె శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో వెల్లడించారు. -
ఆపదలో చేయూత.. క్రౌడ్ ఫండింగ్
శాంతి, ఏకాంబరం దంపతులు (పేరు మార్చాం) తొలి కాన్పులో పుత్రుడు అని తెలియగానే పొంగిపోయారు. బాబును చూస్తూ భవిష్యత్తుపై ఎన్నో కలలుగన్నారు. చిన్నారి మూడేళ్ల వయసుకొచ్చేసరికి కదల్లేని స్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ చిన్నారుల ఆస్పత్రిలో చూపించారు. స్పైనల్ మసు్క్యలర్ అట్రోఫీ(ఎస్ఎంఏ)తో బాధపడుతున్నట్టు తేలింది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే విదేశాల నుంచి ‘జోల్జెన్స్మా’ అనే ఇంజెక్షన్‌ను తీసుకొచ్చి ఇవ్వాలి. ఇందుకు సుమారు రూ.16 కోట్లు అవుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ సమయంలో బాబు తల్లిదండ్రులకు ‘ఇంపాక్ట్ గురూ’ ప్లాట్‌ఫామ్ సంజీవనిగా కనిపించింది. చిన్నారి ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తూ విరాళాలకు (ఫండ్ రైజింగ్) పిలుపునిచ్చారు. మూడున్నర నెలల్లో 65,000 మంది దాతల ఉదారంతో ఊహించనిది సాధ్యమైంది. విదేశాల నుంచి సదరు ఇంజెక్షన్‌ను తీసుకొచ్చి ఇవ్వడంతో బాబు కోలుకున్నాడు. వేణు నెట్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో ఓ బాలిక లివర్ సమస్యతో బాధపడుతుందన్న ‘కెట్టో’ ప్రకటన కనిపించింది. అది క్లిక్ చేయగా, ఆ సమస్య నుంచి బయటపడేందుకు రూ.30 లక్షలు అవుతుందని, దాతలు దయతలిస్తేనే తన కుమార్తె బయటపడుతుందంటూ చిన్నారి తల్లి ఆవేదనతో చెబుతున్న మాటలకు వేణు చలించిపోయాడు. కానీ, కాలేయ చికిత్సకు భారీ మొత్తాన్ని పేర్కొనడంపై అతడిలో అనుమానం కలిగింది. సదరు ప్రకటన నిజమేనా..? అంత ఖర్చు అవుతుందా..? ప్రభుత్వాలు ఎందుకు సాయం చేయవు? ఆస్పత్రులు అయినా బాధితుల విషయంలో కొంత లాభాపేక్ష తగ్గించుకుని చికిత్సలకు ముందుకు రావచ్చుగా..? ఇలాంటి ప్రశ్నలు మెదిలాయి. చివరికి తన సందేహాలన్నీ పక్కన పెట్టేసి రూ.500 అప్పటికప్పుడు డొనేట్ చేశాడు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచి్చనా, తమ వల్ల ఏమవుతుంది? అంటూ కుదేలు అయిపోవాల్సిన పని లేదని శాంతి దంపతుల కథనం ధైర్యాన్నిస్తోంది. ఆరోగ్య పరంగా ఎంత కష్టం వచి్చనా, దాతల నుంచి విరాళాలు తెచ్చి పెట్టేందుకు నేడు ఎన్నో వేదికలు పనిచేస్తున్నాయి. వేలాది మంది బాధితుల కుటుంబాల్లో సంతోషానికి దారి చూపిస్తున్నాయి. అదే సమయంలో ఇలాంటి బాధితులకు సాయం చేశామనే సంతృప్తి దాతలకు లభిస్తోంది. కాకపోతే విరాళం ఇచ్చే ముందు కాస్తంత విచారించి, కథనం నిజమైనదేనని నిర్ధారించుకోవడం ద్వారా తమ దానం నిష్ఫలం కాకుండా చూసుకోవచ్చు. మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే.. వీటి సాయం పొందడమే కాకుండా, వీటి ద్వారా నలుగురికీ తోచినంత సాయం చేయడానికి అవకాశం లభిస్తుంది. మనోళ్లకు దాన గుణం ఎక్కువే.. 2021 వరల్డ్ గివింగ్ ఇండెక్స్ ప్రకారం దానంలో భారత్ 14వ స్థానంలో ఉంది. అపరిచితులకు మన దేశంలో 61 శాతం మంది సాయం చేస్తున్నారు. కాకపోతే విశ్వసనీయత విషయంలో ఉండే సందేహాలు ఈ దాతృత్వాన్ని మరింత విస్తరించకుండా అడ్డుకుంటున్నాయని చెప్పుకో వచ్చు. బాధితులకు, దాతలకు మధ్య వేదికగా నిలిచే విశ్వసనీయ సంస్థలు వస్తున్న కొద్దీ, క్రౌడ్ ఫండింగ్ మరింత పరిడవిల్లుతూనే ఉంటుంది. మరింత మంది బాధితులకు చేయూత లభిస్తుంది. నిధుల సమీకరణ ఇలా..? ► చికిత్సలకు దాతల సాయం అవసరమైన వారు క్రౌండ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లను (ఇంపాక్ట్‌గురూ, మిలాప్, కెట్టో మొదలైనవి) సంప్రదించాలి. ► పాన్, ఆధార్, మెడికల్ డాక్యుమెంట్లు సమర్పించాలి. ► వీటిని క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ధ్రువీకరించుకుంటుంది. తగిన విచారణ అనంతరం బాధితుల కథనం నిజమేనని నిర్ధారించుకున్న తర్వాత వారి తరఫున నిధుల సమీకరణ పేజీని అవి సిద్ధం చేస్తాయి. ► ఇక ఇక్కడి నుంచి నిధుల సమీకరణ మొదలవుతుంది. సాయం అవసరమైన వారు ఈ పేజీ లింక్‌ను తమ నెట్‌వర్క్‌లో షేర్ చేసుకోవాలి. తమ వంతు ప్రచారం కలి్పంచుకోవాలి. అలాగే, ప్లాట్‌ఫామ్‌లు సైతం ప్రచారానికి తమ వంతు సాయం అందిస్తాయి. ► సమీకరించే విరాళంలో ఎక్కువ మొత్తాన్ని కమీషన్ రూపంలో మినహాయించుకునేందుకు సమ్మతి తెలియజేస్తే, వారి తరఫున క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు సైతం విస్తృత ప్రచారాన్ని చేపడతాయి. ► బాధితులు ఎదుర్కొంటున్న సమస్య, వైద్యులు చెబుతున్న వెర్షన్, చికిత్సకు ఎంత ఖర్చవుతుంది? తదితర వివరాలన్నీ ఈ పేజీలో ఉంటాయి. దాతలు విరాళం చెల్లించేందుకు పేమెంట్ లింక్‌లు కూడా అక్కడ కనిపిస్తాయి. ► కనీసం 300–350 అంతకంటే ఎక్కువ విరాళాలనే అనుమతిస్తున్నాయి. ► దాతలు చేసే చెల్లింపులన్నీ కూడా ప్రత్యేక ఖాతాలో జమ అవుతాయి. ► కావాల్సిన మొత్తం వచి్చనా.. లేదంటే గడువు ముగిసినా లేదంటే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి అకాలంగా మరణించినా నిధుల సమీకరణ ముగిసిపోతుంది. ► అనంతరం ఈ మొత్తం నుంచి కమీషన్ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని హాస్పిటల్/బాధితులకు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు చెల్లిస్తాయి. ఇలా చేసే ముందు హాస్పిటల్ బిల్లులను చెక్ చేస్తాయి. ► విరాళం ఇచి్చన వారికి ఎప్పటికప్పుడు మెయిల్ ద్వారా బాధితుల తాజా ఆరోగ్య పరిస్థితిపై వివరాలను ఇవి అప్డేట్ చేస్తుంటాయి. విశ్వసించడం ఎలా..? సాయం అవసరమైన వారికి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు మార్గాన్ని చూపిస్తున్నాయి. మరి విరాళం ఇచ్చే వారు ఈ కథనాలను విశ్వసించేది ఎలా..? ఈ సందేహం చాలా మందికి వస్తుంది. మన దేశంలో విరాళాలకు సంబంధించి భౌతిక వేదికలే ఎక్కువ. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల సేవలు ఇటీవలి కాలంలోనే వెలుగులోకి వచ్చాయి. ఇంటర్నెట్ విస్తరణ ఇందుకు వీలు కలి్పంచిందని చెప్పుకోవాలి. ఆన్లైన్ ప్రపంచంలో అన్నింటినీ నమ్మలేం. సైబర్ మోసాలు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో, అన్నీ విచారించుకున్న తర్వాతే విరాళం ఇవ్వడం సురక్షితంగా ఉంటుంది. కోటక్ ఆల్టర్నేటివ్ అస్సెట్ మేనేజర్స్ సీఈవో (ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ) లక్ష్మీ అయ్యర్ దీనిపై తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘నాకు రిఫరల్ ద్వారా వచ్చే వాటికే నేను దానం చేస్తాను. ఈ విషయంలో నా మార్గం చాలా స్పష్టం. సులభంగా డబ్బులు సంపాదించే మోసగాళ్లకు కొదవ లేదు’’అన్నది లక్ష్మీ అయ్యర్ అభిప్రాయంగా ఉంది. సన్సేరా ఇంజనీరింగ్ జాయింట్ ఎండీ ఎఫ్ఆర్ సింఘ్వి ఈ విషయంలో సందేహాలు వ్యక్తం చేశారు. ‘‘చాలా వరకు విరాళాలు కోరుతున్న ఆన్లైన్ కేసులు వైద్య పరమైనవే ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో అవి పేర్కొనే చికిత్సల వ్యయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. నాకు ఒక ఆస్పత్రితో అనుబంధం ఉంది. కనుక చికిత్సల వ్యయాల గురించి తెలుసుకోగలను’’అని పేర్కొన్నారు. ఇలాంటిదే ఒక విరాళం కేసులో చికిత్సకు రూ.18–24 లక్షలు ఖర్చువుతుందన్న కొటేషన్ కనిపించగా, దీనిపై విచారించగా, తెలిసిన హాస్పిటల్లో రూ.5–6 లక్షలకే చేస్తున్నట్టు విని ఆశ్చర్యపోయినట్టు సింఘ్వి తెలిపారు. నిజానికి కొన్ని కేసుల్లో భారీ అంచనాలు పేర్కొంటున్న ఉదంతాలు లేకపోలేదు. హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న బాధితుల తరఫున నిధుల సమీకరణ కార్యక్రమాలు నడిపించే కొందరు మోసగాళ్ల ఉదంతాలు సైతం లోగడ వెలుగు చూశాయి. అలా అని కష్టాల్లో ఉన్న బాధితులకు విరాళాలు ఆగకూడదు కదా..? ముందస్తు పరిశీలన క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు చికిత్సల వ్యయాలను ముందుగానే నిర్ధారించుకుంటామని చెబుతున్నాయి. హాస్పిటల్ వ్యయ అంచనాలను, చారిత్రక గణాంకాలు, బీమా థర్డ్ పార్టీ అగ్రిగేటర్ సంస్థల డేటా ఆధారంగా పోల్చి చూస్తామని ఇంపాక్ట్‌గురూ సీఈవో జైన్ తెలిపారు. తమ ప్యానల్ డాక్టర్లతోనూ దీనిపై నిర్ధారించుకుంటామని చెప్పారు. నిధుల సమీకరణ నిజమైన కారణాలతో చేసినప్పటికీ, తర్వాత ఆ నిధులు దురి్వనియోగం కాకుండా ఉండేందుకు కూడా ఇవి చర్యలు తీసుకుంటున్నాయి. ‘‘ఇంపాక్ట్ గురూ వేదికగా సమీకరించే నిధుల్లో 80 శాతానికి పైగా నేరుగా హాస్పిటల్స్‌కు బదిలీ చేస్తున్నాం. ఈ హాస్పిటల్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ జాబితాలోనివే’’అని జైన్ తెలిపారు. తమ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ చేసే వైద్య పరమైన కేసుల్లో విరాళాలను హాస్పిటల్ బ్యాంక్ ఖాతా ద్వారానే తీసుకోగలరని కెట్టో అంటోంది. ► బాధితుల కేవైసీ పత్రాలను ముందుగా ఇవి నిర్ధారించుకుంటాయి. ► వైద్య పరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకుని వాటిని తనిఖీ చేస్తాయి. ► తమ ప్యానెల్ వైద్యులతో మాట్లాడి నిర్ధారణకు వస్తాయి. ► అవసరమైతే క్షేత్రస్థాయిలో హాస్పిటల్‌కు తమ ఉద్యోగిని పంపించి వాస్తవమా, కాదా అన్నది నిర్ధారించుకుంటాయి. ప్రచార మార్గం.. ఇంపాక్ట్ గురూ, కెట్టో, మిలాప్ ఇవన్నీ ప్రముఖ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు. ఆన్లైన్ ప్రకటనలు, సామాజిక మాధ్యమాల ద్వారా బాధితుల తరఫున విరాళాల సమీకరణకు ఇవి ప్రచారం కలి్పస్తుంటాయి ఇంటర్నెట్ బ్రౌజ్ చేసే సమయంలో వైద్య చికిత్సల కోసం సాయం కోరుతూ ఈ సంస్థలకు సంబంధించి ప్రకటనలు కనిపిస్తుంటాయి. వీటిని క్లిక్ చేసి చూశారంటే, తర్వాత కూడా అలాంటి ప్రకటనలే మళ్లీ మళ్లీ కనిపిస్తుంటాయి. ప్రకటనల్లో బాధితుల కథనానికి ఆధారంగా వైద్యులు జారీ చేసిన లెటర్, టెస్ట్ రిపోర్ట్‌లను ఉంచుతున్నాయి. సామాజిక మాధ్యమాలతోపాటు, బాధితులు సైతం తమకు తెలిసిన వారికి ఈ లింక్‌లు పంపి సాయం కోరవచ్చు. ఒక్కసారి కావాల్సిన నిధులు లభించగానే, ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ముగుస్తుంది. ఈ సంస్థలు విరాళం ఇచి్చన వ్యక్తులను నెలవారీ స్కీమ్‌లతో ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి నెలా తోచినంత దానం ఇచ్చే విధంగా స్కీమ్‌లు తీసుకొచ్చాయి. విరాళాలకు సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు కల్పిస్తున్నాయి. బాధితుల అనుభవాలు.. లాహిరి సోదరికి బ్రెయిన్ టీబీ నిర్ధారణ కావడంతో 2019 డిసెంబర్లో నిధుల సమీకరణ కోసం మిలాప్ సంస్థను సంప్రదించారు. మిలాప్ ఆమె అభ్యర్థనకు చక్కగా స్పందించింది. ఫొటోగ్రాఫ్‌లు, డాక్యుమెంట్లు అడిగారు. అవన్నీ ఇవ్వడంతో, వాటి ఆధారంగా ఒక ప్రచార ప్రకటనను మిలాప్ రూపొందించింది. తెలిసిన వారి సాయంతో దీనికి మంచి ప్రచారం కలి్పంచుకోవాలని మిలాప్ సూచించింది. తాము ఆ ప్రచారాన్ని చేపట్టబోమని, బాధితులే సొంతంగా నిర్వహించడం వల్ల మరింత విశ్వసనీయత ఉంటుందనే సూచన వచ్చింది. దీంతో లాహిరి తనకు తెలిసిన వారికి షేర్ చేశారు. అలా రూ.45,000 విరాళాలు వచ్చాయి. ఇందులో మిలాప్ తన కమీషన్‌గా రూ.5,000 మినహాయించుకుని, రూ.40,000ను లాహిరి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చెల్లించింది. కానీ, మిలాప్ ద్వారా చేసిన ప్రచారం లాహిరి బంధు మిత్రులకు తెలిసిపోవడంతో, వారి నుంచి ఆమెకు మరో రూ.12 లక్షలు విరాళాల రూపంలో నేరుగా వచ్చాయి. మిలాప్ రూపొందించిన ప్రచారమే లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదని లాహిరి అనుభవం చెబుతోంది. దురదృష్టవశాత్తూ లాహిరి సోదరి బ్రెయిన్ టీబీతో 2020 ఫిబ్రవరిలో మరణించారు. విజయం ఎంత? మీరా అనే వ్యక్తి సైతం, తన భర్త సర్జరీ కోసం కెట్టో ద్వారా నిధుల సమీకరణ చేయగా, మంచి ఆదరణే లభించింది. కెట్టో రిప్రజెంటేటివ్ ఎప్పటికప్పుడు ఆమెతో సంపద్రింపులు చేస్తూ సహకారం అందించడంతో, సర్జరీకి కావాల్సిన మొత్తం 48 గంటల్లోనే సమకూరింది. దేశ, విదేశాల్లోని స్నేహితులు, కుటుంబ సభ్యులు విరాళం ఇచ్చేందుకు సముఖంగా ఉన్నారని తెలిసినా, అందుకు వీలుగా కెట్టో ప్లాట్‌ఫామ్ సాయాన్ని ఆమె తీసుకున్నారు. ఎక్కడ ఉన్నా కెట్టో ద్వారా విరాళం పంపడం సులభమని భావించి అలా చేసినట్టు చెప్పారు. అయితే, అందరికీ ఇదే తరహా అనుభవం లభిస్తుందా..? ప్రతి ఫండ్ రైజింగ్ విజయవంతం అవుతుందా? అంటే నూరు శాతం అవును అని చెప్పలేం. ఇదంతా తమకున్న పరిచయాలు, ఎంపిక చేసుకున్న ప్లాట్‌ఫామ్, రూపొందించిన ప్రకటన, ప్లాట్‌ఫామ్ నుంచి ప్రచారం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ‘‘కొన్నేళ్ల క్రితం మేము సాయం కోసం ఇంపాక్ట్ గురూ ప్లాట్‌ఫామ్‌ను సంప్రదించాం. ఇంపాక్ట్ గురూ దాతల నెట్వర్క్ సాయంతో నిధులు సమకూర్చుతారని అనుకున్నాం. కానీ, ఇంపాక్ట్ గురూ అలా చేయలేదు. ప్రచార కార్యక్రమం పేజీని రూపొందించి, ఆ లింక్‌ను తమ పరిచయస్తులతో పంచుకోవాలని సూచించింది’’అని ఓ వ్యక్తి అనుభవం చెబుతోంది. తమ ప్లాట్‌ఫామ్‌పై వేలాది ప్రచార కార్యక్రమాలు నమోదవుతున్నందున.. ప్రతీ ఒక్క ప్రచారాన్ని తామే సొంతంగా చేపట్టడం సాధ్యం కాదని ఇంపాక్ట్ గురూ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పీయూష్ జైన్ స్పష్టం చేశారు. దాతల కమ్యూనిటీ నుంచి మంచి స్పందన వస్తుందనుకుంటే, తాము తప్పకుండా ప్రమోట్ చేస్తుంటామని చెప్పారు. కొంచెం కమీషన్.. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ లు మొత్తం విరాళం నుంచి నిరీ్ణత మొత్తాన్ని కమీషన్/చార్జీ కింద మినహాయించుకుంటున్నాయి. ఇది ఒక్కో సంస్థలో ఒక్కో విధంగా ఉంటుంది. ‘‘అంతర్జాతీయంగా చూస్తే ప్రతీ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ఎంతో కొంత స్వల్ప ఫీజును వసూలు చేస్తున్నాయి. తమ కార్యకలాపాలు నిర్విరామంగా కొనసాగేందుకే ఇలా చేస్తున్నాయి. టెక్నాలజీ సదుపాయాలు, సిబ్బంది, నిధుల సమీకరణ, ముందస్తు విచారణలకు సంబంధించి వ్యయాలు అవుతాయి. మేము నిలదొక్కుకున్నప్పుడే మా లక్ష్యాన్ని (ఫండ్ రైజింగ్) సాధించగలం’’ అని పీయూష్ జైన్ తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని ప్రీమియం సేవలను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇంపాక్ట్ గురూ అయితే 0 శాతం, 5 శాతం, 8 శాతం ఇలా మూడ్ స్కీమ్‌ల కింద ఈ సేవలను ఆఫర్ చేస్తోంది. మోసాలుంటాయ్.. జాగ్రత్త అవగాహన, జాగ్రత్తలు లేకపోతే ఆన్లైన్ మోసాల బారిన పడే రిస్క్ ఉంటుంది. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విరాళాలు కోరినా లేక విరాళం ఇచ్చినా సరే.. ఆ తర్వాత ఫోన్ కాల్ లేదా వాట్సాప్ మెస్సేజ్ లేదా మెయిల్ రావచ్చు. కష్టంలో ఉన్న బాధితులకు సంబంధించి అందులో సాయం కోరొచ్చు. లేదంటే అప్పటికే విరాళం ఇచ్చిన కేసుకు సంబంధించి అప్డేట్ అంటూ మోసగాళ్లు మెయిల్ పంపించొచ్చు. ఒక్కసారి విరాళం ఇస్తే, ఆ తర్వాత నుంచి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇతర బాధితులకు సంబంధించిన వివరాలను మెయిల్స్, వాట్సాప్ మెస్సేజ్‌లు, కాల్స్ రూపంలో మార్కెటింగ్ చేస్తుంటాయి. ఇదంతా ఇబ్బందికరంగా అనిపించొచ్చు. చాలా మంది సాయం చేయాలని భావిస్తుంటారని, బాధితుల వివరాలను వారు మెయిల్ లేదా వాట్సాప్ సందేశాలు, కాల్స్ రూపంలో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని జైన్ తెలిపారు. ఇవి వద్దనుకునే వారు అన్‌సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలని సూచించారు. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు అన్నీ కూడా సురక్షిత చెల్లింపుల సాధనాలనే వినియోగిస్తున్నాయి. కానీ, వీటి పేరుతో సైబర్ నేరస్థులు ఆకర్షించే కథనాలు, మోసపూరిత పేమెంట్ లింక్‌లు పంపించి, బ్యాంక్ ఖాతాలో బ్యాలన్స్ మొత్తాన్ని ఊడ్చేసే ప్రమాదం లేకపోలేదు. అందుకే విరాళం ఇచ్చే ముందు సంబంధిత సంస్థల యూఆర్ఎల్ను జాగ్రత్తగా గమనించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
చిన్నారి చికిత్సకు రూ. 11 కోట్ల విరాళం.. కనీసం పేరు చెప్పకుండా!
కష్టాల్లో ఉంటే అయినవారే పట్టించుకోని రోజులివి.. నోరు తెరిచి సాయం కావాలని అడిగిన చూసి చూడనట్లు వదిలేసే కాలం ఇది. అలాంటిది ముక్కు ముఖం తెలియని చిన్నారిని ఓ వ్యక్తి దేవుడిలా ఆదుకున్నాడు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడికి కోట్లు విరాళంగా ఇచ్చి గొప్ప మనసును చాటుకున్నాడు. ఎస్ఎంఏ అనే వ్యాధి సోకిన 15 నెలల చిన్నారి చికిత్స కోసం ఓ వ్యక్తి ఏకంగా రూ.11 కోట్లు ఖాతాలో జమ చేశారు.అమెరికాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నా ఆయన కోట్లు దానం చేసి కనీసం తన పేరు, వివరాలు చెప్పకుండా బాలుడికి కొత్త జన్మను అందించాడు. కేరళలోని ఎర్నాకుళానికి చెందిన సారంగ్ మీనన్, అదితి నాయర్ కుమారుడు నిర్వాణ్(15 నెలలు). నిర్వాణ్ స్పైనల్ మస్క్లర్ అట్రోఫీ(వెన్నుముక కండరాల క్షీణత) అనే అరుదైన వ్యాధితో బాధపడతున్నాడు. ఎస్ఎంఏ చికిత్సకు దాదాపు రూ.17.5 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఈ వ్యాధి నివారణకు ఉపయోగించే వన్ టైమ్ డ్రగ్ అయిన జోల్జెన్మ్సా ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో లేదు. దీనిని మెడికల్ ప్రిస్క్రిప్షన్, పిల్లల తల్లిదండ్రుల లేఖతో అమెరికా నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. అంతేగాక ఎస్ఎమ్కే కేసులు, దీని డ్రగ్ డెవలప్మెంట్ పరిశోధనలు తక్కువగా ఉండటం కారణంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందులలో ఇది ఒకటి. దీంతో గత నెల జనవరిలో బాలుడి తల్లిదండ్రులు ఆర్థిక సాయం కోసం క్రౌడ్‌ఫండ్ అకౌంట్ తెరిచారు. ఫిబ్రవరి 19 వరకు వారికి రూ.5.42 కోట్లు విరాళంగా అందాయి. ఈ క్రమంలోనే క్రౌడ్ ఫండింగ్ ఖాతాలోకి ఎవరో వ్యక్తి తన పేరు చెప్పకుండా భారీ మొత్తాన్ని డిపాజిట్ చేశారు. ఫిబ్రవరి 20వ తేదీన ఓ వ్యక్తి అకౌంట్ నుంచి 1.4 మిలియన్ డాలర్లు తమకు అందినట్లు బాధిత కుటుంబం ఫేస్బుక్లో వెల్లడించింది. ఇది భారత కరెన్సీ ప్రకారం అక్షరాల 11.50 కోట్లు. ఇంత మొత్తం విరాళంగా ఇచ్చి బాలుడికి కొత్త జీవితాన్ని అందించాడు. అయితే ఈ డబ్బులు ఎవరూ విరాళంగా ఇచ్చారో తమకు తెలియదని కుటుంబ నిర్వాణ్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. అతనెవరో, తన వివరాలు వెల్లడించడానికి ఇష్టపడలేదని తెలిపారు. తమ జీవితంలో ఇదొక అద్భుతమని వర్ణించారు. ఇప్పటి వరకు అజ్ఞాత దాతతో సహా 72,000 మంది వ్యక్తులు నిర్వాణ్‌కు విరాళాలు అందించారు. దీంతో సారంగ్ దంపతుల ఆర్థిక కష్టాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లైంది. చదవండి: కర్ణాటకలో అదృశ్యమైన బస్.. తెలంగాణలో లభ్యం, మధ్యలో ఏం జరిగింది! -
చేతులు జోడించి వేడుకుంటున్నా...
మాకు పెళ్లైన ఎనిమిదేళ్లకు నేనే తల్లినయ్యారు. పుట్టబోయే బిడ్డను ఎలా చూసుకోవాలి, ఆ బిడ్డ బంగారు భవిష్యత్తు కోసం ఎలా కష్టపడాలి అనుకుంటూ నేను, నాభర్త రోజుల తరబడి గడిపాం. చివరకు నేను తల్లినయ్యాను. బిడ్డను పొదివి పట్టుకున్నప్పుడు నేను పొందిన ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఆ బిడ్డ కోసమే మా భవిష్యత్తు అనుకున్నాం. కానీ మా కలలు కల్లలయ్యాయి. పుట్టిన కొద్ది రోజులకే పాపకు కాన్జెనిటల్ హార్ట్ డిసీజ్ ఉందని తేలింది. దీంతో పాప ఆరోగ్యం బాగయ్యేందుకు అనేక ఆస్పత్రుల చుట్టూ తిరిగాం. ఇంట్లో ఉండటం కంటే ఆస్పత్రుల్లోనే ఎక్కువగా గడిపాం. తల్లి పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన బిడ్డ ఆస్పత్రి బెడ్‌పైనే ఎక్కువగా ఉంది. చివరకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే పాపకి ఆరోగ్యం నయం అవుతుందని చెప్పారు. దాని కోసం రూ. 3.80 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. నా భర్త రవీంద్ర రోజువారి కూలీగా పని చేస్తున్నాడు. తాను రోజంతా కష్టపడితే మాకు మూడు పూటల తిండికే సరిపోతుంది. పాప ఆరోగ్యం కోసం మందులు కొనడం సైతం ఎంతో కష్టంగా ఉంటోంది. గడిచిన ఐదు నెలలుగా ఆస్పత్రుల చుట్టూ తిరగడాకే మా దగ్గర డబ్బులు సరిపోలేదు. అప్పులు చేశాం. ఇక మాకు డబ్బులు ఇవ్వడానికి తెలిసిన వాళ్లెవరు మిగల్లేదు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి నా వేలు పట్టుకుని పాప ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతుంది. పసిపాపకి ఎంత నొప్పిగా ఉందో.. నా వైపు చూస్తూ ఏడుస్తుంటే .. ఏమీ చేయలని మా నిస్సహాయ స్థితి తలచుకుంటే మాకే నరకంగా ఉంది. దయచేసి నా బిడ్డకు ఓ జీవితం ఇచ్చేందుకు మీ వంతు సహకారం అందివ్వండి. ఆపరేషన్‌కు అవసరమైన ఆర్థిక సాయం చేయండి. మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
సైకిల్‌పై వచ్చిన డెలివరీ బాయ్‌కి బైక్ కొనిచ్చిన జొమాటో యూజర్
రాజస్థాన్‌కి చెందిన ఓ జొమాటో డెలివరీ బాయ్ కథ నెట్టింట వైరల్‌గా మారింది. ఎర్రటి ఎండలో ఆ జొమాటో డెలివరీ బాయ్ పడుతున్న కష్టం.. దాన్ని గుర్తించిన ఓ యూజర్.. వెంటనే స్పందించిన నెటిజన్లు.. వెరసి ఓ స్ఫూర్తినిచ్చే ఘటనగా మారింది. రాజస్థాన్‌కి చెందిన ఆదిత్యశర్మ ఏప్రిల్ 11న మధ్యాహ్నం జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. కాసేపటికే ఆర్డర్ వచ్చింది. తీసుకుందామని వెళ్లిన ఆదిత్యకు అక్కడ కనిపించిన దృశ్యం కదిలించి వేసింది. రాజస్థాన్‌లో తీవ్రంగా ఎండలు కొడుతున్న వేళ ఓ వ్యక్తి మిట్టమధ్యాహ్నం చెమటు కక్కుకుంటూ సైకిల్‌పై జొమాటో ఆర్డర్లు డెలివరీ చేయడం అతన్ని కలిచి వేసింది. దీంతో ఆర్డర్ తీసుకుని అతనితో మాటలు కలిపాడు. కష్టాల్లోకి నెట్టిన కరోనా సైకిల్‌పై డెలివరీ సర్వీస్ చేస్తున్న ఆ వ్యక్తి పేరు దుర్గామీనా అని. బీకామ్ చదివిన దుర్గా మీనా దాదాపు పన్నెండేళ్లు టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నాడు. అయితే కరోనా కష్టకాలంలో అతని ఉద్యోగం పోయింది. దీంతో జొమాటో డెలివరీ బాయ్‌గా మారాడు. క్షణం తీరిక లేకుండా పని చేసినా సైకిల్ మీద పది నుంచి పన్నెండు డెలివరీలు ఇవ్వడం వీలు కావడం లేదు. కొత్త బైకు కొనుక్కునేందుకు డబ్బులు కూడబెడుతున్నా కనీసం డౌన్ పేటెంట్‌కు కావాల్సినంత అమౌంట్ కూడా కూడటం లేదని తెలిసింది. డౌన్‌పేమెంట్ కడితే చాలు తన కష్టాలు వింటున్న ఆదిత్య ముందు మరో ప్రపోజల్ ఉంచాడు దుర్గామీనా. తనకు డౌన్‌పేమెంట్ చెల్లంచి బైక్ కొనిస్తే ఇంకా ఎక్కువ డెలివరీలు చేస్తానని అదనంగా వచ్చే డబ్బుతో నెలవారీ ఈఎంఐలు కట్టుకోవడంతో పాటు డౌన్‌పేమెంట్‌గా అందించిన సాయాన్ని నాలుగు నెలల్లో ఇస్తానంటూ తెలిపాడు. అంతేకాదు ఎవరైనా ట్యాబ్, వైఫై సౌకర్యం కల్పించినా టీచింగ్ చేసుకుంటానంటూ మరో ప్రతిపాదన ఆదిత్య ముందు ఉంచాడు దుర్గామీనా. Today my order got delivered to me on time and to my surprise, this time the delivery boy was on a bicycle. today my city temperature is around 42 °C in this scorching heat of Rajasthan he delivered my order on time I asked for some information about him so 1/ pic.twitter.com/wZjHdIzI8z — Aditya Sharma (@Adityaaa_Sharma) April 11, 2022 ట్విట్టర్ స్టోరీ మండే ఎండలో సైకిల్‌పై డెలివరీ చేస్తున్న దుర్గామీనా ఫోటోను జత చేసి.. మొత్తం స్టోరీని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఆదిత్య శర్మ. దుర్గామీనా బైక్ కొనుక్కునేందుకు కనీసం ఒక్క రూపాయి అయినా సాయం చేయాలంటూ నెటిజన్లను కోరుతూ 2022 ఏప్రిల్ 11 మధ్యాహ్నం 3:57 గంటలకు మెసేజ్ పెట్టాడు. సరిగ్గా 24 గంటలు గడవక ముందే దుర్గామీనా బైక్ కొనేందుకు అవసరమైనంత సొమ్ము క్రౌడ్ ఫండింగ్ ద్వారా అందింది. బైక్ ఆగయా.. కేవలం 24 గంటల్లోనే దుర్గామీనాను ఆదుకునేందుకు నెటిజన్లు భారీగా స్పందించారు. దుర్గామీనా సొంతం చేసుకోబోయే బైకు ఫోటోను 2022 ఏప్రిల్ 12 మధ్యాహ్నం 1:30 గంటలకు ఆదిత్య శర్మ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ సైకిల్ డెలివరీ బాయ్ కథనం నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియా స్ట్రెంథ్, క్రౌడ్ ఫండింగ్ ప్రభావం ఎంటో తెలియజెప్పింది. He is on his way ✅to reach showroom pic.twitter.com/JN1OzPr3wO — Aditya Sharma (@Adityaaa_Sharma) April 12, 2022 చదవండి: అలా చేస్తేనే రైతుల ఆదాయం రెట్టింపు -
తనలా బాధపడుతున్న బాలుడి కోసం రూ 61 లక్షలు సమకూర్చాడు...ఐతే అతను చనిపోయాడు!
మనమే బాధలో ఉంటే అవతలివాళ్లకి సాయం చేయాలన్న ఆలోచనే రాదు. చాలామంది తమకే ఇంత పెద్ద కష్టం అంటూ దేవుడిని లేక విధిని తిడుతూ ఊసూరుమంటూ కూర్చుండిపోతారు. కానీ ఈ యువకుడు అందుకు భిన్నం. తాను ఒక క్యాన్సర్ పేషంట్ అయ్యి మరో క్యాన్సర్ పేషంట్ బతకాలని తపించాడు. అసలు విషయంలోకెళ్తే...అమెరికాలోని రైస్ లాంగ్‌ఫోర్డ్ అనే యువకుడు ప్రతిభావంతుడైన అథ్లెట్. అయితే ఒక రోజు తన స్నేహితులతో కలసి చేసిన స్ప్రింట్ రేస్‌లో రైస్ కళ్లు తిరిగి పడిపోయాడు. అప్పుడే రైస్ ఆస్టియోసార్కోమా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. అతని కుడి కాలు తుంటిలో కంతిని గుర్తించిన వైద్యులు తొలగించే నిమిత్తం మొత్తం కాలుని తీసేశారు. దీంతో రైస్ జీవితాంతం కర్రల సాయంతోనే నడిచే పరిస్థితి ఎదురైంది. అయితే అతని కుటుంబసభ్యులు మాత్రం రైస్ క్యాన్సర్‌ని జయించి బయటపడ్డాడని ఆనందించారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. రైస్‌కి శస్త్రచికిత్స జరిగిన కాలు మళ్లీ వాపు రావడం మొదలైంది. మళ్లీ క్యాన్సర్ తర శరీరంలో మరింతగా విజృభించడం మొదలైందని రైస్ గ్రహించాడు. ఈ క్రమంలో రైస్ జాకబ్ జోన్స్ అనే ఆరేళ కుర్రవాడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని తెలుసుకుని ఆ బాలుడికి సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకు రైస్ వ్యక్తిగతంగా సుమారు ఒక లక్ష రూపాయలు పొదుపు చేసి ఆ బాలుడి కుటుంబసభ్యులకు అందజేశాడు. అయితే ఇది అతని చికిత్సకు ఏ మాత్ర సరిపోదని భావించి ఆన్లైన్లో క్రౌడ్ ఫండింగ్ ఓపెన్‌చేసి ఆ బాలుడి కోసం దాదాపు రూ.61 లక్షలు సేకరించాడు. ఈ మేరకు రైస్ తన తల్లి కేథరిన్‌తో ...జాకబ్ ఆరేళ్ల తన జీవితంలో న్యూరోబ్లాస్టోమా అనే క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. అతను ఈ క్యాన్సర్‌ని జయించి త్వరితగతిన కోలుకోవాలని కోరుకుంటున్నా" అని తరుచుగా చెప్పేవాడు. అంతేకాదు రైస్ సేకరించిన ఈ 61 లక్షలు డబ్బుని జాకబ్ కుటుంబ సభ్యులకు అందించిన తదుపరి అతను మరణించాడు. దీంతో జాకబ్ కుటుంబ సభ్యలు మాట్లాడుతూ..."రైస్ తానున్న పరిస్థితిని పక్కనపెట్టి జాకబ్ పట్ల అతను కనబర్చిన ప్రేమ, తెగువ, ధైర్యం నమశక్యంకానివి. రైస్ కారణంగానే జాకబ్ ఈ క్యాన్సర్‌తో పోరాడి కొత్త భవిష్యతును పొందగలిగే సువర్ణావకాశం కలిగింది" అని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ విషయం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఇదో చెత్త ప్రశ్న.. ఇంటర్వ్యూలో యువతి షాకింగ్ రిప్లై.. వీడియో వైరల్) -
అరుదైన ఘటన: రాయిగా మారుతున్న 5 నెలల పాప
లండన్: తల్లిదండ్రులకు పిల్లలే ప్రాణం. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా.. తల్లిదండ్రుల మనసు విలవిల్లాడుతుంది. పిల్లలకంటే ఎక్కువగా వారే బాధపడతారు. బిడ్డలు కోలుకునే వరకు వారి మనసు శాంతించదు. అలాంటి పిల్లలు అరుదైన, చికిత్స లేని జబ్బు బారిన పడితే.. ఇక ఆ తల్లిదండ్రుల గుండెకోత వర్ణించడానికి మాటలు చాలావు. తాజాగా యూకే హేమెల్ హెంప్‌స్టెడ్, హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన అలెక్స్, దవే దంపతులు ఇలాంటి వేదననే అనుభవిస్తున్నారు. ఐదు నెలల వారి చిన్నారి బేబీ లెక్సి రాబిన్స్ ప్రస్తుతం అత్యంత అరుదైన సమస్యను ఎదుర్కొంటుంది. ఈ చిన్నారి శరీరం రాయిలా మారుతుంది. ఆ వివరాలు.. లెక్సి ఈ ఏడాది జనవరి 31న జన్మించింది. ఐదు నెలల వరకు బాగానే ఉన్నప్పటికి.. ఆ తర్వాత లెక్సి శరీరంలో మార్పులు రాసాగాయి. పాప బొటనవేలు, కాలి బొటనవేలులో పెద్దగా చలనం లేదని గుర్తించారు లెక్సి తల్లిదండ్రులు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాదాపు నెల రోజుల పాటు చిన్నారిని పరీక్షించిన వైద్యులు లెక్సి ఫైబ్రోడిస్ప్లాసియా ఓసిఫికన్స్ ప్రోగ్రెసివా (ఎఫ్ఓపీ) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. రెండు మిలియన్ల మందిలో ఒకరికి వచ్చే ఈ అరుదైన జబ్బు వల్ల కండరాలు, వాటిని కలిపి ఉంటే టెండాన్స్, లిగిమెంట్ స్థానంలో ఎముకలు ఏర్పడతాయని వెల్లడించారు. అంతేకాక అస్థిపంజరం వెలుపల ఎముకలు ఏర్పడి కదలికలు లేకుండా అడ్డుకుంటాయన్నారు. చివరకు శరీరం రాయిలా కదలకుండా మారుతుందన్నారు. వీరి జీవితకాలం 40 ఏళ్లు మాత్రమే ఉంటుందని.. దానిలో కూడా సుమారు 20 ఏళ్లకు పైగా వారు మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందని తెలిపారు. ఏప్రిల్‌లో లెక్సికి ఎక్స్‌రే తీసిన వైద్యులు దానిలో చిన్నారి కాళ్ల వద్ద ఉబ్బి ఉండటమే కాక బొటనవేళ్లు జాయింట్ అయినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా చిన్నారి లెక్సి తల్లిదండ్రులు తమ బిడ్డ పరిస్థితిని వివరిస్తూ.. అవగాహన కల్పించే కార్యక్రమంతో పాటు చికిత్సకు సాయం చేయాల్సిందిగా కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసి.. విరాళాలు సేకరిస్తున్నారు. లెక్సి టెస్ట్ రిపోర్టులను ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లాబ్‌కి పంపించారు. ఈ సందర్భంగా లెక్సి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘‘యూకేలో ప్రసిద్ధి చెందిన టాప్ పిడియాట్రిషన్ లెక్సిని పరిశీలిస్తున్నారు. ఆయన 30 ఏళ్ల సర్వీసులో ఇంతవరకు ఇలాంటి కేసు చూడలేదని చెప్పుకొచ్చారు. నా చిన్నారి చాలా తెలివైంది. రాత్రంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోతుంది.. అస్సలు ఏడవదు. అలాంటి నా బిడ్డకు ఇలా చికిత్స లేని జబ్బు సోకడం మా హృదయాలను కలిచివేస్తుంది. కానీ మేం మా ప్రయాత్నాన్ని, నమ్మకాన్ని వదులుకోము’’ అని తెలిపారు. -
క్రౌడ్ ఫండింగ్... సేవా ట్రెండింగ్
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఒక బాలుడు అరుదైన వ్యాధితో బాధపడ్డాడు. చికిత్సకు రూ.16 కోట్లు అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో అంత డబ్బు ఎలా తేవాలని, ఎవరిని అడగాలని, తమ చిన్నారిని ఎలా బతికించుకోవాలని ఆ తల్లిదండ్రులు ఎంతగానో కలత చెందారు. అప్పుడు వారిని దేవుడిలా ఆదుకుంది ‘క్రౌడ్‌ఫండింగ్’. దీంతో ఆన్లైన్లో సమకూరిన నిధులతో వారు తమ చిన్నారిని బతికించుకున్నారు. ఆ కుటుంబంలో మళ్లీ సంతోషం నింపిన ఆ ‘క్రౌడ్‌ఫండింగ్’ అంటే ఏమిటో తెలుసుకుందాం.. సాక్షి, హైదరాబాద్: గతంతో పోలిస్తే.. దాతల సంఖ్య పెరిగింది. ఐటీ సంబంధిత సంస్థల్లో పనిచేసే యువకులు చారిటీ అంటే సై అంటున్నారు. దీంతో ఆపన్నులు–దాతలకు మధ్య వారధిలాంటి మాధ్యమాలు కూడా పెరుగుతున్నాయి. వీటిలో ప్రాచుర్యంలో ఉన్న వారధి ఆన్లైన్ ఫండ్ రైజింగ్ పేజెస్/ క్రౌడ్ ఫండింగ్. అన్ని అవసరాలకూ ఇవి ఉపయోగపడుతున్నప్పటికీ.. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు అధికంగా లబ్ధి చేకూరుతోంది. దీంతో ఖరీదైన చికిత్సలు అవసరమైన అభాగ్యులకు ఇవి వరంలా మారాయి. వ్యక్తిగతంగా చేస్తే సందేహాలు మన వారెవరైనా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ చికిత్సకు అవసరమైన డబ్బు మన దగ్గర లేనప్పుడు ఆన్లైన్ పేజ్‌లు తయారుచేసుకుని దాతల నుంచి విరాళాలు సేకరించవచ్చు. అలా ఓ రోగి తరపున పేజ్ సృష్టించిన వ్యక్తిని క్యాంపెయిన్ ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తారు. వ్యక్తిగతంగా పేజ్ తయారు చేసుకుంటే దాతలు సందేహించొచ్చు కాబట్టి అప్పటికే ఈ తరహా పేజ్‌లకు సపోర్ట్ చేసేందుకు కొన్ని క్రౌడ్ ఫండింగ్ వేదికలు అవతరించాయి. ఇవి కొంత రుసుము తీసుకుని బాధితుడి తరపున చారిటీ క్యాంపెయిన్ నిర్వహిస్తాయి. వాటినే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లంటారు. జాగ్రత్తగా...చేయూత చికిత్స కోసం నిజంగా అవసరమైన వారిని మాత్రమే తమ వేదికను వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వడం.. మరోవైపు దాతలిచ్చే విరాళాలు దుర్వినియోగం కాకుండా చూడటం అనే ఈ రెండు బాధ్యతలనూ క్రౌడ్ ఫండింగ్ వేదికలు నిర్వర్తిస్తాయి. దీని కోసం వీరు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరార్థులకు చెందిన ఆధార్, పాన్ తదితర గుర్తింపు కార్డులతోపాటు సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ని కూడా క్షుణ్నంగా తనిఖీ చేస్తారు. క్యాంపెయిన్ చేసేవారికీ లబ్ధిదారులతో ఉన్న అనుబంధం, రోగి ఐడీ, వ్యాధి, చికిత్స తాలూకు ధ్రువపత్రాలు, చికిత్సకు అయ్యే అంచనా వ్యయం.. వగైరా వివరాలు కచ్చితంగా సేకరిస్తారు. చికిత్స అందిస్తున్న సంబంధిత ఆసుపత్రి, వైద్యులతో కూడా రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారు. ఈ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ హైదరాబాద్ సహా పలు నగరాల్లో శాఖలు ఉన్నాయి. సిటీ ఆస్పత్రులతో ఒప్పందాలు మేము హైదరాబాద్ నుంచి వివిధ చికిత్సల కోసం 12 వేల క్యాంపెయిన్స్ నిర్వహించాం. బాధితులకు రూ.105 కోట్లు అందించాం. పుణెకు చెందిన వేదికా షిండా అనే బాలికకు అవసరమైన జీన్ రీప్లేస్మెంట్ థెరపీ కోసం సేకరించిన రూ.14.3 కోట్లే ఇప్పటిదాకా సేకరించిన వాటిలో అత్యధిక మొత్తం. ఇందులో 1.34 లక్షల మంది దాతలు పాల్గొన్నారు. రెయిన్బో, గ్లోబల్, కిమ్స్ తదితర 25 ప్రముఖ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుని పనిచేస్తున్నాం. మా ద్వారా సాయం కోరాలంటే Milaap.org వెబ్‌సైట్‌ను సందర్శించాలి లేదా facebook@milaap.orgకు మెయిల్ చేయాలి. –అనోజ్ విశ్వనాథన్, ప్రెసిడెంట్, మిలాప్ సెకనుకో విరాళం సెకనుకో విరాళం అనే స్థాయిలో విరాళాలు మా వేదిక ద్వారా అందుతున్నాయి. ఇప్పటిదాకా మేం రూ.1,500 కోట్ల ఫండ్ రైజింగ్‌కు తోడ్పడ్డాం. హైదరాబాద్ నుంచి కోవిడ్ సెకండ్ వేవ్‌లో రెండువేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయి. 150 ఆస్పత్రులతో కలిసి పనిచేశాం. తాజాగా హైదరాబాద్‌కి చెందిన మూడేళ్ల బాలిక ఆయాన్ట్ గుప్తాకు అవసరమైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ టైప్1 చికిత్స కోసం రూ.14.84 కోట్లు సేకరించాం. చికిత్స నిధుల కోసం www.impactguru.com/users/start&fundraiser ను సంప్రదించవచ్చు. –పీయూష్ జైన్, సీఈఓ, ఇంపాక్ట్‌గురు.కామ్ సెలబ్రిటీలూ స్పందించారు.. మా అబ్బాయి ఆయాన్ష్‌కు అయ్యే చికిత్సలో భాగంగా అందించాల్సిన ఒక ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు అని తెలియగానే అంత మొత్తం ఎలా తేవాలో తెలియక ఆందోళన చెందాం. అయితే ఆస్పత్రి సహకారంతోపాటు ఇంపాక్ట్ గురు క్రౌడ్ ఫండింగ్ చేయూతతో ఖరీదైన ఇంజెక్షన్‌ను మా అబ్బాయికి ఇప్పించగలిగాం. దీని కోసం 62,450 మంది దాతలు స్పందించడం మర్చిపోలేని విషయం. వీరిలో సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా ఉన్నారు. –యోగేష్ గుప్తా చదవండి: ఇదిగో మేమున్నాం.. మీకేం కాదు.. -
విషాదం: రూ.16 కోట్ల ఇంజక్షన్.. ఆ పాప ఇక లేదు
జైపూర్: రాజస్తాన్ బికనీర్‌కు చెందిన ఏడు నెలల చిన్నపాప నూర్ ఫాతిమా స్పైనల్ మస్కులర్ అట్రోపీ(ఎస్ఎమ్ఏ) వంటి అరుదైన వ్యాధితో బాధపడుతూ మంగళవారం ఉదయం మరణించింది. ఆ చిన్నారిని బతికించడానికి రూ. 16 కోట్ల విలువైన ఇంజక్షన్ మాత్రమే ఆధారం.సాధారణంగా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు చికిత్సల్లో భాగంగా రూ.22 కోట్ల విలువ చేసే ‘జొలెస్మా’ ఇంజెక్షన్ వాడాల్సి వస్తుంది.ఇది అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అయితే కేంద్రం రూ.6 కోట్లు దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. అయితే పాప తండ్రి జిసాన్ అహ్మద్ ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే కావడంతో తమ బిడ్డపై ఆశలు వదిలేసుకున్నారు. అయితే ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన అయాన్ష్ గుప్తా ఇదే వ్యాధితో బాధపడుతున్న వేళ క్రౌడ్ ఫండింగ్ పేరిట ఏడాది పాటు ఇంపాక్ట్ గురు సంస్థ ఆన్లైన్ వేదికగా రూ. 16 కోట్లు విరాళాలు సేకరించి ఆ బాబును బతికించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న జిసాన్ అహ్మద్‌కు మళ్లీ ఆశలు చిగురించాయి. దీంతో పాప ఇంజెక్షన్‌కు విరాళాలు సేకరించేందుకు తన మిత్రులు, సోషల్ మీడియా గ్రూఫ్లను సంప్రదించాడు. అలా ఇప్పటివరకు క్రౌడ్ ఫండింగ్ పేరిట రూ. 40 లక్షలు పోగయ్యాయి. కానీ దురదృష్టంకొద్ది ఆ చిన్నారి మంగళవారం కన్నుమూయడంతో విరాళం అందించిన వారు పాపను బతికించలేకపోయామని ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయమై.. పాప తండ్రి జిసాన్ అహ్మద్ స్పందించాడు. '' ఉదయం నాలుగు గంటల సమయంలో పాప బాగానే ఉంది. ఆకలితో ఏడ్వడంతో పాపకు పాలు పట్టిచ్చి మళ్లీ నిద్రపుచ్చాం. కానీ ఉదయం ఏడు గంటల సమయంలో పాపను లేపడానికి ప్రయత్నించగా.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులున్నట్లు గమనించాం. దీంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. కానీ పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు దృవీకరించారు. పాప ఇంజెక్షన్ కోసం క్రౌడ్ ఫండింగ్ పేరిట విరాళాలు అందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇంజెక్షన్‌కు రూ. 16 కోట్లు అవసరం కాగా.. ఇప్పటివరకు రూ. 40లక్షలు సేకరించాం. అయితే పాప చనిపోవడంతో మాకు విరాళం అందించిన వారికి డబ్బు తిరిగిచ్చేస్తాం.'' అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. చదవండి: 62,400 మంది దాతలు.. రూ.16 కోట్లు.. బాలుడికి పునర్జన్మ -
రెండేళ్ల కుమారుడి ఆరోగ్యం కోసం రూ.16 కోట్లు
సాక్షి, జూబ్లీహిల్స్(హైదరాబాద్): ప్రపంచమంతా కోవిడ్ మహమ్మారితో పోరాడుతుంటే హైదరాబాద్‌కు చెందిన యోగేష్‌గుప్తా దంపతులు తమ రెండేళ్ల కుమారుడు ఆయాంశ్‌గుప్తా ప్రాణం కాపాడుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. స్పైనల్ మాస్క్యులర్ ఆట్రోపి(ఎస్ఎమ్ఏ) టైప్–1 అనే ప్రమాదకర జబ్బుతో బాధపడుతున్న చిన్నారిని కాపాడుకోవడానికి దాదాపు రూ.16 కోట్లు ఖర్చు అవుతుందని డాక్టర్లు తేల్చిచెప్పారు. దీంతో దిక్కుతోచని యోగేష్.. ప్రసిద్ధ క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ ఇంపాక్ట్‌గురు.కామ్‌ను సంప్రదించాడు. ఇందుకు స్పందించిన సంస్థ ఆయాంశ్‌గుప్తా క్రౌడ్‌ఫండింగ్ క్యాంపెయిన్ ప్రారంభించింది. అజయ్‌దేవగన్, అనిల్‌కపూర్, రాజ్‌కుమార్‌రావు, ఆలియాభట్, దినేష్కార్తీక్ తదితర ప్రముఖులు సహా ప్రపంచ వ్యాప్తంగా 29వేల మంది స్పందించి ఇప్పటి వరకు రూ.6కోట్లను అందించినట్లు వెబ్సైట్ పేర్కొంది. ప్రస్తుతం బైపాస్ మెషీన్ ద్వారా అతి కష్టం మీద ఊపిరి పీల్చుకుంటున్న ఆయాంశ్‌కు విరాళాలు అందించి ప్రాణాలు కాపాడాలని సంస్థ విజ్ఞప్తి చేస్తోంది. -
ఇదిగో మేమున్నాం.. మీకేం కాదు..
సాక్షి, హైదరాబాద్ : గచ్చిబౌలికి చెందిన ఏడాది పసివాడు ఆకాశ్. ఎముకల చుట్టూ ఉన్న కణజాలాన్ని కబళించే అరుదైన కేన్సర్ బారిన పడ్డాడు. దుస్తుల దుకాణంలో పని చేసే తండ్రి వీరేశం అప్పటికే రూ. 6 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. మరే ఆధారం లేదు. ఆ బిడ్డ వైద్యం కోసం రూ.15 లక్షలు అవసరం. సరిగ్గా ఆ సమయంలోనే వైద్యుల సలహాతో ఉచిత క్లౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ‘మిలాప్’ లో జబ్బు వివరాలతో పాటు అందుకయ్యే ఖర్చు, వైద్యుల డయాగ్నసిస్ నివేదికలను అప్లోడ్ చేశారు. పసివాడి దయనీమైన ఫొటో మానవతామూర్తులను కదిలించింది. సాయం అందింది. బిడ్డ బతికాడు. ఒక్క ఆకాశ్ మాత్రమే కాదు. ఆపదలో,కష్టాల్లో ఉన్న ఎంతోమందికి మిలాప్ ఒక వేదికనిస్తోంది. పూర్తి ఉచితంగా, పారదర్శకంగా సేవలందజేస్తోంది. కూకట్‌పల్లికి చెందిన మరో రెండేళ్ల చిన్నారి విశాల్‌కు లివర్ మార్పిడికి మిలాప్ ప్రచార ఉద్యమం రూ. 24 లక్షల వరకు ఆర్జించి పెట్టింది. కోవిడ్ బారిన పడి ఐసీయూలో చేరిన ఎంతోమంది మిలాప్‌ను ఆశ్రయించి బాధలను విన్నవించుకున్నారు. స్పందించిన దాతలు సాయమందజేశారు. ఒక్క వైద్యమే కాదు. ఆపద ఎలాంటిదైనా సరే మిలాప్ ఉచిత క్లౌడ్ ఫండింగ్ సోషల్ ప్లాట్‌ఫామ్ ఒక వేదికకల్పిస్తోంది. ఒక కలయిక... ప్రతి కష్టానికి, ఆపదకు ఒక పరిష్కారం ఉంటుంది. కనుచూపు మేరలో ఉన్న దారులన్నీ మూసుకుపోయి, ఆ బాధల్లోంచి బయటపడేందుకు ఇక ఎలాంటి అవకాశం లేదని నిస్సహాయ స్థితికి చేరుకున్నప్పుడు...ఇదిగో మేమున్నాం‘ అంటూ ఎవరో ఒకరు వచ్చి ఆదుకున్నప్పుడు, ఆ బాధల సుడిగుండంలోంచి బయటకు తీసినప్పుడు అది ఒక పునర్జన్మే అనిపిస్తుంది. గొప్ప ఊరట లభిస్తుంది.కానీ అలాంటి దాతలు, ఇతరుల కష్టాలకు, బాధలకు స్పందించి చేయూతనందించే మానవతామూర్తులను చేరుకోవడమే పెద్ద సమస్య. ‘మిలాప్ క్లౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో దాతలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. అదే సమయంలో హైదరాబాద్‌లోని అన్ని ప్రధాన ఆసుపత్రులతో సమన్వయం చేసుకొని పని చేస్తున్నాం. దీంతో సామాజిక ప్రచార ఉద్యమం చక్కటి ఫలితాలనిస్తోంది.’ అని చెప్పారు ఆ సంస్థ సీఈవో మయూఖ్. వైద్యరంగంతోపాటు అన్ని రంగాల్లో... గత పదేళ్లుగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తోన్న మిలాప్ ఒక్క వైద్య రంగానికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఇప్పటి వరకు 20 వేల మందికి పైగా బాధితులకు ఆర్ధిక సహాయం అందజేసేందుకు వేదికకల్పించిందని చెప్పారు. స్కూళ్లు,కాలేజీల్లో ఫీజులు చెల్లించలేని నిరుపేదల పిల్లలకు చేయూతనిచ్చింది. పిల్లలను చదివించలేని ఒంటరి తల్లులకు ఉపాధి కల్పించింది. జంతువులు, పక్షులు, పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తున్న సామాజిక కార్యకర్తలు, స్వచ్చంద సంస్థలు కూడా మిలాప్ ద్వారా క్లౌడ్ ఫండింగ్ పొందినట్లు ఆయన పేర్కొన్నారు. ► ఇలా చేరుకోవచ్చు: ‘మిలాప్ డాట్ ఓఆర్జీ’ ద్వారా ఆ సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి వివరాలను నమోదు చేయాలి. -
30 వేలమంది అమ్మాయిలకు విద్యాదానం
‘అమ్మాయిలను విద్యావంతులను చేయండి’ అనే నినాదంతో పాటు వారి చదువు కోసం 12 ఏళ్లలో 3.25 కోట్ల నిధిని సమీకరించి, అవసరమైన వారికి అందజేసింది. తన పెళ్లికోసం జమ చేసిన డబ్బు ను కూడా నిరుపేదల చదువుకోసం కేటాయించింది 28 ఏళ్ల నిషితా రాజ్‌పుత్ వడోదర. ‘నా జీవితం పేద అమ్మాయిలను విద్యావంతులను చేయడానికే అంకితం’ అంటున్న నిషిత ఉంటున్నది గుజరాత్. ఆర్థిక లేమి కారణంగా అమ్మాయి ల చదువులు ఆగిపోకూడదన్న ఆమె ఆశయం అందరి అభినందనలు అందుకుంటోంది. ఈ సంవత్సరం 10 వేల మంది బాలికలకు ఫీజులు కట్టి, వారికి ఉన్నత విద్యావకాశాలను కల్పించిన నిషిత 2010లో 151 మంది అమ్మాయిలకు ఫీజులను కట్టడంతో ఈ సాయాన్ని ప్రారంభించింది. ప్రతి యేడాది ఈ సంఖ్యను పెంచుతూ వస్తోంది. గుజరాతీ అయిన నిషిత ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది అమ్మాయిల ఉన్నత విద్యకు ఫీజులు చెల్లించింది. తండ్రి సాయంతో .. ‘నా 12 ఏళ్ల వయస్సులో, నా క్లాస్మేట్ ఒక అమ్మాయి సడన్‌గా స్కూల్ మానేసింది. తను డబ్బు లేక చదువు ఆపేసిందనే విషయం చాలా రోజుల వరకు నాకు తెలియలేదు. ఆ పరిస్థితి మరి ఏ పేద అమ్మాయికీ రాకూడదనుకున్నాను. నా ఆశయానికి మా నాన్న నాకు అండగా నిలిచారు’ అని చెప్పింది నిషిత మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందన్న ప్రశ్నకు సమాధానంగా. నిషిత తండ్రి గులాబ్ సింగ్ వ్వాపారి. తండ్రి సాయంతో మొదట్లో తనకు తెలిసిన అమ్మాయిలకు ఫీజులు చెల్లిస్తూ ఉండేది. సంఖ్య పెరుగుతున్న కొద్దీ డబ్బు అవసరం మరింత పెరుగుతుందని అర్థం అయాక, తెలిసినవారి ద్వారా నిధులను సేకరించడం మొదలుపెట్టింది. అలా ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది అమ్మాయిలకు ఫీజులు చెల్లించింది. ఈ సంవత్సరం 10,000 మంది అమ్మాయిలకు ఫీజులు ఏర్పాటు చేసింది. పెళ్లికి దాచిన డబ్బు చదువులకు.. అమ్మాయిల చదువుకు అవసరమైనప్పుడు తన పెళ్లి కోసం దాచిపెట్టిన లక్షన్నర రూపాయలను 21 మంది అమ్మాయిల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. నిరుపేద అమ్మాయిల చదువుకు ఫీజు చెల్లించడమే కాకుండా, వారికి స్కూల్ బ్యాగులు, పుస్తకాలు,. పండుగ సందర్భాలలో బట్టలు అందజేస్తుంది. టిఫిన్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి, మహిళలకు ఉపాధిని ఇచ్చింది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులకు ఉచితంగా టిఫిన్లు పెట్టే సదుపాయాన్ని కల్పించింది. నిషిత చేసే సేవలో దేశంలోని ప్రముఖులు మాత్రమే కాదు, అమెరికన్ సంస్థలు కూడా జత చేరాయి. ఒక్క అడుగుతో నిషిత మొదలుపెట్టిన ఈ విద్యాదానానికి ఇప్పుడు ఎన్నో అడుగులు జత కలిశాయి. ‘ఈ విద్యాయజ్ఞంలో మేము సైతం...’ అంటూ కదలివస్తున్నాయి. నిషిత లాంటి యువత చేసే మంచి ప్రయత్నాలు ఎంతోమందికి జ్ఞానకాంతిని చూపుతూనే ఉంటాయి. -
తల్లి మాటతో.. కోట్లు సంపాదించాడు
టోక్యో: కరోనా వైరస్ విజృంభణతో ఎందరో ఉపాధి కోల్పోయారు. పట్టణాల్లో పని దొరకక చాలామంది స్వగ్రామాలకు చేరుకున్నారు. కానీ కొందరు ఔత్సాహికులు మాత్రమే కోవిడ్ కాలంలోనూ తమ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. ఈ కోవకు చెందిన వాడే జపాన్‌కు చెందిన యుటా సురుయోకా. కరోనా కాలంలో చాలామంది వ్యాపారాలు తలకిందులైతే.. యుటా మాత్రం దూసుకుపోయాడు. అయితే తాను వ్యాపారం ప్రారంభించడానికి కారణం తన తల్లే అంటాడు యుటా. ఆమె చేసిన వ్యాఖ్యలు తనలో ఆలోచన రగిలించాయని.. ఈ క్రమంలో స్థాపించిన కంపెనీ నేడు మహావృక్షమయ్యింది అంటున్నాడు యుటా. క్రౌడ్ ఫండింగ్ స్టార్టప్‌లో ఇంటర్న్‌గా ఉన్న సమయంలో యుటా తల్లి చిన్న దుకాణం నడుపుకునేది. ఈ క్రమంలో ఓ రోజు ఆమె తనకు కూడా ఆన్లైన్ స్టోర్ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడింది. కానీ తనకు అది సాధ్యం కాదని నిరాశ వ్యక్తం చేసింది. తల్లి మాటలు యుటాలో ఆలోచనలు రేపాయి. గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణదారులకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఇంటర్నెట్ షాపులను సృష్టించడానికి సహాయపడే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా అతను 2012 లో తన సొంత సంస్థ ‘బేస్ ఇంక్‌ను’ స్థాపించాడు. గత ఏడాది స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసిన నాటి నుంచి యుటా కంపెనీ షేర్ల విలువ ఆరు రెట్లు పెరిగింది. అయితే అక్టోబర్‌లో గరిష్ట స్థాయి నుంచి బాగా పడిపోయినప్పటికీ పెద్దగా నష్టం వాటిల్లలేదు. (చదవండి: ‘ట్విట్టర్ కిల్లర్’.. పర్మిషన్ తీసుకుని చంపాడు) ప్రస్తుతం యుటా కంపెనీ షేర్ల మార్కెట్ విలువ సుమారు 7 1.7 బిలియన్లకు పెరగడమే కాక అతడిని మల్టీమిలియనీర్‌గా చేసింది. ఒక హాబీగా స్టార్ట్ చేసిన ఈ కంపెనీ ప్రస్తుతం మల్టీమిలయన్ డాలర్ల విలువ చేస్తోంది. ఈ కంపెనీ ప్రధానంగా ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే వారికి సొంతంగా ఆన్లైన్ షాప్‌ని క్రియేట్ చేసుకునేందుకు సాయం చేస్తుంది. పేమెంట్ ప్రాసెసింగ్‌కు అవసరమైన టూల్స్‌ని అందిస్తుంది. హోల్సెల్లర్లకు మాత్రమే కాక రిటైలర్లకు కూడా ఈ సేవలను అందిస్తుండటం.. యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫామ్ కావడంతో అనతి కాలంలోనే ఈ యుటా బేస్ కంపెనీ ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించగలిగింది. ఇక బేస్ నిర్వహిస్తోన్న ఆన్లైన్ యాప్‌లో ప్రస్తుతం 7 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారంటే ఎంత బాగా రన్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక వెబ్సైట్ క్రియేట్ చేసినందుకు గాను టేస్ యూజర్ల దగ్గర నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయదు. కానీ అది ప్రొవైడ్ చేసే పేమెంట్ టూల్స్ నుంచి జనరేట్ అయ్యే రెవెన్యూలో వాటా తీసుకుంటుంది. (చదవండి: కోవిడ్ ఎఫెక్ట్... ఆరోగ్య బీమా జోరు!) ఇక యుటా ఓ కాలేజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతుండగా.. ఓ క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్‌ప్‌లో ఇంటర్న్‌షిప్ మొదలు పెట్టాడు. ఆ సమయంలో పేపాల్ వంటివి మంచి విజయం సాధించాయి. దాంతో యుటాకి దీని మీద ఆసక్తి ఏర్పడింది. అయితే సొంతంగా తానే ఓ బిజినేస్ చేస్తానని యుటా ఎప్పుడు అనుకోలేదు. తల్లి మాటలతో ఓ హాబీగా బేస్‌ని స్థాపించినప్పటికి అది కస్టమర్లను బాగా ఆకర్షించింది. ఇక కరోనా యుటాకి బాగా కలసి వచ్చింది. గతేడాది ఆగస్టు నాటికి బేస్ స్టోర్‌లో 8 లక్షల కంపెనీలు ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి వాటి సంఖ్య 1.2మిలియన్లకు పెరిగింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంతో అన్లైన్ వ్యాపారాలకు గిరాకీ బాగా పెరిగింది. దాంతో చాలా మంది రిటైలర్స్ బేస్‌లో ఆన్లైన్ స్టోర్లు క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇంత విజయం సాధించినప్పటికి యుటా ఏ మాత్రం పొంగిపోలేదు. తాను ఇప్పుడే వ్యాపారా ప్రపంచంలోకి అడుగుపెట్టానని... నేర్చుకోవాల్సింది చాలా ఉందంటాడు -
బిడ్డ కోసం ఓ తండ్రి ఆరాటం!
తిరువనంతపురం(కేరళ): మనం గెలిస్తే పది మందికి చెప్పుకొని మనం ఓడిపోయి ఒంటరిగా మిగిలితే మన భుజం తట్టి ప్రోత్సహించేవాడు నాన్న. మన భాద్యతను తను బతికున్నంత కాలం తీసుకునేవాడు నాన్న. ఫాదర్స్ డే సందర్భంగా తన కూతురి కోసం ఎంతో పోరాటం చేసి గెలిచిన ఓ నాన్న కథను తెలుసుకుందాం. అతని పేరు ఎస్ బైజు. తిరువనంతపురానికి చెందిన బైజుది రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం. అతని 8 సంవత్సరాల కూతురు అబిన బైజు ఆరోగ్యం పాడై అసుపత్రిలోచేరింది. (ఫాదర్స్ డే ఎలా వచ్చిందో తెలుసా!) అసలే లాక్డౌన్ కారణంగా మూడునెలల నుంచి పనిదొరక్క అల్లాడిపోతున్న అతడిపై పిడుగుపడినట్లు తన కూతురి కాలేయం పాడైందని, ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించాలని డాక్టర్లు చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియని ఆ తండ్రి ఎక్కని మెట్టులేదు, తొక్కని గడపలేదు. కానీ ఏ ఒక్కరూ అతని బాధను పంచుకోవడానికి ముందుకు రాలేదు. తన కూతురుకు సరిపోయే లివర్ దొరికిందని వెంటనే మారిస్తే పాప బతుకుందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యులు చెప్పారు. కానీ చేతిలో పైసా లేని ఆ తండ్రి ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నీరుగా విలపించాడు. అప్పుడు అక్కడే ఉన్న ఒక నర్సు క్రౌండ్ ఫండింగ్ సంస్థ గురించి తెలిపింది. దీంతో మిలాప్ క్రౌండ్ ఫండింగ్ సంస్థను అతడు కలిశాడు. (రేపొక్క రోజే ఏడు రోజులు) పాప ఆపరేషన్‌కు రూ. 20 లక్షలు అవసరం కాగా మిలాప్ సంస్థ రూ. 11,81,325 అందించింది. కొంత మంది దాతలు మరికొంత సాయం చేశారు. మిగిలిన డబ్బును పాపను చేర్పించిన కొచ్చి అస్టర్ మెడిసిటీ ఆసుపత్రి యాజమాన్యం ఇవ్వడానికి అంగీకరించింది. పాపను 21రోజుల పాటు ఐసీయూలో ఉంచారు. పాపకు మే మొదటివారంలో ఆపరేషన్ చేయగా మూడు వారాల పాటు ఐసీయూలో ఉంచారు. మరో మూడు నెలలు పాప ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. తన బిడ్డను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి బైజు ధన్యవాదాలు తెలిపాడు. -
కరోనా: వారి కోసం ‘క్రౌడ్ ఫండింగ్’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరో 20 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగనుంది. దీనితో రోజువారీ వేతనాల మీద ఆధారపడిన వారు, చిరువ్యాపారులు... ఇంకా అనేకమంది తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో వీరిని ఆదుకోవడానికి ప్రముఖ క్రౌడ్ ఫండింగ్ సంస్థ మిలాప్ ప్రత్యేక ఆన్లైన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ హైదరాబాద్ నగర ప్రతినిధులు తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా milaap.org/covid19 పేజీని ఏర్పాటు చేశామని, దీని ద్వారా సేకరించిన నిధులను అవసరార్థుల కోసం, చిన్న చిన్న ఆసుపత్రుల్లో వసతుల కోసం వినియోగిస్తామని వివరించారు. (రానున్న మూడు వారాలే అత్యంత కీలకం) రాచకొండలో కోవిడ్–19 కంట్రోల్ రూమ్ రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ సైతం బుధవారం అత్యవసర వేవల్ని అందించే వర్తక, వాణిజ్య, సేవల రంగాలకు చెందిన వారితో భేటీ అయ్యారు. వారికి ఉన్న ఇబ్బందులు, అవసరమైన సహాయ సహకారాలను చర్చించారు. కమిషనరేట్ పరిధిలోని వారి కోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా కోవిడ్–19 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 100తో పాటు 94906 17234, 94906 17111 నంబర్లలో వాట్సాప్ ద్వారా సంప్రదించాలని కోరారు. (అత్యవసర సేవలకు పాసుల జారీ) పోలీసుల కడుపునింపుతున్న అన్నదాత హిమాయత్‌నగర్: 24 గంటల పాటు తిండీ, ఆహారాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అన్నదానం చేస్తున్నాడో వ్యక్తి. ‘నారాయణి’ జ్యూవెలరీస్ అధినేత అమిత్ అగర్వాల్ నారాయణగూడ పోలీసుల కడుపు నింపుతున్నాడు. మధ్యా హ్నం, రాత్రి భోజన సదుపాయాన్ని అందిస్తున్నాడు. రోటీ, చపాతి, పప్పు, ఇతర ఆకు కూరగాయలతో చేసిన కూరలతో సుమారు ప్రతిరోజూ 100 మందికి పైగా అన్నదానం చేయడం విశేషం. (కోవిడ్ ముట్టఢీ రాష్ట్రాల కట్టఢీ) -
విషమం : సాయం చేసి ప్రాణాలు నిలపండి..!
ఓహియో/కొలంబస్ : చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు వ్యక్తులకు ఆర్థిక చేయూతనందించాలని ‘గో ఫండ్ మీ’ అనే స్వచ్ఛంద సంస్థ కోరింది. కారు ప్రమాదంలో ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీకి లోనైన అశోక్ అధికారి, సౌజన్య బండ ఆరోగ్యం విషమంగా ఉందని వెల్లడించింది. పెద్ద సంఖ్యలో జనం తమకు తోచినంత సాయం చేస్తే ‘ఆర్థిక అత్యవసర స్థితి’లో ఉన్న ఈ ఇద్దరి ప్రాణాలు నిలుస్తాయని తెలిపింది. ‘ఉన్నత చదువుల కోసం అమెరికా వచ్చిన అశోక్, వివాహిత సౌజన్య కుంటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. దాతలు ముందుకొచ్చి చేయూతనందిస్తే.. వారు కోలుకుంటారు. మీ వంతుగా సాయమందించడంతో పాటు ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు షేర్ చేసి చేయండి. ఆపదలో ఉన్నవారికి తమ వంతుగా ఫండ్స్ కలెక్ట్ చేసి ఇవ్వడమే మా కర్తవ్యం’అని గో ఫండ్ మీ తెలిపింది. మీ వంతు సాయాన్ని ఈ కింది లింక్ ద్వారా అందించండి : https://www.gofundme.com/f/critical-car-crash-ashok-and-soujanya?utm_source=customer&utm_medium=copy_link&utm_campaign=p_cp+share-sheet ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం.. ఆఫీస్ అనంతరం తన సహోద్యోగులు అశోక్ అధికారి, సౌజన్య బండను ఇళ్ల వద్ద దింపేందుకు నిఖిల్ గోపిషెట్టి తన కారులో ఎక్కించుకొని వెళ్తున్నాడు. అశోక్ ఇంటికి మరో నిముషంలో చేరుతామనగా బెతెల్ రోడ్డు (కొలంబస్)పై వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని రివర్సైడ్ మెథడిస్టు ఆస్పత్రికి తరలించారు. అఖిల్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కానీ, అశోక్, సౌజన్య తలకు తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా మారింది. మెదడుకు గాయాలు : రివర్సైడ్ మెథడిస్టు ఆస్పత్రి అశోక్, సౌజన్య ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీకి లోనవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తలకు బలమైన గాయాలతో పాటు సౌజన్యకు మడమ, చెవి భాగంలోనూ గాయాలయ్యాయి. ఆమె శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతోంది. అశోక్ వెన్నుపూస, భుజం, పక్కటెముకలు విరిగిపోయాయి. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అమెరికా రావాల్సిందిగా సమాచారమిచ్చాం. -
‘ఒక్క రూపాయి తీసుకోకుండా నటించారు’
ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై క్రౌడ్ ఫండ్ తో నిర్మించిన విభిన్న చిత్రం అంతర్వేదమ్. చందిన రవికిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా ఆడియోను సినీ ప్రముఖల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. నిర్మాత రాజ్ కందుకూరి ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీని నటుడు తనికెళ్ల భరణికి అందించారు. ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్రలో నటించిన తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ‘ఈమధ్యకాలంలో చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. వేరే రంగాల్లో విజయ కేతనం ఎగురవేస్తున్నప్పటికీ.. మానసిక సంతృప్తి కోసం సినిమా రంగంలోకి వస్తున్నారు. మంచి విజయం సాధిస్తున్నారు. యువత ఏదో పిచ్చి వేషాలు వేస్తున్నారు అంటున్నారు కానీ.. అంతర్వేదం సినిమాలో నటించినవారు కానీ.. యూనిట్ మెంబర్స్ కానీ అందరూ కొత్తవారే, సినిమా పట్ల వాళ్ళ ప్యాషన్, ప్రేమ చూస్తుంటే ముచ్చటేసింది’ అన్నారు. ముఖ్య అతిధిగా హాజరైన రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘యూనిట్ మొత్తంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమవుతున్న వాళ్ళందరూ మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకొంటున్నాను’ అన్నారు. దర్శకుడు చందిన రవికిషోర్ మాట్లాడుతూ.. ‘నేను చెప్పిన కథ నచ్చి తనికెళ్ళ భరణి గారు ముందు కోఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఫ్రీగా ఇప్పటివరకూ ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా వర్క్ చేశారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన అతిధులందరికీ పేరుపేరునా కృతజ్ణతలు తెలియజేసుకొంటున్నాను‘ అన్నారు. -
కాంగ్రెస్ క్రౌడ్‌ఫండింగ్
-
కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సమస్యల నేపథ్యంలో విరాళాల కోసం ప్రజల దగ్గర చెయ్యి చాచుతోంది. మీ వంతు సాయం చెయ్యండంటూ గురువారం సాయంత్రం అధికారిక ట్విటర్లో ఓ ప్రకటన చేసింది. ‘కాంగ్రెస్‌కు మీ సహకారం, మద్ధతు అవసరం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటే మాకు సాయం చెయ్యండి. మీకు తోచినంత సాయం చెయ్యండి’ అంటూ ట్వీట్లో పేర్కొంది. కాగా, కాంగ్రెస్ పార్టీకి గత కొన్నేళ్లుగా కార్పొరేట్ డొనేషన్లు భారీగా తగ్గిపోయాయన్న విషయం ఏడీఆర్(Association for Democratic Reforms) నివేదిక తెలియజేసింది. 2014 తర్వాత ఇది మరీ ఎక్కువైపోవటం.. పైగా అది వరుస ఎన్నికల్లో ప్రభావం చూపుతూ వస్తోందని ఆ నివేదిక పేర్కొంది. కాగా, 29 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. (కర్ణాటకలో జేడీఎస్ పొత్తు వేరే విషయం). 2016-2017 ఏడాదిగానూ రూ.225.36 కోట్లు విరాళాల రూపంలో పార్టీకి చేరిందంట. ఇక బీజేపీ రూ. 1,034 కోట్లతో ధనిక పార్టీగా నిలిచింది. ఇక కాంగ్రెస్ క్రౌడ్‌ఫండింగ్‌కు వెళ్తుందన్న విషయాన్ని ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఇన్ఛార్జీ రమ్య స్పందన, సీనియర్ నేత శశిథరూర్‌లు ముందస్తుగానే తెలియజేశారు. బుధవారం శశిథరూర్ తన ట్విటర్లో ఓ పోస్ట్ కూడా చేశారు. నిధుల సమస్యతో బాధపడుతున్న కాంగ్రెస్ ప్రజల సహకారం కోరటం తప్పని భావించటం లేదు. ఎందుకంటే బీజేపీ డబ్బు రాజకీయాలను ఎదుర్కోవాలంటే అది తప్పనిసరి అని థరూర్ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు నేతలకు నిధుల కోరతతో అలవెన్సులు సైతం రద్దు చేసినట్లు సమాచారం. మరో వైపు రమ్య కూడా ఆన్ లైన్ విరాళాల సేకరణ ద్వారా పారదర్శకత ఉంటుందనే విషయాన్ని గతంలో తెలియజేశారు. The Congress needs your support and help. Help us restore the democracy which India has proudly embraced since 70 years by making a small contribution here: https://t.co/PElu5R0mR6 #IContributeForIndia pic.twitter.com/XQ75Iaf7A6 — Congress (@INCIndia) 24 May 2018 -
తెలుగులోనూ క్రౌడ్ ఫండింగ్ మూవీలు వచ్చేస్తున్నాయ్
-
క్రౌడ్ ఫండింగ్‌తో ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: ఆర్థికంగా తగిన నిధులు లేక వైద్యం, విద్య, ఆటలో శిక్షణ వంటి వాటికి దూరమతున్న వారిని ఆదుకోవడానికి మిలాప్ పేరుతో ఒక క్రౌడ్ ఫండింగ్ సంస్థ ఏర్పాటైంది. సమస్యను సంస్థ దృష్టికి తీసుకువస్తే వివిధ వ్యక్తులు నుంచి నిధులను సేకరించి ఫీజులను నేరుగా చెల్లిస్తారు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఈ విధానాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంపై దృష్టిసారిస్తున్నట్లు మిలాప్ కో–ఫౌండర్ అనోజ్ విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా 200 మందికి రూ.2.5 కోట్ల నిధులను సేకరించి ఆర్థికసాయం చేసినట్లు తెలిపారు. మా సంస్థ దృష్టికి సమస్య రాగానే అది నిజమైనదో కాదో 24 గంటల్లో పరిశీలించిన తర్వాతనే నిధులను సేకరిస్తామన్నారు. ఇలా సేకరించిన నిధుల్లో 5 శాతం తాము ఫీజుగా తీసుకొని మిగిలిన మొత్తం హాస్పిటల్‌కు లేదా విద్యా సంస్థకు నేరుగా చెల్లించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం వివిధ హాస్పిటల్స్‌తో చర్చలు జరిపి ముందస్తుగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా రూ. 250 కోట్ల నిధులను సేకరించి ఆర్థికసాయం చేసినట్లు తెలిపారు. -
‘ఆమె జాక్‌పాట్ కొట్టింది’
వాషింగ్టన్ : జూలీ బ్రిస్క్‌మాన్.. అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు.. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మధ్యవేలు చూపించి తన అసహనాన్ని ప్రకటించిన మహిళ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వస్తుంది. రెండువారాల కిందట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వర్జీనియాలో గోల్ఫ్ ఆడి తిరిగి వెళుతున్న సమయంలో జూలీ.. ఆయన కాన్వాయ్‌ని వెంబడించి మరీ మధ్య వేలు చూపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జూలీని ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటినుంచి ఆమెకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో ఆమెకు ఆర్థిక అవసరాల నిర్వహణ కోసం ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న అకిమా.. సామాజిక మాధ్యమాల ద్వారా క్రౌడ్ ఫండింగ్‌ను సేకరించడం మొదలు పెట్టారు. ట్రంప్‌కు జూలీ మధ్యవేలు చూపిస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం..అదే సమయంలో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడంతో నెటిజన్లకు జూలీ మీద అభిమానం పొంగింది. దీంతో కేవలం 7 రోజుల్లోనే 70 వేల డాలర్ల ఫండ్ సమకూరాయి. ఈ మొత్తాన్ని కేవలం 3 వేల మంది దాతలు అందించడం విశేషం. క్రౌడ్ ఫండింగ్ ద్వారా లక్ష డాలర్లు సేకరించి ఆమెకు అందిస్తున్నట్లు అకిమా తెలిపారు. -
ఉక్కు మహిళ వినూత్న ఎత్తుగడ
ఇంఫాల్: ప్రత్యేక భద్రతా దళాలకు ఉన్నప్రత్యేక హక్కులకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాటం చేసిన ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల చాను ప్రస్తుత ఎన్నికల్లో కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు.16ఏళ్ల పోరాటానికి గత ఏడాది స్వస్తి పలికి రాజకీయనేతగా అవతరించి మణిపూర్ ఎన్నికల్లో పోటీచేస్తున్న షర్మిల సరికొత్త తీరుతో వ్యవహరిస్తున్నారు. పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్ (పీఆర్ జేయే) పార్టీతో ఎన్నికల బరిలో దిగిన ఇరోం ముఖ్యమంత్రి ఓకరం ఇబోబి సింగ్ ఢీకొంటున్నారు. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల నేపథ్యంలో ఆన్ లైన్ లోవిరాళాలు సేకరించాలని (క్రౌడ్ ఫండింగ్) చేయాలని ఆమె నిర్ణయించారు. మార్పు కోసం రూ.10ఇవ్వాలంటూ ఆమె ప్రజల్ని కోరుతున్నారు. ప్రజల నుంచి రూ.10 వసూలు చేయటం ద్వారా జనాలకు మరింత దగ్గర రావటంతోపాటు.. ఎన్నికల్లో మరింత పారదర్శకత తీసుకు రావటానికి సాయం చేస్తుందని ఆమె చెబుతున్నారు. అంతేకాదు ఇప్పటికే దాకారూ. 4.5 లక్షల సేకరించారు. ఎన్నికల కోసం ప్రజల నుంచి రూ.10 చొప్పున విరాళాలు వసూలు చేస్తున్నఏకైక ప్రాంతీయ రాజకీయ పార్టీ షర్మిలదనే చెబుతున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండటానికి.. వారి కష్టాల్ని తెలుసుకోవటానికి వీలుగా సైకిల్ మీదనే వెళ్లాలని భావిస్తున్నఆమె..తన పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులందరిని సైకిల్ మీదనే ప్రచారం చేయాలని కోరటం గమనార్హం. మరి.. షర్మిల అడిగినట్లుగా రూ.10 విరాళాల ప్రోగ్రాం ఏమేరకు సక్సెస్ అవుతుందో వేచిచూడాలి.