న్యూఢిల్లీ: ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది.. ప్రజలు భోజనాల నుంచి ఫాస్ట్‌గా రెడీ అయ్యే ఫాస్ట్‌పుడ్స్‌పై మొగ్గు చూపుతున్నారు. అందుకే హోటల్స్ అనే కాకుండా పుట్‌పాత్‌లపై కూడా ఫాస్ట్ పుడ్ సెంటర్లకి గిరాకీ పెరుగుతోంది. ఈ కేటగిరి ఆహారంలో బయట పుడ్‌కి ప్రత్యామ్నాయంగా మ్యాగీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కేవలం రెండు నిమిషాల్లోనే నోరూరించే వంటకం సిద్ధం కావడంతోపాటు దీని ధర కూడా తక్కువే. ఇంకేముంది చిన్నారుల నుంచి పెద్దల వరకు మ్యాగీని ఎగబడి తింటున్నారు.
అయితే అదే మ్యాగీ ఎయిర్‌పోర్టులో కొంటే ఆ బిల్ చూసి ఓ యూట్యూబర్‌కి కళ్లు బైర్లు కమ్మాయి. వెంటనే ఆ బిల్‌ని ఫోటో తీసి నెట్టింట పెట్టి.. ఈ షాకింగ్ విషయాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఓ యూట్యూబర్ ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా ఆకలేసింది. సరే ప్రయాణం కాబట్టి తీరిగ్గా తినే టైం లేదని మ్యాగీ ఆర్డర్ చేశాడు. అనుకున్నట్లుగా మ్యాగీ రావడం మనోడు కడుపునిండా తినేశాడు. అయితే చివరిలో వెయిటర్ తెచ్చిన బిల్ చూసి ఆ యూట్యూబర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
ఎందుకంటే ఆ మ్యాగీ మసాలా నూడుల్స్ ధర రూ. 184గా చూపించి దానికి జీఎస్టీ రూ. 9.20 జోడించడంతో రూ. 193.20 బిల్లు అయింది. చేసేదేమిలేక ఆ వ్యక్తి బిల్లు చెల్లించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ బిల్ చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘వామ్మో.. మరీ ఇంత ధరకు అముతున్నారా.. ఈ ధరకు బిర్యానీ వస్తుందని కొందరు కామెంట్ చేయగా... ఎయిర్‌పోర్టులో ధరలు అలానే ఉంటాయంటూ మరొకరు కామెంట్ చేశారు.
చదవండి: వీడియో: బొమ్మ కాదురా నాయనా.. పామును చేతిలో పట్టుకుని..
Comments
Please login to add a commentAdd a comment