‘టీడీపీ నేతలు దోచుకుంటున్నారు’ | Merugu Nagarjuna Slams Chandrababu Naidu Over Dalit Issues | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 29 2019 8:03 PM | Last Updated on Wed, Jan 30 2019 7:45 AM

Merugu Nagarjuna Slams Chandrababu Naidu Over Dalit Issues - Sakshi

సాక్షి, కర్నూలు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో దళితులు అణచివేతకు గురవుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగర్జున విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో దళితులు అభివృద్ధికి, సంక్షేమానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమేనని గుర్తుచేశారు. కానీ  నేడు టీడీపీ నేతలు ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులను దోచుకుంటున్నారని ఆరోపించారు.

దళితులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చంద్రబాబు హయంలో దళితులపై దాడులు జరుగుతున్న, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా.. దళిత మంత్రులు ఎందుకు ప్రశ్నించడంలేదని నిలదీశారు. దళితుల పట్ల చంద్రబాబు వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని.. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు వారు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement