
సాక్షి, తాడేపల్లి: ఉచిత ఇసుక అంటూ ప్రజలకు చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉచిత ఇసుక హామీని చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసిందని.. ఇసుకను సామాన్యులకు అందకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
‘‘కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించింది. ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు అల్లాడుతున్నారు. పని దొరుకుతుందనీ ఆశపడ్డ కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. ఎన్నికల హామీలను చంద్రబాబు సర్కార్ తుంగలో తొక్కింది. 120 రోజులైనా చంద్రబాబు ఒక్క హామీని నెరవేర్చలేదు. పేద ప్రజల ఉసురు, గోస చంద్రబాబుకు తగులుతుంది.’’ అంటూ సుధాకర్‌బాబు నిప్పులు చెరిగారు.
ఇదీ చదవండి: ఎవరికోసం ఈ అవతారం?
‘‘నచ్చిన ప్రదేశం నుంచి కావాల్సిన ఇసుక తెచ్చుకోవచ్చని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారు. ప్రపంచంలో మాట తప్పే నాయకుడు చంద్రబాబు తప్ప మరొక్కరు వుండరు. చంద్రబాబు, జనసేన, బీజేపీ భారీ స్కామ్ చేసింది. ట్రాక్టర్ ఇసుక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 3 వేలు ఉంటే ఇప్పుడు 10వేలు. 10 వేలు ఉండే లారీ ఇసుక ఇప్పుడు 20 వేలుపైనే అమ్ముతున్నారు. 2019 నుంచి 2023 వరకు ఇసుక పాలసీ విడుదల చేసి పారదర్శకంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఇసుకను అందుబాటులో లేకుండా చేసి.. ప్రధాన ఆదాయ వనరులుగా మార్చారు. ఇసుక పై మాట్లాడుతుంటే కేసులు పెడుతున్నారు.
..వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలపై దాడులు, గుళ్ల కూల్చివేతలు, ఆస్తుల ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది. చంద్రబాబు లక్ష పింఛన్లు తొలగించారు.. ఆ లబ్ధిదారుల ఉసురు చంద్రబాబుకి తగులుతుంది. దేవుడితో చంద్రబాబు పెట్టుకున్నాడు.. వెంకటేశ్వర స్వామితో పెట్టుకొన్న ఎవరు బాగుపడలేదు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చకొడుతున్న వాళ్లకు స్వామి సమాధానం చెపుతారు. 2016 నుంచి 2019 వరకు 19 జీవోలు ఇసుకపై చంద్రబాబు ఇచ్చాడు. చంద్రబాబు ఇంటికి అనుకునే ఇసుక అక్రమ రవాణా జరిగింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇసుక టెండర్ పద్దతిలో జరిగింది. 765 కోట్లు సంవత్సర ఆదాయం ఇసుక వల్ల వొచ్చేది.. 5 ఏళ్లలో 3వేల కోట్లు పైనే వొచ్చింది. మరి ఇప్పుడు ఈ ఆదాయం ఎటు పోయింది.?

..80 లక్షల టన్నుల నిల్వ ఉంచింది గత ప్రభుత్వం.. ఆ టన్నుల దగ్గర చంద్రబాబు, లోకేష్ ఫోటోలు దిగారు.. ఆ ఇసుక ఏమైంది?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల లొనే 40 లక్షల టన్నుల ఇసుక మాయం అయింది. మాయం అయిన ఇసుక పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. భవన నిర్మాణ కార్మికులు, కార్మికుల కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయి. 2019-24 కాలంలో ఆదాయం ఖజానాకి చేరింది.. ఇప్పుడు కూటమి నేతల జేబుల్లోకి వెళ్లింది.’’ అని సుధాకర్‌బాబు దుయ్యబట్టారు.
ఫ్రీ ఇసుక అంటూ ప్రజలకి @ncbn కుచ్చుటోపీ
వైయస్ఆర్సీపీ ప్రభుత్వం స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకని నాలుగు నెలల్లోనే అడ్డదారిలో దోచేసిన తెలుగు తమ్ముళ్లు
రాష్ట్రంలో ఇసుక దొరక్క రోడ్డున పడ్డ 45 లక్షల మంది కార్మికులు
గతంలో కంటే మూడింతలు ధర పెంచేసి ఈ 100… pic.twitter.com/yBVIyzVOvS— YSR Congress Party (@YSRCParty) October 6, 2024
Comments
Please login to add a commentAdd a comment