సాక్షి, విశాఖపట్నం: దళితులపై చంద్రబాబుకు ప్రేమ లేదని.. ప్రేమ ఉన్నట్లు డ్రామా ఆడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళిత యువకుడిపై దాడి ఘటనలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారని, 12 గంటల్లోనే దోషులను పట్టుకున్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు జరిగితే ఎలాంటి చర్యల్లేవని.. దళితులపై టీడీపీ నేతలు దాడులు చేస్తే ఆయన ఎందుకు మాట్లాడలేదని ధర్మశ్రీ ప్రశ్నించారు. (చదవండి: బాబూ.. విశాఖపై ఎందుకు విషం?)
‘దళితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారు. ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. కులాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని’’ ఆయన మండిపడ్డారు. తప్పు చేస్తే ఎంతటివారినైనా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తోందన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పనుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించామని పేర్కొన్నారు. సీఎం జగన్ ఎప్పుడూ దళితుల పక్షానే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర లో చంద్రబాబు కులరాజకీయాలు చేస్తే సహించేది లేదని, బాధ్యతయుతమైన ప్రతిపక్ష నేత గా వ్యవహరించాలని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హితవు పలికారు.(చదవండి: చంద్రబాబు దళిత ద్రోహి: దళిత నేతలు)
Comments
Please login to add a commentAdd a comment