thakurs
-
Geniben Thakor: ఎన్నికల నిధుల కోసం ‘క్రౌడ్ ఫండింగ్’
అహ్మదాబాద్: ‘ఈ ఎన్నికల్లో నేను గెలవకుంటే మళ్లీ నాకు అవకాశం దక్కదు. నా సొంత ఠాకూర్ వర్గం సాధికారత సాధించేందుకే కాంగ్రెస్ టికెట్ సాధించా’ అంటున్నారు గుజరాత్‌లోని బనస్కాంత లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గెనీబెన్ ఠాకూర్. బనస్కాంత జిల్లా వావ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అయిన గెనీబెన్ ఎన్నికల ప్రచార నిధుల కోసం ‘క్రౌడ్ ఫండింగ్’ బాట పట్టారు. ఆన్లైన్లో తన వినతికి బనస్కాంత ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని ఆమె చెప్పారు. గత 40 రోజుల్లోనే రూ.50 లక్షలవిరాళాలు అందాయన్నారు. తన ప్రచార వాహన నిర్వహణ ఖర్చులు భరిస్తామని కొందరు ముందుకొస్తే, వేదికల ఏర్పాటు ప్రచార సామగ్రి, ఆహార పదార్థాలు తదితరాలకయ్యే వ్యయం సమకూరుస్తామంటూ మరికొందరు చెప్పారని ఆమె శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో వెల్లడించారు. -
యూపీ చదరంగంలో కొత్త ఎత్తుగడలు
ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు బ్రాహ్మణ, ఠాకూర్ వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఇది ప్రత్యక్ష రాజకీయ యుద్ధంగా మారి బీజేపీకి తీవ్ర నష్టం జరగక ముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం పావులు కదపటం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ జనాభాలో 10 శాతంగా ఉన్న బ్రాహ్మణ వర్గం మొదటి నుంచీ బీజేపీకి సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉంది. అటువంటి ఓటుబ్యాంకును.. మరో బలమైన ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలు దూరం చేస్తున్నాయి. ఆయన ‘ఠాకూర్ వాదాన్ని’ ప్రమోట్ చేçస్తూ బ్రాహ్మణులను పైకి రాకుండా చేస్తున్నారనే విమర్శ ఉంది. దీంతో కాశీ కారిడార్ ప్రారంభ కార్యక్రమాన్ని మోదీ తనంతతానై నడిపించారు. మొత్తం మీద యూపీలో ఈ పరిస్థితులు చిక్కుముడులను తలపిస్తున్నాయి. అక్కడి రాజకీయ చదరంగంలోని చిక్కుముడులు విప్పడం అసాధ్యం అనిపిస్తోంది కూడా! ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ కుల చదరంగం వైపు చూపు సారిస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని కీలక దిగ్గజాలు, అప్రధానమైన బంట్లు పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అధిక సంఖ్యలో బీజేపీకి ఎంపీలను అందించిన ఉత్తరప్రదేశ్ (యూపీ)లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తలెత్తిన రైతుల ఆగ్రహ జ్వాలలను చల్లార్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఏకపక్షంగా ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తన ప్రసంగంలో పార్టీకి కలిగిన నష్టాన్ని పూడ్చుకునే ధోరణి కనిపించింది. వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించిన పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జాట్ రైతులు అధికంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆ ప్రాంతం నుంచి ఎక్కువ సీట్లు రావడం వల్లనే బీజేపీకి భారీ విజయం లభించింది. ముజఫర్‌నగర్ అల్లర్లు జరిగిన మరుసటి ఏడాదే జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ శక్తిని అనేక రెట్లు పెంచిన ప్రాంతం ఇది. పశ్చిమ యూపీలోని జాట్ల కోపాన్ని తగ్గించడానికి, సాధ్యమైతే వారిని తిరిగి తమ వైపు తిప్పుకోవడానికి మోదీ నూతన వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. పశ్చిమ యూపీలో హిందు– ముస్లింల మధ్య నెలకొని ఉన్న కొన్ని అగాథాలను ఈ రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమం కొంతవరకు పూడ్చగలిగింది. ఇప్పుడు రాష్ట్రం లోనూ, కే్రందంలోనూ అధికారంలో ఉన్న బీజేపీకి ఈ మారిన పరిస్థితులు ప్రతికూలమైనవని వేరే చెప్పనవసరం లేదు. అందుకే మోదీ వెంటనే కొత్త వ్యూహాలతో దిద్దుబాటు చర్యలకు తెరలేపారు. అక్టోబర్ 3వ తేదీన లఖింపూర్ ఖేరీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాచేసి ఇళ్లకు మరలిన రైతులను ఓ కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొట్టి నలుగురు రైతుల మరణానికి కారణం కావడం, ప్రతీకార దాడిలో ఓ జర్నలిస్ట్ మృతి చెందడం తెలిసిందే. రైతులను ఢీకొట్టిన ఒక వాహనం ఆ ప్రాంత బ్రాహ్మణ వర్గానికి చెందిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తేనీ కుమారునిదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన ఆ ఏరియాలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడు. అటువంటి నాయకుని కుమారునిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆ కేసును దర్యాప్తు చేయడానికి ఒక సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ వ్యవహారం కోర్టులకు చేరేటప్పటికి, సుప్రీం కోర్టు ఈ సిట్‌ను మానిటర్ చేయడం ప్రారంభించింది. అత్యున్నత న్యాయ స్థానం సిట్‌లో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను నియమించి దానిని మరింత శక్తిమంతం చేసింది. ఇప్పుడు సిట్ ‘ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర’ వల్లనే రైతు హత్యలు జరిగాయని నివేదిక ఇచ్చింది. దీంతో మంత్రి అజయ్ మిశ్రాకు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. నిర్లక్ష్య మైన ర్యాష్ డ్రైవింగ్ వల్ల రైతు మరణాలు సంభవించాయని పోలీ సులు ఎఫ్ఐఆర్లో మొదట్లో పేర్కొన్నారు. అయితే సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ ఆరోపణల స్థానంలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద హత్య, నేరపూరిత కుట్ర, మరి కొన్ని ఇతర సీరియస్ ఆరోపణలను చేర్చారు. త్వరలో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో.. బీజేపీలోని ఒక వర్గం నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను చంపడానికి కుట్ర పన్నిందని పేర్కొంటున్న ఈ కేసు బీజేపీ పాలిట పేలబోతున్న టైమ్ బాంబ్లా తయారైంది. సిట్ రిపోర్టు సంగతి ప్రస్తావించిన ఒక జర్నలిస్ట్‌పై సాక్షాత్తూ మంత్రి అజయ్ మిశ్రానే తీవ్ర పదజాలంతో మండిపడుతూ దాడిచేస్తున్న దృశ్యాలు ఉన్న వీడియో ఒకటి జనంలోకి వెళ్లిపోయింది. నిజానికి అక్టోబర్ 3న రైతు మరణాలు సంభవించడా నికి కొన్ని రోజుల ముందే రైతులను ఆయన బహిరంగ వేదిక మీద నుంచి బెదిరించారు. ఈ నేపథ్యంలో ఎలా చూసినా అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాల్సిందే! అప్పుడు రైతులను, ఇప్పుడు జర్నలిస్టులను భయపెట్టిన అజయ్ మిశ్రా మంత్రి పదవికి ఏమాత్రం అర్హుడు కాదు. బలమైన ఓటుబ్యాంకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఒక పక్క రైతుల్లోని ఒక వర్గాన్ని శాంతింపచేసే ప్రయత్నం చేస్తూనే.. మరోపక్క ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణత్వానికి ప్రతినిధిగా బీజేపీ కేంద్ర నాయకత్వం చూపుతూ వచ్చిన వ్యక్తి చేసిన నష్టాన్ని పరిహరిం చేందుకు బీజేపీ నడుం బిగించింది. యూపీ జనాభాలో 10 శాతం బ్రాహ్మణులే ఉన్నారు. వీరు సిద్ధాంతపరంగా బీజేపీకి అనుకూలురని పరిగణించడం కద్దు. కానీ యూపీలో మరో బలమైన ఠాకూర్ కులానికి చెందిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘ఠాకూర్వాదం’ లేదా ఠాకూర్ల ఆధిపత్యం పెరగడానికి ఇతోధికంగా మద్దతు ఇస్తున్నా డనే ఆరోపణతో బ్రాహ్మణ వర్గం బీజేపీకి దూరమవుతున్నట్లూ విమ ర్శకులు భావిస్తున్నారు. ఇందువల్ల యూపీలో బీజేపీకి ఉన్న సంప్ర దాయ ఓట్లు దూరమయ్యే అవకాశం ఉండటంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. బీజేపీకి యూపీలో 40 శాతం ఓట్లు ఉన్నాయి. ఆ పార్టీని ఓడించాలంటే మిగతా పార్టీలు అంతకన్నా ఎక్కువ ఓట్లు పొందాలి. అయితే ప్రస్తుతం ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం, ప్రధాన పార్టీలన్నీ దేనికది ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవాలని భావించ డంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితి బీజేపీకి అనుకూలించే అంశమే. యూపీలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), అఖిలేశ్ యాదవ్ అధినేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కన్నా వెనుకబడి ఉంది. అఖిలేశ్ అనేక చిన్న ఏక కుల పార్టీలతో పొత్తుపెట్టుకొని రేసులో ముందున్నారు. ప్రస్తుతం పోటీ ద్విముఖమే అనిపిస్తోంది. బీజేపీకి 10 శాతం ఓట్లు తగ్గితే అవి ఎస్పీ ఖాతాలో పడతాయని భావిస్తున్నారు (2017లో అఖిలేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన ఎన్నికల్లో ఎస్పీకి 22 శాతం ఓట్లే పోలవ్వడంతో ఆయన పదవిని కోల్పోయారు). దీంతో అక్కడ పరిస్థితి రసకందాయంలో పడింది. ప్రియాంక మేలుకొలుపుతో ఎస్పీకి లాభం పార్లమెంట్ సమావేశాల సమయంలో వెలువడిన సిట్ రిపోర్ట్ ప్రతిపక్షాలకు మంచి ఆయుధం అయింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపక్షాల దాడికి నాయకత్వం వహించారు. అదే సమయంలో ఆయన సోదరి ప్రియాంకా గాంధీ ఉత్తరప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటించి ఈ విషయంపై బీజేపీని ఎండగట్టారు. ఈ అంశం ద్వారా లబ్ధి పొందాలని ఆమె తీవ్రంగా ప్రయత్నించినా.. ప్రయోజనం మాత్రం ఎస్పీకే చేకూరుతుంది.. కాంగ్రెస్‌కు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి లేదని జనానికి తెలుసు. ఓడిపోయే పార్టీకి ఓటువేసి తమ ఓటును వ్యర్థం చేసుకోకూడదనే నియమాన్ని మన ఓటర్లు ఎటూ తప్పరు కాబట్టి.. గెలిచే పార్టీకే ఓటు వేస్తారు. ఆ విధంగా చూస్తే ప్రియాంక మేలుకొలుపు ఎస్పీకి లాభం చేకూర్చ బోతోంది. బీజేపీ ప్రచారంలో గమనించదగిన మరో విశేషం ఏమిటంటే.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాధాన్యాన్ని ప్రధాని మోదీ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించడం! ఇటీవల చోటుచేసు కున్న కాశీ కారిడార్ ప్రారంభోత్సవం ఒక రకంగా మతపరమైన వ్యవహారమే. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆ మతంలో యోగిగా గుర్తింపు పొందినవారు. కానీ ఈ కార్యక్రమంలో యోగి ఆదిత్య నాథ్‌ను పక్కన పెట్టి అంతా తానై కనిపించారు ప్రధాని మోదీ. ్రçపస్తుతం బీజేపీలో బలమైన ‘హిందూ హృదయ సమ్రాట్’ ఎవరు అనే పోటీ ఏర్పడితే కచ్చితంగా అది మోదీయే అని చెప్పడానికి వీలుగా కాశీ కారిడార్ ప్రారంభ కార్యక్రమం సాగింది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో పరిస్థితులు చిక్కుముడులను తలపిస్తున్నాయి. కొన్ని ముడులు విప్పడం అసాధ్యం అనిపిస్తున్నది కూడా! – సాబా నఖ్వీ, సీనియర్ జర్నలిస్ట్ -
హత్రాస్ ఉదంతం: పోలీసుల ఎదుటే బెదిరింపులు
లక్నో: హత్రాస్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాధితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మీడియాలో ఒక వీడియో తెగ వైరలవుతోంది. ఠాకూర్ల సామాజిక వర్గానికి చెందిన కొందరు ఎలాంటి భయం లేకుండా.. పోలీసుల ఎదుటే భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను బెదిరించారు. ఇక యోగి ప్రభుత్వం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చే వారికి అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. 144 సెక్షన్ విధించారు. గుంపులు గుంపులుగా చేరడాన్ని నిషేధించారు. చివరకు రాహుల్ గాంధీ, ప్రియాంకలను కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిండానికి వెళ్లిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌తో పాటు మరో 400 మందిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కానీ దారుణానికి పాల్పడిన నిందుతులకు మద్దతుగా 500 వ్యక్తులు చేరడమే కాక ఆజాద్‌ను బహిరంగంగా హెచ్చరించారు. అయితే పోలీసులు వీరి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. (చదవండి: బాధిత కుటుంబంపై కేసు పెట్టాలి) దీనిపై ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిందితులకు మద్దతుగా ఎలాంటి సమావేశాలు జరిపినా చర్యలు ఉండవు. బాధితురాలి కుటుంబం ప్రమాదంలో ఉంది. వారికి ప్రత్యేక భద్రత కల్పించండి’ అని డిమాండ్ చేశారు. ఇక గ్రామంలోని ఉన్నత కులస్తులు రాష్ట్రీయ సావర్న్ పరిషత్ అధ్వర్యంలో సమావేశం అయ్యారు. బాధితురాలి కుటుంబం సదరు వ్యక్తుల మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. యోగి ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. కానీ వారు మాత్రం నమ్మడం లేదు. రాజకీయాలు చేయడానికి ఇక్కడకు వచ్చారంటూ చంద్రశేఖర్ ఆజాద్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఓ వ్యక్తి ‘దెబ్బలను తట్టుకునేందుకు ఠాకూర్లు పుట్టారు.. బయటకు రండి మీ పెద్ద సోదరులు మిమ్మల్ని కలవడానికి ఇక్కడ ఉన్నారు రండి’ అంటూ భీమ్ ఆర్మీ నాయకుడిని ఆహ్వానించారు. -
గుజరాతేతరులపై దాడులకు పిలుపివ్వలేదు!
అహ్మదాబాద్ : గుజరాత్లో 14 నెలల చిన్నారిపై బిహార్ వలస కార్మికుడి లైంగిక దాడి నేపథ్యంలో చెలరేగుతున్న నిరసనలు, హింసాకాండ వలస కార్మికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. క్షత్రియ ఠాకూర్ సేన ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలో గుజరాతేతరులపై ఎలాంటి దాడులకు పాల్పడటం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ స్పష్టం చేశారు. వలస కార్మికులపై గుజరాత్లో మూక దాడులకు తాము ఎన్నడూ పిలుపివ్వలేదని, గుజరాత్లో శాంతి కోసం కృషిచేస్తున్నామని క్షత్రియ ఠాకూర్ సేనకు నేతృత్వం వహిస్తున్న అల్పేష్ పేర్కొన్నారు. గుజరాతేతరులు కూడా తమ సోదరులేనని, గుజరాత్లో శాంతియుతంగా మెలగాలని ఠాకూర్ అంతకుముందు తమ వర్గీయులకు విజ్ఞప్తి చేశారు. గుజరాతేతరులపై దాడులకు క్షత్రియ సేన ఎన్నడూ పిలుపు ఇవ్వబోదని స్పష్టం చేశారు. గత వారం సెప్టెంబర్ 28న సబర్కంత జిల్లాలోని హిమ్మత్‌నగర్ పట్టణ సమీపంలోని గ్రామంలో 14 నెలల పసికందుపై రవీంద్ర సాహు అనే బిహారీ వలస కార్మికుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు ఠాకూర్ వర్గానికి చెందిన బాలిక కావడంతో క్షత్రియ సేన సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. పుల జిల్లాల్లో బిహార్ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు, కార్మికులపై దాడులు జరిగాయి. నిందితుడు రవీంద్ర సాహును పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వరాదని క్షత్రియ ఠాకూర్ సేన డిమాండ్ చేసింది. -
అధికారులపై సీఎం యోగి కొరడా..!
షహరాన్‌పూర్‌లో సడలని ఉద్రిక్తత.. మొబైల్ ఇంటర్నెట్ బంద్! షహరాన్‌పూర్: దళితులు, రాజ్‌పుత్ వర్గాల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణలను అదుపు చేయడంలో విఫలమైన అధికారులపై ఉత్తరప్రదేశ్ సర్కారు కొరడా ఝళిపించింది. పశ్చిమ యూపీలోని షహరాన్పూర్కు చెందిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులను, ఓ ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేసింది. షహరాన్‌పూర్‌లో దళితులు, రాజ్‌పుత్ ఠాకూర్ల మధ్య కులవైరం తలెత్తి గత నెల రోజులుగా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. జిల్లాలోని షబ్బీర్‌పూర్ గ్రామంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి సభ నిర్వహించగా.. ఆ సభలో పాల్గొన్న దళితుడు ఒకరు బుధవారం హత్యకు గురయ్యాడు. మరో 20 మంది గాయపడ్డారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత మరింత తీవ్రస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన సీనియర్ ఎస్పీ ఎస్సీ దుబేను, జిల్లా కలెక్టర్ ఎన్పీ సింగ్‌ను యోగి సర్కారు సస్పెండ్ చేసింది. అంతేకాకుండా జిల్లా డీఐజీ జేకే సాహిపై కూడా వేటు వేసింది. షహరాన్‌పూర్‌లో హింసకు కారణమైన ప్రతి ఒక్కరిపైనా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని యోగి సర్కారు హెచ్చరించింది. సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో ప్రచారమవుతున్న వదంతులు, విద్వేష ప్రసంగాలను ప్రజలు నమ్మవద్దని, సంయమనంతో వ్యవహరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సీఎం యోగి కోరారు. అంతేకాకుండా షహరాన్‌పూర్‌లో విద్వేష వదంతులను అడ్డుకునేందుకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా రద్దుచేశారు. రాజ్‌పుత్ వంశస్తుడైన మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఈ నెల 5న ఠాకూర్లు షబ్బీర్‌పూర్‌లో నిర్వహించిన ఊరేగింపు పట్ల దళితులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఘర్షణ మొదలైంది. ఇక్కడ ఇరు వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో ఓ వ్యక్తి మరణించగా, 15 మంది గాయపడ్డారు. అప్పటినుంచి జిల్లాలో ఇరువర్గాల మధ్య దాడులు, ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
యూపీలో కుల సంఘర్షణ!
షహరాన్‌పూర్: ఠాకూర్, దళిత కులాల మధ్య ఘర్షణలతో ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్ జిల్లా అట్టుడుకుతోంది. మతపరంగా సున్నితమైన ఈ జిల్లాలోని పలుచోట్ల మంగళవారం మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఒకరు మరణించగా, కనీసం 20 మంది గాయపడ్డారు. జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షించి.. శాంతిభద్రతలను కాపాడాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. పోలీసులకు తోడుగా సీనియర్ అధికారులను కూడా నియమించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి పర్యటన సందర్భంగా జిల్లాలోని షబ్బీర్‌పూర్‌లో దాదాపు 12 ఠాకూర్ ఇళ్లకు కొందరు దుండగులు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ వర్గం వారిని శాంతింపజేశారు. ఆ గ్రామంలో మాయావతి పర్యటన ముగియగానే, కత్తులు,తుపాకులతో ఓ గుర్తుతెలియని మూక.. మాయావతి సభకు వచ్చిన బీఎస్పీ మద్దతుదారులపై దాడులకు తెగబడింది. బీఎస్పీ శ్రేణులు వెళుతున్న బోలేరో వాహనంపై మూక దాడి చేసి.. తుపాకులతో కాల్పులు కూడా జరపడంతో 24 ఏళ్ల ఆశిష్ ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. గత ఏప్రిల్ నెల నుంచి షహరాన్‌పూర్ జిల్లాలో కులపోరుతో హింస చోటుచేసుకుంటున్నది. రాజ్‌పుత్ వంశస్తుడైన మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఈ నెల 5న ఠాకూర్లు షబ్బీర్‌పూర్‌లో నిర్వహించిన ఊరేగింపు పట్ల ఓ దళితుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకొని.. ఓ వ్యక్తి మరణించగా, 15 మంది గాయపడ్డారు. అప్పటినుంచి జిల్లాలో ఇరువర్గాల మధ్య దాడులు, ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
‘న్యాయం చేయకుంటే మతం మారతాం’
అలిగఢ్: తమకు న్యాయం చేయకుంటే ముస్లిం మతంలోకి మారిపోతామంటూ అలిగఢ్‌లోని ఓ గ్రామానికి చెందిన దళితులు హెచ్చరించారు. ఉన్నత కులాలకు చెందినవారు తమపై దాడులు నిర్వహిస్తున్నా కూడా పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడం లేదని, సత్వరమే తమకు న్యాయం చేయకుంటే ముస్లిం మతంలోకి మారిపోతామంటూ స్పష్టం చేశారు. అలీగఢ్‌లోని కేశోపూర్ అనే గ్రామానికి చెందిన కొంతమంది దళితులకు మే 16న ఠాకూర్ అనే ఉన్నత కులస్తులతో ఘర్షణలు జరిగాయి. ఈ గొడవలో పలువురు దళితులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఠాకూర్లు కూడా ఫిర్యాదులు అందించారు. అయితే, పోలీసులు మాత్రం తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ఠాకూర్లను వెనుకేసుకొస్తున్నారని, వెంటనే తమకు న్యాయం చేయకుంటే కచ్చితంగా ముస్లిం మతంలోకి మారిపోతామని చెప్పారు.