సాక్షి, విశాఖపట్నం: నమ్మకానికి, మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. సూపర్ సిక్స్ అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిలదీశారు.
‘‘రైతులకు ఇస్తానన్న పెట్టుబడి సాయం రూ.20 వేలు ఏమైంది?. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బకాయిలు పెట్టారు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు.ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. ఈ ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇస్తామని మొదట్లోనే చెప్పాం. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. అన్ని జిల్లాల్లో పోరుబాట ఉధృతం చేస్తాం. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ఎండగడతాం’’ అని అమర్‌నాథ్ తెలిపారు.
‘‘ఈ ఏడాది వైఎస్ఆర్సీపీ, కూటమి ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం చూశారు. ప్రజలు నమ్మించి మోసం చేసిన పార్టీ కుటమిది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ వైఎస్సార్‌సీపీ. కూటమి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.. వైఎస్ జగన్ తన పాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారు. ఐదేళ్లలో 2.75 లక్షల కోట్లు ప్రజల ఖాతాలో వేశారు.
..భోగాపురం ఎయిర్పోర్ట్, సచివాలయాలు, మెడికల్ కాలేజీలు నిర్మించారు. నాడు-నేడు ద్వారా విద్య వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేశారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని మొదటి సంతకం చంద్రబాబు పెట్టారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. సూపర్ సిక్స్ అని చెప్పి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. మేము చేసిన ప్రజా వ్యతిరేక పోరాటాలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది.
ఇదీ చదవండి: అత్యంత ధనిక సీఎం చంద్రబాబు
..తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాలు లేదు. మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, ఒక్కొక్క మహిళకు 1500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు..\ ప్రజా సమస్యలపై రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. త్వరలో జిల్లాలు వారీగా వైఎస్ జగన్ పర్యటిస్తారు. ఏడు నెలల కాలంలో లక్ష 12 వేల కోట్లు అప్పు చేశారు. గతంలో 400 కోట్లు ఉంటే దేశంలో ధనిక సీఎం వైఎస్ జగన్ అని ప్రచారం చేశారు. సుమారు రూ. 950 కోట్లు చంద్రబాబు సంపాదించారు. దేశంలోనే ధనిక సీఎం గా చంద్రబాబు పేరు సంపాదించారు. చంద్రబాబు ఆస్తుల పక్కన ఒకటో రెండో సున్నాలు మర్చిపోయి ఉంటారు.’’ అంటూ అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు.
‘‘రెండు ఎకరాల నుంచి కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారు?. చంద్రబాబు ఆస్తులపై ప్రజలకు సమాధానం చెప్పాలి. చంద్రబాబు రెండు ఎకరాల నుంచి వెయ్యి కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు ఉంగరం వాచ్ ఫోన్ పెట్టుకోలేనంత మాత్రాన ఆస్తులు లేవంటే ప్రజలు నమ్మరు. సంక్షేమ పథకాలు అమలు చేయక చివరికి దేవుడుకి ఆదాయం కూడా పడిపోయింది. బీసీ మంత్రులను కూటమి నేతలు టార్గెట్ చేస్తున్నారు. గౌతు శిరీషతో క్షమాపణ చెప్పించారు. ఉత్తరాంధ్ర మంత్రి బొత్స సత్యనారాయణ కు ఎదురు పడితే ఆ మంత్రిని టార్గెట్ చేశారు. ప్రధాని పర్యటన ముందే స్టీల్ ప్లాంట్ పై కూటమి తమ వైఖరిని చెప్పాలి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయా లేదా అనేది ఎంపీకి తెలియక పోవడం ఆశ్చర్యం’’ అని అమర్‌నాథ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు..
Comments
Please login to add a commentAdd a comment