convert to Islam
-
‘న్యాయం చేయకుంటే మతం మారతాం’
అలిగఢ్: తమకు న్యాయం చేయకుంటే ముస్లిం మతంలోకి మారిపోతామంటూ అలిగఢ్‌లోని ఓ గ్రామానికి చెందిన దళితులు హెచ్చరించారు. ఉన్నత కులాలకు చెందినవారు తమపై దాడులు నిర్వహిస్తున్నా కూడా పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడం లేదని, సత్వరమే తమకు న్యాయం చేయకుంటే ముస్లిం మతంలోకి మారిపోతామంటూ స్పష్టం చేశారు. అలీగఢ్‌లోని కేశోపూర్ అనే గ్రామానికి చెందిన కొంతమంది దళితులకు మే 16న ఠాకూర్ అనే ఉన్నత కులస్తులతో ఘర్షణలు జరిగాయి. ఈ గొడవలో పలువురు దళితులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఠాకూర్లు కూడా ఫిర్యాదులు అందించారు. అయితే, పోలీసులు మాత్రం తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ఠాకూర్లను వెనుకేసుకొస్తున్నారని, వెంటనే తమకు న్యాయం చేయకుంటే కచ్చితంగా ముస్లిం మతంలోకి మారిపోతామని చెప్పారు. -
యువతిపై గ్యాంగ్ రేప్-ఇస్లామ్‌లోకి మార్పిడి
లక్నో/మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, బలవంతంగా ఇస్లాంమత మార్పిడి ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలపై నివేదిక సమర్పించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. యువతి ఆరోపణలపై కేంద్రం నివేదిక కోరినట్లు ఉత్తరప్రదేశ్ హోమ్ శాఖ అధికారి ఒకరు బుధవారం లక్నోలో చెప్పారు. ఆరోపణలపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ అంశంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని అఖిలేశ్ సింగ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హాపూర్‌కు చెందిన ఒక యువతి తన విధులు పూర్తి చేసుకొని ఇంటికి వెళుతుండగా, కొందరు యువకులు కిడ్పాప్ చేసి ఒక మథర్సాలోకి తీసుకువెళ్లారు. ఆ యువతిపై సామూహికంగా అత్యాచారం చేసి, ఆ తరువాత ఆమెను బలవంతంగా ఇస్లాంలోకి మతమార్పిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముజఫర్‌నగర్‌లోని ఒక మథర్సాలో ఇంకా 50 మంది బాలికలు బందీగా ఉన్నట్లు బాధితులు తెలపింది. ఈ కేసుని విచారిస్తున్నట్లు మీరట్ డిజిపి కె.సత్యనారాయణ చెప్పారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. బిజెపి నేతలు బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అండగా ఉంటామని చెప్పారు. ఈ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.