Age Relaxation
-
ఆ రాష్ట్రంలో యువతుల వివాహ వయస్సు పెంపు
దేశంలో యువతుల వివాహ వయస్సు 18గా ఉంది. అంటే వారికి చట్టప్రకారం 18 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సవరించింది.హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 21 ఏళ్ల వయస్సు వచ్చాకనే ఆడపిల్లలకు వివాహం చేయాలనే నిబంధనను తీసుకురానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ తాజాగా యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీ బాల్య వివాహాల నిషేధాన్ని (హిమాచల్ ప్రదేశ్ సవరణ బిల్లు 2024) వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది.ఈ సందర్భంగా మహిళా సాధికారత శాఖ మంత్రి ధని రామ్ షాండిల్ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిషేధించేందుకు బాల్య వివాహ చట్టం 2006ను రూపొందించామని తెలిపారు. లింగ సమానత్వం, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించేందుకు యువతుల కనీస వివాహ వయస్సును పెంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం ఆడపిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహ చట్టం 2006, సంబంధిత చట్టాలను సవరించి, బాలికల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదన చేశామని మంత్రి తెలిపారు. -
అగ్నిపథ్ వయోపరిమితి పెంచాలని కేంద్రానికి ఆర్మీ సూచన!
ఢిల్లీ: అగ్నిపథ్ పథకంలో చేరాలనుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి పెంచాలని ఆర్మీ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న 21 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లుకు పెంచాలని ఆర్మీ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. దీని వల్ల త్రివిధ దళాల్లో సాంకేతిక ఉద్యోగాలను డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల పొందే అవకాశాలు అధికంగా ఉంటాయని శుక్రవారం సీనియర్ మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు.అదే విధంగా నాలుగేళ్ల తర్వాత కనీసం 50 శాతం మంది ఉద్యోగులను కొనసాగించాలని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కేవలం 25 శాతం మంది అగ్నివీరుల సర్వీస్ మాత్రమే కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాము సూచించనట్లుగా 50 శాతం మంది అగ్నివీరుల సర్వీస్ కొనసాగించటం వల్ల కొన్ని ప్రత్యేకమైన విభాగాల్లో మ్యాన్ పవర్ కొరత తగ్గించవచ్చని మరో సైనిక అధికారి అభిప్రాయపడ్డారు. శక్తిమంతమైన సైన్యం కోసం ఈ మార్పులు అవసరమని అన్నారు. రెండేళ్ల వయోపరిమితి పెంచటం మూలంగా త్రివిధ దళాల్లో గ్రాడ్యుయేషన్ పర్తైన అభ్యర్థులు అధిక సంఖ్యలో నియమించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే అగ్నిపథ్ పథకం కింద త్రివిధ దళాల్లో నియామకానికి పదిహేడున్నరేళ్ల నుంచి 21 ఏళ్ల వయసు గల అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఇక నాలుగేళ్ల సర్వీస్ పూర్తి అయిన తర్వాత కేవలం 25 శాతం మంది అగ్నివీరులను మాత్రమే రెగ్యులర్ సర్వీసు కింద మరో 15 ఏళ్లకు పొడిగించనున్న విషయం తెలిసిందే. -
సింగరేణి కారుణ్య నియామకాల వయో పరిమితి పెంపు
గోదావరిఖని: సింగరేణిలోని డిపెండెంట్ల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది. కారుణ్య నియామకాల్లో వయో పరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ మంగళవారం సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. దీనిద్వారా సుమారు 300 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం కారుణ్య నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి ఇప్పటివరకు 35ఏళ్లే. కరోనా, విజిలెన్స్ విచారణ, మెడికల్ బోర్డులో పొరపాట్లు తదితర కారణాలతో చాలామంది వారసుల వయసు 35ఏళ్లకు మించిపోయింది. ఇలాంటివారు నిరుద్యోగులుగా కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు అయితే, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఇటీవల ఇచ్చిన హామీ మే రకు కారుణ్య నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ సమయంలో రెండేళ్లపాటు మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియ నిలిచిపోయింది.సింగరేణిలో పనిచేస్తూ మృతి చెందితే వారసుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే కారుణ్య నియామక ప్రక్రియ ప్ర స్తుతం కొనసాగుతోంది. అనారోగ్యంతో ఉద్యోగానికి అనర్హుడని మెడికల్ బోర్డు నిర్ధారించినా వారసుడికి ఉద్యోగావకాశం క ల్పిస్తోంది. వయో పరిమితి పెంపుపై ఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్, ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య హర్షం వ్యక్తం చేశారు. సెటిల్మెంట్ లేనివారికే.. కారుణ్య నియామకాల్లో కార్మిక వారసుల గరిష్ట వయో పరిమితి 40ఏళ్లకు పెంచాం. ఇది 2018 మార్చి 9వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఇందుకోసం ఆయా ఏరియాల్లో దరఖాస్తు చేయాలి. అయితే, గరిష్ట వయో పరిమితితో ఉద్యోగం పొందలేని, వన్‌టైం సెటిల్మెంట్ జరగని వారికే కొత్త స్కీం వర్తిస్తుంది. – బలరామ్, సింగరేణి సీఎండీ -
74 ఏళ్ల 'ఏజ్‌లెస్ బ్యూటీ'..చూస్తే టీనేజ్ అమ్మాయిలా..!
ఎవ్వరైనా కనీసం 50 దాటితేనే ఏజ్డ్గా కనిపించేస్తారు. ఎంతలా మేకప్‌తో కవర్ చేద్దామన్నా..ముడతలు పడ్డ చర్మాన్ని దాచడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా మెడ, చేతులు, ముసలివాళ్లైనట్లు క్లియర్‌గా కనిపించేస్తుంది. అలాంటిది ఈ బామ్మ ఏజ్‌లో ఉన్న ఈ మహిళను చూస్తే వామ్మో అంటారు. అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోకండి. ఆ రహస్యం ఏంటో ఆమె మాటల్లోనే విందామా..!అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ వెరా వాండ్ వయసు 74 ఏళ్లు. కానీ ఆమె అందానికే అందానివే.. అన్నంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమెను చూడగానే ఎవ్వరూ కూడా ఆమెకు అంత ఏజ్ ఉంటుందని అస్సలు అనుకోరు. అంతేగాదు తాను ఎప్పుడూ మెరిసిన జుట్తుతో అస్సలు కనిపించనని చాలా ధీమాగా చెప్పేస్తోంది. అయితే ఒకనొక మీడియా ఇంటర్యూలో మాత్రం తన తలకు రంగు వేస్తానని ఒప్పుకుంది. అయినప్పటికీ స్కిన్ అంత టైట్‌గా యువకుల మాదిరిగా ఉండటం మాత్రం ఆశ్చర్యమే. View this post on Instagram A post shared by Vera Wang (@verawang) ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ పేరుగాంచిన వాంగ్ని తన బ్యూటీ రహస్యం ఏంటని పలు మీడియాలు ప్రశ్నించగా.."తాను 19 ఏళ్ల నుంచి ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాను. తానెప్పుడూ యవ్వనం గురించి ఆలోచించలేదని చెబుతోంది. ఎందుకంటే..ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళలతో రోజూ పని చేస్తుంటాను కాబట్టి నాకు ఆ ఆలోచనే రాదంటోంది. వాళ్లను చూస్తు ఉత్సాహాంగా పనిచేయడం వల్ల తాను ఇలా యంగ్‌గా కనిపిస్తున్నాని అంటోంది." వాంగ్. నిజంగా గ్రేట్ కదా ఆమె. ఈ ఏజ్‌లో కూడా టీనేజ్ అమ్మాయి లుక్ మెయింటైన్ చేస్తోందంటే మాములు విషయం కాదు కదా..! View this post on Instagram A post shared by Vera Wang (@verawang)(చదవండి: అనుష్క శర్మ బుడ్డి హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే..నోరెళ్లబెట్టడం ఖాయం!) -
Health: పెరిగే వయసుతో.. ఈ సమస్యలూ పెరుగుతాయని మీకు తెలుసా!
వయసు పెరుగుతున్నకొద్దీ వెంట్రుకలు తెల్లబడుతుంటే రంగు వేస్తాం. కానీ మార్పులకు లోనయ్యే చర్మాన్ని ఏం చేయగలం? ఎవరెంత రంగు వేసినప్పటికీ... చర్మం తీరును బట్టే ఎదుటివారి వయసును అంచనా వేస్తుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మానికి కొన్ని రకాల వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉదాహరణకు.. చర్మాన్ని పొడిబార్చే జీరోసిస్ మొదలుకొని చర్మం కింద రక్తం పేరుకున్నట్లు కనిపించే పర్‌ప్యూరా వరకు అనేక సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అవేమిటో, వాటి నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు / నిర్వహణ పద్ధతులూ, చికిత్సలను తెలుసుకుంటే.. పరుగులు తీసే వయసుకు స్పీడ్‌కు బ్రేకులు వేసి, యూత్‌ఫుల్‌గా కనిపించేందుకు తోడ్పడే కథనమిది. చర్మంలో ప్రధానంగా మూడు పొరలు ఉంటాయి. బయటిపొరను ఎపిడెర్మిస్, మధ్యపొరను డెర్మిస్, దాని కింద సబ్‌క్యుటేనియస్ పొర అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ.. ఎపిడర్మిస్ పొర పలుచబారడం మొదలవుతుంది. ఈ పొరలోనే ఉంటూ మేనికి రంగునిచ్చే మెలనోసైట్స్ ఉత్పత్తి తగ్గడం మొదలవుతుంది. అందుకే వృద్ధుల చర్మం పారదర్శకంగా ఉండి, లోపలి రక్తనాళాలు కనిపిస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ చర్మం పాలిపోయినట్లుగా అవుతుంది. ఇక డెర్మిస్ పొరలో చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలాజెన్, ఎలాస్టిన్ అనే కణజాలాలు ఉంటాయి. వీటివల్లనే చర్మం బిగుతుగా ఉంటుంది. ఈ బిగువు తగ్గడం వల్లనే వయసు పెరుగుతున్నకొద్దీ చర్మం సాగి, వదులవుతుంది. డర్మిస్లోని రక్తనాళాలూ బలహీనమవుతాయి. అందుకే వయసు పైబడినవారిలో చిన్న దెబ్బకైనా వెంటనే రక్తస్రావం అవుతుంది. ఇక సబ్‌క్యుటేనియస్ పొరలో కొవ్వు ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కొవ్వు తగ్గిపోవడం వల్ల చర్మం మునుపటిలా కాకుండా పలచబారిపోతుంది. ఈ పొరలోనే చెమట గ్రంథులు, నూనెలాంటి పదార్థాన్ని స్రవించే సెబేషియస్ గ్రంథులు ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ గ్రంథుల పనితీరు తగ్గుతూ పోయి చర్మం పొడిబారినట్లుగా అవుతుంది. నునుపుదనాన్ని కోల్పోతుంది. వెరసి... ఈ సమస్యలన్నింటి వల్ల చర్మం పటుత్వాన్ని కోల్పోయి వేలాడుతున్నట్లుగా అవడంతోపాటు ముడతలు కూడా పడుతుంది. వయసు పెరగడం వల్ల వచ్చే సమస్యలు.. జీరోసిస్ లేదా ఏస్టియోటిక్ డర్మటైటిస్ : దీన్నే వాడుకలో చర్మం పొడిబారిపోవడం అంటారు. ఈ సమస్య ముందుగా మోకాలి కింద భాగంలో ఉన్న చర్మంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆ తర్వాత దుస్తులు కప్పని ఇతర భాగాల్లోనూ కనిపిస్తుంది. ఏజ్ స్పాట్స్ లేదా లివర్ స్పాట్స్ : చర్మానికి రంగును ఇచ్చే మెలనోసైట్స్ తగ్గడం వల్ల చర్మం పాలిపోయినట్లు అవుతుంది. ఆ తర్వాత నల్లటి మచ్చలు వస్తాయి. వాటిని ఏజ్ స్పాట్స్ లేదా లివర్స్పాట్స్ లేదా లెంటిజీన్స్ అంటారు. చర్మానికి బాగా ఎండ తగిలే ప్రదేశాలలో ఇవి ఎక్కువగా వస్తాయి. చెర్రీ యాంజియోమాస్ : ఈ సమస్య ఉన్నవారిలో కొద్దిపాటి రాపిడికే రక్తనాళాలు చిట్లే ప్రమాదం ఉండడంతో పాటు చర్మంపై నుంచి రక్తనాళాలు ఎరుపు రంగులో పైకి కనిపిస్తూ ఉంటాయి. వాటిని ‘చెర్రీ యాంజియోమాస్’ అంటారు. సెబోరిక్ కెరటోసిస్ : చర్మంపై ముఖ్యంగా చేతుల మీద, ముఖంపైన