దేశంలో యువతుల వివాహ వయస్సు 18గా ఉంది. అంటే వారికి చట్టప్రకారం 18 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సవరించింది.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 21 ఏళ్ల వయస్సు వచ్చాకనే ఆడపిల్లలకు వివాహం చేయాలనే నిబంధనను తీసుకురానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ తాజాగా యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీ బాల్య వివాహాల నిషేధాన్ని (హిమాచల్ ప్రదేశ్ సవరణ బిల్లు 2024) వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది.
ఈ సందర్భంగా మహిళా సాధికారత శాఖ మంత్రి ధని రామ్ షాండిల్ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిషేధించేందుకు బాల్య వివాహ చట్టం 2006ను రూపొందించామని తెలిపారు. లింగ సమానత్వం, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించేందుకు యువతుల కనీస వివాహ వయస్సును పెంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం ఆడపిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహ చట్టం 2006, సంబంధిత చట్టాలను సవరించి, బాలికల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదన చేశామని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment