మనమే బాధలో ఉంటే అవతలివాళ్లకి సాయం చేయాలన్న ఆలోచనే రాదు. చాలామంది తమకే ఇంత పెద్ద కష్టం అంటూ దేవుడిని లేక విధిని తిడుతూ ఊసూరుమంటూ కూర్చుండిపోతారు. కానీ ఈ యువకుడు అందుకు భిన్నం. తాను ఒక క్యాన్సర్ పేషంట్ అయ్యి మరో క్యాన్సర్ పేషంట్ బతకాలని తపించాడు.
అసలు విషయంలోకెళ్తే...అమెరికాలోని రైస్ లాంగ్‌ఫోర్డ్ అనే యువకుడు ప్రతిభావంతుడైన అథ్లెట్. అయితే ఒక రోజు తన స్నేహితులతో కలసి చేసిన స్ప్రింట్ రేస్‌లో రైస్ కళ్లు తిరిగి పడిపోయాడు. అప్పుడే రైస్ ఆస్టియోసార్కోమా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. అతని కుడి కాలు తుంటిలో కంతిని గుర్తించిన వైద్యులు తొలగించే నిమిత్తం మొత్తం కాలుని తీసేశారు. దీంతో రైస్ జీవితాంతం కర్రల సాయంతోనే నడిచే పరిస్థితి ఎదురైంది.
అయితే అతని కుటుంబసభ్యులు మాత్రం రైస్ క్యాన్సర్‌ని జయించి బయటపడ్డాడని ఆనందించారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. రైస్‌కి శస్త్రచికిత్స జరిగిన కాలు మళ్లీ వాపు రావడం మొదలైంది. మళ్లీ క్యాన్సర్ తర శరీరంలో మరింతగా విజృభించడం మొదలైందని రైస్ గ్రహించాడు. ఈ క్రమంలో రైస్ జాకబ్ జోన్స్ అనే ఆరేళ కుర్రవాడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని తెలుసుకుని ఆ బాలుడికి సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు.
అందుకు రైస్ వ్యక్తిగతంగా సుమారు ఒక లక్ష రూపాయలు పొదుపు చేసి ఆ బాలుడి కుటుంబసభ్యులకు అందజేశాడు. అయితే ఇది అతని చికిత్సకు ఏ మాత్ర సరిపోదని భావించి ఆన్‌లైన్‌లో క్రౌడ్ ఫండింగ్ ఓపెన్‌చేసి ఆ బాలుడి కోసం దాదాపు రూ.61 లక్షలు సేకరించాడు. ఈ మేరకు రైస్ తన తల్లి కేథరిన్‌తో ...జాకబ్ ఆరేళ్ల తన జీవితంలో న్యూరోబ్లాస్టోమా అనే క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. అతను ఈ క్యాన్సర్‌ని జయించి త్వరితగతిన కోలుకోవాలని కోరుకుంటున్నా" అని తరుచుగా చెప్పేవాడు.
అంతేకాదు రైస్ సేకరించిన ఈ 61 లక్షలు డబ్బుని జాకబ్ కుటుంబ సభ్యులకు అందించిన తదుపరి అతను మరణించాడు. దీంతో జాకబ్ కుటుంబ సభ్యలు మాట్లాడుతూ..."రైస్ తానున్న పరిస్థితిని పక్కనపెట్టి జాకబ్ పట్ల అతను కనబర్చిన ప్రేమ, తెగువ, ధైర్యం నమశక్యంకానివి. రైస్ కారణంగానే జాకబ్ ఈ క్యాన్సర్‌తో పోరాడి కొత్త భవిష్యతును పొందగలిగే సువర్ణావకాశం కలిగింది" అని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ విషయం ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: ఇదో చెత్త ప్రశ‍్న.. ఇంటర్వ్యూలో యువతి షాకింగ్ రిప్లై.. వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment