సాక్షి, అమరావతి: ఆర్థికంగా తగిన నిధులు లేక వైద్యం, విద్య, ఆటలో శిక్షణ వంటి వాటికి దూరమతున్న వారిని ఆదుకోవడానికి మిలాప్ పేరుతో ఒక క్రౌడ్ ఫండింగ్ సంస్థ ఏర్పాటైంది. సమస్యను సంస్థ దృష్టికి తీసుకువస్తే వివిధ వ్యక్తులు నుంచి నిధులను సేకరించి ఫీజులను నేరుగా చెల్లిస్తారు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఈ విధానాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంపై దృష్టిసారిస్తున్నట్లు మిలాప్ కో–ఫౌండర్ అనోజ్ విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా 200 మందికి రూ.2.5 కోట్ల నిధులను సేకరించి ఆర్థికసాయం చేసినట్లు తెలిపారు.
మా సంస్థ దృష్టికి సమస్య రాగానే అది నిజమైనదో కాదో 24 గంటల్లో పరిశీలించిన తర్వాతనే నిధులను సేకరిస్తామన్నారు. ఇలా సేకరించిన నిధుల్లో 5 శాతం తాము ఫీజుగా తీసుకొని మిగిలిన మొత్తం హాస్పిటల్‌కు లేదా విద్యా సంస్థకు నేరుగా చెల్లించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం వివిధ హాస్పిటల్స్‌తో చర్చలు జరిపి ముందస్తుగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా రూ. 250 కోట్ల నిధులను సేకరించి ఆర్థికసాయం చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment