
అహ్మదాబాద్: ‘ఈ ఎన్నికల్లో నేను గెలవకుంటే మళ్లీ నాకు అవకాశం దక్కదు. నా సొంత ఠాకూర్ వర్గం సాధికారత సాధించేందుకే కాంగ్రెస్ టికెట్ సాధించా’ అంటున్నారు గుజరాత్‌లోని బనస్కాంత లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గెనీబెన్ ఠాకూర్. బనస్కాంత జిల్లా వావ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అయిన గెనీబెన్ ఎన్నికల ప్రచార నిధుల కోసం ‘క్రౌడ్ ఫండింగ్’ బాట పట్టారు.
ఆన్‌లైన్‌లో తన వినతికి బనస్కాంత ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని ఆమె చెప్పారు. గత 40 రోజుల్లోనే రూ.50 లక్షలవిరాళాలు అందాయన్నారు. తన ప్రచార వాహన నిర్వహణ ఖర్చులు భరిస్తామని కొందరు ముందుకొస్తే, వేదికల ఏర్పాటు ప్రచార సామగ్రి, ఆహార పదార్థాలు తదితరాలకయ్యే వ్యయం సమకూరుస్తామంటూ మరికొందరు చెప్పారని ఆమె శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment