Centre Clarity On Central Govt Employees Retirement Age - Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచనున్నారా..? కేంద్రం క్లారిటీ..

Published Wed, Aug 9 2023 5:56 PM | Last Updated on Wed, Aug 9 2023 6:15 PM

Centre Clarity On Central Govt Employees Retirement Age - Sakshi

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచనున్నారనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రిటైర్మెంట్ వయస్సును మార్చబోమని స్పష్టం చేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలుకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. 

'కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడం గానీ, తగ్గించడం గానీ ఉండదు' అని కేంద్ర సిబ్బంది వ్వవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే.. లోక్‌సభలో నేడు ఉద్యోగులకు గరిష్ఠంగా 30 ఏళ్ల సర్వీసు కాలం పూర్తి చేసి రిటైర్మెంట్ ఇచ్చే ప్రతిపాదన ఉందా? అని కేంద్రాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై కేంద్రం సమాధానం ఇచ్చింది. 

గత మూడేళ్లలో 122 మంది ఉద్యోగులు నిర్బంధ పదవీవిరమణ చేశారని లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. యంత్రాంగాన్ని బలోపేతం చేసే దిశగా డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్ వినియోగం, రూల్స్‌ను సరళించడం వంటి మార్పులు చేసినట్లు పేర్కొంది.

730 రోజుల చైల్డ్ కేర్ సెలవులు..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు తమ పిల్లల సంరక్షణ కోసం మొత్తం సర్వీసులు గరిష్ఠంగా 730 రోజుల సెలవులు తీసుకోవచ్చని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పిల్లల్లో మొదటి సంతానం 18  ఏళ్లు వచ్చే వరకు ఈ సెలవులకు అర్హత ఉంటుందని స్పష్టం చేశారు. 

ఇదీ చదవండి: పేరు మార్చుకోనున్న కేరళ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement