central
-
తెలంగాణకు కేంద్రం తీపి కబురు
-
జమ్ము మిస్టరీ మరణాలపై కేంద్రం ప్రకటన
మిస్టరీగా మారిన జమ్ము కశ్మీర్ వరుస మరణాల(Mysterious Deaths)పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అంతుచిక్కని అంటువ్యాధితో మరణిస్తున్నారనే వాదనను కేంద్రం తోసిపుచ్చింది. అయితే విషపూరిత పదార్థాల వల్లే వరుస మరణాలు సంభవించాయని, ఈ వ్యవహారంపై కుట్ర కోణం సహా అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని గురువారం ప్రకటించింది.రాజౌరీ(Rajouri) జిల్లాలోని ఓ గ్రామంలో నెలవ్యవధిలో 17 మంది వరుసగా ఒకే తరహా లక్షణాలతో జబ్బుపడి మరీ చనిపోయారు. చనిపోయిన వాళ్లలో చిన్నపిల్లలే(13) ఎక్కువగా ఉన్నారు. వాళ్ల మరణాలకు విషపూరిత పదార్థాలే కారణమని కేంద్రం నిర్ధారించింది. అయితే ఆ టాక్సిన్ ఏంటన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సైన్స్&టెక్నాలజీ మంత్రి(స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.‘‘లక్నోలోని సీఎస్ఐఆర్(CSIR) ల్యాబ్ నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో.. ఇది వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షనో కాదని తేలింది. మృతదేహాల నుంచి సేకరించిన నమునాల్లో విషపదార్థాలు ఉన్నట్లు తేలింది. అయితే ఆ విషపదార్థాలు ఏంటన్న దానిని నిర్ధారించుకునే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. వారం, పదిరోజుల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన రానుంది’’ అని ఆయన తెలిపారు. ఇక అన్నికోణాల్లో ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఏదైనాకుట్ర ఉందని తేలితే.. బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఐటీఆర్ (టాక్సికాలజీ రీసెర్చ్) నిర్వహించిన విశ్లేషణలోనూ ఇంతకు ముందు విషపూరిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది.డిసెంబర్ 7 నుంచి జనవరి 19వ తేదీల మధ్యలో రాజౌరీలోని బధాల్ అనే కుగ్రామంలో ఈ వరుస మరణాలు(Serial Deaths) సంభవించాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, విపరీతంగా చెమటలు పోయడం, స్పృహ కోల్పోవడం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. పైగా మూడు కుటుంబాలకే చెందిన వ్యక్తులు వరుసగా జబ్బు చేసి మరణించడం గమనార్హం. పైగా ఆ కుటుంబాలకు చెందిన బంధువులు చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లో విస్తరించి ఉన్నారు. అయితే అనూహ్యంగా వాళ్లలో కూడా కొందరు ఇదే రీతిలో జబ్బు పడ్డట్లు సమాచారం. అందులోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో బుధవారం అక్కడి అధికారులు బధాల్ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. సుమారు 40 మందిని ఐసోలేషన్‌కు తరలించారు. ఇక ప్రజల్లో ఆందోళన నెలకొన్న దృష్ట్యా.. బహిరంగా జనం గుమిగూడటంపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. వరుస మరణాలతో జమ్ము కశ్మీర్లో హెల్త్ ఎమర్జెన్సీ(Health Emergency) ప్రకటిస్తారనే వదంతులు చక్కర్లు కొట్టాయి. అయితే వైద్య ఆరోగ్య అధికారులు మాత్రం వాటిని కొట్టిపారేశారు. ఆ అవసరం లేదని స్పష్టత ఇచ్చారు. నమునాల్లో న్యూరోటాక్సిన్స్ ఉన్నట్లు తేలడంతో.. కుట్ర కోణం తెర మీదకు వచ్చింది. నిజాలు నిగ్గుతేల్చేందుకు కశ్మీర్ పోలీస్ శాఖ సిట్‌ను ఏర్పాటుచేసింది. మంగళవారం బధాల్కు వెళ్లిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని ప్రకటించారు. మరోవైపు.. వరుస మరణాల నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు 11 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని కశ్మీర్‌కు పంపింది. -
తరతరాల చరిత్రకు ఆలవాలం
టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ తరతరాల చరిత్రకు ఆలవాలం. కేవలం ఇది టాటా కుటుంబ వ్యాపార చరిత్రకు మాత్రమే కాదు, దేశ స్వాతంత్య్రపూర్వ ఆర్థిక, రాజకీయ చరిత్రకు, స్వాతంత్య్రానంతర అభివృద్ధి చరిత్రకు కూడా ఆలవాలం. చారిత్రక ఆనవాళ్లను భద్రపరచి, తర్వాతి తరాలకు అందించడంలో మన భారతీయులకు శ్రద్ధ కొంత తక్కువ. మన దేశంలోని పెద్దపెద్ద వ్యాపార సంస్థలు ఇందుకు మినహాయింపు కాదు. దేశంలోని తొలి వ్యాపార ఆర్కైవ్స్‌ను టాటా సంస్థ ప్రారంభించింది. టాటా గ్రూప్ సంస్థలకు దాదాపు ఒకటిన్నర శతాబ్దాలకు పైబడిన చరిత్ర ఉంది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి, డెబ్బయి ఏడేళ్లు గడిచాయి. టాటా గ్రూప్ చరిత్ర స్వాతంత్య్ర భారత చరిత్రకు దాదాపు రెట్టింపు. ఆనాటి బ్రిటిష్ కాలంలో జెమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా తొలుత తండ్రి చేసే వ్యాపారానికి సçహాయంగా ఉంటూ వచ్చారు. తర్వాత 1868లో ఈ వ్యాపార సామ్రాజ్యానికి పునాది వేశారు. అప్పట్లో ఆయన రూ.21 వేల పెట్టుబడితో ఒక ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించారు. ఆ తర్వాత ఒక కాటన్ మిల్లును ప్రారంభించి, వ్యాపారాలను క్రమంగా విస్తరించుకుంటూ, 1874లో నాగపూర్‌లో సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీని నెలకొల్పారు. బ్రిటిష్ రాజ్యంలో స్థానిక భారతీయుడు ఒకరు ప్రారంభించిన తొలి జాయింట్ స్టాక్ కంపెనీ ఇది. ఆనాటి నుంచి టాటా గ్రూప్ వ్యాపార ప్రస్థానం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. టాటా కుటుంబ వారసుల్లో మూడో తరానికి చెందిన జె.ఆర్.డి. టాటా ఈ చరిత్రను ఒక తరం నుంచి మరో తరానికి అందించడానికి, దేశ పౌరులకు అందుబాటులో ఉంచడానికి వీలుగా టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. తొలుత 1991 జనవరిలో బాంబేలో దీనిని ఏర్పాటు చేశారు. తర్వాత 2001లో పుణేలోని సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన భవనంలోకి దీనిని తరలించారు. ఎంప్రస్ మిల్స్ నుంచి ఎయిర్ ఇండియా వరకుటాటా గ్రూప్ ప్రస్థానం ఎంప్రస్ మిల్స్ నుంచి ఎయిర్ ఇండియా వరకు రకరకాల రంగాల్లో కొనసాగింది. టాటా గ్రూప్ ప్రారంభించిన కొన్ని వ్యాపారాలు కారణాంతరాల వల్ల నిలిచిపోయాయి. ఇంకొన్ని చేతులు మారాయి. అయినా, టాటా గ్రూప్ వ్యాపార ప్రస్థానం దేశ పారిశ్రామిక రంగంలో తన ఉనికిని నేటికీ నిలుపుకుంటూ వస్తోంది. టాటా గ్రూప్ వ్యాపారాలకు సంబంధించి టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌లో భద్రపరచిన ఎన్నో అరుదైన విశేషాలు నేటి తరానికి తెలియవు. స్వాతంత్య్రోద్యమ కాలంలో టాటాలు పోషించిన పాత్ర, స్వాతంత్య్రానంతరం దేశ ఆర్థికాభివృద్ధిలో పోషించిన పాత్ర నిరుపమానమైనవి. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడైన జెమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా నాగపూర్‌లో 1874లో ప్రారంభించిన సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో విక్టోరియా మిల్లును నెలకొల్పారు. బ్రిటిష్ రాణిగా విక్టోరియా 1877 జనవరి 1న భారత సామ్రాజ్ఞిగా పట్టాభిషిక్తురాలు కావడంతో ఈ మిల్లు పేరును ఎంప్రెస్ మిల్స్‌గా మార్చారు. కాలక్రమంలో ఈ కంపెనీ పరిధిలోకి మరో మూడు మిల్లులు చేరాయి. అవన్నీ కలిపి టాటా టెక్స్టైల్ మిల్స్‌గా పేరుపొందాయి. టాటా టెక్స్టైల్ మిల్స్ వ్యాపారం 1997లో నిలిచిపోయింది. జె.ఆర్.డి.టాటా హయాంలో టాటా గ్రూప్ 1932లో విమానయాన రంగంలోకి ‘టాటా ఎయిర్‌లైన్స్’ పేరుతో అడుగుపెట్టింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1953లో భారత ప్రభుత్వం దీనిని జాతీయం చేసి, దీని పేరును ‘ఎయిర్ ఇండియా’గా మార్చింది. ప్రభుత్వం 2000–01 కాలంలో ఎయిర్ ఇండియాను ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. చివరకు 2022లో ఈ కంపెనీని తిరిగి టాటా గ్రూప్ కైవసం చేసుకోగలిగింది. ఈ చరిత్రకు సంబంధించిన ఆధారాలన్నీ టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌లో భద్రంగా అందుబాటులో ఉంచడం విశేషం.మహాత్మాగాంధీకి తొలి విరాళంటాటా గ్రూప్ వారసులు నేరుగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనకపోయినా, భారత స్వాతంత్య్రోద్యమానికి బాసటగా నిలిచారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా కొనసాగుతూ, భారత స్వాత్రంత్య్రోమానికి సన్నాహాలు చేస్తున్న కాలంలోనే 1909లో జెమ్షెడ్జీ టాటా చిన్న కొడుకు సర్ రతన్జీ టాటా ఆయనకు తొలి విరాళంగా రూ.25 వేలు పంపారు. అప్పట్లో అది చాలా పెద్దమొత్తం. టాటాల తొలి కంపెనీ పెట్టుబడి కంటే కూడా నాలుగువేల రూపాయలు ఎక్కువ. గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమానికి సర్ రతన్జీ టాటా బాసటగా ఉండేవారు. గాంధీజీకి ఆయన 1910లో మరో రూ.25 వేలు, 1912లో మూడో విరాళం పంపారు. ఈ సంగతిని గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమ ప్రచార పత్రిక అయిన ‘ఇండియన్ ఒపీనియన్’లో రాసిన ఒక వ్యాసంలో ప్రస్తావించారు. గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చి, స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం చేపట్టారు. అనతికాలంలోనే దేశ ప్రజలు ఆయనను ‘మహాత్మా’ అని పిలువసాగారు. గాంధీజీ 1925లో జెమ్షెడ్పూర్ వచ్చారు. అక్కడి టాటా ఉక్కు కర్మాగారం కార్మికులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో దేశం పట్ల, దేశ ప్రజల పట్ల టాటాలు కనబరుస్తున్న నిబద్ధతపై ఆయన ప్రశంసలు కురిపించారు. గాంధీజీ చేపట్టిన స్వదేశీ ఉద్యమానికి జెమ్షెడ్జీ టాటా పెద్ద కొడుకు సర్ దొరాబ్జీ టాటా భార్య లేడీ మెహర్‌బాయి టాటా కూడా మద్దతు తెలిపారు. ఇందుకోసం 1919లో ఆమె స్వయంగా రాట్నంపై నూలు వడకడం నేర్చుకున్నారు. జె.ఆర్.డి.టాటా తండ్రి ఆర్.డి.టాటా కూడా గాంధీజీ నేతృత్వంలోని స్వాతంత్య్రోద్యమానికి మద్దతు పలికారు. స్వదేశీ ఉద్యమం కోసం ఆయన టాటా సంస్థ తరఫున లక్ష రాట్నం కుదురులను, ఇతర చేనేత సామగ్రిని పంపారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీజీ, నెహ్రూ, సరోజినీ నాయుడు, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, మహమ్మద్ అలీ జిన్నా తదితర జాతీయ నేతలు బాంబేలో టాటాలకు చెందిన తాజ్‌మహల్ పాలెస్ హోటల్లో తరచుగా సమావేశాలు జరుపుకొనేవారు.నెహ్రూ కోరికపై లాక్మే ప్రారంభంమన దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో సౌందర్య సాధనాలను తయారు చేసే కంపెనీలు లేవు. సబ్బులు, పౌడర్లు తప్ప మిగిలిన సౌందర్య సాధనాలు కావాలంటే విదేశీ ఉత్పత్తులపై ఆధారపడే పరిస్థితులు ఉండేవి. ఫలితంగా భారీ ఎత్తున విదేశీ మారకద్రవ్యం వీటి కోసం ఇతర దేశాలకు తరలిపోయే పరిస్థితి ఉండేది. విదేశీ మారకద్రవ్యం సౌందర్య ఉత్పత్తుల కోసం విదేశాలకు తరలిపోకుండా ఉండాలంటే, దేశంలో సౌందర్య సా«ధనాల తయారీ సంస్థ ఒకటి ఏర్పాటు చేయాలని తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అప్పట్లో జె.ఆర్.డి.టాటాను కోరారు. నెహ్రూ కోరిక మేరకు జె.ఆర్.డి.టాటా 1952లో తొలి స్వదేశీ సౌందర్య సాధనాల సంస్థగా ‘లాక్మే’ను ప్రారంభించారు. అప్పట్లో ‘లాక్మే’ అనే ఫ్రెంచ్ ఒపేరా ప్రపంచ ప్రసిద్ధి పొందడంతో జె.ఆర్.డి.టాటా తమ సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్‌కు ఆ పేరు పెట్టారు. లక్ష్మీదేవిని ఫ్రెంచ్‌లో ‘లాక్మే’ అంటారు. చాలాకాలం టాటా గ్రూప్‌లో ఉన్న ఈ బ్రాండ్ 1998లో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ చేతుల్లోకి చేరింది.విద్యా పరిశోధన సేవా రంగాల్లోనూ ముద్రజె.ఆర్.డి.టాటా దాదాపు అర్ధశతాబ్ద కాలం టాటా గ్రూప్ సంస్థలకు నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్ వ్యాపారాలకు వెలుపలి సేవలకు కూడా విస్తరించాయి. జె.ఆర్.డి.టాటా హయాంలోనే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా మెమోరియల్ హాస్పిటల్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్, నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫర్మింగ్ ఆర్ట్స్ వంటి సంస్థలు ప్రారంభమయ్యాయి. విద్యా పరిశోధన రంగాల్లో ఇవి నేటికీ ప్రతిష్ఠాత్మక సంస్థలుగా తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నాయి. ఈ సంస్థల ఏర్పాటు కోసం జె.ఆర్.డి.టాటా చేసిన కృషికి సంబంధించిన వివరాలన్నింటినీ టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌లో భావితరాల కోసం భద్రపరచారు. వీటిని పరిశీలిస్తే, ఒక్కో సంస్థ వెనుక ఉన్న సంకల్పం, వాటి ఏర్పాటు కోసం పడిన తపన అర్థమవుతాయి. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ పేరుతో ఇటీవలి కాలంలో కార్పొరేట్ సంస్థలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీపై ఎలాంటి నిర్బంధం, నిబంధనలు లేనికాలంలోనే టాటాలు సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించారు. స్వాతంత్య్రానికి మూడేళ్ల ముందే, 1944లో సేవా కార్యక్రమాల కోసం జె.ఆర్.డి.టాటా తన సొంత డబ్బుతో జె.ఆర్.డి.టాటా ట్రస్టును ఏర్పాటు చేశారు. తర్వాత కొంతకాలానికి కంపెనీలోని తన షేర్లు కొన్నింటిని, బాంబేలోని ఒక అపార్ట్‌మెంట్‌ను అమ్మేసి, ఆ డబ్బుతో పేద మహిళల స్వావలంబన కోసం తన పేరిట, తన భార్య పేరిట జె.ఆర్.డి.టాటా అండ్ థెల్మా టాటా ట్రస్టును ఏర్పాటు చేశారు. టాటా సంస్థల సుదీర్ఘ చరిత్రను నిక్షిప్తం చేసుకున్న టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌లోని అరుదైన విశేషాలను ఎవరైనా సందర్శించవచ్చు. ఇది ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌ను సందర్శించడమంటే, దేశ ఆర్థిక స్వావలంబన చరిత్రను సింహావలోకనం చేయడమే! -
పార్లమెంటులో జమిలి ఎన్నికల బిల్లు పెట్టనున్న కేంద్రం
-
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
-
పీఎం-విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
ఢిల్లీ, సాక్షి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం- విద్యాలక్ష్మి పథకంతో పాటు పలు అంశాలకు ఆమోదం తెలిపింది. డబ్బు లేని కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం కావద్దనే పీఎం- విద్యాలక్ష్మి పథక లక్ష్యం. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు పీఎం-విద్యాలక్ష్మి ద్వారా ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. నాణ్యత కలిగిన 860 ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించనుంది. రూ. ఏడున్నర లక్షల వరకు రుణ సౌకర్యం అందించనుంది. ఈ పథకం ద్వారా 75 శాతం క్రెడిట్ గ్యారెంటీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. పీఎం-విద్యాలక్ష్మి ద్వారా ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందనున్నారు.#WATCH | Delhi: After the Union Cabinet meeting, Union Minister Ashwini Vaishnaw says, "FCI plays a very big role in the procurement of food. It has been decided today to significantly strengthen the Food Corporation of India (FCI)...Today, the cabinet has decided fresh equity… pic.twitter.com/TL26u6xS2G— ANI (@ANI) November 6, 2024 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రూ. 10,700 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఎఫ్‌సీఐ ఆపరేషన్ సామర్థ్యం పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. ‘‘2004-14తో పోల్చితే 2014-24 మధ్య నాలుగు రెట్లు అధికంగా రైతులకు ఆహార సబ్సిడీ అందింది’’ అని అన్నారు. #Cabinet approves PM-Vidyalaxmi scheme to provide financial support to meritorious students so that financial constraints do not prevent any youth of India from pursuing quality higher educationUnder the scheme, any student who gets admission to a Quality Higher Education… pic.twitter.com/Z8C3fllXuo— PIB India (@PIB_India) November 6, 2024 -
ఆంధ్రాకు వెళ్లాల్సిందే.. ఐఏఎస్, ఐపీఎస్‌లకు DOPT బిగ్ షాక్
-
సొంత రాష్ట్రాలకు వెళ్లిపోండి.. ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్రం షాక్
-
సుప్రీం సీరియస్.. ఏపీకి కేంద్ర దర్యాప్తు సంస్థలు
-
ఈ టర్మ్‌లోనే ఎన్నికలు..
-
బాబు మళ్లీ ఫెయిల్..
-
ఏపీ సర్కార్ నిర్ణయం సరికాదు
సాక్షి, హైదరాబాద్: ‘గ్రూప్–ఏ అధికారుల డిప్యుటేషన్ కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లకు పరిమితం చేసింది. ఆ తర్వాత పొడిగింపునకు డీవోపీటీ అనుమతి కావాలి. దీనిపై ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించినట్టు గాని, క్రమశిక్షణ చర్యలపై చర్చించినట్టు గాని లేదు. నిజంగా అప్పీలెంట్ రికార్డులను తారుమారు చేయడం, సాక్ష్యాలను ధ్వంసం చేస్తారనే భయాలుంటే జూన్ 7నే సస్పెండ్ చేసి ఉండాలి. కానీ.. రెండు నెలల సమయం తీసుకుని ఆగస్టు 19న చేయడం సరికాదు. అలాగే నాలుగు రోజులైతే డిప్యుటేషన్ ముగుస్తుందనగా సస్పెండ్ చేయడం సమర్థనీయం కాదు. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఆదేశాలను నిలుపుదల చేస్తున్నాం’ అని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది.కేసు నేపథ్యమిదీఐఆర్ఏఎస్ అధికారి ఎం.మధుసూధన్‌రెడ్డి డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లోకి 2019లో వచ్చారు. మూడేళ్లు (2022 ఆగస్టు వరకు) పనిచేసేందుకు వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు డిప్యుటేషన్‌ను కేంద్రం మరో రెండేళ్లు (2024 ఆగస్టు వరకు) పొడిగించింది. ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీగా పనిచేస్తున్న మధుసూధన్‌రెడ్డి సేవలను ఉపసంహరించుకుంటూ.. జీఏడీలో రిపోర్టు చేయాలని జూన్ 7న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జీఏడీలో రిపోర్టు చేసిన మధుసూదన్‌రెడ్డికి ఇప్పటివరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన డిప్యుటేషన్ ఈ నెల 22తో పూర్తవుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోనే అయన ఉండాలని, రిలీవ్ చేసుకోవద్దని 18న ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఒక్క రోజులోనే సస్పెన్షన్ ఉత్తర్వులుఆగస్టు 19న క్రమశిక్షణ చర్యల పేరిట సస్పెన్షన్ ఆదేశాలు చేసింది. ఏపీ ప్రభుత్వం తనకు సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌లోని క్యాట్‌లో ఎం.మధుసూధన్‌రెడ్డి అప్పీల్ దాఖలు చేశారు. ప్రభుత్వ చర్య తన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని, సస్పెన్షన్ ఆదేశాలను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ అప్పీల్‌పై లతా బస్వరాజ్ పాట్నే, శాలిని మిశ్రా ధర్మాసనం గురువారం విచారించింది. సస్పెన్షన్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని మధుసూధన్‌రెడ్డి తరఫున కె.సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. డిప్యుటేషన్ పూర్తయిన తర్వాత అధికారిని కొనసాగించడానికి వీల్లేదని మార్చిలో డీవోపీటీ మార్గదర్శకాలు తీసుకొచ్చిన విషయాన్ని బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. సస్పెన్షన్ నివేదిక ఇంతవరకు ఇవ్వలేదన్నారు. -
సుప్రీంకోర్టు ఆదేశాలతో.. కోల్‌కతా ఆసుపత్రి వద్ద కేంద్ర బలగాల మోహరింపు
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. వైద్యురాలిపై అత్యంత క్రూరంగా దాడి చేసి చంపిన కిరాతకుడికి ఉరిశిక్ష విధించాలంటూ ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి..ఈ క్రమంలో తాజాగా హత్యాచారం చోటుచేసుకున్న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ వద్దకు కేంద్ర బలగాలు భారీగా చేరుకున్నాయి. విమానాశ్రయాలు, పార్లమెంట్లకు రక్షణగా ఉండే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఉన్నతాధికారులు హాస్పిటల్ వద్ద గస్తీ కాసేందుకు చేరుకున్నారు.కోల్‌కతా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన మరుసటి రోజు ఈ పరిణామం వెలుగుచూసింది. హత్యాచారం ఘటన తర్వాత ఆసుపత్రి వద్ద భారీ నిరసనలు చోటుచేసుకుంటున్న తరుణంలో కేంద్ర బలగాలను మోహరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.ఆసుపత్రికి చేరుకున్న అనంతరం సీనియర్ సీఐఎస్ఎఫ్ అధికారి కే ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ..ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించేందుకు ఆసుపత్రి వద్దకు వచ్చినట్లు తెలిపారు. తమ పని తాము చేస్తామని, మిగతా విషయాలు సీనియర్ అధికారులు తెలియజేస్తారు పేర్కొన్నారు.కాగా ఆగస్ట్ 15 తెల్లవారుజామున ఒక గుంపు ఆసుపత్రిపై దాడి చేసి రెండు అంతస్తులలోని వైద్య పరికరాలు, సామాగ్రిని ధ్వంసం చేయడంపై సుప్రీంకోర్టు బెంగాల్ పోలీసులకు చీవాట్లు పెట్టింది. ఆసుపత్రి విధ్వంసానికి పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడింది. మాజీ ప్రిన్సిపల్‌కు లై డిటెక్టర్ పరీక్షమరోవైపు.. ఆర్జీ కార్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష( లై డిటెక్టర్ పరీక్ష) చేసే అవకాశాలు ఉన్నాయి. కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు.. పాలీగ్రాఫ్ టెస్టుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆగస్టు 9వ తేదీన వైద్యురాలి శరీరం సెమీనార్ హాల్లో పడి ఉన్న విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత రెండు రోజులకు ప్రిన్సిపాల్ ఘోష్ రాజీనామా చేశారు. ఇప్పటికే పలుమార్లు ఆయన .. సీబీఐ విచారణకు హాజరయ్యారు. -
ఢిల్లీకి రూ. పది వేల కోట్లు కేటాయించాలి.. ఆప్ మంత్రి డిమాండ్
న్యూఢిల్లీ: ఢిల్లీలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్ నుంచి రూ. 10,000 కోట్లు కేటాయించాలని ఆప్ మంత్రి అతిషి డిమాండ్ చేశారు. సెంట్రల్ జీఎస్టీ కింద ఢిల్లీ నుంచి కేంద్రానికి రూ. 25,000కోట్లు అందుతోందని ఆమె తెలిపారు. అంతేగాక ఢిల్లీ ప్రజలు రెండున్నర లక్షల కోట్లకుపైగా ఆదాయపు పన్నుల రూపంలో చెల్లిస్తున్నారని, ఇందులో కొంతభాగం తిరిగి దేశ రాజధానికి దక్కడం తమ హక్కని ఆమె పేర్కొన్నారు. ఈ రెండున్నర లక్షల కోట్లలో ఐదు శాతం రాజధానికి కేటాయించాలని అతిషి డిమాండ్ చేశారు.ఈనెల 23న కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజధానిలో రోడ్డు, రవాణా, విద్యుత్ రంగాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు నగరాన్ని సుందరీకరించడానికి ఢిల్లీకి మరింత డబ్బు విడుదల చేయాలని అతిషి కోరారు.2001 నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం పన్నుల కింద కేవలం రూ.325 కోట్లు మాత్రమే చెల్లిస్తోందని ఆమె అన్నారు. అయితే, ఈ చెల్లింపు కూడా గత ఏడాది ఆగిపోయిందని.. ఏడాది కాలంలో నగరానికి ఒక్క రూపాయి కూడా రాలేదని ఆమె ఆరోపించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు చెల్లించిన పన్నుల సమాహారమే కేంద్ర బడ్జెట్ అని, ఈ పన్నుల్లో ఢిల్లీ వాటా అత్యధికమని ఆమె తెలిపారు. -
గోవా వెళ్లే తెలుగు వారికి కేంద్రం గుడ్‌న్యూస్..
సాక్షి, ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రారంభించనుంది. సికింద్రాబాద్ నుంచి బుధ, శుక్రవారాల్లో ఈ రైలు గోవా బయలుదేనుంది. గోవా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం కానుంది. సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుంది. ఈ సందర్భంగా ప్రధాని, రైల్వే శాఖ మంత్రులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకూ వారానికి ఒకరైలు 10 కోచ్‌లతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్‌కు చేరుకొని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్ళే మరో 10 కోచ్‌లతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. ఇది కాకుండా కాచీగూడ - యలహంక మధ్యన వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్ళే 4 కోచ్ లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ - గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు.ఇలా సికింద్రాబాద్ - గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ మార్చి 16, 2024 నాడు రాశారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైల్వేశాఖ ఈ ప్రతిపాదనను పక్కన పెట్టాల్సి వచ్చింది.మళ్లీ కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు అధికారంలోకి రావడంతో.. ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసిన సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు. దీనిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. దీంతో సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ప్రకటించింది.ఈ నిర్ణయంపై కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో అవసరమైన ఈ రైలును ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది. ఇది సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుంది. -
ఎవరీ సావిత్రి ఠాకూర్? ఏకంగా కేంద్ర మంత్రి వర్గంలో..!
దేశ ప్రధానిగా నరేంద్రమోదీ జూన్ 09న మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ వేదికగా ఆదివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. మోదీ కొత్త ప్రభుత్వంలని కేంద్ర మంత్రి వర్గంలో చోటు పొందడం అంటే ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు లెక్క. చెప్పాలంటే దేశం అంతటని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి గొప్ప అవకాశాన్ని ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని గిరిజన నాయకురాలు సావిత్ర ఠాకూర్‌కి దక్కింది. ఇంతకీ ఎవరీమె..? ఆమెకు ఈ అవకాశం ఎలా దక్కిందంటే..నరేంద్ర మోదీ జూన్ 09న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన తోపాటు 72 మంత్రలు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ప్రభుత్వంలోని మంత్రి వర్గంలో మధ్యప్రదేశ్‌లోని ధార్‌కు చెందిన 46 ఏళ్ల సావిత్రి ఠాకూర్ అనే గిరిజన నాయకురాలు చోటు దక్కించుకుంది. రాష్ట్రపతి భవన్ వేదిక జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఠాకూర్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె మధ్యప్రదేశ్‌లో దీదీ ఠాకూర్‌గా పేరుగాంచింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె గులాబీ రంగు చీర తోపాటు సంప్రదాయ గంచాను ధరించి వచ్చారు.ఆమె ఎవరంటే..దీదీ ఠాకూర్‌గా పేరుగాంచిన సావిత్రి ఠాకూర్‌కి రాజకీయ నేపథ్యం లేదు. ఆమె తండ్రి రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ కాగా, భర్త రైతు. పురుషాధిక ప్రపంచంలో అంచెలంచెలుగా పైకొచ్చింది. ఆమె సామాజికి కార్యకర్తలా మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్, ధార్ వంటి ప్రాంతాల్లోని గిరిజన మహిళలు, పేద మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. వారిని స్వయం సమృద్ధిగా మార్చడానికి రుణలు సేకరించడంలో తన వంతుగా సహాయసహకారాలు అందించింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి.. 2003లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరడం జరిగింది. అలా ఆమె జిల్లా పంచాయతీ మెంబర్‌గా ఎన్నికై.. అక్కడ నుంచి అంచెలంచెలుగా ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నారు. ఆమె షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ) రిజర్వడ్ సీటుపై ధార్ నుంచి పోటీ చేసి బీజేపీకి మహళా గిరిజన నాయకురాలయ్యింది. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే 2019లో బీజేపీ టిక్కెట్ నిరాకరించడంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ పార్టీ పదవులను నిర్వహించింది. తదనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 2.18 లక్ష మెజార్టీ ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రాధేశ్యామ్‌పై విజయం సాధించారు. గతంలో ఠాకూర్ బీజేపీలో జిల్లా ఉపాధ్యాక్షుడిగా ఉన్నారు. 2013లో ఆమె కృషి ఉపాజ్ మండి ధమ్నోద్ డైరెక్టర్‌గా, ఆదివాసీ మహిళా వికాస్ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా పలు ఉన్నత పదవులును అలంకరించారు. గిరిజన నాయకురాలిగా ఆమె ప్రజలకు చేసిన సేవలకు గానూ బీజేపీ ఇలా కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఇచ్చి మరీ గౌరవించింది. కాగా, కేంద్ర మంత్రి మండలిలోని కొత్త మంత్రులు..కేంద్ర మాజీ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ఎంపీలు అన్నపూర్ణా దేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకూర్, నిముబెన్ బంభానియా, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ తదితరులు. అయితే వారిలో సీతారామన్, దేవిలకు క్యాబినేట్లో చోటు దక్కగా, మిగిలిన వారు సహాయ మంతులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 18వ లోక్‌సభలో కొత్తమంత్రి మండలిలో కేబినేట్ పాత్రలో ఇద్దరు తోసహా ఏడుగురు మహిళలు చేరారు. అయితే గతంలో జూన్ 05న రద్దయిన మంత్రిమండలిలో మాత్రం దాదాపు 10 మంది దాక మహిళా మంత్రులు ఉండటం విశేషం. Savitri Thakur takes Oath of Office and Secrecy as Union Minister of State during the #SwearingInCeremony #OathCeremony #ShapathGrahan pic.twitter.com/E9NKSqQPET— PIB India (@PIB_India) June 9, 2024 (చదవండి: మోదీ ప్రమాణా స్వీకారోత్సవంలో పాల్గొననున్న మహిళా లోకో పైలట్లు వీరే..!) -
కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
సాక్షి, విజయవాడ: కేంద్ర కేబినెట్లో ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలకు చోటు దక్కింది. ఒక సీనియర్, ఇద్దరు జూనియర్ ఎంపీలకు ఛాన్స్ లభించింది. ఒక బీసీ, ఇద్దరు ఓసీలకు కేబినెట్లో స్థానం లభించింది. కేంద్ర కేబినెట్లో కింజరాపు రామ్మోహన్నాయుడికి స్థానం దక్కగా.. మూడు సార్లు ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. బీసీ సామాజిక వర్గం నుంచి కేంద్ర కేబినెట్ పదవిని రామ్మోహన్ దక్కించుకున్నారు.టీడీపీలో రెండో మంత్రి పదవిని పెమ్మసాని చంద్రశేఖర్ దక్కించుకున్నారు. దేశంలోని అత్యంత ధనవంతుడైన ఎంపీ అభ్యర్థిగా పేరొందిన పెమ్మసాని చంద్రశేఖర్.. తొలిసారి ఎంపీగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందే టీడీపీలో చేరి, ఎంపీ సీటును పెమ్మసాని దక్కించుకున్నారు. బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మను మంత్రి పదవి వరించింది. తొలిసారి ఎంపీగా శ్రీనివాస వర్మ ఎన్నికయ్యారు. పురందేశ్వరి, సీఎం రమేష్‌లకు తొలి కేబినెట్లో అవకాశం దక్కలేదు. క్షత్రియ, కమ్మ, కొప్పుల వెలమ సామాజికవర్గాలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.శ్రీనివాస్ వర్మ ప్రొఫైల్..క్షత్రియ వర్గానికి చెందిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ 1967 ఆగస్టు నాలుగున భూపతి రాజు సూర్యనారాయణరాజు దంపతులకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. ఈయన విద్యాపరంగా డబుల్ ఎంఏ చేయడంతో పాటుగా ఎం ఎల్ లిటరేచర్, బిఎల్ కూడా చేశారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రావీణ్యులు. 1991లో బీజేపీ పార్టీలో చేరిన శ్రీనివాస్ వర్మ 95 వరకు బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్‌గా, 95 నుండి 97 వరకు భీమవరం టౌన్ పార్టీ ప్రెసిడెంట్‌గా, 97 నుంచి 99 వరకు పార్టీ జిల్లా కార్యదర్శిగా.. 99 నుంచి 2001 వరకు నర్సాపురం పార్లమెంటు కన్వీనర్‌గా, 2001 నుండి 2003 వరకు బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్‌గా, 2003 నుంచి 2009 వరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఎంపీగా పోటీ చేసి పరాజయం చెందారు. 2010 నుంచి 2018 వరకు పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా, 2018 నుండి 2020 వరకు పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జిగా, 2020 నుండి 2023 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. భీమవరం మున్సిపాలిటీకి కౌన్సిలర్‌గా, ఫ్లోర్ లీడర్‌గా, ప్యానల్ చైర్మన్‌గా, డీఎన్ఆర్ విద్యాసంస్థలకు జాయింట్ సెక్రటరీగా, భూపతి రాజు బాపిరాజు ఎడ్యుకేషనల్ సొసైటీకి చైర్మన్‌గా, భీమవరం బిల్డర్స్ అసోసియేషన్‌కు గౌరవ ప్రెసిడెంట్‌గా కూడా శ్రీనివాస్ వర్మ సేవలందించారు. -
19 వరకూ బెంగాల్లో 400 కంపెనీల కేంద్ర బలగాలు
2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలను ఎన్నికల సంఘం జూన్ 4న వెల్లడించనుంది. మరోవైపు గత కొన్నేళ్లుగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సుమారు 400 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపును జూన్ 19 వరకు పొడిగించాలని నిర్ణయించింది.పశ్చిమ బెంగాల్లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించిన అనంతరం 400 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపును జూన్ 19 వరకు పొడిగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సున్నితమైన ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు జూన్ 19 వరకు కేంద్ర బలగాల భద్రతా సిబ్బందిని మోహరించనున్నామని ఎన్నికల సంఘం అధికారి తెలిపారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాలకు ఓటింగ్ జరిగింది. నేడు (సోమవారం) కొన్ని బూత్‌లలో రీపోలింగ్ జరుగుతోంది. ఓట్ల లెక్కింపు ముగిసిన రెండు రోజుల వరకూ అంటే జూన్ 6 వరకు కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం గతంలో నిర్ణయించింది. అయితే ఇప్పుడు దీనిని ఈ నెల 19 వరకూ కొనసాగించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు.బీజేపీ నేత, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఇటీవల ఎన్నికల సంఘానికి చెందిన ప్రత్యేక పరిశీలకునితో సమావేశమయ్యారు. అలాగే కోడ్ ముగిసిన తర్వాత కూడా మూడు నెలల పాటు కేంద్ర బలగాలను రాష్ట్రంలోనే ఉంచాలని గవర్నర్‌తో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. -
అలరించిన జాతీయ సంస్కృతి మహోత్సవాలు (ఫొటోలు)
-
మానసిక ఆరోగ్య సంరక్షణలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: ప్రజల మానసిక ఆరోగ్య సంరక్షణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేషుగ్గా ఉంటున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రశంసించింది. దేశంలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవలందించడం, వారి హక్కులను కాపాడటమే లక్ష్యంగా మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టాన్ని 2017లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. చట్టం అమలుపై రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలిచ్చింది. కాగా, చట్టం అమల్లో భాగంగా సీఎం జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ మెంటల్ హెల్త్ వర్క్‌షాప్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ కితాబిచ్చింది. మన రాష్ట్రం అవలంభిస్తున్న విధానాలను త్వరలో ప్రత్యేకంగా తెలుసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ అడిషనల్ సెక్రటరీ ఎల్ఎస్ ఛాంగ్సన్ పేర్కొన్నారు. ప్రత్యేక బోర్డ్‌ల ఏర్పాటు మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం అమల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ(ఎస్‌ఎంహెచ్‌ఏ)తో పాటు, విశాఖపట్నం, ఎన్టీఆర్, వైఎస్సార్, తిరుపతి జిల్లాల్లో రీజినల్ రివ్యూ బోర్డ్‌ల ఏర్పాటును చేపట్టింది. ఎస్ఎంహెచ్ఏలో రాష్ట్రంలో మానసిక రోగులకు చికిత్సలు అందించేలా ఆస్పత్రుల రిజి్రస్టేషన్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకూ 52 మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్లు రిజిస్ట్రర్ చేసుకున్నాయి. మరోవైపు మానసిక స్థితి సరిగా లేక, రోడ్లపై తిరిగే నిరాశ్రయులను ఆదుకునే చర్యల్లో భాగంగా శ్రద్ధ రిహెబిలిటేషన్ ఫౌండేషన్‌తో వైద్య శాఖ ఎంవోయూ చేసుకుంది. మానసిక స్థితి సరిగా లేక రోడ్లపై తిరిగే వారిని గుర్తించి శ్రద్ధ ఫౌండేషన్ ద్వారా చికిత్సలు అందిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ వంద మంది బాధితులకు చికిత్సలు అందించి, వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. మరోవైపు యువతలో ఆత్మహత్యల నియంత్రణకు ఎమోషనల్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ బై ఎడ్యుకేటర్స్, రెఫరల్ ఇన్ ఏపీ(ఈఏఎస్‌ఈ) కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. నిమ్హాన్స్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఆరిజన్(ఆపీ) వంటి ప్రముఖ సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాయి. ఇప్పటి వరకూ మూడు వేల మందికిపైగా ఎంబీబీఎస్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. -
నీటి వాటాలపైనా అడ్డం తిరిగిన తెలంగాణ
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ ఈనెల 17న నిర్వహించిన సమావేశంలో అంగీకరించి ఆ తర్వాత అడ్డం తిరిగిన తరహాలోనే.. కృష్ణా జలాల వాటాపైనా తెలంగాణ తొండాటకు దిగింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీల చొప్పున పంపిణీ చేస్తూ 2015 జూలై 18–19న కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీనిని అంగీకరిస్తూ ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటుపై కృష్ణా బోర్డులో చర్చించి.. దాని ప్రకారమే రెండు రాష్ట్రాలు నీటిని వినియోగించుకుంటున్నాయి. మరోవైపు కృష్ణా జలాల్లో సగం వాటా కావాలని గతంలో తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసినా.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వెలువడే వరకూ పాత వాటాలే చెల్లుబాటు అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ నీటి వాటాలపైనా అడ్డం తిరిగింది. కేంద్రం చేసిన తాత్కాలిక సర్దుబాటును అంగీకరించబోమని పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసింది. కానీ.. 1976 మే 31న బచావత్ ట్రిబ్యునల్ జారీ చేసిన అవార్డులో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో.. 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలం ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. వాటి ఆధారంగానే రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956లోని సెక్షన్–6(2) ప్రకారం.. కేడబ్ల్యూడీటీ–1 అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. అందుకే కేడబ్ల్యూడీటీ–2 వాటి జోలికి వెళ్లలేదు. 65 శాతం లభ్యత కింద ఉన్న మిగులు జలాలు 194 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 అదనంగా కేటాయించింది. వీటిని పరిశీలిస్తే.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చినా.. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు మారబోవని జలవనరుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట.. కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న హాఫ్ హాలీడే ప్రకటిస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కార్యాలయాలన్నింటికి ఈ హాఫ్ హాలీడే వర్తించనున్నట్లు తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో జరిగే రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తయ్యేంత వరకు ఒకపూట సెలవు వర్దిస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది. ప్రతిచోటా ‘జై శ్రీరామ్’ నినాదాలు వినిపిస్తున్నాయి. శ్రీరామ్‌లల్లాకు జరిగే పట్టాభిషేకం కోసం అయోధ్యవాసులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: అయోధ్య వాతావరణం.. ప్రత్యేక వెబ్‌పేజీ ప్రారంభించిన ఐఎండీ -
కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో.. ఫలించిన సీఎం జగన్ కృషి
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగున్నరేళ్లుగా చేస్తున్న పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్రం నిర్ణయిం చింది. దాంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వ అక్రమ నీటి వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది. దీనివల్ల మన రాష్ట్రానికే కాదు.. తెలంగాణకూ ప్రయోజనమే. రెండు రాష్ట్రాల హక్కులకు విఘాతం కలగదు. కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ చూపిన చొరవ, పట్టుదలను నీటి పారుదల రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఆనాడు ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం, రెండు కళ్ల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు తాకట్టు పెట్టారని, నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పరిరక్షించారని నిపుణులు కొనియాడుతున్నారు. హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చేసేందుకు విభజన చట్టం ద్వారా 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసేదాకా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని నిర్దేశించింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్‌ను 2014–15లో పూర్తిగా ఆదీనంలోకి తీసుకుంది. శ్రీశైలంలో మాత్రం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తెలంగాణలో ఉందనే సాకు చూపి దాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అదే సాకు చూపి పులిచింతల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆధీనంలోకి తీసుకుంది. అయినా సరే.. ఆనాటి ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం కనీస ప్రయత్నం చేయలేదు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం, తెలంగాణలోనూ టీడీపీని బతికించుకోవాలన్న స్వార్ధంతో రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. ► శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలించవచ్చు. నీటి మట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే ఆరేడు వేల క్యూసెక్కులే తరలించడానికి సాధ్యమవుతుంది. అంతకంటే నీటి మట్టం తగ్గితే శ్రీశైలంలో నీటి కోటా ఉన్నా సరే సీమ అవసరాలకు నీటిని వినియోగించలేని దుస్థితి. శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. తెలంగాణకు దిగువన నీటి అవసరాలు లేకపోయినా కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలంలో నీటిమట్టం తగ్గేలా ఆ ప్రభుత్వం చేస్తోంది. తద్వారా శ్రీశైలంలో ఏపీ వాటా జలాలు వినియోగించుకోకుండా చేస్తోంది. ► 2015లో ఇదే రీతిలో శ్రీశైలం నుంచి సాగర్‌కు తెలంగాణ తరలించిన నీటిని.. కుడి కాలువ కింద సాగు అవసరాల కోసం విడుదల చేయాలని అప్పటి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ తోసిపుచ్చింది. దాంతో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకుని, రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి 2015, ఫిబ్రవరి 13న పోలీసులతో కలిసి ఆదిత్యనాథ్ దాస్ నాగార్జునసాగర్‌కు వచ్చారు. అయితే ఆనాటి సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయంగా లబ్ధి పొందాలనే లక్ష్యంతో.. వాటిని స్వాధీనం చేసుకోకుండా తక్షణమే వెనక్కి రావాలని ఆదిత్యనాథ్‌ను ఆదేశించారు. తద్వారా కృష్ణా జలాలపై రాష్ట్రం హక్కులు కోల్పోయేలా చేశారు. ► శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు, డిండి ఎత్తిపోతలతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచి.. సుంకేశుల బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల, భక్తరామదాస ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. వీటి ద్వారా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ హరించివేస్తున్నా ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం నాటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. హక్కుల పరిరక్షణ కోసం సీఎం జగన్ రాజీలేని పోరాటం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చడానికి తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. దీన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్ 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని సీఎం జగన్ చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపివేసేలా తెలంగాణను ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ► 2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలిస్తోంది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా, తెలంగాణ సర్కారు తన భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్రానికి అప్పగించాలని, లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ► శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణా బోర్డు ఏపీకి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని రాష్ట్ర అధికారుల విజ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. ఇదే అంశాన్ని సీఎం జగన్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ తన ఆధీనంలోకి తీసుకుందని.. అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. దాంతో నవంబర్ 30 తెల్లవారుజామున సీఈ మురళీనాథ్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దాంతో సీఎం జగన్ ఆది నుంచి చేస్తున్న డిమాండ్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. -
నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి
సాక్షి, అమరావతి: కృష్ణా నదిపై ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు అంగీకరించారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏపీ భూభాగంలోని 6, తెలంగాణ భూభాగంలోని 9 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించే విధానం (హ్యాండింగ్ ఓవర్ ప్రోటోకాల్)ను వారంలోగా ఖరారు చేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీకి దేబశ్రీ ముఖర్జీ చెప్పారు. త్రిసభ్య కమిటీ ఖరారు చేసిన విధానంపై 15 రోజుల్లోగా రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షించి, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈమేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా ఆదేశాల మేరకు కృష్ణా జలాల వివాదానికి తెరదించేందుకు దేబశ్రీ ముఖర్జీ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్, కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్విందర్‌సింగ్ వోరా తదితరులు పాల్గొన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు డిసెంబర్ 1 నుంచి సీఆరీ్పఎఫ్ పహారాలో సాగర్‌ను నిర్వహిస్తున్నామని, ఈ నెలలో కుడి కాలువ ద్వారా ఏపీకి 5 టీఎంసీలు విడుదల చేశామని కృష్ణా బోర్డు ఛైర్మన్ శివన్నందన్కుమార్ వివరించారు. వెనకడుగు కాదు.. ముందడుగే కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ శ్రీశైలం నిర్వహణను ఏపీకి, సాగర్ నిర్వహణను తమకు అప్పగించారని తెలంగాణ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పారు. ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను నవంబర్ 30న అక్రమంగా ఆ రాష్ట్ర అధికారులు స్వా«దీనం చేసుకున్నారని, సాగర్‌పై నవంబర్ 29 నాటికి ఉన్న యధాస్థితిని కొనసాగించాలని కోరారు. దీనిపై రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ నిర్వహణలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని 2014లో అధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి నవంబర్ 30 వరకూ తొమ్మిదేళ్లపాటు తెలంగాణ సర్కారు తమ హక్కులను కాలరాసిందని, హక్కుల పరిరక్షణ కోసమే మా భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి హెడ్ రెగ్యులేటర్‌ను స్వా«దీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ వెనకడుగు కాదు ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. తొలుత సాగర్ నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామని, ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం తీసుకుంటామంటూ చేసిన ప్రతిపాదనను ఏపీ అధికారులు సున్నితంగా తోసిపుచ్చారు. సాగర్‌ను మాత్రమే బోర్డుకు అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. సాగర్, శ్రీశైలంను ఒకేసారి కృష్ణా బోర్డుకు అప్పగిస్తేనే రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించవచ్చునని సూచించారు. ఇందుకు తెలంగాణ అధికారులు కూడా అంగీకరించారు. దాంతో శ్రీశైలం, సాగర్‌ను కృష్ణా బోర్డుకు ఒకే సారి అప్పగించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అంగీకరించారు. అప్పగింత తర్వాత నిర్వహణ నియమావళి కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రెండున్నరేళ్లైనా అమల్లోకి రాకపోవడంపై దేబశ్రీ ముఖర్జీ అసహనం వ్యక్తంచేశారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి, రెండు రాష్ట్రాల ఈఎన్సీల నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వారంలోగా శ్రీశైలం, సాగర్‌లలోని 15 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించే విధానాన్ని ఖరారు చేయాలని ఆదేశించారు. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనందున, ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి (ఆపరేషన్ ప్రోటోకాల్)ని ఖరారు చేయలేమని తెలంగాణ అధికారులు చెప్పారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చాక ఆపరేషన్ ప్రోటోకాల్‌ను ఖరారు చేయాలని వారు చేసిన సూచనను సీడబ్ల్యూసీ చైర్మన్ వ్యతిరేకించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కేటాయింపుల ఆధారంగానే 2015లో రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ తాత్కాలిక సర్దుబాటు చేశామని, వాటికి అనుగుణంగానే శ్రీశైలం, సాగర్ ఆపరేషన్ ప్రోటోకాల్ ముసాయిదా రూపొందించామని వివరించారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. ప్రాజెక్టుల అప్పగింత తర్వాత ఆపరేషన్ ప్రోటోకాల్ ఖరారుపై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. రూ.8.5 కోట్లు అధికంగా ఇచ్చిన రాష్ట్రం కృష్ణా బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నాయని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ వివరించారు. దీనిపై ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ స్పందిస్తూ.. తెలంగాణకంటే తాము రూ.8.5 కోట్లు అధికంగా ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వాటా నిధులు ఇచ్చాకే తాము కూడా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తక్షణమే వాటా నిధులు విడుదల చేయాలని తెలంగాణ అధికారులను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. -
పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సెక్యూరిటీ విధులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు అప్పగించింది. పార్లమెంట్ భద్రతలో ఢిల్లీ పోలీసుల స్థానంలో సీఐఎస్ఎఫ్ను కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై కొత్త, పాత పార్లమెంట్ భవనాల భద్రత సీఐఎస్ఎఫ్ పరిధిలోకి వస్తుంది. సీఐఎస్ఎఫ్ అనేది కేంద్ర సాయుధ పోలీసు దళంలో భాగంగా ఉంటుంది. ఇది ప్రస్తుతం ఢిల్లీలోని అనేక కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ భవనాలకు కాపలాగా ఉంటుంది. అణు, ఏరోస్పేస్ డొమైన్, విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రో ఇన్స్టాలేషన్లను కూడా కాపాడుతోంది. పార్లమెంటు భవన సముదాయాన్ని సర్వే చేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశించారు. తద్వారా సీఐఎస్ఎఫ్ భద్రత, అగ్నిమాపక విభాగాన్ని సమగ్ర నమూనాలో మోహరించడం సాధ్యమవుతుందని వెల్లడించారు. డిసెంబర్ 13న పార్లమెంట్లో అలజడి జరిగిన విషయం తెలిసిందే. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా నలుగురు దుండగులు లోక్‌సభలోకి ప్రవేశించి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. దీనిపై ప్రతిపక్షాలు కొన్ని రోజులుగా నిరసన చేపడుతున్నాయి. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని పట్టబట్టాయి. ఈ క్రమంలో దాదాపు 150 మంది ఎంపీలు ఉభయ సభల నుంచి సస్పెండ్ అయ్యారు. ఇదీ చదవండి: Winter Parliament Session 2023: మరో ఇద్దరు ఎంపీల సస్పెన్షన్ -
మహా శక్తివంత దేశంగా భారత్
తిరుపతి సిటీ/తిరుమల: ప్రపంచంలో భారత్ మహా శక్తివంతమైన దేశంగా నిలవనుందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. సోమవారం తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలు అవగాహనతో వినియోగించుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య, ఆర్థిక సేవలు, పేదలకు పక్కా గృహాలు, ఆహార భద్రత వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించడానికి ప్రధాని మోదీ సర్కార్ చర్యలు చేపట్టిందన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలతో పౌరులకు లభించే ప్రయోజనాలు, వివిధ సౌకర్యాలను మారుమూల గ్రామీణ లబ్ధిదారులకు చేరవేసేందుకు వికసిత్ భారత్ సంకల్పయాత్ర ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ఉచిత ఆరోగ్య సంరక్షణ కోసం ఏడాదికి రూ.5 లక్షలు అందించేందుకు ఆయుష్మాన్ భారత్ యోజన, పేదల పక్కా గృహాల నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మంచినీటి కోసం జల్ జీవన్ మిషన్, రైతుల కోసం పీఎం కిసాన్, పీఎం కిసాన్ సమ్మాన్, పిల్లల పౌష్టికాహారం కోసం పోషణ్ అభియాన్, పేదరిక నిర్మూలన కోసం దీన్‌దయాల్ అంత్యోదయ యోజన, ఉజ్వల యోజన, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పీఎం జన్‌ధన్, పీఎం జన్ఔషధి యోజన, పీఎం స్వామిత్ర, పెన్షన్ యోజన, ముద్ర యోజన, డిజిటల్ ఇండియా, పీఎం ఫజల్ యోజన, విశ్వకర్మ యోజన, ఉపాధి కల్పన కోసం స్టార్టప్ ఇండియా, అంకుర భారత్, స్వదేశీ దర్శన్, ఉడాన్ పథకం వంటి పథకాలను అందిస్తోందన్నారు. ప్రతి పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశ పౌరుల ప్రయోజనమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్ర«థమ ఉద్ధేశమన్నారు. అనంతరం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, నగరపాలక సంస్థ మేయర్ శిరీష, కమిషనర్ హరిత పాల్గొన్నారు. తిరుమల చేరుకున్న గవర్నర్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సోమవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని రచన అతిథి గృహం వద్ద గవర్నర్‌కు టీటీడీ చైర్మన్ భూమున కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు. గవర్నర్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. -
కృష్ణా జలాల వివాదం: డిసెంబర్ 6న కీలక భేటీ
సాక్షి, విజయవాడ: కృష్ణా జలాల వివాదంపై పరిష్కారం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ తదితర అంశాలపై ఈనెల 6న ఎపీ , తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జల వనరుల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ వీడియో సమావేశం నిర్వహించనుంది. ఈ అంశాలపై ఢిల్లీ నుండి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ వీడియో శనివారం సమావేశం నిర్వహించారు. కానీ తెలంగాణా సీఎస్ ఈరోజు సమావేశానికి హాజరు కాలేనని 5వ తేదీకి సమావేశాన్ని మార్చాలని కోరారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులతో ఈనెల 6వ తేదీన వీడియో సమావేశం నిర్వహించనున్నట్లు దేబశ్రీ ప్రకటించారు. అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించి ఈసమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అప్పటి వరకూ ఇరు రాష్ట్రాలు పూర్తి సంయవనం పాటించాలని సూచించారు. నీటి విడుదలకు సంబంధించి ఎపీ ఇచ్చిన ఇండెంటుపై కృష్ణా నది యాజమాన్య బోర్డు ఈనెల 4వ తేదీన సమావేశం నిర్వహించాలని జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ.. కేఆర్ఎంబి చైర్మన్ శివనందన్ కు సూచించారు. నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని అప్పటి వరకూ నాగార్జున సాగర్ కుడి కాలువ నుండి నీటి విడుదలను ఆపాలని కోరారు. కృష్ణా జలాల పంపకంపై విభజన చట్టం ప్రకారం ఎపీ, తెలంగాణా రాష్ట్రాలకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులను వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీటి విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. 6వతేదీన జరిగే సమావేశంలో ఇందుకు సంబంధించి అన్ని అంశాలను సమావేశం దృష్టికి తీసుకు వస్తామని సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: నాగార్జున సాగర్ దగ్గర టెన్షన్.. టెన్షన్.. మోహరించిన సీఆర్పీఎఫ్ బలగాలు -
తెలుగు రాష్ట్రాల పోలీసులకు పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దుల రక్షణ, ఆయుధాల నియంత్రణ, మాదకద్రవ్యాల నియంత్రణ వంటి నాలుగు ఆపరేషన్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి కేంద్ర హోంశాఖ మెడల్స్‌ను ప్రకటించింది. 2023 సంవత్సరానికి తెలంగాణ నుంచి 22 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 12 మందిని ఎంపిక చేసినట్లు హోంశాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. హోంశాఖ 2018లో ఆపరేషన్స్ మెడల్స్‌ను ప్రవేశపెట్టింది. తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఒక నాన్‌కేడర్ ఎస్పీ, ఒక డీఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఎస్ఐలు, ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు, తొమ్మిదిమంది కానిస్టేబుళ్లు మొత్తం 22 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఏపీ నుంచి ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఒక నాన్‌కేడర్ ఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఒక ఆర్ఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు మొత్తం 12 మందిని ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి ఎంపికైన వారు రాజేష్ కుమార్ (ఐజీపీ), నరేందర్ నారాయణరావు చుంగి (ఎస్పీ), ఎస్.చైతన్య కుమార్ (నాన్‌కేడర్ ఎస్పీ), డీఎస్పీ ఆర్.శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ ఎన్.రాజశేఖర్, ఎస్ఐలు పి.విజయభాస్కర్, ఏ.వరుణకాంత్ రెడ్డి, మహమూద్ యూసఫ్, హెడ్ కానిస్టేబుళ్లు టి.హరినాథ్, షేక్ అజారుద్దీన్, ఎం.జీ.శివమణి, ఎస్.ప్రసాద్, కే.సి.విజయ్‌కుమార్, పీసీలు మహమూద్ ఖాజా మొయిద్దీన్, మోహముంద్ ఇంతియాజ్, బి.సుమన్, పి.రవీందర్, ఎం.రవీదర్‌కుమార్, ఎస్.ప్రేమ్‌కుమార్, ఎండీ షబ్బీర్ పాషా, ఇంతియాజ్ పాషా షేక్, ఏ.శ్రీనివాస్. ఏపీ నుంచి ఎంపికైన వారు వినీత్ బ్రిజ్ లాల్ (ఐజీపీ), బాబూజీ అట్టాడ (ఎస్పీ), ఈజీ అశోక్‌కుమార్ (ఎస్పీ, నాన్‌కేడర్), షేక్ సర్దార్ ఘని (ఇన్స్పెక్టర్), సవ్వన అనిల్‌కుమార్(ఎస్ఐ), ఎంవీఆర్‌పీ నాయుడు (ఆర్ఎస్ఐ), రాజన్న గౌరీ శంకర్ (హెడ్‌కానిస్టేబుల్), అనంతకుమార్ నంద (హెడ్‌కానిస్టేబుల్), పీసీలు అడప మణిబాబు, వి.శ్రీను, జి.భాస్కరరావు. -
పసుపు బోర్డు..గిరిజన వర్సిటీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్ర రైతులు ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డును, ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో.. రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతుంది. దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేయడంతోపాటు వినియోగించేది, ఎగుమతి చేసేది ఈ పంటే. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. దీనిపై పరిశోధనలు పెరిగాయి. పాలమూరు సభ సాక్షిగా ఇక్కడి పసుపు రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు (నేషనల్ టర్మరిక్ బోర్డు)ను ఏర్పాటు చేస్తాం. ములుగులో ట్రైబల్ వర్సిటీ.. ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రూ.900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీకి సమ్మక్క–సారలమ్మ పేరు పెడుతున్నాం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో వివిధ భవనాలను ప్రారంభించాం. హెచ్సీయూకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా కలి్పంచి, ప్రత్యేక నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. నారీశక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడం ద్వారా నవరాత్రులకు ముందే శక్తి పూజ స్ఫూర్తిని నెలకొల్పాం. వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమ రంగాలకు ప్రయోజనం తెలంగాణ ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేలా అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేయడం సంతోషంగా ఉంది. నాగ్‌పూర్–విజయవాడ కారిడార్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కారిడార్‌లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కూడా గుర్తించాం. ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్లు, మూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు, ఒక టెక్స్టైల్ క్లస్టర్ ఉన్నాయి. దేశంలో నిర్మిస్తున్న ఐదు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. హన్మకొండలో నిర్మించే ఈ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వేలాది మందికి ఉపాధి ఇచ్చేలా.. ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఇంధన భద్రతపై చర్చ జరుగుతోంది. కేవలం పరిశ్రమలకే కాకుండా ప్రజలకు కూడా ఇంధన శక్తిని అందిస్తున్నాం. దేశంలో 2014లో 14 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉంటే 2023 నాటికి 32 కోట్లకు పెరిగాయి. ఇటీవల గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా తగ్గించాం. దేశంలో ఎల్పీజీ వినియోగాన్ని పెంచడంలో భాగంగా పంపిణీకి సంబంధించి నెట్‌వర్క్‌ను విస్తరించాల్సి ఉంది. ఇందులో భాగంగా హసన్–చర్లపల్లి ఎల్పీజీ పైప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఇది ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో దోహదపడుతుంది. కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్ వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది..’’అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనలు ఇవీ.. రూ.3,397 కోట్లతో మూడు ప్యాకేజీలుగా వరంగల్ నుంచి ఖమ్మం వరకు చేపట్టనున్న ఎన్‌హెచ్–163 పనులు రూ.3,007 కోట్లతో మూడు ప్యాకేజీలుగా ఖమ్మం నుంచి విజయవాడ వరకు నిర్మించే ఎన్‌హెచ్–163జీ పనులు కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వరకు రూ.1,932 కోట్లతో చేపట్టే మల్టీ ప్రొడక్ట్ పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభించినవి ఇవీ.. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు రూ.2,457 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల 365 బీబీ నంబర్ జాతీయ రహదారి మునీరాబాద్–మహబూబ్‌నగర్ రైల్వేలైన్‌లో భాగంగా జక్లేర్ నుంచి కృష్ణా వరకు రూ.505 కోట్లతో పూర్తి చేసిన కొత్త లైన్ రూ.81.27 కోట్లతో హెచ్‌సీయూలో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ భవనాలు రూ.2,166 కోట్లతో హసన్ (కర్ణాటక) నుంచి చర్లపల్లి వరకు నిర్మించిన ఎల్పీజీ పైప్‌లైన్ జాతికి అంకితం నారాయణపేట జిల్లాలోని కృష్ణా స్టేషన్ నుంచి కాచిగూడ–రాయచూర్– కాచిగూడ డీజిల్, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) రైలు సర్విస్ ప్రారంభం -
‘అసైన్డ్’ రైతులకు యాజమాన్య హక్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుపేద రైతులకు వారి అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కేటాయించి 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై వాటి యజమానులకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఏపీ అసైన్డ్ భూముల(ప్రొబిషన్ ట్రాన్స్ఫర్) చట్టం–1977 సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. దీనితో పాటు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు 10 ఏళ్ల తర్వాత యాజమాన్య హక్కులు బదిలీ చేసుకునే అవకాశాన్నిచ్చింది. సోమవారం శాసన సభ మూడో రోజు సమావేశాల్లో మంత్రులు ప్రవేశపెట్టిన 10 బిల్లులతో పాటు బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ చేసిన తీర్మానానికీ సభ ఆమోదం తెలిపింది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య రాష్ట్రంలోని విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం అనేక విద్యా సంస్కరణలు తీసుకొచ్చింది. తాజాగా ప్రైవేటు వర్సిటీలు కూడా అంతర్జాతీయంగా టాప్ 100 వర్సిటీలతో కలిసి సంయుక్త సర్టిఫికేష¯న్ తప్పనిసరిగా అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు (స్థాపన, క్రమబద్ధీకరణ) చట్టం–2016ను సవరించింది. ఇందులో కొత్తగా ఏర్పడే వర్సిటీల్లో 65:35 నిష్పత్తిలో ప్రభుత్వ కోటా (35శాతం సీట్లు) కింద పేద విద్యార్థులకు చదువుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లోని అధ్యాపక, మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి రాతపూర్వక పరీక్షలను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (వర్సిటీల్లో నియామకాలకు అదనపు ఫంక్షన్లు) చట్టం–2023లో సవరణ చేసింది. నిరుపేదలకు భూ పంపిణీ రాష్ట్రంలో భూదాన్–గ్రామదాన్ బోర్డును ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేసేలా చట్టాన్ని సవరించింది. భూదాన్ ఉద్యమకర్త వినోభా భావే, ఆయన నిర్దేశించిన వ్యక్తుల సమ్మతి ప్రకారమే భూదాన్ – గ్రామదాన్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ వినోభా భావే మరణించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది. ఆయన నిర్దేశించిన వ్యక్తులు ఎవరనేది స్పష్టత లేకపోవడంతో బోర్డు ఏర్పాటుకు అవాంతరాలేర్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వమే బోర్డును ఏర్పాటు చేసి భూదాన్ – గ్రామదాన్లోని భూమిని నిరుపేదలకు కేటాయించేలా చర్యలు చేపట్టేలా చట్టాన్ని సవరించింది. డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి జఫ్రీన్‌కు ఉద్యోగం రాష్ట్రానికి చెందిన డెఫ్ ఒలింపిక్ విజేత, అంతర్జాతీయ డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జఫ్రీన్‌కు వ్యవసాయ, సహకార శాఖలో సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్‌గా గ్రూప్–1 స్థాయి ఉద్యోగాన్ని కల్పిస్తూ ఏపీ పబ్లిక్ సర్వీసుల నియామకాలు క్రమద్ధీకరణ, సిబ్బంది తీరు, వేతన స్వరూపాన్ని హేతు బద్ధీకరించే చట్టం–1994ను సవరించింది. జఫ్రీన్ క్రీడారంగంలో దేశానికి అందించిన విశిష్ట సేవలను గౌరవిస్తూ ఈ ఉద్యోగాన్ని ఇచ్చింది. -
మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లు ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని స్వాగతించారు. బిల్లులో పేర్కొన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని, ఆమోదంలో ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా చూడాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాల్సిందిగా ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల క్రితం లేఖ రాసిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. ఇదే తరహాలో చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశ పెడితే తాము మద్దతు ఇస్తామని కవిత ప్రకటించారు. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత నివా సం వద్ద సంబురాలు జరి గాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరు తూ ఇటీవల 40కి పైగా రాజకీయ పార్టీల నేతలకు ఎమ్మెల్సీ కవిత లేఖలు రాసిన విషయా న్ని ప్రస్తావిస్తూ మిఠాయిలు పంచారు. -
ఇలా అమ్ముకోండి.. అలా కొనుక్కోండి
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లు, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ముగిసిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో)లు కరెంటును నేరుగా ఎవరికైనా అమ్ముకొనే అవకాశం కల్పించింది. ఏదైనా జెన్కో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినప్పుడు డిస్కంలతో పీపీఏ కుదర్చుకుంటుంది. ఇది సాధారణంగా 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ ఉంటుంది. ఈ ఒప్పందం గడువు ముగిసిన తరువాత కూడా డిస్కంలు అదే రేటుకి అదే జెన్కో ద్వారా విద్యుత్‌ను తీసుకునే వెసులుబాటు ఇప్పటివరకూ ఉంది. ఇప్పుడు కేంద్రం ఈ వెసులుబాటు లేకుండా చేసింది. గడువు ముగిసిన తరువాత కూడా అదే రేటుకి కొంటే జెన్కోలకు నష్టం వాటిల్లుతుందన్నది కేంద్రం చెబుతున్న కారణం. దీంతో జెన్కోలు పీపీఏల గడువు ముగిసిన తరువాత ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్ (ఐఈఎక్స్)లోగానీ, ఎక్కువ ధర ఇచ్చే డిస్కంలకు గానీ విద్యుత్‌ను విక్రయించుకోవచ్చు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటును పీపీఏలు ముగిసిన తరువాత విక్రయించేందుకు సెంట్రల్ పూల్ విధానాన్ని కేంద్రం కొత్తగా తీసుకువచ్చింది. కేంద్రానికి చెందిన పదహారు ప్లాంట్లలో విద్యుత్‌ను డిస్కంలు ముందస్తు దరఖాస్తు ద్వారా కొనుక్కొనే అవకాశం కలి్పంచింది. కొనుగోలు ఒప్పందాన్ని కూడా ఐదేళ్లకు పరిమితం చేసింది. పీపీఏలు చేసుకోగా మిగిలిన విద్యుత్‌ను ఐఈఎక్స్‌లో విక్రయిస్తారు. అంతా ఐఈఎక్స్‌లోనే విద్యుత్‌ను అమ్మాలన్నా, కొనాలన్నా ఇప్పుడు జెన్కోలు, డిస్కంలకు ఉన్న ప్రధాన మార్కెట్ ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అనుమతితో 2008 జూన్ 27న ప్రారంభమైన ఐఈఎక్స్ 2017లో స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీగా మారింది. అప్పటినుంచి విద్యుత్ క్రయ విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. 29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 55కు పైగా విద్యుత్ పంపిణీ సంస్థలు, 600కుపైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, 1800కుపైగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, 4,600కు పైగా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఐఈఎక్స్‌లో చేరాయి. గత నెలలో ఐఈఎక్స్‌లో 8,469 మిలియన్ యూనిట్ల లావాదేవీలు జరిగాయి. యూనిట్ సగటు ధర రూ.6.89గా ఉంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ లావాదేవీలకు జెన్కోలు, డిస్కంల నుంచి గరిష్టంగా యూనిట్‌కు 2 పైసలు రుసుమును (ఐఈఎక్స్) వసూలు చేస్తోంది. -
తప్పుడు ప్రచారం చేస్తే రుణాలు ఆపేస్తాం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై విద్యుత్ రంగానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేస్తే.. రుణాలు, సబ్సిడీలు ఆపేస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్. కె.సింగ్ హెచ్చరించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు, విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ విషప్రచారం చేస్తున్నారని, వ్యవసాయ పంపుసెట్లకు మినహా అన్నింటికి మీటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం స్పష్టం చేసిందని చెప్పారు. విద్యుత్ సంస్థల ఆడిట్ నివేదికలు, ఎనర్జీ ఆడిట్ ఎప్పటికప్పుడు చేయించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థలు రుణాలు చెల్లించే స్థితిలో లేవని తమకు సమాచారం అందిందని మంత్రి తెలిపారు. గురువారం ఇక్కడ మంత్రి ఆర్.కె. సింగ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, విద్యుత్ శాఖ సహాయ మంత్రి క్రిషన్‌పాల్ గుర్జర్లు ‘విద్యుత్ శాఖ’పై ఏర్పాటైన పార్లమెంట్ సభ్యుల కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆర్.కె. సింగ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) రూ.1.57 లక్షల కోట్ల రుణం మంజూరు చేస్తే అందులో ఇప్పటికే రూ. 1.38 లక్షల కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి రూ.1.10 లక్షల కోట్లు మంజూరు అయితే.. రూ.91 వేల కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తుంది..: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తుందని కేంద్ర మంత్రి ఆర్.కె. సింగ్ తేల్చి చెప్పారు. ఇప్పటికే ఒక్కొక్కటి 800 మెగావాట్ల రెండు యూనిట్లు సిద్ధమయ్యాయని, ఈనెల 26న ఒక యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తుందని, మరొకటి డిసెంబర్లో ఉత్పత్తి ప్రారంభిస్తుందని ఆయన వెల్లడించారు. వీటిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. మిగిలిన 2,400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలని ఎన్టీపీసీ కోరినా స్పందించడం లేదన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోయినా ఎన్టీపీసీ ఒక్కొక్కటీ 800 మెగావాట్లుగల మూడు యూనిట్లను నిర్మిస్తుందని తేల్చి చెప్పారు. కాగా, దేశం మొత్తాన్ని ఒకే గ్రేడ్ కిందకు తీసుకువచ్చి 1.97 లక్షల కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్లు వేసినట్లు చెప్పారు. తద్వారా దేశంలో ఏకకాలంలో 1.20 లక్షల మెగావాట్ల విద్యుత్‌ను ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరఫరా చేస్తే సామర్థ్యం ఏర్పడిందని మంత్రి వివరించారు. -
జీ20 నిర్వహణకు రూ.4,100 కోట్లా
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర భేటీని కేంద్ర ప్రభుత్వం విజయవతంగా నిర్వహించింది. అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచదేశాలు భారత్‌పై ప్రశంసలు కురిపించాయి. ప్రపంచ స్థాయి నేతగా ప్రధాని మోదీ మరోమారు తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇదే సమయంలో, జీ20 భేటీ కోసం బడ్జెట్ కేటాయింపులకు ఏకంగా 300 శాతం ఎక్కువగా రూ.4,100 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయడంపై కాంగ్రెస్, టీఎంసీ వంటి ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ‘ఇంత డబ్బు ఎక్కడికి పోయింది? మోదీ వ్యక్తిగత ప్రచారం కోసమే ప్రభుత్వం ఇన్ని కోట్లను ఖర్చుచేసింది. ఈ సొమ్మును బీజేపీ ఎందుకు చెల్లించకూడదు? అని పేర్కొన్నాయి. జీ20 భేటీ నిర్వహణ ఖర్చుల వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. ఈ నెల 4న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కొన్ని వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఉంచారు. జీ20 సదస్సు జరిగిన ప్రాంతంలో అభివృద్ధి పనులకు రూ.4,110.75 కోట్లు ఖర్చయినట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా రూ.3,600 కోట్లను ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీవో) పేరుతో ఖర్చయ్యాయి. మొత్తం ఖర్చులో ఇది 88 శాతం. ప్రగతి మైదాన్‌లోని ఐటీపీవో సముదాయం నిర్మాణానికైన వాస్తవ వ్యయం రూ.3,600 కోట్లు. దీనికే జీ20 శిఖరాగ్రం సందర్భంగా భారత్ మండపం అనే పేరు పెట్టారు. ఇది శాశ్వత నిర్మాణం, జీ20 బడ్జెట్‌తో దీనికి సంబంధం లేదు. 2017లో ఈ భవనం నిర్మాణానికి బడ్జెట్లో కేటాయింపులు రూ.2,254 కోట్లు కాగా, రహదారులు, టన్నెళ్ల నిర్మాణానికి మరో వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా.ఈ రెండింటిని కలుపుకుంటే భారత్ మండపం అభివృద్ధి వ్యయం రూ.3,200 కోట్లు దాటింది. రహదారులు, టన్నెళ్లు పోను భారత్ మండపం కాంప్లెక్స్ అభివృద్ధికి రూ.2,700 కోట్లు వెచ్చించినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) జూలై 26న ప్రకటించింది. వీటన్నిటినీ బేరీజు వేసుకుంటూ జీ20 నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రూ.4,100 కోట్లు దుబారా ఖర్చు చేసిందంటూ ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. ఈ విమర్శలపై చార్టెర్డ్ అకౌంటెంట్ గోపాల్ కేడియా ‘ఇండియా టుడే’తో మాట్లాడుతూ శాశ్వత మౌలిక వసతుల కల్పనకైన ఖర్చును జీ20 నిర్వహణ వ్యయంతో కలిపి చెప్పడం సరికాదన్నారు. ఈ నిర్మాణాలు భవిష్యత్తులో జరిగే మరెన్నో కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు వీలుందన్నారు. జీ20 షెర్పా అమితాబ్ కాంత్ ప్రతిపక్షాల విమర్శలకు స్పందిస్తూ.. బడ్జెట్లో కేటాయించిన రూ.990 కోట్ల కంటే చాలా తక్కువగా జీ20 శిఖరాగ్రానికి ఖర్చు చేసినట్లు చెప్పారు. పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుందన్నారు. -
ఎరువులను 24 గంటల్లో ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్ వద్ద నున్న కేంద్రం పంపించిన ఎరువుల ను 24 గంటల్లో రైతులకు ఇవ్వక పోతే...ఆ కార్యాలయాలను బీజేపీ కార్యకర్తలు ముట్టడించి ప్రజలకు పంపిణీ చేస్తారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 17న సభ కోసం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్ ఇవ్వా లంటూ కాంగ్రెస్ దరఖాస్తు చేసుకుంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ–బీఆర్ఎస్ ఒకటేనంటూ దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితల మధ్య వ్యాపార సంబంధాలు, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్లు కలిసి పోటీ చేయడంపై చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘ఇండియా దటీజ్ భారత్’.. ఇంత జరిగిందా?
ఒకే దేశం– ఒకే పన్ను విధానం తర్వాత ఒకే దేశం–ఒకే ఎన్నిక దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వేగంగా కదులుతున్నారు. ఇప్పుడు.. ఎవరూ ఊహించని విధంగా ఒకే దేశం – ఒకే పేరుపైనా నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు ఇండియా దటీజ్ భారత్ అని రాజ్యాంగంలోని ఒకటవ అధికరణంలో పొందుపర్చారు. ఒక దేశానికి రెండురకాల పేర్లు పెట్టారు. అసలు దేశానికి రెండు పేర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది...దాని వెనుక జరిగిందేమిటి ? ఇండియా దటీజ్ భారత్ అని మన రాజ్యాంగం చెపుతోంది. ఒకటో అధికరణం ప్రకారం దేశానికి రెండు పేర్లు పెట్టారు. ఇలా రెండు పేర్లు పెట్టడం వెనుక రాజ్యాంగ సభలో రెండురోజుల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. మన దేశ చారిత్రక వారసత్వానికి అనుగుణంగా భారత్ అని పేరు పెట్టాలని రాజ్యాంగసభ సభ్యులు సేత్ గోవింద్‌దాస్, హరి విష్ణు కామత్ వాదించారు. అంతేకాదు ఇండియా అనే ఆంగ్లపదం ఆంగ్లేయుల పాలనను సూచిస్తుందన్నారు. మరోవైపు హరిగోవింద్పంత్ భారత్వర్షగా దేశం పెట్టాలని సూచించారు. మరికొందరు సభ్యులు చైనా యాత్రీకుడు హ్యుయాన్ త్సాంగ్ తన రచనల్లో దేశం పేరును భారత్ పేర్కొన్నారని ఉదహరించారు. ఇండియా పేరు వలసరాజ్యానికి, పాశ్చాత్యుల ఆధిపత్యానికి గుర్తుగా ఉంటుందని వాదించారు. అయితే ఇండియా పేరు ఎలా చేర్చారు ? చారిత్రకంగా చూస్తే ఇండస్ నది (సింధు నది)కి ఇవతల ఉండే భూభాగాన్ని విదేశీయులు ఇండియాగా పిలిచారు. కాలక్రమంలో అది కొనసాగుతూ వచ్చింది. నిజానికి ఆంగ్లేయుల పాలనా కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 తీసుకువచ్చారు. మన రాజ్యాంగంలో చాలా అంశాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచే తీసుకున్నారు. ఆ తర్వాత 1947లో దేశ విభజన సమయంలో పెద్ద ఎత్తున రక్తపాతం జరిగింది. పాకిస్తాన్లో ఉన్న హిందువులు భారత్ వైపు, ఇక్కడున్న ముస్లింలు పాకిస్తాన్‌వైపు వెళ్లే ప్రయత్నంలో భారీ ఊచకోత జరిగింది. వేలాదిమంది చనిపోయారు. మైనార్టీలలో తీవ్రమైన ఆందోళనలు చెలరేగాయి. ఈ విభజన గాయాల నేపథ్యం రాజ్యాంగ సభ Constituent Assembly సభ్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. భారత్ అనే పేరు హిందుత్వాన్ని మాత్రమే సూచిస్తుందనే ఉద్దేశంతో, దేశంలోని ఉన్న భిన్న మతాలు, సంస్కృతుల నేపథ్యంలో ఇండియా పేరును కూడా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఇండియా పేరుపై నిర్వహించిన ఓటింగ్లోఅనుకూలంగా 51, వ్యతిరేకంగా 38 ఓట్లు వచ్చాయి. అటు భారత్, ఇండియా మధ్య సమన్వయం కోసం ఇండియా దటీజ్ భారత్ అని రెండు పేర్లను రాజ్యాంగంలోని మొదటి అధికరణంలో చేర్చారు. అయితే ఈ అంశంపై రాజ్యాంగసభలో వాడీవేడీ చర్చ జరిగిన సమయంలో రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ, పేర్లపైనా ఘర్షణపూరిత చర్చ కంటే, చేయాల్సిన అసలు పని చాలా ఉందని దానిపైనే దృష్టి పెట్టాలని కోరి ఈ చర్చకు ముగింపు పలికారు. ఇదీ చదవండి: భారత్ అనే పేరు ఎలా పుట్టిందంటే.. ఒకే దేశం–ఒకే పేరు ఒకే దేశం – ఒకే పన్ను, ఒకే దేశం – ఒకే ఎన్నిక, ఒకే దేశం– ఒకే చట్టం (ఉమ్మడి పౌరస్మృతి) అనే పాలసీని అమలు చేస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం త్వరలోనే ఒకే దేశం–ఒకే పేరు తో రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, దేశానికున్న రెండు పేర్లలో ఒకటి తొలగించి, భారత్‌ను శాశ్వతం చేయనున్నారు. :::నాగిళ్ల వెంకటేష్, డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్, సాక్షిటీవీ -
అనధికారిక లాక్ డౌన్లోకి సెంట్రల్ ఢిల్లీ!
ఢిల్లీ: జీ-20 సదస్సుకు రంగం సిద్ధమైంది. అధికారులు భారీ ఏర్పాటు చేశారు. దేశ రాజధానికి రానున్న ప్రతినిధులకు ప్రధాని మోదీ ఫొటోలతో స్వాగత తోరణాలు దర్శనమిస్తున్నాయి. ఆంక్షలతో సెంట్రల్ ఢిల్లీలో అనధికార లాక్డౌన్ కొనసాగుతోంది. లక్షమంది భద్రతా సిబ్భందితో సెంట్రల్ ఢిల్లీ పరిసరాలు శత్రుదుర్భేద్యంగా మారాయి. నేటి సాయంత్రం నుంచి సెప్టెంబర్ 10 వరకు సెంట్రల్ ఢిల్లీలోకి ఇతర వాహనాలు రాకుండా అనుమతిని నిషేధించారు అధికారులు. ఆంక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. అనుమతి ఉన్న వాహనాలు మినహా మిగిలిన వాటికి ఎంట్రీ ఉండదని అధికారులు తెలిపారు. जी-20 समिट ( दिनांक 9 व 10 सितंबर ) के दौरान, सुगम आवाजाही के लिए यातायात निर्देशिका। Traffic advisory in view of #G20Summit on Sept 9 & 10, 2023, to facilitate hassle free movement of vehicles. यातायात निर्देशिका/Traffic Advisory: https://t.co/fFgh2gcsAK pic.twitter.com/nEO09PFpf9 — Delhi Traffic Police (@dtptraffic) August 31, 2023 సెంట్రల్ ఢిల్లీలో నివాసం ఉండేవారు మినహా మిగిలిన వారికి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లపై వారం రోజుల నుంచి ఢిల్లీ పోలీసులు రిహార్సల్స్ చేస్తున్నారు. దాదాపు లక్ష మందికి పైగా భద్రత సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. భారత్ వేదికగా జీ-20 సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్నాయి. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు దేశ రాజధానికి హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సహా పలు ముఖ్యనేతలు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఇదీ చదవండి: మరో వివాదం: ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్' వంతు -
స్వైన్ ‘ఫ్లో’: వేగంగా విస్తరిస్తున్న వైరస్.. పదేళ్లలో 8,064 మంది మృతి!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా స్వైన్‌ఫ్లూపై ఓ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2014 సంవత్సరం నుంచి ఈ ఏడాది జూలై వరకు అంటే దాదాపు పదేళ్లలో దేశవ్యాప్తంగా 1.47 లక్షల మందికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకింది. అందులో 8,064 మంది చనిపోయినట్టు కేంద్ర నివేదిక వెల్లడించింది. ఆ వివరాలను తెలంగాణ వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 2015 సంవత్సరంలో అత్యధికంగా దేశంలో 42,592 మందికి స్వైన్‌ఫ్లూ సోకగా, అందులో ఏకంగా 2,990 మంది చనిపోయారు. ఆ తర్వాత అత్యధికంగా 2017లో 38,811 మందికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకగా, అందులో 2,270 మంది చనిపోయినట్టు కేంద్ర నివేదిక తెలిపింది. 2014లో మాత్రం 937 మందికి స్వైన్‌ఫ్లూ రాగా, 218 మంది చనిపోయారు. దేశంలో వాతావరణ పరిస్థితులు, తీసుకునే జాగ్రత్తలపైనే దాని విస్తరణ, మరణాలు ఆధారపడి ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది. ఈ ఏడు నెలల్లోనే 2,783 కేసులు దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఈ ఏడు నెలల కాలంలో 2,783 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, 52 మంది చనిపోయారు. గతేడాది దేశంలో 13,202 మందికి సోకగా, 410 మంది చనిపోయారు. ఇవిగాక కొందరు రోగులు నేరుగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడంతో అవి రికార్డుల్లోకి ఎక్కడంలేదని అంటున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు స్వైన్‌ఫ్లూ భయం పెట్టి వేలకు వేలు గుంజుతున్నాయి. చివరకు అక్కడ తగ్గకపోవడంతో కొన్ని కేసులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. స్వైన్‌ఫ్లూపై నిరంతర అవగాహన కల్పించడం, నియంత్రణ చర్యలు తీసుకోవడమే పరిష్కారమని నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ మాదల చెబుతున్నారు. జాగ్రత్తలే శ్రీరామరక్ష... గుంపులున్న చోట తిరగకుండా చూసుకోవాలి. గుంపుల్లో తిరిగితే ఒకరి నుంచి మరొకరికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకే ప్రమాదముంది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. అవకాశముంటే రక్షణ కవచంగా గ్లౌవ్స్ తొడుక్కోవాలి. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, అధిక జ్వరం ఉండి, స్వైన్‌ఫ్లూ అనుమానం వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. బీపీ, స్థూలకాయం, షుగర్, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి స్వైన్‌ఫ్లూ త్వరగా సోకే అవకాశముంది. కాబట్టి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు... తీవ్రమైన జ్వరం వస్తుంది. దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు ఉంటాయి. జ్వరం ఒక్కోసారి అధికంగా ఉంటుంది. తలనొప్పి కూడా తీవ్రంగానే ఉంటుంది. పిల్లల్లో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య ఎదురవుతుంది. ఒక్కోసారి చర్మం బ్లూ లేదా గ్రే కలర్లోకి మారుతుంది. దద్దుర్లు వస్తాయి. ఒక్కోసారి వాంతులు కూడా అవుతాయి. నడవడమూ కష్టంగానే ఉంటుంది. ఇక పెద్దల్లో అయితే కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీనొప్పి, కడుపునొప్పి కూడా ఉంటుంది. నిరంతరాయంగా వాంతులు అవుతాయి. -
విశాఖ తీరం..క్రూయిజ్ విహార కేంద్రం
అంతర్జాతీయ నగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ సిటీ సిగలో మరో ప్రతిష్టాత్మక పర్యాటక మణిహారం చేరుతోంది. అంతర్జాతీయ స్థాయి సముద్ర విహారానికి ఆసక్తి చూపే పర్యాటకుల కోసం విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ ముస్తాబైంది. వివిధ దేశాల పర్యాటకులు క్రూయిజ్‌లో వచ్చి మహా విశాఖ నగరంలో పర్యటించేలా ఈ టెర్మినల్‌లో వివిధ ఏర్పాట్లు చేశారు. పోర్టులోని గ్రీన్ చానల్ బెర్త్‌లో రూ.96.05 కోట్లతో నిర్మించిన ఈ సముద్ర విహార కేంద్రాన్ని క్రూయిజ్ షిప్స్‌తోపాటు భారీ కార్గో నౌకల హ్యాండ్లింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ క్రూయిజ్ టెర్మినల్‌ను సోమవారం కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రారంభించనున్నారు. అనంతరం ట్రయల్స్ నిర్వహించేందుకు పోర్టు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.– సాక్షి, విశాఖపట్నం ఏపీ టూరిజంతో కలిసి... ఈ టెర్మినల్ నిర్వహణలో ఏపీ టూరిజం, కేంద్ర టూరిజం శాఖలతో కలిసి విశాఖపట్నం పోర్టు పని చేయనుంది. భారత్‌లో క్రూయిజ్ టూరిజానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 7.1 యూఎస్ బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. రానున్న పదేళ్లలో 12.1 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్ రంగం 1.17 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. క్రూయిజ్ సేవలు ప్రారంభమైతే రాష్ట్రంలో ఇంటర్నేషనల్ టూరిజం గణనీయంగా పెరగనుంది. ఇవీ విశాఖ క్రూయిజ్ టెర్మినల్ ప్రత్యేకతల్లో కొన్ని... 2,500 చదరపు మీటర్లలో టెర్మినల్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, విదేశీ కరెన్సీ మార్పిడి కౌంటర్లు, గ్యాంగ్ వే, రెస్టారెంట్, స్పెషల్ లాంజ్, షాపింగ్, రెస్ట్ రూమ్స్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్లు ఏర్పాటు చేసే విధంగా నిర్మాణాలు పూర్తిచేశారు. క్రూయిజ్‌లో వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల చెకింగ్ కోసం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ క్యాబిన్స్, పర్యాటకులు సేదతీరేందుకు టూరిస్ట్ లాంజ్ నిర్మించారు. టెర్మినల్ పార్కింగ్ ప్రాంతంలో 7 బస్సులు, 70 కార్లు, 40 బైక్‌లు నిలిపేలా ఏర్పాట్లు చేశారు. గంటకు 200 కి.మీ. వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా షోర్ ప్రొటెక్షన్ వాల్ కూడా ఇందులో నిర్మిస్తున్నారు. రెగ్యులర్ బెర్త్ 180 మీటర్ల పొడవు కాగా.. ఈ టెర్మినల్‌లో 330 మీటర్ల భారీ పొడవైన క్రూయిజ్ బెర్త్ నిర్మించారు. 15 మీటర్ల వెడల్పు, 9.50 మీటర్ల డ్రెడ్జ్ డెప్త్‌ని నిర్మించారు. తద్వారా క్రూయిజ్ రాని సమయంలో సరుకు రవాణా చేసే భారీ కార్గో నౌకలను కూడా ఈ బెర్త్‌లోకి అనుమతించేలా డిజైన్ చేశారు. స్థానికులకు ఉపాధి పెరుగుతుంది గరిష్టంగా 2,000 మంది టూరిస్టులకు సరిపడా సౌకర్యాలతో క్రూయిజ్ టెర్మినల్ భవనాన్ని సుందరంగా నిర్మించాం. ఈ టెర్మినల్ కేవలం పర్యాటకంగానే కాకుండా స్థానికులకు ఉపాధి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. క్రూయిజ్ షిప్స్‌లో వచ్చే టూరిస్టులు స్థానిక దుకాణాల్లో షాపింగ్స్ చేయడం, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించడం... ఇలా ఎన్నో విధాలుగా మేలు కలగనుంది. సందర్శనీయ స్థలాల్లో పర్యటించడం వల్ల స్థానికంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభించిన తర్వాత ట్రయల్ నిర్వహిస్తాం. ఇప్పటికే రెండు భారీ ఆపరేటర్ సంస్థలు పోర్టుతో సంప్రదింపులు జరుపుతున్నాయి. వింటర్ సీజన్లో కొత్త టెర్మినల్ నుంచి సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.– డాక్టర్ అంగముత్తు,విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్ -
పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఎందుకంటే..?
ఢిల్లీ:జమిలి ఎన్నికల అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ప్రస్తుతం కమిటీ మాత్రమే ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీ అందించిన రిపోర్టుపై చర్చలు ఉంటాయి. పార్లమెంట్ పరిపక్వమైనది, ఆందోళన పడవద్దు అని చెప్పారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఎజండాపై కూడా 3-4 రోజుల్లో తెలుపుతామని ఆయన చెప్పారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లివంటిది అని ఆయన వ్యాఖ్యానించారు. #WATCH | On 'One nation, One election', Union Parliamentary Affairs Minsiter Pralhad Joshi says "Right now, a committee has been constituted. A report of the committee will come out which be discussed. The Parliament is mature, and discussions will take place, there is no need to… pic.twitter.com/iITyAacPBq — ANI (@ANI) September 1, 2023 జమిలి ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం కమిటీని నియమింటిన విషయం తెలిసిందే. అటు.. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను జరపనున్నట్లు ప్రకటించింది. దీంతో జమిలీ ఎన్నికలను కేంద్రం నిర్వహించడానికి సిద్ధమైందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. VIDEO | "How can the government take unilateral decisions without consultation with political parties and Parliament?" says CPI general secretary D Raja on reports of the central government forming a committee to explore the possibility of 'one nation one election'. pic.twitter.com/RXjYuI19Xx — Press Trust of India (@PTI_News) September 1, 2023 'ఇతర పార్టీల అభిప్రాయాలను సంప్రదించకుండానే ఏ విధంగా జమిలి ఎన్నికలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు?. అందరి అభిప్రాయాలు తీసుకుని, చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి' కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజ విమర్శించారు. నిష్పాక్షికమైన ఎన్నికలు కావాలని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. ఈ అంశాన్ని దృష్టి మళ్లించడానికే జమిలి ఎన్నికలను తెరమీదకు తెస్తున్నారు. VIDEO | "The country is already one, is anyone questioning that? We demand fair election, not 'one nation one election'. This funda of 'one nation one election' is being brought to divert the attention from our demand of fair election," says Shiv Sena (UBT) leader @rautsanjay61… pic.twitter.com/9phqvFiqCv — Press Trust of India (@PTI_News) September 1, 2023 ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు.. -
2025 జూన్‌కు పోలవరం తొలి దశ పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలి దశను 2025 జూన్‌కి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదన అమలుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, కేంద్ర జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తదితరులతో పోలవరం పనులపై సమీక్షించారు. డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్ దెబ్బతినడానికి దారితీసిన పరిస్థితులు, కారణాలపై మరింత లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాఫర్ డ్యామ్‌లలో లీకేజీలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి, వాటిని మరింత పటిష్టం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణులతో అధ్యయనం చేయించాలని సూచించారు. డిజైన్ల ప్రతిపాదన, ఆమోదం నుంచి పనులు చేపట్టడం వరకూ పీపీఏ పాత్ర మరింత పెరగాలన్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల మాత్రమే కొత్తగా డయాఫ్రమ్ వేస్తే సరిపోతుందా? అనే అంశంపై ఏం నిర్ణయం తీసుకున్నారని సీడబ్ల్యూసీని ప్రశ్నించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే మొగ్గుచూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని, దానిపై మరింత లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్ వోరా చెప్పారు. కాఫర్ డ్యామ్‌లను మరింత పటిష్టం చేయడం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులతో చర్చించి నాలుగైదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంకు పంకజ్‌కుమార్ సూచించారు. ఈ నివేదికల ఆధారంగా మరో సారి సమావేశమై కాఫర్ డ్యామ్‌ల పటిష్టత, డయాఫ్రమ్ వాల్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గోదావరిలో వరదలు తగ్గేలోగా వాటిపై తుది నిర్ణయం తీసుకంటే ఈ సీజన్లో పూర్తి స్థాయిలో పనులు చేపట్టవచ్చని, తద్వారా గడువులోగా ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుందని వివరించారు. ఇదీ చదవండి: దోచుకునే బుద్ధి మీది రామోజీ! -
కేంద్ర నిధులపై ప్రజలకు నివేదికలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద తెలంగాణకు కేటాయించిన, విడుదల చేసిన నిధుల వివరాలతో నివేదికలు విడుదల చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో వీటిని వెలువరించనున్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రూపాల్లో పెద్దెత్తున నిధులు కేటాయిస్తూ విడుదల చేస్తున్నా.. తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందంటూ కేసీఆర్ ప్రభుత్వం, అధికార బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఇది దోహదపడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, సెప్టెంబర్ రెండో వారంలోగా అన్ని జిల్లా, అసెంబ్లీ కేంద్రాల్లో ‘పవర్‌పాయింట్ ప్రజెంటేషన్’ ద్వారా మోదీ ప్రభుత్వం వివిధ శాఖలు, రంగాలకు కేటాయించిన నిధులకు సంబంధించిన గణాంకాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఆయా వివరాలతో బుక్లెట్లు, కరపత్రాలు కూడా పంపిణీ చేయాలని తీర్మానించారు. గతంలోనే కిషన్‌రెడ్డి రిపోర్ట్ కార్డ్ హైదరాబాద్‌లో గత జూన్ 17న కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ‘ప్రజలకు మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల రిపోర్ట్ కార్డ్–తెలంగాణ అభివృద్ధికి అందించిన సహకారం’ పేరిట పవర్‌పాయింట్, డిజిటల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్రం నుంచి అందిన సాయానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖలు, రంగాల వారీగా తెలంగాణకు అందిన నిధులు, గ్రాంట్లకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలో సోమవారం పార్టీ సీనియర్ నేత డా.ఎస్.మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్, తొమ్మిదేళ్ల అభివృద్ధిపై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. 17లోగా అవగాహన కల్పించాలి కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా ప్రజలకు వివరించాలని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాలు, వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. గత తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వ పాలనలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, అభివృద్ధిలో కేంద్రం పాత్రకు సంబంధించిన వివరాలు గడపగడపకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి సమావేశాల్లో వివిధ రంగాల ప్రముఖులు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, డాక్టర్లు, ఇంజనీర్లు, రిటైర్డ్ అధికారులను భాగస్వామ్యం చేసుకుంటూ సెప్టెంబర్ 17లోగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కిషన్‌రెడ్డి సూచించారు. -
కాళేశ్వరంపై సందేహాలన్నీ తీర్చండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం, మనుగడ, సుస్థిరతలపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లేననెత్తిన సందేహాల్లో కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని, వాటికి కూడా బదులిస్తే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీని పరిశీలిస్తామని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినట్లు తెలిసింది. జీఎస్టీ సమావేశంలో పాల్గొనేందుకు గత జూలైలో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అక్కడ జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు సత్వరమే అనుమతులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తాజాగా షెకావత్ స్పందించారు. మంత్రి హరీశ్‌రావు స్వయంగా లేఖ రాశారు. సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణలు అసంపూర్ణంగా ఉన్నాయని, అన్ని అంశాలపై సమగ్ర సమాధానాలను ఇవ్వాలని లేఖలో కోరినట్టు తెలిసింది. ఆ వెంటనే ప్రాజెక్టుకు అనుమతుల జారీ ప్రక్రియను పునరుద్ధరిస్తామని కూడా తెలియజేసినట్టు సమాచారం. ఇబ్బందికర ప్రశ్నలు..క్లుప్తంగా వివరాలు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులకు చేసిన వ్యయం, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు యూనిట్‌కు రూ.3 చొప్పున విద్యుత్ సరఫరాకు తెలంగాణ ఈఆర్సీ అనుమతి ఇచ్చిందా? ప్రస్తుత విద్యుత్ చార్జీలు ఎంత? విద్యుత్ చార్జీల భారం దృష్ట్యా భవిష్యత్తులో ప్రాజెక్టు ఆర్థికంగా మనుగడ సాధిస్తుందా? ప్రాజెక్టు సుస్థిర మనుగడకు ఉన్న ఆర్థిక వనరులు ఏమిటి ? ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఎంత? రుణాలు, వడ్డీల రేట్లు ఎంత? తదితర వివరాలను అందజేయాలని కోరుతూ గతేడాది సెప్టెంబర్ 29న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది. గతేడాది జూలైలో గోదావరికి వచ్చిన వరదల్లో మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌస్‌లు ఎందుకు మునిగాయి? పంప్‌హౌస్‌లు, సర్విస్ బే ఎత్తుఎంత? జలాశయాల ఎఫ్ఆర్ఎల్ ఎంత? లాంటి సాంకేతిక అంశాలపై కూడా ఆరా తీసింది. అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన అన్ని కాంపోనెంట్ల డిజైన్లను సమర్పించాలని సూచించింది. దూర ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణాలు, ప్రాజె క్టు కాస్ట్ బెనిఫిట్ రేషియో వివరాలనూ అడిగింది. సీడబ్ల్యూసీ అడిగిన సమాచారం చాలావరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండడంతో వివరాలు క్లుప్తంగా అందజేసినట్టు తెలిసింది. కాగా ఈ సమాచారంపై సంతృప్తి చెందకపోవడంతోనే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీ ప్రక్రియ ను సీడబ్ల్యూసీ నిలుపుదల చేసినట్టు సమాచారం. -
శ్రీశైలంలో ఆగని విద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఆంధ్రలోని కుడిగట్టులో స్వల్పంగా.. తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. శ్రీశైలం నీళ్లపై ఆధారపడి ఉన్న ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన నిలిపివేయాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆదేశించినా ఖాతరు చేయకుండా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తోంది. కాగా, శుక్రవారం నుంచి శనివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 0.192 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను, ఎడమగట్టు కేంద్రంలో 7.975 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్‌కు 15,685 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్‌వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 6,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయానికి గత 4 రోజులుగా వరద ప్రవాహం నిలిచిపోయింది. మరోవైపు దిగువ ప్రాంతాలకు నీరు విడుదల అవుతుండడంతో జలాశయంలో నీటిమట్టం తగ్గిపోతుంది. ప్రస్తుతం జలాశయంలో 119.7828 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. నీటిమట్టం 864.30 అడుగులకు చేరుకుంది. -
పాలమూరుకు లైన్ క్లియర్!
