టీడీపీ నేతల దాడి: ఇద్దరి పరిస్థితి విషమం  | TDP Leaders Attacked On Brothers | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల దాడి: ఇద్దరి పరిస్థితి విషమం 

Published Mon, May 17 2021 7:57 AM | Last Updated on Fri, Jul 23 2021 8:11 PM

TDP Leaders Attacked On Brothers

శ్రీకాళహస్తి రూరల్‌(చిత్తూరు జిల్లా): మండలంలోని మన్నవరం పంచాయతీ నిమ్మరాళ్లపల్లెలో వలంటీర్‌ జయప్రకాష్‌, అతడి తమ్ముడు వెంకటాద్రిపై టీడీపీ నాయకులు కత్తులతో దాడి చేయడంతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల తల్లి నాగమ్మ కథనం మేరకు.. గత స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున వలెంటీర్‌ తమ్ముడు వెంకటాద్రి చురుగ్గా పార్టీ వ్యవహారాల్లో పాల్గొన్నాడు.

దీంతో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు 600 నుంచి 120కి తగ్గిందన్న కక్షతో ఆదివారం గ్రామ శివారులో ఉన్న కొంతమంది స్థానికులను తీసుకొచ్చి కత్తులు, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో వలెంటీర్‌ జయప్రకాష్, అతడి తమ్ముడు వెంకటాద్రి  గాయపడ్డారు. క్షతగాత్రుల అరుపులు విని గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో వారు పరారయ్యారు.   క్షతగాత్రులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి వారి పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి రుయాకు సిఫార్సు చేశారు. ఈ మేరకు శ్రీకాళహస్తి పోలీసులు కేసు నమోదు చేశారు.

చదవండి: విడిపించేందుకు వెళ్లి.. ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు   
కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరితే ఇల్లు దోచేశారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement