యువతిపై గ్యాంగ్ రేప్-ఇస్లామ్లోకి మార్పిడి
లక్నో/మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, బలవంతంగా ఇస్లాంమత మార్పిడి ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలపై నివేదిక సమర్పించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. యువతి ఆరోపణలపై కేంద్రం నివేదిక కోరినట్లు ఉత్తరప్రదేశ్ హోమ్ శాఖ అధికారి ఒకరు బుధవారం లక్నోలో చెప్పారు. ఆరోపణలపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ అంశంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని అఖిలేశ్ సింగ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హాపూర్కు చెందిన ఒక యువతి తన విధులు పూర్తి చేసుకొని ఇంటికి వెళుతుండగా, కొందరు యువకులు కిడ్పాప్ చేసి ఒక మథర్సాలోకి తీసుకువెళ్లారు. ఆ యువతిపై సామూహికంగా అత్యాచారం చేసి, ఆ తరువాత ఆమెను బలవంతంగా ఇస్లాంలోకి మతమార్పిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముజఫర్నగర్లోని ఒక మథర్సాలో ఇంకా 50 మంది బాలికలు బందీగా ఉన్నట్లు బాధితులు తెలపింది.
ఈ కేసుని విచారిస్తున్నట్లు మీరట్ డిజిపి కె.సత్యనారాయణ చెప్పారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. బిజెపి నేతలు బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అండగా ఉంటామని చెప్పారు. ఈ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.