కుట్రలను ఛేదించి.. కేసులను అధిగమించి.. పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులపై మంత్రి హరీశ్‌రావు ట్వీట్ సాక్షి, హైదరాబాద్: కుట్రలను ఛేదించి, కేసులను అధిగమించి పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ పర్యావరణ అనుమతులు సాధించారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానుంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించడం సీఎం కేసీఆర్ సాధించిన మరో అపూర్వ, చరిత్రాత్మక విజయం..’’అని హరీశ్ పేర్కొన్నారు. కేసీఆర్ మొక్కవోని దీక్షకు, ప్రభుత్వం పట్టువిడవని ప్రయత్నం తోడుగా సాధించిన ఫలితం ఇదని.. పాలమూరు బిడ్డల దశాబ్దాల కల సాకారమైన సందర్భంగా మాటల్లో వర్ణించలేని మధుర ఘట్టమని అభివర్ణించారు. సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ (ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ/ఈఏసీ) పలు షరతులతో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫార్సు చేసింది. గత నెల 24న జరిగిన సమావేశం నిర్ణయాలు తాజాగా వెలువడ్డాయి. దీంతో త్వరలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ కానున్నాయి. రూ.55,086.57 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కింద 6 జిల్లాల్లోని 70 మండలాల పరిధిలో మొత్తం 8,83,945 హెక్టార్ల ఆయకట్టుకు ప్రభుత్వం నీరు అందించనుంది. ఆ అధికారులపై చర్యలు తీసుకున్నాకే.. పర్యావరణ అనుమతులు లేకుండానే పనులను చేపట్టినందుకుగాను.. ప్రాజెక్టును ప్రతిపాదించిన అధికారి (ప్రాజెక్టు ప్రపోనెంట్)పై పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోని సెక్షన్ 19 కింద రాష్ట్ర ప్రభుత్వం/కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ షరతు విధించింది. పర్యావరణ అనుమతుల జారీకి ముందే ఈ చర్యల వివరాలను సమర్పించాలని.. అనుమతులు జారీ చేసే వరకు పనులేవీ చేపట్టరాదని స్పష్టం చేసింది. రూ.106 కోట్ల జరిమానా.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో.. పర్యావరణ ప్రభావం మదింపు (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్/ఈఐఏ) నోటిఫికేషన్ 2006ను నీటిపారుదల శాఖ ఉల్లంఘించినట్టు నిపుణుల మదింపు కమిటీ గతంలోనే నిర్థారించింది. ఇలాంటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల జారీకి ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను అమలు చేయాల్సి ఉంటుందని తేల్చింది. ఈ క్రమంలో.. పర్యావరణ పునరుద్ధరణకు రూ.72.63 కోట్లు, ప్రకృతి వనరుల వృద్ధికి రూ.40.2 కోట్లు, సామాజిక వనరుల అభివృద్ధికి రూ.40.8 కోట్లు కలిపి మొత్తం రూ.153.7 కోట్లతో ఎస్ఓపీ ప్రణాళికలు అమలు చేస్తామని నీటిపారుదల శాఖ ప్రతిపాదించగా.. నిపుణుల కమిటీ ఆమోదించింది. ఈ మొత్తానికి ఐదేళ్ల బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని షరతు విధించింది. ఇక అనుమతులు లేకుండానే రూ.21,200 కోట్లతో పనులు చేసినందున.. నిబంధనల ప్రకారం అందులో 0.5శాతం (రూ.106 కోట్లు) జరిమానాగా పీసీబీకి చెల్లించాలని ఆదేశించింది. కోర్టు కేసుల చిక్కులు తొలగినట్టే! పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను నిలిపేయాలని గతంలో ఎన్జీటీ ఆదేశించింది. అయినా పనులు కొనసాగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానకి రూ.920.85 కోట్ల భారీ జరిమానా కూడా విధించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే పొందింది. తాగునీటి అవసరాల కోసం 7.15 టీఎంసీలను మాత్రమే తరలించేలా ప్రాజెక్టు పనులకు సుప్రీం నుంచి అనుమతులు పొందింది. కానీ ఏకంగా 120 టీఎంసీల నీటి తరలింపునకు వీలుగా ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేస్తోందని ధ్రువీకరిస్తూ కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు తాజాగా సుప్రీంకోర్టులో సంయుక్తంగా అఫిడవిట్ దాఖలు చేశాయి. దీంతో కోర్టు ధిక్కరణ చర్యలకు ఆస్కారం ఉండటంతో నీటిపారుదల శాఖవర్గాలు ఆందోళనలో పడ్డాయి. అక్టోబర్ 6న సుప్రీంకోర్టులో దానిపై విచారణ జరగనుండగా.. ఆలోపే ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల విషయంలో న్యాయపరమైన చిక్కులు తొలగిపోనున్నాయి. నిపుణుల కమిటీ షరతుల్లో ముఖ్యమైనవి పర్యావరణ/సామాజిక నష్టాన్ని నిర్దేశిత గడువులోగా పునరుద్ధరించాలి. మూడేళ్లలోగా రూ.153.7 కోట్లతో నష్ట నివారణ ప్రణాళిక అమలు పూర్తి చేయాలి. ఎన్జీటీ ఆదేశాల మేరకు నియమించిన నిపుణుల కమిటీ సూచనల మేరకు నష్ట నివారణ చర్యలుండాలి. అన్ని రిజర్వాయర్లకు 500 మీటర్ల దూరం వరకు పెద్దెత్తున మొక్కలు నాటి అందులో కనీసం 90శాతాన్ని సంరక్షించాలి. వాటర్షెడ్ల అభివృద్ధి ప్రణాళిక, వన్యమృగాల సంరక్షణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలి. ప్రాజెక్టు ఉద్యోగాలు, ఇతర అవకాశాల్లో స్థానిక గ్రామస్తులకు, నిర్వాసితుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఎల్రక్టీ్టషియన్, ఫిట్టర్, వెల్డర్ వంటి వృత్తుల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో తాగునీరు, వైద్యం వంటి మౌలిక వసతులు కల్పించాలి. ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామస్తులకు సోలార్ ప్యానెళ్లు అందజేయాలి. ప్రభావిత గ్రామాల్లో బయో గ్యాస్ ప్లాంట్లు నెలకొల్పాలి. -
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచనున్నారా..? కేంద్రం క్లారిటీ..
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచనున్నారనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రిటైర్మెంట్ వయస్సును మార్చబోమని స్పష్టం చేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలుకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. 'కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడం గానీ, తగ్గించడం గానీ ఉండదు' అని కేంద్ర సిబ్బంది వ్వవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే.. లోక్‌సభలో నేడు ఉద్యోగులకు గరిష్ఠంగా 30 ఏళ్ల సర్వీసు కాలం పూర్తి చేసి రిటైర్మెంట్ ఇచ్చే ప్రతిపాదన ఉందా? అని కేంద్రాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై కేంద్రం సమాధానం ఇచ్చింది. గత మూడేళ్లలో 122 మంది ఉద్యోగులు నిర్బంధ పదవీవిరమణ చేశారని లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. యంత్రాంగాన్ని బలోపేతం చేసే దిశగా డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్ వినియోగం, రూల్స్‌ను సరళించడం వంటి మార్పులు చేసినట్లు పేర్కొంది. 730 రోజుల చైల్డ్ కేర్ సెలవులు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు తమ పిల్లల సంరక్షణ కోసం మొత్తం సర్వీసులు గరిష్ఠంగా 730 రోజుల సెలవులు తీసుకోవచ్చని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పిల్లల్లో మొదటి సంతానం 18 ఏళ్లు వచ్చే వరకు ఈ సెలవులకు అర్హత ఉంటుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: పేరు మార్చుకోనున్న కేరళ! -
మహారాష్ట్రలో గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచుతాం
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రతో పాటు యావత్ భారతదేశంలో వెనుకబాటుతనం కనిపిస్తోందని రైతులు, పేదల ప్రగతి లక్ష్యంగా రైతు ప్రభుత్వం ఏర్పడాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. అబ్ కీ బార్ సర్కార్ నినాదంతో రైతు ప్రభుత్వం ఏర్పాటు మినహా తమకు వేరే కోరికలేవీ లేవన్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్‌లు సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన నేతలకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్రలో 48, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు కలుపుకుని మొత్తం 65 సీట్లలో బీఆర్ఎస్ విజయం సాధిస్తే కేంద్రం మెడలు వంచలేమా అని కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి ఉండదని, ఈ రకంగా దేశానికి నేతృత్వం వహించే అవకాశం మహారాష్ట్రకు దక్కుతుందన్నారు. అంబానీ, ఆదానికి అప్పగించి.. దేశంలో నిల్వ ఉన్న 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలతో 150 ఏళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నా ఆ్రస్టేలియా, ఇండోనేషియా నుంచి కొనుగోలు ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు. అంబానీ, ఆదానీకి అప్పగించి విద్యుత్ బిల్లులు పెంచేందుకు కేంద్రం వింత చేష్టలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను మహారాష్ట్ర నుంచి 20వేల మంది స్వయంగా చూసివెళ్లారని చెప్పారు. దేశంలో నెలకొన్న సమస్యలను తొలగించడానికి కొత్త పార్టీ అవసరముందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే మహారాష్ట్రలో రెండు మూడేళ్లలో వెలుగు జిలుగులు వస్తాయన్నారు. త్వరలో బుల్డానా జిల్లా నుంచి 100 శాతం మంది సర్పంచులు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్రలో లభిస్తున్న ఆదరణను చూస్తుంటే వందకు వంద శాతం మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభు త్వం ఏర్పడుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీష్, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన చైర్మన్ వేణుగోపాలచారి, మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇంచార్జి వంశీధర్ రావు, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, సోలాపూర్ నేత నగేష్ పాల్గొన్నారు. బీఆర్ఎస్కు తోకముడిచి కోతలు ఎత్తేశారు మహారాష్ట్రలో బీఆర్ఎస్ కాలు పెట్టడంతో తోక ముడిచి విద్యుత్ కోతలు ఎత్తేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ మోడల్ అమలు చేయాలని సూచించిన కేంద్రేకర్ అనే ఐఎఎస్ అధికారిని సీఎం, మంత్రులు బెదిరించి రాజీనామా చేయించారని ఆరోపించారు. అక్కడ తెలంగాణ మోడల్ అమలుకు రూ.49వేల కోట్లు మాత్రమే అవసరమవుతాయని, సంపద కలిగిన ఆ రాష్ట్రంలో ఆదాయం ఏమవుతోందని ప్రశ్నించారు. ఇప్పటివరకు మహారాష్ట్రను పాలించిన కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్సీపీ సమస్యలను ఎందుకు దూరం చేయలేకపోయాయని నిలదీశారు. సాగునీరు లేక మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, మహారాష్ట్రలో ఇప్పటికే 70వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, మరో లక్ష మంది అదే బాటలో ఉన్నట్లుగా తనకు తెలిసిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర రక్షణశాఖ, ఆర్మీ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమవుతోందని.. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వస్తుండటం మంచి పరిణామమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. కంటోన్మెంట్‌ను హైదరాబాద్‌లో కలపాలన్నది ఆ నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే సాయన్న కల అని, ఇప్పుడు అది నెరవేరే సమయం వచ్చిందని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11.30కు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. జాతీయ గీతాలాపన అనంతరం స్పీకర్ సూచన మేరకు కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘సాయన్న నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, వివిధ హోదాల్లో పనిచేశారు. ఎలాంటి సమయంలో అయినా చిరునవ్వుతో, అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి. ఏదైనా ప్రయత్నం చేసి కంటోన్మెంట్‌ను హైదరాబాద్‌లో కలిపితే బాగుంటుందని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఆర్మీ నిబంధనలు కఠినంగా ఉండటంతో బలహీన వర్గాలకు కాలనీ కట్టాలన్నా ఇబ్బందిగా ఉందనేవారు. ఆయన విజ్ఞప్తి మేరకు పలుమార్లు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాం. కేంద్ర ప్రభుత్వం కూడా కంటోన్మెంట్లను నగర పాలకవర్గాల్లో కలపాలని నిర్ణయానికి వస్తున్నట్టు శుభవార్త అందింది.ఈ రకంగా సాయన్న కోరిక నెరవేరుతోంది. ఆయన లేని లోటు తీర్చలేనిది..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. అనంతరం సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. సంతాపం తీర్మానంపై మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, తలసాని, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి తదితరులు మాట్లాడారు. తర్వాత ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే విజయరామారావు మృతి పట్ల కూడా సభ సంతాపం ప్రకటించింది. తర్వాత సమావేశాలను శుక్రవారం ఉదయానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మొత్తంగా తొలిరోజున 27 నిమిషాల పాటు అసెంబ్లీ కొనసాగింది. -
గుదిబండ.. ‘అప్పు’డే!.. పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు మరోసారి వెలుగులోకి
సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అప్పులపై టీడీపీతో పాటు దాని అనుబంధ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనతో మరోసారి తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన అప్పులు రూ.1,77,991 కోట్లు మాత్రమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. 2019 నాటికి ఏపీకి రూ.2,64,451 కోట్లు అప్పులుండగా 2023 మార్చి నాటికి రూ.4,42, 442 కోట్లకు చేరినట్లు తెలిపారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అసెస్ చేస్తోందా? 2019 మే నుంచి ఏపీ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది? ఆర్థిక పరిస్థితిని అంచనా వేశారా?..’’ అంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) నిబంధనల మేరకు వ్యవహ రిస్తోందని తేల్చి చెప్పారు. ద్రవ్యలోటు తగ్గింపు, వివేకంతో కూడిన రుణ నిర్వహణ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల్లో సుస్థిరత, పారదర్శకతను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఎఫ్ఆర్బీఎంను అసెంబ్లీ పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను, ఆర్ధిక పరిమితులను అమలు చేస్తున్నారా.. లేదా? అనే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన వ్యయ విభాగం పరిశీలన చేస్తూ ఉంటుందని వివరించారు. కాకి లెక్కలతో పరిపాటిగా.. టీడీపీ దుష్ప్రచారానికి నిత్యం వంత పాడుతున్న ఎల్లో మీడియా అప్పులపై తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో మరోసారి తేటతెల్లమైంది. ఒకసారి రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారని, మరోసారి రూ.పది లక్షల కోట్ల అప్పులంటూ కాకి లెక్కలతో కథలు అల్లటం ఎల్లో మీడియాకు రివాజుగా మారింది. ఈ విష ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నా రహస్యంగా అప్పులను దాచారనే విధంగా ఎల్లో మీడియా అవాస్తవాలను వండి వారుస్తోంది. పరిమితులకు లోబడే అప్పులు తీసుకుంటున్నామని, టీడీపీ హయాంతో పోలిస్తే పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలు స్పష్టం చేసింది. తీసుకున్న అప్పులను సామాజిక హితం కోణంలోనే ఖర్చు చేస్తోంది. భారీగా సంక్షేమ పథకాలు, నగదు బదిలీతో పేదలకు లబ్ధి చేకూరుస్తోంది. కోవిడ్ సమయంలోనూ డీబీటీతో పేదలను ఆదుకోవడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తి క్షీణించకుండా చర్యలు తీసుకుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ మందగమనం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఇవన్నీ ముమ్మాటికీ నిజమని రుజువైంది. ఈ గణాంకాలను ఆర్బీఐ నివేదిక ప్రకారం వెల్లడిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. ఇప్పటికైనా పాఠకులకు తప్పుడు సమాచారాన్ని చేరవేయకుండా విశ్వసనీయతతో జర్నలిజం విలువలను పాటించాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
కేంద్రం నిధులతోనే ఉప్పల్–వరంగల్ ‘కారిడార్’ నిర్మాణం
ఉప్పల్: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే ఉప్పల్–వరంగల్ జాతీయ రహదారి (ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్) పనులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. నిర్మాణ పనులు పనులు 28 నుంచి పునఃప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు. ఉప్పల్ స్కై ఓవర్ నిర్మాణ పనులలో జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్లే జాప్యం జరుగుతుండటాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తాను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. యుద్ధ ప్రాతిపదిక ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయాలని కోరామన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి జులై 24న అవసరమైన నిధుల విడుదలకు అనుమతి మంజూరు చేశానారన్నారు. ఈ నెల 28 నుంచి పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి అదేశించారని ప్రభాకర్ వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎం కేసీఆర్ వెంటనే తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ద్వారా రోడ్డుకు ఇరువైపులా బీటీ రోడ్డు వేస్తామని ప్రకటన చేయించారని ఎద్దేవాచేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని రోడ్డు వేయిస్తుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ కోరారు. దాన్ని మేమే వేస్తున్నామన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కపట నాటకానికి తెర తీసిందని ఆయన విమర్శించారు. -
ఆపకపోతే చర్యలు తప్పవు.. 15 వెబ్సైట్లకు కేంద్రం నోటీసులు!
నిషేధిత ఈ-సిగరెట్లపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ- సిగరెట్ల ప్రచారం, విక్రయాలు జరుపుతున్న వెబ్సైట్లపై కొరడా ఘుళిపించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ-సిగరెట్ల అమ్మకాలు, వాటికి సంబంధించిన ప్రకటనలను చేపడుతున్న 15 వెబ్సైట్లకు తమ కార్యకలపాలు నిలిపివేయాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరో వైపు ఈ-సిగరెట్లపై నిషేధాన్ని సమర్థంగా పాటించేలా చూడాలని ఆరోగ్య శాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. సోషల్ మీడియాలో ఈ-సిగరెట్ల ప్రకటనలు, విక్రయాలను కూడా మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, మరో ఆరు వెబ్సైట్లు కూడా పర్యవేక్షణలో ఉన్నాయని, త్వరలో వాటికి నోటీసులు జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. "టేక్‌డౌన్ నోటీసులు జారీ చేసిన 15 వెబ్సైట్లలో నాలుగు కార్యకలాపాలు నిలిపివేయగా.. మిగిలినవి ఇంకా స్పందించలేదని అధికారలు తెలిపారు. నోటీసులు అందుకున్న వెబ్సైట్ యాజమాన్యం ప్రతిస్పందించి, చట్టానికి లోబడి ఉండకపోతే, ఈ వెబ్సైట్లను తొలగించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తక్షణమే ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని భావిస్తోంది. తదనుగుణంగా ఈ వెబ్సైట్లపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని యోచిస్తోంది. ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిషేధం (ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ ప్రకటన) చట్టం 2019లో అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా వచ్చి.. -
యూజీ ఆనర్స్.. ఇక జాబ్ ఈజీ
గుణదల(విజయవాడ తూర్పు): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా యూజీ ఆనర్స్ (నాలుగేళ్ల డిగ్రీ) కోర్సుకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు మెండుగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు దేశ, విదేశాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన యూజీ ఆనర్స్ కోర్సును ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెట్టేందుకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగా ఉన్న త విద్యా మండలి మార్గదర్శకాల ప్రకారం యూజీ ఆనర్స్ కోర్సుపై ఈ నెల మొదటి వారం నుంచే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు పెద్ద ఎత్తున విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాయి. నాలుగేళ్ల డిగ్రీ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యావేత్తలు, మేధావులు వివరిస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ఉన్నత విద్య అభ్యసించవచ్చని, విదేశాల్లో సైతం ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయని చెబుతున్నారు. దీంతో యూజీ ఆనర్స్‌పై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతోంది. కోర్సులు ఇలా... బీఏ ఆనర్స్ : హిస్టరీ, టూరిజం మేనేజ్మెంట్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, స్పెషల్ ఇంగ్లిష్, స్పెషల్ తెలుగు ఒక మేజర్ సబ్జెక్ట్‌గా ఉంటాయి. ఈ కోర్సులోనే మైనర్ సబ్జెక్టులుగా సోషియాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ ఉంటాయి. బీఎస్సీ ఆనర్స్: కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎల్రక్టానిక్స్, నానో టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, మాథమేటిక్స్, స్టాటిస్టిక్స్, బోటనీ, హారి్టక ల్చర్, జువాలజీ, అగ్రికల్చర్, మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ మేజర్ సబ్జెక్టులుగా ఉంటాయి. మైనర్ సబ్జెక్టులుగా ఫుడ్ టెక్నాలజీతోపాటు ఎంపిక చేసుకున్న కోర్సుకు ఆధారంగా మరికొన్ని సబ్జెక్టులు ఉంటాయి. బి.కాం ఆనర్స్: బి.కాం జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, బీబీఏ జనరల్, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఫైనాన్సియల్ సరీ్వసెస్, అకౌంట్స్ అండ్ టాక్సెస్ మేజర్ సబ్జెక్టులుగా ఉంటాయి. యూజీ ఆనర్స్ మొదటి ఏడాది పూర్తి చేస్తే సర్టిఫికెట్ ఇస్తారు. రెండో ఏడాది పూర్తి చేసిన వారికి డిప్లొమా వస్తుంది. మూడేళ్లు పూర్తి చేస్తే డిగ్రీ, నాలుగో ఏడాది ఉత్తీర్ణులైతే ఆనర్స్ పట్టా పొందుతారు. నాలుగేళ్లు ఆనర్స్ పూర్తి చేసిన తర్వాత పీజీ ఏడాది చదివితే నేరుగా పీహెచ్డీ చేసే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగ, ఉన్నత విద్యా అవకాశాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ విద్యా విధానం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు, ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలు లభిస్తాయి. యువత ఉన్నత భవిష్యత్తుకు నూతన కోర్సులు బంగారు బాటలు వేస్తాయి. – డాక్టర్ భాగ్యలక్ష్మి, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, విజయవాడ -
వైద్య రంగానికి కేంద్రం అధిక ప్రాధాన్యత
సాక్షి, భీమవరం/పాలకొల్లు సెంట్రల్: కేంద్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, దీనిలో భాగంగానే వైద్య కళాశాలలను పెంచుతున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీప్రవీణ్ పవార్ చెప్పారు. కేంద్ర మంత్రి గురువారం పశ్చిమగోదావరి జిల్లాలో టిడ్కో గృహాలను సందర్శించి అక్కడ స్థానికులతో, భీమవరంలో మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం వచ్చాక దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు 387 నుంచి 648కి పెంచారని వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించిన ఘనత ప్రధాని మోదీదేనని అన్నారు. దేశంలో 2014 వరకు 60 లక్షల ఇళ్లు నిర్మాణం చేస్తే మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత 3.50 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. అయినా మోదీ చిత్రపటం ఎక్కడా లేదని అన్నారు. రెండు నెలల్లో మళ్లీ వస్తానని, ఇక్కడ ప్రతి అపార్ట్‌మెంట్‌పై ప్రధాని మోదీ ఫొటో ఉండాలని, ప్రధాని ఆవాస్ యోజన అని రాసి ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడ 6,144 గృహాలు మంజూరవ్వగా 1854 మందికే ఇళ్లు అప్పగించారని, సౌకర్యాలు కూడా కల్పించలేదని అన్నారు. తాను మళ్లీ వచ్చేసరికి మిగిలిన ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాలని చెప్పారు. సబ్ కలెక్టర్ ఎం.సూర్యతేజ మాట్లాడుతూ టిడ్కో గృహాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 20 శాతమని, రాష్ట్ర ప్రభుత్వం వాటా 35 శాతమని, లబ్ధిదారుల వాటా 45 శాతం ఉందని తెలిపారు. కాగా, కేంద్ర మంత్రి ఎదుట రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేక భావన కలిగించాలని కొందరు బీజేపీ నాయకులు చేసిన ప్రయత్నం విఫలమైంది. సమస్యలున్న వారు చేతులెత్తాలని వారు ప్రజలను కోరగా, ఎటువంటి స్పందన రాలేదు. దీంతో వారు ఖంగుతిన్నారు. -
ప్రజల మనసు గెలిచి.. పురస్కారం పొంది.. హనుమంతునిపాడు పీఎస్ కు పట్టం
హనుమంతునిపాడు / ఒంగోలు టౌన్: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచి జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా గుర్తింపు తెచ్చుకుంది జిల్లాలోని హనుమంతునిపాడు పోలీస్‌స్టేషన్. 9 రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని, ప్రజల అభిప్రాయాలను సేకరించి 2022 సంవత్సరానికి గాను ఉత్తమ పోలీసు స్టేషన్ గా ఎంపిక చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం డీజీపీ చేతుల మీదుగా ఎస్పీ మల్లికా గర్గ్, ఎస్ఐ కృష్ణ పావని, సిబ్బంది పురస్కారాన్ని అందుకున్నారు. మండల కేంద్రానికి దూరంగా ఉన్నా.. 1927వ సంవత్సరం బ్రిటీషు పాలనలో కొండ శివారు గ్రామమైన నందనవనంలో పోలీస్సేష్టన్ను ఏర్పాటు చేశారు. 1984లో మండలాలు ఏర్పాటైన తర్వాత దీనిని హనుమంతునిపాడు మండల కేంద్రానికి మార్చారు. అయితే పురాతన భవనంలో తుపాకులు, ఇతర సామగ్రికి, సిబ్బందికి నక్సల్స్ నుంచి ముప్పు పొంచి ఉందన్న కారణంతో 2004లో కనిగిరి పాత పోలీస్‌స్టేషన్‌లోకి మార్చారు. దాదాపు పదేళ్లకుపైగా మండల కేంద్రానికి దూరంగా నియోజకవర్గ కేంద్రంలో హెచ్‌ఎంపాడు పీఎస్ కొనసాగుతోంది. స్టేషన్ పరిధిలో 23 గ్రామ పంచాయతీల్లో 14 సచివాలయాల కింద 62 హ్యాబిటేషన్ గ్రామాలున్నాయి. కనిగిరిలోని పోలీస్‌స్టేషన్ భవనం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిబ్బంది మండలానికి దూరంగా ఉన్నా విధి నిర్వహణలో చిత్తశుద్ధితో వ్యవహరించారు. ఉన్నతాధికారుల సూచనలతో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ శక్తిమేర సేవలందించారు. అన్ని వర్గాల ప్రజల నుంచి సెభాష్ అనిపించుకున్నారు. గతేడాది ఆగస్టు 28వ తేదీన కేంద్ర బృందం సర్వే చేసింది. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. కేంద్ర బృందం ద్వారా ప్రశంసలందుకుని పురస్కారానికి అర్హత సాధించారు. శ్రమకు గుర్తింపు లభించింది హనుమంతునిపాడు పోలీసు స్టేషన్‌కు ఉత్తమ పోలీసు స్టేషన్‌గా కేంద్ర హోం శాఖ నుంచి అవార్డు రావడం ప్రకాశం జిల్లా పోలీసుల శ్రమకు తగిన గుర్తింపు లభించినట్లు భావిస్తున్నాను. ముఖ్యంగా హనుమంతునిపాడులో ఎస్ఐగా విధులు నిర్వహించిన కృష్ణ పావని నిబద్ధత కలిగిన అధికారి. ఆమె పనితీరు చాలా బాగుంది. ఆమెతో పాటుగా అక్కడ పనిచేస్తున్న పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేయడంతోనే ప్రజల, ప్రభుత్వ ప్రశంసలు పొందారు. – ఎస్పీ మలికా గర్గ్ మరింత స్ఫూర్తినినిచ్చింది ఈ అవార్డు నాకు మరింత స్ఫూర్తినిచ్చింది. ఎస్పీ మలికా గర్గ్ ఇచ్చిన మద్దతు, సూచనలు, సలహాలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించడం, ప్రజలతో సానుకూలంగా వ్యవహరించడంతో పాటుగా బాధితులకు న్యాయం చేయడానికి శక్తిమేర ప్రయత్నించడం మా పోలీసు స్టేషన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ విషయాన్ని మండల ప్రజలు కేంద్ర హోం శాఖ బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అవార్డు రావడానికి సహచర పోలీసు సిబ్బంది, మండల ప్రజల తోడ్పాటును ఎప్పటికీ మరచిపోలేను. – కృష్ణ పావని, ఎస్ఐ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకున్న అంశాలు: ● నేరాల నియంత్రణ ● లా అండ్ ఆర్డర్ నిర్వహణ ● చట్టాల అమలు ● కేసుల దర్యాప్తు, విశ్లేషణ ● కోర్టు సమన్లు, కోర్టు మానిటరింగ్ ● ప్రోయాక్టివ్ పోలీసింగ్ ● కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ● పెట్రోలింగ్ నిర్వహణ ● పచ్చదనం, పరిశుభ్రత -
పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపు..సుప్రీంను చేరిన బెంగాల్ ప్రభుత్వం
పశ్చిమ బెంగాల్:పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలనే కలకత్తా హైకోర్టు ఆదేశాలపై పశ్చిమ బంగాల్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) సంయుక్తంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ సమావేశమైన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. గురువారం నుంచి 48 గంటలపాటు పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టు ఎస్ఈసీని ఆదేశించింది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా అల్లర్లు చెలరేగిన జిల్లాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వం వహించిన డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అల్లర్లు చెలరేగిన జిల్లాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని ప్రతిపక్ష నేత సువేందు అధికారి, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ధర్మాసనాన్ని ఆశ్రయించారు. 2021 కలకత్తా మున్సిపల్ ఎన్నికల్లో, 2022లో మున్సిపల్ ఎన్నికల్లో హింసాకాండ జరిగిన నేపథ్యంలో హైకోర్టు కేంద్ర బలగాలను నియమించాలని ఎస్ఈసీకి ఆదేశించింది. జూన్ 9న పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా బెంగాల్ అంతటా పలు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి. అల్లరిమూకలు బాంబులు విసిరారు. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, సీపీఐఎంలు అధికార టీఎంసీని విమర్శించాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులకు వ్యతిరేకంగా ప్రభుత్వమే అందోళనకారులకు మద్దతునిస్తోందని ఆరోపించారు. ఇదీ చదవండి:'కాంగ్రెస్‌లో చేరడం కంటే.. బావిలో దూకి చావడం మేలు' -
సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వంట నూనెల ధరలను తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రిఫైన్డ్ సోయాబీన్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ నూనెలపై ఉన్న దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీని ద్వారా వంట నూనె ధరలు తగ్గనున్నాయి. దేశీయ విపణిలో వంటనూనెల ధరలను తగ్గించేందుకు గతంలో తీసుకున్న చర్యలకు ఈ నిర్ణయం తోడ్పడనుందని శాఖ వెల్లడించింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని చివరిసారిగా 2021 అక్టోబర్‌లో 32.5% నుంచి 17.5%కి తగ్గించింది. చదవండి: ఎన్నికల్లో నామినేషన్ కోసం 22 కి.మీ పరిగెత్తాడు.. కారణం ఏంటంటే! -
కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం
న్యూఢిల్లీ: పోగొట్టుకున్న, చోరీ అయిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేసేందుకు, ట్రాక్ చేసేందుకు ఉపయోగపడే విధానాన్ని (సీఈఐఆర్) కేంద్రం ఈ వారంలో ఆవిష్కరించనుంది. సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (సీడాట్) రూపొందించిన ఈ సిస్టం ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలతో పాటు కొన్ని టెలికం సర్కిల్స్ లో ప్రయోగాత్మకంగా అమలవుతోంది. దీన్ని తాజా గా మే 17న దేశవ్యాప్తంగా అమల్లోకి తేనున్నట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. అయి తే, ఇథమిత్థంగా తేదీని చెప్పనప్పటికీ ఈ త్రైమాసికంలో సీఈఐఆర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సీడాట్ సీఈవో రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు మొబైల్ ఫోన్ల దొంగతనాల ఉదంతాలు తగ్గుముఖం పట్టేందుకు, చోరీకి గురైన..పోయిన మొబైల్ ఫోన్ల జాడలు కనుగొనడంలో పోలీసులకు సహాయకరంగా ఉండేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. అలాగే, మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు వాడే ఐఎంఈఐ నంబర్ల క్లోనింగ్‌ను అరికట్టడంతో పాటు దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సహాయపడగలదని వివరించారు. సీఈఐఆర్ విధానాన్ని ఉపయోగించి ఇటీవలే కర్ణాటక పోలీసులు 2,500 పైచిలుకు ఫోన్లను రికవర్ చేసి, యజమానులకు అప్పగించారు. పోయిన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసేందుకు యాపిల్ ఫోన్లలో ఇప్పటికే ప్రత్యేక సిస్టం ఉండగా.. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో మాత్రం లేదు. మొబైల్ నంబరుకు అనుసంధానమైన డివైజ్ ఐఎంఈఐ నంబరు ద్వారా ఫోన్‌ను కనిపెట్టేందుకు సీఈఐఆర్ తోడ్పడుతుంది. -
Karnataka assembly elections 2023: కర్ణాటక ‘సెంట్రల్’ ఎవరివైపు..!
సాక్షి,బెంగళూరు: సెంట్రల్ కర్ణాటకలో గత కొన్ని దశాబ్దాలుగా బీజేపీయే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. లింగాయత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో బీజేపీ హవా నడుస్తూ వస్తోంది. బీజేపీతో విభేదాలతో ఆ పార్టీ దిగ్గజ నాయకుడు యడియూరప్ప కర్ణాటక జనతా పార్టీ పేరుతో వేరు కుంపటి పెట్టి ఎన్నికల బరిలో దిగిన 2013లో మినహాయిస్తే మిగిలిన ఎన్నికల్లో బీజేపీదే పై చేయి. దావణగెరె, శివమొగ్గ, చిత్రదుర్గ, తుమకూరు జిల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో లింగాయత్‌లతో పాటు ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువే. మొత్తం 32 స్థానాల్లో 8 సీట్లు ఎస్సీ, ఎస్టీకి రిజర్వ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ సారి లింగా యత్లతో పాటు ఎస్సీ, ఎస్టీ ఓట్లు తమకేనని అందుకే ఈ సారి ఈ ప్రాంతంలో తమ పార్టీ దూసుకు పోతుందన్న అంచనాలతో ఉంది. మలేనాడు, మధ్య కర్ణాటక జిల్లాల నుంచి రాష్ట్రానికి ఇప్పటికి ఐదు మంది ముఖ్యమంత్రులు వచ్చారు. దీంతో కర్ణాటక లోని ఈ ప్రాంతంపై ఆయా రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. అయిదుగురు మాజీ ముఖ్యమంత్రుల్లో కడిదాళ్ మంజప్ప, ఎస్.బంగారప్ప, జేహెచ్ పటేల్, బీఎస్ యడియూరప్ప వంటి నేతలు అవిభజతి శివమొగ్గ జిల్లాకు చెందిన వారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ప్రాంతంపై పట్టుకు బీజేపీ,కాంగ్రెస్ శ్రమిస్తున్నాయి. కేవలం తుముకూరు జిల్లాలో మాత్రమే పట్టు ఉన్న జేడీ(ఎస్) ఈ సారి అన్ని జిల్లాలకు విస్తరించడానికి వ్యూహాలు పన్నుతోంది. అవకాశాలను అందిపుచ్చుకున్న బీజేపీ.. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం కాల క్రమేణ బీజేపీ వశం అయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కాంగ్రెస్, బీజేపీకి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. 2004 నుంచి హిందూ ఓట్లను క్రోడికరించడంలో బీజేపీ సఫలీకృతమైంది. అప్పటి నుంచి నెమ్మదిగా పుంజుకుంటూ మధ్య కర్ణాటకలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. బీజేపీకి కీలక ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్‌లు శివమొగ్గ, దావణగెరె జిల్లాల్లో అధిక సంఖ్యలో ఉండడం అధికార పార్టీకి కలసి వచ్చింది. సీట్లను పెంచుకునే వ్యూహంలో కాంగ్రెస్ స్థానికంగా ఉన్న సమస్యల్ని ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ తనకు అను కూలంగా ప్రచారంలో మలుచుకుంటోంది. ఎక్కడిక్కడే హామీలు గుప్పిస్తూ ఈ సారి మధ్య కర్ణాటకలో అత్యధిక స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. గత ఏడాది కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య 75వ పుట్టిన రోజు వేడుకల్ని దావణగెరెలో భారీగా నిర్వహించి ఎన్నికల సమరశంఖాన్ని పూరించింది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సెంట్రల్ కర్ణాటకలో అత్యధికంగా ర్యాలీలు నిర్వహిస్తూ వస్తున్నారు. జేడీ(ఎస్) తుముకూరు ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి పంచరత్న యాత్రని వినియోగించుకున్నారు. మొత్తమ్మీద సెంట్రల్ ఓటరు ఎవరిని కరుణిస్తారో వేచి చూడాలి. స్థానిక అంశాలపై బీజేపీ దృష్టి లింగాయత్ ఓట్లతో పాటుగా స్థానిక సమస్యల పరిష్కారంపై బీజేపీ దృష్టి సారించింది. శివమొగ్గ జిల్లాలో బగర్‌హుకుం భూ స్వాధీనం, శరావతి ప్రాజెక్టు పునరావాసం, విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కర్మాగారం మూసివేత వంటి సమస్యలు బీజేపీకి తలనొప్పిగా మారాయి. చిక్కమగళూరు జిల్లాలో వర్షాల వల్ల కాఫీ సాగుదారులు తీవ్రంగా నష్టపో యారు. భద్రా ఎత్తిపోతల ప్రాజెక్టు చిత్రదుర్గ జిల్లాలో ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్లో రూ. 5,300 కోట్లు ప్యాకేజీ ప్రకటించింది. ఈ అంశం బీజేపీకి అనుకూ లంగా మారింది. ఇక ధరాభారం, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ ఇంకా ఎటూ తేల్చకపోవడంతో ఈ వర్గం వారు అధికార పార్టీపై గుర్రుగా ఉన్నారు. -
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదు : కేంద్రం
-
లోన్ యాప్ సంస్థలకు కేంద్రం కళ్లెం
-
కేంద్రం,బీజేపీ నాయకత్వం మీకు అండగా ఉంది
-
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ
-
గుడ్‌న్యూస్..కేంద్రంలో దాదాపు 10 లక్షల ఉద్యోగ ఖాళీలు!
న్యూఢిల్లీ: కేంద్రంలో పలు విభాగాల్లో 9.79 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉందని ప్రభుత్వం బుధవారం తెలిపింది. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘‘2021 మార్చి 1 నాటికి అన్ని శాఖలు, విభాగాలు, సంస్థల్లో 9.79 లక్షలకుపైగా ఖాళీలున్నాయి. రైల్వేశాఖలోనే 2.93 లక్షలున్నాయి. రక్షణ శాఖలో 2.64 లక్షలు, హోం శాఖలో 1.43 లక్షలు, రెవెన్యూలో 80,243, ఆడిట్–అకౌంట్ విభాగంలో 25,934, అణు ఇంధన శాఖలో 9,460 ఖాళీలున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ఆదేశించాం’’ అన్నారు. -
అమ్మకానికి బొగ్గు గనులు.. మరి సింగరేణి పరిస్థితి ఏంటి?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర బొగ్గు, గనుల శాఖ సింగరేణి పరిధిలోని గనులను మరోసారి అమ్మకానికి పెట్టింది. బుధవారం బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారికంగా ఏడో రౌండ్‌కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి దేశంలోని తెలంగాణతో సహా మరో 8 రాష్ట్రాల్లో ఉన్న 106 బొగ్గు బ్లాకులను వేలం వేయనుంది. ఇందులో సింగరేణికి చెందిన కొత్తగూడెం ఏరియాలోని పెనగడప, మందమర్రి ఏరియాలోని శ్రావణపల్లి బ్లాక్ ఉన్నాయి. గతంలో ఈ బ్లాక్‌ను వేలంలో చేర్చగా పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పటివరకు అన్ని రౌండ్లలోనూ సింగరేణి కంపెనీ వేలంలో పాల్గొనకుండా దూరంగా ఉంటూ వస్తోంది. తాజా రౌండ్లో పాల్గొంటుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది. -
పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన
-
ఏపీలో అంతర్రాష్ట్ర ప్రసార వ్యవస్థ.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆమోదం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో భారీ వ్యయంతో నెలకొల్పే గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కర్నూలు జిల్లాలో రూ.4,070.04 కోట్ల విలువైన రెండు భారీ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టులకు పవర్ గ్రిడ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. రూ.3,546 కోట్ల అంచనా వ్యయంతో కర్నూలులో విండ్ ఎనర్జీ జోన్, సోలార్ ఎనర్జీ జోన్ కోసం అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ లైన్ల ప్రాజెక్టు మొదటిది. ఇది 2025 నవంబర్‌కి ప్రారంభమవుతుంది. మరో ప్రాజెక్టు కొలిమిగుండ్ల వద్ద రూ.524.04 కోట్ల అంచనా వ్యయంతో వస్తుంది. ఇది 2024 నవంబర్‌కు ప్రారంభిస్తారు. బీవోటీ విధానంలో.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ దేశమంతటా ట్రాన్స్మిషన్ లైన్లు నిర్వహిస్తోంది. విద్యుదుత్పత్తి సంస్థలు ఉత్పత్తి చేసే కరెంటును అమ్ముకోవడానికి ఈ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటాయి. అయితే, కొత్తగా నిరి్మంచే లైన్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీవోటీ) విధానంలో నిర్మించాలని కేంద్రం ఆదేశించింది. తాజా ప్రాజెక్టులు కూడా ఈ విధానంలోనే నిరి్మస్తారు. దీనివల్ల కొంతకాలం తరువాత ఈ లైన్లు ప్రభుత్వ ఆ«దీనంలోకి వస్తాయి. తద్వారా ట్రాన్స్‌కో, డిస్కంలపై ఆర్ధిక భారం తప్పుతుంది. గతంలో కంపెనీలు ఈ అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ వ్యవస్థను వినియోగించుకోవడం కోసం లాంగ్ టర్మ్ యాక్సెస్ విధానంలో పవర్ గ్రిడ్‌కు దరఖాస్తు పెట్టుకునేవి. అయితే, కేంద్ర ప్రభుత్వం లాంగ్‌టర్మ్ యాక్సెస్‌కు బదులు జనరల్ నెట్వర్క్ యాక్సెస్ (జీఎన్ఏ) విధానాన్ని తెచి్చంది. దీంతో అవసరాలకు తగ్గట్టు ట్రాన్స్మిషన్ లైన్లను ఇతరులకు ఇవ్వడం, ఇతరుల నుంచి వాడుకోవడం వంటివి స్వల్ప, మధ్యకాలిక ఒప్పందాల ద్వారా చేయొచ్చు. -
కృష్ణా బోర్డులో అంత జీతాలా?.. కేంద్రం ఆగ్రహం
కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూలవేతనంపై 25శాతం అధికంగా చెల్లిస్తుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అధిక వేతనం చెల్లింపులను నిలుపుదల చేయాలని, ఇప్పటిదాకా అదనంగా చెల్లించిన వేతనాలను తిరిగి వసూలు చేయాలని కృష్ణా బోర్డును ఆదేశించింది. లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవి కేంద్ర పాలన పరిధిలోనే.. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖలోని అంతర్రాష్ట విభాగం ఇంజనీర్లకు మూలవేతనంపై 25శాతం అధికంగా చెల్లిస్తుండగా, సమానంగా తమ ఉద్యోగులకు సైతం 25శాతం మూలవేతనాన్ని అధికంగా చెల్లించాలని 2020 అక్టోబర్ 20న కృష్ణా బోర్డు తీర్మానం చేసింది. దాదాపు రెండేళ్ల నుంచి అధిక వేతనాలు చెల్లిస్తూ వస్తోంది. గోదావరి బోర్డు సైతం తమ ఉద్యోగులకు ఇదే తరహాలో అధిక వేతనాలను చెల్లిస్తామని కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదనలు పంపగా, ఈ విషయం కేంద్రం దృష్టికి వచ్చింది. అధిక వేతనాలను నిలిపేయాలని 2021 జూలైలో కృష్ణా బోర్డుకు కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. స్వయంప్రతిపత్తి కలిగి ఉన్న నేపథ్యంలో కేంద్రం ఆదేశాలను అమలు చేయాల్సిన అవసరం లేదని కృష్ణా బోర్డు కేంద్రానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85(3)ను ప్రయోగిస్తూ తక్షణమే అధిక వేతనాల చెల్లింపులను నిలుపుదల చేయాలని తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా బోర్డును ఆదేశించింది. -
కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఆ రెండు నగరాల పేరు మార్పు!
ముంబై: బీజేపీ అధికారంలో ఉన్న చోట పురాతన నగరాల పేర్ల మార్పు చేపట్టింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పట్టణాల, నగరాల పేర్లను మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో రెండు ప్రముఖ నగరాల పేర్లను మార్చబోతోంది. అందుకు కేంద్రం ఆమోద ముద్ర కూడా వేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణాన్ని ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ పట్టణానికి ధరాశివ్‌గా పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ధృవీకరించారు. ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. దీనిపై ఫడ్నవిస్ స్పందిస్తూ.. తమ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్నందుకు హర్షం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ల పేర్లను మార్చాలనే డిమాండ్‌ను తొలిసారిగా శివసేన అధినేత బాల్ థాక్రే తెరపైకి తీసుకొచ్చారు. కొన్ని ఏళ్లుగా ఈ డిమాండ్ నడుస్తోంది. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే 2022లో తన ప్రభుత్వం కూలిపోయే ముందు తన చివరి క్యాబినెట్ సమావేశంలో ఈ పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పేర్ల మార్పుపై మహారాష్ట్ర క్యాబినెట్ 2022లో నిర్ణయాన్ని ఆమోదించింది కూడా. అయితే దాని ఆమోదం మాత్రం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండిపోయింది. చదవండి: మార్క్స్ మెమోపై వాగ్వాదం.. ప్రిన్సిపాల్‌పై స్టూడెంట్ దాడిలో.. -
సహకారోద్యమం బలోపేతం!
న్యూఢిల్లీ: దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాబోయే ఐదేళ్లలో గ్రామ పంచాయతీల్లో 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీలు), పాడి–మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 99,000 పీఏసీలు ఉండగా, 63,000 మాత్రమే చురుగ్గా ఉన్నాయి. 1.6 లక్షల పంచాయతీల్లో పీఏసీలు లేవు. 2 లక్షల గ్రామాల్లో పాడి–మత్స్య సహకార సంఘాల్లేవు. అక్కడ వాటిని, తీర గ్రామాల్లో మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఐదేళ్లలో 2 లక్షల బహుళ ప్రయోజనకర పీఏసీలు, పాడి–మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీంతో రైతుల ఆదాయం పెరగడంతోపాటు గ్రామాల్లో నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తర సరిహద్దుల్లో ‘భవ్య గ్రామాలు’ దేశ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్(వీవీపీ) పేరిట నూతన పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2022–23 నుంచి 2025–26 దాకా మూడేళ్ల వ్యవధిలో రూ.4,800 కోట్లతో వీవీపీ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకం. ఇందులో రూ.2,200 కోట్లను రోడ్ల నిర్మాణం కోసం ఖర్చు చేస్తారు. ఈ పథకంతో సరిహద్దు గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. వీవీపీ స్కీమ్‌తో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రం పాలిత ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలియజేసింది. షింకున్ లా సొరంగం కేంద్ర పాలిత ప్రాంతమైన లద్ధాఖ్లోని సరిహద్దు ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి 4.1 కిలోమీటర్ల పొడవైన షింకున్ లా సొరంగం నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నిమూ–పదామ్–దార్చా రోడ్డు లింక్‌లో రూ.1,681 కోట్లతో ఈ సొరంగం నిర్మిస్తారు. 2025 డిసెంబర్ నాటికల్లా నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో లద్ధాఖ్‌కు సులువుగా చేరుకోవడానికి ఈ టన్నెల్ ఉపయోగపడుతుందని వివరించారు. దేశ భద్రతకు సైతం ఈ ప్రాజెక్టు చాలా కీలకమని చెప్పారు. శ్రీనగర్–కార్గిల్–లేహ్ టన్నెల్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామన్నారు. -
సోషల్ మీడియాలో మీమ్స్.. కౌ హగ్ డే నిర్ణయంపై వెనక్కి తగ్గిన కేంద్రం
ఫిబ్రవరి 14న ప్రజలు ఆవును కౌగించుకోవాలన్న నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ప్రేమికుల దినోత్సవం రోజున కౌ హగ్ డే జరుపుకోవాంటూ ఇచ్చిన పిలుపును ఉపసంహరించుకుంది. ఈ మేరకు భారత జంతు సంరక్షణ బోర్డు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మత్స్య, పశుసంవర్థక, డెయిరీ మంత్రిత్వశాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు ఫిబ్రవరి 14న కౌ హగ్ డే జరుపుకోవాలంటూ ఇచ్చిన పిలుపును వెనక్కి తీసుకొంటున్నట్టు కేంద్ర పశు సంరక్షణ బోర్డు కార్యదర్శి ఎస్కే దత్తా ఓ నోటీసులో పేర్కొన్నారు. కాగా గోవులను ప్రేమించేవారు ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డేకి బదులుగా కౌ హగ్ డే జరుపుకోవాలని కేంద్ర జంతు సంక్షేమ శాఖ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతున్న నేపథ్యంలో భారతీయ పురాతన సంప్రదాయాలు అంతరించిపోతున్నాయని.. గోమాత ప్రాధాన్యతను గుర్తించి ఫిబ్రవరి 14న గోవులను ఆలింగనం చేసుకోవాలంటూ పేర్కొంది. గోవును కౌగిలించుకోవడం ద్వారా భావ సంపద వృద్ధి చెందుతుందని.. తద్వారా వ్యక్తిగత, సామూహిక సంతోషం పెరుగుతుందని తెలిపింది. అయితే ఈ ప్రకటన చే'rనప్పటి నుంచి కౌ హగ్ డే అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అప్పటి నుంచి దీనిపై రచ్చ జరుగుతూనే ఉంది. కొంతమంది దీనిపై సానుకూలంగా స్పందిస్తుంటే.. మరికొందరు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శిస్తున్నారు. దీంతో నెట్టింట్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. అటు విపక్షాలు కౌ హగ్ డేపై సైతం విమర్శలు గుప్పించాయి. కౌ హగ్ డే పిలుపు హాస్యాస్పదమని.. ప్రధాని మోదీకి పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఓ ‘పవిత్ర గోవు’ అంటూ మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో జంతు సంరక్షణ బోర్డు ‘కౌ హగ్ డే’ పాటించాలంటూ ఇచ్చిన పిలుపును తాజాగా ఉపసంహరించుకోవడం గమనార్హం. చదవండి: మోదీ సర్కార్‌ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: ఎమ్మెల్సీ కవిత -
బడ్జెట్ 2023: కేంద్రం ఫోకస్ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023-24ను సమర్పించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ సారి బడ్జెట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు పన్ను ప్రయోజనాల రూపంలో ప్రజలకు కొంత ఉపశమనాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం తన కేటాయింపులను ప్రణాళికాబద్దంగా ఖర్చు చేయనుంది, ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణాన్ని ఎలా నియంత్రిస్తుంది అనే దానిపై అందరి దృష్టి ఉంది. ఈ సారి బడ్జెట్లో ఈ ప్రతిపాదనలు ఉండొచ్చని అటు ప్రజలతో పాటు నిపుణులు భావిస్తున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం! పన్ను స్లాబ్ ప్రస్తుత పన్ను స్లాబ్‌లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ₹ 2.5 లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితి ఉంది. దీని అర్థం ఈ పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయవలసిన అవసరం లేదు. అయితే ఈ నిబంధనలో గత ఏడేళ్లగా ఎటువంటి మార్పులు చేయలేదు. దీంతో రాబోయే బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం ₹ 5 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ప్రామాణిక తగ్గింపు(స్టాండర్డ్ డిడక్షన్) ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను ₹ 50,000 నుంచి ₹ 1 లక్ష వరకు రెట్టింపు చేసే అవకాశం ఉందని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగుతున్న జీవన వ్యయం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కోసం ప్రామాణిక మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని వాదన కూడా ఉంది. ఆర్థిక లోటు తగ్గింపు భారత్ తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించుకోవచ్చని గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ తెలిపింది. ఆండ్రూ టిల్టన్, శాంతాను సేన్‌గుప్తాతో సహా గోల్డ్‌మ్యాన్ ఆర్థికవేత్తలు భారతదేశం తన లోటును 5.9కి ఉంచుతుందని ఒక నివేదికలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయాన్ని కొనసాగిస్తూ సంక్షేమ వ్యయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ఉపాధి, గృహనిర్మాణంపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మౌలిక సదుపాయాలు, సామాజిక పథకాల వ్యయం ఈ ఏడాది బడ్జెట్లో మౌలిక సదుపాయాలపై ఖర్చు కూడా పెంచే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే రానున్న కాలంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బడ్జెట్ ఇదే కావడంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక రంగ సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: అప్పట్లో రియల్ ఎస్టేట్ కింగ్.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి -
త్వరలో తెరుచుకోనున్న రియల్ KGF గేట్లు
-
చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. కేంద్రం ఈ నిజాన్ని దాస్తోంది: రాహుల్ ఫైర్
జైపూర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చైనా విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చైనా నుంచి వచ్చే ముప్పును తక్కువ అంచనా వేస్తుందని విమర్శించారు. డ్రాగన్ దేశం యుద్ధానికి కాలు దువ్వుతుంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దీనిని అంగీకరించడం లేదని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర భాగంగా రాజస్థాన్‌లోని దౌసాలో రాహుల్‌గాంధీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కూడా ఉన్నారు, కాగా డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖవద్ద భారత్, చైనా మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. భారత్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన చైనా ఆర్మీని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుపడ్డారు ‘చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని చొరబాటు కోసం కాదు. వారి ఆయుధాల సరళి, వాడకం చూస్తే అర్థమవుతోంది.. అది యుద్ధం కోసమేనని. కానీ మన ప్రభుత్వం దానిని గుర్తించడం లేదు. భారత ప్రభుత్వం వ్యూహాలపై కాదు, సంఘటనలపై పనిచేస్తోంది. చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. మన సైనికులపై దాడి చేసింది. దీంతో డ్రాగన్‌తో వచ్చే ముప్పు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ నిజాన్ని దాచేస్తోంది. మోదీ చైనా బెదిరింపులను విస్మరిస్తున్నారు. ఓవైపు లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా దాడికి సిద్ధమవుతుంటే.. భారత ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా నిద్రపోతుంది’ అని రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదవండి: రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్ రాజధానిలో నీటి సరాఫరా బంద్ -
ఈడీ డైరెక్టర్ పదవీ కాలం ఎందుకు పొడిగించారు?
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ సంజయ్‌కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని మూడుసార్లు ఎందుకు పొడిగించారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రంతోపాటు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ), ఈడీ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఈడీ డైరెక్టర్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత జయా ఠాకూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీఆర్ గావై, జస్టిస్ విక్రమ్‌నాథ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేంద్రంతోపాటు సీవీసీకి నోటీసులు జారీ చేసింది. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉపయోగించుకుంటోందని, తద్వారా ప్రజాస్వామ్య నిర్మాణాన్ని ధ్వంసం చేస్తోందని జయా ఠాకూర్ తన పిటిషన్లో ఆరోపించారు. సంజయ్‌కుమార్ మిశ్రాకు పొడిగింపు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వు జారీ చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని ఆక్షేపించారు. -
దేశవ్యాప్తంగా పోలీసులు అందరికీ ఒకే యూనిఫామ్ : ప్రధాని మోదీ
-
ఉచిత హామీలపై ఈసీ ఆందోళన
-
మిషన్ భగీరథ అవార్డుపై కేంద్రం వర్సెస్ తెలంగాణ
-
తెలంగాణ మంత్రులకు కౌంటర్ ఇస్తూ కేంద్ర జలశక్తి శాఖ ప్రెస్ నోట్
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక