
సాక్షి,తాడేపల్లి: వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు బదలాయించారన్నది అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపునకు ఆద్యుడు చంద్రబాబేనన్నారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు.
‘టీడీపీ హైదరాబాద్ కార్యాలయం‘ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు 1997లో భూ బదలాయింపు జరిగింది. శిక్షణా తరగతులు,పేదలకు చదువులు చెప్పిస్తామని స్థలం తీసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఇప్పుడు ఎలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్థలం ఖరీదు ప్రస్తుతం వెయ్యికోట్లకు పైమాటే.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్యాలెస్ కాదా. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి 2016 జూలై 21వ తేదీన టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన మాట వాస్తవమా కాదా. 575 జీవో ప్రకారం మంగళగిరిలో 33 ఏళ్లకు మాత్రమే లీజుకు ఉండాల్సిన భూములు 99 ఏళ్లకు ఎలా తీసుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయాలు ప్యాలెస్‌లు అయితే మరి టీడీపీ కార్యాలయాలను ఏమని పిలుస్తారు.
3ఎకరాల65సెంట్ల ప్రభుత్వ భూమిలో మంగళగిరిలో నిర్మించిన టీడీపీ ఆఫీస్‌ను తాటాకుల పందిరి అంటారా. చంద్రబాబు జీవోల ప్రకారమే వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయాలకు భూములు కేటాయించారు. జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వం పై దాడి జరుగుతోంది. 2019 నుంచి 24 మధ్య సభను సజావుగా జరగకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.
ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా మాటల దాడి చేస్తున్నారు. జగన్‌పై లోకేష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారం ఉందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని హితవు పలుకుతున్నాం’అని టీజేఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment