‘న్యాయం చేయకుంటే మతం మారతాం’ | Dalit families in Aligarh village threaten to convert to Islam | Sakshi
Sakshi News home page

‘న్యాయం చేయకుంటే మతం మారతాం’

Published Mon, May 22 2017 7:09 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

‘న్యాయం చేయకుంటే మతం మారతాం’

‘న్యాయం చేయకుంటే మతం మారతాం’

అలిగఢ్‌: తమకు న్యాయం చేయకుంటే ముస్లిం మతంలోకి మారిపోతామంటూ అలిగఢ్‌లోని ఓ గ్రామానికి చెందిన దళితులు హెచ్చరించారు. ఉన్నత కులాలకు చెందినవారు తమపై దాడులు నిర్వహిస్తున్నా కూడా పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడం లేదని, సత్వరమే తమకు న్యాయం చేయకుంటే ముస్లిం మతంలోకి మారిపోతామంటూ స్పష్టం చేశారు. అలీగఢ్‌లోని కేశోపూర్‌ అనే గ్రామానికి చెందిన కొంతమంది దళితులకు మే 16న ఠాకూర్‌ అనే ఉన్నత కులస్తులతో ఘర్షణలు జరిగాయి.

ఈ గొడవలో పలువురు దళితులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఠాకూర్లు కూడా ఫిర్యాదులు అందించారు. అయితే, పోలీసులు మాత్రం తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ఠాకూర్లను వెనుకేసుకొస్తు‍న్నారని, వెంటనే తమకు న్యాయం చేయకుంటే కచ్చితంగా ముస్లిం మతంలోకి మారిపోతామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement