సాక్షి, అమరావతి: టీడీపీ నేతలు నోటికి హద్దూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు చంద్రబాబు, లోకేష్‌కు ప్రజలే సమాధానం చెప్తున్నారు. ఓటమిని చంద్రబాబు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. (చదవండి: అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలి: ఎంపీ అవినాష్‌రెడ్డి)
‘‘చంద్రబాబుతో పోలిస్తే జంతువులు కూడా సిగ్గుపడతాయి. కొడుకు చేతకానివాడని చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు చంద్రబాబు అసలు పోటీనే కాదు. టీడీపీ నేతలు ఉగ్రవాదులు మాట్లాడే భాష వాడుతున్నారు. సీఎం జగన్ పాలనలో దళారులు లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదు. ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లోకేష్ నాయకత్వాన్ని టీడీపీ నేతలే అంగీకరించడం లేదని’’ సుధాకర్‌బాబు ఎద్దేవా చేశారు.
చదవండి: ఆదినారాయణరెడ్డిని తరిమికొట్టాలి: నారాయణస్వామి
Comments
Please login to add a commentAdd a comment