కందిగింజ సైజులో సెబోరిక్ కెరటోసిస్ అనే గోధుమరంగు మచ్చలు వస్తాయి. స్కిన్ ట్యాగ్స్ లేదా యాక్రోకార్డాన్స్: చర్మం వదులుగా.. ముడత పడినట్లుగా అయి... అదనపు చర్మంలా పొడుచుకు వచ్చి, పులిపిర్లలా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా మెడమీద, బాహుమూలాల వద్ద, తొడలపైన కనిపిస్తాయి. పర్‌ప్యూరా అండ్ హిమటోమాస్: చర్మం కింద ఉన్న రక్తనాళాలు పెళుసుబారి సులువుగా చిట్లుతాయి. దాంతో అక్కడ రక్తం చేరినట్లుగా కనిపిస్తుంది. దాన్ని సినైల్ పర్‌ప్యూరా అంటారు. ఒకవేళ రక్తం పేరుకుపోయి, చర్మం ఉబ్బుగా కనిపిస్తే దాన్ని హిమటోమా అంటారు. ఎయిర్ బార్న్ కాంటాక్ట్ డర్మటైటిస్: వయసు పైబడిన వారిలో చర్మానికి చాలా తేలికగా అలర్జీలు వస్తుంటాయి. పరిసరాల్లో ఉండే మొక్కల కారణంగా చర్మంపై అలర్జీలు వస్తే దాన్ని ఎయిర్ బార్న్ కాంటాక్ట్ డర్మటైటిస్ అని అంటారు. కెరటో అకాంథోమా: వయసు పైబడుతున్న వారిలో, ఎండలో ఎక్కువగా తిరిగే కొందరిలో కాయల్లా కనిపించే వాటిని నాన్ క్యాన్సరస్ స్కిన్ గ్రోత్స్గా చెబుతారు. అవి చాలా పెద్దగా, చుట్టూ ఎత్తుగా... మధ్యలో కొద్దిగా గుంటలా ఉంటాయి. జాగ్రత్తలు.. వయసు పైబడుతున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలాకాలం పాటు చర్మాన్ని సంరక్షించుకోవడమే కాదు... యూత్‌ఫుల్‌గా కనిపించేలా కూడా చూసుకోవచ్చు. అందుకోసం చేయాల్సినవి.. చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్లు వాడాలి. బాగా గాఢంగా ఉండి, ఎక్కువ సువాసనలు వెదజల్లే సబ్బులు వాడకూడదు. బాత్ ఆయిల్స్‌ను దూరం పెట్టాలి. పొగ తాగడం మానేయాలి. ఎండలోకి వెళ్లేటప్పుడు సస్‌స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. సౌకర్యంగా ఉండే దుస్తులు ధరించాలి. సమతులాహారం, ద్రవపదార్థాలు తీసుకోవాలి. గోరు వెచ్చటి నీటితోనే స్నానం చేయాలి. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఆహారం: చర్మంపై వయసు ప్రభావం కనపడనివ్వకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, పండ్లతోబాటు బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. చికిత్స: సమస్యను బట్టి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మానికీ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. వయసు మళ్లిన వారిలో బేసల్ సెల్ ఎపిథిలియోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, మెలనోమా వంటి చర్మ క్యాన్సర్స్ కనిపించవచ్చు. మరికొన్ని తీవ్ర సమస్యలు.. ఇన్ఫెక్షన్లు: వయసు పైబడుతున్న వారి చర్మం తేలిగ్గా ఇన్ఫెక్షన్స్కు గురవుతుంది. బార్టీరియా వల్ల – ఫాలిక్యులైటిస్, సెల్యులైటిస్; ఫంగస్ వల్ల – క్యాండిడియాసిస్, డెర్మటోఫైట్ ఇన్ఫెక్షన్స్; వైరస్ వల్ల – జోస్టర్ వంటివి సోకుతాయి. సోరియాసిస్: పెరిగే వయసుతో సోరియాసిస్ అనే చర్మ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. మొదట పొడిగానూ ఆ తర్వాత వెండిరంగు పొట్టు రాలుతున్న లక్షణాలు కనిపిస్తాయి. న్యూరోడర్మటైటిస్: ఇందులో ప్రధానంగా పాదాల మీద నల్లటి మచ్చలా వచ్చి, చాలా దురదగా ఉంటుంది. — డా. ఎస్. సుష్మా సుకృతి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్. ఇవి చదవండి: చిన్నారులు బరువు పెరుగుతున్నారా? అయితే జాగ్రత్త! -
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉగ్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సర్వీస్ మినహాయిస్తూ వమోయపరిమితి సడలించింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. చదవండి: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్‌కు లైన్‌క్లియర్ -
వర్సిటీ అధ్యాపకుల వయోపరిమితి పెంచాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పలు విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉన్నత విద్య వర్గాలు కూడా ఈ వాదనను బలపరుస్తున్నాయి. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో పదవీ విరమణ వయసు 65 ఏళ్లు ఉండగా, మెడికల్ కాలేజీల్లోనూ బోధన సిబ్బంది రిటైర్మెంట్ వయసు కూడా 65 ఏళ్లకు ఉంది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచింది. కానీ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల రిటైర్మెంట్ వయసు మాత్రం 60 ఏళ్లుగానే ఉంది. రాష్ట్రంలో త్వరలో కొంతమంది అధ్యాపకులు రిటైర్ అయ్యే వీలుందని చెపుతున్నారు. ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో ప్రొఫె సర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే రిటైర్మెంట్ల కారణంగా మరికొన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. మరో పక్క రాష్ట్రంలోని కొన్ని వర్సిటీల వైఎస్ చాన్స్లర్ల పదవీ కాలం మరో ఐదు నెలలు మాత్రమే ఉంది. దీంతో కొత్త వీసీల నియామకం చేపడితే తప్ప యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీపై దృష్టి పెట్టే వీల్లేదు. ఈ సమయంలో బోధన సిబ్బంది కొరత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే వీలుందని అధ్యాపక వర్గాలు అంటున్నాయి. 2024లోనే ఉస్మానియా యూనివర్సిటీ న్యాక్ అసెస్మెంట్కు వెళ్లాల్సిన అవసరం ఉంది. న్యాక్‌లో మంచి గ్రేడ్ వస్తే తప్ప రీసెర్చ్ ప్రాజెక్టులు ఈ యూనివర్సిటీకి వచ్చే అవకాశం లేదు. ఇతర వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యాపకుల పదవీ విరమణ వయసును పెంచే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. -
తొందరగా వృద్ధాప్య లక్షణాలు రావడానికి కారణం ఇదే!
మనుషుల్లో కొందరూ చాలా పెద్దాళ్లలా కనిపిస్తారు. తొందరగా వయసు పెరిగిపోయినట్లు వృద్ధాప్య ఛాయలే గాక ఆ వయసు సంబంధిత రుగ్మతలు కూడా కనిపిస్తుంటాయి. ఇలా ఎందువల్ల జరుగుతుందో అనే దిశగా శాస్త్రవేత్తలు ఎన్నాళ్లగానో పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఆ పరిశోధనల్లో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటివల్లే మనిషి వయసు స్పీడ్ అప్ అయ్యి వృద్ధులుగా మారుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అది మనిషి దేహంలోనే ఉంటూ టైం చూసి వయసుపై ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. దేని వల్ల ఇలా జరుగుతుంది. ఏం చేయాలి తదితరాల గురించి తెలుసుకుందాం!. పిల్లులు, ఎలుకల్లో ఉండే పరాన్నజీవులు(చిన్న బగ్) మనిషి వయసును ప్రభావితం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. యూఎస్‌లోని దాదాపు 15% మంది వ్యక్తులు తమ జీవిత కాలంలో తెలిసి లేదా తెలియకుండానే వాటిలో ఉండే ఏక కణజీవి టోక్సోప్లాస్టో గోండి బారిన పడ్డట్లు తెలిపారు. ఇవి పిల్లుల, ఎలుకలు శరీరంలో ఉంటాయని. అవి మనిషి శరీరంలో చేరి నిద్రాణంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇది దాని జీవితకాలం మనిషి శరీరంలోనే జీవించగలదని చెబుతున్నారు. మనిషికి ఉండే రోగ నిరోధకవ్యవస్థ కారణంగా ఆ పరాన్న జీవి కలిగించే ఇన్ఫెక్షన్స్కి గురికావడం అనేది ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మన వయసును ప్రభావితం చేసి వృద్ధాప్య లక్షణాలు కనిపించేలా.. ఆ వయసులో ఉండే శారీరక బలహీనతలను వేగవంతం చేస్తోందన్నారు. దీన్ని వృద్ధాప్య సిండ్రోమ్ అని పిలుస్తారు. దీని కారణంగా వృద్ధుల మాదిరిగా బరువు తగ్గడం, అలసట, కొద్దిగా కూడా శారీరక శ్రమ చేయలేకపోవడం, బలహీనంగా ఉండటం, తరుచుగా ఆస్పత్రికి వెళ్లడం తదితర లక్షణాలన్నీ ఒక్కసారిగా తలెత్తుతాయన్నారు. ఈ లక్షణాలు 65 ఏళ్లు అంతకంటే పైబడినవారిలో గుర్తించినట్లు తెలిపారు. వృద్ధుల్లో ఈ గోండి ఇన్ఫెక్షన్ కోసం వెతకగా ఇది సంకోచించి ఉండి, ముందుగానే వయసును ప్రభావితం చేసినట్లు గుర్తించామన్నారు. దీని గురించి మరింతగా తెలుసుకునేందుకు దాదాపు 601 మంది స్పానిష్, పోర్చుగ్రీస్ వృద్ధులపై పరిశోధనలు చేయగా 67% మంది ఈ గోండి పరాన్న జీవికి ప్రభావితం అయినట్లు గుర్తించారు. ఈ పరాన్న జీవి నిర్ధిష్ట ప్రతిరోధకాలు వయసును ప్రభావితం చేసి.. సంబంధిత బలహీనత లక్షణాలను పెంచుతున్నట్లు తెలిపారు. అందువల్ల పిల్లి, ఎలుకలు వంటి జీవులకు వాటి వ్యర్థాలకు దూరంగా ఉండమని సూచిస్తున్నారు. ఒక వేళ్ల పెంపుడు జంతువులుగా పెంచుకున్నా.. సురక్షితంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. (చదవండి: భారత్‌లోనే టీబీ కేసులు అత్యధికం!: డబ్ల్యూహెచ్ఓ నివేదిక) -
ఈ పొరపాటు చేస్తే.. ఏజ్డ్ పర్సన్‌లా కనిపించడం ఖాయం!
ఇటీవలకాలంలో చాలామంది ఏజ్ పరంగా చూస్తే చిన్నవాళ్లే అయినా వారిని చూస్తే ఏజ్డ్లా కనిపిస్తారు. వాళ్లు చెబతేగానీ మనకు తెలయను కూడా తెలియదు. దీంతో ఒకరకంగా వారు కూడా సమాజంలో కాస్త ఇబ్బందిగా ఫీలవ్వడమే గాక ఆత్మనూన్యత గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల తొందరగా వృద్ధాప్య ఛాయలు కనిపించేలా చేసే వాటికి దూరంగా ఉండి వీలైనంతలో కొద్దిపాటు జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య మీ ధరిచేరదంటున్నారు ఆరోగ్య నిపుణులు. తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకూడదంటే.. కొందరూ చూస్తే ఎంత ఏజ్ వచ్చినా కూడా స్మార్ట్‌గా యంగ్‌గా కనిపిస్తారు. అందుకు ప్రధాన కారణం మంచి నిద్ర అంటున్నారు డాక్టర్ పాల్విన్. మంచి నిద్ర మన ముఖవర్చస్సు కాంతివంతంగా యవ్వనంగా ఉండేలా చేస్తుందట. సుఖమైన నిద్ర మనిషి ఏజ్‌ని దాచేస్తుందంటున్నారు. ఎప్పుడూ నిద్ర విషయంలో అస్సలు అశ్రద్ధ కనబర్చకూడదట. ఇదే అన్ని రకాల వ్యాధులు అటాక్ చేసేందుకు ఒకరకంగా కారణమవుతుందని కూడా చెబుతున్నారు. ఈ నిద్ర మన జీర్ణవ్యవస్థపై అత్యంత ప్రభావం చూపుతుందంటున్నారు. కంటినిండా నిద్ర ఉంటే ఎలాంటి జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు ఎదురుకావట. అలాగే ఎన్ని ఒత్తిడులు ఉన్నా వాటన్నింటిని తేలిగ్గా తీసుకుని కొట్టిపడేసి ధైర్యంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ శరీరానికి అవసరమయ్యే నిద్రను మిస్ చేయకండని వార్నింగ్ ఇస్తున్నా డాక్టర్ పాల్విన్. ఇలా ఒక నెలపాటు వేళకు భోజనం చేస్తూ..కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు మంచిగా నిద్రపోవడానికి యత్నించి చూస్తే మీకే చక్కటి ఫలితం కనిపిస్తుందంటున్నారు. దీని వల్ల శరీరం స్వస్థత చెందడమేగాక మీకు తెలియకుండానే మీలో జీవక్రియలు మెరుగుపడటం, వ్యాధి నిరోధక శక్తి పెరగడం జరుగుతుందన్నారు. ఇదే సమయంలో మీ పడకగది కూడా మీరు వెళ్లగానే పడుకోవాలనిపించేంత ఆహ్లాదంగా పరిశుభ్రంగా ఉండాలని చెబుతున్నారు. సరైన నిద్రలేకపోవడం వల్ల రక్తపోటు, ఊబకాయం, స్ట్రోక్, మధుమేహం, గుండెబ్బులు వంటి రోగాలబారిన పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ధూమపానం, ఆల్కహాల్ తదితర చెడు అలవాట్లను సాధ్యమైనంత తొందరగా వదిలేయాలి. రోజువారి జీవనశైలిలో కొద్ది మార్పులు చేసి నిద్రకు సక్రమంగా షెడ్యూల్‌ని కేటాయించేలా చేస్తే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం రాదని అంటున్నారు. ఈ విధానం పాటిస్తే కచ్చితంగా ఏజ్డ్ పర్సన్‌లా కనిపించరని, ఆయుః ప్రమాణం పెరిగి మీరు చిన్నవారిలానే కనిపిస్తారని డాక్టర్ పాల్విన్ చెబుతున్నారు. (చదవండి: చిన్నారుల్ని ఇబ్బంది పెట్టే హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్!) -
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచనున్నారా..? కేంద్రం క్లారిటీ..
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచనున్నారనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రిటైర్మెంట్ వయస్సును మార్చబోమని స్పష్టం చేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలుకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. 'కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడం గానీ, తగ్గించడం గానీ ఉండదు' అని కేంద్ర సిబ్బంది వ్వవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే.. లోక్‌సభలో నేడు ఉద్యోగులకు గరిష్ఠంగా 30 ఏళ్ల సర్వీసు కాలం పూర్తి చేసి రిటైర్మెంట్ ఇచ్చే ప్రతిపాదన ఉందా? అని కేంద్రాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై కేంద్రం సమాధానం ఇచ్చింది. గత మూడేళ్లలో 122 మంది ఉద్యోగులు నిర్బంధ పదవీవిరమణ చేశారని లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. యంత్రాంగాన్ని బలోపేతం చేసే దిశగా డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్ వినియోగం, రూల్స్‌ను సరళించడం వంటి మార్పులు చేసినట్లు పేర్కొంది. 730 రోజుల చైల్డ్ కేర్ సెలవులు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు తమ పిల్లల సంరక్షణ కోసం మొత్తం సర్వీసులు గరిష్ఠంగా 730 రోజుల సెలవులు తీసుకోవచ్చని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పిల్లల్లో మొదటి సంతానం 18 ఏళ్లు వచ్చే వరకు ఈ సెలవులకు అర్హత ఉంటుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: పేరు మార్చుకోనున్న కేరళ! -
ప్రధాని పదవికి వయసు అడ్డంకి కాదేమో!
భారతదేశం సహా అనేక ప్రజాస్వామ్య దేశాల్లో చట్టసభల సభ్యత్వం పొందడానికి రాజకీయ నాయకులకు ఎలాంటి వయోపరిమితి లేదు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు చేపట్టడానికి కూడా ఇంత వయసు దాటిన నేతలు అనర్హులు అనే నిబంధన ఏదీ లేదు. రాజ్యాంగ, రాజకీయ పదవులకు గరిష్ఠ వయోపరిమితి లేకపోవడం సబబేనని, మానసిక సామర్ధ్యం ఉన్న నాయకులు ఎంత వయసువారైనా పదవుల చేపట్టడంలో తప్పేమీ లేదని ప్రపంచవ్యాప్తంగా పలువురు రాజ్యాంగ నిపుణులూ, ప్రజాతంత్రవాదులూ అభిప్రాయపడుతున్నారు. 81 ఏళ్లకు ప్రధానిగా మొరార్జీ దేశాయి నిజమే, శారీరక, మానసిక ఆరోగ్యం బాగున్నంత వరకూ ప్రజలు ఎన్నుకున్నంత కాలం ఏ వయసు నాయకులైనా పదవులు అధిష్ఠించడం సక్రమమేనని రాజనీతి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇండియాలో 1977 మార్చి లోక్ సభ ఎన్నికల అనంతరం తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ప్రమాణం చేసిన కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత మొరార్జీ దేశాయి వయసు 81 సంవత్సరాలు. అప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న మాజీ కేంద్ర మంత్రి అయిన మొరార్జీ భాయ్ ఇంత పెద్ద వయసులో ప్రధాని పదవికి ఎన్నికకావడమేమిటని కొందరు వ్యాఖ్యానించారు. చరిత్రకెక్కిన రాజీవ్ గాంధీ మంకు పట్టుదల ఉన్న నేతగా అప్పటికే పేరున్న గాంధీయవాది మొరార్జీ 2 ఏళ్ల 4 మాసాలు ప్రధానిగా కొనసాగారు. 1896 ఫిబ్రవరి 29న జన్మించిన దేశాయి జీ 99 ఏళ్లు జీవించారు. ఆ తర్వాత మళ్లీ దేశ ప్రధాని అయిన ఏ నాయకుడి వయసు గురించీ చర్చ అంతగా జరగలేదు. 1984 చివరిలో తల్లి మరణానంతరం ప్రధాని పదవిని చేపట్టిన రాజీవ్ గాంధీ వయసు 40 ఏళ్లు. ఇండియాలో అత్యంత పిన్నవయస్కుడైన ప్రధానిగా ఆయన చరిత్రకెక్కారు. అనంతరం 1997లో 77 ఏళ్ల వయసులో ప్రధాని అయిన ఇందర్ కుమార్ గుజ్రాల్ గురించి కూడా అప్పట్లో పెద్దగా చర్చ జరగలేదు. ఆయన దాదాపు 11 నెలలు పదవిలో కొనసాగారు. పదేళ్లపాటు ప్రధానిగా చేసిన మన్మోహన్ సింగ్ గుజ్రాల్ తర్వాత 1996 మార్చిలో బీజేపీ తరఫున తొలి ప్రధాని అయిన అగ్రనేత అటల్ బిహారీ వాజపేయి 73 ఏళ్లు దాటాక అత్యున్నత పదవిని అధిష్ఠించారు. మళ్లీ వరసగా 1998, 1999లో ప్రధాని పదవి చేపట్టి 6 ఏళ్ల 2 మాసాలు కొనసాగిన వాజపేయి 79 సంవత్సరాల వయసులో పదవి నుంచి దిగిపోయారు. 2004 పార్లమెంటు ఎన్నికల తర్వాత తొలి యూపీఏ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాని అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ వయసు అప్పటికి 71 ఏళ్లు. పదేళ్లు ప్రధానమంత్రిగా కొనసాగాక 2014 మే నెలలో పదవి నుంచి దిగిపోయినప్పుడు మన్మోహన్ జీ వయసు 81 సంవత్సరాలు. 16వ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో 2014 మేలో 63 సంవత్సరాల వయసులో తొలిసారి ప్రధానిగా ప్రమాణం చేశారు నరేంద్ర మోదీ. వచ్చే ఏడాది ఎన్నికల్లో ప్రధానిగా మోదీ ఎన్నికైతే.. 2024 పార్లమెంటు ఎన్నికల్లో మోదీ జీ ప్రధానమంత్రి పదవికి బీజేపీ అభ్యర్థిగా పోటీపడి మూడోసారి ప్రధాని అయ్యే పక్షంలో ఆయన 78 ఏళ్ల ఆరు నెలల వయసులో 2029 మే నెలలో ఉన్నత పదవి నుంచి దిగిపోయే అవకాశం ఉంది. దేశంలో ప్రధాని పదవి చేపట్టిన ప్రముఖుల వయసు గురించి ఇప్పుడు రాజకీయ పరిశీలకులు ప్రస్తావించడానికి కారణాలు లేకపోలేదు. అధ్యక్షుడి హోదాలో బైడెన్ 80వ పుట్టిన రోజు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జోసెఫ్ (జో) బైడెన్ పదవిలో ఉండగా 80వ పుట్టినరోజు జరుపుకున్న మొదటి దేశాధినేతగా చరిత్రకెక్కారు.అంతేగాక, ఈ వయసులో ఆయన కొద్ది నెలల క్రితం తాను రెండోసారి అధ్యక్ష పదవికి డెమొక్రాటిక్ పార్టీ అధ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నట్టు ప్రకటించారు. ఒకవేళ బైడెన్ పార్టీ టికెట్ సంపాదించి 2024 నవంబర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే–81 సంవత్సరాల వయసులో 2025 జనవరి 20న దేశాధ్యక్షునిగా ప్రమాణం చేసే తొలి నాయకుడిగా కొత్త రికార్డు నెలకొల్పుతారు. 1951లో పూర్తి చేసిన రాజ్యాంగ సవరణ ఫలితంగా అమెరికా అధ్యక్ష పదవిని రెండుసార్లు మించి నిర్వహించకూడదనే నిబంధన అమలులోకి వచ్చింది. అంతేగాని, దేశాధ్యక్ష పదవికి పోటీపడడానికి అమెరికాలో గరిష్ఠ వయోపరిమితి లేదు. అంతేగాక, అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు, గవర్నర్ పదవులు సహా అన్ని చట్టసభల పదవులుకు పోటీచేయడానికి ఎలాంటి వయోపరిమితి లేదు. ఇండియాలో ఏ పదవి కోసమైనా ఎన్నిసార్లయినా లేదా ఏ వయసులోనైనా పోటీచేయడానికి భారత రాజ్యాంగం అవకాశం కల్పిస్తోంది. పదవులకు పోటీపడే నాయకుల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటే నేతల వయసుపై జనం పెద్దగా చర్చించరు. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు -
ఉద్యోగాల భర్తీలో EWS వారికి ఐదేళ్ల వయోపరిమితి పెంపు
-
కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. సీఎం జగన్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగార్థులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూల నిర్ణయం తీసుకున్నారు. వారి విజ్ఞప్తి మేరకు వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచాలని అధికారులను ఆదేశించారు. పలు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు వీటి భర్తీ కోసం పోలీస్ శాఖ అక్టోబర్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, 411 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. వయో పరిమితి పెంచి తమకు కూడా అర్హత కల్పించాలంటూ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగార్థులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులపై సీఎం అధికారులతో సమావేశమయ్యారు. వారికి అవకాశం కల్పించేలా రెండేళ్లపాటు వయో పరిమితి పెంచుతూ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కానిస్టేబుల్ జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 24 ఏళ్లు ఉండేది. ఇప్పుడు రెండేళ్ల సడలింపుతో 26 ఏళ్లు వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 24 ఏళ్ల వయోపరిమితిలో ఐదేళ్లు ఇదివరకే సడలింపు ఇచ్చారు. ఆ ప్రకారం 29 ఏళ్లు వయస్సు వారు కానిస్టేబుల్ పోస్టులకు అర్హులు. దీనికి తాజా మినహాయింపుతో 31 ఏళ్ల వయస్సు వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఐ పోస్టులకు జనరల్‌లో 27 ఏళ్ల వరకు అవకాశం ఉండేది. ప్రస్తుతం రెండేళ్ల పెంపుతో 29 ఏళ్ల వయసు ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 32 ఏళ్ల నుంచి 34 ఏళ్ల వరకు వయో పరిమితి పెరిగింది. సీఎం నిర్ణయం వల్ల లక్షలాది మంది అభ్యర్థులకు ప్రయోజనం కలుగుతుందని అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: పోస్టుల భర్తీ ప్రక్రియ ఇలా.. -
సుప్రీం, హైకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయస్సు పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయస్సును పెంచాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) కోరుతోంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రస్తుతం దిగువ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సు వరుసగా 60, 62, 65 ఏళ్లుగా ఉన్నాయి. ముఖ్యంగా హైకోర్టులు, సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సులను 65, 67 ఏళ్లకు పెంచాలని బీసీఐ కోరుతోంది. వివిధ కమీషన్లు, ఫోరంలకు చైర్ పర్సన్లుగా అనుభవజ్ఞులైన న్యాయవాదులను నియమించేందుకు వీలుగా నిబంధనలను సవరించాలని పార్లమెంట్‌ను కోరుతూ తీర్మానించినట్లు వెల్లడించింది. (చదవండి: పోలీసులకు రక్షణ కల్పిస్తున్న 'పాములు'!!.. ఎక్కడ.. ఎవరి నుంచి అంటే..) -
ఇంటర్వ్యూలో ఆమె వయసు అడిగినందుకు... పరిహారంగా రూ. 3 లక్షలు..
అమ్మాయి వయసు మగాడి జీతం అడగకూడదని పెద్దలు అంటుంటారు. బహుశా ఇందుకేనేమో పాపం ఆ కంపెనీ ఇంటర్వ్యూలో అమ్మాయి వయసు అడిగినందుకు పరిహారంగా ఏకంగా రూ. 3లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే...డోమినోస్ పిజ్జా డెలివరీ డ్రైవర్ ఉద్యోగ ఇంటర్వ్యూలో నార్తర్న్ ఐర్లాండ్‌లోని జానిస్ వాల్ష్ అనే మహిళ ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. జానిస్ వాల్ష్ అనే మహిళ ఇంటర్వ్యూ సంభాషణలో ఆమె వయసు గురించి ప్రశ్నించారు. ఆ తర్వాత ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. వాస్తవానికి వాల్ష్ ఈ ఇంటర్వ్యూలో ఎంపికైంది కానీ ఆమె వయసు కారణంగా తిరస్కరణకు గురైనట్లు తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురైంది. అదీగాక 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న యువకులనే తీసుకుంటారని తెలుసుకున్న తర్వాత తాను లింగ వివక్షతకు గురైనట్లు తెలుసుకుంది. దీంతో వాల్ష్ తాను ఇంటర్వ్యూలో వయసు వివక్షత కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయానని వివరిస్తూ... డోమినోస్ స్టోర్ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది. వెంటనే ఇంటర్వ్యూ చేసిన సదరు వ్యక్తి క్విర్క్ ఆమెకు క్షమాపణలు చెప్పడమే గాక వయసు గురించి అడగకూడదని తనకు తెలియదని వివరణ ఇచ్చాడు. కానీ ఆ కంపెనీ మాత్రం పిజ్జా డెలీవరీ జాబ్స్ ప్రకటనను ఇస్తూనే ఉండటంతో...వాల్ష్ మరింత దిగులు చెందింది. తనకు డ్రైవింగ్ వచ్చినప్పటికీ కేవలం మహిళను కావడం వల్లే ఈ ఉద్యోగం రాలేదని భావించి వాల్ష్ కోర్టు మెట్లెక్కింది. ఐతే ఆమెకు ఐర్లాండ్ ఈక్వాలిటీ కమీషన్ మద్దతు లభించింది. వ్యాపారాలు యువతకు ఉపాధిని కల్పించడం తోపాటు సమానత్వాన్ని పాటించాలని, అలా లేనప్పుడు ఉద్యోగులు హక్కులు ఎలా రక్షింపబడతాయని సదరు కంపెనీని కోర్టు ప్రశ్నించింది. వాల్ష్కు సదరు డోమినోస్ కంపెనీ దాదాపు రూ. 3.7 లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. (చదవండి: వెరైటీ వెడ్డింగ్ కార్డు! హర్ష గోయెంకా మనసును దోచింది!) -
హైదరాబాద్‌లో భారీగా కొత్త ఆసరా పింఛన్లు.. ఎంత మందికి అంటే?
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో కొత్తగా లక్షన్నర మందికి ఆసరా పింఛన్ల లబ్ధి చేకూరనుంది. పాత పెండింగ్ దరఖాస్తులకు మోక్షం లభించింది. ఇప్పటికే తుది జాబితా సిద్ధంగా ఉండటంతో కొత్త పింఛన్ల మంజూరుకు మార్గం సుగమమైంది. పంద్రాగస్టు తర్వాత కొత్త పింఛన్లు అందనున్నాయి. వాస్తవంగా గత మూడేళ్లుగా ఆసరా కొత్త పింఛన్ల ఊసే లేకుండా పోయింది. ఆసరా పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ వచ్చింది. దరఖాస్తులపై ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి విచారణ పూర్తయి అర్హులను గుర్తించినా... . మంజూరు మాత్రం పెండింగ్‌లో పడిపోతూ వచ్చింది. ప్రభుత్వం నంచి గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో కొత్త పింఛన్లకు మోక్షం లభించలేదు. తాజాగా ముఖ్యమంత్రి ప్రకటనతో ఆసరా పెండింగ్ ప్రతిపాధనలకు కదలిక వచ్చినట్లయింది. దీంతో వితంతు,వికలాంగుల, ఒంటరి మహిళాలతోపాటు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు పింఛన్లు మంజూరు కానున్నాయి. ఇప్పటికే సెర్ప్ వద్ద ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వ ఆదేశాలతో వాటికి మోక్షం లభించినట్లయింది. (చదవండి: 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో.. రోడ్డుకు నోచుకోని తండాలు) మరో లక్షన్నర సడలింపు దరఖాస్తులు వయస్సు సడలింపు దరఖాస్తులు సుమారు లక్షన్నర పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం వయస్సు సడలింపుతో అర్హులైన వారి నుంచి మీ సేవా ఆన్లైన్ ద్వారా ఆగస్టులో పక్షం రోజులు, ఆ తర్వాత సెప్టెంబర్‌లో పక్షం రోజులు దరఖాస్తులు స్వీకరించారు. బోగస్ దరఖాస్తులకు రాకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేయడంతో దరఖాస్తుదారులు వ్యక్తిగతంగా మీ సేవా కేంద్రాలకు వెళ్లి పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. కాగా, వాటిపై ఇప్పటి వరకు సరైన ఆదేశాలు లేక కనీసం క్షేత్ర స్థాయి విచారణ లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం పెండింగ్‌లో పడిపోయాయి. (చదవండి: కేంద్రం ఇచ్చింది 3శాతం కంటే తక్కువే..) -
అగ్నిపథ్ ఆందోళనలు.. కేంద్ర హోం శాఖ సంచలన నిర్ణయం
అగ్నిపథ్ స్కీమ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో నిరసనకారులు రైళ్లను తగలబెట్టడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్లకు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సీఏపీఎఫ్(Central Armed Police Forces), అసోం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్రం తెలిపింది. The Ministry of Home Affairs (MHA) decides to reserve 10% vacancies for recruitment in CAPFs and Assam Rifles for Agniveers. — गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 18, 2022 'అగ్నిపథ్' కింద ఆర్మీకి ఎంపికై నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సామ్ రైఫిల్స్‌లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని వెల్లడించింది. ఈ రెండు దళాల్లో నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని అగ్నివీరులకు 3 ఏళ్ల పాటు పెంచుతామని కేంద్రం తెలిపింది. అగ్నివీర్ తొలి బ్యాచ్ వారికి .. కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో గరిష్ట వయో పరిమితి 5 ఏళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఇవే.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమ బల్ (SSB), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG). ఈ బలగాలన్నీ కేంద్రహోంశాఖ పరిధిలోకి వస్తాయి. ఇక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు.. కేంద్ర రక్షణ శాఖ కింద ఉంటాయి. -
తెలంగాణ: పోలీస్ అభ్యర్థులకు మరో గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు వరుస నోటిఫికేషన్లతో శుభవార్తలు చెబుతున్న తెలంగాణ సర్కార్ తాజాగా మరో గుడ్‌న్యూస్ అందించింది. పోలీసుశాఖ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పొడగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేళ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీ మహేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. కాగా పోలీసుశాఖతో పాటు ఫైర్, జైళ్లు, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, ఎస్పీఎస్ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 2వ తేదీ నుండి పోలీస్ ఉద్యోగాల కోసం ధరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఒకే అభ్యర్ధి ఎన్ని పోస్టులకైనా ధరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల దరఖాస్తుకు ఈనెల 20 రాత్రి 10 గంటల వరకు మాత్రమే సమయముంది. అయితే వయోపరిమితి పెంచిన నేపథ్యంలో దరఖాస్తు గడువు తేదీని కూడా పొడగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: నోటిఫికేషన్లో అర్హతలే అంతిమం..పిటిషనర్ అప్పీల్‌ను కొట్టేసిన హైకోర్టు -
TSSPDCL: జేఎల్‌ఎంల పోస్టులకు పదేళ్ల ‘వయో’ సడలింపు లేదు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) భర్తీ చేయనున్న జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులకు 10 ఏళ్ల గరిష్ట వయోపరి మితి సడలింపును వర్తింపజేయడం లేదు. విద్యుత్ స్తంభాలను ఎక్కి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో విధులు నిర్వహించే జూనియర్ లైన్మెన్కు శారీరక దారుఢ్యం అత్యంత ఆవశ్యకమని, అందువల్ల ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి సడలింపు ఇవ్వరాదని టీఎస్ఎస్పీడీసీఎల్ నిర్ణయించింది. 1,000 జేఎల్ఎం, 201 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 70 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి సంస్థ ఈ నెల 9న సంక్షిప్త ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ పోస్టుల కు మాత్రం 10 ఏళ్ల గరిష్ట వయోపరి మితి సడలింపును వర్తింపజేయనున్నట్టు సంస్థ ఉన్నతాధికారవర్గాలు తెలిపాయి. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ జిల్లా స్థాయి పోస్టులే కొత్త జోనల్ విధానం ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ పోస్టులను జిల్లా స్థాయి పోస్టులుగా వర్గీకరించి భర్తీ చేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల స్థానికత గల అభ్యర్థులకే 95 శాతం పోస్టులు దక్కనున్నాయి. ఐటీఐ (ఎలక్ట్రికల్)తో పాటు అప్రెంటిస్ పూర్తి చేసిన అభ్యర్థులు జేఎల్ఎం పోస్టులకు అర్హులు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన వారు సబ్ ఇంజనీర్ పోస్టులకు అర్హులు కానున్నారు. డిస్కం స్థాయి పోస్టులుగా ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికే షన్ వెలువడింది. గురువారం నుంచి వచ్చే నెల 3 వరకు దరఖాస్తులను స్వీకరించను న్నారు. జూలై 17న రాత పరీక్ష జరగనుంది. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండి 18–44 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో ఐదేళ్లు, శారీర క వికలాంగులకు మరో 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు వర్తించనుంది. ఏఈ పోస్టుల ను కొత్త జోనల్ విధా నం కింద టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలోని పోస్టులుగా విభ జించారు. సంస్థ పరిధిలోని 16 జిల్లాల అభ్యర్థులు 95% పోస్టుల కోసం పోటీపడడానికి అర్హులు. ఏఈ పోస్టుల నోటిఫికేషన్‌ను సంస్థ వెబ్సైట్ https://tssouthernpower.cgg.gov.in లో చూడవచ్చు. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.