సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని.. ప్రజల ఇళ్లపై కూటమి నేతలు.. దౌర్జన్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో టీడీపీ భ్రష్టు పట్టిందని.. వసూళ్లపై గ్రామాల్లో ఆ పార్టీ నేతలు పోటీపడుతున్నారని ధ్వజమెత్తారు.
‘‘అమాయకులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిస్తున్నారు. చంద్రబాబు, పవన్ బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరింది. భక్తుల మనోభావాలతో చంద్రబాబు, పవన్ ఆడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు. ప్రజా సమస్యలను డైవర్ట్ చేసేందుకే విష ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలు దాడులు చేసి ఆ తర్వాత రాజీ కుదుర్చుతున్నారు’’ అని సుధాకర్‌బాబు దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడి
చంద్రబాబు డీఎన్‌ఏ లోనే దళిత వ్యతిరేక భావం ఉంది. దళితులను అణగతొక్కటం, హింసించటం చంద్రబాబు హయాంలో జరుగుతూనే ఉంటుంది. మంచిగా పనిచేసే అధికారులను సైతం వేధిస్తున్నారు. ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై దాడి అత్యంత హేయం. జనసేన ఎమ్మెల్యే నానాజీ దళిత ప్రొఫెసర్ పై దాడి చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపటం లేదు?’’ అంటూ టీజేఆర్ ప్రశ్నించారు.
ఎమ్మార్వో వనజాక్షి మీద దాడి చేసిన ఎమ్మెల్యేతో చంద్రబాబు రాజీ చేయించారు. చంద్రబాబు పాలన వచ్చిందంటే రౌడీలు, గూండాలు రంగప్రవేశం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పటినుంచే నానాజీ వ్యవహారశైలి దుందుడుకు స్వభావం. జనసేనలోకి వెళ్లాక పవన్ స్వభావాన్ని కూడా అలవర్చుకుని రెచ్చిపోయాడు. జనసేన ఎమ్మెల్యే నానాజీ దాడులకు దిగుతుంటే పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు
..వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేసిన ప్రతి ఒక్కరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఎమ్మెల్యేనానాజీ.. ప్రొఫెసర్‌పై దాడి చేయటం ప్రపంచమంతా చూసింది. నానాజీపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉమామహేశ్వరరావుకు మేము అండగా నిలుస్తాం. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదు
..ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారాన్ని కూడా రాజీ చేశారు. వనజాక్షిపై దాడి చేసిన ఎమ్మెల్యేతో రాజీ చేశారు. ఇప్పుడు ఉమామహేశ్వరరావుతో కూడా నానాజీతో రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ దీక్షలు చేసినా ఆయన కడుపులో కుట్రలు ఉన్నాయి. దీక్షలు చేయటం కాదు.. నానాజీ లాంటి వారిపై చర్యలు తీసుకో పవన్.. దళితుల పిల్లలను సూర్యప్రకాశరెడ్డి నేలపై కూర్చోపెట్టి కొట్టారు.
..శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ స్క్రాబ్ వ్యాపారిని డబ్బుల కోసం బెదిరించారు. జనసేన, టీడీపీ నేతల భావజాలం అంతా దళిత వ్యతిరేకమే. ఉమామహేశ్వరరావుపై దాడి చేసిన నానాజీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి. వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించింది హత్యలు, దాడులు, కూల్చటాలే. ప్రతిరోజూ జగన్ మీద విమర్శలు చేయటం తప్ప ఇంకేం సాధించారు?. ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పటానికి రెడీగా ఉన్నారు’’ అని టీజేఆర్ సుధాకర్‌బాబు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment