bill
-
వక్ఫ్ బోర్డుపై జేపీసీ నివేదిక.. రాజ్యసభలో గందరగోళం
న్యూఢిల్లీ: ఈరోజు(గురువారం) పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి దశలోని చివరి రోజు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ఉభయ సభల్లో హంగామా నెలకొంది. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) నివేదికను బీజేపీ ఎంపి మేధా కులకర్ణి ప్రవేశపెట్టారు. మరోవైపు లోక్‌సభలో ఇదేవిధమైన గందరగోళం నెలకొన్న నేపధ్యంలో సభా కార్యకలాపాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.రాజ్యసభలో జేపీసీ నివేదికపై ప్రతిపక్షాల ప్రశ్నలకు కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. తన మంత్రిత్వ శాఖ సభ్యులు జేపీసీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రతిపక్షాలు నివేదికను చదివి, ఆపై స్పందించాలని ఆయన కోరారు. ప్రశ్నలు లేవనెత్తే వారు కూడా జేపీసీ సభ్యులేనని ఆయన అన్నారు.వక్ఫ్ బిల్లుపై సభలో ప్రవేశపెట్టిన జేపీసీ నివేదికను ప్రతిపక్షం అంగీకరించబోదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. దానిని చర్చ కోసం వెనక్కి పంపాలని ఆయన ఛైర్మన్‌ను అభ్యర్థించారు. వక్ఫ్ బిల్లుపై ఏ పార్టీ అభిప్రాయాన్నీ పరిగణలోకి తీసుకోలేదని ఖర్గే అన్నారు. వక్ఫ్ బోర్డుపై జేపీసీ నివేదికపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది.జేపీసీ జనవరి 30న ముసాయిదా నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఈ నివేదికను 655 పేజీలలో పొందుపరిచారు. 16 మంది సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేశారు. 11 మంది సభ్యులు వ్యతిరేరించారు. కమిటీలోని ప్రతిపక్ష ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించారు. కాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు(గురువారం) పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టం-1961ని సరళీకరించడం ద్వారా, ఆదాయపు పన్ను చట్టాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చేయడమే దీని లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రస్తుత ఆదాయపు పన్ను-1961 కంటే శరళమైనది. అయితే దీనిలో మరిన్ని విభాగాలు, షెడ్యూళ్లు ఉన్నాయి. 622 పేజీల కొత్త బిల్లులో 23 అధ్యాయాలు, 16 షెడ్యూల్లలో 536 విభాగాలు ఉన్నాయి. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంలో 298 విభాగాలు, 14 షెడ్యూల్లు ఉన్నాయి. 880 పేజీలు. కాగా పార్లమెంటులో లోక్‌సభ కార్యకలాపాలు ఐదు నిమిషాలు మాత్రమే కొనసాగాయి. ప్రతిపక్షం గందరగోళం సృష్టించడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్ -
కొత్త ఆదాయ పన్ను బిల్లులో ‘ట్యాక్స్ ఇయర్’?
పార్లమెంటులో త్వరలో ప్రవేశపెట్టనున్న కొత్త ఆదాయపు పన్ను బిల్లు(New Income Tax Bill) సామాన్యులకు ప్రత్యక్ష పన్ను చట్టాలను సులభతరం చేయడమే లక్ష్యంగా రూపొందించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. బిల్లులో ప్రతిపాదించిన కీలక మార్పుల్లో ‘ట్యాక్స్ ఇయర్’ ఒకటని సమాచారం. ఈ మార్పువల్ల వ్యాపారుల పన్ను చెల్లింపులను సులభతరం చేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.టాక్స్ ఇయర్(Tax Year) అంటే ఏమిటి?టాక్స్ ఇయర్ అనేది నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రయోజనాల కోసం ఉపయోగించే 12 నెలల వ్యవధి. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం ట్యాక్స్ ఇయర్ ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 1961 ఆదాయపు పన్ను చట్టంలో ఉపయోగించిన ‘ప్రివియస్ ఇయర్’, ‘అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం)’ స్థానంలో ఈ ట్యాక్స్ ఇయర్‌ను వాడనున్నారు.ఇదీ చదవండి: ఎల్ అండ్ టీ చైర్మన్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలుపన్ను చట్టాలను ఎలా సులభతరం చేస్తుంది?స్థిరమైన ట్యాక్స్ ఇయర్‌ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని నివేదించడానికి, పన్నులు చెల్లించడానికి నిర్దిష్ట వ్యవధిని కలిగి ఉంటారు. ఇది విభిన్న ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరు అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం-వచ్చే ఆర్థిక సంవత్సరం)లను కలిగి ఉండటం వల్ల తలెత్తే గందరగోళాన్ని తొలగిస్తుంది.పన్ను చెల్లింపుదారులు తమ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సులభమైన, స్పష్టమైన భాషను ఉపయోగించాలని కొత్త బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన కాలం చెల్లిన నిబంధనలు, వివరణలను తొలగించాలని నిర్ణయించారు.పన్ను విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలు, క్రమబద్ధమైన విధానాతతో కొత్త పన్ను చట్టాలు వివాదాలు, లిటిగేషన్లను తగ్గిస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల మరింత పన్ను వసూలుకు వీలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుకు సంబంధించి వివాదాలు తగ్గడం వల్ల న్యాయవ్యవస్థపై భారం తగ్గుతుందని చెబుతున్నారు.తరచూ శాసన పరమైన సవరణలు అవసరం లేకుండా పన్ను పథకాలను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి ఎక్కువ అధికారాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది. -
కొత్త ఆదాయపు పన్ను బిల్లు వచ్చే వారమే
-
నెల కరెంట్ బిల్ రూ.200 కోట్లు: దెబ్బకు ఫ్యూజులు అవుట్
సాధారణంగా నెలకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది? మహా అయితే వేల రూపాయలోనే ఉంటుంది, కదా. కానీ హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ వ్యక్తికి కరెంట్ బిల్ ఏకంగా రూ.200 కోట్ల కంటే ఎక్కువే వచ్చింది. కరెంట్ బిల్ ఏమిటి? రూ.200 కోట్లు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం చదివేయాల్సిందే..హిమాచల్‌ప్రదేశ్‌లోని బెహెర్విన్ జట్టన్ గ్రామానికి చెందిన 'లలిత్ ధీమాన్' అనే వ్యాపారవేత్త.. తనకు వచ్చిన ఎలక్ట్రిక్ బిల్ చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే ఆయనకు వచ్చిన కరెంట్ బిల్ ఏకంగా రూ. 2,10,42,08,405. ఇప్పటి వరకు ఇంత కరెంట్ బిల్ బహుశా ఏ ఒక్కరికీ వచ్చి ఉండదు.రూ.2,10,42,08,405 కరెంట్ బిల్ రావడానికి ముందు నెలలో 'లలిత్ ధీమాన్'కు వచ్చిన బిల్లు రూ.2,500 మాత్రమే. భారీ మొత్తంతో కరెంట్ బిల్ రావడంతో అతడు ఫిర్యాదు చేసేందుకు విద్యుత్ బోర్డును సందర్శించాడు. సాంకేతిక లోపం వల్లనే ఈ బిల్లు వచ్చిందని.. విద్యుత్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఆ తరువాత అతనికి సరైన కరెంట్ బిల్ ఇచ్చారు. నిజానికి అతనికి వచ్చిన కరెంట్ బిల్ రూ.4047 మాత్రమే.ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే!సాంకేతిక లోపాల వల్ల భారీ బిల్లులు రావడం ఇదే మొదటి సారి కాదు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తికి 1,540 రూపాయల కరెంట్ బిల్ వస్తే.. విద్యుత్ శాఖ నుంచి 86 లక్షల రూపాయలకు పైగా బిల్లును స్వీకరించాడు. ఆ తరువాత జరిగిన తప్పిదాన్ని అధికారులు గుర్తించి ఆయనకు సరైన బిల్ ఇచ్చారు. -
‘సాక్షి’కి ఎందుకు చెప్పారు?
సాక్షి, అమరావతి: ‘‘ఏమనుకుంటున్నారు మీరంతా..? కరెంట్ గురించి, బిల్లుల గురించి ‘సాక్షి’ వాళ్లకు ఎందుకు చెప్పారు..? ఎవరు చెప్పమన్నారు..? ఇలా అయితే చాలా ఇబ్బంది పడతారు..! మరోసారి ఇలా ఎవరికైనా చెబితే సహించేది లేదు..!’’ అంటూ విద్యుత్ బిల్లుల బాధితులపై కూటమి నేతలు, అధికార యంత్రాంగం బెదిరింపులకు దిగాయి. ఏమిటీ నిరంకుశం?ఏలూరు జిల్లా మల్కీ మహ్మద్‌పురం (పల్లపూరు)లో విద్యుత్ బిల్లుల బాధితుల వద్దకు మంగళవారం వచ్చిన భీమడోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(డీఈఈ) గోపాలకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) శివాజీ, లైన్మెన్ శేషగిరితో పాటు దాదాపు పది మంది అధికారులు, సిబ్బంది, కూటమి నేతలు వారిపై విరుచుకుపడ్డారు. ‘సాక్షి’తో ఎందుకు మాట్లాడారని గద్దించారు. పింఛన్లు, రేషన్ కార్డులు తీసేస్తామంటూ హెచ్చరించారు. ఇకపై విద్యుత్ బిల్లులు, చార్జీల గురించి ఎక్కడా నోరు విప్పవద్దని తమను బెదిరించినట్లు బాధితులు వెల్లడించారు. ఇకపై తమను వేధింపులకు గురి చేస్తారని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఏమిటీ నిరంకుశత్వమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజమే కానీ.. మీరెలా రాసేస్తారు?దీనిపై ఏఈ శివాజీని వివరణ కోరగా.. ‘‘మావైపు తప్పు ఉన్న మాట వాస్తవం.. అయినా మీరు ఎలా రాసేస్తారు?’’ అంటూ ‘సాక్షి’ ప్రతినిధిని సైతం బెదిరించే ధోరణిలో మాట్లాడారు. లైన్ మెన్ శేషగిరికి ప్రతి నెలా విద్యుత్ బిల్లు నిమిత్తం డబ్బులిస్తున్నా తమకు రసీదు ఇవ్వడం లేదని ఎంఎంపురం వాసి పాపమ్మ ‘సాక్షి’కి తెలిపారు. దీన్ని లైన్మెన్ దృష్టికి తేగా రసీదు ఎక్కడో పడేశానంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. గోడు ఆలకించకుండా బెదిరింపులా..!పేదలకు సంక్షేమ పథకాలిచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుతో తమ నడ్డి విరుస్తుండటంతో హాహాకారాలు చేస్తున్నారు. వారి గోడును తెలుసుకుని వాస్తవాలను ‘సాక్షి’ అందరి దృష్టికి తెస్తోంది. వారి కష్టాలను ‘గ్రౌండ్ రిపోర్ట్’ రూపంలో ప్రచురిస్తోంది. అయితే ఇదంతా ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. కరెంటు చార్జీలు పెంచినా, పేదలకు ఉచిత విద్యుత్‌ను దూరం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదనే ధోరణితో పాలకులు వ్యవహరిస్తున్నారు. అనుమతి ప్రకారమే చార్జీలు: ఇంధన శాఖఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతితోనే ఇంధన సర్దుబాటు చార్జీలను వసూలు చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ తెలిపింది. ‘కరెంటు కోత.. చార్జీల మోత’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనంపై ఆ శాఖ స్పందించింది. ఎం.ఎం.పురంలో పాచిపని చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలు సిగారపు పాపమ్మకు పాత బకాయిల వల్లే రూ.1,345 విద్యుత్ బిల్లు వచ్చిందని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల బిల్లుల్లో కొంత, వచ్చే నెల బిల్లుల నుంచి మరికొంత మేర సర్దుబాటు చార్జీలు విధిస్తున్నట్లు వెల్లడించింది. ఏ ఒక్క ఎస్సీ, ఎస్టీ వినియోగదారుడికీ సబ్సిడీ తొలగించలేదని, ఎవరికైనా సబ్సిడీ రాకుంటే సంబంధిత ధృవపత్రాలతో మీసేవలో దరఖాస్తు చేసుకుంటే అర్హతను పరిశీలించి మంజూరు చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఎలాంటి లోడ్ రిలీఫ్ అమలు చేయడం లేదని పేర్కొంది. -
భూ భారతి బిల్లుకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూ భారతి (రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) బిల్లు–2024కు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈనెల 18వ తేదీన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై శుక్రవారం సభలో చర్చ జరిగిన అనంతరం బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.ఈ బిల్లుపై చర్చలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పాలు పంచుకోలేదు. ఈ–ఫార్ములా రేసింగ్ అంశాన్ని సభలో చర్చించాలని శుక్రవారం మొత్తం సభలో పట్టుపట్టిన బీఆర్ఎస్ కీలకమైన ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొనలేదు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి బిల్లును ఇతర పక్షాలైన బీజేపీ, ఎంఐఎం, సీపీఐలు స్వాగతిస్తూనే కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. అయితే, ఈ సవరణలను పరిగణనలోకి తీసుకోకుండానే బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. ఆనంద భాష్పాలొస్తున్నాయి.. భూ భారతి బిల్లును అసెంబ్లీ ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించగానే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు ప్రకటించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జూపల్లి కృష్ణారావులతో పాటు కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ, బీజేపీ సభ్యులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలసి అభినందించారు. అంతకుముందు చర్చకు ముగింపుగా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం నుంచి కీలకమైన ఆర్వోఆర్ చట్టం ప్రవేశపెట్టిన మూడో మంత్రిగా ఈ బిల్లు సభ ఆమోదం పొందినందుకు తన జన్మ ధన్యమైందని, ఆనంద భాష్పాలు వస్తున్నాయని భావోద్వేగానికి గురయ్యారు.వాస్తవానికి, ఈ బిల్లును మంత్రి పొంగులేటి పట్టుపట్టి మరీ ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి స్పీకర్ అనుమతి మేరకు సభలో ప్రవేశపెట్టించిæ శీతాకాల సమావేశాల్లోనే కొత్త ఆర్వోఆర్ చట్టం తీసుకురావాలన్న తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇక, బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆఫీసర్స్ గ్యాలరీలో ఉన్న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి. లచ్చిరెడ్డిలను మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు.స్పీకర్‌కు మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేల ధన్యవాదాలుఅసెంబ్లీలో భూభారతి బిల్లుకు సభ ఆమోదం లభించిన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలియజేశారు. స్పీకర్ చాంబర్లో ప్రసాద్‌కుమార్‌ను శాలువాతో సన్మానించారు. రాష్ట్ర రైతాంగం, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా దీనిని ప్రత్యేక శ్రద్ధతో రూపొందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. -
ట్రంప్ ప్రతిపాదనల్ని తిరస్కరించిన హౌస్
వాషింగ్టన్: వచ్చే ఏడా ది మార్చి 14 వ రకు ఫెడరల్ ప్రభుత్వ వ్యయంపై ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకూలురు శుక్రవారం ఉదయం ప్రవేశపెట్టిన ప్రతిపాదనలను ప్రతినిధుల సభ తిరస్కరించింది. రుణ పరిమితి పెంచుతూ చేసిన ప్రతిపాదనల్ని సభలో ప్రవేశపెట్టగానే ఒక్క పెట్టున నిరసనలు చెలరేగాయి. హఠాత్తుగా తీసుకొచ్చిన ప్రతిపాదనల్ని ఆమోదించేది లేదని సభ్యులు ప్రకటించారు. బిల్లు ఆమోదానికి కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ లభించలేదు.174–235 ఓట్ల తేడాతో వీగిపోయింది. అయితే, శుక్రవారం అర్ధరాత్రి తుది ప్రయత్నంగా తమ ప్రతిపాదనలను మరోసారి సభలో ప్రవేశపెడతామని స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటించారు. ప్రకృతి విపత్తులకు ఇచ్చే సాయం, రైతులకు ఆర్థిక సాయం కలిపి 110 బిలియన్ డాలర్లను బైడెన్ ప్రభుత్వం వ్యయ బిల్లులో ప్రతిపాదించింది. అయితే, రుణ పరిమితి పెంచితేనే ఓకే చేస్తామని ట్రంప్ అనుకూ లురు అంటున్నారు. శుక్రవారంలోగా ఈ విషయంలో స్పష్టత రాకుంటే ప్రభుత్వ పాలన స్తంభించే ప్రమాదముంది. -
జమిలి ఎన్నికలపై జేపీసీ ఏర్పాటు చేసిన కేంద్రం
-
అతుల్ సుభాష్‌కు బిల్లు నివాళి..!
అతుల్ సుభాష్ అనే టెక్కీ బలవన్మరణం దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టించింది. చట్టాలన్ని ఆడవాళ్లకేనా అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. భార్య కుటుంబం పెడుతున్న తప్పుడు కేసులతో ఎంతోమంది అతుల్ సుభాష్ లాంటి భర్తలు వేధింపులకు గురవ్వుతున్నారనే వాదన వినిపిస్తోంది. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన వైవాహిక చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని బాధిత భర్తలు ఆరోపిస్తున్నారు. చెప్పాలంటే ఆ టెక్కీ మరణం చర్చనీయాంసంగా మారడమే గాక బీటలు వారిపోతున్న వైవాహిక వ్యవస్థ, చట్టంలోని లోసుగులను లేవనెత్తింది. ప్రస్తుతంఈ విషయమే హాట్‌టాపిక్ మారింది. ఈ తరుణంలో ఢిల్లీ రెస్టారెంట్ చెందిన జంబోకింగ్ ఫ్రాంచైజీ ఆ టెక్కీ అతుల్‌కి వినూత్నంగా నివాళి ఆర్పించడం నెట్టింట వైరల్‌గా మారింది. హౌజ్ ఖాస్ అనే గ్రామంలోని జంబోకింగ్ ఫ్రాంచైజీ అవుట్‌లెట్‌కి ఓ వ్యక్తి వెళ్లాడు. అతను అక్కడ తినేసి తిరిగి వెళ్లేటప్పడూ అందుకున్న రసీదు అతడిని ఆకర్షించింది. అందులో "జస్టీస్ ఫర్ అతుల్ సుభాష్ అనే హ్యాష్ ట్యాగ్‌తో అతడి ఆత్మహత్యకు తాము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అతని జీవితం అందిరిలానే అత్యంత ముఖ్యమైనది. మీకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం." అని రాసి ఉంది. అతడు వెంటనే ఆ రసీదుని ఫోటో తీసి తన స్నేహితుడికి పంపండంతో రెడ్డిట్‌లో వైరల్‌గా మారింది. ఆ జంబోకింగ్ ఫ్రాంచైజీని స్వామి సమర్థ్ ఫుడ్స్ నడుపుతోంది. అందర్ని కదలించిన ఆ టెక్కీ ఆవేదనను సహృద్భావంతో అర్థం చేసుకుని ఇలా వినూత్నంగా నివాళులర్నించడమే గాక అతడికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ.. అందరికీ అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉంది. పైగా అందుకోసం ఇలా రసీదుని ఉపయోగించుకోవడమనేది ప్రశంసనీయం. అంతేగాదు సదరు వ్యక్తి ఈ విషయమై జంబోకింగ్ ఫ్రాంచైజీ యజమానిని ప్రశ్నించగా.. దానికి ఆ వ్యాపారి ప్రతీది వ్యాపారం కాదని తన దైన శైలి బదులిచ్చి అందరి మనసులను గెలుచుకున్నాడు. నెటిజన్లు కూడా.. ఆ వ్యాపారి విశాల హృదయాన్ని ప్రశంసించగా, ఇలా జొమాటా, స్విగ్గీలు కూడా చెయ్యొచు గదా అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: గట్ హెల్త్‌పై దృష్టి పెడదాం..ఆరోగ్యంగా ఉందాం..!) -
లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
-
విపక్షాల వ్యతిరేకత మధ్యే జమిలి బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
-
‘జమిలి’కి వేళయిందా?!
మొత్తానికి బీజేపీ చిరకాల వాంఛ నెరవేరటంలో తొలి అడుగుపడింది. దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు ముసాయిదా బిల్లులు మంగళవారం లోక్‌సభలో ప్రవేశించాయి. అందరూ అనుకున్నట్టే ఈ బిల్లులకు విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వచ్చినంత వేగంగా రెండు బిల్లులూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు వెళ్లబోతున్నాయి. తరచు జరిగే ఎన్నికల వల్ల పాలనా నిర్వహణలో అస్థిరత నెలకొంటున్నదని, కీలకమైన ప్రాజెక్టుల సాకారంలో అంతులేని జాప్యం చోటుచేసుకుంటున్నదని, ఎన్నికలకు తడిసి మోపెడు వ్యయం అవుతున్నదని ప్రభుత్వ పెద్దలు చాన్నాళ్లుగా వాదిస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై స్పష్టత వుంటే పాలన కుంటు పడదని, అధికార యంత్రాంగంపైనా, ఖజానాపైనా భారం తగ్గుతుందని, వోటింగ్ శాతం పెరుగు తుందని వారి వాదన. ఈ విషయమై కేంద్రం మాజీ రాష్ట్రపతి రావ్‌ునాథ్ కోవింద్ నేతృత్వంలో నియమించిన బృందం సైతం పాలకుల వాదనకు అనుకూలంగా సిఫార్సులు చేసింది. జమిలి ఎన్నికల వల్ల సుస్థిరత ఏర్పడి పెట్టుబడులు పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధికి వీలవుతుందని, వనరుల కేటాయింపు సమర్థంగా చేయొచ్చని వివరించింది. మతపరమైన ఉద్రిక్తతలు తగ్గి భద్రతా బలగాల వినియోగం పెద్దగా ఉండబోదన్నది ఆ బృందం అభిప్రాయం. జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని 83, 172, 324 అధికరణాలను సవరించాల్సి వుంటుంది. అందుకోసమే ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టారు. వోటర్ల జాబితాకు సంబంధించి రాజ్యాంగంలోని 325 అధికరణను సవరించే మరో బిల్లు అవసరమవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆధ్వర్యంలో లోపరహితమైన జాబితా రూపొంది లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. అంటే జమిలి కేవలం ఈ రెండు సభలకు సంబంధించిందే. ఈ ఎన్నికలు పూర్తయిన వందరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయి.మొత్తానికి ఎన్నికల జాతర అయిదేళ్లకోసారి మాత్రమే ఉంటుంది. మధ్యలో ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం కుప్పకూలి అసెంబ్లీ ఎన్నికలు తప్పనిసరైతే వాటిని జరుపుతారట. కానీ ఆ కొత్త ప్రభుత్వాల ఆయుష్షు ఆ మిగి లిన సంవత్సరాలకు మాత్రమే పరిమితమవుతుందట. అంటే అయిదేళ్ల కాలానికి ఎన్నికైన ప్రభుత్వం మూడేళ్లకే పతనమైతే... కొత్తగా ఎన్నికలై వచ్చే పాలకులకు కేవలం రెండేళ్లు మాత్రమే పదవీయోగం దక్కుతుందన్నమాట! సారాంశంలో ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ఆదర్శం కాస్తా అట కెక్కినట్టే అవుతుంది. మరి ఈ బిల్లులు సాధించదల్చుకున్నదేమిటి? ఈ బిల్లులు గట్టెక్కటం అంత సులభమేమీ కాదు. ఏ రాజ్యాంగ సవరణ బిల్లుకైనా మూడింట రెండువంతుల మెజారిటీ తప్పనిసరి. ఆ రకంగా చూస్తే 543 మంది సభ్యులున్న సభలో ఈ బిల్లు లకు మద్దతుగా కనీసం 362 మంది వోటేయాలి. కానీ ఎన్డీయే బలం 293. అంటే మరో 69 మంది మద్దతు అవసరమవుతుంది. రాజ్యసభ వరకూ చూస్తే 163 మంది బిల్లులకు అనుకూలంగా వోటే యాలి. కానీ ఎన్డీయే బలం 121. ఆ తర్వాత రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా తప్పనిసరి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన చట్టాలు మార్చాలంటే కనీసం సగం అసెంబ్లీలు అందుకు అంగీ కరించాలి. కోవింద్ కమిటీ ముందు 47 రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలు వినిపించాయి. 32 పార్టీలు అనుకూలం కాగా, 15 పార్టీలు ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’కు వ్యతిరేకమని తేలింది. ప్రజాస్వామ్యమంటే కేవలం అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికలు మాత్రమే కాదన్న సంగతి పాలకులు మరిచిపోయి చాన్నాళ్లయింది. ఎన్నికల్లో చెప్పేది ఒకటైతే, గెలిచాక చేసేది మరొకటి.కేంద్రంలో మాత్రమే కాదు... ఏపీలోని ఎన్డీయే పాలన చూసినా ఈ సంగతి ఇట్టే అర్థమవుతుంది. ఏపీలో నదురూ బెదురూ లేకుండా ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ ఎగనామం పెట్టారు. ఇక ఎక్కడ ఎన్ని కలు జరిగినా ఈవీఎంలపై అనుమానాలు మొదలవుతున్నాయి. ఏపీలో ఎన్నికలు పూర్తయినవెంటనే ఈసీ ప్రకటించిన ఓట్లకు లెక్కించినప్పుడు అదనంగా మరో పన్నెండున్నర శాతం ఓట్లు వచ్చిచేరాయి. దేశంలో అత్యధిక నియోజకవర్గాల్లో సగటున వెయ్యి ఓట్లు ఇలా అదనంగా చేరినట్టు బయటపడింది. దీనిపై సంజాయిషీ ఇవ్వాలన్న కనీస సంస్కారం ఈసీకి లేకపోగా... ఈవీఎంలలో పోలైన ఓట్లనూ, వీవీ ప్యాట్ స్లిప్‌లనూ సరిపోల్చాలన్న వినతుల్ని బుట్టదాఖలా చేసింది. పైగా అతి తెలివి ప్రదర్శించి డమ్మీ పోలింగ్ నిర్వహణకు దిగింది! ఏపీకి సంబంధించినంతవరకూ అయితే గడువుకు ముందే వీవీ ప్యాట్ స్లిప్‌లను ధ్వంసం చేశారు. ఈవీఎంల డేటా తొలగించారు. ఈ వైపరీ త్యాలపై తామేం చేయాలన్న స్పృహ, వివేకం కేంద్ర పాలకులకు లేకపోగా... ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ లోనే దేశ భవిష్యత్తు సర్వం ఆధారపడి వున్నట్టు భూమ్యాకాశాలు ఏకం చేస్తున్నారు.పైగా ఈ మాదిరి ఎన్నికలు ప్రాంతీయ ఆకాంక్షలనూ, అవసరాలనూ పాతరపెడతాయన్న ఆరోపణలకు సరైన జవాబు లేదు. ఈ విధానం దేశ ఫెడరల్ స్వభావాన్ని దెబ్బతీస్తుందన్న విమ ర్శను బేఖాతరు చేస్తున్నారు. అసలు 140 కోట్ల జనాభా... 30 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతా లున్న దేశాన్నీ... లెక్కకు మిక్కిలివున్న పార్టీలనూ ‘జమిలి’ చట్రంలో బిగించి ఒక్క వోటుకి కుదించాలన్న ప్రతిపాదనే వింతై నది. దానిపై బిల్లులు పెట్టేముందు విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయం సాధించాలన్న కనీస ఇంగితజ్ఞానం కొరవడితే ఎలా? అగ్రరాజ్యమైన అమెరికాలోనే నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరుపుతూ, రాష్ట్రాల సెనేట్లకూ, స్థానిక సంస్థలకూ, ప్రతినిధుల సభకూ నిర్ణీత కాలంలో విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తుండగా దాదాపు 97 కోట్లమంది వోటర్లున్న ఈ అతి పెద్ద దేశంలో జమిలికి తహతహలాడటంలోని మర్మమేమిటి? -
జమిలి బిల్లు ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ ఆమోదం
Lok Sabha Session Updatesలోక్‌సభ రేపటికి వాయిదాతిరిగి ప్రారంభమైన లోక్‌సభ లంచ్‌కు ముందు జమిలి బిల్లు ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ ఆమోదంఇక.. జేపీసీ ముందుకు జమిలి బిల్లులు!లోక్‌సభలో జమిలి ప్రవేశపెట్టడానికి ఆమోదంపార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ) ముందుకు బిల్లులువన్ నేషన్.. వన్ ఎలక్షన్లో భాగంగా 129 రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన బిల్లు కూడాజేపీసీ ద్వారా విస్తృస్థాయి చర్చకు అవకాశంఅతిత్వరలో జేపీసీ ఏర్పాటుజేపీసీ చైర్మన్‌ను ఎంపిక చేయనున్న లోక్‌సభ స్పీకర్సంఖ్యా బలం దృష్ట్యా బీజేపీ నుంచే జేపీసీకి చైర్మన్జేపీసీలో విపక్ష సభ్యులకు కూడా స్థానంసభ్యుల పేర్లను ప్రతిపాదించని తరుణంలో.. సభ్యత్వం కోల్పోయే అవకాశంజమిలి బిల్లు కాపీ కోసం క్లిక్ చేయండి వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదంతీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలుబిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్ నిర్వహించిన స్పీకర్ ఓం బిర్లాకొత్త పార్లమెంట్లో ఫస్ట్ డిజిటల్ ఓటింగ్అనుమానాలున్నవాళ్లకు స్లిప్పులు పంచిన సిబ్బందిఅనుకూలంగా 269 ఓట్లు.. వ్యతిరేకంగా 198 ఓట్లులోక్సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా‘జమిలి’ బిల్లుపై ఓటింగ్ అనంతరం 3 గంటలకు వాయిదాపడ్డ లోక్‌సభ ‘జమిలి’ బిల్లు ‘జేపీసీ’కి.. సాధారణ మెజారిటీతో ఓకే అన్న లోక్‌సభ కొత్త పార్లమెంట్ భవనంలో జమిలి బిల్లుపై తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్విపక్షాలు డివిజన్ కోరడంతో ఓటింగ్‌కు అనుమతిచ్చిన స్పీకర్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి, జేపీసీలో చర్చకు పంపేందుకు అనుకూలంగా 269 ఓట్లు బిల్లు ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా 198 ఓట్లు #WATCH | In a first, E-voting on 'One Nation One Election' Bill underway in Lok Sabha. (Source: Sansad TV) pic.twitter.com/dMRk6UEjeO— ANI (@ANI) December 17, 2024జేపీసీకి జమిలి బిల్లు పంపేందుకు సిద్ధం: అమిత్ షా జమిలి ఎన్నికల బిల్లును జేపీసీ కి పంపేందుకు సిద్ధంఈ బిల్లును జేపీసీకి పంపి విస్తృతంగా చర్చించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారుజేపీసీ నివేదిక తర్వాత మళ్లీ బిల్లు తీసుకువస్తాం లోక్‌సభలోకి జమిలి ఎన్నికల బిల్లు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టిన న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మేఘ్వాల్ తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే చర్య అని మండిపాటు రాజ్యాంగ సవరణకు సంబంధించిన రెండు బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలి రాష్ట్రాల అసెంబ్లీల కాలపరమితి కుదించడం రాజ్యాంగ విరుద్ధం కాంగ్రెస్ ఎంపీ మనీష్‌తివారీ డిమాండ్ జమిలి ఎన్నికల బిల్లుపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఫైర్ జమిలి ఎన్నికలు నియంతృత్వ పాలనకు నాంది అని వ్యాఖ్యబిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన బిల్లును ఉపసంహరించుకోవాలని టీఎంసీ, డీఎంకే డిమాండ్జమిలి ఎన్నికలు ఎన్నికల సంస్కరణ కాదన్న టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీఈ బిల్లు ఆమోదం పొందితే ఎన్నికల కమిషన్‌కు సర్వాధికారాలు వస్తాయిజమిలి ఎన్నికల బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లేనపుడు బిల్లు ఎలా తెస్తారని ప్రశ్నించిన డీఎంకే జమిలి బిల్లు రాజ్యాంగ విరుద్ధం: ఎంఐఎం అధినేత అసదుద్దీన్జమిలి ఎన్నికలు ఒక లీడర్ ఈగో కోసమే వచ్చిన ఆలోచనరాష్ట్రాల హక్కులను హరిస్తున్నారుబిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాంజమిలి ఎన్నికలకు వైఎస్సార్సీపీ మద్దతులోక్సభలో జమిలి బిల్లులకు టీడీపీ మద్దతుజమిలి ఎన్నికల బిల్లుపై దేశమంతా చర్చ జరగాలి: ఎంపీ రఘునందన్‌రావు గతంలో కూడా నాలుగు సార్లు జమిలి ఎన్నికలు జరిగాయిజమిలి ఎన్నికలతో అధ్యక్ష తరహా పాలన జరగదుఈ బిల్లుకు 31 పార్టీలు మద్దతిస్తున్నాయిఇంకా 15 పార్టీలు మద్దతు ఇవ్వాల్సి ఉందిఏ పార్టీని మేము బుల్డోజ్ చేయంజమిలి ఎన్నికలు దేశ ప్రజల ఆకాంక్షప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలికాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలిఇండియా కూటమిలో ఇప్పటికే లుకలుకలు ఉన్నాయివన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు తప్పనిసరిగా పాస్ అవుతుందని నమ్మకం ఉందిఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్..జమిలి ఎన్నికల బిల్లును లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టనున్నారుఈ సందర్భంగా కాంగ్రెస్ తన ఎంపీలకు విప్ జారీ చేసిందిఎంపీలంతా సభకు హాజరుకావాలని కోరింది సభలోకి వెళ్లేముందే జమిలి ఎన్నికల బిల్లుపై చర్చించే అవకాశం ఉందిసభలోకి రెండు బిల్లులు..జమిలి ఎన్నికల 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు–2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024ను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు వాటిని ఇవాళ లోక్‌సభ బిజినెస్ జాబితాలో చేర్చారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు సంబంధించిన ఈ బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశ పెడతారని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. అనంతరం విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్‌ను మంత్రి అభ్యర్థించవచ్చని వివరించాయి. ఇందుకు వీలుగా కమిటీకి చైర్మన్, సభ్యులను స్పీకర్ నియమిస్తారు. సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు అందులో స్థానం కల్పిస్తారు. బీజేపీ ఎంపీల్లో ఒకరిని చైర్మన్‌గా ఎంపిక చేయనున్నారు. భాగస్వామ్య పక్షాలందరితో చర్చించిన మీదట కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గడువు పొడిగిస్తారు.20వ తేదీతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నందున జమిలి బిల్లులను మంగళవారమే ప్రవేశపెట్టనున్నట్టు జాతీయ మీడియా కూడా పేర్కొంది.జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించినట్టు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ వెల్లడించింది. -
జమిలి ఎన్నికల బిల్లు వాయిదా!
-
పార్లమెంట్ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
-
జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్రం కసరత్తు
-
2027లో జమిలి ఎన్నికలు..?
సాక్షి,న్యూఢిల్లీ:జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 2027లోనే దేశంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధపడిందన్న ప్రచారం జరుగుతోంది. జమిలి ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్లో ఆమోదించాల్సిన బిల్లు కూడా ఇప్పటికే సిద్ధమైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది. కాగా,ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు సహా పలు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని, జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టబోరని ప్రచారం జరగడం గమనార్హం. -
రిపేర్ బిల్లు చూసి చిర్రెత్తిన కస్టమర్!
స్కూటర్ రిపేర్ వస్తే షోరూమ్ వాళ్లు వేసిన బిల్లు చూసి ఓ కస్టమర్ నిర్ఘాంతపోయాడు. ఆ బిల్లు ఏకంగా ప్రస్తుతం కొత్త స్కూటర్ రేటుతో దాదాపు సమానంగా ఉంది. దాంతో చిర్రెత్తిన ఆ కస్టమర్ స్కూటర్ షోరూమ్ ముందే సుత్తితో స్కూటర్‌ను పగలగొట్టాడు. ఆ స్కూటర్ షోరూమ్‌కు రిపేర్ కోసం వచ్చిన ఇతర కస్టమర్లు చుట్టూ చేరి సుత్తితో బాదే కస్టమర్ చర్యలకు మద్దతుగా నిలిచారు. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేర్ కోసం ఓ కస్టమర్ షోరూమ్‌ను సంప్రదించాడు. రిపేర్ పూర్తయ్యాక బిల్లు చూసిన తాను షాక్‌కు గురయ్యాడు. ఏకంగా రూ.90,000 బిల్లు చేసినట్లు గుర్తించాడు. దాంతో కోపంతో ఆ షోరూమ్ ముందే స్కూటర్‌ను సుత్తితో పగలగొట్టాడు. రిపేర్ బిల్లులకు సంబంధించి సరైన నిబంధనలు పాటించడం లేదని ఇతర కస్టమర్లు తన చర్యను సమర్థించారు. ఈమేరకు తీసిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది.Furious Ola Electric customer smashes scooter with hammer after allegedly receiving ₹90,000 bill from showroom. pic.twitter.com/c6lYSKSUf7— Gems (@gemsofbabus_) November 24, 2024ఇదీ చదవండి: అదానీకి యూఎస్ ఎస్ఈసీ సమన్లుఓలా స్కూటర్లకు సంబంధించి ఇటీవల ఫిర్యాదులు పెరుగుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఓలా కస్టమర్ల నుంచి 10,644 ఫిర్యాదులు వచ్చినట్లు, వాటిని పరిష్కరించాలనేలా సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) గతంలో సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కంపెనీ సర్వీసుకు సంబంధించి ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వివాదం నెలకొంది. కంపెనీ సర్వీసు సరిగా లేదని పేర్కొంటూ సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఫొటోను కమ్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై భవిష్ స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. -
లోకాయుక్త బిల్లు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చట్టానికి సవరణలు తీసుకొస్తూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిపాదనలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగాలేవని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్‌రావు అభిప్రాయపడ్డారు. సీఎం పేరుతో మంత్రి నారా లోకేశ్ లోకాయుక్త చట్ట సవరణ బిల్లు ఆమోదం కోసం శుక్రవారం ‘మండలి’లో ప్రవేశపెట్టగా, దానిపై కొద్దిసేపు చర్చ జరిగింది. బిల్లులో సవరణలపై లోకేశ్ వివరిస్తూ.. లోకాయుక్త, సభ్యుల నియామక కమిటీలో సీఎం చైర్మన్‌గా, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, హోంమంత్రి లేదా సీఎం నామినేట్ చేసే మంత్రి సభ్యులుగా ఉంటారని.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లేనిపక్షంలో మిగతా నలుగురు సభ్యులతో లోకాయుక్త కమిటీ సమావేశం ఏర్పాటుకు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. దీనిపై లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ జోడు గుర్రాల్లా వెళ్లాలని ఓ రాజనీతిశాస్త్ర అధ్యాపకుడిగా నేను భావిస్తున్నా. బిల్లు సారాంశం నాకు అర్థమైనంత వరకు.. ప్రతిపక్ష నాయకుడు లేరు కాబట్టి ఆయనను మినహాయిస్తూ, మిగిలిన నలుగురితో చేయాలని అనుకుంటున్నట్లుగా ఉంది. నిజానికి.. ప్రతిపక్ష నాయకుడు లేకపోయినా, ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షం నుంచి ఎవరైనా ఒక సభ్యుడు ఉండేలా కమిటీ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. దానికి ప్రతిపక్ష హోదా అక్కరలేదు. ప్రతిపక్ష పార్టీ అక్కడ ఉంది. ఆ పార్టీని ఎవరో ఒక సభ్యుడిని నామినేట్ చేయమని అడగొచ్చు. మీ ప్రతిపాదనలు ప్రజాస్వామ్య స్పిరిట్ కాదు’ అంటూ మాట్లాడారు. ఈ సమయంలో పలువురు టీడీపీ సభ్యులు పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయగా.. లక్ష్మణరావు స్పందిస్తూ.. ‘వాదనలు చేయాలంటే చాలా చెయ్యొచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రం చెబుతున్నా. ఆచరిస్తే ఆచరించండి లేకపోతే లేద’ని తెలిపారు.ప్రజాస్వామ్యయుతంగానే ముందుకు..లక్ష్మణరావు చేసిన సూచనపై లోకేశ్ స్పందిస్తూ.. ‘ప్రతిపక్ష నేత లేనిపక్షంలో అని బిల్లులో పేర్కొన్నాం.. అంతేగానీ ఏమీ తీసివేయడంలేదు. ఆయన లేనిపక్షంలో నలుగురుతో జరుగుతుందని మాత్రమే బిల్లులో పేర్కొన్నాం’.. అని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగానే లోకాయుక్తను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. మాజీ సీఎం జగన్ రెండు సమావేశాల నుంచి సభకు రాని పరిస్థితి అని.. అన్నీ పరిగణనలోకి తీసుకునే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చర్చ అనంతరం, సభ మూజువాణితో బిల్లు ఆమోదం పొందినట్లు మండలి చైర్మన్ ప్రకటించారు.మరో ఏడు బిల్లులు కూడా.. జ్యుడీషియల్ ప్రివ్యూకు రద్దుఇప్పటికే అసెంబ్లీ ఆమోదం పొందిన లాండ్ గ్రాబింగ్ సవరణ బిల్లు, పీడీ యాక్ట్ సవరణ బిల్లు, దేవదాయశాఖ పాలక మండలి కమిటీ అదనపు సభ్యుల నియామకం సవరణ బిల్లు, జ్యుడీషియల్ ప్రివ్యూకు సంబంధించిన బిల్లులతో పాటు మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, వ్యాట్ చట్ట సవరణ బిల్లులు కూడా శుక్రవారం మండలిలో ఆమోదం పొందాయి. -
ఆ రాష్ట్రంలో యువతుల వివాహ వయస్సు పెంపు
దేశంలో యువతుల వివాహ వయస్సు 18గా ఉంది. అంటే వారికి చట్టప్రకారం 18 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సవరించింది.హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 21 ఏళ్ల వయస్సు వచ్చాకనే ఆడపిల్లలకు వివాహం చేయాలనే నిబంధనను తీసుకురానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ తాజాగా యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీ బాల్య వివాహాల నిషేధాన్ని (హిమాచల్ ప్రదేశ్ సవరణ బిల్లు 2024) వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది.ఈ సందర్భంగా మహిళా సాధికారత శాఖ మంత్రి ధని రామ్ షాండిల్ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిషేధించేందుకు బాల్య వివాహ చట్టం 2006ను రూపొందించామని తెలిపారు. లింగ సమానత్వం, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించేందుకు యువతుల కనీస వివాహ వయస్సును పెంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం ఆడపిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహ చట్టం 2006, సంబంధిత చట్టాలను సవరించి, బాలికల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదన చేశామని మంత్రి తెలిపారు. -
దారికొచ్చిన ఎన్డీయే సర్కారు!
అలవాటైన పద్ధతిలో వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎన్డీయే ప్రభుత్వానికి కాసేపటికే తత్వం బోధపడినట్టుంది. విపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురుకావటంతో దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపటానికి అంగీకరించింది. కారణమేదైనా అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు జేపీసీకి లేదా సెలెక్ట్ కమిటీకి పంపటం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక సంప్రదాయం. కానీ ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కేవలం రెండు సంద ర్భాల్లో మాత్రమే పాటించింది. పదేళ్లనాడు గద్దెనెక్కగానే అంతకు కొన్ని నెలలముందు అమల్లోకొచ్చిన భూసేకరణ చట్టం పీకనొక్కుతూ ఆదరా బాదరాగా ఆర్డినెన్స్ తీసుకురావటం ఎవరూ మరిచిపోరు. విపక్షాలు అభ్యంతరం చెబుతున్నా ఆనాడు చెవికెక్కలేదు. ఆర్డినెన్స్ మురిగి పోయిన రెండుసార్లూ దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ తిరిగి ఆర్డినెన్సులు తీసుకొచ్చారు. రాజ్యసభలోగండం గడిచేలా లేదని గ్రహించాక ఇక దాని జోలికి పోరాదని నిర్ణయించుకున్నారు. అటుపై సాగు చట్టాల విషయంలోనూ రైతులనుంచి ఇలాంటి పరాభవమే ఎదురయ్యాక వాటినీ ఉపసంహరించుకున్నారు. ఐపీసీ, సాక్ష్యాధారాల చట్టం, సీఆర్పీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టాల తాలూకు బిల్లులపై కూడా సంబంధిత వర్గాలను సరిగా సంప్రదించలేదు. ఎన్డీయే ఏలుబడి మొదలయ్యాక చోటుచేసుకున్న వేర్వేరు ఉదంతాల పర్యవసానంగా ముస్లిం సమాజంలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడిన నేపథ్యంలో ఈ వివాదాస్పద చర్యకు కేంద్రం ఎందుకు సిద్ధపడిందో తెలియదు. బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీ(యూ) నేత, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అంటున్నారు. ఇది పారదర్శకత తీసుకొస్తుందని కూడా ఆయన సెలవిచ్చారు. మంచిదే. మరి ఆ వర్గంతో సంప్రదింపులు జరిగిందెక్కడ? ముస్లిం సమాజానికున్న అభ్యంతరాల సంగతలా వుంచి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు సైతం ఇది ఎసరు పెడుతోంది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం భూమి రాష్ట్రాల జాబితాలోనిది.వక్ఫ్ ఆస్తిపై కేంద్ర పెత్తనాన్ని అనుమతించటంద్వారా దాన్ని కాస్తా తాజా బిల్లు నీరుగారుస్తోంది. కనుక ముస్లిం సమాజంతో మాత్రమేకాదు...రాష్ట్రాలతో కూడా సంప్రదించాల్సిన అవసరం లేదా? హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లు తెచ్చారని లోక్‌సభలో విపక్షాలు చేసిన విమర్శలు కాదని చెప్పటానికి ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. తన చర్య వెనక సదుద్దేశం ఉందనుకున్నప్పుడూ, బిల్లుపై ఉన్నవన్నీ అపోహలే అని భావించి నప్పుడూ తగిన సమయం తీసుకుని సంబంధిత వర్గాలతో చర్చించటానికేమైంది? ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే హడావిడిగా బిల్లు తీసుకొచ్చి వుంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఉండదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ మాదిరి ఎత్తుగడలను జనం ఏవగించు కున్నారని బీజేపీకి అర్థమయ్యే వుండాలి.సవరణ బిల్లు ద్వారా తీసుకొచ్చిన 44 సవరణల పర్యవసానంగా వక్ఫ్ బోర్డుల అధికారాలకు కత్తెరపడుతుందని, ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుందని కనబడుతూనేవుంది. అరుదైన సంద ర్భాల్లో తప్ప కలెక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోరు. ఫలానా ప్రార్థనాస్థలం శతాబ్దాలక్రితం తమదేనంటూ ఆందోళనలు చేయటం, దానికి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతుండటం అక్కడక్కడ కనబడుతూనేవుంది. ఇంతకాలం వక్ఫ్ ట్రిబ్యున ళ్లకు ఉండే అధికారం కాస్తా కలెక్టర్లకు ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించటం, ఆస్తిని విరాళంగా ఇవ్వటంపై ఆంక్షలు సంశయం కలిగించేవే. మతపరమైన, ధార్మికపరమైన కార్యకలాపాల నిర్వహణ కోసం వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించటానికి ఏర్పడిన బోర్డుల్లో వేరే మత విశ్వాసాలున్నవారిని నియమించటం ఏరకంగా చూసినా సరికాదన్న ఇంగిత జ్ఞానం ఉండొద్దా? అసలు ఒకసారి బోర్డు దేన్నయినా వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే దాన్ని మార్చటం అసాధ్యమన్న ప్రచారం కూడా తప్పు. ఫలానా ఆస్తి బోర్డుదనుకుంటే సంబంధిత వర్గాలకు నోటీసులిచ్చి వారి వాదనలు పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రస్తుత చట్టంలోని సెక్షన్40 చెబుతోంది. అటు తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్‌దే తుది నిర్ణయం. పైగా విరాళమిచ్చిన దాత కచ్చితంగా ఇస్లాంను పాటించే వ్యక్తే అయివుండాలని, దానంగా వచ్చే ఆస్తి కుటుంబవారసత్వ ఆస్తి కాకూడదని చట్టం నిర్దేశిస్తోంది. ఇప్పటికే ఇన్ని కట్టుదిట్టమైన నిబంధనలుండగా అందుకు భిన్నంగా ప్రచారం చేయటం సబబేనా? ఈ పరిస్థితుల్లో బిల్లు చట్టమైతే వక్ఫ్ ఆస్తుల చుట్టూ వివాదాలు ముసురుకుంటాయనుకునే అవకాశం లేదా? సంకీర్ణంలోని జేడీ(యూ), ఎల్జేపీలు బిల్లుకు మద్దతు పలకగా సభలో టీడీపీ సంకటస్థితిలో పడిన వైనం స్పష్టంగా కనబడింది. ఆ బిల్లుకు మద్దతిస్తుందట...కానీ జేపీసీకి ‘పంపితే’ వ్యతిరే కించబోదట! ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టుకొచ్చిన బాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇంకా సజీవంగా ఉందన్నమాట! టీడీపీది చిత్రమైన వాదన. అలా పంపనట్టయితే వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించబోమని చెప్పడానికి నోరెందుకు రాలేదు? ఒకపక్క బిల్లు చట్టమైతే పారదర్శకత ఏర్పడుతుందన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూనే తమ సెక్యులర్ వేషానికి భంగం కలగకుండా ఆడిన ఈ డ్రామా రక్తి కట్టలేదు. జాతీయ మీడియా దీన్ని గమనించింది. మొత్తానికి సవరణ బిల్లు జేపీసీకి వెళ్లటం శుభ పరిణామం. ఎన్డీయే సర్కారు ఈ సంప్రదాయాన్ని మున్ముందు కూడా పాటించటం ఉత్తమం. -
వక్ఫ్ బోర్డు బిల్ పై కేంద్రం కీలక నిర్ణయం
-
Gold Scam: క్యారెట్లలో కిరికిరి.. కొనేదంతా బంగారం కాదు!
హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీకి చెందిన ఒక మహిళ తన బంగారు ఆభరణాన్ని కరిగించి మరో ఆభరణం తయారు చేయించుకునేందుకు స్వర్ణకారుడి వద్దకు వెళ్లింది. ఆభరణాన్ని పరిశీలించగా అందులో 70 శాతానికి మించి బంగారం లేదు. హాల్‌మార్క్ సెంటర్‌కు పంపి పరిశీలిస్తే ఆభరణంలో రాగి 16.47 శాతం, వెండి 15.23 శాతం ఉండగా బంగారం 68.12 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. గతంలో ఆ ఆభరణాన్ని విక్రయించిన వ్యాపారి ఇచ్చిన రసీదు అందుబాటులో లేకపోవడంతో ప్రశ్నించే అవకాశం లేకుండాపోయింది.బంగారంపై మహిళలకుండే మక్కువ అంతా ఇంతా కాదు. బంగారంతో చేసిన ఆభరణాలపై ఉండే క్రేజే వేరు. ధనం లేకున్నా, తులం బంగారం అయినా ఒంటి మీద ఉండాలని సగటు మధ్య తరగతి మహిళలు భావిస్తుంటారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతిఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు వీలైనప్పుడల్లా బంగారు ఆభరణాలు కొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో కొత్త బంగారు ఆభరణాలు కొనేవారి సంఖ్య, అన్‌సీజన్‌లో పాత బంగారంతో కొత్త ఆభరణాలు చేయించేకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో అధికంగా ఉంటోంది. గతంలో పెళ్లినాడు ఏ నగలైతే పెట్టుకునేవాళ్లో వాటినే భద్రంగా కాపాడుకుంటూ శుభకార్యాల్లో ధరించేవాళ్లు. ప్రస్తుతం ట్రెండ్ మారింది.పాత నగలను ఫ్యాషన్‌కు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కొనేటప్పుడు ఆ ఆభరణాన్ని మొత్తం బంగారం కిందే లెక్కించి వ్యాపారి డబ్బులు వసూలు చేస్తాడు. అదే కొంత కాలం తర్వాత కొన్న బంగారాన్ని కరిగించి మరో ఆభరణం తయారీ కోసమో, ఆర్థిక అవసరాల కోసం అమ్మడానికో వెళితే అసలు రంగు బయటపడుతుంది. క్యారెట్ల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత తక్కువుందనో, వేస్టేజీ ఎక్కువుందనో పేర్కొంటూ వీలైనంత తక్కువ చెల్లించడం సర్వసాధారణం. ఇక వజ్రా భరణాల్లో మేలిమి బంగారం నేతి బీరలో నెయ్యి చందంగానే మారింది. కళ్ల ముందే బంగారం స్వచ్ఛతలో మాయ చేస్తున్నా నాణ్యత గుర్తించలేక వినియోగదారులు నష్టపోతున్నారు. సాక్షి హైదరాబాద్మోసం ఇలా..ప్రముఖ జ్యువెలరీస్, షాపింగ్ మాల్స్ నుంచి చిన్నపాటి స్వర్ణకారుడి షాపు వరకు కూడా 24 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్నే విక్రయిస్తుంటాయి. ఆభరణంలో పటుత్వం కోసం రాగి కలుపుతారు. సాధారణంగా ఆభరణాలన్నీ 22 క్యారెట్లు లేదా కొంచెం తక్కువ నాణ్యత కలిగి ఉంటాయి. వజ్రాల నగ కేవలం 18 క్యారెట్‌తోనే ఉంటుంది. అయితే వ్యాపారులు 18 క్యారెట్ల అభరణాన్ని చేతిలో పెట్టి 22 క్యారెట్ల బిల్లు వసూలు చేయడం సర్వసాధరణంగా మారిపోయింది. 22 క్యారెట్లు 18 క్యారెట్ల ఆభరణానికి మధ్య గ్రాముకు కనీసం రూ.500 నుంచి రూ.1,000 వరకు వ్యత్యాసం ఉంటుంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారానికి దాదాపు రూ.10 వేల వరకు వినియోగదారులు మోసపోతున్నారన్నమాట.హాల్‌మార్క్ ముద్ర తప్పనిసరివంద శాతం స్వచ్ఛతతో కూడిన మేలిమి బంగారం బిస్కెట్ రూపంలో ఉంటుంది. కాగా బంగారు ఆభరణాల్లో స్వచ్ఛతను హాల్ మార్క్ ముద్ర తెలియజేస్తుంది. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) నిబంధన మేరకు బంగారం ఉంటేనే సదరు ఆభరణంపై హాల్ మార్క్ ముద్ర ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750 అని ముద్ర ఉంటుంది. ఈ నంబర్ తర్వాత హాల్ మార్క్ వేసిన సెంటర్ మార్క్ ఉంటుంది. తయారైన సంవత్సరం ఇంగ్లిష్ అక్షరం కోడ్ రూపంలో ఉంటుంది. చివరిలో బీఐఎస్ ధ్రువీకరించిన ఆభరణాల తయారీదారుల గుర్తు ఉంటుంది. ఈ హాల్‌మార్క్ ముద్ర లేని ఆభరణాల కొనుగోలులోనే మోసాలకు అవకాశం ఉంటుంది.స్వచ్ఛత...క్యారెట్లలోబంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. ఇది 0 నుంచి 24 వరకు ఉంటుంది. క్యారెట్ విలువ ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంత స్వచ్ఛత లేదా నాణ్యత కలిగి ఉన్నట్టన్న మాట. ధర కూడా ఆ మేరకే ఉంటుంది. బంగారం ఎంతో సున్నితంగా పెళుసు స్వభావంతో కూడిన లోహం. కాబట్టే ఆభరణాల తయారీలో అది గట్టిగా ఉండేందుకు రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలుపుతారు. బంగారం, ఇతర లోహాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయనేది క్యారెట్ ద్వారా తెలుస్తోంది. అయితే వాస్తవ నిష్పత్తి, క్యారెట్ల మధ్య తేడాలు.. వ్యాపారులు, ఎప్పుడూ బంగారం కొనుగోళ్లలో మునిగి తేలేవారికి, పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది.ఆభరణంలో బంగారమెంత?కొనుగోలు చేసే బంగారు ఆభరణాలలో ఎంత బంగారం ఉందో క్యారెట్ లెక్క ద్వారా తెలుసు కోవచ్చు. ఉదాహరణకు 14 క్యారెట్ల ఉంగరాన్ని కొనుగోలు చేశారనుకోండి.. బంగారం స్వచ్ఛతను 0 నుండి 24 స్కేల్లో కొలుస్తారు కాబట్టి, 14ని 24తో భాగించాలి. అప్పుడు 0.583 వస్తుంది. అంటే మీ 14 క్యారెట్ల బంగారు ఉంగరంలో 58.3% బంగారం ఉందన్న మాట. అదేవిధంగా బంగారం స్వచ్ఛతను ఫైన్నెస్, దాని రంగును బట్టి గుర్తించొచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండి, 24 క్యారెట్లతో పోల్చుకుంటే కొంత ముదురు రంగులో ఉంటుంది. ఇలా ఇతర లోహాల పరిమాణం పెరిగేకొద్దీ రంగు తేలిపోతుంటుంది. బంగారం తెల్లగా ఉందంటే నికెల్ ఎక్కువగా ఉందన్నమాట. క్యారెట్లు..రకాలు24 క్యారెట్లు: పూర్తి స్థాయి స్వచ్ఛత/నాణ్యత కలిగిన బంగారం. ఇందులో ఇతర లోహాలేవీ ఉండవు. అందుకే 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే ఖరీదు ఎక్కువ. ఖరీదెక్కువ, ఆభరణానికి పనికిరాదు.. మరెందుకు ఇది అంటే బంగారంలో పెట్టుబడులు పెట్టే వారికి ఇది ఎక్కువగా ఉపయోగ పడుతుంది. కొంతమంది 24 క్యారెట్ల బంగారం (బిస్కెట్) కొని ఆభరణాలు చేయించుకుంటుంటారు.22 క్యారెట్లు: ఇందులో 22 వంతులు బంగారం ఉంటే రెండొంతుల్లో రాగి, జింక్ లాంటి లోహాలు ఉంటాయి అంటే 91.6 శాతం బంగారం, 8.4 శాతం కలిపిన ఇతర లోహాలు ఉంటాయన్న మాట. ముందే చెప్పుకున్నట్లు 24 క్యారెట్ల బంగారం కంటే దీనికి మన్నిక ఎక్కువ. కాబట్టే ఆభరణాల తయారీకి ఇది అనువైనది. సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తారు. దీనినే 916 కేడీఎం గోల్డ్ లేదా 91.6 కేడీయం గోల్డ్ అని కూడా అంటారు. 18 క్యారెట్లు: ఇందులో 18 భాగాలు పసిడి ఉంటే.. ఆరు భాగాలు ఇతర మెటల్స్ ఉంటాయి. మొత్తం మీద 75 శాతం బంగారం , 25 శాతం జింక్, రాగి, నికెల్ లాంటి లోహాలు ఉంటాయి. 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత మన్నికగా ఉంటుంది. తక్కువ ఖర్చు అవుతుందని చాలామంది ఈ ఆభరణాలు కొంటుంటారు.14 క్యారెట్లు: ఇందులో 58.3 శాతం గోల్డ్, 41.7 శాతం ఇతర మెటల్స్ ఉంటాయి. దీనికి మన్నిక ఎక్కువ కానీ ధర చాలా తక్కువ. ఇక 12 క్యారెట్లలో 50 శాతం, 10 క్యారెట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు. టంచ్ మిషన్లతో ‘పంచ్’నగ నచ్చకనో, పాతబడిందనో, కొత్త మోడల్ మార్కెట్లోకి రావడంతో మార్చుకుందామనో జ్యువెలరీ దుకాణదారుని దగ్గరకు వెళతాం. అప్పుడు పాత నగను కరిగించడం ద్వారా దాంట్లో బంగారం శాతం ఎంత ఉందో తెలుసుకోవడానికి టంచ్ మిషన్‌లో పరిశీలిస్తారు. మిషన్‌లో ముందే సవరించిన రీడింగ్‌తో బంగారం శాతాన్ని నిర్ధారణ చేస్తారు. సాధారణంగా పాత నగలో ఉన్న బంగారం శాతం కంటే 5 నుంచి 10 శాతం తక్కువగా నిర్ధారణ చేస్తుంటారు. ఇది టంచ్ మిషన్లతో జరుగుతున్న మోసం. వాస్తవానికి బంగారం నాణ్యతను, పాత బంగారంలో బంగారం శాతాన్ని నిర్ణయించేందుకు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్) సంస్థ ద్వారా అనుమతి పొందిన లైసెన్స్‌దారుడి దగ్గరే నిర్ధారణ చేయాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్స్–రే ఫ్లోరోసెన్స్ మిషన్ (కంప్యూటర్ అనుసంధాన యంత్రాల టంచ్ మిష¯Œన్)తో బంగారం నాణ్యత ప్రమాణాలు నిర్ధారిస్తున్నారు. అధికారిక కాగితంపై కాకుండా సాధారణ పేపర్‌పైనే ప్యూరిటీ పర్సంటేజీలను వేస్తున్నారు.బంగారు పూతనే వన్ గ్రామ్వన్ గ్రామ్ గోల్డ్ పేరుతో ఆభరణాల విక్రయం ఎక్కువ జరగడం అందరికీ తెలిసిందే. ఎంతో వ్యయం చేసి ఆభరణాలు కొనేకన్నా.. పెళ్ళిళ్లు ఇతర వేడుకల్లో ఒరిజినల్ బంగారాన్ని తలదన్నేలా కన్పించే ఆకర్షణీయమైన డిజైన్లలో ఉండే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలకు ఇటీవలి కాలంలో గిరాకీ పెరిగింది. వెండి, రాగితో చేసిన ఆభరణాలకు బంగారం పూత పూసి వీటిని తయారు చేస్తారు. అందుకే వీటిని వ¯Œన్ గ్రామ్ గోల్డ్‌గా వ్యవహరిస్తుంటారు. ఇమిటేషన్ (నకిలీ)జ్యువెలరీ కంటే వ¯Œన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ఎక్కువ కాలం రంగు పోకుండా ఉంటాయి. అంతేకానీ ఈ ఆభరణాల్లో ఒక గ్రాము బంగారాన్ని వినియోగిస్తారని కాదు. బంగారం స్వచ్ఛత ఇలా..క్యారెట్ స్వచ్ఛత24 క్యారెట్ 99.923 క్యారెట్ 95.822 క్యారెట్ 91.621 క్యారెట్ 87.518 క్యారెట్ 75.014 క్యారెట్ 58.3బంగారం నాణ్యత పరిశీలన తప్పనిసరిబంగారం కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతపై అవగాహన అవసరం. నాణ్యత పరిశీలన తప్పనిసరి. చాలవరకు జ్యువెలరీస్, షాపింగ్ మాల్స్ నాణ్యతను తెలియజేసే క్యారెక్టరైజేష¯Œన్ మిషన్ వినియోగించడం లేదు. ప్రభుత్వ పరంగా తనిఖీలు నిర్వహించే సంబంధిత అధికారుల వద్ద కూడా నాణ్యతను పరిశీలించే మిషన్లు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్లు సరఫరా చేస్తే తనిఖీలతో వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట పడటంతో పాటు వినియోగదారులు చెల్లించే సొమ్ముకు తగిన నాణ్యతతో కూడిన బంగారం లభించే అవకాశం ఉంటుంది.వినియోదారుడు కూడ బంగారం నాణ్యతను అడిగాలి. అనుమానం ఉంటే నాణ్యతను పరీక్షించుకోవాలి. హాల్‌మార్క్ గుర్తును చూసిన తర్వాత మాత్రమే ఆభరణం కొనుగోలు చేయాలి. హాల్‌మార్క్ అనేది బంగారంపై ప్రభుత్వ హామీ. ఒక్కో ఆభరణాన్ని పరీక్షించి, హాల్ మార్క్ ఇచ్చేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ.– భాస్కర్ కూచన, రిటైర్డ్ అసిస్టెంట్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ, హైదరాబాద్ -
రిజర్వేషన్ల పెంపు.. బీహార్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
బీహార్‌లో రిజర్వేషన్ల పరిధిని మరింతగా పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో రిజర్వేషన్ల పరిధిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది.విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఇతర వెనుకబడిన తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం 65 శాతం మేరకు పెంచిన రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై పట్నా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రిజర్వేషన్ల పెంపును రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ గౌరవ్ కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను పూర్తి చేశాక, మార్చి 11న నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. పట్నాహైకోర్టు ఈ రోజు(గురువారం) రిజర్వేషన్లపై తన తీర్పు వెలువరించింది. Patna High Court scraps 65% reservation for Backward Classes, EBCs, SCs & STs.The Court set aside the Bihar Reservation of Vacancies in Posts and Services (Amendment) Act, 2023 and The Bihar (In admission in Educational Institutions) Reservation (Amendment) Act, 2023 as ultra… pic.twitter.com/FTvY9CzvRn— ANI (@ANI) June 20, 2024 -
ఒకే బిల్లు.. చెల్లింపులు రెండు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు నిధుల కటకట ఉండగా, ప్రతీ పనికి ప్రభుత్వం ఒక వైపు ఆచితూచి ఖర్చు పెడుతుంటే.. మరోవైపు రాష్ట్ర ట్రెజరీ విభాగం మాత్రం ఒకే చెక్కుకు రెండేసి చొప్పున చెల్లింపులు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ ఒక ప్రైవేటు కంపెనీతో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐఎఫ్ఎంఎస్) అమలు చేయిస్తోంది. దీనిపై ఐదేళ్లుగా ఉద్యోగులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎస్టీఓ పరిధిలో ఒకే మొత్తానికి సంబంధించి ఒక చెక్‌ను స్థానిక అధికారులు క్లియర్ చేయగా, అదే చెక్‌ను స్థానిక అధికారుల ప్రమేయం లేకుండానే ఆన్లైన్ పద్ధతిలో ఈ–కుబేర్ నుంచి చెల్లించేశారు. వివరాల్లోకి వెళితే వలిగొండ మార్కెట్ కమిటీ నుంచి గత నవంబర్ 22న వచ్చి న రూ.30,65,987 (టోకెన్ నంబర్ : 2438538332) మొత్తాన్ని ఖజానాలో సరిపోను నగదు లేని కారణంగా ఈ ఏడాది మార్చి 31న రిజెక్ట్ చేశారు. అదే మొత్తం కోసం తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ 25న చెక్‌ను మళ్లీ సబ్మిట్ చేస్తే.. రామన్నపేట ఎస్టీఓ అనుమతితో మే 30న రూ.30,65,987 మొత్తాన్ని సంబంధిత అకౌంట్‌కు బదిలీ చేశారు. మళ్లీ అదే మొత్తానికి సంబంధించి మరో చెక్ (నం. 251940047) ఎస్టీఓ ప్రమేయం లేకుండానే మరో రూ.30,65,987 మొత్తాన్ని అదే అకౌంట్‌కు బదిలీ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన రామన్నపేట సబ్‌ట్రెజరీ అధికారి (ఎస్టీఓ).. ఉన్నతాధికారులకు నివేదించి, ఆపై రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఐడీ, పాస్‌వర్డ్‌లను వాడుకుని ఖాతాల నుంచి చెల్లింపులు చేస్తున్న అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఎంప్లాయీస్ గెజిటెడ్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
వాస్తవ ఖర్చులే ట్రూ అప్ చార్జీలు
సాక్షి, అమరావతి: ట్రూ అప్ చార్జి.. ప్రతి నెలా కరెంటు బిల్లు రాగానే అందులో ఈ చార్జీని చూసి సంబంధం లేని ఏదో చార్జీ వేసేశారని భావిస్తుంటారు. ఈ అమాయకత్వాన్నే ఆసరా చేసుకుని ప్రతిపక్షాలు, కొన్ని పచ్చ పత్రికలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి. వాస్తవానికి ట్రూ అప్ అంటే వేరే ఖర్చులు కాదు. వినియోగదారులకు సంబంధం లేనివి అంతకన్నా కాదు. విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు పెట్టిన వాస్తవ ఖర్చులే అవి. అది కూడా ఆంధ్రప్రదేశ్ విదుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించినవే.ప్రతి ఏటా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినియోగదారులపై విధించే చార్జీలను ఏపీఈఆర్సీనే నిర్ణయిస్తుంది. ఆ ఏడాది యూనిట్‌కు ఎంత వసూలు చేయాలని ఈఆర్సీ చెబితే అదే రేటును డిస్కంలు వసూలు చేయాలి. కానీ, బహిరంగ మార్కెట్లో ప్రతి రోజూ కొనే విద్యుత్‌కు అదనంగా ఖర్చవుతుంటుంది. ఉదాహరణకు ఈఆర్సీ అనుమతించిన రేటు రూ.6 అయితే కొన్న రేటు రూ.8 అయితే, పైన పడిన రూ.2 భారాన్ని కొనుగోలు సమయంలో డిస్కంలు పవర్ ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తెచ్చి కట్టేస్తుంటాయి. ఆ అప్పులు తీర్చడం కోసం రూ.2 తో కొన్న విద్యుత్‌ను వినియోగదారులకే అందించినందున ఆ ఖర్చును వారి నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతించాలని డిస్కంలు ఏపీఈఆర్సీని కోరుతుంటాయి. దీనినే ట్రూ అప్ చార్జీగా పిలుస్తున్నారు.ఖర్చు చేసినంతా కాదుడిస్కంలు నివేదికలో ఇచ్చిన మొత్తాన్ని యథాతధంగా ఆమోదించాలని లేదు. ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టి, ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి, అన్ని అంశాలనూ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. 2014–15 నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరాలకు దాదాపు రూ.7,200 కోట్లు అదనపు వ్యయం జరిగిందని డిస్కంలు నివేదించాయి. కానీ నెట్వర్క్ ట్రూ అప్ చార్జీలను దాదాపు రూ.3,977 కోట్లుగానే ఏపీఈఆర్సీ నిర్ధారించింది. ఇందులో ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ భారం రూ.1,066.54 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తోంది. 2021–22కు సంబంధించి ప్రతి త్రైమాసికానికి రూ.3,336.7 కోట్లకు నివేదిక సమర్పిస్తే కమిషన్ రూ.3,080 కోట్లకు అనుమతినిచ్చింది.2023–24 ఆర్థిక సంవత్సరం జూన్ నెల నుంచి నెలవారీ విద్యుత్ కొనుగోలు చార్జీల సవరింపును డిస్కంలు అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం ప్రతి నెలా సర్దుబాటు తరువాత రెండో నెలలో అమల్లోకి వస్తుంది. నెలవారీ అదనపు కొనుగోలు వ్యయం, విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోవడం, మార్కెట్ ధరలు తారస్థాయికి చేరుకోవడం, థర్మల్ కేంద్రాలలో 20 శాతం నుంచి 30 శాతం వరకూ విదేశీ బొగ్గు వాడటం, తగినంత జల విద్యుత్ ఉత్పత్తి లేకపోవటం వలన యూనిట్ దాదాపు రూ.1 వరకూ పెరిగింది. అయినా ప్రస్తుతం డిస్కంలు కమిషన్ ఆదేశాల మేరకు 40 పైసలే వసూలు చేస్తున్నాయి. 2022–23కు రూ.7,300 కోట్ల ట్రూ అప్ చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు కోరినా ఏపీఈఆర్సీ అనుమతించలేదు. అలాగే 2023–24 ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు నివేదించిన రూ.10,052 కోట్ల ట్రూ అప్ చార్జీలపైనా ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.అప్పటికీ ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలను చెల్లించకుండా విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల్లోకి నెట్టేసింది. సబ్సిడీ రూ.17,487 కోట్లు మంజూరు చేయగా, అందులో రూ.10,923 కోట్లు మాత్రమే చెల్లించింది. రూ.6,564 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. అదే విధంగా 2014–19 మధ్య పెరిగిన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయాలను బిల్లుల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కంలకు ఇవ్వలేదు. ఏపీఈఆర్సీకి తప్పుడు నివేదికలు ఇచ్చి, విద్యుత్ సంస్థల ఆదాయం బాగానే ఉన్నట్టు చూపించారు. దీంతో 2014–19 మధ్య దాదాపు రూ.20 వేల కోట్లు డిస్కంలు నష్టపోవాల్సి వచ్చింది.ఫలితంగా రాబడికి, వ్యయానికీ మధ్య అంతరం పెరిగిపోయి, పాత అప్పులే సకాలంలో చెల్లించలేని పరిస్థితి వచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం అలా చేయడంలేదు. చెల్లించాల్సిన సబ్సిడీలను పక్కాగా చెల్లించడమే కాకుండా అదనంగా నిధులు ఇస్తూ ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ఖర్చులు పెరిగినప్పటికీ వ్యవసాయ, బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్న ఉచిత, రాయితీ విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే మోస్తోంది.2020–21 ఆర్ధిక సంవత్సరంలో కోవిడ్ వల్ల విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలు కనిష్టానికి చేరుకున్నాయి. దానివల్ల ఆదా అయిన దాదాపు రూ.4800 కోట్లను 2022–23 టారిఫ్‌లో డిస్కంలు తగ్గించాయి. వినియోగదారుల బిల్లుల్లో సర్దుబాటు చేశాయి. అంటే ఆ మేరకు వినియోగదారులపై చార్జీల భారం పడలేదు. ఇలా ఖర్చులు తగ్గినప్పుడు వినియోగదారులకు ప్రభుత్వం చొరవతో విద్యుత్ సంస్థలు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. -
అక్రమ వలసలకు చెక్.. సంచలన బిల్లు తెచ్చిన బ్రిటన్
లండన్: అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటున్న బ్రిటన్ వాటిని ఆపేందుకు సంచలన బిల్లు తీసుకువచ్చింది. మంగళవారం(ఏప్రిల్23) ‘సేఫ్టీ ఆఫ్ రువాండా’ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుతో అక్రమ వలసదారులకు అడ్డకట్టపడనుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారందరినీ ఆఫ్రికా దేశం రువాండాకు తరలిస్తారు. బ్రిటన్ రాజు చార్లెస్ 3 ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారుతుంది. బ్రిటన్‌కు వచ్చే అక్రమ వలసదారులను ఆపడానికి రువాండా బిల్లు తీసుకువచ్చినట్లు ప్రధాని రిషి సునాక్ తెలిపారు. దేశంలోకి చట్టవిరుద్ధంగా వచ్చేవారు నివసించడానికి ఇక నుంచి వీలులేదని చెప్పారు. అక్రమ వలసదారులను విమానాల్లో తీసుకువెళ్లి దేశం బయట వదిలేస్తామన్నారు. -
స్మోకింగ్ బ్యాన్..! రిషి సునాక్‌పై వ్యతిరేకత
లండన్: బ్రిటన్‌లో స్మోకింగ్ బ్యాన్ చట్టంపై ప్రధాని రిషి సునాక్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 2009 తర్వాత పుట్టిన వారికి అంటే.. 15, 15 ఏళ్లలోపు వయసు ఉన్న వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడాన్ని నిషేధించే చట్టాన్ని సునాక్ గతేడాదే ప్రతిపాదించారు. మంగళవారం (ఏప్రిల్16) ఈ చట్టాన్ని బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెట్టారు. సునాక్ సొంత పార్టీ కన్జర్వేటివ్స్ ఎంపీల్లో కొందరు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ ప్రధానులు లిజ్ ట్రుస్, బొరిస్ జాన్సన్‌లు కూడా ఈ చట్టంపై వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చట్టం అమలు చేయడమంటే ప్రజల ఇష్టాఇష్టాలను నియంత్రించడమేననేది వారి వాదన. వేల కొద్ది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, ఒక జనరేషన్‌ను స్మోకింగ్ నుంచి దూరంగా ఉంచేందుకు ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని యూకే హెల్త్ సెక్రటరీ విక్టోరియా అట్కిన్స్ తెలిపారు. ఈ చట్టం దేశంలో ప్రొడక్టివిటీని పెంచడమే కాకుండా నేషనల్ హెల్త్ సర్వీస్‌పై భారాన్ని తగ్గిస్తుందన్నారు. ఇదీ చదవండి.. మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్ -
‘ఉబర్’ రైడ్‌కు కోట్లలో బిల్లు..! షాక్ అయిన కస్టమర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో దీపక్ తెంగురియా అనే వ్యక్తి రొటీన్‌గా తాను వెళ్లే రూట్లో ఉబర్ ఆటో రైడ్ బుక్ చేశాడు. రైడ్ తక్కువ దూరమే అయినందున రూ.62 బిల్లు చూపించింది. మామూలే కదా అని ఆటో ఎక్కి డెస్టినేషన్‌లో దిగి బిల్లు పే చేద్దామనుకునే సరికి దీపక్ అవాక్కయ్యాడు. ఏకంగా రూ.7.66 కోట్లు పే చేయాలని బిల్లు చూపించింది. దీంతో ఆశ్చర్యపోవడం దీపక్ వంతైంది. దీపక్‌కు ఇంత భారీ బిల్లు రావడానికి సంబంధించిన వీడియోను ఆయన స్నేహితుడు ఆశిష్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశాడు. దీనిపై వీడియోలో స్నేహితులిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చంద్రయాన్‌కు రైడ్ బుక్ చేసుకున్నా ఇంత బిల్లు రాదని ఇద్దరు స్నేహితులు జోకులు వేసుకున్నారు. सुबह-सुबह @Uber_India ने @TenguriyaDeepak को इतना अमीर बना दिया कि Uber की फ्रैंचाइजी लेने की सोच रहा है अगला. मस्त बात है कि अभी ट्रिप कैंसल भी नहीं हुई है. 62 रुपये में ऑटो बुक करके तुरंत बनें करोडपति कर्ज़दार. pic.twitter.com/UgbHVcg60t — Ashish Mishra (@ktakshish) March 29, 2024 అయితే అతి తక్కువ దూరం ఆటో రైడ్‌కు కోట్లలో బిల్లు రావడంపై ఉబర్ స్పందించింది. ‘భారీ బిల్లు ఇచ్చి ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు. మాకు కొంత సమయమిస్తే దీనిపై అప్డేట్ ఇస్తాం’అని ఉబర్ సందేశం పంపింది. ఇదీ చదవండి.. వీల్ చైర్లో వచ్చాడు.. విల్ పవర్ చూపాడు -
ఫ్రాన్స్ పార్లమెంట్లో అబార్షన్ బిల్లుకు ఆమోదం!
ఫ్రాన్స్ పార్లమెంట్లో జరిగిన సంయుక్త సమావేశంలో అబార్షన్ బిల్లుకు ఆమోదం లభించింది. ఫ్రాన్స్ రాజ్యాంగంలో మహిళలకు గర్భస్రావం చేయించుకునే హక్కును పొందుపరిచే బిల్లుకు ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు. అబార్షన్‌ను రాజ్యాంగంలో చేర్చిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. ఈ బిల్లు అత్యధిక ఓట్లతో ఆమోదం పొందిన నేపధ్యంలో ఉమ్మడి సెషన్‌లోని సభ్యులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలో మహిళా హక్కుల కోసం పనిచేస్తున్నవారంతా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఈ బిల్లుకు చట్టపరమైన రూపం కల్పించేందుకు ఫ్రెంచ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 34ను సవరించారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభల్లో అంటే జాతీయ అసెంబ్లీ,సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మహిళలకు అబార్షన్ హక్కును కల్పిస్తుంది. ఉమ్మడి సెషన్‌ను ప్రారంభించిన దిగువ సభ స్పీకర్ యాయెల్ బ్రాన్-పివెట్ మాట్లాడుతూ మహిళకు అబార్షన్ హక్కును కల్పించిన మొదటి దేశం ఫ్రాన్స్ అని అన్నారు. ఈ బిల్లు ఆమోదానికి ముందు ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియెల్ అటల్ మాట్లాడుతూ మహిళలు ఇకపై అబార్షన్ విషయంలో సొంత నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. మరోవైపు అబార్షన్‌ను వ్యతిరేకిస్తున్న సంస్థలు, కార్యకర్తలు ఈ బిల్లును ఆమోదంపై పార్లమెంటు నిర్ణయాన్ని తప్పుబట్టారు. అధ్యక్షుడు మాక్రాన్ రాజకీయ లబ్ధి కోసం ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని వారు ఆరోపించారు. NEW: France's Parliament votes to make abortion a constitutional right, the first country in the world to do so. French PM Gabriel Attal: " We're sending a message to all women: your body belongs to you and no one can decide for you." pic.twitter.com/xI7EyZwvMv — Lewis Goodall (@lewis_goodall) March 4, 2024 -
పబ్లిక్ పరీక్షల బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో అవతకవకలకు పాల్పడే వారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు–2024కు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. బిల్లుపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనూరాధ మాట్లాడుతూ.. పబ్లిక్ పరీక్షలు, ఉద్యోగ నియామకాల పరీక్ష పత్రాల లీక్ కారణంగా నష్టపోయిన కోట్లాది మంది యువత ఈ తరహా బిల్లు కోసమే ఎదురు చూస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష పత్రాలు లీక్‌చేసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఓబీసీల చేర్పు అభినందనీయమని ఎంపీ చింతా అనూరాధ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ స్థానిక సంస్థల చట్టాల బిల్లుకు వైఎస్సార్సీపీ తరఫున మద్దతు ప్రకటించారు. ఏకలవ్య పాఠశాలలు అత్యవసరం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు అత్యవసరమని వైఎస్సార్సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. జమ్మూ కశ్మీర్ షెడ్యూల్డ్ కులాల, తెగల ఆర్డర్ సవరణ బిల్లులు–2024కు వైఎస్సార్సీపీ తరఫున మద్దతు ప్రకటించారు. వేగివాడలో డీఎస్పీ పశ్చిమ గోదావరి జిల్లా వేగివాడలో ‘డిమాన్స్ట్రేషన్ కం సీడ్ ప్రొడక్షన్ ఫారం’ (డీఎస్పీ) ఏర్పాటు చేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిచ్చారు. విశ్వవిద్యాలయాల్లో ఫ్రీ కోచింగ్ అంబేడ్కర్ ఫౌండేషన్ (డీఏఎఫ్)’, అంబేడ్కర్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (డీఏసీఈ) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ఉచిత కోచింగ్ స్కీమ్ నిర్వహిస్తున్నట్టు కేంద్ర సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ మార్గాని భరత్ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. ఏపీలో 24 కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులు వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతలను అవలంభించేందుకు ఏపీలో 24 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకేల)ను ఏర్పాటు చేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిస్తూ.. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో రెండేసి చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకటి చొప్పున కేవీకేలు ఉన్నట్టు వివరించారు. మిల్లెట్, ఎర్రపప్పు, బెంగాల్ చిట్రా, కదిరి, వేరుశనగ వంటి పంటల ఉత్పత్తి కోసం కరువు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మొబైల్ సందేశాలతో రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. -
అసెంబ్లీలో యూసీసీ బిల్లు.. విపక్షాల రగడ.. సభ వాయిదా!
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్‌లోని రాష్ట్ర అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ 2024 బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమయంలో రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ‘వందేమాతరం, జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజైన మంగళవారం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి యూసీసీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విపక్ష ఎమ్మెల్యేలు రచ్చ చేశారు. దీనిపై పలు ప్రశ్నలు సంధించారు. యూనిఫాం సివిల్ కోడ్‌పై చర్చించేందుకు సభను మధ్యాహ్నం 2:00 గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు అసెంబ్లీ స్పీకర్ రీతూ ఖండూరి భూషణ్ అధ్యక్షతన జరిగిన వ్యాపార సలహా సమావేశంలో సభలో ప్రశ్నోత్తరాల సమయం ఉండదని నిర్ణయించారు. యూసీసీపై చర్చతోపాటు రాష్ట్ర ఆందోళనకారులకు రిజర్వేషన్లపై సెలెక్ట్ కమిటీ నివేదికను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రతిపక్ష నేత యశ్పాల్ ఆర్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రీతమ్ సింగ్ వ్యాపార సలహా కమిటీకి రాజీనామా చేశారు. యూసీసీపై చర్చకు సమయం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత యశ్పాల్ ఆర్య మాట్లాడుతూ తాము యూసీసీ బిల్లును వ్యతిరేకించడం లేదని అన్నారు. అయితే రాజ్యాంగ ప్రక్రియ, నిబంధనల ప్రకారం సభ పనిచేయాలని కోరుకుంటున్నామన్నారు. కాగా అసెంబ్లీ సమావేశాల తొలి రోజైన సోమవారం ఆరుగురు ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల మృతికి సభలో నివాళులర్పించారు. -
UCC Bill: నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లు
దేశంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. యూసీసీపై బిల్లును తీసుకురావడానికి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ రోజు (మంగళవారం) రెండవ రోజున అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పోర్చుగీస్ పాలనా కాలం నుండి గోవాలో యూసీసీ అమలులో ఉంది. యూసీసీ కింద వివాహం, విడాకులు, భరణం, భూమి, ఆస్తి, వారసత్వానికి సంబంధించిన చట్టాలు రాష్ట్రంలోని పౌరులందరికీ వారి మతంతో సంబంధం లేకుండా వర్తిస్తాయి. మంగళవారం సభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చర్చల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కోరారు. యూసీసీ గురించి ఇటీవల మాట్లాడిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దీనివలన అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. బిల్లుపై సభలో సానుకూలంగా చర్చించాలని ఇతర పార్టీల సభ్యులను అభ్యర్థించారు. ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం యూసీసీ ముసాయిదాను ఆమోదించి, ఫిబ్రవరి 6న బిల్లుగా సభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. నాలుగు సంపుటాలలో 740 పేజీలతో కూడిన ఈ ముసాయిదాను సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజన్ ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ శుక్రవారం ముఖ్యమంత్రికి సమర్పించింది. 2022లో జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో యూసీసీపై చట్టం చేసి, రాష్ట్రంలో దానిని అమలు చేస్తామని బీజేపీ హామీనిచ్చింది. 2000లో ఏర్పడిన ఉత్తరాఖంఢ్‌లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. 2022 మార్చిలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో యూసీసీ అమలుపై హామీనిచ్చింది. కాగా మంగళవారం అసెంబ్లీలో యూసీసీపై చర్చ జరగనున్న సందర్భంగా అవాంఛనీయ పరిస్థితులు చోటు చేసుకుంటే, వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం. -
పేపర్ లీక్ చేస్తే కోటి ఫైన్.. లోక్‌సభలో కేంద్రం బిల్లు
న్యూఢిల్లీ: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి కేంద్రం ఇక చెక్ పెట్టనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీల వంటి వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్రమంత్రి జితేందర్‌సింగ్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో పాలు పంచుకునే అధికారులు, లీకేజీకి పాల్పడే ముఠాల ఆగడాలకు ఈ బిల్లుతో కళ్లెం వేయనున్నారు. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత దీని కింద నేరం రుజువైన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష,రూ. కోటి వరకు జరిమానా విధించనున్నారు. రాజస్థాన్, హరియాణా, గుజరాత్, బిహార్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు తీసుకురానున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ఇటీవల చేసిన ప్రసంగంలోనూ ప్రస్తావించారు. ఇదీచదవండి.. పేటీఎంపై సీబీఐ,ఈడీల మౌనం దేనికి: కాంగ్రెస్ -
‘ఎక్స్’లో హాట్‌టాపిక్‌గా దోశ ధర..!
గురుగ్రామ్: ఢిల్లీలోని గురుగ్రామ్‌లోని ఓ హోటల్లో ఇచ్చిన దోశ బిల్లుపై ట్విట్టర్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గురుగ్రామ్‌లోని 32 ఎవెన్యూ ఏరియాలో కర్ణాటక కేఫ్‌లో ఆశిశ్ సింగ్ అనే యువకుడు రెండు దోశలు, ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాడు. 30 నిమిషాల తర్వాత ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. హాయిగా దోశలు తినేసి బిల్లు చూస్తే ఆశిశ్‌కు ఒక్కసారిగా షాక్ తగిలినంత పనైంది. బిల్లు ఏకంగా వెయ్యి రూపాయలు వచ్చింది. దీంతో ఆశిష్ ఈ విషయాన్ని ఎక్స్‌లో షేర్ చేశాడు. ఆశిష్ ట్వీట్‌పై పలువురు ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘తమిళనాడులో అయితే అవే దోశలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. మీరు పే చేసింది ఏరియా ప్రీమియమ్’ అని ఒకాయన కామెంట్ చేశాడు. ‘వీధి టిఫిన్ బండి దగ్గర మీరు పే చేసిన ధరలో పదవ వంతుకే ఆ దోశలు వచ్చేవి’ అని మరొకతను రిప్లై ఇచ్చాడు. గురుగ్రామ్‌ను వదిలి బెంగళూరుకు రండి తక్కువ ధరలో మంచి దోశలు ఉంటాయి’ అని మరో కర్ణాటక అతను కామెంట్ పెట్టాడు. Bc gurgaon is crazy, spent 1K on two Dosa and idli after waiting for 30 min. Suggest good and reasonably priced dosa places. pic.twitter.com/HYPPK6C07U — Ashish Singh (@ashzingh) December 4, 2023 ఇదీచదవండి..రిస్క్ చేయాలేగానీ..మా తర్వాతే ఎవరైనా..! -
గేర్‌బాక్స్ రిపేర్‌కు రూ.5.8 లక్షలు - బిల్ చూసి అవాక్కయిన కారు ఓనర్..
కారులో సమస్య వచ్చినప్పుడు రిపేర్ చేసుకోవాలంటే ఖర్చు వేలల్లో ఉంటుంది, అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటనలో గేర్‌బాక్స్‌లో సమస్యను పరిష్కరించుకోవడానికి ఏకంగా ఐదు లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా కారు ఇంజిన్‌లో అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. మెయింటెనెన్స్ సరిగ్గా లేకుంటే.. ఇలాంటి సమస్యలే తలెత్తుతూ ఉంటాయి. ఇటీవల ఫోక్స్‌వ్యాగన్ అమియో కారులోని DSG గేర్‌బాక్స్ ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో దానిని రిపేర్ చేసుకోవడానికి రూ. 5.8 లక్షలు ఖర్చు అయినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన బిల్ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. గేర్‌బాక్స్‌లో సమస్యను పరిష్కరించుకోవడానికే.. ఇంత బిల్ వచ్చిందా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఫోక్స్‌వ్యాగన్ అమియో యజమాని 2వ, 3వ గేర్ మధ్య అప్‌షిఫ్ట్ చేసేటప్పుడు, డౌన్‌షిఫ్ట్ చేసేటప్పుడు ఎక్కువ శబ్దం వస్తున్నట్లు గ్రహించి సర్వీస్ సెంటర్‌కు వెళ్లి తన సమస్యను తెలియజేశాడు. డీఎస్జీ గేర్‌బాక్స్‌లో పెద్ద సమస్య ఉన్నట్లు గుర్తించి, దానిని రిపేర్ చేయడానికి రూ. 5.8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ గేర్‌బాక్స్‌లో ఎక్కడ సమస్య ఉందనే విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోయారు. -
బిల్లు ఎగ్గొడదామని చూశారు..కెమెరాకి చిక్కారు..
-
పైరసీకి అడ్డుకట్ట వేస్తాం
‘‘పైరసీ కారణంగా ప్రతి ఏడాది వినోద రంగానికి రూ.20 వేల కోట్లు నష్టం వాటిల్లుతోంది. ఓ సినిమా నిర్మాణానికి పడ్డ కష్టం పైరసీ వల్ల వృథాగా పోతోంది. పైరసీని అడ్డుకోవడానికి కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖలో నోడల్ ఆఫీసర్స్‌ను నియమించడం జరిగింది’’ అని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇటీవల సినిమాటోగ్రఫీ చట్టం–1952లో సవరణలు చేసి, కొత్త బిల్లును పార్లమెంట్లో ఆమోదించిన విషయం తెలిసిందే. ఇందులో పైరసీని అరకట్టడం అనేది ఓ ప్రధానాంశం. ఈ విషయమై శుక్రవారం అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ– ‘‘ ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కార్యాలయంలో,ప్రాంతీయ కార్యాలయాల్లో పైరసీ, డిజిటల్ పైరసీల ఫిర్యాదులను స్వీకరించేందుకు అధికారులను నియమించాం. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్న పైరేటెడ్ కంటెంట్‌పై నోడల్ ఆఫీసర్స్‌కు ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు 48 గంటల్లో ఆ కంటెంట్‌ను ఆ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించేలా చర్యలు చేపడతారు’’ అని చెప్పుకొచ్చారు. -
బొగ్గు దిగుమతుల బిల్లు రూ.3.85 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత్ గత ఏడాది బొగ్గు దిగుమతులపై రూ.3.85 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో దేశం మొత్తం బొగ్గు వినియోగంలో దిగుమతి వాటా 26 శాతం నుండి 21 శాతానికి తగ్గింది. అయితే భారతదేశం ప్రతి సంవత్సరం 200 మిలియన్ టన్నుల (ఎంటీ) కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశం నుంచి భారీ విదేశీ మారకపు ద్రవ్య ప్రవాహానికి దారితీస్తోంది. అడవుల సంరక్షణకు పెద్దపీట: బొగ్గు మంత్రిత్వశాఖ ఇదిలా ఉండగా, అడవులను సంరక్షించే అంశానికి పెద్ద పీట వేస్తున్నట్లు బొగ్గు మంత్రిత్వశాఖ పేర్కొంది. పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచనలను పట్టించుకోకుండా బొగ్గు గనులను వేటినీ వేలం వేయలేదని కూడా స్పష్టం చేసింది. ఉదాహరణకు, లెమ్రు ఎలిఫెంట్ కారిడార్ పరిధిలోకి వచ్చే బొగ్గు గనులను డి–నోటిఫై చేయాలన్న ఛత్తీస్‌గఢ్ విజ్ఞప్తిని అంగీకరించినట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు లెమ్రు ఎలిఫెంట్ కారిడార్‌కు ఆవల ఉన్న ప్రాంతాలను కూడా మినహాయింపు కోసం పరిశీలించినట్లు పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లో 10 శాతం నిల్వలు ఉన్న 40కి పైగా కొత్త బొగ్గు బ్లాకులను బొగ్గు తవ్వకాల నుంచి దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. దట్టమైన హాస్డియో–అరాండ్ బొగ్గు క్షేత్రం పరిధిలోని తొమ్మిది బొగ్గు గనులను కూడా బొగ్గు బ్లాకుల తదుపరి రౌండ్ వేలం నుంచి దూరంగా ఉంచిన్నట్లు తెలిపింది. అదేవిధంగా, తదుపరి వేలం ప్రక్రియ నుండి మూడు లిగ్నైట్ గనులను మినహాయించాలన్న తమిళనాడు అభ్యర్థన కూడా అంగీకరించినట్లు పేర్కొంది. ‘‘బొగ్గు మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాలు... అటవీ ప్రాంతాలను వేలంలో పెట్టాలని పరిశ్రమ డిమాండ్లు ఉన్నప్పటికీ వాటిని రక్షించడం మా బాధ్యత అని మంత్రిత్వశాఖ స్పష్టంగా సూచిస్తోంది’’అని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త అసెంబ్లీలో బిల్ పాస్..
-
ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి..
సైదాబాద్: కుమార్తె వైద్యానికైన బిల్లు కట్టలేక.. ఆస్పత్రిలో వదిలేసి వచ్చిన తల్లిదండ్రుల చెంతకు ఆ చిన్నారి ఎట్టకేలకు చేరింది. తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి చొరవతో కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని సింగరేణి కాలనీలో నివసిస్తున్న నితిన్, ప్రవల్లిక దంపతులకు ఈనెల7న పాప పుట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన పాప మెరుగైన వైద్యం కోసం వారు పిసల్‌బండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల చికిత్సకు రూ.లక్షా16వేల బిల్లు అయింది. వారి వద్ద కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండటంతో దిక్కుతోచక పాపను ఆస్పత్రిలో వదిలేసి వచ్చేశారు. వారి నిస్సహాయస్థితిపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దాంతో పలువురు దాతలు వారిని సంప్రదించి తోచిన సహాయం చేశారు. సాక్షి కథనంపై స్పందించిన తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి కళార్చన, గోవర్ధన్‌రెడ్డి గురువారం ఆస్పత్రికి చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అదే రాత్రి చిన్నారిని డిశ్చార్జి చేయించారు. తమ పరిస్థితిని వెల్లడిస్తూ కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ అధికారులకు చిన్నారి తల్లిదండ్రులు నితిన్, ప్రవల్లికలు కృతజ్ఞతలు తెలిపారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్ణం: రాహుల్ గాంధీ
ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్తిగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఓబీసీలను బీజేపీ గాలికొదిలేస్తోందని ఆరోపించారు. ఇప్పుడున్న వ్యవస్థలో ఓబీసీలకు ప్రభుత్వం ఏం ప్రాధాన్యత ఇస్తుందో చెప్పాలని కేంద్రాన్ని రాహుల్ ప్రశ్నించారు. మహిళా బిల్లులో ఓబీసీ ప్రస్తావనే లేదని అన్నారు. మద్దతు ఇస్తున్నాం.. కానీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాను మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్న రాహుల్ గాంధీ.. కుల గణన చేపట్టి అత్యధిక జనాభా ఉన్న వర్గాలవారికి సముచిత స్థానం కల్పించాలని కోరారు. పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి మారేప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించకపోవడంపై రాహుల్ ప్రశ్నించారు. 90లో ముగ్గురు మాత్రమే.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 90 సెక్రటరీల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీ జాబితాలో ఉన్నారని రాహుల్ చెప్పారు. బడ్జెట్లో కేవలం 5 శాతం మాత్రమే వారి ఆధీనంలో ఉందని అన్నారు. కుల గణన చేయడంతోపాటు మహిళా బిల్లులో ఓబీసీలకు ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. తక్షణమే అమలు చేయండి.. పంచాయతీ రాజ్ వ్యవస్థే మహిళలకు అధికారం ఇచ్చిందని, అన్నాళ్ల తర్వాత ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లు మరో కీలక పరిణామం అని ఆయన అన్నారు. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి తీసుకురావడంపై రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నేటి నుంచి ఈ బిల్లు అమలులోకి రావాలని డిమాండ్ చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలని అన్నారు. ఇదీ చదవండి: కొత్త పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్ స్థానంలో కూర్చున్న తొలి తెలుగు ఎంపీగా మిథున్ రెడ్డి రికార్డు. -
నారీ శక్తికి వందనం.. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నేడు లోక్ సభలో "నారి శక్తివందన్" బిల్లుపై చర్చ
-
ఏమిటీ మహిళా రిజర్వేషన్ల బిల్లు? .. ఆ(మె) బిల్లు వెనక
మహిళలకు చట్ట సభల్లో, ముఖ్యంగా లోక్‌సభ, అసెంబ్లీల్లో మూడో వంతు రిజర్వేషన్లు.. దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా చర్చలో ఉన్నఅంశం. అదే సమయంలో, అంతేకాలంగా విజయవంతంగా పెండింగ్‌లోనూ ఉన్న అంశం. అన్ని పార్టీలూ ఇందుకు మద్దతు తెలిపేవే. కానీ తీరా సదరు పార్లమెంటులో బిల్లు రూపంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రం ఆమోదం పొందకపోవడం, చివరికి సంబంధిత లోక్ సభ కాలపరిమితి తీరడం, దాంతో బిల్లుకు కూడా కాలదోషం పట్టడం... ఇదీ వరస! 1989లో తెరపైకి... మహిళలకు చట్ట సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం దివంగత ప్రధాని రాజీవ్ గాందీతో మొదలైంది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో వారికి 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆయన హయాంలో, అంటే 1989లో పార్లమెంటులో బిల్లు పెట్టారు. అయితే అది లోక్ సభలో ఆమోదం పొందింది గానీ రాజ్యసభలో గట్టెక్కలేదు. అనంతరం తెలుగు తేజం పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా 1992, 1993లో ఈ మేరకు 72 73వ రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టారు. వాటిని ఉభయ సభలూ ఆమోదించాలి. అలా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లోని స్థానాలు, చైర్ పర్సన్ పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వ్ అయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు స్థానిక సంస్థలకు ఎన్నికయ్యేందుకు ఇది దోహదం చేసింది. దేవేగౌడ నుంచి మన్మోహన్ దాకా.. లోక్ సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తూ తొలిసారిగా 1996లో దేవేగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ సర్కారు పార్లమెంటులో 81వ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టింది. కానీ లోక్ సభా ఆమోదం పొందలేక అది కాలగర్భంలో కలిసిపోయింది. అనంతరం అటల్ బిహారీ వాజపేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 1998, 1999ల్లోనూ, ఆ తర్వాత 2002, 2003ల్లోనూ నాలుగుసార్లు బిల్లు పెట్టినా మోక్షానికి నోచుకోలేదు. 2004లో యూపీయే ఈ అంశాన్ని తమ కనీస ఉమ్మడి ప్రణాళికలో చేర్చింది. అధికారంలోకి వచ్చాక 2008లో మన్మోహన్ సింగ్ సర్కారు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అక్కడినుంచి స్టాండింగ్ కమిటీకి వెళ్ళడం, దాని నివేదికను కేంద్రం ఆమోదించడం, చివరికి రాజ్యసభ మహిళా బిల్లును ఆమోదించడం జరిగిపోయాయి. అయితే అదంతా సులువుగా ఏమీ జరగలేదు. బిల్లును వ్యతిరేకించిన పలువురు ఎంపీలను మార్షల్స్ సాయంతో బయటికి పంపి మరీ ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ఇంతా చేస్తే, ఆ బిల్లు దిగువ సభ అయిన లోక్ సభ ముందుకు రానే లేదు. చివరికి 2009లో 15వ లోక్ సభ రద్దుతో అలా పెండింగులోనే ఉండిపోయింది. కాకపోతే శాశ్వత సభ అయిన రాజ్యసభ ఆమోదం పొందింది గనక నేటికీ కాలదోషం పట్టకుండా అలాగే ఉంది. ఏమిటీ మహిళా రిజర్వేషన్ల బిల్లు? లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు మూడింట ఒక వంతు,అంటే 33 శాతం స్థానాలను కేటాయించడం దీని ముఖ్యోద్దేశం. ఈ మేరకు వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం, లోక్ సభలో మంగళవారం ఈ మేరకు ప్రవేశపెట్టడం తెలిసిందే.ఆ మూడు అసెంబ్లీల్లో అత్యధికం... అసెంబ్లీలో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించిన ఘనత ఛత్తీస్‌గఢ్ దే! అయితే అక్కడ వారు ఎందరున్నారో తెలుసా? కేవలం 14.4 శాతం! 13.7 శాతంతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో, 12.35 శాతంతో జార్ఖండ్ మూడో స్థానంలో ఉన్నాయి. 15 అసెంబ్లీల్లో 10% కన్నా తక్కువ... గోవా, గుజరాత్,హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక,కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ,ఒడిశా, సిక్కిం, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం. 7 అసెంబ్లీల్లో 0–12% కన్నాతక్కువ... బీహార్, హరియాణా,పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ. లోక్‌సభలో 15 శాతమైనా లేరు... లోక్ సభలో ప్రస్తుతం మహిళా ఎంపీల సంఖ్య 78.మొత్తం సంఖ్య 543లో ఇది 15 శాతం కూడా కాదు. రాజ్యసభలో కూడా మహిళా ఎంపీలు 14 శాతమే ఉన్నారు. - సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎల్లుండి రాజ్యసభకు మహిళా రిజర్వేషన్ బిల్లు
-
ఆర్టీసీ ఉద్యోగులు.. ఇక ప్రభుత్వ ఉద్యోగులే
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ గురువారం ఓకే చెప్పడంతో చట్ట బద్ధత లభించింది. దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. టీఎస్ ఆర్టీసీ (ఉద్యో గులను ప్రభుత్వంలో విలీనం) బిల్లు–2023ను శాసనసభ గతనెలలో ఆమోదించగా, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బిల్లుపై సంతకం చేసినట్టు రాజ్భవ న్ తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. జూలై 31న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశానికి సంబంధించి ఆమోద ముద్ర వేయడం, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణ యించిన విషయం విదితమే. అయితే ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో, గవర్నర్ బిల్లు ను పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేయడం, మొద ట సంస్థ ఆస్తులు, కేంద్ర గ్రాంట్లు, వాటా, విభజన చట్టంలో 9వ షె డ్యూల్, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తారా.? వారి సీనియారిటీ, పారిశ్రామిక వి వాదాల చట్టం వర్తిస్తుందా..? ప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా పెన్షన్ వర్తిస్తుందా..?అన్ని ప్రయోజనాలు కల్పి స్తారా..? ప్రభుత్వ ఉద్యోగాల్లో కండక్టర్, కంట్రోలర్ వంటి పోస్టులు లేవు మరి వారిని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు.? కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారా.? డిపోల్లో కేటగిరి వారీగా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఎంత.. కాంట్రాక్టు, క్యాజువ ల్ కార్మికుల పరిస్థితి ఏమిటీ..? ఆర్టీసీ ప్రస్తుత స్వరూపంతోనే పనిచేస్తుందా..? ఆస్తులను ప్రభుత్వం విలీనం చేసు కుంటుందా.? బస్సుల నిర్వహణ, ఆజమాయిషీ ఎవరిది లాంటి అనేక ప్రశ్నలు గవర్నర్ లేవనెత్తడం.. వాటిన్నింటికి ప్రభుత్వం సమాధానం ఇవ్వడంతోపాటు, బిల్లులో పొందుపరిచి అసెంబ్లీలో పాస్ చేసిన సంగతి విదితమే. బిల్లు వచ్చిన తర్వాత మళ్లీ న్యాయశాఖ పరిశీలనకు పంపించిన గవర్నర్.. ఈనెల 3వ తేదీన న్యాయశాఖ నుంచి బిల్లు తిరిగి వచ్చిన తర్వాత దాదాపు పదిరోజుల పరిశీలన అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపారు. సీఎంకు ధన్యవాదాలు : బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులంతా రుణపడి ఉంటారని పేర్కొన్నారు. తాను సంస్థ చైర్మన్‌గా ఉన్న సమయంలో వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం ఆనందంగా ఉందన్నారు. -
టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళి సై ఆమోదం
-
బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టి అందులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఈమేరకు ఆయన శనివారం రాజకీయ పార్టీ లకు లేఖలు రాశారు. మహిళా బిల్లు, బీసీలకు ప్రత్యేక వాటా కల్పించేందుకు కేంద్ర ప్రభు త్వంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఇందులో భాగంగా బీజేపీతో పాటు కాంగ్రెస్, జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే, ఎన్సీపీ, రాష్ట్రీయ జనతాదళ్ తదితర పార్టీల అధ్యక్షులకు కృష్ణయ్య వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రస్తుతం చట్టసభల్లో మహిళలకు అతి తక్కువగా ప్రాతినిధ్యం ఉందన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో జనాభా ప్రకారం వా టా ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదన్నారు. -
ఆర్టీసీ విలీనం బిల్లు ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశం మరోసారి గందరగోళంగా మారుతోంది. ఆగమేఘాల మీద శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏమైందో స్పష్టత లేకపోవటం కార్మికుల్లో ఆందోళనకు, అయోమయానికి కారణమవుతోంది. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపడంలో జాప్యం జరిగినప్పుడు ఆర్టీసీ కార్మికులు ఏకంగా రెండు గంటలపాటు బస్సులు దిగ్బంధం చేసి రాజ్‌భవన్‌ను ముట్టడించారు. ఆ సమయంలో పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ మరుసటి రోజు హైదరాబాద్ వచ్చిమరీ ఆమోదం తెలిపారు. అంత వేగంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో.. ఇక బిల్లు ఆమోదం, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనానికి వీలుగా కమిటీ ఏర్పాటు కావటం, మార్గదర్శకాలు రూపొందటం, విలీన ప్రక్రియ పూర్తి కావటం కూడా అంతే వేగంగా జరుగుతుందని భావించారు. కానీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి సరిగ్గా నెల గడిచింది. గత నెల ఆరో తేదీన శాసనసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అది గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు చేరింది. అయితే కొన్ని సందేహాల నివృత్తి కోసం దానిని న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్టు తర్వాత గవర్నర్ ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. 183 మంది ఉద్యోగులకుటుంబాలకు నిరాశ గత నెలలో పదవీ విరమణ పొందిన 183 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు నెలాఖరు వరకు ఉత్కంఠగా ఎదురుచూసి నిరాశ చెందాల్సి వచ్చింది. ఇప్పుడు మరో 200 కుటుంబాలు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. న్యాయశాఖ కార్య దర్శి కార్యాలయానికి వచ్చిన బిల్లు అప్పటినుంచి తెలంగాణ సచివాలయంలోనే ఉండిపోయిందంటూ కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై రాజ్‌భవన్ వర్గా లను ‘సాక్షి’వివరణ కోరగా, ఆర్టీసీ బిల్లు ఇంకా రాజ్‌భవన్‌కు చేరుకోలేదని పేర్కొన్నాయి. వేరే 3 బిల్లులు మాత్రం వచ్చాయని వివరించాయి. ఆ రెండు వేతన సవరణలు చేయాలి: కార్మిక సంఘాలు బిల్లును తిరిగి రాజ్‌భవన్‌కు పంపటంలో జాప్యం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు, ఇప్పుడు మరో అంశంపై పట్టుపడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు 2017, 2021 వేతన సవరణలు పెండింగులో ఉన్నందున, వాటిని క్లియర్ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొంటున్నాయి. విలీన ప్రక్రియ లోపే ఆ రెండు వేతన సవరణలు చేస్తే, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను కొంత ఉన్నత స్థాయిలో స్థిరీకరించేందుకు వీలుంటుందని, లేకుంటే తక్కువ వేతన స్థాయిలోనే ఫిక్స్ అవుతాయని, ఇది కార్మికులను తీవ్రంగా నష్టపరుస్తుందని వివరిస్తున్నాయి. ఆయా అంశాలపై మరోసారి ఆందోళనకు సిద్ధమని అంటున్నాయి. ఇప్పుడు ఏ కార్యాలయాన్నిముట్టడించాలి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలియజేయడంలో జాప్యం జరిగిందంటూ రాజ్‌భవన్‌ను ముట్టడించేలా చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వమే జాప్యం చేస్తోంది. ఇప్పుడు ఏ కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించాలి. బిల్లును ఇప్పటికీ రాజ్భవవన్కు పంపకుంటే వెంటనే పంపాలి. ఈలోపు కార్మికులకు బకాయి ఉన్న వేతన సవరణలు చేయాలి. – అశ్వత్థామరెడ్డి, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వెంటనే రాజ్‌భవన్‌కు పంపాలి ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ సంతకం కోసం వెంటనే రాజ్‌భవన్‌కు పంపాలి. జాప్యం చేయకుండా రెండు వేతన సవరణలు జరిపి, సీసీఎస్ బకాయిలు చెల్లించి, ఆ తర్వాత విలీన ప్రక్రియ పూర్తి చేయాలి. – రాజిరెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ -
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోమహిళా బిల్లు ఆర్.కృష్ణయ్య డిమాండ్
కాచిగూడ (హైదరాబాద్): పా ర్లమెంట్ ప్రత్యేక సమావేశా లలో మహిళా బిల్లు పెట్టాల ని, మహిళా బిల్లులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేకసభ కోటా కల్పిం చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21వ తేదీన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రా జ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శని వారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మా ట్లాడుతూ, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ పెట్టాలని అన్నారు. మహిళా బి ల్లులో బీసీ మహిళలకు ప్రాతినిథ్యం కల్పించక పోతే మహిళా బిల్లుకు సార్ధకత లేదన్నారు. మ హిళా బిల్లులో రాజకీయ రిజర్వేషన్లతోపాటు వి ద్యా, ఉద్యోగాలలో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల కు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50శాతం టికెట్లు ఇవ్వాలని, బీసీలకు అన్యాయం చేసే పార్టీల భరతం పడతామని హెచ్చరించారు. -
బిల్ తీసుకుంటే చాలు..కోటి రూపాయలు మీవే!
Mera Bill Mera Adhikar: అన్ని కొనుగోళ్లకు ఇన్వాయిస్లు, బిల్లులు అడిగే సంస్కృతిని ప్రోత్సహించేలాకేంద్రం కొత్త పథకాన్ని తీసు కొస్తోంది రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రభుత్వం 'మేరా బిల్ మేరా అధికార్' పేరుతో 'ఇన్వాయిస్ప్రోత్సాహక పథకాన్ని' ప్రారంభిస్తోంది. ఇందుకోసం వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతి త్రైమాసికంలో లక్కీడ్రా నిర్వహించి, రూ.1 కోటి చొప్పున రెండు బంపర్ బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వినియోగదారులు తాము జరిపే కొనుగోళ్లన్నింటికీ విక్రయదార్ల నుంచి రశీదును అడగడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 'మేరా బిల్ మేరా అధికార్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. సెప్టెంబరు 1 నుంచి 12 నెలల కాలానికి ప్రయోగాత్మక పద్ధతిలో (పైలట్ ప్రాజెక్ట్) ఈ స్కీం షురూ కానుంది. ఆర్థిక శాఖ అందించిన వివరాల ప్రకారం ప్రతీ నెలా లక్కీ డ్రాలో 800 జీఎస్టీ రశీదులను ఎంపిక చేస్తారు. వీరికి రూ.10,000 చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనుంది. లక్కీడ్రాలో ఎంపిక చేసిన మరో 10 రశీదులకు రూ.10 లక్షల చొప్పున బహుమతి అందిస్తుంది. అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి బంపర్ డ్రా ఉంటుంది. ఇందుకోసం గత మూడు నెలల నుంచి బంపర్ డ్రా నెలలో 5వ తేదీ వరకు అప్లోడ్ చేసిన రశీదుల నుంచి విజేతను ఎంపిక చేస్తారు. ఈ పథకం ప్రారంభంలో అసోం గుజరాత్ , హరియాణా, పుదుచ్చేరి, దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలలో పైలట్‌గా లాంచ్ కానుంది. డ్రా అర్హతలు, నిబంధనలు ♦ జీఎస్టీ రిజిస్టర్డ్ సప్లయ్దారులనుంచి వినియోగదార్లు తీసుకున్న రశీదులను మాత్రమే డ్రాకు పరిగణనలోకి తీసుకుంటారు. ♦ జీఎస్టీ గుర్తింపు సంఖ్య, రిసీట్ నెం, డేట్, విలువ, ప్రాంతం తదితర వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ♦ డ్రాలో విజేతగా ఎంపికైన కస్టమర్లు, ఈ సమాచారం అందిన తేదీ నుంచి 30 రోజుల్లోగా యాప్ లేదా వెబ్‌పోర్టల్‌లో పాన్, ఆధార్, బ్యాంకు అకౌంట్ లాంటి వివరాలివ్వాలి. ♦ ఒక నెలలో గరిష్ఠంగా ఒక వ్యక్తి 25 రశీదులను అప్లోడ్ చేయవచ్చు ♦ లక్కీ డ్రాకు అర్హత పొందాలంటే రశీదు విలువ కనీసం రూ.200 ♦ బీ2సీ రశీదులన్నింటినీ నెల 5వ తేదీ(అంతుకుముందు నెలలోని బిల్లులను)లోపు అప్లోడ్ చేస్తేనే నెలవారీ డ్రాకి అర్హత ♦వీటిని 'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ అప్లికేషన్లోను, 'వెబ్ డాట్ మేరాబిల్డాట్జీఎస్టీ డాట్ జీవోవీడాట్ఇన్ అనే వెబ్‌పోర్టల్‌లోనూ అప్లోడ్ చేయాలి. -
ఆర్టీసీ బిల్లుపై న్యాయ సలహా కోరిన గవర్నర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యాయసలహా కోరారు. ఈ క్రమంలో ఆర్టీసీ బిల్లుతో పాటు ఇతర బిల్లులను సైతం ఆమె న్యాయ కార్యదర్శికి పంపినట్లు సమాచారం. ఇది నిబంధనల్లో భాగంగా జరిగే ప్రక్రియే అని రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. ఆర్టీసీ బిల్లుతో పాటు గతంలో తాను వెనక్కి పంపిన మరో నాలుగు బిల్లులకు సంబంధించిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? అనే విషయాన్ని సైతం నిర్ధారించాలన్నారామె. ఈ క్రమంలో.. న్యాయకార్యదర్శి సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఆర్టీసీ బిల్లు సమయంలో దురుద్దేశంతో చేసిన అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ తెలంగాణ ప్రజలను, ఆర్టీసీ ఉద్యోగులను ఓ ప్రకటనలో ఆమె కోరారు. గవర్నర్ కావాలనే ఆపుతున్నారు ఆర్టీసీ బిల్లును గవర్నర్ కావాలనే ఆపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లులపై ఇప్పటికే రాష్ట్రపతి సంతకం చేశారని, అంతకుముందే శాసనసభ ఆమోదం పొందిన బిల్లుల ఆమోదానికి గవర్నర్ మాత్రం జాప్యం చేస్తున్నారని, ఇందుకు రాజకీయ ప్రేరేపిత కారణాలు ఉన్నాయని మండిపడ్డారాయన. నామినేటెడ్ ఎమ్మెల్సీలకు కేబినెట్ పంపిన పేర్లను కూడా ఆమోదించలేదు. తక్షణమే ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని డిమాండ్ చేశారాయన. ప్రత్యక్ష కార్యాచరణకు సిద్దం ఆర్టీసీ బిల్లు విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆర్టీసీ ఉద్యోగులు ప్రత్యేక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) ఉదయం మంత్రి హరీష్ రావు ను కలవనున్నారు టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి, ఇతర నేతలు. గవర్నర్ ఆర్టీసి బిల్లు పై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో పెట్టడం, న్యాయ సలహా అంటూ తాత్సరం చేయడం పై హరీష్ రావు ను కలిసి తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు చర్చించనున్నారు. అనంతరం టీఎంయూ తన భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనుంది. -
శాండ్విచ్ కట్ చేసి, తినేలోపు ఊహించని షాక్.. ఈ రెస్టారెంట్‌కి వెళ్లకూడదు బాబోయ్!
సాధారణంగా రెస్టారెంట్లో తిన్నాక ఆర్డర్ చేసిన ఆహారం, జీఎస్టీ లాంటివి బిల్లో చూస్తాం. ఏ హాటల్‌కి వెళ్లినా ఇదే కనిపిస్తుంది. అయితే ఓ రెస్టారెంట్ మాత్రం వీటికి భిన్నంగా కస్టమర్లతో నడుచుకుంటోంది. అందులో మనం తిన్న ఆహారంతో పాటు, సర్వీసింగ్ మాత్రమే కాదు ప్లేట్స్‌కు కూడా బిల్ వేస్తున్నారు. ఈ వింత అనుభవాన్ని ఓ కస్టమర్ సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకోగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. రెండు పీసులకే ఇటలీలో విహార యాత్ర ఎంజాయ్ చేస్తున్న ఓ బ్రిటీష్ టూరిస్ట్ ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లేక్ కోమో సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. వెయిటర్ రాగానే శాండ్ విచ్ను ఆర్డర్ చేశాడు. అది వచ్చాక రెండు ముక్కలుగా కట్ చేసి వారిద్దరికి ఇవ్వాలని కోరాడు. తినడం పూర్తయ్యాక వెయిటర్ తీసుకువచ్చిన బిల్ చూసి ఆ టూరిస్ట్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. శాండ్ విచ్ను రెండు పీసులుగా చేసినందుకు కూడా బిల్లో చార్జీ విధించడంపై అవాక్కయ్యాడు. శాండ్ విచ్ అసలు ఖరీదు 7.50 యూరోలు కాగా కట్ చేసినందుకు 2 యూరోలు (భారత ప్రకారం రూ.180) విధించారు. సదరు కస్టమర్ రెస్టారెంట్ మేనేజర్‌తో వాదించకుండా బిల్ చెల్లించినప్పటికీ, అతను ట్రిప్ అడ్వైజర్‌లో నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడంతో పాటు ఆ బిల్లు స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు. విసుగు చెందిన కస్టమర్ రివ్యూల సైట్లో రెస్టారెంట్‌కు ఒక స్టార్ మాత్రమే ఇచ్చాడు. అనంతరం ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేశాడు. దీని చూసిన నెటిజన్లు.. ఇలాంటి రెస్టారెంట్లకు వెళ్లకూడదని, యాజమాన్యంపై మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. రెస్టారెంట్ యజామాన్యం మాత్రం తమ చర్యను సమర్థించుకుంది. దీనిపై స్పందిస్తూ.. ‘రెండు పీసులుగా చేయడం వల్ల వాటికి రెండు ప్లేట్లు వాడాలి. ఈ క్రమంలో రెండు ప్లేట్లు కడుక్కోవాలి. ఇందుకు పట్టే సమయం, శ్రమకు ఆ మాత్రం చార్జీ అవుతుంది’’ అని తెలిపింది. -
సీఈసీ నియామకంలో సీజేఐకు అధికారం లేనట్టే
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య కొలీజియంపై విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో వివాదాస్పద బిల్లును మోదీ సర్కార్ గురువారం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించింది. ఆయన స్థానంలో కేబినెట్ మంత్రికి స్థానం కల్పించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఎన్నికల సంఘంపై కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు లభిస్తాయి. కేంద్రం ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చే వరకు ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు లతో కూడిన త్రిసభ్య కమిటీ సీఈసీ, ఇతర కమిషనర్ల నియామకాలు చేపడుతుందని గత మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీజేఐను తప్పించి కేబినెట్ మంత్రిని చేర్చడం వివాదానికి దారితీసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీసు) బిల్లు, 2023ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధానమంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నామినేట్ చేసిన కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఆ కమిటీయే సీఈసీ, ఈసీలను ఎంపిక చేస్తుంది. కాంగ్రెస్, ఆప్ ఇతర విపక్ష పార్టీ సభ్యుల ఆందోళనల మధ్య ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సుప్రీం తీర్పుని లెక్క చేయరా ? సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వుల్ని నీరు కార్చేలా ఈ బిల్లు ఉందని విపక్షాలు విమర్శించాయి. కమిటీ నుంచి సీజేఐని తప్పించడం అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలపై ఇది ప్రభావం చూపిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పులేమైనా బీజేపీకి నచ్చకపోతే వాటిని లెక్క చేయదని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం మొత్తాన్ని ప్రధాని మోదీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఆరోపించారు. కమిటీలో ఇద్దరు బీజేపీకి చెందినవారే ఉంటే నిష్పాక్షికంగా కమిషనర్ల ఎంపిక ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఈసీలో ఖాళీ కేంద్ర ఎన్నికల కమిషన్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఖాళీ ఏర్పడనుంది. ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేకి 65 ఏళ్లు నిండనుండడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న పదవీ విరమణ చేస్తారు. 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్ది రోజుల ముందే ఆయన పదవీ విరమణ చేస్తారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలి. తాము చెప్పినట్టు వినే కమిషనర్‌ను నియమించుకొని ఎన్నికల కమిషన్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవడానికే కేంద్రం ఇదంతా చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సుప్రీం కోర్టు ఉత్తర్వుల కంటే ముందు కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించే వారు. -
రాజ్యసభలో తీవ్ర రగడ
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంతోపాటు వివాదాస్పద ముఖ్య ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల బిల్లుపై విపక్ష సభ్యులు ఆందోళన, నినాదాలతో గురువారం రాజ్యసభ అట్టుడికింది. మణిపూర్ హింసపై 267 నిబంధన కింద సభలో చర్చ చేపట్టాలని ఇన్నాళ్లూ పట్టుబట్టిన విపక్షాలు కొంత దిగొచ్చాయి. 176 నిబంధన కింద చర్చ ప్రారంభించాలని, ప్రధాని మోదీ సభకు వచ్చిన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రధానమంత్రి ఏమైనా దేవుడా? రాజ్యసభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే మణిపూర్ వ్యవహారంపై 176 నిబంధన కింద చర్చ కోసం విపక్ష సభ్యులు పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ప్రధాని మోదీని సభకు రప్పించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే కోరారు. దీనిపై అభ్యంతరం తెలిపిన అధికార బీజేపీ ఎంపీలపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రధానమంత్రి ఎందుకు రాకూడదు? ఆయన ఏమైనా దేవుడా?’ అని ప్రశ్నించారు. ఖర్గే వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను చైర్మన్ ధన్‌ఖడ్ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. అనంతరం వివిధ పార్టీల సభాపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. సభకు సహకరించాలని కోరారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్షాల ఆందోళన ఆగలేదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. రాజ్యసభ కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఓబ్రెయిన్ తీరును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుపట్టారు. అనంతరం మల్లికార్జన ఖర్గే మాట్లాడారు. అధికార పక్షం వల్లే సభ సజావుగా సాగడం లేదని మండిపడ్డారు. బీజేపీ ఎంపీల వ్యవహార శైలిని ఆక్షేపిస్తూ ఓ కవిత వినిపించారు. ఖర్గే తీరు గురువింద గింజలా ఉందని పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు. ఖర్గే వ్యాఖ్యలను పలువురు బీజేపీ సభ్యులు ఖండించారు. మిజోరాం ఎంపీ ఒకరు మాట్లాడబోతుండగా చైర్మన్ ధన్‌ఖడ్ అనుమతించలేదు. పార్లమెంట్ సభ్యులకు దేశంలో ఏదో ఒక ప్రాంతం ముఖ్యం కాదని, దేశమంతా సమానమేనని ధన్‌ఖడ్ అన్నారు. ఫార్మసీ(సవరణ) బిల్లుకు ఆమోదం వివాదాస్పద ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్(అపాయింట్మెంట్ కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు–2023ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం విపక్షాల ఆందోళన మధ్యే కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘పోస్ట్ ఆఫీస్ బిల్లు–2023’ను ప్రవేశపెట్టారు. ఈ తర్వాత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి మన్సుఖ్ మాండవీయా ప్రవేశపెట్టిన ‘ఫార్మసీ(సవరణ) బిల్లు–2023’ సభలో ఆమోదం పొందింది. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్‌ఖడ్ ప్రకటించారు. -
ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం -
లోక్‌సభలో పాసైన డేటా పరిరక్షణ బిల్లు
ఢిల్లీ: దేశ పౌరుల డిజిటల్హక్కుల్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు.. లోక్‌సభలో ఎట్టకేలకు పాసైంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఆగస్టు 3న లోక్‌సభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ‘గోప్యత’ దెబ్బతింటుందన్న విపక్షాల అనుమాన ఆందోళనల నడుమే ఇవాళ బిల్లు పాస్ కావడం గమనార్హం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్-2023 బిల్లు ప్రకారం.. ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్ని ఒక సంస్థ సేకరించాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేకపోయినా, సమాచార దుర్వినియోగానికి పాల్పడినా రూ.50 కోట్ల నుంచి గరిష్టంగా 250 కోట్ల రూపాయల జరిమానా విధిస్తారని కేంద్ర ఐటీశాఖ మంత్రి(సహాయ) రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ చట్టం అమలు కోసం డేటా ప్రొటెక్షన్ బోర్డు ఆఫ్‌ఇండియాను ఏర్పాటు చేస్తారు. ఈ బిల్లులోని నిబంధనం ప్రకారం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బోర్డు రిఫరెన్స్‌తో కేంద్రం ఏదైనా సమాచారాన్ని బ్లాక్ చేసేందుకు పర్మిషన్ ఉంటుంది. ఆన్లైన్ వేదికల్లో.. వ్యక్తుల నుంచి సమాచార దుర్వినియోగం విపరీతంగా జరుగుతుంటుంది. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం గనుక పొందితే.. ప్రతి పౌరుడి డిజిటల్ హక్కులకు రక్షణ లభిస్తుంది అని కేంద్రం చెబుతోంది. కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లుతో సోషల్ మీడియా కంపెనీల ఇష్టారాజ్యానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. బిల్లులోని ముఖ్యాంశాలు ► ఈ బిల్లు భారతదేశంలోని డిజిటల్ వ్యక్తిగత డేటాను ఆన్లైన్లో సేకరించిన.. ఆఫ్‌లైన్‌లో సేకరించి డిజిటలైజ్ చేయబడిన వాటి ప్రాసెసింగ్‌కు వర్తిస్తుంది. ► వ్యక్తిగత డేటా ఆ వ్యక్తి సమ్మతితో చట్టబద్ధమైన ప్రయోజనం కోసం మాత్రమే ప్రాసెస్ చేయబడుతుంది. వినియోగదారుల డేటాను ఉపయోగించడానికి కంపెనీలు ఇప్పుడు అనుమతి తీసుకోవాలి. ► డేటా విశ్వసనీయులు డేటా ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి, డేటాను సురక్షితంగా ఉంచడానికి, దాని ప్రయోజనం అందించిన తర్వాత డేటాను తొలగించడానికి బాధ్యత వహిస్తారు. ► సమాచారాన్ని స్వీకరించే, సరిదిద్దే, తొలగించే హక్కు, ఫిర్యాదులను పరిష్కరించే హక్కుతో సహా వ్యక్తులకు ఈ బిల్లు నిర్దిష్ట హక్కులను అందిస్తుంది. ► రాష్ట్ర భద్రత, పబ్లిక్ ఆర్డర్, నేరాల నిరోధం వంటి కారణాలతో బిల్లులోని నిబంధనలను అమలు చేయడం నుంచి ప్రభుత్వ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వవచ్చు. ఇదీ చదవండి: కుటుంబ పాలన.. క్విట్ ఇండియా -
గవర్నర్‌కు జ్ఞానోదయం అయినందుకు సంతోషం: సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ పాపం తెలిసో తెలియకో అనవసరంగా వివాదం కొని తెచ్చుకున్నారు. ఎందుకు పని పెట్టుకున్నారో తెలియదు. 96 క్లారిఫికేషన్లు అడిగారు. ఆ అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిశీలించి, పరిగణనలోకి తీసుకున్నవే. మొత్తం మీద గవర్నర్‌కు జ్ఞానోదయమై ఆదివారం మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలిపి పంపినందుకు సంతోషం. ప్రభుత్వం, ఆర్టీసీ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం..’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం అసెంబ్లీలో ఈ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘ఆర్టీసీని పెట్టిందే ప్రజారవాణా ఉండాలని. కాలక్రమేణా సంస్థ నష్టాల్లో పడింది. నేను రవాణా మంత్రిగా అంకితభావంతో పనిచేసి రూ.14 కోట్ల నష్టంలోని సంస్థను రూ.14 కోట్ల లాభాల్లోకి తెచ్చా. శక్తిసామర్థ్యాలుంటే సంస్థ నష్టాలను పూడ్చవచ్చు. కానీ డీజిల్ ధరల పెరుగుదలతో పరిస్థితి చేయిదాటింది. తమను ప్రభుత్వంలోకి తీసుకోవాలని గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే, తగిన డబ్బిస్తామని నడిపించుకోవాలని చెప్పాం. లాభాలు తీసుకురావాలని బెస్ట్ ఐపీఎస్ అధికారిని నియమించాం. మంచి అనుభవమున్న బాజిరెడ్డి గోవర్దన్‌ను చైర్మన్‌ను చేశాం. వారు విశ్వప్రయత్నాలు చేసినా డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో నష్టాలు మరింత పెరిగాయి. డీజిల్ లీటర్ రూ. 60 నుంచి రూ.110 కావడంతో ఆమాంతంగా ఖర్చు పెరిగి రోజుకు రూ.2.5 కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో ఇటీవల కేబినెట్లో.. గతంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలపొద్దని అనుకున్నామని, ఇప్పుడేం చేద్దామని చర్చించాం. ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రభుత్వానికైనా సామాజిక బాధ్యత. పైగా ఆర్టీసీని తీసేయడానికి లేదు. అది మంచి నైపుణ్యాలున్న సంస్థ. జీరో యాక్సిడెంట్‌తో ప్రయాణికులను క్షేమంగా చేరవేసే సంస్థ. కానీ అది మనుగడ సాగించే అవకాశం లేదు. దీంతో ప్రభుత్వమే సాకాలి. మరో దారిలేదు. ఇప్పటికే ఏడాదికి బడ్జెట్లో పెట్టి మరీ రూ.1,500 కోట్లు వారికి ఇస్తున్నాం. ప్రభుత్వంలో లేదన్న పేరే తప్ప గవర్నమెంటే సాదుతోంది. కాబట్టి ప్రభుత్వంలోకి తీసుకుందాం. ఉద్యోగులకు భద్రత వస్తుంది. సంస్థకు చిక్కులు పోతాయనే ఉద్దేశంతో విలీనం నిర్ణయం కేబినెట్లో తీసుకున్నాం’ అని కేసీఆర్ వివరించారు. భూములపై కన్ను అంటూ నీచంగా మాట్లాడుతున్నారు.. ‘గతంలో వద్దన్నవారే మళ్లీ ఎట్లా తీసుకున్నారని పిచ్చివాగుడు చేసే వాళ్లు ఉన్నారు. ప్రభుత్వం ఏ పనిచేసినా ఓ బాధ్యతతో, దృక్పథంతో, పరిశీలనతో చేస్తుంది. ఇక సగం సగం ఎందుకు పూర్తిగానే బాధ్యత తీసుకుందామని నిర్ణయించాం. మరో ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులను పెట్టి ఆదాయం పెంచే చర్యలు తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని కొందరు దుర్మార్గులు, నీచులు మాట్లాడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఇంటి పిల్లవాడిని సాదుకోవాలి తప్ప చంపుకోలేము. మరిన్ని సౌకర్యాలు పెంచి, అవసరమైతే మరిన్ని స్థలాలు సేకరించి ప్రభుత్వ పరంగా సరీ్వసులు పెంచుతాం. ఆర్టీసీ ఉద్యోగులకూ పీఆర్సీ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేవి వారికి కూడా వస్తాయి’ అని సీఎం తెలిపారు. -
‘విలీనానికి’ అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులతో ఆదివారం రాజ్‌భవన్‌లో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పలు సిఫారసులతో బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. దీంతో విలీనంపై మూడురోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడినట్టయ్యింది. ముగిసిన హైడ్రామా ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ ఈ నెల 2న రాష్ట్ర ప్రభుత్వం బిల్లును రాజ్‌భవన్‌కు పంపింది. అయితే బిల్లు పరిశీలనకు సమయం కావాలని 3వ తేదీన రాజ్‌భవన్ ప్రకటించింది. ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో అదే రోజు బిల్లును పరిశీలించిన గవర్నర్ తమిళిసై 5 సందేహాలపై ప్రభుత్వ నుంచి వివరణలు కోరారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు రాజ్‌భవన్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించగా, ప్రభుత్వ ప్రొద్బలమే ఇందుకు కారణమని రాజ్‌భవన్ ఆరోపించింది. కాగా ప్రభుత్వం పంపిన వివరణలతో సంతృప్తి చెందని గవర్నర్.. ఈ నెల 5న రెండోసారి మరికొన్ని సందేహాలకు సమాధానాలను కోరగా, ప్రభుత్వం వెంటనే ఆ మేరకు వివరణలు పంపించింది. రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం ఎట్టకేలకు ఆదివారం బిల్లుకు గవర్నర్ సమ్మతి తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేశారు. కారుణ్య నియామకాలు చేపట్టాలి ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనం తర్వాత కూడా సంస్థ భూములు, ఆస్తులపై యాజమాన్య హక్కులను ఆర్టీసీ సంస్థే కలిగి ఉండాలి. సంస్థ అవసరాల కోసమే వాటిని వినియోగించాలి. ఈ మేరకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణీ ప్రక్రియ పూర్తి కావాలి. ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీ నుంచి రావాల్సిన బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలి. బకాయిల చెల్లింపు బాధ్యతను తీసుకోవాలి. విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పారితోశాకాలు, జీతభత్యాలు, పే స్కేలు, సర్విసు నిబంధనలు, బదిలీలు, పదోన్నతులు, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు వర్తింపజేయాలి. వైద్యపరంగా అనర్హులు(మెడికల్లీ అన్‌ఫిట్)గా మారే ఉద్యోగులు కారుణ్య నియామకం కింద తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం కోరే సదుపాయాన్ని కల్పించాలి. అత్యంత కఠినంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల ప్రక్రియను సరళీకరించి మానవీయంగా మార్చాలి. అందరికీ సమాన ప్రయోజనాలు ఆర్టీసీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో రాష్ట్ర సర్విసు నిబంధనల మేరకు సమాన ప్రయోజనాలు, జీతాలు, పీఎఫ్ చెల్లించాలి. వారి ఉద్యోగ భద్రతను పరిరక్షించి వారి సేవలను ఇతర శాఖల్లో వినియోగించుకోవాలి. ఆర్టీసీ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు సర్విసులో ఉన్నంత కాలం వారికి ఆర్టీసీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు కొనసాగించాలి. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సైతం వైద్య ప్రయోజనాలు అందించాలి. బస్సుల నిర్వహణలో ఆర్టీసీ సంస్థ, యూనియన్ల పాత్రే కీలకం. ప్రజల భద్రత కోసం బస్సుల నిర్వహణను ప్రభుత్వం తీసుకుని, ఔట్సోర్సింగ్ పద్ధతిలో స్వతంత్ర సంస్థకు లేదా మరేదైనా పద్ధతిలో అప్పగించాలి. నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇవ్వాలి. -
నేనైతే సంతకం పెట్టాను.. కానీ అంతా వాళ్ల చేతిలోనే ఉంది
సాక్షి, చైన్నె : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కేంద్రం చేతిలో ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తన వద్దకు నివేదిక రాగానే, పరిశీలించిన సంతకం పెట్టినట్టు వివరించారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్ మార్మోగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీలో బీజేపీ మిత్రపక్షం ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర హోదాకోసం తీర్మానం చేసింది. దీనిని రాజ్‌నివాస్‌కు పంపించారు. అయితే, దీనిని ఎల్జీ తమిళిసై సౌందరరాజన్ తుంగలో తొక్కేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సమాధానం ఇస్తూ ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ తీర్మాన నివేదిక తనకు జూలై 22న అందినట్టు పేర్కొన్నారు. మరుసటిరోజే తాను పరిశీలించి సంతకం కూడా చేశానని, అదే రోజున కేంద్రం అనుమతి కోరుతూ ఢిల్లీకి పంపించినట్టు వివరించారు. నిబంధనల పరంగా ఇందులోని అంశాలను కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. తన వరకు రాష్ట్ర హోదా ఫైల్లో సంతకం పెట్టానని, అమల్లోకి రావాలంటే కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు వెలువడాల్సి ఉంటుందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. -
ఆర్టీసీ విలీనం డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం
-
ఆర్టీసీ బిల్లుపై స్పందించిన గవర్నర్ తమిళిసై
-
కార్మికులకు అండగా ఉన్నా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును హడావుడిగా ప్రవేశపెట్టడం సరికాదని, అందులోని అంశాలపై విస్తృత చర్చ కోసం భాగస్వామ్య పక్షాలకు తగిన సమయం ఇవ్వాల్సి ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఆపడం వెనక తనకు వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలేమీ లేవని.. ప్రజలు, ఆర్టీసీ ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాలను రక్షించడమే తన ఉద్దేశమని చెప్పారు. తాను ఎల్లçప్పుడూ ఆర్టీసీ కార్మికుల పక్షాన ఉంటానని, గత సమ్మె సమయంలో కూడా కార్మికులకు అండగా నిలబడి అర్ధరాత్రి వారి సమస్యలను విన్నానని గుర్తు చేశారు. శనివారం ఆమె పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ మజ్దూర్ యూనియన్ల ప్రతినిధులతో మాట్లాడారు. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు పట్ల ఆందోళన, సానుభూతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన వివరణలు అందాక.. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. పీఆర్సీ, గ్రాట్యుటీ చెల్లింపు ఎప్పుడు? ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణలు (పీఆర్సీలు), ఈపీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిల చెల్లింపు వంటివి పెండింగ్‌లో ఉండటంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ సహకార సొసైటీకి చెందిన రూ.3 వేల కోట్లకుపైగా నిధులను ప్రభుత్వం తీసుకుని ఇప్పటివరకు చెల్లించలేదని గుర్తు చేశారు. రాష్ట్రానికి రాజ్యాంగబద్ధ అధిపతిగా రాజ్యాంగ నియమాల పరిరక్షణతోపాటు ప్రజలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే బాధ్యత తనపై ఉందన్నారు. ధర్నాకు మంత్రుల వ్యూహరచన: ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఎలాంటి సమ్మెకు పిలుపు ఇవ్వలేదని వీడియో కాన్ఫరెన్స్‌లో జేఏసీ ప్రతినిధులు గవర్నర్‌కు చెప్పారు. ప్రభుత్వ ప్రోద్బలంతో బలవంతంగా సమ్మె చేయించారని, మహిళా ఉద్యోగులను సైతం వదిలిపెట్టలేదని ఆరోపించారు. రాజ్‌భవన్ ముట్టడి జరపాలని తమపై ఒత్తిడి తెచ్చారని.. ధర్నాకు ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యూహరచన చేశారని పేర్కొన్నారు. -
ఆర్టీసీ కార్మికుల ‘చలో రాజ్‌భవన్’
సాక్షి, హైదరాబాద్/ పంజగుట్ట: ఆర్టీసీ కార్మికులు కదంతొక్కారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా శనివారం ఉదయం భారీ ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపైన ఆమోదం తెలపాలని, గవర్నర్ సంతకం చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది ‘చలో రాజ్‌భవన్’పేరిట భారీ ర్యాలీ నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతృత్వంలో చేపట్టిన ఈ భారీ ప్రదర్శనకు నగరంలోని అన్ని డిపోలకు చెందిన కార్మికులు తరలివచ్చారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సిటీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఫలితంగా విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు కార్మికుల భారీ ప్రదర్శనతో ఖైరతాబాద్ చౌరస్తా, రాజ్‌భవన్ తదితర మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. నాలుగైదు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ కార్మికులు రోడ్డుపైనే బైఠాయించడంతో ఖైరతాబాద్ నుంచి రాజ్‌భవన్ వచ్చే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. దాంతో నాలుగు వైపులా విపరీతంగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు గంటలతరబడి రోడ్లపైనే పడిగాపులు కాయాల్సివచ్చింది. గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాజ్‌భవన్ వైపు వెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకొని ఆందోళనకారులు ముందుకు వెళ్లారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘గవర్నర్ డౌన్ డౌన్’అంటూ నినదించారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రదర్శనగా వెళ్లిన కార్మికులంతా రాజ్‌భవన్ ఎదుట బైఠాయించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి అధ్యక్షతన ఐదుగురు ప్రతినిధుల బృందం రాజ్‌భవన్‌లోకి వెళ్లి గవర్నర్‌తో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నిరసనను విరమించారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారు ఆ తర్వాత «థామస్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ ఎంతో సానుకూలంగా స్పందించారని చెప్పారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ తనకు ఎంతో ముఖ్యమని గవర్నర్ చెప్పారని పేర్కొన్నారు. బిల్లులో కొన్ని సందేహాలు నివృత్తి కాగానే బిల్లుకు ఆమోదం తెలుపుతామన్నారని వివరించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు కమలాకర్, ఉపాధ్యక్షులు జీపీఆర్ రెడ్డి, కోశాధికారి రాఘవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.ఆర్.రెడ్డి, మహిళా నాయకురాలు నిర్మలా రెడ్డి, బీఆర్టీయూ అధ్యక్షులు రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి పి.నారాయణ నిరసనకు నాయకత్వం వహించారు. కాగా, గవర్నర్‌తో సమావేశం అయిపోయాక అక్కడకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులను పోలీసులు రాజ్‌భవన్‌లోనికి అనుమతించకుండా వారిని తీసుకొని ఖైరతాబాద్‌లో వదిలేశారు. -
ఆర్టీసీ బిల్లు జాప్యంపై బండి సంజయ్ కామెంట్లు
సాక్షి, కరీంనగర్: ఆర్టీసీ బిల్లు విషయంలో తొందరపాటు పనికి రాదని.. గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తోందంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఇవాళ(శనివారం) తొలిసారి ఆయన సొంత జిల్లాలో పర్యటించారు. శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టు వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసై భుజాలపై తుపాకీ పెట్టి ఈ ప్రభుత్వం కాల్చాలని చూస్తోంది. గవర్నర్‌ను రెండు రోజుల్లోనే పరిశీలించి ఆమోదించాలంటే ఎలా?. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల జీవితాలకు సంబంధించిన బిల్ అది. కార్మికులకు సరైన న్యాయం చేసేందుకే ఇంతలా పరిశీలన చేస్తారు. ఇలాంటి బిల్స్ లో ఏ గవర్నరైనా ఇలానే పరిశీలిస్తారు అని తెలిపారాయన. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ కానీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై కానీ వ్యతిరేకం కాదని గుర్తించాలి బండి సంజయ్ కోరారు. ఆర్టీసీ కార్మికులు కొంత సంయమనంతో ఉండండి. మీకు సరైన న్యాయం జరుగుతుంది. రేపొద్దున తిరకాసు చేసి.. ఆ నెపాన్ని గవర్నర్‌పై నెట్టేసే వ్యక్తి కేసీఆర్. ఆర్టీసీ ఆస్తుల్ని అమ్మేసే కుట్ర జరగుతుందోని అని ఆరోపించారాయన. అంతకు ముందు.. మొట్టమొదటిసారిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ కు వచ్చిన బండి సంజయ్‌కు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. రామడుగు మండలంలో వర్షాలకు దెబ్బ తిన్న మోతె వాగు బ్రిడ్జ్, శంకరపట్నం మండలంలో దెబ్బ తిన్న కల్వల ప్రాజెక్టులను సందర్శించారాయన. ఇదీ చదవండి: హలో కేటీఆర్‌గారూ.. ఇది గుర్తుందా? -
టీఎస్ఆర్టీసీ బిల్లు రగడ: గవర్నర్ అడిగిన వివరణలపై సర్కార్ రిప్లై
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై వివరణ కోరారు. దీనిపై రాజ్‌భవన్‌కు అధికారులు రిప్లై పంపించారు. ఇప్పటి కన్నా మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. విలీనం అయిన తర్వాత విధివిధానాలో అన్ని అంశాలు ఉంటాయని, కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ ఇష్యూ ఏపీలో ఎలా చేసిందో వాటికి అనుగుణంగా ఉంటుందని తెలంగాణ సర్కార్ తెలిపింది. కాగా, టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై వివరణ కోరిన సంగతి తెలిసిందే. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్లో న్యాయం ఎలా చేస్తారు? అన్న గవర్నర్.. ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను కోరారు. చదవండి: ఆర్టీసీ విలీనం: గవర్నర్, కేసీఆర్ సర్కార్ పంచాయితీ.. ‘బట్టకాల్చి మీదేస్తున్నరు’ -
మరోసారి రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్
-
రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత.. గవర్నర్‌తో ముగిసిన ఆర్టీసీ కార్మికుల చర్చలు
►ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరిన గవర్నర్.. ఆ సంస్థ ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించారు. ఆర్టీసీ యూనియన్ నాయకులతో పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆర్టీసీ యూనియన్ సభ్యుల బృందం గవర్నర్‌తో గంటపాటు చర్చించారు. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని ఆ సంఘం నేత థామస్‌రెడ్డి తెలిపారు. ►గవర్నర్ లేవనెత్తిన ఐదు అభ్యంతరాలపై తెలంగాణ సర్కార్ వివరణ ఇచ్చింది. ఈనేపథ్యంలో ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై ఏం నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. ►రాజ్‌భవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ రాజ్‌భవన్ ముట్టడికి ర్యాలీగా ఆర్టీసీ ఉద్యోగులు బయలుదేరారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ యూనియన్ నేతలను చర్చలకు గవర్నర్ ఆహ్వానించారు. ►ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. గవర్నర్ తీరును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు. రెండు గంటలపాటు బస్సులను బంద్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసే బిల్లును వెంటనే గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా డిపోల్లో బస్సులన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు బంద్ పాటించారు. రెండు గంటల పాటు ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల అందోళనతో బస్సులు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ ,ఉట్నూరు, బైంసా, నిర్మల్, అసిపాబాద్, మంచిర్యాల డిపోల ముందు ఆందోళన కొనసాగుతుంది. రెండు గంటల బంద్‌లో భాగంగా నల్లగొండ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. మరోవైపు డిపో వద్ద గురుకుల అభ్యర్థులు నిరసనకు దిగారు. పరీక్ష కోసం వెళ్లేందుకు బస్సులు లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు సర్వీసులు నిలిపివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
నేడు ఆర్టీసీ ఉద్యోగుల రాజ్‌భవన్ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లు’ను గవర్నర్ తమిళిసై పరిశీలన కోసం ఆపడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్విసులను నిలిపివేయాలని ఉద్యోగులు, కార్మికులకు పిలుపునిచ్చాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశాయి. -
వచ్చి రెండు రోజులేగా అయ్యింది.. టైం పడుతుంది!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై వర్సెస్ బీఆర్ఎస్ సర్కార్‌కు నడుమ మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్ తెలిసిందే. ఈ క్రమంలో.. ‘బిల్లుల పెండింగ్’ అంశం కూడా హాట్ టాపిక్‌గా ఉంటోంది. అయితే తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీసీ బిల్లును ఈ దఫా అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాల్సి ఉండగా.. గవర్నర్ నుంచి అందుకు అనుమతులు రాలేదు. ఈ తరుణంలో.. రాజ్‌భవన్ స్పందించింది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. ఆ సంస్థ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా బిల్లును రూపొందించింది.. ఆర్థికపరమైంది కావడంతో దానిని గవర్నర్‌కు పంపింది కూడా. అయితే రెండు రోజులు గడిచినా గవర్నర్ నుంచి అనుమతి రాలేదు. ఆమె అనుమతి ఇస్తేనే అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగేది. దీంతో ప్రభుత్వ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తుండగా.. మరోవైపు ఈ పరిణామంపై రాజ్‌భవన్ వర్గాలు స్పందిస్తూ.. బుధవారం మధ్యాహ్నాం ఆర్టీసీ బిల్లు రాజ్‌భవన్‌కు చేరింది. కాబట్టి గవర్నర్ ఈ బిల్లును పరిశీలించడానికి కొంత సమయం పడుతుంది. పైగా న్యాయ సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సమయం కావాలి అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదీ చదవండి: ‘మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించేది నేనే!’ -
సినిమా అంటే హీరో ఒక్కడే కాదు: రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: సినిమా అంటే హీరో ఒక్కడే కాదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, బడ్జెట్లో సింహభాగం హీరోలకు వెళ్లే సంస్కృతి మారాలని అభిప్రాయపడ్డారు. సినిమా బడ్జెట్లో అధికభాగం హీరోల రెమ్యునరేషన్లేనని గుర్తుచేశారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ వంటి బడా హీరోలు రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నారని చెప్పారు. సినిమా కోసం పనిచేసిన కార్మికులకు మాత్రం నామమాత్రపు జీతాలేనని తెలిపారు విజయసాయి రెడ్డి. కష్టపడిన అందరికీ సముచిత ప్రయోజనం చేకూరాలని ఆయన కోరారు. ఈ మేరకు చట్టాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు. హీరో కొడుకులే హీరోలు ఎందుకు అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదీ చదవండి: బాబు బాటలో పవన్.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా? -
13 గంటలు ఆటోలో ఊరంతా తిరిగి.. డ్రైవర్ డబ్బులు అడిగేసరికి..
ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్ పరిధిలోని సైబర్ సిటీలో ఒక మహిళ హల్చల్ చేసింది. జ్యోతి అనే ఈ మహిళ మేదాంత హాస్పిటల్ సమీపంలో ఒక ఆటోను రాత్రి 10 గంటల సమయంలో బుక్ చేసుకుంది. మర్నాటి ఉదయం 11 గంటల వరకూ అదే ఆటోలో పలుచోట్ల తిరిగింది. ఈ సమయంలో ఆటోవాలా ఆమెను ఎక్కడకు వెళ్లాలో సరిగ్గా చెప్పండి.. లేదంటే డబ్బులిచ్చి, ఆటో దిగిపోండి అని అన్నాడు. ఆటో డ్రైవర్ దీపక్ డబ్బులు అడగగానే ఆమె నానా హంగామా చేసింది. డబ్బులడిగితే తప్పుడు కేసులు పెడతానని బెదిరించింది. దీంతో ఈ విషయమై ఆటో డ్రైవర్ గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతోనూ ఆమె వాగ్వాదానికి దిగింది. ఆటో డ్రైవర్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఒక యాప్ ద్వారా గత రాత్రి ఆమె ఆటో బుక్ చేసుకున్నదని, ఉదయం 11 గంటల వరకూ ఆటోలో ఇటునటు తిప్పాలని కోరిందన్నాడు. తరువాత ఆటో బిల్లు వెయ్యి రూపాయలు అయ్యిందని చెప్పగానే, ముందు పేటీఎం చేస్తానని చెప్పిందని, తరువాత గొడవకు దిగిందని తెలిపాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి.. -
రెస్టారెంట్లో మహిళకు వింత అనుభవం.. పాటలు విన్నారని ఊహించని షాక్ ఇచ్చారు!
రెస్టారెంట్‌కు స్నేహితులతో కలిసి వెళ్లి.. టేస్టీ పుడ్‌ని లాగించేసి కాసేపు సరదాగా గడిపేసి రావడం అంటే అందరికీ ఇష్టమే. అయితే సాధారణంగా రెస్టారెంట్ అంటే బిల్ కాస్త ఖరీదుగానే ఉంటుంది కాబట్టి మనం దానికి కూడా సన్నద్ధంగానే ఉంటాం. మహా అయితే భోజనం ధరలు కాస్త ఎక్కువగా ఉండడం, సర్వీస్ ఛార్జీ వంటివి ఊహిస్తాం. అయితే బ్రిటన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు వెయిటర్ ఇచ్చిన బిల్ చూడగానే ఊహించని షాక్ తగిలింది. బిల్లో ఇలాంటివి కూడా వేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఆ ఫోటోని నెట్టింట షేర్ చేసింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని ఓ మహిళ తన స్నేహితులంతా కలిసి సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లింది. ఇంకేముందు చిట్ చాట్ మొదలుపెట్టిన కాసేపటి ఆర్డర్ పెట్టిన పుడ్ వచ్చేసింది. కబుర్లు చెప్పుకొంటూ వాటిని ఆరగించారు. చివర్లో వెయిటర్ తీసుకువచ్చిన బిల్ చూసి షాక్ అవ్వడం వారి వంతైంది. ఎందుకంటే ఆ రెస్టారెంట్లో లైవ్ మ్యూజిక్ కార్యక్రమం నడుస్తోంది. యాజమాన్యం ఆ పాటలు విన్నందుకు 8 పౌండ్లు బిల్లో చేర్చింది. ఏం చేయాలో తోచక వారు బిల్లు చెల్లించి బయటకు వచ్చేశారు. తరువాత తమకు ఇలాంటి అనుభవం ఎదురైందంటూ రెస్టారెంట్ నిర్వాహకులు ఇచ్చిన రసీదును సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇలాంటివి యూకేలో మునుపెన్నడూ లేవంటూ ఈ ఫోటో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ బిల్లులో మరికొన్ని ఫీజులు ఉండటంతో రెస్టారెంట్ యాజమాన్యం పుడ్ లవర్స్ ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: 2,600లకు పైగా విమానాలు రద్దు.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ విజ్ఞప్తులు -
వామ్మో.. ఈ మ్యాగీ కంటే బిర్యానీ బెటర్.. ధర చూసి షాకైన యూట్యూబర్!
న్యూఢిల్లీ: ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది.. ప్రజలు భోజనాల నుంచి ఫాస్ట్‌గా రెడీ అయ్యే ఫాస్ట్పుడ్స్పై మొగ్గు చూపుతున్నారు. అందుకే హోటల్స్ అనే కాకుండా పుట్‌పాత్‌లపై కూడా ఫాస్ట్ పుడ్ సెంటర్లకి గిరాకీ పెరుగుతోంది. ఈ కేటగిరి ఆహారంలో బయట పుడ్‌కి ప్రత్యామ్నాయంగా మ్యాగీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కేవలం రెండు నిమిషాల్లోనే నోరూరించే వంటకం సిద్ధం కావడంతోపాటు దీని ధర కూడా తక్కువే. ఇంకేముంది చిన్నారుల నుంచి పెద్దల వరకు మ్యాగీని ఎగబడి తింటున్నారు. అయితే అదే మ్యాగీ ఎయిర్‌పోర్టులో కొంటే ఆ బిల్ చూసి ఓ యూట్యూబర్‌కి కళ్లు బైర్లు కమ్మాయి. వెంటనే ఆ బిల్‌ని ఫోటో తీసి నెట్టింట పెట్టి.. ఈ షాకింగ్ విషయాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఓ యూట్యూబర్ ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా ఆకలేసింది. సరే ప్రయాణం కాబట్టి తీరిగ్గా తినే టైం లేదని మ్యాగీ ఆర్డర్ చేశాడు. అనుకున్నట్లుగా మ్యాగీ రావడం మనోడు కడుపునిండా తినేశాడు. అయితే చివరిలో వెయిటర్ తెచ్చిన బిల్ చూసి ఆ యూట్యూబర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ మ్యాగీ మసాలా నూడుల్స్ ధర రూ. 184గా చూపించి దానికి జీఎస్టీ రూ. 9.20 జోడించడంతో రూ. 193.20 బిల్లు అయింది. చేసేదేమిలేక ఆ వ్యక్తి బిల్లు చెల్లించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ బిల్ చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘వామ్మో.. మరీ ఇంత ధరకు అముతున్నారా.. ఈ ధరకు బిర్యానీ వస్తుందని కొందరు కామెంట్ చేయగా... ఎయిర్‌పోర్టులో ధరలు అలానే ఉంటాయంటూ మరొకరు కామెంట్ చేశారు. చదవండి: వీడియో: బొమ్మ కాదురా నాయనా.. పామును చేతిలో పట్టుకుని.. -
బుట్టాయిగూడెంలో తమ్ముళ్ల పరువు పాయే.. పాత బిల్లుతో బొక్కబోర్లా!
ద్వారకా తిరుమల: రాష్ట్ర ప్రభుత్వంపై బురద చిమ్మాలన్న దురుద్దేశంతో లేనిది ఉన్నట్టు చూపించేందుకు ప్రయత్నాలు చేసిన టీడీపీ నాయకుడు చివరికి భంగపడ్డారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం బుట్టాయిగూడెంలో జరిగిన ఈ ఘటన వివరాలున్నాయి.. బుట్టాయిగూడేనికి చెందిన నోముల రాంబాబు పూరి గుడిసెకు 2021 అక్టోబర్ నుంచి 2022 నవంబర్ వరకు (13 నెలలకు) రూ.26,660 విద్యుత్ బిల్లు వచ్చిం ది. అతను అధికారులను సంప్రదించగా, అంత బిల్లు రావడానికి మీటరు జంప్ అవడమే కారణమని తెలుసుకున్నారు. 2022 నవంబర్ 30న రూ.16,840 బిల్లును మినహాయించి, మిగిలిన రూ.9,820 చెల్లించాలని సూచించారు. పైగా, రాంబాబుకు ఎస్సీ కోటాలో ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇస్తోంది. అప్పటి నుంచి అతడికి నెలకు రూ.28 మాత్రమే బిల్లు వస్తోంది. అయితే రాంబాబు పాత బకాయితో పాటు ఆ తర్వాతి నెలల బిల్లులు కూడా చెల్లించలేదు. అతని బకాయి రూ.10,150కు చేరింది. దీంతో అధికారులు నెల క్రితం అతని ఇంటి విద్యుత్ కనెక్షన్ తొలగించారు. రాంబాబు ఈ నెల 7న రూ.2 వేలు మాత్రమే చెల్లించాడు. అయితే అధికారులు మొత్తం బిల్లు చెల్లించాలని సూచించారు. గోపాలపురం టీడీపీ ఇన్చార్జి మద్దిపాటి వెంకట్రాజు పార్టీ కార్యక్రమంలో భాగంగా గురువారం అక్కడికి వచ్చారు. ఆయనకు రాంబాబు పాత బిల్లు చూపాడు. వెంటనే ఆయన పాత బిల్లు పట్టుకొని పూరి గుడిసెకు వేలల్లో బిల్లు వచ్చిం దంటూ రోడ్డుపై బైఠాయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. చివరకు అది పాత బిల్లని తేలడంతో నాలుక్కరుచుకున్నారు. ప్రతి నెలా ఎస్సీ సబ్సిడీ వస్తోంది ప్రభుత్వం గతేడాది డిసెంబర్ రెండో తేదీ నుంచి రాంబాబుకు ఎస్సీ కోటాలో ప్రతి నెలా విద్యుత్ సబ్సిడీ ఇస్తోందని, అతనికి నెలకు రూ.28 మాత్రమే బిల్లు వస్తోందని భీమడోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.గోపాలకృష్ణ తెలిపారు. పాత బిల్లు బకాయికి సంబంధించి రాంబాబు శనివారం మరో రూ.500 చెల్లించాడని, దాంతో అతడి ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని వివరించారు. బిల్లు నెలకు రూ.26,660 వచ్చిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. -
రెస్టారెంట్లో ఖరీదైన వాటర్ బాటిల్ అంటగట్టారని.. ‘పైసా వసూల్’ పనిచేసి..
ఖరీదైన రెస్టారెంట్లలో బిల్లులు ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. అటువంటి సందర్భాల్లో కాస్త నిట్టూరుస్తూనే బిల్లు చెల్లిస్తుంటాం. తాజాగా ఫిట్నెస్, న్యూట్రిషన్ కోచ్ రితికా బోరా రెస్టారెంట్లో తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. ఆమె రెస్టారెంట్లో వాటర్ బాటిల్‌కు ఆర్డర్ చేయగా, దానికి ఆమె భారీగా బిల్లు చెల్లించాల్సి వచ్చింది. తన అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసిన ఆమె క్యాప్షన్‌లో ‘మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఈ ఫ్యాన్సీ రెస్టారెంట్‌కు స్నేహితురాలితో పాటు వెళ్లాను. అక్కడ వాటర్ బాటిల్‌కు రూ.350 చెల్లించాల్సి వచ్చిందంటే ఎవరూ నమ్మరు. అందుకే ఆ బాటిల్‌ను నాతో పాటు ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దీనిని తిరిగి వినియోగించవచ్చని భావించాను. ఈ విధంగా నేను మాత్రమే చేస్తున్నానా? మీరు కూడా చేస్తారా?’ అని అమె ప్రశ్నించింది. Met up with a friend at this fancy restaurant for lunch, and you won't believe they charged 350 rps for a bottle of water! So, I decided to bring the bottle home with me so that I can reuse it. Is it only me or u have done this too? pic.twitter.com/AecGPLuoV8 — Ritika Borah (@coach_ritika) July 10, 2023 ఎక్కడైనా వాటర్ బాటిల్ రూ. 20కి లభ్యమవుతుంది. అయితే ఈ రెస్టారెంట్లో ఏకంగా వాటర్‌బాటిల్‌కు రూ. 350 చెల్లించాల్సి వచ్చిందని ఆమె వాపోయింది. రితికా బోరా పోస్టును చూసిన పలువరు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు తమకు రెస్టారెంట్లలో ఎదురైన అనుభవాలను తెలియజేయగా, మరికొందు ‘పైసా వసూల్’ పని చేశారంటూ మెచ్చుకుంటున్నారు. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
మద్దతుదారులకు ట్రంప్ షాక్.. అంత పని చేశాడా?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్ధతుదారులకు షాక్ ఇచ్చాడా?. తాజాగా రహస్య పత్రాల వ్యవహారంలో ఫ్లోరిడా మియామీ కోర్టుకు హాజరైన ఆయన.. దారిలో లిటిల్ హవానాలోని ఓ క్యూబన్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అయితే అక్కడ జరిగిన ఓ పరిణామం గురించి సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ట్రంప్ రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో జనం భారీ సంఖ్యలో గుమిగూడారు. అయితే వాళ్లను ఉద్దేశించి ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ అంటూ బిల్లు తానే కడతానంటూ గట్టిగా అరిచి ప్రకటించాడాయన. దీంతో అక్కడున్నవాళ్లంతా ఎగబడి మరీ తిండి కోసం పోటీ పడ్డారు. అయితే కాసేపటికే అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పది నిమిషాల తర్వాత గప్‌చుప్‌గా ట్రంప్ అక్కడికి వెళ్లిపోవడంతో కంగుతినడం మద్దతుదారుల వంతు అయ్యింది. ట్రంప్ ఇంత పని చేస్తాడా? అని నిరాశకు లోనయ్యారంతా. ట్రంప్ ఆ రెస్టారెంట్లో పది నిమిషాలు మాత్రమే గడిపాడు. ఎలాంటి ఆర్డర్ చేయలేదని తెలుస్తోంది. అయితే.. అక్కడ నుంచి వెళ్లిన ట్రంప్ మాత్రం తన ప్రైవేట్ ప్లేన్‌లో మెక్‌డొనాల్డ్స్ ఫుడ్‌ను ఆరగించాడని స్థానిక పత్రికలు కథనాలు ప్రచురించాయి. Trump supporters left empty-handed after he promised 'food for everyone' at Miami's Versailles: report https://t.co/TxZ0I949ZA Kind of like when he left people out in the cold at one of rally’s. He had no buses to take people home he bussed in. — James Tate (@JamesTate121) June 15, 2023 JUST IN: Trump supporters left empty-handed after he promised 'food for everyone' at Miami's Versailles Idiots 😂😂😂 I guess they had to go home and drink some more kool-aid pic.twitter.com/dsK3UImpTy — CoffeyTimeNews (@CoffeyTimeNews) June 15, 2023 Mr. Generosity showed up at a restaurant and shouted "food for everybody". He then left without paying a cent. And this is the face of rhe republican party. https://t.co/6va9vvwVPR — Dan ain't Q (@dan6654) June 15, 2023 -
అమెరికాలో దీపావళికి సెలవు.. ప్రత్యేక బిల్లు!
వాషింగ్టన్: అమెరికాలో దీపావళిని ఫెడరల్ హాలీడేగా ప్రకటించాలని కోరుతూ అమెరికా చట్టసభ్యురాలు ఒకరు ప్రత్యేక బిల్లు (Diwali Day Act )ప్రవేశపెట్టారు. గ్రేస్ మెంగ్ శుక్రవారం ప్రతినిధుల సభ( House of Representatives)లో ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనపై పలువురు చట్టసభ్యులతో పాటు భారతీయ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. గ్రేస్ మెంగ్ వర్చువల్‌గా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందికి దీపావళి పండుగ ఎంతో ముఖ్యమైంది. క్వీన్స్, న్యూయార్క్ లాంటి అమెరికా ప్రధాన నగరాల్లోనూ లెక్కలేనన్ని కుటుంబాలు, కమ్యూనిటీలు దీపావళిని ఘనంగా నిర్వహించుకుంటాయి. అమెరికన్ పౌరులు సైతం హుషారుగా పాల్గొనడమూ చూస్తున్నాం. ఆ వెలుగులు ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి. కాబట్టి, ఈ పండుగను ఫెడరల్ హాలీడేగా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని ఆమె వివరించారు. మరో ఈ ప్రతిపాదనపై సౌత్ ఏషియా కమ్యూనిటీతో పాటు పలువురు అక్కడి చట్టసభ్యులు హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. న్యూయార్క్‌కు చెందిన మరో చట్టసభ్యురాలు జెన్నిఫర్.. దీపావళిని అధికారిక సెలవు దినంగా గుర్తించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని అంటున్నారు. అమెరికాలో 40 లక్షల మంది దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారామె. న్యూయార్క్ సెనెటర్ జెర్మీ కూనీ, న్యూయార్క్ సిటీ కౌన్సిల్మ్యాన్ శేఖర్ కృష్ణన్ సైతం ఈ బిల్లును స్వాగతిస్తున్నారు. శేఖర్ కృష్ణన్ న్యూయార్క్ ప్రభుత్వానికి ఎన్నికైన తొలి ఇండియన్ అమెరికన్. ఇక అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌లోనూ దీపావళి వేడుకలు జరుగుతుండడం చూస్తున్నదే. ఈ బిల్లు తొలుత పార్లమెంట్లో పాస్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధ్యక్షుడు సంతకంతో చట్టం అవుతుంది. ఒకవేళ దీపావళి పండుగకు గనుక సెలవు దినంగా ఆమోద ముద్ర పడితే.. అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఫెడరల్ హాలీడేస్ జాబితాలో 12వదిగా నిలుస్తుంది. అమెరికాలో పబ్లిక్ హాలీడేస్(నేషనల్ హాలీడేస్)తో పాటు ఫెడరల్ హాలీడేస్(ప్రత్యేక సెలవులు) ఉంటాయి. ఈ లిస్ట్‌లో న్యూఇయర్, మార్టిన్ లూథర్ కింగ్ జయంతోత్సవాలు, వాషింగ్టన్ బర్త్‌డే, మెమొరియల్ డే, జూన్టీన్త్ నేషనల్ ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెన్స్ డే, లేబర్ డే, కొలంబస్ డే, వెటరన్స్ డే, థాంక్స్‌గివింగ్ డే, క్రిస్మస్ డేలు ఉన్నాయి. -
మధ్యవర్తిత్వంపై త్వరలో చట్టం
సాక్షి, హైదరాబాద్: మధ్యవర్తిత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం చేయనుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. ఆ బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం భారత మధ్యవర్తిత్వ దిన తొలి వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘మధ్యవర్తిత్వం ద్వారా కేసుల్ని రాజీ చేసుకొనే విధానాన్ని అనుసరిస్తేనే ఏ దేశమైనా న్యాయ వివాదాల సత్వర పరిష్కారం ద్వారా పురోగతి సాధిస్తుంది. ఎంఎన్సీ సంస్థల నుంచి సాధారణ స్థాయి సంస్థల్లో జరిగే ఒప్పందా ల్లో విదాదం ఏర్పడితే నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్ర యించకుండా తొలి దశలో మధ్యవర్తిత్వం ద్వారా ఆ వివాదం పరిష్కరించుకొనేలా ఒప్పందం ఉండాలి. హైదరాబాద్‌లో వేలాది నిర్మాణాలు జరుగుతున్నా యి. సివిల్ వివాదాలు ఏళ్ల తరబడి కోర్టుల్లో వాయిదాల మీద వాయిదాలు పడే అవకాశం ఉంది. తద్వారా అది పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. చోళుల కాలంలోనే ‘మధ్యవర్తిత్వం’... దేశంలో చోళుల కాలం నుంచే మధ్యవర్తిత్వ ప్రయత్నాలు సాగేవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి తెలిపారు. ‘వ్యాపార లావాదేవీల్లో వివాదాలను ఆర్బిట్రేషన్ విధానంలోనే పరిష్కరించుకొనేవారు. ఆర్బిట్రేషన్, చర్చలు, మధ్యవర్తిత్వం లోక్‌అదాలత్ ఇవన్నీ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారానికి (ఏడీఆర్) విభిన్న కోణాలే. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ 2021–22 సమాచారం ప్రకారం దేశంలో 464 ఏడీఆర్ కేంద్రాలుంటే 397 పనిచేస్తున్నాయి. 570 మధ్యవర్తిత్వ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటిలో ఇప్పటివరకు 53 వేల కేసులు పరిష్కారం అయ్యాయి. మధ్యవర్తిత్వ బిల్లు – 2021ను త్వరలోనే పార్లమెంటు ఆమోదించే అవకాశం ఉంది. నిర్దిష్ట గడువులోగా మీడియేషన్ ప్రక్రియ పూర్తి (180 రోజుల్లో పూర్తి చేయాలి. లేనిపక్షంలో మరో 180 రోజులు పొడిగింపు), మధ్యవర్తుల నమోదుకు జాతీయ స్థాయిలో మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు, మధ్యవర్తిత్వ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నాక ఉభయ పార్టీలు అందుకు కట్టుబడి ఉండాలి. మధ్యవర్తిత్వ వ్యవహారాలన్నీ గోప్యంగా ఉంచడం వంటివి ప్రతిపాదిత బిల్లులో కీలకాంశాలు. కోవిడ్ లాక్డౌన్ వేళ ఏడీఆర్ అమల్లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అవి ఆన్లైన్ వివాద పరిష్కార (ఓడీఆర్) దిశగా కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడ్డాయి’అని జస్టిస్ హిమాకోహ్లి పేర్కొన్నారు. సమయం, డబ్బు ఆదా: హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటును స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం గుజరాత్లో ఆర్బిట్రేషన్–మీడియేషన్ సెంటర్ ఏ ర్పాటుకు ఆర్థిక సాయం అందించింది. ఈ సెంటర్ల ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుంది. సింగపూర్ ఆర్బిట్రేషన్–మీడియేషన్ ఒప్పందంపై భార త్ 2019 ఆగస్టు 7న సంతకం చేసింది. శ్రీకృష్ణుడు కౌరవ, పాండవుల మధ్య రాయబారానికి ప్రయచారు. అది విఫలం కావడంతోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. పెను వినాశనానికి దారితీసింది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు రచ్చబండ విధానం ద్వారా స్థానికంగా వివాదాల్ని పరిష్కరించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వ విధానానికి ఆదరణ లభిస్తోంది’అని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. 33 కేసుల పరిష్కారం... ఐఏఎంసీ ఇప్పటివరకు 33 కేసుల్ని పరిష్కరించిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు వెల్లడించారు. ఆర్బిట్రేషన్ ద్వారా పది కేసులు, మీడియేషన్ ద్వారా 23 కేసుల్లో మొత్తం 700 బిలియన్ డాలర్ల విలువైన వివాదాలు పరిష్కారమయ్యాయని వివరించారు. అనంతరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఐఏఎంసీ సీఈ వో జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, సింగపూర్ ఐఏఎంసీ చైర్మన్ జార్జి లిమ్ ప్రసంగించారు. వారికి ఐఏఎంసీ రిజిస్ట్రార్ తారిక్ స్వాగతం పలికారు. తర్వాత మధ్యవర్తిత్వంపై పలు చర్చాకార్యక్రమాలు జరిగాయి.