
సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళిత వ్యతిరేకి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. దళితుల పట్ల చంద్రబాబు చాలాసార్లు అక్కసు వెళ్లగక్కారని విమర్శించారు. మహానాడులో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ఎందుకు తీర్మాణాలు చేయలేదని ప్రశ్నించారు. అది మహానాడు కాదు మహా దగానాడు అని ఎద్దేవా చేశారు.
దళితుడన్న కారణంతోనే మోత్కుపల్లి నర్సింహులుని టీడీపీ నుంచి బహిష్కరించారని ఆరోపించారు. దళితుల పట్ల మంత్రి ఆదినారాయణ రెడ్డి అవహేళనగా మాట్లాడినా, వర్ల రామయ్య పబ్లిగ్గా విద్యార్థిని తిట్టినా చంద్రబాబు వివరణ కూడా అడగలేదని మండిపడ్డారు. రాజధాని పేరుతో భూములు స్వాహా చేశారని సుధాకర్ బాబు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment