TJR Sudhakar Babu
-
దళితులు అంటే చంద్రబాబుకు మొదట్నుంచి చులకన: TJR సుధాకర్ బాబు
-
‘కూటమి సర్కార్ లిమిట్స్ దాటిపోయింది.. మనం ఏపీలోనే ఉన్నామా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. అక్రమ కేసులు పెట్టి పోలీసు స్టేషన్లో చిత్ర హింసలు పెడుతోంది. అసలు మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా? లేదా? అని ప్రశ్నించారు.అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ.. దళిత యువకుడిపై అక్రమ కేసు బనాయించి హింసించారు. వర్షాలతో రాజమండ్రి రోడ్లు మునిగిపోతే ప్రశ్నించకూడదా?. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోద్బలంతోనే హింసించారు. ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. బాజీలాల్ అనే సీఐ దళిత యువకుడిని దారుణంగా కొట్టారు. దుస్తులు ఊడతీయించి మహిళా కానిస్టేబుల్ ఎదుట కూర్చోపెట్టారు. పరువు పోయిందని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.అక్రమ కేసులపై బాధితుడు పులి సాగర్ మాట్లాడుతూ.. వర్షానికి కాలనీలో నీళ్లు నిలిచిపోతే సోషల్ మీడియాలో పోస్టు పెట్టాను. అనంతరం, పోలీసులు స్టేషన్‌కు పిలిచి పచ్చి బూతులు తిట్టారు. చంపేస్తామని బెదిరించి పోలీసు స్టేషన్లో బట్టలూడదీశారు. పీక కోసి రైలుపట్టాలపై పడేస్తానని ప్రకాష్‌నగర్ సీఐ బెదిరించారు. గోదావరిలో పడేస్తామని సీఐ దూషించారు. కానిస్టేబుల్‌తో దుస్తులు ఊడతీయించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు దుస్తుల్లేకుండా లాకప్‌లో కూర్చోపెట్టారు. మహిళా పోలీసుల ఎదుట నా పరువు తీశారు. విద్యావంతుడినైనా నన్ను ఇంత చిత్రహింసలకు గురి చేయటం ఎందుకు?. నాకు ఈ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్చ లేదా? అని ప్రశ్నించారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. దళితులు అంటే చంద్రబాబుకు మొదటి నుంచి చులకన భావమే. చంద్రబాబు దళిత వ్యతిరేకి. సమస్యలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే తప్పేంటి?. సాగర్‌ను బండబూతులు తిట్టి, బట్టలు విప్పిన సీఐపై చర్యలు తీసుకోవాలి. పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది?. కూటమి పాలనలో కులం పేరుతో దూషణలు, దళిత వ్యతిరేక భావనలు ఉన్నాయి. కూటమి సర్కార్ పూర్తిగా లిమిట్స్ దాటిపోయింది. బాధితుడు సాగర్‌కు జరిగిన అన్యాయంపై పోరాడుతామని చెప్పారు. రైలు కింద అతని తలకాయ పెడతానని బెదిరించారు. తాడు కట్టి గోదావరిలో వేస్తామనటం ఏంటి?. సీఐ బాజీలాల్ని వెంటనే సస్పెండ్ చేయాలి. దళితులంతా ఏకతాటిపైకి వచ్చి ఈ విషయంపై స్పందించాలి. పెద్ద ఎత్తు ఉద్యమం చేస్తాం. దళిత అధికారులపై కూడా కక్ష కట్టి వేధిస్తున్నారు. టీడీపీ నేతల కళ్లల్లో ఆనందం చూడటం కోసమే పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఎదురుగా కనిపిస్తున్న తప్పులను ప్రశ్నిస్తే కూడా కేసులు పెడతారా?. దళితుల గొంతు మీద కాలు పెట్టి తొక్కుతున్నారు. దళిత అధికారులు, దళిత మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో దళితులకు బతికే అవకాశం లేకుండా చేస్తున్నారు. పులి సాగర్ విషయంలో న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం అని హామీ ఇచ్చారు. -
నీ పాపం పండుద్ది.. ఊరికే పోదు
-
సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఆగని వేధింపులు
-
‘నియంత పాలనకు..చంద్రబాబు సర్కారుకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయ్’
సాక్షి,తాడేపల్లి : సాక్షి,తాడేపల్లి : నియంతలు,నీరోల పాలనకు చంద్రబాబు పాలనకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో టీజేఆర్ సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కును మన రాజ్యాంగం కల్పించిందిపాలకులు రాచరికపు పోకడలు పోవటానికి వీల్లేదుకానీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారా?ప్రజల ప్రాథమిక హక్కులన్నిటినీ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారుఅలాంటి చంద్రబాబుకు రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపకునే హక్కు లేదురెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే చంద్రబాబుకు పాలనకు అనర్హుడుచెప్పినట్టు కేసులు పెట్టించకపోతే మంత్రి పదవిలో నుండి దిగిపోవాలని మంత్రి అనితని పవన్ కళ్యాణ్ అన్నారుఇదేనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే తీరు?నియంతలు, నీరోల పాలనకు చంద్రబాబు సర్కారుకు దగ్గరి పోలికలు ఉన్నాయిదళిత నేత నందిగం సురేష్ ను అన్యాయంగా జైలుపాల్జేశారుదళిత నాయకత్వాన్ని చంపేసే కుట్ర చంద్రబాబు చేస్తున్నారువైఎస్ జగన్ దళితులకు అందించిన సంక్షేమాన్ని నిలిపేసిన చంద్రబాబుకు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదుచిన్నారులపై అత్యాచారాలు చేసి చంపేస్తుంటే చంద్రబాబు దోషులను ఎందుకు అరెస్టు చేయనీయటం లేదు?జగన్‌పై నిత్యం విషం చిమ్మటానికే చంద్రబాబు పని చేస్తున్నారుచంద్రబాబు గెలుపులో ఏదో తేడా ఉందని అందరికీ అర్థం అవుతోందిఈవిఎంలలో తేడా వలనే గెలిచారని ప్రజలు అంటున్నారుభారీ సీట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వానికి సోషల్ మీడియా కార్యకర్తలను చూస్తే భయమెందుకు?ఇలాంటి నాయకులను రీకాల్ చేసే పరిస్థితులు రావాలిఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, ఇతర అనేక కార్యక్రమాలను ఆపేసిన చంద్రబాబుకు రాజ్యాంగాన్ని అమలు చేసే హక్కు లేదుఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబుకు రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు లేదుఅభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయిఇక్కడ ఈవీఎంలతో ఎందుకు జరుపుతున్నారు?రాజ్యాంగ పరిరక్షణకు అందరం నడుము బిగించాల్సిన సమయం వచ్చింది కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోము’ అని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. -
కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తుంది
-
ప్రశ్నిస్తే నేరమా?.. తప్పుడు కేసులపై న్యాయ పోరాటం: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని.. పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుధారాణి అనే మహిళను నాలుగు రోజుల క్రితం పోలీసులు తీసుకొచ్చారని.. ఇప్పటికీ కోర్టులో హాజరు పరచలేదని ధ్వజమెత్తారు.దీనిపై మేము హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాం. పిటిషన్ వేసినందుకు ఆమెపై మరో నాలుగు తప్పుడు కేసులు పెడతామని ఆమెని బెదిరిస్తున్నారు. రాయచోటికి చెందిన హన్మంతరెడ్డిని కూడా అలాగే తీసుకెళ్లారు. మేము పిటిషన్ వేశాక అతన్ని మదనపల్లెలో ఉంచామని పోలీసులు చెబుతున్నారు. వర్రా రవీంద్ర రెడ్డి విషయంలో ఏకంగా ఎస్పీనే బదిలీ చేశారు. ఎస్పీల స్థానంలో నాన్ కేడర్ ఎస్పీలను వేస్తామని ఐపీఎస్‌లను కూడా బెదిరిస్తున్నారు. ‘కేసులు నమోదు చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్లను బాధితులకు ఇవ్వటం లేదు ఇలా చేయటం ద్వారా ఏం చెప్పదలచుకున్నారు?’’ అంటూ మనోహర్‌రెడ్డి ప్రశ్నించారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ, ప్రశ్నిస్తే కేసులు పెట్టటం సరికాదని.. కాలం ఒకేలాగ ఎప్పుడూ ఉండదన్నారు. ప్రభుత్వం చేస్తోన్న తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టటం ఏంటి?. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కల్పిస్తున్నారు. మా కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తుంటే చూస్తూ ఊరుకోం. వారికి అన్నివిధాలా అండగా నిలబడుతున్నాం. పోలీసులు చేయ్యి చేసుకుంటే ఆ వివరాలు ఇవ్వాలని మా కార్యకర్తలను కోరుతున్నాం. సదరు పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తున్నాం. టీడీపీ అధికార ట్విట్టర్లోనే మాపై దారుణంగా పోస్టులు పెడితే డీజీపీ ఏం చేస్తున్నారు?ఇదీ చదివండి: వేధించకుంటే వేటే!..వైఎస్ జగన్‌ని దారుణంగా దూషిస్తుంటే డీజీపికి కనపడటం లేదా?. మరోసారి ఆ వివరాలన్నీ మేము డీజీపికి ఇవ్వబోతున్నాం. దీనిపై ఆయన కచ్చితంగా కేసులు పెట్టించాలి. లేకపోతే సదరు పోలీసులపై కూడా ప్రైవేట్ కేసులు వేస్తాం’’ అని టీజేఆర్ హెచ్చరించారు. -
ప్రజల దృష్టిని మళ్లించేందుకే బాబు కుట్రలు
నెల్లూరు(బారకాసు)/ఒంగోలు సిటీ/ప్రొద్దుటూరు: ‘దుష్ప్రచారం, డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబుకు రెండు కళ్లు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారు. అందువల్లే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం బురదచల్లుతూ తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయమ్మ కారుకు ప్రమాదం.. అంటూ కొత్త నాటకానికి తెరతీశారు.రెండేళ్ల క్రితం విజయమ్మ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైతే, టీడీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు దు్రష్పచారం చేయడం సిగ్గుచేటు’ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్‌బాబు, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వివిధ ప్రాంతాల్లో వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, కుట్రలను ఎండగట్టారు. మేం మాట్లాడితే తట్టుకోలేరు: కాకాణి రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉంటే వాటిలో 50లక్షల మందికి మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. ‘మా పార్టీ అధినేత వైఎస్ జగన్, ఆయన కుటుంబ వ్యవహారాలపై కొందరు పిచి్చపిచ్చి విమర్శలు చేస్తున్నారు. మేం కూడా అదేవిధంగా మాట్లాడితే తట్టుకోలేరు. ఎనీ్టఆర్ ఎవరి వల్ల చనిపోయారు? ఆయన స్థాపించిన పారీ్టని ఎలా చేజిక్కించుకున్నారనే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?’ అని ప్రశ్నించారు. ‘ఇసుక, మద్యం మాఫియాలో మీ ఎమ్మెల్యేలు ఏయే ఘోరాలు చేస్తున్నారో తెలుసుకుని వారిని తొక్కిపెట్టి నార తీయండి. హామీలు అమలుచేయని చంద్రబాబు, లోకేశ్‌ను తొక్కి పెట్టి నార తీయాలి.’ అని పవన్‌కళ్యాణ్‌కు కాకాణి సూచించారు. హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తారనే: టీజేఆర్ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ప్రజలకు ఆశలు కల్పించిన చంద్రబాబు ఎప్పటిలాగే మళ్లీ వమ్ము చేశారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని, హామీల అమలుపై ప్రజలు ఇక ప్రశ్నిస్తారని పేర్కొన్నారు. అందువల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్ జగన్ కుటుంబ వ్యవహారాలను తెరపైకి తెచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.‘దేశంలో అనేక రాజకీయ కుటుంబాల్లో విభేదాలు ఉన్నాయి. చంద్రబాబుకు గతంలో హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరితో విబేధాలు లేవా? తమ్ముడు రామ్మూర్తినాయుడుతోపాటు అనేక మంది కుటుంబ సభ్యులతో గొడవలు లేవా? హెరిటేజ్‌లో చంద్రబాబు తన తమ్ముడు, చెల్లెళ్లకు వాటాలు పంచారా?’ అని ఆయన నిలదీశారు. ‘కూటమి అధికారంలోకి వచి్చన నాలుగు నెలల్లోనే 77మంది మహిళలు మాయమైపోయారని వారి రక్షణ సంగతి చూడండి..’ అని పవన్‌కళ్యాణ్‌కు హితవుపలికారు. తన కుటుంబంలో జరిగిన ఘటనలను కూడా పవన్ గుర్తుచేసుకోవాలని సూచించారు. అవన్నీ కుట్రలేనా బాబూ?: రాచమల్లు వైఎస్ విజయమ్మ కారు ప్రమాదంపై తప్పుడు ప్రచారాలు, కథనాలను ఆపాలని టీడీపీ శ్రేణులను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి హెచ్చరించారు. ‘హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం, జూనియర్ ఎనీ్టఆర్ కారు రోడ్డు ప్రమాదానికి గురికావడం, చంద్రబాబు ఇంట్లో మహిళ ఆత్మహత్య, బాలకృష్ణ ఇంట్లో హత్యాయత్నం, సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి.. ఇవన్నీ కుట్రలేనా’ అని రాచమల్లు సూటిగా ప్రశ్నించారు. వాటన్నింటికి తాము లింక్ పెట్టి రాస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు. -
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రతీకార దాడులు చేస్తున్నారు
-
‘బాబూ.. మొన్నటి వరకు నందమూరి ఫ్యామిలీతో సఖ్యత ఉందా?’
సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన ఘోరంగా విఫలమైందన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పోలీసుల ద్వారా ప్రతిపక్షంపై కక్షసాధింపునకు పాల్పడుతోందని ఆరోపించారు.టీజేఆర్ సుధాకర్ బాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ అపర మేధావి అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంలో నిజంగా చంద్రబాబు మేధావే. అందుకే హామీలను అమలు చేయడం లేదు. కూటమి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క హామీని నెరవేర్చింది. అది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం. దీపం పథకంలో ఉచిత సిలిండర్ ఇస్తామని కూటమి నేతలు హామీ ఇవ్వలేదా? మరి ఇప్పుడు ఎందుకు డబ్బులు కట్టించుకుంటున్నారు.హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు సహా కూటమి నేతలు మహిళలను మోసం చేస్తున్నారు. గతంలోనూ డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఇలాగే మహిళలను మోసం చేశారు. రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. కూటమి పాలనలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చంద్రబాబుకు మొన్నటి వరకు నందమూరి ఫ్యామిలీతో, పురంధేశ్వరితో సఖ్యత ఉందా?. చంద్రబాబు తీరు చూస్తుంటే గురివింద సామెత గుర్తుకు వస్తుంది’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. -
BIG Queation: షర్మిలమ్మ బైబిల్ మీద ప్రమాణం చేసి కన్నీళ్లు కాదు కరెక్ట్ ఆన్సర్ కావాలి
-
షర్మిలకు మానవత్వం ఉందా..?: టీజేఆర్ సుధాకర్‌బాబు
సాక్షి,తాడేపల్లి: షర్మిలకు మానవత్వం ఉందా అని, వైఎస్సార్ శత్రువులతో షర్మిల చేతులు కలుపుతారా అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్‌బాబు ప్రశ్నించారు.శనివారం(అక్టోబర్ 26) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు.‘రేవంత్‌రెడ్డి,చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారారు.షర్మిల పాదయాత్రను వైఎస్సార్, వైఎస్జగన్ అభిమానులు కలిసి సక్సెస్ చేశారు. షర్మిల కోసం వైవీసుబ్బారెడ్డి ఎన్నోత్యాగాలు చేశారు’అని సుధాకర్‌బాబు పేర్కొన్నారు.ఇదీ చదవండి: చంద్రబాబు స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారు: పెద్దిరెడ్డి -
చేతకాని ప్రభుత్వం ఎలా ఉంటుందో చంద్రబాబు చేసి చూపించాడు
-
శాంతిభద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది
-
రెడ్ బుక్కే ముఖ్యమా.. మహిళ భద్రత ఎక్కడ?: టీజేఆర్ సుధాకర్ బాబు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగంతో కూటమి నేతలు భయపెడుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. రాష్ట్రంలో అరాచకాలను చంద్రబాబు ఎందుకు అదుపు చేయడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో దిశా యాప్‌తో మహిళలపై దౌర్జన్యాలను అరికట్టామని గుర్తు చేశారు.మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగంతో కూటమి నేతలు భయపెడుతున్నారు. ఎక్కువ కేసులు నమోదు చేయాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గంగలో కలిపారు. శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో అరాచకాలను చంద్రబాబు ఎందుకు అదుపు చేయడం లేదు. మహిళలపై జరుగుతున్న దాడులను ఎందుకు పట్టించుకోవడం లేదు.వైఎస్సార్సీపీ హయాంలో దిశా యాప్ తీసుకొచ్చాం. దిశా యాప్‌తో మహిళలపై దౌర్జన్యాలను అరికట్టాం. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. రోజుకొక ఘటన జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదు. దిశ యాప్ ఉన్నట్టయితే యువతి బతికి ఉండేది. అత్తకోడళ్లపై లైంగిక దాడులు జరిగేవి కావు. ఇప్పడు కూటమి ప్రభుత్వంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. మహిళలపై ఎన్ని దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ఒక్క సమీక్ష కూడా ఎందుకు చేయటం లేదు?.రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ కేసులు పెడుతున్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయింది. అందుకే బద్వేలు ఘటన లాంటివి జరుగుతూనే ఉన్నాయి. దళితులను అణచివేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అందుకే విశ్వరూప్ లాంటి బలమైన లీటర్లను టార్గెట్ చేశారు. హోంమంత్రి సెల్ఫీలతో కాలం గడుపుతున్నారే తప్ప పని చేయటం లేదు. పక్క పార్టీ వారిని తిట్టటమే తప్ప హోంమంత్రి ఏం చేస్తున్నారు?. ఒక్క ఘటనపై కూడా కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదు?. కేవలం నేమ్ ప్లేట్ హోంమంత్రిగానే మిగిలిపోయారు. వరుస ఘటనలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారిపోయింది. లోకేష్ ప్రసంగాలు నేర ప్రవృత్తి గల వారికి ఉత్ప్రేరకంగా మారింది. మచ్చమర్రి ఘటనలో చిన్నారి మృతదేహాన్ని కనీసం గుర్తించలేకపోయారు. పిఠాపురంలో టీడీపీ నేతే మత్తుమందు ఇచ్చి ఒక యువతిపై అత్యాచారం చేశాడు. నాలుగు నెలల్లోనే 74 ఘటనలు జరిగితే ఇక ఈ ఐదేళ్లలో పరిస్థితి ఏంటి?. మహిళలు, చిన్నారులకు రక్షణ ఉంటుందా?. పాలకుడే నేరాలు చేయమని ప్రోత్సాహిస్తుంటే ఇక ప్రజలు బతికేది ఎలా?.నందిగం సురేష్, పినిపే విశ్వరూప్ కుమారుడిని జైలులో పెట్టారు. ఆ పోలీసులతో రాజకీయాలను తారుమారు చేయాలని చూస్తున్నారు. టీడీపీ నేతలు ఆడినట్టు ఆడితే పోలీసులకు మచ్చ వస్తుంది. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించమని కోరుతున్నాం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థకు ఐదుసార్లు జాతీయ అవార్డులు వచ్చాయి. లోకేష్ పిల్ల రాక్షసుడుగా మారారు. ఆయన వలనే రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయి. సూపర్ సిక్స్ అమలు చేసేంత వరకు వైఎస్సార్సీపీ ఊరుకోదు. ఎన్ని కేసులు పెట్టినా, జైల్లోకి నెట్టినా మేము ప్రశ్నించకుండా ఆగము. ఎక్కువ కేసులు ఉన్నవాడే బెస్టు లీడర్ అని లోకేష్ అంటున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఖనిజ సంపద దోపిడీకి బాబు స్కెచ్
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ఖనిజ సంపద దోపిడీకి మాస్టర్ స్కెచ్ వేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు ఇసుక దోపిడీని వ్యవస్థీకృతం చేసి ప్రత్యక్ష దోపిడీకి దిగారని ధ్వజమెత్తారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎవరికీ అనుమానం రాకుండా కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ప్రజలంతా దసరా సందడిలో ఉంటే.. తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇసుక, మద్యం టెండర్ల పండుగలో ఉన్నారని చెప్పారు. ఎవరూ పాల్గొనే అవకాశం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఇసుక రీచ్‌ల టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తూ.. దోపిడీకి తెరలేపిందన్నారు.ఆ బిడ్ల వెనుక మర్మమేమిటి? టన్ను ఇసుక తవ్వడానికి రూ.90 నుంచి రూ.120గా బేస్ ధరగా టెండర్లలో నిర్ణయించి, చాలా జిల్లాల్లో టన్ను ఇసుక ధర రూ.50 నుంచి రూ.60కి తవ్వుతామని బిడ్లు దాఖలు చేయడం వెనుక మర్మమేంటని టీజేఆర్ నిలదీశారు. ఇసుక టెండర్లలో అక్రమాలకు ఈ ధరలే నిదర్శనమన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 17 రీచ్‌లకు 48 గంటల్లో టీడీపీ నేతల నుంచి బిడ్లు స్వీకరించి ఖరారు చేసేశారని, కర్నూలులో అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఒకే టెండర్ వస్తే బిడ్‌ను ఆమోదించారన్నారు.వైఎస్సార్, పల్నాడు, ఉభయ గోదావరి, అనంతపురం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనకాపల్లి, చిత్తూరు, విశాఖ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో బీజేపీ, జనేసేన నేతలతో కలసి టీడీపీ నాయకులు బ్లాక్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిల్వ ఉంచిన 80 లక్షల టన్నుల ఇసుకను అమ్ముకున్నారని మండిపడ్డారు. ఇసుకను ఉచితంగా ఇవ్వాలని, ఇసుక టెండర్లను రద్దు చేయాలని, లేకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. -
‘ఇసుక దోపిడీ.. చంద్రబాబు మాస్టర్ స్కెచ్’
తాడేపల్లి, సాక్షి: ఊహలకు అందని మాస్టర్ స్కెచ్‌తో ఇసుకను దోపిడీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరించి దోపిడీకి ప్లాన్ వేశారని అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇసుక పంపిణీలో లోపాలు జరిగినట్టు ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు గుర్తించాలని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘2014-19 మధ్యలో కూడా ఇదే కూటమి ప్రభుత్వం ఇసుక విధానం కోసం 19 జీవోలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, నాయకులకు ఎలా దోచిపెట్టవచ్చో చూపిస్తున్నారు. రాజకీయాల్లో ఎన్నికల హామీలకు విలువ లేదని చంద్రబాబు మళ్లీ నిరూపించారు. తాను మారినట్టు, ప్రజల కోసమే పని చేస్తుననట్టు నటిస్తున్నారు. అధికారంలోకి రాగానే తన నిజ స్వభావాన్ని చూపిస్తున్నారు. ఈరోజు 18 టన్నుల లారీ విలువ రూ.33 వేలకుపైగా ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలు బతికేదెలా?. మా హయాంలో రూ. 3,750 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. అందరూ దసరా పండుగ హడావుడిలో ఉంటే టీడీపీ నేతలు మాత్రం టెండర్ల పండుగలో ఉన్నారు. రెండు రోజుల్లోనే టెండర్లు పిలవటం ఏంటి?. ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎల్లోమీడియాలో వార్తలు ఎందుకు రావటం లేదు?.మద్యం టెండర్లలో టీడీపీ నేతలందరూ పాల్గొనలేకపోయారని వారి కోసమే రెండు రోజులు గడువు పెంచారు. మద్యాన్ని దూరం చేయాలని జగన్ కోరుకుంటే.. చంద్రబాబు మాత్రం ఏరులై పారించాలని చూస్తున్నారు. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా ఇసుకకు టెండర్ పెట్టేశారు. ప్రభుత్వ ఆదాయానికి పూర్తిగా గండికొట్టేలా వ్యవహరిస్తున్నారు.వర్షాకాలంలో ఉపయోగపడుతుందని 80 లక్షల టన్నుల ఇసుకను రెడీ చేసి పెడితే.. టీడీపీ నేతలు 40 లక్షల టన్నుల ఇసుకను అక్రమంగా అమ్మేసుకున్నారు.ఇప్పుడు భారీస్థాయిలో రేట్లు పెంచటానికి కారణం ఏంటో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సామాన్యలకు టెండర్లు వేసే అవకాశం లేకుండా చేశారు. కలెక్టరేట్ల దగ్గర టీడీపీ గూండాలు, రౌడీలు బెదిరించి తరిమేశారు. ఇదేనా కూటమి ప్రభుత్వపు పాలనా విధానం?. ఇసుకను కచ్చితంగా ఫ్రీగా ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వ హామీని అమలు చేయాల్సిందే’’ అని అన్నారు.చదవండి: టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు.. మంత్రికి నిరసన సెగ -
చంద్రబాబు మాస్టర్ స్కెచ్.. కూటమి నేతల జేబుల్లోకి 3000 కోట్లు ప్రభుత్వ సొమ్ము
-
ఉచిత ఇసుక హామీని చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసింది
-
ఉచిత ఇసుక ఏదీ బాబూ?: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: ఉచిత ఇసుక అంటూ ప్రజలకు చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉచిత ఇసుక హామీని చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసిందని.. ఇసుకను సామాన్యులకు అందకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు.‘‘కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించింది. ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు అల్లాడుతున్నారు. పని దొరుకుతుందనీ ఆశపడ్డ కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. ఎన్నికల హామీలను చంద్రబాబు సర్కార్ తుంగలో తొక్కింది. 120 రోజులైనా చంద్రబాబు ఒక్క హామీని నెరవేర్చలేదు. పేద ప్రజల ఉసురు, గోస చంద్రబాబుకు తగులుతుంది.’’ అంటూ సుధాకర్‌బాబు నిప్పులు చెరిగారు.ఇదీ చదవండి: ఎవరికోసం ఈ అవతారం?‘‘నచ్చిన ప్రదేశం నుంచి కావాల్సిన ఇసుక తెచ్చుకోవచ్చని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారు. ప్రపంచంలో మాట తప్పే నాయకుడు చంద్రబాబు తప్ప మరొక్కరు వుండరు. చంద్రబాబు, జనసేన, బీజేపీ భారీ స్కామ్ చేసింది. ట్రాక్టర్ ఇసుక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 3 వేలు ఉంటే ఇప్పుడు 10వేలు. 10 వేలు ఉండే లారీ ఇసుక ఇప్పుడు 20 వేలుపైనే అమ్ముతున్నారు. 2019 నుంచి 2023 వరకు ఇసుక పాలసీ విడుదల చేసి పారదర్శకంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఇసుకను అందుబాటులో లేకుండా చేసి.. ప్రధాన ఆదాయ వనరులుగా మార్చారు. ఇసుక పై మాట్లాడుతుంటే కేసులు పెడుతున్నారు...వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలపై దాడులు, గుళ్ల కూల్చివేతలు, ఆస్తుల ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది. చంద్రబాబు లక్ష పింఛన్లు తొలగించారు.. ఆ లబ్ధిదారుల ఉసురు చంద్రబాబుకి తగులుతుంది. దేవుడితో చంద్రబాబు పెట్టుకున్నాడు.. వెంకటేశ్వర స్వామితో పెట్టుకొన్న ఎవరు బాగుపడలేదు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చకొడుతున్న వాళ్లకు స్వామి సమాధానం చెపుతారు. 2016 నుంచి 2019 వరకు 19 జీవోలు ఇసుకపై చంద్రబాబు ఇచ్చాడు. చంద్రబాబు ఇంటికి అనుకునే ఇసుక అక్రమ రవాణా జరిగింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇసుక టెండర్ పద్దతిలో జరిగింది. 765 కోట్లు సంవత్సర ఆదాయం ఇసుక వల్ల వొచ్చేది.. 5 ఏళ్లలో 3వేల కోట్లు పైనే వొచ్చింది. మరి ఇప్పుడు ఈ ఆదాయం ఎటు పోయింది.?..80 లక్షల టన్నుల నిల్వ ఉంచింది గత ప్రభుత్వం.. ఆ టన్నుల దగ్గర చంద్రబాబు, లోకేష్ ఫోటోలు దిగారు.. ఆ ఇసుక ఏమైంది?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల లొనే 40 లక్షల టన్నుల ఇసుక మాయం అయింది. మాయం అయిన ఇసుక పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. భవన నిర్మాణ కార్మికులు, కార్మికుల కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయి. 2019-24 కాలంలో ఆదాయం ఖజానాకి చేరింది.. ఇప్పుడు కూటమి నేతల జేబుల్లోకి వెళ్లింది.’’ అని సుధాకర్‌బాబు దుయ్యబట్టారు. ఫ్రీ ఇసుక అంటూ ప్రజలకి @ncbn కుచ్చుటోపీ వైయస్ఆర్సీపీ ప్రభుత్వం స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకని నాలుగు నెలల్లోనే అడ్డదారిలో దోచేసిన తెలుగు తమ్ముళ్లురాష్ట్రంలో ఇసుక దొరక్క రోడ్డున పడ్డ 45 లక్షల మంది కార్మికులు గతంలో కంటే మూడింతలు ధర పెంచేసి ఈ 100… pic.twitter.com/yBVIyzVOvS— YSR Congress Party (@YSRCParty) October 6, 2024 -
బాధ్యత లేని బాబు సర్కార్‌పై పోరాటానికి సిద్ధం: టీజేఆర్ సుధాకర్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువ అవుతామన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. బాధత్యలేని ప్రభుత్వ తీరుపై పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్‌తో అనుబంధ సంఘాల నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బూత్ లెవల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పటిష్టం చేయాలని వైఎస్ జగన్ చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువ అవుతాం. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని అర్థం చేసుకున్నాం. ప్రభుత్వంపై మేము పోరాటం చేస్తాం.బాధ్యతలేని ప్రభుత్వ తీరుపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. దేశంలో ఏ పార్టీకి లేనంతగా పార్టీ నిర్మాణం చేస్తాం. ప్రజలకు అండగా నిలబడతాం. అన్ని స్థాయిల్లోనూ కార్యవర్గాలను నియమిస్తాం. అందరికీ ఐడీ కార్డులు కూడా ఇస్తాం. ఎవరెవరు ఎలా పని చేస్తున్నదీ సమీక్షలు చేస్తాం. చెదిరిపోయిన వాలంటీర్లను సమీకరిస్తాం. ప్రజల గొంతుకగా రానున్న రోజుల్లో పని చేస్తాం. 2029లో మళ్ళీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటాం. కమిటీ నిర్మాణాల అనంతరం సభ్యత్వ నమోదు ప్రారంభిస్తాం. ఈనెల 16, 17న వర్క్‌షాప్ నిర్వహిస్తాం. జిల్లా అధ్యక్షులతో కలిసి అన్ని విభాగాల నేతలు ఈ వర్క్‌షాపునకు హాజరవుతారు’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: టీటీడీ నిబంధనలు తుంగలో తొక్కేసిన పవన్.. -
ఏపీలో రౌడీరాజ్యం నడుస్తోంది
-
‘ఏపీలో రౌడీ రాజ్యం.. పరాకాష్టకు కూటమి అరాచకాలు’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని.. ప్రజల ఇళ్లపై కూటమి నేతలు.. దౌర్జన్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో టీడీపీ భ్రష్టు పట్టిందని.. వసూళ్లపై గ్రామాల్లో ఆ పార్టీ నేతలు పోటీపడుతున్నారని ధ్వజమెత్తారు.‘‘అమాయకులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిస్తున్నారు. చంద్రబాబు, పవన్ బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరింది. భక్తుల మనోభావాలతో చంద్రబాబు, పవన్ ఆడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు. ప్రజా సమస్యలను డైవర్ట్ చేసేందుకే విష ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలు దాడులు చేసి ఆ తర్వాత రాజీ కుదుర్చుతున్నారు’’ అని సుధాకర్‌బాబు దుయ్యబట్టారు.ఇదీ చదవండి: దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడిచంద్రబాబు డీఎన్ఏ లోనే దళిత వ్యతిరేక భావం ఉంది. దళితులను అణగతొక్కటం, హింసించటం చంద్రబాబు హయాంలో జరుగుతూనే ఉంటుంది. మంచిగా పనిచేసే అధికారులను సైతం వేధిస్తున్నారు. ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై దాడి అత్యంత హేయం. జనసేన ఎమ్మెల్యే నానాజీ దళిత ప్రొఫెసర్ పై దాడి చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపటం లేదు?’’ అంటూ టీజేఆర్ ప్రశ్నించారు.ఎమ్మార్వో వనజాక్షి మీద దాడి చేసిన ఎమ్మెల్యేతో చంద్రబాబు రాజీ చేయించారు. చంద్రబాబు పాలన వచ్చిందంటే రౌడీలు, గూండాలు రంగప్రవేశం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పటినుంచే నానాజీ వ్యవహారశైలి దుందుడుకు స్వభావం. జనసేనలోకి వెళ్లాక పవన్ స్వభావాన్ని కూడా అలవర్చుకుని రెచ్చిపోయాడు. జనసేన ఎమ్మెల్యే నానాజీ దాడులకు దిగుతుంటే పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు..వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేసిన ప్రతి ఒక్కరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఎమ్మెల్యేనానాజీ.. ప్రొఫెసర్‌పై దాడి చేయటం ప్రపంచమంతా చూసింది. నానాజీపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉమామహేశ్వరరావుకు మేము అండగా నిలుస్తాం. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదు..ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారాన్ని కూడా రాజీ చేశారు. వనజాక్షిపై దాడి చేసిన ఎమ్మెల్యేతో రాజీ చేశారు. ఇప్పుడు ఉమామహేశ్వరరావుతో కూడా నానాజీతో రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ దీక్షలు చేసినా ఆయన కడుపులో కుట్రలు ఉన్నాయి. దీక్షలు చేయటం కాదు.. నానాజీ లాంటి వారిపై చర్యలు తీసుకో పవన్.. దళితుల పిల్లలను సూర్యప్రకాశరెడ్డి నేలపై కూర్చోపెట్టి కొట్టారు...శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ స్క్రాబ్ వ్యాపారిని డబ్బుల కోసం బెదిరించారు. జనసేన, టీడీపీ నేతల భావజాలం అంతా దళిత వ్యతిరేకమే. ఉమామహేశ్వరరావుపై దాడి చేసిన నానాజీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి. వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించింది హత్యలు, దాడులు, కూల్చటాలే. ప్రతిరోజూ జగన్ మీద విమర్శలు చేయటం తప్ప ఇంకేం సాధించారు?. ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పటానికి రెడీగా ఉన్నారు’’ అని టీజేఆర్ సుధాకర్‌బాబు చెప్పారు. -
తిరుపతి లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలకు సుధాకర్ బాబు కౌంటర్
-
సీఎం చంద్రబాబు పచ్చి మోసగాడు: TJR సుధాకర్ బాబు