హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికలున్నందున ఫిబ్రవరి 2వ తేదీన కేంద్రప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.. కేంద్ర ప్రభుత్వ పర్సనల్, ట్రైనింగ్ విభాగం కార్యదర్శికి లేఖ రాశారు. ఎన్నికలు జరిగే 2వ తేదీన గ్రేటర్లోని కేంద్రప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సెలవు ప్రకటించాలని లేఖలో కోరారు.