Nara Lokesh : దళితులు పీకిందేమీ లేదు | Lokesh controversial comments at the Kurnool | Sakshi
Sakshi News home page

Nara Lokesh : దళితులు పీకిందేమీ లేదు

Published Fri, Apr 14 2023 4:44 AM | Last Updated on Fri, Apr 14 2023 5:14 AM

Lokesh controversial comments at the Kurnool  - Sakshi

సాక్షి ప్రతినిధి కర్నూలు: దళితులపై నారా లోకేశ్‌ నోరుపారేసుకున్నారు. అసభ్య పదజాలంతో ఆ వర్గాన్ని దూషించారు. ‘యువగళం’ పేరుతో చేస్తు­న్న పాదయాత్రలో లోకేశ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చనీయాంశమవుతున్నా­యి. పాదయాత్రలో భాగంగా గురువారం నంద్యా­ల జిల్లా డోన్‌ నియోజకవర్గానికి లోకేశ్‌ చే­రుకున్నారు. జక్కసానిపల్లి­లో ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా అనంతపురానికి చెందిన అక్కులప్ప అనే దళితుడు విదేశీ విద్య, అవుట్‌ సోర్సింగ్, కస్తూరిబా గురుకుల పాఠశా­లలోని ఉద్యోగులను పర్మినెంట్‌ చేసే విషయంలో టీడీపీ వైఖరిని ప్రశ్నిం చాడు. టీడీపీ అధికారంలోకి వ­స్తే ‘అంబేడ్కర్‌ విదేశీ విద్య’ అ­ని పేరు మారుస్తారా? అన్నా­రు. ఇందుకు లోకే­శ్‌ బదులిస్తూ ‘విదేశీ వి­ద్య­ను చంద్రబాబు తీసు­­కొచ్చారు. కొంతమంది పిల్లలైనా విదేశాలకు వెళ్తే, మరో పదిమంది వె­ళ్తారనే ఉద్దే­శంతో ప్రారంభించారు. ప్రస్తు­తం చాలామంది పిల్లలు విదేశాలకు వెళ్లి ఇరుక్కుపోయారు. టీడీపీ ప్రభుత్వం ఒక ఏడా­ది ఫీజులు చెల్లించింది.

ఈ ప్రభుత్వం ఫీజు­లు చెల్లించలేదు. విదేశాల్లో చదివే విద్యార్థులు అప్పు­లపాలయ్యా­రు. విదేశీ విద్యతో పాటు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు తీసేశారు. ప్రభుత్వం రూ.­30కోట్లు పెట్టి యాడ్స్‌ ఇచ్చినంత మాత్రాన పిల్ల­లు విదేశాలకు వె­ళ్లరు. విదేశీ విద్యపై పోరాడిన వ్యక్తి మీ లోకేశ్‌. మంగళగిరి వేదికగా నేనే పోరా­డాను. దళితులు పీకింది లేదు... పొడిచింది లేదు. ఈయన పేరు పె­ట్టేందుకు!’ అని వివాదాస్పద వ్యా­ఖ్యలు చేశా­రు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర క­లకలంరేపుతు­న్నాయి. గతంలో లోకేశ్‌ తండ్రి చంద్రబాబు కూ­డా ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు?’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement