మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు
గంగవరం(చిత్తూరు జిల్లా): దళితులపై టీడీపీకి చెందిన అగ్రవర్ణాలవారు దాడులకు పాల్పడిన ఘటనలో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గురువారం మీడియా ఎదుట బాధితులు తమ ఆవేదన వెళ్లగక్కారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ మబ్బువారిపేట దళితవాడలో దాదాపు 30 ఇళ్లలో ప్రజలు నివాసం ఉంటున్నారు.
వీళ్లందరికీ అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ అంటే అమితమైన అభిమానం.దీన్ని జీర్ణించుకోలేని ఇదే గ్రామంలో టీడీపీకి చెందిన అగ్ర కులస్థులు నిత్యం కులం పేరుతో దూషించడం, అవమానించడం వంటివి పరిపాటిగా సాగిస్తున్నారు. బుధవారం రాత్రి వారు పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటుండగా.. టీడీపీకి చెందిన అల్లరిమూకలు దుర్గ, గోవర్ధన్, రాకేష్ మరి కొంతమంది అనుచరులతో వెళ్లి అక్కడ గొడవలు సృష్టించారు.
ఇంతలో రవి అనే వ్యక్తి అందరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. అందరూ కలిసి అతనిపై పైశాచికంగా దాడి చేశారు. అడ్డొచ్చిన మహిళల పైనా దాడులకు పాల్పడి కులం పేరుతో దూషించినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు దళితులపై దాడి విషయాన్ని ఎమ్మెల్యే వెంకటేగౌడ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డిని వివరణ కోరగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
ఇదీ చదవండి: మా అవినీతినే బయటపెడతారా.. మీ అంతు చూస్తాం
Comments
Please login to add a commentAdd a comment