Dalits
-
Chittoor: దళితులకు అవమానం.. కాళ్ల మీద పడి క్షమాపణలు కోరిన కలెక్టర్
చిత్తూరు, సాక్షి: సీఎం సొంత జిల్లాలో దళితులకు ఘోర అవమానం జరిగింది. జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా.. ప్రభుత్వ కార్యక్రమానికి దళితులకు ఆహ్వానం వెళ్లలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయా సంఘాల నాయకులు నిరసనకు దిగగా.. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరారు. బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకల్లో అధికారుల అలసత్వం బయటపడింది. అధికారిక కార్యక్రమాలకు దళితులకు ఆహ్వానం పంపించలేదు. కూటమి పాలనతో తాము నిర్లక్ష్యానికి గురౌతున్నామంటూ దళిత సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ఈ విషయమై సదరు కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. వాళ్ల ఆవేదన విన్న కలెక్టర్ సుమిత్.. అది కింది స్థాయి ఉద్యోగులు చేసిన తప్పిదమని, తప్పకుండా చర్యలు తీసుకుంటానంటూ దళిత సంఘాల నేతల కాళ్ల మీద పడి క్షమాపణలు కోరడంతో చివరకు శాంతించారు. -
బీసీల ఆలోచన ఆ పూటకే!
సాక్షి, అమరావతి: ‘‘ఈ బడుగు, బలహీన వర్గాల ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు... ఇప్పుడొచ్చారు.. సగం మంది వెళ్లిపోయారు. వారి ఆలోచన అంతా.. మీటింగ్ అయింది.. మా పని అయిపోయింది..! అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుబడుతున్నా.. మిమ్మల్ని కాదు.. అదే ఇక్కడున్న వాళ్లంతా ఉన్నారు.. వీళ్లకి ఓపిక ఉంది. బంగారు కుటుంబాలకు ఓపిక లేదు.. మార్గదర్శకులకు ఓపిక ఉంది. అంటే వాళ్లు నేర్చుకున్నారు. అది నేర్పాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే నేను పట్టుదలగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి జీవితాల్లో వెలుగులు తెస్తా..!’’ ఈ వ్యాఖ్యలు చూశారా..! 40 ఏళ్ల రాజకీయ అనుభవం, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు దళిత, బలహీన వర్గాల నుద్దేశించి ఆదివారం నిర్వహించిన పీ 4 సభలో మాట్లాడిన దారుణమైన మాటలివీ!! దళితులు, బడుగు, బలహీనవర్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో మళ్లీ నోరు పారేసుకున్నారు. బడుగు, బలహీనవర్గాల ఆలోచన ఆ పూట వరకే ఉంటుందని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు చెప్పినా కూడా ఆలోచించరని నిందించారు. వచ్చాం.. మీటింగ్ అయిపోయింది.. మా పని అయిపోయిందని అనుకుంటూ ఉంటారని.. వాళ్ల ఆలోచనా విధానమే తప్పని వ్యాఖ్యానించారు. పేదలను ధనికులను చేస్తానంటూ జీరో పావర్టీ పీ–4 పేరుతో నిర్వహించిన సభలోనే వారిపై తనకున్న ఏహ్య భావాన్ని ఆయన బయటపెట్టారు. గతంలోనూ చంద్రబాబు పలు సందర్భాల్లో ఎస్సీ, బీసీ వర్గాలను నేరుగా దూషించి వారి పట్ల తనకున్న చులకన భావాన్ని చాటుకున్నారు. దీనిపై ఎస్సీ, బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. చంద్రబాబుకు దళితులు, బీసీలంటే ఎప్పుడూ చులకన భావమేనని, తమను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేçస్తున్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..? అని గతంలో వారి పుట్టుకనే హేళన చేసిన హీనమైన భావజాలం చంద్రబాబుదని మండిపడుతున్నారు. నాడు తమ బాధలు చెప్పుకునేందుకు సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను.. ‘మీ తోకలు కత్తిరిస్తా..! తమాషాలు చేస్తున్నారా? మిమ్మల్ని ఇక్కడి వరకూ రానివ్వడమే తప్పు..’ అంటూ హూంకరించిన నిర్వాకం ఆయనదే. నేనిచ్చిన బియ్యం తింటున్నారు. నేనేసిన రోడ్లపై నడుస్తున్నారు... నాకెందుకు ఓటు వేయరు... అంటూ నంద్యాల ఉప ఎన్నికల ప్రచార సమయంలో బ్లాక్మెయిల్ తరహాలో పేదలను చంద్రబాబు బెదిరించారు. అందుకు అనుగుణంగానే టీడీపీ నేతలు దళితులు, బీసీల పట్ల తరచూ హీన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు, పదవులు..?’ అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక సభలో ఎస్సీల పట్ల అవమానకరంగా మాట్లాడటం తెలిసిందే. ‘ఎస్సీలు శుభ్రంగా ఉండరు. వాళ్లు దగ్గరకు వస్తే వాసన వస్తుంది. వాళ్లకి చదువు రాదు..’ అంటూ టీడీపీలో ఉండగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దారుణంగా మాట్లాడారు. తాజాగా చంద్రబాబు వారి పట్ల తనకున్న చులకన భావాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. బడుగు, బలహీన వర్గాలకు అసలు ఆలోచనలే ఉండవని, డబ్బులు ఇస్తే మీటింగ్‌కు వస్తారనే రీతిలో అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. పేదలను గొప్పోళ్లను చేస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ తన ప్రసంగం వినలేక వెళ్లిపోతున్న వారిని చూసి చంద్రబాబుకు కోపం కట్టలు తెంచుకుంది. వారి పట్ల తన మనసులో ఉన్న మాటను వెళ్లగక్కి బడుగులంటే తనకు ఏమాత్రం గిట్టదని మరోసారి రుజువు చేసుకున్నారు.చరిత్రలో ఎవరూ చేయలేదు..పేదరికం లేని సమాజం కోసం పీ–4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇది వినూత్న కార్యక్రమమని, కొత్త ప్రయోగమని, ఇంతవరకూ చరిత్రలో ఎవరూ అమలు చేయలేదని తెలిపారు. వెలగపూడి సచివాలయం సమీపంలో నిర్వహించిన సభలో జీరో పావర్టీ పీ–4 కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. పథకం లోగో, పోర్టల్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. శాయోజీరావు సహాయం వల్లే అంబేడ్కర్ ఎదిగారని, శివసుబ్రహ్మణ్యం అయ్యర్ వల్ల అబ్దుల్ కలాం ముందుకెళ్లారన్నారు. కలాంను రాష్ట్రపతిని చేయడంలో తన పాత్ర కూడా ఉందన్నారు. ఎన్టీఆర్ లేకపోతే తాను కూడా అందరిలా మామూలుగానే ఉండేవాడినన్నారు. హైదరాబాద్ దశ, దిశ మారడానికి తాను చేసిన ఆలోచనలే కారణమన్నారు. పీ–4 గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. ఇప్పటికీ పైకి రాని కుటుంబాలు 20 శాతం ఉన్నాయని, మార్గదర్శులుగా ఉండేవారు బంగారు కుటుంబాలతో కలసి పని చేయాలన్నారు. తలసరి ఆదాయం 2028–29 నాటికి రూ.5.42 లక్షలు, 2047కి రూ.55 లక్షలు చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. టాప్ టెన్‌లో ఉన్న పది శాతం శ్రీమంతులు అట్టడుగున్న ఉన్న 20 శాతం మందిని పైకి తెచ్చే బాధ్యత తీసుకోవాలని సూచించారు. పవన్ దొరకడం నా అదృష్టం..2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ 2.0 సాధించడమే తన లక్ష్యమని, పీ–4 అందుకు మార్గదర్శి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆగస్టు 15 నాటికి ఈ కార్యక్రమాన్ని ఒక రూపం తీసుకొచ్చి మళ్లీ ఉగాది నాటికి ప్రగతిని ప్రజలకు వెల్లడిస్తామన్నారు. 2029కి రాష్ట్రం జీరో పావర్టీలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే ప్రపంచమే ఆచరించే పరిస్థితికి వస్తుందన్నారు. పవన్ కల్యాణ్ లాంటి మిత్రుడు దొరకడం తన అదృష్టమని, ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు రెండు మూడు తరాల కోసం ఆలోచిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాగా 20 లక్షల బంగారు కుటుంబాలను పైకి తెచ్చే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన విధాన పత్రంలో తెలిపింది. సంపన్న కుటుంబాలు పీ 4 ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయి కనీసం ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుని మార్గదర్శి కుటుంబంగా నిలవాలని కోరింది. ⇒ మంగళగిరికి చెందిన గొర్రెల పెంపకందారు కడియం నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా, విజయవాడకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయేల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా పీ 4 పథకం ప్రారంభం సందర్భంగా ప్రకటించారు. నరసింహ తన పిల్లల్ని చదివించాలని కోరగా గ్రీన్కో ఎనర్జీ అధినేత చలమలశెట్టి అనిల్‌కుమార్ మార్గదర్శిగా ముందుకొచ్చారు. ఇమ్మాన్యుయేల్ తన కూతుర్ని ఎంబీబీఎస్ చదివించాలని కోరగా మెయిల్ సంస్థల అధినేత మేఘా కృష్ణారెడ్డి వారికి మార్గదర్శిగా ముందుకొచ్చారు. కృష్ణా జిల్లాలోని తన సొంత మండలం గుడ్లవల్లేరు బాధ్యత మొత్తం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.ఇంత హీనంగా మాట్లాడతారా? పేదల విషయంలో మొదటి నుంచి చంద్రబాబుది ఫ్యూడలిస్టు భావజాలమే. ఎస్సీలు, బీసీల పట్ల ఆయన మాటలు, చేతలు ఎప్పుడూ లోకువగానే ఉంటాయి. బడుగు, బలహీనవర్గాల గురించి అంత హీనంగా మాట్లాడడం సరికాదు. వారికి ఆలోచనలు లేవని చెప్పడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అలాంటి మాటలు మాట్లాడతారా? ఇప్పుడే కాదు.. అనేక సందర్భాల్లో ఎస్సీలు, బీసీల గురించి తక్కువగా మాట్లాడారు. ఆయనకిది తగదు. వెంటనే దళితులు, బడుగు వర్గాలకు క్షమాపణ చెప్పాలి. – చింతపల్లి గురుప్రసాద్, బహుజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడుబాబులో రెండో వ్యక్తి బయటకొచ్చాడు చంద్రబాబు చేతలకి, మాటలకి పొంతన ఉండదు. పేదలను ఎప్పుడూ అవమానిస్తారు. ఇప్పుడు మరోసారి అవమానించారు. ఎస్సీలు, దళితులంటేనే ఆయనకు పడదు. పేదల కోసమని నిర్వహించిన సభలో జనం వెళ్లిపోతున్నారని సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏమిటి? చంద్రబాబులో రెండో వ్యక్తి బయటపడ్డాడు. ఆయన్ను దళిత, బీసీలు నమ్మకూడదు. ఆయన తన మాటలను ఉపసంహరించుకోవాలి. – నత్తా యోనారాజు మాల మహానాడు నాయకుడుగుణపాఠం తప్పదు పేదలకు మేలు చేయకపోగా వారి గురించి తరచూ అవమానకరంగా మాట్లాడడం చంద్రబాబుకే చెల్లింది. పీ–4 మీటింగ్ అని పిలిచి ఒక్కరికి మేలు చేయకపోగా తిట్లు బహుమతిగా ఇస్తారా? బీసీ, ఎస్సీలను తిట్టడానికి బహిరంగ సభ పెడతారా? పేదల గురించి ఇంత అన్యాయంగా మాట్లాడిన రాజకీయ నాయకుడు దేశంలో మరొకరు లేరు. వారికి ఆలోచనలే లేవని అనడం అహంకారం. త్వరలోనే బీసీలు, ఎస్సీలు ఆయనకు గుణపాఠం చెబుతారు. – ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రిపేదలు తన బానిసలుగా ఉండాలనే ఆలోచన బాబుది పేదలు ఎప్పుడూ తమ బానిసలుగా ఉండాలనే ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు. జీరో పావర్టీ పీ–4 సభలో దాన్ని బయటపెట్టారు. ఎస్సీ, బీసీల గురించి అంత నీచంగా మాట్లాడడం దారుణం. గతంలోనూ ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని నీచంగా మాట్లాడారు. పేదలు ఎప్పుడూ తమ కాళ్ల దగ్గరే ఉండాలనే ఆలోచన చంద్రబాబుది. – కైలే అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేఅసలు మనిషి బయటపడ్డాడు.. చంద్రబాబులోని అసలు మనిషి పీ–4 మీటింగ్‌లో బయటపడ్డాడు. వారి కోసమని మీటింగ్ పెట్టి తిట్టడం ఏమిటి? సభకు వచ్చిన జనం వెళ్లిపోతుంటే ఇష్టం వచ్చినట్లు తిడతారా? పేదలు కూడా సంపన్నుల్లా అలోచించాలని చెప్పి వారిని తిట్టడం అన్యాయం. బీసీలు, ఎస్సీలను చంద్రబాబు ఎప్పుడూ గౌరవించలేదు. అనేకసార్లు అవమానించారు. ఇప్పుడు మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. – జోగి రమేష్, మాజీ మంత్రి -
300 ఏళ్ల కులవివక్షకు ముగింపు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో మూడు దశాబ్దాల కులవివక్షకు దళితులు ముగింపు పలికారు. 300 ఏళ్ల తరువాత 130 దళిత కుటుంబాలు తమ ఇష్టదైవం ఆలయంలోకి ప్రవేశించాయి. పూర్బా బర్ధమాన్ జిల్లాలోని గిద్దేశ్వర్ శివాలయం ఈ చారిత్రాత్మక సన్నివేశానికి వేదికైంది. కత్వా సబ్ డివిజన్లోని గిద్‌గ్రామ్ గ్రామంలోని దస్పార ప్రాంతానికి చెందిన ఐదుగురు సభ్యుల బృందం బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఆలయం మెట్లు శివలింగంపై పాలు, నీరు పోసి మహదేవునికి అభిషేకం చేశారు. దాస్ ఇంటి పేర్లు కలిగిన దళిత కుటుంబాలు చెప్పులు కుట్టడం, నేత సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే స్థానికంగా ఉన్న గిద్దేశ్వర్ శివాలయం 300 ఏళ్ల కిందట స్థాపించారు. అప్పటి నుంచి వీరికి ఆలయంలోకి ప్రవేశం లేదు. శివుడిని పూజించేందుకు అనుమతించాలని మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా కూడా వారు పూజలు చేయడానికి ప్రయత్నించగా వారిని ఆలయ ప్రాంగణం నుంచి తరిమివేశారు. అంతేకాదు దాదాపు గ్రామ బహిష్కరణ చేశారు. వారికి నిత్యావసర వస్తువులు అమ్మడంతో పాటు వారి నుంచి పాలవంటివి కొనడం మానేశారు. దీంతో దళితులు స్థానిక యంత్రాంగం, పోలీసుల సహాయం కోరారు. దస్పారా గ్రామస్తులతో పలుమార్లు చర్చలు జరిపిన పోలీసులు.. సమస్యను పరిష్కరించారు. అంతేకాదు దళితుల నుంచి పాలను కూడా సేకరించాలని పాలకేంద్రాలను పోలీసులు ఆదేశించారు. అలా యంత్రాంగం, పోలీసుల జోక్యంతో వందల ఏళ్ల అణచివేతను ఎదిరించిన దళితులు బుధవారం ఆలయంలో పూజలు చేశారు. పూజలు చేసే హక్కు లభించినందుకు సంతోషంగా ఉందని, అందరూ బాగుండాలని దేవుడిని కోరుకున్నానని సంతోష్ దాస్ అనే వ్యక్తి తెలిపారు. అయితే ఈ సంతోషం తాత్కాలికమా? దీర్ఘకాలికమా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు, యంత్రాంగం ఉండగా కిమ్మనకుండా ఉన్న గ్రామస్తులు.. వాళ్లు వెళ్లిపోయాక కూడా తమను అనుమతిస్తారా? అని దళితులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వారి సందేహాలకు ఊతమిస్తూ ఆలయ సేవకుడు సనత్ మండల్ మాత్రం ఈ నిర్ణయాన్ని విముఖతతోనే అంగీకరించారు. ఆలయంలోకి దళితులు ప్రవేశిస్తే ఆలయ పురాతన సంప్రదాయాలు, స్వచ్ఛత, పవిత్రత పెద్ద ప్రశ్నలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆలయంలోకి దళితుల ప్రవేశంతో పెద్ద ప్రతిష్టంభన తొలగిందని ఇది స్వాగతించాల్సిన విషయమని తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అపూర్వ ఛటర్జీ అన్నారు. -
పారదర్శక విచారణ జరగాలి
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో 2017లో దళితులపై దాడి జరిగిన ఘటనపై విచారణ పారదర్శకంగా సాగాలని బాధితుల్లో ఒకరైన కోలా హరీశ్ పేర్కొన్నారు. ఈ మేరకు హైకోర్టులో విచారణ సాగుతున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో తనను ఇంప్లీడ్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నాటి కేసులో వాస్తవాలు తెలియాలంటే తన వాదనలు కూడా వినాలని కోరారు. అలాగే, న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. సిరిసిల్ల జిల్లా చీర్లవంచ, కొదురుపాక ప్రాంతాల నుంచి వందలాది ఇసుక లారీలు టిప్పర్లు నడిచేవి. ఈ క్రమంలోనే 2017, జూలై 2న నేరెళ్లకు చెందిన ఎరుకల భూమయ్యను ఇసుక లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు ఐదు ఇసుక లారీలను తగలబెట్టారు. దీంతో పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ జరగ్గా.. 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత రాత్రి 11:30 గంటలకు నేరెళ్లకు చెందిన పెంట బానయ్య, కోలా హరీశ్, చెప్పాల బాలరాజు, పసుల ఈశ్వర్ కుమార్, గంధం గోపాల్, రామచంద్రాపూర్‌కు చెందిన భక్తుల మహేశ్, జిల్లెలకు చెందిన కోరుకొండ గణేశ్, చీకోటి శ్రీనివాస్‌లను పోలీసులు అనుమానితులుగా అదుపులోకి తీసుకొని, జూలై 7న అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. ఎస్ఐ తప్పు లేదని విచారణలో తేలింది ఈ ఘటనలో బాధితులను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని, బాధ్యులైన ఎస్పీ విశ్వనాథ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవీందర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉప్పల్‌కు చెందిన గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన పిల్‌తో పాటు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ రాసిన లేఖతో మరో పిల్ దాఖలైంది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రాధారాణి ధర్మాసనం బుధవారం వి చారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది డి.సురేశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ మంగళవారం అందిందన్నారు. దీనిపై వివరాలు తెలుసుకుని, బదులివ్వడానికి 15 రోజుల సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 27కు వాయిదా వేసింది. అయితే, సదరు ఎస్ఐ ఎలాంటి తప్పు చేయలేదని విచారణాధికారి నివేదిక ఇచ్చారని, దీంతో సస్పెన్షన్‌ను ఉపసంహరించుకున్నామని అఫిడవిట్లో ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. -
మా ముందు చెప్పులతో నడవొద్దు!
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘మా వీధుల్లో మీరు తిరగకూడదు.. మా ముందు చెప్పులు వేసుకుని నడవకూడదు.. దళితులు ఊర్లోనే ఉండకూడదు.. ఖాళీచేసి వెళ్లిపోండి’.. అంటూ టీడీపీ నేతలు దళితులపై విరుచుకుపడ్డారు. సిమెంటు రోడ్డు నిర్మాణ విషయమై టీడీపీ వారికి, సర్పంచ్‌కు మధ్య వివాదం ఏర్పడడంతో ‘పచ్చ’మూకలు అధికార బలంతో ఇలా పేట్రేగిపోయారు. ఇది చినికి చినికి గాలివానగా మారి దాడులకు దారితీసింది. టీడీపీ నేతలు మండల ప్రధాన కార్యదర్శి, మరికొందరు చేసిన ఈ వ్యాఖ్యలపై దళితులూ తిరగబడ్డారు.ఈ ఘటన చిత్తూరు జిల్లా, నగరి మండలం, తడుకుపేట గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ దాడుల్లో దళితవాడకు చెందిన విక్కీ (20), సంతోష్ (17), ప్రవీణ్‌కుమార్ (23), శ్రీధర్ (27), రమేష్ (43), శ్రీశాంత్ (18), సిద్ధు (14)తో పాటు వీరికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీకి చెందిన గోపి (45)కి గాయాలయ్యాయి. టీడీపీకి చెందిన మండల ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు, రాజేష్ కూడా గాయపడ్డారు. అయితే, గాయపడ్డ దళితులను, వైఎస్సార్సీపీ వారిని ఇళ్లలోనే నిర్బంధించిన టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ నేతలే తమపై దాడిచేశారంటూ రాస్తారోకో చేసి వాహనాలను రోడ్డుపై ఆపేసి హంగామా చేశారు. ఒకవైపు రాస్తారోకో చేస్తూనే మరోవైపు టీడీపీ రౌడీమూకలు దళితులకు చెందిన ఆరు బైక్‌లను కాల్చేశారు. కానీ, దళితులు, వైఎస్సార్సీపీ నేతలు 13 మందిపై కేసులు నమోదు చేశారు. మరికొందరిని కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, నిర్బంధంలో ఉన్న దళితులు శుక్రవారం ఉదయం బయటకు రాగానే వారికి జరిగిన అన్యాయం కూడా వెలుగుచూసింది. మాపై దాడిచేసి వారే నిరసనలు చేస్తున్నారు : దళిత మహిళల ఆందోళన నిజానికి.. తమపై దాడిచేసిన టీడీపీ వారే నిరసనలకు దిగడం విడ్డూరంగా ఉందని దళిత మహిళలు మండిపడ్డారు. ఊర్లో దళితులు తిరగకూడదంటూ టీడీపీ నేతలు హుకుం జారీచేస్తున్నారని.. వాళ్ల ముందు చెప్పులు వేసుకుని నడవకూడదని, చెప్పులు తలపై పెట్టుకుని వెళ్లండని దౌర్జన్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. పిల్లలకు పాల ప్యాకెట్ తీసుకురావడానికి ఊర్లోకి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఉందని.. తమ పిల్లలు పాఠశాలకు వెళ్తే వారిని తిరిగి పంపేశారని, ఇదేం న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక దళితవాడకు చెందిన ఐదుగురు యువకులు కనిపించడంలేదని, వారెక్కడున్నారో తమకు తెలియాలన్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్నదమ్ముల్లా కలిసిమెలిసి తిరిగామని టీడీపీ అధికారంలోకి రావడంతో సమస్యలు మొదలయ్యాయన్నారు.రోడ్లపై వెళ్తుంటే చెప్పులతో కొట్టడానికి వస్తున్నారని, బూతులు తిడుతూ వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. తామేం చెయ్యలేమంటూ పోలీసులు చేతులెత్తేస్తున్నారని.. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. కలెక్టర్, ఎస్పీ తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. నా కొడుకు ఏమయ్యాడో.. రాత్రి నుంచి నా కొడుకు కార్తీక్ కనిపించడంలేదు. ఏమయ్యాడో వాడిని ఏంచేశారో తెలీడంలేదు. తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతోంది. దళితులు ఈ బాధలన్నీ అనుభవించాలా? అధికారులు దయచేసి నా కొడుకును నా వద్దకు పంపండి. – నీలవేణి, తడుకుపేట దళితవాడ ఊర్లో ఉండకూడదంటే మేం ఎక్కడికెళ్లాలి? దళితులు ఊర్లోనే ఉండకూడదంటే మేం ఎక్కడికెళ్లాలి? నడిరోడ్డుపై కూర్చున్న టీడీపీ నేతలు దళితులు ఊర్లోనే ఉండకూడదంటూ అరుస్తూ నిరసనలు చేస్తుంటే వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? ప్రభుత్వం వారిది.. మేమేమీ చెయ్యలేమని పోలీసులే చెబుతున్నారు. మా మామను కొట్టేశారు మాకు దిక్కెవరు? – సుప్రియ, తడుకుపేట దళితవాడ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ పరిస్థితిలేదు.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదు. అందరూ కలిసే ఉండేవారు. ప్రభుత్వం మారడంతో గ్రామస్తుల్లో ప్రవర్తన మారింది. మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. ఎదిరిస్తే కొడుతున్నారు. పాలప్యాకెట్ తీసుకురావడానికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఉంది. పిల్లల్ని పాఠశాలకు పంపడానికి కూడా భయపడుతున్నాం. – స్వప్న, తడుకుపేట దళితవాడ శాంతిభద్రతలు అదుపులోకి తెస్తున్నాం.. రెండువర్గాల మధ్య గొడవల్లో ఇప్పటికే ఒక వర్గం వారు ఇచి్చన ఫిర్యాదు మేరకు 13 మందిపై కేసు నమోదుచేశాం. మరో వర్గం వారు ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేశాం. అదనపు బలగాలను తీసుకొచ్చి శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. – మహేశ్వర్‌రెడ్డి, సీఐ, నగరి -
రూపంలో తేడా ఉన్నందుకేనా దొంగలు?
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ విద్యానగర్ ఎస్సీ–ఎస్టీ కాలనీకి చెందిన నలుగురు యువకులు మందమర్రి పోలీసులు తాము చేయని దొంగతనం కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపిస్తూ డిసెంబర్ 19న సెల్ఫీ వీడియో ద్వారా అభ్యర్థన పెట్టి, హెయిర్ డై తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఇదే కాలనీకి చెందిన ఆటో నడుపుకొనే ఎరుకల కులానికి చెందిన మరో యువకుడు ఏడాది కింద పోలీసులు తనపై అనేక కేసులు బనాయిస్తున్నారని భయపడి పోలీస్ స్టేషన్లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని అంటించుకున్నాడు. దాని కంటే ముందు ఒకసారి గొంతు కోసుకున్నాడు. ఆత్మహత్యా ప్రయత్నాల్ని ఆ యువకులు చనిపోయే ఉద్దేశంతో చేయకపోయినా, తామున్న పరిస్థితి నుండి ఎట్లా బయట పడాలో తెలియక ఈ ప్రమాదకర మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇలాంటి పెనుగులాటల వెనుక సామాజిక, ఆర్థిక, వ్యవస్థాపరమైన అంశాలున్నాయి.ఈ ఎస్సీ–ఎస్టీ కాలనీ అనేక ప్రాంతాల నుండి ఒకప్పుడు వలస వచ్చి, కాలరీ ఏరియాలో రోజూవారీ కూలీ చేసుకొని బతికే నిరుపేదలు నివసించే ప్రాంతం. స్థిరపడిన వారిలో మాదిగ, నేతకాని, ఎరుకల కులాలే ప్రధానంగా ఉన్నాయి. వాళ్ల తరువాత తరాలు కూడా ఇక్కడే పుట్టి పెరుగుతున్నాయి. ఈ కాలనీ కుటుంబాలకు నిర్మాణ రంగంలో దొరికే రోజువారీ అడ్డ కూలీ పని, యువకులైతే ఆటోలు నడుపు కోవటం, పాన్ టేలలు, వెల్డింగ్, చిన్న చిన్న మెకానిక్ పనులే జీవనా ధారం. తల్లిదండ్రుల జీవితాల్లోనే స్థిరత్వం లేకపోవటం, పరిసరాల ప్రభావం, ఇతర సాంస్కృతిక కారణాల వలన పిల్లలు పెద్దగా చదువులో రాణించటం లేదు. వీళ్లలో కొందరిపై గతంలో చిన్న చిన్న స్క్రాప్, కాపర్ వైర్ల, ఇతర దొంగతనాల కేసులున్నాయి. ఇద్దరిపై గంజాయిని స్థానికంగా అమ్మి పెట్టే కేసులున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ కేసుల్లో ఎవ్వరికీ ఎప్పుడూ కోర్టులో శిక్ష పడలేదు. నేరం జరగటానికి గల సామాజిక, ఆర్థిక నేపథ్యాన్ని వదిలేసి బ్రిటిష్ పాలకులు ఒకప్పుడు కొన్ని తెగలను నేరస్త తెగలుగా ముద్ర వేసి, వారిని క్రిమినల్ ట్రైబ్స్ అని పిలిచేవారు. ఫలితంగా ఆ తెగలో పుట్టిన వారు గతంలో నేరాలు చేసి ఇప్పుడు మానేసినా లేదా అసలు ఎప్పుడూ నేరం చేయకపోయినా నిరంతరం అంతులేని పోలీసు అకృత్యాలకు బలయ్యేవారు. ఆ ముద్ర చెరిపేసుకోవటానికి వారికి కొన్ని తరాలు పట్టింది.ఇతరుల కళ్ళు గప్పి, మన కష్టార్జితం కాని దాన్ని కైవసం చేసుకోవటమే దొంగతనం. సమాజంలో లంచగొండులు, అక్రమార్జనపరులు, బ్యాంకులను కొల్లగొట్టే వ్యాపారులు, ప్రజల ఉమ్మడి భూములను, వనరులను తమ హస్తగతం చేసుకొనే వైట్‌కాలర్ మనుషులు దొంగలు కారా? సభ్య సమాజం అనబడే దాంట్లో ఎంత మంది ఇవ్వాళ కేవలం వారి నైతికమైన కష్టార్జితం మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నారు? వీరంతా సమాజంలో ఎంతో దర్జాగా బతుకుతుండగా నిమ్న కులాలకు చెందిన వాళ్లు, కటిక పేదలు మాత్రం పోలీసుల చేతిలో దెబ్బలు తింటున్నారు. కేవలం దొంగ తనం రూపంలో తేడా ఉన్నందుకేనా?పేదరికం, తగిన ఉపాధి మార్గాలు లేకపోవడం, పాలకులే పెంచి పోషించే వ్యసనపర సంస్కృతి, మనుషులందరినీ సమానంగా చూసే ప్రజాస్వామ్య సంస్కృతి లేని పరిపాలనల పర్యవసానంగానే చిన్న చిన్న దొంగతనాలు జరుగుతాయి. దీనికి వ్యక్తిగతంగా వారినే బాధ్యులను చేసి శిక్షించటం కంటే పాలకులే ఆ స్థితికి నైతిక బాధ్యత వహించటం నాగరిక పద్ధతి. నేరం జరగటానికి గల నేపథ్యాన్నీ, నివారించడానికి గల అవకాశాలనూ పరిశీలించకుండా నేరస్తులను మాత్రమే శిక్షించే సాంప్రదాయం సంకుచితమైనది. నేర సంస్కృతి పెరగటానికి కావలసిన భౌతిక పరిస్థితులను పెంచి పోషించే పాలకులే నేరాల అదుపు పేరుతో పేదవర్గాలపై కేసులు బనాయించటం అనైతికమైన విషయం. చదవండి: విస్మృత చరిత్రపై వెలుగు రేకలు దేశంలో కొన్ని వర్గాలు మాత్రమే దొంగలుగా ఉంటారనే సామాజిక విలువలో ఆర్థిక, కులవివక్ష ఉంది. మేం మాత్రం దొంగలం కాదు సుమా అనే ఆత్మవంచన కూడా ఉంది. ఈ మానసిక భావనను సమీక్షించుకోవాల్సిన బాధ్యత పాలకులది, సభ్య సమాజానిది. సమాజంలోని పౌరులందరూ గౌరవప్రదమైన ఉపాధితో, సమానమైన హోదా, అవకాశాలతో జీవించేటట్టు చూడాల్సిన రాజ్యాంగ బాధ్యత పాలకులది.- డాక్టర్ ఎస్. తిరుపతయ్య మానవ హక్కుల వేదిక, తెలంగాణ సభ్యులు -
రాక్షస పాలనలో దళితులపై కక్ష
సాక్షి, అమరావతి: ‘‘ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..?’’ అంటూ అహంకారపూరితంగా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు! ఆ వర్గాన్ని ఉక్కుపాదంతో అణగదొక్కుతూ.. దళితులకు అసలు నాయకత్వమే లేకుండా చేయాలనే దుర్నీతితో సాగుతున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడం.. ప్రశ్నించడమే పాపమన్నట్లు వ్యవహరిస్తున్నారు.ఒకపక్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనుక్షణం వేధింపులకు గురిచేస్తూ.. మరోవైపు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఆర్డీవో, డీఎస్పీ, మండల స్థాయి అధికారులపై కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించారు. సూపర్ సిక్స్ సహా హామీల అమలు, అక్రమాలు, వైఫల్యాలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు ఎస్సీ వర్గానికి చెందిన సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వారిని పోలీసు స్టేషన్లలో అర్ధ నగ్నంగా నిలబెట్టి అవమానాలకు గురి చేసిన ఘటనపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి ఎస్సీలను ఉక్కుపాదంతో అణచివేత చర్యలను రోజు రోజుకు ఉద్ధృతం చేస్తున్నారని ఆ సామాజిక వర్గ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులు..» అధికారంలోకి వస్తూనే వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను లక్ష్యంగా చేసుకున్న కూటమి ప్రభుత్వం ఆయనపై వరుసగా కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులకు తెర తీసింది. దళితులకు నాయకత్వం లేకుండా చేయాలనే కుట్రపూరిత ధోరణితో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా కేసులు నమోదు చేస్తూ బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. నందిగం సురేష్ పై అసలు ఎక్కడెక్కడ, ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలంటూ స్వయంగా హైకోర్టు ఆదేశించడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. అన్యాయంపై ప్రశ్నించడం.. దళితుల్లో స్ఫూర్తి రగల్చడమే పాపమనే విధంగా దళిత నేతల పట్ల కూటమి సర్కారు దుర్నీతితో వ్యవహరిస్తోంది. » చంద్రబాబుపై గతంలో గులకరాయి పడిన ఘటనకు సంబంధించి నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌లపై కూటమి సర్కారు ఇప్పుడు అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు దిగింది. » కూటమి సర్కారు రాజకీయ క్షక్ష సాధింపుల్లో భాగంగా నారా లోకేశ్‌పై ట్వీట్ చేశారంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై స్థానిక పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేసింది. జోరుగా సాగుతున్న పేకాట కార్యకలాపాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ఓ ప్రజాప్రతినిధి పట్ల ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. జరుగుతున్న విషయాన్ని చెబితే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా విపక్షంలో ఉన్నారనే ఏకైక కారణంతో ఓ ఎమ్మెల్యేపై కేసులు బనాయించడం కూటమి సర్కారు అరాచకాలకు పరాకాష్ట. » బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గతేడాది ఓ వలంటీర్ మృతి చెందిన ఘటనకు సంబంధించి మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న కూటమి సర్కారు అధికారంలోకి రాగానే ఈ కేసులో ఎలాంటి సంబంధం లేని విశ్వరూప్ కుమారుడు డాక్టర్ శ్రీకాంత్‌ను అక్రమంగా అరెస్టు చేసింది. డాక్టర్ శ్రీకాంత్‌ను ఏ 1గా చేర్చి జైలుకు తరలించింది. ఇటీవల ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. » మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు మేరుగు నాగార్జునపై టీడీపీ నేతలు ఓ మహిళతో తప్పుడు కేసు పెట్టించారు. నాగార్జున డబ్బులు తీసుకుని మోసం చేశారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు బనాయించారు. అయితే తనపై అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించినట్లు ఆ మహిళ అఫిడవిట్లో పేర్కొంది. తాను ఎన్నడూ మేరుగు నాగార్జునను చూడలేదని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి ఆరి్థక లావాదేవీలు లేవని అందులో వెల్లడించడం గమనార్హం.విద్యావంతుడికి అవమానాలు.. రాజమహేంద్రవరంలో వరదలు వచి్చనప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులను నెల రోజుల్లోనే పరిష్కరించినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన విద్యావంతుడైన దళిత యువకుడు పులి సాగర్ తాను నివాసం ఉండే కృష్ణానగర్, బ్రదరన్ చర్చి ప్రాంతాల్లో వరద నీరు ఇంకా నిల్వ ఉండటం, సమస్యలు తొలగకపోవడంపై ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు. దీంతో ఆయనపై కేసులు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం దారుణ అవమానాలకు గురి చేసింది. పోలీసు స్టేషన్‌కు రావాలని ఆదేశించడంతో ఈ నెల 2న ఆయన రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ స్టేషన్‌కు వెళ్లారు. బీఎస్సీ, బీఈడీ చదివిన తనను పోలీసులు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ, బెదిరిస్తూ.. సెల్లో అర్ధనగ్నంగా నిలబెట్టి.. మహిళా పోలీసు కానిస్టేబుళ్లను కాపలాగా ఉంచారని పులి సాగర్ వాపోయారు. దళిత యువకుడిని పోలీసులు ఘోరంగా అవమానించిన తీరును సామాజికవేత్తలు ఖండిస్తున్నారు. » చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గంలో గత ఎన్నికల సమయంలో విద్యుత్తు సబ్ స్టేషన్లో ప్రమాదానికి సంబంధించి టీడీపీ నాయకుల ప్రోద్బలంతో దళితుడైన యాదమరి ఎంపీపీ సురేష్ బాబుపై చిత్తూరు టూ టౌన్ సీఐ అక్రమ కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగానే పూతలపట్టు మండలం ఎగువ పాలకూరు దళితవాడలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హరి, జయపాల్, భారతి, బాబుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. » రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లెలో ఇటీవల దళిత వర్గానికి చెందిన ప్రభుపై టీడీపీ సానుభూతిపరులు మరుగుతున్న నూనెను ఒంటిపై పోయడంతో తీవ్ర గాయాలతో కడప రిమ్స్‌లో చేరాడు. » దళితుడనే చిన్న చూపుతో రాజంపేట మున్సిపల్ కమిషనర్ రాంబాబును టీడీపీ నాయకులు ఆయన కార్యాలయంలోనే వేధించారు. తీవ్ర మానసిక వేధింపులతో కలత చెందిన ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికార యంత్రాంగంపై వేధింపులు» ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ సంజయ్‌కు నిష్పక్షపాతంగా పని చేస్తారనే పేరుంది. ఆయన ఏ రాజకీయ పక్షానికీ కొమ్ము కాయరని ఐపీఎస్ అధికారులే స్పష్టం చేస్తున్నారు. అగి్నమాపక డీజీ, సీఐడీ చీఫ్ హోదాల్లో సంజయ్ అక్రమాలు, నిధుల దురి్వనియోగానికి పాల్పడ్డారనే నెపం మోపి ఆయన్ను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. » ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ను వేధింపులకు గురి చేస్తున్న కూటమి సర్కారు ఐపీఎస్‌లు పాల్రాజు, జాషువాకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా కక్ష సాధిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి అన్బురాజన్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. రాజకీయ దురుద్దేశాలతో రిటైర్డ్ సీనియర్ పోలీస్ అధికారి విజయ్‌పాల్‌ను వేధించి అరెస్టు చేసింది. » ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణకు నిజాయితీగా, చట్ట ప్రకారం వ్యవహరిస్తారని అధికార వర్గాల్లో పేరుంది. గత ప్రభుత్వంలో ఆయన స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ఐజీగా పని చేశారు. విధి నిర్వహణలో నిక్కచి్చగా వ్యవహరించిన రామకృష్ణపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తనిఖీలు నిర్వహించి అక్రమాలను వెలికి తీసినందుకు ఆయనపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు దిగింది. -
మూగబోయిన దళితుల గొంతుక
పది రోజుల క్రితం మరణించిన వి.టి.రాజశేఖర్ మండల్ నిశ్శబ్ద విప్లవం ప్రారంభం కాకముందే దళితవాదం వైపు మళ్లారు. ఒక కన్నడ అగ్రకుల శూద్ర శెట్టి అయినప్పటికీ దళితుల కోసం అదే పేరుతో(దళిత్ వాయిస్) ఒక పత్రికను స్థాపించారు. దానివల్ల సామాజిక ఒంటరితనాన్ని అనుభవించారు. ఆయన బలమైన జాత్యహంకార వ్యతిరేకి. చివరివరకూ దళిత ఉద్యమకారులకు, రచయితలకు అండగా నిలిచారు. దళితులు–ఓబీసీల ఐక్యత కంటే దళితులు–ముస్లింల ఐక్యత గురించిన ఆయన ఆలోచన మరింత స్థిరమైనది. ముస్లింగా మారకపోయినా, ఇస్లాం మతానికి బలమైన మద్దతుదారుగా నిలిచారు. అంటరానితనానికి వ్యతిరేకంగా, దళిత విముక్తి ప్రచారకర్తగా ఆయన లాంటి ఏ ఉన్నత శూద్ర మేధావీ ఇప్పటివరకూ ఉద్భవించలేదు.2024 నవంబర్ 20న 93 సంవత్సరాల వయస్సులో వి.టి.రాజశేఖర్ మరణం, ఒక కోణంలో నన్ను తీవ్రంగా బాధించినప్పటికీ, మరో కోణంలో ఆయన జీవితాన్నీ, వారసత్వాన్నీ వేడుకగా జరుపుకొనే వీలు కల్పించింది. ఆయన భారతదేశ వ్యాప్తంగానూ, దేశం వెలుపలా కూడా ఉన్న నాలాంటి ఉద్యమకారులకు, రచయితలకు ధైర్యం, విశ్వాసం కలిగించిన స్నేహితుడూ, మార్గదర్శకుడూ! ఆయన వల్లే నా పుస్తకం ‘నేను హిందువు నెట్లయిత’ (వై ఐ యామ్ నాట్ ఎ హిందూ)కు 2008లో ‘లండన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియా’(లీసా) అవార్డు వచ్చింది. వెస్ట్‌మినిస్టర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ (బ్రిటిష్ పార్లమెంట్)లో నా ఉపన్యాసం తర్వాత జరిగిన అవార్డు వేడుకకుఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. మేము లండన్‌లో ప్రపంచ రాజ కీయాల గురించి చర్చించుకుంటూ, కలిసి భోజనం చేస్తూ విలువైన సమయం గడిపాము.ఆయన, ఆయన పత్రిక గురించి నాకు తెలియకముందే, ఒక చక్కటి సమీక్ష రాసి, నా పుస్తకానికి తన ‘దళిత్ వాయిస్’ పాఠకులలో ప్రాచుర్యం కలిగించారు. ఆయన భిన్నాభిప్రాయాలకు సంబంధించిన విషయాలపై వెంటనే తగాదాకు తెరతీయగల వ్యక్తి, కానీ అదే సమయంలో విషయాలు ఆమోదయోగ్యమైన స్థానాలకు మారిన ప్పుడు స్నేహాన్ని పునరుద్ధరించగల వ్యక్తి. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో పని అనుభవంతో, దృఢమైన పాత్రికేయ నేపథ్యంతో, బంట్ అని కూడా పిలువబడే కన్నడ శెట్టి సంఘం నుండి వచ్చిన వి.టి. రాజశేఖర్‌కు దళిత విముక్తిపై ఉన్న తిరుగులేని వైఖరి నిజంగా విశేషమైనది. చనిపోయే వరకు ఆయన దళితవాద నిబద్ధతతోనే ఉన్నారు. ఆయన తరాన్ని అలా ఉండనివ్వండి, అంటరానితనానికి వ్యతిరేకంగా, దళిత విముక్తి ప్రచారకర్తగా ఆయన లాంటి ఏ ఉన్నత శూద్ర మేధావీ ఇప్పటివరకూ ఉద్భవించలేదు.‘దళిత్ వాయిస్’ని ప్రారంభించిన తర్వాత తన మధ్యతరగతి ఉన్నత కుల స్నేహితులందరినీ కోల్పోయానని ఆయన చెప్పారు.బెంగళూరులోని తన సొంత ఇంటి నుండి ఆ పత్రిక రచన, ముద్రణ, పంపిణీని ఒంటరిగా నిర్వహించారు.మండల్ నిశ్శబ్ద విప్లవం ప్రారంభం కాకముందే ఆయన దళితవాదం వైపు మళ్లారు. అప్పట్లో అంబేడ్కర్ అనంతర దళితులకు ఇంగ్లిష్ చదవడం, రాయడానికి సంబంధించిన పాండిత్యం లేదు. దళిత్ పాంథర్ మరాఠీ సాహిత్య ఉద్యమం కారణంగా దళిత్ అనే పదం కొన్ని మీడియా సర్కిళ్లలో మాత్రమే గుర్తించబడుతోంది.ఆయన కూడా ఒక రిపోర్టర్‌గా బొంబాయి నగరంలో ఉన్నందున, ఏకంగా ఒక పత్రికను ప్రారంభించడం ద్వారా ‘దళిత’ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తేవడంలోని ప్రాముఖ్యతను వెంటనే అర్థం చేసు కున్నారు. కానీ ఒక కన్నడ అగ్ర కుల శూద్ర శెట్టికి ఆ నిర్ణయం తీసుకోవడం, పర్యవసానంగా సామాజిక ఒంటరితనాన్ని ఎదుర్కో వడం, ముఖ్యంగా తన జర్నలిస్టు సర్కిళ్లలో ఒక హింసాత్మక ప్రక్రియ అయి ఉండాలి!ఒక లాభదాయకమైన జర్నలిస్టు ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఆ శీర్షికతో ఆంగ్ల పత్రికను ప్రారంభించడం మండల్‌కు ముందటి పరిస్థితుల్లో ఊహించుకోండి. 2024 లోనే దళిత, ఓబీసీ, ఆదివాసీలకు చెందిన జర్నలిస్టులు ఎంత మంది ఉన్నారని రాహుల్ గాంధీ ఒక జాతీయ మీడియా సమావేశంలో ప్రశ్నించగా, అందులో ఎవరూ చేయి ఎత్తలేదు. అది కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ నేత, విదేశీ మీడియా సమక్షంలో... ఇదీ పరిస్థితి! దేశంలోని ప్రముఖ మీడియాలో ఉన్న ఆంగ్ల బ్రాహ్మణ జర్నలిస్టు కులతత్వపు వలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిన ఒంటరి శూద్రుడు వీటీ రాజశేఖర్ అయివుండాలి! ప్రధాన స్రవంతి మీడియాలోని కులతత్వం కారణంగా ఆయన నిరాశతో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. తన ప్రత్యర్థులతో పోరాడేందుకు రాడికల్ దళిత్ జర్నల్ను ప్రారంభించానని నాకు చెప్పారు.ఆయన భారతదేశంలోని అగ్రవర్ణ జర్నలిజంతో ఎప్పుడూ రాజీ పడలేదు. దళిత్ వాయిస్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన కథనాలు ఏ జాతీయ ఆంగ్ల వార్తాపత్రికలోనూ కనిపించలేదు. భారతీయ మీడియా గురించి చర్చ జరిగినప్పుడల్లా ఆయన దాని కులతత్వాన్ని దుయ్యబట్టేవారు. అగ్ర కులాల భారతీయ వార్తాపత్రికలన్నీ ‘టాయి లెట్ పేపర్లు’ అనేవారు. నేను జాతీయ వార్తాపత్రికలలో రాస్తున్నానని తెలుసుకున్నప్పుడు, ఆయన నాతో ‘మీ ఆలోచనలను అగ్రవర్ణాల వారికి అమ్మవద్దు, వారు మారరు’ అన్నారు. వాస్తవానికి నేను చిరునవ్వుతో దానిని అక్కడే వదిలేశాను. ఎందుకంటే ప్రధాన స్రవంతి మీడియాలో వీలైనంత ఎక్కువగా పాల్గొనాలనీ, రాయాలనీ నేను నమ్ముతాను. అలాంటి విభేదాలు ఉన్నప్పటికీ ఆయన చనిపోయే వరకు మా స్నేహం ఆప్యాయంగా కొనసాగింది.దళితులు–ఓబీసీల ఐక్యత కంటే దళితులు–ముస్లింల ఐక్యత గురించి ఆయన ఆలోచన మరింత స్థిరమైనది. దళితుల కంటే ఓబీసీలు ఆర్ఎస్ఎస్/బీజేపీతో కలిసి వెళ్తారని ఆయన అన్నారు. ఆయన ముస్లింగా మారకపోయినా, ఇస్లాం మతానికి బలమైన మద్దతుదారుగా నిలిచారు. తన పాకిస్తాన్ పర్యటనల కారణంగా కొంతకాలం పాటు ఆయన వీసా రద్దు చేయబడింది. ఆయన బలమైన జాత్యహంకార వ్యతిరేకి. యూదులకు వ్యతిరేకంగా పదే పదే వ్యాసాలు రాశారు.తన జీవితం చివరి రోజుల్లో ఆరోగ్య కారణాల వల్ల బెంగళూరు నుండి మంగళూరుకు మారిన తర్వాత ఆయన మౌనం మరింత పెరిగింది. అయినప్పటికీ, తన 80వ దశకం చివరి వరకూ ప్రయాణిస్తూనే ఉన్నారు. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీలో రోహిత్ వేముల వ్యవస్థీకృత హత్యకు వ్యతిరేకంగాజరిగిన నిరసన సభకు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు నేను చివరిసారిగా ఆయనను కలిశాను. దురదృష్టవశాత్తు క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి ఆయనను అనుమతించలేదు. అయినప్పటికీ గేటు వద్ద చాలాసేపు నిల్చొని నిరసన తెలిపారు. అది దళితుల పట్ల ఆయనకున్న నిబద్ధత.ఆయన ఎప్పుడూ ఖాదీ కుర్తా, పైజామా ధరించే వ్యక్తి. ఒక సాధారణ కన్నడ కాంగ్రెస్ రాజకీయ నాయకుడిలా కనిపిస్తారు. కానీ ఆయన నిజమైన మతం మారిన దళిత మేధావి.ఈ సంవత్సరం ప్రారంభంలో పాల్ దివాకర్ బృందం ‘దళిత్ వాయిస్’ను డిజిటలైజ్ చేశారు. ఆ వెబ్సైట్ ప్రారంభోత్సవానికిబెంగళూరు ఇండియన్ సోషల్ ఇన్ స్టిట్యూట్‌కు నన్ను ఆహ్వానించారు. దురదృష్టవశాత్తు నేను వెళ్ళలేకపోయాను. అయితే ఈ లెజెండరీ దళితుడు జీవించి ఉన్నప్పుడే అది జరిగింది.శూద్ర అగ్రవర్ణం నుండి దళితవాదంలోకి మారి, వారి విముక్తి కోసం తన జీవితాంతం పోరాడగలిగే మరో రాజశేఖర్ ఉద్భవిస్తాడని అనుకోలేము. ఆయన దళిత్ వాయిస్ పత్రిక ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆఫ్రికాలో, అనేక ముస్లిం దేశాలలో ప్రసిద్ధి చెందింది.ప్రపంచంలోని అత్యంత అణగారిన ప్రజల విముక్తి కోసం బతికిన ఆయన ఇంత సుదీర్ఘ జీవితం తర్వాత ఈ భూమిని విడిచి పెట్టారు. కాబట్టి, మనం కూడా జీవించి ఉన్నంత కాలం వీటీ రాజ శేఖర్ జీవితాన్ని, ఆలోచనలను, రచనలను వేడుకగా జరుపుకోవాలి. గుడ్ బై వీటీఆర్.-వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
టీడీపీ నేతల దాడులు పెరుగుతున్నాయి
-
దళితులపై కారంచేడు తరహా దాడులకు టీడీపీ కుట్ర
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ మెజార్టీ సాధించిన తర్వాత దళితులపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులకు పాల్పడేందుకు కుట్రలు పన్నుతున్నారని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి జయప్రకాష్ కెనడీ విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ హయాంలో దళితులు, మైనార్టీలు, బీసీల సంక్షేమం జరిగిందని, అందువల్లనే ఈ ఎన్నికల్లో ఆయా వర్గాలన్నీ వైఎస్సార్సీపీకే మద్దతుగా నిలిచాయని చెప్పారు. పోలింగ్ జరుగుతున్న రోజే ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ నాయకులు పలు జిల్లాల్లో దళితులపై దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలు, బీసీలకు సీఎం జగన్ సంక్షేమ పథకాలతో మేలు చేశారని, అందుకు కృతజ్ఞతగా ఈ ఎన్నికల్లో దళితులు, మైనార్టీలు, బీసీలు ఆయనకు అండగా ఉన్నారని తెలిపారు. అది సహించలేని టీడీపీ.. దళితులపై దాడులు చేయాలనే ఆలోచనల్లో ఉన్నట్లుగా తమకు సమాచారం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల కిందటి కారంచేడు వంటి ఘటనలు పునరావృతం చేయడానికి టీడీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని జయప్రకాష్ కెనడీ ఆరోపించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకునే హక్కు దళితులకు లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత దళితులపై దాడులు జరగకుండా ఎలక్షన్ కమిషన్, డీజీపీ పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ మేదర సురేష్ మాట్లాడుతూ టీడీపీ నేతలు పోలింగ్ రోజున దళితులపై దాడులకు తెగబడుతున్నా ఎలక్షన్ కమిషన్ ప్రేక్షకపాత్ర వహించిందని విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత దళితులపై దాడులు జరిగితే దానికి ఎలక్షన్ కమిషన్, డీజీపీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో విజయవాడ మాలమహానాడు నగర అధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
దళితులపై పెత్తందారీ తోడేలు దొంగ ప్రేమ
రామోజీరావు: వేలాది దళిత కుటుంబాలను రోడ్డు మీదకు లాగి వారి ఆశలను చిదిమేసి హైదరాబాద్‌లో ఫిలిం సిటీని నిర్మించిన పెత్తందారీ కర్కోటకుడు. ఫిలిం సిటీ కోసం దళితుల నుంచి వందలాది ఎకరాల అసైన్డ్, భూదాన్ భూములను నిర్ధాక్షిణ్యంగా లాక్కున్న కబ్జాకోరు. గ్రామాలకు వెళ్లే రోడ్లను ఫిలిం సిటీలో కలిపేసుకుని గోడ గట్టి, ఆ గ్రామాల ప్రజలను నానా తిప్పలు పెట్టి, వారి ఉసురు తీసిన రక్త పిపాసి. వేలాది దళిత కుటుంబాలను నిర్దాక్షిణ్యంగా చిదిమేసి రాజసౌధాలను నిర్మించుకుని రాజులా చలామణి అవుతున్న ఆధునిక నరకాసురుడు. ఇప్పుడు వారిపై తనకు అమిత ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న తోడేలు. చంద్రబాబు: రాష్ట్రంలో పచ్చ ముఠాకు నాయకుడు. దళితులంటే అస్సలు పడని ఓ పెత్తందారు. ఆయన హయాంలో దళితులపై లెక్కలేనని దాడులు, అవమానాలు. ముఖ్యమంత్రిగా ఉండగానే ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ వ్యాఖ్యానించిన దళిత ద్వేషి. ఈయనే కాదు.. ఈయన వెంట ఉన్న నేతలదీ అదే తీరు. దళితులకు రాజకీయాలెందుకురా అంటూ హుంకరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. దళితుల దగ్గర కంపు కొడుతుందంటూ ఈసడించుకున్న ఆదినారాయణ రెడ్డి. వీళ్లే కాదు.. టీడీపీలో అనేక మంది నేతలది ఇదే తీరు. వీళ్లంతా రామోజీ నమ్మిన బంటు చంద్రబాబు బ్యాచ్. అందుకే దళితులపై వీళ్లెంతగా వీరంగం వేసిన రామోజీకి కనిపించదు, వినిపించదు. సీఎం వైఎస్ జగన్: నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ దళితులను కుటుంబ సభ్యుల్లా అక్కున చేర్చుకున్న నాయకుడు. వారిని రాజకీయంగా, అన్ని రంగాల్లో ఉన్నత స్థితి కల్పిస్తూ, వారి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి, ఎవరినీ పైసా అడగాల్సిన పని లేకుండా ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రి. వారిని సాధికారత వైపు నడిపించి, సమాజంలో గౌరవం కల్పించి, తలెత్తుకొని తిరిగేలా చేసిన నేత. దళితులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తారు కాబట్టే ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాను ఇటీవల ఆ వర్గానికి చెందిన నేత నందిగం సురేష్ తో విడుదల చేయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే దళితుల మనసు గెల్చుకున్న దళిత బంధువు. – సాక్షి, అమరావతి రామోజీ కపట నాటకం తానే స్వయంగా దళితుల భూములు లాక్కొని, వారి కంటి నుంచి రక్తం కారేలా ఏడిపించిన రామోజీ.. ఇప్పుడు దళితులపై ప్రేమ అంటూ కపట నాటకమాడుతున్నారు. జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు అంటిందంటూ ఈనాడులో రక్తపు రాతలు రాసి అక్కసును బయటపెట్టుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో దళితులకు దక్కిన గౌరవం ఏ పాటిదో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇది తమ ప్రభుత్వమని ప్రతి దళితుడూ చెప్పుకునే రాష్ట్రంలో అనుకోకుండా జరిగిన ఒకట్రెండు ఘటనలను బూచిగా చూపి దళితుల నెత్తురు జగన్ చేతులకు అంటిందని నిస్సిగ్గుగా రాయడం ఆకాశంపై ఉమ్మి వేయడం లాంటి ప్రయత్నమేనని విశ్లేషకులు చెబుతున్నారు. దళితులంటే అంటరాని వారనే ఆదిమ సమాజపు భావజాలంతో వారిని అడుగడుగునా అవమానిస్తున్న చంద్రబాబు బ్యాచ్‌కు మద్దతు పలికిన రామోజీరావు.. దళితులకు అన్ని విధాలుగా అండదండలందిస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై బురద జల్లేలా రాసిన రాతలను అసలు ఎవరైనా నమ్ముతారా? ఈ లాజిక్ రామోజీ బుర్రకు అందదు. ఎందుకంటే.. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చాలన్నదే ఆయన ఏకైక అజెండా. అందుకే తప్పుడు రాతలతో ప్రజలను పక్కదోవ పట్టంచాలని ప్రయత్నిస్తున్నారు. బాబు హయాంలో దారుణ దమనకాండ చంద్రబాబు హయాంలో దళితులపై దారుణమైన దమనకాండ జరిగినా అసలు ఏమీ జరగనట్లు దొంగ నిద్ర నటించాడు రామోజీ. సాక్షాత్తూ బాబు సీఎంగా ఉన్నప్పుడే వారి పుట్టుకనే అవమానç³రిచేలా అన్యాయమైన వ్యాఖ్యలు చేసినా కిమ్మనలేదు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని బాబు అన్నప్పుడు దళిత సమాజం మొత్తం భగ్గుమంది. అప్పుడు రామోజీ వంత పలికింది దళితులకు కాదు.. బాబుకు. బాబు మంత్రివర్గ సభ్యుడు ఆదినారాయణరెడ్డి దళితులను అవహేళన చేసినప్పుడు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నీచంగా తూలనాడినా రామోజీకి దళితులపై ప్రేమ పుట్టలేదు. 2017 డిసెంబర్లో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుచరులు ఓ దళిత మహిళపై దాడి చేసి, ఆమె బట్టలు చింపి పొలం నుంచి ఈడ్చిపడేసినా పట్టించుకునే నాథుడే లేడు. బాబు హయాంలో దళితులు నిత్యం భయంగా బతికే పరిస్థితులు ఉండేవి. తమపై దాడులు జరిగితే పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యేవి కాదు. కేసు పెట్టడానికి దళితులు పోరాడాల్సివచ్చేది. బాబు హయాంలో ఎస్సీలపై నేరాల సంఖ్య పెరిగినట్లు క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలే చెబుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు తగ్గిపోయాయి. దళితుల భద్రతకు పెద్దపీట వేయడంతోపాటు దళిత మహిళనే హోంమంత్రిగా చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. అలాంటి జగన్ చేతులు దళితుల రక్తం అంటిందంటూ అడ్డగోలు రాతలతో రామోజీ ఆక్రోశం వెనుక బాబును పీఠం ఎక్కించాలన్న తపన ఉందని మేధావులు అంటున్నారు. దళితుల గురించి చంద్రబాబు, టీడీపీ నేతలు చేసిన దారుణ వ్యాఖ్యలు ♦ ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? అందరూ సంపన్న వర్గాల్లోనే పుట్టాలని కోరుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాలు ఏలవచ్చనుకుంటారు. కులాలను బట్టి ఓట్లు రావు. వాటితో ఎవడూ గెలవలేడు. మంద కృష్ణ ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేకపోయాడు. - సీఎం హోదాలో 2016 ఫిబ్రవరి 9న చంద్రబాబు ♦ దళితులు శుభ్రంగా ఉండరు. వారి దగ్గర వాసన వస్తుంది. వాళ్లు సరిగా చదవరు. అయినా ఎస్పీలు అవుతారు. రిజర్వేషన్లు పదేళ్ల కోసం ఇస్తే 70 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. పట్టాలిస్తే వాటిని నిలుపుకోరు. – 2017లో చంద్రబాబు మంత్రివర్గం సభ్యుడిగా ఉన్నప్పుడు ఆదినారాయణరెడ్డి ♦రాజకీయంగా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు దళితులు. మీరు వెనుకబడిన వారు. మీరు షెడ్యూల్డ్ క్యాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయి. మాకు పదవులు. మీకెందుకురా పిచ్చి –––––––––––––––– – 2019 ఫిబ్రవరి 20న టీడీపీకి చెందిన అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితుడిపై దాడి చేసేది టీడీపీ నాయకులే రాష్ట్రంలో దాడులు చేసేది టీడీపీ నాయకులే. వారు అధికారంలో ఉన్నా, లేకపోయినా దళితులే లక్ష్యంగా దాడులు చేస్తుంటారు. దళిత నాయకుడినైన నాపై అంబేడ్కర్ జయంతి రోజున టీడీపీ అభ్యర్థి బోనెల విజయచంద్ర తన అనుచరులతో దాడికి దిగారు. మా ఇంటికి వచ్చి తలుపులు పగులగొట్టి వీరంగం సృష్టించారు. ఇవి ఈనాడు రామోజీరావుకు కనిపించవు. దళిత ద్రోహి చంద్రబాబే. ఈ రోజు ఆయనకు మద్దతుగా ఈనాడులో తప్పుడు కథనాలు ఇవ్వడం దారుణం. టీడీపీ పాలనలో దళితులపై జరిగిన దాడులు రాయాలంటే పేపర్లు చాలవు. – అలజంగి జోగారావు, ఎమ్మెల్యే, పార్వతీపురం ఎవరు మేలు చేశారో తెలుసు దళితులకు సీఎం జగన్ పాలనలోనే మేలు జరిగింది. దళితులను అక్కున చేర్చుకొని, ఉన్నత స్థితికి చేర్చింది సీఎం వైఎస్ జగన్ మాత్రమే. ఎన్నికల వేళ ఈనాడు అధినేత రామోజీరావుకు మతి భ్రమించింది. ఎస్సీ సామాజిక వర్గం ఓట్ల కోసం తప్పుడు కథనాలు వండివార్చితే నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. ఓటమి భయంతో నిత్యం కట్టు కథలు అల్లుతున్నారు. గత ఎన్నికల్లోనూ వారిది ఇదే ధోరణి. ప్రజలు ఎప్పుడూ వాస్తవాలనే స్వీకరిస్తారు. ప్రజలంతా బాబు అండ్‌కో ను ఛీ కొడుతుంటే ఎలాగైనా బాబును గద్దెనెక్కించాలని, తద్వారా కేసుల నుంచి తప్పించుకోవాలని రామోజీ తాపత్రయపడుతున్నారు. – రేగాన శ్రీనివాసరావు, టూరిజం కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చంద్రబాబే దళితుల ద్రోహి దళితులంటే బాబుకు గిట్టదు. కేవలం ఓట్లు దండుకోవడానికే మాత్రమే బాబుకు ఎస్సీలు కావాలి. తర్వాత తన సామాజికవర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ఎస్సీలపై ఆయన చేసిన దాడులన్నీ చెప్పుకుంటూ పోతే పుస్తకం రాయొచ్చు. ఎవరైనా ఎస్సీలుగా పుడతారా అని హేళన చేసింది చంద్రబాబే. ఇటీవల ఓ మైనారిటీ సమావేశంలో కూడా ఎస్సీలను చులకన చేసి మాట్లాడారు. క్రైస్తవులంతా ఎస్సీలని, అధికారంలోకి వస్తే వాళ్ల అంతు చూస్తామన్నట్లుగా బెదిరింపు ధోరణిలో వ్యవహరించారు. ఇటువంటివన్నీ పచ్చ పత్రికలు కప్పిపుచ్చి బాబును వెనకేసుకుని వస్తున్నాయి. దళితులకు సీఎం జగన్‌మాత్రమే మేలు చేస్తున్నారు. – ప్రసాద్, మాల మహానాడు అధ్యక్షుడు, చిత్తూరు పచ్చ పత్రిక విషపు రాతలు సీఎం జగన్, దళితులపై పచ్చ పత్రిక విషపు రాతలు రాసింది. సీఎం జగన్ బస్సు యాత్రకు తండోపతండాలుగా వస్తున్న వారిలో అధికంగా ఉండేది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలే. మరి ఈ పచ్చ రాతలు రాసే వాళ్లకు ఇలాంటి నిజమైన యాత్రలు కనిపించవా?. దళితులకు తీవ్ర అన్యాయం చేసింది బాబే. ఆయన దళిత ద్రోహి. గతంలో మాల, మాదిగలను విడదీసి గద్దెనెక్కిన బాబు దళిత జాతిని అవహేళనగా మాట్లాడుతూ దళిత విద్యార్థులపై కుట్ర పూరిత పాలన కొనసాగించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా బయటికి కూడా రాని విధంగా చంద్రబాబు దళిత జాతి అణచివేతకు పెద్ద కుట్ర చేశాడు. – ఎగ్గుల శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు చంద్రబాబే దళిత ద్రోహి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడే దళిత ద్రోహి. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా దళితులపైన దాడుల కేసులు 3400 పైగా నమోదయ్యాయి. నమోదవని ఇంకా చాలా ఉన్నాయి. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు అన్న మాటలు ఇప్పటికీ మేం మర్చిపోలేదు. చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తున్నాయి. దళితులపైన టీడీపీ నేతలు, ఆ ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు ఎన్నో. లేనిపోని రాతలు రాసి జగనన్న ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే సహించేది లేదు. – మాస్టీల మంజు, ఎస్సీ నేత, ఏఎంసీ మాజీ అధ్యక్షురాలు, కంచిలి -
మాల, మాదిగల మధ్య చిచ్చుకు చంద్రబాబు కుట్రలు
సాక్షి, అమరావతి/భీమవరం/తాడేపల్లిరూరల్/నెహ్రూనగర్/కడప కార్పొరేషన్: ఎన్నికలు వచ్చాయంటే చాలు అన్నదమ్ముల్లా ఉన్న మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టేలా చంద్రబాబు కుట్రలు చేస్తారని మాల మహానాడు(పీవీ రావు) జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజు మండిపడ్డారు. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు మంద కృష్ణ మాదిగతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయిస్తారని తెలిపారు. తాడేపల్లిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాదిగల ఆత్మగౌరవాన్ని కొన్నేళ్లపాటు మంద కృష్ణ చంద్రబాబు పాదాల వద్ద పెట్టారని చెప్పారు. మళ్లీ ఈ మధ్య ప్రధాని మోదీ పాదాల చెంతపెట్టారని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చాయంటే మంద కృష్ణ మాదిగకు పండుగేనని, చంద్రబాబు రాజకీయాల్లో ప్యాకేజీ అనేది మొదట మంద కృష్ణతోనే ప్రారంభించారని తెలిపారు. ఏపీ రాజకీయాలతో మంద కృష్ణకు ఏం పనని, ఇన్నేళ్ల పాటు ఎమ్మార్పీఎస్ పేరుతో మంద కృష్ణ వెలగబెట్టిన రాజకీయాలు తెలియని వారు ఎవరూ లేరన్నారు. 30న మంద కృష్ణమాదిగ నిర్వహించాలని చూస్తోంది.. మాదిగల సదస్సు కాదనీ, అది టీడీపీ మాయ సభ అని చెప్పారు. ‘దళితులను హేళనచేసిన బాబుకు మద్దతా’ దళితులకు చంద్రబాబు బద్ధ శత్రువని, మంద కృష్ణమాదిగకు డబ్బులిచ్చి మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు దుయ్యబట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మీడియాతో మాట్లాడారు. మంద కృష్ణమాదిగ పెద్ద మొత్తంలో ప్యాకేజీ తీసుకుని మాదిగ సోదరులను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి తాకట్టుపెడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ దళితులను హేళన చేసిన చంద్రబాబుకు మద్దతివ్వడం దారుణమన్నారు. మాదిగ సామాజిక వర్గానికి సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చి నందిగం సురేష్‌కు బాపట్ల ఎంపీగా సీటు ఇవ్వడంతో పాటు హోం మంత్రిగా తానేటి వనిత, మున్సిపల్ శాఖ మంత్రిగా ఆదిమూలం సురేష్‌లకు ఉన్నత పదవులు కట్టబెట్టారని గుర్తుచేశారు. తెలంగాణకు చెందిన మంద కృష్ణకు ఏపీతో సంబంధమేంటని ప్రశ్నించారు. ‘సదస్సును అడ్డుకుని తీరతాం’ మంద కృష్ణ ఈ నెల 30న నిర్వహించే సదస్సును అడ్డుకుని తీరతామని నవ్యాంధ్ర ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు హెచ్చరించారు. అసలు ఏపీలో మాదిగ సదస్సు పెట్టడానికి నీకు ఏ అర్హత ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ కృష్ణమాదిగ నిర్వహించాలనుకున్నది మాదిగల సభ కాదని టీడీపీ ప్రాయోజిత సదస్సుగా అభివర్ణించారు. మాదిగలను ప్రతిసారీ నమ్మించి చంద్రబాబుకు తెగనమ్మడం ఆయనకు పరిపాటిగా మారిందన్నారు. కనీసం బడిలోకి కూడా రానీయకుండా దళితులను దశాబ్దాల తరబడి చదువులకు దూరం చేశారో.. అలాంటి విద్యాశాఖకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆదిమూలపు సురేష్‌ను మంత్రిగా చేసిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. ప్రత్యేక శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడం ద్వారా తరతరాల దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడారని, సంక్షేమ పథకాలతో వారి బతుకుల్లో వెలుగులు నింపిన వైఎస్ జగన్‌ను అణగారిన వర్గాల ఆత్మ బంధువుగా అభివర్ణించారు. ‘మాదిగలను చంద్రబాబుకు తాకట్టు పెడుతున్న మందకృష్ణ’ మంద కృష్ణమాదిగ మాదిగలను చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నాడని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావు అన్నారు. తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. కృష్ణమాదిగ తన వ్యక్తిగత స్వార్థం కోసం మాదిగలను చంద్రబాబుకు తాకట్టు పెట్టాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్.. 2019 ఎన్నికల్లో ఎంపీ సీటును నందిగం సురేష్‌కు కేటాయిస్తే కనీసం మద్దతు కూడా ఇవ్వలేదని, ఓ మాదిగను పార్లమెంట్‌కు పంపిస్తుంటే మద్దతివ్వలేదంటే మంద కృష్ణ స్వార్థాన్ని అర్థం చేసుకోవచ్చని అన్నారు. చంద్రబాబు తప్ప మందకృష్ణ మాదిగను ఏ రాజకీయ పార్టీ నమ్మదన్నారు. మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మంద కృష్ణమాదిగ 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని చంద్రబాబును ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. సీట్ల కోసం కాకుండా కాసుల కోసమే వర్గీకరణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని తన ప్రయోజనాలు కాపాడుకుంటున్నారని మండిపడ్డారు. వర్గీకరణ అంశం కేంద్రం చేతిలో ఉందని, కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చారని, ఎన్నికల అనంతరం మాదిగలను పోలీసులతో కొట్టించిన ఘనత చంద్రబాబుదని అలాంటి వ్యక్తికి మందకృష్ణ మాదిగలను తాకట్టు పెట్టడం దారుణమన్నారు. సీఎం వైఎస్ జగన్ వచ్చాకే మాదిగల జీవితాల్లో మార్పు వచి్చందన్నారు. ‘మాదిగలంతా సీఎం జగన్ వెంటే’ రాష్ట్రంలో మాదిగలంతా జగనన్నకు తోడుగా, నీడగా ఉంటారని నవ్యాంధ్ర ఎమ్మార్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి గరుడాద్రి అన్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మాదిగలు, మాదిగ ఉప కులాలను గంపగుత్తగా ఒక పార్టీకి తాకట్టు పెట్టే అధికారం మంద కృష్ణకు ఎక్కడిదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటు వేయాలని చెప్పడానికి ఆయనెవరని నిలదీశారు. మంద కృష్ణమాదిగకు మాదిగ జాతి ఇంకా గులాంగిరి చేసేందుకు సిద్ధంగా లేదన్నారు. సీఎం జగనన్న ప్రభుత్వం దళితులకు, అణగారిన ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటోందని, మాదిగలు ఈ విషయాలన్ని గుర్తించి సీఎం జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. -
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొలికపూడి శ్రీనివాస్
-
చిత్తూరు జిల్లా: దళితులపై టీడీపీ వర్గాల దాడి
గంగవరం(చిత్తూరు జిల్లా): దళితులపై టీడీపీకి చెందిన అగ్రవర్ణాలవారు దాడులకు పాల్పడిన ఘటనలో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గురువారం మీడియా ఎదుట బాధితులు తమ ఆవేదన వెళ్లగక్కారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ మబ్బువారిపేట దళితవాడలో దాదాపు 30 ఇళ్లలో ప్రజలు నివాసం ఉంటున్నారు. వీళ్లందరికీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ అంటే అమితమైన అభిమానం.దీన్ని జీర్ణించుకోలేని ఇదే గ్రామంలో టీడీపీకి చెందిన అగ్ర కులస్థులు నిత్యం కులం పేరుతో దూషించడం, అవమానించడం వంటివి పరిపాటిగా సాగిస్తున్నారు. బుధవారం రాత్రి వారు పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటుండగా.. టీడీపీకి చెందిన అల్లరిమూకలు దుర్గ, గోవర్ధన్, రాకేష్ మరి కొంతమంది అనుచరులతో వెళ్లి అక్కడ గొడవలు సృష్టించారు. ఇంతలో రవి అనే వ్యక్తి అందరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. అందరూ కలిసి అతనిపై పైశాచికంగా దాడి చేశారు. అడ్డొచ్చిన మహిళల పైనా దాడులకు పాల్పడి కులం పేరుతో దూషించినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక వైఎస్సార్సీపీ నేతలు దళితులపై దాడి విషయాన్ని ఎమ్మెల్యే వెంకటేగౌడ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎస్ఐ ప్రతాప్‌రెడ్డిని వివరణ కోరగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఇదీ చదవండి: మా అవినీతినే బయటపెడతారా.. మీ అంతు చూస్తాం -
మంత్రి ఈశ్వర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసిందని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దళితుల సంక్షేమం అమలైందన్న విషయాన్ని ఈశ్వర్ గుర్తుంచుకోవాలని అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో, గత మూడేళ్లలో ఎంతమందికి దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలు అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో తాము ఓట్లు అడుగుతామని, బీఆర్ఎస్కు దమ్ముంటే డబుల్బెడ్రూం ఇళ్లు కట్టిన చోట్ల ఓట్లు అడగాలన్నారు. గత నాలుగేళ్లుగా ఏమీ పట్టించుకోకుండా ఎన్నికల ముందు హడావుడి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. దళితుల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ మాట తప్పారని, వాటిని తాము అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఆయన ఉలిక్కిపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని కాకుండా దళితులకు అన్యాయం చేసిన కేసీఆర్‌ను ఈశ్వర్ ప్రశ్నించాలని జీవన్‌రెడ్డి సూచించారు. -
దళితులు, గిరిజనులకు సముచిత గౌరవం
సాగర్: గత ప్రభుత్వాలకు దళితులు, ఓబీసీలు, గిరిజనులు ఎన్నికలప్పుడే గుర్తుకు వచ్చేవారని ప్రధాని మోదీ ఆరోపించారు. దళిత బస్తీలు, నిరుపేదలుండే ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో నీటి వసతి కూడా ఉండేది కాదన్నారు. తమ ప్రభుత్వం మాత్రం దళితులు, ఓబీసీలు, గిరిజనులకు సముచిత గౌరవం ఇచ్చిందని, జల్ జీవన్ మిషన్ ద్వారా వారి ఇళ్లలోకే మంచినీరు అందిస్తోందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బడ్తుమా గ్రామంలో శనివారం ప్రధాని సంత్ రవిదాస్ జ్ఞాపకార్థం 11 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్లతో నిర్మించే ఆలయం–స్మారక నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బినా–కోటా డబుల్ లేన్ రైలు మార్గాన్ని జాతికి అంకితం చేయడంతోపాటు వివిధ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ధానాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. -
సాహసోపేత నిర్ణయాలు.. వారికి వైఎస్ జగన్ సర్కార్ ఐదు వరాలు
కలలో సైతం ఊహించని భూ సంస్కరణలివి. భారతదేశ సామాజిక చరిత్రలో ఇది మేలి మలుపు. బహుశా ఇప్పటిదాకా ఈ రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేసిన దాఖలాలు ఎక్కడా ఉండకపోవచ్చు. ప్రధానంగా దళిత వర్గాల స్థితిగతుల్లో వేగవంతంగా మార్పు కనిపించడం ఖాయం. బహిరంగ సభల్లో సీఎం జగన్ ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ’ అని చెప్పే మాటలు ఆయన హృదయాంతరాల్లోంచి వచ్చేవేనని రుజువైంది. సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా భూములకు సంబంధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సాహసోపేతంగా తీసుకున్న ఐదు నిర్ణయాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పేదల తల రాతలు మార్చనున్నాయి. ప్రధానంగా దళితుల పాలిట ఐదు వరాలుగా భావించవచ్చు. నిరుపేద దళితులకు సమాజంలో గౌరవనీయమైన స్థానాన్ని కల్పించడమే లక్ష్యంగా ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఐదు కీలక ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేశారు. అసైన్డ్ భూముల రైతులకు యాజమాన్య హక్కులు కల్పించాలనే చరిత్రాత్మక నిర్ణయంతో 15.21 లక్షల మంది రైతులు లబ్ధి పొందితే అందులో అత్యధికులు దళిత వర్గానికి చెందిన వారే. రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత భూమి లేని నిరుపేదలకు భూముల పంపిణీకి శ్రీకారం చుట్టడం ద్వారా ఎక్కువ లబ్ధి పొందబోతున్నదీ దళిత సోదరులే. అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న లంక భూములకు డి పట్టాలు ఇవ్వడం ద్వారా దళితులు, ఇతర వర్గాల వారి కష్టాలకు ప్రభుత్వం చరమగీతం పాడింది. భూమి కొనుగోలు పథకం కింద దళితులకు ఇచ్చిన భూములపై పూర్తి హక్కులు కల్పించి వారికి మేలు చేకూర్చుతోంది. శ్మశాన వాటికలు లేని దళిత వాడ ఉండకూడదనే లక్ష్యంతో ఎవరూ అడగకుండానే 1,700 గ్రామాల్లో వాటి ఏర్పాటుకు 1,050 ఎకరాలు కేటాయించింది. వీటన్నింటి వల్ల 16 లక్షల మంది దళితులు, ఇతర పేద వర్గాల బతుకు చిత్రాలు మారనున్నాయి. ఇన్నాళ్లూ కాగితాలపైనే విలువ అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడంతో అనేక సంవత్సరాలుగా భూమి ఉన్నా లేనట్లే జీవిస్తున్న లక్షలాది మంది దళిత, పేద రైతులకు మేలు జరగనుంది. ప్రభుత్వం నుంచి భూమిని పొంది 20 ఏళ్లు పూర్తయితే ఆ అసైన్మెంట్దారులు.. వారు లేకపోతే వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయి. అసైన్డ్ భూముల చరిత్రలో ఇదొక గొప్ప నిర్ణయం. స్వాతం్రత్యానికి ముందు, తర్వాత.. భూమి లేని నిరుపేదలకు జీవనోపాధి కల్పించడానికి ప్రభుత్వాలు భూమిని ఇచ్చేవి. ఇలా భూమి పొందే వారిలో ఎక్కువ మంది దళితులే ఉండేవారు. వారికి ప్రభుత్వాలు అసైన్ (ఇచ్చిన) చేసిన భూములను వారు సాగు చేసుకోవడమే తప్ప వాటిపై వారికి ఎటువంటి హక్కులు ఉండవు. అసైన్డ్ చట్టాల ప్రకారం ఆ భూములను అమ్మడం, కొనడం నిషేధం. ఏదైనా అవసరం వచ్చి తనకున్న అసైన్డ్ భూమిలో కొంత భాగాన్ని అమ్ముదామంటే సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ఆ భూముల రిజి్రస్టేషన్ జరగదు. దీంతో ఇతర భూములకు, అసైన్డ్ భూములకు చాలా తేడా ఏర్పడింది. అవసరాల రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో సాదా బైనామాల పద్ధతిలో కాగితాల మీద రాసుకుని కొందరు తమ భూములను ఉన్న విలువ కంటే చాలా తక్కువకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూపులు ► తమ భూములపై తమకు హక్కులు ఇవ్వాలని అసైన్డ్ రైతులు ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నారు. స్వాతం్రత్యానికి ముందు.. 1954లో ఇచ్చిన భూములపై సంబంధిత రైతులకు యాజమాన్య హక్కులు కల్పించే అవకాశం ఇచ్చారు. కానీ అది కూడా అమలులోకి రాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి భూములపై యాజమాన్య హక్కులు కల్పించే ప్రక్రియను ప్రారంభించింది. ► 1954 తర్వాత అసైన్మెంట్ చేసిన భూములపైనా యాజమాన్య హక్కులు ఇవ్వాలనే అభ్యర్థనపై గత ప్రభుత్వాలు చర్చించడం, కమిటీలు వేసి కాలయాపన చేయడం తప్ప ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం కూడా అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించే విషయంపై ఒక కమిటీ నియమించి చేతులు దులుపుకుంది. ► వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో 13 మంది దళిత, గిరిజన ఎమ్మెల్యేలు సభ్యులుగా 2022 ఆగస్టు 30న ప్రజాప్రతినిధుల కమిటీని నియమించి దీనిపై నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈ కమిటీ కర్ణాటక, తమిళనాడులో అసైన్డ్ భూములపై హక్కులు ఇవ్వడంతో ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి విధానాలపై అధ్యయనం చేసింది. అసైన్డ్ భూములకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు, నిబంధనలను పరిశీలించింది. ► వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మన రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత లబ్ధిదారులు.. వారు లేకపోతే వారి వారసులు వారికి అవసరమైనప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇందుకు రాష్ట్రం మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ► అసైన్డ్ రైతుల్లో దాదాపు 70 శాతం మంది దళితులు ఉంటారని అంచనా. ఆ తర్వాత బీసీ, ఎస్టీ, మైనార్టీ రైతులకూ మేలు జరుగుతుంది. అదే సమయంలో ఎవరైనా 20 ఏళ్లకు ముందే పేద రైతుల నుంచి భూములు కొనుక్కుని ఉంటే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ భూములపై వారికి ఎటువంటి హక్కులు రావు. 54,129.45 వేల ఎకరాల్లో దళితులకే ఎక్కువ ► సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో నిరుపేదలకు వ్యవసాయ భూములు పంపిణీ చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల దళితులకు ఎక్కువ ప్రయోజనం కలగనుంది. భూమి లేని నిరుపేదల్లో వారే ఎక్కువగా ఉన్నారు. 23 జిల్లాల్లో 54,129.45 వేల ఎకరాలను అర్హులైన పేదలకు పంచనున్నారు. 46,935 మందికి భూములివ్వడానికి ఎంపిక చేయగా అందులో దళితులే ఎక్కువ. ► వ్యవసాయ కూలీలుగా, ఇతర పనులు చేసుకుంటూ జీవించే వారిని ప్రభుత్వం రైతులుగా మార్చనుంది. రాష్ట్రంలో చివరిసారిగా 2013లో భూ పంపిణీ జరిగింది. తక్కువ భూమి అయినా పేదలకివ్వడం అదే చివరిసారి. ఆ తర్వాత భూ పంపిణీ గురించి ఎవరూ పట్టించుకోలేదు. పేదలు మాత్రం తమ జీవనోపాధికి కొంత భూమి ఇవ్వాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఎవరూ అడగకుండానే దళితులు, ఇతర వర్గాల్లోని నిరుపేదలకు మేలు చేయాలనే సంకల్పంతో భూ పంపిణీకి శ్రీకారం చుట్టారు. లంక భూముల్లో 80 శాతం వీరివే ► లంక భూములకు డీకేటీ పట్టాలివ్వాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల 8 జిల్లాల్లో ఉన్న కృష్ణా, గోదావరి లంకల్లోని 9,062 ఎకరాలకు సంబంధించిన 19,176 మంది రైతులకు పట్టాలు దక్కనున్నాయి. వారిలో అత్యధికులు దళిత రైతులే. ► కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో మూడు కేటగిరీల్లో లంక భూములను సాగు చేసుకుంటున్న అనేక మంది రైతులకు పట్టాలు లేవు. తమకు పట్టాలు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలను కోరుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం దళిత రైతుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. సి కేటగిరీలోని కొన్ని భూములకు ఐదేళ్ల లీజుకు ఇవ్వనుంది. అప్పు మాఫీతో భూమి చేతికొచ్చింది ► భూమి కొనుగోలు పథకం ద్వారా భూములు పొందిన దళిత రైతుల కష్టాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం చరమగీతం పాడింది. ఆ భూములపై రుణాలను మాఫీ చేస్తోంది. రుణాలు చెల్లించినా నిషేధిత జాబితాలో కొనసాగుతున్న భూములకు సైతం విముక్తి కల్పిస్తోంది. ఈ రెండు నిర్ణయాల వల్ల మొత్తం 22 వేల మందికిపైగా రైతులకు వారి భూములపై సంపూర్ణ హక్కులు లభించనున్నాయి. ► భూమి లేని దళిత రైతుల జీవనోపాధి కోసం గతంలో రాష్ట్ర ఎస్సీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూములను కొనుగోలు చేసి అర్హులకు ఇచ్చింది. ఆ భూములపై ఇచ్చిన రుణాలను కొందరు తిరిగి చెల్లించినా, కొందరు చెల్లించలేకపోయారు. దీంతో 16,213.51 ఎకరాలకు సంబంధించి 14,223 మంది రైతుల భూముల పత్రాలు తనఖాలో ఉన్నాయి. ► ఇప్పుడు ఆ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసి భూములపై దళిత రైతులకు పూర్తి హక్కులు కల్పించింది. ఎలాంటి రుసుం తీసుకోకుండా వాటిని దళిత మహిళా రైతుల పేరుతో రిజిష్టర్ డాక్యుమెంట్లుగా ఇవ్వనున్నారు. ► రుణాలు చెల్లించి తాకట్టు నుంచి విడిపించుకున్న రైతుల భూములు కూడా నిషేధిత జాబితాలోనే కొనసాగుతున్నాయి. ఆ భూములను 22 (ఏ) నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం చెల్లించాల్సిన రిజి్రస్టేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలను ప్రభుత్వం మినహాయించింది. దళిత రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే భూములపై హక్కులు లభిస్తాయి. నెరవేరిన దశాబ్దాల కల ► రాష్ట్రంలో దళిత వాడలకు స్మశాన వాటికల సమస్య లేకుండా చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. శ్మశాన వాటికలు లేని దళిత వాడల్లో వెంటనే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 17,564 రెవెన్యూ గ్రామాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్లు 1,900కు పైగా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవని నివేదిక ఇచ్చారు. 1,700 గ్రామాల్లో వాటి ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ గ్రామాల్లో జనాభాను బట్టి అర ఎకరం లేదా ఎకరం కేటాయించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్‌కు అప్పగించింది. ► మొత్తంగా 1,700 గ్రామాల్లో 1,050.08 ఎకరాలను శ్మశాన వాటికలకు కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దళిత వాడల్లో ఎన్నో దశాబ్దాలుగా ఈ సమస్య నలుగుతోంది. తమకు శ్మశాన వాటికలు కావాలని ఎస్సీలు.. ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులను ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా, ఏ ప్రభుత్వం దానిపై ఇంత వరకు చిత్తశుద్ధితో దృష్టి పెట్టలేదు. మొట్టమొదటిసారిగా సీఎం వైఎస్ జగన్ ఈ విషయంపై దృష్టి సారించి, 1050 ఎకరాలు కేటాయించారు. అతి త్వరలో ఆయా గ్రామాల్లో వారికి శ్మశాన వాటికలు ఏర్పాటు కానున్నాయి. పెరగనున్న రైతుల స్థితిగతులు సీఎం జగన్ నిర్ణయాలతో రైతుల చేతిలో ఉన్న భూముల విలువ పెరిగింది. తద్వారా ఆయా రైతుల స్థితిగతులు, ఆదాయ హోదాలు పెరుగుతున్నాయి. అత్యవసర కాలంలో తనకంటూ విలువైన ఆస్తి ఉందంటూ ఆ భూముల్ని చూసుకుని మురిసిపోయే పరిస్థితులొచ్చాయి. ఈ సంస్కరణల వల్ల రాష్ట్ర జీడీపీ కూడా పెరుగుతుంది. దాదాపు 22 లక్షల మంది బడుగు, బలహీన వర్గాల వారికి ప్రయోజనం. – కె. నారాయణ స్వామి, ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి) భూ సంస్కరణలు సీఎం జగన్‌కే సాధ్యం.. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులపై సీఎం జగన్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. సామాజిక న్యాయ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయంగా చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు అధిక ప్రయోజనం. అంబేడ్కర్ ఆశయసాధనకర్తగా సీఎం వైఎస్ జగన్ తెలుగుజాతి ఉన్నంతవరకు మిగిలిపోతారు. ఈ కాలంలో అంటరానితనంపై అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పక తప్పదు. – పీడిక రాజన్న దొర, ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమ శాఖ మంత్రి) అంటరానితనంపై సవాల్ పేదలకు మేలు చేసే విషయాలపై గత పాలకులు సగం సగం నిర్ణయాలే తీసుకున్నారు. సీఎం జగన్ మాత్రం చిత్తశుద్ధితో అసైన్డ్ భూములపై నిర్ణయం తీసుకున్నారు. అంటరానితనంపై ప్రభుత్వ పరిపాలన సవాల్ విసిరినట్లు ఉంది. నాలుగేళ్ల పాలనలో విప్లవాత్మక సంస్కరణల ద్వారా సీఎం తన విశ్వరూపం చూపారు. – పినిపె విశ్వరూప్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చరిత్రాత్మక నిర్ణయం అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం చరిత్రాత్మక నిర్ణయం. ఎంతటి కష్టమొచ్చినా ఇన్నాళ్లూ అసైన్డ్ భూములను అమ్ముకోడానికి వీలు లేని పరిస్థితి. ఇకపై ఆ బెంగ తీరనుంది. దీనివల్ల 15.21 లక్షల మంది పేదలకు చెందిన 27.41 లక్షల ఎకరాల భూమిని పేదలు అమ్ముకోడానికి అవకాశం కలుగుతోంది. వాళ్లకు హక్కులు కల్పిస్తే వారి జీవితాలు బాగు పడతాయనే ఆలోచనే గొప్ప మార్పునకు నాంది. – మేరుగు నాగార్జున, రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి దేశంలో గొప్ప భూ సంస్కరణ అసైన్డ్ భూములపై దళితులకు సర్వహక్కులు కల్పించడం దేశంలోనే గొప్ప భూ సంస్కరణ. 20 ఏళ్లపాటు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూమిపై ఉన్న ఆంక్షలన్నీ ఎత్తేసి ఆ భూమిపై సర్వహక్కుల్ని లబ్ధిదారులకు కల్పించడం నిజంగా గొప్ప విషయం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి భూ సంస్కరణ జరగలేదు. భూములపై హక్కు కల్పించడం అంటే వారి హోదాను పెంచడమన్న విషయాన్ని విపక్షాలు గుర్తించాలి. – ఆదిమూలపు సురేష్, పురపాలక శాఖ మంత్రి సీఎం జగన్‌కు సెల్యూట్ అసైన్డ్ భూములపై సంస్కరణలు పేద రైతుల హోదాను పెంచే మహత్తర నిర్ణయంగా భావించాలి. దళిత ప్రజాప్రతినిధులమంతా సీఎం జగన్‌కు సెల్యూట్ చేస్తున్నాం. ఈ భూ సంస్కరణల ద్వారా 15.21 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. భూ రీసర్వే ద్వారా ఇప్పటికే 19 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. – నందిగం సురేష్, వైఎస్సార్సీపీ బాపట్ల ఎంపీ గొప్ప ఫలితాలు ఖాయం వైఎస్ జగన్ ప్రభుత్వం విలువ లేకుండా ఉన్న భూములపై ఆంక్షలు తొలగించి, వాటిపై అనుభవదారులకు సర్వ హక్కుల్ని కల్పించింది. తద్వారా పేద రైతుల సామాజిక హోదాను పెంచే దిశగా అడుగులు ముందుకు వేసింది. ప్రభుత్వ ఆస్తులు, ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ఆస్తుల్ని వేర్వేరుగా రికార్డుల్లో చేర్చి, వివాదాలను పరిష్కరిస్తోంది. స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి భూ హక్కుల సంస్కరణలు గొప్ప ఫలితాల్ని ఇవ్వనున్నాయి. – తానేటి వనిత, రాష్ట్ర హోం శాఖ మంత్రి రైతు హోదాను పెంచే మహత్తర నిర్ణయం 20 ఏళ్లపాటు అనుభవమున్న భూమిపై సర్వహక్కులు కల్పించటం, ఆంక్షలు ఎత్తివేత సహసోపేత నిర్ణయం. ఒక మేజర్ సంస్కరణ తీసుకు రావాలని రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచించారు. 20 ఏళ్లపాటు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూమిపై ఆంక్షలన్నీ ఎత్తేసి ఆ భూమిపై సర్వహక్కుల్ని లబ్ధిదారులకు కల్పించారు. రైతుకు తన భూమిపై హక్కు ద్వారా తన హోదాను పెంచే నిర్ణయంగా భావించాలి. – మేకతోటి సుచరిత, మాజీ మంత్రి దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం సీఎం వైఎస్ జగన్ సామాజిక బాధ్యతతో తీసుకున్న ఈ నిర్ణయం భారత సామాజిక న్యాయ చరిత్రలో సువర్ణ అధ్యాయం. అసైన్డ్ భూములకూ ఇక మంచి ధర వస్తుంది. ఆయా రైతుల స్థితిగతులు, ఆదాయ హోదాలు పెరుగుతాయి. విలువైన ఆస్తి అని వారు సంబరపడుతున్నారు. – జూపూడి ప్రభాకర్‌రావు, ప్రభుత్వ సలహాదారు -
మాది దిగువ వీధి కాదు..ఇందిరా నగర్
‘కీజ తెరు’ అనంటే తమిళంలో ‘దిగువ వీధి’ అని అర్థం. ప్రతి ఊరిలో దిగువ వీధి ఉంటుంది. దిగువ వీధిలో ఎవరుంటారో ఊరి వారికి తెలుసు. దళితులు. వారు నివసించే ప్రాంతాన్ని ఆ విధంగా గుర్తిస్తారు. ‘ఇలా పేరులో వివక్షను తొలగించండి’ అని తమ వాడ పేరును మార్చడానికి సంవత్సరం పాటు పోరాడింది అనసూయ అనే అమ్మాయి. దిగువ వీధికి బదులుగా వారి వీధి మొన్నటి జూలై 1న ‘ఇందిరా నగర్’ అయ్యింది. వివక్ష గుర్తులను చెరిపే పోరాటం కొనసాగిస్తానని అంటోంది అనసూయ. తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ పదవి స్వీకరించాక 2022 అక్టోబర్‌లో గ్రేటర్ చెన్నై అంతటా కులాలను సూచించే వీధుల పేర్లను, భవంతుల పేర్లను తొలగించవలసిందిగా ఆదేశించాడు. దేశంలో అన్నిచోట్ల ఉన్నట్టే తమిళనాడులో కూడా ఊళ్లలోని కొన్ని వీధులను కులాల పేర్లతో పిలవడం వాడుకలో ఉంది. సామాజిక స్పృహ పెరిగాక ఈ ధోరణి తగ్గినా చైతన్యం ఎంతో అవసరం ఉంది. ముఖ్యంగా దళితుల విషయంలో. వీరికి ఆలయాల ప్రవేశంలోగాని, ఊరి కట్టుబాట్లలో ప్రాధాన్యం ఇవ్వడంలోగాని వివక్ష పాటిస్తున్నారనే ఎన్నో వార్తలు తమిళనాడు నుంచి వింటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అనసూయ శరవణ ముత్తు అనే 28 ఏళ్ల సివిల్ ఇంజినీర్ తన ఊరిలోని తన వాడకు మర్యాదకరమైన పేరు సాధించడంలో విజయం పొందింది. ఆది ద్రావిడార్ తెరు తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో ఆనందవాడి అనే చిన్న పల్లె ఉంది. ఆ పల్లెలో 1994లో దళితులకు పట్టాలిచ్చారు. 2000 సంవత్సరానికి 100 కుటుంబాలు అక్కడ ఇళ్లు కట్టుకుని తమ పేటకు ‘ఇందిరా నగర్’ అని పేరు పెట్టుకున్నారు. అయితే వారు పెట్టుకునే పేరు వారు పెట్టుకోగా ఊరు వారిని తాను ‘ఎలా గుర్తించాలనుకుంటున్నదో’ అలా గుర్తించి ఆ పేటను ‘ఆది ద్రావిడార్ తెరు’, ‘పార తెరు’, ‘ఆది ద్రావిడార్ తెరు’, ‘కీజ తెరు’, ‘దళిత కాలనీ’... ఇలా పిలవడం మొదలెట్టింది. ఇవన్నీ కూడా దళితులు నివసించే ప్రాంతాన్ని సూచించేవే. ‘నా చిన్నప్పుడు స్కూల్లో మా పేట పేరు చెప్పిన వెంటనే నేనెవరో పోల్చుకునేవారు. అప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను’ అని ఇదే ప్రాంతం, సామాజిక వర్గం నుంచి చదువుకుని సివిల్ ఇంజనీర్ అయిన అనసూయ శరవణముత్తు అంది. ‘నేను కాలేజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెళ్లిపోయాను. 2022లో తిరిగి వస్తే ఇంకా కులాన్ని సూచించే పేరుతోటే నా పేటను పిలుస్తున్నారు. ఇది ఎంతమాత్రం కుదరదు అని నిశ్చయించుకున్నాను’ అంది అనసూయ. అందరితో పోరాడి... ఇందిరా నగర్ అనే పేరును రెవిన్యూ వారు ఏ మాత్రం పట్టించుకోకుండా ‘దిగువ వీధి’ అనే పేరుతోనే వీరి పేటను రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. అలాగే రేషన్ కార్డుల్లో, ఆధార్ కార్డుల్లో, ఓటర్ కార్డుల్లో, చివరకు పాస్‌పోర్టుల్లో కూడా ఇందిరా నగర్ అని తప్ప రకరకాల వివక్ష పేర్లతో ఇక్కడ నివసిస్తున్న దళితుల గుర్తింపు కార్డులు నమోదై ఉన్నాయి. దాంతో అనసూయ 2022 ఆగస్టు నుంచి పోరాటం మొదలెట్టింది. ‘మొదట కలెక్టర్ చుట్టూ తిరిగాను. తిప్పించుకుని తిప్పించుకుని అక్టోబర్ నాటికి అఫీషియల్‌గా రికార్డుల్లో మార్చారు. కాని అసలు సమస్య పంచాయతీతో వచ్చింది. ఆనందవాడి పంచాయతీ మా పేటను దిగువ వీధి అని పిలవకూడదనే తీర్మానం చేయడానికి ఏమాత్రం ముందుకు రాలేదు. నేను పోరాడితే ఫిబ్రవరిలో తీర్మానం చేశారు. ఆ తర్వాత పంచాయితీ పెద్దలొచ్చి మా పేట ముందు బోర్డు పెట్టే కార్యక్రమంలో పాల్గొనమని ఎన్నిసార్లు తిరిగినా రాలేదు. దాని కోసం మళ్లీ పోరాడాల్సి వచ్చింది. చివరకు మొన్న జూలై 1న పంచాయతీ పెద్దలంతా వచ్చి బోర్డును నిలబెట్టి వెళ్లారు’ అని తెలిపింది అనసూయ. వివక్షాపూరితం వెనుకబడ్డ, దళిత వర్గాలను సులువుగా గుర్తించేందుకు ఎప్పటి నుంచో వారు నివసించే ప్రాంతాలకు వివక్షాపూరితమైన పేర్లు పెట్టే ఆనవాయితీ ఉందని ఈ ఉదంతం విన్నాక అనసూయను అభినందిస్తూ విల్లుపురం ఎంపీ రవికుమార్ అన్నారు. ‘నువ్వు ఎక్కడుంటావు అనే ప్రశ్నతో ఎదుటివారి కులం ఏమిటో ప్రాంతాన్ని బట్టి అర్థమవుతుంది. దీంతో వివక్ష మొదలవుతుంది. ఇలాంటి వివక్షాపూరితమైన పేర్లను రాష్ట్రమంతా తొలగించాలి’ అని రవికుమార్ అన్నారు. అనసూయలాంటి అమ్మాయిలు పూనుకుంటే అదెంత సేపు? -
కుల వివక్షకు పెత్తందారుల ఆజ్యం!
నాగా వెంకటరెడ్డి – సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’’.. స్వయంగా చంద్రబాబు సందేహం ఇదీ!! ‘‘ఒరేయ్ మీకెందుకురా ఈ రాజకీయాలు? అవేవో మేం చేసుకుంటాం, మేం చూసుకుంటాం..!’’ ఎస్సీలనుద్దేశించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని అనుచిత వ్యాఖ్యలివీ! ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? టీడీపీ అధినేత ప్రోద్బలంతో ఆ పార్టీ నేతలు ఇప్పుడు అంతకంటే ఇంకో అడుగు ముందుకేశారు! దళిత ప్రజాప్రతిని ధులు తమ గ్రామాలకు వస్తుంటే చాలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోవడంతోపాటు పసుపు నీళ్లతో వీధులను శుభ్రం చేస్తున్నారు. అదీ ఎక్కడో కాదు.. స్వయంగా నారా చంద్రబాబు సొంతూరు ఉన్న మండలానికి చేరువలోనే కావడం గమనార్హం. పసుపు నీళ్లు చల్లుతూ... చిత్తూరు జిల్లాలో అధికారపార్టీకి చెందిన ఎస్సీ ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వస్తున్నట్లు తెలియగానే చంద్రబాబు సామాజిక వర్గీయులు తలుపులకు తాళాలు వేసుకుని ఇళ్లలో నుంచి వెళ్లిపోవడం, ఇతరులు ఎవరూ అందుబాటులో ఉండకూడదని హుకుం జారీచేయడం, ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన తరువాత రోడ్లపై పసుపు నీళ్లు చల్లడం, పాలతో అభిషేకాలు చేయించడం లాంటి దారుణాలకు ఒడి గడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథ కాల గురించి ప్రజలకు నేరుగా వివరిస్తూ గడప గడ పకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు (జీడీ నెల్లూరు), పూతలపట్టు నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కళ త్తూరు నారాయణస్వామి, ఎం.ఎస్.బాబు తమ తమ ప్రాంతాల్లో చురుగ్గా పర్యటిస్తున్నారు. దళిత ఎమ్మెల్యేలు వచ్చే సమయానికి అందరూ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోవాలని, ఎవరూ స్వాగతం పలకరాదని, పర్యటనలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలంటూ టీడీపీ అధినేత జారీ చేసిన ఆదేశాలను స్థానిక నాయకత్వం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటికి తాళం.. పెరటిలో సర్పంచ్ ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు ఇటీవల పూతలపట్టు మండలం గుంతూరు గ్రామ సచివాలయం పరిధిలోని 170 గొల్లపల్లె పర్యటనకు వెళ్లే సమయానికి టీడీపీ నాయకులు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వచ్చే సమయానికి ఎవరూ ఇళ్లలో ఉండకూడదని గ్రామ సర్పంచ్, టీడీపీ నాయకుడు ప్రకాష్‌నాయుడు హుకుం జారీచేయడంతో సుమారు వంద కుటుంబాలు గ్రామం వీడి వెళ్లక తప్పలేదు. సర్పంచ్ తన ఇంటికి తాళం వేసి పెరట్లోనే ఉండటం గమనార్హం. గత నెల 24వతేదీన పేట అగ్రహారం గ్రామానికి వెళ్లినప్పుడు కూడా చంద్రబాబు వర్గం దారుణంగా వ్యవహరించింది. పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల ప్రజలను బెదిరిస్తూ ఎవరైనా అందుబాటులో ఉంటే అంతు చూసా్తమని హెచ్చరించారు. ఎమ్మెల్యే పర్యటన అనంతరం వీధులను పసుపునీళ్లతో శుభ్రం చేయడం అగ్రకుల దురహంకారానికి మచ్చు తునకగా నిలుస్తోంది. దళిత నేతలకు దూరం దూరం...! ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి గత నెల 24వతేదీన జీడీ నెల్లూరు మండలం పాచిగుంటలో గడప గడపకూ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో టీడీపీ నాయకుడు మనోహర్‌నాయుడు స్థానికులను బెదిరింపులకు గురి చేయడం విస్మయం కలిగిస్తోంది. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోవాలంటూ స్థానికులను హెచ్చరించారు. దళిత ఎమ్మెల్యేలను దరిచేరనివ్వకపోవడం, గ్రామాలకు రానివ్వకపోవడం చంద్రబాబు పెత్తందారీ మనస్తత్వానికి తాజా నిదర్శనమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. ‘చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్ మేరకే మనోహర్‌నాయుడు వ్యవహరిస్తున్నారు. పాచిగుంటలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన 22 కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయేలా ఒత్తిడి చేశారు. తాటిమాకులపల్లెలో 10 కుటుంబాల వారు కూడా అదేవిధంగా వెళ్లిపోయారు. దళితులంటే చంద్రబాబుకు ఎందుకంత చులకన భావం?’ అని నారాయణస్వామి ప్రశ్నించారు. పూతలపట్టు, జీడీ నెల్లూరు చంద్రబాబు సొంత ఊరు ఉన్న మండలానికి చేరువలో ఉండటం గమనార్హం. సమాజంలో తప్పుడు సంకేతాలు రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు సహజం. దళిత ఎమ్మెల్యేలు గ్రామాల్లో కార్యక్రమాలు ముగించుకుని తిరిగి వెళ్లాక వీధులను పసుపు నీళ్లతో కడగడం, పాలాభిషేకాలు చేయడం దారుణం. దీనివల్ల ప్రజా సమస్యలు పక్కదారి పట్టడమే కాకుండా సమాజంలో తప్పుడు సంకేతాలు వెళతాయి. ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి వాటిని అంగీకరించకూడదు. – వందవాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి, తిరుపతి ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలి.. ఇన్నేళ్ల స్వతంత్ర భారత దేశంలో ఇంతటి అవమానకర వివక్ష దారుణం. వీధుల్లో పసుపునీళ్లు చల్లడం, ఇళ్లకు తాళాలు వేసుకుని బహిష్కరించడం, హేళనగా చూడటం ఏమాత్రం సరికాదు. ఇలాంటి దుర్మార్గాలకు కారకులఫై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వివక్షను నిర్మూలించాలి. ప్రజా సంఘాలు స్పందించి ప్రత్యక్ష కార్యాచరణకు నడుం బిగించాలి . – ఆండ్ర మాల్యాద్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) -
కర్ణాటక క్రీడాశాఖ మంత్రి ఇంటిపై దళితుల దాడి
-
చీరలు విసిరేసి.. కర్ణాటక మంత్రి ఇంటిపై దాడి
సాక్షి, బెంగళూరు: ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న వేళ.. కన్నడనాట సిత్ర విచిత్రాలు దర్శనమిస్తున్నాయి. అయితే.. తాజాగా కర్ణాటక క్రీడాశాఖ మంత్రి కేసీ నారాయణగౌడ ఇంటిపైకి దళితులు ఆగ్రహంతో దూసుకొచ్చారు. గత రాత్రి మంత్రి అనుచరులుగా చెప్పుకుంటున్న కొందరు స్థానికంగా కొందరికి చీరలు పంపిణీ చేశారు. అయితే.. ఆ చీరలను ఈ ఉదయం మంత్రి ఇంటి ముందు విసిరేసిన దళితులు నిరసన తెలిపారు. ఆపై వాళ్లు మంత్రి నివాసంపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో మంత్రి ఇంట్లోనే ఉన్నారా? లేదా? అనే సంగతిపై స్పష్టత కొరవడింది. ఆటో నడిపిన పీసీసీ చీఫ్.. మరిన్ని సిత్రాల కోసం క్లిక్ చేయండి -
దళితులపై లోకేష్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాల ఆందోళన
-
దళితులపై బాబు ‘చిన్న’ చూపు
నాగా వెంకటరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘చెప్పేటందుకే నీతులు’ అన్న మాట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి అతికినట్లు సరిపోతుంది. మైకు పట్టుకుంటే దళితులు, వారి అభ్యున్నతి అంటూ మాట్లాడే చంద్రబాబు.. పార్టీలో వారికి ఇస్తున్న ప్రాధాన్యత మాత్రం సున్నా. కొన్నిమార్లు దళితుల పట్ల చిన్న చూపును కూడా ఆయన వ్యక్తపరుస్తూ ఉంటారు. పార్టీ వ్యవహారాల్లోకొచ్చేసరికి అదే చిన్నచూపు చేతల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్చార్జిల నియామకం, వారిపై ఆధిపత్యం చెలాయించే బాబు బృందాలే ఇందుకు నిదర్శనం. పేరుకే ఎస్సీలను ఇన్చార్జిలుగా నియమించినప్పటికీ, ఆ నియోజకవర్గంలో పార్టీ నిర్మాణం, నిర్వహణ, కార్యక్రమాల అమలులో వారి పాత్ర శూన్యం. ఈ నియోజకవర్గాల్లో బాబు తన వర్గీయులతో వేసిన కమిటీలదే ఆధిపత్యం. వారేమి చెబితే ఇన్చార్జిలు, పార్టీ ఇతర నేతలు అది చేయాల్సిందే. దళితుల పట్ల వ్యతిరేకత, ఆ వర్గాలను చులకన చేసి మాట్లాడటం, పదవుల పంపిణీలో మోసగించడం, రాజకీయంగా ఎదగనీయకపోవడం, ఆ ప్రాంత ముఖ్య నేతల ద్వారా విభేదాలను రాజేయిస్తూ వర్గాలను ప్రోత్సహించడం, ఎన్నికలప్పుడు తమ వర్గీయుల సిఫార్సుల మేరకే అభ్యర్థిత్వాలను ఖరారు చేయడం తొలి నుంచి చంద్రబాబు సాగిస్తున్న తంతే. సీనియర్ దళిత నేతలకూ చుక్కలు చూపించడం బాబు బృందానికి రివాజే. దళితులపై చిన్న చూపులో తండ్రిని మించిన లోకేశ్ దళితులను చిన్న చూపు చూడటంలో చంద్రబాబు కుమారుడు లోకేశ్ తండ్రిని మించిపోయాడన్న వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి. పాదయాత్రలో కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ ఎన్నికల్లో గెలిపించండని లోకేశ్ చెబుతున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మాత్రం ఆయన ఎవరి పేరూ చెప్పకపోవడం గమనార్హం. రానున్న ఎన్నికల్లో నగరిలో గాలి భానుప్రకాశ్, చంద్రగిరిలో పులివర్తి నానిలను గెలిపించాలని ఆయన చెప్పారు. వాటి పొరుగునే ఉన్న పూతలపట్టు, గంగాధర నెల్లూరు ఇన్‌ఛార్జిల ప్రస్తావనే లోకేశ్ నోటి వెంట రాలేదు. ♦ కొవ్వూరు స్థానాన్ని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆశిస్తున్నారు. గత ఎన్నికలప్పుడు ఆయన్ని కొవ్వూరు నుంచి తప్పించి తిరువూరుకు పంపగా అక్కడ ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం కంఠమని రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరితో కూడిన ద్విసభ్య కమిటీ అక్కడ ఆధిపత్యం చెలాయిస్తోంది. వీరివురూ బాబు సామాజికవర్గానికి చెందిన వారే. ఇక్కడ వీరిదే హవా. దళితుడైన మాజీ మంత్రి పార్టీ కార్యాలయానికి కూడా వచ్చే అవకాశం లేదు. సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన కార్యక్రమాలేవో ఆయన చేసుకుంటున్నారు. ♦ చింతలపూడి నుంచి మాజీ మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహించగా ప్రస్తుతం అక్కడ ఆమెకు ఇన్చార్జి బాధ్యతలు కూడా లేవు. నియోజకవర్గానికి చెందిన గంటా మురళీరామకృష్ణ, గంటా సుధీర్, పరిమి సత్తిపండు, గరిమెళ్ల చలపతి తదితరులదే పెత్తనం. ♦ చంద్రబాబు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు పరిధిలోని గంగాధర నెల్లూరులో చిట్టిబాబు నాయుడుదే ఆధిపత్యం. పూతలపట్టులో యువరాజు నాయుడు, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో కె.విశ్వనాథ నాయుడు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో మాకినేని పెద్దరత్తయ్యలే పార్టీ పెద్దలు. అనంతపురం జిల్లా సింగనమలలో బండారు శ్రావణితో పాటు పలుకుబడి కలిగిన వేర్వేరు సామాజికవర్గాల నేతలు అజమాయిషీ చలాయిస్తున్నారు. కోడుమూరు, నందికొట్కూరు, బద్వేలు స్థానాల్లోనూ ఇదే తంతు. ♦ డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఇన్ఛార్జిగా లోక్‌సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్‌ను నియమించారు. హరీష్ అమలాపురం లోక్‌సభ నియోజకవర్గానికి కూడా ఇన్చార్జి. కానీ, ఆయన మాటకు ఇక్కడ విలువ లేదు. నామని రాంబాబు, డొక్కా నాథ్‌బాబు ఎలా చెబితే అలా ఆడాలి. ♦ విజయనగరం జిల్లా రాజాంలో మాజీ మంత్రి కొండ్రు మురళిమోహన్ ఇన్చార్జిగా ఉన్నప్పటికీ, అక్కడ రాష్ట్ర పార్టీ మాజీ అ«ధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుదే ఆధిపత్యం. మాజీ సభాపతి కావలి ప్రతిభా భారతి, ఆమె కుమార్తె కావలి గ్రీష్మకూ పార్టీలో ఎటువంటి విలువా లేదు. ♦ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఇన్ఛార్జిగా చావల దేవదత్తుని నియమించినప్పటికీ, ఆయనకు ఏ అధికారమూ లేదు. పార్టీలో హవా అంతా బాబు వర్గానికి చెందిన చెరుకూరి రాజేశ్వరరావు, సుంకర కృష్ణమోహన్‌రావు, నెక్కలపు వెంకట్రావులదే. ఆర్థికంగా బలవంతులైతే చాలు... ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ సీనియర్లు ఇటీవల చంద్రబాబుకు, లోకేశ్‌కు ఝలక్ ఇచ్చారు. గుడివాడ పార్టీ బాధ్యతలను నిర్వర్తిస్తున్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు ప్రత్యామ్నాయంగా తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఎన్నారై వెనిగండ్ల రామును ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటన ఏర్పాట్లపై పలుసార్లు సమావేశమైన సీనియర్లు రాముకు ఆహ్వానం కాదు కదా కనీసం సమాచారాన్ని కూడా ఇవ్వలేదు. దీనిపై రాము అలకబూనారన్న సంగతి తెలియగానే బాబు సీరియస్ అయ్యారు. నియోజకవర్గాలలో ఎవరైనా పార్టీ కోసం పనిచేయవచ్చని, ఇందుకు ఎవరి అనుమతీ అవసరంలేదని ఫత్వా జారీ చేశారు. దీంతో బాధ్యతలు అప్పగించిన వారు మినహా మరెవరూ నియోజకవర్గ పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని రాష్ట్ర అధ్యక్షుని హోదాలో అచ్చెన్నాయుడు గతంలో ఇచ్చిన సర్క్యులర్‌కు విలువలేకుండా పోయింది. స్థితిమంతులు, తన వర్గానికి చెందిన నేతల విషయంలో ఒకలా, ఇతర వర్గాల విషయంలో మరోలా బాబు వ్యవహారం ఉంటుందనే పార్టీ నేతల అభిప్రాయానికి గుడివాడ వ్యవహారం ఒక నిదర్శనం. -
దళితులను చూస్తే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంట?
మంత్రి ఆదిమూలపు సురేష్ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ మాటలను వెనక్కు తీసుకోవాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు.యర్రగొండపాలెంలో చంద్రబాబు కావాలనే జనాన్ని రెచ్చగొట్టారని, టీటీడీ కార్యకర్తల ద్వారా రాళ్ల దాడి చేయించారని అన్నారు. వీడియోలు చూస్తే రాళ్లదాడి చేసిన వారు ఎవరనేది స్పష్టంగా కనిపిస్తుందని, కానీ దాన్ని తోసిపుచ్చి మాపై ఎదురుదాడి చేయటం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే సురేష్‌కు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి సురేష్ మంచి విద్యావేత్త, అలాంటి వ్యక్తిపై ఇలాంటి దాడులు చేయటం కరెక్ట్ కాదు. చంద్రబాబుకు అసలు దళితులను చూస్తే ఎందుకంత కడుపుమంట అని నిలదీశారు. దళితులకు సీఎం జగన్ ఎంతో మేలుచేస్తూ అవినీతికి తావు లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నారని, ప్రస్తుతం వారి జీవన ప్రమాణాలు కూడా పెరిగాయని డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. అంతమాత్రానికే దళితులపై చంద్రబాబు ద్వేషం ఏంటన్నారు. దళిత మంత్రి సురేష్‌కు రక్షణ కావాలని, అంతే కాకుండా చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని డిమాండ్ చేసారు. దళితులకు మంచి జరుగుతుంటే వారిపై మీ స్టాండ్ ఏంటని అన్నారు. రెండు లక్షల కోట్ల డబ్బు నేరుగా పేదలకే చేరితే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంట అని కూడా ప్రశ్నించారు. -
తెలుగుదేశం పార్టీని దళితులు నమ్మే పరిస్థితి లేదు
-
దళితులపైకి కార్యకర్తలను రెచ్చగొట్టిన చంద్రబాబు
యర్రగొండపాలెం: దళితులపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేతలు, దళితులపై దాడులు చేసేలా తమ కార్యకర్తలను రెచ్చగొట్టారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. దీంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నేతలు, దళితులపై రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్ సీపీ నేతలు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వైఎస్సార్సీపీకి చెందిన జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ షాబీర్‌బాషా, పెద్దారవీడు మండలంలోని కంభాలపాడు సర్పంచ్ బెజవాడ ఆదాం, మరొకరిని ఆస్పత్రికి తరలించారు. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అయి ఉండీ దళితులపైకి కార్యకర్తలను రెచ్చగొట్టడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. శుక్రవారం యర్రగొండపాలెం వస్తున్న చంద్రబాబుకు నిరసన తెలుపుతూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో దళిత నాయకులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు నల్లటి కండువాలు మెడలో వేసుకుని, బెలూన్లు, ప్లకార్డులతో మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద రోడ్డుకు ఒక పక్క నిలబడ్డారు. దళితులనుద్దేశించి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, గో బ్యాక్ చంద్రబాబు, దళిత ద్రోహి చంద్రబాబు, నారా లోకేశ్ అంటూ నినాదాలు చేశారు. దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ క్షమాపణ చెప్పిన తర్వాతే ఎస్సీ నియోజకవర్గంలోకి అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, దళితుల నిరసన విషయాన్ని తెలుసుకున్న టీడీపీ నాయకులు కొంతమంది.. దాడులు జరపాలన్న ప్రధాన ఉద్దేశంతో మంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు ర్యాలీగా వచ్చారు. వీరిని పోలీసులు కొద్ది దూరంలోనే నిలిపివేశారు. ఆ తర్వాత చంద్రబాబు కాన్వాయ్ మంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చింది. కాన్వాయ్ వెళ్లేందుకు ఎటువంటి ఆటంకాలు లేకపోవడం వలన సజావుగా సాగుతుందని పోలీసులు భావించారు. అయితే, చంద్రబాబు హఠాత్తుగా తన కారు డోరు తీసుకొని బయటకు వచ్చారు. నిరసన తెలుపుతున్న మంత్రి సురేష్పైన, దళితుల పైన సీరియస్‌గా వేలు చూపిస్తూ దూషించడం మొదలుపెట్టారు. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయేలా మాట్లాడారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రాళ్లు, ఇనుప రాడ్లు, చెప్పులు మంత్రి సురేష్ పైన, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, దళితులపైన విసరడం మొదలు పెట్టారు. పోలీసులు వెంటనే మంత్రిని క్యాంపు కార్యాలయంలోకి తీసుకెళ్లారు. టీడీపీ రాళ్ల దాడిలో ఇద్దరు వైఎస్సార్సీపీ నేతలకు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితిని పోలీసులు చక్కదిద్ది, బాబు కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపించారు. గాయాలైన ముగ్గురికీ స్థానిక ప్రభుత్వ వైద్యులతో మంత్రి సురేష్ చికిత్స చేయించారు. అందరినీ చదివిస్తా : చంద్రబాబు సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ మార్కాపురం: టీడీపీ అధికారంలోకి వస్తే పిల్లలందరినీ చదివిస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు. రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. అందరికీ ఉద్యోగాలు రావాలని, ఉద్యోగాలు వచ్చిన వారందరూ తనను బాగా చూసుకోవాలని అన్నారు. ఆయన శుక్రవారం రాత్రి యర్రగొండపాలెంలో రోడ్ షో నిర్వహించారు. అంతకుముందు మార్కాపురంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్మోహన్రెడ్డి ఇంట్లో ఒకరికే అమ్మ ఒడి ఇస్తున్నారని, మిగతా ఇద్దరూ కూలి పనులకు వెళ్లాలా అంటూ ప్రశ్నించారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పారు. వర్షం కూడా టీడీపీ అంటే భయపడింది తమ్ముళ్లూ.. వర్షమొస్తే కరెంటు పోతుందా అని కేడర్‌ను చంద్రబాబు అడగడంతో కేడర్ నోరెళ్లబెట్టింది. -
కర్నూల్ లో లోకేష్ పాదయాత్రకు నిరసన సెగ
-
దగాకోరు డ్రామాలు!
♦ మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్‌ను పక్కగదిలో కూర్చోబెట్టి టీజే వెంకటేష్‌తో బేరాలు కుదుర్చుకుని రాజ్యసభ సీటు అమ్ముకున్నారు. ♦ వర్ల రామయ్యకు ఆఖరిలో బలవంతంగా తిరుపతి ఎంపీ సీటు కేటాయించి బలి పశువును చేశారు. పామర్రులో పనిగట్టుకుని తమవాళ్లతో ఓడించారు. ♦ మీకెందుకురా రాజకీయాలు, పదవులు?.. అవి మాకోసమే ఉన్నాయంటూ అనుంగు శిషు్యడు చింతమనేనితో చెప్పించిన నాడు చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. ♦ దళిత నాయకుల్లో ఏ ఒక్కరూ రాజకీయంగా ఎదగకుండా వెన్నుపోటు రాజకీయాలు ఆయన నైజం. ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని వ్యాఖ్యానించినప్పుడే చంద్రబాబు అంతరంగం బోధపడింది. ‘దళితులు పీకిందీ లేదు... పొడిచిందీ లేదు’ అంటూ దురహంకారంతో మాట్లాడిన లోకేష్ తండ్రికి తగ్గ తనయుడినని రుజువు చేసుకున్నారు. నాగా వెంకటరెడ్డి, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దళిత బాంధవుడిగా ప్రచారం చేసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తనకు అలవాటైన డ్రామాలను రక్తి కట్టిస్తున్నారు. తమ పార్టీలోని దళిత నేతలను కరివేపాకులా వాడుకుంటున్న చంద్రబాబు దళిత సంక్షేమమంటూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఆ తరువాత కూడా దళితులను రాజకీయంగా ఎదగనివ్వకుండా చంద్రబాబు అణగదొక్కారనేందుకు ఎన్నో ఉదంతాలున్నాయి. రిజర్వుడు స్థానాలకు అభ్యర్థుల ఎంపికలోనూ బాబు కోటరీ బృందానిదే పెత్తనం. తాము మంత్రులుగా పనిచేసినా చివరిదాకా టికెట్ కోసం ఎదురు చూడాల్సిందేనని గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ దళితనేత ‘సాక్షి’తో పేర్కొన్నారు. తామెంత సీనియర్లు అయినా టికెట్ దక్కాలంటే బాబు వర్గీయుల సిఫార్సులు తప్పనిసరని కృష్ణా జిల్లాకు చెందిన మరో నాయకుడు వ్యాఖ్యానించారు. ♦ కొవ్వూరు నుంచి 2009లో టీవీ రామారావు విజయం సాధించినప్పటికి తదుపరి ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. 2014లో అక్కడ గెలుపొంది మంత్రిగా వ్యవహరించిన కె.ఎస్.జవహర్‌కు 2019లో టికెట్ నిరాకరించి తిరువూరుకు మార్చడంతో ఓడిపోయారు. 2014లో పాయకరావుపేట నుంచి గెలుపొందిన వంగలపూడి అనితను 2019లో కొవ్వూరుకు మార్చి బరిలోకి దించటంతో ఓడిపోయారు. కొవ్వూరు ఎమ్మెల్యే ఎవరైనా పెత్తనం మాత్రం బాబు వర్గీయులదే. ♦ చింతలపూడిలో 2009, 2014, 2019లో వరుసగా మార్పులు చేశారు. 2014లో గెలిచి మంత్రిగా పనిచేసిన పీతల సుజాతను తరువాత పక్కనపెట్టేశారు. 2009, 2019లో కె.రాజారావు పార్టీ అభ్యర్థి కావడం గమనార్హం. ♦ ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరులో 1983 నుంచి ఉప ఎన్నికతో సహా పదిసార్లు ఎన్నికలు జరగ్గా తూమాటి పెంచలయ్య మాత్రమే రెండుసార్లు పోటీ చేయగలిగారు. అదీ ఎన్టీఆర్ ఉన్నప్పుడు. ఆ తరువాత ఎనిమిది ఎన్నికల్లోనూ కొత్త ముఖాలే. కె.నారాయణయ్య నాయుడు, జి.ఎన్.నాయుడు కనుసన్నల్లో నడుచుకున్న వారికే అవకాశం దక్కింది. ♦ బద్వేలు, నందికొట్కూరు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల అభ్యర్థులు గత మూడు ఎన్నికల్లోనూ మారిపోయారు. మిగతా చోట్లా ఇదే పరిస్థితి. టీడీపీలో రిజర్వుడు స్థానం నుంచి రెండు, మూడు పర్యాయాలు వరుసగా టిక్కెట్ దక్కడమంటే పెద్ద విశేషమే. దళితులు పీకిందేమీ లేదు: లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగాగురువారం రోజు నంద్యాల జిల్లా డోన్ పరిధిలోని జక్కసానిపల్లెలో ఎస్సీలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ విదేశీ విద్య పథకం గురించి మాట్లాడుతూ ‘దళితులు పీకిందీ లేదు... పొడిచిందీ లేదు...’ అని దారుణంగా వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ♦ రాజమహేంద్రవరంలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి వరుసగా రెండు పర్యాయాలు ఓడినా ఆయనకు మాత్రం సీటు గ్యారంటీనే. ఇదే జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే టీడీపీ అధినేత తీరు తేటతెల్లమవుతుంది. ♦ దేవినేని ఉమాకు అనుకూలంగా ఉన్నందున ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తంగిరాల సౌమ్య, అంతకుముందు ఆమె తండ్రి తంగిరాల ప్రభాకరరావుకు అవకాశం కల్పించారు. ♦ ఆలపాటి రాజేంద్రప్రసాద్ సహకారంతో బాపట్ల జిల్లా వేమూరులో నక్కా ఆనందబాబు కొనసాగుతుండటం గమనార్హం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో మాకినేని పెదరత్తయ్యది పెత్తనమైనా 2009లో కందుకూరి వీరయ్య, 2014లో రావెల కిషోర్‌బాబు, 2019లో డొక్కా మాణిక్య వరప్రసాద్ పోటీ చేశారు. ♦ పొత్తు కుదిరిందంటే చాలు.. రిజర్వుడు స్థానాలను కేటాయించేందుకు చంద్రబాబు ఏమాత్రం సంకోచించరు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వామపక్షాల కోటాలో చేరేది. కర్నూలు జిల్లా కోడుమూరును గతంలో బీజేపీకి కేటాయించడం విశేషం. -
విగ్రహాలు కాదు.. దళితులకు చేసిందేమిటి..?
కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కొందరు విమర్శిస్తున్నారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్‌తో కలసి నెహ్రూ పనిచేశారు. రాజ్యాంగ పరిరక్షణకు తోడ్పడ్డారు. నాడు కాంగ్రెస్ తెచి్చన సంస్కరణలతోనే నేడు మోదీ ప్రధాని అయ్యారు. –ఖర్గే సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘‘ఒకరు 20 అడుగులు, మరొకరు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ పేద దళితులకు చేసిందేమీ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను మోసం చేస్తున్నాయి. కేవలం ప్రకటనలు చేస్తే సరిపోదు. పేద దళితుల కోసం చేసిందేమిటో చెప్పాలి..’’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. నేటి ప్రభుత్వాలు భావ ప్రకటనా స్వేచ్ఛను, హక్కులను హరిస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో జరిగిన ‘జైభారత్ సత్యాగ్రహ సభ’లో మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దళితుల పేరు చెప్పి మోసం.. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని కేసీఆర్ దళితుల పేరు చెబుతూ మోసం చేస్తున్నారని ఖర్గే విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో దళితుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించినది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి ఇవ్వకుండా దళితులను మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడ్డాక దళితుల కోసం ఎన్ని నిధులు కేటాయించారు? ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. కేవలం పేపర్లలో ప్రకటనలు ఇస్తే సరిపోదన్నారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. భావ ప్రకటన స్వేచ్ఛను, హక్కులను హరిస్తున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దేశానికి ఎంతో సేవ చేసిందని.. కానీ ఆగమేఘాలపై రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేశారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఏనాడూ ప్రతిపక్షాలపై కక్షగట్టలేదన్నారు. కానీ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బలహీనపర్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మీరు చేసిందేంటో చెప్పండి.. కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు విమర్శిస్తున్నారని, నాడు చేసిన కాంగ్రెస్ తెచి్చన సంస్కరణలతోనే నేడు మోదీ ప్రధాని అయ్యారని, అమిత్‌షా హోంమంత్రి అయ్యే అవకాశం వచి్చందని ఖర్గే చెప్పారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్‌తో కలిసి నెహ్రూ పని చేశారని, రాజ్యాంగ పరిరక్షణకు తోడ్పడ్డారని గుర్తుచేశారు. బీజేపీ నేతలు దేశానికి చేసినదేమిటో చెప్పాలన్నారు. దేశ సేవలో వారి పాత్ర ఏమిటని ప్రశ్నించారు. పైగా ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ.. అదేమీ చేయకపోగా ఎయిర్‌పోర్టులు, రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిలో ప్రైవేటీకరణతో నేడు ఉద్యోగాల సంఖ్య 40వేలకు తగ్గిందని చెప్పారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రేవంత్‌రెడ్డి, భట్టి పాదయాత్రలు చేపట్టారన్నారు. -
చరిత్రలో ఇన్ని పథకాలు ఎవ్వరూ ఇవ్వలేదు
-
Nara Lokesh : దళితులు పీకిందేమీ లేదు
సాక్షి ప్రతినిధి కర్నూలు: దళితులపై నారా లోకేశ్ నోరుపారేసుకున్నారు. అసభ్య పదజాలంతో ఆ వర్గాన్ని దూషించారు. ‘యువగళం’ పేరుతో చేస్తున్న పాదయాత్రలో లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి. పాదయాత్రలో భాగంగా గురువారం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గానికి లోకేశ్ చేరుకున్నారు. జక్కసానిపల్లిలో ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురానికి చెందిన అక్కులప్ప అనే దళితుడు విదేశీ విద్య, అవుట్ సోర్సింగ్, కస్తూరిబా గురుకుల పాఠశాలలోని ఉద్యోగులను పర్మినెంట్ చేసే విషయంలో టీడీపీ వైఖరిని ప్రశ్నిం చాడు. టీడీపీ అధికారంలోకి వస్తే ‘అంబేడ్కర్ విదేశీ విద్య’ అని పేరు మారుస్తారా? అన్నారు. ఇందుకు లోకేశ్ బదులిస్తూ ‘విదేశీ విద్యను చంద్రబాబు తీసుకొచ్చారు. కొంతమంది పిల్లలైనా విదేశాలకు వెళ్తే, మరో పదిమంది వెళ్తారనే ఉద్దేశంతో ప్రారంభించారు. ప్రస్తుతం చాలామంది పిల్లలు విదేశాలకు వెళ్లి ఇరుక్కుపోయారు. టీడీపీ ప్రభుత్వం ఒక ఏడాది ఫీజులు చెల్లించింది. ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదు. విదేశాల్లో చదివే విద్యార్థులు అప్పులపాలయ్యారు. విదేశీ విద్యతో పాటు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు తీసేశారు. ప్రభుత్వం రూ.30కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చినంత మాత్రాన పిల్లలు విదేశాలకు వెళ్లరు. విదేశీ విద్యపై పోరాడిన వ్యక్తి మీ లోకేశ్. మంగళగిరి వేదికగా నేనే పోరాడాను. దళితులు పీకింది లేదు... పొడిచింది లేదు. ఈయన పేరు పెట్టేందుకు!’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలంరేపుతున్నాయి. గతంలో లోకేశ్ తండ్రి చంద్రబాబు కూడా ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు?’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
త్వరలో ఎస్సీ సదస్సు
సాక్షి, అమరావతి: దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. దళితులకు సంక్షేమ పథకాల అమలుపై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సమీక్ష జరిగింది. పార్టీ ఎస్సీ విభాగాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకునేలా చైతన్యం చేయడంపై చర్చించారు. దళితుల్లో నాయకత్వాన్ని పెంపొందించేలా చురుకైన కార్యకర్తలు, నేతలను గుర్తించి ప్రోత్సహించాలని నిర్ణయించారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నాగార్జున మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న మేలు, చేకూరుతున్న ప్రయోజనాలను వివరిస్తూ త్వరలో రాష్ట్రస్థాయి ఎస్సీ సదస్సు నిర్వహిస్తామని ప్రకటించారు. దళితులను మోసగించేందుకు టీడీపీ పన్నుతున్న కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ సూచించారు. చంద్రబాబు హయాంలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. ఎస్సీ విభాగానికి సంబంధించి అన్ని కమిటీలను బలోపేతం చేస్తామని సామాజిక న్యాయ సలహాదారుడు జూపూడి ప్రభాకరరావు తెలిపారు. సీఎం జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలను జగనన్న సందేశం పేరుతో ఇంటింటికీ తీసుకు వెళ్తామని చెప్పారు. -
వివక్ష ఉందంటే ఉలుకెందుకు?
వివక్ష సృష్టికర్తలు, వివక్ష లేదని చెప్పడమో లేక దాన్ని తక్కువ చేసి చూపడమో చేస్తూ వుంటారు. అందులో భాగంగానే బాధితుల ఆక్రందనల్ని ప్రమాదకరమైన అలవాట్లుగా చూపిస్తుంటారు. ఈ మధ్య ఒక వైపు దళితుల మీద వివక్ష వుందని చెబుతూనే మరోవైపు వివక్ష తీవ్రతనూ, పరిమాణాన్నీ పలుచన చేసి చూపించే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. నవంబర్ 17న ‘సాక్షి’లో పి. కృష్ణమోహన్ రెడ్డి రాసిన ‘ఇక్కడి వివక్షే కనిపిస్తుందా?’ వ్యాసంలో ఈ ధోరణి కనిపిస్తుంది. ఆధారాల కంటే సొంత అవసరాలనే నిజాలుగా ప్రచారంచేసే పోస్ట్– ట్రూత్ మేధావులు పెరిగిపోయారు. ఇక్కడి వివక్షని తెలుసు కోవడానికి విదేశాల రిపోర్టులు అవసరం లేదనీ... నిజాన్ని గుర్తించే జ్ఞానం వుంటే సరిపోతుందనీ తెలుసుకోలేకపోతున్నారు. కులం కొనసాగింపు కోసం కొత్తకొత్త వాదనలు కనిపెడుతున్నారు. దళితులు ప్రతి విషయాన్నీ కుల కోణం నుంచి చూస్తున్నారని ఆందోళన చెందటం అందులో మొదటిది. తమ తప్పును కప్పిపుచ్చు కోవడానికి అన్ని కులాలు వివక్ష ఎదుర్కొంటున్నాయి అంటారు. దళితులు ఎదుర్కొనే అంటరానితనం భిన్నమైందని ఒప్పుకోరు. ‘కొన్ని సంఘటన లను చూపించి’ దేశమంతా వివక్ష ఉందనడం సరి కాదంటారు. 2021లోనే దేశంలో 50,900 దాడులు నమోదు అయినట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో చెప్పింది. ఇన్ని దాడులు చెదురు మదురు ఘటనలుగా కనిపించడం ఆశ్చర్యమే. దళితులు ఇక్కడి వివక్షనే ఎదిరించడం ‘అధర్మ’మట. ఆఫ్రికాలో అపార్తీడ్కూ, అమెరికాలో జాతి వివక్షకూ వ్యతిరేకంగా దళితులు సంఘీభావం ప్రకటించడం వీళ్ళకి కనబడదు. ఎక్కడో వివక్ష ఉంది కాబట్టి ఇక్కడ దళితులు దాన్ని అనుభవించాలంటారు! ఆస్ట్రేలియాలో ఆదివాసీలకు జరిగిన అన్యాయానికి ఆ దేశ అధినేత క్షమాపణ చెప్పాడు. అమెరికాలో నల్ల జాతీయుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ క్షమాపణలు చెప్పారు. అలాంటి ఊరట కలిగించే మాట ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? రిజర్వేషన్లు సమానత్వానికి వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. కానీ వీళ్ళకు కులం, అంటరానితనం అసమానత్వంగా కనబడవు. అమెరికాలో ‘పౌర హక్కుల చట్టం 1964’ ప్రకారం జాతి, మతం, లింగం వంటి అంశాల వల్ల ఒక వ్యక్తిని వివక్షకు గురి చేయకూడదు. ఈ చట్టం లోని ‘టైటిల్ సెవెన్’ ప్రకారం ప్రభుత్వంతో కలిసి పనిచేసే వ్యక్తులు, సంస్థలు... కాంట్రాక్టులు, వ్యాపారాల్లో అఫర్మే టివ్ యాక్షన్ ప్లాన్ అమలు చేసి తీరాలి. అంటే నల్ల జాతీయులు, లాటిన్ అమెరికన్స్, మహిళలు, మైనారిటీలు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి తప్పకుండా ఉద్యోగావకాశాలు కల్పించాలి. నియామకాలలో డైవర్సిటీ ఇండెక్స్ పాటించి తీరాలి. ఇది రిజర్వేషన్ లాంటిదే. అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీల్లో డైవర్సిటీ ఇండెక్స్, హాలీవుడ్ సినిమాల్లో నల్ల జాతీయులు కనిపించడం వంటివి అఫర్మేటివ్ యాక్షన్‌లో భాగమే. దౌర్భాగ్యం ఏంటంటే... బతుకుదెరువు కోసం వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్న మన వాళ్ళు అక్కడ కూడా కుల వివక్షను పెంచి పోషిస్తున్నారు. అందుకే అక్కడి దళితులు నల్లజాతీయుల లాగే తమకూ రక్షణ చట్టాలు కావాలని ఉద్యమాలు చేస్తున్నారు. అకడమిక్స్‌లోనూ వివక్ష రాజ్యమేలుతోంది. దానికి వ్యతిరేకంగా పోరాడే విద్యార్థులనూ, ఉద్యోగులనూ కులవాదులుగా చిత్రించడం ‘అలవాటైన దుర్మార్గం’ కాదా? దళితులు ఇప్పుడిప్పుడే చదువుకు దగ్గర అవుతున్నారు. వాళ్లకి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు విష వలయాలుగా మారటం అన్యాయం కాదా? అంబేడ్కర్ మీద అక్కసు వెళ్లగక్కడం మరో పోకడ. గతంలో అమెరికాకి చెందిన నల్లజాతి నాయకులు ఇండియా వచ్చి గాంధీని కలిసి ఆహ్వానించారు గాని అంబేడ్కర్‌ని కలవలేదని పెద్ద రహా స్యాన్ని కనిపెట్టినట్టు ప్రచారం చేస్తున్నారు. గాంధీని పిలిచారు కాబట్టి అంబేడ్కర్ వివక్ష మీద పోరాటం చెయ్యలేదని చెప్పగలరా? గాంధీ ఒక దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిస్తున్న నేతగా ప్రపంచాన్ని ఆకర్షించాడనే సంగతిని మరువరాదు. అంబేడ్కర్‌ను తక్కువ చేసి చూపాలనే దుగ్ధతో అనవసరమైన పోలికలు తీసుకొస్తే ఎలా? ‘అంబే డ్కర్ ఎంతో సహనంతో ఇప్పటిదాక నామీద దాడి చెయ్యకపోవడం అతని గొప్పతనమే’ అని గాంధీ స్వయంగా ‘హరిజన’ పత్రికలో ఎందుకు రాసుకున్నాడో తెలిస్తే లోతు అర్థమౌతుంది. దేశంలో చాక్లెట్ కొన్నా పన్ను కట్టాల్సిందే. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ... మిగిలిన పౌరుల్లాగానే పన్ను కడుతున్నారు. అందులోంచే సంక్షేమ కార్యక్రమాలకూ, పారిశ్రామిక వసతుల కోసం, కార్పొరేట్ లకూ, భూమి ఉన్న రైతులకూ రాయితీలు ఇవ్వడం కోసం ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. రాయితీల్లో తొంబై శాతం పైగా లబ్ధి దారులు పైకులాలవారే. ఈ రాయితీలతో పోల్చుకుంటే రిజర్వేషన్ల విలువ అతి స్వల్పం. దేశాన్నే ప్రైవేట్ చేతుల్లో పెడుతుంటే పట్టించు కోకుండా తరతరాలుగా అణచివేతకు గురైనవారికి ఇస్తున్న రిజర్వేషన్ల మీద దాడిచేయడం ఏమిటి? కులం పేరుతో ఎవరి పట్లయినా వివక్ష చూపడం జరిగినా, దాడి జరిగినా నైతికంగా అందరూ బాధ్యత వహించాలి. దాన్ని అందరూ గర్హించాలి. (క్లిక్ చేయండి: మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో.. !?) - ప్రొఫెసర్ శ్రీపతి రాముడు ఆచార్యులు, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇన్‌క్లూజివ్ పాలసీ, హెచ్‌సీయూ -
ఇక్కడి వివక్షే కనిపిస్తుందా?
కొంతమంది నియోదళిత్ మేధావులకు, వామపక్షీయులకు ప్రతి విషయాన్నీ కులం లేదా మత కోణంలో చూసే ధోరణి గత 30 సంవత్సరాలుగా అలవాటైంది. అకడమిక్స్‌లో కూడా ఈ ధోరణి రావడం ప్రమాదకరం. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాలు, ముస్లింలు, క్రిష్టియన్లు, అగ్ర వర్ణాల వారు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారు. 130 కోట్ల జనాభాలో, దాదాపుగా 30 కోట్ల మంది దళితులు ఉన్న భారతదేశంలో... కేవలం కొన్ని సంఘటలను చూపించి రిపోర్టులు తయారు చేసి, దేశమంతా వివక్షత ఉందని చెప్పడం ఎంతమాత్రమూ శాస్త్రీయం కాదు. అధర్మమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలో చాలా దేశాల్లో దారుణమైన వివక్ష నేటికీ కొనసాగుతోంది. మన నియోదళిత్ మేధావులు వాటిని ఏమాత్రం ప్రస్తావిం చకుండా భారతదేశానికీ, హిందూమతానికీ వ్యతిరేకంగా పని చేసే కొన్ని సంస్థల రిపోర్టుల గురించి మాట్లాడుతున్నారు. రాజీవ్ మల్హోత్ర, అరవిందన్ నీలకంఠన్ రాసిన ‘బ్రేకింగ్ ఇండియా – వెస్ట్రన్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ద్రవిడియన్ అండ్ దళిత్ ఫాల్ట్ లైన్స్’ అనే పుస్తకంలో ఇటువంటి విదేశీ సంస్థలూ, అధ్యయన కేంద్రాలూ, ఎన్జీఓలూ వంటివి భారతదేశాన్ని, హిందూమతాన్ని విచ్ఛిన్నం చేయడానికి గత 30 సంవత్సరాలుగా చేస్తున్న ఒక బహిరంగమైన కుట్ర బట్టబయలైంది. ఇక ప్రపంచంలోని వివక్షకు వస్తే మొదటగా అమెరికాలో ఉన్న నల్లజాతీయులపై వివక్ష నేటికీ కొనసాగుతోంది. అయినా వారికి భారతదేశంలో దళితులలాగా రాజ కీయాలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు లేవు. దక్షిణాఫ్రికాలో నల్లజాతి వివక్ష (అపారై్థడ్) 1992 వరకు చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా జరిగింది. ఇప్పటికి కూడా దక్షిణాఫ్రికాలో వాళ్ళు రిజర్వేషన్లు కావాలని అడగలేదు. 1883 వరకు అమెరికాల్లో నల్ల జాతీయులు బానిసలుగా ఉండేవాళ్ళు, 1970 వరకు అమెరికాలో నల్లజాతీయులకు ఓటు హక్కులేదు. ఇప్పటికీ యూఎస్‌తో సహా అనేక దేశాల్లో జాతి, మతపరమైన వివక్ష ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 1930లలో భారత్‌లో షెడ్యూల్డ్ కులాల వివక్షమీద అంబేడ్కర్ పోరాటం చేస్తున్న సమయంలోనే అమెరికాలో కూడా వివక్ష మీద పోరాటం జరుగుతోంది. ప్రముఖ అమెరికన్ నల్లజాతీయుల నాయకులు చానీతో బియాస్, బెంజమిన్ మేస్ లాంటి వారు భారతదేశానికి వచ్చి గాంధీని కలిసి వివక్షతపై చర్చలు జరిపారు. 1938లో హోవర్డ్ తురిమెన్ అనే ప్రముఖ నల్ల మతాధికారి అమెరికాకు వచ్చి పోరాటం సాగించాలని గాంధీని కలిసి విన్నవించారు. ప్రముఖ నల్ల జాతి హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్... గాంధీజీనే ఆదర్శంగా తీసుకున్నారు. అలాగే దక్షిణాఫ్రికాలో అపార్థైడ్కు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా తదితరులు కూడా మహాత్మా గాంధీనే ఆదర్శంగా తీసుకున్నారు. ఇక్కడ నియో దళిత మేధావులు, వామపక్ష వాదులు దాచి పెట్టేదేమిటంటే... పైన పేర్కొన్న నాయకులు ఎవ్వరూ కూడా అంబేడ్కర్‌ను కలవలేదు. వీరెవ్వరు కూడా ఆయా దేశాల్లో రిజర్వేషన్లు కోరలేదు. ఎందుకంటే ఈక్వాలిటీ అనే యూనివర్సల్ ప్రిన్సిపుల్‌కు రిజర్వేషన్లు అనేవి బద్ధ వ్యతిరేకం కాబట్టి. దేశం 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో కొన్ని శతాబ్దాల కాలం వెనుకబడింది. 1951 నాటికి అక్షరాస్యత కేవలం 16.7 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం, కాబట్టి కేవలం దళితులే కాదు అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు వెనకబడే ఉన్నారు. దళితుల పరిస్థితి ఇంకా దయనీయమనే చెప్పాలి. అయితే ల్యాండ్ సీలింగ్ వల్ల వచ్చిన భూమిలో 46 శాతం దళితులకే వచ్చింది. అయినా ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉంది. (క్లిక్ చేయండి: నిరసనకారులకు గుణపాఠమా?!) - డాక్టర్ పి. కృష్ణ మోహన్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, చరిత్ర విభాగం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం -
‘దళిత జాతిని అవమానపర్చిన చరిత్ర చంద్రబాబుది’
సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వం రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు అవమానం జరిగేలా వ్యవహరిస్తే.. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆయన భారీ విగ్రహ ఏర్పాటుతో గౌరవిస్తోందని ఏపీ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. బుధవారం నగరంలో ఏర్పాటు చేయబోతున్న భారీ విగ్రహ పనులను ఆయన పరిశీలించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతారని మేం ఊహించలేదు. ఇంత ఖరీదైన స్థలంలో విగ్రహ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. దేశంలోనే ఎక్కడా లేనట్లుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. విగ్రహ తయారీ హర్యానాలో జరుగుతోంది. విగ్రహ ఏర్పాటు కోసం నిర్మాణ వ్యయం పెరిగినా.. ముందుకే వెళ్తున్నాం. సీఎం జగన్ నిర్ణయం నభూతో.. నభవిష్యత్. ఇచ్చిన మాటమీద నిలబడే నాయకుడు సీఎం జగన్. 2023 ఏప్రిల్ 14 నాటికి విగ్రహం ఏర్పాటు చేసి తీరతాం అని ఉద్ఘాటించారు మంత్రి నాగార్జున. గత ప్రభుత్వం అంబేద్కర్ ను అగౌరవ పరిచేలా వ్యవహరించింది. అంబేద్కర్ ఆలోచనలను అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబు. దళిత జాతిని అవమాన పరిచిన చరిత్ర చంద్రబాబుది. అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రబాబు గురించి మాట్లాడటం కూడా అవమానమే అంటూ పేర్కొన్నారు. టీడీపీపై ఫైర్ టీడీపీ నేతలకు ఉత్తరాంధ్ర ఇప్పుడు గుర్తుకొచ్చిందా?. 14 ఏళ్లలో చంద్రబాబుకు ఉత్తరాంధ్ర గుర్తుకు రాలేదా?. గత ఐదేళ్లలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఎందుకు గుర్తుకు రాలేదు?. మూడు రాజధానుల పై జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాకే చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ పుట్టుకొచ్చిందా?. చంద్రబాబు, టీడీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయ్. రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు యాత్ర చేయిస్తున్నాడు. అమరావతి ప్రాంతంలో రైతుల కోసం కూడా చంద్రబాబు ఆలోచన చేయలేదు అని మంత్రి మేరుగ విమర్శించారు. -
కేసీఆర్ ‘విజన్ డాక్యుమెంట్’ రైతులు, దళితుల పురోభివృద్ధికి..
సాక్షి, హైదరాబాద్: జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా సన్నాహాలు వేగవంతం చేసిన ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు రైతులు, దళితులపై కొత్త పార్టీ అనుసరించే విధానంపై కసరత్తు చేస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటనకు దసరాను ముహూర్తంగా ఎంచుకోగా, అంతలోగానే ఈ రెండు వర్గాల అభ్యున్నతికి ‘విజన్ డాక్యుమెంట్’ను విడుదల చేయాలని నిర్ణయించారు. కొత్త జాతీయ పార్టీ ఎజెండాలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతోపాటు ఎస్సీల అభివృద్ధి, సంక్షేమానికీ ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల స్ఫూర్తి జాతీయ పార్టీ ఎజెండాలో ప్రతిబింబించాలని సంకల్పిస్తున్నారు. ఈ పథకాలకు మరికొన్ని జోడించి ‘విజన్ డాక్యుమెంట్’ను రూపొందిస్తున్నారు. ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు, ఎస్సీలతో భేటీ సందర్భంగా వచ్చిన సలహాలు, సూచనల్లో ఆచరణ సాధ్యమైన వాటికి విజన్ డాక్యుమెంట్లో చోటుకల్పిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ మోడల్‌ను పరిచయం చేసేలా... దేశంలో సాగుకు యోగ్యమైన భూమి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, రైతు అనుకూల సాగు చట్టాల రూపకల్పన తదితరాల్లో కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను పదేపదే విమర్శిస్తున్న కేసీఆర్.. వ్యవసాయ రంగంపై రూపొందిస్తున్న ‘విజన్ డాక్యుమెంట్’లో కొత్త పార్టీ విధానాలపై స్పష్టత ఇస్తారు. రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, దళితబంధు వంటి వాటితోపాటు దేశవ్యాప్తంగా కాళేశ్వరం తరహా నీటి ప్రాజెక్టుల నిర్మాణం, నదుల అనుసంధానం, వనరుల వినియోగం తదితరాలను ప్రస్తావిస్తారు. తెలంగాణ రైతుల కేస్ స్టడీలు, గణాంకాలు, నిపుణుల అభిప్రాయాలు తదితరాలను పొందుపరుస్తారు. త్వరలో దేశవ్యాప్తంగా దళిత సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి, వారి నుంచి వచ్చే సలహాలు, సూచనల ఆధారంగా విజన్ డాక్యుమెంట్‌కు తుది రూపు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. దేశమంతా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేసీఆర్ చేసిన డిమాండ్‌పై జాతీయస్థాయిలో చర్చ జరిగిందని, విజన్ డాక్యుమెంట్ మరింత చర్చకు దోహదం చేస్తుందని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. -
వాసాలమర్రిలో వడివడి.. హుజూరాబాద్‌లో తడబడి..
హుజూరాబాద్ నుండి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దళితబంధు.. తెలంగాణ దళితుల సంక్షేమం, అభివృద్ధిలో ఓ విప్లవం. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయంతో ఉపాధి మార్గాన్ని చూపే ఓ కొత్త వెలుగు. ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తి మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ దళితుల స్థితిగతులను మార్చేందుకు వాసాలమర్రిలో పురుడుపోసుకున్న ఈ పథకం హుజూర్బాద్లో విస్తరించి ఏడాదిని పూర్తి చేసు కుంటోంది. అయితే లక్ష్యాలు, నిబంధనలు ఒక్కటే అయినా, యాదాద్రి జిల్లా వాసాలమర్రి లబ్ధిదారుల్లో వెలుగులు నింపుతున్న ఈ పథకం..హుజూరాబాద్‌లో మాత్రం తడబడుతోంది. తక్కువ సంఖ్యలో లబ్ధిదారులు, సరైన యూనిట్ల ఎంపిక, అధికారుల పర్యవేక్షణ, మెరుగైన అమలు తీరు వాసాలమర్రి దళితులను విజయపథంలో నడిపిస్తుంటే..యూనిట్ల ఎంపికలో అవగాహన లోపం, సరైన మార్గదర్శకత్వ లేమి కారణంగా హుజూరాబాద్‌లో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రత్యేక సర్వే.. పకడ్బందీగా అమలు వాసాలమర్రిలో స్థానిక మార్కెట్ పరిస్థితి, లబ్ధిదారుల అభిరుచులు, వారి సాంకేతిక సామర్థ్యాల పరిశీలన అనంతరం యూనిట్లను మంజూరు చేశారు. ఆపై వారు నిలదొ క్కుకునేందుకు ప్రత్యేక శిక్షణ, పరిశీలనతో ముందుకు వెళ్తుండటంతో ఇక్కడ సక్సెస్ రేటు ఊహించినదానికంటే అధికంగా ఉంది. మెజారిటీ లబ్ధిదారుల పరిస్థితి ప్రభుత్వం ఆశించిన విధంగా మెరుగుపడుతోంది. స్థానిక అవసరాల మేరకు యూనిట్లు ‘వాసాలమర్రిలో తొలుత ప్రత్యేకంగా సర్వే చేసి స్థానిక పరిస్థితులు, అవసరాలను గుర్తించాం. ఇదే సమయంలో లబ్ధిదారుల్లో సామర్థ్యాన్ని పరిశీలించి వారు కోరుకున్నవి కాకుండా అక్కడ అవసరం ఉన్న యూనిట్లు పెట్టించాం. 75 మందికి 19 రకాల పనులు అప్పగించి చేయూతనిస్తున్నాం. మెజారిటీ లబ్ధిదారుల ఆర్థికస్థితి ఇప్పుడిప్పుడే మారుతోంది..’ అని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ చెప్పారు. ఇక్కడ కోరుకున్న వారికి కోరుకున్నట్టుగా..! హుజూరాబాద్‌లో 15,710 కుటుంబాలకు దళితబంధు అందజేయాలన్న లక్ష్యంతో ఇప్పటికి 12,007 మందికి అందజేశారు. అయితే ఇక్కడ స్థానిక పరిస్థితులు, లబ్ధిదారుల సామర్ధ్యం, మార్కెట్లో డిమాండ్ – సప్లయితో సంబంధం లేకుండా యూనిట్ల పంపిణీ సాగుతోంది. దీంతో లబ్ధిదారుల్లో తమకు రూ.10 లక్షల సహాయం అందుతుందన్న సంతోషం ఉన్నా, ఆశించిన ఆదాయం రావటం లేదన్న అసంతృప్తి వెంటాడుతోంది. హుజూరాబాద్ మండలం చిల్పూరులో 324 కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేస్తే అందులో 142 యూనిట్లు వాహనాలే కావటం విశేషం. ఇక ఎక్కువ సంఖ్యలో బర్రెలు తీసుకున్నవారూ సంతృప్తిగా లేరు. హరియాణాæ నుండి తెచ్చిన బర్రెలు ఆశించిన విధంగా పాలు ఇవ్వకపోగా, అనారోగ్యం పాలవున్న తీరు లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. లబ్ధిదారుల అవగాహన లోపం, సరైన చర్యలు తీసుకోవడంలో అధికారుల వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాసాలమర్రిలో ‘లక్ష్మీ’ కటాక్షం దళితబంధు పథకంతో తన పేరు నిజంగా సార్ధకమైందని అంటోంది..వాసాలమర్రికి చెందిన చెన్నూరి లక్ష్మి. నలుగురు పిల్లల తల్లయిన లక్ష్మి గతంలో అద్దెకు తీసుకున్న ఆటోలో భర్తతో కలిసి ఊరూరూ తిరుగుతూ కూరగాయల వ్యాపారం చేసేది. కానీ వచ్చిన లాభంలో 75 శాతం ఆటో అద్దెకే పోయేది. ఈ నేపథ్యంలో దళితబంధు కింద లక్ష్మి ఆటో ట్రాలీ తీసుకుంది. కూరగాయలు కొని అమ్మితే లాభం ఉండదని భావించింది. తనకున్న భూమిలో బోరు వేసి తాను కూడా కాయగూరల సాగు మొదలుపెట్టింది. ఇప్పటికే నలుగురు కూతుళ్లలో ఇద్దరి వివాహాలు చేయగా, బీటెక్, ఎంబీఏ చదువుతున్న ఇంకో ఇద్దరు అమ్మాయిలున్నారు. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్న కుమార్తె మానసతో కలిసి లక్ష్మి చుట్టుపక్కల పల్లెలకు ఆటోలో వెళ్లి వస్తూ వ్యాపారం చేస్తోంది. సొంత ఆటో, వ్యవసాయ పంటలతో ప్రస్తుతం లక్ష్మిఆదాయం నెలకు రూ.50 వేల వరకు చేరింది. ఇక దీపం వత్తులు చేస్తున్న బొల్లారం లావణ్య, పేపర్ గ్లాస్లు తయారు చేసి విక్రయిస్తున్న బొల్లారం రేఖలు చిన్నపాటి పారిశ్రామికవేత్తలుగా మారిపోయారు. తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నారు. ఈ తరహా మార్పు వాసాలమర్రిలోని 80 శాతం లబ్ధిదారుల్లో కనిపిస్తోంది. వరినాటు మెషీన్ తీసుకున్నాం కానీ.. గతంలో కూలీ పనులు చేసుకొని బతికేటోళ్లం. దళితబంధులో మా చిన్నాన్న అయిలయ్యతో కలిసి వరి నాటు వేసే మెషీన్ తీసుకున్నం. ఇప్పటివరకు 80 ఎకరాల్లో నాట్లు వేసినం. గంటకు ఎకరం వరకు నాటు వేస్తుంది. అయితే ఆ యంత్రాన్ని నడపడం మాకు రాకపోవడంతో బాపట్ల నుంచి డ్రైవర్, టెక్నీషియన్లను తీసుకొచ్చాం. వచ్చిన ఆదాయంలో అత్యధికం డ్రైవర్, టెక్నీషియన్‌తో పాటు డీజిల్‌కే పోయింది. మాకు సరిపడా మిగిలే పరిస్థితి ఉంటే బాగుంటుంది. –పాంకుంట అనిల్, ధర్మరాజుపల్లి (హుజూరాబాద్) కేసీఆర్‌కు రుణపడి ఉంటాం మాకు ఎకరన్నర పొలం ఉంది. మా ఆయన వ్యవసాయం చేస్తోంటే నేను ఊళ్లోనే కూలి పనికి పోయి బతికేది. మాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. దళితబంధులో నెల క్రితం 4 బర్రెలు వచ్చినై. రెండు బర్లు పాలిస్తున్నై. 15 రోజులకు రూ.6 వేల వరకు వచ్చినయి. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. అయితే పాల దిగుబడి ఊహించినట్టుగా లేదు. – పుల్ల సరోజని, చెల్పూరు (హుజూరాబాద్) అడ్డా మీద పెట్టనివ్వలేదు.. రెండు నెలల క్రితం మాకు మా నాన్న పేరుమీద ఆటో ట్రాలీ ఇచ్చారు. ఊరిలో సరిపడా గిరాకీ దొరకటం లేదు. జమ్మికుంట అటో అడ్డాకు పోతే.. సభ్యత్వం కోసం 7 వేలు కట్టమన్నారు. అంతమొత్తం లేక ఆటో ఊరిలోనే పెట్టా. ఇక్కడ గిరాకీ దొరికితే పోతున్న. – గోపీచంద్, చెల్పూరు (హుజూరాబాద్) చేయి విడువని వ్యవస్థ కావాలి దళితబంధు అనేది సంక్షేమ రంగంలోనే అత్యద్భుతం. అయితే యూనిట్ ఎంపిక, నిర్వహణ, భవిష్యత్తులో వచ్చే సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ అవసరం. ఇది ప్రభుత్వంతో పాటు దళిత ప్రజాస్వామిక సంఘాల బాధ్యత. వచ్చే ఐదేళ్ల పాటు లబ్ధిదారులకు అన్నివిధాలా సహాయకారిగా ఉండేలా చేయి విడువని వ్యవస్థ ఏర్పాటు చేస్తేనే పథకం లక్ష్యం నెరవేరుతుంది. – మల్లేపల్లి లక్ష్మయ్య, చైర్మన్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అన్నివిధాలా అండగా ఉండాలి రాష్ట్రంలో 19 లక్షల దళిత కుటుంబాలున్నాయి. రూ.3,100 కోట్లతో 29 వేల మంది లబ్ధిదారులకు పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఈ పథకంతో దళితుల జీవితాల్లో మార్పులు రావాలంటే ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సిన పలు చర్యలను నిపుణులు సూచిస్తున్నారు. ►యూనిట్ల మంజూరుతోనే సరి పెట్టుకోకుండా లబ్ధిదారులకు అన్నివిధాలా అండగా నిలవాలి. అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. ►లబ్ధిదారులు స్థానిక పరిస్థితులు, వారి సామర్థ్యానికి అనుగుణంగా యూనిట్లు ఎంపిక చేసుకునేలా చూడాలి. యూనిట్ల పంపిణీ కంటే ముందుగానే వాటిపై పూర్తి అవగాహన కల్పించాలి. అవసరమైన సాంకేతిక శిక్షణ ఇవ్వాలి. మార్కెట్ మెలకువలు కూడా వివరించాలి. ►దళితబంధు లబ్ధిదారుల పర్యవేక్షణ కోసం ప్రతి మండలానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించి యూనిట్లు లాభాల బాట పట్టేలా మిగతా విభాగాలతో సమన్వయం చేయాలి. ►ప్రతి నెలా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి, లోపాలు సరిదిద్దడంతో పాటు లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. ►ప్రభుత్వ విభాగాల్లో ప్రైవేటు వాహనాల వినియోగం స్థానే.. దళితబంధు యూనిట్లకు ప్రాధాన్యవ్వాలి. ►జిల్లా స్థాయిలో గ్రీవెన్స్‌సెల్ పెట్టి వచ్చే ఫిర్యాదులపై తక్షణ పరిష్కారం చూపాలి. -
వారు నమ్మనివే... నేడు జీవనాడులు
స్వాతంత్య్రం వచ్చాక అత్యంత శక్తిమంతమైన నిరసన ప్రదర్శన ఇటీవలి రైతు ఉద్యమం! కేంద్రం మెడలు వంచి, మూడు రాక్షస వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేలా చేసిన ఈ ఉద్యమం ప్రధానంగా జాతీయ జెండా నీడలోనే జరిగింది. నిజానికి, మూడు వర్ణాలతో, మధ్యలో నీలిరంగు అశోక చక్రంతో కూడిన జెండాను ఆర్ఎస్ఎస్ చాలాకాలం వ్యతిరేకించింది. సర్సంఘ్చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్‌కు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలపై నమ్మకం లేదు. కానీ ఆ మూడు విషయాలే ఇప్పుడు శూద్ర, దళిత, ఆదివాసీలకు జీవనాడిగా మారాయి. అశోక చక్రంతో కూడిన మువ్వన్నెల జెండాను అంబేడ్కర్ ఆమోదిస్తే... వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు రైతులు దాన్ని తమ సొంతం చేసుకున్నారు. ► 75ఏళ్ళ స్వాతంత్య్ర మహోత్సవాలు జరుపుకొంటున్న ఈ తరుణంలో భారత జాతీయ పతాకం ప్రాముఖ్యంపై దేశవ్యాప్తంగా కీలకమైన చర్చ ఒకటి నడుస్తోంది. సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో జాతీయ పతాకాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ పార్టీ ఏమో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రంతో కూడిన పతాకాన్ని ట్విట్టర్లో పంచుకుంది. కమ్యూనిస్టులు అసలు జాతీయ పతాకం తాలూకు చర్చ పట్టనట్టుగా వ్యవహరించారు. బహుశా వారికి త్రివర్ణ పతాకం కంటే తమ ఎర్రజెండానే ముద్దేమో మరి! ► బీజేపీ, కాంగ్రెస్‌లు తమ వాళ్ల చిత్రాలతో ప్రదర్శించుకునేందుకు వారికే సొంతమైన పార్టీ జెండాలు ఉండనే ఉన్నాయి. అవసరమైతే వారు వీటిని తమ ఇళ్లపై ఎగరేయడం ద్వారా తమ రాజకీయ ఉనికిని చాటుకోవచ్చు. అయితే ఈ దేశంలో ఉత్పాదక వర్గం దృష్టిలో జాతీయ పతాకం ప్రాముఖ్యం ఏమిటన్నది చూడాలి. కులాల ప్రాతిపదికన చూస్తే ఈ ఉత్పాదక వర్గం శూద్ర/ దళిత/ ఆదివాసీ వర్గాలతో కూడినదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేమీ లేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. స్వాతంత్య్రం తరువాత ఈ దేశంలో నమోదైన అత్యంత శక్తిమంతమైన నిరసన ప్రదర్శన ఇటీవలే విజయవంతమైన రైతు ఉద్యమం! కేంద్రం మెడలు వంచి, మూడు రాక్షస వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేలా చేసిన ఈ ఉద్యమం ప్రధానంగా జాతీయ జెండా నీడలోనే జరిగింది. రైతు నాయకులు తమ సంఘర్షణకు ప్రతీకగా జాతీయ పతాకం మినహా మరేదీ లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారు. ఈ ఉద్యమం జాతీయ పతాకం అసలు వారసులు ఎవరో నిర్ణయించిన ఉద్యమం. జాతీయ పతాకం మాదే అన్న రైతుల ధీమా అసలైనది. సాధికారికమైనది కూడా! ► మూడు వర్ణాలతో, మధ్యలో నీలిరంగు అశోక చక్రంతో కూడిన మన జెండాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చాలాకాలం పాటు వ్యతిరేకించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఆర్ఎస్ఎస్ రెండో సర్సంఘ్చాలక్ అయిన ఎంఎస్ గోల్వాల్కర్ తన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ పుస్తకంలో ‘‘మన నేతలు ఈ దేశానికి ఓ కొత్త జాతీయ జెండాను సిద్ధం చేశారు. ఎందుకిలా? కేవలం పక్కదోవ పట్టించేందుకు, ఇంకొకరిని అనుకరించేందుకు మాత్రమే! అసలీ జెండా ఉనికిలోకి ఎలా వచ్చింది? ఫ్రెంచ్ విప్లవ సమయంలో ‘‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ’’ భావనలకు ప్రతీకలుగా ఫ్రెంచి వారు మూడు రంగుల జెండాను సిద్ధం చేసుకున్నారు. దాదాపు ఇవే సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందిన అమెరికన్ విప్లవకారులూ కొన్ని మార్పులతో ఫ్రెంచి వారి మూడు వర్ణాల జెండాను తయారు చేసుకున్నారు. మన ఉద్యమకారులకూ ఈ మూడు వర్ణాలపై ఓ వ్యామోహం ఉందన్నమాట. దీన్నే కాంగ్రెస్ పార్టీ భుజానికెత్తుకుంది’’ అని రాసుకున్నారు. ► ఆర్ఎస్ఎస్ గురూజీకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృ త్వం అనే ఆదర్శాలపై నమ్మకం లేదు. వీటితో కులం, వర్ణం, ధర్మ వ్యవస్థ కుప్పకూలిపోతుందన్నది ఆయన ఆలోచన. ఇస్లామిక్ జెండాలోని పచ్చదనం మాదిరిగానే కమ్యూనిస్టుల ఎర్రజెండాలోని ముదురు ఎరుపు రంగు ఉందని ఆర్ఎస్ఎస్ అనుకునేది. కమ్యూనిస్టులకు మొదటి నుంచి కూడా శ్రామిక విప్లవానికి ప్రతీకగా నిలిచే ఎర్రజెండా మినహా మరే జెండా పట్ల గౌరవం ఉండేది కాదు. ఎరుపు, తెలుపు, పచ్చదనాల మేళవింపుతో కూడిన జాతీయ పతాకాన్ని ఆమోదించిన తరువాత రాజ్యాంగ విధానసభ చర్చల్లో అంబేడ్కర్ ఆ పతాకం మధ్యలో గాంధీ ప్రతిపాదించిన చరఖాకు బదులు అశోకుడి చక్రం ఉండాలని కోరారు. అంబేడ్కర్ అప్పటికే బౌద్ధ మతం వైపు ఆకర్షితుడై ఉన్నారు. ► 1947 జూలై 22న జాతీయ పతాకం ప్రస్తుత రూపంలో ఆమోదం పొందగా, ఆగస్టు 15 అర్ధరాత్రి తొలిసారి దాన్ని ఎగురవేశారు. ఆర్ఎస్ఎస్/బీజేపీలు అప్పట్లో అధికారంలో ఉండివుంటే జెండా ఈ రూపంలో ఉండేది కాదు. కాషాయ ధ్వజం మన జెండా అయ్యుండేది. బహుశా దాని మధ్యలో ఓ స్వస్తిక్ చిహ్నం చేరి ఉండేదేమో! దేశవ్యాప్తంగా ముస్లిమ్‌లు ఉన్న విషయాన్ని గుర్తుంచుకుంటే విభజన సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేదో తెలిసేది కాదు. ద్విజుల ఆధిపత్యంలో హిందూ/హిందూత్వ వాతావరణం నిండుకున్న సమయంలో శూద్ర/దళిత/ఆదివాసీ సమూహాల పరిస్థితి ఏమిటో అర్థమయ్యేది కాదు. అయితే అంబేడ్కర్ తన సంస్థ జెండా కోసమూ నీలి వర్ణాన్నే ఎన్నుకున్నాడు. ఇప్పుడు బహుజన సమాజ్‌పార్టీ జెండాలోనూ కనిపిస్తుంది. నాకైతే 2021–22లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక రైతు ఉద్యమంతోనే జాతీయ పతాకానికి కొత్త అర్థం లభించిందని అనిపిస్తుంది. ► 1947 ఆగస్టు 15న మువ్వన్నెల జెండాను ఎగురవేసింది మొదలు వర్ణధర్మం వల్ల ఇబ్బందులు పడ్డ శూద్రులు, దళితులు, ఆదివాసీల జీవితాల్లో ఒక కొత్త దశ మొదలైందని నా నమ్మకం. అందుకే ఈ వర్గాల వారు త్రివర్ణ పతాకంపై మరింత నమ్మకం పెంచుకోవాలని భావిస్తున్నా. అదృష్టవశాత్తూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కూడా మువ్వన్నెల్లోని మూడు రంగులు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు ప్రతీకలుగా రాజ్యాంగ రచన సమయంలో పలు సందర్భాల్లో రూఢి చేయడం గమనార్హం. గోల్వాల్కర్ చేసిన ప్రకటనను పరిశీలిస్తే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అంశాలపై అతడికి ఎంత ద్వేషం ఉందో మనకు ఇట్టే అర్థమైపోతుంది. కానీ ఈ మూడు విషయాలే ఇప్పుడు శూద్ర, దళిత, ఆదివాసీలకు జీవనాడిగా మారాయి. ► జాతీయ పతాకం పైభాగంలోని ఎరుపు లాంటి రంగు సూచించే విప్లవమే దేశంలోని ఉత్పాదక వర్గం కోరిక కూడా! తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. కులాధిపత్యం, శోషణ, అస్పృశ్యత, హింస వంటివాటికి ఫుల్స్టాప్ పెట్టి శాంతి నెలకొనాలని శూద్ర, దళిత, ఆదివాసీలూ కాంక్షించారు. ఆకుపచ్చదనం గురించి ఆర్ఎస్ఎస్ మేధావులు ఊహించినట్లు ఇస్లామ్‌ను సూచించలేదీ రంగు. పైరుపచ్చలు, పర్యావరణ హిత జీవనవిధానం, పాడి పశువుల వంటి వాటిని మాత్రమే సూచించింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం కోరుకుంటున్న హరిత పర్యావరణ ఉద్యమాలే మన జాతీయ జెండాలోని పచ్చ రంగు అన్నమాట. ఈ పచ్చదనాన్ని సూచించేదెవరు? ఈ దేశపు రైతన్నలు! ► ఆధునిక చరిత్రలో రైతులకు అసలు సిసలైన ప్రతినిధి మహాత్మా జ్యోతీరావు ఫూలే. శూద్రులు, అతిశూద్రులుగా జ్యోతిరావు ఫూలే అభివర్ణించే రైతుల సమస్యల కేంద్రంగానే ఆయన రచనలన్నీ సాగాయి. దేశ చరిత్రలో మొదటిసారి ఇలాంటి రచనలు చేసిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే. 1873లో ‘గులామ్‌గిరి’ పేరుతో ఆయన రాసిన తొలి పుస్తకం దేశంలోని ఉత్పాదక సమూహాలు ఆకాంక్షిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రతిబింబించింది. అశోక చక్రంతో కూడిన జెండాను అంబేడ్కర్ ఆమోదిస్తే... వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు రైతులు దాన్ని తమ సొంతం చేసుకున్నారు. ► మన రాజ్యాంగం, జాతీయ జెండా, ప్రజాస్వామ్య సంస్థలన్నింటినీ కాపాడుకోవాల్సిన... కొనసాగించాల్సిన అవసరం ఎంతో ఉంది. భిన్నాభిప్రాయాలు, ఆకాంక్షలు కలిగి ఉన్నా స్వాతంత్య్ర ఉద్యమకారులు కలసికట్టుగా ఆధునిక భారతదేశాన్ని ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఆలోచనలు, రాజ్యాంగాలతో రూపొందించారు. పల్లెలు, పట్టణాలు, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలపై జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని, స్వాతంత్య్ర ఉద్యమకారుల త్యాగ గుణాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంచె ఐలయ్య షెపర్డ్ – వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
మేము ఈ దేశ పౌరులమేనా?
స్వాతంత్య్ర పోరాటాన్ని విజయవంతంగా నడిపిన గాంధీని ఆఫ్రికాలో తెల్లవాళ్ళు ఎక్కిన రైలు బోగీ నుంచి కిందికి తోసేసిన ఘటన చదివినప్పుడల్లా భారతీయులం రగిలిపోతుంటాం. బ్రిటిష్ వారి జాత్యహంకారానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసి, స్వాతంత్య్రం సాధించుకున్నాం. అయితే మన దేశంలో ఉన్న కుల సమాజపు అసమానతలు, దానితో వచ్చిన విద్వేష, కులదురహంకార దాడుల మాటేమిటి? నిజంగా ఈ స్వతంత్ర భారతావని దళితులను ఇంకా తమవాళ్ళుగా భావిస్తోందా? దళిత సోదరులపై ఏటేటా పెరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు దేన్ని సూచిస్తున్నాయి? నేనీ దేశ పౌరుడినేనా? ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ఓ దళితుడిగా నేనెక్కడున్నాను? ► ఏ దేశానికైనా పరాయి పాలన నుంచి విముక్తి లభిస్తే పండుగే! దేశ ప్రజలమైన మనం ఆజాదీ అమృతోత్సవాలు చేసుకోవడం అంతులేని ఆనందాన్నే ఇస్తుంది. అయితే కొద్ది రోజులుగా నా మనసును ఓ ప్రశ్న వేధిస్తూ ఉంది. ఈ స్వర్ణోత్సవాల్లో భాగస్వామిని కాగలనా? లేదా? అసలు నేనీ దేశ పౌరుడినేనా? అయితే ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో దళితుడిగా నేనెక్కడున్నాను? దేశంలో స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుభవించిన వేదన ఏదో కట్టిపడేస్తోంది. ఈ సంబరాలకూ, నీకూ ఏ సంబంధం లేదంటోంది. ► మన దేశం ఇప్పటికే రెండు పండుగలు జరుపుకొంది. ఇప్పుడు మూడో పండుగ ‘ఆజాదీ కా అమృతోత్సవ్’. సంవత్సరకాలంగా ఈ ఉత్సవాలు సాగుతున్నాయి. 1972లో వెండిపండగ, 1997లో బంగారు పండుగ, ఇప్పుడు ఏకంగా అమృతోత్సవాల్లో మునిగితేలుతున్నాం. 1972కు ముందు అంటే 25 ఏళ్ళల్లో ఎంతో మార్పు వస్తుందని అంతా భావించారు. విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయ ప్రాతినిధ్యంలో, ఆర్థిక రంగంలో కొంత మెరుగైన ఫలాలు వచ్చినమాట నిజమే. అది ఈ దేశప్రజల చైతన్య పునాదులపై ఆధారపడి జరిగిందే తప్ప, అప్పణంగా ఎవరూ అప్పజెప్పింది కాదు. అయితే ఎంత ప్రగతి సా«ధించినా సాటి మనిషి నన్ను జంతువుల కన్నా హీనంగా చూస్తోంటే, నోరెత్తి న్యాయం అడిగితే అరెస్టులు, దాడులు. రాజ్యాంగ బద్ధ సమాన హక్కుల కోసం అడిగితే, ప్రాణాలే గాలిలో కలిసిపోతున్నాయి. నా జీవితంలోని సంఘటన పాతికేళ్ళ స్వాతంత్య్రం వట్టి బూటకమని ఎలా తేల్చిందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ► నేటి పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం జనగామ గ్రామం నా సొంత ఊరు. మా నాన్నకు ముగ్గురు తమ్ముళ్ళు. అందులో చిన్నవాడి పేరు మల్లెపల్లి రాజం. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు ఇప్పటి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రాంతానికి గని కార్మికుడిగా పనిచేయడానికి వెళ్ళాడు. 1960లో మా గ్రామం శివారులోనే బొగ్గు గనులు ప్రారంభం కావడంతో ఇక్కడ పనిచేయడానికి తిరిగి వచ్చాడు. అటు బొగ్గు గనుల్లో పనిచేస్తూ, గ్రామంలో కూలీల, పాలేర్ల జీతాల పెరుగుదల కోసం పనిచేశాడు. అదేవిధంగా భూస్వాముల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను ప్రజలకు పంచడానికి ఉద్యమాలు నడిపాడు. అది భూస్వాములకు కడుపుమండేలా చేసింది. 1963లో జరిగిన సంఘటన ఆయనను మా నుంచి శాశ్వతంగా దూరం చేసింది. ► మా ఊరి మధ్యలో ఒక మర్రిచెట్టు ఉండేది. దానిచుట్టూ బండలతో ఒక గద్దె కట్టి ఉండేది. దాన్ని కచ్చేరీ గద్దె అనేవాళ్ళం. దాని మీద అగ్రవర్ణ దొరలు మాత్రమే కూర్చునేవారు. మా చిన్నాన్న మల్లెపల్లి రాజం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త. అందువల్ల ఆ చైతన్యం ఇచ్చిన ధైర్యంతో దొరలు కూర్చునే కచ్చేరీ గద్దె దగ్గరకు వెళ్ళి, ‘కచ్చేరీ గద్దె మీద మేం కూడా కూర్చుంటాం’ అని అడిగాడు. అక్కడ ఘర్షణ జరిగింది. రెండు రోజుల తర్వాత మా చిన్నాయన కనిపించకుండా పోయాడు. మూడు రోజుల వరకు ఆచూకీ తెలియలేదు. నిజానికి మా చిన్నాయనను కిడ్నాప్ చేసి, మూడు రోజులు పొగాకు బ్యారెన్‌లో బంధించి, చిత్రహింసలకు గురిచేశారు. కసితీరా చంపి ఊరి చివర కుంటలో పడేశారు. కుటుంబ సభ్యులు వెతగ్గా, వెతగ్గా, మూడు రోజుల తర్వాత శవమై తేలాడు. ‘కచ్చేరీ గద్దెపై మేం కూడా కూర్చుంటాం’ అన్నందుకు స్వతంత్ర భారతావనిలో ఓ దళితుడికి జరిగిన శాస్తి అది. ఇది అప్పట్లో పెద్ద సంచలనం. వేలాది కార్మికులు నిరసనగా పెద్ద ఊరేగింపు చేశారు. అయినా సరే నిందితులపై కేసు కూడా నమోదు కాలేదు. ఇదీ ఈ దేశ స్వాతంత్య్రం ఓ దళితుడికి అందించిన స్వేచ్ఛ. ► అంతటితో ఆగలేదు. 1968లో 25 డిసెంబర్న కీలవేన్మణిలోని 44 మంది దళితులను అక్కడి ఆధిపత్య కులాలైన భూస్వాములు సజీవ దహనం చేశారు. దీంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాజిల్లా కంచికచర్లలో కోటేశ్ అనే దళిత యువకుడిని గుంజకు కట్టి, కిరోసిన్ పోసి, కాల్చారు. ఇది కలవరపాటుకు గురిచేసింది. ఇంకా ఎన్నో జరిగాయి కానీ అంతగా బయటకు రాలేదు. అయినా భవిష్యత్తులోనైనా అంతరాలు తొలగిపోతాయన్న ఆశతో దళితులు ముందుకు నడిచారు. 1972లో స్వాతంత్య్ర రజతోత్సవాల్లో భాగస్వాములయ్యారు. ► ఇట్లా వెండిపండుగ జరుపుకొన్నామో లేదో, బీహార్‌లోని బెల్చిలో 1977 మే 27న ఎనిమిది మంది దళితులను చేతులు కట్టేసి కాల్చి చంపి, ఒక చితి మీద తగులబెట్టారు. ఇదంతా ఒక ఆధిపత్యకుల భూస్వాములు చేసిన నీతిమాలిన చర్య. 1985లో కారంచేడులో, 1991లో చుండూరులో దళితులను ఊచకోత కోసిన ఘటనలు ఇంకా కళ్ళ ముందు రక్తమోడుతున్నాయి. గుండెగాయాల్ని కెలుకుతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ మన స్వతంత్ర భారతావని మరో మైలురాయిను దాటి స్వర్ణోత్సవం జరుపుకొంది 1997లో. అదే ఏడాది బీహార్‌లోని లక్ష్మణ్‌పూర్ బాతేలో 58 మంది దళితులు ఊచకోతకు గురయ్యారు. అయినా దళితులు రాజ్యాంగంపై అంతులేని విశ్వాసంతో ఆ ఉత్సవాల్లోనూ భాగస్వాములయ్యారు. ప్రతి ఏటా జెండా పండుగను ఈ దేశ దళితులు చేసుకుంటూనే ఉన్నారు. 2006లో మహారాష్ట్రలోని ఖైర్లాంజి ఘటన సహా చెప్పుకుంటూ పోతే... కొన్ని వేల ఘటనలు స్వాతంత్య్ర సంబరాలతో దగాపడ్డ దళితన్నల గుండెలు చీల్చుకొస్తాయి. ► సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సేకరించిన లెక్కల ప్రకారం 1994 నుంచి 2020 మధ్య 26 ఏళ్ళలో 17,835 మంది దళితులు హత్యకు గురయ్యారు. 44,506 మంది దళిత మహిళలు ఆధిపత్య కులాల చేతుల్లో అత్యాచారాలకు బలయ్యారు. అంతేకాక 85,219 మంది దళితులపైన తీవ్ర భౌతిక దాడులు జరిగాయి. ఇందులో ఎక్కువ మంది అంగవికలురు అయ్యారు. మనదేశం స్వాతంత్య్రం కోసం పోరాడడానికి బ్రిటì ష్ వాడు వాళ్ళతో మనల్ని సమానంగా చూడక అవమానాలకు గురిచేయడమే కారణమంటాం. మరి, మన దేశంలో ఉన్న కుల సమాజ అసమానతలు, దానితో వచ్చిన విద్వేష, కులదురహంకార దాడుల మాటేమిటి? వీటినెవరు ప్రశ్నిస్తారు? నిజంగా ఈ స్వతంత్ర భారతావని దళితులను ఇంకా తమవాళ్ళుగా భావిస్తోందా? నా దళిత సోదరులపై ఏటేటా దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరుగుతోన్నస్థితి దేన్ని సూచిస్తోంది? నేనీ దేశ పౌరుడినేనా? అందుకే అమృతోత్సవాన్ని తలచుకున్న ప్రతిసారీ ఈ అనుమానం వెంటాడుతూనే ఉంది. ► అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2004లో 546 మంది దళితులు హత్యకు గురైతే, 2014లో 704 మంది, 2020లో 902 మంది అగ్రకుల దాడుల్లో మరణించారు. 16 ఏళ్ళలో దళితులపై అఘాయిత్యాలు రెండింతలు పెరిగాయి. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడి ఉంటే, ఈ దాడులు తగ్గాలి. కానీ ఏటేటా పెరుగుతూనే ఉన్నాయంటే అర్థం ఏమిటి? ఈ స్వాతంత్య్రానికి అర్థం ఏమిటి? 2004లో 1157 మంది అత్యాచారాలకు బలైతే, 2020లో ఆ సంఖ్య 3396కి చేరింది. అంటే దళిత స్త్రీలపై అత్యాచారాలు మూడు రెట్లు పెరిగాయి. దేశంలోని ప్రజాస్వామ్య వాదులు చాలా విషయాల్లో తమ ఆందోళన ప్రకటిస్తుంటారు. దళితుల విషయానికి వస్తే నిజంగా ఉండాల్సినంత స్పందన లేదన్నది నిర్వివాదాంశం. ప్రభుత్వాలూ అంతే. ఇలాంటి అమానవీయ పరిస్థితుల్లో మా ఇంటిపైన ఏ జెండా ఎగురవేయాలి? ఫోన్లో డీపీని మార్చుకోమంటారా? ఆ పని ఎలా చేయగలను? ఇప్పుడు ఈ విషయం రాయడంతో అద్భుతాలు జరగకపోవచ్చు. కానీ దేశంలోని ఇతర కులమతాల పెద్దలు, విద్యావేత్తలు, న్యాయాధీశులు, రాజకీయ వేత్తలు ఆలోచిస్తారని ఆశ. రాబోయే తరాలు ఈ స్వాతంత్య్ర సంబరాల్లో తమ పాత్రను ఎంచుకుంటారనే భావన. అంతే! వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
‘ఎంపీ రఘురామను అడుగు పెట్టనివ్వం’
సాక్షి, భీమవరం: దళితుల ఓట్లతో గెలిచి నియోజకవర్గ ప్రజల బాగోగులు గాలికి వదిలేసి పత్రికలు, టీవీల్లో అవాకులు చవాకులు పేలుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజును నియోజకవర్గంలోకి అడుగుపెట్టనివ్వబోమని ఏపీ బహుజన జేఏసీ నాయకులు హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయంలో శనివారం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిరుదుగడ్డ రమేశ్‌బాబు మీడియాతో మాట్లాడారు. జేఏసీ ఫౌండర్, కన్వీనర్ తాళ్లూరి మధు మాట్లాడుతూ.. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అవహేళన చేశారని, అందుకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రఘురామకృష్ణరాజు గోబ్యాక్ అని నినదించారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ గెలిపించిన పార్టీకే కళంకం తెస్తున్న ఎంపీ.. గతంలో దళితుల పైన, దళిత అధికారుల పైన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, క్షమాపణ చెప్పకపోతే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని, శాంతియుతంగా నిరనన తెలియజేస్తామన్నారు. దుండి అశోక్, ప్రశాంత్, బేతాళ కమలాకర్, ఏలేటి న్యూటన్ పాల్గొన్నారు. -
దళిత రచనలతోనే సినీ ప్రయాణం ప్రారంభించాను: పా.రంజిత్
సాక్షి, చెన్నై: దళిత రచనలతోనే తన సినీ పయనం మొదలైందని దర్శక, నిర్మాత పా.రంజిత్ పేర్కొన్నారు. తన చిత్రాల ద్వారా సమాజంలోని అసమానతలు, అణగారిన జీవితాలను ఆవిష్కృతం చేసే దర్శకుడీయన. అలా తనకంటూ ప్రత్యేక బాటను ఏర్పరచుకుని సక్సెస్‌ఫుల్‌గా పయనిస్తున్న పా.రంజిత్ తన నీలం ఫౌండేషన్ ద్వారా ఏప్రిల్ నెల అంతా దళిత చరిత్ర మాసం పేరుతో చెన్నైలో సాంస్కృతిక కళలు, ఫొటో ఎగ్జిబిషన్, చిత్ర ప్రదర్శనలు నిర్వహించారు. అందులో భాగంగా మదురైలో శుక్ర, శనివారాల్లో దళితుల రచయితల కోసం దళిత సాహితీ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళిత రచనలతోనే తన సినీ పయనం మొదలైందని తెలిపారు. దళితుల ఉన్నతికి దళిత సాహితీవేత్తలే దిశా నిర్దేశం చేశారని పేర్కొన్నారు. 1990 ప్రాంతంలో దళిత సాహిత్యం మొదలైనప్పుడు పలు ప్రశ్నలు ఎదురయ్యాయని అన్నారు. ఇప్పుడు దళిత సాహిత్యం ఎంతో అభివృద్ధి చెందిందని పా.రంజిత్ పేర్కొన్నారు. -
సీఎంకు దళిత, బహుజనులు వెన్నుదన్నుగా ఉండాలి
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలంతో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో దళిత, బహుజనులకు లభిస్తున్న ఆదరణ చరిత్రాత్మకమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరితను గుంటూరులోని ఆమె నివాసంలో నాగార్జున శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దళిత, బహుజనులందరూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కిన నాగార్జునను సుచరిత అభినందించారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో మేరుగు నాగార్జున తన శాఖ బాధ్యతలు చేపడతారని ఆయన కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
‘సామాజిక న్యాయం’లో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: ‘బహుజన హితాయా.. బహుజన సుఖాయా’ అని చాటిన బుద్ధుడి వ్యాఖ్యలను ఆచరణలో నిజం చేసి చూపిన సీఎం వైఎస్ జగన్.. సామాజిక న్యాయం చేసిన నేతగా సరికొత్త చరిత్ర సృష్టించారని బహుజన కులాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి గురుప్రసాద్ కితాబిచ్చారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం పదవులు కేటాయించడంపై స్పందించిన ఆయన.. శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. బుద్ధిజం, అంబేడ్కరిజం, మహాత్మ జ్యోతిరావు పూలే కలలను సీఎం జగన్ సాకారం చేయడం గొప్ప విషయమన్నారు. దేశంలో బహుజనుల కోసం ఏర్పడిన బీఎస్పీ సైతం రాజకీయ మనుగడ కోసం అగ్రవర్ణాలకు సీట్లిచ్చిందని, అగ్రవర్ణానికి చెందిన సీఎం జగన్ మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జనాభా దామాషా ప్రాతిపదికన నామినేటెడ్, మంత్రి పదవులు కేటాయించి యుగపురుషుడిగా నిలిచారని ప్రశంసించారు. టీడీపీ తన స్వార్థ రాజకీయాల కోసం వర్గీకరణ పేరుతో మాల, మాదిగలకు, రాజకీయ పదవుల పేరుతో గౌడ–శెట్టిబలిజలకు, రిజర్వేషన్ పేరుతో కాపులకు ఇతర కులాలతో తగవులు పెట్టిందని విమర్శించారు. సీఎం జగన్ మాత్రం కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య వంటి అగ్రవర్ణాల్లోని పేదలకు మేలు చేసేలా ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా చర్యలు చేపట్టారని గురుప్రసాద్ గుర్తు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా బీసీ కులాల మేలు కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారన్నారు. కనీసం ఓటుకు, వార్డు మెంబర్‌కు కూడా అర్హతలేని సంచార జాతులకు ఏకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని, బహుజనులు ఎల్లప్పుడూ ఆయన వెంటనే ఉంటారని గురుప్రసాద్ స్పష్టం చేశారు. ఇలాంటి సీఎంనే మేం కోరుకున్నాం.. ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య రాష్ట్రంలో దళిత బహుజనులకు సామాజిక న్యాయం చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘకాలం కొనసాగాలని, ఇలాంటి ముఖ్యమంత్రే తమకు కావాలని కోరుకున్నామని ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య చెప్పారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో అనేక రాష్ట్రాల్లో బీసీ, దళితులు ముఖ్యమంత్రులైనా.. సీఎం వైఎస్ జగన్ మాదిరిగా అణగారిన వర్గాలకు అగ్రపీఠం వేసిన వారు లేరన్నారు. దళితుల పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్‌లో సైతం అట్టడుగు వర్గాలకు అంతంత మాత్రంగానే ఉన్నత పదవులు దక్కాయని గుర్తుచేశారు. బీసీల పార్టీ అని చెప్పుకొనే టీడీపీ సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉన్నత పదవులు ఇచ్చిన సందర్భాలు తక్కువేనని అన్నారు. దళిత బహుజనులకు చంద్రబాబు ఏనాడూ ప్రాధాన్యత శాఖలు ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాత్రం తన వారితో త్యాగాలు చేయించి మరీ ఆయా పదవుల్లో ఎస్సీ, బీసీలను కూర్చోబెడుతుండటం ఆయన గొప్ప మనస్సుకు నిదర్శనమని చెంగయ్య కితాబిచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిచిన అనంతరం సీఎం వైఎస్ జగన్ రెండు పర్యాయాలు ఎస్సీలకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, రాష్ట్ర హోం మంత్రి పదవులివ్వడం ఆయనకే చెల్లిందన్నారు. సామాజిక విప్లవాన్ని సృష్టిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు దళితబహుజనులు అండగా ఉంటారని తెలిపారు. -
సామాజిక అస్పృశ్యత నిర్మూలనే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదని, సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16 శాతం కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియను ఆ శాఖ కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. కమిషనర్ వాకాటి కరుణ, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌తో కలిసి డ్రా ద్వారా ఆసుపత్రులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. దళితులు కూలీకి పరిమితం కావొద్దని, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని స్వాతంత్య్రానికి ముందే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. నాడు అంబేడ్కర్ కన్న కలలను నేడు సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని కొనియాడారు. దళితబంధు లబ్ధిదారులు సరైన యూనిట్ ఎంపిక చేసుకునేలా, ఆ యూనిట్‌ను గ్రౌండ్ చేసేలా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు. గతంలో నీటిపారుదలశాఖ టెండర్లలో ఎస్సీ, ఎస్టీలకు 21 శాతం కేటాయించామని, ఇప్పటికే వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ, డైట్ ఏజెన్సీల్లో దళితులకు 16 శాతం కేటాయిస్తున్నామని, వంద పడకలలోపు ఆసుపత్రులను ఒక కేటగిరీగా, వంద పడకలకు పైగా ఉన్న ఆసుపత్రులను మరో కేటగిరీగా విభజించామని వివరించారు. మొత్తం 56 ఆసుపత్రుల ఎంపిక పారదర్శకంగా చేశామని, వీటికి త్వరలో టెండర్లు పిలుస్తారని తెలిపారు. ఎస్సీ యువత వీటిని అందిపుచ్చుకునేలా టెండర్ల నిబంధనల్లోనూ మార్పులు చేశామని, ఒక్క టెండర్ వచ్చినా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించా మని చెప్పారు. మెడికల్ షాపుల్లో కూడా రిజర్వేషన్ ఎలా అమలు చేయాలన్న విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. -
దళితబంధులో అన్యాయం చేశారు
జూలూరుపాడు: దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అన్యాయం జరిగిందంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో దళితులు, యువకులు ఆందోళనకు దిగారు. అర్హులైన వారికి కాకుండా భూములు, భవనాలు, ఉద్యోగాలు ఉన్నవారికి, గతంలో ప్రభుత్వ రుణాలు పొందిన వారికి దళితబంధు జాబితాలో చోటు కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జూలూరుపాడు, వెంగన్నపాలెం, పెద్దహరిజనవాడ, చిన్నహరిజనవాడ గ్రామాల దళిత మహిళలు, యువత మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యాలయాన్ని ముట్టడించారు. ఖమ్మం–కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాబితాలోని అనర్హుల పేర్లు ఇస్తే పరిశీలించి ప్రభుత్వానికి నివేదికిస్తామని తహసీల్దార్ చెప్పడంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు. అనర్హుల పేర్లు తొలగించి అర్హుల ఎంపిక కోసం గ్రామసభ నిర్వహించాలని, ఎమ్మెల్యే అనుచరుల పేర్లు తొలగించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. -
పార్టీ గెలుపోటములలో దళితులే నిర్ణేతలు!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములు నిర్ణయించడంలో దళితులు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. వీరికి రిజర్వ్ చేసిన స్థానాల్లో అధిక స్థానాలను దక్కించుకున్న పార్టీలే అధికార పీఠం ఎక్కిన నేపథ్యంలో అందరూ వీరిని తమవైపు తిప్పుకునే యత్నాల్లో మునిగితేలుతున్నారు. గత ఎన్నికల్లో 84 ఎస్సీ రిజర్వ్డ్ (రెండు ఎస్టీలకు రిజర్వు అయి ఉన్నాయి) స్థానాల్లో ఏకంగా 70 స్థానాలను గెలుచుకున్న బీజేపీ మరోమారు తమ ఓటుబ్యాంకు స్థిరంగా ఉంచుకునేందుకు నానాతంటాలు పడుతుండగా, వాటిని కొల్లగొట్టేందుకు సమాజ్‌వాదీ అనేక ఎత్తులు వేస్తోంది. ఇక తన సామాజిక వర్గానికే చెందిన సీట్లలో గత ఎన్నికల్లో తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్న బీఎస్పీ అధినేత మాయావతి తన బలాన్ని చూపేందుకు తహతహలాడుతున్నారు. 68 శాతం సీట్లు కొడితే అధికారమే... యూపీలో 15 కోట్లకు పైగా ఉన్న ఓటర్లలో కనీసంగా 21 శాతం మంది అంటే సుమారు 3.15 కోట్ల మంది దళితులు ఉన్నారు. ఇందులో అత్యధికంగా 2.25 కోట్ల మంది జాతవ్ వర్గానికే చెందిన వారు కాగా, 16 శాతం మందితో పాసీలు 70 నుంచి 80 లక్షల మంది వరకు ఉంటారు. మిగతా కులాల వారు మరో కోటి మందికి పైగా ఉన్నారు. మొత్తంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 84 ఉన్నాయి. ఇందులో 68శాతానికి మించి సీట్లు సాధించిన పార్టీనే అధికారంలోకి వస్తుందని గత గణాంకాలు చెబుతున్నాయి. 2007లో బీఎస్పీ 61 స్థానాల(69శాతం)ను సాధించి అధికారంలోకి వస్తే, 2012లో ఎస్పీ 58 స్థానాలు (68శాతం) సాధించి అధికార పీఠమెక్కింది. ఇక 2017లో అయితే బీజేపీ ఏకంగా 70 స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ కనీసంగా 58 స్థానాలను దక్కించుకునే పార్టీనే అధికారంలోకి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో అన్ని పార్టీలు వీరిని ఆకర్షించే పనిలో పడ్డాయి. ఆకర్షణ మంత్రాల్లో పార్టీలు... ముఖ్యంగా ఈ స్థానాల్లో తమ పట్టు ఏమాత్రం సడలకుండా చూసుకునేందుకు అధికార పార్టీ అనేక ఎత్తులు వేస్తోంది. 2012 ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు 14 శాతం మాత్రమే బీజేపీ దక్కించుకోగా, అది 2017లో ఏకంగా 40శాతానికి పెరిగింది. 84 రిజర్వ్డ్ స్థానాలకు గానూ 65 మంది జాతవేతర వర్గాల వారికే సీట్లు కేటాయించి ఆ స్థానాల్లో గెలిచి చూపించింది. నిజానికి జాతవ్‌లంతా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో ఉన్నప్పటికీ దోబీ, ఖాటిక్, పాసీ, వాల్మీకి వంటి జాతవేతర వర్గాలను ఆకర్షించి ఏకంగా 70 స్థానాలను దక్కించుకుంది. దక్కిన స్థానాలను దృష్టి పెట్టుకొనే యూపీ కేబినెట్లో ఏకంగా ఎనిమిది మందిని మంత్రులను చేసింది. ప్రస్తుతం ఆర్థికంగా అట్టడుగున ఉన్నవారు ప్రభుత్వ పథకాల నుండి పొందిన ప్రయోజనాలను నొక్కి చెప్పేలా పార్టీ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఎస్పీ వర్గాలు పొందుతున్న గృహాలు, మరుగుదొడ్లు, ఆరోగ్య సంరక్షణ, సబ్సిడీ సౌకర్యాలను ఎక్కువగా ప్రచారం చేస్తూ వారి ఓట్లకు గాలమేస్తోంది. దళితులకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చామని బీజేపీ చెప్పుకుంటున్నా ఓట్లను తెచ్చిపెట్టే నేతలు లేకపోవడం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీలో యోగికి ఉన్న ప్రజాదరణ, పథకాలతోనే ఎస్సీలను ఆకర్షించే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేస్తోంది. ఇక సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దళితులను ఆకట్టుకునేలా అంబేడ్కర్ జయంతిని ‘దళిత్ దివాళి’గా ప్రకటించాలని చేసిన వినతి పెద్ద చర్చకే దారితీసింది. దీనికి తోడు గడిచిన సెప్టెంబర్‌లో 15 రోజుల పాటు గ్రామీణ దళిత ఓటర్లే లక్ష్యంగా ‘గ్రామగ్రామాన దళితులతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని పార్టీ నిర్వహించింది. తాను ప్రకటించిన గృహాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి హామీలు ఎక్కువగా దళిత వర్గాలకే లాభం చేస్తాయని ఆయన పదేపదే తన సమావేశాల్లో అఖిలేశ్ ప్రస్తావిస్తున్నారు. మరోపక్క బీఎస్పీ 2007 ఎన్నికల్లో అమలు చేసిన ’బ్రదర్హుడ్’ విధానాన్ని అనుసరించేలా నిర్ణయాలు చేసింది. వివిధ మండలాల్లో సమావేశాల ద్వారా ప్రజలను సమావేశపరిచి సంప్రదాయ దళితుల ఓట్లతో పాటు బ్రాహ్మణ, వెనుకబడిన తరగతులు, ముస్లిం సమాజం మద్దతు కూడగట్టే ప్రణాళికలు అమలుపరుస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం సితాపూర్లోని సిధౌలీ, అజంగఢ్‌లోని లాల్గంజ్ స్థానాలను మాత్రమే పొందిన బీఎస్పీ ఈమారు తన సత్తా చాటుకునేలా వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమైంది. -
దళితులు అవసరం లేదు!... దళిత ఓటు బ్యాంకే లక్ష్యం!
అఖిలేష్ యాదవ్‌కు దళితులు అక్కర్లేదు, దళితుల ఓటు బ్యాంకు మాత్రమే కావాలి అని భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు చర్చల అనంతరం మాట్లాడిన ఆజాద్.. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఎస్పీతో పొత్తు చర్చలు విఫలమైన నేపథ్యంలో అఖిలేష్ యాదవ్‌పై మండిపడ్డారు ఆజాద్. అంతేకాదు ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల కోసం అఖిలేష్ యాదవ్ దళిత ఓటు బ్యాంకుపై దృష్టి సారించాడు అని విమర్శించారు. పైగా అతను బహుజన సమాజ్ ప్రజలను కించపరిచాడని ఆరోపించారు. తాను గత ఆరు నెలలుగా యాదవ్‌తో అనేక చర్చలు నిర్వహించిన పొత్తు కుదరలేదని చెప్పారు. రాబోయే రాష్ట్ర ఎన్నికలలో సమాజవాదీ పార్టీ(ఎస్పీ) తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలను బలోపేతం చేయడానికి అఖిలేష్ యాదవ్ అనేక చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారనేది గమనార్హం. అయితే వెనుకబడిన తరగతులు, దళితులు తమకు సామాజిక న్యాయం చేస్తాడనే నమ్మకంతో యాదవ్‌కు మద్దతు ఇస్తున్నారని ఆజాద్ అన్నారు. కానీ అఖిలేష్ యాదవ్‌కి సామాజిక న్యాయం అంటే అర్థం కావడం లేదని, అది మాటలతో జరగదంటూ ఆజాద్ విమర్శించారు. దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై యాదవ్ మౌనం వహిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లాగా ప్రవర్తిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్న సంగతి తెలసిందే. (చదవండి: కంగనా రనౌత్ చెంపల కంటే సున్నితమైన రోడ్లు నిర్మిస్తాం!: ఇర్ఫాన్ అన్సారీ) -
జాగు చేయక.. బాగు చేసేలా..
జాతీయ స్థాయి టోల్‌ఫ్రీ నం: 18002021989 హెల్ప్‌లైన్ నం:14566 రాష్ట్రస్థాయి హెల్ప్‌లైన్ నం: 040–23450923 సాక్షి, హైదరాబాద్: దళితులు, గిరిజనులపై అత్యాచారాల (అట్రాసిటీస్) నిరోధక చట్టం అమలును కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. క్షేత్రస్థాయిలో ఈ చట్టం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని, బాధితులకు పరిహారం అందించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలకు చెక్ పెట్టేందుకు నడుం బిగించింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన హెల్ప్‌డెస్క్‌ను ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అఘాయిత్యాలను అరికట్టడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌తో పాటు ప్రతి రాష్ట్రంలో ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఒకట్రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా అన్ని కాల్సెంటర్లను ప్రారంభించేందుకు ఆ శాఖ కసరత్తు వేగవంతం చేసింది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల విషయంలో ఆయా వర్గాల్లో అవగాహన కల్పించేలా మరింత ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ హెల్ప్‌డెస్క్ ప్రారంభించిన ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా 4,776 మంది యూజర్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా... 295 మంది వినతులు సమర్పించారు. ఇందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 27 వినతులు (గ్రీవెన్స్) నమోదు అయ్యాయి. ఫిర్యాదుల నమోదు ఇలా... హెల్ప్‌డెస్క్‌లో ఫిర్యాదులను అత్యంత సులభంగా సమర్పించవచ్చు. ముందుగా https://nhapoa.gov.in/ లింకు ద్వారా అత్యాచారాల నిరోధానికి జాతీయ సహాయ కేంద్రం (నేషనల్ హెల్ప్‌డెస్క్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) పేజీ తెరవాలి. అనంతరం రిజిస్టర్ యువర్ గ్రీవెన్స్ ఆప్షన్‌ను ఎంచుకుని బాధితుడి వివరాలతో పాటు ఎఫ్ఐఆర్ తదితర పూర్తి సమాచారాన్ని అందులో నమోదు చేయాలి. ఈ ప్రక్రియ మొత్తంగా ఏడు దశల్లో జరుగుతుంది. అనంతరం బాధితుడి ధ్రువీకరణతో ఫిర్యాదు సమర్పణ పూర్తవుతుంది. వినతుల నమోదు తర్వాత వెబ్‌పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులకు క్షణాల్లో వినతులు/ఫిర్యాదుల చిట్టా మొత్తం చేరుతుంది. అక్కడ పరిశీలన పూర్తి చేసిన తర్వాత అంచెలంచెలుగా అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. నిర్దేశించిన గడువులోగా పరిష్కరించి కేంద్ర అధికారులకు రాష్ట్ర అధికారులు యాక్షన్ టేకెన్ రిపోర్టు (చేపట్టిన చర్యలతో నివేదిక) సమర్పించాల్సి ఉంటుంది. వినతులు, ఫిర్యాదుల నమోదులో కేవలం బాధితులే కాకుండా అట్రాసిటీ చట్టాల అమలుపై పనిచేస్తున్న స్వచ్ఛంధ సంస్థలు కూడా భాగస్వాములు కావొచ్చు. వెబ్‌పోర్టల్ ద్వారానే కాకుండా జాతీయ స్థాయి టోల్‌ఫ్రీ నంబర్, హెల్ప్‌లైన్ నంబర్లలో కూడా సంప్రదించవచ్చు. ఇక రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారులకు కూడా ఫిర్యాదులు పంపవచ్చు. రాష్ట్రంలో secyscdts@gmail.com ద్వారా మెయిల్ పంపడంతో పాటు 040–23450923 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి వినతులు చెప్పుకోవచ్చు. కేంద్రం, రాష్ట్రాల భాగస్వామ్యం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల అమలు కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్, వెబ్‌పోర్టల్, కాల్ సెంటర్ల నిర్వహణలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత వహిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50ః50 చొప్పున నిధులు ఖర్చు చేస్తాయి. కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రం వందశాతం నిధులను కేంద్రమే భరిస్తుంది. ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ సెల్స్, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, పూర్తిస్థాయి ప్రత్యేక కోర్టులు (ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్), స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పూర్తిస్థాయి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితర కేటగిరీల్లో ఖర్చు చేయాలి. బాధితులకు న్యాయ సహాయం, పరిహారం కింద ఇచ్చే మొత్తాన్ని ఈ నిధుల కింద ఖర్చు చేయకూడదు. -
దళితులు శూద్రులే... విడగొట్టారంతే!
మానవ చరిత్రలో ఒక్క భారతదేశంలోనే అత్యంత హేయమైన అంటరానితనం వేళ్లూనుకొని ఉంది. దాదాపు అన్ని మతాలూ మనుషుల మధ్య ప్రేమను ప్రోదిచేసి, ఇహపరమైన జీవితాన్ని సమానత్వం, సౌభాతృత్వం వంటి గొప్ప ఆదర్శాలతో ఆనందమయం చేసుకోవడానికి మార్గాలు చూపించినవే. కానీ హిందు మతం మాత్రం అంటరానితనం ప్రాతిపదికన భారతీయ సమాజంలో అసమానతలకు బీజం వేసి కొనసాగేలా ఆంక్షలు విధించడం.. విడ్డూరమేకాదు అమానవీయం కూడా. ఒకప్పుడు శూద్రుల్లో భాగంగా ఉన్న దళితులను వారి నుంచి వేరుచేసిన వైనం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. దళితులు చారిత్రక శూద్రులు. ఆర్యులకంటే ముందు క్రీ.పూ. 3000 నాటికే వ్యవ సాయ–పట్టణ నాగరికతను అభివృద్ధి చేసు కున్న హరప్పా ప్రజా సమూహంలో వారూ భాగంగా ఉన్నారు. కానీ ఇంత ఆధునిక రాజ్యాంగం కలిగిన ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకు తున్నప్పటికీ, ద్విజులతో పాటు శూద్రులు కూడా వారిని అంటరాని వారుగా చూస్తున్నారు. మనకు గొప్ప ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ ఒక దళితుడనే ఎరుక భారతీయుల్లో కనిపిం చడం లేదు. అంబేడ్కర్ తనను తాను విముక్తి గావించుకొని, కులము, అంటరానితనం లేని ‘భారతదేశం అనే ఆలోచన’కు రూపమిచ్చాడు. అయితే ఇది సాకారం కావాలంటే, తమ సాటి ఉత్పాదక శూద్రులైన దళితులు తమ నుంచి ఎలా వెలికి గురయ్యారనే సంగతిని శూద్రులు అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ విభజన సృష్టించడం ద్వారా ద్విజులు.. తమ ఇరువురిపైనా ఎంత పటిష్టమైన నియంత్రణ కలిగి ఉన్నారో కూడా అర్థం చేసుకోవాలి. దళితులను శూద్రుల నుంచి వేరుచేసి వారికి ప్రతికూల ఆధ్యా త్మిక భావజాలాన్ని ఆపాదించింది బ్రాహ్మణవాదం. అది ఇప్పటికీ కొనసాగుతున్న ఒక మూఢ నమ్మకం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత మొత్తం జనాభాలో శూద్రులు 52 శాతం ఉన్నారు. దళితులు 16.6 శాతం ఉన్నారు. బ్రాహ్మణులు, బనియాలు, కాయస్థులు, ఖత్రీలు, వంటి వారందరూ కలిసి దాదాపు 5 శాతం మాత్రమే ఉన్నా. తమకన్నా అధిక సంఖ్యలో ఉన్న దళితులను వీరు ఆధునిక అంటరాని బానిసలను చేశారు. 2011 జనగణన ప్రకారం మొత్తం జనాభాలో హిందువులు 79.8 శాతం ఉన్నారు. శూద్రులు/ఓబీసీలు, ద్విజులు కచ్చితంగా ఎంతమంది ఉన్నారన్న సంగతి భవిష్యత్తులో కులాలవారీ జనాభా గణన చేసినప్పుడే తెలుస్తుంది. ప్రస్తుతం అనుకుంటున్న సంఖ్యలు గాలిలో రాతల లాంటివే. చర్రితను పరిశీలించినప్పుడు, కుల విభేదాలు భారత అభివృద్ధిపై చాలా ప్రతికూల ప్రభావం కలిగి ఉన్నాయనేది స్పష్టమవుతుంది. క్రీ.పూ. 1500 ప్రాంతంలో బ్రాహ్మ ణుల ఆధ్యాత్మిక గ్రంథంగా రుగ్వేదాన్ని రాయడంతో అసలు సమస్య ప్రారంభమైంది. ఆహార అనుత్పాదక వర్గాలవారు హరప్పా నాగరికత నిర్మాతలను శాశ్వతంగా తమ బానిసలుగా చేసుకున్నారు. వారు మొదట్లో ఈ బానిసలను అంటదగిన, అంటరానివారుగా; ఆ తర్వాత అనేక కులాలుగా విభజించారు. అంటరానితనం అనే సామాజిక జాడ్యం రుగ్వేదకాలంలో లేనే లేదనిపిస్తుంది. ఎక్కడా దాని ప్రస్తావన కనిపించదు. నాలుగు వర్ణాల్లో చిట్టచివరిదైన శూద్ర వర్ణం వారు మిగిలిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారికి అన్ని రకాల సేవలూ అందిస్తూ సేవించాలి. దీన్నిబట్టి అంటరానివారుగా భావిస్తున్న పంచములు మొదట్లో శూద్రులలో భాగంగా ఉండేవారని అర్థమవుతుంది. జంతు చర్మాలు, వాటితో తయారు చేసిన వస్తువులు అపవిత్రమైనవి (అంటరానివి)గా బ్రాహ్మ ణవాదం ప్రçకటించిన తర్వాతే తోళ్లతో సంబంధం ఉన్న శూద్రు లందరినీ అంటరానివారుగా పరిగణించారని అనిపిస్తుంది. వేద కాలపు ప్రజల ప్రధాన వృత్తి పశుపోషణ అయినప్పటికీ తోళ్ల పరిశ్రమ కూడా వారి ఆర్థిక జీవనంలో ఒక భాగమే అని చెప్పవచ్చు. వేదకాలపు పశుపోషణ ఆర్థిక వ్యవస్థను పోలిన ప్రస్తుత ఆదివాసీ వ్యవస్థలను పరిశీలిస్తే అందుకు సంబంధించిన సాక్ష్యాలు లభిస్తాయి. దట్టమైన అరణ్యాల్లో ఉన్న మనకాలపు ఆదివాసీ సమాజాల్లో కూడా వృత్తుల ప్రత్యేకీకరణ కనిపిస్తుంది. అక్కడా వేటాడటం, చర్మా లను సేకరించడం, ఆ చర్మాల నుంచి రకరకాల తాళ్లు, బ్యాగులు, ఇతర వ్యవసాయ పనిముట్లు తయారు చేయడం కనిపిస్తుంది. కానీ ఆ ఆదివాసీ సమాజాల్లో ఈ తోళ్లతో సంబంధం ఉన్న పనివారిని అంట రానివారుగా పరిగణించకపోవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాల అభివృద్ధి క్రమంలో అతి సహజంగా కనిపించే దృశ్యం ఇది. కానీ భారత దేశంలో బ్రాహ్మణవాదం మానవుల్లో బానిసత్వం కన్నా ఘోరమైన అంటరానితనం అనే కొత్త సూత్రాన్ని ప్రవేశపెట్టింది. అంటరానితనానికి గీటురాయి తోలు ఆధునిక భారతం అంతటా తోళ్ల పరిశ్రమ మొత్తం దళితుల పరి శ్రమగా ఉంది. ఇందులో పనిచేసేవారందరూ దళితులే. గ్రామీణ భారతావనిలో తోలు పని.. శూద్రులు, దళితులకు మధ్య అంటరాని తనానికి గీటురాయిగా ఉంది. అయితే ఇస్లాం రాకతో అందులోకి మారినవారు కుల పరమైన గుర్తింపు లేకుండానే తోలు పరిశ్రమలో భాగమయ్యారనుకోండి. ఇతర వెనుకబడిన తరగతులవారు, ద్విజులు ఎవరూ తోలు పరిశ్రమలో పనిచేయడం లేదు. అయితే ఏ దశలో తోలుపని అంటరానిదానిగా మారిందనేది స్పష్టంగా తెలియదు. శూద్రుల ఆచార వ్యవహారాల్లో కొత్తగా కులాల ప్రాతిపదికన బ్రాహ్మణ కర్మకాండలను బ్రాహ్మణవాదం ప్రవేశ పెట్టింది. తోలు అపవిత్రం, దానికి సంబంధించిన పని కలుషిత మైనదని ఈవాదం వారి బుర్రల్లో చొప్పించింది. ఫలితంగా అంటరాని తనం పాదుకుంది. కర్మకాండలు మూఢనమ్మకాలుగా మారి పోయాయి. ఇందుకు వేలాది సంవత్సరాల కాలం పట్టింది. అందుకే బ్రాహ్మణవాదం ఒక మతం కాదు. అది ఒక మూఢ నమ్మకం. పరంపరగా వస్తున్న బ్రాహ్మణ వాదం ఆధారంగా పనిచేసే ఆర్ఎస్ఎస్/బీజేపీ శ్రేణులకు అంటరానితనాన్ని నిర్మూలించాలనే ఎజెండా లేదు. దళిత, శూద్ర తత్వవేత్తలు కలిసి కూర్చొని భారత చర్రితను జాగ్రత్తగా అధ్యయనం చేసినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అంటరానివారు, అంటదగినవారి మధ్య ఉండే సంబంధం శాశ్వత మానవ సంబంధం కాదు. ఈ అమానవీయ సంబంధాన్ని నాశనం చేయడానికి నడుం బిగిస్తే తప్పనిసరిగా ఈ భూమిపై నుంచి అది మాయమవుతుంది. బ్రాహ్మణ వాద సాహిత్యానికి చెందిన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాల్లో అంటరానితనానికి ఎటువంటి పరిష్కారం లేదు. అసలు సమస్యను సృష్టించిందే ఈ సాహిత్యం కాబట్టి పరిష్కార మార్గాలు అందులో ఎందుకుంటాయి? ఇవ్వాళ ఆర్ఎస్ఎస్, బీజేపీలు బ్రాహ్మణ వాద గ్రంథాలన్నీ శూద్రులు, దళితుల అసలైన సంస్కృతిని నిక్షిప్తం చేశాయని, వాటిని అనుసరించాలని, వాళ్లంతా తమవారేనని.. తమ రాజకీయ ప్రాపగాండాలో భాగంగా ప్రచారం చేస్తున్నాయి. నిజానికి భారత దేశంలో తప్ప, ప్రపంచంలోని ఏ మత గ్రంథం కూడా ప్రజ లను కులాలుగా విభజించి అమానవీయమైన అంటరానితనాన్ని ప్రబోధించలేదు. తోలుపై రాయడాన్ని ఎందుకు నిరాకరించినట్లు? భారతదేశంలో తోలుతో సంబంధం ఉన్న వారందరినీ అంటరాని వారిగా చిత్రించిన బ్రాహ్మణీయ వ్యవస్థ, చివరికి తోళ్లను రాత సాధనంగానూ ఉపయోగించడానికి నిరాకరించింది. తోలుకు అపవ్రి తతను ఆపాదించిన బ్రాహ్మణవాదులు తొందరగా పాడైపోయే తాళ పత్రాలపై రాసేవారు. దీంతో మన ప్రాచీన జీవనానికి సంబంధించిన ఎంతో సమాచారాన్ని కోల్పోయాం. ప్రాచీన ప్రపంచంలో మొదటగా బైబిల్ని లిఖించింది సాపుచేసిన చర్మం మీదే. అలాగే గ్రీకు తత్వ వేత్తలు, ఈజిప్టు వాసులూ తోలుపైనే రాశారు. కన్ఫ్యూసియస్ వంటి చైనా తత్వవేత్తలు కూడా చర్మంపైనే తమ రచనలు చేశారు. టావో మతం చర్మంపై రాసిన రచనల ఆధారంగానే ఉనికిలోకి వచ్చింది. సమకాలీన ప్రాచీన ప్రపంచంలో భారతీయులు తప్ప వేరే ఎవరూ తాళపత్రాలను రాతకోసం ఉపయోగించలేదు. పోనీ దేశంలో తోలు పరిశ్రమలో ఉన్నవారన్నా చర్మంపై రాశారా అంటే అదీ లేదు. ఇందుకు కూడా నిందించవలసింది బ్రాహ్మణ వాదు లనే. ఎందుకంటే దళితులు, శూద్రుల చదువుపై నిషేధం విధించింది వారే గనుక. మానవుల మధ్య అసమానత్వాన్ని సృష్టించడానికి దైవత్వ భావాలను సాధనాలుగా ఉపయోగించడం వల్ల ప్రజల్లో ఉత్పాదకతా సామర్థ్యం దెబ్బతింటుంది. సరిగ్గా భారత దేశంలో జరి గిందీ ఇదే. ఈ బ్రాహ్మణీయ భావజాలం వల్ల కేవలం దళితులే కాదు శూద్రులు కూడా తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఉత్పాదక శక్తులు బాగా బలహీనమయ్యాయి. ఇతర శక్తులు భారతదేశంలో జోక్యం చేసుకుని ఉండకపోతే ఇండియా మరింతగా వెనకబడిపోయి ఉండేది. విశ్లేషకులు ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
దళితులంతా సీఎం జగన్‌కు అండగా నిలబడాలి: సురేశ్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. దళితులకు భరోసా, నమ్మకం, గౌరవం కల్పించారు. దళితుడైన నన్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. వైఎస్సార్ కడప జిల్లాలో మంగళవారం జరిగిన దళిత ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘‘దళితుల వెనుకబాటుకు ప్రధాన కారణమైన చదువుపైన సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.. అణిచివేతకు గురైన దళితులకు సమాజంలో సమానత్వం అందించేలా కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. దళితులకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందిచడానికి కృషి చేస్తున్నారు అని తెలిపారు. (చదవండి: సెలవు రోజూ ‘ఆసరా’ సంబరాలు) ‘‘సీఎం జగన్ దళితుల కోసం తీసుకొచ్చిన కార్యక్రమాలు చూసి ప్రతిపక్షాలకు కడుపు మండుతోంది. అందుకే వాటిని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. బడుగు వర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయత్నం. దళితుల కుటుంబాల గుండెల్లో వైఎస్ జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారు. దళితులపైన చంద్రబాబుకు చులకన భావన, నీచ దృష్టి ఉంటుంది. అయితే దళితుల ఓట్లు మాత్రం కావాలనే నీచమైన ఆలోచనతో దళితులకు ద్రోహం చేశారు. బీజేపీ నేతలు తమ స్వార్థం కోసం దళితుల ఓటు బ్యాంకు కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దళితులంతా కలిసికట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అండగా నిలబడదాం’’ అని సురేశ్ పిలుపునిచ్చారు. చదవండి: ‘ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విద్య ఉండాలన్నదే ఉద్దేశం’ -
సీఎంపై సభాహక్కుల నోటీస్ పరిశీలిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని ప్రకటించి ఇప్పుడు వెనక్కు తగ్గిన సీఎం కేసీఆర్‌పై సభాహక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు తెలిపారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పలేదని సీఎం అవాస్తవాలు మాట్లాడారని, భగ వద్గీత, ఖురాన్, బైబిల్‌పై సీఎం ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. ఆ విధంగా చేయ లేని పక్షంలో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీ తప్పుగా ప్రచురితమైందని, దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి సిద్ధంగా లేమని చెప్తారా అని నిలదీశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో అప్పటి మంత్రి కోనేరు రంగారావు అధ్యక్షతన సభాసంఘం సమ ర్పించిన నివేదికను శాసనసభ ఎదుట ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. దాదాపు ఏడేళ్ల క్రితమే రాష్ట్రంలో కులాల వారీగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎందుకు బయట పెట్టడంలేదో చెప్పాలన్నారు. -
మీ రక్తం మాకొద్దు.. సీఎం కుర్చీ కావాలి
సాక్షి, హైదరాబాద్: దళితులకు సీఎం కేసీఆర్ రక్తం అవసరం లేదని, ఆయన కూర్చున్న సీఎం కుర్చీ కావాలని, ఆ కుర్చీ ఇస్తే తమను తామే అభివృద్ధి చేసుకుంటామని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానిం చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు వారు రాసిన బహిరంగలేఖను శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. రాహుల్‌గాంధీకి టీఆర్ఎస్ నేతలు లేఖ రాయడం ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే అన్నట్టే ఉందని ఆ లేఖలో తెలిపారు. ఏడేళ్లుగా దళితులకు టీఆర్ఎస్ చేసిన మోసంపై, ఆ పార్టీ నేతలు వాడిన భాషపై రాహుల్ గాంధీ సమక్షంలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద ఈ ఏడేళ్లలో రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా, వాటిని ఖర్చు పెట్టకుండా దళితులకు ద్రోహం చేశారని, కేసీఆర్‌కు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే ఏకకాలంలో వారి అభివృద్ధి కోసం రూ.65 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం రూ.10 వేల కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ పదవులను అక్కడి వ్యక్తులకే కట్టబెట్టి మిగిలిన నియోజకవర్గాల నాయకులను మోసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి రుణాల కోసం 9 లక్షల మంది దళితులు దరఖాస్తు చేసుకుంటే కేవలం లక్ష మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, మిగిలిన వారికి రక్తం ధారబోయాల్సిన పనిలేదని, లోన్లు ఇస్తే చాలని ఎద్దేవా చేశారు. -
దళితులపై దాడులకు చంద్రబాబే గ్యాంగ్ లీడర్
సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై దాడులకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గ్యాంగ్‌లీడర్‌లా వ్యవహరించారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. మంగళవారం గుంటూరులో పర్యటించిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందాన్ని కలిసిన అనంతరం ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకరరావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి.లక్ష్మణరెడ్డి కూడా వారి వెంట ఉన్నారు. మహిళలపై వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడే వారిపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని, రమ్య హత్య కేసు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటుందని జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం సత్వరమే ఆదుకుందని, 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసినట్లు గుర్తు చేశారు. రమ్య హత్య ఘటన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేగంగా స్పందించిన తీరు, ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకున్న చర్యలను ఎస్సీ కమిషన్ అభినందించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల పట్ల కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసిందని, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏ ప్రభుత్వాలూ ఇంతగా స్పందించలేదని కమిషన్ సభ్యులు చెప్పారన్నారు. రమ్య కుటుంబానికి చట్ట ప్రకారం న్యాయం చేస్తామని, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట ప్రకారం బాధిత కుటుంబానికి వారం లోపే సాయాన్ని అందచేశామని చెప్పారు. కమిషన్ దృష్టికి గత సర్కారు అఘాయిత్యాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దళితులకు జరిగిన తీవ్ర అన్యాయాలు, అఘాయిత్యాలను ఎస్సీ కమిషన్‌కు వివరించినట్లు జూపూడి ప్రభాకర్ తెలిపారు. రమ్య కుటుంబ సభ్యులే ముఖ్యమంత్రి జగన్ తమకు న్యాయం చేశారని చెబుతున్నారని, ఇకనైనా చంద్రబాబు నీచ రాజకీయాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. దళితులపై వ్యాఖ్యలు గుర్తున్నాయ్ బాబూ: ఎమ్మెల్యే నాగార్జున రమ్య హత్య ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచిందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఇంత వేగంగా న్యాయం చేయడం బహుశా దేశంలో ఎక్కడా జరగలేదని, రమ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయంతోపాటు ఇంటి స్థలం పట్టా కూడా ఇచ్చినట్లు చెప్పారు. గత సర్కారు దళితులను అంటరానివారిగా చూసిందని ఎమ్మెల్యే నాగార్జున గుర్తు చేశారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ అధికారంలో ఉండగా చంద్రబాబు దురహంకారంతో చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు ఎస్సీలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ఆయన్ను విచారించాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో దళితులకు ఇళ్ల స్థలాలను సైతం అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. చంద్రబాబు దళితులను మోసగించి లాక్కునన్ని భూములు చరిత్రలోనే ఎవరూ లాక్కోలేదన్నారు. ఆయన కులమతాలు, ప్రాంతాలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీఎం తక్షణమే స్పందిస్తున్నారు: మాణిక్యవరప్రసాద్ ముఖ్యమంత్రి జగన్ అందరికంటే ముందే స్పందించి బాధితురాలు రమ్య కుటుంబానికి ఆసరాగా నిలిచారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. రాష్ట్రంలో మహిళలు, పేదలు, దళితులపై ఏ చిన్న ఘటన జరిగినా ముఖ్యమంత్రి తక్షణమే స్పందిస్తున్నారని గుర్తు చేశారు. బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచిన దళిత సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. దళితులపై ఈగ వాలకుండా చూస్తున్నారు: ఎమ్మెల్యే రజని దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ స్పందించని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రమ్య కుటుంబానికి కొండంత అండగా నిలిచిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దళితులపై ఈగ కూడా వాలకుండా అండగా నిలుస్తున్నారని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజని పేర్కొన్నారు. మృతురాలి కుటుంబానికి పరిహారం, ఇంటి స్థలంతోపాటు వ్యవసాయ భూమి కూడా ఇస్తున్నామన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు మృతురాలు రమ్య సోదరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిందితుడికి త్వరితగతిన కఠిన శిక్ష పడేలా న్యాయ నిపుణులతో ప్రభుత్వం చర్చిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన ఫోన్లో స్వయంగా దిశ యాప్ పనితీరును ఎస్సీ కమిషన్ బృందానికి వివరించారు. దళితులకు అన్యాయం జరిగిన సమయాల్లో ప్రభుత్వాలు ఇలానే శరవేగంగా స్పందిస్తే సమాజం బాగుంటుందని జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఎన్నాళ్లీ లాఠీ దెబ్బలు.. తెగించి కొట్లాడదాం
సాక్షి, హైదరాబాద్: ‘అధికారమే లక్ష్యంగా తెగించి కొట్లాడాల్సిన సమయం వచ్చింది. కర్ణాటక తరహాలో ఉద్యమిద్దాం. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెద్దాం. బీజేపీ కార్య కర్తలంతా రాబోయే రెండేళ్లపాటు తమ పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించండి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. 2023లో బీజేపీని అధి కారంలోకి తెచ్చే వరకు తాను దశల వారీగా పాద యాత్రను కొనసాగించనున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ అవినీతి, కుటుంబపాలనతో తెలంగాణ తల్లి బందీ అయ్యిందని, ఆ తల్లిని విముక్తి చేయడమే లక్ష్యంగా తెగించి పోరాడాలన్నారు. నీళ్లు–నిధులు–నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఏర్పడితే 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా గడీల పాలనతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుయ్యబట్టారు. ఈ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని, ప్రజల ఆకాంక్షలు, బాధలు తెలుసుకోవాలనే ఈనెల 24 నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్నట్టు చెప్పారు. గురువారం పార్టీ కార్యాలయంలో తన పాదయాత్రలో పాల్గొనే కార్యకర్తలకు నిర్వహించిన వర్క్‌షాపులో బండి సంజయ్ మాట్లాడారు. ‘కేసీఆర్ పాలనలో ప్రజలంతా అల్లాడిపోతున్నారు. ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. జైల్లో వేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు లాఠీ దెబ్బలు తిందాం? ఇంకా ఎన్నాళ్లు త్యాగాలు చేద్దాం?’ అంటూ ప్రశ్నించారు. ఒకప్పుడు కర్ణాటకలో పాలకులు కాషాయ జెండాపై కక్ష కట్టి కార్యకర్తలను జైల్లో వేశారని గుర్తుచేశారు. అయినా అక్కడి కార్యకర్తలు వెరవకుండా పాలకులపై తెగించి యుద్ధం చేసిన ఫలితంగానే కర్ణాటకలో పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ‘పార్టీ కోసం బూత్‌స్థాయి నుంచి ఎవరు శ్రమిస్తున్నారనే విషయాన్ని పరిశీలించేందుకే కేంద్రం నన్ను ప్రతినిధిగా పంపింది. అందరూ కష్టపడి పనిచేయాలి’ అని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇన్చార్జి, ఎంపీ మునుస్వామి చెప్పారు. ఈ వర్క్‌షాపులో పాదయాత్ర ప్రముఖ్ డా.గంగిడి మనోహర్ రెడ్డి, సహప్రముఖ్ తూళ్ల వీరేందర్ గౌడ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డా. మల్లారెడ్డి, కట్టాసుధాకర్ పాల్గొన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయండి రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోబోదని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇలాంటివి జరిగినపుడు జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకునేదాకా ఒత్తిడి తేవాలని పార్టీ ఎస్సీ మోర్చా నాయకులకు సూచించారు. -
వైఎస్సార్సీపీ నుంచి దళితులను వేరు చేయలేరు : మంత్రి అవంతి
-
దళితులపై అనుచిత వ్యాఖ్యలు.. నటి అరెస్ట్
చెన్నై: తమిళ నటి, బిగ్ బాస్ ఫేం మీరా తన విచిత్రమైన వ్యవహర శైలితో తరచూ వార్తల్లో నిలిచే సంగతి తెలిసిందే. ఇతర నటీనటులు, ప్రముఖ రాజకీయ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్‌టాపిక్‌గా మారుతుంటారు. సెలబ్రిటీల గురించి అంటే పర్లేదు కానీ ఈ సారి ఏకంగా ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మీరా మిథున్ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత-కేంద్రీకృత పార్టీ అయిన విదుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటిని అరెస్ట్ చేశారు. కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల ప్రకారం మీరా మిథున్ దళితుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో మీరా మిథున్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా నెటిజనులు డిమాండ్ చేశారు. మీరా మిథున్ షేర్ చేసిన వీడియోలో.. ఆమె ఓ డైరెక్టర్ అనుమతి లేకుండా తన ఫోటోని అతడి మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ కోసం వాడుకున్నాడని ఆరోపించారు. అంతటితో ఊరుకోక.. ‘‘తక్కువ జాతి అనగా దళిత సామాజిక వర్గానికి చెందిన వారి ఆలోచనలు ఇలానే ఉంటాయి. చాలా చీప్‌గా ప్రవర్తిస్తారు’’ అంటూ నోటికొచ్చినట్లు విమర్శించారు. దళితులు నేరాలకు, అంసాఘిక కార్యకలపాలకు పాల్పడటం వల్లనే వారిని సమాజంలో నీచంగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాక తమిళ ఇండస్ట్రీలో ఉన్న దళిత దర్శకులను, నటీనటులను బయటకు గెంటేయాలని సూచించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు మీరా మిథున్‌సై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు మీరా మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. ఇక మీరా తమిళ్ బిగ్‌బాస్ సీజన్3లో పాల్గొన్నారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. Actress Meera Mithun has used very derogatory term against SC/ST people in her video. This shows her caste conceit mindset. She must be arrested soon. @mkstalin #CrushTheCaste pic.twitter.com/LghONRsKPv — Mission Ambedkar (@MissionAmbedkar) August 7, 2021 -
ఇదో ఉద్యమం.. దేశానికే వెలుతురునిస్తుంది: సీఎం కేసీఆర్
మూడు దశల్లో పథకం.. ►దళితుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా మూడు దశలను పాటించాలి. మొదట దళితుల అసైన్డ్, గ్రామ కంఠం తదితర భూసమస్యలను పరిష్కరించాలి. తర్వాత దళితవాడల్లో మౌలిక వసతులను సంపూర్ణ స్థాయిలో మెరుగుపర్చాలి. అనంతరం ‘దళిత బంధు’పథకాన్ని అమలు చేయాలి. దళిత బంధు లబ్ధిదారులకు బీమా ►‘దళిత బంధు’ లబ్ధిదారులకు ‘దళిత బీమా’ను వర్తింపచేసే దిశగా సర్కారు ఆలోచన చేస్తోంది. రైతుబీమా మాదిరి వ్యవస్థను ఏర్పాటు చేసి దళిత బీమాను అమలుచేద్దాం. మంత్రి, దళిత ప్రజాప్రతినిధులు, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు చేసి, ఆమోదయోగ్య కార్యాచరణ రూపొందించాలి. కొంచెం ఆలస్యమైనా సరే దళిత బీమాను అమలు చేసుకుందాం. సాక్షి, హైదరాబాద్: ‘‘దళితబంధు ఒక కార్యక్రమం కాదు.. ఇదొక ఉద్యమం.. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి విజయాన్ని సాధించి పెట్టింది. ఇప్పుడు దళితబంధు కార్యక్రమం దళితుల అభి వృద్ధితో పాటు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి దారులు వేస్తుంది. అవకాశం, సహకారం లేక బాధపడు తున్న వర్గాలకు మార్గం చూపుతుంది. ఇక్కడి దళితుల విజయం ఇతర కులాలు, వర్గాలకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశానికి వెలుతురు ప్రసరింప చేస్తుంది’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ‘దళిత బంధు’ పథకంపై హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన 427 మందితో ప్రగతిభవన్‌లో సోమవారం నిర్వహించిన అవగా హన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మనిషిపై తోటి మనిషి వివక్ష చూపించే దుస్థితి మీద సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీ ద్వారా తాను కూడా అధ్యయనం చేశానని కేసీఆర్ వివరించారు. కక్షలు, కార్పణ్యాలు ద్వేషాలు పోయి పరస్పర విశ్వాసం పెంచుకుని ఒకరికొకరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. దళిత మహిళ మరియమ్మ మరణానికి కారకులైన పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ప్రభుత్వమే అండ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్కో వర్గాన్ని, ఒక్కో రంగాన్ని బాగు చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వమే స్వయంగా అండగా ఉన్నప్పుడు స్వీయ అభివృద్ధి కోసం దళిత సమాజం పట్టుదలతో పనిచేయాలి. తమలో ఇమిడి ఉన్న పులిలాంటి శక్తిని గుర్తించి ముందుకు సాగాలి. దళారులకు, ప్రతీప శక్తులకు దూరంగా ఉండాలి. దళితవాడల్లో ఇప్పటికే నమోదై ఉన్న పరస్పర కేసులను వాపస్ తీసుకుని పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలి. అప్పుడే మన విజయానికి బాటలు పడతాయి. వ్యాపారవర్గంగా అభివృద్ధి చెందాలి ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో దళిత సమాజం తమకు ఇష్టమైన పరిశ్రమ, ఉపాధి, వ్యాపారాన్ని ఎంచుకుని వ్యాపారవర్గంగా అభివృద్ధి చెందాలి. గ్రామంలోని ఇతర వర్గాలు దళితుల వద్దకు అప్పుకోసం వచ్చేలా ఆర్థిక సాధికారత సాధించాలి. అంబేద్కర్ ఆశయాలను అమలు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో విద్యావంతులైన దళితులు కదిలి రావాలి. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమవుతున్న దళితబంధును విజయవంతం చేసేందుకు పట్టుదలగా పనిచేయాలి. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించాలి. దళితులు విజయం సాధించి వెలుగు దివ్వెలు, కరదీపికలుగా మారాలి. ఏది కోరుకుంటే అదే.. వివిధ రకాల ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాలను గుర్తించి లబ్ధిదారుల ఇష్టాన్ని బట్టి ఆర్థిక సాయం అందిస్తాం. దానితోపాటు లబ్ధిదారులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘దళిత రక్షణ నిధి’ఏర్పాటు చేస్తాం. కలెక్టర్ల పర్యవేక్షణలో లబ్ధిదారుల కమిటీ దానిని నిర్వహిస్తుంది. ఆ నిధిలో ఏటా కనీస మొత్తాన్ని జమ చేస్తూ దళితులు మరింత పటిష్టంగా నిలదొక్కుకునేందుకు వినియోగిస్తాం. ప్రతీ లబ్ధిదారుడికి గుర్తింపు కార్డు దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందేవారికి గుర్తింపు కార్డు ఇస్తాం. ప్రత్యేకమైన బార్‌కోడ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్‌ను ఆ ఐడీ కార్డులో చేర్చి పథకం అమలుతీరు సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తాం. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. లబ్ధిదారుడు తను ఎంచుకున్న పనిద్వారా ఆర్థికంగా ఎదగాలే తప్ప జారి పడనివ్వం. సోమవారం ప్రగతిభవన్‌లో హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులతో కలసి భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో దళితుల సమస్యలన్నీ తీర్చాలి హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత వాడల స్థితిగతులను తెలియజేసేలా ప్రొఫైల్ తయారు చేయాలి. హుజూరాబాద్‌లో ఇల్లు లేని దళిత కుటుంబం లేకుండా వంద శాతం పూర్తికావాలి. ఖాళీ స్థలాలున్న వారు ఇండ్ల నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా దళితులకు దీనిని అమలు చేస్తాం. నియోజకవర్గంలోని దళితవాడల్లో రేషన్‌కార్డులు, పింఛన్లు సహా అన్ని రకాల సమస్యలను గుర్తించి అధికారులు నివేదిక తయారు చేయాలి. వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వమే ఉచితంగా వైద్య సాయం చేస్తుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో వారం పదిరోజుల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి, అసైన్డ్ సహా దళితుల అన్నిరకాల భూసమస్యలను పరిష్కరించాలి..’’అని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాగా సదస్సులో ప్రసంగం తర్వాత దళిత బంధు పథకంలో మార్పులు, చేర్పులపై హుజూరాబాద్ నుంచి వచ్చిన దళితుల నుంచి సీఎం అభిప్రాయాలు సేకరించారు. సుదీర్ఘంగా ఎనిమిది గంటల పాటు ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు సుమారు 8 గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ఉదయం 11.30కు సమావేశం ప్రారంభంకాగా దళితబంధు పథకం ప్రత్యేకతలను సీఎం కేసీఆర్ వివరించారు. మధ్యాహ్నం సదస్సుకు హాజరైన మహిళలు, యువకులు, ఇతర ప్రతినిధులతో కలిసి సీఎం భోజనం చేశారు. నాటుకోడి, చేపలు, మాంసాహారం, ఇతర ప్రత్యేక వంటకాలు వడ్డించారు. ఈ సందర్భంగా ‘గొర్రెల మందల పెరిగిన పులి’, ‘పైరవీకారుల మీద రామాయణం’అంటూ సీఎం హాస్యోక్తులు పండించినట్టు దళిత ప్రతినిధులు వెల్లడించారు. 17 వేల పొదుపు సంఘాలను తయారుచేసిన బంగ్లాదేశ్ ప్రొఫెసర్ హాష్మి గురించి కేసీఆర్ వివరించారని తెలిపారు. సదస్సులో హుజూరాబాద్ ఉప ఎన్నిక, అభ్యర్థులు వంటి అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని పేర్కొన్నారు. సదస్సులో పాల్గొన్నది వీరే.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన దళితబంధు అవగాహన సదస్సులో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, గోరటి వెంకన్న, ప్రభాకర్, రాజేశ్వర్‌రావు.. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, రసమయి బాలకిషన్, గా>్యదరి కిషోర్, చంటి క్రాంతి కిరణ్, సండ్ర వెంకటవీరయ్య, దుర్గం చిన్నయ్య, హన్మంత్ షిండే, సుంకె రవిశంకర్, కె.మానిక్‌రావు, కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, జి.సాయన్న, వీఎం అబ్రహం, చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఇక సీపీఎం, సీపీఐ నేతలు వెంకట్, బాలనర్సింహ, ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్‌రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, పలు ఇతర శాఖల ఉన్నతాధికారులు, హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఎవరేమన్నారంటే.. ►నేను ట్రాక్టర్ డ్రైవర్‌ను. పథకంలో అర్హత పొందితే ట్రాక్టర్‌ను కొనుక్కుంటా: సమ్మయ్య, కిష్టంపల్లి, వీణవంక మండలం ►నేను కారు డ్రైవర్‌ను. టాక్సీ కారు కొనుక్కుని స్వయంగా కిరాయికి నడుపుకొంటా: దాసర్ల చిరంజీవి, లస్మక్కపల్లి, వీణవంక మండలం ►తెలంగాణలో విజయం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా ‘దళిత బంధు’లాంటి పథకాన్ని అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: వెంకట్, సీపీఎం ►రాజకీయాలకు అతీతంగా అమలు చేస్తున్న దళితబంధు దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పుకు బాటలు వేస్తుంది. దేశవ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు కోసం పోరాడుతాం: బాల నర్సింహ, సీపీఐ ►దళితబంధు పథకం ద్వారా తెలంగాణ దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరుగుతారు. అరవై లక్షల మంది తెలంగాణ దళితులæ జీవితాల్లో వెలుగులు నింపే గురుతర బాధ్యత హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టు విజయం మీద ఆధారపడి ఉంది: రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే ►పథకం పటిష్ట అమలు కోసం నోడల్ ఏజెన్సీని నియమించాలి. దళిత ప్రజాప్రతినిధులు పైలట్ నియోజకవర్గంలో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తే నేర్చుకుంటం: గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్ ►బ్యాంకుల ప్రమేయం లేకుండా, గ్యారెంటీ లేకుండా నేరుగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే: కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి ►చిన్నలోన్ కోసం తండ్లాడిన దళితులకు ఉపాధి కోసం రూ.10 లక్షలు పూర్తి ఉచితంగా ఇవ్వడం మానవీయ నిర్ణయం. ఇది దేశంలోనే విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుంది. ఉద్యమ స్పూర్తితో జరుగుతున్న తెలంగాణ అభివృద్ధిలో మాలాంటి వాళ్లను ప్రజాప్రతినిధులను చేసి భాగస్వామ్యం చేస్తున్నందుకు ధన్యవాదాలు -గోరటి వెంకన్న, ఎమ్మెల్సీ 16 బస్సులు.. 427 మంది హుజూరాబాద్: ప్రగతిభవన్‌లో జరిగిన ‘దళితబంధు’పథకం అవగాహన సదస్సులో పాల్గొనేందుకు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 412 మంది దళిత ప్రతినిధులు, 15 మంది రిసోర్స్పర్సన్లు కలిపి మొత్తం 427 మంది 16 ప్రత్యేక ఏసీ బస్సుల్లో వచ్చారు. మొదట ఆయా మండలాల నుంచి బస్సుల్లో హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్దకు వచ్చారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, మరికొందరు బాణసంచా డప్పు చప్పుళ్ల మధ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తర్వాత బస్సులను కలెక్టర్ కర్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. అవగాహన సదస్సులో పాల్గొనేందుకు నియోజవర్గంలోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డు నుంచి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషుల చొప్పున ఎంపిక చేసి పంపినట్టు కలెక్టర్ తెలిపారు. -
9న ఇంద్రవెల్లిలో లక్షమందితో దండోరా
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లుగా దళితులు, గిరిజనులకు చేస్తున్న మోసాలను రాష్ట్రవ్యాప్తంగా ఎండగట్టేందుకు ఆగస్టు 9న ఇంద్రవెల్లి నుంచి లక్షమందితో దండోరా మోగించనున్నామని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని చిరాన్‌పోర్ట్ క్లబ్లో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నేతలతో రేవంత్ సమావేశమయ్యారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కె. ప్రేంసాగర్‌రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కె.సురేఖ, జాతీయ యువజన కాం గ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్‌కుమార్ యాదవ్, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ పాల్గొన్నారు. రేవంత్ మాట్లాడుతూ ఒక్క హుజూరాబాద్‌లోనే దళితబంధు పథకం అమలు చేస్తే, మిగిలిన 118 నియోజకవర్గాల్లోని దళితుల పరి స్థితి ఏంటని ప్రశ్నిం చారు. రాష్ట్రంలోని 1.35 కోట్ల మంది దళిత, గిరిజనులకు ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులను మోసం చేసి డబ్బాల్లో ఓట్లు వేసుకుంటామంటే ఊరుకునే ప్రసక్తే లేదని, ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ ప్రభుత్వంపై ‘దళిత, గిరిజన దండోరా’మోగిస్తామని చెప్పారు. ప్రేంసాగర్‌రావుతోపాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలెవ్వరితోనూ తనకు విభేదాలు లేవని రేవంత్ స్పష్టం చేశారు. కాగా, అంతకుముందు బోనాల సందర్భంగా ఉజ్జయిని అమ్మవారిని రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన నిజాంపేటకు చెందిన వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం చేశారు. -
భయపడే ప్రసక్తే లేదు.. చావుకైనా సిద్ధం: ప్రవీణ్ కుమార్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పోలీసు కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్వేరోస్ వ్యవస్థాపకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. బహుజన రాజ్యాధికార సాధన కోసం మరణించడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. పదవీ విరమణ చేసిన మరుసటి రోజే పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని తెలిపారు. శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన స్వేరోస్ కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోట్లాది మంది ప్రవీణ్‌కుమార్‌లు పుట్టుకొస్తారు అంబేడ్కర్ బాటలో నడిచేందుకు ఒంటరి పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఒక్క ప్రవీణ్‌కుమార్‌పై కేసులు పెడితే కోట్లాది మంది ప్రవీణ్‌కుమార్‌లు పుట్టుకొస్తారని వ్యాఖ్యానించారు. పోలీసు ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నావని తన తల్లి ప్రశ్నిస్తే కోట్లాది మంది దళిత బిడ్డలను బాగు చేసేందుకే రాజీనామా చేశానని చెప్పానని తెలిపారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ గురించి నాలుగేళ్ల చిన్నపిల్ల ఎంతో చక్కగా మాట్లాడిందని, అలాంటి ధైర్యం ఆ 29 మంది ఎమ్మెల్యేలకు ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేదని విమర్శించారు. హుజురాబాద్‌లో దళితబంధు పథకాన్ని రూ.వెయ్యి కోట్లతో అమలు చేయాలని అనుకుంటున్నారని, ఆ డబ్బులతో దళిత బిడ్డలను అమెరికా, ఆస్ట్రేలియాల్లో చదివించేందుకు పంపితే సత్య నాదెళ్ల, బిల్‌గేట్స్, సుందర్ పిచాయ్‌లు అవుతారని పేర్కొన్నారు. తమ బిడ్డలు ఎన్ని రోజులు రోడ్లు ఊడ్వాలని, ఎన్ని రోజులు కల్లు గీయాలని, గొర్లు.. బర్లు కాయాలని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. అమెరికా, ఆస్ట్రేలియా ఎందుకు వెళ్లకూడదని అన్నారు. మన రాజ్యం వస్తుందని ప్రచారం చేయాలి వందల సంవత్సరాలుగా దళితులు అణచివేతకు గురవుతున్నారని, వారిపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ప్రవీణ్‌కుమార్ అన్నారు. మటన్, చికెన్ దావత్, బీరు, బిర్యానీలు, తాయిలాలకు మోసపోయే జాతులు మనవి కావని, రాజ్యాధికారం సాధించుకునేందుకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మన రాజ్యం వస్తుందని అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, తాండూర్ నుంచి నల్లగొండ వరకు ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. వీణ్‌కుమార్‌పై కేసు నమోదు కరీంనగర్ క్రైం: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరొకరిపై కరీంనగర్ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మార్చిలో పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్(దూళికట్ట) గ్రామంలో జరిగిన స్వేరోస్ కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్, ఎన్.శంకర్‌బాబు హిందువుల మత విశ్వాసాలను కించపరిచే విధంగా వ్యవహరించారంటూ న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి మార్చి 22న తన న్యాయవాది ద్వారా కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం గురువారం రాత్రి ప్రవీణ్‌కుమార్, శంకర్‌లపై కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఉపాధి.. రక్షణ.. సాధికారత.. ఉన్నతస్థితి 'దళిత బంధు'
అదనంగా రక్షణ నిధి పథకం అమలు, పర్యవేక్షణ.. ఫలితాలను అంచనా వేయడం.. లబ్ధిదారులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం.. ఈ మూడు ముఖ్యమైన అంశాలు దళిత బంధు పథకంలో ఉంటాయి. ఈ పథకం ద్వారా రూ.10 లక్షల నగదు అందిస్తారు. అదనంగా లబ్ధిదారుడు–ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధి నుంచి వారికి సహాయం అందుతుంది. ఈ పథకం ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబాల పరిస్థితి ఆపదల కారణంగా మళ్లీ దిగజారకుండా ఈ నిధి రక్షక కవచంగా నిలుస్తుంది. నేరుగా ఖాతాల్లోకి రూ. 10 లక్షలు కుటుంబం యూనిట్‌గా అర్హులైన దళిత కుటుంబాలకు నేరుగా ఆర్థికసాయం చేసి, వారికి ఇష్టమైన పనిని ఎంచుకుని, అభివృద్ధి చెందే అవకాశాన్ని కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. దళారుల బాధలేకుండా.. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేస్తాం. ‘హుజూరాబాద్’లో 20,929 కుటుంబాలకు... హుజూరాబాద్ మండలంలో 5,323 దళిత కుటుంబాలు, కమలాపూర్‌లో 4,346, వీణవంకలో 3,678, జమ్మికుంటలో 4,996, ఇల్లంతకుంటలో 2,586.. కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తంగా 20,929 దళిత కుటుంబాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వారిలో అర్హులైనవారిని పథకానికి ఎంపిక చేస్తారు. ఈ పథకాన్ని పరిపూర్ణ స్థాయిలో అర్హులందరికీ వర్తింపజేస్తామని సీఎం ప్రకటించారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితుల సాధికారత కోసం అమలు చేయనున్న కొత్త పథకానికి ‘తెలంగాణ దళిత బంధు’ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద కరీంనగర్‌లోని హుజూరాబాద్ నియోజవర్గంలో దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. తొలుత ఈ నియోజకవర్గంలోని మండలాల్లో దళిత కుటుంబాల స్థితిగతులపై అధ్యయనం చేసి.. అర్హులను గుర్తించి, పథకాన్ని వర్తింపజేస్తామని వెల్లడించారు. ‘దళిత సాధికారత పథకం– పైలట్ ప్రాజెక్టు ఎంపిక– అధికార యంత్రాంగం విధులు’ అంశాలపై కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కార్యాలయం వివరాలను వెల్లడించింది. ఇప్పటికే నిర్ణయించిన మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘దళిత బంధు’ పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పథకానికి ఈ ఏడాది రూ.1,200 కోట్లు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించామని.. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు అమలు కోసం అదనంగా మరో రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్లను ఖర్చు చేయనున్నామని తెలిపారు. ఆ నియోజకవర్గంలో ఎదురయ్యే లోటుపాట్లను సరిదిద్దడం, మరింతగా మెరుగుపర్చడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం సులువు అవుతుందన్నారు. పైలట్ ప్రాజెక్టు అమల్లో కలెక్టర్లతోపాటు కొందరు అధికారులు పాల్గొంటారని.. వారితో త్వరలో వర్క్‌షాప్ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రగతి భవన్లో దళిత సాధికారత కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా.. దళిత బంధు అమలులో అలసత్వం వహిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని సీఎం కేసీఆర్ అధికారులను హెచ్చరించారు. ‘‘పథకాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాల్సి ఉంది. మూస పద్ధతిలో కాకుండా ప్రభుత్వ ఆలోచనలను అందుకుని పనిచేసే అధికార, ప్రభుత్వ యంత్రాంగం ఎంపిక జరగాలి. ఎంపిక చేసిన అధికారులు దళిత బంధు పథకాన్ని ఆషామాషీగా కాకుండా మనసుపెట్టి అమలు చేయాలి. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఈ పథకం అమల్లో ముందుకు సాగాలి. మనం తినేటప్పుడు ఎంత లీనమై రసించి ఆరగిస్తామో, మనకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఎంత దీక్ష కనబరుస్తామో.. దళిత బంధు పథకం అమల్లో అధికారులు అంతే తాదాత్మ్యం చెంది పనిచేయాలి’’ అని పేర్కొన్నారు. కుల, ధన, లింగ భేదాలతో వ్యక్తులపై వివక్ష చూపి, ప్రతిభావంతులను ఉత్పత్తి రంగానికి దూరంగా ఉంచడం.. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగానే కాకుండా మొత్తం జాతికే నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. దళిత కుటుంబాల ప్రొఫైల్ రాష్ట్రవ్యాప్తంగా దళిత కుటుంబాల ప్రొఫైల్ రూపొందించాలని, వారి జీవన స్థితిగతులను అందులో పొందుపరచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దళితుల సమస్యలు అన్నిచోట్లా ఒకే రీతిలో ఉండవని.. గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ అనేవిధంగా విభజించాలని సూచించారు. ఆయా సమస్యలకు అనుగుణంగా దళిత బంధు అమలు చేయాలన్నారు. హుజూరాబాద్ నుంచి ఎందుకంటే? ‘దళిత బంధు’ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే ఎందుకు ప్రారంభిస్తున్నారన్న వివరాలను సీఎం కార్యాలయం వెల్లడించింది. ‘‘సీఎం కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలుకొని.. తాను ఎంతగానో అభిమానించిన రైతుబీమా పథకం దాకా చాలా వరకు కరీంనగర్ జిల్లా నుంచే మొదలుపెట్టారు. రైతుబంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. ఈ ఆనవాయితీని, సెంటిమెంటును కొనసాగిస్తూ.. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఆయన స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. తేదీ, ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు’’ అని తెలిపింది. చిత్తశుద్ధి, నిబద్ధత గల అధికారులు కావాలి ‘‘క్షేత్రస్థాయిలో దళిత బంధును పటిష్టంగా అమలు చేయడం కోసం.. దళితుల అభివృద్ధిపై మనసుపెట్టి నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరం. వారు అధికారులుగా కాకుండా సమన్వయకర్తలుగా, కార్యకర్తలుగా భావించి పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి చిత్తశుద్ధి, దళితులపై ప్రేమాభిమానాలున్న అధికారులను గుర్తించండి’’ అని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. -
‘వారి పక్కన కూర్చోవాలంటేనే అసహ్యమేస్తోంది’
చంద్రగిరి: దళితుడిని మాతో పాటు సమానంగా వేదికపై ఎలా కూర్చోబెడతారు? వారి పక్కన కూర్చోవాలంటేనే అసహ్యం వేస్తుంది.. మరోసారి ఇలా జరిగితే రైతుభరోసా కేంద్రానికి తాళాలు వేస్తానంటూ తెలుగుదేశం మద్దతుదారుడైన ఓ ఉపసర్పంచ్ తన కులపిచ్చిని ఇలా బహిరంగంగా వ్యక్తపరిచిన ఘటన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సొంత పంచాయతీలో శుక్రవారం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి రైతు చైతన్యయాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా బి.కొంగరవారిపల్లి, భీమవరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సర్పంచ్ లక్ష్మీ, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి, బాధితుడు దళిత నేత, ఎంపీటీసీ అభ్యర్థి రాజయ్యలతో పాటు అధికారులు పాల్గొన్నారు. స్థానిక ఉప సర్పంచ్ రాకేష్‌చౌదరి కార్యక్రమం వద్దకు వచ్చి, హాజరుకాకుండా వెనుదిరిగారు. కార్యక్రమం అంతా సజావుగా సాగి, అధికారులు తిరుగు ప్రయాణమయ్యే సమయంలో రాకేష్‌చౌదరి వేదిక వద్దకు వచ్చి.. మీరు అధికారులేనా.. ఎవరిని వేదికపైకి కూర్చోబెట్టాలో.. పెట్టకూడదో కూడా తెలియదా?.. ఒక దళితుడిని వేదికపై ఎలా కూర్చోబెడతారంటూ అధికారులపై జులుం ప్రదర్శించాడు. వారి పక్కన మాలాంటి వారు (అగ్రకులాల) కూర్చోవాలంటేనే అసహ్యంగా ఉందంటూ ఆయన ప్రవర్తించిన తీరు అక్కడి అధికారులతో పాటు స్థానిక ప్రజలను విస్మయానికి గురిచేసింది. మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకుంటే సహించేదిలేదని, రైతుభరోసా కేంద్రానికి తాళాలు వేస్తానంటూ అధికారులను హెచ్చరించారు. అనంతరం బాధితుడు రాజయ్య కలుగజేసుకుని దళితులను ఇలా అవమానించి మాట్లాడటం సరికాదని రాకేష్చౌదరికి హితవు పలికారు. అగ్రవర్ణాలతో పాటు దళితులు కూడా ఓటు వేస్తేనే మీరు ఉపసర్పంచ్ అయ్యారని, దళిత జాతిని కించపర్చి మాట్లాడటం సబబు కాదని తెలిపారు. దళితుడైన నేను వేదికపై కూర్చోకూడదని రాజ్యాంగంలో ఉందా అని ఆయన్ను ప్రశ్నించారు. దళితులంటే ముందు నుంచి చిన్నచూపు చూస్తున్నారంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. మరోసారి రాజయ్యపై ఉపసర్పంచ్ అసభ్యకరంగా మాట్లాడటంతో ఆయన తీవ్ర కలత చెందారు. అగ్రకులానికి చెందిన రాకేష్‌చౌదరి వ్యాఖ్యలతో దళిత నేతలు, కుల సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు దళితజాతిని కించపరిచేలా మాట్లాడిన రాకేష్చౌదరిపై రాజయ్యతో పాటు దళిత సంఘాల నాయకులు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. -
రఘురామకృష్ణరాజుపై గరగపర్రు గ్రామ దళితుల ఫిర్యాదు
సాక్షి, పశ్చిమగోదావరి: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై గరగపర్రు గ్రామ దళితుల ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజును ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రఘురామకృష్ణరాజు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. చదవండి: పెళ్లి పేరుతో యువతి మోసం.. రూ.ఆరు లక్షలతో పరార్ నేడు, రేపు భారీ వర్షాలు -
కోవిడ్ రూల్స్ బ్రేక్: కాళ్లు మొక్కిన దళితులు
చెన్నె: అణగారిన వర్గాలపై ఇంకా వివక్ష కొనసాగుతోంది. అణగారిన వర్గాలను మరింత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని దళితులతో కాళ్లు మొక్కించుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మే 12వ తేదీన తిరువన్నెనల్లూరు సమీపంలోని ఒట్టనందల్ గ్రామంలో దళిత కుటుంబాలు గ్రామ దేవత ఉత్సవాలు నిర్వహించారు. అయితే కరోనా నేపథ్యంలో అనుమతి లేకుండా ఉత్సవాలు జరిపారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. దీనిపై గ్రామ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్వాహకులపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం కోర్టుకు వెళ్లారు. వారిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసి పంపించేసింది. అయితే పంచాయతీ పెద్దలు మాత్రం తమ ముందుకు హాజరుకావాలని ఆదేశించారు. పంచాయతీ కోర్టు గ్రామ పెద్దలను కలిసి వారి కాళ్లపై పడాలని ఆదేశించింది. ఈ తీర్పుతో దళితులు తిరుమల్, సంతానం, అరుముగం పంచాయతీ సభ్యుల కాళ్లపై పడి క్షమాపణలు తెలిపారు. ఈ ఘటనపై దళిత, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
కులం పేరుతో అవమానం.. ఖండించిన కమల్ హాసన్
చెన్నై: కులం పేరుతో అవమానించిన వ్యవహారం విల్లుపురంలో సంచలనం కలిగించిన ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపారు. అనంతరం పోలీసులు 50 మందిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. తిరువెన్నైనల్లూరు సమీపంలోని ఒట్టందల్ గ్రామంలో రెండు కులాలకు చెందిన నివాసప్రాంతాలున్నాయి. శుక్రవారం ఒక కులం ప్రజలు ఉంటున్న ప్రాంత ఆలయంలో ఉత్సవాలు జరిగాయి. కరోనా లాక్‌డౌన్‌ను మీరి ఉత్సవాలకు ఏర్పాటు చేయడంతో మరో వర్గానికి చెందిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తిరువెన్నైనల్లూరు పోలీసులు ఆలయం వద్దకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తమకు సమాచారం తెలిపిన యువకుడి గురించి ఉత్సవ నిర్వాహకులకు తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి. దీనికి సంబంధించిన ఊరి పంచాయతీలో ఆలయ ఉత్సవ నిర్వాహకులు ముగ్గురిని మరో వర్గం కాళ్లకు మొక్కింపజేసి అవమానపరిచింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో సంచలనం ఏర్పడింది. దీనిగురించి విల్లుపురం జిల్లా కలెక్టర్ అన్నాదురై, ఎస్పీ రాధాకృష్ణన్ ఒట్టందల్ గ్రామానికి నేరుగా వెళ్లి విచారణ జరిపారు. ఇరువర్గాలపై తిరువెన్నైనల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మొదటగా ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఉత్సవాలు నిర్వహించిన 50 మందిపైనా కేసు నమోదైంది. ఈ సంఘటనను సినీనటుడు కమల్ హాసన్ తీవ్రంగా ఖండించారు. చదవండి: ఇండియన్–2 షూటింగ్ ఆలస్యానికి కారణం లైకా సంస్థే: శంకర్ -
ఓటేస్తే చంపేస్తాం..!
సాక్షి, తిరుపతి: ప్రజాస్వామ్య ప్రక్రియలో పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ఓటుహక్కును వినియోగించుకోనివ్వకుండా మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సొంత ఊరు ఊరందూరులో పెత్తందార్లు అడ్డుకున్నారు. ఎస్టీ, ఎస్టీలే లక్ష్యంగా బొజ్జల సుధీర్‌రెడ్డి అనుచరులు శనివారం పోలింగ్ కేంద్రం వద్ద రచ్చ చేశారు. ఓటేస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు తమ గ్రామాన్ని శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో విలీనం చేసినందుకు పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్టు హకుం జారీ చేశారు. గ్రామ కట్టుబాట్లను పాటించాలని హెచ్చరించి మధ్యాహ్నం వరకు ఎవరూ పోలింగ్‌లో పాల్గొనకుండా కాపు కాశారు. కాగా, ఈ విషయాన్ని కొందరు ఓటర్లు ‘సాక్షి’ దృష్టికి తేవడంతో ప్రతినిధి బృందం ఊరందూరు ఎస్సీ కాలనీకి చేరుకుని ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసుల సహకారంతో కాలనీకి చెందిన 12 మంది దళితులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండల పరిధిలో ఆరు గ్రామాలకు చెందిన ఎస్సీలను 35 ఏళ్లుగా ఓటుహక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్న ఘటన 2019 సార్వత్రిక ఎన్నికల్లో వెలుగు చూడటం తెలిసిందే. మాకు నచ్చిన పార్టీకి ఓటు వేశాం: ఊరందూరు దళితులు సాక్షి, పోలీసుల సహకారంతో మా ఓటు హక్కును వినియోగించుకున్నాం. మాకు నచ్చిన పార్టీకి చెందిన నాయకుడికి ఓటు వేసినందుకు ఆనందంగా ఉంది. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే దళితులకు గౌరవం
భవానీపురం (విజయవాడ పశ్చిమ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే దళితులకు గౌరవం లభిస్తుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటూ ఎస్సీలను అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. అమరావతిలో దళితుల భూములను కొట్టేసిన ఘనుడని అన్నారు. సంత్ గురు రవిదాస్ 644వ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిపోగు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సామాజిక సంస్కరణలను తీసుకువచ్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీ అన్నారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దళితులంతా సంఘటితంగా ఉండాలన్నారు. సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాంటివారు చాలా అరుదుగా ఉంటారన్నారు. అతి సామాన్యుడనైన నన్ను ఎంపీగా చేయడం, తిరుపతిలో డాక్టర్ గురుమూర్తిని ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలపటం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. సంత్ గురు రవిదాస్ తరువాత వచ్చిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జగజ్జీవన్‌రామ్, పూలే వంటి మహనీయులు అసమానతలను రూపుమాపేందుకు విశేష కృషి చేశారన్నారు. కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొమరవల్లి బాల కోటయ్య, కృష్ణా జిల్లా అధ్యక్షుడు అప్పికట్ల రాము, విజయవాడ పట్టణ అధ్యక్షుడు కె.ఏసుదాసు, యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 400 మంది డప్పు కళాకారులు, చర్మకారులు వైఎస్సార్సీపీలో చేరగా.. నేతలు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. -
బండి సంజయ్ మూల్యం చెల్లించక తప్పదు..
సాక్షి, హైదరాబాద్: దళితులనుద్దేశించి చెప్పులు కుట్టుకునే వారిగా, మొలలు కొట్టుకునేవారిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, ఇందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీఆర్ఎస్కు చెందిన దళిత ఎమ్మెల్యేలు హెచ్చరించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎంఎస్. ప్రభాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గాదరి కిశోర్, కాలె యాదయ్య, ఆరూరి రమేశ్, చిరుమర్తి లింగయ్య, సుంకే రవిశంకర్, దుర్గం చిన్నయ్య, చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్.. ఆదివారం ఘాటుగా బహిరంగ లేఖ రాశారు. ‘నడిమంత్రపు సిరివస్తే కన్నూమిన్నూ కానకుండా విర్రవీగినట్టు సంజయ్ ప్రవర్తన ఉంది. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ సాటి మనుషులను అవమానపరుస్తున్నాడు. తలాతోక లేకుండా మాట్లాడే వ్యక్తిగా ముద్ర పడ్డ బండి.. మరోసారి దళితుల పట్ల అమానుష వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు దళితుల పట్ల బీజేపీ వైఖరికి అద్దం పడుతున్నాయి. బూజుపట్టిన సనాతన ఆలోచనలకూ, అంటరానితనానికి, దళితుల అణచివేతకు అద్దంపట్టేలా ఆయన వ్యాఖ్యలున్నాయి. ఆధునిక యుగంలో కూడా దళితుల స్థితిగతులు అలాగే ఉండాలని, దళితులు ఇంకా చెప్పులు కుట్టుకుని బతకాలని కోరుకునే విధంగా మాట్లాడటం దుర్మార్గం’ అని ఆ లేఖలో తీవ్రంగా ఆక్షేపించారు. అందరితో సమానంగా పోటీ... డాక్టర్ అంబేడ్కర్ కల్పించిన అవకాశాలతో అన్ని రంగాల్లో అందరితో పోటీపడి తాము ఉన్నతస్థానాలకు ఎదుగుతుండటం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి మింగుడు పడటం లేదని విమర్శించారు. దళితులు అందరితో సమానంగా పోటీపడుతున్నారని సంజయ్ గుర్తిస్తే మంచిదని, లేదంటే ప్రజలే బీజేపీకి మొలలు కొడతారని హెచ్చరించారు. -
రాష్ట్ర సమానాభివృద్ధి కోసమే మా పోరాటం
తాడికొండ: మూడు రాజధానుల ఏర్పాటుతో ఏపీకి కలిగే ప్రయోజనాలు, సమానాభివృద్ధి కోసమే తమ పోరాటమని బహుజన పరిరక్షణ సమితి నేతలు స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం, తామూ అడ్డు కాదనే నిజం చంద్రబాబుకు తెలిసినా రైతులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. 3 రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో కొనసాగుతున్న 56వ రోజు దీక్షలకు మంగళవారం సమితి నేతలు, మహిళలు భారీగా హాజరయ్యారు. నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు కోర్టుల ద్వారా 3 రాజధానులను అడ్డుకోవడం దారుణమన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ముందుకెళుతుంటే బాబుకు భవిష్యత్తులో పుట్టగతులు ఉండవనే భయం పట్టుకుందన్నారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో 32 వేల ఎకరాల భూములిచ్చిన రైతుల మేలు ఈ జన్మలో మర్చిపోను అని చెప్పి పూలింగ్ ముగిశాక రైతులకు చిప్ప చేతికిచ్చారని దుయ్యబట్టారు. ఇకనైనా తప్పులు ఒప్పుకొని 3 రాజధానుల నిర్ణయానికి కట్టుబడాలని, లేకుంటే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. -
దళితులపై వివక్ష చూపినందుకే టీడీపీకి చావుదెబ్బ
తాడికొండ: రాజధాని ప్రాంతంలో దళితులు, పేద వర్గాలపై వివక్ష చూపిన కారణంగానే ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని చావుదెబ్బ కొట్టారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు స్పష్టం చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం 52వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే అమరావతి ఉద్యమాన్ని భూతద్దంలో చూపిస్తున్నారన్నారు. కోర్టుల్లో వేసిన తప్పుడు కేసులు ఉపసంహరించుకుని.. ఇకనైనా బుద్ధి మార్చుకుని మూడు రాజధానులకు మద్దతు ఇవ్వకపోతే దళితులు, బహుజనులు సంఘటితమై చంద్రబాబును రాష్ట్రంలో తిరగనివ్వకుండా చేస్తామని హెచ్చరించారు. వివిధ సంఘాల నాయకులు చెట్టే రాజు, పరిశపోగు శ్రీనివాసరావు, జేటీ రామారావు, నూతక్కి జోషి, కొలకలూరి లోకేష్, పులి దాసు, నత్తా యోనరాజు, బేతపూడి సాంబయ్య, ఆదాం పాల్గొన్నారు. -
అమరావతిలో అణగారిన వర్గాలకు చోటులేదా?
తాడికొండ: అమరావతి ఆంధ్రుల సొత్తయితే, ఈ ప్రాంతంలో దళితులు, ముస్లిం, మైనార్టీలకు చోటు కల్పించకుండా చంద్రబాబు ఎందుకు అడ్డుపడుతున్నారో సమాధానం చెప్పాలని అమరావతి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మల్లవరపు నాగయ్య ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 49వ రోజు రిలే నిరాహార దీక్షల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బినామీలతో భూములు స్వాహాచేసి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబు.. ఇళ్ల స్థలాల కోసం దీక్షలకు వస్తున్న దళిత మహిళలపై దాడులు చేసి బెదిరించి ట్రాక్టర్లతో తొక్కిస్తామనడంపై మండిపడ్డారు. అణగదొక్కాలని చూస్తే ఉవ్వెత్తున లేచి చంద్రబాబు అండ్ కోను ముంచెత్తుతామని హెచ్చరించారు. పాల్గొన్న మహిళలు, దళిత సంఘాలు దళిత నేతలు పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనరాజు మాట్లాడుతూ మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి సాధ్యమన్నారు. చంద్రబాబు తన కుల రాజధాని నిర్మాణానికి కృత్రిమ ఉద్యమంతో మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థకు చంద్రబాబు వత్తాసు పలుకుతూ..ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులకెక్కి వ్యవస్థను ప్రలోభాలకు గురిచేస్తున్నాడని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్‌కు ప్రజాబలం, దళిత, మైనారీ్ట, బీసీ వర్గాల అండ ఉందని స్పష్టం చేశారు. కాగా బుధవారంతో రిలే నిరాహార దీక్షలు 50వ రోజుకు చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి దళిత, బహుజన సంఘాలు భారీగా పాల్గొని మద్దతు తెలుపనున్నాయి. బేతపూడి సాంబయ్య, ఆదాం పాల్గొన్నారు. -
దళితుల్ని కించపర్చే వ్యాఖ్యలు చేస్తే సహించం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దళితులంతా ఒకటై నడుస్తున్నారని.. ఎవరైనా దళితుల్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఎంపీ నందిగం సురేష్ హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పాలనలో దళితులకు మేలు కలుగుతోందన్న అక్కసుతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చంద్రబాబు కుటిల యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక దళిత మేధావి పది మందిని పోగేసి దళితులపై దాడులు జరిగిపోతున్నాయంటూ.. చంద్రబాబు తరహాలో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వాస్తవానికి ఆ మాటల్ని మాట్లాడాల్సింది చంద్రబాబు దుర్మార్గపు పాలనలోనే అని.. ఆ మేధావికి ఇప్పుడే గొంతు వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కులాల కుంపట్లు పెట్టడంలో ఆరితేరిన చంద్రబాబు దళితుల కళ్లను దళితులతోనే పొడిపించాలని చూస్తున్నారన్నారు. దళితులు వాస్తవాల్ని గ్రహించి.. దళిత పక్షపాతి ఎవరు, దళిత ద్రోహి ఎవరో తెలుసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. కొందరు దళిత నాయకులు చంద్రబాబు తొత్తులుగా మారి మేధావులమంటూ మాట్లాడుతున్న విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమైందన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న దళిత మేధావులు చంద్రబాబు అరాచక పాలనలో ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్లో ఆత్మ వంచన చేసుకుని మాట్లాడొద్దని.. ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడాలని హితవు పలికారు. దళితుల ప్రయోజనాల కోసం ఆందోళనలు చేస్తే దళితులుగా తాము కూడా మద్దతు ఇస్తామన్నారు. కానీ.. చంద్రబాబు ప్రయోజనాల కోసం చేస్తే మాత్రం చులకన అవుతారని పేర్కొన్నారు. -
పేదల గూడుకు అడ్డంకులు..ఇదేమని ప్రశ్నిస్తే దాడులు
సాక్షి, అమరావతి బ్యూరో/తాడికొండ: ఒక ప్రాంతం, ఒక వర్గం వారికే మేలు జరిగేలా.. దళిత, పేద వర్గాలను అన్యాయానికి గురిచేసేలా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ రాజధాని ప్రాంత దళితులు, పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకైక రాజధానితో లబ్ధి పొందాలని చూస్తూ ఇతర ప్రాంతాలకు ద్రోహం చేయాలనుకోవడం తగదని మండిపడుతున్నారు. తమకు ఇళ్ల స్థలాలు చేతికొచ్చే సమయంలో అడ్డుకోవడంపైనా ఆగ్రహోదగ్రులవుతున్నారు. అందుకే వారు టీడీపీ నేతల వైఖరిపై కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. పేదల భూములను కొట్టేసిన ‘పచ్చ’ రాబందులు తరతరాలుగా వస్తున్న అసైన్డ్, లంక భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇంతలో రాజధాని అమరావతి రూపంలో వచ్చిన ‘పచ్చ’ రాబందులు ఆ భూములపై కన్నేశారు. రాజధానికి ప్రభుత్వం ఆ భూములను ఉచితంగా తీసేసుకుంటుందని, తమకు విక్రయిస్తే ఎకరాకు రూ.లక్షల్లో ఇస్తామని ప్రలోభపెట్టారు.. బెదిరించారు. ఇలా గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లోని దళితులు, పేదల భూములను టీడీపీ నేతలు కారుచౌకగా కొట్టేశారు. వాటిని టీడీపీ ప్రభుత్వానికి పూలింగ్‌కు ఇచ్చేసి ఎకరానికి రూ.కోట్ల చొప్పున దండుకున్నారు. దళితుల ఆగ్రహానికి కారణాలివీ.. కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 30 లక్షల ఇళ్ల స్థలాలు, రాజధాని అమరావతి ప్రాంతంలో 60 వేల మందికి ఇవ్వనున్న తరుణంలో టీడీపీ నేతలు కోర్టుల ద్వారా అడ్డుకున్నారు. అంతేకాకుండా ప్రైవేటు విద్యాసంస్థల్లో పిల్లలను చదివించుకోలేని తమలాంటి వారి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే దానిపైనా కోర్టుకెక్కడంపై ఆవేదన చెందుతున్నారు. ఇలా తమ భూములను అతి తక్కువ ధరకే లాక్కోవడంతోపాటు తమ అభ్యున్నతికి అడ్డుపడుతున్న టీడీపీ నేతల తీరుకు నిరసనగా దళిత సంఘాలు.. బహుజన పరిరక్షణ సమితి పేరిట మూడు రాజధానులకు మద్దతుగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో 24 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. దళిత సంఘాలు ఏమంటున్నాయంటే.. ► పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాలకు అడ్డుపడుతూ, ఇంగ్లిష్ మాధ్యమానికి అడ్డుపడుతూ టీడీపీ కోర్టుల్లో వేసిన కేసులను ఉపసంహరించుకోవాలి. ► పేదలు, దళితులకు రాజధానిలో ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపుపై వామపక్షాలు, జనసేన పార్టీలు ద్వంద్వ వైఖరిని వీడాలి. ► పరిపాలన వికేంద్రీకరణతోనే అన్ని వర్గాల అభివృద్ధి. ఒక సామాజికవర్గం కోసం అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ చంద్రబాబు చేస్తున్నది కృత్రిమ ఉద్యమం. కోర్టులకెక్కడం దుర్మార్గం రాజధానిలో మాలాంటి పేదలకు ఇవ్వడానికి వీల్లేదంటూ టీడీపీ వాళ్లు కోర్టులకెళ్లడం దుర్మార్గం. మాలాంటి వారికి సెంటు భూమి కూడా ఇవ్వడానికి వీల్లేదన్నారంటే కులవివక్ష కొనసాగుతున్నట్టే. పెద్దలు తప్ప పేదలు గూడు కట్టుకుని బతకడానికి వీల్లేదా? –రెడ్డిబోయిన మరియకుమారి, దళిత మహిళ దళితులను అణగదొక్కుతున్నారు చంద్రబాబు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని దళితులను అణగదొక్కుతున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా, ఇంగ్లిష్ మీడియం చదువులు అందకుండా కోర్టుల ద్వారా అడ్డుపడడం దుర్మార్గం. – కోడి సుజ్ఞాన్, దళిత వర్గాల ఫెడరేషన్, పశ్చిమ గోదావరి జిల్లా -
దళితుల శాశ్వత శత్రువు బాబు
సాక్షి నెట్వర్క్: చంద్రబాబు హయాంలో దళితులపై జరిగిన దాడులు, అకృత్యాలకు నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను తగులబెట్టారు. రాజధాని అమరావతిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుపడ్డ దళిత ద్రోహి బాబేనని ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బతిన్నా ఆయన బుద్ధి మారలేదని దుయ్యబట్టారు. దళితులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు వారే తగిన శాస్తి చేస్తారని హెచ్చరించారు. ► అధికారంలో ఉన్నంతకాలం దళితులను పట్టించుకోని బాబు నేడు మొసలికన్నీరు కారుస్తున్నారని నెల్లూరులో ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, వరప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ► చంద్రబాబు దళితులను పావుగా వాడుకున్నారని కర్నూలులో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ నిప్పులు చెరిగారు. ► విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు నేతృత్వంలో నిరసన వ్యక్తం చేశారు. ► కృష్ణా జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే రక్షణనిధి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంత్రి తానేటి వనిత, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు నిరసనల్లో పాల్గొన్నారు. ► అనంతపురంలో ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, శ్రీకాకుళంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, చిత్తూరు జిల్లా పూతలపట్టు, సత్యవేడుల్లో ఎమ్మెల్యేలు ఎం.ఎస్.బాబు, ఆదిమూలం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ► గుంటూరులో జరిగిన నిరసనలో ఎమ్మెల్యేలు ముస్తఫా, కిలారి రోశయ్య, మద్దాళి గిరి తదితరులు పాల్గొన్నారు. ► కాకినాడలో జరిగిన నిరసనలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీ రవీంద్రబాబు పాల్గొన్నారు. పి.గన్నవరంలో ఎమ్మెల్యే చిట్టిబాబు, రాజోలులో ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ నిరసన తెలిపారు. ► విశాఖలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, శెట్టి ఫాల్గుణ తదితరులు నిరసనల్లో పాల్గొన్నారు. గుంటూరులో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎంపీ సురేష్, ఎమ్మెల్యేలు శ్రీదేవి, గిరి, ముస్తఫా, రోశయ్య తదితరులు ఇలా అన్నారు.. చంద్రబాబును అరెస్టు చేయాలి ► రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న చంద్రబాబుపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ► చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా దళితుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. అందుకే గత ఎన్నికల్లో దళితులంతా టీడీపీ ప్రభుత్వాన్ని ఓడించారు. – ఏలూరులో మంత్రి తానేటి వనిత పేదలను అణగదొక్కేందుకే చంద్రబాబు పుట్టారు ► ఐదేళ్ల పాలనలో దళితుల సంక్షేమం పట్టని చంద్రబాబు.. ఇప్పుడు వారిపై చూపిస్తున్న కపట ప్రేమ వెనుక ఆంతర్యం ఏమిటో అందరికీ తెలుసు. ► దళితులకు రాజకీయాలు ఎందుకని వ్యాఖ్యానించిన టీడీపీ నేతలు వారిపై సవతి తల్లి ప్రేమ చూపడం హాస్యాస్పదం. – గుంటూరులో ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే శ్రీదేవి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ► ‘దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా’ అంటూ వ్యాఖ్యానించిన రోజు నుంచే దళితులు చంద్రబాబును తమ శాశ్వత శత్రువుగా చూస్తున్నారు. దళితులపై ఎవరు దాడులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ► దళితులపై ఎక్కడ దాడి జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటోంది. విశాఖ జిల్లా పెందుర్తిలో శిరోముండనం ఘటనలో ఏడుగురి అరెస్టే ఇందుకు నిదర్శనం. – విజయవాడలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున -
వంద గొడ్లను తిన్న రాబందు కాశీయాత్ర చేసినట్లుంది
సాక్షి, అమరావతి: దళితులపై జరుగుతున్న దాడుల గురించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు, చెబుతున్న నీతులు వంద గొడ్లను తిన్న రాబందు కాశీయాత్ర చేసినట్లు ఉందని ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో దళితులను అనేక రకాలుగా వేధించినప్పుడు కనీస చర్యలకు ఆదేశించని బాబు.. నేడు దళితుల పట్ల ఆవేదన చెందటం హాస్యాస్పదమేనన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► సొంత జిల్లా ముంగిలిపట్టులో ఓ దళిత వృద్ధ మహిళను చెప్పులతో కొట్టారు. ► శాంతిపురం (కుప్పం)లో మహిళను వివస్త్రను చేశారు. ► తొట్టంబేడులో ఓ మహిళను కొట్టి చంపారు. ► రాజుల కండ్రిగ, కృష్ణమనాయుడు కండ్రిగ, పశ్చికాపల్లిలో దళితులను వెలిపెట్టారు. ► రామాపురం (నెల్లూరు)లో 40 మంది దళితులను తప్పుడు కేసులతో జైలుకు పంపారు. ► టీడీపీ జెండా కాల్చారని చుండూరు దళిత యువకులను పోలీస్ స్టేషన్లో చావ బాదారు. ► దళితులైన నాయుడుపేట మునిసిపల్ చైర్పర్సన్ శోభారాణి, కడప జడ్పీ చైర్మన్ గూడూరు రవిలకు సమావేశాల్లో కుర్చీలు ఇవ్వకుండా నిలబెట్టారు. ► 6 వేల ప్రభుత్వ పాఠశాలలు, వందలాది ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు మూసేశావు. -
‘దళితులపై చంద్రబాబు మొసలి కన్నీరు’
సాక్షి, విజయవాడ: ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు లేదని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి నిప్పులు చెరిగారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా అంటూ అవమానించిన చంద్రబాబు వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఎస్టీలకు తెలివి ఉండదని చంద్రబాబు హేళన చేశారని.. ఆయనను చూసి ఎస్సీ, ఎస్టీలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. ‘‘రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీలకు ఎవరూ ఇవ్వనన్నీ పథకాలు అమలు చేస్తున్నాం. కోటి 13 లక్షల మందికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్‌దే ఎస్సీ, ఎస్టీలకు ఏడాదిలోనే 13వేల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో అందించాం. దళితులు, గిరిజనులపై దాడులు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటున్నామని’’ మంత్రి వెల్లడించారు. (చదవండి: చంద్రబాబు దళిత ద్రోహి: దళిత నేతలు) పశ్చిమగోదావరి: చంద్రబాబు దళిత ద్రోహి అని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. ఏనాడూ దళితులను ఆయన పట్టించుకోలేదన్నారు. దళితులపై చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ కేబినెట్లో ఐదుగురు దళితులకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. చంద్రబాబుకు దళితులు గుణపాఠం చెబుతారని తానేటి వనిత అన్నారు.(చదవండి: ‘చంద్రబాబుకు ప్రేమలేదు.. అంతా డ్రామా’) -
‘చంద్రబాబుకు ప్రేమలేదు.. అంతా డ్రామా’
సాక్షి, విశాఖపట్నం: దళితులపై చంద్రబాబుకు ప్రేమ లేదని.. ప్రేమ ఉన్నట్లు డ్రామా ఆడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళిత యువకుడిపై దాడి ఘటనలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారని, 12 గంటల్లోనే దోషులను పట్టుకున్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు జరిగితే ఎలాంటి చర్యల్లేవని.. దళితులపై టీడీపీ నేతలు దాడులు చేస్తే ఆయన ఎందుకు మాట్లాడలేదని ధర్మశ్రీ ప్రశ్నించారు. (చదవండి: బాబూ.. విశాఖపై ఎందుకు విషం?) ‘దళితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేస్తున్నారు. ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. కులాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని’’ ఆయన మండిపడ్డారు. తప్పు చేస్తే ఎంతటివారినైనా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తోందన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పనుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించామని పేర్కొన్నారు. సీఎం జగన్ ఎప్పుడూ దళితుల పక్షానే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర లో చంద్రబాబు కులరాజకీయాలు చేస్తే సహించేది లేదని, బాధ్యతయుతమైన ప్రతిపక్ష నేత గా వ్యవహరించాలని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హితవు పలికారు.(చదవండి: చంద్రబాబు దళిత ద్రోహి: దళిత నేతలు) -
చంద్రబాబు దళిత ద్రోహి: దళిత నేతలు
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు దళిత ద్రోహి అని వైఎస్సార్సీపీ దళిత నేతలు మండిపడ్డారు. దళితులకు చంద్రబాబు చేసిన మోసంపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వైస్సార్సీపీ నేతలు పాలాభిషేకాలు చేసి వినతి పత్రాలు సమర్పించారు. 14 ఏళ్ళు అధికారంలో ఉండగా ఏనాడు దళితులను చంద్రబాబు పట్టించుకోలేదని దళిత నేతలు ధ్వజమెత్తారు. దళితులకు దక్కాల్సిన సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. (చదవండి: జగన్‌ను దళితులకు దూరం చేయాలని కుట్ర) ‘‘అధికారం పోయాక దళితులపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారు. అమరావతిలో దళితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను చంద్రబాబు అడ్డుకున్నారు. దళితులు ఇంగ్లీషు మీడియం చదవకుండా అడ్డుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో దళితులపై దాడులు జరిగితే చంద్రబాబు నోరు మెదపలేదని’ దుయ్యబట్టారు. (చదవండి: చంద్రబాబును దళిత జాతి ఎప్పటికీ క్షమించదు) దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ చంద్రబాబు అవమానించారని దళిత నేతలు గుర్తు చేశారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు పాలాభిషేకం చేసి, వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఆ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ అధికార ప్రతినిధి పద్మజ, నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాలే పుల్లారావు, గౌతం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లా: ఎస్సీలకు చంద్రబాబు చేసిన మోసంపై పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. నాలుగు రోడ్లకూడలిలో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖపట్నం: దళితులపై చంద్రబాబు కపట ప్రేమకు నిరసనగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, చెట్టి ఫాల్గుణ, నార్త్ కన్వీనర్ కేకే రాజు, విశాఖ నగర ఎస్సీ విభాగం అధ్యక్షులు బోని శివరామకృష్ణ కార్యదర్శి రొయ్య వెంకటరమణ పాల్గొన్నారు. దళితులకు పూర్తి రక్షణ.. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో దళితులకు పూర్తి రక్షణ ఉందన్నారు. దేశ చరిత్రలోనే ఎస్సీ ఎస్టీ బీసీలకు తన పాలనలో సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. శిరో ముండనం కేసులో ఎంతటివారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ రాజకీయం చేస్తోందని.. దళితులు నమ్మే స్థితిలో లేరని మంత్రి పేర్కొన్నారు. కులాల మధ్య చిచ్చు.. కులాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మండిపడ్డారు. జనం ఛీ కొట్టినా చంద్రబాబు నాయుడు కపట నాటకాలు ఆపడం లేదని దుయ్యబట్టారు. దళితులపై దాడి జరిగితే జూమ్ లో పరామర్శిస్తారా? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇది పేదలు, బలహీనవర్గాల ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళితులు, అగ్రవర్ణాలు అన్న తేడా లేదని.. ఇది పేదలు, బలహీనవర్గాల ప్రభుత్వం అని నార్త్ కన్వీనర్ కేకే రాజు అన్నారు. అన్ని వర్గాలు కలిసి ఐక్యంగా ఉండటాన్ని చూడలేక చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుల రాజకీయాలకు నిరసనగా.. చంద్రబాబు కుల రాజకీయాలకు నిరసనగా గాజువాకలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాలాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, యువజన నాయకుడు రేవంత్ రెడ్డి, దళిత సంఘాల ప్రతినిధి పరదేశి, కోళ్లు దేవుడు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేక రాజకీయాలపై అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. చంద్రబాబు, ఇతర ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు ఆపాలంటూ అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ విభాగం నేతలు నిరసనకు దిగారు. చంద్రబాబు, టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని.. అందుకే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారని.. టీడీపీ నేతలు దాడులు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. -
దళితులకు అండగా ఉంటాం: భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ దళిత, గిరిజన బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలపై దాడులు పెరుగుతున్నాయని, హత్యలు నిత్యకృత్యం అయ్యాయని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజు తెలంగాణలో ఇద్దరు దళితులు ప్రభుత్వ పాశవిక విధానాలకు బలయ్యారని, ఇంత ఘోరాలు జరుగుతున్నా.. ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లోని వర్గల్ మండలం వేలూరులో తన భూమి ప్రభుత్వం గుంజుకుందన్న ఆవేదనతో ఓ దళిత యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ప్రభుత్వం చేసిన హత్యనేనని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజపూర్ మండలం తిరుమలపూర్ గ్రామంలో ఓ దళిత యువ రైతును ఇసుక మాఫియా లారీతో తొక్కి హత్య చేసిందని, ఈ విషయంలో దోషులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాల వారికి న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తామని, ఒకట్రెండు రోజుల్లో గవర్నర్ ను కలసి వినతిపత్రం ఇస్తామని, తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలసి ఫిర్యాదులు చేస్తామని తెలిపారు. దళితులకు న్యాయం జరిగే వరకు రాష్ట్రంలో అందరినీ కలుపుకుని కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఆ ప్రకటనలో భట్టి స్పష్టం చేశారు. -
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో బాబూ
సాక్షి, అమరావతి: దళితులకు మేలు చేయడమెలాగో అప్పట్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు నేర్చుకోవాల్సిందని.. కానీ అది జరగలేదని, కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సీఎం వైఎస్ జగన్‌ని చూసైనా నేర్చుకోవాలని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ హితవు పలికారు. తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం కేసులో ఘటన జరిగిన 24 గంటల్లోనే దానికి బాధ్యులైన ఎస్ఐ, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామన్నారు. అంతేకాకుండా అరెస్టు చేసి జైలుకు కూడా పంపామన్నారు. దేశంలో, చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు జరిగితే ఇంత వేగంగా స్పందించిన దాఖలాలే లేవన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులు ఎప్పటికీ పాకల్లో మగ్గాలన్నదే ఆయన ఉద్దేశమని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తుంటే వారు ఎక్కడ బాగుపడిపోతారో అని అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లిష్ మీడియంను కూడా అందుకే అడ్డుకున్నారని మండిపడ్డారు. ఆయన చేసే నీచ రాజకీయాలు ప్రపంచంలో మరెవరూ చేయరన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అమ్మాజీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంకా ఆమె ఏమన్నారంటే.. ► కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి సంక్షేమ పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేయాలన్నదే చంద్రబాబు ముఖ్య ఉద్దేశం. దళితులకు, దళితులకు, దళితులకు, ఓసీలకు మధ్య చిచ్చు పెడితే ఆయన చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోతారు. ► దళితులకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 30 లక్షల ఇళ్ల పట్టాలను ప్రభుత్వం అందిస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపింది.. చంద్రబాబే. ► చంద్రబాబు దళిత ద్రోహి అనేది దేశం మొత్తానికి తెలుసు. ఆయన ఒక ఫెయిల్యూర్ సీఎం. ఆయన 14 ఏళ్ల పరిపాలన గమనిస్తే ఇది అర్థమవుతుంది. ► దళిత ద్రోహి ఎవరు అని గూగుల్‌ని అడిగినా బాబు పేరే వస్తుంది. ఆయన మానసిక ఆరోగ్యంపై ప్రజలకు సందేహాలు ఉన్నాయి. టెస్టు చేయించుకున్నాకే ఆయన మీడియాతో మాట్లాడాలి. ► తన 40 ఏళ్ల ఇండస్ట్రీలో దాచుకోవడం.. దోచుకోవడం తప్పితే బాబు దళితులకు చేసింది ఏమీ లేదు. ► దళిత సంక్షేమం విషయంలో ఏ ఒక్క అంశంలోనైనా సీఎం వైఎస్ జగన్‌కు చంద్రబాబు సరితూగగలడా? ► బాబు వస్తే.. జాబు వస్తుందని ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు కనిపించకుండా చేసిన ఘనుడు.. బాబు. ► సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంటే బాబుకు ఎందుకు కడుపు మంట? సీఎం ఏడాదిలోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాల పేద విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఉచితంగా చదువులు చెప్పిస్తుంటే బాబుకు ఎందుకు ఏడుపు? ► సీఎం వైఎస్ జగన్ పరిపాలనను దేశవిదేశాల్లోని ప్రజలు, మేధావులు మెచ్చుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ► హత్యా రాజకీయాలు చేయడం బాబుకు అలవాటు. పిల్లనిచ్చిన మామను అధికారం నుంచి దింపి ఆయన చావుకు కారణమయ్యారు. -
చంద్రబాబువి క్షుద్ర రాజకీయాలు
సాక్షి, అమరావతి: ఎస్సీలను, దళిత సంఘాలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం రూ.15,735 కోట్లు ఖర్చు చేసిందన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనను చూసి ఓర్వలేని చంద్రబాబు ఏం చేయాలో అర్థం కాక కుల రాజకీయాలకు తెర తీశారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ► విశాఖపట్నంతో మొదలైన చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో సాగుతున్నాయి. ► మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో ఎస్సీలకు సొంత డబ్బుతో పింఛన్లు ఇవ్వడంతోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటి వ్యక్తిపై దళిత వ్యతిరేకి అని విమర్శలు చేయడం దారుణం. ► ఎస్సీల మధ్య చిచ్చు పెట్టిందే చంద్రబాబు. ఇప్పటికీ ఆయన సొంత ఊరు నారావారిపల్లెలో ఎస్సీలను దేవాలయాల్లోకి రానివ్వని పరిస్థితి ఉంది. -
కాలినడకన పది లక్షల మంది కూలీలు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని వివిధ ప్రాంతాల్లో లాక్డౌన్ కారణంగా ఇరుక్కుపోయిన వలస కార్మికులను తమ స్వగ్రామాలకు తరలించేందుకు ప్రత్యేక శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ వేలాది మంది వలస కార్మికులు తమ ప్రాణాలకు తెగించి గమ్యస్థానాలకు వందల కిలోమీటర్లు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నారు. అలా ఎంత మంది వెనక్కి బయల్దేరారు? ఎందుకు? దేశ చారిత్రక గమనంలో అసలు వలసలు ఎందుకు చోటు చేసుకున్నాయి? భారత దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి అంతా వలసలపైనే ఆధారపడి ఉందని నిపుణలు చెప్పారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక దేశంలో అంతర్గత పారిశ్రామిక వలసలు ప్రారంభమయ్యాయి. 1960లో గ్రీన్ రెవెల్యూషన్, 1991లో స్వేచ్ఛా వాణిజ్యం కోసం తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, అందులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్థిక జోన్లతో వలసలు ఎక్కువగా పెరిగాయి. ఎక్కువ సంపాదన కోసం వలసలు జరగలేదు. ఉన్న ప్రాంతంలో ఉపాధి అస్సలు లేకపోవడం వల్లనే నూటికి 90 శాతం వలసలు జరిగాయి. దేశంలో ఎక్కువగా తూర్పు ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాంతాలకు వలసలు కొనసాగాయి. పారిశ్రామికాభివృద్ధికి ముందు వ్యవసాయాధార వలసలు కొనసాగాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ ఉత్తర ప్రాంతాల నుంచి పచ్చిమ ప్రాంతాలకు తొలుత వ్యవసాయాధార కార్మిక వలసలే కొనసాగాయి. ఆ తర్వాత పారిశ్రామీకరణతో ఆ వలసలు మొదలయ్యాయి. ఒడిశా నుంచి ప్లంబర్లు ఢిల్లీకి వలస పోవడం, తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా నుంచి ముంబైకి భవన నిర్మాణ కార్మికులు పట్టణీకరణ, పారిశ్రామీకరణలో భాగంగా వలసలు వెళ్లారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి వెశ్లిన వారిని పాలమూరు కార్మికులని వ్యవహరిస్తారు. 1980లో మహారాష్ట్రలో చెక్కర పరిశ్రమ బాగా విస్తరించి బ్రెజిల్ లాంటి విదేశాలను చక్కెరను ఎగుమతి చేయడం ప్రారంభించినప్పుడు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కార్మికుల వలసలు పెరిగాయి ఆ తర్వాత 2001లో పూర్తయిన ‘ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్ కారిడార్’ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. (లాక్‌డౌన్‌తో సాధించిన ఫలితాలేమిటి?) దేశంలో అభివృద్ధి చెందని ప్రాంతాల నుంచి అభివృద్ధి చెందిన ప్రాంతాలకే వలసలు జరిగాయని, దేశంలో అన్ని ప్రాంతాల్లో కాకుండా కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం, కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందక పోవడమే వలసలకు ప్రధాన కారణమని అధ్యయన నిపుణలు తేల్చారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోని అన్నిరకాల పరిశ్రమలు ‘చీప్ లేబర్’ కోసమే వలసలను ప్రోత్సహించాయి. ఒక్క కార్మిక రంగాన్నే తీసుకుంటే దేశంలో ఐదారు కోట్ల మంది వలసకార్మికులు ఉన్నారు. వారిలో తట్టాబుట్ట సర్దుకొని కాలి నడకన ఊళ్లకు బయల్దేరిన కార్మికులంతా దినసరి వేతనం మీద బతికే కూలీలేనని నిపుణులు చెబుతున్నారు. రైలు చార్జీలు భరించే స్థోమత లేకనే వారు కాళ్లను నమ్ముకున్నారు. అలాంటి దాదాపు పది లక్షల మంది కార్మికులు తినడానికి తిండి, ఉండడానికి గూడు కరువై సొంతూళ్లకు బయల్దేరారు. వారిలో ఎక్కువ మంది దళిత వర్గాల వారే ఉన్నట్లు పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. (కార్మికులు లేక ‘పరిశ్రమల లాక్డౌన్’) -
దళిత నేతకు గెలవని సీటు
సాక్షి, అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి గెలిచే అవకాశం ఏమాత్రం లేకపోయినా దళిత నేత వర్ల రామయ్యను టీడీపీ తరఫున పోటీకి దింపుతుండటం చర్చనీయాంశమైంది. ఈసారి రాష్ట్రానికి వచ్చే నాలుగు రాజ్యసభ స్థానాల్లో సంఖ్యాబలం అధికంగా ఉన్న వైఎస్సార్ సీపీ గెలవడం లాంఛనమేనని తెలిసినా చంద్రబాబు దళిత నేతను పోటీకి దింపడం ఆ వర్గాన్ని మోసం చేయడానికేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరేళ్లలో మూడుసార్లు టీడీపీ నాయకుల్ని రాజ్యసభకు పంపే అవకాశం వచ్చినప్పుడు తన కోటరీలోని ముఖ్యులు, సొంత సామాజిక వర్గం వారికి ప్రాధాన్యం ఇచ్చిన వైనాన్ని దళిత నాయకులు గుర్తు చేస్తున్నారు. ఆరేళ్లలో ఒక్క దళిత, బీసీ నేతనైనా రాజ్యసభకు పంపకపోగా.. మాట ఇచ్చి వారిని మోసం చేసిన ఉదంతాలున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 2002 నుంచీ మాటిచ్చి మోసగించడమే - 2014లో టీడీపీ నుంచి ఇద్దరిని రాజ్యసభకు పంపే అవకాశం రాగా.. తన కోటరీలో సొంత సామాజిక వర్గానికి చెందిన గరికపాటి మోహనరావుకు ఒక సీటు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట సీతారామలక్ష్మికి మరో సీటు ఇచ్చారు. - ఆ సమయంలో తెలంగాణకు చెందిన మోత్కుపల్లి నరసింహులు రాజ్యసభ సీటివ్వాలని అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. - 2016లో టీడీపీ తరఫున ముగ్గురిని రాజ్యసభకు పంపాల్సి ఉండగా ఎన్డీఏ కోటాలో సురేష్ ప్రభుకి అవకాశం ఇచ్చి, టీడీపీ నుంచి టీజీ వెంకటేష్‌కు రెండో సీటు ఇచ్చారు. - మూడో సీటును అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తన కోటరీ వ్యక్తి, సన్నిహితుడు సుజనా చౌదరికి కేటాయించారు. - అదే సమయంలో టీడీపీకి చెందిన దళిత నేత జేఆర్ పుష్పరాజ్‌కు సీటిస్తానని తన ఇంటికి పిలిపించుకుని గంటల తరబడి కూర్చోబెట్టి ఆ తర్వాత లేదని చెప్పి అవమానించి పంపారు. - 2018లో టీడీపీకి రెండు రాజ్యసభ స్థానాలు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు సీఎం రమేష్‌కు రెండోసారి ఇచ్చారు. మరో సీటును వర్ల రామయ్యకు ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకుమార్‌కు ఇచ్చారు. - 2002 నుంచి ఇప్పటివరకూ పలుమార్లు రాజ్యసభకు టీడీపీ నాయకుల్ని పంపే అవకాశం వచ్చినా ఎప్పుడూ దళితులను చంద్రబాబు పట్టించుకోలేదు. - గతంలో రాజ్యసభ సీటివ్వాలని కోరిన పరసా రత్నం, సత్యవేడుకు చెందిన హేమలత, బల్లి దుర్గాప్రసాద్ (అప్పట్లో టీడీపీ నేత) వంటి వారికి మొండిచేయి చూపారు. - ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నప్పుడు గవర్నర్‌గా పంపిస్తానని నమ్మించి మోసం చేశారని మోత్కుపల్లి నరసింహులు పలు సందర్భాల్లో వాపోయారు. -
దళితులను మరోసారి అవమానించిన చంద్రబాబు
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దళితులను మరోసారి అవమానించారు. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు మోసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున వర్ల రామయ్యను పోటీకి నిలపడం ద్వారా మరోసారి వారిని మోసం చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం లేకపోవడం వల్లే వర్ల రామయ్యను చంద్రబాబు బరిలో నిలిపినట్టుగా తెలుస్తోంది. గెలిచే అవకాశం ఉన్నప్పుడు దళితులకు రాజ్యసభ సీటు ఇవ్వని చంద్రబాబు.. తన సామాజికవర్గం, అగ్రవర్ణాలకు అవకాశం కల్పించారు. అందులో భాగంగానే సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్రావు, సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్, టీజీ వెంకటేశ్‌లను రాజ్యసభకు పంపించారు. గతంలో వర్ల రామయ్య కన్నీరు పెట్టుకున్నా రాజ్యసభ సీటు ఇవ్వని చంద్రబాబు.. ఇప్పుడు అతన్ని బరిలో నిలపడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని దళిత సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దళితులపై చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే.. వర్ల రామయ్యకు అప్పుడు ఎందుకు అవకాశం కల్పించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ దళితులను అవమానించడమేనని వారు మండిపడుతున్నారు. కాగా, 2002 నుంచి ఇప్పటివరకు ఒక్క దళిత నేతను కూడా చంద్రబాబు రాజ్యసభకు పంపలేదు. 2016లో జేఆర్ పుష్పరాజ్‌కు రాజ్యసభ సీటు ఇస్తానని తిప్పించుకున్న చంద్రబాబు.. చివరి నిమిషంలో దానిని అగ్రవర్ణాలకు కేటాయించారు. చదవండి : చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తాం -
మేం దాడి చేస్తే మాపై కేసులెలా పెడతారు?
బాపట్ల: చంద్రబాబు తనయుడు లోకేశ్ మరోసారి తన విచిత్ర వ్యాఖ్యలతో ప్రజలను, కార్యకర్తలను అయోమయానికి గురి చేశారు. ‘అమరావతిలో మేం దాడి చేస్తే పోలీసులు మా మీద కేసులెలా పెడతారు’ అంటూ వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతినే ఉంచాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో బాపట్లలో లోకేశ్ సోమవారం పాదయాత్ర నిర్వహించారు. అనంతరం బీఆర్ అంబేడ్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అమరావతి ఉద్యమానికి డబ్బులు అవసరం లేదని చెప్పారు. అమరావతిలో సన్న, చిన్నకారు, దళిత అసైన్డ్ భూముల రైతుల కోసం పోరాటం చేస్తుంది తామేనన్నారు. అయితే.. అంబేడ్కర్ భవనంలో సమావేశం నిర్వహించి ఆయన సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించిన లోకేశ్ కనీసం అంబేడ్కర్ విగ్రహానికి, చిత్రపటానికి నివాళి అర్పించకపోవడం విమర్శలకు తావిచ్చింది. దళితులు లోకేశ్ తీరుపై మండిపడ్డారు. -
అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు
దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను దూషిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దళిత, ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు తన కుల అహంకారాన్ని ప్రదర్శించారని మండిపడ్డాయి. విజయకుమార్‌కు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. మరోవైపు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు పెట్టాలంటూ పోలీస్స్టేషన్లలో దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. సాక్షి, అమరావతి : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) నివేదికలోని అంశాలను మీడియాకు వివరించిన ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై మాజీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఐదుగురు మంత్రులు తీవ్రంగా ఖండించారు. విజయకుమార్‌పై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు వెంటనే వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని మంత్రులు నారాయణస్వామి, విశ్వరూప్, సుచరిత, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పాకే చంద్రబాబు బయటకు రావాలన్నారు. మున్సిపల్ శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి హోదాలో విజయకుమార్ బీసీజీ నివేదికపై మీడియాకు వివరించారని వారు గుర్తుచేశారు. దీనిపై చంద్రబాబు చేసిన విమర్శలు చౌకబారుగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. అలాగే, విజయకుమార్‌ను ‘గాడు’ అనడం ద్వారా తన కుల దురహంకారాన్ని మరోసారి చంద్రబాబు చాటుకున్నారని మంత్రులు ధ్వజమెత్తారు. ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా? అని సీఎంగా ఉన్నప్పుడు వ్యాఖ్యానించిన చంద్రబాబు.. బీసీల తోకలు కత్తిరిస్తానని, ఎస్టీ మహిళల మీద చేయిచేసుకోవడం లాంటి సంఘటనలతో పలుమార్లు కులపరంగా తనకున్న దురహంకార నిజస్వరూపం బయటపడిందని మంత్రులు గుర్తుచేశారు. విజయకుమార్ బాధ్యతలేంటో.. ఆయన కులం ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసని, అయినా ఉద్దేశపూర్వకంగానే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ప్రకటనలో మంత్రులు పేర్కొన్నారు. చంద్రబాబు ఇకపై నోటిని అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. విజయకుమార్‌కు క్షమాపణ చెప్పాలి విజయకుమార్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లుగా అంబేడ్కర్ విగ్రహం పాదాలు పట్టుకుని క్షమాపణ అడగాల్సిందిగా చంద్రబాబును మంత్రులు డిమాండ్ చేశారు. అలాగే, స్వయంగా విజయకుమార్ వద్దకు వెళ్లి, ఆయనక్కూడా మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఇది జరిగే వరకూ చంద్రబాబు ఏ గ్రామంలో అడుగుపెట్టదలుచుకున్నా అక్కడి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలందరూ బాబును ఛీకొట్టాలన్నారు. జ్యుడీషియల్ విచారణ చేయించాలి చంద్రబాబు నాయుడు చేసిన సామాజిక నేరాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసి.. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. విజయకుమార్‌ను ‘వాడు’ అని సంబోధించడంలోనే చంద్రబాబులో ఉన్న అహంకారం ఏంటో తెలుస్తోంది. ఆయన గతంలోనూ దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఎన్నో కేసుల నుంచి, కోర్టుల నుంచి మాజీ సీఎం తప్పించుకు తిరుగుతున్నారు. చంద్రబాబు దోపిడీదారు, అవినీతిపరుడు. దళితులను అవమానించటమేగాక దాడులు చేయించిన ఘనుడు. గతంలో నాయీబ్రాహ్మణులనూ తోకలు కత్తిరిస్తానని బెదిరించారు. తాను ఉన్న సభలో జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు మాట్లాడలేదు. – కత్తి పద్మారావు, దళిత ఉద్యమ నేత చంద్రబాబూ.. నోరు అదుపులో పెట్టుకో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలి. దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను ‘గాడు’ అని సంబోధించడం ఆయన కుల అహంకారానికి నిదర్శనం. ముఖ్యమంత్రి పదవి పోయేసరికి చంద్రబాబుకు చిన్న మెదడు దెబ్బతింది. ఆయన ఒక మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నాడు. – కిషోర్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అట్రాసిటీ కేసు నమోదు చేయాలి చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం హేయం. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా మాల ఉద్యోగులతో సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. – నక్కా రాజశేఖర్, ఏపీ మాల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దళితులు తలుచుకుంటే రోడ్డెక్కలేరు ప్రణాళికా సంఘం కార్యదర్శిగా విజయకుమార్ తన బాధ్యతల నిర్వహణలో భాగంగా బీసీజీ నివేదికను రాష్ట్ర ప్రజలకు చదివి వినిపించారు. అతన్ని పట్టుకుని ‘విజయకుమార్ గాడు’ అని చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయటం దుర్మార్గం. రాష్ట్రంలోని దళితులు తలచుకుంటే చంద్రబాబు రోడ్లపై తిరగలేరు. విజయ్‌కుమార్‌ను అవమానించినందుకు బాబు అంబేద్కర్ విగ్రహం పాదాల వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పకపోతే దళిత జాతి ఆయనను క్షమించదు. – ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అనుచిత వ్యాఖ్యలు చేసే చరిత్ర ఆయనదే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికను మీడియాకు వివరించిన ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను ‘గాడు’ అని సంబోధిస్తూ మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు తీరు ఆయనలోని నిరాశ, నిస్పృహలతో పాటు కుల అహంకారాన్ని బయటపెట్టింది. విజయకుమార్‌కు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి. అధికారులను, ఉద్యోగులను బెదిరించడంతో పాటు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసే చరిత్ర చంద్రబాబుదే. – ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి క్షమాపణ చెప్పకుంటే ఆందోళన దళిత వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి విజయకుమార్ని తీవ్రస్థాయిలో కించపరుస్తూ ‘వాడు’ అంటూ వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో మా ఉద్యోగ సంఘం చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. – రెడ్డిచర్ల ధనుంజయ్, సెర్ప్ ఎల్4, ఎల్5 స్థాయి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాబు అహంకారానికి నిదర్శనం విజయకుమార్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం. ప్రభుత్వ పథకాల అమలు, పేదలకు సేవలందించడంలో విజయకుమార్ ఎప్పుడూ ముందుంటారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా, తూర్పు గోదావరి జిల్లా జేసీగా, ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్‌గా విశేష సేవలందించారు. – తాళ్ళూరి బాబూరాజేంద్ర ప్రసాద్ ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు క్షమాపణ చెప్పాల్సిందే.. విజయకుమార్‌ను కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు భేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒక దళిత ఐఏఎస్ అధికారి విషయంలో ఆయన అలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – ఎస్.కృష్ణమోహన్‌రావు, ఏపీ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రతిపక్ష నేతను అరెస్టు చేయాలి దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం చంద్రబాబును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద వెంటనే అరెస్టు చేయాలి. అధికారం కోల్పోయిన చంద్రబాబు మతిభ్రమించి కుల అహంకారంతో దళిత అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. – మేడిద బాబూరావు, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఆందోళనలు చేస్తాం రాష్ట్ర ప్రతినిధిగా మాట్లాడిన దళిత ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ఎస్సీ కమిషన్లు ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తాం. – గోళ్ల అరుణ్‌కుమార్,మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ప్రతి ఒక్కరూ ఖండించాలి విజయకుమార్‌ను అవమానించిన చంద్రబాబుపై సుమోటోగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. గతంలో సీనియర్ ఐపీఎస్ అధికారి బయ్యారపు ప్రసాదరావును డీజీపీగా రాకుండా ఆయన అడ్డుకున్నారు. ఇప్పుడు విజయకుమార్‌ను అవమానించిన చంద్రబాబు తీరును ప్రతి ఒక్కరూ ఖండించాలి. – పెరికే వరప్రసాదరావు, ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు ఐఏఎస్ అధికారిపై వ్యాఖ్యలు సరికాదు ఒక బాధ్యతగల ఐఏఎస్ అధికారిని అవమానించేలా ప్రతిపక్షనాయకుడు దుర్భాషలాడటం సరికాదు. ప్రభుత్వానికి అందిన నివేదికలోని అంశాలను విజయకుమార్ సవివరంగా చెప్పడాన్ని సహించుకోలేక చంద్రబాబు పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఈ విధానం మంచిది కాదు. – ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి జి.హృదయ రాజు -
ఎన్నేళ్లిలా అణిగిమణిగి ఉండాలి?
‘మా బతుకులు ఎలాగూ తెల్లారిపోతున్నాయి. ఎన్నేళ్లిలా అణిగిమణిగి ఉండాలి? మా పిల్లలు చదువుకుంటున్నారు.. స్వతహాగా ఎదుగుతున్నారు. వారినీ మాలాగే అణగదొక్కేయాలనుకుంటే ఎలా? మాకెలాగూ తప్పలేదు. పెత్తందార్ల అడుగులకు యువత ఎందుకు మడుగులు ఒత్తుతుండాలి? మమ్మల్ని ధైర్యంగా ఉండాలని మా యువకులు చెబుతున్నారు. ప్రభుత్వం రక్షణగా ఉంటే సరేసరి. లేదంటే మమ్మల్ని మేమెలా కాపాడుకోవాలో మేమూ తెలుసుకుంటాం. ఏం మా ఓట్లు మేం వేసుకుంటామని అనడమే తప్పా? అదేమైనా నేరమా? మా హక్కును వినియోగించుకునే అవకాశం కూడా లేదా?’ ‘చూడండయ్యా. మేం రోజుకు కేవలం రూపాయిన్నర కూలికి వాళ్ల పొలాల్లో పనులకు వెళ్లాం. నలభై ఏళ్లుగా మా చెమట ధారపోస్తున్నాం. పిల్లలు చదువుకున్నారు. వారికీ ఆలోచనలు ఉంటాయి. మా ఓట్లు మేం వేసుకుంటామని అడిగితే వాళ్లను కొట్టేస్తారా. వాళ్లు ఉండే ఊరు మాత్రం బాగుండాలి. వాళ్ల వీధులు నున్నగా మారాలి. సిమెంటు రోడ్లు వేసుకోవాలి. మా వీధులు మాత్రం ఇలాగే మట్టి రోడ్లుగానే ఉండిపోవాలా?’ ఇదీ ఎన్ఆర్ కమ్మపల్లికి చెందిన దళితుడు అరవై ఏళ్ల నడిపయ్య ఆవేదన. ఇదీ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌లో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న దళితుల ఆవేదన. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు దశాబ్దాల తరబడి అరాచకాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఓటు హక్కు వినియోగించుకుంటామన్న దళితులను భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోకపోవడంతో వారంతా ఓటు వేయలేకపోయారు. ఎట్టకేలకు చంద్రగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదుతో తొలిసారి దళితులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ పెద్దలు దళితులపై బెదిరింపులకు దిగారు. ‘ఏరా.. మేం వద్దని చెప్పినా పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటేశారు.. ఎన్నికల ఫలితాలు రానివ్వండి.. మీ పని పడతాం’ అంటూ నిరుపేద దళితుల్ని బెదిరిస్తున్నారు. ఈ హూంకరింపులతో దళిత వర్గాల వారు భయకంపితులవుతున్నారు. ఎన్ఆర్ కమ్మపల్లిలో ఇప్పటికే 20 మంది సొంత ఊరిని వదిలి వేరే ప్రాంతాలకు తరలిపోయారు. దళితులపై దాడులకు వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకునేందుకు పరుగులు తీస్తున్న పోలీసులు (ఫైల్) వెంకట రామాపురంతో మొదలై.. తిరుపతికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోని గ్రామం.. వెంకట రామాపురం. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని ఓ గ్రామమిది. మాజీ మంత్రి, దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడు స్వగ్రామం కూడా ఇదే. టీడీపీ ఆవిర్భావం తర్వాత సొరకాయలపాలెం (ప్రస్తుతం 662 ఓట్లు) పంచాయతీ నుంచి వెంకట రామాపురం (ప్రస్తుతం 377 ఓట్లు)ను విడదీసి ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. సీఎం చంద్రబాబు సామాజికవర్గం ప్రధానంగా పెత్తనం చెలాయిస్తున్న ఎన్ఆర్ కమ్మపల్లి, రావిళ్లవారిపల్లి, కమ్మపల్లి, గణేశ్వరపురం (కొత్తకండ్రిగ), కమ్మ కండ్రిగ, కొత్త కండ్రిగ, మిట్ట కండ్రిగ తదితర గ్రామాల్లోని దళిత ఓటర్లు, పేద వర్గాలకు చెందిన వారు స్వయంగా ఓటు వేసే అవకాశం లేదు. ఓటు వేయడం మాట దేవుడెరుగు.. కనీసం ఓటు వేయాలనే ఆలోచన చేసినా దాడులు తప్పేవీ కాదు. అరాచకాలు అన్నీఇన్నీ కావు తమ అభీష్టానికి, టీడీపీకి వ్యతిరేకంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఆలోచన చేసిన వారికి చుక్కలు చూపించడం రామచంద్రాపురం మండలంలోని పలు గ్రామాల్లోని చంద్రబాబు సామాజికవర్గం నేతలకు చాలా సాదాసీదా విషయం. నడిచే దారులు మూసేయించడం, వాటిపై ముళ్ల కంప (మెష్) వేయించడం, రేషన్ సరుకులు తీసుకోనివ్వకపోవడం, పచారీ కొట్లలో సరుకులు కొనుగోలుకు అనుమతించకపోవడం, ఊరి కట్టుబాటు పేరుతో కట్టడి చేయడం వంటి అరాచక చర్యలతో భయకంపితులను చేస్తారు. ఈ దురాగతాల వల్ల ఆ సామాజికవర్గం వారిని ఎదిరించడానికి ఇతర కులాలు, వర్గాల వారు సాహసించరని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. 2014లో సింగిల్ విండో ఎన్నికల సమయంలో తాము ఓటు హక్కు వినియోగించుకుంటామని అన్నందుకు దళిత యువకులతోపాటు మరికొందరిని కోళ్లఫారాల్లో వేసి చితకబాదారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పారు. వారిపై ఆధారపడుతున్నందునే ఈ దాష్టీకాలు గ్రామాల్లోని దళితులు, ఇతర పేదలు రైతుల వద్ద అప్పులు తీసుకుంటుంటారు. వ్యవసాయ పనులకు, ఇతర అవసరాలకూ గ్రామ పెద్దలపైనే ఆధారపడాలి. ఈ కారణంగా చంద్రబాబు సామాజికవర్గం వారిపై పెత్తనం చెలాయిస్తోందని డివిజనల్ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘పాతతరం వారు అణిగిమణిగి ఉండేవారు. ఇప్పటి తరం వ్యవసాయ పనులకు వెళ్లటం లేదు. ఏదో ఒక సాంకేతిక నైపుణ్యంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆటోలు తోలుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో పెత్తనం చెలాయిస్తున్న వారిని యువత అంగీకరించడం లేదు. స్వతంత్రంగా వ్యవహరించడానికి ముందుకొస్తున్నారు. దీన్ని అగ్రవర్ణాల వారు భరించలేకపోతున్నారు’ అని వివరించారు. ఎన్నిసార్లు విన్నవించినా.. తమకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారికి, పోలీస్ ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఎన్ఆర్ కమ్మపల్లికి చెందిన పలువురు దళిత యువకులు ‘సాక్షి’కి చెప్పారు. ‘ఏంట్రా.. మీకు ఓట్లు కావాలా’ అని ఎన్ఆర్ కమ్మపల్లికి చెందిన చంద్రబాబు సామాజికవర్గం వారు దారికాచి ఐదుగురిని చితకబాదారని వాపోయారు. తక్షణ అవసరాలకు బంగారం కుదువపెట్టి డబ్బు తెచ్చుకుంటే ఆ డబ్బు వైఎస్సార్సీపీ వారి వద్ద నుంచి తీసుకున్నారని కొట్టారని కన్నీటి పర్యంతమయ్యారు. ‘చూడండి సార్.. మా బాబాయ్ ఆటో ఎలా ధ్వంసం చేశారో. ఆయన రోజుకు రూ. 1,000 సంపాదించుకునేవారు. తెల్లవారుజామున తిరుపతికి వెళ్లి షాపులకు చికెన్ వేసేవారు. ఆటో ధ్వంసం చేయడంతో వారం రోజులుగా జీవనోపాధి కోల్పోయారు’ అని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు ఉండాల్సిందే.. తిరుపతికి అత్యంత సమీపంలోని గ్రామాల్లో ఇలాంటి దౌర్జన్యాలను, కుల వివక్షను మేం కూడా అంగీకరించలేకపోతున్నాం. కొందరు అధికారుల తప్పిదాల వల్ల అందరికీ చెడ్డపేరు వస్తోంది. ఓటరు పోలింగ్ కేంద్రం లోపలకు రాగానే వారి వేళ్లపై సిరా పూసి స్లిప్పు ఇస్తారట. ఓటు మాత్రం ఎవరో వేస్తారట. సీసీ కెమెరాల పొజిషన్ కూడా మార్చేస్తారట. ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటే పోలింగ్ అధికారులు ఏం చేస్తున్నట్లు. చివరకు ఇవన్నీ మా విభాగానికి చుట్టుకుంటాయి’ అని రామచంద్రాపురం మండలంలో పోలింగ్‌ను పర్యవేక్షించడానికి అమరావతి నుంచి వచ్చిన సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ఫోన్లో ‘సాక్షి’కి చెప్పారు. అందుకే సంబంధిత పోలింగ్ అధికారులపై మరింత కఠిన చర్యలు ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్‌కు మొరపెట్టుకున్నా.. ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు బ్రాహ్మణ కాలవను సందర్శించినప్పుడు గ్రామస్తులు వారి కాళ్లపై పడి తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ సమయంలో తమ వాళ్లు కూడా అక్కడే ఉన్నారని గంగిరెడ్డిపల్లికు చెందిన వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఏవీ బ్రహ్మానందరెడ్డి గుర్తు చేశారు. కమిషన్ సభ్యులు జిల్లా అధికారులతో మాట్లాడారని ఆయన చెప్పారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైనందుకు పాతకందుల వారి పంచాయతీ ఐఏవై కాలనీకి చెందిన దళిత యువకుడికి టీడీపీ నాయకులు రూ.2 వేలు జరిమానా విధించారంటేæఅధికార పార్టీ దాష్టీకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లమవుతోంది. అయ్యో... దండం పెడతాం, మీరు గమ్ముగుండండయ్యా.. అయ్యా... మీకు దండం పెడతాం. మీరంతా గమ్ముగుండండయ్యా... నోళ్లు మూసుకోండి. ఎదురు మాట్లాడి ఎందుకయ్యా వాళ్ల చేతుల్లో పడి చచ్చిపోతారు.. అని ఎన్ఆర్ కమ్మపల్లి దళితవాడకు చెందిన మహిళలు ‘సాక్షి’ ప్రతినిధులతో మాట్లాడుతున్న వారిని ఆపడానికి ప్రయత్నించారు. ఆ పొరుగూరోళ్లతో (సాక్షి ప్రతినిధులని వాళ్లకు తెలియదు) మాట్లాడవద్దంటూ వారించారు. ఆ గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగుతున్నా... పోలీసులు అక్కడే వారి సమీపంలో ఉన్నప్పటికీ దళితుల మాటల్లో వణుకు, కళ్లలో దైన్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ‘ఎందుకమ్మా మీరు అలా భయపడుతున్నారని’ అడగ్గా.. ‘ఏందోనయ్యా, మా ఖర్మ ఇంతే. పిల్లోళ్లు ఓట్లు వేస్తామన్నారట. అంతేనయ్యా దోవలో వస్తున్న వారిని పట్టుకుని కొట్టేశారు. మీరైనా, పోలీసోళ్లు అయినా మాకాడ ఎన్నాళ్లు ఉంటారు. పోలీసోళ్లు ఉన్నన్ని రోజులు మా జోలికి రాకపోవచ్చు. ఆ తరువాత ఏమవుతుందో మాకు తెలుసయ్యా. అందుకే ఏం మాట్లాడవద్దని మా వాళ్లను బతిమలాడుకుంటున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు వృద్ధ మహిళలు. పునరావృతం కాకుండా చూడాలి ఇకనైనా అధికారులు తప్పులు జరగకుండా చూడాలి. ఎన్నికల నిర్వహణలో ఈసీ వైఫల్యం చెందిందంటూ చంద్రబాబు దేశవ్యాప్తంగా తిరుగుతూ గగ్గోలు పెడుతున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆయన సొంత నియోజకవర్గంలో దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టీకాల గురించి కూడా ఆయనే వెల్లడించాలి. – చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే ఆగడాలు వారికి అలవాటే.. దళితులపై ఆగడాలు చేయడం వారికి అలవాటే. జిల్లాలోని చాలాచోట్ల ఓ సామాజికవర్గం వారికి దళితుల పట్ల చిన్నచూపు ఉంది. ఎందుకంటే దళితులు తమ ఆర్థిక అవసరాలకు ఆ సామాజికవర్గంలోని ధనిక రైతులపై ఆధారపడుతుంటారు. పశువులు మేపుకోవాలన్నా, గడ్డి తెచ్చుకోవాలన్నా, కట్టెలు కొట్టుకోవాలన్నా, పొలాల్లో నడవాలన్నా వారికి అనుకూలంగా ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎన్నికల్లో తమకే ఓట్లు వేయాలని ఒత్తిడి తెస్తారు.. బెదిరిస్తారు.. దాడులు చేస్తారు. అయినా సరే నమ్మకం కుదరదు. అందుకని పోలింగ్ కేంద్రం వద్దకు కూడా దళితులను రానివ్వరు. ఈ పరిస్థితులు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. – సుబ్రమణ్యం, కేవీపీఎస్, రాష్ట్ర అధ్యక్షులు -
స్వేచ్ఛగా ఓటెత్తారు!
తిరుపతి రూరల్: దళితులు, గిరిజనులు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును సైతం స్వేచ్ఛగా వినియోగించుకోలేని దుస్థితి రామచంద్రాపురం మండలంలో కొన్ని గ్రామాల్లో ఉంది. గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాలకు వచ్చిన దళిత, గిరిజనులను బలవంతంగా బయటకు పంపించి, టీడీపీ శ్రేణులు రిగ్గింగ్ చేసుకున్నారు. వీడియో పుటేజీల ద్వారా గుర్తించిన ఎన్నికల కమిషన్, రీ–పోలింగ్‌కు ఆదేశించింది. ఆదివారం జరిగిన రీపోలింగ్‌లోనూ దొంగ ఓట్లు ద్వారా కుయుక్తులకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించారు. కానీ ఆధికారులు ముందు అవి ఫలించలేదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నియోజకవర్గం పరిధిలోని దళితులు, గిరిజనులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమ్మపల్లి, ఎన్ఆర్ కమ్మపల్లిలో దొంగ ఓట్లు.. ఇద్దరి అరెస్ట్ రిగ్గింగ్, రీసైక్లింగ్ ద్వారా దొంగచాటుగా ఓట్లు వేసుకునే తమ సంస్కృతి అధికారుల ముందు సాగకపోవడంతో టీడీపీ శ్రేణులు దొంగఓట్లకు తెగబడ్డారు. కమ్మపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నించిన మునిచంద్రనాయుడు, ఎన్ఆర్ కమ్మపల్లిలో యుగంధర్నాయుడును ఎన్నికల అధికారులు గుర్తించారు. దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించారని వారిని పోలీసులకు పట్టించారు. రాత పూర్వకంగా ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేయటంతో మునిచంద్రనాయుడు, యుగంధర్నాయుడుపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన డీఐజీ, తిరుపతి, చిత్తూరు ఎస్పీలు రీ–పోలింగ్ సందర్భంగా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలూ చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు. డీఐజీ క్రాంతిరాణాఠాటా, చిత్తూరు, తిరుపతి అర్బన్ ఎస్పీలు స్వయంగా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. ఎన్‌ఆర్‌కమ్మపల్లి, కమ్మపల్లిలో రచ్చచేసేందుకు ప్రయత్నించిన యువకులను అక్కడి నుంచి తరిమేశారు. భద్రత మధ్య ఓటింగ్‌కు దళితులు, గిరిజనులు దళితులు, గిరిజనులను టీడీపీ శ్రేణులు ఓటింగ్‌కు రాకుండా బెదిరిస్తున్నారనే ఫిర్యాదు రావడంతో ఎన్నికల అధికారులు అప్రమత్తం అయ్యారు. దళితవాడల నుంచి పోలింగ్ కేంద్రాల వరకు వారిని తీసుకువచ్చి, ఓటింగ్ చేయించి, తిరిగి వారు ఇళ్లకు చేరేంతవరకు పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. దీంతో దళితులు, గిరిజనుల్లో ఆత్మస్థయిర్యం పెరిగింది. 25 ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నామని వారు ఆనం దం వ్యక్తం చేశారు. -
తప్పు చేశాం.. క్షమించండి..!
న్యూఢిల్లీ : దళితులు, నిమ్న కులస్తులపై మంగళవారం అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఓ యువతి తీవ్ర విమర్శల నేపథ్యంలో క్షమాపణలు కోరారు. రిజర్వేషన్ల కారణంగా తక్కువ జాతివారు తమ తలపై వచ్చి కూర్చుంటున్నారని, దళితుల వల్లే తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదంటూ ఆమె అసభ్యంగా మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలలను తిడుతూ తన మిత్రుడితో కలసి వీడియో చిత్రీకరించి వాట్సాప్‌లో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. తీవ్ర విమర్శలు రావడంతో వారిరువురు శుక్రవారం క్షమాపణలు చెప్పారు. ఈమేరకు మరో వీడియో విడుదల చేశారు. తన వ్యాఖ్యలపై చింతిస్తున్నానని, ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే ఆవేదనతో అలా మట్లాడానని యువతి చెప్పుకొచ్చారు. దయచేసి తనపై అసభ్యకర కామెంట్లు ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఏ మతాన్ని, కులాన్ని కించపరచడం తమ ఉద్దేశం కాదని ఆ అసభ్యకర వీడియో బదులుగా.. తాజా వీడియోను షేర్ చేయండని కోరారు. (చదవండి : వైరల్ : దళితులపై బూతుపురాణం.. మోదీకి జేజేలు..!) -
రెచ్చిపోయిన పచ్చమూక
-
దళితులపై మండిపడిన యువతి
-
వైరల్ : దళితులపై బూతుపురాణం.. మోదీకి జేజేలు..!
న్యూఢిల్లీ : పీడిత ప్రజల బాగుకోసం స్వతంత్ర భారతంలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు సమాజంలో అంతరాలు పెంచాయనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. 69 ఏళ్ల గణతంత్ర భారతంలో రిజర్వేషన్లు ఇంకా అవసరమా అని కొందరు విమర్శలు చేస్తుండగా.. మరికొందరు మాత్రం అణగారిన వర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు అందడం లేదంటున్నారు. అయితే, నేటి ఆధునిక కాలంలోనూ మనదేశంలో కులం గోడలు బలంగా నిలబడడానికి రిజర్వేషన్లే కారణమంటూ ఓ యువతి బూతు పురాణం అందుకుంది. దళితులపై అసభ్యకర రీతిలో విరుచుకుపడింది. అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తిని కావడంతో తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని చెప్పుకొచ్చింది. రిజర్వేషన్ల పుణ్యమానీ ఎస్సీ,ఎస్టీ,బీసీలు తక్కువ మార్కులకే ఉద్యోగాలు తన్నుకు పోతున్నారని అసహనం వ్యక్తం చేసింది. గవర్నమెంటు కొలువు దక్కాలంటే.. ఆ.....(అసభ్య పదజాలం) కులంలో పుట్టాలా..? అని ప్రశ్నించింది. మార్కులు సరిగా రాకున్నా.. రిజర్వేషన్ల ఫలితంగా.. ఆ.... (అసభ్య పదజాలం) కులస్తులు తమ తలపై (టాప్ పొజిషన్) కూర్చుకుంటున్నారని మండిపడింది. రాజకీయంగా తనకు ప్రధాని మోదీ అంటే తనకు ఇష్టమని చెప్పింది. 40 సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక వీడియో చివర్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పైనా ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : దళితులపై మండిపడిన యువతి -
రాజ్యాంగమా.. నీవే దిక్కు!
స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా దేశంలో చాలామంది ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వాలు అంటే తెలియదు. భారత రాజ్యాంగంలో ప్రతి పౌరునికి కొన్ని రాజ్యాంగ హక్కులు కల్పించినప్పటికీ ఇప్పటి వరకు వాటిని స్వేచ్ఛగా వాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా దళిత హక్కులకు పూర్తిగా భగం వాటిల్లితోంది. అందుకు ఉదాహరణ మండలంలోని రామాయపాలెం. సాక్షి, మర్రిపూడి(ప్రకాశం): ఈ గ్రామంలో 591 ఓట్లు ఉన్నాయి. దళితవాడలో 250 మంది దళితులు నివసిస్తున్నారు. కాలనీలో 198 మంది దళితుల (మాదిగలు) ఓట్లు ఉన్నాయి. ప్రతి ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ నంబరు 14 లో తమ ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే దాదాపు 35 ఏళ్లుగా ఈ దళితవాడలోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న దాఖలాలు లేవు. అధికారపార్టీకి చెందిన నేతల బెదిరింపులే ఇందుకుకారణ మని దళితులు వాపోతున్నారు. బెదిరింపుల పర్వం మండలంలోని సింహభాగం చౌదరి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 393 ఉన్నాయి. ప్రతి ఎన్నికల సమయంలో అక్కడ అధికార తెలుగుదేశం పార్టీదే హవా. ఎన్నికల సమయంలో దళితులకు చెందిన ఓట్లను వినియోగిచుకోనివ్వరు. ఎస్సీ ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లాలంటేనే భయాందోళనకు గురౌతున్నారు. వారి ఓట్లు లాక్కుని వేసుకోవడం రామాయపాలెం గ్రామంలో ఆనవాయితీగా వస్తోంది. ఆ గ్రామంలో ప్రతి ఎన్నికల్లో ఓటర్లును బెదిరించడం, ప్రలోభాలకు లోను చేయడం, ఎదురుతిరిగితే దౌర్జన్యానికి దిగడం జరుగుతోంది. అందుకే ఆ గ్రామ దళితులు భయపడి తమ ఓటును వినియోగించుకోకుండా బూత్‌ల వద్ద ఉన్న ఏజెంట్లకు ఇచ్చి వెళ్లిపోతుంటారు. నా ఓటు నేను వేసుకుంటా అన్న మాట దళితుల నుంచి వినిపిస్తే గ్రామంలోకి రానివ్వరు. పనులకు పిలవరు, డబ్బులు ఇచ్చినా తాగునీరు (బబుల్స్ నీరు), పాలు కట్ అంటారు. అందుకే భయపడి అధికారపార్టీ నేతలు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లకు ఓటరు స్లిప్ ఇస్తామంటున్నారు. నాడు 10 ఓట్లే వేశారు మండలంలోని రామాయపాలెం గ్రామంలోని పోలింగ్ బూత్ నంబరు 14 వద్దకు ఓటు వినియోగించుకోనివ్వకపోవడంతో దళితవాడలో నూతన పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలంటూ గతంలో జిల్లా కలెక్టర్‌కు రెండుసార్లు వినతిపత్రం సమర్పించారు. 2014 ఎన్నికల్లో ఓటు వినియోగించుకోనివ్వకపోవడంతో అప్పటి కలెక్టర్ విజయకుమార్‌ను సంప్రదిస్తే మాకు పోలీస్ సెక్యూరిటీతో 10 ఓట్లు మాత్రమే వేసుకోనిచ్చి మిగిలిన ఓట్లు అన్నీ సీసీ కెమేరాలు తొలగించి అధికార పార్టీకి చెందినవారు వేసుకుని గెలుచుకున్నారని గ్రామ దళితులు వాపోతున్నారు. దళితవాడలో నూతన పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ అధికారులను వేడుకున్నా ఉపయోగంలేదు. దీంతో మండల స్థాయి అధికారులు, బూత్‌లెవల్ అధికారుల అండతో పచ్చనేతలు రెచ్చిపోతున్నారు. ఓటరు లిస్టులో ఓట్లు ఉన్నాయని ఈ సారైనా తమ ఓటు హక్కు తమకు కల్పించాలని వేడుకుంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రలోభాలా? ప్రజల చేత ఎన్నుకున్న ప్రజాస్వామ్యదేశంలో ఓటు హక్కు వినియోగించుకునే హక్కు అంబేడ్కర్ దళితులను కల్పించారు. నేటి సమాజంలో అసమానతలు తొలగాలని సమానత్వం పెంపొందించాలని రాజ్యాగంలో దళితులకు ఓటు హక్కు అనే ఆయుధం మాకు ఇచ్చారు. కానీ అ పరిస్థితి లేదు. ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. - కోండ్రు మోజేష్ (నేషనల్ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మండల అధ్యక్షుడు) బూత్ వద్దకు ఎలా వస్తారో చూస్తామంటున్నారు మాగ్రామంలో పోలింగ్ బూత్ నంబరు 14 వద్ద కు వెళ్లాలంటే భయంగా ఉంది. పోలింగ్‌బూత్ వద్దకు దళితులు ఎలా వస్తారో చూస్తామంటున్నారు. - మక్కెన బ్రహ్మయ్య ఓటు లాక్కుని వేసుకుంటారు ఓట్లు వేయడానికి ఎన్నిసార్లు పోలింగ్‌బూత్ వద్దకు వెళ్లినా నా ఓటు లాక్కుని పచ్చనేతలు వేసుకుంటున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మా ఓట మమ్ములనువేసుకోనివ్వండి సారూ. - మక్కెన శ్యాంసన్ దళితవాడలో పోలింగ్ బూత్ పోలింగ్ బూత్‌నంబరు 14 వద్ద ఎలాగూ ఓటు వేసుకోనివ్వరు. అందు వల్లా మా ఓట్లు మేమువేసుకోవడానికి వీలుగా దళితవాడలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి. - ఎం. హరి ఇప్పటి వరకు వినియోగించుకోలేదు మండలంలోని రామాయపాలెం గ్రామంలోని దళితవాడలో నివసిస్తున్నా దాదాపు 35 ఏళ్లుగా ఓటు వినియోగించుకున్న దాఖలాలు లేవు. ప్రతి ఎన్నికల సమయంలో మమ్ములను బెదిరించి లాక్కుని ఓటు వేసుకుంటున్నారు. - మక్కెన శ్రీను -
అది సేవా లేదా రాజకీయ స్టంటా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇదొక రాజకీయ స్టంట్, రానున్న లోక్‌సభ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని చేసినది. ఓట్ల కోసం ఆడిన డ్రామా’... ప్రధాని నరేంద్ మోదీ ఆదివారం నాడు ప్రయాగ్ రాజ్‌లో ఐదుగురు స్వీపర్లు లేదా పారిశుద్ధ్య పనివారల కాళ్లు కడిగిన వీడియో దశ్యాలపై ముంబై ర్యాలీకి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు చేసిన వ్యాఖ్యలివి. సోమవారం నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, ముంబైలోని ఆజాద్ మైదానంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన వేలాదిమంది పారిశుద్ధ్య కార్మికులు ధర్నాలు నిర్వహించారు. ‘దళితులు, కార్మికుల హక్కుల సంఘం’ ఆధ్వర్యంలో ఢిల్లీలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించగా, ‘సఫాయ్ కర్మచారి ఆందోళన్, మహారాష్ట్ర మున్సిపల్ కామ్‌గార్ యూనియన్, కచ్రా వాహ్తుక్ శ్రామిక్ సంఘ్’ తదితర కార్మిక సంఘాల పిలుపు మేరకు ముంబైలో ధర్నా నిర్వహించారు. ‘ఇదంతా ఓట్ల కోసం. మోదీకి మా పట్ల అంత ప్రేమ ఉంటే, మమ్మల్నీ సైనికుల్లా చూడాలి. విధి నిర్వహణలో చనిపోతే అమర వీరుల్లా గౌరవించాలి’ అని హర్యానాలోని ఫరిదాబాద్ నుంచి ధర్నాకు వచ్చిన 30 ఏళ్ల రవి వాల్మికన్ వ్యాఖ్యానించారు. భద్రతా మాస్కులు, చేతులకు గ్లౌజులు, కాళ్లకు రక్షణ బూట్లు లేకుండానే తామంతా డ్రైనేజీ పనులు చేస్తున్నామని ఆయనతోపాటు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు తెలిపారు. ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులందరికి కనీస వేతనాలను అమలు చేస్తామని మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం 2015లోనే ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో తాము ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వచ్చిందని యూనియన్ నాయకులు తెలిపారు. మోదీకి తమ పట్ల ప్రేమ ఉంటే తాము ఎందుకు ఇంత దుర్భర పరిస్థితుల్లో బతుకుతామని వారు ప్రశ్నించారు. ఆధ్యాత్మిక సేవలో భాగంగానే... ఆదివారం నాడు కుంభమేళాకు హాజరైన నరేంద్ర మోదీ, ఆధ్యాత్మిక సేవలో భాగంగానే ఐదుగురు పారిశుద్ధ్య కార్మికుల పాదాలను కడిగానని చెప్పుకున్నారు. వాల్మికి సామాజిక వర్గం చేసే పాకీ పని కూడా ఆధ్యాత్మిక సేవ లాంటిదని మోదీ 2010లో ప్రచురించిన ‘కర్మయోగి’ అనే తన పుస్తకంలో రాశారు. ‘బ్రతుకుతెరువు కోసం వారు ఈ పని చేస్తున్నారని నేను భావించడం లేదు. అలా అయితే మరో వృత్తి ఎన్నుకొనే వారు. తరతరాలుగా ఇదే వృత్తిలో ఎందుకు కొనసాగుతారు ?’ అని ఆ పుస్తకంలో మోదీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జాతిపిత మహాత్మా గాంధీ కూడా 1936లో ‘ది ఐడియల్ బాంగీ’ పేరిట రాసిన వ్యాసంలో పాకిపని వారలు చేసేది ‘పవిత్ర విధి’ అని అభివర్ణించారు. వారు చేసే పనిలో ఎలాంటి పవిత్రత లేదని, వారిని దళితులుగా దూరం పెట్టడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వారు ఆ పని చేయాల్సి వస్తోందంటూ డాక్టర్ అంబేడ్కర్, నాడే గాంధీకి సమాధానం ఇచ్చారు. వేలాది మంది మరణం 2014–2016 మధ్య రెండేళ్ల కాలంలోనే డ్రైనేజీ క్లీనింగ్ పనిలో 1,327 మంది పారిశుద్ధ్య కార్మికులు మరణించినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2015 నుంచి అంతకుముందు ఆరేళ్ల కాలంలో ఒక్క ముంబై నగరంలోనే 1,386 మంది పారిశుద్ధ్య కార్మికులు విధినిర్వహణలో మరణించారని ‘ఇండియాస్పెండ్’ పరిశోధన సంస్థ 2015లో విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది. వీరిలో 90 శాతం మంది కాంట్రాక్టు లేబర్లే. దేశంలో పాకిపనివారల వ్యవస్థను 2013, సెప్టెంబర్ నెలలో కేంద్ర కార్మిక శాఖ నిషేధించింది. దీన్ని కచ్చితంగా అమలు చేయడంతోపాటు పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలకు పూర్తి భద్రతనిచ్చే ఆధునిక పరికరాలను ఉపయోగించాలంటూ 2014, మార్చి 26వ తేదీన దేశంలోని అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను కచ్చితంగా అమలుచేసి ఉంటే ఇంతమంది పారిశుద్ధ్య కార్మికులు ఎందుకు చనిపోతారు? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న రైల్వే వ్యవస్థలో కూడా పారిశుద్ధ్య పనివారలు ఎందుకు కొనసాగుతారు? కాకపోతే వారిని స్వీపర్లుగా వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిపై వారికి రోజుకు 200 రూపాయలు చెల్లిస్తున్నారు. ప్రాణ హాని లేదా అంగవైకల్య ప్రమాదాలకు ఆస్కారం ఉన్న విధులను ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టు కార్మికులను అప్పగించరాదంటూ 1947 నాటి పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టం నిర్దేశిస్తుండగా, డ్రైనేజీ పనులకు కాంట్రాక్టు కార్మికులను ఉపయోగిస్తే యజమానులకు ఏడాది జైలు, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తామని 1993 నాటి చట్టం చెబుతోంది. దేశంలోని దాదాపు అన్ని మున్సిపాలిటీలు పారిశుద్ధ్య పనులకు కాంట్రాక్టు కార్మికులను ఉపయోగిస్తున్న విషయం తెల్సిందే. మనకన్నా ఆర్థికంగా వెనకబడిన అనేక దేశాలు పారిశుద్ధ్య పనులకు ఆధునిక పరికరాలను ఉపయోగిస్తున్న విషయం తెల్సిందే. -
పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు..
సాక్షి, ఏలూరు : ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితుల మనోభావాలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయటానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని కత్తుల రవికుమార్ జైన్ తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ కేవలం ఒక దళితుడిగా స్పందిస్తూ చింతమనేని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలో దళితుల మనోభాలను కించపరిచే వ్యాఖ్యలను మాత్రమే కట్ చేసి పోస్టు చేశానని విలేకరులకు చెప్పారు. దళితులను అవమానపరుస్తూ చింతమనేని మాట్లాడితే దానిపై ఏమాత్రం స్పందించని ప్రభుత్వం, పోలీసులు తనపై కేసులు పెట్టడం అన్యాయ మన్నారు. చింతమనేనిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తానేమీ చదువురాని వ్యక్తిని కాదని, ఉన్నతభావాలు కలిగిన వ్యక్తిగా, దళితుల మనోభావాలను దెబ్బ తీశారనే కారణంతో ఇది సమాజానికి తెలి యజేసేందుకు పోస్టు చేశానని చెప్పారు. మరోవైపు వీడియో షేర్ చేసిన రవికుమార్ జైన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు...దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి కేసు నమోదు చేయలేదు. పోలీసుల వైఖరిపై దళితులు మండిపడుతున్నారు. -
‘పశ్చిమ’ పోలీసుల వైఖరిపై సర్వత్రా విమర్శలు
సాక్షి, పశ్చిమగోదావరి : దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఇప్పటివరకూ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నప్పటకి పోలీసులు మాత్రం స్పందించడం లేదు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వదిలేసి.. వీడియోను షేర్ చేసిన వైఎస్సార్ సీపీ కార్యకర్త కత్తుల రవికుమార్‌ని అరెస్ట్ చేయడం పట్ల దళిత సంఘాలు మండిపడుతున్నాయి. చింతమనేని విషయంలో చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తూ.. ఈ వ్యవహారాన్ని పక్క దారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసుల వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారని దళిత నేతలు మండిపడుతున్నారు. అంతేకాక ప్రభుత్వం పెద్దల ఆదేశాల మేరకే పశ్చిమ పోలీసులు నడుచుకుంటున్నారని.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి.. వినతి పత్రం సమర్పించాలని దళిత సంఘాల నేతలు నిర్ణయించారు. -
కత్తుల రవి విషయంలో పోలీసుల ఓవరాక్షన్
-
కత్తుల రవికి బెయిల్ మంజూరు
పశ్చిమగోదావరి : వైఎస్సార్సీపీ నేత కత్తుల రవికుమార్‌కు సొంత పూచీకత్తుపై ఏలూరు రెండవ అదనపు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదు చేయకుండా ఆయన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వైఎస్సార్సీపీ నేత రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. అరెస్ట్ అనంతరం పొద్దున్నుంచి ఏలూరు వీధుల్లో, సందుల్లో తిప్పుతూ బెదిరింపులకు పాల్పడుతూ చివరికి ఏలూరు రెండవ అదనపు కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి సొంతపూచీకత్తుపై బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. బెయిల్‌పై బయటికి వచ్చిన రవిని వైఎస్సార్సీపీ నేతలు మాజీ మంత్రి మరడాని రంగా రావు, కొఠారు రామచంద్రరావు, కొయ్యే మోషెన్ రాజు, దళిత సంఘాల నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు’ వినాశకాలే ‘విప్’రీత బుద్ధి -
‘నేను ఏ తప్పూ చేయలేదు’
-
‘నేను ఏ తప్పూ చేయలేదు’
పెదపాడు(పశ్చిమ గోదావరి జిల్లా): తాను ఏ తప్పూ చేయలేదని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, దళిత నేత కత్తుల రవి జైన్ తెలిపారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒత్తిడితోనే తనను అన్యాయంగా కేసులో ఇరికించారని చెప్పారు. చింతమనేని రోడ్‌షోలో మాట్లాడిన వీడియోని తాను ఎక్కడా మార్ఫింగ్ చేయలేదని చెప్పారు. చింతమనేని మాట్లాడిన దానిని ఉన్నది ఉన్నట్లుగానే వాట్సప్‌లో షేర్ చేసినట్లు వెల్లడించారు. చింతమనేని ప్రభాకర్ దళితులను కించపరిచే విధంగా మాట్లాడితే అతనిని వదిలేసి, వీడియో అందరికీ తెలిసేలా షేర్ చేసిన తనపై కేసు పెట్టడం దారుణమన్నారు. ‘దళితులు.. మీకెందుకురా రాజకీయాలు.........కొడకల్లారా’ అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని దళిత వర్గాన్ని తీవ్రంగా అవమానించిన సంగతి తెలిసిందే. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ దళిత నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అయితే తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ చింతమనేని ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం వెంటనే స్పందించి వీడియో షేర్ చేసిన కత్తుల రవి అనే వైఎస్సార్‌సీపీనేతను హడావిడిగా అరెస్టు చేశారు. ఈ ఘటనతో పోలీసుల వైఖరిపట్ల దళిత సంఘాలు, వర్గాల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చింతమనేని దిష్టిబొమ్మతో పాటు టీడీపీ జెండాలను దళితులు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కోర్టుకు తీసుకెళ్లకుండా డ్రామాలాడుతున్న పోలీసులు కత్తుల రవిని ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ నుంచి కోర్టుకు తరలించడంలో కూడా పోలీసులు హైడ్రామా నడుపుతున్నారు. పోలీసులు, రవిని జీపులో కోర్టుకు తీసుకెళ్లకుండా గంట సేపటి నుంచి ఊరంతా తిప్పుతున్నారు. మీడియా, వైఎస్సార్సీపీ నేతల కళ్లబడకుండా ఏలూరు వీధుల్లో, సందుల్లో నాటకీయంగా తిప్పుతూ టీడీపీకి అనుకూలంగా డ్రామాలాడుతున్నారు. పోలీసుల వైఖరితో రవి కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. వినాశకాలే ‘విప్’రీత బుద్ధి చింతమనేని వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ.. చింతమనేనికి చంద్రబాబు మద్దతు! -
చింతమనేని వీడియో షేర్ చేశారంటూ..
-
చింతమనేని ఎఫెక్ట్: కత్తుల రవి జైన్ అరెస్ట్
సాక్షి, పశ్చిమగోదావరి : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కనీసం కేసు కూడా నమోదు చేయని పశ్చిమ పోలీసులు.. ఆయన తీరును నిరసించినందుకు దళితులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. దళితుల గురించి అసభ్య పదజాలం ఉపయోగిస్తూ చింతమనేని మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, దళిత నేత కత్తుల రవి జైన్‌ను పెదపాడు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో దళిత సంఘాలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రవిని వెంటనే విడిచి పెట్టకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.(మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు) కాగా ‘దళితులు.. మీకెందుకురా రాజకీయాలు’ అంటూ దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని దళిత వర్గాన్ని తీవ్రంగా అవమానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేయాలంటూ దళిత నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అయితే తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ చింతమనేని ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం వెంటనే స్పందించారు. ఆయన వీడియోను షేర్ చేశారంటూ రవిని అరెస్టు చేశారు. పోలీసుల పక్షపాత వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ల అండ చూసుకుని రెచ్చిపోతున్న చింతమనేనికి పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారంటూ ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి(మరోసారి రెచ్చిపోయిన చింతమనేని.. ఉద్రిక్తత) జూపూడి, కారెం శివాజీలపై దళితుల ఆగ్రహం చింతమనేని ప్రభాకర్ వైఖరిని నిరసిస్తూ దళిత సంఘాలు తణుకులో ఆందోళన చేపట్టాయి. చింతమనేని అరెస్టు చేయాలంటూ తణుకు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగాయి. ఈ సందర్భంగా చింతమనేని వ్యాఖ్యలపై స్పందించని జూపూడి, కారెం శివాజీలపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల ధర్నాకు వైఎస్సార్ సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు మద్దతుగా నిలిచారు. ఆయన కూడా ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు.(చింతమనేనిపై భగ్గుమన్న దళితులు) -
వైఎస్సార్సీపీలో చేరినందుకు బహిష్కరణ
తిరుపతి రూరల్/చంద్రగిరి: దళితులను ఉద్దేశించి పిచ్చముం..కొడకల్లారా, మీకు ఎందుకురా రాజకీయాలు అంటూ ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే చేసిన వాఖ్యలు, వాడిన అసభ్యకర పదజాలం, కించపరిచిన విధానం చూశాం. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యాలను మనం విన్నాం. దళితులకు పరిశుభ్రతే తెలియదంటూ అగౌరవపరిచిన మంత్రి మాటాలనూ విన్నాం. అన్ని పోస్టుల్లోనూ తన సామాజికవర్గం మనుషులే ఉండాలనుకుంటున్న ముఖ్యమంత్రి పరిపాలనను చూస్తున్నాం. నేడు మన కులంవాళ్లు వేరే పార్టీలో ఉంటారా? అది మన కులం కట్టుబాట్లకు వ్యతిరేకం అంటూ కుల దురహంకారులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగళిపట్టు గ్రామానికి చెందిన జాగర్లమూడి దామోదర్ నాయుడు, ఆయన భార్య భారతి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దామోదర్ నాయుడు ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో గ్రామంలో అదే సామాజికవర్గానికి చెందిన కొందరు వ్యక్తులు రచ్చబండ వద్ద పంచాయితీ పెట్టారు. ‘‘మన కులపోళ్లు వేరే పార్టీలోకి వెళ్తారా? మన కులానికి చెందిన పార్టీలో తప్ప ఇంకో పార్టీలోకి వెళ్తే గ్రామ బహిష్కరణ తప్పదు’’ అంటూ హెచ్చరించారు. ‘‘నేను, నాతోపాటు మీరు ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో రుణమాఫీతో ప్రయోజనం పొందాం. తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మన ఊరంతా సిమెంట్ రోడ్లు వేయించినప్పుడు కులం గుర్తుకురాలేదా? రుణమాఫీ చేసుకున్నప్పుడు కులం గుర్తుకు రాలేదా? మంచి పనులు చేయించుకున్నప్పుడు రాని కులం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఇదేక్కడి న్యాయం? ఇవేం కట్టుబాట్లు’’ అని దామోదర్‌నాయుడు ప్రశ్నించారు. దాంతో మరింత కోపోద్రిక్తులైన కుల దురంహకారులు దాడికి తెగబడ్డారు. దామోదర్‌నాయుడు, ఆయన భార్య, పిల్లలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇంట్లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. తర్వాత వారిని గ్రామం నుంచి బహిష్కరిస్తూ కులపెద్దలు హుకుం జారీ చేశారు. రేషన్ సరుకులు కట్ చేయాలని, తాగునీరు సైతం సరఫరా చేయకూడదని, మన కులపోళ్లు ఎవరూ వారితో మాట్లాడకూడదని, ఎవరైనా మాట్లాడితే ఇదే శిక్ష తప్పదని హెచ్చరించారు. మేలు చేసిన వారికి కృతజ్ఞతగా ఉంటే తప్పేంటి అన్నందుకు దామోదర్ నాయుడు కుటుంబానికి రూ.4,000 అపరాధం విధించారు. బాధితులపై పోలీసుల తిట్ల పురాణం తమపై దాడి చేసి, గ్రామం నుంచి బహిష్కరించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దామోదర్‌నాయుడు కుటుంబ సభ్యులు బుధవారం చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని ప్రాధేయపడ్డారు. పోలీసులను తీసుకుని గ్రామానికి వెళ్లారు. మార్గమధ్యంలో పోలీసులకు అధికార పార్టీ నేతల నుంచి ఫోన్‌కాల్స్ రావడంతో వారు యూటర్న్ తీసుకున్నారు. ‘‘రెండు నెలలపాటు గ్రామం వదిలిపోతే తప్పేంట్రా నా కొ....ల్లారా’’ అంటూ తిట్ల పురాణం అందుకున్నారు. ఒకవైపు కులదురంహకారుల దాడి, గ్రామ బహిష్కరణ, మరోవైపు పోలీసుల తిట్లతో భయకంపితులైన దామోదర్‌నాయుడు కుటుంబం తమను ఆదుకోవాలంటూ చంద్రబాబు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఆశ్రయించింది. వెంటనే కేంద్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిద్దామని, మీకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పార్టీల పేరుతో కుల బహిష్కరణలు, గ్రామ బహిష్కరణలు, జరిమానా విధించడం వంటి ఘటనలపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు రక్షణ కల్పించిన పోలీసులు వారినే బెదిరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చింతమనేనిపై చర్యలు తీసుకోని పక్షంలో..
సాక్షి, పశ్చిమ గోదావరి : ‘మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలు’ అంటూ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే చింతమనేనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు, రాజకీయ నాయకులు నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలకు దిగారు. పీవీ రావు మాల మహానాడు రాష్ట్రాధ్యక్షుడు గుమ్మారపు సూర్యవరప్రసాద్ ఆధ్వర్యంలో పాలకొల్లులోని గాంధీ బొమ్మల సెంటర్లో బుధవారం రాస్తారోకో చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి చింతమనేనిపై కేసు నమోదు చేయాలని సీఐ ఆదిప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. అనతరం మీడియాతో మాట్లాడారు. (మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం.. దళిత వ్యతిరేకి, కుల అహంకారి అయిన ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చెయ్యాలి. దళిత జాతిని కించపరస్తూ.. మీకు పదవులు ఎందుకు రా.. అని ఎమ్మెల్యే మాట్లాడటం చాలా హేయమైన చర్య. చింతమనేనిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలి. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం’ అని దళిత నాయకులు హెచ్చరించారు. ‘ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారేం శివాజీ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ దళితులపట్ల ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండించక పోవడం చాలా సిగ్గు చేటు. మాపై నిజమైన ప్రేమ ఉంటే కారెం శివాజీ, జూపూడి లిద్దరూ కూడా తక్షణమే తమ పదవులకి రాజీనామా చేయడంతో పాటు టీడీపీని వీడి బయటకు రావాలి’ అని సూర్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. -
దళితులపై ఎమ్మెల్యే చింతమనేని తీవ్ర వ్యాఖ్యలు
-
రాజకీయాలు మాకు మీకెందుకురా..
-
దళితులు.. మీకెందుకురా రాజకీయాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ సాక్షి, అమరావతి: మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలంటూ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు వెనుకబడిన వారు.. షెడ్యూల్ క్యాస్ట్ వారంటూ ఇష్టమొచ్చినట్లు తనదైన శైలిలో దూషించారు. రాజకీయాలు మాకుంటాయి.. పదవులూ మాకేనంటూ తన అహంకారం ప్రదర్శించారు. ‘మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా కొట్లాట’ అంటూ అసభ్య పదజాలంతో దళితులను కించపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. గత నెల మొదటివారంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన ‘జన్మభూమి–మా ఊరు’ కార్యక్రమంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ దళితుడు తాను మాట్లాడతానని మైక్ అడగడంతో చింతమనేని ఆగ్రహంతో ఊగిపోయారు. అసభ్య, అభ్యంతరకర పదజాలంతో దళితులపై విరుచుకుపడ్డాడు. ‘మొన్న జగన్మోహన్రెడ్డి వచ్చినప్పుడు నేను కావాలంటే అడ్డుకునేవాడిని కదా.. నేను మాట్లాడానా.. అప్పుడు గొడవ పడితే మీరు రారా..’ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు వీడు మాట్లాడతానంటూ మైక్ అడుగుతున్నాడంటూ చింతమనేని మండిపడ్డారు. ‘రాజకీయంగా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు దళితులు. మీరు వెనుకబడిన వారు. మీరు షెడ్యూల్ క్యాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయి. మాకు పదవులు. మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా కొట్లాట..’ అంటూ చింతమనేని దళితులను ఇష్టారీతిన దూషించి అవమానించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో చింతమనేని వివక్షపూరిత వ్యాఖ్యలపై దళిత సంఘాలు నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. తామంటే టీడీపీ నాయకులకు ఇంత చిన్నచూపా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అంత నీచంగా కనిపిస్తున్నామా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ వివక్ష పూరిత వ్యాఖ్యలు చేయడాన్ని గుర్తు చేస్తూ.. వాళ్ల అధినేతే అలా ఉన్నప్పుడు టీడీపీ నాయకులు అంతకన్నా గొప్పగా ఉంటారని ఆశించడం అత్యాశే అవుతుందని వ్యాఖ్యానించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం దళితులు శుభ్రంగా ఉండరంటూ అవమానించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. రాష్ట్రంలో పథకం ప్రకారమే దళితులపై దాడులు జరుగుతున్నాయని, రాజకీయంగా అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. ముందు చింతమనేనని వెంటనే ఎమ్మెల్యే పదవికి అనర్హుడిని చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. తమను హీనంగా చూస్తున్న టీడీపీ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. నోరు అదుపులో పెట్టుకో.. చింతమనేని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడటం నేర్చుకో. పదవులెందుకంటూ దళితులను అవమానిస్తున్నావ్.. ఈ రోజు నువ్వు అనుభవించే పదవి.. దళిత మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పెట్టిన భిక్ష అనే విషయం మర్చిపోవద్దు. ఈ దేశంలో వేల సంవత్సరాలు పరిపాలన చేసిన చరిత్ర ఎస్సీ, ఎస్టీ, బీసీలకుంది. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎస్సీ, ఎస్టీ, బీసీలేనన్న వాస్తవం తెలుసుకో. ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోతే నీకు తగిన బుద్ధి చెబుతాం. – డాక్టర్ మెండెం సంతోష్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం అంత అంటరానివాళ్లమా.. దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాలను అవమానించేలా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతాం. దళితులు అంత అంటరాని వాళ్లా? మీకెందుకు పదవులు.. మేం పదవులెక్కి పెత్తనం చేస్తామంటూ చింతమనేని అహంకారంగా మాట్లాడటం దుర్మార్గం. గతంలో జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులను సైతం దుర్బాషలాడాడు. దళిత కార్మికుడు జాన్‌ను అకారణంగా కొట్టాడు. ఆయన ఎమ్మెల్యేనా లేదా రౌడీనా అనేది అర్థం కావడం లేదు. తనపై మూడు కేసులున్నాయని బహిరంగంగా ప్రకటిస్తున్నా చింతమనేని ప్రభాకర్‌ను ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయడం లేదో ప్రజలకు జవాబు చెప్పాలి. – ఆండ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దళితులను నీచంగా చూస్తారా.. దళితుల మనోభావాల్ని దెబ్బతీసిన చింతమనేని ఎమ్మెల్యే పదవిని స్పీకర్ రద్దు చేయాలి. లేదంటే గవర్నర్ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యేగా ఉండి ఒక బహిరంగ సభలో దళితులను కించపర్చడం దారుణం. దళితులను ఇంత నీచంగా చూస్తారా? రాష్ట్రంలో ఒక పథకం ప్రకారమే దళితులపై దాడులు జరుగుతున్నాయి. దళితులను రాజకీయంగా అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రపతిగా ఒక దళితుడు ఉన్న దేశంలో ఓ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. చింతమనేని ఎమ్మెల్యేగా ఉంటే అధికారులెవరూ కేసులు పెట్టరు.. విచారణ చేయరు. అందుకే వెంటనే ఆయన్ని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలి. చంద్రబాబు అండతోనే చింతమనేని రెచ్చిపోతున్నాడు. రేపట్నుంచి జిల్లా వ్యాప్తంగా చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం. రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తాం. – కొయ్యె మోషెన్‌రాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు దళితులను కించపర్చడం వల్లే ఇదంతా.. ముఖ్యమంత్రి చంద్రబాబే దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అనటం వల్లే టీడీపీ నేతలు కూడా దళితులను కించపరుస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డేమో దళితులు శుభ్రంగా ఉండరని అంటాడు. చింతమనేని ఏమో దళితులకు రాజకీయాలెందుకంటూ అవమానిస్తాడు. దళితులు టీడీపీ నేతల దగ్గర జెండాలు మోస్తూ బానిసలుగా బతకాలా? రాజ్యాధికా>రం అక్కర్లేదా? వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతాం. – నూకపెయ్యి సుధీర్‌బాబు, ఏలూరు పార్లమెంట్ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతమనేని తీరే అంత.. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ప్రజాప్రతినిధిలా కాకుండా రౌడీలా వ్యవహరిస్తూ.. నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటాడు. బహిరంగసభల్లో కూడా వందలాది ముందే.. పత్రికల్లో రాయడానికి వీల్లేని విధంగా ప్రజల్ని హీనంగా తిడుతుంటాడు. తన మాట వినలేదని గతంలో పెదవేగి ఎస్ఐపైనే దాడి చేశాడు. అటవీ అధికారి, మార్కెటింగ్ శాఖ అధికారులపైనా దాడులకు పాల్పడ్డాడు. తన ఇసుక దందాను అడ్డుకున్నందుకు అప్పట్లో మహిళా తహసీల్దార్ వనజాక్షిని జట్టుపట్టుకుని మరీ ఈడ్చేయడానికీ చింతమనేనే కారకుడు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం చింతమనేనినే వెనకేసుకువచ్చారు. దీంతో ఆయన ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. గుండుగొలను సెంటర్లో బందోబస్తు చేస్తున్న ఏఎస్సై, సీపీవోలపై దాడికి పాల్పడ్డాడు. తమ సమస్యలపై వినతిపత్రమిచ్చేందుకు వచ్చిన అంగన్వాడీ ఉద్యోగులను బూతులు తిడుతూ దాడికి తెగబడ్డాడు. దళిత కార్మికుడు జాన్‌ను అకారణంగా కొట్టాడు. ఇళ్ల స్థలాలు, పొలాల గొడవల పేరుతో ప్రతిరోజూ ఎవరోఒకరిని కొడుతూ, తిడుతూ రౌడీలా చెలామణి అవుతున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు అండ ఉండటంతో పోలీసులు ఏమి చేయలేని నిస్సహాయస్థితిలోకి వెళ్లిపోయారు. దెందులూరు నియోజకవర్గంలో ఓ మాఫియా కింగ్‌లా వ్యవహరిస్తున్నాడు. ఇసుక, మట్టి, చెరువులు, భూములు ఇలా అన్నింటినీ దోచేస్తున్నా అడిగే నాథుడే లేకుండా పోయాడు. రౌడీషీటర్ ప్రజాప్రతినిధి అవడం, ఆయనకు ముఖ్యమంత్రి వత్తాసు పలకడం ప్రజల దౌర్భాగ్యమంటూ ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. -
బాబు పాలనలో దళితులు అభివృద్ధికి నోచుకోలేదు
-
‘టీడీపీ నేతలు దోచుకుంటున్నారు’
సాక్షి, కర్నూలు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో దళితులు అణచివేతకు గురవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగర్జున విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో దళితులు అభివృద్ధికి, సంక్షేమానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమేనని గుర్తుచేశారు. కానీ నేడు టీడీపీ నేతలు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దోచుకుంటున్నారని ఆరోపించారు. దళితులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చంద్రబాబు హయంలో దళితులపై దాడులు జరుగుతున్న, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా.. దళిత మంత్రులు ఎందుకు ప్రశ్నించడంలేదని నిలదీశారు. దళితుల పట్ల చంద్రబాబు వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని.. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు వారు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
మీ కాళ్లు పట్టుకుంటాం.. ఓటు కల్పించండయ్యా
రామచంద్రాపురం: మీ కాళ్లు పట్టుకుంటాం, మీకు దణ్ణం పెడుతామంటూ దళితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు శ్రీరాములు ముందు బోరున విలపించారు. ముప్పై ఏళ్లుగా మా ఓట్లు అగ్రవర్ణాల వారే వేసుకుంటున్నారని వాపోయారు. రామచంద్రాపురం మండలానికి చెందిన ఆరు గ్రామాల దళితవాడల ప్రజలు తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలంటూ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంగళవారం శ్రీరాములు రెవెన్యూ, పోలీసు అధికారులను వెంటబెట్టుకుని వచ్చి గెరికచేనుపల్లి, బ్రాహ్మణకాల్వ దళితవాడల ప్రజలను కలిశారు. గెరికచేనుపల్లిలో కమ్మకండ్రిగ, రావిళ్లవారిపల్లి, కొత్తకండ్రిగ, గణేశ్వరపురం, కమ్మపల్లి, ఎన్ఆర్ కమ్మపల్లి, టీటీకండ్రిగ, పారకాల్వ పోలింగ్‌బూత్‌లలో ఓట్లు వేసుకోలేకపోతున్నామని దళితులు ఆయన దృష్టికి తెచ్చారు. అగ్రవర్ణాల వారు తమ పంచాయతీకి తాగునీటిని నిలిపివేశారని, శ్మశానానికి కూడా నోచుకోక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 3 కిలోమీటర్ల దూరం నడిచి రావిళ్లవారిపల్లికి వెళ్లినా వేలుపై ఇంకుముద్ర వేసి పంపిస్తున్నారే కానీ ఓట్లు వేయనీయడం లేదని బ్రాహ్మణకాల్వ గ్రామస్తులు వాపోయారు. 11.42 సెంట్ల భూమిని అగ్రవర్ణాల వారు ఆక్రమించుకుని గుడి కట్టనీయకుండా అడ్డుకుంటున్నారన్నారు. శ్రీరాములు స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో ఇంత దారుణమా అంటూ విస్తుపోయారు. దళితులను ఓటు వినియోగించకుండా అగ్రవర్ణాలు ఆపుతుంటే పోలీసులు, రెవెన్యూ వ్యవస్థలు ఏమి చేస్తున్నాయని ప్రశ్నించారు. ఓటు వేయనీయట్లేదంటే గ్రామ బహిష్కరణ చేసినట్లేనన్నారు. బాధితులకు తక్షణమే ఓటు హక్కు కల్పించాలని కోరారు. జేసీ మహేష్‌కుమార్ మాట్లాడుతూ బ్రాహ్మణకాల్వలో పోలింగ్‌బూత్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీరాములు వెంట ఆర్డీవో మల్లికార్జున, ఎమ్మార్వో జయరాములు, తదితరులు ఉన్నారు. -
వైఎస్సార్ సీపీ జెండా కట్టినందుకు..
సాక్షి, పెదపాడు: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. వైఎస్సార్ సీపీ జెండాను ఇంటిపై కట్టినందుకు ఓ వ్యక్తిపై కక్ష సాధింపునకు దిగారు. ప్రభుత్వ భూమిగా సాకు చూపి, ఆ వ్యక్తి ఇంటి స్థలంలో నుంచి రోడ్డు వేయించే పనికి పూనుకున్నారు. అడ్డుపడిన మహిళను పోలీసులు దౌర్జన్యంగా తోసివేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెం గ్రామానికి చెందిన పిట్టా విజయ్‌కుమార్, పిట్టా స్టీఫెన్‌కు తాతల కాలం నుంచి సంక్రమించిన స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. వారు వైఎస్సార్ సీపీపై అభిమానంతో ఇంటిపై వైసీపీ జెండా కట్టారు. దీంతో భగ్గుమన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరవర్గం.. ఆ స్థలం ప్రభుత్వానిదంటూ.. అధికారులపై ఒత్తిడి తెచ్చి రహదారి నిర్మించేందుకు పూనుకున్నారు. అందుకోసం అధికారులు ఇంటిని తొలగించేందుకు సిద్ధం కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే మరడాని రంగారావు తదితరులు ఘటనా స్థలానికి వెళ్లి ఎమ్మార్వోతో చర్చలు జరిపారు. రెండురోజులు గడువు ఇచ్చిన అధికారులు గురువారం తెల్లవారుజామున భారీ పోలీసు బందోబస్తుతో రంగంలోకి దిగి ఇంటి తొలగింపునకు చర్యలు చేపట్టారు. తొలగింపు పనులను అడ్డుకున్న విజయకుమార్ భార్య విజయకుమారిని పోలీసులు నెట్టివేయడంతో కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కోటగిరి శ్రీధర్, దెందులూరు నియోజకవర్గ ఇన్చార్జి కొఠారు అబ్బయ్య చౌదరి, అప్పనప్రసాద్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మొండెం ఆనంద్, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు పల్లెం ప్రసాద్ ఆమెను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడటం హేయమైన చర్య అని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. -
దళితులపై చింతమనేని కక్ష సాధింపు
-
దొడ్డిపట్లలో దళితులపై పోలీసులు అమానుషం
-
టీవీ చానళ్లలో ఆ పదం వాడకూడదు
న్యూఢిల్లీ: షెడ్యూల్ కులాలకు చెందిన వారి ప్రస్తావన వచ్చినప్పుడు దళితులు అనే పదాన్ని వాడకూడదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) టీవీ చానళ్లకు సూచించింది. ముంబై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంఐబీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ప్రవేటు శాటిలైట్ టీవీ చానళ్లకు ఈ నిబంధన వర్తించనుంది. వార్తాపత్రికలు, మ్యాగజైన్లు ఈ విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎంఐబీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఎంఐబీ ప్రవేటు చానళ్లకు రాసిన లేఖలో.. మీడియా దళితులు అనే పదానికి బదులు షెడ్యూల్ కులాలు అనే పదాన్ని వాడాల్సి ఉంటుందని తెలిపింది.దళిత్ అనే పదానికి బదులుగా రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ఇంగ్లిష్‌లో షెడ్యూల్ క్యాస్ట్ అని గానీ, దేశంలో ఇతర జాతీయ భాషల్లో దానికి సరిపడు అనువాదాన్ని గానీ వాడాల్సి ఉంటుందని.. అధికారిక లావాదేవీలకు, వ్యవహారాలకు, ధృవపత్రాలకు సంబంధించిన వాటిలో ఈ నిబంధన వర్తిస్తుందని కోర్టు తెలిపిందన్న విషయాన్ని ప్రస్తావించింది. కానీ ఈ సూచనలు పాటించకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటామనే దానిపై ఎంఐబీ స్పష్టతనివ్వలేదు. కాగా ప్రభుత్వ దస్త్రాల్లో, సమాచార మార్పిడిలో దళిత్ అనే పదం వాడకూడదనే పిటిషన్‌పై విచారణ జరిపిన ముంబై హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఈ మేరకు జూన్‌లో తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో దళితులు అనే పదానికి బదులు షెడ్యూల్ కులాలు వాడాలని మార్చి 15వ తేదీన సర్య్కూలర్ జారీ చేసింది. -
ఆ అరెస్టులే అసలైన కుట్ర
ఈ దేశంలో ఆదివాసీలను ఎన్కౌంటర్ల పేరుతో మట్టుబెట్టినప్పుడు, వారి హక్కులను కాలరాసినప్పుడు, వరవరరావు, గౌతం నవ్లఖా, ఆయనతో పాటు అరెస్టయిన వారు ఆదివాసీలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు కూడగట్టారు. నరేంద్రమోదీ హత్యకు సంబంధించి బయటపడిందంటున్న మావోయిస్టుల ఉత్తరం నిజమైంది కాదనీ, మానవహక్కుల, ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేయడానికి సృష్టించిన ఉత్తరమని పలువురు న్యాయకోవిదులూ, మేధావులూ ప్రకటించారు. అలాంటప్పుడు ఈ అరెస్టులకు కారణం ఉండాలి. మావోయిస్టులకు మద్దతునిచ్చేవారికి ఇలా హెచ్చరిక జారీచేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇదెంతమాత్రం వాంఛనీయం కాదు. హత్యలు, అత్యాచా రాలూ, అవమానాలూ భరిస్తూ ఉన్నంతకాలం ఏ విధమైన ఘర్షణ లేదు. సరిగ్గా ఇదే మహారాష్ట్రలో భీమా కోరేగావ్ స్ఫూర్తియాత్ర సందర్భంగా జరిగిన ఘటనలకు వర్తిస్తుంది. పీష్వాల అకృత్యాలు సహిం చిన మహార్, చమార్ లాంటి నాటి అంటరాని కులాలు 1818 జనవరి 1న ప్రతిఘటనా దాడికి పూనుకున్నాయి. కేవలం అయిదు వందల మంది కొన్నివేల మంది పీష్వా సైన్యాన్ని మట్టుబెట్టారు. ఇది చరిత్ర. అలాంటి విజయగాథను మననం చేసుకొని, స్ఫూర్తి పొందడానికి లక్షలాది మంది దళితులు దేశం నలుమూలల నుంచి కోరేగావ్ జైత్రయాత్రకు బయలుదేరారు. భీమా నదికి దక్షిణం వైపున ఉన్న భీమాకోరేగావ్ స్తూపం వద్ద దళితులు ఎంతో ప్రశాంతంగా పది కిలోమీటర్లకు పైగా నడిచివెళ్లి నివాళులర్పించారు. భీమా నదికి రెండోవైపు అంటే ఉత్తరం వైపు భీమాకోరేగావ్ యాత్రకు కదలివస్తోన్న దళితులపై దాడి జరిగింది. వధూబద్రుకా గ్రామంలో కొంత మంది ఆధిపత్య కులాలు కాషాయజెండా లతో, ఇనుపరాడ్లు, రాళ్లతో పొలాల్లో దాగి దాడికి దిగారు. ఊహించని ఈ దాడికి తట్టుకోలేని దళితులు చెల్లాచెదురయ్యారు. అక్కడ ఉన్న వాహనాలను తగు లబెట్టారు. ఈ గ్రామాల అగ్రకులాలకు తోడుగా పొరుగున ఉన్న సన్నావాడి, శిఖరాపూర్ గ్రామాల ఆధిపత్య కులాలు దాడిలో భాగమయ్యాయి. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాహుల్ పతంగే ఆసుపత్రిలో మరణించారు. ఈ దాడి హఠాత్తుగా జరిగింది కాదని, ముందస్తు పథకం ప్రకారమే జరిగిందని స్థానికులు చెప్పారు. రెండు రోజుల ముందే డిసెంబర్ 29న వధూబద్రుకా గ్రామంలో అక్కడి దళితులు నిర్మిం చుకున్న ఒక అమరవీరుని సమాధిని ఆధిపత్య కులాలు కూల్చివేశాయి. అంతకు ముందు మూడు నెలలుగా భీమాకోరేగావ్ విజయయాత్రపై చర్చ జరుగుతోంది. భీమాకోరేగావ్ దళితులు తలెత్తుకొని నిలబడటం ఆధిపత్య కులాలకు కంటగింపుగా తయారైంది. అదే ఈ దాడికి కారణం. దీనికిపై దేశంలోని అనేక ప్రాంతాలు నిరసనలతో భగ్గుమ న్నాయి. మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లోని దళితులు, ఆదివాసీలు రాష్ట్రం మొత్తాన్ని దిగ్బంధనం చేశారు. ముంబైని స్తంభింపజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేలాది మంది దళిత యువకులు భీమా కోరేగావ్ జైత్రయాత్ర సందర్భంగా జరిగిన దాడిని ప్రతిఘటించడం మనకు కనిపిస్తుంది. పూనా– ముంబై ప్రాంతమే కాకుండా మరాఠ్వాడా, విదర్భ లాంటి ప్రాంతాలు కూడా అట్టుడికిపోయాయి. ఈ ప్రతిఘటనను అణచడానికి వేలాది మంది పోలీ సులను రంగంలోకి దింపారు. కానీ రాహుల్ పతం గేని హత్య చేసిన సంభాజీ భీడే, మిలింద్ ఎగ్బోటేను మాత్రం అరెస్టు చేయలేదు. ఈ విషయమై పార్ల మెంటులో సైతం చర్చ జరిగింది. తర్వాత కేవలం మిలింద్ ఎగ్బోటేను మాత్రమే అదుపులోకి తీసుకొని బెయిల్‌పై విడిచిపెట్టారు. హిందూ సంఘ నాయ కుడు సంభాజీ భీడేను ఇప్పటి వరకు అరెస్టు చేయ లేదు. విచారించనూ లేదు. ఈయన ప్రధాని నరేంద్ర మోదీ గురువు అంటారు. మరో విచిత్రం ఏమిటంటే జనవరి ఒకటవ తేదీన హత్యకు గురైన దళిత యువ కుడు రాహుల్‌ని చంపింది హిందూ సంఘ కార్య కర్తలు కాదని, దళిత యువకులే హత్యచేశారని పోలీ సులు మరో కథ అల్లారు. సుప్రీం ఆదేశంతో దళితుల్లో ఆందోళన మహారాష్ట్రలో ఈ ఉద్యమ జ్వాలలు చల్లారకముందే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ప్రభు త్వోద్యోగులనూ, ఇతరులనూ ముందస్తుగా అరెస్టు చేయకూడదని మార్చిలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పరిణామం దేశంలోని మొత్తం దళితులను ఆందో ళనకు గురిచేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, బిహార్, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో దళితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏప్రిల్ రెండున దళిత సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ దళిత ఉద్యమ శక్తిని నిరూపించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకకంఠంతో దళితులు సుప్రీంకోర్టు తీర్పుని నిరసించారు. భారత్ బంద్ సందర్భంగా ఉత్తరప్రదేశ్, మ«ధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వందలాది యువకులు అరెస్టయ్యారు. రోడ్ల మీదకు వచ్చిన యువతీయువ కులను వారి కులం పేరు అడిగి మరీ వ్యాన్లలోకి ఎక్కించి జైళ్ళలోకి తోశారు. ఈ రెండు సంఘటనలతో ఖంగుతిన్న కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ∙ఉద్య మాన్ని అణచివేయాలని ఆలోచించింది. నేరుగా దళి తులను లక్ష్యంగా చేసుకుని నిర్బంధం ప్రయోగిస్తే ఎన్నికల్లో తమకు వ్యతిరేక ఫలితాలు వస్తాయని భావించిన పాలకులు దానికి మరో మార్గం అన్వే షించారు. అందుకు భీమాకోరేగావ్ హింసాకాండ అనే పదం సృష్టించారు. మీడియా ద్వారా దీన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఎల్గార్‌పరిషత్ జరిపిన సమా వేశాన్ని దానికి మద్దతుగా చూపించారు. భీమా కోరే గావ్ ద్విశత వార్షికోత్సవ స్ఫూర్తియాత్ర సందర్భంగా కొన్ని ప్రజాసంఘాలు కలిసి డిసెంబర్ 31న పుణే లోని శనివార్వాడలో సభ ఏర్పాటు చేశాయి. కోరే గావ్ స్ఫూర్తి కొనసాగించాలనే లక్ష్యంతో ఈ సభను ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు ముందే చెప్పారు. గుజరాత్ దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ, జేఎ న్యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్, రోహిత్ వేముల తల్లి రాధిక సహా కొంత మంది దళిత నాయకులు ఈ సభకు హాజరయ్యారు. జనవరి ఒక టిన దళితులపై దాడి తర్వాత జరిగిన దళితుల నిరసన ప్రదర్శనలకు ఈ సభకు సంబంధం ఉందని, ఎల్గార్ పరిషత్ సభలో చేసిన ఉపన్యాసాలే హింసా కాండకు కారణమయ్యాయని పోలీసులు ముందుగా ప్రకటించారు. ఈ ఎల్గార్ పరిషత్ సభలకు ఆర్థిక సహకారాన్నీ మావోయిస్టు్టలు అందించారని ప్రచా రం చేసిన పోలీసులు జూన్ నెలలో ఐదుగురు కార్య కర్తలను మావోయిస్టుల పేరుతో అరెస్టు చేశారు. దాడి చేసింది దళితులు కాదు! భీమాకోరేగావ్ జైత్రయాత్ర సందర్భంగా భీమా నదికి ఉత్తర భాగంలో దాడి చేసింది దళితులు కాదు. కాషాయజెండాలతో, ఇనుపరాడ్లు, రాళ్లతో దాడిచే సిన వారు స్థానిక ఆధిపత్య కులాల వ్యక్తులేనని పత్రికలూ, మీడియా ఘోషించాయి. ఒకవేళ ఎల్గార్ పరిషత్ ఉపన్యాసాలే హింసాకాండకు కారణమైతే భీమా నదికి దక్షిణ భాగంలో వెల్లువెత్తిన జనసంద్రం మొత్తం పుణేనే భస్మీపటలం చేయగలిగేది. కోరేగావ్ భీమా నదికి దక్షిణభాగంలో దళిత యువకుడు రాహుల్ హత్యానంతరం కూడా దళితులు హింసకు పాల్పడలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన తెలిపారు. లక్షలాది మంది దళితుల స్ఫూర్తికార్య క్రమాన్ని నిర్వహించింది అఖిల భారత సమతాసైనిక్ దళ్. ఎల్గార్ పరిషత్‌కు, భీమా కోరేగావ్ స్ఫూర్తి కార్యక్రమానికీ ఎలాంటి సంబంధమూ లేదు. ఎల్గార్ పరిషత్ సమావేశం జరిగింది డిసెంబర్ 31 సాయం త్రం. దళిత యువకుడు రాహుల్ హత్య జరిగిన గ్రామంలో డిసెంబర్ 29వ తేదీన దళితులు నిర్మిం చిన స్మారక చిహ్నాన్ని ఆధిపత్య కులాలు ధ్వంసం చేశాయి. అంటే ఆ సమావేశానికి ముందే దళితులపై పరోక్ష దాడులు ప్రారంభమయ్యాయి. ఎలాంటి ఆధారంలేని ఎల్గార్ పరిషత్ కార్య క్రమాన్ని ఆసరా చేసుకొని మానవ హక్కుల సంఘాలు, పౌరహక్కుల సంఘాల నాయకులపైన పోలీసులు దాడులు చేశారు. ఆ దాడుల్లో ప్రధాని మోదీని హత్యచేయడానికి కుట్ర పన్నుతున్నారన డానికి ఆధారం లభ్యమైందని పోలీసులు ఢిల్లీలోని రోమా విల్సన్ గది నుంచి ఒక ఉత్తరం దొరికినట్టు ప్రకటించారు. ఇదే సందర్భంగా ముంబైలో సుధీర్ ధవలేను, నాగ్‌పూర్‌లో సోమాసేన్, మహేష్ రావత్, సురేంద్ర గాడ్లింగ్‌ను ఏప్రిల్ 17న అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో విరసం నేతlవరవరరావు, ఢిల్లీలో న్యాయవాది, పౌర హక్కుల నాయకుడూ, జర్నలిస్టు, రచయిత గౌతం నవ్లఖా, ఫరీదాబాద్‌లో సుధా భరద్వాజ్, రాంచీ నుంచి ఆదివాసీ హక్కుల నాయ కుడు స్టాన్ స్వామి, ముంబై నుంచి అరుణ్ ఫెరీరాను అరెస్టు చేశారు. ఏప్రిల్ 2న భారత్ బంద్ తర్వాత ఈ అరెస్టులు జరగడం, దానికి భీమాకోరే గావ్‌ను ముడి పెట్టడం చూస్తే ఈ చర్యల వెనుక దాగి ఉన్న కుట్ర బహిర్గతమవుతోంది. విప్లవకవి వరవరరావు అరవై ఏళ్లుగా విప్లవో ద్యమంలో ఉంటూ ప్రజాఉద్యమాల్లో మమేకమ య్యారు. ఆదివాసీల పక్షాన పోరాడుతున్నారు. ధిక్కారస్వరమైన వరవరరావుని బయటలేకుండా చేయడమే లక్ష్యంగా ఈ అరెస్టుల తతంగం జరిగిం దన్నది వాస్తవం. ఈ దేశంలో ఆదివాసీలను ఎన్ కౌంటర్ల పేరుతో మట్టుబెట్టినప్పుడు, వారి హక్కు లను కాలరాసినప్పుడు, వారిపై అత్యాచారాలు చేసి నప్పుడు వరవరరావు, గౌతం నవ్లాఖా, ఆయనతో పాటు అరెస్టయిన వారు ఆదివాసీలకు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు కూడగట్టారు. నరేంద్రమోదీ హత్యకు సంబంధించి బయట పడిందంటున్న మావోయిస్టుల ఉత్తరం నిజమైంది కాదనీ, మానవహక్కులు, ప్రజాసంఘాల నాయ కులనూ అరెస్టు చేయడానికి సృష్టించిన ఉత్తరమని పలువురు న్యాయకోవిదులూ, మేధావులూ ప్రకటిం చారు. అలాంటప్పుడు ఈ అరెస్టులకు కారణం ఉండాలి. మావోయిస్టులకు సమాజంలో మద్దతు నిచ్చేవారికి ఇలా హెచ్చరిక జారీచేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇంకా దళితులు, ఆదివాసీలు పోరాడుతోంటే వారికి మావోయిస్టులతో సంబంధాలను అంటగట్టి అణచివేయడం కూడా రెండో ప్రయోజనంగా భావి స్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్లో భీం ఆర్మీ ఉద్యమానికి మావోయిస్టుల అండ ఉందనే నెపంతో ఆ సంస్థ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్‌ని ఏడాదికి పైగా జైల్లో పెట్టారు. దళితులు, ఆదివాసీలు ఎదురు తిరిగినప్పుడల్లా వారిని ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా ముద్ర వేస్తున్నారు. ఇదెంత మాత్రం వాంఛనీయం కాదు. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 మల్లెపల్లి లక్ష్మయ్య -
రాపూరు ఎస్సైను అరెస్ట్ చేయాలి: దళితులు ఆందోళన
-
‘మోదీ రాజ్యంలోదళితుల స్థానం ఎక్కడ?’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యంలో దేశంలోని దళితులు, గిరిజనులు, మైనారిటీల స్థానం ఎక్కడుందో చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ప్రశ్నించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దళితులను ఎలా విస్మరించారో అలాగే ప్రస్తుతం మోదీ ప్రభుత్వం వెళుతోందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సవరణ బిల్లు–2018పై జరిగిన చర్చలో బాల్క సుమన్ ప్రసంగించారు. మోదీ రాజ్యంలో దళితులు, గిరిజనులు, మైనారిటీల స్థానం ఎక్కడో ఆయన మన్‌కీబాత్‌లో చెప్పాలని హితవు పలికారు. గత పదేళ్లలో దళితులపై దాడులు 66 శాతం పెరిగాయని, ప్రతి 15 నిమిషాలకో దాడి, రోజూ ఆరుగురు దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటిది ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టులను, కేసుల నమోదు నిబంధనలను సుప్రీం కోర్టు సడలించడం తనను తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి దళితుల పక్షాన కేంద్రం నిలవాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. 27 ఏళ్ల కింద ఉమ్మడి ఏపీలోని చుండూరులో 13 మంది దళితులను ఊచకోత కోస్తే ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదని వాపోయారు. అలాంటిది ప్రస్తుతం సమాజంలో కొందరు రిజర్వేషన్లు దేనికి అని ప్రశ్నించడం బాధాకరమన్నారు. దేశంలోని దళితులు అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం పొంది, సమానత్వంతో ఉన్నామన్న భావన కలిగే దాకా రిజర్వేషన్లు ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టానికి సంబంధించి వివాదాస్పద తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో ఒకరిని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చైర్మన్‌గా నియమించడాన్ని తప్పుబట్టారు. మోదీ ప్రభుత్వానికి దళితులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్జీటీ చైర్మన్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే న్యాయవ్యవస్థ ఉన్నత హోదాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని పేర్కొన్నారు. పార్లమెంట్‌కే పోటీ చేస్తా: బూర సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, ఎయిమ్స్ ఏర్పాటు అయిన తర్వాత మొదటి ఆపరేషన్ చేయాలని ఉందని వెల్లడించారు. రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్రమోదీని కాకుండా, బీసీలని ఆలింగనం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో తోక పార్టీగా మారిందని, బీసీలకు అన్యాయం చేస్తే అదికూడా మిగలదన్నారు. భారతదేశంలో బీసీలు 50 శాతంపైగా ఉన్నారని, బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
మూకహత్యలకు రాజకీయాలే దన్ను
హాపూర్, ధూలే, మాల్డా, పులికాట్, హజారీబాగ్. దేశంలోని ఈ పట్టణాల పర్యటన కోసం వాటి పేర్లు ఇక్కడ రాయడం లేదు. నవ భారతంలో ప్రజలు సిగ్గుపడే ఘటనలు అంటే మూకహత్యలు ఈ ఊళ్లలో జరిగాయి. హిందూస్తాన్ లోని పట్టణాలు ఇలాంటి హత్యలకు అనువైన ప్రదే శాలుగా మారిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో పశువుల వ్యాపారి రక్బర్ ఖాన్ మూకల దాడిలో మర ణించాడు. 2010 నుంచీ దేశంలో మొదలైన మూక హత్యల్లో ఇది 87వది. అడ్డూఅదుపూ లేని మూకల దాడుల్లో ఇప్పటి వరకూ జరిగిన దాడుల్లో 34 మంది ప్రాణాలు కోల్పోగా, 240 మంది గాయపడ్డారు. 2014 మేలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి నప్పటి నుంచీ 98 శాతం మూకహత్యలు జరిగాయి. ఇలాంటి సంఘటనల్లో 56 శాతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంభవించాయి. ఇలాంటి నేరాలను ఎప్పటి కప్పుడు నమోదు చేసి వివరాలు సేకరించే ఇండియా స్పెండ్ అనే వెబ్సైట్ ఈ విషయాలు వెల్లడించింది. చావులతో కూడా ఈ లెక్కలను గణాంకాల సేకర ణకు ఇవ్వడం లేదు. వివక్షతో విచ్చలవిడిగా ప్రవ ర్తించే మూకలు బలోపేతమౌతూ దేశాన్ని మధ్య యుగాల భారతదేశంగా మార్చుతున్నాయనే వాస్త వాన్ని ఇవి సూచిస్తున్నాయి. మత విద్వేషాలు పెరగ డంతోపాటు చట్టాన్ని అమలు చేయాల్సిన భారత ప్రభుత్వ వ్యవస్థలు అరాచక శక్తులతో రాజీపడటం వల్ల మనుషులు ఆదిమానవులుగా మారుతున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేప థ్యంలో ఈ హత్యలు ప్రారంభం మాత్రమేనని నేను భావిస్తున్నాను. ‘జనం గొడ్డు మాంసం తినడం మానేస్తే మూకహత్యలు ఆగిపోతాయ’ని ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ మాటలు ఈ విషయాన్నే నొక్కి చెబుతున్నాయి. ఇదే పద్ధతిలో మాట్లాడే హైదరాబా ద్‌కు చెందిన బీజేపీ ఎమ్యెల్యే టి. రాజా సింగ్ ‘మొదట గో హత్యల గురించి ఎందుకు ప్రశ్నిం చరు?’ అంటూ రెచ్చగొడుతున్నారు. ఆయన తన పోకడలను వ్యతిరేకించే వారికి ఇలా హెచ్చరిస్తున్నా రనే విషయం మనం మర్చిపోకూడదు. మూకహత్య నిందితులకు ఎమ్మెల్యే మద్దతు! స్థానిక ఎమ్మెల్యే మద్దతు తమకుందని రాజస్తాన్‌లోని ఆల్వార్ మూకహత్య కేసులో నిందితులు ప్రకటిం చుకున్నారని వార్తలొచ్చాయి. ఇలాంటి దుర్మార్గాలకు కేవలం రాజకీయ నేతలేగాక ప్రభుత్వ ఉన్నతాధికా రులు కూడా కారణమౌతున్నారు. ఫలితంగా, దేశం లోని అనేక ప్రాంతాల్లో మత విద్వేషాలతో నిండిపో తున్నాయి. హిందువులు కాని ఇతర మతాల ప్రజల రోజులు దగ్గరపడ్డాయనే ధోరణి ప్రబలిపోతోంది. ఆవుల రవాణా మూకహత్యలకు దారితీసే సంద ర్భాల్లో ఎలాంటి నాగరిక దేశంలోనైనా మొదట పశు వులను గోశాలలకు తరలించడాని కన్నా దాడిలో గాయపడిన మనుషులను ఆస్పత్రికి తరలించడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఆల్వార్ పోలీసులు ఇదే పని చేయడమేగాక, పొరపాటు జరిగిందని చెప్పారు. పశువుల వ్యాపారి పేరు రక్బర్ఖాన్ కావడమే అతని హత్యకు కారణమా? సమాజంలో వర్గ విద్వేషాలు ఉన్నప్పుడు వాటిని వివరంగా వెల్లడించాల్సిన బాధ్యత జర్నలిస్టులకు లేదు. అయితే, ఈ రకమైన ఊచకోతలు ఓ పథకం ప్రకారం జరుగుతున్నట్టు కనిపిస్తే మీడియా వాటి గుట్టు విప్పాల్సిన అవసరం తప్పక ఉంటుంది. ఈ మూక హత్యల్లో మతపరమైన అంశం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, ఇలాంటి దాడు లకు గురైన వారిలో 56 శాతం, బాధితుల్లో 88 శాతం ముస్లింలేనని ఇండియా స్పెండ్ సంస్థ వెల్లడించింది. ఈ నెలలోనే ఉత్తర కర్ణాటకలోని బీదర్‌లో హైదరా బాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహ్మద్ ఆజంను పిల్లలను ఎత్తుకుపోయే వ్యక్తిగా అనుమానించి అప్ప టికప్పుడు గుమిగూడిన జనం కొట్టి చంపారు. ఇలాంటి మూకల దాడుల్లో గోసంరక్షకులైనా లేదా సాధారణ జన సమూహాలైనాగాని ముస్లింలనే పట్టుకు చంపుతున్నారని మలక్‌పేట్ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా అన్నారు. ‘‘ మూకహత్యల పేరుతో ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఈ సంఘటనలు సూచిస్తు న్నాయి. వీటి వెనుక ఉన్నది హిందుత్వ శక్తులే’’ అని ఆయన ఆరోపించారు. కాని, మహ్మద్ ఆజం హత్యలో మతం పాత్ర లేదని బీదర్ ఘటన గురించి తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. దాడి సందర్భంలో 9మంది పోలీసులు ఆజంను, అతని స్నేహితులిద్ద రినీ రెండు వేల మందికిపైగా ఉన్న మూకనుంచి కాపాడటానికి గట్టి ప్రయత్నమే చేశారు. ఆల్వార్‌లో పోలీసులే ఏం చేసిందీ పైన చెప్పాను. ఆల్వార్ వంటి ఘటనలు పరిశీలిస్తే, బలాలా చెప్పింది మనకు ఇబ్బంది కలిగించే వాస్తవమని గుర్తించక తప్పదు. హాపూర్‌లో జరిగిందే బీదర్‌లోనూ ! దాడికి గురైనవారిని ఎలా చూశారనే విషయానికి వస్తే హాపూర్ ఘటన బీదర్‌లో పునరావృతమైంది. బీదర్‌లో దుండగులు టెకీ ఆజం కుడి చేతికి తాడుకట్టి ముఖాన్ని నేల మీద ఈడ్చుకుంటూ పోయారు. ఆ సమయంలో మూకలు అతన్ని కొడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఆజం కొన్ని నిమిషాల తర్వాత ఆస్పత్రికి తీసుకెళుతుండగా ప్రాణాలు విడిచాడు. జూన్ నెలలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్‌లో పశువుల వ్యాపారి ఖాసింను ఇదే తీరులో కొట్టి చంపారు. ప్రాణంపోయాక అతని మృత దేహాన్ని పోలీస్ జీపు దగ్గరికి జనం ఈడ్చుకుంటూ పోతుండగా, ముగ్గురు పోలీసులు వారితో పాటు నడిచారేగాని మరణించినవారి శరీరాలను పద్ధతిగా చూడాలనే స్పృహ వారిలో కలగలేదు. మూకలు ఖాసింను ఆవును మాంసం కోసం చంపే వ్యక్తి అని ఆరోపించగా, బీదర్‌లో ఆజంను పిల్లలను తన కారులో అపహరించుకుపోతున్న దొంగగా ముద్రవే శారు. ఇండియాలో 2018లో నోటి మాటగా లేదా వాట్సాప్ సందేశం ద్వారా వ్యాప్తిచేసే అబద్ధాలు అరాచక మూకలు మనుషుల ప్రాణాలు తీయడానికి తోడ్పడుతున్నాయి. ఇలాంటి మూకహత్యలపై ప్రభు త్వాలు స్పందించే తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మూకహత్యల నివారణకు కొత్త చట్టం చేయాలని పార్లమెంటును సుప్రీంకోర్టు కోరినా ఈ దిశగా కేంద్రం ఓ కమిటీ వేయడం మినహా చేసిందేమీ లేదు. శాంతి, భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశ మని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. జార్ఖండ్‌లోని రాంగఢ్‌లో ఓ ముస్లిం మాంసం వ్యాపా రిని కొట్టి చంపిన కేసులో దోషులుగా తేలిన ఏడుగురు హంతకులను కేంద్ర పౌరవిమానయాన మంత్రి జయంత్ సిన్హా సన్మానించారు. ‘ప్రధాని మోదీకి ప్రజాదరణ పెరగడం వల్లే ఇలాంటి మూక హత్యలు జరుగుతున్నాయని మరో కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ చెప్పడం మరీ దారుణం. ‘‘మోదీకి జనాదరణ పెరిగేకొద్దీ ఇలాంటి ఘటనలు జరుగుతాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవార్డులు వెనక్కి ఇచ్చేశారు. యూపీ ఎన్నికలప్పుడు మూకహత్యలు జరిగాయి. 2019 ఎన్నికల సమయంలో మరోటి మొదలవుతుంది’’ అని మేఘవాల్ వివరించారు. పథకం ప్రకారం చేసిన ఇలాంటి దారుణ హత్యలను ఎన్నికల పేరు చెప్పి ఈ బీజేపీ నేత సమర్ధించడం నిజంగా ఆందోళనకరం. బీజేపీ, కాంగ్రెస్ ‘నువ్వంటే–నువ్వు’ ఈ ఘటనలపై పాలకపక్షమైన బీజేపీ ప్రతినిధులు స్పందిస్తూ, కాంగ్రెస్ పాలనలో జరిగిన ఇలాంటి దారుణాల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ‘‘1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచ కోత, అస్సాంలో 1983 నాటి నెల్లీ మూకుమ్మడి హత్యాకాండ, 1947 దేశ విభజనలో జరిగిన హిందూ, ముస్లింల ఊచకోతలు కాంగ్రెస్ పాలనలో జరిగినవే కదా’’ అంటే ఇప్పటి దారుణాలను సమ ర్థించుకుంటున్నారు. అయితే, ఇది బీజేపీ–కాంగ్రెస్ మధ్య వాదన లేదా మాటల యుద్ధం కాదనే విషయం ఈ రెండు పార్టీలు మరిచిపోతున్నాయి. దేశ ప్రజలే రెండు వర్గాలుగా చీలిపోవడంతో జరుగు తున్న హత్యలివి. ఆవుల అక్రమ రవాణాదారు అనే ముద్రవేసి ప్రాణాలు తీసే క్రీడ ఇది. ఇలాంటి ఘట నలపై దర్యాప్తు చేసి, సత్యం ఏమిటో తేల్చాల్సిన వారు ఆ పనిలో విఫలమవుతున్నారు. కిందటేడాది ఏప్రిల్‌లో ఆల్వార్లోనే ఓ మూక చేతుల్లో మరణిం చిన పాల వ్యాపారి పెహ్లూ ఖాన్ ప్రాణాలు విడిచే ముందు తనపై దాడి చేసిన ఆరుగురి పేర్లు చెప్పాడు. కాని, వారిపై సాక్ష్యాధారాలు లేవని దీనిపై దర్యాప్తు జరిపిన సీఐడీ పోలీసులు ఆ ఆరుగురినీ విడిచి పెట్టారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి హత్యలు జరగడం మనం దిగులు పడాల్సిన విష యం. తీవ్ర ఆవేశంతోనో లేదా బాగా రెచ్చగొట్ట డంతోనే ఒక మనిషిని మరో మనిషి చంపడం సాధారణంగా జరుగుతుంది. మూకలు ఇలాంటి అమానుష హత్యలకు పాల్పడుతున్నాయంటే అవి సంపాదించిన అడ్డగోలు ధైర్యమే ఇందుకు కారణం. ఆవులను చంపి మాంసం తినేవారికి సమాజంలో బతికే హక్కు లేదని మూకలకు నూరిపోసే పథకం ప్రకారం ఇలాంటి హత్యలకు మనుషులను సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారంతో కావాలని మామూలు వ్యక్తులను రాక్షసులుగా మార్చేస్తున్నారు. 15 ఏళ్ల జునేద్ఖాన్ కిందటేడాది జూన్‌లో ఇంట్లో ఈద్ జరుపుకోవడానికి తోబుట్టువులతో రైలులో హరియాణాలోని ఇంటికి వెళుతుండగా మూక చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు. హంతకులు అతని సోదరుల గడ్డాలు పట్టుకుని ఎగతాళి చేయడమేగాక, వారిని ఆవు మాంసం తినే వ్యక్తులని ముద్రవేశారు. ఎన్నికలకు ముందు ఇలాంటి హింసా కాండ ఫలి తంగా ప్రజలు రెండు వర్గాలుగా చీలి పోవడాన్ని తమకు ప్రయోజనకరంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతాయనే భయం పీడిస్తోంది. వీటిని కేవలం ట్విట్టర్లో ఖండించడం వల్ల ప్రయోజనం లేదు. మహాత్మాగాంధీ ‘హింద్ స్వరాజ్’ అనే గ్రంథంలో ‘‘ ఆవుపై నా గుండె నిండా ఎంత జాలి ఉన్నా–దాని ప్రాణం కన్నా నా సోదరుడిని కాపాడటానికే నా ప్రాణ త్యాగం చేస్తాను’’ అని రాసిన మాటలు ఈ సందర్భంగా మనకు గుర్తుకొస్తే మంచిది. ఇదే మనం ఆచరించాల్సిన నియమం కావాలి. కానీ, 2018లో ఈ మాటలు ఎవరికీ వినిపించవు, కనిపించవు. - టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
దళితుల కోసం జీవితం అంకితం
‘ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్’ అనే మాటను ఆచరణాత్మకంగా చేసి చూపారు సుధావర్గీస్. నారీ గుంజాన్ స్వచ్ఛంద సంస్థను స్థాపించి దళితులకు తన జీవితాన్ని అంకితం చేశారు. వారి వికాసం కోసం ఒకవైపు పాటుపడుతూనే మరోవైపు వారి హక్కుల సాధనే శ్వాసగా జీవనం సాగిస్తున్నారు. కేరళలోని కొట్టాయంకు చెందిన సుధా వర్గీస్ మూడు దశాబ్దాల కిందట బిహార్‌లో స్థిరపడ్డారు. ఈ రాష్ట్రంలో ముసహరాలుగా పిలిచే దళితుల వికాసమే లక్ష్యంగా ఆమె పని చేస్తున్నారు. యుక్తవయస్సులో ఉండగా బిహార్‌కు వెళ్లిన సుధకు అక్కడి కులవ్యవస్థ గురించి తెలిసింది అంతంతమాత్రమే. ఆరంభంలో ఆమెకు ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా వాటిని లెక్కచేయలేదు. భాష అర్థమవకపోవడంతో పట్టుదలతో మెల్లమెల్లగా నేర్చుకున్నారు. ముసహరాల హక్కులను కాపాడాలనే లక్ష్యంతో న్యాయవాద డిగ్రీ చదివారు. దీంతో న్యాయపరమైన అడ్డంకులను అధిగమించడం ఆమెకు మరింత సులువైంది. ఆ తర్వాత ముసహరాల సాధికారత కోసం చెమటోడ్చారు. 1987లో నారీ గుంజాన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దళిత మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించారు. 2005లో పట్నా శివారులోని దానాపూర్‌లో దళిత బాలికల కోసం ప్రత్యేకంగా ఓ పాఠశాల నెలకొల్పారు. దానికి ప్రేరణ అని నామకరణం చేశారు. ఆర్థిక సమస్యల కారణంగా కూలీకి వెళుతున్న బాలికలకు ఉచితంగా విద్యాబోధన చేశారు. నారీ గుంజాన్ సంస్థ ప్రస్తుతం బిహార్‌లోని ఐదు జిల్లాల్లో పనిచేస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 850 స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. ఈ గ్రూపులు అంగన్వాడీ పాఠశాలలనూ నడుపుతున్నాయి. వయోజన విద్యా కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఆమె అంకితభావం గురించి తెలియడంతో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ గయలోనూ ఇలాంటి పాఠశాలను నెలకొల్పాల్సిందిగా కోరారు. దానాపూర్, గయల్లోని రెండు పాఠశాలల్లో ప్రస్తుతం మూడు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరోవైపు నారీ గుంజాన్ సంస్థ యువతకు సంగీతం, క్రీడలు, నాట్యం, కళలు వంటి అంశాలపై శిక్షణ ఇచ్చింది. ఆయా విభాగాల్లో తర్ఫీదు పొందిన యువతీయువకులు దేశ, విదేశాల్లో నిర్వహించిన అనేకపోటీల్లో పాల్గొని సత్తా చాటారు. సుధ 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి పద్మశ్రీ పురస్కారం పొందారు. ‘ఏదో ఒకటి చేయాలనిపించింది’ ఈ విషయమై సుధ మాట్లాడుతూ ‘ముసహరాలతో పరిచయమయ్యేదాకా అస్పృశ్యత, వివక్ష అనే పదాలు నాకు కొత్త. వారికి ఏదో ఒకటి చేయాలనిపించింది. దీంతో వారి ఇళ్ల వద్దే నివాసం ఏర్పరుచుకున్నా. వారి హక్కుల కోసం పోరాడుతున్నా. వారి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటా’ అని అన్నారు. –సాక్షి, స్టూడెంట్ ఎడిషన్ -
‘టీడీపీ దళిత తేజం కాదు..దళిత మోసం’
సాక్షి, నెల్లూరు: టీడీపీ దళిత తేజం కాదు..దళిత మోసం.. దళితులంటే బాబుకి చిన్నచూపేనని వైఎస్సార్సీపీ పార్లమెంట్ అధ్యక్షుడు కిలివేటి సంజీవయ్య అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దళితుల గురించి మాట్లాడే హక్కు లేదని ఆరోపించారు. జిల్లాలో ఇప్పటివరకు 80 ఎస్సీ వసతి గృహాలను మూసివేశారు.. కానీ ఒక గురుకుల పాఠశాలనైనా ప్రారంభించారా అని ప్రశ్నించారు. బాబు వర్గీకరణ పేరుతో దళితుల మద్య చిచ్చుపెడుతున్నారు. దీనిపై బాబు ప్రసంగానికి ఎటువంటి స్పందన లేదని, దళితులంతా వైఎస్ జగన్‌కి అండగా ఉన్నారని తెలిపారు. -
దళితులకు సెంట్ భూమి అయినా ఇచ్చావా చంద్రబాబు ?
-
‘బాబు క్షమాపణ చెప్పి.. ముక్కు నేలకు రాయి’
సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. అంతేకాక చంద్రబాబు దళిత వ్యతిరేకి అని మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. శనివారం ఆయన విజయవాడ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయలంలో మీడియాతో మాట్లాడారు. నెల్లూరులో దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయి అని డిమాండ్ చేశారు. దళిత తేజం పేరుతో నెల్లూరులో జరిగే మీటింగ్‌కు జనాన్ని తరలిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు అని నిలధీశారు. దళితుల పరిస్థితి ఒక్క శాతం కూడా మెరుగుపడలేదని మేరుగ ఆరోపించారు. ‘రాష్ట్రంలో రాజ్యాంగం అవహాస్యం అవుతుంది. దళితులపై దాడులు జరుగుతుంటే మీ నోరు ఎందుకు మూడపడింది చంద్రబాబు? దళితులకు రాజ్యాంగబద్ధంగా కేటాయించాల్సిన నిధులు ఏమయ్యాయి? రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ కన్న కలలు ఇవేనా? దళితులు చదువుకోకూడదని ఎస్సీ హాస్టల్స్ మూయించింది వాస్తవం కాదా. చంద్రబాబు నీది దళిత వ్యతిరేక స్వాభావం. దళిత ద్రోహి చంద్రబాబు.. అంబేడ్కర్ మహానుబావుడు. నువ్వు 420వి.. నీకు ఆయనకి పోలికా? విరగిపోయే చెట్టు చంద్రబాబు.. అయితే మొలకెత్తే విత్తనం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని’ మేరుగ అన్నారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఏం ఉద్ధరించారని మండిపడ్డారు. దళితులకు సెంట్ భూమి ఐనా ఇచ్చావా చంద్రబాబు ? దళిత తేజం ఇదేనా అని నిలదీశారు. దళితుల భూములను సైతం చంద్రబాబు కొల్లగొట్టారని ఆయన మండిపడ్డారు. దళితులపై జరిగిన దాడుల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగోస్థానంలో ఉందని జాతీయ క్రైమ్ రికార్డుల చెబుతున్నాయని మేరుగ పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు దోచుకుంటున్న జుపూడిపై చర్యలేవి అని వైఎస్సార్సీపీ నేత మేరుగ నాగార్జున చంద్రబాబును ప్రశ్నించారు. -
దళితులపై తెలుగుదేశం దౌర్జన్యం
హనుమాన్‌జంక్షన్ రూరల్ : దళితులపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దౌర్జన్యకాండపై కేసు నమోదు చేయకపోగా.. బాధితులైన వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా నిర్భందించారు. ఈ ఘటనకు నిరసనగా కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్ పోలీస్‌స్టేషన్ ఎదుట వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు అందోళన చేపట్టారు. వైఎస్సార్ సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు, పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు నేతృత్వంలో వందలాది కార్యకర్తలు బుధవారం ఉదయం 11 గంటలకు పోలీస్‌స్టేషన్ ఎదుట చేపట్టిన ధర్నా ఏకధాటిగా రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. ఈ నెల 24న బాపులపాడు మండలం కె.సీతారామపురంలో వైఎస్సార్సీపీ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా వివాదం సృష్టించారు. రచ్చబండ ముగించుకుని తిరిగి వెళ్లుతున్న యార్లగడ్డ వెంకట్రావు వాహానాన్ని అడ్డగించి ఘర్షణకు దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్త చిన్నం కాశీ విశ్వనాథ్ తల పగలుకొట్టడమే కాకుండా ఎస్సీలను కులం పేరుతో దుర్భషలాడారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీకి చెందిన దళితులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే వంశీమోహన్, తెలుగురైతు నాయకుడు చలసాని ఆంజనేయులు, మరికొందరు టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేసినప్పటికీ హనుమాన్‌జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేయ్యలేదు. అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు, ఆయన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఈ ఘర్షణతో సంబంధం లేని ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలను మంగళవారం అర్ధరాత్రి సమయంలో పెనమలూరు, గన్నవరం పోలీసులు విచారణ పేరుతో అదుపులోకి తీసుకోవటంతో వివాదం మరింత ముదిరింది. కార్యకర్తల అక్రమ అరెస్టులకు నిరసనగా హనుమాన్‌జంక్షన్ పోలీస్‌స్టేషన్ ఎదుట వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని, దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నాయకులు, ప్రోత్సహించిన ఎమ్మెల్యే వంశీమోహాన్పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై టీడీపీ నేతలపై కేసు నమోదు చేయబోమని హనుమాన్‌జంక్షన్ సీఐ వై.వి.ఎల్.నాయుడు, ఎస్ఐ వి.సతీష్‌లు ఖరాఖండిగా చెప్పడంతో వివాదం ముదిరింది. పోలీసులు టీడీపీకి తొత్తులుగా మారటం దారుణం: పార్థసారధి, కారుమూరి అధికార టీడీపీకి పోలీసులు పూర్తిగా తొత్తులుగా మారిపోయారని వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి, తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు దుయ్యబట్టారు. పోలీస్‌స్టేషన్ ఎదుట వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టిన అందోళనకు వారు మద్దతు పలికారు. బాధ్యతయుతమైన హోదాలో ఉన్న సీఐ వైవిఎల్ నాయుడు నిజాయతీగా వ్యవహారించకుండా, టీడీపీ నేతలకు భయపడి పోలీసు వ్యవస్థ పరువును తీస్తున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇది దళితులను, దళిత చట్టాలను అగౌరవపర్చమేనని మండిపడ్డారు. చివరకు దాడులకు పాల్పడిన టీడీపీ నేతలపై కేసు నమోదుకు హామీ ఇవ్వడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన విరమించారు. ధర్నాలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కైలే జ్ఞానమణి, ఎంపీటీసీ సభ్యులు మంగళఈ కమిటీ డీజీపీకి అర్హత గల వారి జాబితాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుంది.పాటి కమలకుమారి, బేతాళ ప్రమీలారాణి పాల్గొన్నారు. -
భూ మాఫియా రుబాబు!
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: వారికి అనువంశికంగా వచ్చిన భూములవి. ఈ భూములను గత ఏడాది దళితులకు భూ పంపిణీ పథకం కింద ప్రభుత్వానికి ఇవ్వడానికి ఆ కుటుంబాలు ముందుకొచ్చాయి. ఎంతో ఔదార్యంతో ఆ కుటుంబాలు ముందుకొచ్చినా అక్కడ ఉన్న భూ మాఫియా.. ‘ఈ భూములు ప్రభుత్వానికి ఇవ్వొద్దు.. పదికో, పరక్కో మాకే ఇవ్వాలి’ అంటూ ఆ కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. సూర్యాపేట జిల్లా చింతపాలెం మండలం వెల్లటూరులో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. జిల్లాలోని హుజూర్‌నగర్‌కు చెందిన అమరవాది రవిచందర్, అమరవాది గోపాలకృష్ణమూర్తి, అమరవాది చంద్రమౌళీశ్వర ప్రసాద్‌తో పాటు మరో పదిమంది బ్రాహ్మణ కుటుంబాలకు చింతపాలెం మండలం వెల్లటూరు గ్రామంలో భూములున్నాయి. ఈ గ్రామంలోని సర్వే నంబర్ 488 లో అనువంశికంగా వచ్చిన సుమారు 135 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 70 ఎకరాలను ఆ 13 కుటుంబాలు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకం కింద ప్రభుత్వానికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాయి. వెంటనే స్పందించిన కలెక్టర్, సదరు దరఖాస్తులను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలంటూ జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు. భూ రికార్డులను పరిశీలించి వివరాలు పంపాలని జేసీ, చింతపాలెం తహసీల్దార్‌ను ఆదేశించారు. ఇది జరిగి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు ఆ భూముల వివరాలను స్థానిక రెవెన్యూ అధికారులు తేల్చలేదు. పదికో.. పరకో మాకే అమ్మాలి! ఈ భూములను బ్రాహ్మణ కుటుంబాలు ప్రభుత్వానికి ఇస్తున్నాయని తెలుసుకున్న స్థానిక భూ మాఫియా వీరిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆ భూమిని తమకే పదికో.. పరకో అమ్మాలని బెదిరింపులకు పాల్పడుతోంది. మూడు రోజుల క్రితం ఆ భూములను పరిశీలించేందుకు జేసీ వెళ్లారు. భూములు తమ అ«ధీనంలో ఉన్నాయని, తమకు కొందరు అమ్మారంటూ భూ మాఫియా జేసీ ముందు వాదించింది. జేసీ అక్కడి నుంచి వెళ్లిన తర్వాత బ్రాహ్మణ కుటుంబాలను భూ మాఫియా సభ్యులు భయభ్రాంతులకు గురిచేయడంతో వారు దీనిపై కోదాడ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పట్టించుకోని స్థానిక రెవెన్యూ సిబ్బంది .. ప్రభుత్వానికి ఇస్తామన్న భూమిపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా స్థానిక రెవెన్యూ యంత్రాంగం మిన్నకుండా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. రైతుబంధు పథకం కింద ఇటీవల ఈ భూములకు సంబంధించి కొత్త పట్టేదారు పాస్ పుస్తకాలు కూడా సదరు బ్రాహ్మణ కుటుంబాల్లో కొందరికి వచ్చాయి. మిగతావి తమకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ కుటుంబాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నా యి. ‘ప్రభుత్వానికి ఇస్తే ధర తక్కువగా వస్తుందని, ఎంతకో కొంతకు భూ మాఫియా సభ్యులకే అమ్మండి’ అంటూ స్థానిక రెవెన్యూ యంత్రాంగం వారికి వత్తాసు పలుకుతోందని బ్రాహ్మణ కుటుం బాలు ఆరోపిస్తున్నాయి. మళ్లీ సీఎంవో మెట్లెక్కిన బాధితులు ఈ భూముల విషయమై తమను భయాందోళనకు గురిచేస్తున్నారంటూ ఆ బ్రాహ్మణ కుటుంబాలు శుక్రవారం సీఎంవోను ఆశ్రయించాయి. స్థానిక రెవెన్యూ సిబ్బంది భూ మాఫియాతో చేతులు కలిపి ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని సీఎంఓ కార్యాలయంలో వారు ఫిర్యాదు చేశారు. తమ భూములవైపు వెళ్తే భూ మాఫియా తమను హత్య చేయాలని చూస్తోందని, తమకు రక్షణ లేకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాకు న్యాయం చేయాలి.. ఈ భూములను దళితుల భూ పంపిణీ పథకానికి ఇవ్వడానికి ముందుకొస్తే భూ మాఫియా సభ్యులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇవి మావి కావడంతోనే కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చాయి. మిగతావి రెండో విడతలో ఇస్తామంటున్నారు. మాకు ఉన్నతాధికారులు న్యాయం చేయాలి. – అమరవాది రవిచందర్, హుజూర్నగర్ మా భూములని వీళ్లు, వాళ్లు అంటున్నారు.. బ్రాహ్మణ కుటుం బాలు వెల్లటూరులోని వారి భూములను దళితుల భూ పంపిణీ పథకానికి ఇస్తామని దరఖాస్తు చేసింది వాస్తవమే. ఆ భూముల పరిశీలనకు జాయింట్ కలెక్టర్ వచ్చారు. అయితే ఆ భూములు తమవంటే.. తమవని బ్రాహ్మణ కుటుంబాలు, గ్రామస్తులు అంటున్నారు. ఈ భూముల విషయాన్ని పరిశీలిస్తున్నాం. కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు బ్రాహ్మణ కుటుంబాలకు వచ్చాయి. – జె.కార్తీక్, తహసీల్దార్, చింతపాలెం మండలం -
దళితుల వెనకబాటుకు కారణం కాంగ్రెస్సే: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో దళితుల వెనకబాటుకు కాంగ్రెస్ పాలనే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తించినా కాంగ్రెస్‌కు కనిపించటం లేదని, తాజాగా మీరాకుమార్ మాటలే దీనికి నిదర్శనమని చెప్పారు. సోమవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రపతులుగా దళితులైన మీరాకుమార్, సుశీల్‌కుమార్ షిండే, వెంకటస్వామిలాంటి వారికి అవకాశమివ్వకుండా, ప్రతిభాపాటిల్, ప్రణబ్ ముఖర్జీని కాంగ్రెస్ ఎంచుకోవటాన్ని ప్రజలు గమనించారన్నారు. 79 మంది దళిత ఎంపీలు, 543 మంది దళిత ఎమ్మెల్యేలు బీజేపీలో ఉన్నారని కాంగ్రెస్ నేతలు మరిచిపోయారన్నారు. 1980 ఎన్నికల్లో జగ్జీవన్‌రామ్‌ను ప్రధాని అభ్యర్థిగా చేయకుండా కాంగ్రెస్ కుట్రలు పన్ని ఓడించిందని పేర్కొన్నారు. జగ్జీవన్‌రామ్ కూతురైన మీరాకుమార్ కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రశ్నించడం మానేసి బీజేపీని ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. -
‘చట్టాల’తో దళితులను కుమ్ముతున్నారు!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ‘భీమ్ ఆర్మీ’ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఏడాది దాటి పోయింది. 2017, మే నెలలో సహరాన్‌పూర్‌లో జరిగిన హింసాకాండకు కారకుడన్న ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేశారు. ఆ నెలలో దళితుల ఇళ్లపై అగ్రవర్ణాల వారు దాడి చేయడంతో మొదలైన ఇరు వర్గాల ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. ఈ సంఘటనలకు సంబంధించి ఇతరులతోపాటు ఆజాద్‌ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సంవత్సరం నవంబరు నెలలో ఆజాద్ కేసు అలహాబాద్ కోర్టుకు రాగా, ఆజాద్‌పై ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడినవంటూ ఆక్షేపించిన జడ్జీలు ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేశారు. ఆజాద్‌ను బేషరతుగా విడుదల చేయాల్సిన పోలీసులు వెంటనే ఆయనపై భయానకమైన జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించారు. ఎలాంటి చార్జిషీటు, విచారణ లేకుండా ఎవరినైనా ఏడాది పాటు ఈ చట్టం కింద జైలు నిర్బంధంలో ఉంచవచ్చు. ఏడాది కాగానే మళ్లీ అదే చట్టాన్ని మరో ఏడాది పొడిగించవచ్చు. ఈ చట్టం కింద ఉన్న కాస్త భద్రత ఏమిటంటే....ముగ్గురు హైకోర్టు జడ్జీలతో కూడిన సలహా సంఘం ముందు మూడు నెలల నిర్బంధం అనంతరం నిందితుడు అప్పీల్ చేసుకోవచ్చు. మరి ఆజాద్‌కు అలాంటి అవకాశాన్ని కల్పించినదీ, లేనిది తెలియదు. ఆజాద్‌పై పోలీసులు చేసిన నేరారోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడినంటూ హైకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ మరింత కఠినమైన చట్టాన్ని ప్రయోగించిన పోలీసులు మళ్లీ జడ్జీల ముందు ఆజాద్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తారని అనుకోలేం. హింసాకాండ కేసులోనే అగ్రవర్ణాలకు చెందిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ వారిలో ఒక్కరిపై కూడా ఈ జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించలేదు. వారంతా బెయిల్‌పై బలాదూర్ తిరుగుతున్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కూడా ఈ జాతీయ భద్రతా చట్టం లాంటిదే. ‘బ్యాటిల్ ఆఫ్ బీమా కోరెగావ్ (1818, జనవరి ఒటటవ తేదీన బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి దళిత సైనికులు పేశ్వా బాజీ రావు సేనలను ఓడించారు)’ 200 వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 31, 2017న ఘర్షణలు చెలరేగి ఒకరు మరణించడంతో మహారాష్ట్ర పోలీసులు టాప్ మావోయిస్టులను ‘చట్ట విరుద్ధ కార్యకలాపాలా నిరోధక చట్టం’ కింద అరెస్ట్ చేసింది. వాస్తవానికి ఆ రోజు దళితులకు అడ్డంపడి గొడవ చేసిందీ కాషాయ దళాలు. కాషాయ జెండాలు ధరించి వారు దాడులు చేయడంతో ఘర్షణ జరిగింది. ఘర్షణ కారణమంటూ ప్రముఖ హిందూత్వ నాయకులు మిలింద్ ఎక్బోటే, సంబాజీ భిడేలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారిపై మాత్రం ఈ చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టాన్ని ప్రయోగించలేదు. ఈ చట్టాన్ని కూడా ఎవరిపైనైనా సరే, ప్రయోగించవచ్చు. ఎలాంటి చార్జిషీట్లు, విచారణ లేకుండా నెలల తరబడి జైళ్ళలో ఉంచవచ్చు. యూపీలో ఘర్షణలు జరిగినందుకు దళితుల చీఫ్ ఆజాద్‌పై మొదటి చట్టాన్ని ప్రయోగించగా ఇక్కడ మహారాష్ట్రలో దళితుల కోసం పోరాడున్న మావోయిస్టులపై రెండో చట్టాన్ని పోలీసులు ప్రయోగించారు. ఈ రెండు చట్టాల్లో కూడా నిందితులు నేరం చేసినట్లుగా రుజువు చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపైన లేదు. తాము నేరం చేయలేదంటూ నిందితులే రుజువు చేసుకోవాలి. ఇంతటి రాక్షస చట్టాలను ఎత్తివేసేందుకు ఉద్యమాలు రావాలి. కానీ ఆ ఉద్యమాలను కూడా ఈ చట్టాలతోనే అణచివేస్తారేమో! -
భీమ్-కోరెగావ్: నలుగురు దళితుల అరెస్ట్
పుణె : భీమా-కోరేగావ్‌లో చెలరేగిన అల్లర్ల కేసులో నలుగురు దళిత నాయకులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. భీమా-కోరేగావ్ యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా 200వ జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటున్న దళితులపై కోరేగావ్‌లో జనవరి 1న పెద్ద సంఖ్యలో హిందుత్వ కార్యకర్తలు, అగ్రవర్ణ కులాల వారు దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన మిలింద్ ఎక్‌బోతేను మే 14న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరి కొంతమందిని ఈ ఘర్షణలకు కారణంగా చూపుతూ.. పోలీసులు నలుగురు దళిత నాయకులు సుధీర్ ధావాలే, లాయర్ సురేంద్రను, దళిత కార్యకర్త మోహన్ రౌత్, రోనా విల్సన్‌లను అరెస్టు చేశారు. కాగా, దళిత నాయకుడైన సుధీర్ ధావాలేను ముంబైలో, లాయర్ సురేంద్రను, దళిత కార్యకర్త మోహన్ రౌత్‌ను నాగ్‌పూర్‌లో, రోనా విల్సన్‌ను ఢిల్లీలో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. భీమ్ కోరేగావ్‌లో జరిగిన ఘర్షణలకు వీరు పంచిన కరపత్రాలు, వీరిచ్చిన ప్రసాంగాలే ఉసిగొల్పినట్టు పోలీసు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో ఒకడైన సుధీర్ ‘ఎల్గర్ పరిషత్’ సంస్థ నిర్వహకులలో ఒకరు. జనవరి 1న కారేగావ్‌లో జయంతి ఉత్సావాలు నిర్వహించింది ఎల్గర్ పరిషత్ సంస్థే. రోనా విల్సన్‌ను ఢిల్లీలో పుణె పోలీసుల ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం సహయంతో అరెస్టు చేసి పటియాల కోర్టు ఎదుట హాజరుపర్చి రెండు రోజుల రిమాండ్‌కు తరలించారు. ఇవి చదవండి : హిందుత్వ నినాదాలతో దాడి.. , కోరెగావ్ ఓ శౌర్య ప్రతీక -
విజయవాడలో మరో భూకబ్జా
సాక్షి, విజయవాడ: నగరంలో మరో భూబాగోతం వెలుగులోకి వచ్చింది. కబేళా సమీపంలోని కొండ ప్రాంతంలో 500 గజాల స్థలాన్ని కబ్జా చేశారంటూ దళితులు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. తమ స్థలల్లోకి రానీయకుండా దౌర్జన్యం చేస్తున్నారంటూ సీపీ దగ్గర వాపోయారు. అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ నేతల సహకారంతో తమ భూమిని కాజేయాడానికి కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన భూములను లాక్కొని తమ స్థలం వద్దకు రానీయకుండా కొంత మంది దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పేర్కొనారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించకుంటే తమ స్థలాల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. -
‘మహానాడు కాదు..మహాదగానాడు’
సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళిత వ్యతిరేకి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. దళితుల పట్ల చంద్రబాబు చాలాసార్లు అక్కసు వెళ్లగక్కారని విమర్శించారు. మహానాడులో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ఎందుకు తీర్మాణాలు చేయలేదని ప్రశ్నించారు. అది మహానాడు కాదు మహా దగానాడు అని ఎద్దేవా చేశారు. దళితుడన్న కారణంతోనే మోత్కుపల్లి నర్సింహులుని టీడీపీ నుంచి బహిష్కరించారని ఆరోపించారు. దళితుల పట్ల మంత్రి ఆదినారాయణ రెడ్డి అవహేళనగా మాట్లాడినా, వర్ల రామయ్య పబ్లిగ్గా విద్యార్థిని తిట్టినా చంద్రబాబు వివరణ కూడా అడగలేదని మండిపడ్డారు. రాజధాని పేరుతో భూములు స్వాహా చేశారని సుధాకర్ బాబు ఆరోపించారు. -
10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చాం
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఉజ్వల యోజన లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం 10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను ఇచ్చిందని, వాటిలో నాలుగు కోట్లు పేద మహిళలకే కేటాయించామని ఆయన చెప్పారు. గ్యాస్ కనెక్షన్లలో సింహ భాగం దళితులు, గిరిజనులకే దక్కాయని ఆయన వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల అనుకూల పథకాల్ని అమలు చేస్తుంటే.. ఆ విషయంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని తప్పుపట్టారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు కేవలం ధనికులు, ప్రభావితం చేసే వ్యక్తులకు మాత్రమే ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చేవారని, ఇప్పుడు పేదలు, దళితులు, గిరిజనులే లక్ష్యంగా పథకం అమలవుతోందని చెప్పారు. ప్రస్తుతం ప్రతీ 100లో 81 కుటుంబాలకు కనెక్షన్లు ఉన్నాయని, ఎన్డీఏ ప్రభుత్వం వల్లే అది సాధ్యమైందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఆరు దశాబ్దాల్లో 13 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇస్తే.. గత నాలుగేళ్లలో 10 కోట్లు ఇచ్చామని ప్రధాని పేర్కొన్నారు. ఉజ్వల్ యోజనతో లబ్ధి పొందిన మహిళలతో మాట్లాడుతూ.. ‘చిన్నతనంలో నా తల్లి కట్టెల పొయ్యిపై వంట చేసేది. ఆ సమయంలో పొగ వల్ల ఎంతో ఇబ్బంది పడేది. భవిష్యత్‌లో 100 శాతం ఇళ్లకు శుద్ధమైన ఇంధనం అందించడమే మా లక్ష్యం’ అని మోదీ అన్నారు. మా హయాంలోనే దళితులకు ప్రయోజనాలు ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా దళితులు ఎంతో లాభపడ్డారని పేర్కొంటూ.. ఎన్డీఏ, యూపీఏ హయాంలో దళితులు పొందిన లబ్ధిని మోదీ పోల్చారు. ‘2010–14 మధ్యలో దళితులు 445 పెట్రోల్ బంకులు పొందితే.. 2014–18లో 1200 పెట్రోల్ బంకులు కేటాయించాం. యూపీఏ హయాంలో 900 మంది దళితులకు మాత్రమే ఎల్పీజీ డీలర్షిప్ కేటాయిస్తే.. ఎన్డీఏ పాలనలో 1300 మందికి ఇచ్చాం’ అని చెప్పారు. ఉజ్వల యోజన కింద లబ్ధి పొందడం ప్రారంభమైనప్పటి నుంచి పేదలు, దళితులు, గిరిజన వర్గాల జీవితాలు మెరుగయ్యాయని, సామాజిక సాధికారితలో ఈ పథకం ప్రధాన పాత్ర పోషించిందని మోదీ పేర్కొన్నారు. మే, 2016లో ప్రారంభించిన ఉజ్వల పథకంలో 5 కోట్ల నిరుపేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం ఆ సంఖ్యను 8 కోట్లకు పెంచారు. తమిళనాడు వస్తే దోసె దొరుకుతుందా..? టీ నగర్ (చెన్నై): తమిళనాడుకు వస్తే దోసె దొరుకుతుందా? అని తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన మహిళ రుద్రమ్మతో వీడియో కాన్ఫనెన్స్‌లో మోదీ అన్నారు. తప్పకుండా తయారు చేసి ఇస్తానని, తమ ఇంటికి రావాలని ఆమె ఆహ్వానించారు. అనంత్‌నాగ్‌కు చెందిన మహిళా బృందం ‘ఇది రంజాన్ మాసం. ఖురాన్‌ను రోజూ చదువుతాం. రోజూ మీ కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రధానిగా కొనసాగుతారని మేం ఆశిస్తున్నాం’ అని మోదీతో అన్నారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన లబ్ధిదారుతో మోదీ మాట్లాడుతూ.. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌కు ఇబ్బందులుంటే తనను నేరుగా సంప్రదించాలని సూచించారు. గతంలో కట్టెల పొయ్యి వాడినప్పుడు వంటకు ఎంతో సమయం పట్టేదని.. ఇప్పుడు గ్యాస్ పొయ్యితో సమయం ఆదా అవడం వల్ల పిల్లలతో సమయం గడుపుతున్నానని ఆమె పేర్కొంది. -
‘అంబేద్కర్‌కి మొదటి ప్రాధాన్యం ఇవ్వొద్దు’
జైపూర్: బీజేపీ నేతల మాటలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ వైపు మతతత్వ పార్టీ అంటూ బీజేపీపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. నాయకుల అనుచిత వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. తాజాగా బీజేపీ రాజస్థాన్ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహుజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. శుక్రవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘తమని ఆదివాసీలుగా చెప్పుకొనే ఎస్సీ, ఎస్టీలు అంబేద్కర్‌కు మొదటి ప్రాధాన్యం ఇవ్వొద్దు. ఆయన కంటే ముందుగా హనుమాన్‌ని పూజించాలి. ఎందుకంటే, ఆదివాసీల మొదటి నాయకుడు హనామన్ జీ మాత్రమే.వారంతా ఆయనకు అగ్ర తాంబూలం ఇవ్వాలి. వారి మొదటి దేవుడు హనుమాన్. దళితులకు మార్గ నిర్దేశం చేసింది హనుమానే’ అని అహుజా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యాలయంలో గల అంబేద్కర్ విగ్రహం కింద హనుమాన్ చిత్రపటం ఉండడం చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుణ్ని అవమానించారని మండిపడ్డారు. ‘మీరు సిగ్గు పడాలి. మీరంతా ఆదివాసీలమని చెప్పుకొంటూనే హనుమాన్‌ని అవమానిస్తారా..!’ అని స్థానిక ఎంపీ కిరోడి లాల్ మీనాపై అహుజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంజనేయస్వామికి ప్రపంచం మొత్తం మీద దాదాపు 40 లక్షల దేవాలయాలు ఉన్నాయని ఆయన అన్నారు. మరే దేవుడికి ఇన్ని ఆలయాలు లేవని తెలిపారు. అహుజా వ్యాఖ్యలపై ఎంపీ కిరోడిలాల్ స్పందించారు. ‘ హనుమాన్ కాలంలో ఇటువంటి రాజకీయాలు లేవు. అహుజా హనుమాన్ జీని ఆదివాసీ, దళిత నాయకుడు అని అనాల్సిన అవసరం ఏమొచ్చిందో అంతుచిక్కడం లేద’ని ఆయన అన్నారు. ‘హనుమాన్‌కి అవమానం జరిదిందని విన్నాను. ఇది చాలా విచారకరం. అలాంటి ఘటనలు భక్తుల మనోభావాలను కించపరుస్తాయి. అయినా, ఈ ఘటనకు ఆదివాసీలను బాధ్యులను చేయాల్సిన అవసరం లేద’ని అన్నారు. -
తెలుగుదేశం పార్టీ శ్మశానంలా తయారైంది..
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దళితులను మోసం చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. పెద్ద మాదిగ అని చెప్పుకునే బాబుకు దళితులపై ఏమాత్రం ప్రేమ లేదని పేర్కొన్నారు. మహానాడుకు తనను పిలవకుండా మాదిగలను, దళితులను అవమానపరిచారని విమర్శించారు. శుక్రవారం ఆయన బేగంపేటలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గురువారం జరిగిన మహానాడుకు తనను ఆహ్వానించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పార్టీకి 30 ఏళ్లుగా సేవ చేస్తున్న నన్ను మహానాడుకు పిలవలేదు. నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సీనియర్ లీడర్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా? ఎస్సీ వర్గీకరణ సభ కోసం నిజామాబాద్ వెళ్తుండగా ఇద్దరు బిడ్డలున్న ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోతే చంద్రబాబు ఆదుకోలేదు. పెద్ద మాదిగ అని చెప్పుకునే బాబుకు దళితులపై ఉన్న ప్రేమ ఇదా? ఆంధ్రాలోనూ దళితులున్నారు జాగ్రత్త! పెద్ద మాదిగ అన్న మీరు వర్గీకరణపై ఎందుకు తీర్మానం చెయ్యలేదు. కేసీఆర్ ఎప్పుడో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపినా మీరెందుకు చెయ్యలేదో చెప్పాలి’’అని నిలదీశారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు కనీసం చాయ్‌కి కూడా సమయం ఇవ్వలేదని, ఆయనా దళితులకు న్యాయం చేసేది అని ప్రశ్నించారు. తాను చేసిన తప్పేంటో ఇప్పటికైనా బాబు చెప్పాలని, తప్పుంటే ముక్కు నేలకు రాస్తానని, లేదంటే ఆంధ్రాలో అన్ని జిల్లాలు తిరిగి నా తప్పేంటని అడుగుతానని స్పష్టంచేశారు. ‘‘రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లికి పోయావ్.. ఎంగేజ్మెంట్కు కేబినెట్ అంతా తీసుకొని వెళ్లావ్.. కానీ నా బిడ్డ పెళ్లికి పిలవంగా పిలవంగా సాయంత్రం వచ్చారు. అదే కేసీఆర్ ఇంటికి వెళ్లి.. నా ఇంట్లో బిడ్డ పెళ్లి ఉందనగానే ఆత్మీయంగా స్వాగతం పలికారు. పెళ్లికి కూడా వచ్చారు’’అని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ శ్మశానంలా తయారైంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శ్మశానంలా తయారైందని, ఆంధ్రప్రదేశ్‌లోనూ వస్తదో, రాదో అన్న పరిస్థితి ఉందని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డిలాంటి మూర్ఖులను ప్రోత్సహించి, నిబద్ధత గల తన వంటి నాయకులను చిన్నచూపు చూడటంతోనే పార్టీ సర్వనాశనం అయిందన్నారు. పార్టీలో నీతి లేని నాయకులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, దళితులను ముఖ్యంగా మాదిగలను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘పార్టీలో డబ్బు, కులానికే ప్రాధాన్యత పెరిగింది. అందుకే పార్టీ పతనావస్థకు చేరుతోంది. దీనిపై ఇప్పటికైనా చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి’’అని వ్యాఖ్యానించారు. మళ్లీ చెబుతున్నా.. కేసీఆర్‌తో కలిసిపోదాం.. కేసీఆర్‌తో కలిసి పోదాం అన్నందుకే తనను పక్కన పెడుతున్నారని మోత్కుపల్లి వాపోయారు. ‘‘మళ్లీ చెబుతున్నా.. కేసీఆర్ మన మిత్రుడే. ఆయన కేబినెట్లో ఉన్నవారు మనవారే. వారితో జతకట్టడం మనకు మంచిదే. టీఆర్ఎస్లో పార్టీని విలీనం చేయాలన్న వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నా’’అని చెప్పారు. ఇప్పటికీ తాను టీడీపీలోనే ఉన్నానని, బాబు తనను పిలిచి మాట్లాడాలని అన్నారు. తనను పిలవకుంటే రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసుంటే చెప్పుతో కొట్టేవారు ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డి అప్రూవర్‌గా మారతాడని చంద్రబాబు భయపడ్డారని, అందుకే బ్లాక్ మెయిల్ చేసినా ఆయనపై చర్యలు తీసుకోలేదని మోత్కుపల్లి చెప్పారు. ఒకవేళ కుట్రతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసుంటే ప్రజలు టీడీపీని చెప్పుతో కొట్టేవారని, నాదెండ్ల భాస్కర్‌రావు మాదిరే తిరుగుబాటు చేసేవారని వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎన్నికల్లో పైసా, పరపతి లేనివారికి సీఎం కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారని, ఆ పని మీరెందుకు చేయలేకపోయారని బాబు ను నిలదీశారు. పార్టీ నుంచి తనను మెడపట్టి బయటకు గెంటేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. -
దళిత ఉద్యోగిపై టీడీపీ నేత దాడి
-
దళితుడిపై టీడీపీ నేత దాడి
సాక్షి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. అధికార మదంతో తెలుగు తమ్ముళ్లు అడ్డూఅదుపు లేకుండా దౌర్జన్యాలకు దిగుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ నేత ఒకరు బరితెగించారు. కొమదవోలు గ్రామ కార్యదర్శి యువి రత్నంపై టీడీపీ నాయకుడు గంటా మోహనరావు దాడి చేశారు. ఇంటికి పిలిపించుకుని బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారు. పంచాయతీకి సంబంధించిన 5 లక్షల రూపాయిలను అడ్వాన్స్‌గా ఇవ్వలేదన్న అక్కసుతో కార్యదర్శిపై గూండాయిజం ప్రదర్శించారు. దళితుడైన తనపై టీడీపీ నేత గంటా మోహనరావు దాడికి పాల్పడినట్లు బాధితుడు ఎన్జీఓ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దాడి విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని ఎన్జీఓ నేతలు నిర్ణయించారు. అధికారులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
దళితులపై సర్కారు వివక్ష
ఆళ్లగడ్డ : చంద్రబాబు ప్రభుత్వం దళితులపై మరోసారి వివక్ష చూపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నేత గంగుల బిజేంద్రారెడ్డి విమర్శించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ శోభారాణి ఆత్మహత్య ఘటనపై సక్రమంగా స్పందించలేదన్నారు. ఈ మేరకు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఐటీయూ ఆధ్వర్యంలో శోభారాణి మృతదేహంతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఆమె ఇంటి నుంచి మృతదేహాన్ని తీసుకుని పట్టణ వీధుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం ఎదురుగా మృతదేహాన్ని ఉంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ శోభారాణి దళిత ఉద్యోగి అయినందునే ప్రభుత్వం ఆమె ఆత్మహత్య ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కనీసం ఆమె కుటుంబాన్ని ఆ శాఖ అధికారులు ఎవరూ పరామర్శించకపోవడం దారుణమన్నారు. నిబంధనల ప్రకారం అంత్యక్రియలకు నగదు కూడా అందజేయలేదన్నారు. శోభారాణి మృతికి కారణమైన సీడీపీఓ పద్మావతిని వెంటనే విధుల నుంచి తప్పించాలని, అంతవరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి కదిలించేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో తహసీల్దార్ లక్ష్మిదేవి, ఉప తహసీల్దార్ శ్రీనివాసులు, సీఐ శ్రీనాథరెడ్డి, ఎస్సై ప్రియతంరెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడారు. సీడీపీఓను విధుల నుంచి తప్పించనున్నట్లు తెలపడంతో పాటు అంత్యక్రియలకు నగదు అందజేయడంతో నిరసన విరమించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీపీ బండి చంద్రుడు, సుధాకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, పత్తి నారాయణ, సింగం భరత్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, డివిజన్ కార్యదర్శి శ్రీనివాసులు, మాలమహనాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. -
తలవంచని ధిక్కారస్వరం
మూడు వేల సంవత్సరాల అణచివేతను, అవమానాలను, హింసను భరిస్తూ వున్న జాతి.. మొత్తం ప్రపంచానికి మనుషులుగా బతికే పాఠాలు నేర్పాలి అని చెప్పిన మహాకవి కలేకూరి ప్రసాద్. బహుజనుల బతుకుల్లో వెలుగుల కోసమే బతికాడు. నిరంతరం బహుజనుల కోసమే రాశాడు. కవితైనా పాటైనా, వ్యాసమైనా, అనువాదమైనా, విమర్శయినా తన శైలిలో పాఠకుల బుర్రల్లో ఆలోచనల సెగలు పుట్టిస్తూ, కన్నీటి చుక్కల్లో నుంచి చురకత్తుల వీరులు రావాలనీ దళిత తల్లుల గుండెకోతలు, మంటలు మండే ఆవేదనలే రాశాడు కలేకూరి. పిడికెడు ఆత్మగౌరవం కోసం అంటూ దళిత మ్యానిఫెస్టో కవిత రాసీ దేశ దళితుల గాయాల చరిత్రను, ధిక్కార తిరుగుబాటు కవిత్వంలో రికార్డ్ చేశాడు కంచికచర్ల కోటేశు ఘటన, కీలవేణ్మణి, కారంచేడు, నీరుకొండ, చుండూరు దళితులపై దాడులను మొత్తంగా ఈ కవితలో రాశారు. కలేకూరి రాసిన ఒక పాట దేశం మొత్తం మార్మోగింది. ‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా / విరిసీ విరియని ఓ చిరునవ్వా/కన్నుల ఆశల నీరై కారగ/కట్నపు జ్వాలలో సమిధై పోయావా...’ ఈ పాట తెలియని వారు ఉండరు.ఎక్కడ దళితులపై దాడి జరిగినా తక్షణం స్పందించి పాల్గొంటూ, కవితలు, పాటలు, వ్యాసాలు, ఉపన్యాసాలతో ఆ ఉద్యమపోరాటంలో పాల్గొనేవాడు. అదిగదిగో ఇప్పుడు ‘కలేకూరి ప్రసాద్’ వస్తున్నాడు, ప్రశ్నించడానికీ, ధిక్కరించడానికీ, ‘అదిగదిగో తూర్పున సూర్యుడులా మండుతూ వస్తున్నాడు’ కలేకూరి ‘వస్తున్నాడు’. (మే 17న కలేకూరి ప్రసాద్ 5వ వర్ధంతి సందర్భంగా, చిలకలూరిపేటలో స్మారక సాహిత్య సభ) తంగిరాల–సోని, కంచికచర్ల మొబైల్ : 96766 09234దల -
బాబు పాలనలో దళితులకు రక్షణ కరువు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని, చట్టాలు, రాజ్యాంగ వ్యవస్థలకు చంద్రబాబు సర్కారు తూట్లు పొడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దౌర్జన్యాల నుంచి రాష్ట్ర ప్రజల్ని అంబేడ్కరే రక్షించాలన్నారు. టీడీపీ హయాంలో దళితులపై దాడులు అధికమయ్యాయని పేర్కొన్నారు. దళితులుగా ఎవరైనా పుడతారా? అని అవమానకరంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ‘‘గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో చనిపోయిన పశువు చర్మం ఒలిచారని చెట్టుకు కట్టేసి కొట్టారు. కుప్పంలో దళిత మహిళను వివస్త్రను చేశారు. కర్నూలు జిల్లాలో పారిశుద్ధ్య పనులు చేయలేదని గ్రామ బహిష్కరణ చేశారు. ప్రకాశం జిల్లాలో దళితుల భూముల్ని ఆక్రమించుకున్నారు’’ అని గుర్తు చేశారు. -
అంటే చంద్రబాబును జైల్లో పెట్టాలా?
పెరికగూడెం(కైకలూరు నియోజకవర్గం), కృష్ణా : స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా దళితుల పట్ల ఇంకా వివక్ష కనపడటం బాధాకరమని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెరికగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన దళిత ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్ మాట్లాడారు. దళితులపై నేటికి దాడులు జరుగుతుండటంపై దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. మంచి అన్నది మాల అయితే నేను మాలగా పుట్టడానికి సిద్ధమన్న గురజాడ అప్పారావు మాటలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎన్నికల సమయంలోనే దళితులు గుర్తుకువస్తారని, అప్పుడు వచ్చి తనకంటే పెద్ద దళితుడు ఎవరూ లేరని అంటారని చెప్పారు. ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్లను సక్రమంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారని, అమలుచేయని వారిని జైల్లో పెడతామని పేర్కొన్నారని గుర్తు చేశారు. అంటే నాలుగేళ్లలో కనీసం ఒక్క ఏడాదైనా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లను అమలు చేయని చంద్రబాబును ఇప్పుడు జైల్లో పెట్టాలా? అంటూ ప్రశ్నించారు. ఇదే ముఖ్యమంత్రి దళితుడిగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అని వ్యాఖ్యానించడం సిగ్గు చేటని, నాయకుడు చూపిన బాటలోనే టీడీపీ నేతలు నడుస్తూ దళితులపై దారుణాలకు ఒడిగడుతున్నారని అన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తనని తాను చంద్రబాబు దళిత తేజంగా కీర్తించుకుంటున్నారని, ఇలాంటి వ్యక్తి దళిత తేజం అయితే దళితులందరూ ఎక్కడిపోవాలని ప్రశ్నించారు. ‘నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు దళితులకు ఎక్కడైనా మేలు చేసినట్టు కనిపించిందా?. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులు ఇబ్బందులు పడుతున్నారు. కారంచేడు ఘటన నుంచి ఇప్పటివరకూ అదే తరహాలో టీడీపీ పాలన సాగుతోంది. ఏపీలో దళితులపై టీడీపీ నేతల జులూం.. - 2016 ఆగష్టులో తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని జానకిపేటలో దళితులను టీడీపీ నాయకులు చెట్టుకు కట్టేసి కొట్టారు. ప్రతిపక్ష నాయకుడిగా నేను అక్కడి వెళ్లి జరిగింది తెలుసుకున్నా. ప్రభుత్వాన్ని నిలదీశా. చంద్రబాబు కూడా తూర్పు గోదావరి జిల్లా వచ్చాడు. కానీ ఘటనాస్థలికి రాలేదు. కనీసం బాధితులను పరామర్శించలేదు. - 2017 జులైలో ప్రకాశం జిల్లా దేవరపల్లిలో 70 ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూముల్ని నీరు-చెట్టు పథకం కోసం టీడీపీ ఎమ్మెల్యే లాక్కున్నారు. పథకం కోసం వేరే భూములు లేవా? అని అధికార పార్టీ అన్యాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడి వెళ్లి అడ్డుకున్నారు. - 2017 డిసెంబర్లో విశాఖపట్నం జిల్లాలోని జెర్రిపోతులపాలెంలో టీడీపీ నాయకుడు దళిత మహిళను బట్టలూడదీసి కొట్టాడు. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా?. ఆమె భూమిని అక్రమించుకునేందుకు పశువులు మాదిరిగా టీడీపీ ఎమ్మెల్యేలు పాశవికంగా ప్రవర్తించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి నిలబడితే అప్పుడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకూ ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. - 2018 జనవరిలో గుంటూరు జిల్లా గొట్టిపాడులో దళితుల మీద మూకుమ్మడిగా టీడీపీ నాయకులు దాడి చేశారు. 2018 జనవరిలోనే కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో నక్కలదిన్నెలో పారిశుధ్య పనులు చేయడానికి నిరాకరించారని దళితులను టీడీపీ నాయకులు గ్రామ బహిష్కరణ చేశారు. వారికి కనీసం మంచినీళ్లు కూడా అందనివ్వలేదు. నాయకుడిని బట్టి పార్టీ ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని అన్నారు. ఇక కిందిస్థాయిలోని టీడీపీ నాయకులు దళితులను ఎలా చూస్తారు. సీఎం మాట్లాడాల్సిన మాటలేనా ఇవన్నీ. ఎస్టీలకు తెలివి లేదు అని కుప్పంలో 2017 జులై 20న చంద్రబాబు మాట్లాడారు. తెలివి ఏమైనా చంద్రబాబు అత్తగారి సొత్తా?. ఈయనకు ఏం తెలివితేటలు ఉన్నాయి. 40 ఏళ్లుగా రాష్ట్రాన్ని, ప్రజానికాన్నీ దోచుకుతింటున్నాడు. ఆయన కేబినేట్‌లోని మంత్రి ఆదినారాయణ దళితులు శుభ్రంగా ఉండరని, సక్రమంగా చదువుకోరంటూ వ్యాఖ్యలు చేశారు. ఇవే మాటలు నా కేబినేట్‌లోని మంత్రి మాట్లాడి ఉంటే వెంటనే బర్త్‌రఫ్ చేసేవాడిని. దానివల్ల ఒక గట్టిసంకేతాన్ని నాయకుల్లోకి పంపినట్లు అవుతుంది. పేదవాళ్లను ఆప్యాయంగా పలకరించని వారు. వాళ్ల బాగోగులు తెలుసుకోని వారు సీఎం పదవిలో ఉండటానికి అనర్హులు.’ అని వైఎస్ జగన్ దళితుల ఆత్మీయ సమ్మేళనంలో వ్యాఖ్యానించారు. -
‘ఆయన్ను చూసి అంబేద్కర్ బాధ పడేవారు’
సాక్షి, హైదరాబాద్: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా దళితులపై ఎన్నో దాడులు జరిగాయని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై దాడులెన్ని జరిగినా.. ఏ ఒక్క ఘటనపై కనీస చర్యలు గానీ , కేసులు గానీ లేవన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా 105 అడుగుల విగ్రహమని చెప్పి నాలుగేళ్లుగా ఆ మాటే విస్మరించారని మండిపడ్డారు. విగ్రహం ఏర్పాటుకు దీక్ష తలపెట్టిన నాయకులను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. అంబేద్కర్ ఉండి ఉంటే.. చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న తీరు చూసి బాధపడేవారని వ్యాఖ్యానించారు. బాబుకు విదేశీ పర్యటనలపై ఉన్న మోజు రాష్ట్ర అభివృద్ధిపై లేదన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించమని అంబేద్కర్‌కు వినతి పత్రాలు అందిస్తామన్నారు. -
అంబేద్కర్ ఆశయాలకు బాబు తూట్లు పొడుస్తున్నారు
-
సీఎం చంద్రబాబుకు ముద్రగడ లేఖ
సాక్షి, కాకినాడ : సీఎం చంద్రబాబు నాయుడికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ప్రతి ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో ఏపీ నుంచి మహారాష్ట్రకు దళితుల కోసం ఉచితంగా ప్రత్యేక రైళ్ళు నడపాలని ఆయన కోరారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పుట్టిన గ్రామమైన మహారాష్ట్రలోని మౌహంను జయంతి సందర్భంగా వారు దర్శించుకుంటారు. అంతేకాక ప్రతి జిల్లా నుంచి కనీసం 30 బోగిలు ఉన్న రైళ్ళను ప్రభుత్వమే తన సొంత ఖర్చుతో నడపాలని ముద్రగడ అన్నారు. రాజధాని అమరావతిలో స్మృతివనం ఏర్పాటు చేయాలని మీ కడుపు నుంచి కాకపోయినా.. పెదాల నుంచి వచ్చినందుకు సంతోషమని ముద్రగడ అన్నారు. గత కొద్ది రోజులగా స్మృతివనం ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
దళితులు నా ఇంట్లో భోజనం చేస్తే..
సాక్షి, న్యూఢిల్లీ : దళితుల ఇళ్లకు వెళ్లి.. వారితో భోజనం చేసినంత మాత్రాన తాము పవిత్రులం కాబోమని, అదే దళితులను తన ఇంటికి ఆహ్వానించి.. వారికి తన స్వహాస్తాలతో భోజనం వడ్డించినప్పుడే.. పవిత్ర భావం కలుగుతుందని కేంద్రమంత్రి ఉమాభారతి తెలిపారు. మధ్యప్రదేశ్ నౌగావ్‌లోని గాధ్మౌవ్ గ్రామంలో ఆమె సామాజిక సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, దళితుల ఇంటికి వెళ్లి.. వారితో భోజనం చేసినంత మాత్రాన దళితులకు గౌరవం లభించడంగానీ, సామాజిక సామరస్యం ఏర్పడటంగానీ జరగదని ఆమె అన్నారు. ‘ నేను వెళ్లి దళితుల ఇళ్లలో భోజనం చేసినంతమాత్రాన వారు పవిత్రులు అవ్వడానికి నేనేమీ రాముడ్ని కాదు. అందుకు బదులు నేనే దళితులను నా ఇంటికి పిలిచి.. వారికి స్వయంగా భోజనం వడ్డించినప్పుడు.. అది నన్ను పవిత్రురాలిని చేస్తుంది’ అని ఆమె అన్నారు. ‘నన్ను నేను శ్రీరాముడినని భావించుకోను. అందుకే సామాజిక సామూహిక భోజనాల్లో నేను పాల్గొనను’ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ.. ఆమె దళితులతో కలిసి భోజనం చేయలేదు. వేరే ప్రభుత్వ కార్యక్రమాలు ఉండటంతో త్వరగా వెళ్లాల్సి వచ్చిందని, అందుకే భోజనంలో పాలుపంచుకోలేదని ఆమె తర్వాత వివరణ ఇచ్చారు. ‘దళితులను అంటరానివారిగా చూసే రోజులు.. వారితో కలిసి భోజనం చేస్తే.. వారు ఆనందపడి.. స్వాధికారిత వస్తుందనుకునే రోజులు పోయాయి. దళితులు ఇప్పుడు ఆర్థిక, సామాజిక సావలంబన కోరుకుంటున్నారు. ప్రభుత్వ, పరిపాలనలో భాగం కోసం తపిస్తున్నారు’ అని ఆమె తెలిపారు. -
దళితులను దగా చేస్తున్న ప్రభుత్వాలు
స్టేషన్‌ఘన్‌పూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను దగా చేస్తున్నాయని టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చేపూరి వినోద్ విమర్శించారు. శివునిపల్లిలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. టీపీసీసీ కార్యదర్శిగా ఎన్నికైన వినోద్‌ను పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్.. తీరా రాష్ట్ర ఏర్పాటయ్యాక దళితులను దగా చేశారని విమర్శించారు. ఎట్టకేలకు డాక్టర్ రాజయ్యను డిప్యూటీ సీఎం చేసిన కేసీఆర్.. ఆరునెలల్లోనే బర్తరఫ్ చేశారని తెలిపారు. ఇంటికో ఉద్యోగమంటూ యువతను, నిరుద్యోగులను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారని, కానీ ఎక్కడా ఉద్యోగాల భర్తీ ఊసే లేదన్నారు. కేవలం వారి కుటుంబంలోనే ఐదుగురికి రాజకీయ ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ హామీ ఇంతవరకూ ఆచరణకు నోచుకోలేదని ఆరోపించారు. దళిత, గిరిజనులకు రక్షణ కవచంలా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై దళితులు, బడుగు, బలహీన వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయని, రానున్న రోజుల్లో ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తుల కట్టయ్య, ఘన్పూర్ పట్టణ అధ్యక్షుడు గోనెల ఎల్లయ్య, నాయకులు బైరు బాలరాజు, న్యాయం సంపత్‌రెడ్డి, గాబు శ్రీనివాస్‌రెడ్డి, కుంభం ఉపేందర్, గుర్రం సోమయ్య, ఓరుగంటి వెంకటేశ్వర్లు, గుర్రం రాజు, కొడెపాక సుధాకర్, గొడుగు రాజయ్య, కత్తుల గట్టుమల్లు, బైరు నాగరాజు, భూక్య ఆము, భూక్య శ్రీను, నక్క పాపయ్య, ఏలియా, అశోక్ పాల్గొన్నారు. -
దళితులతో విందుపై ఉమాభారతి వ్యాఖ్యలివే..
సాక్షి, భోపాల్ : దళితులకు చేరువయ్యేందుకు పార్టీ తలపెట్టిన కార్యక్రమంలో బీజేపీ నేతలు తడబడుతుంటే కేంద్ర మంత్రి ఉమాభారతి ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను దళితుల ఇళ్లకు వెళ్లనని, తన ఇంటికే వారిని ఆహ్వానించి స్వయంగా వారికి వడ్డిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. తనతో భోజనం చేసిన వారంతా పునీతమవుతారని శ్రీరాముడిలా తాను భావించనని, దళితులు తమ ఇంటికి వచ్చి విందు ఆరగిస్తేనే తాము పునీతమవుతామని భావిస్తానన్నారు. మధ్యప్రదేశ్‌లోని చత్తార్పూర్ జిల్లాలో సామాజిక సమగ్రతా విందు కార్యక్రమంలో పాల్గొంటూ ఉమాభారతి ఈ వ్యాఖ్యలు చేశారు. సామూహిక భోజనాల్లో తాను పాలుపంచుకోనని తాను స్వయంగా దళితుల వద్దకు వెళ్లడం లేదా వారిని తమ ఇంటికి విందుకు ఆహ్వానించడం చేస్తానన్నారు. తన చేతులతో దళితులకు వడ్డించినప్పుడే తాము దీవించబడతామని నమ్ముతానన్నారు. ‘మీరు ఢిల్లీకి రండి..అక్కడ మీకు భోజనం పెడతా..మా మేనల్లుడు మీరు తిన్న ప్లేట్లను శుభ్రం చేస్తారు..అయితే ఇక్కడ మాత్రం మీతో కలిసి నేను విందు ఆరగించలే’నని ఈ సందర్భంగా వేదిక ముందున్న వారిని ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు. ఇక ఉమాభారతి వ్యాఖ్యలతో యూపీ మంత్రి దళితుల ఇళ్లకు వెళుతున్న మంత్రులను రాముడితో పోల్చారు. రామాయణంలో చెప్పినట్టు శబిరి ఎంగిలిపళ్లను తిన్న రాముడి మాదిరిగా బీజేపీ నేతలు సైతం దళితుల ఇళ్లకు వెళ్లి వారిని ఆశీర్వదిస్తున్నారని అన్నారు.మరోవైపు దళితుని ఇంట విందు ఆరగించిన యూపీ మంత్రి సురేష్ రాణా హోటల్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నారన్న విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. -
వారికి బౌద్ధం శరణం గచ్చామి!
సాక్షి, గాంధీనగర్ : గుజరాత్‌లోని ఉనా పట్టణంలో 2016, జూలై నెలలో గోసంరక్షుకుల దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఏడుగురు దళితులు, వారితోపాటు మూడువందల మంది ఇతర దళితులు ఆదివారం నాడు బౌద్ధమతం స్వీకరించారు. మోటా సమాధియాల గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ కుల రహిత బౌద్ధమతాన్ని స్వీకరించినప్పటికీ ఈ దళిత కుటుంబాలు అగ్రవర్ణాలు ఎక్కడ, ఎప్పుడు దాడిచేస్తాయోమోనని భయాందోళనలకు గురవుతున్నాయి. 2016, జూలైలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి కోలుకున్న రమేశ్ సర్వయ్య మీడియాతో మాట్లాడుతూ నాడు తమ ఏడుగురిపై దాడిచేసిన వారిలో ఒకరు ఏప్రిల్ 25వ తేదీన మళ్లీ తమలో ఇద్దరిపై దాడి చేశారని చెప్పారు. ఆ రోజు జరిగిన సంఘటన నుంచి ఇంతవరకు తమ కుటుంబాలపై కూడా మూడుసార్లు దాడులు చేసి బెదిరించారని ఆయన వివరించారు. 2016, జూలై 11వ తేదీన ఉనా పట్టణంలో చనిపోయిన ఆవు మాంసాన్ని ఒలుస్తాన్నారన్న కారణంగా రమేశ్ సర్వయ్య కుటుంబంలోని ఏడుగురు సభ్యులపై దర్బార్ అనే అగ్ర కులానికి చెందిన 40 మంది దాడి చేశారు. సర్వయ్య నలుగురు సోదరులను బట్టలిప్పించి ఇనుప రాడ్లతో కొట్టారు. మరో ముగ్గురిని జీపుకు కట్టి లాక్కుపోయారు. వారి ఒల్లంత హూనమై స్పహతప్పి పడిపోయిన సందర్భంలో వారిని ఒదిలేసి వెళ్లిపోయారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సష్టించడంతో 43 మంది నిందితులపై పోలీసులు కేసు పెట్టారు. వారిలో 35 మంది బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసులో విచారణే ప్రారంభంకాలేదు. ఇక తమను ఎప్పటికి హిందువులు తమ వారిగా గుర్తించరని, వారి నుంచి రక్షణ కూడా లేదని గ్రహించే ఇప్పుడు బౌద్ధం పుచ్చుకున్నట్లు సర్వయ్య వివరించారు. 2016 సంఘటన జరిగిన నాటి నుంచి దాదాపు 60 వేల మంది దళితులు దేశంలో బౌద్ధం స్వీకరించాలని నిర్ణయించారు. అందుకోసం ర్యాలీలు కూడా నిర్వహించారు. వివిధ కారణాల వల్ల అంత మంది బౌద్ధంలోకి వెళ్లలేదు. అధికారిక లెక్కల ప్రకారం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు ఐదున్నర వేల మంది బౌద్ధ మతం స్వీకరించారు. -
గుర్రమెక్కావా? అయితే చచ్చావే..
ఒకప్పుడు.. వాళ్లు వీధుల్లో నడిస్తే మట్టి మలినమవుతుందన్నారు.. అడుగులను చెరిపేసేందుకు వెనక తాటాకులు కట్టుకోమన్నారు.. ఉమ్మి నేలపైపడ్డా అరిష్టమేనని మూతికి ముంత తగిలించి తిరగమన్నారు.. వారి మేనిని సోకే గాలిని మళ్లించలేమనుకున్నారేమో.. ఊరుఊరునే తూర్పుకి తరలించేశారు.. కాలం మారిందని.. ఇప్పుడా పరిస్థితి లేదనుకుంటున్నారేమో.. దళితులపై దాష్టీకానికి తాజా తార్కాణం గుజరాత్లో వెలుగు చూసింది.. గుర్రమెక్కాడని.. పట్టుమని పాతికేళ్లయినా నిండని యువకుడిని పొట్టన బెట్టుకున్నారు. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలోని తంబి ఓ కుగ్రామం.. అక్కడ నివసించే ప్రదీప్ రాథోడ్ అనే యువకుడు.. చాలా ముచ్చటపడి.. తండ్రి చెవినిల్లు కట్టి మరీ ఓ గుర్రాన్ని కొనుక్కున్నాడు. అప్పుడప్పుడూ గుర్రమెక్కి సవారీకి వెళ్లడమూ ప్రదీప్‌కు ఇష్టమైన పని. ఇది కాస్తా.. అక్కడి రాజ్‌పూత్‌లకు కంటగింపుగా మారింది. అగ్గి మీద గుగ్గిలమయ్యారు. గుర్రం దిగు, లేదా నీ కడుపులో బల్లేలు దిగుతాయన్నారు. ఆ ఊళ్లో వాళ్లే కాదు పక్క ఊళ్లలోని వాళ్లు కూడా బెదిరింపులకు దిగారు. నువ్వు గుర్రం ఊసెత్తొద్దని.. అయినా వింటేనా? నా గుర్రం.. నా ఇష్టం అన్నాడు ప్రదీప్. షేడెడ్ జీన్స్ వేసుకుని, కాలుమీద కాలేసుకుని, గుర్రం మీద దర్జాగా రాజులా కూర్చొని ఫొటోకి ఫోజు కూడా ఇచ్చాడు ఆత్మగౌరవం కలిగిన ఆ కుర్రాడు. అంతే అగ్రవర్ణాలకి కడుపులో కాలింది. ఒక రోజు.. ఠీవీగా ప్రదీప్‌ని ఎక్కించుకుని వెళ్లిన గుర్రం ఒంటరిగా తిరిగొచ్చింది. రాథోడ్ తండ్రి గుండెలు గుభేలుమన్నాయి. యజమాని ప్రదీప్ రాథోడ్‌ని చంపేశారు. ఈ ఘటన గత నెలాఖరున జరిగింది. ప్రదీప్ ఒక్కడే కాదు సుమా! గుజరాత్లో ఇలాంటి చావులు కొత్తకాదు. అమ్మాయిలపై అకృత్యాలు అంతకన్నా కొత్తకాదు. అక్కడ భూస్వాములైన క్షత్రియులు చెప్పిందే శాసనం. కాదూ కూడదంటే రాథోడ్లాగే తలెగరేసిన వారి తలలు తెగనరికేస్తారు. కేసులేవీ ఠాణాలకు ఎక్కనూ ఎక్కవు. ఇది అన్యాయమని ఎవరైనే ప్రశ్నిస్తే ‘అబ్బే ఆ కుర్రాడంత మంచోడేం కాదు. గతంలో ఎప్పుడో ఓ అమ్మాయి ముందు పిల్లిమొగ్గలు వేసిన ‘దుష్ట చరిత్ర’కూడా ఉంద’ని కాకమ్మ కబుర్లు చెప్పే ఘటికులు అక్కడి ఖాకీలు. -
‘చంద్రబాబుపై సీబీఐ విచారణ జరపాలి’
సాక్షి, విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు మేరుగు నాగార్జున విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకుని కలుషితం చేస్తున్నారన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య రాసిన లేఖకు బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టించిన చంద్రబాబుపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో దళితులకు, గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దళితులపై దాడులు జరిగితే పట్టించుకోరని మండిపడ్డారు. సబ్‌ప్లాన్ ద్వారా ఎంతమంది దళితులు లబ్ధి పొందారని ఆయన ప్రశ్నించారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. మట్టి, ఇసుక, దేవుడి భూములను కూడా వదలడం లేదని ఆరోపించారు. చంద్రబాబు మళ్లీ దళితులను మోసం చేస్తున్నారన్నారు. -
దళితుల హక్కులపై దాడి: కడియం
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా రాజ్యాంగంతోపాటు దళితుల హక్కులపై దాడి జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇప్పుడిప్పుడే ఎస్సీ, ఎస్టీలు ఎదుగుతున్నారని, అన్యాయాల గురించి ప్రశ్నిస్తున్నారని, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అణచివేసే కుట్ర సాగుతోందని అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 127వ జయంతి ఉత్సవాలు శుక్రవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కడియం మాట్లాడుతూ అంబేడ్కర్ ఎంతో ముందుచూపుతో రాసిన రాజ్యాంగం నేటి సమకాలీన సమస్యలకు కూడా పరిష్కారం చూపుతోందన్నారు. ఆరు దశాబ్దాలపాటు పోరాటం జరిగినా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. కేంద్రం ఇచ్చిన వివరాలను బట్టి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కోరలను సుప్రీంకోర్టు తీసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు ఎత్తివేయాలని కొంతమంది ఆందోళన చేస్తున్నారని, ఇలాంటివాటి పట్ల దళితులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. దళితులు సంఘటితంగా ఉన్నప్పుడే పార్టీలు, ప్రభుత్వాలు భయపడతాయని అన్నారు. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ వద్ద జరిగిన చర్చలో దళితబిడ్డలకు నాణ్యమైన విద్య అందించేందుకు 125 గురుకులాలు ఏర్పాటు చేయాలని కోరానని, అయితే సీఎం ఏకంగా 577 గురుకులాలు ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్ బాటలో నడుస్తోందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే బాబూమోహన్, ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘న్యాయవ్యవస్థ అగ్రకులాలతో నిండిపోయింది’
సాక్షి, సూర్యాపేట: న్యాయవ్యవస్థ అంతా అగ్రకులాలతో నిండిపోయిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏ ఒక్క దళిత, గిరిజనులు సుప్రీంకోర్టు జడ్జీలు కాలేకపోయారన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాలను బలహీనం చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకే అట్రాసిటీ చట్టంలో ఉన్న పదునైన కోరలను తొలగించేందుకు కుట్ర జరిగిందన్నారు. భవిష్యత్తులో రిజర్వేషన్లు ఎత్తివేసుందుకే ముందస్తుగా ఈ యాక్ట్‌ను బలహీనపరిచే కుట్రలను కేంద్రం చేయకుండా.. సుప్రీం కోర్టు ద్వారా చేయించిందని ఆయన విమర్శించారు. -
కేంద్ర మంత్రి మాల వేస్తే...దళితులు ప్రక్షళన చేశారు
వడోదర : కేంద్ర మంత్రి మేనకా గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మేనకా గాంధీ పూలమాల వేయడంతో ఆ ప్రాంతమంతా కలుషితమైందని కొంత మంది దళితులు విగ్రహాన్ని ప్రక్షాళన చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా మేనకా గాంధీ శనివారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు ఎంపీ రంజరన్ బెన్, ఇతర బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. వీరంతా అక్కడకు చేరుకున్న సమయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఠాకూర్ సోలంకి నేతృత్వంలోని దళితులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు... దళితుల మధ్య కొంతసేపు ఘర్షణ జరిగింది. వారు తిరిగి వెళ్లిపోయిన తర్వాత దళిత సంఘం కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహాన్ని పాలు, నీటితో ప్రక్షాళన చేశారు. బీజేపీ నేతల రాక వల్ల ఆ ప్రాంతం కలుషితమైపోయిందని, అందుకే ప్రక్షాళన చేశామని సోలంకి వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకుల ఘెరావ్.. అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించడానికి దళిత కార్యకర్తలు, బీజేపీ నాయకుల కంటే ముందే స్థానిక జీఈబీ సర్కిల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో దళిత కార్యకర్తలు బీజేపీ నాయకులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్కిల్ వద్దకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
దళిత యువశక్తి @ 2019
భారత జనాభాలో అయిదోవంతు ఉన్న దళితులు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారనున్నారు. కొత్త తరం దళితుల సంఖ్య ఈసారి గణనీయంగా పెరగడంతో ఎన్నికల్లో వారే కీలక ఓటు బ్యాంకు కానున్నారు. 2.3 కోట్ల మంది యువ దళిత ఓటర్లు తొలిసారిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. దేశం మొత్తమ్మీద ఉన్న దళిత జనాభాలో వీరే 19 శాతం ఉన్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే వారి సంఖ్య అత్యధికంగా ఉంది. 1991–2011 మధ్య కాలంలో భారత జనాభా పెరుగుదల రేటు కంటే దళిత జనాభా పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఈ సారి యువ దళిత ఓటర్ల సంఖ్య పెరిగింది. అలాగే ఈ కొత్త తరం ఓటర్లలో 90 శాతం మంది చదువుకున్నవారే. తత్ఫలితంగా దళితులు సామాజికంగా ఎంత అణచివేతకు గురవుతున్నారు? ఏయే రంగాల్లో తమ వర్గం పరిస్థితి ఎలా ఉందన్న అవగాహన వారిలో బాగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతం 27,518 ఉద్యోగాలు ఖాళీగా ఉండగా వాటిలో మూడో వంతు దళితులకు రిజర్వ్ చేసినవే. కానీ ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి 2012 సంవత్సరం నుంచి ఒక్క ప్రయత్నం కూడా జరగలేదు. అలాగే దళిత వర్గానికి చెందిన వారు వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారుల కంటే బాగా కింది స్థాయి ఉద్యోగాల్లోనే ఎక్కువగా పనిచేస్తుండటంతో యువ దళితులు అసహనంతో ఉన్నారు. అన్యాయాలపై గళమెత్తి ప్రశ్నించే వారి సంఖ్య కూడా పెరిగింది. బుజ్జగించే వ్యూహంలో బీజేపీ దళితుల్ని ఆకట్టుకోవడం కోసం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 127వ జయంతి సందర్భంగా బీజేపీ పలు వ్యూహాలను రచిస్తోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై పెరిగిపోతున్న దాడులు, అంబేడ్కర్ విగ్రహాల కూల్చివేతలు, వాటికి కాషాయ రంగులు పూయడం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తాజా తీర్పు వంటి పరిణామాలతో దేశంలో దళితులు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు మోదీ దళిత వ్యతిరేకి అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే అంబేడ్కర్ స్మారకం ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ యువ దళిత ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్