offices
-
ట్రూకాలర్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు.. అసలేమైంది?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కాలర్ ఐడీ ప్లాట్‌ఫాం ట్రూకాలర్ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్‌లో లొసుగులు, పన్ను ఎగవేతల ఆరోపణలకు సంబంధించి సమాచారాన్ని సమీకరించేందుకు, పత్రాలను పరిశీలించేందుకు సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు.విచారణకు పూర్తిగా సహకారం అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వివరించాయి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ విషయంలో అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన విధానాలనే పాటిస్తున్నట్లు పేర్కొన్నాయి. స్వీడిష్ కంపెనీ అయిన ట్రూకాలర్‌కు భారత్‌లో ముంబై, గురుగ్రామ్, బెంగళూరులో కార్యాలయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: అంబానీ, మిట్టల్‌లకు షాక్.. మస్క్ వైపే కేంద్రం మొగ్గు! -
కొనసాగుతున్న కక్ష సాధింపు
భవానీపురం (విజయవాడ పశ్చిమ)/విజయనగరం/ఆదోని టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై టీడీపీ సర్కారు కక్షగట్టింది. గతం మరచిపోయి కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇటీవల చీకటిలో కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ విద్యాధరపురంలోని లేబర్‌కాలనీలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని కూల్చేయడానికి పావులు కదుపుతోంది. ఇందుకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి, పార్టీ ఆఫీస్ నిర్మాణానికి సంబంధించిన సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘విద్యాధరపురం లేబర్‌కాలనీ పార్టీ ఆఫీసుకు పాత తేదీలతో (గత నెలలో) నోటీసులు ఇస్తాం. దాని వల్ల మీకు ఇబ్బంది ఏమీ ఉండదు. మీరు ఒప్పుకుంటే రేపు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి నోటీస్ ఇచ్చి వెళిపోతా. అధికారులు మాపై ఒత్తిడి తెస్తున్నారు’ అని కార్పొరేషన్‌కు చెందిన సిబ్బంది ఒకరు పార్టీ కార్యాలయం సంబంధికునికి ఫోన్ చేశారు.ఇందుకు ఇటు వైపు నుంచి సమాధానమిస్తూ ‘అలా ఎలా తీసుకుంటాం.. మీరు ఎప్పుడు నోటీస్ ఇస్తే ఆ రోజు తేదీ వేసి ఇవ్వండి. అది కూడా సైట్ దగ్గరకు వచ్చి నోటీస్ ఇస్తే తీసుకుంటాం. ఆ విషయాన్ని మాపై వారికి తెలియజేస్తాం’ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్‌వీ ప్రసాద్.. అనుమతి లేకుండా పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారని సోమవారం నోటీస్ జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందిగా మారిన మురికి కుంటను పూడ్చేసి, అధికారుల అనుమతితోనే నిర్మాణం చేపట్టినప్పటికీ టీడీపీ సర్కారు కక్షగట్టి వ్యవహరిస్తోంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మహారాజుపేటలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం అక్రమమని టౌన్ ప్లానింగ్ అధికారి ఫిలిప్ సోమవారం నోటీసు జారీ చేశారు. అనుమతి లేకుండా నిర్మిస్తున్నందున తక్షణమే పనులు ఆపేసి, ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లేని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం అక్రమమని బీజేపీ నాయకుడు నాగరాజుగౌడ్, టీడీపీ నేత ఉమ్మి సలీంతో పాటు మరో ఇద్దరు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తగిన సమాధానం ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ అధికారులు పార్టీ కార్యాలయానికి నోటీసు జారీ చేశారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్యాలెస్ కాదా..? టీజేఆర్ సుధాకర్‌బాబు
సాక్షి,తాడేపల్లి: వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు బదలాయించారన్నది అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపునకు ఆద్యుడు చంద్రబాబేనన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ హైదరాబాద్ కార్యాలయం‘ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు 1997లో భూ బదలాయింపు జరిగింది. శిక్షణా తరగతులు,పేదలకు చదువులు చెప్పిస్తామని స్థలం తీసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఇప్పుడు ఎలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్థలం ఖరీదు ప్రస్తుతం వెయ్యికోట్లకు పైమాటే. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్యాలెస్ కాదా. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి 2016 జూలై 21వ తేదీన టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన మాట వాస్తవమా కాదా. 575 జీవో ప్రకారం మంగళగిరిలో 33 ఏళ్లకు మాత్రమే లీజుకు ఉండాల్సిన భూములు 99 ఏళ్లకు ఎలా తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు ప్యాలెస్‌లు అయితే మరి టీడీపీ కార్యాలయాలను ఏమని పిలుస్తారు. 3ఎకరాల65సెంట్ల ప్రభుత్వ భూమిలో మంగళగిరిలో నిర్మించిన టీడీపీ ఆఫీస్‌ను తాటాకుల పందిరి అంటారా. చంద్రబాబు జీవోల ప్రకారమే వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు భూములు కేటాయించారు. జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వం పై దాడి జరుగుతోంది. 2019 నుంచి 24 మధ్య సభను సజావుగా జరగకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా మాటల దాడి చేస్తున్నారు. జగన్‌పై లోకేష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారం ఉందని వైఎస్ జగన్మోహన్రెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని హితవు పలుకుతున్నాం’అని టీజేఆర్ అన్నారు. -
గ‘లీజు’ గురివింద!
సాక్షి, విశాఖపట్నం : పచ్చకామెర్ల బాధితులకు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది! అద్దె స్థలానికి ఎసరు పెట్టిన గురివిందకు.. అనుమతులున్న స్థలాలు అక్రమమే అనిపిస్తాయి! బంధువుల భూమినే కాజేసిన భూ రాబందుకు..సొంత భూమిలో ఎవరు నిర్మాణాలు చేపడుతున్నా గిట్టదు! అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసినట్లుగా.. తనను అక్కున చేర్చుకొని ఆదరించిన విశాఖపై బురద చల్లుతున్న ఈనాడు రామోజీ నగరానికి ముఖ్యమంత్రి వస్తున్నారంటే చాలు ఉలిక్కిపడి విషం చిమ్ముతున్నారు. ఇన్నాళ్లూ రుషికొండపై నానా యాగీ చేసిన ఈనాడు ఇప్పుడు అక్కడ భవనాలు ప్రారంభం కావడంతో మరో బురద జల్లుడు కార్యక్రమానికి తెగబడింది. అన్ని అనుమతులూ తీసుకుని ఓ దిగ్గజ సంస్థ సొంత భూమిలో నిర్మాణాలు చేపడుతుంటే అదేదో నేరమన్నట్లుగా దిగజారుడు కథనాలను ప్రచురించింది. విశాఖ తీరానికి తూట్లు పొడుస్తున్నారంటూ రామోజీ శోకాలు పెట్టారు. విశాఖలో లక్షల ఎకరాల భూ రికార్డులను మాయం చేసిన చరిత్ర టీడీపీదే. కోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద భూముల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్న ఘనత చంద్రబాబుదే. వాస్తవానికి భీమిలిలో కొంత భూమిని కొనుగోలు చేసిన దిగ్గజ సంస్థ అరబిందో సీఆర్‌జెడ్ నిబంధనలకు లోబడి అన్ని అనుమతులూ తీసుకొని నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈనాడుకు మాత్రం అది దేశద్రోహంలా కనిపిస్తోంది. సంతకాలు ఫోర్జరీ.. పచ్చళ్లు అమ్ముకుంటూ వచ్చిన రామోజీని విశాఖ నగరం అక్కున చేర్చుకుంది. అయితే ఆయన తన వ్యాపార విస్తరణకు సహకరించిన నగరాన్నే మింగేసే వైట్ కాలర్ క్రిమినల్‌గా మారిపోయారు! కుటుంబ సభ్యుల్ని మోసగించిన వ్యక్తిగా... బంధువుల్ని కోర్టుల చుట్టూ తిప్పి వారి భూముల్ని కొల్లగొట్టిన వ్యాపారిగా.. పత్రికను అడ్డం పెట్టుకొని కుళ్లు రాజకీయాలకు మూలపురుషుడుగా రామోజీ మిగిలిపోయారు. విశాఖలో కబ్జాలకు, గలీజు దందాలకు ఆద్యుడిగా నిలిచారు. 1974లో విశాఖలోని సీతమ్మధారలో 2.78 ఎకరాల భూమిని, 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 10 భవనాలను నెలకు రూ.3 వేలు అద్దె చొప్పున 33 ఏళ్ల లీజుకు మంతెన ఆదిత్యవర్మ నుంచి లీజుకు తీసుకున్న రామోజీ గడువు ముగిసినా ఖాళీ చేయకుండా తిరిగి కోర్టులో కేసు వేశారు. స్థలం యజమానికి తెలియకుండా కొంత భూమిని రోడ్డు విస్తరణకు అప్పగించి ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి కొంత స్థలాన్ని పొందారు. రామోజీ దాన్ని తన కుమారుడి పేరిట రిజిస్టర్ చేయించుకున్నారు. లీజు స్థలాన్ని తన సొంతమని పేర్కొంటూ ప్రభుత్వానికి అప్పగించటం.. ప్రతిఫలంగా పొందిన స్థలాన్ని రామోజీ రిజిస్టర్ చేసుకుని మోసపూరితంగా వ్యవహరించడంతో యజమాని మంతెన ఆదిత్యవర్మ క్రిమినల్ కేసు దాఖలు చేశారు. దీన్నుంచి తప్పించుకునేందుకు రామోజీ ఏకంగా విశాఖ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్‌ను ఫోర్జరీ చేయడం గమనార్హం. ఫోర్జరీకి సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నట్లు తేలడంతో న్యాయస్థానం రామోజీపై కేసు నమోదుకు ఆదేశించగా స్టే తెచ్చుకున్నారు. దిగువ కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకూ ఫోర్జరీకి సంబంధించి రామోజీకి చీవాట్లు పెట్టడంతో బిల్డింగ్ కొట్టేద్దామన్న ప్రయత్నాలు విఫలమై గత్యంతరం లేక ఆ స్థలాన్ని యజమానికి అప్పగించారు. కబ్జా ‘కార్యాలయం’ కనిపించలేదా? దసపల్లా భూముల వ్యవహారం కోర్టులో ఉండగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అందులో కొంత భాగాన్ని టీడీపీ కార్యాలయం నిర్మించేందుకు కేటాయించుకున్నారు. నగరం నడిబొడ్డున సర్వే నం 1196లో 2 వేల గజాల్ని కారుచౌకగా అప్పగించేశారు. ఇది చాలదన్నట్లుగా పక్కన ఉన్న కొండని సైతం తొలిచేసి 100 నుంచి 300 గజాల్ని ఆక్రమించేసి భవనాన్ని నిర్మించుకుంటే రామోజీ కళ్లు మూసుకున్నారు. మరోవైపు ఇల్లు నిర్మించుకునేందుకు ఓ వ్యక్తి కొనుగోలు చేసిన భూమిని ఆక్రమించిన నాటి మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడ తన కలల సౌధాన్ని కట్టుకున్నారు. ఆ కబ్జా కాండ బయటకు రాకుండా రామోజీ అడ్డుపడ్డారు. దీన్ని సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో టీడీపీ నేతలు ఉలిక్కిపడి భూ యజమానితో బేరసారాలకు దిగారు. విద్యాలయం పేరుతో విధ్వంసం.. టీడీపీ నేత, మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తి రుషికొండ ప్రాంతంలో 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గీతం యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమించుకొని రెండు ఎకరాల్లో భవన నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించారు. సుమారు రూ.500 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గీతం యూనివర్శిటీ కాంపౌండ్ వాల్‌ను తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. విలువైన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తుంటే విశ్వవిద్యాలయాన్ని నాశనం చేస్తున్నారంటూ నాడు రామోజీ బురద చల్లేందుకు ప్రయత్నించారు. -
AP: 25 నుంచి 31 వరకు ఈ–ఆఫీస్‌లు పనిచేయవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర యూనిట్లు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఈ–ఆఫీస్‌లను ప్రస్తుత వెర్షన్ నుంచి కొత్త వెర్షన్‌కు మార్పు చేస్తున్నారు. అందువల్ల ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు ప్రస్తుత పాత వెర్షన్‌లోని ఈ–ఆఫీస్‌లు పనిచేయబోవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆరు రోజుల్లో కార్యాలయాల్లో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. కొత్త వెర్షన్ ఈ–ఆఫీస్‌లు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. అప్పటి వరకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ సూచించారు. కొత్త వెర్షన్‌పై ఈ నెల 23, 24 తేదీల్లో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల వరకు మాస్టర్ శిక్షకులను డెవలప్ చేయనున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో మాస్టర్ శిక్షకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాల నుంచి మాస్టర్ శిక్షణకు సిబ్బందిని పంపాలని ఐటీ శాఖ సూచించింది. -
ఢిల్లీ మంత్రి నివాసాల్లో 23 గంటలపాటు ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఢిల్లీ సామాజిక, ఎస్సీ/ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాజ్‌కుమార్ ఆనంద్ నివాసాలు, కార్యాలయాల్లో 23 గంటలపాటు సోదాలు నిర్వహించారు. గురువారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు శుక్రవారం ఉదయం ముగిశాయి. మంత్రిపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఈడీ దర్యాప్తు సాగిస్తోంది. ఆయన అంతర్జాతీయ హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు, తప్పుడు పత్రాలతో రూ.7 కోట్లకుపైగా పన్ను ఎగ్గొట్టినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) చార్జిïÙట్ దాఖలు చేసింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు ఈడీ పరిధిలోకి వచి్చంది. తనను వేధించడమే పనిగా పెట్టుకుందని ఈడీపై మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ మండిపడ్డారు. -
విశాఖ నుంచి పాలన: ప్రభుత్వ కార్యాలయాలు .. మిలీనియం టవర్స్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో పలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నది. ఇందుకోసం వివిధ భవనాలను అధికారుల త్రిసభ్య కమిటీ పరిశీలించినట్లు తెలుస్తున్నది. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం డిసెంబర్ నుంచి విశాఖ నుంచి ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా మునిసిపల్, ఆర్థికశాఖ ప్రత్యే క ప్రధాన కార్యదర్శులతో పాటు పరిపాలనశాఖ కార్యదర్శులతో కూడిన త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ మిలీనియం టవర్స్‌తో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను పరిశీలించినట్టు సమాచారం. ప్రధానంగా మిలీనియం టవర్స్‌లో అందుబాటులో ఉన్న 2 లక్షల చదరపు అడుగుల భవనాలను అధికారుల త్రిసభ్య కమిటీ పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇక్కడే ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్టు గుర్తించినట్లు సమాచారం. అదేవిధంగా గ్రే హౌండ్స్‌లో ఉన్న భవనాలనూ కమిటీ పరిశీలించింది. ఇక్కడ పోలీసుశాఖ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు అవకాశం ఉన్నట్లు ప్రాథ మికంగా నిర్ధా్దరణకు వచ్చారు. వీఎంఆర్డీఏ కు చెందిన వివిధ భవనాలను కూడా త్రిసభ్య కమిటీ స్వయంగా పరిశీలించింది. వీఎంఆర్డీకు చెందిన భవనాల్లో మునిసిపల్‌శాఖ ఉన్నతాధికారులు.. వైద్యారోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు అరిలోవలోని విమ్స్ నుంచి విధులకు హాజరయ్యే అవకాశం ఉందని త్రిసభ్య కమిటీ ప్రాథమికంగా భావించినట్టు సమాచారం. ఇక ఇక్కడకు వచ్చే అధికారులకు అవసరమైన వసతి సౌకర్యాలను మాత్రం ఆయా శాఖలే చూసుకోవాలని కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చదవండి: రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు -
ఆఫీసుల్లో కూడా వైన్, బీర్ సర్వ్ చేసేలా కొత్త పాలసీ!
ఆ రాష్ట్రంలోని కార్యాలయాల్లో(ఆఫీసుల్లో) బీర్, వైన్ సర్వ్ చేసేలా అనుమితించడం కోసం ప్రత్యేక పాలసీని కూడా తీసుకొచ్చారు. ఈ పాలసీ ప్రకారం అన్ని కార్పొరేటే కార్యాలయాల్లో వైన్, బీర్ వంటి తక్కువ కంటెంట్ ఆల్కహాల్ డ్రింక్స్‌ని సర్వ్ చేసేలా అనుమితిస్తున్నారు. ఈ పాలసీ నిబంధన ప్రకారం కార్పోరేట్ కార్యాలయాల్లో సుమారు 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంటీన్ లేదా తినుబండరాలు ఉండాలి. ఈ మేరకు గురుగ్రామ్ లేదా హర్యానాలోని అక్కడ క్యాబినేట్ మంగళవారం ఈ క్తొత పాలసీ 2023-24కి ఆమోదం తెలిపింది. రిటైల్ పర్మిట్ రుసుము కింద పర్యావరణం, జంతు సంక్షేమ నిధి కోసం రూ. 400 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత విడదల చేసిన అధికారిక ప్రకటనలో దీని గురించి తెలిపారు. హర్యానా కొత్త మద్యం పాలసీలో ముఖ్యాంశాలు కొత్త పాలసీలో దేశీయ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఇంపోర్టెడ్ ఫారిన్ లిక్కర్ బేసిక్ కోటా పెరిగింది. దీంతో దేశీయ మద్యం, IMFL పై ఎక్సైజ్ సుంకం రేట్లలో నామమాత్రపు పెరుగుదల మాత్రమే ఉంది. ఈ పెంపుదలతో ఎక్సైజ్ ఆదాయానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాపారం చేసే సౌలభ్యం కోసం, కొత్త విధానంలో, జిల్లా స్థాయిలో IFL (BIO) లేబుల్‌లను పునరుద్ధరించింది. అలాగే సూక్ష్మ మధ్య తరహా రంగాన్ని ప్రోత్సహించడానికి చిన్న షాపులకు లైసెన్స్ ఫీజును తగ్గించింది. రాష్ట్రంలో వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించేందుకు వైన్ తయారీ కేంద్రాల పర్యవేక్షక రుసుమును తగ్గించినట్లు ప్రకటనలో తెలిపారు. పంచకులలోని శ్రీ మాతా మానస దేవి ఆలయం చుట్టుపక్కల నోటిఫై చేయబడిన పవిత్ర ప్రాంతాలు, గురుకులాలు ఉన్న గ్రామాలలో మద్యం దుకాణాలు తెరవకూడదని నిర్ణయించినట్లు ప్రకటన పేర్కొంది. తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న పానీయాలను ప్రోత్సహించడానికి, మైల్డ్, సూపర్ మైల్డ్ కేటగిరీల కింద సిద్ధంగా ఉన్న పానీయాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పబ్ కేటగిరీలో బీర్, వైన్ వినియోగానికి మాత్రమే లైసెన్స్ ఫీజు మరింతగా తగ్గించింది. (చదవండి: మరో భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ సన్నాహాలు) -
మార్గదర్శి అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ
-
మళ్లీ ఆఫీసులు కళకళ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం గణనీయంగా తగ్గిపోవడంతో కార్యాలయాలు తిరిగి ఉద్యోగులతో సందడిగా మారుతున్నాయి. కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కంపెనీలు తమ ఉద్యోగులను కోరుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లోగడ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో మెజారిటీ ఉద్యోగులు పనిచేయడం తెలిసిందే. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత నుంచి ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తోంది. వారంలో కొన్ని రోజుల పాటు ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారు. కొన్ని కంపెనీలు అయితే వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు మంగళం కూడా పలికాయి. కంపెనీలు తమ పని విధానాలను సమీక్షించుకుంటున్నాయి. ఐటీ పరిశ్రమలో పని విధానాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిపై ప్రభావం చూపుతాయి. కనుక కంపెనీల్లో ప్రస్తుతం అమలవుతున్న పని విధానాలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తు విధానాల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ఓ సర్వే నిర్వహించింది. ఈ సంఘంలో 300కు పైగా కంపెనీలు భాగస్వాములుగా ఉంటే, మూడింట ఒక వంతు కంపెనీలు సర్వేలో పాల్గొని వివరాలు తెలిపాయి. సర్వేలోని అంశాలు.. ► ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేసేందుకు కంపెనీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కంపెనీలు తీసుకుంటున్న చర్యలు ఫలితంగా మూడింట ఒక వంతుకు పైగా కంపెనీల్లో 60 శాతానికి పైగా ఉద్యోగులు ఇప్పుడు వారంలో కనీసం రెండు రోజులు ఆఫీసులకు వచ్చే పనిచేస్తున్నారు. పెద్ద కంపెనీల్లో కార్యాలయాలకు వచ్చే వారు 22 శాతంగా ఉంటే, చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో 38 శాతంగా ఉన్నారు. ► 62 శాతం కంపెనీల్లో 19 శాతం మంది ఉద్యోగులు హైదరాబాద్‌కు వెలుపల ఉన్న చోట నుంచే పనిచేస్తున్నారు. ఈ మేర ఉద్యోగులు ఆఫీసులకు రాకుండా పనిచేయడం అన్నది 2023లోనూ, ఆ తర్వాత కూడా కొనసాగుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 21 శాతం కంపెనీల్లో అయితే 20–39 శాతం మేర ఉద్యోగులు, 13 శాతం కంపెనీల్లో 40–59 శాతం మేర ఉద్యోగులు హైదరాబాద్ బయటి నుంచే సేవలు అందిస్తున్నారు. ► 26 శాతం కంపెనీల్లో నూరు శాతం ఉద్యోగులు వారంలో అన్ని రోజులూ (సెలవులు మినహా) కార్యాలయాలకు వచ్చి పనిచేస్తున్నారు. 28 శాతం కంపెనీల్లో మూడు రోజుల కార్యాలయ పనివిధానం నడుస్తోంది. 14 శాతం కంపెనీల్లో వారంలో రెండు రోజులు కార్యాలయాలకు వస్తుంటే, 15 శాతం కంపెనీలు ఫ్లెక్సీ (వీలునుబట్టి ఎక్కడి నుంచి అయినా) పని విధానాన్ని ఆచరిస్తున్నాయి. ► భవిష్యత్తులో అవసరమైతే 2–5 రోజుల పాటు ఇంటి నుంచి పనిచేసేందుకు వీలుగా కంపెనీలు విధానాలను రూపొందించుకున్నాయి. వారంలో కనీసం మూడు రోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తారని భావిస్తున్నాయి. ► భవిష్యత్తులో పూర్తిగా ఆఫీసుకే వచ్చి పనిచేసే విధానాన్ని అమలు చేస్తామని 35 శాతం కంపెనీలు చెప్పాయి. వారంలో మూడు రోజులు అయినా ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సి ఉంటుందని 26 శాతం కంపెనీలు తెలిపాయి. 12 శాతం కంపెనీలు వారంలో రెండు రోజుల విధానాన్ని అనుసరిస్తామని పేర్కొన్నాయి. ► టీమ్ వర్క్, సహకారం, సంస్థలో పని సంస్కృతి, గుర్తింపు, విధేయత, వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధి అంశాలు ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు రావడంపై ప్రభావం చూపించనున్నాయి. ► సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో మెజారిటీ ఐటీ రంగం నుంచే ఉన్నాయి. 27 శాతం ప్రొడక్ట్ కంపెనీలు కాగా, 24 శాతం ఇంటెగ్రేటెడ్ ఐటీ, ఐటీఈఎస్ సేవల రంగానికి చెందినవి ఉన్నాయి. -
ప్రభుత్వ కార్యాలయాల్లోని ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణకు ఏర్పాట్లు
-
మెక్ డోనాల్డ్స్ అన్ని ఆఫీసులు మూత, ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం!
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద ఫాస్ట్‌ఫుడ్ చైన్లలో ఒకటైన మెక్‌డొనాల్డ్స్ సంచలననిర్ణయం తీసుకుంది. అమెరికా లోని అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసింది. ఈ మేరకు ఉద్యోగాలపై వేటు వేయనుంది. తాజాగా మరో రౌండ్ తొలగింపులకి సిద్ధమవుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ సోమవారం నివేదించింది. అయితే ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తారనే దానిపై స్పష్టత లేదు. సోమవారం నుండి బుధవారం వరకు ఇంటి నుండి పని చేయడం ప్రారంభించాలని కంపెనీ గత వారమే మెక్ డోనాల్డ్స్ అమెరికా ఉద్యోగులకు మెయిల్ పంపింది. ఈ వారంలో షెడ్యూల్ అయిన అన్ని వ్యక్తిగత సమావేశాలను రద్దు చేయాలని కూడా కంపెనీ ఉద్యోగులను కోరినట్టు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 5, బుధవారం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా. త్వరలోనే ఉద్యోగులను తీసివేయనున్నట్టు కూడా మెక్ డోనాల్డ్స్ ప్రకటించనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. కాగా ప్రపంచ ఆర్థికమాంద్యం, ద్రవ్యోల్బణ ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే చాలా కంపెనీలు వేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్‌తో సహా అనేక టెక్ దిగ్గజాలు భారీగా ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. -
ఊపు మీదున్న రిటైల్ రియల్ ఎస్టేట్ లీజింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ షాపింగ్ మాల్స్, ఖరీదైన వీధుల్లో రిటైల్ రియల్ ఎస్టేట్ లీజింగ్ గతేడాది 47 లక్షల చదరపు అడుగులు నమోదైంది. దేశంలో ఎనమిది ప్రధాన నగరాల్లో 2021తో పోలిస్తే ఇది 21 శాతం అధికమని ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తన నివేదికలో వెల్లడించింది. ‘భారత రిటైల్ రంగం రికవరీ బాటలో ఉంది. ఈ ఏడాదీ ఊపు కొనసాగుతుంది. అంతర్జాతీయంగా క్లిష్ట ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ విదేశీ బ్రాండ్లు ప్రథమ శ్రేణి నగరాలేగాక ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నాయి. ఇక్కడ వ్యాపార అవకాశాలు ఉన్నాయని గుర్తించడమే ఇందుకు కారణం. 2022లో రిటైల్ రియల్ ఎస్టేట్ లీజింగ్ బెంగళూరులో 16.8 లక్షల నుంచి 19.2 లక్షల చదరపు అడుగులకు, ఢిల్లీ ఎన్సీఆర్ 3.6 లక్షల నుంచి 9.6 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. అయితే హైదరాబాద్‌లో 6.4 లక్షల నుంచి 3.1 లక్షల చదరపు అడుగులకు, ముంబైలో 6.6 లక్షల నుంచి 3.9 లక్షల చదరపు అడుగులకు పడిపోయింది. 2023లో భారత్‌లో కొత్తగా 16 మాల్స్ రాబోతున్నాయి. వచ్చే ఏడాదీ ఇదే స్థాయిలో మాల్స్ ఏర్పాటు కానున్నాయి’ అని వివరించింది. -
భారత్ లో ట్విట్టర్ ఆఫీసులు బంద్
-
షాకింగ్: ఇండియాలో రెండు ట్విటర్ ఆఫీసులు మూత
సాక్షి,ముంబై: బిలియనీర్, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్న తరువాత ఖర్చులు తగ్గించుకునే పనిలో పలు నిర్ణయాలు తీసుకుంటున్న మస్క్ తాజాగా న్యూఢిల్లీ, ముంబై నగరాల్లోని ఆఫీసులను మూసి వేశారు. భారతదేశంలోని తన మూడు కార్యాలయాలలో రెండింటిని మూసివేసిన సంస్థ సిబ్బందిని ఇంటినుంచే పనిచేయమని కోరింది. మస్క్ యాజమాన్యంలో ట్విటర్ కోరింది. బెంగళూరు కార్యాలయం ప్రస్తుతం యథాతథంగా కొనసాగనుందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది ఎలాన్‌మస్క్ కంపెనీని చేజిక్కించుకున్నప్పటినుంచి 90 శాతం ఉద్యోగులను తొలగించిన ట్విటర్ ఢిల్లీ, ముంబైలోని తన కార్యాలయాలను మూసివేయడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఇండియాలో సుమారు 200 మంది సిబ్బందిలో 90శాతం మందిని తొలగించిన విషయం తెలిసిందే. 2022లో ఉద్యోగుల భారీ తొలగింపుల తరువాత మస్క్ ఇప్పుడు ఆఫీసుల మూతకు మొగ్గుచూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగాఉద్యోగుల తొలగింపుల తోపాటు, కార్యాలయాలను మూసివేస్తున్నారు. భారతీయ మార్కెట్‌కు ప్రాధాన్యతనిస్తోందని నివేదికల ద్వారా తెలుస్తోంది. ట్విటర్ బెంగళూరులో కార్యాలయాన్ని కొనసాగిస్తోందని, ఇది ప్రధానంగా ఇంజనీర్లతో పని చేస్తుందని వర్గాలు వెల్లడించాయి. -
రిటర్న్ టు ఆఫీస్: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టీసీఎస్ ఆఫీసులకు వచ్చే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కోవిడ్ తరువాత క్రమంగా వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికిన మేజర్ కంపెనీలన్నీ ఉద్యోగులకు ఆఫీసులకు రప్పించేందుకు నానా కష్టాలు పడుతున్నాయి.ఆ ఫీసు నుండే పని చేసేలా ఉద్యోగులనుప్రేరేపించేందుకు వారు కొత్త మార్గాలను ప్రయత్నిస్తున్నాయనిహెచ్‌ఆర్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు ఈ క్రమంలో టీసీఎస్ ఉద్యోగులను ఆఫీసు నుంచి పనిచేసేలా చేసేందుకు ఈ ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఉద్యోగులు ఆఫీసు నుండి పనిచేసే రోజులకు పాయింట్లను చేర్చనుంది. అప్రైజల్ సిస్టమ్‌లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాయింట్లను అందించనుంది. ఈ మేరకు కంపెనీలోని మేనేజర్లు, టీమ్ లీడ్‌లకు ఈమెయిల్ పంపించినట్టు తెలుస్తోంది. టీమ్ మెంబర్లందరికీ ఈ క్రింది RTO (రిటర్న్ టు ఆఫీస్)కు వచ్చేలా చూడాలని కోరింది. తమ టీం సభ్యులు వారానికి సగటున మూడు రోజులు ఆఫీసులకు రావాలని కోరుతోంది. అయితే తాజా పరిణామంపై హెచ్ఆర్ నిపుణులు విభిన్నంగా స్పందించారు. ఒక ఉద్యోగి పనితీరు వారు ఆఫీసు నుండి పని చేస్తున్నా లేదా రిమోట్‌గా పని చేస్తున్నారా అనే దానితో సంబంధం లేకుండా వారు ఉత్పత్తి చేసే ఫలితాలపై మాత్రమే నిర్దారించుకోవాలని, ఆఫీసు నుండి పని చేసే ఉద్యోగులు ఉండవచ్చు కానీ వారి లక్ష్యాలను చేరుకోలేరు, కేవలం ఆఫీసుల నుండి పని చేసినవారికి మదింపు పాయింట్లు ఇవ్వడం అనేది వారి పనితీరును మెరుగు పర్చడంలో సహాయ పడదని సీఐఇఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఎండీ ఆదిత్య నారాయణ్ మిశ్రా పేర్కొన్నారు. -
మంగళగిరిలో రాష్ట్ర అటవీశాఖ కార్యాలయం ప్రారంభం
-
గొల్లపూడి టీడీపీ ఆఫీస్ పై యజమాని శేషారత్నం కీలక వ్యాఖ్యలు
-
Photo Feature: మేమా.. టైంకు రావడమా..
సాక్షి, ఖమ్మం: జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. అధికారులు సహా ఉద్యోగులు, సిబ్బంది అందరూ తమకు ఇష్టం వచ్చిన సమయంలో విధులకు రావడం పరిపాటిగా మారింది. దీంతో వివిధ పనులపై వచ్చే ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయంలో శనివారం ఈ పరిస్థితి కనిపించింది. ఉదయం 10.30 గంటలు దాటినా చాలామంది అధికారులు కార్యాలయానికి రాలేదు. ఆసరా మేనేజర్ సెక్షన్, సెర్ప్ విభాగం, సెర్ప్ ఫైనాన్స్ విభాగం, హెచ్ఆర్ విభాగంతోపాటు పలు సెక్షన్లలో ఉద్యోగులు రాక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సెర్ప్ ఫైనాన్స్ విభాగంలో.. సెర్ప్ విభాగంలో.. హెచ్ఆర్ విభాగంలో ఖాళీ కుర్చీలు -
పనిచేసే చోట పదిలమేనా? ఆఫీసుల్లో కానరాని ఐసీసీ
బెంగళూరు: ఆమె ఓ ఆఫీసులో ఉద్యోగి. అందులో ఓ పురుష ఉద్యోగి పోకిరీ చేష్టలతో సమస్యగా ఉంటోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే రచ్చ అవుతుంది. ఆఫీసులో పై అధికారులకు చెప్పుకుందామంటే అవకాశం ఉండదు. ఇలా.. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, కంపెనీల్లో మహిళా ఉద్యోగులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే బాధితులు ఫిర్యాదు చేయడానికి అంతర్గత ఫిర్యాదుల సమితి (ఐసీసీ) ఉండాలి. కానీ ఈ కమిటీలు అనేక చోట్ల మనుగడలో లేవు. దీంతో మహిళలు గోడు చెప్పుకోవడానికి అవకాశం దొరకడం లేదు. రాష్ట్ర మహిళా కమిషన్ సమీక్షలో ఈ చేదునిజం వెలుగుచూసింది. రాష్ట్రంలో అన్ని ప్రైవేటు సంస్థల్లో కమిషన్ సర్వే చేయగా, 5,550 ఆఫీసులు, సంస్థల్లో ఐసీసీలు లేవని తేలింది. ఐసీసీ ఎలా ఉండాలి ప్రభుత్వ చట్టాల ప్రకారం 10 మంది కంటే ఎక్కువ మంది మహిళాసిబ్బంది పనిచేసేచోట మహిళలపై లైంగిక దాడులు, వేధింపులను నివారణకు తప్పనిసరిగా ఐసీసీ ఉండాలి. సీనియర్ ఉద్యోగులతో దీనిని ఏర్పాటు చేయాలి. కమిటీలో తప్పనిసరి మహిళా ఉద్యోగులు, ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధికి చోటివ్వాలి. కనీసం మూడు నెలలకు ఒకసారి సమావేశమై మహిళా ఉద్యోగుల సమస్యల మీద చర్చించాలి. కమిటీ లేనట్లయితే అలాంటి సంస్థపై జరిమానా విధించడం, లైసెన్సు రద్దు చేయడానికీ ఆస్కారముంది. ఆ సంస్థలకు హెచ్చరికలు ఇప్పటివరకు సుమారు 400 ప్రభుత్వ, 1300కు పైగా ప్రైవేటు సంస్థల్లో ఐసీసీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ 5,550 ప్రైవేటు ఆఫీసుల్లో ఇంకా ఎలాంటి పురోగతి లేదని, ఆ సంస్థలకు హెచ్చరికల జారీ చేశామని మహిళాకమిషన్ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు తెలిపారు. గత ఏడాదిలో పనిచేసే చోట లైంగిక వేధింపులపై 210 కేసులు నమోదు కాగా, ఇందులో బెంగళూరులోనే ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా గార్మెంట్స్ ఫ్యాక్టరీల్లో ఎక్కువగా వేధింపుల సమస్య ఉంది, ఇక్కడ మహిళల భద్రత కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె తెలిపారు. (చదవండి: మహిళా రచయిత్రి పై అత్యాచారం...చంపేస్తామంటూ బెదిరింపులు..) -
కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు.. సెటైర్ వేసిన ఎంపీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరంపై మరో కేసు నమోదైంది. పదకొండేళ్ల క్రితం చిదంబరం కేంద్ర మంత్రిగా ఉండగా రూ.50 లక్షల లంచం తీసుకొని ఒక విద్యుత్ కంపెనీ కోసం 263 మంది చైనీయులకు వీసాల మంజూరుకు సహకరించారంటూ కార్తీపై సీబీఐ కేసు నమోదు చేసింది. కార్తీతో పాటు ఆయన సన్నిహితుడు ఎస్.భాస్కరరామన్, నాటి తల్వాండి సాబో పవర్ ప్రాజెక్టు అధ్యక్షుడు వికాస్ మఖారియా తదితరులపై ఏపీసీ 120బీ, 477ఏ, అవినీతి నిరోధక చట్టంలోని 8, 9 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, చెన్నైలోని చిదంబరం, కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నై, ఢిల్లీ, ముంబయి, కర్ణాటక, ఒడిశా, పంజాబ్ సహా 10 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపారు. సోదాల సమయంలో చిదంబరం ఢిల్లీలో, కార్తీ లండన్‌లో ఉన్నారు. వీటిపై కార్తీ, ‘‘ఇప్పటివరకు నాపై ఎన్నిసార్లు ఇలా దాడులు చేశారో గుర్తు లేదు. ఇది కచ్చితంగా ఒక రికార్డే’’ అని ట్వీట్ చేశారు. ఎఫ్ఐఆర్లో నాపేరే లేదు: చిదంబరం మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరానికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చిదంబరం కొడుకు కార్తీపై నమోదైన కేసులకు సంబంధించి సీబీఐ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా సీబీఐ దాడులపై చిదంబరం స్పందించారు. This morning, a CBI team searched my residence at Chennai and my official residence at Delhi. The team showed me a FIR in which I am not named as an accused. The search team found nothing and seized nothing. I may point out that the timing of the search is interesting. — P. Chidambaram (@PChidambaram_IN) May 17, 2022 ‘ఈ రోజు(మంగళవారం) ఉదయం చెన్నై, ఢిల్లీలోని నా నివాసాలు, కార్యాలయాలపై సీబీఐ బృందం సోదాలు నిర్వహించింది. అధికారులు ఎఫ్ఐఆర్ కాపీ చూపించారు. కానీ అందులో నిందితుడిగా నా పేరే లేదు. అంతేగాక సోదాల్లో తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి అధికారులు ఎలాంటి పత్రాలనూ స్వాధీనం చేసుకోలేదు. ఇక అధికారులు సెర్చింగ్ చేసే సమయం ఆసక్తికరంగా సాగింది’ అంటూ చిదంబరం వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చదవండి: ‘ఢిల్లీలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు ఆప్‌దే’ I have lost count, how many times has it been? Must be a record. — Karti P Chidambaram (@KartiPC) May 17, 2022 -
నంద్యాల జిల్లా కార్యాలయాలను పరిశీలించిన మంత్రి బుగ్గన
-
ఆ చోట, ఈచోట కాదు.. అడుగడుగునా అభద్రతే.. వేధించని చోటెక్కడ!
సాక్షి, నిర్మల్: ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించుకుంది. తనకంటూ ఓ భరోసా దొరికిందని సంతోష పడింది. భర్త, పిల్లలతో సాఫీగా జీవితం సాగుతోంది. అందరిలాగే తన పని తాను చేసుకుపోతోంది. కానీ.. తను పనిచేస్తున్నచోట ఓ నీచుడి కళ్లు తనపైనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తించలేకపోయింది. కళ్లతోనే కీచకత్వాన్ని ప్రదర్శిస్తున్న ఆ దుర్మార్గుడు క్రమంగా తనతో అసభ్యంగా మాట్లాడే వరకూ వచ్చాడు. ఈ విషయం ఎవరితో చెప్పుకోవాలో తెలియక.. చెబితే ఏమనుకుంటారోనన్న భయంతో.. కుమిలి పోసాగింది. ఆమె తనను ఏం చేయాలేదన్న ధీమానా.. లేక ఏం చేసినా.. తనకేం కాదన్న ధైర్యమా..! ఆ కీచకుడు తన చేష్టలతో ఆమెను మరింత ఇబ్బంది పెట్టాడు. చివరకు తన కుటుంబానికి తన బాధను చెప్పుకుని బోరుమంది. ఇలా.. ఈ ఒక్క ఉద్యోగినికే కాదు.. మరో ఉపాధ్యాయురాలికి ఇదే పరిస్థితి. ఇంకో శాఖలో పనిచేస్తున్న యువ ఉద్యోగికీ ఇదే వేధింపులు. ఓస్థాయిలో ఉన్న మహిళ అధికారికీ అప్పుడప్పుడు ఇలాంటి కీచక చేష్టలు ఎదురవుతూనే ఉన్నాయి. సర్కారు ఉద్యోగాల్లో ఉన్నవాళ్లకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక నెలజీతంతో కుటుంబాలను పోషించుకునే ప్రైవేటు పనులు చేసే మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఆమె బయటకు వెళ్లిందంటే చాలు.. వేధించని చోటెక్కడైనా ఉందా.. అన్న ప్రశ్నలూ మహిళాలోకం నుంచి వస్తున్నాయి. జిల్లాలో ఏళ్లుగా ఇలాంటి కీచక చేష్టలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైన ఘటన జరిగినప్పుడు స్పందించే ఉన్నతాధికారులు ఆ తర్వాత చర్యలపై దృష్టిపెట్టడం లేదు. ఇప్పటికీ జిల్లాలో మహిళా ఉద్యోగినులు ఇలాంటి ఫిర్యాదులు చేయడానికి ఉండాల్సిన అంతర్గత ఫిర్యాదుల కమిటీలు(ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ–ఐసీసీ) పత్తాలేవు. ఒక్క శాఖలో కూడా కమిటీలను వేయకపోవడం దారుణం. ఛదవండి: మసాజ్‌సెంటర్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్ అంతటా అభద్రతే.. ఆ చోట.. ఈచోట.. అని కాదు. మహిళలపై అంతటా వేధింపులు పెరుగుతున్నాయి. అడుగడుగునా అతివలకు అసభ్యకరమైన చేష్టలు, వ్యంగ్యమైన మాటలు, మింగేలా చూసే చూపులు తప్పడం లేదు. జనాభాపరంగా మహిళలు అధికంగా ఉన్న జిల్లాలో వారిపైనే ఇలాంటి కీచక చేష్టలు పెరుగుతుండటం కలవరపెడుతోంది. కొంతమంది రాక్షసులు కళ్లతోనే మహిళలను చిత్రహింసలు పెడుతున్నారు. ఎవరైనా అమాయకత్వంగా ఉంటే ఆసరాగా చేసుకుని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. బస్సుల్లో వచ్చే విద్యార్థినులు, వ్యాపారసంస్థలు, ఆఫీసుల్లో పనిచేసే యువతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగినులపైనా వేధింపులు పెరుగుతున్నాయి. ఉద్యోగాలు వదులుకునే దాకా.. మూడేళ్ల క్రితం జిల్లాలోని ఓ శాఖకు చెందిన ఉద్యోగిని తన పై అధికారి నుంచి వేధింపులను ఎదుర్కొన్నారు. సంబంధిత శాఖ పనిపైన కాకుండా ఆ పైఅధికారి పర్సనల్ విషయాలను మాట్లాడటం, చొరవ తీసుకోవడం చేశాడు. ఆమె సెల్‌ఫోన్‌కు రాత్రిపూట మెసేజ్‌లను పంపడం, ఫోన్లు చేయడం వంటివీ కొనసాగించాడు. చివరకు ఆమె పై అధికారుల వద్దకు వెళ్లడంతో ఆ కీచకుడు కాళ్లబేరానికి వచ్చాడు. తనకు ఇబ్బంది కలిగిన చోట ఉండలేక సదరు ఉద్యోగిని దూరంగా ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్లిపోయారు. ► మరోశాఖలోనూ ఓ స్థాయి ఉన్న అధికారి ఇదే తీరుగా తన కింది ఉద్యోగిని పట్ల ప్రవర్తించిన విషయం విచారణ వరకూ వెళ్లినా.. అధికారులు బయటకు రానివ్వలేదు. ► కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువ ఉద్యోగినులపైనా కొంతమందిపై అధికారుల తీరుపై సరిగా లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ► అధికారులు, తోటి ఉద్యోగులచేష్టలు ఇబ్బంది పెడుతుండటంతో ఒకరిద్దరు కాంట్రాక్టు ఉద్యోగినులు తమ ఉద్యోగాలనూ వదులుకున్నారు. ► తాజాగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, తోటి ఉపాధ్యాయురాలితోనే అసభ్యంగా ప్రవర్తించాడో దుర్మార్గుడు. గతంలో పనిచేసిన చోటల్లా ఇలాంటి కీచక చేష్టలనే ప్రదర్శించినట్లు ఆరో పణలున్నాయి. ఎలాగు బదిలీల్లో వేరే జిల్లాకు వెళ్తున్నానన్న ధీమాతో సహోపాధ్యాయురాలి ని వేధించిన ఈ ‘టీచకుడి’ తీరు ఉ న్నతాధికారుల వరకూ వెళ్లింది. వాళ్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా ఉంది. చదవండి: ప్రేమలేనిదే జీవించలేమని.. ప్రేమికుల ఆత్మహత్య ఐసీసీ జాడేది.. ‘పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం, నిషేధ చట్టం–2103’ ప్రకారం.. మహిళలు పనిచేసే చోట వారికి ఎదురయ్యే వేధింపులు, సమస్యలపై విచారించేందుకు ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. చట్ట ప్రకారం ఆయాశాఖల వారీగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ఐసీసీ)లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఈ కమిటీలు ఏర్పాటు కాలేదు. గతేడాది స్వయంగా సీఎంఓ నుంచి మహిళ ఉద్యోగినుల కోసం ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు మొదలుపెట్టినా.. అవి ఇంకా కొలిక్కిరాలేదు. ఈ సెల్ ఏర్పాటైతే బాధితులు ఆన్లైన్ ద్వారా చేసే ఫిర్యాదు ఏకకాలంలో సంబంధిత శాఖాధికారి, కలెక్టర్, ఐసీసీ రాష్ట్ర కమిటీతో పాటు జాతీయస్థాయి కమిటీ వరకూ వెళ్తుంది. కానీ.. ఇప్పటికీ ఐసీసీ మహిళ ఉద్యోగినులకు అందుబాటులోకి రాకపోవడం శోచనీయం. మహిళ ఉద్యోగినుల రక్షణకోసం గత ఏడాది ఫిబ్రవరిలో కలెక్టర్ ముషరఫ్ అలీ ఓ సీరియస్ సర్క్యులర్ జారీ చేశారు. ఇది కూడా పూర్తిగా అమలు కాకపోవడం గమనార్హం. చర్యలు తీసుకుంటాం.. జిల్లాలో మహిళా ఉద్యోగినులపై ఎలాంటి వేధింపులను సహించేది లేదు. గత ఏడాదే దీనిపై సర్క్యులర్ జారీ చేశాం. జిల్లాలో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ కూడా డీడబ్ల్యూఓ చైర్మన్‌గా పనిచేస్తోంది. ఇంటర్నల్ కంప్లైంట్ సెల్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి. బాధితులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. – ముషరఫ్ అలీ ఫారూఖి, కలెక్టర్ -
నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
-
ఒమిక్రాన్ ఎఫెక్ట్, వర్క్ ఫ్రమ్ హోంపై దిగ్గజ కంపెనీల సంచలన నిర్ణయం..?!
వచ్చే ఏడాది నుంచి హైబ్రిడ్ వర్క్ కల్చర్‌ను అమలు చేసే విషయంలో సంస్థలు యూటర్న్ తీసుకోనున్నాయి. కొన్ని కంపెనీలు వచ్చే ఏడాది మొత్తం ఉద్యోగుల్ని వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితం చేయాలని చూస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్ని వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కార్యాలయాలకు ఆహ్వానించాలని భావించాయి. కానీ ప్రపంచ దేశాల్ని ఒమిక్రాన్ వణికిస్తుండడంతో రిటర్న్- టు- ఆఫీస్ ప్లాన్ అమలు చేయడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ►ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసుల్లో విధులు నిర్వహించేలా కార్యాలయాల్ని సిద్ధం చేశాయి. కానీ అనూహ్యంగా ఒమిక్రాన్ భయం ఉద్యోగుల్ని తిరిగి కార్యాలయాలకు రప్పించే అంశాన్ని మరింత ఆలస్యం చేయనున్నాయి. ►డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ప్రభావం తక్కువేనని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు యూఎస్‌తో పాటు ఇతర దేశాల్లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఉద్యోగులతో కార్యాలయాల్లో విధుల నిర్వహణ సంస్థలకు కత్తిమీద సాములా మారింది. ►బ్రిటన్, డెన్మార్క్, నార్వే, స్వీడన్‌కు చెందిన కంపెనీలు ఓమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. ►టెక్ దిగ్గజం గూగుల్, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వాహన తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ కంపెనీ..ఉద్యోగుల్ని కార్యాలయాలకు పిలిపించడంపై మరింత ఆలస్యం చేయనున్నాయి. ►ఇప్పటికే ఫేస్బుక్ (మెటా), రైడ్‌షేరింగ్ కంపెనీ 'లిఫ్ట్' వచ్చే ఏడాది ప్రారంభంలో ఉద్యోగులు ఆఫీసుల్లో పనిచేయాలన్న ఆంక్షలపై పునరాలోచనలో పడ్డాయి. ఫేస్బుక్ వచ్చే ఏడాది జున్ చివరి నాటికి ఉద్యోగుల్ని ఆఫీస్‌లకు పిలిపించాలని ప్రయత్నించింది. కానీ ఒమిక్రాన్ ప్రభావంతో మరింత ఆలస్యం కానుంది. అప్పటి వరకు ఉద్యోగులు ఇంటికే పరిమితం కానున్నారు. లిఫ్ట్ సంస్థ వచ్చే ఏడాది అంతా ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి రావాల్సిన అవసరం లేదని పేర్కొంది. ►అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్స్యూరెన్స్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ జెఫ్ లెవిన్ షెర్జ్ ఒమిక్రాన్‌పై స్పందించారు. 18 నెలల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన ఉద్యోగులు త్వరలో ఆఫీస్‌ల నుంచి విధులు నిర్వహిస్తారని భావించినట్లు తెలిపారు. కానీ ఒమిక్రాన్ విజృంభణతో మరింత ఆలస్యం కావడమే కాదు.. ఉద్యోగుల పట్ల సంస్థలు మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. ►కోవిడ్‌కు ముందు ఉన్న విధంగా ఆఫీసుల్లో పనిచేసే వాతావరణం తిరిగి ఇప్పట్లో వచ్చేలా లేదని ఒమిక్రాన్‌తో అర్ధమైందని అడ్వటైజింగ్ ఏజెన్సీ క్రియేటివ్ సివిలైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గిసెలా గిరార్డ్ చెప్పారు. చదవండి: గూగుల్ షాకింగ్ నిర్ణయం.. ఆ ఉద్యోగుల తొలగింపు! -
ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ తప్పనిసరి
సాక్షి, అమరావతి: సచివాలయంతో పాటు శాఖాధిపతులు, కలెక్టర్ కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. తక్షణం సచివాలయంను అన్ని శాఖలతో పాటు శాఖాధిపతులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు పరికరాలను అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖను ఆదేశిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. గతంలో సచివాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో బయోమెట్రిక్ హాజరు ఉందని, అయితే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చిలో బయోమెట్రిక్ హాజరును నిలుపుదల చేసినట్లు మెమోలో పేర్కొన్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మళ్లీ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని ఇటీవల జరిగిన కార్యదర్శులు సమావేశంలో నిర్ణయించినట్లు మెమోలో తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల కార్యదర్శులు, కలెక్టర్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధిపతులు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా అమలు చేయడంతో పాటు నెలవారీ నివేదికలను సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. బయోమెట్రిక్ హాజరు పరికరాలు సక్రమంగా పనిచేసేలా ఐటీ శాఖతో పాటు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
జనవరి నుంచే ఆఫీసులకు రండి
Facebook Employees Return To Office: కరోనా-లాక్డౌన్ మొదలైన వర్క్ ఫ్రమ్ హోం ట్రెండ్.. ఇంకొన్నాళ్లు కొనసాగేలా కనిపిస్తోంది. ఇప్పటికే టెక్ కంపెనీలు కొన్ని అక్టోబర్ మధ్య నుంచి ఆఫీసులకు రావాలని తేల్చిచెప్పడంతో పాటు షరతుల మీద కొందరు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోంకి అనుమతి ఇస్తున్నాయి. ఈ తరుణంలో సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ ఫేస్బుక్ తన ఉద్యోగులకు భారీ ఊరట ఇచ్చింది. ఇక వచ్చే ఏడాది నుంచే ఆఫీసులకు రావాలని తెలియజేసింది. డెల్టా ఫ్లస్ వేరియెంట్ ఉధృతి.. తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా విజృంభిస్తోంది. దాదాపు అన్ని దేశాల్లోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. ఈ తరుణంలో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించి.. వాళ్ల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేయడం ఇష్టం లేదని ఫేస్బుక్ భావిస్తోంది. ఈ మేరకు కాలిఫోర్నియా మెన్లో పార్క్ హెడ్ కార్యాలయం నుంచి ఉద్యోగులకు మెయిల్ వెళ్లింది. అందులో ‘ఇప్పట్లో ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని. బహుశా జనవరి నుంచి ఆఫీసులకు రావాల్సి ఉండొచ్చ’ని సంకేతాలు ఇచ్చింది. చదవండి: జీతాల కట్టింగ్‌కు రెడీ, కానీ..-ఉద్యోగులు ఇక గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, యాపిల్లు వ్యాక్సినేషన్ పూర్తైన ఉద్యోగులను ఆఫీసులకు రావాల్సిందేనని ఇదివరకు చెప్పాయి. అంతేకాదు మాస్క్‌లు ధరించడం, సోషల్ డిస్టెన్స్, శానిటైజేషన్ లాంటి ఏర్పాట్లతో ఆరోగ్య భద్రతకు తమది హామీ అని ప్రకటించాయి. కానీ, వేవ్‌ల వారీగా పెరుగుతున్న కరోనా కేసులు, ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళన, విమర్శలు, పైగా ఇంటి నుంచే ఎక్కువ అవుట్‌పుట్ వస్తుండడంతో రిమోట్ వర్క్ విషయంలో ఉద్యోగుల పట్ల సానుకూల స్పందన ఇస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ కూడా జనవరి నుంచే రావాలని ఊరట ఇవ్వగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ఫేస్బుక్ కూడా చేరింది. మరోవైపు గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్‌లు మాత్రం అక్టోబర్ మధ్య నుంచే ఉద్యోగులను రప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. -
పన్ను ఎగవేత ఆరోపణలు: శాంసంగ్‌కు షాక్!
సాక్షి,\న్యూఢిల్లీ: దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ చిక్కుల్లో పడింది. పన్ను ఎగవేత ఆరోపణలతో శాంసంగ్ కార్యాలయాలలో అధికారులు దాడులు నిర్వహించారు. కస్టమ్స్ సుంకం ఎగవేత ఆరోపణలపై ఆధారాలను సేకరించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. కానీ దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయా లేదా అనే దానిపై స్పష్టత లేదు. నెట్ వర్కింగ్ కార్యకలాపాలు నిర్వహించే న్యూఢిల్లీ, ముంబైలోని శాంసంగ్ ఆఫీసులపై డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవలే శాంసంగ్ కంపెనీ నెట్ వర్క్ పరికరాలను అక్రమంగా దిగుమతి దిగుమతి చేసుకుందనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దక్షిణ కొరియాతో పాటు, వియత్నాంలో తయారు చేసిన టెలికం పరికరాలు, ఇతర ఉత్పత్తులపై స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) కింద సంస్థకు కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఉంది. అందులో భాగంగా టెలికం సేవలు, నెక్ట్స్ జెన్ వైర్ లెస్ నెట్ వర్క్ ల డెవలప్ మెంట్, ఆధునికీకరణ, విస్తరణ వంటి విషయాల్లో పరస్పర సహకారం కోసం భారత్, దక్షిణ కొరియాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అయితే ఎఫ్‌టిఎయేతర దేశంలో తయారన పరికరాలను దక్షిణ కొరియా లేదా వియత్నాం గుండా తరలించిందనేది ప్రభుత్వానికి అందిన విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో సోదాలు అధికారులు సోదాలు నిర్వహించారు. ఇదే నిజమని తేలితే సరఫరా చేసిన సంబంధిత పరికరాలపై కస్టమ్స్ సుంకం విధించవచ్చు. మరోవైపు డీఆర్ఐఅధికారులు సోదాలపై శాంసంగ్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.వాల్యూమ్ పరంగా దేశంలో అతిపెద్ద 4జీ విక్రయ సంస్థ శాంసంగ్. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ప్రత్యేకమైన 4 జీ పరికరాల ప్రొవైడర్‌గా శాంసంగ్ ఉంది. -
కరోనా: కేంద్రం తాజా మార్గదర్శకాలు.. పూర్తి వివరాలు
సాక్షి, న్యూఢిల్లీ: కార్యాలయాలు ఇతరత్రా పని చేసే ప్రాంతాలు ఎప్పుడూ రద్దీగా ఉంటాయన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా ప్రామాణిక నియమావళి విడుదల చేసింది. కారిడార్లు, ఎలివేటర్లు, స్టెయిర్‌కేస్, వాహనాలు నిలుపదల చేసే చోటు, క్యాంటీన్, కేఫటేరియా, సమావేశాల మందిరాలు తదితర ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రామాణిక నియమావళి పాటించాలని మంత్రిత్వశాఖ ఆదేశాల్లో పేర్కొంది. నియమావళి ఇదీ... ► కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు అన్నివేళలా ఉండాలి. ► కార్యాలయాల్లో ప్రతి ఒక్కరూ ఇతరులతో ఆరు అడుగుల దూరం పాటించాలి. ► అన్నివేళలా మాస్కులు ధరించాలి. ముక్కు, నోరు మూసి ఉండేలా మాస్కుల ధరించేలా చూడాలి. మాస్కు ముందుభాగం పదేపదే తాకకుండా చూసుకోవాలి. ► కార్యాలయంలోకి ప్రవేశించే ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ వినియోగించాలి. ► కరోనా లక్షణాలు లేని వారినే కార్యాలయాల్లోకి అనుమతించాలి ► అధికారి లేదా సిబ్బంది కంటైన్మెంట్ జోన్లలో నివశిస్తున్నట్లైతే వారు డీనోటిఫైఅయ్యే వరకూ కార్యాలయానికి రాకూడదు. వారికి ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించాలి. ► డ్రైవర్లు వారికి కేటాయించిన గదుల్లో సామాజిక దూరం పాటించాలి. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. కంటైన్మెంట్ జోన్లలో నివసించే వారిని వాహనం నడపడానికి అనుమతించకూడదు. ► వాహనం లోపలి భాగాన్ని రోజుకి రెండుసార్లు సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్ లేదా స్ప్రేతో శుభ్రం చేయాలి. ► డోర్ హ్యాండిళ్లు, తాళాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ► వయసు ఎక్కువ ఉన్నవారు, గర్భిణులు, వైద్య సేవలు పొందుతున్న వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కార్యాలయాల్లో ఫ్రంట్‌లైన్ పనులకు వారి సేవలు వినియోగించకూడదు. ► మాస్కు ధరించిన వారినే కార్యాలయాల్లోకి రానివ్వాలి. ► సందర్శకులను పూర్తిగా పరిశీలించిన అనంతరమే అనుమతించాలి. ► వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు నిర్వహించాలి. ► వ్యాలెట్ పార్కింగ్ నిర్వహించే వారు గ్లౌజ్‌లు, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ► కార్యాలయం లోపల , బయట ఉన్న దుకాణాలు, స్టాళ్లు, కేఫటేరియా, క్యాంటీన్లలో సామాజిక దూరం పాటించేలా చూడాలి. ► కనీసం రోజుకి రెండుసార్లు కార్యాలయాల ప్రాంగణం శానిటైజ్ చేయాలి. ► వాష్‌రూమ్‌ల్లో ఎళ్లవేళలా శానిటైజర్, సబ్బులు, నీటిప్రవాహం ఉండేలా చూసుకోవాలి. ► సీపీడబ్ల్యూడీ నిబంధనలు అనుసరించి ఏసీలు ఎప్పుడూ 24–30డిగ్రీలు, తేమ 40–70శాతం మధ్యలో ఉండేలా చూసుకోవాలి. ప్రాంగణం ఎలా ఉండాలి... ► కార్యాలయాల్లో కేసులు నమోదైతే కనక సదరు రోగి 48 గంటల క్రితం సందర్శించిన లేదా పనిచేసిన ప్రాంతాలను శానిటైజేషన్ చేయాలి. ► ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మార్గదర్శకాలు అనుసరించి పనులు కొనసాగించొచ్చు. ► ఒకవేళ ఆయా కార్యాలయాల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైతే సదరు బ్లాక్ లేదా భవనం మొత్తాన్ని శానిటైజ్ చేసి తర్వాత కార్యకలాపాలు ప్రారంభించాలి. కంటైన్మెంట్ జోన్లలో నివసించే అధికారులు, సిబ్బంది కార్యాలయానికి సంబంధించిన పర్యవేక్షక అధికారికి ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలి. ► కంటైన్మెంట్ జోన్ డీనోటిఫై అయ్యే వరకూ కార్యాలయాలకు హాజరుకాకూడదు. ఆయా సిబ్బంది ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలి. కేసులు వస్తే ఏం పాటించాలి... ► ఆయా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కార్యాలయాల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు వస్తే ... అనారోగ్యానికి గురైన వ్యక్తి గది లేదా ప్రాంతం ఇతరులకు దూరంగా ఉంచాలి. ► అనారోగ్యానికి గురైన వారిని వైద్యుడి వద్దకు తీసుకెళ్తే ఆ సమయంలో వారు మాస్కు లేదా ఫేస్ కవర్ ధరించేలా చూడాలి. ► వెంటనే దగ్గర్లోని వైద్య సదుపాయం ఉన్న ప్రాంతాలకు వారి సమాచారం చేరవేయాలి. వైద్యుల సలహాలు పాటించాలి. ► ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం కేసుల నిర్వహణ ఉండాలి. ఇవి కూడా చదవండి: ఇలాగైతే కరోనా వ్యాప్తి చెందదా? టీకా తీసుకున్న 20 రోజులకు పాజిటివ్! -
డేటా బ్రీచ్ : డా. రెడ్డీస్‌కు భారీ షాక్
సాక్షి, ముంబై: హైదరాబాదుకు చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కు డేటా షాక్ తగిలింది. సంస్థకు చెందిన సర్వర్లలో డేటాబ్రీచ్ కలకలం రేపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్లాంట్లను సౌకర్యాలను మూసి వేసింది. సైబర్ దాడి నేపథ్యంలో అన్ని డేటా సెంటర్ సేవలను వేరుచేసినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల అందించిన సమాచారంలో డా.రెడ్డీస్ తెలిపింది. సైబర్ దాడిని గుర్తించిన నేపథ్యంలో అవసరమైన నివారణ చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. రాబోయే 24 గంటల్లో అన్ని సేవలను పునఃప్రారంభించాలని ఆశిస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ సీఈఓ ముఖేష్ రతి తెలిపారు. ఇది తమ కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం చూపదన్నారు. (రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్) ఇండియా సహా, అమెరికా, యూకే, బ్రెజిల్, రష్యాలోని ప్లాంట్లు ప్రభావితమైనాయని డా.రెడ్డీస్ వెల్లడించింది. భారతదేశంలో రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ 2-3 దశల హ్యూమన్ ట్రయల్స్ నిర్వహణకు డా.రెడ్డీస్ కు డీజీసీఐ( డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి లభించిన కొన్నిరోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం ఆందోళన రేపింది. దీంతో డాక్టర్ రెడ్డీస్ షేర్ 4 శాతం కుప్ప కూలింది. మరోవైపు గత కొంతకాలంగా ఇన్వెస్టర్లకు చక్కని రిటర్న్స్ అందించిన ఫార్మా షేర్లు గురువారం అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. అరబిందో ఫార్మా, సిప్లా భారీగా నష్టపోతున్నాయి. దీంతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2.29 శాతం నష్టంతో ట్రేడవుతోంది. -
అటవీ భూముల కేటాయింపులపై హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్పూర్ మండలం మైలవరం గ్రామం సమీపంలోని అటవీ భూములను ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ భూములకు సంబంధించి న్యాయవాది వి.గంగా ప్రసాద్ దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది. ‘మైలవరం గ్రామంలో సర్వే నంబర్లు 54, 55, 204/1, 205/1లో కొండలతో కూడిన దాదాపు 250 ఎకరాల అటవీ భూమి ఉంది. జిల్లా కోర్టుల భవన సముదాయంతో పాటు ఇతర నిర్మాణాలకు ఈ భూమిని కేటాయించారు. 25 ఎకరాలను జిల్లా కోర్టుల భవన సముదాయాల నిర్మాణానికి, 20 ఎకరాలను పీజీ కళాశాల భవనాలకు, ఐదెకరాలు టూరిజం కార్పొరేషన్‌కు, 2.30 ఎకరాలు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం కేటాయించింది. నిరుపయోగమైన, నీటి సౌకర్యం లేని భూములను మాత్రమే నిర్మాణాలకు కేటాయించాలని 2012లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోకు విరుద్ధంగా వృక్షాలున్న ఈ భూమిని నిర్మాణాలకు కేటాయించారు. ఈ భూ కేటాయింపులను చట్టవిరుద్ధంగా ప్రకటించి నిర్మాణాలు చేపట్టకుండా ఆదేశాలివ్వండి’అని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. -
ఇద్దరికి వైరస్, ఆఫీసులు మూసివేసిన టెక్ సంస్థ
సాక్షి, బెంగళూరు: ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) ప్రకంపనలుకొనసాగుతుండగానే బెంగళూరు నగరంలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడం మరింత ఆందోళన రేపుతోంది. తాజాగా జర్మనీ సాఫ్ట్వేర్ గ్రూప్ కుచెందిన భారత సంస్థ ‘సాప్’ ఉద్యోగులకు ప్రాణాంతక స్వైన్ ఫ్లూ కారక హెచ్1ఎన్1 వైరస్ సోకడంతో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలికంగా తన కార్యాలయాలన్ని మూసివేయడంతో పాటు, ఉద్యోగులకు ఇంటినుంచే సదుపాయాన్ని కల్పించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం, హెచ్1ఎన్1 లక్షణాలలో జ్వరం, చలి, గొంతు నొప్పిలాంటివి సాధారణ జలుబు లక్షణాలుగా పైకి కనిపించినప్పటికీ, ఈ వైరల్ న్యుమోనియా ఆరోగ్యకరమైన యువకులను కబళించే తీవ్రత ఉన్న కారణంగా ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.బెంగళూరులో సాప్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు హెచ్1ఎన్1 వైరస్ ఫలితం పాజిటివ్ వచ్చింది. దీంతో శానిటైజేషన్ కోసం భారత్‌లోని తన కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసినట్టు సాప్ ప్రకటించింది. బెంగళూరు, గుర్గావ్, ముంబై ఆఫీసులలో సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపింది. అలాగే తదుపరి నోటీసు వచ్చేంతవరకు తమ ఉద్యోగులందరూ ఇంటి నుండే పని చేయాలని కోరింది. -
ఏపీ: అవినీతిపరుల భరతం పడుతున్న ఏసీబీ
సాక్షి, విజయవాడ: సీఎం ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ప్రక్షాళనకు ఏసీబీ నడుంబిగించింది. అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో లంచావతారాల భరతం పట్టేందుకు ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా చిత్తూరు, పశ్చిమ, తూర్పుగోదావరి, అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు నిర్వహించింది. బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు చేపట్టింది. 14400 స్పందన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు స్పందించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో బీరువాలు, సిబ్బంది బ్యాగులను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. రికార్డులు పరిశీలించి సిబ్బందిని ఆరా తీస్తున్నారు. కార్యాలయాలకు పనులపై వచ్చిన ప్రజలను విచారించి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. చిత్తూరు: జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. రేణిగుంట, వడమాలపేట, పుత్తూరు తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. వివిధ సమస్యల మీద వచ్చిన ఫిర్యాదులు ఎంత వరుకు పరిష్కారం అయ్యాయి. పెండింగ్ ఉన్న ఫిర్యాదులు, పరిష్కారం చేయకపోవడానికి కారణాలపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి: జిల్లాలోని చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయంలో పలు దస్ర్తాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. కృష్ణా: జిల్లాలోని అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. రికార్డులను పరిశీలించడంతో పాటు, అధికారులు, సిబ్బంది బ్యాగులను కూడా తనిఖీ చేస్తున్నారు. కార్యాలయాలకు పనుల మీద వచ్చిన ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. తూర్పుగోదావరి: జిల్లాలోని పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు,సిబ్బందిని విచారిస్తున్నారు. రికార్డులను పరిశీలించడంతో పాటు, తహసీల్ధార్ కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. అనంతపురం జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా దాడుల్లో భాగంగా ఏసీబీ అధికారులు జిల్లాలోని ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎచ్చెర్ల తహసీల్ధార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రకాశం జిల్లా: పొన్నలూరు తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడుల్లో భాగంగా కార్యాలయంలో ఏసీబీ అధికారులు అపర్ణ, వెంకటేశ్వర్లు, రాఘవరావు, ప్రసాద్ రికార్డులను పరిశీలించారు. పాసు పుస్తకాలు జారీ అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శ్రీకాకుళం: జిల్లాలోని కొత్తూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్ధార్ కార్యాలయంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రికార్డులను పరిశీలించారు. విజయనగరం జిల్లా: జిల్లాలో వేపాడ తహసీల్ధార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. కార్యాలయంలోని అధికారులు,సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రికార్డులు పరిశీలించి ఆరా తీస్తున్నారు.ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. నెల్లూరుజిల్లా: సూళ్లూరుపేట తహసీల్ధార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించాయి. అవినీతిపై ఆరోపణలపై అధికారులను, సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు కార్యాలయాలకు వచ్చిన ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
విభజనపై సందిగ్ధం..!
కరీంనగర్: జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు ముగిశాయి. కొత్త పాలకవర్గం ఎన్నిక పూర్తయ్యింది. మరో 20 రోజుల్లో కొలువుదీరడమే మిగిలింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు నాలుగు జిల్లాల్లోనూ పల్లె ఓటర్లను తమవైపు తిప్పుకొని పాలకవర్గాలను ‘కారు’ ఎక్కించిన విషయం విదితమే. నాలుగు జిల్లాల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో గెలుపొందడం, చైర్పర్సన్, వైస్‌చైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకపక్షంగా జరిగి నాలుగు జిల్లా పరిషత్‌లను తమ ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. గత మూడు నెలలుగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు. ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్, లెక్కింపు, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలక వర్గాల ఎంపిక ప్రక్రియలో జెడ్పీ అధికారులు తలమునకలు అయ్యారు. ఇక కొత్తపాలక వర్గాలు కొలువుదీరేందుకు అవసరమైన జిల్లా పరిషత్ కొత్త భవనాలు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఉద్యోగుల పదోన్నతులు చేపడుతారా.. లేదా వర్క్ టు సర్వ్ కింద ఉన్న సిబ్బందినే ఆయా జిల్లాలకు విభజిస్తారా అనేది తేలాల్సి ఉంది. జిల్లా పరిషత్‌ల ఏర్పాటుపై పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఇంకా పూర్తిస్థాయి మార్గదర్శకాలు అందలేదు. నాలుగు జిల్లాలకు నోడల్ జెడ్పీగా ఉన్న కరీంనగర్ జిల్లా పరిషత్ పరిధిలోని ఉద్యోగుల వివరాలు కేడర్ల వారీగా, మౌలిక సదుపాయాలు, సామగ్రి వివరాలను రెండు నెలల క్రితమే పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడి సిబ్బంది నివేదించారు. కరీంనగర్ జెడ్పీలో 80 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. ఈ సిబ్బందినే నాలుగు జిల్లాలకు విభజించే ఆస్కారం ఉంది. ఇటీవల వెలువడిన ఆదేశాల ప్రకారం జెడ్పీలోని కొన్ని విభాగాలను కుదించే అవకాశం కూడా లేకపోలేదు. మరికొన్ని పోస్టులను తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒక్కో జిల్లా పరిషత్‌కు 19 మంది సిబ్బంది అవసరం, సీఈవో, డిప్యూటీ సీఈవో, రెండు సూపరింటెండెంట్ పోస్టులు, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు, ఆరుగురు ఆఫీస్ సబార్డినేట్లు ఇలా మొత్తం ఒక్క జెడ్పీలో ఎంత తక్కువ అన్న కనీసం 19 మంది ఉంటేనే పాలన సవ్యంగా కొనసాగించే వీలుంటుంది. ప్రస్తుతం జెడ్పీ పరిధిలో 80 మంది ఉద్యోగులను విభజించే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల జెడ్పీలకు లైజన్ అధికారులతోపాటు ఒక్కొక్క జిల్లాకు ఆరుగురి వరకు సిబ్బందిని ఎన్నికల విధుల నిమిత్తం రిలీవ్ చేశారు. ఎన్నికల అనంతరం ఆయా సిబ్బంది మళ్లీ జెడ్పీలో నివేదించారు. కొత్త జిల్లాల్లో సిబ్బందిని పంచాయతీరాజ్ శాఖ ద్వారా పదోన్నతులు కల్పించి బదిలీ చేస్తారా లేదా సర్వ్ టు రూల్ కింద ఆయా జిల్లాల కలెక్టర్లే ఈ సిబ్బందిని కేటాయిస్తారా అన్న దానిపై జిల్లా పరిషత్ ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ఫ్యాన్లు, జిరాక్స్ మిషన్లు, తదితర సామగ్రి సమాచారం సైతం పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఇప్పటికే చేరింది. కొత్త మండల పరిషత్‌లకు కనీసం పది మంది... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడ్డ మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క మండలానికి కనీసం పది మంది సిబ్బంది అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను విభజించి ఒక్కొక్క మండల పరిషత్‌కు మిగతా మండలాల నుంచి పది మంది ఉద్యోగులను నియమిస్తే పాలనసాఫీగా సాగుతుంది. ఒక్క మండలంలో ఓ ఎంపీడీవో, సూపరిండెంటెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, నలుగురు ఆఫీస్ సబార్డినేట్లు అవసరం. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కొత్త కార్యాలయాలు, సిబ్బంది కేటాయింపుల మార్గదర్శకాలు సైతం జెడ్పీకి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. జూలై 5న కొత్తపాలక వర్గాలు... ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించి జిల్లా పరిషత్, చైర్పర్సన్లు, వైస్చైర్మన్లతో పాలక వర్గాలు ఏర్పడ్డాయి. వచ్చే జులై 5న కొత్త పాలక వర్గాలు ఆయా జిల్లాల్లో కొలువుదీరాల్సి ఉంది. కొత్త జిల్లా పరిషత్ కార్యాలయాలతో పాలన ప్రారంభిస్తారా.. లేదా అద్దె భవనాల్లోనా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను జెడ్పీకి కేటాయిస్తారా అన్నదానిపై స్పష్టత రాలేదు. ఎన్నికల సమయంలో ఆయా జిల్లాల్లో ఏర్పడిన ఎంపీడీవో కార్యాలయాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన భవనాల్లో ఎన్నికల తతంగం ముగించారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల సామగ్రి, సిబ్బంది పంపిణీ అంతా పూర్తిస్థాయిలో కరీంనగర్ జిల్లా పరిషత్ నుంచే కొనసాగింది. తక్షణం ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వస్తే తప్ప ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ఆదేశాలు అందాకే కార్యాచరణ... కొత్త జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయాలు, ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. గతంలో అడిగిన పూర్తి సమాచారం నివేదించాం. జిల్లా పరిషత్ కొత్త పాలక వర్గంలు ఎన్నిక నియమాకం ముగిసింది. పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి మార్గదర్శకాలు రాగానే వాటికి అనుగుణంగా తదుపరి కార్యాచరణ చేపట్టి పనులు మొదలు పెడుతాం. – జెడ్పీ సీఈవో వెంకటమాధవరావు -
రాజకీయ కార్యాలయాల వేదిక మినీబైపాస్
సాక్షి, నెల్లూరు(అర్బన్): ప్రశాంతంగా ఉండే మినీబైపాస్ రోడ్డు రాజకీయ కార్యాలయాలకు వేదికైంది. మినీబైపాస్ రోడ్డులోనే టీడీపీ, బీజేపీ, జనసేన కార్యాలయాలు ఉన్నాయి. మరో 10 అడుగులు ముందుకేస్తే సీపీఎం కార్యాలయం ఉంది. అలాగే మినీబైపాస్ రోడ్డుకు కూతవేటు దూరంలోనే మాగుంట లేఅవుట్లో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయా కార్యాలయాల వద్ద రాజకీయ సందడి నెలకొంది. నిత్యం వందలాది మంది కార్యకర్తలు కార్యాలయాల బాట పట్టారు. ఎన్నికల సామగ్రి నిర్వహణ, ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ ప్రత్యర్థుల గురించి చర్చలు, ప్రచార వ్యూహాలు ఈ కార్యాలయాల నుంచే జరుగుతున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు, మాజీలు, పోటీ చేసే అభ్యర్థులు, వారి శ్రేయోభిలాషులతో ఆయా కార్యాలయాల వద్ద సందడిగా ఉంది. ఆ కార్యాలయాల పక్కనే ఉండే టీ దుకాణాలు, కేఫ్‌లు, జ్యూస్ షాపులు నిత్యం వచ్చిపోయే కార్యకర్తలతో కిటకిటలాడుతున్నాయి. ఓటు రాజకీయాలతో కార్యాలయాలు కళకళలాడుతుండగా, మరోవైపు ఎన్నికల పుణ్యమా అని తమ వ్యాపారం బాగా జరుగుతుందని పార్టీ కార్యాలయాల సమీపంలోని దుకాణాల యజమానులు సంబరపడుతున్నారు. -
ఆఫీస్‌లో ఎక్కువ పనిచేస్తే.. ఇక అంతే!
జపాన్... పేరు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది హిరోషిమా, నాగసాకి అణుబాంబు దాడి. అంతటి భయంకర దాడికి దేశం చిన్నాభిన్నమైనప్పటికీ... జపనీయులు ఎంతో మనోధైర్యంతో తమ దేశాన్ని మళ్లీ నిలబెట్టుకున్నారు. తమ జీవనశైలితో ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఎంతో నిబద్ధతో పనిచేసే జపనీయులు విశ్రాంతి లేకుండా పనిచేస్తూ... తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో తమ దేశ పౌరులను కాపాడుకునేందుకు... అక్కడి ప్రభుత్వం రొటీన్‌కు భిన్నంగా కొత్త కొత్త నిబంధనలు రూపొందించి మరీ క్రమశిక్షణలో పెడుతోంది. ప్రభుత్వం చర్యలు తీసుకునేంతంగా ఆ దేశ పౌరులు ఏంచేస్తున్నారో మనమూ ఓసారి తెలుసుకుందాం... టోక్యో: జపాన్‌లోని ఓ ఆఫీస్.. డ్యూటీ షిప్ట్ ముగిసిపోయే సమయం సాయంత్రం 5 గంటలకు సరిగ్గా ఓ అలారం మోగుతుంది. ఉద్యోగులు వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని అనౌన్స్మెంట్ వస్తుంది. కాసేపయ్యాక.. ఓ డ్రోన్ ఆఫీస్ మొత్తం తిరుగుతుంది. ఎక్కడైనా ఉద్యోగులు కనిపిస్తే.. వెంటనే పై అధికారులకు సమాచారం ఇస్తుంది. వాళ్లు సదరు ఉద్యోగులకు ఫోన్ చేస్తారు. వెంటనే పని ఆపేసి వెళ్లకపోతే మెమో జారీ చేస్తామని హెచ్చరిస్తారు. విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. జపాన్‌లోని ప్రభుత్వ ఆఫీసుల్లో, చాలా కంపెనీల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అవును..జపాన్ ఉద్యోగులు చేయాల్సిన పనిగంటలకంటే ఎక్కువ గంటలు పని చేయడమేగాక... తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అంతేగాక..ఉద్యోగులు ఏదైనా నిరసన తెలపాలన్నా ఎక్కువసేపు పనిచేసి నిరసన తెలుపుతున్నారు. ఇదంతా తలనొప్పిగా మారడంతో.. పనిరాక్షసులపై ప్రభుత్వానికి కఠిన నిబంధనలు అమలు చేయక తప్పడంలేదు. కరోషి.. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఒత్తిడి పెరిగి గుండెపోటు, అవయవాల ఫెయిల్యూర్ వంటివి సంభవిస్తున్నాయి. దీనిని జపాన్ భాషలో కరోషి అని పిలుస్తుంటారు. ఎన్‌హెచ్‌కే వార్తా సంస్థలో పనిచేసే ఓ మహిళా రిపోర్టర్ మివా సాడో.. వయసు 31 సంవత్సరాలు మాత్రమే. 2013 జులైలో ఆమె గుండెపోటుతో మరణించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో కరోషి వ్యాధితో చనిపోయినట్టు తేలింది. ఎన్నికల సమయం కావడంతో ఆమె 159 గంటలపాటు అదనంగా పనిచేసినట్టు తేలింది. నెలలో రెండు రోజులు మాత్రమే వీక్ ఆఫ్ తీసుకున్నారట. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ విషయం బయటికి వచ్చింది. ఇది ఒక్కటేగాక.. ఇలా జపాన్‌లో చాలామంది కరోషి వ్యాధితో మరణిస్తున్నట్లు సర్వేల్లో తేలింది. ఇలాంటి మరణాలను మొదట 1978లో అధికారికంగా గుర్తించి కరోషి అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఆఫీస్‌లోనే చనిపోయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. దీనికి ప్రధాన కారణం.. వాళ్ల పని సంస్కృతి, ఎక్కువ మొత్తంలో అందే జీతాలు. అంతేగాక ఇక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారికి సైతం రూ.లక్షల్లో జీతాలు అందుతాయి. ఉద్యోగుల ప్రాణాలు కాపాడేందుకు.. కరోషిని గుర్తిస్తే వెంటనే సమాచారం ఇచ్చేలా 1988లోనే ఒక హెల్ప్‌లైన్ నంబరును ఏర్పాటు చేశారు. 1990–2007 మధ్య కాలంలో ఈ నంబరుకు దాదాపు రెండు వేల కాల్స్ వచ్చాయి. ఇది గుర్తించిన చాలా కంపెనీలు ఉద్యోగులకు ప్రత్యేక కళ్లద్దాలు పంపిణీ చేశాయి. అవి ఉద్యోగుల కళ్ల కదలికలను గమనించి సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తాయి. ఏకాగ్రత తగ్గినట్టు గుర్తిస్తే కాసేపు విరామం తీసుకోమంటూ వారి ఫోన్లకు సందేశం పంపిస్తాయి. అయితే 2008 నుంచి కాల్స్ రావడం కొంత తగ్గినా ఇప్పటీకి ఏడాదికి సగటున 400 కాల్స్ వస్తున్నాయి. ఈ మధ్యనే ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులను ఇంటికి పంపడానికి డ్రోన్లను రంగంలోకి దించారు. టైం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆఫీసులోనే ఉండి పనిచేస్తుంటే ఈ డ్రోన్ పసిగట్టేస్తుంది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తుంది. అధికారులు పరిశీలించి సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎన్ని చర్యలు తీసుకుంటున్నా జపాన్ వాసుల పనితీరులో మాత్రం పెద్దగా మార్పు కనిపించడంలేదట. ఎక్కువ గంటలు పనిచేయడానికే మొగ్గు చూపి, ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు ఉద్యోగులు. చట్టపరంగా... దశాబ్దాలుగా జపాన్ను కరోషి తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు కలిసి చర్యలు చేపట్టాయి. చట్టప్రకారం నెలలో 100 గంటలకు మించి పనిచేయకూడదు. వారానికి రెండు చొప్పున వారాంతపు సెలవులు తీసేసినా రోజుకి ఐదుగంటలకు మించి పనిచేయరాదు. నిబంధనలు అతిక్రమించి ఎక్కువగంటలు పనిచేస్తే ఆ ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. నిబంధనలు ఉల్లంఘించి కంపెనీలు తమ ఉద్యోగులతో ఎక్కువ గంటలు పనిచేయించినా చర్యలు తప్పవు. (సాక్షి, స్టూడెంట్ ఎడిషన్) -
సొంత భవనాలు కలేనా?
స్వపరిపాలనలో గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసుకుంటామని కలలుగన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడటంతో గ్రామాలకు మరో స్వాతంత్య్రం వచ్చినట్లయింది. పంచాయతీ హోదాతో పాటు సమస్యలు నెరవేరుతాయని, సొంత భవనాల నిర్మాణం \జరుగుతుందని ఆశపడ్డారు. పంచాయతీ హోదావచ్చి ఏడాది కావస్తున్నా కనీస సౌకర్యాల కల్పనకు నోచుకోవడం లేదు. సమస్యలకు తోడు ఇన్చార్జి కార్యదర్శులతో పాలన అస్తవ్యస్తంగా మారింది. రేగోడ్(మెదక్): మండలంలో గతంలో 12 పంచాయతీలు ఉండేవి. గతేడాది పెద్దతండా, సంగమేశ్వర తండా, తిమ్మాపూర్, వెంకటాపూర్, పోచారం, తాటిపల్లి గ్రామాలకు పంచాయతీలుగా హోదా దక్కడంతో మొత్తంగా పంచాయతీల సంఖ్య 18కి చేరింది. స్వరాష్ట్రంలో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందుల పాలవుతున్నారు. ఐదు వందల జనాభా కలిగిన గ్రామాలు, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసినా పంచాయతీలకు సొంత భవనాలు ఇప్పటి వరకూ నిర్మించలేదు. అంగన్వాడీ పాఠశాలల భవనాలు, ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో పంచాయతీ కార్యాలయాలను కొనసాగిస్తున్నారు. నామమాత్ర ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసినా సమావేశాలకు స్థలం సరిపోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. పంచాయతీలను ఏర్పాటు చేసి సుమారు ఏడాది కావస్తున్నా.. భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయకపోవడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇన్చార్జి కార్యదర్శులే దిక్కు.. పంచాయతీకి ఒక గ్రామ కార్యదర్శి ఉండాలి. కానీ ఇక్కడ 18 గ్రామ పంచాయతీలకు నలుగురు మాత్రమే కార్యదర్శులు పని చేస్తున్నారు. ఇద్దరు కార్యదర్శులకు ఐదు చొప్పున పంచాయతీలు, మరో ఇద్దరు కార్యదర్శులకు నాలుగు చొప్పున పంచాయతీలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇన్చార్జి బాధ్యతలతో కార్యదర్శులకు భారంగా మారింది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏ గ్రామ కార్యదర్శి ఏ గ్రామంలో ఉంటున్నారనే విషయం తెలియక అధికారులు, ప్రజలు సతమతమవుతున్నారు. దీంతో పారిశుధ్య నిర్వహణ గ్రామాల్లో అస్తవ్యస్తంగా మారింది. అపరిశుభ్రత కారణంగా ఇటీవల సంగమేశ్వర తండాలో ఇంటింటికీ జ్వరాలు వచ్చిన విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీలకు లక్షలాది రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తున్నా సమస్యల పరిష్కారం నోచుకోక, పారిశుధ్యం కానరక ప్రజలు అవస్థలు పడుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిధులు మంజూరు చేయాలి మా తండాను మేమే పరిపాలించుకునే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేయడం ఆనందంగా ఉంది. పంచాయతీ ఏర్పడినా సొంత పంచాయతీ భవనం నిర్మాణం కాలేదు. పంచాయతీలో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. నిధులు మంజూరు చేసి సమస్యలను తొలగించాలి. –సంతోష్ చౌహాన్, సంగమేశ్వర తండా వెంటనే బదిలీలు చేపట్టాలి జిల్లాలో సుమారు పదేళ్లకు పైగా ఒకే మండలంలో పనిచేస్తున్న కార్యదర్శులు ఉన్నారు. వారందరికీ బదిలీలు చేయాలి. ఒక్కో కార్యదర్శికి ఐదారు పంచాయతీలు ఉండటంతో పని ఒత్తిడికి గురై మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతీ పంచాయతీకి కార్యదర్శులను నియమించి సమస్యలను పరిష్కరించాలి. –పంచాయతీ కార్యదర్శిల అసోసియేషన్ జిల్లా కోశాధికారి -
వేల కోట్లకు పడుగలెత్తిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్....
సాక్షి ప్రతినిధి కడప: టీడీపీ నేత రాజ్యసభ సభ్యులు ఎంపీ సీఎం రమేష్ నివాసం గృహం, సమీప బంధువులు, ప్రధాన అనుచరుల ఇళ్లల్లో శుక్రవారం ఐటీ అధికారులు సో దాలు చేశారు. ఈవార్త జిల్లాలో దావానంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణుల్లో కలకలం రేగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆదా యపు పన్నుశాఖ అధికారులు సోదాలు చేసి మూడు సూట్కేసులల్లో విలువైన పత్రాలు, డ్యాకుమెంట్లు తీసుకెళ్లారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఇంటిలో శుక్రవారం తిరుపతి నుంచి వచ్చిన 8 మంది ఐటీ (ఇన్‌కం ట్యాక్స్) అధికారులు తనిఖీలు చేశారు. సాయంత్రం 5.30 గంటల వరకూ అధికారుల తనిఖీలు కొనసాగాయి. కాగా ‘గుమ్మడి కాయల దొంగ’ అంటే భుజాలు తడుముకున్నట్లుగా టీడీపీ నేతలు శైలి కన్పించింది. ఐటీ అధికారుల తనిఖీలు చేయడాన్ని రాజకీయ రంగు పులిమి నిరసనలు, నినాదాలు చేపట్టారు. ఓవైపు అధికారులు వారి పని వారుచేస్తుండగా మరోవైపు టీడీపీ శ్రేణులు ఆం దోళనలు కొనసాగించాయి. ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, బీటెక్ రవీ, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు పోట్లదుర్తి చేరుకొని హంగామా సృష్టించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన పాటించారు. ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మీడియా ఎదుట ఆగ్రహం ప్రదర్శించారు. రిత్విక్ కన్స్ట్రక్షన్స్.... రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ రమేష్‌నాయుడు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్కు వేల కోట్లు కాంట్రాక్టు పనులు వచ్చి చేరిపోయాయి. అప్పటి వరకు అరకొర పనులకే పరిమితమైన ఆ సంస్థ రాష్ట్రంలో దాదాపుగా రూ.3,658కోట్లు పనులు చేసినట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టుల్లో పెండింగ్‌లో ఉన్న పనులు కల్పతరువుగా నిలిచాయి. జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, ఆర్టీపీపీ, వంశధార, కుప్పం బ్రాంచ్ కెనాల్, వెలిగొండ టన్నెల్ ప్రధానంగా ఉన్నట్లు సమాచారం. బీఎన్ఎస్ఎస్లో అతి తక్కువగా నిలిచిపోయిన పనులు రివైజ్డ్ రేట్లు వేయించుకొని అత్యధికంగా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ రూ.522 కోట్లు, హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్–2 రూ.1000 కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ విస్తరణ పనులు రూ.195 కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ 34వ ఫ్యాకేజీ రూ.234కోట్లు, జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులో రూ.350కోట్లు, వెలిగొండ టన్నల్ రూ.270 కోట్లు, తెలుగుగంగ లైనింగ్ పనులు రూ.289 కోట్లు, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ రూ.172 కోట్లు, వంశధార ప్రాజెక్టు పనులు రూ.120 కోట్లు, ఆర్టీపీపీ 6వ ఫ్లాంటు నిర్మాణ పనులు రూ.400 కోట్లు, గండికోట ప్రాజెక్టు పునరావాస నిర్మాణం పనులు రూ.106 కోట్లు పనులు దక్కినట్లు కాంట్రాక్టు వర్గాలు వివరిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంలో దాదాపు రూ.3,658 కోట్లు పైబడిన కాంట్రాక్టులను ఆ సంస్థ కొనసాగిస్తున్నట్లు పలువురు ధ్రువీకరిస్తున్నారు. ఈమొత్తం వ్యవహారంలో ఆదాయ వ్యవహారాలు చెల్లించడంలో లోటుపాట్లు ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించి దాడులకు పాల్పడినట్లు పలువురు వెల్లడిస్తున్నారు. ఇదివరకే టీడీపీ నేత ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజలరెడ్డి సైతం ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలు సైతం చేశారు. ఈనేపథ్యంలో ఐటీ విభాగం ప్రత్యక్ష తనిఖీలు చేయడంపై పోట్లదుర్తి వాసులు ‘తేలు కుట్టిన దొంగల్లా’ వ్యవహరిస్తున్నారని పలువురు బాహాటంగా అంటున్నారు. -
గృహాలు కిందికి.. ఆఫీసులు పైకి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ గృహ నిర్మాణ రంగంలో నూతన ప్రాజెక్ట్‌ల విషయంలో గణనీయమైన తగ్గుదల ఉందని, కార్యాలయాల మార్కెట్ మాత్రం కాసింత మెరుగ్గా ఉందని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. హెచ్1తో పోలిస్తే నగరంలో జూలై–డిసెంబర్ (హెచ్2) మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు 84 శాతం క్షీణత, ఆఫీసు లావాదేవీల్లో మాత్రం 5 శాతం వృద్ధిని నమోదు చేసిందని నివేదిక వెల్లడించింది. దేశంలోని అన్ని ముఖ్య నగరాలతో పాటూ హైదరాబాద్‌లోని నివాస, కార్యాలయాల విభాగం పరిస్థితులపై క్షేత్రస్థాయిలోని వివరాలను నైట్‌ఫ్రాంక్ హైదరాబాద్ డైరెక్టర్ సామ్సన్ ఆర్థూర్ బుధవారమిక్కడ విడుదల చేశారు. పెద్ద నోట్ల రద్దు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ బిల్లు (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కారణంగా దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాల్లోని రియల్టీ మార్కెట్‌పై ప్రభావం చూపించింది. హైదరాబాద్‌లో అయితే పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఇక్కడ హెచ్1లో 2,571 యూనిట్లు ప్రారంభం కాగా.. హెచ్2లో 84 శాతం తగ్గుదలతో 940 యూనిట్లకే పరిమితమయ్యాయి. అమ్మకాలూ డౌన్.. హెచ్2లో నగరంలో గృహాల అమ్మకాల్లోనూ 13 శాతం తగ్గుదల కనిపించింది. హెచ్1లో 7,901 యూనిట్లు అమ్ముడుపోగా.. హెచ్2లో 6,342 యూనిట్లకు చేరాయి. నగరంలో ఇంకా అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ 2016తో పోలిస్తే 28,088 నుంచి 17,356 యూనిట్లకు తగ్గింది. అమ్మకాలు ఆశాజనకంగా ఉండటంతో రూ.50 లక్షల లోపు ఉండే అందుబాటు గృహాల ప్రాజెక్ట్‌ల వైపు నిర్మాణ సంస్థలు దృష్టిసారించాయి. దీంతో ఈ విభాగంలో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు 40 శాతం పెరిగాయి. ఆఫీస్‌లో 5 శాతం వృద్ధి.. జూలై–డిసెంబర్ మధ్య కాలంలో హైదరాబాద్ ఆఫీసు రియల్టీ మార్కెట్ రికార్డుల మోత మోగించింది. ఈ 6 నెలల కాలంలో 3.34 మిలియన్ చ.అ. ఆఫీసు లావాదేవీలు జరిగాయి. హెచ్1లో ఇది 2.33 మిలియన్ చ.అ.లుగా ఉంది. అంటే 5 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే 2016 ఏడాదితో పోలిస్తే మాత్రం 2017లో ఆఫీసు విభాగ లావాదేవీలు 4 శాతం తగ్గాయి. దేశంలోనూ సేమ్ సీన్! 2017 హెచ్2లో దేశంలోని 8 ప్రధాన మార్కెట్లలో గృహ రంగంలో క్షీణత, ఆఫీసు విభాగంలో వృద్ధిని నమోదు చేసింది. హెచ్1లో 62,738 యూనిట్లు ప్రారంభం కాగా.. హెచ్2లో 41 శాతం తగ్గుదలతో 40,832 యూనిట్లకు పరిమితమయ్యాయి. అమ్మకాల్లోనూ అంతే! హెచ్1లో 1,20,756 యూనిట్లు అమ్ముడుపోగా.. హెచ్2లో 2 శాతం క్షీణతతో 1,07,316కు చేరాయి. అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ 2016లో 6,52,996 యూనిట్లు ఉండగా. 2017లో ఇవి 5,28,494 యూనిట్లకు తగ్గాయి. 9 శాతం అప్.. హెచ్2లో ఆఫీస్ విభాగంలో 22.5 మిలియన్ చ.అ. లావాదేవీలు జరిగాయి. హెచ్1లో 19.2 మిలియన్ చ.అలుగా ఉంది. 9 శాతం వృద్ధిని కనబర్చింది. విభాగాల వారీగా పరిశీలిస్తే.. ఐటీ, ఐటీఈఎస్ విభాగం 37 శాతం, బీఎఫ్ఎస్ఐ 14 శాతం, తయారీ రంగం 14 శాతం ఆఫీసు స్థలాన్ని ఆక్రమించాయి. -
ఆఫీసుల్లో ప్రీపెయిడ్ కరెంట్ !
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ వృథాకు చెక్ పెట్టడంతో పాటు ప్రతి యూనిట్‌నూ పక్కాగా లెక్కించేందుకు ప్రీపెయిడ్ మీటర్లను అందుబాటులోకి తెచ్చింది దక్షిణ తెంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ. తొలుత నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే 464 ప్రీపెయిడ్ కనెక్షన్లు జారీ చేసిన డిస్కం.. ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. మరో ఆరు మాసాల్లో నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ మీటర్లను అమర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలి దశలో ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేసి, ఆ తర్వాత గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు కూడా ఈ విధానాన్ని వర్తింపజేయాలని అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్లో 43 లక్షల కనెక్షన్లు గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 43 లక్షల విద్యుత్ కనె క్షన్లు ఉన్నాయి. వీటిలో 36 లక్షల గృహ, ఐదున్నర లక్షల వాణిజ్య, 45 వేల పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, హాస్టళ్లు, కార్పొరేషన్ ఆఫీసుల కనెక్షన్లే 22 వేల వరకూ ఉంటాయి. వీటి నుంచి నెలానెలా బిల్లులు వసూలు కాకపోగా.. బకాయిలు లక్షల్లో పేరుకుపో యి సంస్థకు నష్టాలు వాటిల్లుతున్నాయి. అంతేకాక పర్యవేక్షణ లోపం వల్ల విద్యుత్ దుబారా రెట్టింపైంది. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ ప్రీపెయిడ్ మీటర్ విధానాన్ని తొలి విడతగా నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్షేమ వసతి గృహాలకు, ఇతర కార్యాలయాలకు వర్తింపజేసి విద్యుత్ దుబారాను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఇటీవల పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా రాజ్‌భవన్, ఎన్టీఆర్ ఘాట్ సహా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిని బిగించింది. ఇక్కడ మంచి ఫలితాలు వచ్చాయి. నిజానికి మార్చి చివరి నాటికే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సింది. ఏప్రిల్ ఒకటి నుంచి రీడింగ్ నమోదు చేయాల్సి ఉంది. కానీ సరఫరా కంపెనీల వద్ద డిస్కం సూచించిన ఫీచర్లతో కూడిన మీటర్లు లేకపోవడంతో జాప్యం జరిగింది. మీటర్ల బిగింపు ప్రక్రియ వేగవంతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్రీపెయిడ్ మీటర్ల బిగింపు ప్రక్రియను డిస్కం వేగవంతం చేసింది. పవర్–1, ఈసీఐఎల్, హెచ్ పీఎల్, జీనస్ కంపెనీలు ఈ మీటర్లను సరఫరా చేస్తున్నాయి. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 464 కనెక్షన్లను డిస్కం జారీ చేసింది. వీటి నిర్వహణ బాధ్యతను ఐదేళ్ల పాటు సదరు సరఫరా కంపెనీలే చూసుకుంటున్నాయి. సింగిల్ ఫేజ్ మీటర్‌కు రూ.8,668, త్రీ ఫ్రేజ్ మీటర్‌కు రూ.11 వేల వరకు ఖర్చు అవుతుండగా, ఈ ఖర్చంతా డిస్కమే భరిస్తుంది. మీటర్ల బిగింపు ప్రక్రియ పూర్తైన తర్వాత వచ్చే ఫలితాలను బట్టి వీటిని ఔత్సాహిక వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. ఇలా పని చేస్తుంది.. ప్రస్తుతం ఉన్న మెకానికల్ మీటర్లను తొలగించి, దాని స్థానంలో ప్రీపెయిడ్ కార్డుతో అనుసంధానించిన ప్రత్యేక మీటర్‌ను అమర్చుతారు. దీనికి ఓ సిమ్‌కార్డును అనుసంధానిస్తారు. వినియో గదారుడు ఇకపై ప్రతినెలా సెల్ ఫోన్‌ను రీచార్జ్ చేసుకున్నట్లుగానే ఇంట్లోని విద్యుత్ మీటర్‌ను రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే ఇంట్లో విద్యుత్ ఉంటుంది. లైట్లు వెలుగుతాయి. లేదంటే కార్డును రీచార్జ్ చేసుకునే వరకు చీకట్లు తప్పవు. ఈ మీటర్ల కోసం ఆయా కార్యాలయాలు, సంస్థలు ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి అయ్యే పూర్తి ఖర్చును డిస్కమే భరిస్తుంది. -
ఫేస్బుక్ సరికొత్త చాట్ యాప్
న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సరికొత్తగా వర్క్‌ప్లేస్ చాట్ యాప్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త చాట్ యాప్‌ను ఆఫీసులో వివిధ డిపార్ట్మెంట్ల మధ్య వ్యక్తులను కనెక్ట్ చేయడం కోసం లాంచ్ చేసింది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, పీఎస్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫేస్బుక్ వర్క్‌ప్లేస్‌కు ఈ యాప్ లింక్ అయి ఉంటుంది. ఉద్యోగుల మధ్య మెసేజింగ్‌కు ఇది ఉపయోగపడుతోంది. గ్రూప్ ప్రాజెక్టుల విషయంలో ఉద్యోగులు ఈ యాప్‌లో చర్చించుకోవడం వంటివి చేసుకోవచ్చు. పలు ముఖ్యమైన అంశాలపై కూడా లైవ్ వీడియో సెషన్స్ ద్వారా ఉద్యోగులు చర్చించుకోవచ్చు. వర్క్‌ప్లేస్‌లో ఉన్నప్పుడు ఉద్యోగులు ఎక్కువగా మొబైల్ డివైజ్‌లు కంటే తమ డెస్క్టాప్లనే వాడుతుంటారు. ఎక్కువ సమయం డెస్క్‌టాప్‌లపైనే కేటాయిస్తున్నారు. అందుకోసం డెస్క్‌టాప్ యాప్‌ను కూడా ఫేస్బుక్ తీసుకొచ్చింది. వర్క్‌ప్లేస్ చాట్ ద్వారా సహ ఉద్యోగులతో లేదా గ్రూప్‌తో వీడియో చాట్, స్క్రీన్ షేరింగ్, ఫైల్ షేరింగ్, మెసేజ్ రియాక్షన్స్, @మెంక్షన్స్, జీఐఎఫ్స్ వంటి ఫీచర్లున్నాయి. -
అన్ని శాఖల్లో బయోమెట్రిక్ అమలుకు ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): అన్ని శాఖల అధికారులు విధిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పలువురు ఫోన్ ద్వారా తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ మంజూరైనా అందించలేదని ఆస్పరి మండల రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. చౌకదుకాణాల్లో కిరోసిన్ నిలిపేశారని, ఇకపై కూడా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చిప్పగిరికి చెందిన కొందరు ఫోన్ ద్వారా కలెక్టర్‌ను కోరారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు తదితరులు పాల్గొన్నారు. -
ఒకే గూటిలో పోలీసు కార్యాలయాలు
20 ఎకరాలలో నూతన భవనాల నిర్మాణం అర్బన్ ఎస్పీ, డీఎస్పీలు, సీఐడీ, ఆయుధగారం.. అన్నీ అక్కడే సీఎం చంద్రబాబుతో ప్రారంభించేందుకు యత్నం రాజమహేంద్రవరం పోలీస్ అర్బన్ జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మిస్తున్నారు. లాలాచెరువు వద్ద జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఓఎన్జీసీ బేస్ క్లాంప్లెక్ వద్ద 20 ఎకరాల స్థలంలో అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయం, డిస్ట్రిక్ ఆర్మ్డ్ రిజర్వు పోలీస్ కార్యాలయం (డీఏఆర్), సీఐడీ కార్యాలయం, ఆయుధగారం కార్యాలయాలు కొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటివరకూ కొన్ని డీఎస్పీ, సీఐడీ తదితర కార్యాలయాలు అద్దె భవనాలలో నిర్వహిస్తున్నారు. ఒకేచోటు అన్ని కార్యాలయాలు ఉండడం వల్ల ప్రజలకు సౌలభ్యంతో పాటు, ప్రభుత్వానికీ అద్దెల భారం తగ్గుతుంది. డీఎఆర్ కార్యాలయం, ఆయుధగారాలు నూతన భవనాలు శిథిలావస్థకు చేరాయి. రూ.14 కోట్లతో ఎస్పీ కార్యాలయం, ఆయుధగారం, డీఏఆర్ కార్యాలయాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ కార్యాలయాలను సీఎం చంద్రబాబుతో ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : డిస్ట్రిక్ పోలీస్ ఎస్పీ కార్యాలయాన్ని పూర్తి హంగులతో 27 వేల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించారు. భవనం ముందు భాగంగా గార్డెనింగ్ ఏర్పాటు చేశారు. ఎస్పీ, ముగ్గురు అడిషినల్ ఎస్పీలకు ప్రత్యేక చాంబర్లు, క్రైం, లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచి, ఇతర శాఖల డీఎస్పీలకు కూడా చాంబర్లు కేటాయించారు. ఈ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్, పరిపాలనకు సంబంధించిన ఏ,బీ,సీ,డీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. సీఐడీ కార్యాలయం... ప్రస్తుతం ఏవీ అప్పారావు రోడ్డులో అద్దె భవనంలో ఉన్న సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి ఈ ప్రాంగణంలో ఎకరం స్ధలం కేటాయించారు. దీనిలో 17 వేల చదరపు గజాల స్థలంలో జీ ప్లస్-1 తో రూ.3.40 కోట్లతో నిర్మించారు. ఈ కార్యాలయంలో సీఐడీ డీఎస్పీ కార్యాలయం, డీఎస్పీ గదులు, కాన్ఫరెన్స్ హాల్, మల్టీపర్పస్ రూమ్స్, సీఐలు, ఎస్సైలకు ప్రత్యేక గదులు, లాకప్ రూమ్, ఇంటరాగేషన్ రూమ్ నిర్మించారు. డీఏఆర్ కార్యాలయం ఆశోకా థియేటర్ వద్ద శిథిలావస్థలో ఉన్న పురాతన భవనంలో ప్రస్తుతం డిస్ట్రిక్ ఆర్మ్డ్ పోలీస్ కార్యాలయం ఉంది. పోలీస్ కార్యాలయ సముదాయంలో 22 వేల చదరపు గజాల స్థలంలో ఈ కార్యాలయానికి భవనం నిర్మించారు. ఈ భవనంలో డీఏఆర్ డీఎస్పీ, ఎంఆర్, ఆర్ఎస్సైలు, ఆర్ఐల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు పోలీస్ బ్యాండ్ కోసం ప్రత్యేక రూమ్, క్లాస్ రూమ్‌లు నిర్మించారు. వీటిని మహిళా, పురుష పోలీసులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఆయుధగారం... ప్రస్తుతం ఆశోకా థియేటర్ వద్ద పురాతన భవనంలో ఉన్న ఆయుధగారాన్ని నూతన భవనంలోకి మార్చనున్నారు. 8 వేల చదరపు గజాల స్థలంలో నిర్మించిన ఈ భవనానికి సంఘ వ్యతిరేక శక్తులు దాడిని తట్టుకునేలా ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్ ఉంటుంది. భవనం కింద భాగంలో ఆయుధాలు ఉంచేందుకు స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది. నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేశారు. భవనం పరిసరాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పేరేడ్ గ్రౌండ్, షెడ్లు, ఈ ప్రాంగణంలో ఉన్నాయి. సోలార్ సిస్టమ్... ఈ కార్యాలయాలకు మొత్తం సోలార్ సిస్టం ద్వారా విద్యుత్‌ను అందించనున్నారు. భవనంపైనే సోలార్ పలకలను ఏర్పాటు చేశారు. రూ.65 లక్షలతో 100 కేవీ సోలార్ సిస్టం ఏర్పాటు చేశారు. దీని ద్వారా అన్ని కార్యాలయాలకు విద్యుత్ సరఫరా చేస్తారు. -
హైదరాబాద్‌లో భారీ ఆఫీస్ ప్రాజెక్టు
హైదరాబాద్: నగరంలో భారీ కమర్షియల్ ఆఫీస్ ప్రాజెక్టు నిర్మాణం కోసం మై హోమ్ గ్రూప్ తాజాగా రియల్ ఎస్టేట్ డెవలపింగ్ సంస్థ ఆర్ఎంజెడ్ కార్ప్‌తో చేతులు కలిపింది. ఈ ప్రాజెక్టుపై బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడి పెట్టనున్నారు. సుమారు 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండబోయే ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణ, నిర్వహణ కార్యకలాపాలు మై హోమ్ గ్రూప్, ఆర్ఎంజెడ్ గ్రూప్ సంయుక్తంగా చేపడతాయి. హైటెక్ సిటీకి దగ్గర్లో 3.5 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో తొలి దశ ’స్కైవ్యూ’ సముదాయం 2018 డిసెంబర్ ఆఖరు నాటికి అందు బాటులోకి రానుంది. దేశీయంగా నివసించేందుకు ఉత్తమ నగరంగా పేరొందిన హైదరాబాద్‌లో ఆఫీస్ ప్రాజెక్టుల అభివృద్ధికి భారీ అవకాశాలున్నాయని మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు తెలిపారు. దేశ, విదేశ కంపెనీలు హైదరాబాద్ మార్కెట్ వైపు దృష్టి సారించే విధంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నట్లు ఆర్ఎంజెడ్ కార్ప్ కార్పొరేట్ చైర్మన్ మనోజ్ మెండా పేర్కొన్నారు. -
పేరుకే డివిజన్
నెల రోజులైనా ఏర్పాటుకాని కార్యాలయాలు ఇన్ చార్జి ఆర్డీఓ, ఇన్ చార్జి డీఎస్పీతో పాలన మిగతా శాఖల అధికారుల నియామకంపై ఊసెత్తని ప్రభుత్వం మండలాల్లో కాని పనుల కోసం జిల్లా కేంద్రానికి వెళుతున్న ప్రజలు తొర్రూరు : పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజనలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆర్డీఓ, డీఎస్పీ, రిజిషే్టష్రన్, ఎస్టీఓ, ఫైర్‌స్టేçÙన్, పోస్టుమార్టం ఆస్పత్రి, 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, చిన్నతరహా, భారీ నీటి పారుదల, విద్యా, వైద్య, వ్యవసాయ, విద్యుత్, హర్టీకల్చర్, ఐసీడీఎస్, ఐకేపీ, డీఆర్డీఏ, లేబర్, డీఎల్పీఓ, ఆర్టీఏ, మత్య్క పారిశ్రామిక, ఎక్సైజ్, సివిల్ సప్లై, విజిలెన్స్, పశు వైద్య వంటి అన్నిశాఖల డివిజన్ స్థాయి కార్యాలయాలు ఏర్పాటవుతాయని, తద్వారా అన్నిశాఖల సేవలు అందుబాటులోకి వస్తాయని ఎంతో ఆశతో ప్రజలు ఎదురు చూశారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో అన్నివర్గాల ప్రజలు సంబురాలు జరుపుకున్నారు. అయితే డివిజన్ ఏర్పాటై నెల రోజులు గడుస్తున్నా కేవలం ఆర్డీఓ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయాల ప్రారంభం తప్ప, ఇప్పటికి సుమారు ముప్పై శాఖల్లో ఏ ఒక్కశాఖ కార్యాలయాన్ని కుడా ప్రారంభించిన దాఖాలాలు లేవు. ప్రారంభించిన కార్యాలయాల్లో పరిపాలన శూన్యం .. తొర్రూరులో ఏర్పాటు చేసిన ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించి, ఇన్ చార్జ్ ఆర్డీఓను నియమించినప్పటికి ఆయా మండలాలకు చెందిన సంబంధిత ఫైల్స్ ఇంకా రాకపోవడంతో ఆర్డీఓ సేవలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. అంతేకాకుండా డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించి, ఇన్ చార్జ్ డీఎస్పీని నియమించినప్పటికి ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు కూడా సంబంధత డీఎస్పీ కార్యాలయాన్ని తెరిచిన దాఖలాలు లేవు. నూతనంగా ఏర్పడిన జిల్లాలో నెలరోజులు గడుస్తున్నా పరిపాలన సాగకపోవడంతో అసలు కొత్త కార్యాలయాల పాలన ఉంటుందో, ఉండదోనని ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెవెన్యూ డివిజన్ లో ఉండే ప్రతి కార్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. -
రియల్ ఎస్టేట్ ఆఫీసులుగా CRDA
-
కార్యాలయాల ప్రారంభ ఏర్పాట్లు పూర్తి చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ న్యూశాయంపేట : జిల్లాల కార్యాలయాల ప్రారంభ ఏర్పాట్లు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల విభజన, నూతన జిల్లాల ఏర్పాటు, జిల్లాల ప్రారంభోత్సవాల గురించి శనివారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈనెల 11న ఉదయం 10.30గంటలకు నూతన జిల్లాల కార్యాలయాల ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయ గీతాలాపనతో కేటాయించిన మంత్రులతో జిల్లా ప్రారంభోత్సవం చేసిన తర్వాత భవన సముదాయ ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. నూతన జిల్లాల ప్రారంభోత్సవాలు ఘనంగా నిర్వహించి, జిల్లా కలెక్టర్లు నూతన ఫైళ్లను కూడా పరిశీలించి ఆమోదించే ఏర్పాట్లు చేయాలన్నారు. సాయంత్రం నూతన జిల్లా కేంద్రాల్లో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. 10న ఆయా జిల్లా కేంద్రాల్లో పనిచేసే అధికారులకు సిబ్బంది ఆర్డర్ టూ సర్వ్ ఉత్తర్వులు జారీ ఉంటుందని, వెంటనే విధులకు హాజరై కార్యాలయ బాధ్యతలు స్వీకరించి అదేరోజు పనులు చేపట్టాలన్నారు. కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ ప్రతిపాదిత మూడు జిల్లాలతోపాటు జనగామ జిల్లాలోని కార్యాలయాల్లో అవసరమైన భవనాలను సిద్ధం చేసి ఫర్నిచర్, ఇతర సామగ్రి ఏర్పాటు చేసినట్లు వివరించారు. నూతనంగా ప్రకటించిన జనగామ జిల్లాకు నిధులు విడుదల చేయాలని కోరారు. జేసీ ప్రశాంత్‌జీవన్ పాటిల్, డీఆర్ఓ కె.శోభ, జిల్లా పరిషత్ సీఈఓ విజయగోపాల్, సీపీఓ రామచంద్రరావు పాల్గొన్నారు. -
ముమ్మరంగా జిల్లా కార్యాలయాల పనులు
ఆర్డీఓ క్వార్టర్లే.. కలెక్టర్ క్వార్టర్లు కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులకు మరమ్మతులు డీఈఓ కార్యాలయానికి రంగులు మహబూబాబాద్ : మానుకోట జిల్లా కార్యాలయాల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పట్టణ శివారు ఇందిరానగర్‌కాలనీ సమీపంలోని వైటీసీ భవనాన్ని కలెక్టరేట్‌గా కేటాయించగా కార్యాలయానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం, ఇతర పనులు కొనసాగుతున్నాయి. బీఎస్ఎన్ఎల్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు పనులు చేస్తున్నారు. కలెక్టర్ క్వార్టర్స్‌గా ఆర్డీఓ క్వార్టర్స్‌నే కేటాయించగా మరమ్మతులు సాగుతున్నాయి. ఇక ఆర్డీఓ నివాసానికి అద్దెకు పట్టణంలోని పలు ఇళ్లను చూస్తున్నారు. కాగా ప్రస్తుత జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ మానుకోటకు కలెక్టర్‌గా వస్తున్నారనే ప్రచారం సాగుతోంది. వైటీసీ భవనంలోని కలెక్టర్ చాంబర్, గదుల మధ్య గోడల నిర్మాణ పనులను ఇటీవల జేసీ పరిశీలించారు. ఈ ప్రాంతంపై జేసీ పూర్తి అవగాహన ఉండటం వల్ల ఆయనే వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పట్టణ శివారులోని ఐటీఐ భవనాన్ని ఎస్పీ కార్యాలయానికి కేటాయించారు. దీంతో ఈ భవనం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ.15లక్షలు, రోడ్డు నిర్మాణానికి రూ.25లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఇటీవల ప్రకటించారు. ఈ భవనం ఆవరణలో బోర్లు వేయించడం, మరుగుదొడ్లు, ఇతర పనులు వేగంగా సాగుతున్నాయి. వెంకటేశ్వర్లబజార్‌లోని ఓ ఇంటిని ఎస్పీ క్యాంపు కార్యాలయంగా అధికారులు పరిశీలించారు. కానీ ఆ భవనానికి అద్దె భారీగా ఉండటంతో మరోచోట చూడాలని అధికారులు యోచిస్తున్నారు. డీఎస్పీ కార్యాలయాన్నే ఎస్పీ క్యాంప్ ఆఫీస్‌గా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. తొర్రూరు రోడ్‌లోని ఎస్పీ కార్యాలయం సమీపంలోని బీసీకాలనీ వద్ద ఉన్న ఒక ఇంటిని కూడా పోలీసులు చూసినట్లు సమాచారం. ఆ ఇంటిని డీఎస్పీ కార్యాలయంగా ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఎస్పీ క్యాంపు కార్యాలయం ఏర్పాటుపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. పట్టణంలోని ఎంఈఓ కార్యాలయాన్నే డీఈఓ కార్యాలయంగా కేటాయించగా, రంగులు వేస్తున్నారు. శనివారం నుంచి ఆ భవనానికి రంగులు వేస్తున్నారు. ఏదేమైనా మానుకోటలో జిల్లా ఏర్పాటు వాతావరణం నెలకొంది. -
జయశంకర్ జిల్లా కార్యాలయాలకు హంగులు
గోడలకు రంగులు.. గదుల్లో ఏసీల ఏర్పాటు తాత్కాలిక భవనాలకు కొనసాగుతున్న మరమ్మతులు మరో నాలుగు రోజుల్లో పనులు పూర్తి భూపాలపల్లి : కొత్తగా ఏర్పాటవుతున్న ఆచార్య జయశంక ర్ జిల్లా తాత్కాలిక కార్యాలయాల్లో మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. అక్టోబర్ 1లోపు జిల్లా కార్యాలయాలను అన్ని విధాలుగా సిద్ధం చేసి 11 నుంచి పాలన కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు స్థానిక రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారులు పనులను ముమ్మరం చేశారు. మరో నాలుగు రోజుల్లో పనులు పూర్తవుతాయని స్థానిక రెవెన్యూ అధికారులు తెలుపుతున్నారు. కలెక్టరేట్లో చురుగ్గా పనులు.. భూపాలపల్లి పట్టణంలోని మంజూర్‌నగర్‌లో ఉన్న ఇందూ అతిథిగృహంలో కింది అంతస్తు మొత్తాన్ని కలెక్టరేట్‌కు కేటాయించారు. ఇందులో కలెక్టర్, జేసీ, డీఆర్ఓ, ఏఓ, కలెక్టర్ కార్యాలయ సెక్షన్లు, వీడియో, సమావేశపు గదులకు కేటాయించారు. అలాగే పై అంతస్తులో డీఎం సీఎస్, డీఎస్ఓ, డీపీఓ, ఎ¯ŒSఐసీ వీసీ, రికార్డ్సŠ, ఐఅండ్‌పీఆర్, డీఆర్డీఏ, సీపీ ఓ శాఖలకు కేటాయించారు. ఆయా శాఖలకు కేటాయిం చిన గదుల్లో పనులు త్వరితగతిన సాగుతున్నాయి. ఇందూ అతిథిగృహంలోని 32 గదులకు నంబర్లు రాయించారు. అలాగే భవనం చుట్టూ పూల మొక్కలను నాటేందుకు ప్రస్తుతం ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. కలెక్టర్, జేసీకి కేటాయించిన గదుల్లో ఏసీలను ఏర్పాటు చేశారు. భవనం కొత్తదే అయినప్పటికీ ఇప్పటివరకు వినియోగంలో లేదు. దీంతో మరో మారు గదుల్లో పెయింటింగ్ చేస్తున్నారు. అలాగే ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయ నున్న తహసీల్దార్ కార్యాలయం వెనక భాగంలోని దేవాదుల డేటాబేస్ సెంటర్ భవనంలో పనులు కొనసాగుతున్నాయి. ఈ భవనంలో గోడలకు పగుళ్లు రావడంతో రెండు రోజులుగా మరమ్మతు పనులు చేపడుతున్నారు. కార్యాలయం చుట్టూ మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్డీఓ గదిలో ఏసీని ఏర్పాటు చేశారు. ఇందులో మరో మారు రంగులు వేయిస్తున్నారు. సిద్ధంగా ఐటీఐ భవనం.. భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ భవనంలో టూరిజం, జీఎం ఇండసీ్ట్రస్, ట్రెజరీ, వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆర్అండ్బీ, వ్యవసాయశాఖ, మార్కెటింగ్, మైనింగ్, కోఆపరేటివ్ కార్యాలయాలకు కేటాయించారు. అయితే ఈ భవనంలో నిర్మాణ, మరమ్మతు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో అధికారులు భవనానికి తాళం వేసి ఉం చారు. ఇదిలా ఉండగా, ఎస్పీ కార్యాలయానికి కేటాయించిన సింగరేణి మైనింగ్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో ఇంకా పనులు ప్రారంభం కాలేదు. పోలీసు ఉన్నతాధికారులు రెండు రోజుల్లో భవనాన్ని పరిశీలించి పనులు చేయించనున్నట్లు తెలిసింది. కొత్త భవనాలతో తప్పిన తంటా.. నూతనంగా ఏర్పాటవుతున్న ఆచార్య జయశంకర్ జిల్లా తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటుకు కొత్త భవనాలు రెడీగా ఉండడంతో అధికారులకు తిప్పలు తప్పాయి. సింగరేణి ఇందూ అతిథి గృహం, ప్రభుత్వ ఐటీఐ, దేవాదుల డాటా బేస్ సెంటర్ భవనాలు నిర్మించి ఉన్నప్పటికీ ఇప్పటివరకు వినియోగంలో లేవు. ఇంతకాలం అవి ఖాళీగానే ఉన్నాయి. దీంతో అధికారులు ఆయా భవనాల్లో మరమ్మతు పనులు పెద్ద మొత్తంలో చేపట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. -
త్వరలో నూతన సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు
చింతపల్లి దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో నూతనంగా చింతపల్లి, కొండమల్లేపల్లి, డిండి మండల కేంద్రాల్లో నూతన సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్ వెల్లడించారు. మంగళవారం చింతపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లి సర్కిల్ ఆఫీస్ పరిధిలో నాంపల్లి, మర్రిగూడ, చింతపల్లి పీఎస్‌లు, కొండమల్లేపల్లి సర్కిల్ ఆఫీస్ పరిధిలో గుడిపల్లి, గుర్రంపోడు, కొండమల్లేపల్లి పీఎస్‌లు, డిండి సర్కిల్ ఆఫీస్ పరిధిలో నేరడుగొమ్ము, చందంపేట, డిండి పీఎస్‌లతో త్వరలో సర్కిల్ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో గ్రామాల్లో పోలీస్ పల్లెనిద్ర తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22న పీపుల్స్ వారోత్సవాల సందర్భంగా దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని కృష్ణపట్టె, రాచకొండ ఏరియాలలో ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా మావోయిస్టుల కదలికలు లేవని పేర్కొన్నారు. రాష్ట్ర రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.అనంతరం పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులను సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డి, ఎస్ఐ నాగభూషణ్రావుతో పాటు సిబ్బంది ఉన్నారు. -
ఇంటర్ విద్య ఆర్ఐఓ, డీవీఈఓ పోస్టుల విలీనం
ప్రతీ జిల్లాకు ఇంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈఓ) ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డీఐఈఓ కార్యాలయాలు విద్యారణ్యపురి : జిల్లాలోని ఇంటర్ విద్య, జిల్లా వృత్తి విద్యాధికారి పోస్టులను విలీనం చేయబోతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పునర్విభజనతో వరంగల్, హన్మకొండ (వరంగల్ రూరల్), భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు ఏర్పాటుకు ముసాయిదా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఇంటర్ విద్య ఆర్ఐవో, జిల్లా వృత్తివిద్యాధికారి (డీవీఈఓ) కార్యాలయాలు ఉన్నాయి. ఇంటర్ విద్య ఆర్ఐవో ప్రైవేట్ జూనియర్ కళాశాలల పర్యవేక్షణతోపాటు పరీక్షలను నిర్వహించే బాధ్యత చూస్తున్నారు. డీవీఈవో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పర్యవేక్షిస్తున్నారు. వృత్తి విద్యాకోర్సులును కూడా నడిపిస్తున్నారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటు కానున్నందున ఇక ఆ రెండు కార్యాలయాలు వేర్వేరుగా కాకుండా ఒకే కార్యాలయంగా విలీనం కాబోతున్నాయి. ఇక నూతన జిల్లాలో ఆ రెండు పోస్టులు కలిపి జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డీఐఈఓ) వ్యహరిస్తారు. దీంతో జిల్లాకో డీఐఈఓ ఉంటారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఇంటర్ విద్య ఆర్ఐవో, డీవీఈవోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని సీనియర్ పిన్సిపాళ్లు ఇద్దరు బాధ్యతలను నిర్విర్తిస్తున్నారు. ఇందులో ఒకరిని ఒక జిల్లాకు మరొకరిని మరో జిల్లాకు డీఐఈవోలుగా బాధ్యతలు అప్పగిస్తే మిగతా రెండు జిల్లాలకు డీఐఈవోలుగా ఎవరిని నియమిస్తారనేది చర్చనీయాంశంగా ఉంది. ఒకవేళ నియమిస్తే మరో ఇద్దరి సీనియర్ ప్రిన్సిపాళ్లను డీఐఈవోలుగా నియమించాల్సి ఉంటుంది. లేదా ప్రస్తుతం ఉన్న ఇంటర్ విద్య ఆర్ఐఓ, డీవీఈఓలకే అప్పగిస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ విద్య ఆర్ఐఓ, డీవీఈఓలు పోస్టులు కలిపి 17 మంది పనిచేస్తున్నారు. ఇక 27 జిల్లాలు కానున్న నేపథ్యంలో వారిని సర్దుబాటు చేసినా అన్ని జిల్లాలకు సరిపోరు. ప్రస్తుతం ఉన్నవారినే సర్దుబాటు చేస్తారా లేదా వేరే సీనియర్ ప్రిన్సిపాల్స్క అవకాశం కల్పిస్తారానేది వేచి చూడాల్సిందే. జిల్లా కేంద్రంలోని ఇంటర్ విద్య ఆర్ఐవో కార్యాలయంలో సీనియర్ ప్రిన్సిపాల్ ఆర్‌ఐవోగా విధులు నిర్వర్తిస్తుండగా అందులో ఒక సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు. దినసరి వేతన ఉద్యోగులుగా ఇద్దరు, మరో ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్ అటెండర్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇక హన్మకొండలోని జిల్లా వృత్తివిద్యా కార్యాలయంలో డీవీఈవో సీనియర్ ప్రిన్సిపాల్ బాధ్యతలను నిర్వర్తిస్తుండగా ఒకరు çఅడ్మినిసే్ట్రటివ్ ఆఫీసర్ సూపరింటెండెంట్, ఒకరు సీనియర్ అసిస్టెంట్, మరొకరు జూనియర్ అసిస్టెంట్, అటెండర్ తదితరులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండు ఆర్ఐవో, డీవీఈఓ కార్యాలయాల ఉద్యోగులను కలిపి కొత్తగా ఏర్పాటు చేయబోయే నాలుగు జిల్లాలకు సర్దుబాటు చేసి ప్రతిపాదించారు. అయినప్పటికీ కొత్తగా ఏర్పాటు చేయనున్న డీఐఈవో కార్యాలయంలో ఉద్యోగుల కొరత ఉంటుంది. నాలుగు జిల్లాల ఏర్పాటు చేయబోతున్నందున వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న ప్రభు్వత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కళాలలకు సంబం«ధించిన వివరాలను సైతం ఆయా జిల్లాల పరిధిలోకి వెళ్లేలా ఫైళ్ల విభజన కూడా చేస్తున్నారు. ఇక వరంగల్ జిల్లా ఇంటర్ విద్య ఆర్ఐవో కార్యాలయం హన్మకొండలోని సుబేదారిలోని అద్దెభవనంలో కొనసాగుతుండగా హన్మకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీవీఈవో కార్యాలయం ఉంది. ఇక రెండు పోస్టులు విలీనంతో ఇక వరంగల్ జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈవో) కార్యాలయం అద్దెభవనంలో ఉండబోతుండగా, హన్మకొండకు పాత ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలో ఏర్పాటు చేయనున్నారు. మిగతా జయశంకర్ (భూపాలపల్లి) జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఓ హాల్లో ఇంటర్ విద్య ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయం ఉండేలా ఇప్పటికే సంబంధిత ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇక ఇంటర్ విద్య ఎడ్యుకేషన్ఆఫీసర్ జిల్లాకు ఒకరు ఉండి ప్రభుత్వ, ఎయిడెడ్ప్రైవేట్ జూనియర్ కళాశాలలను కూడా పర్యవేక్షిస్తారు. జిల్లాలో 44 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా అందులో వరంగల్ జిల్లాకు 14, హన్మకొండ జిల్లాలో 9, భూపాలపల్లి జిల్లాకు 8, మహబూబాబాద్ జిల్లాకు 8, యాదాద్రి జిల్లాకు 6, సిద్దిపేటకు 2 ప్రభుత్వ కళాశాలలు ఉండబోతున్నాయి. ఈమేరకు ప్రతిపాదించారు. ఇక ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో మహబూబాబాద్ జిల్లాకు ఒకటి, వరంగల్ జిల్లాలో ఆరు ఉండబోతున్నాయి. ఇక ప్రస్తుతం వరంగల్ జిల్లాలో 241 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉండగా అందులో కొత్తగా ఏర్పాటు కాబోతున్న వరంగల్ జిల్లాకు 67, హన్మకొండకు 88, భూపాలపల్లి జిల్లాకు 17, మహబూబాబాద్ జిల్లాకు 41 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉండబోతున్నాయి. -
ఎస్సీ, బీసీ కార్యాలయాల పరిశీలన
కొత్తగూడెం రూరల్: కొత్తగూడెం మండలం విద్యానగర్ కాలనీలోని ఎఎస్డబ్ల్యూఓ కార్యాలయంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. బీసీ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు శనివారం ఇక్కడకు వచ్చి భవన సముదాయాలను పరిశీలించి వెళ్లారు. ఎస్సీ, బీసీ రుణాల మంజూరు తదితర కార్యక్రమాలకు ఈ కార్యాలయాలనే వినియోగించనున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరం కొత్త రుణాలు ఈ జిల్లా నుంచే వెలవడనున్నాయి. -
కొత్త జిల్లాల్లో కార్యాలయాలు సిద్ధం
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం భవనాలు, వాహనాలు, కంప్యూటర్లు, నెట్ సిద్ధం పక్షం రోజుల్లో పాలనా పరంగా అందుబాటులోకి డివిజన్, మండలాల్లోనూ అన్ని ఏర్పాట్లు కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మరో 11 కొత్త మండలాలకు ప్రతిపాదనలు ఖేడ్ సంగారెడ్డి జిల్లాలోనే నారాయణఖేడ్: నూతన సిద్దిపేట, మెదక్ జిల్లాల ఏర్పాటులో బాగంగా ప్రభుత్వ కార్యాలయాలు సిద్దంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ రోనాల్డ్రోస్త తెలిపారు. గురువారం నారాయణఖేడ్ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్, ఇతర విభాగాల కార్యాలన్నింటినీ సిద్దం చేశామని తెలిపారు. దీంతోపాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాల్లో అక్కడి అధికారుల కార్యాయాలను సైతం సిద్దం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్న తరహాలో కొత్త జిల్లాల్లోనూ కార్యాలయాలు, ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, వాహనాలు తదితరాలన్నింటినీ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకోసం భవనాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మరో 11మండలాల కోసం ప్రతిపాదనలు జిల్లాలో ఇదివరకు ప్రభుత్వం ముసాయిలో కొత్త మండలాలు ప్రకటించగా ప్రజా అవసరాలు, విజ్ఞప్తుల మేరకు మరో 11కొత్త మండలాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ రోనాల్‌రోస్ తెలిపారు. మనూరు మండలంలోని నాగల్గిద్దతోపాటు వివిధ ప్రాంతాల్లోని ప్రతిపాదిత మండలాలు ఉన్నాయని అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లాలోనే ఉంటుందన్నారు. జిల్లాలో మంచి వర్షం జిల్లా వ్యాప్తంగా మూడు నాలుగు రోజులుగా మంచి వర్షం కురిసిందని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ తెలిపారు. జిల్లాలో ఈనెలలో మైనస్ 28 శాతం వర్షపాతం ఉండగా ప్రస్తుతం మైనస్ 5 శాతానికి వచ్చిందన్నారు. దీంతో వర్షపాతం నార్మల్ స్థాయికి చేరిందన్నారు. ఇంకా సింగూరు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో ప్రారంభం కాలేదని, మరో రెండు రోజుల్లో కొద్దిగా నీరు చేరే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం 5.9టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఈ నీటివల్ల రెండేళ్ల వరకు తాగునీటి ఇబ్బందులు తీరుతాయన్నారు. ఘన్‌పూర్‌కు కేవలం 0.25 టీఎంసీల నీటిని వదిలామని, ఇంతమేర నీరు వదలడంతో తాగునీటికి వచ్చే ఇబ్బందులు లేవన్నారు. చెరువులు, కుంటల్లోకి కొద్దిగా నీరు వచ్చి చేరిందని, మరికొన్ని నిండిపోయాయన్నారు. పంట, ఆస్తి నష్టాల వివరాలు సేకరించేందుకు ప్రతి మండలంలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరూ మరుగుదొడ్లు నిర్మించుకోండి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని సంపూర్ణ పారిశుద్ధ్యానికి పాటుపడాలని కలెక్టర్ రోనాల్డ్ రోస్ కోరారు. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలు సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించాయని అన్నారు. మెదక్ నియోజకవర్గం కూడా త్వరలో పూర్తవుతుందన్నారు. ఒక్క నారాయణఖేడ్ నియోజకవర్గం మాత్రమే వెనుకబడి ఉందని చెప్పారు. డిసెంబర్ నాటికి వందశాతం లక్ష్యానికి చేరుకోనున్నట్లు తెలిపారు. ఇక నుంచి మరుగుదొడ్ల బిల్లులు వ్యక్తికి నేరుగా కాకుండా సర్పంచ్ ఖాతాల్లో జమచేస్తామని, ఇలా గ్రూపులుగా డబ్బులు వస్తాయని కలెక్టర్ అన్నారు. -
25 నాటికి కొత్త కార్యాలయాల బోర్డులు
జిల్లా పునర్విభజన సమీక్ష సమావేశంలో కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: కొత్తగూడెం జిల్లాలోని నూతన కార్యాలయాల ఫోటోలను కంప్యూటర్లో అప్లోడ్ చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ఆదేశించారు. కార్యాలయాల బోర్డులను కూడా ఈ నెల 25వ తేదీ సిద్ధం చేసుకోవాలన్నారు.జిల్లా పునర్విభజనపై ఆయన బుధవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన కార్యాలయాల ఏర్పాటు, వాటి వైశాల్యం, సిబ్బంది వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలన్నారు. ఏవేని మరమ్మతులు అవసరమనుకుంటే సంబంధిత శాఖ ప్రధాన కార్యాలయానికి నివేదిక పంపాలన్నారు. ఏదైనా శాఖకు కార్యాలయ భవనం కేటాయించనట్టయితే ఆ ప్రక్రియను సంబంధిత అధికారులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. కార్యాలయాల్లోని ప్రభుత్వ వాహనాలను మాత్రమే అప్లోడ్ చేయాలన్నారు. ఇప్పటికే ప్రైవేట్ వాహనాల వివరాలను నివేదికల్లో పేర్కొన్నట్టయితే వెంటనే తొలగించాలన్నారు. కొత్త మండలాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకటించినందున సంబంధిత మండలాలకు సిబ్బందిని సర్దుబాటు చేయాల్సుంటుందన్నారు. ఆవివరాలను అప్లోడ్ చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లా ప్రధానాధికారి కార్యాలయంలోగల ఫర్నిచర్‌ను, ఫైళ్ళను కూడా విభజించాల్సుందని అన్నారు. కంప్యూటర్లో అప్లోడ్ విధానంపై వివిధ శాఖల అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. జిల్లా పునర్విభజన నివేదికల ప్రక్రియను ఈ నెల15వ తేదీలోగా పూర్తిచేయాలని చెప్పారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్, జిల్లాపరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్, వివిధ శాఖల జిల్లా అధికారులు -
25 నాటికి కొత్త కార్యాలయాల బోర్డులు
జిల్లా పునర్విభజన సమీక్ష సమావేశంలో కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: కొత్తగూడెం జిల్లాలోని నూతన కార్యాలయాల ఫోటోలను కంప్యూటర్లో అప్లోడ్ చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ఆదేశించారు. కార్యాలయాల బోర్డులను కూడా ఈ నెల 25వ తేదీ సిద్ధం చేసుకోవాలన్నారు.జిల్లా పునర్విభజనపై ఆయన బుధవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన కార్యాలయాల ఏర్పాటు, వాటి వైశాల్యం, సిబ్బంది వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలన్నారు. ఏవేని మరమ్మతులు అవసరమనుకుంటే సంబంధిత శాఖ ప్రధాన కార్యాలయానికి నివేదిక పంపాలన్నారు. ఏదైనా శాఖకు కార్యాలయ భవనం కేటాయించనట్టయితే ఆ ప్రక్రియను సంబంధిత అధికారులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. కార్యాలయాల్లోని ప్రభుత్వ వాహనాలను మాత్రమే అప్లోడ్ చేయాలన్నారు. ఇప్పటికే ప్రైవేట్ వాహనాల వివరాలను నివేదికల్లో పేర్కొన్నట్టయితే వెంటనే తొలగించాలన్నారు. కొత్త మండలాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకటించినందున సంబంధిత మండలాలకు సిబ్బందిని సర్దుబాటు చేయాల్సుంటుందన్నారు. ఆవివరాలను అప్లోడ్ చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లా ప్రధానాధికారి కార్యాలయంలోగల ఫర్నిచర్‌ను, ఫైళ్ళను కూడా విభజించాల్సుందని అన్నారు. కంప్యూటర్లో అప్లోడ్ విధానంపై వివిధ శాఖల అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. జిల్లా పునర్విభజన నివేదికల ప్రక్రియను ఈ నెల15వ తేదీలోగా పూర్తిచేయాలని చెప్పారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్, జిల్లాపరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్, వివిధ శాఖల జిల్లా అధికారులు -
కొత్త..కొత్తగా!
వనపర్తి టౌన్: కొత్త జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో జిల్లా కార్యాలయాలు, ఉన్నతాధికారుల నివాసగహాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లా పాలనాయంత్రాంగం కోసం కలెక్టర్, ఎస్పీల నివాసగహాల ఎంపిక ప్రక్రియ చకచకా సాగుతోంది. ఈ విషయమై పట్టణంలోని పలు కార్యాలయాలను పరిశీలించిన అధికారులు చివరకు కలెక్టర్ క్యాంపు కార్యాలయం కోసం పంచాయతీరాజ్ అతిథిగహాన్ని, ఎస్పీ క్యాంప్ కార్యాలయాన్ని ఇరిగేషన్ బోర్డు(ఐబీ) అతిథిగహాన్ని దాదాపుగా ఖరారుచేశారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు కూడా ధ్రువీకరిస్తున్నారు. దసరా నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్ ఇదివరకే పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయా శాఖల ముఖ్య అధికారుల నివాసగహాలు సిద్ధమవుతున్నాయి. కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదులు అందజేసేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో క్యాంపు కార్యాలయాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా ఈ రెండు భవనాలను ఎంపికచేసినట్లు తెలుస్తోంది. విజయదశమి నాటికీ కొత్త కలెక్టర్, ఎస్పీలు బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆ లోపు అన్ని ఏర్పాట్లను చక్కదిద్దుతున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం కోసం పంచాయతీరాజ్ అతిథిగహం రెండు అంతస్తుల్లో రూ.40లక్షలతో ఇటీవల నిర్మాణం పూర్తిచేశారు. మిగిలిపోయిన కొద్దిపాటి పనులకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఈ రెండు భవనాలకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ సమకూర్చుతోంది. కొత్త జిల్లాలకు ఏర్పాట్లు చకచకా సాగిపోతుండడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు. -
గిరిజన పాఠశాల భవనం పరిశీలన
మహబూబాబాద్ : జిల్లా ఏర్పాటు నేపథ్యంలో వ్యవసాయ శాఖ కార్యాలయాల నిమిత్తం జిల్లా కలెక్టర్ కరుణ ఆదేశాల మేరకు పట్టణ శివారులోని ఇందిరానగర్ కాలనీలోని ప్రభుత్వ బాలుర గిరిజన ఉన్నత పాఠశాల భవనాన్ని వ్యవసాయ శాఖ జేడీ ఉషా, హార్టికల్చర్ డీడీ పుట్ట సునిత పరిశీలించారు. భవనంలోని గదులను తహసీల్దార్ కె.విజయ్‌కుమార్, ఆర్ఐ జర్పుల సుధాకర్‌నాయక్ వారికి చూపించారు. ఈ భవనంలో 12 గదులు ఉండగా పైఅంతస్తులోని నాలుగు గదులను వ్యవసాయ శాఖకు కేటాయించామని, అందులో హార్టికల్చర్, సెరీకల్చర్, ఇతర అధికారుల కార్యాలయాలు ఏర్పా టు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ భవనంలోని కింది నాలుగు గదుల్లో డీటీఓ కార్యాలయానికి కేటాయించనున్నట్లు చెప్పారు. ఏఓ కె.రామారావు, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లా కార్యాలయాలు ఏర్పాటు
సబ్‌కలెక్టర్ శశాంక జగిత్యాల అర్బన్: జగిత్యాల జిల్లాకు సంబంధించిన కార్యాలయాల భవనాలను అన్నింటిని ఏర్పాటుచేసినట్లు సబ్‌కలెక్టర్ శశాంక తెలిపారు. సోమవారం సాయంత్రం విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం పంచాయతీరాజ్‌శాఖ భవనాన్ని కలెక్టరేట్ కోసం కేటాయించినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ గెస్ట్‌హౌస్‌ను జేసీకి కేటాయించినట్లు తెలిపారు. కలెక్టర్ గెస్ట్ హౌస్ మాత్రం ప్రస్తుతం సబ్కలెక్టర్కార్యాలయంలోఉన్న హౌస్‌ను, పోలీస్ డీపీవో భవనం ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లా ట్రెజరీ ల్యాండ్సర్వే కార్యాలయాలను ప్రస్తుతం ఉన్న ఐఅండ్‌క్యాడ్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మిగతా కార్యాలయాలన్నీ ఎస్సారెస్పీ క్వాటర్లలో కొనసాగుతున్న కార్యాలయాల్లోనే చేస్తున్నట్లు తెలిపారు. ఇతర శాఖలన్నింటిని అందులోనే ఏర్పాటు చేసి దసరా నుంచి జిల్లాపాలనకొనసాగుతుందని తెలిపారు. మెట్పల్లిలో డివిజన్ కేంద్రం ఏర్పాటవుతుందని, ప్రస్తుతం ఉన్న తహశీల్దార్ కార్యాలయన్నే ఆర్డీవో కార్యాలయంగా ప్రతిపాదించామని వివరించారు.జగిత్యాల రూరల్, బుగ్గారం, బీర్పూర్ మండలాలను కేటాయించాలని ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. కార్యాలయాలను మరమ్మతు పనుల కోసం పీఆరీ శాఖకు అప్పగించినట్లు పేర్కొన్నారు. వీరు మంగళవారం నుంచి పనులుసైతం ప్రారంభించనున్నట్లు తెలిపారు. -
జిల్లా కార్యాలయాలు కొలిక్కి
భవనాల అప్పగింతకు సింగరేణి సంస్థ అంగీకారం స్పీకర్ చొరవతో తొలగిన సమస్య భూపాలపల్లి : జయశంకర్ జిల్లా తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటుకు భవనాల సమస్య తొలగిపోయింది. జిల్లా కార్యాలయాలను సింగరేణి భవనాల్లో ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. కానీ సింగరేణి స్థానిక అధికారులు ఆయా భవనాలను ఇవ్వడం వీలు కాదంటూ ఇటీవల ప్రకటన విడుదల చేశారు. దీంతో భవనాల విషయమై అయోమయం నెలకొంది. చివరికి ఆయా భవనాలను అప్పగించేందుకు సింగరేణి సూత్రప్రాయంగా అంగీకరించింది. భూపాలపల్లి పట్టణం మంజూర్‌నగర్‌లోని సింగరేణి ఇందూ అతిథిగృహంలో కలెక్టరేట్‌తోపాటు మరో 10 శాఖల కార్యాలయాలు, మైనింగ్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్(ఎంవీటీసీ)లో ఎస్పీ కార్యాలయం, సీఈఆర్ క్లబ్లో ఎక్సైజ్, పీఆర్ ఇంజనీరింగ్, దేవాదు ల డేట్బేస్ సెంటర్లో ఆర్డీవో, ప్రభుత్వ ఐటీఐలో పలు శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. జాయింట్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, ములుగు ఆర్డీవో మహేం దర్జీ ఆయా భవనాలను పరిశీలించారు. ఏయే గదులను ఏశాఖకు కేటాయించాలో వారం రోజుల క్రితమే ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 6న సింగరేణి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. సింగరేణికి చెందిన ఇందూ అతిథిగృహం, ఎంవీటీసీ, సీఈఆర్ క్లబ్‌లు పరిపాలన, శాంతిభద్రతలు, చట్టపరంగా ఇవ్వడం వీలు కాదని అందులో పేర్కొంది. దీంతో సమస్య మళ్లీ మెుదటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి స్థానిక జీఎం పాలకుర్తి సత్తయ్య తో మాట్లాడారు. దీంతో ఆయా భవనాలను అప్పగించేందుకు జీఎం అంగీకరించారు. భూపాలపల్లిలో గనుల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తమ సంస్థకు ఇప్పటివరకు సుమారు 4 వేల ఎకరాలకు పైగా అప్పగించిందని, ప్రభుత్వానికి తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని పేర్కొన్నారు. ఈమేరకు శాసన సభాపతి, జాయింట్ కలెక్టర్, ములుగు ఆర్డీవో, వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ నెల 8న భూపాలపల్లికి వచ్చి సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎంతో కలిసి సంస్థ భవనాలను పరిశీలించారు. జిల్లా కార్యాలయాలకు సింగరేణి భవనాలు అనుకూలంగా ఉన్నాయని రెవె న్యూ అధికారులు వెల్లడించారు. జేసీ ఆయా భవనాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఏ భవనం ఏ శాఖకు కేటాయించాలో స్థానిక అధికారులకు సూచించారు. భవనాల్లో చేయాల్సిన తాత్కాలిక మరమ్మతులను వివరించారు. మొత్తానికి జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు తమవంతు సహకారం అందిస్తామని సింగరేణి సంస్థ తెలపడంతో కార్యాలయాలకు భవనాల సమస్య పరిష్కారమైంది. -
మూడు టౌన్ ప్లానింగ్ కార్యాలయాలు
భూపాలపల్లి, మానుకోట, హన్మకొండ జిల్లాల్లో ఏర్పాటు 12 జిల్లాలకు ఒక్కటే టీసీపీ ఆర్డీ ఆఫీస్! వరంగల్ అర్బన్ : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖలో విభజన కసరత్తు సాగుతోంది. వరంగల్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ నాలుగు జిల్లాలుగా విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదాను వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులు, అసిస్టెంట్ సిటీప్లానర్ అధికారులు, సర్వేయర్లు, కంప్యూటర్ ఔట్సోర్సింగ్ ఆపరేటర్ల నియామకాలపై రాష్ట్ర టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ ఆనంద్‌బాబు వివరాలను సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. గ్రామీణ ప్రాంతాల్లో జీప్లస్ 2 భవనాల వరకు ఆయా పంచాయతీల కార్యదర్శులు అనుమతులు మంజూరు చేస్తారు. జీ ప్లస్2 ఆపై అంతస్తులకు, పరిశ్రమలకు జిల్లా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి (డీటీసీపీఓ) నిర్మాణ అనుమతులు జారీ చేస్తారు. దీంతో డీటీసీపీవో పోస్టులు కీలకం కానున్నాయి. డీటీసీపీవోల విభజన ఇలా... ప్రభుత్వం నాలుగు జిల్లాలుగా విభజించేందుకు సన్నద్ధమైన నేపథ్యంలో వరంగల్ జిల్లాకు ప్రస్తుతం ఉన్న డీటీసీపీవో ఎ.కోదండరామిరెడ్డి కొనసాగనున్నట్లు సమాచారం. ఇక్కడ పనిచేస్తున్న అసిస్టెంట్ డీటీసీపీవోకు పదోన్నతి కల్పించి హన్మకొండ జిల్లా డీటీసీపీవోగా బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు తెలిసింది. ఇక మహబూబాబాద్, జయశంకర్(భూపాలపల్లి) జిల్లాలకు ఇద్దరు డీటీసీపీవోలు నియమించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న వీరిద్దరికే రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. వరంగల్ డీటీసీపీవో కార్యాలయంలో ఇద్దరు అసిస్టెంట్ డీటీసీపీవోలు కావాల్సి ఉంది. ఇద్దరు సర్వేయర్లు ఉండాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు ఇద్దరు ఏడీటీసీపీవోలతోపాటు మరో సర్వేయర్‌ను నియమించాల్సి ఉంది. ఆరుగురు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఆపరేటర్ల నియామకానికి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ జిల్లాలకు ఇద్దరి చొప్పన ఏడీటీసీపీవోలు, ఇద్దరు సర్వేయర్లను నియమించాల్సి ఉంది. అంతేకాకుండా ఔట్సోర్సింగ్ పద్ధతిలో జిల్లాకు ఆరుగురి చొప్పున విధుల్లోకి తీసుకోవాల్సి ఉందని ప్రతిపాదనల్లో పొందుపరిచారు. ఒకే టీసీపీ ఆర్డీ ఆఫీస్ వరంగల్ రీజినల్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రీజినల్ డైరెక్టర్(ఆర్డీ) పరిధిలో ప్రస్తుతం వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లోని మునిసిపాలిటీల్లో, నగర పంచాయతీల్లో టౌన్‌ప్లానింగ్ కార్యకలాపాలను ఆర్డీ పర్యవేక్షిస్తారు. తాజాగా జిల్లాల పునర్విభజనతో నాలుగు జిల్లాలు కాస్త 12కు చేరాయి. ఖమ్మం, కొత్తగూడెం, మానుకోట, జయశంకర్ (భూపలపల్లి), వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, కొమురంభీం జిల్లా, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలుగా విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాలకు ఒక ఆర్డీ కార్యాలయం ఏర్పాటు చేయాలనే భావనలో రాష్ట్ర టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం మరో ఆర్డీ కార్యాలయం ఏర్పాటుపై స్తబ్దత నెలకొన్నట్లు టౌన్ ప్లానింగ్‌లు అధికారులు చెబుతున్నారు. -
‘కొత్త’ కార్యాలయాల కోసం కసరత్తు
– సింగరేణి భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే జలగం – అధికారుల నివాసాలకు సింగరేణి క్వార్టర్లు కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా ఏర్పాటవుతున్న తరుణంలో జిల్లా కార్యాలయాల కోసం సింగరేణి భవనాలను స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆదివారం పరిశీలించారు. ఆర్డీఓ రవీంద్రనాథ్, డీఎస్పీ సురేందర్‌రావులతో కలిసి ఇప్పటికే రెవెన్యూ అధికారులు గుర్తించిన భవనాలను, కలెక్టరేట్ కోసం కేటాయించిన సింగరేణి పీఅండ్‌పీ బిల్డింగ్‌ను సందర్శించారు. త్రీ ఇంక్లైన్లో సింగరేణి అధికారుల క్వార్టర్లను పరిశీలించి..కలెక్టర్, ఎస్పీ, జేసీలకు కావాల్సిన నివాస భవనాలను కేటాయించేందుకు అనుకూలంగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పీఅండ్‌పీ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలం కలెక్టరేట్ విస్తరణ కోసం ఉపయోగపడుతుందని, మీటింగ్ హాల్‌కోసం మార్పులు చేయాలని, వాహనాల పార్కింగ్ కోసం పాత పీఅండ్‌పీ భవనం అనువుగా ఉంటుందని అధికారులకు సూచించారు. సీటీసీ భవనం వెనుక ఉన్న ఖాళీ స్థలం కార్యాలయాల ఏర్పాటు కోసం పనిచేస్తుందన్నారు. జిల్లా ఏర్పాటుకు సమయం ఆసన్నమైనందున రెవెన్యూ, పోలీస్ అధికారులు త్వరితగతిన ఏర్పాట్లను పూర్తి చేయాలని, ప్రజలకు చేరువలో పరిపాలనా యంత్రాంగం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధర్నాచౌక్‌కు అనువైన స్థలాన్ని సేకరించాలన్నారు. జిల్లా కార్యాలయాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉండేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్, సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కార్యాలయాల ముస్తాబు
మహబూబ్‌నగర్ క్రైం / మహబూబ్‌నగర్ న్యూటౌన్ : స్వాతంత్య్ర దినోత్సవానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ముస్తాబయ్యాయి. ఈ పాటికే కలెక్టరేట్, జెడ్పీ, ఎస్పీ కార్యాలయాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. శనివారం రాత్రి వాటిని విద్యుద్దీపాలతో చూడముచ్చటగా అలంకరించారు. సోమవారం జరిగే వేడుకలకు జిల్లా పరేడ్ మైదానాన్ని సిద్ధం చేశారు. ఇందులోభాగంగా జిల్లా పోలీస్ అధికారులు కవాతు సాధన చేశారు. ఇక్కడ జరిగే కార్యక్రమానికి జిల్లా మంత్రి జూపల్లి కష్ణారావు, కలెక్టర్ శ్రీదేవి, ఎస్పీ రెమా రాజేశ్వరి హాజరై జెండా ఆవిష్కరణ చేయనున్నారు. -
భయం.. భయం
ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ అందులోనే విధులు నిర్వహిస్తున్నారు. అసలే వర్షకాలం.. చిరుజల్లులకే పైకప్పుల నుంచి నీళ్లు కారుతున్నాయి.. పెచ్చులూడి పడుతున్నాయి. వరుస వర్షాలతో ఎప్పుడూ కూలుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గాంధారి మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయ భవనం ప్రమాదకరంగా మారింది. పైకప్పు పెచ్చులూడి వర్షం నీళ్లు కిందకు కారుతున్నాయి. పుస్తకాలను ఎలా భద్రపరచాలో అర్థం కాక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని పాత భవనం శిథిలమైంది. దీన్ని తొలగించడం లేదు. ఉత్తునూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎల్లారెడ్డి పట్టణంలోని ఎస్టీవో కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం కూలేందుకు సిద్ధంగా ఉంది. వరండాలో పైకప్పు నుంచి పూర్తిగా పెచ్చులూడిపోయాయి. సదాశివగనర్ మండల కేంద్రంలోని హైస్కూల్‌తో పాటు భూంపల్లి, అడ్లూర్ ఎల్లారెడ్డి హైస్కూళ్ల భవనాలు ప్రమాదకరంగా మారాయి. తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్, క్రిష్ణాజివాడి, నందివాడ తదితర పాఠశాలలకు చెందిన తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. 70 ఏళ్ల క్రితం కట్టిన భవనంలోనే ఎర్రపహాడ్ ప్రాథమిక పాఠశాల నిర్వహిస్తున్నారు. ఇది ఎప్పుడు కూలుతుందో తెలియక విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనతో గడుపుతున్నారు. బాల్కొండ మోర్తాడ్/కమ్మర్పల్లి/వేల్పూర్ : బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పాత భవనాలు కూలేందుకు సిద్ధమయ్యాయి. వీటిని తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం ప్రాథమికోన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుత వర్షాలతో అది మరింత ప్రమాదకరంగా మారింది. పశువైద్యశాల భవనం కూడా శిథిలావస్థకు చేరింది. కమ్మర్పల్లి మండలంలోని చౌట్పల్లి జెడ్పీ హైస్కూల్ భవనం ప్రమాదకరంగా మారింది. తరగతి గదుల్లో స్లాబు పెచ్చులూడి ఇనుప చువ్వలు తేలాయి. గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. భారీ వర్షాలకు కూలిపోయే ప్రమాదం ఉంది. వేల్పూర్ మండల కేంద్రంలో చాలా ఏళ్ల క్రితం నిర్మించిన పశు వైద్యశాల కూలేందుకు సిద్ధమైంది. ప్రమాదకరంగా మారిన ఈ భవనంలోనే ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ అర్బన్ : నగరంలో పురాతన భవనాలు ప్రమాదకరంగా మారాయి. ఏళ్ల కిందట నిర్మించిన నివాస గృహాలు శిథిలావస్థకు చేరాయి. కోటగల్లి, గాజులపేట, మార్వాడి గల్లీ, కసాబ్‌గల్లీ, అశోక్ వీధి, జెండా గల్లీ, మైసమ్మవీధి, పెద్దబజారు ప్రాంతాల్లో ఎక్కువగా పురాతన కట్టడాలు ఉన్నాయి. అప్పట్లో మట్టితో నిర్మించిన ఇళ్లు కాలం చెల్లాయి. ప్రస్తుత వర్షాలకు అవి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల ఆశోక్వీధిలో ఓ పురాతన భవనం కూలిపోయింది. ఇలాంటి ఇళ్లను ఇప్పటికే గుర్తించిన అధికారులు వాటిని ఖాళీ చేయించారు. అయితే, వాటిని తొలగించడంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. కలెక్టరేట్లోని పలు భవనాలు సహా నిజామాబాద్ తహసీల్దార్ కార్యాలయం ప్రమాదకరంగా మారింది. ఉద్యోగులు భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. పెద్దబజారులోని యూనాని ఆసుపత్రి పాత భవనంలోనే కొనసాగుతోంది. ఆర్మూర్.. ఆర్మూర్అర్బన్/మాక్లూర్/నందిపేట : నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ప్రమాకరంగా మారాయి. ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. 1968లో నిర్మించిన ఈ భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. ఆర్మూర్‌లోని ఎన్ఆర్ఈజీఎస్, వీఆర్వో కార్యాలయాలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియక ఉద్యోగులు భయంభయంగా విధులు నిర్వహిస్తున్నారు. మాక్లూర్ మండల కేంద్రంలోని ట్రాన్స్‌కో కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీంతో అధికారులు ఆ కార్యాలయంలో పనులు చేయాలంటే జంకుతున్నారు. నందిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల భవనాలు ప్రమాదకరంగా మారాయి. మండలంలోని వెల్మల్ గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం శిథిలావస్థకు చేరి ఏళ్లు గడుస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే శాపూర్‌లోని ప్రాథమిక పాఠశాల, నందిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల తరగతి గదులు కూలేందుకు సిద్ధమయ్యాయి. కామారెడ్డి.. కామారెడ్డి : నియోజకవర్గంలో చాలా భవనాలు కూలే దశకు చేరాయి. నిజాం కాలంలో నిర్మించిన కట్టడాల్లో ఇంకా కార్యాలయాలు కొనసాగిస్తున్నారు. ఆ భవనానికి కాలం చెల్లిందని ఎప్పుడో నిర్ధారించారు. అందులో ఉన్న తహసీల్ కార్యాలయాన్ని మార్చారు కూడా. కానీ అదే భవనంలో ఓ మూలన ఉప కోశాధికారి (సబ్ ట్రెజరీ) కార్యాలయం మాత్రం కొనసాగుతోంది. నిజాం కాలంలో నిర్మితమైన ఈ భవనాన్ని కాలం చెల్లిన భవనాల జాబితాలో చేర్చారు. అందుకే తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని క్లబ్ భవనంలోకి మార్చారు. అయితే సబ్ ట్రెజరీ కార్యాలయం విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షం కురిసినప్పుడు కార్యాలయంలోని గదుల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. కూలిపోతుందనే వాస్తవం తెలిసినప్పటికీ కార్యాలయాలను కొనసాగిస్తుండడం మనోళ్లకే చెల్లింది. పైగా, ప్రమాదకరంగా మారిన ఈ భవనంలోకే కొత్తగా ఎక్సైజ్ కార్యాలయాన్ని మార్చనున్నారని సమాచారం. బోధన్ : నియోజకవర్గంలో పలు కట్టడాలు అవసాన దశకు చేరాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని ఈ కట్టడాల్లోనే ఇంకా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బోధన్‌లోని శక్కర్‌నగర్ నిజాంషుగర్ ఫ్యాక్టరీ గేట్‌కు ఎదురుగా దశాబ్దాల క్రితం నిర్మించిన జనరల్ ఆస్పత్రి బహుళ అంతస్తుల భవనం కూలిపోయే దశలో ఉంది. ఈభవనంలోనే ప్రస్తుతం ఎన్ఎస్ఎఫ్ కోర్ కమిటీ కార్యాలయం కొనసాగుతోంది. శక్కర్‌నగర్‌లోని ఎంవీఐ కార్యాలయం భవనం రాకాసీపేట్ ప్రాంతంలో పశువైద్యశాల భవనం, పాత మున్సిపల్ ఆఫీసు భవనం, ఆర్‌డబ్ల్యూస్ డివిజన్ కార్యాలయంతో పాటు పలుచోట్ల ప్రభుత్వ పాఠశాలల భవనాలు, కళాశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఆర్టీసీ కొత్త బస్టాండ్‌లో నిజామాబాద్ వెళ్లే ప్లాట్ ఉన్న రేకుల షెడ్డు కూలిపోయే దశకు చేరింది. నియోజకవర్గంలో 82 గ్రామ పంచాయతీలుండగా, ఇందులో సగానికి పైగా పంచాయతీ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. నవీపేట మండల కేంద్రంలో పీహెచ్సీ భవనం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉంది. పలు గ్రామాల్లో పురాతన కాలంలో నిర్మించిన మట్టి బురుజులు ప్రమాదకరంగా మారాయి. 2014లో బోధన్ మండలంలోని హున్సాలో జనావాసాల మధ్య ఉన్న మట్టి బురుజు సగభాగం విరిగి పడింది. మట్టి బురుజులను తొలగిస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన అధికారులు ఇంతవరకు అమలు చేయలేదు. మరోవైపు, ప్రమాదకరంగా మారిన పాత భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలను సర్వే ద్వారా గుర్తించారు కానీ, ఇంతవరకు తొలగించే ప్రక్రియ చేపట్టలేదు. -
త్వరలో బ్యాంకుల్లా పోస్టాఫీసులు!
న్యూఢిల్లీః త్వరలో బ్యాంకింగ్ సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) పేరున దగ్గరలోని పోస్టాఫీసులే బ్యాంకులుగా పనిచేసే విధానాన్ని 2017 మార్చి నాటికి అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ ప్రతిపాదనను తెచ్చింది. దీంతో 2019 నాటికల్లా మొత్తం దేశంలోని 50 జిల్లా కేంద్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుం మారుమూల ప్రాంతాల్లో ఉన్న 139,000 పోస్టాఫీసులతో కలిపి భారతదేశంలో 154,000 పోస్టాఫీసులు ఉన్నాయి. వీటిలో ముందుగా జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఉండే సుమారు 650 కార్యాలయాల్లో పోస్టల్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చి, వాటిని మారుమూల ప్రాంతాలతో అనుసంధానం చేస్తారు. వచ్చే ఏడాది మార్చి నాటికల్లో పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పేమెంట్ బ్యాంకులను అందుబాటులోకి తెస్తామని, ప్రపంచంలోనే పోస్టల్ సేవలను అందించడంలో మన దేశం ఇంచుమించుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్నా అతి పెద్ద నెట్వర్క్ ను కలిగి ఉందని టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుత ప్రతిపాదనను అమల్లోకి తెచ్చేందుకు 400 కోట్ల రూపాయల ఈక్విటీలు, 400 కోట్ల రూపాయల గవర్నమెంట్ గ్రాంటులతో మొత్తం 800 కోట్ల రూపాయలను వినియోగించనున్నట్లు టెలికాం మంత్రి తెలిపారు. ఇందుకోసం మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సుమారు 1.7 లక్షల మంది పోస్ట్ మ్యాన్ లకు అవసరాన్ని బట్టి స్మార్ట్ ఫోన్లను, టాబ్లెట్ లను అందిస్తామని, దీంతో ప్రజలు తమ బ్యాంక్ అకౌంట్లను సులభంగా చేరుకోగల్గుతారన్నారు. అంతేకాక ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ కలిగిన 5000 ఏటీఎం లను కూడ దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు శాఖ యోచిస్తున్నట్లు తెలిపారు. -
అద్దెకు కార్యాలయాలు చూసుకోండి
► ఇప్పటికే రెండు జిల్లాల కలెక్టర్లు ప్రైవేట్ భవనాలను గుర్తించారు ► కలెక్టర్ల సహకారంతో అద్దె ఒప్పందాలు చేసుకోండి ► ఎంత అద్దె అయినా సర్కారు ఇస్తుంది ► 27న నూతన రాజధాని నుంచే పనిచేయాలి: సీఎస్ హైదరాబాద్: జూన్ 27వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నుంచే శాఖాధిపతుల కార్యాలయాలు పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ లోగా శాఖాధిపతుల కార్యాలయాలన్నీ హైదరాబాద్ నుంచి రాజధాని ప్రాంతం గుంటూరు, విజయవాడలకు తరలి వెళ్లాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ బుధవారం సర్క్యులర్ జారీచేశారు. తొలి ప్రాధాన్యతగా శాఖలకు చెందిన ప్రభుత్వ భవనాలు రాజధాని ప్రాంతంలో ఉంటే అక్కడికి తరలివెళ్లాలని పేర్కొన్నారు. లేదంటే గుంటూరు, విజయవాడల్లో ఆ జిల్లాల కలెక్టర్లు ప్రైవేటు భవనాలను గుర్తించారని, వెంటనే ఆ భవనాలు పరిశీలించి అద్దెకు తీసుకోవడంతో పాటు జూన్ 27లోగా తరలివెళ్లిపోవాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని కార్యాలయాల్లోని ఫర్నీచర్, పరికరాలతో పాటు ఉద్యోగులందరూ 27లోగా తరలివెళ్లాల్సిందేనని, 27వ తేదీ తర్వాత రాజధాని ప్రాంతం నుంచే విధులు నిర్వహించాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇప్పటికే 16,96,231 చదరపు అడుగుల నిర్మాణ స్థలం గల 85 ప్రైవేటు భవనాలను గుర్తించారని, అలాగే 2,34,000 చదరపు అడుగుల పార్కింగ్ స్థలాన్ని గుర్తించారని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ 1,50,000 చదరపు అడుగుల నిర్మాణ స్థలం గల నాలుగు ప్రైవేట్ భవనాలను గుర్తించారని తెలిపారు. శాఖాధిపతుల కార్యాలయాల ఉన్నతాధికారులు గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్ల సహాయ సహకారాలతో ప్రైవేట్ భవనాలను పరిశీలించి అద్దె ఒప్పందాలను చేసుకోవాలని స్పష్టం చేశారు. అద్దె ఒప్పందాలను మూడు సంవత్సరాల వరకు చేసుకోవాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఒక వేళ ఏ శాఖాధిపతి కార్యాలయమైనా నిర్మాణంలో ఉంటే ఆ నిర్మాణం పూర్తి అయ్యే వరకు అద్దెకు కార్యాలయాన్ని చూసుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10ల్లో ఉన్న సంస్థలు మినహా మిగతా శాఖాధిపతుల కార్యాలయాలన్నీ తరలివెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. శాఖాధిపతుల కార్యాలయాలకు అవసరమైన ప్రైవేట్ భవనాలకు ఎంత వరకైనా అద్దె చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అధికారుల సమావేశంలో స్పష్టం చేశారు. చదరపు అడుగుకు 25 రూపాయల వరకు నెలకు అద్దె చెల్లించేందుకు కూడా వెనుకాడేది లేదని ఆయన తెలిపారు. పిల్లి మొగ్గలు శాఖాధిపతుల కార్యాలయాల తరలింపు, వాటికి వసతి విషయంలో ప్రభుత్వ పెద్దలు ముందు నుంచి ఒక మాటపై లేకుండా తడవకో మాట మారుస్తూ పిల్లిమొగ్గలు వేస్తూ వస్తున్నారు. తొలుత శాఖాధిపతుల కార్యాలయాల కోసం అద్దె భవనాలను చూసుకోవాలని సూచించారు. ఆ తరువాత అద్దె భవనాలు చూసుకోవద్దని, వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం భవనాల్లోనే మరో రెండు అంతస్థులు శాఖాధిపతుల కార్యాలయాల కోసం నిర్మిస్తామని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా మరో రెండు అంతస్థుల నిర్మాణాలకు టెండర్లను కూడా ఆహ్వానించారు. అయితే మళ్లీ మాటమార్చిన ప్రభుత్వం శాఖాధిపతుల కార్యాలయాల కోసం ప్రైవేట్ భవనాలను అద్దెకు తీసుకోవాలని సూచించింది. -
'కేంద్రప్రభుత్వ కార్యాలయాలకు సెలవివ్వండి'
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలున్నందున ఫిబ్రవరి 2వ తేదీన కేంద్రప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.. కేంద్ర ప్రభుత్వ పర్సనల్, ట్రైనింగ్ విభాగం కార్యదర్శికి లేఖ రాశారు. ఎన్నికలు జరిగే 2వ తేదీన గ్రేటర్‌లోని కేంద్రప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సెలవు ప్రకటించాలని లేఖలో కోరారు. -
అర్జీ... అంతేసంగతి!
ముఖ్యమంత్రికి ఇచ్చినా అటకెక్కాల్సిందే.. - అందిన పిటిషన్లు 11,880 - పరిష్కారమైనవి కేవలం 59 - అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎంవో సాక్షి, హైదరాబాద్: ‘అధికారులు.. ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నాం.. ఎన్ని అర్జీలు ఇచ్చినా లాభం లేదు... నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి(సీఎంవో) అర్జీ పెట్టుకుంటేనన్నా తమ సమస్యకు కనీస పరిష్కారం దొరుకుతుంది... ఎమ్మెల్యేనో, ఎంపీనో సిఫారసు లేఖ దానికి జోడిస్తే మరింత తొందరగా పని అవుతుంది...’ అనేది సగటు బాధితుడి నమ్మకం. కానీ.. సాక్షాత్తూ సీఎంవోలో ప్రజల విజ్ఞప్తులు.. అర్జీలకు దిక్కుమొక్కు లేకుండాపోయింది. వేలాది అర్జీలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. మొత్తం 11,880 పిటిషన్లు అందితే.. కేవలం 59 పరిష్కారమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ మానిటరింగ్ సెల్ లో నమోదైన ఈ అర్జీల పురోగతి తీరును చూసి సీఎంవోలోని ఉన్నతాధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు పిటిషన్ల పురోగతిపై నివేదికను పంపించాలని అన్ని విభాగాలకు లేఖలు రాశారు. సాధారణంగా ప్రజా విజ్ఞప్తులు, పిటిషన్లను సీఎంవో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. రెండు వారాలకోసారి సీఎంవో అధికారులు సీఎంకు వీటి పురోగతిని నివేదించాల్సి ఉంటుంది. వీఐపీల ద్వారా లేదా సీఎంవోకు నేరుగా అందిన అర్జీలన్నింటినీ అధికారులు సంబంధిత విభాగాలకు పంపిస్తారు. అక్కడ వాటిని పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని సూచిస్తారు. అందులో యోగ్యమైన వాటిని పరిష్కరించడం లేదంటే తిరస్కరించడం క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారి బాధ్యత. ఈ అర్జీపై తీసుకున్న యాక్షన్.. లేదంటే పరిష్కరించిన చర్యను.. తిరస్కరిస్తే కారణాలను తమ విభాగపు ఉన్నతాధికారుల ద్వారా తిరిగి సీఎంవోకు తెలియపరుస్తారు. కానీ, ఇప్పుడున్న ఈ అర్జీల పురోగతి చూస్తే క్షేత్రస్థాయిలో ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయా...? లేదా వీటికి సంబంధించిన సమాచారం సీఎంవోకు తిరిగి అందడం లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే అన్ని విభాగాల అధికారులు తమ దగ్గరున్న పిటిషన్లపై సమీక్ష జరపాలని.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నవి తక్షణమే పరిష్కరించాలని సీఎంవో నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. పిటిషన్ మానిటరింగ్ సిస్టమ్‌లో ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. -
‘నైట్‌లైఫ్’కు రెడ్ సిగ్నల్ శాంతిభద్రతలు తలెత్తుతాయని
సాక్షి, ముంబై: నగరంలో ‘నైట్ లైఫ్’కు ప్రభుత్వం రెడ్ సిగ్నల్ ఇచ్చింది. రాత్రి సమయంలో హోటళ్లు, టీ, కాఫీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తెరిచి ఉంచడం వల్ల శాంతి, భద్రతలకు భంగం వాటిళ్లుతుందని భావించిన హోం శాఖ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. నగరంలో వాణిజ్య కేంద్రాలకు నిలయమైన నారిమన్ పాయింట్, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ తదితర నాన్ రెసిడెన్సియల్ ప్రాంతాల్లో అనేక కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో అత్యధిక శాతం కార్యాలయాలు రాత్రి కూడా తెరిచి ఉంటాయి. దీంతో ముంబైతోపాటు పుణేలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్, ఇతర షాపులు 24 గంటలు తెరిచి ఉంచాలనే ప్రతిపాదనను యువసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే.. నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు కొద్ది రోజుల కిందట భేటీలో తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ మారియా ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించారు. అయితే శాంతి భధ్రతల ృష్ట్యా ప్రతిపాదనకు రెడ్ సిగ్నల్ ఇచ్చింది. రాత్రులందు షాపులు, మాల్స్ తెరిచి ఉంచడంవల్ల ఆకతాయిలు, నేర చరిత్ర గల వారితో శాంతి, భద్రతలకు భంగం వాటిళ్లుతుందని హోం శాఖ వెల్లడించింది. ఇప్పటికే నగర పోలీసులపై పని భారం ఎక్కువగా ఉందని, షాపులకు అనుమతిస్తే మహిళలకు భద్రత కల్పించడంలో ఇబ్బందులు తలెత్తుతాయని హోం శాఖ స్పష్టం చేసింది. అయితే వీటి వల్ల అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని ఆదిత్య ఠాక్రే అభిప్రాయపడ్డారు. మారుతున్న కాలాన్ని బట్టి రాత్రులందు షాపింగ్ మాల్స్, హోటళ్లు తెరిచి ఉంచడం వల్ల ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. -
వారికి మనోస్థైర్యం ఏదీ?
జిల్లాలో సుమారు 21,000 మంది ఎయిడ్స్ రోగులు ఉన్నట్లుగా అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. కానీ వాస్తవంగా 30,000 మందికిపైగానే ఉన్నట్లు సమాచారం. అయితే జిల్లాలో ఎయిడ్స్‌వ్యాధి నిర్ధారణ, కౌన్సెలింగ్ నిర్వహణ కోసం వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సుమారు 12 ఐసీటీసీ (ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్‌సెంటర్)లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలకు వచ్చిన వారికి ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడంతో పాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు ఏఆర్టీ మందుల కోసం పంపిస్తారు. అక్కడ మరో రెండు రకాల రక్త పరీక్షలను నిర్వహించి సీడీ -4 ఆధారంగా ఏఆర్టీ మందులను అందజేస్తారు. అంతేగాక వారి చిరునామాల ఆధారంగా ప్రతి నెలా మందులను అందజేసేందుకు సమీప ప్రాంతాలలోని లింక్డ్ ఏఆర్టీ కేంద్రాలకు వెళ్లమని సూచిస్తారు. జిల్లాలోని భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతీయ వైద్యశాలల్లో లింక్డ్ ఏఆర్టీ సెంటర్లను ఏర్పాటు చేశారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి (నాకో)ద్వారా ఏఆర్టీ, లింక్డ్ ఏఆర్టీ కేంద్రాలకు ప్రతినెలా మందుల సరఫరా జరుగుతుంది. అయితే గడిచిన రెండు నెలలుగా ఏఆర్టీ మందుల సరఫరా నిలిచిపోవడంతో ఎయిడ్స్ రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఐసీటీకేంద్రాలకు గడిచిన 20 రోజులుగా ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ పరీక్షల కిట్ల సరఫరా నిలిచిపోయింది. ఇదిలా ఉండగా సగటున ఒక రోగికి గతంలో నెల రోజులకు సరిపడా మందులు అందజేసిన సంబంధిత అధికారులు ప్రస్తుతం సరఫరా నిలిచిపోయిందంటూ ఐదు రోజులకు మాత్రమే ఇస్తున్నారు. సాధారణంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు ప్రతి రోజూ తన దినచర్యలో భాగంగా ఏఆర్టీ మందులను తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. మధ్యలో ఏ మాత్రం నిలిపివేసినా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి నీరసించి మృత్యువాత పడే అవకాశం మెండుగా ఉంటుంది. కాగా ఏఆర్టీ మందులు దొరకక రోగులు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా జెఎల్ఎన్, ఎస్ఎల్ఎన్,టీఎల్ఎన్,టీఎల్ఈ మందుల సరఫరా పూర్తిస్థాయిలో నిలిచిపోయినట్లు సమాచారం. నాకో ద్వారా ఏఆర్టీ మందుల సరఫరా నిలిచి పోవడం వల్లే ఎయిడ్స్ రోగులకు అందించలేకపోతున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే ఏఆర్టీ మందుల సరఫరాను కొనసాగించాలని ఎయిడ్స్ రోగులు కోరుతున్నారు. -
స్తంభించిన పాలన
సాక్షి, అనంతపురం : జిల్లాలో సమైక్య ఉద్యమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ పాలుపంచుకుంటున్నారు. ఒకట్రెండు రోజులు కాదు.. ఏకంగా 60 రోజులుగా ఉద్యమ పథంలో కొనసాగుతున్నారు. దీనివల్ల అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. పాలన పూర్తిగా స్తంభించిపోయింది. కార్యాలయాల్లో ఫైళ్లకు బూజు పడుతోంది. ప్రభుత్వ సంక్షే మ కార్యక్రమాలు అమలు కావడం లేదు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మినహా ఎవరూ కార్యాలయాలకు వెళ్లడం లేదు. సమస్యలు పరిష్కరించండంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజలు కూడా నెలన్నరగా ఎక్కడా కనిపిం చడం లేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి జూలై 30న ప్రకటన వెలువడిన తరువాత జిల్లా లో ఉద్యమం ఉవ్వెత్తున మొదలైంది. మొదట్లో 12 రోజులపాటు రోజూ గంటో.. అర గంటో తెరచుకున్న కార్యాలయాలు ఆ తర్వాత పూర్తిగా మూతపడ్డాయి. ఉద్యోగులు ఆగస్టు 12న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. కలెక్టర్, జే సీ, జెడ్పీ సీఈఓ మినహా జిల్లాలోని దాదాపు 80 వేల మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. దీంతో జిల్లా అంతటా పాలన నిలిచిపోయింది. సంక్షేమ పథకాల అమలు పడకేసింది. ప్రజలకు నెల వారీగా అందాల్సిన పింఛన్లు, రేషన్ సరుకులు కూడా ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, మార్కెటింగ్ శాఖల ఆదాయం భారీగా పడిపోయింది. రెవెన్యూ శాఖ నుంచి పైసా అందడం లేదు. ఇక రైతులకు కూడా ఖరీఫ్ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. జిల్లాలో 5,400 మంది కౌలు రైతులు ఉండగా.. 10 శాతం మందికి మాత్ర మే ఖరీఫ్ రుణాలందాయి. రెవెన్యూ అధికారులు అందుబాటులో లేనందున సరైన పత్రాలు అందడం లేదని, దీంతో రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు నిరాకరిస్తున్నారని అనంతపురం, గుత్తి, పెనుకొండ, రాప్తాడు, ఉరవకొండ ప్రాంతాల కౌలు రైతులు గగ్గోలు పెడుతున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది సమ్మెలో ఉండడంతో ఈసీలు నిలిచిపోయాయి. ఫలితంగా స్థలాలు, భవనాల క్రయవిక్రయాలు ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో జిల్లాలో దాదాపు రూ.30 కోట్ల నష్టం వాటిల్లింది. ఆర్టీసీ కార్మికులు 47 రోజులుగా చేస్తున్న సమ్మెతో ఒక్క అనంతపురం రీజియన్‌కే ఇప్పటి వరకు దాదాపు రూ.40 కోట్ల నష్టం వచ్చింది. వారం రోజులుగా మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లలో పంట ఉత్పత్తులు, ఇతర వాటిపై వచ్చే ఆదాయానికి బ్రేక్ పడింది. జిల్లా వ్యాప్తంగా రూ.30 లక్షల వరకు ఆదాయానికి గండిపడినట్లు సమాచారం. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ, అమ్మహస్తం, అభయహస్తం, పావలా వడ్డీ రుణాలు వంటి పథకాలు జిల్లాలో పూర్తిగా పడకేశాయి. రబీకి సంబంధించి విత్తన పప్పుశనగ, వేరుశనగ పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. స్ప్రింక్లర్లు, డ్రిప్పు పరికరాలు అందక సూక్ష్మసేద్యం పడకేసింది. పశుక్రాంతి భ్రాంతిగా మారింది. అటు బ్యాంకుల్లోనూ.. ఇటు ట్రెజరీల్లోనూ ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి. మునిసిపల్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ వంటి కీలక శాఖల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిచిపోయి అవస్థలు పడుతున్నారు. పాత బిల్లులు ఇస్తేనే.. కొత్త పనులు చేస్తామని కాంటాక్టర్లు తెగేసి చెబుతున్నారు. దీని వల్ల వివిధ అభివృద్ధి పనులన్నీ అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రస్తుత పరిస్థితికి ప్రభుత్వ చేతగానితనమే కారణమంటూ జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన చిచ్చుపెట్టి ఢిల్లీ పెద్దలు తమాషా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రెండు నెలలుగా ఉద్యమం
‘‘రెండు నెలలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నాం. అన్ని పనులు వదులుకుని సమైక్యమే ధ్యేయంగా రోడ్లపైకొచ్చాం. విభజిస్తే మా బతుకులు అంధకారమవుతాయని గొంతు చించుకుని అరుస్తున్నాం. ఎన్ని విధాలుగా నిరసన తెలపాలో అన్ని రూపాల్లో ఆందోళనలు చేస్తున్నాం. మేము సైతం అంటూ మాతో పాటు చిన్న పిల్లలు కూడా ఉద్యమంలో కదం తొక్కుతున్నారు. అయినా ఈ కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు.’’ - సకల జనం ఆవేదన ‘‘ రాష్ట్ర విభజన జరిగితే అత్యంత కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా మరింతగా నష్టపోతుంది. ఎంతగా అంటే నిత్యం తాగు, సాగు నీటి కోసం కొట్టుకోవాల్సినంత. హంద్రీ-నీవా నీరు ఇక వస్తుందో.. రాదో దేవుడికే ఎరుక.’’ - రైతన్న ఘోష సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర ఉద్యమం 60 రోజులుగా హోరెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణే ధ్యేయంగా ప్రజలు, ఉద్యోగులు కదం తొక్కుతుండడంతో రెండు నెలలుగా ఉధృత స్థాయిలో కొనసాగుతోంది. శనివారం కూడా జిల్లా వ్యాప్తంగా సమైక్య నినాదం మార్మోగింది. అనంతపురం నగరంలో ఏపీఎన్జీఓలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించారు. విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న జాక్టో నాయకులకు కళాకారులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు ఆట పాటలతో సమైక్యవాదాన్ని వినిపించారు. ఉపాధ్యాయులు, హౌసింగ్, రెవెన్యూ, హంద్రీ-నీవా ఉద్యోగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన, బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఫేస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కళాకారులు ర్యాలీ చేశారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు జిల్లా పరిషత్ ఎదుట మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఎస్కేయూ పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు వర్సిటీ ఎదుట జాతీయ రహదారిపై ‘ఎస్కేయూ..60’ ఆకారంలో కూర్చుని రాస్తారోకో చేశారు. రాష్ట్రాన్ని విడగొడితే ఊరుకునేది లేదంటూ ఉరవకొండలో వేలాది మంది విద్యార్థులు గర్జించారు. ఒక్కసారిగా ై‘జె సమైక్యాంధ్ర’ అంటూ నినదించడంతో ఉరవకొండ దద్దరిల్లింది. సోనియాకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తూ ఉరవకొండలో సాయిప్రగతి పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ధర్మవరంలో విద్యార్థులు రోడ్డుపైనే చదువుతూ నిరసన తెలిపారు. తాడిమర్రిలో జేఏసీ నాయకులు బ్యాంకులను బంద్ చేయించారు. గుంతకల్లులోని పాతబస్టాండ్ సర్కిల్లో ప్రైవేటు స్కూళ్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్మించారు. మునిసిపల్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. హిందూపురంలో ఎన్జీఓలు ర్యాలీ చేపట్టారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు తోపుడు బండ్లపై ఉల్లిపాయలు, వెల్లుల్లి, చిరుధాన్యాలు అమ్ముతూ, ఉపాధ్యాయులు మెడకు ఉరితాళ్లు తగిలించుకుని నిరసన తెలిపారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు గంజి పంపిణీ చేశారు. కదిరిలోని అంబేద్కర్ సర్కిల్లో ఓడీచెరువు మండల ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేపట్టారు. జేఏసీ నాయకులు ఉరి తగిలించుకొని నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్, రెవెన్యూ ఉద్యోగులు ర్యాలీ చేశారు. తలుపులలో సమైక్యవాదులు రోడ్డుపైనే స్నానాలు చేసి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మినీ సర్కస్ నిర్వహించారు. మడకశిరలో సమైక్యవాదులు రోడ్డుపై బైఠాయించారు. జేఏసీ నాయకులు ఎస్బీఐని ముట్టడించారు. అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. కర్ణాటక బస్సులపై వీరప్పమొయిలీకి వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు రాశారు. పుట్టపర్తిలో హిజ్రాలు ర్యాలీ చేశారు. జేఏసీ నాయకులు గ్రామ దేవత సత్యమ్మకు పూజలు నిర్వహించారు. అమడగూరులో జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించారు. నల్లమాడలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. జేఏసీ నాయకులు వీధులు ఊడ్చి నిరసన తెలిపారు. కొత్తచెరువులో జేఏసీ నాయకులు యూపీఏ పెద్దల చిత్రపటాలతో శవయాత్ర నిర్వహించారు. పెనుకొండలో ట్రాక్టర్ యజమానుల యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ, రొద్దంలో జేఏసీ నాయకులు ప్రజా బ్యాలెట్ చేపట్టారు. గోరంట్లలో జేఏసీ నాయకులు శరీరానికి ఆకులు చుట్టుకుని, సోమందేపల్లిలో టీ అమ్ముతూ నిరసన తెలిపారు. రాయదుర్గంలో డాక్టర్లు విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. ఎన్జీఓలు మోకాళ్లపై నిరసన తెలిపారు. కణేకల్లులో ఉప్పర కులస్తులు, ఆత్మకూరులో ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. రాప్తాడులో జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించారు. శింగనమల ఆర్టీసీ బస్టాండ్‌ను శుభ్రం చేసి సమైక్యవాదులు నిరసన తెలిపారు. కల్లూరు వద్ద పెన్నానదిలో ‘సమైక్యాంధ్ర’ మంటలు వేశారు. తాడిపత్రిలో జేఏసీ నాయకులు మానవహారం నిర్మించి.. పచ్చగడ్డి తింటూ నిరసన తెలిపారు. ఆంజనేయస్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టి రాష్ట్రం విడిపోకుండా చూడాలని ప్రార్థించారు. బెళుగుప్పలో జేఏసీ నాయకులు ఇంటి ంటికీ వెళ్లి సమైక్య నినాదాన్ని విన్పించారు. కాగా.. ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ వచ్చిన ఉరవకొండకు చెందిన చేనేత కార్మికుడు వూడిశెట్టి శేఖర్(42), గుంతకల్లులోని తిలక్‌నగర్‌కు చెందిన దాదావలి(25) శనివారం గుండెపోటుతో మరణించారు. -
కింకర్తవ్యం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పుట్టి ముంచుతోంది. విభజన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ప్రకటనకు ముందే వైఎస్ఆర్సీపీ తన విధానాన్ని స్పష్టం చేసింది. తెలంగాణ ఇస్తున్నట్లు చెప్పిన వెంటనే ఆందోళన బాట పట్టింది. సమైక్యాంధ్ర జేఏసీలతో కలిసి ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లో ఆ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. ఇదే సమయంలో తమ పార్టీ అధినేతల నిర్ణయాన్ని సమర్థించాలో, వ్యతిరేకించాలో తెలియక కాంగ్రెస్, టీడీపీ నాయకులు జనం ముందుకు రాలేకపోతున్నారు. తెలుగుదేశం ఇచ్చిన లేఖతోనే తెలంగాణ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ప్రకటించడం టీడీపీ శ్రేణులను ఇరుకున పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కు తగ్గేది లేదని పార్టీ అధిష్టానం స్పష్టం చేయడంతో కాంగ్రెస్ నేతలు ఉద్యమంలో కలిసి నడవలేక తర్జనభర్జన పడుతున్నారు. చొరవ తీసుకొని వెళ్లినా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జిల్లా కేంద్రంలోని ఆయా పార్టీల కార్యాలయాల వద్ద టెంట్లు ఏర్పాటు చేసుకొని రిలే నిరాహారదీక్షల పేరుతో కాలం వెల్లదీస్తున్నారు. అయితే బుధవారం టీడీపీ టెంట్ నాయకులు లేక వెలవెలబోయింది. కాంగ్రెస్ నేతల తీరు అయోమయం తెలంగాణ ప్రకటన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పత్రికా సమావేశాలకు, అధికారిక కార్యక్రమాలకు హాజరై ‘సమైక్యాంధ్రను విడగొట్టడానికి ఇతర పార్టీలే కారణం’ అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటనలు గుప్పించడానికే పరిమితమవుతున్నారు. ఇక తెలంగాణ ప్రకటన వెలువడిన నాటి నుంచి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఢిల్లీకే పరిమితం కాగా.. ఆయన వర్గం ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలను స్వీకర్‌కు అందజేసి వచ్చి అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి రాజీనామా ప్రకటన చేసి, ఆళ్లగడ్డలో బలవంతంగా ఒకరోజు దీక్షలో పాల్గొన్నారు. ఇక మంత్రి పదవులకు రాజీనామా చేసి కర్నూలుకు వచ్చి ఆర్భాటంగా ఒకరోజు దీక్షలో కూర్చున్న మంత్రి టీజీ వెంకటేశ్ కూడా ఆ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. మరో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి రంజాన్ రోజు మొక్కుబడిగా ర్యాలీ నిర్వహించడంతో సరిపెట్టారు. ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డి రాజీనామా లేఖ స్పీకర్‌కు పంపించి ముఖం చాటేశారు. కోడుమూరు ఎమ్మెల్యే మురళీకృష్ణ పరిస్థితి అదే. నంద్యాల, నందికొట్కూరు ఎమ్మెల్యేలు శిల్పా మోహన్ రెడ్డి, లబ్బి వెంకటస్వామి కూడా ఒక్కరోజు ఆందోళనల్లో కనిపించి వెళ్లిపోయారు. కోట్ల సతీమణి, డోన్ మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ ఒకరోజు డోన్‌లో జేఏసీ దీక్షా శిబిరానికి వచ్చి తన భర్తతో రాజీనామా చేయిస్తానని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఎమ్మెల్యేలు లేని ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు మొక్కుబడిగా ఉద్యమకారులకు మద్దతు పలికి ఫొటోలు దిగి వెళ్లిపోతున్నారు. ఆ పార్టీ మండల, గ్రామ స్థాయి నాయకులు కూడా దూరంగానే ఉంటుండడం గమనార్హం. కాటసాని సోదరులు సైతం ఉద్యమం పట్ల అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. -
తెలంగాణ డీజీపి ఎవరనేదాని పై అప్పుడే ఊహాగానాలు