Maggi
-
మనోళ్లు ‘మ్యాగీ’ లాగించేస్తున్నారు!
న్యూఢిల్లీ: మ్యాగీ.. బహుశా భారత్‌లో ఈ పేరు తెలియనివారు ఉండరేమో. నూడుల్స్‌కు మారుపేరుగా స్థానం సంపాదించిందంటే ఎంతలా మార్కెట్లోకి చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. నూడుల్స్, సూప్స్ ఉత్పత్తులను ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే మ్యాగీ బ్రాండ్ కింద విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా మ్యాగీ ఉత్పత్తుల అమ్మకాల్లో భారత్ తొలి స్థానంలో నిలవడం విశేషం. 2023–24లో ఏకంగా 600 కోట్లకుపైగా సర్వింగ్స్ (ఒకరు తినగలిగే పరిమాణాన్ని ఒక సర్వింగ్‌గా పరిగణిస్తారు) స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయని కంపెనీ వెల్లడించింది.అంతేకాదు నెస్లే కిట్‌క్యాట్ బ్రాండ్‌కు టాప్–2 మార్కెట్‌గా భారత్ స్థానం సంపాదించింది. గత ఆర్థిక సంవత్సరంలో 420 కోట్ల కిట్‌క్యాట్ ఫింగర్స్ అమ్ముడయ్యాయి. ఈ విషయాలను నెస్లే ఇండియా తన 2023–24 వార్షిక నివేదికలో వెల్లడించింది. రెండంకెల వృద్ధితో నెస్లే ఇండియా వేగంగా దూసుకెళ్తున్న మార్కెట్లలో ఒకటిగా నిలిచిందని సంస్థ తెలిపింది. భారత్‌లో 10వ ప్లాంటును నెస్లే ఒడిశాలో ఏర్పాటు చేస్తోంది. ప్లాంట్ల విస్తరణ, సామర్థ్యం పెంపునకు 2020–25 మధ్య రూ.7,500 కోట్లు వెచి్చస్తున్నట్టు నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ వెల్లడించారు. గడిచిన ఎనిమిదేళ్లలో కంపెనీ భారత్‌లో 140కిపైగా ఉత్పత్తులను పరిచయం చేసింది. -
పసివాళ్ల ఆహారంతో ఆటలా!
తొమ్మిదేళ్లనాటి మ్యాగీ నూడిల్స్ వివాదం నుంచి బయటపడి రెండు వారాలు గడిచాయో లేదో... నెస్లే కంపెనీ మెడకు కొత్తగా సెరిలాక్ తగువు చుట్టుకుంది. ఈసారి దీని మూలం మన దేశంలో కాదు, స్విట్జర్లాండ్‌లో వుంది. భిన్న రకాల ఉత్పత్తుల ద్వారా లాభాల రూపంలో ఏటా వేలాదికోట్ల రూపాయలు తరలించుకుపోతున్న బహుళజాతి సంస్థలకు ఇక్కడి ప్రజల ఆరోగ్యం విషయంలోగానీ... ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలపైగానీ పెద్దగా పట్టింపు వుండదని చాలామంది చేసే ఆరోపణ. అడపా దడపా వెల్లడవుతున్న అంశాలు వాటిని బలపరిచేవిగానే వుంటున్నాయి. భారత్‌లో పసివాళ్ల ఆకలి తీర్చడానికి తల్లులు ఉపయోగించే సెరిలాక్లో అధిక శాతం చక్కెరవుంటున్నదని స్విట్జర్లాండ్‌లోని స్వచ్ఛంద సంస్థ ‘పబ్లిక్ ఐ’ మరో సంస్థ అంతర్జాతీయ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ (ఐబీ–ఫాన్)తో కలిసి గురువారం బయటపెట్టాక దేశం నివ్వెరపోయింది. నెస్లే సంస్థ ఒక్క భారత్‌లో మాత్రమే కాదు, యూరప్ దేశాలతోపాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా దేశాల్లో కూడా సెరిలాక్ విక్రయిస్తోంది. కానీ యూరప్ దేశాల పిల్లల కోసం తయారుచేసే సెరిలాక్కూ, వేరే దేశాల్లో విక్రయించే సెరిలాక్కూ చాలా వ్యత్యాసం వుంది. యూరప్ దేశాల్లో విక్రయించే సెరిలాక్లో అసలు చక్కెర పదార్థాలే వాడని నెస్లే... ఇతరచోట్ల మాత్రం యధేచ్ఛగా వినియోగిస్తున్నట్టు ‘పబ్లిక్ ఐ’ తెలిపింది. మూడేళ్లలోపు పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కృత్రిమంగా తీపిని పెంచే సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి పదార్థాలేవీ కలపరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. పసిపిల్లల ఆహారోత్పత్తుల్లో కృత్రిమ తీపి పదార్థాలు, అదనపు చక్కెర వుండరాదన్నది 2022 సంవత్సర ప్రధాన నినాదం కూడా. కానీ దురదృష్టమేమంటే మన దేశం వాటి వినియోగాన్ని అనుమతిస్తోంది. తమ చిన్నారులకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్ తదితర పోషకాలు లభిస్తాయన్న ఆశతో తల్లులు సెరిలాక్ వంటి ఉత్పత్తులను ఆశ్రయిస్తారు. గత అయిదేళ్లుగా సెరిలాక్లో కృత్రిమ తీపి పదార్థాల వాడకాన్ని 30 శాతం తగ్గించామని నెస్లే కంపెనీ తాజా వివాదం తర్వాత సంజాయిషీ ఇస్తోంది. మంచిదే. కానీ అసలు వాడరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నప్పుడు ఈ తగ్గించటమేమిటి? ఇన్ని దశాబ్దా లుగా వాటిని ఎందుకు కొనసాగించినట్టు? ఇది తప్పించుకునే ధోరణి కాదా? నెస్లే సంస్థ సంగతలావుంచి అసలు మన దేశంలో అమ్ముడవుతున్న బహుళజాతి సంస్థల ఉత్పత్తుల్లో తగిన ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో చూసి నియంత్రించాల్సిన ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) ఏమైనట్టు? ఎక్కడో స్విట్జర్లాండ్‌లోని స్వచ్ఛంద సంస్థలు వివిధ దేశాల్లో విక్రయించే సెరిలాక్ ఉత్పత్తుల నమూనాలను సేకరించి నిగ్గుతేల్చే వరకూ ఆ సంస్థ గాఢ నిద్రపోయిందా అనే సందేహం రావటం సహజం. పసివాళ్లకు అందించే ఆహారంలో పరిమితికి మించి చక్కెర లేదా ఉప్పు ఎక్కువైతే వారి ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుందనీ, చిన్న వయసునుంచే తీపి పదార్థాలకు వారు అలవాటుపడతారనీ నిపుణులంటారు. ఈ పదార్థాలు ఊబకాయాన్ని పెంచుతాయని, పిల్లలు శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్, మధు మేహంవగైరా వ్యాధులకు లోనవు తారని హెచ్చరిస్తారు. మన పిల్లల్లో ఇటీవలకాలంలో ఊబకాయం లక్షణం పెరుగుతున్నదని అనేక సర్వేలు గొంతు చించుకుంటున్నాయి కూడా. అయినా నియంత్రణ వ్యవస్థల చెవులకు సోకలేదు. ఒక అంచనా ప్రకారం కేవలం సెరిలాక్ అమ్మకాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నెస్లే సంస్థ ఏటా వంద కోట్ల డాలర్ల (రూ. 8,400 కోట్లు)కుపైగా ఆర్జిస్తోంది. ఇందులో భారత్, బ్రెజిల్ దేశాల వాటాయే 40 శాతం వుంటుందని అంటారు. ఇంతగా లాభాలొచ్చే ఉత్పత్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసు కోవాలనీ, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలనీ నెస్లేకు తెలియదా? పోనీ అన్నిచోట్లా ఇలానే చేస్తే అజ్ఞానమో, నిర్లక్ష్యమో అనుకోవచ్చు. కానీ ధనిక దేశాల్లో ఒకరకంగా, వర్ధమాన దేశాల్లో మరో విధంగా ద్వంద్వ ప్రమాణాలు పాటించటం ఏ వ్యాపార నీతి? ఆహార ఉత్పత్తులు, శీతల పానీయాలు తదితరాల విషయంలో ఏమరుపాటు పనికిరాదు. వాటిని ఎప్పుడో ఒకసారి పరీక్షించి చూసి వదిలేయకూడదు. నిర్ణీత కాలపరిమితుల్లో నిరంతరం వాటి నమూనాలను పరీక్షిస్తూ వుండాలి. మనం తినే తిండి ఆరోగ్యదాయకమేనా, సురక్షితమేనా అని మాత్రమే కాదు... ఉత్పత్తిదారు చెప్పుకుంటున్నవిధంగా అందులో పోషకాలున్నాయో లేదో గమనించాలి. ప్రమాణాలకు అనుగుణంగా లేనివాటిని నిర్దాక్షిణ్యంగా మార్కెట్ నుంచి తొలగించాలి. ప్రపంచంలో చైనా తర్వాత మన దేశమే అతి పెద్ద మార్కెట్. అందుకే బహుళజాతి సంస్థలు సినీతారలనూ, క్రీడా దిగ్గజాలనూ తమ బ్రాండ్ అంబాసిడర్లుగా రంగంలోకి దించి ప్రకటనలతో ఊదరకొడుతూ అచిరకాలంలోనే లాభాల బాట పడుతుంటాయి. ఆ ఉత్పత్తుల్ని వాడటం ఆధునికతకూ, ఉత్తమాభి రుచికీ నిదర్శనమని బ్రాండ్ అంబాసిడర్లు చెప్తే మోసపోవటానికి మన మధ్యతరగతి ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. 2015లో మ్యాగీ నూడిల్స్‌లో అత్యంత హానికరమైన సీసం, మోనోసోడియం గ్లూటామేట్ వంటి పదార్థాలున్నాయని వెల్లడైనప్పుడు గగ్గోలైంది. తీరా తొమ్మిదేళ్లు గడిచాక జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ మ్యాగీ నూడిల్స్ విషయంలో కేంద్రం నిర్ణయం సరికాదని ఈనెల మొదటివారంలో తోసిపుచ్చింది. నెస్లేకు క్లీన్చిట్ ఇచ్చింది. భవిష్యత్తులో సెరిలాక్ విషయంలోనూ ఇదే జరుగుతుందా? ఇతరత్రా అంశాల మాటెలావున్నా హానికారక ఆహార పదార్థాలు మార్కెట్లోకి రాకుండా చూడాల్సిన కనీస బాధ్యత తమకున్నదని కేంద్ర ప్రభుత్వం గుర్తించటం అవసరం. -
వీధుల్లో కూరగాయలు అమ్మినట్లు మ్యాగీని అమ్మేస్తున్నాడు!
మ్యాగీ న్యూడిల్స్‌తో రకరకాల రెసిపీలు చేసిన వైరల్ వీడియోలు చూశాం. ఇప్పుడు ఏకంగా మ్యాగీని తోపుడు బండిమీద వేసి కూరగాయాలు అమ్మినట్లు అమ్మేస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి తోపుడు బండిపై పెద్ద ఎత్తున ఒపెన్‌గా మ్యాగీ న్యూడిల్స్‌ని వేసుకుని లూజ్కి అమ్మేస్తున్నాడు. పైగా ఆ క్వాండిటీకి సరిపడా మషాల ప్యాకెట్లు కూడా ఇస్తున్నాడు. ఏదో కూరగాయాలు, పండ్లు మాదిరి తూచి అమ్మేస్తుండటం అందర్నీ షాక్‌కి గురి చేసింది. అయితే చాలామంది అతడి వద్దకొచ్చి కావల్సినంత కొనుక్కుని పట్టుకుపోతుండటం విశేషం. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఆ వ్యక్తిపై మండిపడుతున్నారు. మ్యాగీ ప్యాకెట్లలో ఉంటే ఎలాంటీ అనారోగ్య సమస్యలు రావు, కానీ ఇలా ఘోరంగా బండిపై ఓపెన్‌గా అమ్మితే ప్రజల ఆరోగ్యం ఏం కావాలంటూ ఫైర్ అవ్వుతూ పోస్టులు పెట్టారు. ఈ వీడియోకి మిలియన్సల్లో వ్యూస్, లక్షల్లో లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by CHATORE_BROOTHERS (@chatore_broothers) (చదవండి: వింత గ్రామం: నిద్ర ముంచుకొచ్చిందా ఇక అంతే!..ఏకంగా..) -
మ్యాగీ కటోరీ చాట్ ట్రై చేయండిలా!
రోజుకో రకం వెరైటీ రెసీపీలనే మనం చూస్తూనే ఉన్నాం. ఇది అత్యంత విభిన్నమైన రెసిపీ. మ్యాగీ న్యూడిల్స్‌తో ఇప్పటి వరకు రకరకాల వంటకాలు చూసుంటారు. ఈ రెసీపి చూస్తే చాట్ ఇలా కూడా చెయొచ్చా!అని అంటారు. అంత ఆకర్షణీయంగా చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట పెద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇంతకీ ఆ రెసిపీ ఎలా చేశారంటే?.. న్యూడీల్స్ని ఉడబెట్టి ఓ గిన్నెల తీసుకున్నారు. దానీ టీ వడకట్టే చిక్కంలో కొద్దిగా న్యూడిల్స్ తీసుకుని దాన్ని ఆ చిక్కానికి సరిపడగా సర్ధి నేరుగా మరిగే నూనెల వేయించారు. అది ఒక్కసారిగా బౌల్ మాదిరిగా రాగానే ఈ చిక్కం తీసి కాస్త డీప్ ఫ్రై చేశారు. ఆ తర్వాత ఆ న్యూడిల్స్ బౌల్లో కొద్దిగా ఉల్లిపాయలు, టమోట ముక్కలు కాస్త, గ్రీన్ చట్నీ కలిపి గార్నీష్ చేశారు. చివరిగా పెరుగ వేసి గార్నిషీ చేశారు. అంతే మ్యాగీ కటోరీ చాట్ రెడీ. అందుకు సంబంధించిన వీడియోని తన్విగోర్ నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి 62 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Tanvi Gor (@golus_kitchen_by_tanvigor) (చదవండి: కాఫీ రుచి బెటర్‌గా ఉండేందుకు ట్రిక్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు!) -
వామ్మో.. ఈ మ్యాగీ కంటే బిర్యానీ బెటర్.. ధర చూసి షాకైన యూట్యూబర్!
న్యూఢిల్లీ: ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది.. ప్రజలు భోజనాల నుంచి ఫాస్ట్‌గా రెడీ అయ్యే ఫాస్ట్పుడ్స్పై మొగ్గు చూపుతున్నారు. అందుకే హోటల్స్ అనే కాకుండా పుట్‌పాత్‌లపై కూడా ఫాస్ట్ పుడ్ సెంటర్లకి గిరాకీ పెరుగుతోంది. ఈ కేటగిరి ఆహారంలో బయట పుడ్‌కి ప్రత్యామ్నాయంగా మ్యాగీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కేవలం రెండు నిమిషాల్లోనే నోరూరించే వంటకం సిద్ధం కావడంతోపాటు దీని ధర కూడా తక్కువే. ఇంకేముంది చిన్నారుల నుంచి పెద్దల వరకు మ్యాగీని ఎగబడి తింటున్నారు. అయితే అదే మ్యాగీ ఎయిర్‌పోర్టులో కొంటే ఆ బిల్ చూసి ఓ యూట్యూబర్‌కి కళ్లు బైర్లు కమ్మాయి. వెంటనే ఆ బిల్‌ని ఫోటో తీసి నెట్టింట పెట్టి.. ఈ షాకింగ్ విషయాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఓ యూట్యూబర్ ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా ఆకలేసింది. సరే ప్రయాణం కాబట్టి తీరిగ్గా తినే టైం లేదని మ్యాగీ ఆర్డర్ చేశాడు. అనుకున్నట్లుగా మ్యాగీ రావడం మనోడు కడుపునిండా తినేశాడు. అయితే చివరిలో వెయిటర్ తెచ్చిన బిల్ చూసి ఆ యూట్యూబర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ మ్యాగీ మసాలా నూడుల్స్ ధర రూ. 184గా చూపించి దానికి జీఎస్టీ రూ. 9.20 జోడించడంతో రూ. 193.20 బిల్లు అయింది. చేసేదేమిలేక ఆ వ్యక్తి బిల్లు చెల్లించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ బిల్ చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘వామ్మో.. మరీ ఇంత ధరకు అముతున్నారా.. ఈ ధరకు బిర్యానీ వస్తుందని కొందరు కామెంట్ చేయగా... ఎయిర్‌పోర్టులో ధరలు అలానే ఉంటాయంటూ మరొకరు కామెంట్ చేశారు. చదవండి: వీడియో: బొమ్మ కాదురా నాయనా.. పామును చేతిలో పట్టుకుని.. -
Recipe: మ్యాగీ వడ.. ఇలా తయారు చేసుకోండి!
మ్యాగీ అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. రెగ్యులర్‌గా న్యూడుల్స్ కాకుండా మ్యాగీతో వడ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. కావాల్సినవి ►మ్యాగీ – 3 (రెండున్నర స్లైస్‌లను ముందుగానే ఉడికించి, నీళ్లు వడకట్టి పక్కన పెట్టుకోవాలి ►మిగిలింది చిన్న చిన్న ముక్కల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి) ►క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము – పావు కప్పు చొప్పున ►పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలు – కొన్ని చొప్పున ►కారం, పసుపు, గరం మసాలా – 1 టీ స్పూచొప్పున ►పెరుగు – ఒక టేబుల్ స్పూన్ ►మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు ►మైదాపిండి – 4 లేదా 5 టేబుల్ స్పూన్లు (నీళ్లు పోసి.. తోపులా చేసుకోవాలి) ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ ►ముందుగా ఒక బౌల్ తీసుకుకోవాలి. ►అందులో ఉడికిన మ్యాగీ (చల్లారిన తర్వాత), క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, మొక్కజొన్న పిండి, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ►ముక్కలు, కారం, పసుపు, గరం మసాలా, పెరుగు అన్నీ జోడించి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ►అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసుకోవాలి. ►మైదా తోపులో ముంచి, మ్యాగీ ముక్కల్లో దొర్లించి నూనెలో దోరగా వేయించుకోవాలి. చదవండి: Chatpattey Coconut Recipe: క్రంచీ.. కరకరలు.. చట్‌పటే కోకోనట్, బటాడా వడ తయారీ ఇలా! Kobbari Vadalu Recipe: రుచికరమైన కొబ్బరి వడల తయారీ ఇలా! -
‘అమ్మ కొడుతోంది.. ధరలు మండుతున్నాయ్ మోదీ జీ’.. ఆరేళ్ల పాప లేఖ
PM Narendra Modi: జీఎస్టీ (GST) బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు ఇది సామాన్యుల బిల్లని వారికి ఎంతో ఊరట కలిగిస్తుందన్నారు. దీన్ని అమలు తర్వాత విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని మాటలు చెప్పారు నేతలు. అయితే జీఎస్టీ మాత్రమే కాదు ఏది వచ్చినా ప్రజలపై బాదుడు ప్రక్రియ మాత్రం కొనసాగుతుందని తాజాగా మరోసారి నిరూపించింది కేంద్రం. ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో కొత్తగా కొన్ని నిత్యవసరాల వస్తువులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. నిన్నటి వరకు ఎలా ఉన్నా, ప్రస్తుత పన్నుల ప్రభావం, ధరల భారం దెబ్బకు పసి పిల్లలు కూడా భయపడుతున్నారు. అందుకు నిదర్శనమే ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఓ చిన్నారి లేఖ. ధరలు మండిపోతున్నాయని ఒకటో తరగతి చదివే ఓ బాలిక ఏకంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. పాపం ఎంత కష్టం వచ్చిందో.. ఆ చిట్టి తల్లికి! ఏముంది ఆ లేఖలో.. పేపర్, పెన్సిల్ తీసుకొని నేరుగా ప్రధాని మోదీని ఉద్దేశించి.. మీరు ఇంతలా ధరలు పెంచేస్తే ఎలా? అని ప్రశ్నించింది. "నా పేరు కృతి దూబే. నేను 1వ తరగతి చదువుతున్నాను. మోదీజీ, మీరు విపరీతంగా ధరల పెంచుతున్నారు. ఈ క్రమంలోనే నా పెన్సిల్, రబ్బరు (ఎరేజర్) కూడా ఖరీదైనవిగా మారిపోయాయి. అంతేనా నా మ్యాగీ ధర కూడా పెరిగింది. స్కూల్లో ఎవరో నా పెన్సిల్ని దొంగిలించారు. ఇప్పుడు మా అమ్మ నన్ను కొట్టింది. పెన్సిల్ అడుగుతున్నారు. నేను ఏమి చేయాలి? మీరే చెప్పండంటూ నేరుగా ప్రధానికే లేఖ పేరుతో తన బాధని అక్షరాల రూపంలో రాసి పంపింది. కాగా ఈ చిన్నారి యూపీలోని కనౌజీ జిల్లాలో చదువుకుంటోంది. ప్రస్తుతం ఈ లేఖ వైరల్‌గా మారి నెట్టింట హల్ చేస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలనే మాత్రమే కాదు పసి పిల్లలను కూడా కదిలిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: Narendra Modi: ‘అమ్మ కొడుతోంది.. ధరలు మండుతున్నాయ్ మోదీ జీ’.. ఈ పాపకి ఎంత కష్టం వచ్చిందో! -
‘నాకీ భార్య వద్దు’ .. మ్యాగీ వండిపెట్టిందని విడాకులిచ్చాడు
బెంగళూరు: మ్యాగీ చేసి పెట్టినందుకు భార్యకు విడాకులిచ్చాడో భర్త. మ్యాగీ చేస్తే విడాకులిచ్చేస్తారా? అనుమానం రావచ్చు. అతనేమో భోజన ప్రియుడు. ఆమెకేమో వంట రాదు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్... మూడు పూటలూ మ్యాగీ చేసి పెట్టింది. ఇంకేముంది.. ‘నాకీ భార్య వద్దు’ అంటూ విడాకుల కోసం కోర్టుకెళ్లాడు. పరస్పర అంగీకారం కింద విడాకులూ వచ్చాయి. బళ్లారిలో జరిగిన ఈ ఘటనను మైసూరుకు చెందిన జడ్జి ఎమ్ఎల్ రఘునాథ్ ఇటీ వల వెల్లడించారు. ఈ తరం దంపతులు చిన్న విషయాలకే విడాకుల దాకా వెళ్తున్నారంటూ ఆయన బళ్లారిలో ఉండగా పరిష్కరించిన ఈ కేసును ఇటీవల ఓ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ఒక్క వంట రాదనే కాదు... ప్లేటుకు ఒక పక్క పెట్టాల్సిన ఉప్పుడబ్బాను మరోపక్క పెట్టారని ఒకరు, వెడ్డింగ్ సూట్ కలర్ బాగలేదని మరొకరు విడాకులు తీసుకున్నారని గుర్తు చేశారు. -
ఈ ప్రపంచానికి ఏమైంది? మొన్న మ్యాంగో మ్యాగీ.. ఈసారి పేస్ట్రీ మ్యాగీ!
నిన్నటికి నిన్న ‘మ్యాంగో మ్యాగీ’అనే వెరైటీ వంటకమొకటి ఇంటర్నెట్లో వైరలైందో లేదో ఇంతలోనే ఇంకో రకమైన మ్యాగీ వంటకం పుట్టుకొచ్చింది. చాక్లెట్ పేస్ట్రీ (కేక్ లాంటిది)తో కలిపి చేసిన ఈ వంటకం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఇంతకీ వీడియోలో ఏముందంటే.. ఫ్రై చేసే పెనంపై కొంచెం నూనె పోసి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేశారు. అలా ఫ్రై చేస్తుండగానే ఓ చాక్లెట్ పేస్ట్రీని అందులో వేసి నీళ్లు పోశారు. ఇదంతా బాగా ఉడికిన తర్వాత మ్యాగీని కలిపి పైన మసాలా పోశారు. ఇంకేముంది.. కాసేపయ్యాక పేస్ట్రీ మ్యాగీ రెడీ. ఈ వంటకం వీడియో చూసిన నెటిజన్లు ‘ఏమైంది ఈ ప్రపంచానికి?’అని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: మ్యాంగో మ్యాగీ.. ‘దేవుడా! నన్ను వేరే గ్రహానికి పంపెయ్యవా’ Today’s special pastry maggi ☺️🙏🏻pic.twitter.com/NGHCuvUXKF — sha (@aokeasha) May 16, 2022 -
మ్యాంగో మ్యాగీ.. ‘దేవుడా! నన్ను వేరే గ్రహానికి పంపెయ్యవా’
Mango Maggi Video: వంటకాలపై ఎప్పటికప్పుడు ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. కొత్త కొత్త వెరైటీలు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని వెరైటీలను చూస్తే మాత్రం ఇదెక్కడి విచిత్రమని అనిపిస్తుంది. ‘ఇలా ఎవరైనా చేస్తారా?’అని అడగాలనిపిస్తుంది. అలాంటి వంటకానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరలైంది. అదే ‘మ్యాంగో మ్యాగీ’. మీరు విన్నది నిజమే. మ్యాగీని ముప్పుతిప్పలు పెట్టి చేసిన ఈ వెరైటీ వంటకం గురించి మీరూ తెలుసుకోవాల్సిందే. వీడియోలో ముందుగా.. ఫ్రై చేసే పెనంపై ఓ మహిళ మ్యాగీ నూడుల్స్‌ను వేసి, నీళ్లు పోసి మ్యాజిక్ మసాలా వేసింది. ఆ తర్వాత మ్యాంగో స్లైస్ బాటిల్ లోంచి జ్యూస్‌ను ఆ వంట కంలో పోసింది. వంటకమయ్యాక మామిడి ముక్కలను దానిపై చల్లి అందించింది. ఈ మ్యాం గో మ్యాగీ తయారీ వీడియోను ఒకరు పోస్ట్ చేయగా నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ‘ఆ లొకేషన్ ఎక్కడో చెప్పరా. ఆ వంటకం చేసిన వాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఎవరైనా వెళ్తారు’అని ఒకరు.. ‘మీరు నరకానికి వెళ్తారు’అని మరొకరు, ‘దేవుడా.. నన్ను వేరే గ్రహానికి పంపెయ్యవా’అని ఇంకొకరు కామెంట్లు పెట్టారు. Mango Maggi kha lo doston.🙌🏼 pic.twitter.com/4fY2HWJumV — Professor D (@RetardedHurt) May 13, 2022 -
మ్యాగీ లవర్స్‌కు భారీ షాక్!
రెండు నిమిషాల్లోనే రెడీ. అంటూ మ్యాగీ నూడిల్స్‌తో మధ్యతరగతి జీవితాల్లోకి చొచ్చుకొచ్చింది నెస్లే ఇండియా లిమిటెడ్. ఇప్పుడీ ఈ మ్యాగీ పెరుగుతున్న ధరలతో మసాలా దట్టించకముందే నషాళాలనికి అంటుతుంది. ఈ ఏడాది మార్చిలో నెస్లే సంస్థ మ్యాగీ నూడిల్స్ ధరల్ని పెంచింది. ఇప్పుడు మరోసారి ధరల్ని పెంచుతున్నట్లు తెలిపింది. మ్యాగీ ఈ పేరు తెలియని పిల్లలుండరు. రెండే రెండు నిమిషాల్లో మ్యాగీ నూడిల్స్‌ను వండి వార్చితే. లొట్టలేసుకొని లాగించేస్తుంటారు పిల్లలు. బ్రేక్ ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు ఎప్పుడైనా సరే మ్యాగీ ఉంటే చాలు. పిల్లలే కాదు..పెద్దలు సైతం మసాలా నూడిల్స్‌ను ఇష్టంగా తింటుంటారు. అలాంటి నూడిల్స్..పెరుగుతున్న ధరల కారణంగా తినేందుకు మరింత భారంగా మారనున్నాయి. నెస్లే సంస్థ మార్చిలో మ్యాగీ ధరల్ని 9 నుంచి 16 శాతం పెంచింది. ఇప్పుడు ఆ ధరల్ని మరింత పెంచనున్నట్లు నెస్లే ఇండియా వెల్లడించింది. మ్యాగీతో పాటు నెస్లే తయారు చేస్తున్న కిట్ కాట్, నెస్కెఫే కాఫీ ధరలు పెరగనున్నట్లు నెస్లే సీఈఓ ష్నీడర్ చెప్పారంటూ ఓ అంతర్జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. మ్యాగీ ధరలు పెరగడానికి కారణం ఇదే ముడి సరుకు,ఫ్యూయల్, ట్రాన్స్ పోర్ట్, వర్క్‌ర్లకు ఇచ్చే వేతనాలు భారీగా పెరిగడం వల్లే వరుసగా మ్యాగీ ధరలు పెరగడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. నెస్లే సీఈఓ ష్నీడర్ తెలిపిన వివరాల ప్రకారం.. నెస్లే..ఉత్పత్తిని పెంచడం,అంతర్గతంగా అమ్మకాల వృద్ధిని' చూసింది. పెరుగుతున్న ఇతర (పైన పేర్కొన్నట్లు) ఖర్చుల కారణంగా ఉత్పత్తుల ధరల్ని పెంచడం అనివార్యమైంది. ఇక ఈ సంవత్సరం అమ్మకాలు,లాభాల లక్ష్యాలను చేరుకోగలదని నెస్లే స్పష్టం చేసింది. చదవండి👉 పిడుగులాంటి వార్త..సామాన్యులకు షాక్.. వీటి ధరలు భారీగా పెరిగాయ్! -
సామాన్యులకు మరో షాక్..వీటి ధరలు భారీగా పెరిగాయ్!
పెట్రోలు, డీజిల్, గ్యాస్, వంట నూనెల ధరల పెంపుతో సతమతం అవుతున్న సామాన్యుడి నెత్తిన పడేందుకు మరో ధరల పిడుగు పడింది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) రంగంలో దిగ్గజ కంపెనీలైన హిందుస్తాన్ యూనీలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), నెస్లే ధరల పెంపును ప్రకటించాయి నేషనల్ మీడియా కథనం ప్రకారం..నెస్లే ఇండియా మ్యాగీ ధరల్ని 9 నుంచి 16 శాతం పెంచగా.. మిల్క్,కాఫీ ఫౌడర్ ధరలు పెరిగాయి. 70 గ్రాముల మ్యాగీ మసాలా నూడిల్స్ రూ.12 నుంచి రూ.14 పెరిగింది. ♦140 గ్రాముల మ్యాగీ మసాల నూడిల్స్ 12.5శాతంతో ధర రూ.3 పెరిగింది. ♦560 గ్రాముల ప్యాకెట్ ధర 9.4 శాతంతో రూ.96 నుంచి రూ.105కి పెరిగింది. ♦నెస్లే ఏప్లస్ ఒకలీటర్ కార్టన్ ధర 4శాతంతో రూ.75 నుంచి రూ.78కి పెరిగింది. ♦నెస్కెఫె క్లాసిక్ కాఫీ ఫౌడర్ ధర 3 నుంచి 7శాతానికి పెరిగింది. ♦నెస్కెఫె క్లాసిక్ 25 గ్రాముల ప్యాకెట్ 2.5శాతంతో రూ.78 నుంచి రూ.80కి పెరిగింది. ♦నెస్ కెఫె క్లాసిక్ 50 గ్రాముల ప్యాకెట్ 3.4శాతంతో రూ.145 నుంచి రూ.150కి పెరిగింది. ♦హెచ్‌యూఎల్ సైతం టీ, కాఫీ ఫౌడర్ ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది.అదే సమయంలో బ్రూ కాఫీ ధర 3 నుంచి 7శాతం, తాజ్ మహల్ టీ 3.7 శాతం నుంచి 5.8శాతం పెరిగాయి. ♦ బ్రూక్ బ్రాండ్ 3 రోజెస్ వేరియంట్ ధర 1.5 నుంచి 14శాతానికి పెరిగింది. ఇక ఈ పెరిగిన ధర ఫ్రిబవరి నుంచి తయారువుతున్న ఉత్పత్తులపై పడనున్నాయి. చదవండి: వాహన వినియోగదారులకు కేంద్రం భారీ షాక్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్! -
RIP మ్యాగీ అంటున్న నెటిజన్లు.. కారణం ఇదే..
ఫుడ్.. ఈ పేరు వింటనే చాలా నోరూరుతోంది. స్నాక్స్, స్వీట్స్, హాట్, డిషెస్ ఇలా వంటకం ఏదైనా.. ఫుడ్‌ను ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కో వంటకం నచ్చుతుంది. మరికొందరికి కొత్త వంటకాలు టేస్ట్ చేయడం అంటే పిచ్చి. ఏ హోటల్, రెస్టారెంట్‌కు వెళ్లినా, అక్కడ ఉన్న కొత్త వంటకాన్ని రుచి చూడాలనుకుంటారు. ఇలాంటి వారి కోసం రెండు మూడు పదార్థాలను కలిపి ఢిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్‌ను తయారు చేస్తుంటారు. వీటిని యూట్యూబ్ ద్వారా ఆహార ప్రియులకు షేర్ చేస్తుంటారు. చదవండి: Anand Mahindra: నీ పాటతో ఆ గ్యారేజికి ప్రాణం పోశావ్! ఇలా రకరకాల స్ట్రీట్ ఫుడ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చక్కగా ఉంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు. అయితే అన్నీసార్లు ఇవి సక్సెస్ కాలేవు. కొన్నిసార్లు బెడిసికొడుతుంటాయి. తాజాగా అలా తయారైన తందూరీ మ్యాగీపై నెటిజన్ల నుంచి నెగెటివ్ రియాక్షన్ వస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను అనికైత్ లూత్రా అనే యూట్యూబ్ ఛానెల్లో డిసెంబర్ 20న పోస్ట్ చేశారు. ఇందులో ముందుగా మట్టి పాత్రలను కొలిమిలో కాల్చి అందులో నుంచి ఓ పాత్రను పైకి తీసి గిన్నెలో పెట్టారు. అది మండుతూ ఎర్రగా ఉంది. అప్పుడు దానికి వెన్నను అంటించారు. వెంటనే అది కొవ్వొత్తిలా కాలి మంట వచ్చింది. చదవండి: వలస రాజహంసలు ఒకేచోట సందడి చేశాయి: క్యూట్ వైరల్ వీడియో!! అప్పుడు కాస్తా ఉడికించిన మ్యాగీని అందులో పోశారు. వెంటనే అది కుతకుతా ఉడుకుతూ.. డాన్స్ చేసినట్లు కనిపిస్తుంది. అంతే తందూరీ మ్యాగీ రెడీ. దీనిని ఇప్పటివరకు 32 లక్షల మందికి పైగా చూశారు. దీనిని చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘రెస్ట్ ఇన్ పీస్ . మ్యాగీ ఆత్మ శాంతించాలి. డిసెంబర్ 31 లాగా మ్యాగీ డ్యాన్స్ చేస్తోంది. చెడగొట్టారు. ఎంత అందంగా కనిపిస్తోంది అనే దానిపై ఫోకస్ పెడుతున్నారే తప్ప రుచిపై పెట్టట్లేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ మీరూ ఈ వంటకాన్ని చూసేయండి.. చదవండి: కూతురుతో కలిసి అదిరిపోయే స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా -
స్పైసీ మ్యాగీ మిర్చి గురూ
న్యూఢిల్లీ: కొంత కాలం నుంచి చిత్ర విచిత్రమైన వంటకాలతో ప్రముఖ పాకశాస్త్ర నిపుణులు వాళ్ల కళా నైపుణ్యాలను ప్రదర్శించడమే కాక చాలామంది భోజన ప్రియుల మనస్సులను గెలుచుకున్నారు. అలాగే ఇటీవల కాలంలో మ్యాగీ మిల్క్ షేక్, చాకోలెట్ మ్యాగీ వంటి రకరకాల వంటకాలు చాలానే వచ్చాయి. (చదవండి: "ఆధార్ తప్పనిసరి కాదు") ప్రస్తుతం ఆ జాబితాలోకి స్పైసీ మ్యాగీ మిర్చి బజ్జీ అనే ఒక సరికొత్త వంటకం చేరనుంది. దీనికి సంబంధించిన ఇమేజ్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా మిర్చి బజ్జీ అనగానే దానిలోకి నంజుకునే ఉల్లిపాయలు, బఠాణి కూర, కొత్తిమీరతో చక్కగా గార్నిష్ చేసి ఉంటుంది. ఇక ఈ బజ్జీని చూసే వాళ్లకి ఎప్పుడేప్పుడు తినేద్దాం అని తహతహ లాడుతుంటుంది. అలాంటిది మ్యాగీ ప్రియుల కోసం వచ్చిన ఈ సరికొత్త స్పైసీ వంటకం నెటిజన్లను నోరూరిస్తూ ఫిదా చేస్తోంది. ఇది కూడా మిర్చి బజ్జీలానే కాకపోతే సెనగపిండితో కాకుండా కేవలం వేయించిన మిర్చిలోనే న్యూడిల్స్‌ని స్టవ్ చేసి సర్వ్ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు వాట్ ఏ స్పైసీ మ్యాగీ మిర్చి అంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. (చదవండి: పెట్రోల్ సంక్షోభానికి చక్కటి పరిష్కారం!) -
వైరల్: మ్యాగీ మిల్క్‌షేక్.. ‘ఈ గతి పట్టించిన వాడిని చంపేస్తా’
మ్యాగీ అనడం కంటే టూ మినిట్స్ మ్యాగీ అంటే సులువుగా అందరూ గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే తక్కువ సమయంలో ఏదైనా పుడ్ చేయగలమంటే అది మ్యాగీ న్యూడుల్స్ మాత్రమే అని చెప్పాలి. ఇది సింపుల్ అండ్ ఫాస్ట్ మాత్రమే కాదు టేస్టీ కూడా. అందుకే దీన్ని బోలెడు మంది ఇష్టపడుతుంటారు. ఇక ప్రతి ఒక్కరికీ ఈ పాపులర్ నూడుల్స్ తయారు చేయడంలో ఎవరి సొంత వెర్షన్ వాళ్లకి ఉంటుంది. కొంతమంది సింపుల్ న్యూడుల్స్గా చేసుకోగా, మరికొందరు సూప్‌గా, ఇంకొందరు ఎగ్ న్యూడుల్స్గా.. ఇలా చాలా రకాలే ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి మ్యాగీ మీద ప్రయోగాలు చేసి ఓ వింత వంటకం చేసి అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటుగా కోపం కూడా తెప్పించాడని చెప్పాలి. ఇంతకీ అతను ఏం చేశాడంటే... రొటీన్ మ్యాగీ తిని బోర్ కొట్టిందేమో పాపం. కాస్త కాదు కాదు.. చాలా డిఫరంట్‌గా ఆలోచించి మ్యాగీ న్యూడుల్స్‌ను మిల్క్‌షేక్ కాంబినేషన్ కలిపి తయారు చేశాడు. ప్రస్తుతం ఈ విచిత్ర పుడ్ కాంబినేషన్ ఫోటో నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. మ్యాగీ ప్రేమికులంతా ఈ ఫోటోపై వ్యంగ్యంగా స్పందిస్తూ కామెంట్ పెడుతున్నారు. ‘ఓ వెధవ నాకు ఈ ఫోటో షేర్ చేశాడు.. మ్యాగీ మిల్క్ షేక్.. ఇది ఎవడు చేశాడో గానీ వాడు దొరకాలి అని’.. ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మరోకరు.. ‘ఎక్కడ నుంచి వస్తార్రా బాబు‘ అంటూ కామెంట్ చేశారు. మరో నెటిజన్ అయితే ఏకంగా కొట్టినంత పని చేశాడు. ‘నోరూరించే మ్యాగీకి ఈ గతి పట్టించినవాడిని చంపేస్తా’ అంటూ ఫైర్ అయ్యాడు. Some idiot share this with me... Maggie Milk-shake.... Jinda pakadna hai in banane waalo ko... 🤢🤢🤢 pic.twitter.com/m0BV8m7zyI — Mayur Sejpal | मयूर सेजपाल 🇮🇳 (@mayursejpal) September 11, 2021 చదవండి: కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం.. -
ఇలాంటి లడ్డు నెవర్ బిఫోర్ .. ఎవర్ ఆఫ్టర్!
న్యూఢిల్లీ: మ్యాగీ ఈ పేరు తలుచుకోగానే ప్రతి ఒక్కరి నోట్లో నీరు ఊరుతాయి. దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా ఇష్టంగా తింటారు. దీని తయారీకి పట్టే సమయం కూడా చాలా తక్కువ. ఇది ఇన్స్టాంట్ మ్యాగీగా మనకు మార్కెట్లో లభిస్తుంది. దీని ప్యాకింగ్ చేసేటేప్పుడే అన్ని రకాల పదార్ధాలతో కలిసి ఉంటుంది. దీన్ని వేడినీళ్లలో వేయగానే.. మంచి రుచికరమైన మ్యాగీ క్షణాల్లో మన ముందుంటుంది. అయితే, కొంతమంది మాత్రం ట్రెండ్‌ను ఫాలో కాకుండా సెట్ చేశారు. మ్యాగీతో లడ్డు చేస్తే ఎలా ఉంటుందో అనుకున్నారో.. ఏమో గానీ.. వెంటనే వారి ఆలోచనను అమలు చేసేశారు. మ్యాగీతో లడ్డు ప్రయోగం చేశారు. ఇంతటితో ఆగకుండా దానిపై అందంగా కాజునికూడా ఉంచారు. ఇప్పుడు, దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ వావ్.. దీన్ని చూస్తే నోటిలో నీరు ఊరుతోంది.. ఎలా తయారు చేశారంటూ’.. సరదాగా కామెంట్లు పెడుతున్నారు. -
మ్యాగీ విత్ పెరుగు ట్రై చేశారా?!
మ్యాగీ.. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికి ఫేవరెట్ ఫుడ్ ఐటం. చాలా వరకు ఊరికే నీటిలో వేసి ఉడికించుకుని తింటారు. కొందరు మాత్రం పోపు వేసి కూరగాయలతో కలిపి వండితే.. మరి కొందరు ఎగ్, చికెన్‌తో ట్రై చేస్తారు. కానీ మ్యాగీని పెరుగతో ఎప్పుడైనా తిన్నారా. పేరు వినగానే ముఖం అదోలా మారిపోయింది కదా. చాలా మంది అస్సలు వినడానికి, ట్రై చేయడానికి ఇష్టపడని ఈ కాంబినేషన్‌ని ఓ యువతి నిజం చేసి చూసింది. మ్యాగీలో పెరుగు వేసుకుని తిన్నది. ‘మ్యాగీ అండ్ కర్డ్ ఇజ్ ఫుడ్ ఫర్ ద సౌల్’ పేరుతో ట్విట్టర్లో మ్యాగీలో పెరుగు కలిపిన ఫోటోని షేర్ చేసింది. ఇది చూసిన నెటిజనుల్లో ఎక్కువ మంది ‘ఏం టెస్ట్ తల్లి .. ఇంత చండాలంగా ఉంది’.. ‘మ్యాగీ మీద విరక్తి పుట్టించావ్గా’.. ‘అసాధ్యాన్ని సాధ్యం చేశావ్‌గా’ అని కామెంట్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ‘అద్భుతం’.. ‘టేస్ట్ కోసం దానిలో మయోన్నైస్ కలపండి’ అంటూ సూచనలు చేస్తున్నారు. (చదవండి: నిన్ను చూస్తుంటే కడుపు మండుతోంది) Maggi and curd is food for the soul ❤️ pic.twitter.com/RmNRVRvnfw — Felon Mask (@acnymph) November 16, 2020 గతేడాది ఓ యువతి పాలు, గులాబీ రెక్కలతో స్వీట్ మ్యాగీ తయారు చేసింది. "చాక్లెట్ మ్యాగీ", "మ్యాగీ పానీపూరి" అనే విభిన్న వంటకాలు భోజన ప్రియులకు వికారం కలిగించిన విషయం తెలిసిందే. ఇవేకాక రసగుల్లా బిర్యానీ, చాక్లెట్ చికెన్ వంటి వింత వంటకాలు వైరలయిన సంగతి తెలిసిందే. -
నిన్ను చూస్తుంటే కడుపు మండుతోంది
నెటిజన్లు తమకు ఆనందం వచ్చినా, బాధ కలిగినా వెంటనే తోటి నెటిజన్లతో పంచుకోవటం ప్రస్తుతం పరిపాటిగా మారింది. వింతగా అనిపించిన కొన్ని విషయాలు ఎంత చిన్నవైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారటం కూడా మామూలై పోయింది. తాజాగా ఓ మ్యాగీ న్యూడిల్స్ ప్రేమికుడి పోస్టు నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాను కొనుక్కున్న మ్యాగీ న్యూడిల్స్ ప్యాకెట్లో రెండు మసాలా ప్యాకెట్లు రావటంతో శశ్వంత్ ద్వివేదీ అనే వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘‘ నేను కొన్న మ్యాగీ ప్యాకెట్లో రెండు మసాలా ప్యాకెట్లు వచ్చాయి. ఒట్టు.. నేను అబద్ధం ఆడటం లేదు’’ అని పేర్కొన్నాడు. ('ఇది తయారు చేసినవాడిని చంపేస్తా’) ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశాడు. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు అతడి అదృష్టంపై తమ అసూయను వెళ్లగక్కారు. ‘‘ నిన్ను చూస్తుంటే నా కడుపు మండుతోంది.. దాన్ని మ్యాజిక్ మసాలా అనడానికి ఇదే కారణం.. నీ అదృష్టాన్ని ఉద్ధేశించి ఏమైనా ప్రసంగిస్తావా?.. అదృష్టం అంటే నీదిరా బాబు!’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. -
‘కాపీ కొట్టినట్లు ఆధారం ఏమిటి?’
మెప్పుల కోసం గొప్పలు చెప్పుకోవడం ఎవరి పేటెంట్ హక్కూ కాదని మద్రాస్ హై కోర్టు తీర్పు ఇచ్చింది. రెండు పెద్ద కంపెనీల మసాలా గొడవ ఇది. 2013 నుంచీ సాగుతోంది. ఐ.టి.సి. కంపెనీ ‘ఇప్పీ’ నూడుల్స్ ప్యాకెట్ మీద ‘మేజిక్ మసాలా’ అని ఉంటుంది. నెస్లే కంపెనీ మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్ మీద ‘మేజికల్ మసాలా’ అని ఉంటుంది. ఈ కారణంగానే నెస్లే మీద ఐ.టి.సి. కేసు వేసింది. తమ ‘మేజిక్’ నే ‘మేజికల్’గా నెస్లే కాపీ కొట్టిందని ఐ.టి.సి ఆరోపణ. ‘కాపీ కొట్టినట్లు ఆధారం ఏమిటి?’ అనే వాదనకు ‘మేము మేజిక్ అని పెట్టిన మూడేళ్లకు వాళ్లు మేజికల్ అని పెట్టుకున్నారు’ అని తన వాదన వినిపించింది. కోర్టుకు ఆ వాదన సంతృప్తికరంగా అనిపించలేదు. ‘మేజిక్ మసాలా, మేజికల్ మసాలా అని చెప్పుకొనే గొప్పలపై ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదని అంటూ కేసును కొట్టేసింది. బిజినెస్ అన్నాక కాపీలు తప్పవు. కోర్టు వెళ్లడం కన్నా కొత్తదారిలోకి వెళ్లడం కొన్నిసార్లు లాభదాయకంగా ఉంటుంది. కానీ.. పెద్ద కంపెనీలు కదా.. తాడో పేడో అనుకుంటాయి.(కాలక్షేపం కోసం వీటిని తినేస్తున్నారు..) చదవండి: 'ఇది తయారు చేసినవాడిని చంపేస్తా’ -
'ఇది తయారు చేసినవాడిని చంపేస్తా’
చాలు, ఇక చాలు, ఈ ఘోరాలు తాము చూడలేమంటూ ఆహారప్రియులు సోషల్‌మీడియాలో వాపోతున్నారు. ఈ సారి ఎలాంటి భయంకర వంటకం పుట్టుకొచ్చిందోనని బెదిరిపోకండి. కానీ ఈ ఫుడ్ ప్రయోగం మాత్రం అటు చాక్లెట్ ప్రేమికులకు, ఇటు మ్యాగీ ప్రియులకు కోపం తెప్పించక మానదు. ఇప్పటికే ఈ పదార్థం ఏంటో అర్థమై ఉంటుంది. అదే "చాక్లెట్ మ్యాగీ". నూటికి ఒక్కరు మాత్రమే ఈ వంటకంపై ఆసక్తి చూపిస్తుండగా మిగతా 99మంది మాకొద్దు బాబోయ్ అంటూ పరుగులు తీస్తున్నారు. (తినే మ్యాగీ కాళ్ల కింద; నలిగిపోయిందా?) చాక్లెట్, మ్యాగీని కలపడాన్ని "ఉగ్రవాద చర్య, రాక్షసత్వం, ఆహార విపత్తు, 2020లో ఇలాంటి ఘోరాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో" అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరో నెటిజన్ మాత్రం "ఈ రెసిపీ చేసినవాన్ని చంపేస్తా" అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. కాగా గతంలో "మ్యాగీ పానీపూరి" అనే విభిన్న వంటకం భోజన ప్రియులకు వికారం కలిగించిన విషయం తెలిసిందే. అసలు ఈ పేరు వినడానికే ఇబ్బందిగా ఉందంటూ నెటిజన్లు పెదవి విరిచారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో రోజుకో కొత్త వంటకం పుట్టుకొస్తూనే ఉంది. ('ఛీ, వినడానికే దరిద్రంగా ఉంది') -
"మ్యాగీ పానీపూరి"
-
'ఛీ, వినడానికే దరిద్రంగా ఉంది'
న్యూఢిల్లీ: జనాలు అస్సలు మొహమాట పడని ఏకైక చోటు పానీపూరి బండి. అబ్బాయిలకు పానీపూరి ఇష్టం ఉంటుంది, కానీ అమ్మాయిలకు పానీపూరి పిచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆ బండి దగ్గరకు ఎప్పుడూ వెళ్లే రెగ్యులర్ కస్టమర్స్ వీళ్లు. ఇప్పుడు చెప్పబోయే ఈ వార్త కచ్చితంగా పానీపూరి ప్రియులకు కోపం తెప్పిస్తుంది. ఇప్పటివరకు నెట్టింట్లో వెరైటీ వంటకాల పేరుతో ఎన్నో ఘోరాలను చూశాం. అందులో గులాబ్‌జామూన్ పావ్ బాజీ, కుర్కురే మిల్క్‌షేక్, స్వీట్ మ్యాగీ, ఓరియో సమోసా, న్యూటెల్లా బిర్యానీ ఇలా పేర్లు వింటేనే గుండెలదిరే వంటకాల గురించి విన్నాం. (2020లో ఇవి మాత్రం ప్రయత్నించకండి) తాజాగా భోజనప్రియులను బెంబేలెత్తించే మరో కొత్త వంటకం పుట్టుకొచ్చింది. అదే "మ్యాగీ పానీపూరి". ఇది ఎలా తయారుచేయాలో వివరిస్తూ బన్నీ అనే వ్యక్తి దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో పూరీలో పప్పు, పానీకి బదులుగా రెడీ చేసి పెట్టిన మ్యాగీని వేసి ఉంచాడు. దీన్ని చూసి షాక్‌కు లోనైన నెటిజన్లు 'ఇది హారర్ చిత్రంలోని దృశ్యంలా ఉంది', 'ఇది 2020 ఏడాది కన్నా పెద్ద ఘోరం', 'ఛీ, ఈ రెసిపీ పేరు వినడానికే దరిద్రంగా ఉంది', 'నువ్వు ఎవరో తెలీదు కాని నువ్వంటే నాకు పరమ అసహ్యం' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (పానీపూరి తిన్న 40 మంది చిన్నారులకు అస్వస్థత) -
2020లో ఇవి మాత్రం ప్రయత్నించకండి
స్వీట్ మ్యాగీ, గులాబ్జామున్ పావ్ బాజీ, కుర్కరే మిల్క్‌షేక్ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా. అదేంటి ఎప్పుడు వినని కాంబినేషన్ల గురించి అడుగుతున్నారేంటి అనుకుంటున్నారా ? ఏం లేదండి 2019లో ఇలాంటి ప్రయోగాలను కొంతమంది ప్రయత్నించారు. ఆపై వాటిని సోషల్‌మీడియాలో షేర్ చేశారు. మ్యాగీతో స్వీట్ తయారు చేయడం, గులాబ్జామున్ను పావుబాజీలో ఉపయోగించడం, దాల్ మక్కానీ క్యాపుచినో వంటివి తయారు చేసి వీడియోలో షేర్ చేశారు.కానీ వీటి తయారు విధానం చూసిన తర్వాత మీరు మాత్రం దయచేసి ప్రయత్నించకండి. అసలే 2019 సంవత్సరానికి ముగింపు పలికి 2020 సంవత్సరానికి స్వాగతం చెప్పాం. ఇవి ఎలా తయారు చేశారనేది మాత్రం వీడియోలు చూసి తెలుసుకోండి. 1. స్వీట్ మ్యాగీ Best maggi recipe pic.twitter.com/foOrc0VjoU — Desi Gooner (@Sahil_Adhikaari) September 12, 2019 2. గులాబ్ జామున్ పావ్‌బాజీ 3. కుర్కురే మిల్క్‌షేక్ 4. కోకో చెర్రీ దోష Things like this will make you lose faith in humanity! pic.twitter.com/LO5hWwtyVG — Darshan Pathak (@darshanpathak) September 30, 2019 -
తినే మ్యాగీ కాళ్ల కింద; నలిగిపోయిందా?
రెండు నిమిషాల్లో స్నాక్స్ సిద్ధం కావాలంటే మ్యాగీ ఉండాల్సిందే. నోరూరించే మ్యాగీ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లదాకా అందరికీ ఇష్టమే. తాజాగా మ్యాగీ వార్తల్లోకెక్కింది. ఏంటి? మ్యాగీలో మళ్లీ ఏదైనా కెమికల్స్ కలుపుతున్నారా అని ఆందోళన చెందకండి. అదేమీ లేదు, ప్రముఖ ఫ్యాషన్ కంపెనీ కొత్త సంవత్సరం కలెక్షన్స్ అంటూ.. నూడిల్స్‌తో పాటు ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అదే దీనంతటికీ కారణమైంది. ఇక ఈ ఫొటోలో ఓ యువతి మ్యాగీ చెప్పులను ధరించింది. దాని పక్కన మ్యాగీ ఫొటో కూడా ఉండటంతో అది మ్యాగీతో చేసిందేనని అందరూ భావించారు. ‘తినే మ్యాగీ కాళ్లకింద నలిగిపోయిందే..’ అని తెగ ఫీలయ్యారు. కానీ అసలు విషయం తెలిశాక నవ్వకుండా ఉండలేకపోయారు. ఆ యువతి ధరించిన చెప్పులు మ్యాగీ డిజైన్‌ను పోలి ఉన్నాయి తప్పితే మ్యాగీతో తయారు చేసినవి కాదు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు బాగుందంటూ నవ్వుకుంటుంటే. ఏడ్చినట్టు ఉంది నీ బ్రాండ్ అని తిట్టిపోస్తున్నారు. ‘వేడినీళ్లు తగిలితే చెప్పులు దెబ్బతినవు కదా? అని కొందరు చమత్కార కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ చెప్పులు సొంతం చేసుకోవాలంటే సుమారు రూ.లక్ష వెచ్చించాల్సిందే. -
బాలుడిని బలి తీసుకున్న మ్యాగీ వంట..
కర్ణాటక ,తుమకూరు : మ్యాగీ తయారు చేయడానికి చేసిన ప్రయత్నం బాలుడిని బలి తీసుకున్న ఘటన సోమవారం తుమకూరు పట్టణంలో చోటు చేసుకుంది. క్రిస్టియన్ స్ట్రీట్‌లో తల్లితండ్రులతో ఉంటున్న నోయల్ ప్రసాద్ (7) సోమవారం మ్యాగీ చేస్తానంటూ తల్లిని ఒప్పించి కిచెన్‌లో గ్యాస్ స్టవ్ వెలిగించడానికి ప్రయత్నించాడు. అయితే అప్పటికే గ్యాస్ లీక్ కావడంతో లైటర్ వెలిగిస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు అంటుకొని మంటలు వ్యా పించాయి. ఘటనలో నోయల్‌కు తీవ్రగాయాలు కావడంతో తల్లితండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినా తీవ్రగాయాలు కావడంతో చికిత్స ఫలించక నోయల్ మృతి చెందాడు. తుమకూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
మ్యాగీని.. ఇలా కూడా తయారు చేస్తారా..!
సాధారణంగా బాగా ఆకలి వేసినప్పుడూ.. వంట చేసుకొని తినే ఓపిక లేనప్పడు క్షణాల్లో తయారయ్యే మ్యాగీని చేసుకుంటారు. అందరికీ మ్యాగీ అంటే.. నూడిల్స్‌లా ఉండి.. అందులో వేసుకోవడానికి మసాలాతో కూడిన ప్యాకెట్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అదేవిధంగా మ్యాగీని అందరూ నీటితో చేస్తారన్న సంగతి విధితమే. మ్యాగీని ఒకేలా చేసుకొని తినడం బోర్ కొట్టిన ఓ మహిళా భిన్నంగా ఆలోచించి.. కొత్త తరహాలో తయారు చేశారు. అందులో నీటికి బదులుగా పాలను పోసీ కొంత చక్కెరను కూడా కలిపి తయారు చేశారు. ఆ వంటకానికి ‘స్వీట్ మ్యాగీ’ అనే పేరును కూడా జోడించారు. అంతటితో ఆగకుండా ఆ మహిళా ‘స్వీట్ మ్యాగీ’ తయారి విధానాన్ని వీడియో తీసి ట్విటర్ పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్లో కామెంట్లు చేస్తున్నారు.‘మీరు వదిలేసిన మసాలా ప్యాకెట్ నాకు ఇవ్వగలరా.. నేను ఎక్కువ మసాలా ఉపయోగిస్తానను’ అని ఒకరు, ‘చాలా సృజనాత్మకంగా ఉంది. కానీ తయారు చేయడానికి ప్రయత్నిస్తా అనుకోవడం లేదు’ అని మరొకరు, ‘ఓ దేవుడా.. మ్యాగీని ఇలా కూడా తయారు చేస్తారా.. నేను ఎక్కడా చూడలేదు’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. -
మ్యాగీని.. ఇలా కూడా తయారు చేస్తారా..!
-
‘మ్యాగీ’ డ్రెస్.. రెడీ కావడానికే 2నిమిషాలే!
బాలీవుడ్ నటి కియారా అద్వానీ తాజాగా ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ధగధగ మెరిసిపోయే పసుపురంగు డ్రెస్‌లో హాట్ లుక్‌తో ఉన్న ఫొటోను కియారా పోస్టు చేసింది. డిజైనర్ అటెలీర్ జుహ్రా రూపొందించిన ఈ గౌను నారలు, నారలుగా ఉండటంతో ఈ ఫొటోపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు గుప్పించారు. ఈ డ్రెస్‌లో కియారా లుక్‌ను ప్రశంసించడానికి బదులు ‘మ్యాగీ’ న్యూడిల్స్‌తో పోలుస్తూ కామెంట్లు చేశారు. ‘మీకు మ్యాగీ చాలా ఇష్టం. కానీ, తిని.. తిని బోర్ కొట్టిందనుకోండి. దానితో ఇలా గౌను చేయవచ్చు. ఆహారాన్ని వృధా చేయకుండా ఇదే బెస్ట్ పద్ధతి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. మరొకరు ‘మసాలా మ్యాగీ’ అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్లను సరదాగా తీసుకున్న కియారా అంతే సరదాగా బదులిచ్చింది..‘హాహాహ్హా... రెడీ అయ్యేందుకు రెండు నిమిషాలే పట్టింది’ అంటూ ట్విటర్లో చమత్కరించింది. -
‘రెండు నిమిషాల్లో రెడీ కావొచ్చు’
సినీ తారలు అన్నాక ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది. కొందరు ఈ విమర్శలపై ఘాటుగా స్పందిస్తే.. మరికొందరు కాస్త వెటకారంగా స్పందిస్తారు. తాజాగా నటి కియారా అద్వానీ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆమె ధరించిన దుస్తుల గురించి కామెంట్ చేశాడో నెటిజన్. దాంతో కియారా అతడికి వెరైటీ సమాధానం చెప్పి నోరు మూయించారు. మంగళవారం కియారా డిజైనర్ అటెలియర్ జుహ్రా రూపొందించిన డ్రెస్ ధరించి ఫోటో షూట్లో పాల్గొన్నారు. View this post on Instagram 🌼 A post shared by KIARA (@kiaraaliaadvani) on Sep 3, 2019 at 7:58am PDT పసుపు రంగులో ఈకలు, అంచులతో ఈ డ్రెస్‌ని డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు కియారా. ఓ నెటిజన్ కియారా డ్రెస్‌ను మ్యాగీ న్యూడుల్స్‌తో పోలుస్తూ విమర్శించాడు. ఈ విమర్శలపై కియారా ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘రెండు నిమిషాల్లో రెడీ’ అంటూ సమాధానమిచ్చారు. కియారా సమయస్ఫూర్తిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
నెస్లేకు మళ్లీ మ్యాగీ కష్టాలు!
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం నాటి మ్యాగీ నూడుల్స్ వివాదం నెస్లే ఇండియాను ఇంకా వెంటాడుతోంది. మ్యాగీ నూడుల్స్‌కి సంబంధించి కంపెనీ మీద ఎన్‌సీడీఆర్‌సీలో కేంద్రం పెట్టిన కేసు విచారణపై స్టేను ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసు విచారణ యథాప్రకారం కొనసాగనుంది. మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్‌పై మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) నిర్వహించిన పరీక్షల ఫలితాలు దీనికి ప్రాతిపదికగా ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. మరోవైపు, సుప్రీం కోర్టు ఆదేశాలను నెస్లే స్వాగతించింది. మ్యాగీ నూడుల్స్‌లో సీసం తదితర అవశేషాలు నిర్దేశిత స్థాయిల్లోనే ఉన్నాయని సీఎఫ్టీఆర్ఐ పరీక్షల్లో తేలినట్లు పేర్కొంది. అయితే, న్యాయస్థానం ఆదేశాల కాపీ వచ్చిన తర్వాతే తమకు ఉత్తర్వుల పూర్తి వివరాలు తెలుస్తాయని వివరించింది. వివరాల్లోకి వెళితే.. మ్యాగీ నూడుల్స్‌లో హానికారక మోనోసోడియం గ్లూటమేట్ (ఎంఎస్‌జీ) అవశేషాలు అధిక మోతాదులో ఉన్నాయంటూ ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ 2015లో దీన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెస్లే ఇండియా తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇస్తోందని, తప్పుడు లేబులింగ్, అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తోందని ఆరోపిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ 2015లో జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)లో ఈ కేసు దాఖలు చేసింది. రూ. 640 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేసింది. అయితే, దీన్ని నెస్లే సవాల్ చేయడంతో సుప్రీంకోర్టు అప్పట్లో కేసు విచారణపై స్టే విధించింది. మరోవైపు మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్‌లో సీసం, ఎంఎస్‌జీ స్థాయి లపై పరీక్షలు జరిపి నివేదికనివ్వాలంటూ సీఎఫ్టీఆర్ఐని 2016 జనవరి 13న సుప్రీంకోర్టు ఆదేశించింది. 29 శాంపిల్స్‌లో సీసం పరిమాణం నిర్దేశిత స్థాయికి లోబడే ఉందంటూ సీఎఫ్టీఆర్ఐ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
మ్యాగీలో అంతా బూడిదే..భారీ జరిమానా
లక్నో: మ్యాగీ నూడుల్స్‌కు మరోసారి భారీ షాక్ తగిలింది. టూ మినిట్స్ మ్యాగీ నూడుల్స్ అంటూ పిల్లల్ని, పెద్దల్నీ విపరీతంగా ఆకట్టుకున్నప్పటికీ ప్రమాదకర రసాయానాల వివాదం నెస్టే ఇండియా బ్రాండ్ మ్యాగీ నూడుల్స్‌ను వెంటాడుతోంది. తాజాగా నాణ్యత పరీక్షల్లో దారుణంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో ఇటీవల నిషేధంతో భారీగా నష్టపోయిన సంస్థ మరోసారి నాణ్యత పరీక్షల్లో విఫలమైంది. దీంతో ఉత్తర్‌ప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లా కోర్టు నెస్లే ఇండియాకు భారీ జరిమానా విధించింది. షాజహాన్‌పూర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు మ్యాగి నూడుల్స్ పరిమితి కంటే ఎక్కువ బూడిద కంటెంట్ ఉందన్న ల్యాబ్ నివేదికను సమర్ధించింది. మ్యాగీ ఉత్పత్తులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేజిస్ట్రేట్ సంస్థకు రూ.62లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఇందులో రూ.45లక్షలు, ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లకు రూ.15లక్షలు, ఇద్దరు అమ్మకం దారులకు రూ.11లక్షలు చొప్పున జరిమానా విధించింది. పిల్లలు వినియోగించే మాగి నమూనాలలో యాష్ సూచించిన పరిమితి కంటే ఒకశాతానికి మించిపోయింది. నాసిరకం ఉత్పత్తులను అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యంతో ఆడలాడుకోవటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరాదని ఎడీఎం జేకే శర్మ వ్యాఖ్యానించారు. జిల్లా అధికారులు అందించిన సమాచారం ప్రకారం మాగి నూడుల్స్ , పాస్తా ఏడు నమూనాలను సేకరించి, 2015 లో లక్నోలో ఒక ప్రయోగశాలలో పరీక్ష కోసం పంపగా 2016 లో ఉత్తర ప్రదేశ్ ఆహార భద్రత మరియు ఔషధ నిర్వహణ (FSDA) కు నివేదికను సమర్పించింది. అయితే, నెస్లే ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ, మ్యాగి నూడుల్స్ వినియోగానికి 100శాతం సురక్షితంగా ఉన్నాయని పునరుద్ఘాటించారు. దీనికి సంబంధించి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదనీ, ఆర్డర్ పొందిన వెంటనే తక్షణమే అప్పీల్ చేస్తామన్నారు. వినియోగదారుల్లో ఏర్పడిన గందరగోళానికి తాము చింతిస్తున్నామని పేర్కొన్నారు. మాగి మసాలాలో నాలుగు శాంపిల్స్, మాగి పాస్తా రెండు శాంపిల్స్ అటా నూడుల్స్ శాంపిల్ లాబ్ పరీక్ష విఫలం కావడం గమనార్హం. -
మళ్లీ చిక్కుల్లో మ్యాగీ నూడుల్స్
లక్నో : మ్యాగీ నూడుల్స్ మళ్లీ ల్యాబ్ టెస్టుల్లో విఫలం చెందింది. ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఫుడ్ క్వాలిటీ టెస్టుల్లో మ్యాగీ నూడుల్స్ విఫలం చెందినట్లు తెలుస్తోంది. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ పరిపాలనా శాఖ అధికారులు నెస్లే ఇండియా, డిస్ట్రిబ్యూటర్లు, అమ్మకందారులకు భారీగా జరిమాన విధించినట్లు రిపోర్టులు వచ్చాయి. సరైన నిబంధనలు పాటించకపోవడం వల్లే నెస్లే ఇండియాకు జరిమానా విధించామని ఎఫ్ఎమ్సీజీ పేర్కొంది. నెస్లేకు రూ. 45 లక్షలు, ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లకు 15 లక్షలు, ఇద్దరు అమ్మకందారులకు రూ. 11 లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించింది. -
మ్యాగీ నిల్వల విధ్వంసానికి సుప్రీంకోర్టు సమ్మతి
న్యూఢిల్లీ: నెస్లే ఇండియా, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధీనంలో ఉన్న కాలం చెల్లిన 550 టన్నుల మ్యాగీ నూడుల్స్‌ను ధ్వంసం చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. కంపెనీ 39 కేంద్రాల్లో, లక్నోలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ వద్ద ఉన్న నిల్వలను ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కాల్చివేయాలని జస్టిస్ దీపక్ మిశ్రా, యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపునిచ్చిన సిమెంటు కర్మాగారాల్లోని దహన కేంద్రాల్లో నియంత్రణ సంస్థ ప్రతినిధుల సమక్షంలో వాటిని బూడిదచేస్తామని నెస్లే తరఫు లాయర్ అరవింద్ దత్తార్ తెలిపారు. ఈ వ్యవహారంలో ఏమైనా ఫిర్యాదులుంటే కోర్టును ఆశ్రయించవచ్చని బెం^Œ స్పష్టం చేసింది. వెనక్కి పిలిచిన నిల్వలను ధ్వంసం చేయడానికి అనుమతించాలని, వాటి నిల్వ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిందని నెస్లే కంపెనీ సెప్టెంబర్ 21న సుప్రీంకోర్టు తలుపులు తట్టిన సంగతి తెలిసిందే. -
నూడుల్స్ ధ్వంసానికి సుప్రీంను ఆశ్రయించిన నెస్లే
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ తయారీ సంస్థ నెస్లే ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవలి నిషేధం నేపథ్యంలో భారీగా పేరుకుపోయిన మ్యాగీ నూడుల్స్ నిల్వలను ధ్వంసం చేసేందుకు సుప్రీం అనుమతి కోరింది. గడువు తీరిన 550 టన్నుల మ్యాగీ నూడుల్స్ ను ధ్వంసం చేయాల్సి అవసరం ఉందని తెలిపింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అంగీకరించకపోడంతో సుప్రీంను ఆశ్రయించినట్టు పేర్కొంది. జస్టిస్ దీపక్ మిశ్రాలతో, జస్టిస్ సి నాగప్పన్ లతో కూడిన బెంచ్ ముందుకు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఇది గతంలో హైకోర్టులో నెస్లే లేవనెత్తిన సమస్యే అని ఎఫ్ఎస్ఎస్ఏఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో జస్టిస్ అటార్నీ జనరల్ ముకుల్ సూచనలను పాటించాల్సి ఉందని పునరుద్ఘాటించారు. దీంతో తదుపరి విచారణను సెప్టెంబర్ 30 కి వాయిదా వేశారు. -
మ్యాగీ మళ్లీ టాప్
న్యూఢిల్లీ : ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిషేధం అనంతరం మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మ్యాగీ నూడుల్స్ మళ్లీ టాప్ స్పాట్‌లోకి వచ్చాయి. ఈ ఏడాది ప్రథమార్థం వరకు 57 శాతం మార్కెట్ షేరును సొంతం చేసుకుని మార్కెట్లో తన ఆధిపత్య స్థానాన్ని మ్యాగీ పునరుద్ధరించుకుంది. రీఎంట్రీ ఇచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే 57.1 శాతం మార్కెట్ షేరును మ్యాగీ కైవసం చేసుకోవడంపై నెస్లే ఇండియా ఆనందం వ్యక్తంచేస్తోంది. ఇన్ స్టెంట్ నూడుల్స్ సెగ్మెంట్లో ఆరోగ్యవంతమైందిగా మ్యాగీ నిలుస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించిన హానికర రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణలతో పలు రాష్ట్రాలు ఈ ఉత్పత్తులపై నిషేధం విధించాయి. ఇవి క్యాన్సర్ ముప్పుకు దారితీస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఐదు నెలల నిషేధం కాలంలో నెస్లే ఇండియా రూ.500 కోట్లకు పైగా విక్రయాలను కోల్పోవాల్సి వచ్చింది. ల్యాబ్ పరీక్షల్లో మ్యాగీ నూడుల్స్ నాణ్యమైనవేనని తేలడంతో మళ్లీ ఉత్పత్తులను నవంబర్‌లో మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. నిషేధం అనంతరం మొదటిసారి గత డిసెంబర్లో మ్యాగీకి డిమాండ్ పుంజుకుంది. మార్కెట్లోకి పునఃప్రవేశించిన ఒక నెలలోనే 35.2 శాతం మార్కెట్ షేరు పెంచుకుంది. 2016 మార్చిలోనే ఈ ఇన్ స్టెంట్ నూడుల్స్ 51 శాతం మార్కెట్ షేరును దక్కించుకున్నాయి. -
డాన్సర్ దుస్తులపై వివాదం
బోస్టన్: డాన్సర్ మ్యాగీ మెక్ మఫ్ఫీన్ కు నెటిజన్లు అండగా నిలిచారు. మసాచుసెట్స్ లోని లోగాన్ ఎయిర్ పోర్టులో ఆమెకు జరిగిన అవమానంపై సోషల్ మీడియాలో గళమెత్తారు. కురచ దుస్తులు వేసుకుందన్న కారణంగా జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ ఆమెను విమానంలోని ఎక్కనీయయలేదు. అప్పటికప్పుడు పొడుగు దుస్తులు కొనుక్కుని వేసుకోవడంతో ఆమెను విమానంలోకి అనుమతించారు. మఫ్ఫీన్ పట్ల జెట్ బ్లూ ఎయిర్‌లైన్స్ సిబ్బంది వివక్ష పూరితంగా వ్యవహరించారని నెటిజన్లు ఆరోపించారు. బూటీ సాలిడారిటీ, బూటీ షార్ట్ సపోర్ట్ హాష్ ట్యాగ్స్‌తో ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ఇది డ్రెస్ కోడ్ వివక్ష అని ఎద్దేవా చేశారు. మనిషి మనిషికి డ్రెస్ కోడ్ పెడతారా అని ప్రశ్నించారు. తాను ఒంటినిండా దుస్తులు వేసుకున్నానని, నియమాలు ఉల్లంఘించలేదని మఫ్ఫీన్ తెలిపింది. అయితే ప్రయాణికుల దుస్తులు అభ్యంతకరంగా ఉంటే అనుమతించబోమని జెట్ బ్లూ అధికార ప్రతినిధి అన్నారు. చివరకు మఫ్ఫీన్ కు జెట్ బ్లూ క్షమాపణ చెప్పింది. అంతేకాకుండా ఆమెకు 162 డాలర్ల ఫ్లైట్ క్రెడిట్ ఆఫర్ చేసింది. డ్రెస్ కోడ్ పై జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ స్పష్టత ఇవ్వాలని మప్ఫీన్ డిమాండ్ చేసింది. -
దుస్తులు సరిగా లేవని ప్రయాణికురాలిని...
బోస్టన్: విమానం ఎక్కడానికి వచ్చిన ప్రయాణికురాలికి ఎయిర్ లైన్స్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమె దుస్తులు సరిగా లేవన్న కారణంగా విమానంలో కాలు పెట్టేందుకు అభ్యంతరం చెప్పారు. మసాచుసెట్స్ లోని లోగాన్ ఎయిర్ పోర్టులో కొన్ని రోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాగీ మెక్ మఫ్ఫీన్ లోగాన్ లో జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించి బోస్టన్ చేరుకుని, అక్కడ కనెక్టింగ్ ఫ్లయిట్ అందుకుని న్యూయార్క్ కు వెళ్లాల్సి ఉంది. ఆమె ఓ స్వెట్టర్, చిన్న షార్ట్ వేసుకుందని, పొడవాటి సాక్సు ధరించి ఉందని జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. సీటెల్ కు చెందిన మాగీ మరీ పొట్టి దుస్తులు వేసుకుని వచ్చిందని, ఆమెను దుస్తులు మార్చుకోవాల్సిందిగా సూచించారు. లేనిపక్షంలో విమానం ఎక్కేందుకు ఆమెను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దీంతో చేసేదేం లేక మాగీ.. వేరే టర్మినల్ కు వెళ్లి 22 డాలర్లు ఖర్చుపెట్టి కొత్త షార్ట్స్ కొనుక్కుంది. ఆ తర్వాత హాయిగా ప్రయాణించి బోస్టన్ చేరుకుంది. రూల్స్ లో ఈ విషయాలు లేకున్నా తనను అడ్డుకున్నారని మాగీ చెప్పింది. ఎగతాళి చేసేలా లోగోలు, ఫొటోలు ఉన్న దుస్తులు ధరిస్తే ఎయిర్ లైన్స్ నియమాలకు విరుద్ధమని అధికారులు వెల్లడించారు. తనను విమానం ఎక్కకుండా గేట్ వద్దే నిలిపివేసినందుకు సిబ్బంది క్షమాపణలు చెప్పిందని బాధిత ప్రయాణికురాలు స్థానిక మీడియాకు వెల్లడించింది. -
నెస్లీ కి మ్యాగీ తప్ప మరోదారి లేదా?
మ్యాగీ వివాదం నెస్లీ ఇండియాను ఆర్థికంగా, నైతికంగా బాగా దెబ్బతీసింది. మ్యాగీ నూడుల్స్ లో మోతాదుకు మించి లెడ్ ఉందని తేలడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బందుల్లో పడింది. భారీ నష్టాలను మూటగట్టుకుంది. అయితే కంపెనీ నష్టాల నుంచి బయట పడటానికి వేరే మార్గం లేదా అంటే.. ఉందనే అంటున్నారు పెట్టుబడిదారులు. మ్యాగీ ఉత్పత్తులపైనే కాక మిగతా వాటిపై కూడా దృష్టిసారించాలని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. నెస్లీ తన అమ్మకాలను 70శాతం పెంచుకోవడానికి మ్యాగీ ఉత్పత్తులపై కాకుండా కంపెనీ ఆఫర్ చేసే మరో మూడు ఉత్పత్తులపై దృష్టిసారించాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాల ఉత్పత్తుల వాల్యుమ్, న్యూట్రిషన్ విభాగం కూడా వరుసగా నాలుగు ఏడాదులు నష్టాల్లో నడవడం, బెవరేజస్,చాకోలేట్ల అమ్మకాలు పతనం నుంచి బయటపడాలని భావిస్తున్నారు. ఈ ద్రవ్యోల్బణ వాతావరణంలో వాల్యుమ్ పైన కాకుండా కేవలం అమ్మకాలు, లాభాలపైనే దృష్టిసారించడంతో, కంపెనీకి ఈ నష్టాల వస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. కొన్ని కేటగిరి ఉత్పత్తులో డిస్కౌంట్లు ఆఫర్ చేసి, అమ్మకాల వృద్ధిని పెంచుకోవడంలో నెస్లీ దూకుడులో ఉన్నప్పటికీ, ఇవి నిర్వహణ లాభాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపడం లేదన్నారు. మార్చి క్వార్టర్లో మెటీరియల్ ఖర్చులు కూడా పెరిగాయన్నారు. పామ్ ఆయిల్ వంటి కమోడిటీల రేట్లను నెస్లీ పెంచింది. కంపెనీ ఆఫర్ చేసే ఉత్పత్తులపై రేట్లను తగ్గించుకుని, పట్టణ వినియోగాన్ని పెంచుకుంటే నెస్లీ లాభాలను ఆర్జించవచ్చని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. అన్నీ కేటగిరీలోనూ వాల్యుమ్ వృద్దిని నెస్లీ చేపడితే లాభాలను నమోదుచేయొచ్చని చెబుతున్నారు. అమ్మకాలు, మార్జిన్లలో పెరుగుదల ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లలో కంపెనీపై ఆసక్తిని పెంచడానికి ఈ నష్టాలను నెస్లీ అధిగమించాల్సి ఉంది. మ్యాగీ ఉత్పత్తులు పునఃప్రారంభమయ్యాక కూడా నెస్లీ స్టాక్ 5.7శాతం కిందకే నమోదవుతోంది. మ్యాగీ ఉత్పత్తులు మార్కెట్లోకి పునఃప్రారంభమయ్యాక 50శాతం మార్కెట్ షేరును అవే నమోదుచేశాయని కంపెనీ ప్రకటించింది. అయితే కంపెనీ అమ్మకాలు మార్చి క్వార్టర్లో గతేడాది ఇదే త్రైమాసికం కంటే 8.4శాతం పడిపోయాయని తెలిపింది. ఈ క్షీణత డిసెంబర్ త్రైమాసికంలో 24శాతం నెస్లీ అమ్మకాలు పతనం కంటే తక్కువే ఉందని తెలిపింది. ముందటి త్రైమాసికాలతో పోలిస్తే ఈ అమ్మకాల క్షీణత కొంత మెరుగుపడిందని కంపెనీ ప్రకటించింది. మ్యాగీ మసాలా వేరియంట్ ను నవంబర్ లో కంపెనీ పునఃప్రారంభించింది. నిర్వహణ లాభాలు 3.5 శాతం పెరుగుతూ వస్తున్నాయని, కానీ ఇవి గతేడాది కంటే 1శాతం తక్కువగానే ఉన్నాయని పేర్కొంది. ఉద్యోగుల ప్రయోజనాలు, ఇతరాత్ర ఖర్చులు పెరగకపోవడం వల్ల ఈ లాభాలను ఆర్జిస్తున్నామని, అదేమాదిరి కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు పెరగడం లేదని తెలిపింది. -
ప్రపంచంలోనే అత్యంత ముసలి కుక్క మరణం!
సాధారణంగా కుక్కలు 8 నుంచి 15 ఏళ్ల వరకు బతుకుతాయి. కానీ ఆస్ట్రేలియాలోని నైరుతి విక్టోరియా ప్రాంతంలో 30 ఏళ్లపాటు బతికిన ఓ కుక్క బుధవారం మరణించింది. మాగీ అనే ఈ శునకం చనిపోయి ఉండటాన్ని దాని యజమాని బ్రియాన్ మెక్లారెన్ గమనించారు. గత వారం కూడా అది బాగానే ఉందని, పిల్లులను చూసి గట్టిగా మొరిగిందని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం చూస్తే అది చనిపోయి ఉందని, దాంతో తాను చాలా బాధపడుతున్నానని అన్నారు. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాస మరణం వచ్చినందుకు మాత్రం కాస్త ఊరటగా ఉందన్నారు. తన పెంపుడు శునకానికి 30 ఏళ్లు ఉన్నట్లు మెక్లారెన్ చెబుతున్నా, దానికి సంబంధించిన ఆధారాలు ఏవీ లేవు కాబట్టి దాని సరైన వయసు ఎంతో నిర్ధారణ కాలేదు. తన చిన్నకొడుకు నాలుగేళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఆ కుక్కపిల్లను తెచ్చినట్లు మెక్లారెన్ చెబుతున్నారు. అతడికి ఇప్పుడు 34 ఏళ్లు. దాంతో ఆ కుక్క వయసు 30 ఏళ్లని అంటున్నారు. తామిద్దరం చాలా మంచి స్నేహితులమని అన్నారు. చెవులు వినిపించకపోయినా అది మాత్రం అతడి పొలానికి కాపలా ఉంటోంది. గత సంవత్సరం అక్టోబర్ నెలలో అది రోడ్డుమీద పడుకొని ఉండగా.. ఓ వాహనం కొట్టేయడంతో బాగా రక్తం పోయింది. కానీ ఎలాగోలా బతికింది. -
సీఎఫ్టీఆర్ఐ నుంచి మ్యాగీకి లైన్ క్లియర్
మ్యాగీ నూడుల్స్ తింటే హానికరం, ఆరోగ్యానికి ప్రమాదకరమంటూ మార్కెట్లో బంద్ చేసిన ఈ ఉత్పత్తులకు కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ(సీఎఫ్టీఆర్ఐ) నుంచి అన్ని అనుమతులు లభించాయి. ఈ సంస్థ నిర్వహించిన పరిశోధనలో మ్యాగీ నూడుల్స్ మంచి ఫలితాలు వచ్చాయి. దాదాపు 29 శాంపుల్స్ పై నిర్వహించిన టెస్ట్ లో ఎలాంటి హానికరమైన రసాయన పదార్థాలు లేవని సీఎఫ్టీఆర్ఐ సుప్రీంకు తెలపింది. ఈ విషయాన్ని నెస్లే సోమవారం సాయంత్రంప్రకటించడంతో, మంగళవారం మార్కెట్లో దీన్ని షేర్ విలువ 5 శాతం పెరిగి రూ.6,180 కు చేరింది.. గతేడాది డిసెంబర్ లో మ్యాగీ నూడుల్స్ శాంపుల్స్ ను మైసూర్ ల్యాబోరేటరీలో పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీఎఫ్టీఆర్ఐ నుంచి మ్యాగీకి వచ్చిన మంచి ఫలితాలతో మరిన్ని మ్యాగీ ఉత్పత్తులను మార్కెట్లోకి పునః ప్రవేశపెడతామని నెస్లే తెలిపింది. 2015 జూన్ లో ఫుడ్ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఎస్ఏఐ మ్యాగీ నూడుల్స్ లో హానికరమైన రసాయన పదార్థాలు ఉన్నాయంటూ మార్కెట్లో ఆ ఉత్పత్తును ఆపివేసింది. ముంబాయి హైకోర్టు విధించిన షరతులను సంతృప్తిపరుస్తూ మ్యాగీ నూడుల్స్ గతేడాది నవంబర్ లోనే మళ్లీ మార్కెట్లోకి వచ్చింది. కానీ దాని షేర్ల విలువ ఏ మాత్రం పెరుగలేదు. 14.50 శాతం వరకూ పడిపోయాయి.ఈ క్రమంలో సీఎఫ్టీఆర్ఐ ఇచ్చిన ఫలితాలతో నెస్లే షేర్లు మెరుగైన బాటలో నడుస్తున్నాయి. -
మ్యాగీకి సీఎఫ్టీఆర్ఐ క్లీన్చిట్
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ తింటే హానికరం, ఆరోగ్యానికి ప్రమాదకరమంటూ మార్కెట్లో బంద్ చేసిన ఈ ఉత్పత్తులకు కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ(సీఎఫ్టీఆర్ఐ) నుంచి అన్ని అనుమతులు లభించాయి. ఈ సంస్థ నిర్వహించిన పరిశోధనలో మ్యాగీ నూడుల్స్ మంచి ఫలితాలు వచ్చాయి. దాదాపు 29 శాంపుల్స్ పై నిర్వహించిన టెస్ట్ లో ఎలాంటి హానికరమైన రసాయన పదార్థాలు లేవని సీఎఫ్టీఆర్ఐ సుప్రీంకు తెలపింది. ఈ విషయాన్ని నెస్లే సోమవారం సాయంత్రంప్రకటించడంతో, మంగళవారం మార్కెట్లో దీన్ని షేర్ విలువ 5 శాతం పెరిగి రూ.6,180 కు చేరింది.. గతేడాది డిసెంబర్ లో మ్యాగీ నూడుల్స్ శాంపుల్స్ ను మైసూర్ ల్యాబోరేటరీలో పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీఎఫ్టీఆర్ఐ నుంచి మ్యాగీకి వచ్చిన మంచి ఫలితాలతో మరిన్ని మ్యాగీ ఉత్పత్తులను మార్కెట్లోకి పునః ప్రవేశపెడతామని నెస్లే తెలిపింది. 2015 జూన్ లో ఫుడ్ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఎస్ఏఐ మ్యాగీ నూడుల్స్ లో హానికరమైన రసాయన పదార్థాలు ఉన్నాయంటూ మార్కెట్లో ఆ ఉత్పత్తును ఆపివేసింది. ముంబాయి హైకోర్టు విధించిన షరతులను సంతృప్తిపరుస్తూ మ్యాగీ నూడుల్స్ గతేడాది నవంబర్ లోనే మళ్లీ మార్కెట్లోకి వచ్చింది. కానీ దాని షేర్ల విలువ ఏ మాత్రం పెరుగలేదు. 14.50 శాతం వరకూ పడిపోయాయి.ఈ క్రమంలో సీఎఫ్టీఆర్ఐ ఇచ్చిన ఫలితాలతో నెస్లే షేర్లు మెరుగైన బాటలో నడుస్తున్నాయి. -
మ్యాగీ నూడుల్స్‌కు మరిన్ని పరీక్షలు: సుప్రీం
న్యూఢిల్లీ: ఐదు నెలల నిషేధం అనంతరం మళ్లీ మార్కెట్లోకి వచ్చిన మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్‌ను మరిన్ని పరీక్షలకు పంపనున్నారు. మైసూర్‌లోని ప్రభుత్వ ల్యాబ్‌కు మ్యాగీ ఉత్పత్తుల శాంపిల్స్‌ను పంపి పరీక్షించాలని బుధవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా తమకు నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. మ్యాగీ ఉత్పత్తుల తయారీలో పరిమితులకులోబడి సోడియం రసాయనాలను కలిపారా అన్న విషయాన్ని నిర్ధారించాల్సిందిగా ఫుడ్ సేఫ్టీ రెగ్యులరేటర్‌కు సూచించింది. 'మ్యాగీ నూడుల్స్‌ను యువతరం కొంటున్నారు. వారి రక్షణ విషయంపై మాకు ఆందోళన ఉంది' అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. మ్యాగీ నూడుల్స్ తయారీలో పరిమితికి మించి సోడియం కలిపారని, ఇవి సురక్షితం కావంటూ భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ గత జూన్‌లో వీటిని నిషేధించింది. కాగా గత నవంబర్‌లో మూడు ప్రభుత్వ ల్యాబ్‌లలో నిర్వహించిన పరీక్షల్లో మ్యాగీ ఉత్పత్తులు సురక్షితమని తేలిన తర్వాత బాంబే హైకోర్టు వీటిపై నిషేధాన్ని తొలగించింది. ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తాజాగా మ్యాగీ ఉత్పత్తులకు మరిన్ని పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. -
వర్మ-మ్యాగీ ఒక ప్రేమకథ!
క్రియెటివ్ డైరెక్టర్, కాంట్రవర్సీ కింగ్.. ఇలా ఎన్నైనా చెప్పండి. రాంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మనే. ఆయన ఎప్పుడూ వార్తల్లో వ్యక్తే. తాజాగా ఒక ప్రేమకథతో ఆయన ట్విట్టర్‌కు ఎక్కారు. అది మ్యాగీ న్యూడిల్స్‌పై ఆయనకున్న ప్రేమ. ఇటీవల నిషేధానికి గురై అనేక కష్టనష్టాలు పడ్డ నెస్లే మ్యాగీ న్యూడిల్స్‌కు వర్మ అడుగడుగునా బాసటగా నిలిచారు. అందుకు రుణం తీర్చుకోవాలి కదా! అందుకే మ్యాగీ కూడా ఆయన ప్రేమను, మద్దతును స్వీకరించింది. ఇందుకు ప్రతిగా ఆయనకు ఓ గిఫ్ట్ హ్యాంపర్‌ను పంపిస్తామని తెలిపింది. చిరునామా వివరాలు ఇవ్వమని కోరింది. దీంతో వర్మ పొంగిపోయారు. దీనిని గౌరవంగా భావించారు. మ్యాగీ బేబి నువ్వు ఇప్పటికీ 20 లక్షల నిమిషాల ఆనందాన్ని కానుకగా ఇచ్చావు. హుమ్మా' అంటూ ఓ ముద్దుపెట్టారు. ఇలా ట్విట్టర్లో నడిచిన మ్యాగీ- వర్మ ప్రేమకథను చూసి ఓ అభిమాని స్పందించాడు. షారుఖ్‌ఖాన్, కాజోల్ జంటగా నటించిన 'దిల్వాలే దుల్హానియా లేజాయెంగే' సినిమా కంటే మధురమైన, అతి సుందరమైన ప్రేమకథ మీదేనంటు కితాబిచ్చాడు. అది కూడా నచ్చేయడంతో వర్మ దానిని రీట్వీట్ చేశారు. Honoured and Maggied -
మ్యాగీ న్యూడిల్సే అతిపెద్ద హీరో: వర్మ
ముంబై: ట్విట్టర్లో తనదైన మార్కు వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు ఏదో హల్చల్ చేసే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తాజాగా మ్యాగీ న్యూడిల్స్‌పై పడ్డారు. చెన్నై వరద బీభత్సానికి సంబంధించి అతిపెద్ద హీరోగా బాధిత మ్యాగీ న్యూడిల్సే నిలిచిందని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. చెన్నైలో బాధిత ప్రజలకు సరఫరా అయిన మ్యాగీ న్యూడిల్సే అతిపెద్ద రక్షకురాలిగా నిలిచిందని, ప్రభుత్వం తనను ధ్వంసం చేయాలని చూసినా.. మ్యాగీ న్యూడిల్స్ మాత్రం ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడిందని ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. మ్యాగీకి జై కొట్టారు. ఉన్నట్టుండి వర్మ మ్యాగీ గురించి వ్యాఖ్యలు చేయడంలో అంతర్థారం లేకపోలేదు. ఇటీవల నిషేధానికి గురైన మ్యాగీ న్యూడిల్స్ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ వర్షాలతో అల్లాడుతున్న చెన్నై ప్రజలకు ముందుస్తుగా అందజేసిన ఆహార పదార్థాలు, పానీయాల జాబితాలో మ్యాగీ న్యూడిల్సే అగ్రస్థానంలో నిలిచింది. సహాయక చర్యల్లో భాగంగా నెస్ట్లే సంస్థ రెండు నిమిషాల్లో సిద్ధమయ్యే మ్యాగీ న్యూడిల్స్ ను తమిళనాడు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అందజేసింది. చెన్నై ప్రజలకు కొరత రాకుండా ప్యాకేజెడ్ ఆహార పదార్థాలు, తాగునీరు బాటిళ్లు అందజేయాలని కేంద్రమంత్రి హర్సిమత్కౌర్ బాదల్ పిలుపునిచ్చారు. దీంతో పలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ప్యాకేజెడ్ ఆహారపదార్థాలు అందజేశాయి. ఈ జాబితాలో 10 మిలియన్ టన్నుల న్యూడిల్స్, 5వేల లీటర్ల టెట్రా ప్యాకేడ్ పాలు, 50వేల కాపీ పొట్లాలతో నెస్ల్టే ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఎంటీఆర్, ఐటీసీ సంస్థలు కూడా భారీమొత్తం ఆహార పదార్థాలు అందజేశాయి. -
నెస్లేకు మరో ఎదురు దెబ్బ
-
నెస్లేకు మరో ఎదురు దెబ్బ
నెస్లేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మ్యాగీ నూడిల్స్ వివాదం నుండి ఇప్పుడిప్పుడే బయట పడి మార్కెట్ లోకి మళ్లీ రంగ ప్రవేశం చేసిన వెంటనే నెస్లేకు సంబంధించిన మరో ఉత్పత్తిపై దుమారం మొదలైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆహార లాబొరేటరీ సంస్థ నిర్వహించిన శాంపిల్ టెస్ట్‌లో నెస్లే పాస్తా విఫలమైంది. పాస్తాలో మోతాదుకు మించిన సీసం పరిమాణం ఉన్నట్లు తేలిందని లాబొరేటరీ అధికారి అరవింద్ యాదవ్ తెలిపారు. సాధారణంగా సీసం మోతాదు 2.5 పీపీఎం కు మించరాదు. అయితే పాస్తాలో శాంపిల్స్‌లో 6 పీపీఎం ఉన్నట్లు నిర్థారణ అయింది. ఈ రిపోర్టు ప్రకారం నెస్లే పాస్తా ప్రొడక్ట్‌ను హానికరమైన అహార పదార్థాల జాబితాలో చేర్చారు. తమ పరిశీలనలో తేలిన ఫలితాలను లక్నో లాబొరేటరీకి పంపిన అధికారులు పాస్తాపై కోర్టులో కేసు నమోదు చేయడానికి అనుమతులు కోరారు. -
'రాందేవ్ మా పర్మిషన్ తీసుకోలేదు'
న్యూఢిల్లీ: దేశంలో నూడుల్స్ వివాదం కొనసాగుతుండగానే ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తన సంస్థ తరుపున నూడుల్స్ ప్రారంభించారు. అది కూడా ఫుడ్ సేప్టి అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోకుండానే. రాందేవ్ బాబా పతంజలి అట్టా నూడుల్స్, రాందేవ్ నూడుల్స్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నూడుల్స్ ఇప్పటి వరకు తమ అనుమతి తీసుకోలేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్మన్ తెలిపారు. ఇసలు ఇప్పటి వరకు అలాంటి అనుమతి కోసం రాందేవ్ బాబా దరఖాస్తు కూడా చేసుకోలేదని అధికార వర్గాల సమాచారం. పైగా ఈ ప్యాకెట్లపై ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ అనుమతి పొందినట్లు ఉందని తెలిసింది. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై దృష్టి సారించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్మన్ ఆశిష్ బహుగుణ తెలిపారు. అనుమతి తీసుకున్నాం పతంజలి నూడుల్స్ ఫుడ్ సేఫ్టి సంస్థ అనుమతి తీసుకోలేదని ఆరోపించగా తాము ఇదివరకే దాని అనుమతులు పొందామని, అన్ని నియమనిబంధనలు, ప్రమాణాలు పాటించామని పతంజలి అధికార ప్రతినిథి ఎస్ కే తిజర్వాలా అన్నారు. -
మ్యాగీ నూడుల్స్‌పై సుప్రీం కోర్టుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ నిషేధ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నెస్లే ఇండియాను.. సమస్యలు మళ్లీ చుట్టుముడుతున్నాయి. మ్యాగీ నూడుల్స్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులివ్వడాన్ని సవాలు చేస్తూ ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ.. తాజాగా సుప్రీం కోర్టుకు వెళ్లింది. పరీక్షల కోసం ల్యాబరేటరీలకు కంపెనీ ఇచ్చిన శాంపిల్స్ నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేసింది. పైగా.. తాజా శాంపిల్స్‌ను అందించే పనిని హైకోర్టు తటస్థ సంస్థకు కాకుండా వాటిని తయారు చేసే నెస్లే అప్పగించడాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ తన పిటీషన్లో సవాలు చేసింది. -
5 నిమిషాల్లో 60,000 మ్యాగీ కిట్స్ విక్రయం
న్యూఢిల్లీ: మోతాదుకు మించి సీసం ఉందనే కారణంగా దాదాపు ఐదు నెలల నిషేధాన్ని ఎదుర్కొన్న తర్వాత మళ్లీ మార్కెట్లోకి వచ్చిన మ్యాగీ ఇన్స్టెంట్ నూడుల్స్ వెల్కమ్ కిట్స్ స్నాప్‌డీల్‌లో కేవలం ఐదు నిమిషాల్లోనే 60,000 అమ్ముడుపోయాయి. నవంబర్ 9న మ్యాగీ కిట్స్ నమోదు ప్రక్రియ ప్రారంభమైతే.. వాటి అమ్మకాలు స్నాప్‌డీల్‌లో గురువారం ప్రారంభమయ్యాయి. కేవలం ఐదు నిమిషాల్లోనే తొలి బ్యాచ్‌కు చెందిన 60,000 మ్యాగీ కిట్స్ అమ్ముడుపోయాయి. ఒక మ్యాగీ కిట్‌లో 12 మ్యాగీ ప్యాకెట్స్, 2016 మ్యాగీ క్యాలెండర్, మ్యాగీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, మ్యాగీ పోస్ట్‌కార్డ్స్, ఒక వెల్కమ్ బ్యాక్ లెటర్ ఉంటాయి. దీని ధర రూ.144గా ఉంది. అలాగే మరో కొత్త బ్యాచ్ మ్యాగీ కిట్స్ విక్రయాలు నవంబర్ 16న జరగనున్నాయి. మ్యాగీ విక్రయాలు ఇప్పటికే 300 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా 100 పట్టణాల్లో పునఃప్రారంభమయ్యాయి. -
5 నిమిషాల్లో 60 వేల మ్యాగీ కిట్స్ అమ్మకం
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటిదాకా దుకాణాల ద్వారా విక్రయాలకే పరిమితమైన మ్యాగీ నూడుల్స్‌ను ఆన్లైన్లోని స్నాప్ డీల్ లో పెట్టిన ఐదునిమిషాల్లోనే రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. 5 నిమిషాల్లో 60 వేల మ్యాగీ వెల్కమ్ బ్యాక్ కిట్స్‌ను ఆన్ లైన్ లో కొనుగోలు చేశారు. మ్యాగీ వెల్కమ్ బ్యాక్ కిట్స్‌లో 12 మ్యాగీ ప్యాకెట్లు, 2016 మ్యాగీ క్యాలెండర్, మ్యాగీ ఫ్రీజ్‌పై వాడే అయస్కాంతం, మ్యాగీ పోస్ట్ కార్డు, ఒక వెల్కమ్ బ్యాక్ లెటర్ ఉంటాయి. నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో... దాదాపు అయిదు నెలల తర్వాత మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. సుమారు 100 పట్టణాల్లో దాదాపు 300 మంది పంపిణీదారుల ద్వారా వీటి విక్రయాలు మొదలయ్యాయి. మ్యాగీ నూడుల్స్‌లో హానికారక సీసం నిర్దేశిత స్థాయికి మించి ఉందన్న ఆరోపణలపై భారత ఆహార ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ ఏడాది జూన్‌లో వీటి అమ్మకాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
మ్యాగీ నూడుల్స్ మళ్లీ మార్కెట్లో...
100 పట్టణాల్లో విక్రయాలు తర్వాత దశల వారీగా విస్తరణ న్యూఢిల్లీ: నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో... దాదాపు అయిదు నెలల తర్వాత మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. సుమారు 100 పట్టణాల్లో దాదాపు 300 మంది పంపిణీదారుల ద్వారా వీటి విక్రయాలు మొదలుపెట్టినట్లు నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతానికి మసాలా వేరియంట్లో మాత్రమే నూడుల్స్ లభిస్తాయని, త్వరలో మిగతా వేరియంట్ల విక్రయాలు కూడా మొదలవుతాయని నారాయణన్ చెప్పారు. ఈ ఏడాది జూన్ నాటి ధరలే కొనసాగుతాయన్నారు. పంజాబ్, ఒడిషా, మణిపూర్, బిహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర ఎనిమిది రాష్ట్రాల్లో తమ నూడుల్స్ అమ్మకాలకు ఇంకా అనుమతి రాలేదు. మ్యాగీ నూడుల్స్‌లో హానికారక సీసం నిర్దేశిత స్థాయికి మించి ఉందన్న ఆరోపణలపై భారత ఆహార ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ ఏడాది జూన్‌లో వీటి అమ్మకాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. స్నాప్‌డీల్‌లో ఫ్లాష్ సేల్.. ఇప్పటిదాకా దుకాణాల ద్వారా విక్రయాలకే పరిమితమైన మ్యాగీ నూడుల్స్‌ను ఆన్లైన్లో కూడా విక్రయించనున్నట్లు నారాయణన్ చెప్పారు. స్నాప్‌డీల్ ద్వారా ఫ్లాష్ సేల్ విధానంలో వీటిని విక్రయిస్తున్నట్లు వివరించారు. -
ఈ నెల నుంచే మళ్లీ మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు
న్యూఢిల్లీ: ఈ నెలలోనే మ్యాగీ బ్రాండ్ నూడుల్స్ విక్రయాలు మళ్లీ ప్రారంభించనున్నట్లు నెస్లే ఇండియా తెలిపింది. తాజాగా ఉత్పత్తి చేసిన నూడుల్స్... వినియోగానికి సురక్షితమైనవేనంటూ ప్రభుత్వ ల్యాబొరేటరీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరించింది. బోంబే హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కర్ణాటక, పంజాబ్, గోవాలోని తమ ప్లాంట్లలో తయారైన నూడుల్స్‌ను ప్రభుత్వ అక్రెడిటేషన్ గల మూడు ల్యాబొరేటరీలు క్లియర్ చేశాయని నెస్లే ఇండియా పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఉన్న మరో రెండు ప్లాంట్లలోనూ నూడుల్స్ తయారీని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వివరించింది. ఇందుకోసం కావాల్సిన అనుమతులను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. మ్యాగీ నూడుల్స్‌లో హానికారక సీసం స్థాయిలు ఎక్కువగా ఉన్నాయన్న ఆరోపణలపై విక్రయాలను ఆహారపదార్థాల నాణ్యతా ప్రమాణాల సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే, దీన్ని సవాలు చేస్తూ కంపెనీ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. -
నెస్లే ఇండియాకు మ్యాగీ దెబ్బ
15 ఏళ్లలో తొలిసారి నష్టాలు న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం నెస్లే ఇండియాపై తీవ్రమైన ప్రభావాన్నే చూపింది. జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు రూ.64 కోట్ల నష్టాలొచ్చాయని (స్టాండ్ఎలోన్) నెస్లే ఇండియా తెలిపింది. ఒక క్వార్టర్లో నష్టాలు రావడం 15 ఏళ్లలో ఇదే మొదటిసారి. కన్సాలిడేటెడ్‌గా చేస్తే ఈ కంపెనీ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో 60% తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ. 311 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ క్యూ3లో రూ.124 కోట్లకు తగ్గిందని నెస్లే ఇండియా ఎండీ నారాయణన్ చెప్పారు. నికర అమ్మకాలు రూ.2,558 కోట్ల నుంచి 32 శాతం క్షీణించి రూ.1,736 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు. -
మళ్లీ భారత మార్కెట్లలోకి మ్యాగీ!
పిల్లలకు పొద్దున్నే టిఫిన్ ఏం చేయాలి.. సాయంత్రం రాగానే స్నాక్స్ ఏం పెట్టాలి.. ఇలాంటి ప్రశ్నలు ఇక తల్లులకు అక్కర్లేదు. మ్యాగీ నూడుల్స్ మళ్లీ స్టోర్లలో అమ్మకాలకు సిద్ధమైపోతున్నాయి. వచ్చే నెల నుంచి భారతీయ మార్కెట్లలో మళ్లీ మ్యాగీ అమ్మకాలు ప్రారంభించాలని నెస్లె సంస్థ భావిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధి ఒకరు తాజాగా తెలిపారు. ఈ సంవత్సరం మే నెలలో మ్యాగీ నూడుల్స్ అమ్మకాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అందులో సీసం ప్రమాదకరస్థాయిలో ఉందని, దాంతోపాటు ఎంఎస్‌జీ అనే పదార్థం కూడా ఉందని అప్పట్లో చెప్పారు. దాంతో దాదాపు రూ. 435 కోట్ల విలువైన మ్యాగీ ప్యాకెట్లను నెస్లె సంస్థ వెనక్కి తీసుకుని, వాటిని ధ్వంసం చేయాల్సి వచ్చింది. తాజాగా నెస్లె సంస్థ మళ్లీ మ్యాగీని కొత్తగా తయారుచేయడం మొదలుపెట్టింది. దాని శాంపిళ్లను పరీక్షలకు పంపుతామని, వాటిలో ఫలితాలు ఆమోదయోగ్యంగా వస్తే.. వచ్చే నెల నుంచి అమ్మకాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. సో, దాదాపుగా నవంబర్ నుంచి మళ్లీ మార్కెట్లలో మ్యాగీ కనిపిస్తుందన్న మాట. -
మ్యాగీ నూడుల్స్ పై నిషేధం ఎత్తివేత!
న్యూఢిల్లీ: గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో మ్యాగీ నూడుల్స్ పై నిషేధం ఎత్తివేసినట్టు తెలుస్తున్నది. మ్యాగీ నూడుల్స్ నమూనాలను ఇటీవల పరీక్షించి.. సురక్షితమని తేల్చిన నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మ్యాగీ నూడుల్స్ లో ప్రమాదకరమైన, సురక్షితం కాని పదర్థాలు ఉన్నాయని పరీక్షల్లో తేలడంతో వాటిపై భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) నిషేధం విధించింది. దీంతో గత జూన్‌లో నెస్ట్లే ఇండియా సంస్థ మ్యాగీకి చెందిన అన్ని రకాల నూడుల్స్ ను మార్కెట్ నుంచి వెనుక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు మూడు ప్రయోగశాలల్లో మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్ పరీక్షించామని, ఈ పరీక్షల్లో అవి సురక్షితమని తేలిందని నెస్ట్లే ఇండియా గత శుక్రవారం ప్రకటించింది. దీంతో గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో మ్యాగీ నూడుల్స్ పై నిషేధం ఎత్తివేసినట్టు వార్తలు వస్తున్నాయి. -
'మ్యాగీ నూడిల్స్ సురక్షితం'
ముంబై: మ్యాగీ నూడిల్స్ సురక్షితమని పరీక్షల్లో తేలినట్టు నెస్లె ఇండియా సంస్థ ప్రకటించింది. 100 మ్యాగీ శాంపిల్స్‌ను మూడు ల్యాబరేటరీలలో పరీక్షించగా, ఫలితాల్లో సురక్షితమని తేలినట్టు వెల్లడించింది. మ్యాగీలో హానికర రసాయనాలున్నాయంటూ భారత ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాల సంస్థ వెల్లడించడంతో నిషేధించిన సంగతి తెలిసిందే. కాగా నిషేధాన్ని ఇటీవల బాంబే హైకోర్టు ఎత్తేసింది. మ్యాగీ తాజా నమూనాలను హైదరాబాద్, జైపూర్, పంజాబ్‌లోని ఆహార పరీక్ష కేంద్రాలకు పంపాలని ఆదేశించింది. మ్యాగీలో రసాయనాలు అనుమతించిన మోతాదు కన్నా తక్కువ ఉన్నట్లు ఈ పరీక్షల్లో తేలితే ఉత్పత్తులు అమ్ముకోవచ్చని తెలిపింది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు మూడు ల్యాబరేటరీల్లో శాంపిల్స్‌ను పరీక్షించారని, ఈ నివేదికలు తమకు అందాయని నెస్లె సంస్థ ప్రతినిధులు చెప్పారు. మ్యాగీలో రసాయనాలను మోతాదుకు లోపే వాడినట్టు పరీక్షల్లో తేలిందని తెలిపారు. భారత ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాల సంస్థ నిబంధనల ప్రకారం నడుచుకుంటామని, మూడు ల్యాబరేటరీల్లో పరీక్షలు నిర్వహించిన తర్వాతే కొత్త మ్యాగీ న్యూడిల్స్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తామని చెప్పారు. -
రామ్‌దేవ్ నూడుల్స్ ఉండగా.. మిగతావి దండగ!
►ఆటా నూడుల్స్ విడుదల చేసిన పతంజలి ఆయుర్వేద ►సోషల్ మీడియాలో ఇప్పటికే రాందేవ్ నూడుల్స్ హల్చల్ ►మ్యాగీకి ఇది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అంటున్న యోగా గురు మ్యాగీ నూడుల్స్ నిషేధానికి గురైనప్పటి నుంచి పిల్లలకు స్నాక్ ఐటం ఏం పెట్టాలో తెలియక తికమక పడుతున్న తల్లులకు.. రెండు నిమిషాల్లో కడుపు నింపే ఆహారం దూరమైపోయిందని బాధపడుతున్న బ్యాచిలర్లకు తియ్యటి శుభవార్త. విదేశీ మ్యాగీకి ప్రత్యామ్నాయంగా ప్రముఖ యోగా గురు రామ్ దేవ్ బాబా.. స్వచ్ఛమైన స్వదేశీ ఆటా (గోధుమ పిండి) నూడుల్స్ తయారుచేయించి మార్కెట్ లోకి విడుదల చేశారు. ఇప్పటికే ఆయుర్వేద ఔషధాలు, ఆహార ఉత్పత్తులు, ఆరోగ్య రక్షణ ఉత్పత్తులు, పళ్లరసాలను ఉత్పతత్తి చేస్తున్న తమ సంస్థ పతంజలి ఆయుర్వేద లిమిటెడ్.. కొత్తగా ఆటా నూడుల్స్ తయారుచేస్తున్నదని, ఇందులో ఒక్క ఔన్సు కూడా మైదా(పిండి)ని కలపలేదని, ఇది మ్యాగీ స్థానంలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉండగలదని రామ్‌దేవ్ అన్నారు. గురువారం హరిద్వార్‌లోని తన ఆశ్రమంలో రామ్‌దేవ్ ఆటా నూడుల్స్ ఉత్పత్తుల విక్రయాలను ఆయన ప్రారంభించారు. కాగా, ఇప్పటికే వీటిని తిన్నవారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని చెప్పారు.. 'రామ్ దేవ్ ఆటా నూడుల్స్ ఉండగా విదేశీ మ్యాగీ ఎందుకు దండగ' అని. మోతాదుకు మించి సీసం, ఇతర రసాయనాలు ఉన్నాయని తేలడంతో దేశవ్యాప్తంగా మ్యాగీ నూడుల్స్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
అప్పుడు మ్యాగీ.. ఇప్పుడు యిప్పీ!
అలీగఢ్: మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం అంశం మరుగునపడ్తున్న నేపథ్యంలో.. తాజాగా మరో ప్రముఖ నూడుల్స్ బ్రాండ్ ‘యిప్పీ’ శాంపుల్స్లోనూ నిషేధిత సీసం(లెడ్) పరిమితికి మించి ఉందని తేలింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఉన్న వివిధ షాపుల నుంచి సేకరించిన యిప్పీ నూడుల్స్‌ను పరీక్షించిన యూపీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ(ఎఫ్‌డీఏ) ఈ మేరకు నిర్ధారించింది. ‘యిప్పీ’ ప్రముఖ దేశీయ సంస్థ ఐటీసీకి చెందిన నూడుల్స్ బ్రాండ్. సీసం పరిమితి 1 పీపీఎం లోపు ఉండాల్సి ఉండగా, యిప్సీలో అది 1.057పీపీఎంగా ఉందని తమ పరీక్షల్లో తేలిందని అలీఘడ్ డివిజన్ ఎఫ్‌డీఏ డివిజన్ హెడ్ చందన్ పాండే ఆదివారం తెలిపారు. దీనిపై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించి నిషేధిత పదార్ధాలు ఉన్న విషయం మొదట యూపీలోనే వెల్లడి కావడం విశేషం. అయితే, మ్యాగీ నూడుల్స్‌పై నిషేధాన్ని ఇటీవల బాంబే హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. మ్యాగీ నూడుల్స్‌ను మరోసారి పరీక్షించాలని ఆ కోర్టు ఆదేశించింది. -
మ్యాగీపై నిషేధం ఎత్తివేత
నెస్లే కంపెనీకి బాంబే హైకోర్టులో ఊరట ముంబై: నెస్లే కంపెనీకి తాత్కాలిక ఊరట లభించింది! మ్యాగీలో హానికర రసాయనాలున్నాయంటూ భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) దేశవ్యాప్తంగా విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు గురువారం ఎత్తేసింది. అయితే మ్యాగీ తాజా నమూనాలను హైదరాబాద్, జైపూర్, పంజాబ్‌లోని ఆహార పరీక్ష కేంద్రాలకు పంపాలని ఆదేశించింది. మ్యాగీలో హానికర లెడ్(సీసం) అనుమతించిన మోతాదు కన్నా తక్కువ ఉన్నట్లు ఈ పరీక్షల్లో తేలితే తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా మ్యాగీపై నిషేధం విధిస్తూ జూన్ 5న ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇచ్చిన ఆదేశాలతోపాటు రాష్ట్రంలో నిషేధం విధిస్తూ మహారాష్ట్ర ఆహార, ఔషధ విభాగం ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. నిషేధం విషయంలో సహజన్యాయ సూత్రాలను పాటించలేదని, తన వాదన చెప్పుకునేందుకు నెస్లేకు అవకాశం దక్కలేదని కోర్టు పేర్కొంది. మ్యాగీని పరీక్షించిన ల్యాబ్‌లు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ లాబొరేటరీస్‌కు అనుబంధ సంస్థలు కావంది. అన్ని రకాల నూడుల్స్ నుంచి ఐదు శాంపిళ్లను హైదరాబాద్, జైపూర్, పంజాబ్‌లలో ఎన్ఏబీఎల్ గుర్తించిన ల్యాబ్‌లకు పరీక్షల కోసం పంపాలంది. 6 వారాల్లో ల్యాబ్‌లు నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న ఆహార భద్రత సంస్థలు చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని కానీ, లేదని కానీ చెప్పలేమని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. -
మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం తొలగింపు
-
మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం తొలగింపు
ముంబయి : సంచలనం రేపిన మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తుల నిషేధం కేసులో నెస్లే సంస్థకు బాంబే హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. మ్యాగీ నూడుల్స్‌పై కోర్టు నిషేధాన్ని తొలగించింది. ఆరు వారాల పాటు మ్యాగీపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు కోర్టు గురువారం వెల్లడించింది. అలాగే మ్యాగీ నూడుల్స్ ను మరోసారి తాజాగా పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించింది. మ్యాగీ నిషేధం విషయంలో సహజ న్యాయ సూత్రాలను ప్రభుత్వం పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. మ్యాగీలో లెడ్ ధాతువులు పరిమితికి మించి ఉన్నాయన్న ప్రభుత్వ వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. ఆరు వారాల్లో ప్రతి అయిదు శ్యాంపుల్స్ను ...మూడు ల్యాబ్‌ల్లో పరీక్షలకు పంపించాలని నెస్లే కంపెనీని బాంబే హైకోర్టు ఆదేశించింది. ల్యాబ్ నివేదికలు వచ్చిన అనంతరం తదుపరి విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది. అంతేకాకుండా అప్పటివరకూ మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను, తయారీ చేయకూడదని కోర్టు ఆదేశించింది. కాగా హైదరాబాద్, జైపూర్, మొహాలీ ల్యాబ్‌లలో మ్యాగీకి పరీక్షలు నిర్వహించనున్నారు. -
మాకు మ్యాగీ నూడుల్స్ తో ఇబ్బందేమీ లేదు!
న్యూఢిల్లీ: భారత్ లో నెస్లీ ఇండియాకి చెందిన మ్యాగీ న్యూడుల్స్ పై నిషేధం కొనసాగుతుండగా, అమెరికా మాత్రం మ్యాగీ వాడకంపై సానుకూలంగా స్పందిస్తోంది. తాము తాజాగా చేసిన పరీక్షల్లో మ్యాగీలో ఎటువంటి హానికర రసాయనాలు లేనట్లు అమెరికా పేర్కొంది. మ్యాగీ న్యూడుల్స్ లో సీసం శాతం తగినంతగానే ఉన్నట్లు పేర్కొంది. మ్యాగీకి చెందిన అనేక రకాలైన శాంపిల్స్ ను తీసుకుని చేసిన పరీక్షల్లో ఈ విషయం స్పష్టమైందని యూఎస్ ఎఫ్ డీఏ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. దీంతో అమెరికాలో మ్యాగీ అమ్మకాలు యథావిధిగానే కొనసాగుతున్నట్లు ఓ ఈమెయిట్ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మ్యాగీ వాడకం వల్ల తమ ప్రజలు హానికర రసాయనాల బారిన పడుతున్నట్లు తమ ఎఫ్ డీఏ పరీక్షల్లో నిర్ధారణ కాలేదని తెలిపారు. ఇదిలా ఉండగా నెస్లీ ఇండియా అనుచిత వ్యాపారాలకు పాల్పడినట్లు భారత్ లో కేసు నమోదైంది. లేబుళ్ల మీద తప్పుడు వివరాలు ఇవ్వడమే కాకుండా తప్పుదోవ ప్రకటించే ప్రకటనలు చేశారని.. వీటన్నింటి దృష్ట్యా దేశానికి జరిగిన నష్టానికి గాను రూ. 640 కోట్లు కట్టాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆశ్రయించింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చిన దాదాపు మూడు దశాబ్దాల్లో ఓ కంపెనీపై ప్రభుత్వ శాఖ ఇలా కేసు పెట్టడం ఇదే తొలిసారి. మ్యాగీ నూడుల్స్‌లో సీసంతో పాటు ఎంఎస్‌జీ (మోనోసోడియం గ్లూటామేట్) ఎక్కువ స్థాయిలో ఉన్నాయంటూ ఆరోపణలు రావడంతో చాలా రాష్ట్రాలు దాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. -
మ్యాగీ.. మీరు 640 కోట్లు కక్కండి!
నెస్లె ఇండియా విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అనుచిత వ్యాపారాలు చేశారని, లేబుళ్ల మీద తప్పుడు వివరాలు ఇచ్చారని, తప్పుదోవ ప్రకటించే ప్రకటనలు చేశారని.. వీటన్నింటి దృష్ట్యా దేశానికి జరిగిన నష్టానికి గాను రూ. 640 కోట్లు కట్టాలని కేసు దాఖలు చేసింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ వద్ద కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ తొలిసారిగా ఓ కంపెనీపై కేసు పెట్టింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చిన దాదాపు మూడు దశాబ్దాల్లో ఓ కంపెనీపై ప్రభుత్వ శాఖ ఇలా కేసు పెట్టడం ఇదే తొలిసారి. మ్యాగీ నూడుల్స్‌లో సీసంతో పాటు ఎంఎస్‌జీ (మోనోసోడియం గ్లూటామేట్) ఎక్కువ స్థాయిలో ఉన్నాయంటూ ఆరోపణలు రావడంతో చాలా రాష్ట్రాలు దాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఈ కేసు దాఖలైంది. ఇంతకుముందు తాము నెస్లె కంపెనీపై కేసు పెట్టాలని సూచించామని, ఇప్పుడు తామే కేసు పెట్టామని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తెలిపారు. -
'మ్యాగీకి క్లీన్చిట్ ఇవ్వలేదు'
మ్యాగీ నూడుల్స్ విషయంలో తాము ఇంతవరకు నెస్లె ఇండియా కంపెనీకి ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదని భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ తెలిపింది. కర్ణాటకలోని ఓ ల్యాబ్ మ్యాగీ సురక్షితమేనని చెప్పినా కూడా.. జూన్ 5వ తేదీన మ్యాగీపై తాము విధించిన నిషేధం ఇప్పటికీ అమలులోనే ఉన్నట్లు స్పష్టం చేసింది. వాస్తవానికి అసలు ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ మ్యాగీ నూడుల్స్‌కు ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వనే లేదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. యూకే, సింగపూర్ దేశాల్లో చేయించామని చెబుతున్న పరీక్షల వివరాలను నెస్లె ఇండియా కంపెనీ ఇంతవరకు తమకు ఇవ్వలేదని అన్నారు. అయితే... నెస్లె కంపెనీ మాత్రం ఆయా దేశాల్లో చేసిన పరీక్షల్లో మ్యాగీ తినేందుకు సురక్షితమేనని తేలినట్లు చెబుతోంది. -
నెస్లే సంస్థకు ఊరట..
న్యూఢిల్లీ : ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెస్లే సంస్థకు కొంత ఊరట లభించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ మాగీ న్యూడుల్స్ సురక్షితమేనని క్లీన్ చిట్ ఇచ్చింది. కేంద్ర ఆహార పరిశోధన సంస్థ శాంపిల్ టెస్టులో ప్రమాణాలు పాటించినట్లు గుర్తించింది. గోవా ఎఫ్‌డీఏ పంపించిన ఐదు శాంపిల్స్‌ను పరీక్షించి గత జూన్ లో మ్యాగీ న్యూడుల్స్పై నిషేధం విదించిన విషయం విదితమే. ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలు 2011 పాటించిన నేపథ్యంలో తాజాగా మైసూర్ ల్యాబోరేటరీలో జరిపిన టెస్టుల ద్వారా వీటికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు గోవా ఎఫ్‌డీఏ డైరక్టర్ సలీం ఏ వెల్జీ తెలిపారు. -
మ్యాగీ మళ్లీ రావాలి.. తెస్తాం
కొన్ని నెలల క్రితం మ్యాగీపై నిషేధం అనగానే.. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం చెలరేగింది. కానీ ఇప్పుడు మళ్లీ దాన్ని మార్కెట్లలోకి తీసుకురావాల్సి ఉందని నెస్లె ఇండియా కొత్త అధినేత సురేష్ నారాయణన్ అంటున్నారు. స్విస్ సంస్థ అయిన నెస్లెకు భారత విభాగానికి అధినేతగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఈ అంశంపై మాట్లాడారు. ప్రస్తుతానికి మ్యాగీ వివాదం కోర్టులో ఉంది కాబట్టి తాను దాని గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, కోర్టు తీర్పును బట్టి తాము మళ్లీ మ్యాగీని మార్కెట్లలోకి ఎలా తీసుకురావాలో చూస్తామని ఆయన అన్నారు. జూలై 25వ తేదీన నెస్లె ఇండియాకు ఎండీగా ఉన్న ఎటైన్ బెనెట్ పదవి నుంచి దిగిపోయారు. నారాయణన్ (55) శనివారం నాడు ఆ సంస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. డెయిరీ ఉత్పత్తులు, చాక్లెట్లు.. ఇలా అన్నింటి అమ్మకాలను పెంచడం ద్వారా తమ మార్కెట్‌ను వృద్ధి చేసుకోడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. మ్యాగీ పయనం కూడా కొనసాగుతుందని.. దాంతో పాటే ఇతర విభాగాలపై కూడా దృష్టి సారిస్తామని నారాయణన్ అన్నారు. ఇన్నాళ్లూ ఫిలిప్పీన్స్‌లో చైర్మన్‌గా ఉన్న ఆయన.. ప్రత్యేకంగా భారతదేశానికి ఈ బాధ్యతల కోసమే వచ్చారు. -
మ్యాగీ నూడుల్స్ ధ్వంసానికి నెస్లె రూ.20 కోట్లు ఖర్చు
న్యూఢిల్లీ : నెస్లె ఇండియా మ్యాగీ ఇన్స్టంట్ నూడుల్స్‌ను ధ్వంసం చేయడానికి అంబుజా సిమెంట్ కు రూ.20 కోట్లను చెల్లించింది. దీంతో అంబుజా సిమెంట్ మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్స్‌ను చంద్రాపూర్‌లోని (మహారాష్ట్ర) తన ప్లాంటులో తగలబెట్టనుంది. దాదాపు రూ.320 కోట్ల విలువైన 9 వేరియంట్ల మ్యాగీ నూడుల్స్‌ను ధ్వసం చేస్తామని నెస్లె గత నెలలోనే ప్రకటించింది. -
రూ.350 కోట్ల నుంచి రూ.30 కోట్లకు!
ఢిల్లీ: భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిషేధం ఎదుర్కొంటున్న మ్యాగీ ఇన్ స్టెంట్ న్యూడుల్స్ అమ్మకాలు దేశంలో భారీ స్థాయిలో పడిపోయాయి. భారత్ లో మ్యాగీ నూడుల్స్ పై నిషేధం విధించడంతో దాదాపు 90 శాతం అమ్మకాలను తాము కోల్పోయినట్లు పరిశ్రమ వర్గాలు స్పష్టం చేశాయి. గత నెల నుంచి పోలిస్తే మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు రూ.320 కోట్లకు తగ్గినట్లు పేర్కొన్నాయి. మ్యాగీ ఉత్పత్తులపై నిషేధానికి ముందు రూ.350 కోట్ల అమ్మకాలుంటే.. ఆ అమ్మకాల విలువ నెల వ్యవధిలోనే రూ.30 కోట్లకు పడిపోయింది. మ్యాగీపై నిషేధానికి ముందు దాని అమ్మకాల ద్వారా వచ్చే వార్షికాదాయం రూ.4,200 కోట్లు ఉండగా నెలసరి అమ్మకాలు విలువ రూ. 350 కోట్లు. వినియోగ దారుల్లో నెలకొన్న భయంతోనే మ్యాగీ నూడుల్స్ అమ్మకాల విలువ గణనీయంగా తగ్గిపోయినట్లు ఆ సంస్థకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో పాటు భారత్ లో ఆహార ఉత్పత్తి చేసే పరిశ్రమలపై భద్రతాధికారుల వేధింపులు ఎక్కువగా ఉన్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు. -
విదేశాల్లో మ్యాగీ నూడుల్స్‌కు క్లీన్చిట్
లండన్: భారత్‌లో నిషేధానికి గురైన మ్యాగీ ఉత్పత్తుల అమ్మకాలకు విదేశాల్లో చిక్కులు తొలగిపోతున్నాయి. మ్యాగీ ఉత్పత్తులకు ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వగా, తాజాగా కెనడా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కష్టాల్లో ఉన్న మ్యాగీ ఉత్పత్తుల సంస్థ నెస్లేకిది ఉపశమనం లభించే వార్త. మ్యాగీ ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం కాదని కెనడా ఆహార తనిఖీ సంస్థ (సిఎఫ్ఐఏ) వెల్లడించింది. మ్యాగీ ఉత్పత్తులను ల్యాబ్‌లో పరీక్షించిన అనంతరం సిఎఫ్ఐఏ ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. సింగపూర్ ప్రభుత్వం కూడా మ్యాగీ నూడిల్స్‌కు సురక్షితమని ప్రకటించింది. మ్యాగీ ఉత్పత్తులు సురక్షితమని, వీటిని తినడం ఎలాంటి హానికరం కాదని బ్రిటన్ ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఏ) సర్టిఫికెట్ ఇచ్చింది. భారత్‌లో తయారు చేసిన ఈ ఉత్పత్తులు యూరోపియన్ యూనియన్ అనుమతించిన స్థాయి మేర ఉన్నాయని పేర్కొంది. మ్యాగీ నూడుల్స్ లో సీసం(లెడ్), మోనో సోడియం గ్లూటామేట్(ఎంఎస్‌జీ) అనే హానికర రసాయనాలు పరిమితికి మించి ఉన్నాయని భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) తనిఖీల్లో రుజువుకావడంతో జూన్ 5న కేంద్ర ప్రభుత్వం నిషేధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకానొక దశలో మ్యాగీ ఉత్పత్తులన్నింటినీ ధ్వంసం చేయాలనే డిమాండ్ వెల్లువెత్తడంతో అలా చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని, విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతించాలని నెస్లే సంస్థ కోర్టును ఆశ్రయించింది. భారత్‌లో నిషేధానికి గురైన మ్యాగీ ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతించాలన్న నెస్లే అభ్యర్థనకు బాంబే హైకోర్టు అంగీకారం తెలిపింది. -
మాగీ యాగీ
వ్యాపారానికి విశ్వాసం పెట్టుబడి. మనకు తెలియని సమాచారాన్ని, మనకు తెలిసిన, మనం అభిమానించిన వ్యక్తి తెలియచేయడమే ప్రక టన. బజారులో అమ్మే మిఠాయి తినవద్దంది అమ్మ. అటు వేపు కూడా చూడం. బజారులో ఉన్న ఫలానా పకోడీ బాగుంటుందన్నాడు పక్కింటాయన. ‘ఆయనెవరయ్యా చెప్పడానికి?’ అంటాం. ఇంకా, పక్కింటాయన మీద కోపం ఉంటే పకోడీ తిని మరీ ఆయన మాట తప్పని నిరూపిస్తాం. ప్రకటనకు పెట్టుబడి ఆ పెద్దమనిషి పరపతి. ‘పెద్దమనిషి’ అంటున్నాను కాని, ‘సినీ నటుడు’ అనడం లేదు. కారణం ఈ మధ్య ఎస్.పి. బాలసుబ్రహ్మ ణ్యం, సిరివెన్నెల, మనూ కూడా ప్రకటనల్లో పాల్గొంటున్నారు. ఆయా వ్యక్తుల పట్ల ప్రజల అభిమానం, విశ్వాసం ఆ ప్రకటనకు దన్ను. పిండికొద్దీ రొట్టె. మరీ బొత్తిగా ముఖం తెలియని వ్యక్తులతో ప్రకటనలు- చాలా సందర్భాలలో వారి అందమో, మాటలో ఆటలో చమత్కారమో కారణం కావచ్చు. కత్రినా కైఫ్, జెనీలియా, ప్రీతీ జింటా మొదలైనవారు ప్రకటనల ద్వారా వెండితెరకు వచ్చినవారు. ఇర్ఫాన్ ఖాన్, ఓం పురీ లాంటి వాళ్లు వెండితెర ద్వారా ప్రకటనలలో జొర బడినవారు. దేనికైనా పరపతి, ప్రచారమే ముఖ్యం. బొత్తిగా ప్రకటనల వ్యవహారం తెలియనివారు కొందరు ఈ మధ్య నన్ను అడిగారు: ‘‘అయ్యా! ఒక నిముషం ప్రకటన సినీమాలో నటించడానికి అంత డబ్బు ఎందుకండీ?’’ అని. చూడడానికి ఇది విపర్యంలాగే కని పిస్తుంది. కాని ఇందులో తిరకాసు ఉంది. బండగా చెప్పాలంటే ‘సినీమా’ నూనె తయారు చేసే గానుగ. ప్రకటన- సీలు వేసి నూనెను సూపర్ మార్కెట్లో అమ్మే దుకాణం. సినీమా పెట్టుబడి. ప్రకటన కరెన్సీ. ప్రకట నకు ఎక్కువ డబ్బు ఇచ్చేది - వ్యవధిని బట్టి కాదు. ఆ వ్యక్తి పరపతిని బట్టి. ‘‘మీరు ఖరీదు చేసేది ఆ నిమిషాన్ని కాదు. డబ్బు చేసుకొనేది - మున్ఫై సంవత్సరాలు ఆ నటుడు కూడబెట్టుకున్న పరపతిని. అమితాబ్ బచ్చన్ చేతిలో కొంగమార్కు పళ్లపొడి పొట్లం ఉంటే కోటి మంది దాన్ని గుర్తిస్తారు. అప్పలకొండ అనే వ్యక్తి చేతిలో ప్రపంచ ప్రఖ్యాత టూత్‌పేస్ట్ ట్యూబు ఉంటే పక్కవాడు కూడా గుర్తించడు. ఎన్.టి. రామారావుకి వేసే ఓటు ఆయన నిరూపించిన ఒక జీవితకాలపు సంప్రదాయం పట్ల చూపే విశ్వాసం. స్క్రీన్‌ప్లే రచనలో బండసూత్రం- తెలియని విషయాన్ని తెలిసిన మార్గంలో పరిచయం చెయ్యాలి. మరొక్కసారి - గుర్తింపుకి ‘విశ్వాసం’ పెట్టుబడి. కావాలనే ఈసారి ‘వ్యాపారం’ అనడం లేదు. అమితాబ్ బచ్చన్ తెరమీద తొడుక్కోమన్న చెప్పుల్ని మనం తొడుక్కుంటున్నామంటే అర్థం-మనకి తెలిసిన, మనం అభిమానించే, మనం నమ్మిన ఓ వ్యక్తి మన లాగే ఆ పని చేసి తృప్తి చెందాడు కనుక. అమితాబ్ బచ్చన్ చెప్పుల తయారీలో డిగ్రీ సంపాదించినవాడని కాదు. ‘‘ఈ కారు అద్భుతం’’ అని మనకు తాళాలు చూపించే హిందీ నటుడు షారుక్‌ఖాన్‌ని ‘‘ఏమయ్యా! నువ్వెప్పుడైనా ఆటోమొబైల్ కోర్సు చేశావా?’’ అని ఎవరైనా అడిగారా? ఇప్పుడు అసలు కథ. అలా అడగాలా? వద్దా? దేశ మంతా ఆవురావురుమని తింటున్న మాగీ నూడుల్స్ గొప్పవని, మంచివని ముగ్గురు తారలు మనకు చెప్పా రు. అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతీ జింటా. గత 30 సంవత్సరాలుగా దేశమంతా తింటోంది. ఇప్పు డు మాగీ నూడుల్స్‌ను చాలా రాష్ట్రాలు బహిష్కరించా యి. నెస్లే సంస్థే ఆ సరుకుని ఈ దేశం నుంచి ఉపసంహరించింది. ఇందులో సినీతారల బాధ్యత ఎంతవరకు ఉంది? ప్రపంచమంతటా వ్యాపారం చేస్తున్న ఓ కార్పొరేట్ సంస్థ సరుకుని ఆ సంస్థ పరపతి దృష్ట్యా అంగీకరించి- బోలెడంత డబ్బు పుచ్చుకుని ప్రకటనలు ఇవ్వడం ఎంత వరకు సమంజసం? ఇందులో మోనోసోడియం గ్లుటా మేట్ పాలు ఎక్కువ కావడం వల్ల రక్తహీనత, మోతాదు మరీ మించితే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని అమి తాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతీ జింటా తెలుసు కోవలసిన అవసరం ఎంతవరకు ఉంది? వారి మీద కేసులు నమోదయ్యాయి. తీరా వాద ప్రతివాదాలు జరుగుతాయి. తమ విశ్వాసాన్ని పెట్టుబ డిగా వ్యాపారం చేస్తున్న ఒక వ్యాపారి సరుకుని ఏమాత్రం మంచిచెడ్డలు తెలుసుకోకుండా సమర్థించడం నేర మే కదా! అయితే 30 సంవత్సరాలు తెలుసుకోవలసిన, తెలియజెప్పవలసిన జాతీయ సంస్థకే ఈ నిజం తెలియలేదు కదా! అయితే అది సమర్థించుకునే ‘కారణం’ అవుతుందా? విశ్వాసాన్ని పెట్టుబడిగా వినియోగించుకుంటున్న వ్యాపారికీ, దాన్ని డబ్బు చేసుకుంటున్న ‘సినీతార’కీ సామాజిక బాధ్యతల పాళ్లు ఎంతవరకూ ఉన్నాయి? ఇది నీతికీ, న్యాయానికీ, చట్టానికీ కొరుకుడు పడని విచికిత్సే. విచారణ, న్యాయవాదుల వాదనలూ ఆసక్తిక రంగా ఉండక తప్పవు. (రచయిత: గొల్లపూడి మారుతీరావు) -
మ్యాగీ నూడుల్స్‌కు బ్రిటన్ క్లీన్చిట్
లండన్: భారత్‌లో నిషేధానికి గురైన మ్యాగీ ఉత్పత్తుల సంస్థ నెస్లేకు గొప్ప ఉపశమనం లభించింది. మ్యాగీ ఉత్పత్తులకు బ్రిటన్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చింది. మ్యాగీ ఉత్పత్తులు సురక్షితమని, వీటిని తినడం ఎలాంటి హానికరం కాదని బ్రిటన్ ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఏ) సర్టిఫికెట్ ఇచ్చింది. భారత్‌లో తయారు చేసిన ఈ ఉత్పత్తులు యూరోపియన్ యూనియన్ అనుమతించిన స్థాయి మేర ఉన్నాయని పేర్కొంది. మ్యాగీ నూడిల్స్ శాంపిల్స్‌ను పరీక్షించిన అనంతరం బ్రిటన్ ఎఫ్ఎస్ఏ నివేదిక రూపొందించింది. మ్యాగీ తయారీలో స్థాయి మేరకు పదార్థాలను వాడారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వినియోగదారులకు భరోసా ఇచ్చింది. మ్యాగీ నూడుల్స్ లో సీసం(లెడ్), మోనో సోడియం గ్లూటామేట్(ఎంఎస్‌జీ) అనే హానికర రసాయనాలు పరిమితికి మించి ఉన్నాయనిని భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) తనిఖీల్లో రుజువుకావడంతో జూన్ 5న కేంద్ర ప్రభుత్వం నిషేధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకానొక దశలో మ్యాగీ ఉత్పత్తులన్నింటినీ ధ్వంసం చేయాలనే డిమాండ్ వెల్లువెత్తడంతో అలా చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని, విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతించాలని నెస్లే సంస్థ కోర్టును ఆశ్రయించింది. భారత్‌లో నిషేధానికి గురైన మ్యాగీ ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతించాలన్న నెస్లే అభ్యర్థనకు బాంబే హైకోర్టు అంగీకారం తెలిపింది. -
మ్యాగీ నూడుల్స్ ఎగుమతులకు కోర్టు అంగీకారం
ముంబై: సంచలనం రేపిన మ్యాగీ ఉత్పత్తుల నిషేధం కేసులో నెస్లే సంస్థకు కాస్తలో కాస్త ఊరట లభించింది. ఇప్పటికే భారత్‌లో నిషేధానికి గురైన మ్యాగీ ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతించాలన్న నెస్లే అభ్యర్థనకు బాంబే హైకోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు మంగళవారం తీర్పును వెలువరించింది. మ్యాగీ నూడుల్స్ లో సీసం(లెడ్), మోనో సోడియం గ్లూటామేట్(ఎంఎస్‌జీ) అనే హానికర రసాయనాలు పరిమితికి మించి ఉన్నాయనిని భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) తనిఖీల్లో రుజువుకావడంతో ఆ ఉత్పత్తులపై జూన్ 5న కేంద్ర ప్రభుత్వం నిషేధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకానొక దశలో మ్యాగీ ఉత్పత్తులన్నింటినీ ధ్వసం చేయాలనే డిమాండ్ వెల్లువెత్తడంతో అలా చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని, విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతించాలని నెస్లే సంస్థ కోర్టును ఆశ్రయించింది. -
మన దేశం నుంచి మరో నూడుల్స్ ఔట్!
మ్యాగీ వివాదం తర్వాత భారతీయ మార్కెట్ల నుంచి తమ నూడుల్స్‌ను ఉపసంహరించుకోవాలని మరో బహుళ జాతీయ కంపెనీ నిర్ణయించుకుంది. ఇండో నిస్సాన్ కంపెనీ తమ 'టాప్ రామెన్' బ్రాండు నూడుల్స్‌ను ఇక్కడి మార్కెట్ల నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ఆహార భద్రతా నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి అందిన ఉత్తర్వుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల ఆరంభంలో మ్యాగీ నూడుల్స్‌ను నెస్లె కంపెనీ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుని, వాటిని ధ్వంసం చేయాల్సి వచ్చింది. హిందుస్థాన్ యూనిలీవర్ కూడా తమ 'నార్' ఇన్స్టెంట్ నూడుల్స్‌ను ఇలాగే ఆహార భద్రతా కారణాల రీత్యా ఉపసంహరించుకుంది. భారతదేశంలో అమ్ముతున్న అన్ని బ్రాండుల ఇన్స్టెంట్ నూడుల్స్‌ను పరీక్షించాలని ఆహారభద్రతా సంస్థ నిర్ణయించింది. వాటిలో మోనోసోడియం గ్లూటామేట్ (ఎంఎస్‌జీ)తో పాటు సీసం పరిమాణాల్ని కూడా పరీక్షించారు. దాంతో క్రమంగా ఒక్కో కంపెనీకి సమాచారం అందడం, వాళ్లు తమ నూడుల్స్‌ను ఉపసంహరించడం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా టాప్ రామెన్ వంతు వచ్చింది. నూడుల్స్‌తో పాటు పాస్తాలు, మాకరోని బ్రాండులన్నింటినీ ఆహార భద్రతా సంస్థ పరీక్షించింది. నెస్లె ఇండియా, ఐటీసీ, ఇండో నిస్సిన్ ఫుడ్ లిమిటెడ్, జీఎస్కే కన్స్యూమర్ హెల్త్‌కేర్, సీజీ ఫుడ్స్ ఇండియా, రుచి ఇంటర్నేషనల్, ఏఏ న్యూట్రిషన్ తదితర సంస్థలు వీటిని తయారుచేస్తున్నాయి. నెస్లె ఇప్పటివరకు రూ. 320 కోట్ల విలువైన మ్యాగీ ప్యాకెట్లను ధ్వంసం చేసింది. -
2 మినిట్స్ యాగీ..!మ్యాగీ మాయ
‘‘రకరకాల బ్రాండ్స్‌కు ప్రచారం చేస్తున్నప్పుడు స్టార్స్ కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిందే! లక్షల మంది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని తెలిసీ కొంతమంది స్టార్స్ పాన్‌మసాలాలు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, ఆల్కహాల్ ఉత్పత్తులకు ఎలా ఎండార్స్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మరికొన్ని కోట్లు సంపాదన కోసం అలా ఎలా జనాన్ని తప్పుదోవ పట్టిస్తాం’’ అంటున్నారు ప్రముఖ నటి రవీనా టాండన్. 1990లలో కథానాయికగా ఉత్తరాది తెరను ఉర్రూతలూగించడంతో పాటు అడపా దడపా మన తెలుగుతో సహా దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు రవీనా. ఇప్పుడు సినిమాకి కీలకంగా నిలిచే పాత్రలు చేస్తున్నారు. సినిమాల సంగతెలా ఉన్నా, వాణిజ్య ప్రకటనల్లో మాత్రం తరచూ తెరపై మెరుస్తున్నారు రవీనా. దాదాపు డజను ఉత్పత్తులకు ఆమే ప్రచారకర్త. తాజా ‘మ్యాగీ’ నూడుల్స్, ఆ ఉత్పత్తులకు ప్రచారం చేసిన తారలపై వివాదం నేపథ్యంలో ఈ ఎండార్స్మెంట్ల గురించి కదిలిస్తే, రవీనా టాండన్ కాస్తంత ఘాటుగానే స్పందించారు. అది ఆమె మాటల్లోనే... ఓ ఉత్పత్తి నాణ్యత ఏ పాటిదో నిర్ణయించి, దాన్ని మార్కెట్లో అమ్మడానికి అనుమతినిచ్చేది ప్రభుత్వమే. కొన్ని ఆహార పదార్థాలను ప్రభుత్వమే ఆమోదించినప్పుడు, మేము ప్రచారకర్తలుగా చేస్తే అందులో తప్పేముంది? ‘మ్యాగీ’ వ్యవహారంలో దానికి ప్రచారకర్తలుగా వ్యవహ రించిన స్టార్స్ మీద కేసులు వేయడం సరైన పని కాదు. దాదాపు 25, 30 ఏళ్లుగా మ్యాగీ మార్కెట్లో ఉంది. ప్రభుత్వ ఆమోదంతోనే ఆ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. మరి, ఇన్నేళ్లూ దాని నాణ్యత గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ప్రభుత్వమే ఆమోదించింది కాబట్టి, తారలు కూడా ప్రమోట్ చేశారు. తీరా, ఇప్పుడు హఠాత్తుగా నిద్ర లేచి, ఆ ఉత్పత్తుల్లో నాణ్యత లేదంటూ, మమ్మల్ని నిందిస్తే మేమేం చేస్తాం? పదిహేడేళ్ళ వయసులోనే వాణిజ్య ప్రకటనల్లో నటించడం మొదలుపెట్టా. తొలిరోజుల్లో ఒక్కో యాడ్‌కీ నాకు దక్కిన పారితోషికం ఐదువందల రూపాయలు. అప్పట్లో నేను ఏ ఉత్పత్తికి ప్రచారకర్తగా వ్యవహరించాలన్న దాని దగ్గర నుంచి ఆర్థిక లావాదేవీల దాకా అంతా మా నాన్నగారే చూసుకునేవారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా... సిగరెట్లు, మద్యం లాంటి అనారోగ్యకరమైన వాటికి నేనెన్నడూ ప్రచారం చేయలేదు. అయినా ప్రచారం చేస్తున్న స్టార్‌కు అన్నీ ఎలా తెలుస్తాయి. త్వరలో ఓ ‘యోగర్ట్’ (పెరుగు) ఉత్పత్తికి ప్రచారకర్తగా వ్యవహరించనున్నా. తాజా పరిణామాల నేపథ్యంలో దాని నాణ్యత తెలుసుకోవాలనుకున్నా. ఆ ఉత్పత్తిదారులు నాకు ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చారు. కానీ, ఆ రిపోర్ట్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి నేనేం శాస్త్రవేత్తను కాదు కదా! అందుకని ఒక దశ దాటాక, ఉత్పత్తిదారులు చెబుతున్న మాటల్ని నమ్మాల్సి ఉంటుంది. ఏమైనా ప్యాకేజ్డ్ ఫుడ్స్, టిన్ ఫుడ్స్ ఆరోగ్యానికి అంత మంచివి కావు. మార్కెట్లోకి ఇవి రావడం మొదలయ్యాకే ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని నా ఫీలింగ్. కానీ, ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. సహజమైన ఆహారం తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఇది మంచి పరిణామం. కంపెనీ ఫేస్ వ్యాల్యూను బట్టి ఎవరమైనా నమ్మేస్తాం. కానీ, ఇక నుంచి నేను కూడా ఏ ఉత్పత్తికి ప్రచారం చేస్తున్నా మరింత జాగ్రత్త తీసుకోదలిచా! -
రూ.320 కోట్ల నూడుల్స్ ధ్వంసం
న్యూఢిల్లీ : మ్యాగీ నూడుల్స్‌ను నిషేధించడంతో రూ.320 కోట్ల విలువైన నూడుల్స్‌ను ధ్వంసం చేస్తున్నట్లు నెస్లే ఇండియా వెల్లడించింది. మార్కెట్, ఫ్యాక్టరీల్లోని నిల్వలను ఉపసంహరించుకుని, ధ్వంసం చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు నిన్న తెలిపింది. మార్కెట్, వ్యాపార భాగస్వాముల వద్ద ప్రస్తుతం రూ.210 కోట్ల విలువైన నిల్వలు ఉన్నాయని, ఫ్యాక్టరీలు, పంపిణీ కేంద్రాల్లో మరో రూ.110 కోట్ల విలువైన నిల్వలు ఉన్నాయని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కి వెల్లడించింది. మ్యాగీ నూడుల్స్ లో సీసం, రుచిని పెంచే మోనోసోడియం గ్లుటామేట్ స్థాయిలు పరిమితి కంటే ఎక్కువగా ఉండటంతో భారత ఆహార భద్రతా ప్రమాణ సంస్థ ఈ నెల 5న నిషేధం విధించి, వాటిని మార్కెట్ నుంచి వాపసు తీసుకోవాలని ఆదేశించడం, నిషేధంపై స్టే ఇవ్వడానికి బాంబే హైకోర్టు నిరాకరించడం తెలిసిందే. దాంతో వెనక్కి తీసుకున్న మ్యాగీ నూడుల్స్ నిల్వలను అయిదు సిమెంట్ ఫ్యాక్టరీలలో కాల్చివేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. -
ఒకటి మమ్మీ, రెండు మ్యాగీ..
అక్షర తూణీరం ‘‘జీవితానికి కావల్సినవి రెండే రెండు. ఒకటి మమ్మీ, రెండు మ్యాగీ’’ అని ఒక తరం ప్రగాఢంగా నమ్ముతున్న తరుణం లో ఒక్కసారి తేడా పడింది. అసలు మన దేశంలో యింతే. ఏదైనా సరే, బావుందిలే అని మొదలు పెట్టి అలవాటు పడగానే -అది తింటేనో తాగితేనో అయి పోతారంతేనంటూ వార్నింగులు వస్తాయి. అమెరికన్ కోడి వేపుడు ముక్కలు తింటే కిడ్నీలు, కళ్లు పోతాయంటున్నారు. మనకి ఏదొచ్చినా విడ్డూరమూ, విపరీతమే. సిగరెట్టు తయారీని పరిశ్రమగా గౌరవిస్తారు. పొగాకు పంటని ప్రో త్సహిస్తారు. సిగరెట్లు కాల్చడం హానికరమని టాంటాం వేస్తారు. ఎక్కడంటే అక్కడ పొగ తాగరాదంటారు. చిల్లరగా ఒకటీ అరా అమ్మకానికి దొరకవు. టోకున ప్యాకెట్ కొనుక్కోవల్సిందే. మళ్లీ బీడీల జోలికి వెళ్లరు. అక్కడ పుర్రె బొమ్మ పెట్టడానికి భయపడతారు. ఎందుకంటే బీడీ తయారీ ఒక పెద్ద కుటీర పరిశ్రమ. పొగాకుని కూడా గంజాయిని నిషేధించినట్లు పూర్తిగా పక్కన పెట్టచ్చు. దేనికైనా చిత్తశుద్ధి వుండాలి. మా నాయనమ్మ నవగ్రహాలకి ఒక్క కొబ్బరి కాయ చాలు, విడివిడిగా తొమ్మిది అక్కర్లేదని అరిచి కేకలు పెట్టి మరీ చెబుతుండేది. మన ప్రభుత్వాలవి కూడా నాయనమ్మ ఆలోచనలే. నిజంగానే ప్రజల ఆరోగ్యం కాపాడాలనే చిత్త శుద్ధి ఉంటే, ముందస్తుగా మన మంచినీళ్లను నిషేధించాలి. పాలు, పెరుగు, బియ్యం, నెయ్యి, కూరగాయ-సమస్తం రసాయన కలుషితం. ఆఖరికి అరటిపళ్లను, మామిడిపళ్లను భయం కరమైన కెమికల్స్‌లో ముందే పండించి సిద్ధం చేస్తున్నారు. మనం తాగే ఎన్ని శీతల పానీయాలు స్వచ్ఛమైనవి? పాన్ సుపారి, గుట్కా నమలచ్చా? అసలిప్పుడు సెల్‌ఫోన్ అత్యంత ప్రమాదభరితమై పోయింది. సెల్‌ఫోన్ దేశ ఆర్థిక, రాజకీయ, సాంఘిక, నైతిక అంశాలపై దుష్ర్పభావాన్ని చూపిస్తోంది. అంతమాత్రం చేత నిషేధిస్తామా అంటే, మరి చిత్తశుద్ధి ఉంటే నిషేధించాల్సిందే. మనం శుక్రనీతిని పాటిస్తాం. ప్రాణవిత్త మానములకు భంగం వాటిల్లినప్పుడు బొంకవచ్చు అని రాక్షస గురువు స్పష్టంగా చెప్పాడు. మనం కూడా ఆ గణంలో వాళ్లమే కాబట్టి అటువైపు మొగ్గుతున్నాం. లేకపోతే, మద్యం ఎందుకు నిషేధించరు? కల్లుపై ఎందు కు నిఘా పెట్టరు? ఇదంతా ఒక తీరు అయితే మ్యాగీ నుంచి కోడిగుడ్డు దాకా ప్రచారకులుగా నిలబడే పెద్ద మనుషులు కొందరు. సామాన్య ప్రజలే వారిని సెలెబ్రిటీలను చేస్తారు. వారా ముఖం తొడుక్కొ ని అనేక చెత్త సందర్భాలకు బ్రాండ్ దూతలుగా నిలబడి సొమ్ము చేసుకుంటారు. దీన్నే విధి వైపరీత్యం అంటారు. ఫలానా వారి బంగారు ఆభరణాలకు ఒకాయన భరోసా యిస్తుంటాడు. ఇంకో రియల్ ఎస్టేట్ గొప్పతనాన్ని మరొకాయన వల్లిస్తుంటాడు. చిట్‌ఫండ్ కంపెనీలకి, రుణ సౌకర్యాలకు పక్కన నిలబడి వాళ్లేం చెప్పమంటే అవి చెప్పేసి సొమ్ములు చేసుకుంటారు. మన దురదృష్టం కొద్దీ కొన్ని విలువలు మూలాల్లోనే సడలిపోయాయి. విచిత్రమేమంటే యీ మహానుభావులే స్వచ్ఛ భారత్‌కి కూడా ప్రచార దూతలుగా ప్రచార మాధ్యమాలను అలంకరించడం. ఇటీవల రోజుల్లో వరదలా వస్తున్న చిత్ర విచిత్రమైన వార్తలను వింటున్నప్పుడు ఎవరికైనా మనసు వికలం అవుతుంది. ఒక పెద్దాయనని మీకెలా అనిపిస్తోందండీ అని మాట వరసగా అడిగాను. ఆయన నిర్లిప్తంగా నవ్వి, ఏ అలవాటు లేకుండా యీ దేశాన్ని యిన్నేళ్లు కాపాడాను. చాలా వృథా. నాకిప్పుడు ఆత్మహత్య చేసుకోవా లనుంది అన్నారు. పాపం! - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
నెస్లేకు బాంబే హైకోర్టులో దక్కని ఊరట
ముంబై: మ్యాగీ నూడుల్స్‌ను ఉత్పత్తి చేసే నెస్లే ఇండియా కంపెనీకి బాంబే హైకోర్టులో ఊరట లభించలేదు. ఆ కంపెనీ 9 రకాల నూడుల్స్‌ను నిషేధిస్తూ భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ), మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది. నిషేధాన్ని సవాలు చేస్తూ గురువారం నెస్లే దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం కోర్టు విచారించింది. ఈ విషయంలో రెండు వారాల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటికే షాపుల నుంచి ఆ ఉత్పత్తులను తొలగిస్తున్నందున ఈ దశలో నిషేధంపై స్టే విధించాల్సిన అవసరంలేదని ధర్మాసనం చెప్పింది. -
మ్యాగీపై నెస్లేకు చుక్కెదురు
ముంబై: తొమ్మిది రకాల మ్యాగీ ఉత్పత్తులపై భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిషేధం విధించడాన్ని సవాలు చేస్తూ నెస్లే ఇండియా కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై త్వరగా విచారణ చేపట్టాలని కంపెనీ తరఫు న్యాయవాది గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మార్కెట్ నుంచి తొమ్మిది రకాల మ్యాగీ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలంటూ ఈనెల 5న ఎఫ్ఎస్ఎస్ఏఐ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. నెస్లే విన్నపాన్ని తోసిపుచ్చింది. అయితే మ్యాగీ ఉత్పత్తుల నిషేధంపై దాఖలైన పిటిషన్ కు సంబంధించి ఆహార నాణ్యత, భద్రత సంస్థలు రెండు వారాల్లో వివరణతో కూడిన నివేదిక అందజేయాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. -
నిషేధంపై నెస్లే పిటిషన్
ముంబై: తొమ్మిది రకాల మ్యాగీ ఉత్పత్తులపై భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిషేధం విధించడాన్ని సవాలు చేస్తూ నెస్లే ఇండియా కంపెనీ గురువారం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశంపై త్వరగా విచారణ చేపట్టాలని కంపెనీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. మార్కెట్ నుంచి తొమ్మిది రకాల మ్యాగీ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈనెల 5న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నవించారు. మహారాష్ట్రలో మ్యాగీ అమ్మకాలను నిషేధిస్తూ ఆహార భద్రత కమిషనర్ జారీ చేసిన ఆదేశాలను కూడా కొట్టేయాలని అభ్యర్థించారు. నెస్లే పిటిషన్‌పై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టనుంది. -
మ్యాగీ వివాదం: కోర్టుకెక్కిన నెస్లె
ఆరోగ్య సమస్యలు సృష్టిస్తుందన్న ఆందోళనతో.. మార్కెట్లలో బ్రహ్మాండంగా అమ్ముడవుతున్న తమ 'మ్యాగీ' నూడుల్స్‌ను వెనక్కి రప్పించాలంటూ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ నెస్లె కంపెనీ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. మహారాష్ట్రకు చెందిన ఎఫ్‌డీఏ ఇచ్చిన ఉత్తర్వులపై కూడా ఈ కంపెనీ కోర్టుకు వెళ్తోంది. అయితే తాము మార్కెట్ల నుంచి మ్యాగీ ఉత్పత్తులను వెనక్కి తీసుకుంటున్నామని, దానికి.. కోర్టుకు వెళ్లడానికి ఎలాంటి సంబంధం లేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బాంబే హైకోర్టు ఇచ్చే ఉత్తర్వులను బట్టి తామేం చెయ్యాలో నిర్ణయించుకుంటామన్నారు. నూడుల్స్‌లో అనుమతించిన పరిమితి కంటే ఎక్కువ పరిమాణంలో సీసం, ఎంఎస్‌జీ అనే పదార్థాలు ఉండటంతో పలు రాష్ట్రాలు మ్యాగీ అమ్మకాలను నిషేధించిన విషయం తెలిసిందే. -
నిషేధం వద్దు... నోటీసులు చాలు
- మ్యాగీపై తెలంగాణ సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: మ్యాగీపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నెస్లే కంపెనీ తన మ్యాగీ ఉత్పత్తులను వెనక్కు తీసుకుంటున్న నేపథ్యంలో నిషేధం అవసరం లేదని... కేవలం నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 22 శాంపిళ్లను సేకరించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)కు పరీక్ష నిమిత్తం పంపిన సంగతి తెలిసిందే. వాటిలో 6 శాంపిళ్ల వివరాలను ఐపీఎం వెల్లడించింది. అందులో సీసం (లెడ్) పరిమిత మోతాదులోనే ఉందని నిర్ధారించింది. కానీ, ప్రమాదకర మోనో సోడియం గ్లూటమేట్ (ఎంఎస్‌జీ) ఉందని గుర్తించారు. మ్యాగీ ప్యాకెట్లపై మాత్రం ఎంఎస్‌జీ లేదని ముద్రించారు. ఇలా ముద్రించడం వినియోగదారులను తప్పుదోవ పట్టించడమేనని, అందుకే తాము నెస్లే కంపెనీకి నోటీసులు ఇవ్వనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా మంగళవారం వివరించారు. అయితే ఎంత మోతాదులో ఎంఎస్‌జీ ఉందనే విషయాన్ని నిర్ధారించలేదని ఆయన తెలిపారు. సహజసిద్ధంగా ఎంఎస్‌జీ ఉందా? లేక రసాయనాలు కలపడం ద్వారా ఎంఎస్‌జీని మ్యాగీలో కలిపారా అనే విషయం తెలియదని, ఆ విషయం అప్రస్తుతమన్నారు. ఆరు శాంపిళ్ల వివరాలు ఇవే..: ఆరు శాంపిళ్ల పరీక్ష వివరాలను ఐపీఎం ప్రకటించింది. అందులో హైదరాబాద్ నుంచి సేకరించిన ఐదు ప్యాకెట్లు, రంగారెడ్డి జిల్లా నుంచి సేకరించిన ఒక శాంపిల్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షించిన వాటిలో మ్యాగీ మసాలా నూడిల్స్ రెండు ప్యాకెట్లు, మ్యాగీ 2 మినిట్ నూడిల్స్ రెండు ప్యాకెట్లు, మ్యాగీ 2 మినిట్ నూడిల్స్ మసాలా రెండు ప్యాకెట్లు ఉన్నాయి. ‘తప్పుడు ముద్రణ’ (మిస్‌బ్రాండెడ్) అని నిర్ధారించారు. మిగిలిన 16 శాంపిళ్ల వివరాలను కూడా వెల్లడించేందుకు ఐపీఎం కసరత్తు చేస్తోంది. బుధవారం మరో 6 శాంపిళ్ల ఫలితాలు వెల్లడిస్తారు. -
ఫాస్ట్‌ఫుడ్‌లకు ‘పరీక్షా’కాలం
నెస్లే, ఐటీసీ, ఇండో నిసాన్ సహా ఏడు కంపెనీల ఉత్పత్తులపై పరీక్షలకు ఆదేశం ♦ అన్ని రాష్ట్రాలకు ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ సర్క్యులర్ ♦ ఈనెల 19 కల్లా నివేదిక సమర్పించాలని స్పష్టీకరణ న్యూఢిల్లీ: మ్యాగీ వివాదం నేపథ్యంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) మరిన్ని కంపెనీలకు చెందిన నూడుల్స్, పాస్తా తదితర పదార్థాలపై దృష్టి సారించింది. నెస్లే, ఐటీసీ, ఇండో నిసాన్, గ్లాక్సోస్మిత్‌క్లిన్ తదితర ఏడు కంపెనీలకు చెందిన 32 బ్రాండ్ల ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించాలని సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. మ్యాగీ, టాప్ రామెన్, వాయ్ వాయ్, యమ్మీ, మాకరోనీ వంటి ప్రముఖ బ్రాండ్లు వీటిలో ఉన్నాయి. అలాగే ఎలాంటి ఆమోదం లేకుండా మార్కెట్లో చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్న తక్షణ తయారీ ఆహార పదార్థాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని స్పష్టంచేసింది. లేకుంటే అలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నెస్లేకు చెందిన మ్యాగీపై పరీక్షలు నిర్వహించగా హానికారకాలు ఉన్నట్టు తేలిందని, అందుకే అలాంటి ఇతర ఉత్పత్తులపై పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘మార్కెట్లో చాలా బ్రాండ్ల ఉత్పత్తులకు మా ఆమోదం లేదు. అవి ఆహారంగా తీసుకోదగిన పదార్థాలు కావు’ అంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో వైఎస్ మాలిక్ అన్ని రాష్ట్రాల ఆహార భద్రత కమిషనర్లకు ఒక సర్క్యులర్ పంపారు. నూడుల్స్, పాస్తా, మాకరోనీ, కేకులతోపాటు రుచిని పెంచేందుకు వాడే ఉత్పత్తులపై ఎలాంటి పరీక్షలు నిర్వహించాలో కూడా అందులో వివరించారు. నివేదికలను జూన్ 19కల్లా ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కంపెనీల ఉత్పత్తులపై పరీక్షలు నెస్లే ఇండియా, ఐటీసీ, ఇండోనిసాన్ ఫుడ్ లిమిటెడ్, జీఎస్కే కన్స్యూమర్ హెల్త్‌కేర్, సీజీ ఫుడ్స్,రుచి ఇంటర్నేషనల్, ఏఏ న్యూట్రిషియన్ ఏయే ఉత్పత్తులపై పరీక్షలు? వాయ్ వాయ్ నూడుల్స్, సీజీ ఫుడ్స్‌కు చెందిన భుజియా చికెన్ స్నాక్స్, కోకా ఇన్స్టంట్ నూడుల్స్(రుచి ఇంటర్నేషనల్), ఫూడుల్స్(జీఎస్కే కన్స్యూమర్ హెల్త్‌కేర్), నెస్లే మ్యాగీకి చెందిన తొమ్మిది రకాల నూడుల్స్ ఉత్పత్తులు, మ్యాగీ న్యూటిలిషియస్ పజ్టాకు చెందిన నాలుగు ఉత్పత్తులు, టాప్ రామెన్ ఆటా మసాలా(ఇండో నిసిన్స్), ఐటీసీకి చెందిన 3 రకాల ఇన్స్టంట్ నూడుల్స్, యమ్మీ చికెన్ నూడుల్స్, యమ్మీ వెజ్ నూడుల్స్(ఏఏ న్యూట్రిషియన్స్). కాగా, భారత్‌లో తయారైన మ్యాగీ న్యూడుల్స్ తమ దేశ భద్రతా ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని, ఆరోగ్యానికి ముప్పులేదని సింగపూర్ తెలిపింది. -
తాజాగా నూడుల్స్‌పై గోవా వేటు
* మెడికల్ షాపుల్లో పిల్లల ఆహార పదార్థాల అమ్మకాలపై నిషేధానికి యోచన పణజి/న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్‌పై నిషేధాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం గోవా కూడా నిషేధం విధించింది. దీంతో మ్యాగీపై నిషేధం విధించిన రాష్ట్రాల సంఖ్య 11కు చేరింది. మరోవైపు ఇతర ఫాస్ట్‌ఫుడ్‌లపైనా దృష్టి సారించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. లెడ్ తదితర హానికర పదార్థాలు ఉంటే వాటిపైనా వేటు తప్పదన్న సంకేతాలిచ్చింది. ‘‘మ్యాగీ నూడుల్స్‌లో ప్రమాదకరమైన సీసం ఉన్నట్లు తేలింది. అందుకే నిషేధం విధించాం. ఇది ఇంతటితో ముగియలేదు. హానికారకమని తేలితే ఇతర పదార్థాలపైనా నిషేధం తప్పదు. అలాంటి ఉత్పత్తులపై కేంద్ర ఆరోగ్య శాఖ, రాష్ట్రాలు ఓ కన్నేసి ఉంచాయి. అయితే ఇప్పటిదాకా అలాంటి ఆహార పదార్థాలు మా దృష్టికి రాలేదు’’ అని ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ తెలిపారు. అన్ని బ్రాండ్లకు సంబంధించిన నూడుల్స్‌ను పరీక్షిస్తామని భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) స్పష్టంచేసింది. మరోవైపు మందుల షాపుల్లో పిల్లల ఆహార పదార్థాల అమ్మకాలను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం తెలిపారు. ‘‘మ్యాగీ విషయం చూశాం. సాధారణంగా మందుల దుకాణాల్లో పిల్లల కోసం కొనే పదార్థాలు మంచివనే నమ్మకముంది. అందువల్ల మందుల షాపుల్లో వివిధ రకాల ఔషధాలు, టానిక్‌లు తప్ప పిల్లల ఆహార పదార్థాలు అమ్మకపోవడమే మంచిదని భావిస్తున్నాం’’ అని చెప్పారు. కాగా, మ్యాగీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ ప్రచారం నిర్వహించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అఖిల భారత వర్తకుల సమాఖ్య(సీఏఐటీ) కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌లను కోరాయి. భారత్ నుంచి నెస్లే మ్యాగీ నూడుల్స్ దిగుమతులపై బహ్రెయిన్ తాత్కాలిక నిషేధం విధించింది. ప్రచారం బారెడు.. నాణ్యత బెత్తెడు నెస్లే కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారానికి భారత్‌లో కిందటేడాది ఏకంగా రూ.445 కోట్లు వెచ్చించింది. అదే ఉత్పత్తుల నాణ్యతా పరీక్షలకు మాత్రం అందులో 5 శాతం కూడా ఖర్చు పెట్టలేదు. అందుకు కేవలం రూ.19 కోట్లు వెచ్చించి చేతులు దులుపుకుంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ వార్షిక లెక్కలే చెబుతున్నాయి. గత ఐదేళ్లుగా ఆ కంపెనీ ఖర్చు ఇలాగే ఉంది. ప్రతి ఏటా ఉత్పత్తుల ప్రచారానికి రూ.300-450 కోట్ల మధ్య వెచ్చిస్తుండగా, నాణ్యత పరీక్షలకు రూ.12-20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తేలింది. -
మరో రెండు రాష్ట్రాల్లో మ్యాగీ నిషేధం
-
మ్యాగీపై మహారాష్ట్ర, పంజాబ్ వేటు
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ విక్రయాలపై శనివారం మరో రెండు రాష్ట్రాలు నిషేధం విధించాయి. మహారాష్ట్ర, పంజాబ్లలోని మ్యాగీ శాంపిళ్లలో ప్రమాణాలు భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనల మేరకు లేవని తేలడంతో ఆ రాష్ట్రాలూ నిషేధించాయి. ముంబైలో 6 శాంపిళ్లను పరీక్షించగా, మూడు శాంపిళ్లలో సీసం గరిష్ట పరిమితి(2.5 పీపీఎం) కంటే ఎక్కువగా 4.66 పీపీఎం ఉన్నట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. పంజాబ్‌లో పరీక్షించిన శాంపిళ్లలో సీసం అనుమతించిన పరిమితిలోనే ఉందని, మోనోసోడియం గ్లుటామేట్ మాత్రం ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఆ రాష్ట్ర అధికారులు అన్నారు. అయితే, ఆయా బ్రాండ్లకు ప్రచారకర్తలుగా పనిచేసిన ప్రముఖులపై ప్రస్తుతం చర్యలు తీసుకోబోవడం లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. మరోవైపు ఇతర బ్రాండ్ల ఇన్స్టంట్ నూడుల్స్‌నూ పరీక్షించనున్నట్లు తెలిపింది. ఆహార భద్రత కోసం వివిధ బ్రాండ్ల పాస్తాను కూడా పరీక్షిస్తామంది. కాగా, నెస్లే కంపెనీ ఉత్పత్తి చేస్తున్న మ్యాగీతో సహా 9 రకాల ఉత్పత్తులన్నింటి తయారీ, విక్రయాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ శుక్రవారం నిషేధం విధించడం తెలిసిందే. ఈ నూడుల్స్‌ను ఢిల్లీ, అస్సాం, బిహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, జమ్మూకశ్మీర్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కూడా ఇదివరకే నిషేధించాయి. -
నా క్రెడిట్ ను బాస్ కొట్టేశాడు!
అగ్రా:ఇప్పటికే మ్యాగీ నూడుల్స్ వివాదం సర్వత్రా ఆసక్తిగా మారిన తరుణంలో తాజాగా మరో కొత్త కోణం వెలుగు చూసింది. మ్యాగీ నూడుల్స్ నిషేధంలో అసలు కీలక పాత్ర పోషించిందెవరు?, ఆ నూడుల్స్ లో హానికరమైన రసాయనాలన్నట్లు గుర్తించిన వారెవరు? ఇప్పడు అదే అంశంపై రగడ మొదలైంది. మ్యాగీ నూడుల్స్ దర్యాప్తులో తాను ప్రముఖ పాత్ర పోషించినా.. ఆ క్రెడిట్ ను తన బాస్ కొట్టేశాడంటూ ఫుడ్ ఇన్ స్పెక్టర్ సంజయ్ సింగ్ ఆరోపిస్తున్నాడు. 'అసలు మ్యాగీ న్యూడిల్స్ దర్యాప్తులో కీలక పాత్ర నాది. దాదాపు సంవత్సరం పైనుంచి నూడిల్స్ పై దర్యాప్తు కొనసాగిస్తున్నా. మా డిపార్ట్ మెంట్ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లేకపోయినా నూడుల్స్ విచారణను యథావిధిగా చేశా. మ్యాగీ నూడుల్స్ ను ల్యాబ్ పరీక్షించి వాటిలో హానికరమైన రసాయనాలున్నట్లు ధృవీకరించా. అయితే మా బాస్ వికే పాండే ఆ క్రెడిట్ ను మొత్తం కొట్టేశాడు'అని సంజయ్ సింగ్ ఆరోపణలకు దిగాడు. 2014, మార్చి 10న మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్ ను బారాబాంకీ మార్కెట్ నుంచి సేకరించి .. ఆ తరువాత దర్యాప్తుకు గోరఖ్ పూర్ ల్యాబ్ కు తీసుకువెళ్లి దర్యాప్తు కొనసాగించినట్లు సంజయ్ తెలిపాడు. మ్యాగీ నూడుల్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. మ్యాగీ ఇన్స్టంట్ నూడుల్స్‌కు చెందిన అన్ని రకాల ఉత్పత్తులను తక్షణమే మార్కెట్ నుంచి ఉపసంహరించాలని మ్యాగీని ఉత్పత్తి చేసే ప్రఖ్యాత స్విస్ సంస్థ నెస్లేను భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) శుక్రవారం ఆదేశించింది. అలాగే, మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తి, అమ్మకాల పైనా నిషేధం విధించింది. -
మ్యాగీ నూడుల్స్ ఔట్
-
మ్యాగీ నూడుల్స్ ఔట్
ఉత్పత్తులపై నిషేధం విధించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ♦ 9 రకాల ఉత్పత్తులను మార్కెట్ నుంచి ఉపసంహరించాలని నెస్లేకు ఆదేశం ♦ నిరాధార కారణాల వల్ల ఈ గందరగోళం.. మా ఉత్పత్తులు పూర్తి సురక్షితం: నెస్లే ♦ మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను నిలిపేసిన మధ్యప్రదేశ్ ♦ భారత్ నుంచి దిగుమతైన మ్యాగీ ఉత్పత్తులను నిషేధించిన నేపాల్, సింగపూర్ న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. మ్యాగీ ఇన్స్టంట్ నూడుల్స్‌కు చెందిన అన్ని రకాల ఉత్పత్తులను తక్షణమే మార్కెట్ నుంచి ఉపసంహరించాలని మ్యాగీని ఉత్పత్తి చేసే ప్రఖ్యాత స్విస్ సంస్థ నెస్లేను భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) శుక్రవారం ఆదేశించింది. అలాగే, మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తి, అమ్మకాల పైనా నిషేధం విధించింది. సీసం(లెడ్), మోనో సోడియం గ్లూటామేట్(ఎంఎస్‌జీ) అనే హానికర రసాయనాలు పరిమితికి మించి ఉన్నాయని పేర్కొంటూ ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మ్యాగీ నూడుల్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం మధ్యప్రదేశ్ కూడా మ్యాగీ ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం విధించింది. నిరాధార కారణాల వల్ల ఈ గందరగోళం తలెత్తిందని, దాంతో వినియోగదారుల నమ్మకం సడలిందని, త్వరలోనే మళ్లీ వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొంటామని నెస్లే గ్లోబల్ సీఈఓ పాల్ బల్క్ విశ్వాసం వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన స్విట్జర్లాండ్ నుంచి శుక్రవారం ఢిల్లీ వచ్చారు. నెస్లేకి ఊరటనిచ్చేలా రెండు రాష్ట్రాలు పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలు మాత్రం మ్యాగీ నూడుల్స్‌లో హానికర పదార్థాలేవీ లేవని తమ పరీక్షల్లో తేలిందని, అందువల్ల వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోబోవడం లేదని స్పష్టం చేశాయి. దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని నెస్లే ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మరోవైపు, భారత్ నుంచి దిగుమతి చేసుకున్న మ్యాగీ నూడుల్స్ అమ్మకాలపై సింగపూర్, నేపాల్ దేశాలు తాత్కాలిక నిషేధం విధించాయి. మ్యాగీ నూడుల్స్‌లో సీసం మోతాదు ఎక్కువుంటోందన్న వార్తల నేపథ్యంలో వాటిపై పరీక్షలు జరపాలని బ్రిటన్ నిర్ణయించింది. హానికరం.. సురక్షితం కాదు: ‘మ్యాగీ ఉత్పత్తుల వినియోగం సురక్షితం కాదు. హానికరం. మ్యాగీ నూడుల్స్‌కు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులను తక్షణమే మార్కెట్ నుంచి ఉపసంహరించుకోండి. వాటి ఉత్పత్తి, దిగుమతి, సరఫరా, అమ్మకాలను నిలిపేయండి. వాటికి మేం ఇచ్చిన అనుమతులను ఎందుకు వెనక్కి తీసుకోకూడదో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వండి. మా ఆదేశాలను అమలు చేస్తామనే అంగీకార పత్రాన్ని 3 రోజుల్లోగా మాకు అందించండి. మీ ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్న ప్రక్రియపై రోజువారీ నివేదిక ఇవ్వండి. అలాగే, మ్యాగీ ఓట్స్ మసాలా నూడుల్స్‌ను అనుమతి లేకుండానే, భద్రత పరీక్షలు జరపకుండానే మార్కెట్లో ప్రవేశపెట్టారు. తక్షణమే వాటిని మార్కెట్ నుంచి తొలగించండి. ఎంఎస్‌జీ విషయంలో లేబులింగ్ నిబంధనలను ఉల్లంఘించారు. దానిపై వివరణ ఇవ్వండి’ అని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈఓ వైఎస్ మాలిక్ నెస్లేకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వందేళ్లుగా భారత్ మా మార్కెట్ ‘మా ఉత్పత్తులకు సంబంధించి మేం ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన భద్రతాప్రమాణాలను, నాణ్యతావిధానాలను పాటిస్తాం. మ్యాగీ పూర్తిగా సురక్షితమని మా పరీక్షల్లో తేలింది. అయినా, మా ఉత్పత్తులను భారతీయ మార్కెట్ నుంచి తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నాం. మా పరీక్షా విధానాలతో పాటు అన్ని అంశాల్లో భారతీయ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాం. వెల్లడి కాని కారణాల వల్ల ఈ గందరగోళం తలెత్తిందని భావిస్తున్నాం. సాధారణంగా లెడ్(సీసం) వాతావరణంలో ఎక్కడైనా ఉంటుంది. అయితే, మా ఉత్పత్తుల్లో మాత్రం పరిమితికి లోబడే ఉంది. ఎంఎస్‌జీని మేం ప్రత్యేకంగా కలపం. నూడుల్స్ తయారీ ప్రక్రియలో ఉపయోగించే సహజసిద్ధ పదార్థాల ద్వారానే అది తుది ఉత్పత్తిలోకి చేరుతుంది. అందుకే ఎంఎస్‌జీని చేర్చినట్లుగా మా ఉత్పత్తుల ప్యాక్స్‌పై ఉండదు. పలు ప్రయోగ కేంద్రాల్లో మ్యాగీ ఉత్పత్తులను పరీక్షించాం. అన్ని పరీక్షల్లోనూ మా ఉత్పత్తులు సురక్షితమేనని తేలింది’ అని పాత్రికేయుల సమావేశంలో నెస్లే గ్లోబల్ సీఈఓ పాల్ బల్క్ వివరణ ఇచ్చారు. ఆహార భద్రతపై రాజీ లేదు దేశ ప్రజల ఆహార భద్రతపై రాజీ లేదని కేంద్ర ఆహార మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆహార భద్రత ప్రమాణాలను మ్యాగీ ఉల్లంఘించినట్లు తేలిందన్నారు. వివాదం మొదలైంది ఇలా.. మ్యాగీ.. 2 నిమిషాల్లోనే నూడుల్స్! దేశంలోనే తొలి ఇన్స్టంట్ నూడుల్స్ బ్రాండ్ ఇది. ఉత్తరప్రదేశ్‌లో విక్రయిస్తున్న మ్యాగీ నూడుల్స్‌లో సీసం(లెడ్), మోనోసోడియం గ్లుటామేట్‌లు అనుమతించిన మోతాదు కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు గతనెలలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారులు గుర్తించడంతో వివాదం మొదలైంది. గ్లుటామేట్ తో ప్రమాదమే... గ్లుటామిక్ యాసిడ్, దాని గ్లుటామేట్‌లు(అయాన్లు, లవణాలు) కలిపితే మోనోసోడియం గ్లుటామేట్ రసాయనం ఏర్పడుతుంది. ఆహార పదార్థాలకు రుచి కోసం దీనిని కలుపుతారు. ఆహారంలో ఇది ఎక్కువైతే తలనొప్పి, చికాకు, అసౌకర్యం కలుగుతాయి. కొంతమందిలో చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్ వస్తుంది. ఈ సిండ్రోమ్ వల్ల.. తలపోటు, ఛాతీ, వెన్ను, వంటి నొప్పులు, మగత కలుగుతాయి. ఛాతీలో మంట, దవడలు బిగుసుకుపోవడం, అలర్జీ వంటి సమస్యలూ రావచ్చు. సీసంతో దుష్పరిణామాలు ఇది భార లోహం. విషపూరితం. వాతావరణంలో ముఖ్యంగా గాలి, నీటిలో ఉంటుంది. గాలి, నీరు, ఆహారం, ఇతర మార్గాల ద్వారా మనుషుల్లోకి చేరవచ్చు. ఆహార పదార్థాల్లోకి నీటి ద్వారా లేదా ముడి పదార్థాలు, ప్యాకేజింగ్‌ల వల్ల రావచ్చు. శరీరంలోకి ఇది ఎక్కువగా చేరితే కడుపు నొప్పి, తలనొప్పి వస్తాయి. గందరగోళం, చికాకు కలుగుతాయి. రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. మోతాదు మించితే.. మూర్ఛ వస్తుంది. కోమాలోకి వెళతారు. మరణమూ సంభవించవచ్చు. 72% నెస్లే కంపెనీ 1947 నుంచే మ్యాగీ బ్రాండ్ న్యూడుల్స్‌ను విక్రయిస్తోంది. దేశంలో ఇన్స్టంట్ నూడుల్స్ అమ్మకాల్లో 72 శాతం వాటా మ్యాగీదే! 3,000 కోట్లు భారత్‌లో నెస్లే కంపెనీ ఉత్పత్తుల మొత్తం టర్నోవర్ రూ. 10 వేల కోట్లు. ఇందులో మ్యాగీ నూడుల్స్‌కే 30 శాతం అంటే రూ. 3,000 కోట్ల వాటా ఉంది. 17.2 పీపీఎం నీటిలో లేదా మట్టిలో ఒక పదార్థం గాఢతను లెక్కించే ప్రమాణమే పీపీఎం(పార్ట్స్ పర్ మిలియన్). ఒక పీపీఎం అంటే.. ఒక లీటరు నీటిలో ఒక మిల్లీగ్రామ్ పదార్థాన్ని కలిపితే వచ్చే గాఢతకు సమానం. అయితే, ఆహార పదార్థాల్లో సీసం కనిష్టంగా 0.1 పీపీఎం నుంచి 1.4 పీపీఎం ఉండవచ్చు. గరిష్టంగా 2.5 పీపీఎం మించరాదు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని పలు చోట్ల, కోల్‌కతాలో స్వాధీనం చేసుకున్న మ్యాగీ శాంపిళ్లలో ఏకంగా 17.2 పీపీఎంల సీసం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది! -
ఏపీలో మ్యాగీ నూడుల్స్ పై నిషేధం
హైదరాబాద్: మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించిన హానికర రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఏపీలో మ్యాగీ నూడుల్స్ ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. మ్యాగీ నూడుల్స్ కు సంబంధించి సరఫరా, అమ్మకాలు జరపరాదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఆహారభద్రత అధికారాలు మ్యాగీ నూడుల్స్ పై తాజా ఆదేశాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆమె ఆదేశించారు. కాగా, మ్యాగీ సరఫరా చేసే తొమ్మిదిరకాల ఉత్పత్తులను వెనక్కితీసుకోమని చెప్పినట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మ్యాగీ నూడుల్స్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
'వారికి ఏ సమస్య వచ్చినా.. అండగా ఉంటాం'
న్యూఢిల్లీ: తమ కంపెనీ తరపున ప్రచారకర్తలుగా పనిచేసిన వారికి ఏ సమస్య వచ్చినా మద్దతుగా ఉంటామని నెస్లె ఇండియా పేర్కొంది. మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తులపై వివాదం ఏర్పడిన నేపథ్యంలో నెస్లె కంపెనీ వివరణ ఇచ్చింది. నెస్లె తరపున బాలీవుడ్ తారలు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటా ప్రచారకర్తలుగా పనిచేశారు. మ్యాగీ నూడుల్స్‌లో మోతాదుకు మించి సీసం వాడారని తేలడంతో వీటిని చాలా రాష్ట్రాల్లో నిషేధించగా, ప్రచారకర్తలపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నెస్లె కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రచారకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని చెప్పారు. -
మ్యాగీ తయారీలో ప్రమాణాలు ఉల్లంఘించారు: కేంద్రం
న్యూఢిల్లీ: మ్యాగీ న్యూడుల్స్ ఉత్పత్తిదారులు ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రమాణాలు ఉల్లంఘించారని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నద్దా అన్నారు. ఆహారభద్రతపై రాజీపడబోమని నద్దా స్పష్టం చేశారు. 9 మ్యాగీ ఉత్పత్తులను మార్కెట్ల నుంచి తొలగించాలని కేంద్ర ఆహార భద్రత రెగ్యులేటర్ ఆదేశించింది. అన్ని రాష్ట్రాల నుంచి ఆరోగ్య శాఖకు నివేదికలు వచ్చాయని, మ్యాగీ ఉత్పత్తులను మార్కెట్ల నుంచి వెనక్కిపంపాలని సూచించినట్టు నద్దా తెలిపారు. నెస్లె కంపెనీ ఆహార భద్రత విషయంలో ప్రమాణాలు ఉల్లంఘించినట్టు తాము నిర్ధారణకు వచ్చినట్టు చెప్పారు. -
దుబాయ్‌లో క్లియరెన్స్ సేల్!
భారతదేశానికి సంబంధించిన మ్యాగీ ఇన్స్టెంట్ నూడుల్స్ అమ్మకాలను దుబాయ్‌లో నిషేధించారు. అయినా.. 'భారత్, నేపాల్, భూటాన్లలో మాత్రమే అమ్మకానికి' అనే స్టాంపులున్న మ్యాగీ ప్యాకెట్లు అక్కడి సూపర్ మార్కెట్లలో దర్శనమిస్తున్నాయి. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న మ్యాగీ నూడుల్స్ అమ్మొద్దంటూ ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ గురువారమే నోటీసులు ఇచ్చింది. తక్షణం అలాంటి ప్యాకెట్లను దుకాణాల్లోంచి తీసేయాలని కూడా చెప్పింది. కానీ, ఆ తరహా ప్యాకెట్లు ఇప్పటికీ ఎంచక్కా అక్కడి షెల్ఫుల్లో దర్శనమిస్తున్నాయి. ఈ విషయాన్ని అక్కడి పత్రిక 'ఖలీజ్ టైమ్స్' బయటపెట్టింది. గత సంవత్సరం భారతదేశంలో తయారైన మ్యాగీ ప్యాకెట్లు దుబాయ్ మార్కెట్లోకి వెల్లువెత్తాయి. భారతదేశం నుంచి వచ్చిన ప్యాకెట్లను అమ్మేందుకు దుబాయ్‌లో అధికారిక ఏజెంట్లు ఎవరూ లేరని, అందుకే ఇక్కడ ఆ ప్యాకెట్ల అమ్మకాలను వెంటనే ఆపేయాలని, మార్కెట్ల నుంచి తక్షణం ఉపసంహరించాలని అధికారులు ఆదేశించారు. దుబాయ్‌లో అమ్ముతున్న ఇండియన్ ఫ్లేవర్ మ్యాగీ నూడుల్స్‌ను క్లియరెన్సు సేల్ కింద.. డిస్కౌంటు రేట్లకు అమ్మేస్తున్నారు. కొన్ని నెలల క్రితమే భారతదేశం నుంచి ఈ ప్యాకెట్లు దుబాయ్ మార్కెట్లలోకి వచ్చినట్లు మరో అధికారి నిర్ధారించారు. నాలుగు సూపర్ మార్కెట్ల చైన్లలో వీటిని అమ్ముతున్నట్లు తేలింది. మలేసియాలోని నెస్లె కంపెనీలో తయారైన ఆరు ఫ్లేవర్ల మ్యాగీ నూడుల్స్‌ను మాత్రమే దుబాయ్‌లో అమ్మేందుకు అనుమతి ఉంది. -
'మ్యాగీ నూడుల్స్ హానికరం కాదు'
-
'మ్యాగీ నూడుల్స్ హానికరం కాదు'
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని నెస్లే గ్లోబల్ సీఈవో పాల్ బక్కే తెలిపారు. వివాదాల కారణంగా భారతీయ మార్కెట్ల నుంచి మ్యాగీ ఉత్పత్తులను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు. తమ మ్యాగీ నూడుల్స్‌లో హానికారక రసాయనాలు అధిక మొత్తాల్లో ఉన్నాయనే వార్తల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. నూడుల్స్ లో మోనో సోడియం గ్లుటామేట్ లేదని స్పష్టం చేశారు. నాణ్యతా ప్రమాణాలే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. 30 ఏళ్లుగా భారతీయులు తమ ఉత్పత్తిని నమ్మారని చెప్పారు. భారత్ లో తాము పాటిస్తున్న ప్రమాణాలనే ప్రపంచమంతా పాటిస్తున్నామని పాల్ తెలిపారు. ప్రజల నమ్మకాన్ని పొంది మళ్లీ భారత్ మార్కెట్ లోకి వస్తామన్నారు. భారత్ మార్కెట్ తమకెంతో కీలకమని అందుకే తానిక్కడకు వచ్చానని చెప్పారు. తాము ఎక్కడ ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. -
మ్యాగీ నిషేధించాలంటూ బడి పిల్లల ధర్నా
విజయవాడ: చిన్నపిల్లల పాలిట విషాహారమైన మ్యాగీని వెంటనే నిషేధించాలని బాలల సంఘాలు పలు చోట్ల ధర్నాకు దిగాయి. విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట పిల్లలు ‘మీ స్వార్థం కోసం మా ప్రాణాలను బలి తీయోద్దు’ అని ఫ్లకార్డులు పట్టుకుని తమ నిరసనలు వ్యక్తం చేశారు. తిరుపతిలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో చిన్నపిల్లలతో కలిసి ర్యాలీ తీశారు. దేశ వ్యాప్తంగా నెస్లే కంపెనీ కూడా మ్యాగీ అమ్మకాలను నేటి నుంచే నిలిపివేస్తున్నట్టు ఓ ప్రకటన ద్వారా తెలిపింది. కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మ్యాగీ అమ్మకాలను నిలిపివేయాలని ఆందోళనలు జరుగుతున్నాయి. -
రిపోర్ట్ రాగానే మ్యాగీ నిషేధం
తిరుమల: తెలంగాణ రాష్ట్రంలో మ్యాగీ శాంపుల్స్ టెస్ట్‌కు పంపించామని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీహెచ్ లక్ష్మారెడ్డి శుక్రవారం తిరుమలలో వెల్లడించారు. నివేదిక అందిన వెంటనే మ్యాగీపై నిషేధానికి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు లక్ష్మారెడ్డి తిరుమలలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు తీర్థప్రసాదాలను టీటీడీ అధికారులు అందజేశారు. అలాగే శ్రీకాకుళం ఎంపీ కె.రాంమ్మోహన్ నాయుడు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. -
'మ్యాగీ' అమ్మకాలు నిలిపేసిన నెస్లే
న్యూఢిల్లీ: తమ మ్యాగీ నూడుల్స్‌లో హానికారక రసాయనాలు అధిక మొత్తాల్లో ఉన్నాయనే వార్తల నేపథ్యంలో ‘మ్యాగీ’ నూడుల్స్ అమ్మకాలను నిలిపేయాలని నిర్ణయించినట్లు నెస్లే ఇండియా గురువారం అర్ధరాత్రి ప్రకటించింది. వినియోగదారుల్లో నెలకొన్న గందరగోళ వాతావరణాన్ని పోగొట్టేందుకు ఈ చర్యతీసుకుంటున్నామని ప్రకటనలో పేర్కొంది. వీలైనంత తొందరగా మీ నమ్మకాన్ని చూరగొని మళ్లీ మార్కెట్లోకి అడుగుపెడతామని కంపెనీ స్పష్టం చేసింది. హానికారక రసాయనాల నేపథ్యంలో మ్యాగీ నూడుల్స్‌పై పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. బిగ్ బజార్ వాల్‌మార్ట్, మెట్రో ఏజీ సంస్థలు తమ హోల్‌సేల్ స్టోర్ల నుంచి మ్యాగీ నూడుల్స్‌ను ఉపసంహరించాయి. -
తిరుపతి లడ్డూను పరీక్షించగలరా?
మ్యాగీ వివాదంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ వివాదం మొదలైనప్పటి నుంచీ మరింత ఎక్కువగా మ్యాగీ తింటున్నానని తెలిపారు. 'మ్యాగీ'కి మద్దతుగా పుంఖాను పుంఖాలుగా ట్వీట్లు వదిలారు ఈ సంచలన దర్శకుడు. తిరుపతి లడ్డూను ఎవరైననా పరీక్షించగలరా, కనీసం రోడ్డు పక్కనున్న 100 హోటళ్లను తనిఖీ చేయగలరా అంటూ ప్రశ్నించారు. ఎంఎన్‌సీలను సాఫ్ట్ టార్గెట్ చేస్తున్నారని, ఈ వివాదం నుంచి మ్యాగీ బయటకు పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఆహార పదార్థంలో ఎక్కువ లేదా తక్కువ మొత్తంలో ఇంగ్రేడియంట్స్ ఉంటాయన్నారు. మ్యాగీపై హఠాత్తుగా వివాదం ఎందుకు రేపారో తనకు అర్థం కావడంలేదన్నారు. క్యూట్ గా, టేస్టీగా ఉండే మ్యాగీ వివాదంలో చిక్కుకోవడంపై బాధను వ్యక్తం చేశారు. చాలా ఏళ్లు తర్వాత మేలుకున్న అధికారులు మ్యాగీ నూడూల్స్ ను పరీక్షించినట్టుగానే క్యాడ్ బరీ, అమూల్, కోల్ గేట్ నూ టెస్ట్ చేయాలని సూచించారు. మ్యాగీపై వివక్ష చూపేముందు మన చేపల మార్కెట్లను, రోడ్డు పక్కల ఆహారశాలలను శుభ్రం చేయాలన్నారు. మ్యాగీని ఇష్టపడే, విశ్వసించే వ్యక్తిగా దాన్ని మాత్రమే తినాలని నిర్ణయించుకున్నట్టు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. 'ఆరోగ్యానికి హాని కలిగించే సిగరెట్లు, మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతారు.. మ్యాగీపై నిషేధం విధించారు.. సూపర్బ్' అంటూ వర్మ తనదైన శైలిలో విమర్శించారు. వ్యతిరేక ప్రచారంతో మ్యాగీ నూడూల్స్ ఇప్పుడు సులభంగా దొరుకుతున్నాయని పేర్కొన్నారు. మ్యాగీపై వచ్చిన ఆరోపణలు వీగి పోతాయని వర్మ విశ్వాసం వ్యక్తం చేశారు. Does anybody test Turupathi laddus? Or any of the 100s of roadside hotels ? Mnc's are just soft targets...reminds me of KFC targeting days — Ram Gopal Varma (@RGVzoomin) June 3, 2015 Supposedly confirmedly dangerous cigarettes nd alcohol r allowed to sell with dumb warnings which no one cares and Maggi is banned..Superb! — Ram Gopal Varma (@RGVzoomin) June 4, 2015 -
మరో నాలుగు రాష్ట్రాల్లో మ్యాగీ నిషేధం
-
మరో నాలుగు రాష్ట్రాల్లో నిషేధం
ఉత్తరాఖండ్, తమిళనాడు, గుజరాత్, జమ్మూకశ్మీర్‌లో ‘మ్యాగీ నూడుల్స్’పై చర్యలు ♦ సరుకును తక్షణమే ఉపసంహరించాలని నెస్లే ఇండియాకు ఆదేశం ♦ చర్యలకు సిద్ధమవుతున్న బిహార్, ఉత్తరప్రదేశ్ న్యూఢిల్లీ: హానికారక రసాయనాల నేపథ్యంలో మ్యాగీ నూడుల్స్‌పై మరో నాలుగు రాష్ట్రాలు నిషేధం విధించాయి. ఉత్తరాఖండ్, తమిళనాడులో మూడు నెలలు, గుజరాత్, జమ్మూకశ్మీర్‌లలో ఒక నెల చొప్పున నిషేధం విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు గురువారం ప్రకటించాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని లేదని పరీక్షల్లో తేలిన తర్వాతే అనుమతిస్తామని స్పష్టంచేశాయి. అలాగే తమ రాష్ట్రాల నుంచి మ్యాగీ నూడూల్స్ సరుకును తక్షణమే ఉపసంహరించాలని నెస్లే ఇండియా సంస్థను ఆదేశించాయి. బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా మ్యాగీపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రాలు నూడుల్స్‌పై పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఫలితాలు రాగానే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ ప్రభుత్వం బుధవారమే మ్యాగీ నూడుల్స్‌పై 15 రోజులపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గుజరాత్ సర్కారు మ్యాగీ నూడుల్స్‌తోపాటు సన్‌ఫీస్ట్, ఎస్కేఎస్ ఫుడ్స్‌కు చెందిన న్యూడుల్స్పైనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో ఎస్కేఎస్ నూడుల్స్‌లో లెడ్(సీసం) మోతాదు పరిమితికి మించి ఉండడంతో వాటిపైనా 15 రోజుల నిషేధం విధించింది. ‘‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 27 మ్యాగీ నూడుల్స్ శాంపిళ్లను సేకరించి పరీక్షలు చే శాం. అందులో 14 శాంపిళ్లలో సీసం శాతం మోతాదుకు మించి నమోదైంది. ఇక అన్ని నమూనాల్లో హానికారక మోనోసోడియం గ్లుటామేట్(ఎస్ఎస్జీ) ఆనవాళ్లు కనిపించాయి’’ అని గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి నితిన్ పటేల్ వెల్లడించారు. ఇక పరీక్షల్లో మ్యాగీ నూడుల్స్ హానికారకం కాదు అని తేలే వరకు ఒక్క జిల్లాలో కూడా వాటిని అమ్మకుండా చూడాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సూచించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మ్యాగీపై మూడునెలలపాటు నిషేధం విధించినట్లు ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఓం ప్రకాశ్ తెలిపారు. పరీక్షలకు పంపిన కొన్ని శాంపిళ్లలో ఎంఎస్‌జీ ఉన్నట్టు తేలిందని, మరికొన్ని ఫలితాలు రావాల్సి ఉందని ఆయన వివరించారు. కాగా, భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న మ్యాగీ నూడుల్స్‌పై నేపాల్ కూడా దృష్టి సారించింది. వాటిని పరీక్షలకు పంపింది. ఫలితాలు వచ్చాక నిషేధంపై నిర్ణయం తీసుకోనుంది. నూడుల్స్ ఉపసంహరించిన వాల్‌మార్ట్, మెట్రో ఏజీ వాల్‌మార్ట్, మెట్రో ఏజీ సంస్థలు తమ హోల్‌సేల్ స్టోర్ల నుంచి మ్యాగీ నూడుల్స్‌ను ఉపసంహరించాయి. ‘మ్యాగీ 2-మినిట్ నూడుల్స్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మా సంస్థకు చెందిన 20 స్టోర్ల నుంచి ఆ సరుకును ఉపసంహరిస్తున్నాం. ప్రజారోగ్యానికి మేం పెద్దపీట వేస్తాం’ అని వాల్‌మార్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ కూడా భారత్‌లో 18 స్టోర్ల నుంచి మ్యాగీని ఉపసంహరిస్తున్నట్లు పేర్కొంది. -
తమిళనాడులో మ్యాగీ నిషేధం
న్యూఢిల్లీ: హాని కల్గించే రసాయనాలు ఉన్నాయన్న కారణంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిషేధం ఎదుర్కొంటున్న మ్యాగీ న్యూడుల్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా మ్యాగీ నూడుల్స్ పై మూడు నెలల పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఉత్తరాఖండ్‌లో మూడు నెలలు నిషేధం విధించగా, గుజరాత్, జమ్మూకశ్మీర్‌లలో ఒక నెల చొప్పున నిషేధం విధించాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని లేదని పరీక్షల్లో తేలిన తర్వాతే అనుమతిస్తామని స్పష్టంచేశాయి. దీంతో పాటు బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా మ్యాగీపై చర్చలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.ఢిల్లీ ప్రభుత్వం బుధవారమే మ్యాగీ న్యూడుల్స్పై 15 రోజులపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా నేపాల్ మ్యాగీ దిగుమతులపై నిషేధం విధించింది. -
కీడెంచి 'యాడ్' ఎంచు...
(వెబ్ సైట్ ప్రత్యేకం) వారిద్దరూ బాలీవుడ్ నటీమణులే... ఒకరేమో ప్రకటనలో నటించి చిక్కుల్లో పడితే, మరొకరేమో 'యాడ్' ఆఫర్‌ను నిర్మొహమాటంగా తిప్పికొట్టి న్యూస్‌లో నిలిచారు. ఏక్ దో తీన్ అంటూ ఒకప్పుడు బాలీవుడ్ ను ఊర్రుతూలూగించిన అందాల తార మాధురీ దీక్షిత్ ఒకరయితే... మరొకరు ఇంట్లోవారికి ఇష్టం లేకున్నా అడ్డంకులను అధిగమించి జాతీయ ఉత్తమ స్థాయికి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్‌లో నటించేందుకు కోట్లు ఆఫర్ ఇచ్చినా ఛీ కొట్టి హైలెట్ అయితే.... మరొకరు దేశవ్యాప్తంగా దూమారం రేపుతున్న మ్యాగీ నూడుల్స్ ప్రకటనలో నటించి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. కోట్లు ఇస్తామంటే... బీడీ నుంచి బ్లేడ్ వరకూ ఏ ప్రకటనలో అయినా నటించేందుకు నటీనటులు సై అంటున్న పరిస్థితి ఉంది. అందుకు ఆయా ఉత్పత్తుల ప్రకటనలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తమ అభిమాన నటులంటే... పడి 'చచ్చే' ఫ్యాన్స్, ఫాలోయిర్స్... వారిని అనుకరిస్తూనే ఉంటారు. దాంతో ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు తమ ఉత్పత్తిని జనాల్లోకి తీసుకువెళ్లటంతో పాటు మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఆయా సంస్థలు సెకన్ల ప్రకటనలకు కూడా వాల్యూను బట్టి లక్షల నుంచి కోట్ల రూపాయలు కుమ్మరించి తారలను 'బ్రాండ్ అంబాసిడర్' లుగా నియమించుకుంటున్నాయి. దాంతో నెలలు, వారాలు తరబడి కష్టపడకుండా నటీనటులు సింపుల్‌గా గంటల్లో షూటింగ్ ముగించేసి కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు తాము నటించిన ప్రకటనలే వారి మెడకు చుట్టుకుంటున్నాయి. ప్రస్తుతం మాధురీ పరిస్థితి కూడా అదే. ఇంతకీ మాధురీ దీక్షిత్ ఏం చేసింది? 'అలసిపోయిన పిల్లలు మ్యాగీ నూడుల్స్ తింటే ఇట్టే శక్తి వస్తుంది. నేను తినిపిస్తున్నాను. మీరూ తినిపించండి' అని చెప్పటమే మ్యాగీ నూడుల్స్ ప్రకటనలో నటించటమే మాధురి చేసిన పొరపాటా? తప్పుచేసివారితోపాటు అందుకు పలువిధాలుగా సహకరించినవారు కూడా నిందార్హులేనన్న న్యాయసూత్రం ఇక్కడ ఆమె విషయంలో మరోసారి రుజువైంది. దాంతో ఆ ప్రకటనలో నటించిందుకు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'మ్యాగీ.. 2 మినిట్ నూడుల్స్'లో పరిమితికి మించి సీసం (లెడ్), మోనో సోడియం గ్లూటమేన్ ఉన్నట్లు దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ ప్రకటనలో నటించిన మాధురీ దీక్షిత్ పై కేసులు నమోదు అయ్యాయి. ఆమెతో పాటు ఈ యాడ్‌ను ప్రమోట్ చేసిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ప్రీతి జింటాలపైనా వేర్వేరుగా కేసులు నమోదు అయ్యాయి. ఇక కంగనా రనౌత్ విషయానికి వస్తే... భారీ 'ఆఫర్' చేస్తే... తారలు ఏ ప్రకటనలో అయినా నటిస్తారనే దాన్ని ఈ బాలీవుడ్ 'క్వీన్' తిరగరాసింది. ఓ ఫెయిర్ నెస్ క్రీమ్‌లో నటిస్తే పెద్ద మొత్తంలో ఇస్తామని ఆశ చూపినా ఆమె మాత్రం డోంట్ కేర్ అంది. తమ కంపెనీ ప్రకటనలో నటిస్తే ఏకంగా రెండు కోట్లు ఇస్తామన్నాఅందుకు కంగనా ససేమిరా అంది. ఆ కంపెనీ ఇంకా పెద్ద మొత్తంలో ఇస్తామన్నా.... 'ఫెయిర్' అనే పదమే తనకు నచ్చదని, విలువలే తన ఆస్థి అంటూ మొహం మీద చెప్పింది. యువతకి అందం తెచ్చేది ఆత్మ విశ్వాసం, శక్తి సామర్థ్యాలు, తెలివితేటలే కానీ వాళ్లు రాసుకునే క్రీమ్ వల్ల కాదని తెగేసి చెప్పటం విశేషం. దాంతో కంగనా నిర్ణయాన్ని అందరూ శభాష్ అని మెచ్చుకున్నారు. ఇక కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న సెలిబ్రిటీలు తమను కోట్లాది మంది ఫాలో అవుతున్నారనే విషయాన్ని కాస్త ఆలోచిస్తే మంచిదేమో. ప్రకటనల్లో నటించేటప్పుడు వచ్చే రెమ్యూనరేషన్‌తో పాటు ఆ ఉత్పత్తి ఎలాంటిది? జనానికి మంచి చేసేదా.. చెడు చేసేదా అనే విషయాలపై తారలు '2 మినిట్ మ్యాగీ'తో అయినా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మ్యాగీపై నిషేధం, నోటీసులు, కోర్టు కేసుల నేపథ్యంలో ఈ ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. అదేదో యాడ్‌లో కష్టాల్లో ఉన్న యువతిని... ఓ బ్రాండ్ బనియన్ ధరించిన యువకుడు రక్షించినట్లు ఈ బ్రాండ్ అంబాసిడర్లను ఎవరు కాపాడతారో చూడాలి. -
టూ మినిట్స్...
(వెబ్ సైట్ ప్రత్యేకం) టూ మినిట్స్ మాగీ నూడుల్స్ అంటూ రెండో ఆలోచన రానివ్వకుండా, జీవితాల్లోకి చొచ్చుకొచ్చిన మాగీ నూడుల్స్‌కు దేశవ్యాప్తంగా ప్రజలు బానిసలుగా మారిపోయారంటే అతిశయోక్తి కాదు. బద్ధకంగా ఉన్నా, ఓపిక లేకపోయినా అప్పటికపుడు ఏదైనా తినాలనిపించినా ఠక్కున గుర్తొచ్చే ది మ్యాగీ నూడుల్స్. అంతలా మ్యాగీ నూడుల్స్ మహిళలు, పిల్లల జీవితాలతో మమేకమై పోయింది. అలాంటి ఆ ప్యాకెట్ ఇపుడు విషమైపోయిందని తెలిసి నివ్వెరపోతున్నారు. సీసం మోతాదు ఎక్కువైందని, చిన్నారులకు ప్రాణాలకు తీవ్ర హాని కలిగించేంత ప్రాణాంతకంగా మారే ప్రమాదముందన్న అధికారుల హెచ్చరికలతో మ్యాగీ నూడుల్స్ తయారీ సంస్థ నెస్లే ఇండియా లిమిటెడ్ మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. యూపీలో రగిలిన ఈ రగడ దేశంలోని చాలా రాష్ట్రాలకు పాకుతోంది. యూపీ, కేరళ రాష్ట్రాల్లో నిషేధించారు. ఢిల్లీ సర్కార్ 15 రోజులపాటు మ్యాగీని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కేరళ, యూపీలోనూ ఈ ఉత్పత్తులను ఉపసంహరించుకోవాల్సిందిగా నెస్లే ఇండియాను అధికారులు ఆదేశించారు. ఇంకా పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, బీహార్, హర్యానా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు తాజాగా అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోనూ మ్యాగీ శ్యాంపిళ్ల పరీక్షలు మొదలయ్యాయి. తెలంగాణా ప్రభుత్వం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంటులో పరీక్షలు చేయిస్తోంది. మరోవైపు దీనిపై కొత్త చట్టం చేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి రాం విలాశ్ పాశ్వాన్ ప్రకటించారు. అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన మ్యాగీ శ్యాంపిళ్ల ఫలితాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఐ) నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని ఆయన ప్రకటించారు. అలాగే ఎన్సీడీఆర్సీ( నేషనల్ కన్జ్యూమర్ రెడస్సల్ కమిటీ)లో ఫిర్యాదు చేయడానికి కేంద్రం సన్నద్ధమౌతోంది. సాధారణంగా వినియోగదారులు ఫిర్యాదులను విచారించే ఎన్సీడీఆర్సీ, 1986 చట్టం, సెక్షన్ 12-1-D ప్రకారం ప్రభుత్వ ఫిర్యాదులను కూడా స్వీకరిస్తుంది. దీని ప్రకారం నేరం రుజువైతే 5 లక్షల జరిమానాతో పాటు ఆరు సంవత్సరాల జైలు శిక్ష పడొచ్చు. అంతేకాదు జైలు శిక్ష ఏడేళ్లతో పాటు, జరిమానా 10 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ఈ వివాదం ముగియకముందే ఇదే సంస్థకు (నెస్లే) చెందిన పాల పొడిలో పురుగులు ఉన్నాయన్న వార్త మరింత ఆందోళన కలిగిస్తోంది. తన 18 నెలల పసిపాప కోసం కొన్న పాలపొడిలో పురుగులను గమనించి షాకైన తమిళనాడుకు చెందిన ఓ వినియోగదారుడు కోయంబత్తూరులో ఫిర్యాదు చేశాడు. పాలపొడిలో అండదశలో ఉన్న సజీవ లార్వా ఉన్నాయన్న వార్తలు జనం గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దీంతో నెస్లే ఇండియా కంపెనీ రూపొందిస్తున్న ఆహార ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. పెరుగుతున్న ఫాస్ట్ ఫుడ్ కల్చర్ దుష్పరిణామాలను మ్యాగీ వివాదం..మరోసారి వెలుగులోకి తెచ్చినట్లు అయ్యింది. ఫాస్ట్‌ఫుడ్‌ను ఆరగించే ముందు మనం కూడా రెండు నిమిషాలు ఆగి ఆలోచించక తప్పని స్థితి. మరోవైపు ఈ వివాదంలో బాలీవుడు నటులు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ముఖ్యంగా 'దో బూంద్ ..' లాంటి పోలియో నివారణ ప్రచార ప్రకటనతో ఆకట్టుకున్న బిగ్ బి అమితాబ్ కూడా ఈ వివాదంలో ఇరుక్కున్నారు. ఇక ముందు ఇలాంటి ప్రకటనలకు ఒప్పుకునే ముందు కచ్చితంగా నటులు, సెలబ్రిటీలు 'రెండు నిమిషాలు* ఆలోచించు కోవాల్సిందే.. -
బాలీవుడ్ సెలబ్రిటీలకు శివసేన బాసట
ముంబై: 'మ్యాగీ నూడుల్స్' వివాదంలో ఇరుక్కున్న బాలీవుడ్ ప్రముఖులకు శివసేన బాసటగా నిలిచింది. మ్యాగీ ప్రకటనల్లో నటించినందుకు బాలీవుడ్ తారలపై కేసులు నమోదు చేయడాన్ని తప్పుబట్టింది. వాణిజ్య ప్రకటనల్లో నటించే సెలబ్రిటీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించిన హానికర రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మాధురీ దీక్షిత్, అమితాబ్ బచ్చన్, ప్రీతి జింతా న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. మ్యాగీ తయారీలో నిబంధనలు ఉల్లంఘించినా ఇప్పటివరకు క్వలిటీ కంట్రోల్ విభాగం ఏం చేస్తోందని శివసేన అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నీలమ్ గోర్హి ప్రశ్నించారు. ఈ నిర్లక్ష్యం కారణంగా పలుతరాలు ఆరోగ్య పరంగా నష్టపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా ఉత్పత్తిని ప్రమోట్ చేసేముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని బ్రాండ్ అంబాసిడర్లు, మోడల్స్, నటులకు ఆమె సూచించారు. -
మ్యాగీపై ముప్పేట దాడి
‘రెండు నిమిషాల్లో నూడిల్స్...’ అంటూ మార్కెట్లో తిరుగులేని లీడర్‌గా చలామణిలో ఉన్న మ్యాగీకి కష్టాలన్నీ కట్టగట్టుకుని ఒకేసారి వచ్చినట్టున్నాయి. అది మూడు దశాబ్దాలుగా దేశంలో నిర్మించుకుంటూ వచ్చిన సామ్రాజ్యం పదిరోజుల వ్యవధిలో తలకిందులైంది. యూపీకి చెందిన ఆహార, ఔషధ నిర్వహణ సంస్థ (ఎఫ్‌డీఏ) సీనియర్ అధికారి ఒకరు యాదృచ్ఛికంగా చేసిన తనిఖీ దాని తలరాతను మార్చేసింది. మ్యాగీ నూడిల్స్‌లో అత్యంత హానికరమైన సీసం, మోనోసోడియం గ్లూటామేట్ (ఎంఎస్‌జీ) వంటివి పరిమితికి మించిన స్థాయిలో ఉన్నాయని పరీక్షలో వెల్లడైంది. నిరుడు మార్చిలో తయారైన ఆ బ్యాచ్ ఉత్పత్తులను వెనక్కు తీసుకోవాలంటూ మ్యాగీ ఉత్పత్తిదారులైన స్విట్జర్లాండ్‌కు చెందిన నెస్లే సంస్థను ఆదేశించడంతోపాటు మ్యాగీ వాణిజ్య ప్రకటనల్లో నటించిన మాధురీ దీక్షిత్‌కు కూడా నోటీసులు పంపింది. ఇంతలో బీహార్‌లోని ఒక న్యాయస్థానం మ్యాగీపై వచ్చిన ఫిర్యాదును స్వీకరించడంతోపాటు మాధురీ దీక్షిత్, అమితాబ్‌బచ్చన్, ప్రీతీ జింటాలపై ఎఫ్ఐఆర్ నమోదుచేయమని పోలీసులను ఆదేశించింది. ఆ వెనకే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేల్కొన్నాయి. మ్యాగీ శాంపిల్స్ సేకరించి వెనువెంటనే పరీక్షలు జరిపే పనిలోబడ్డాయి. మహారాష్ట్ర, గోవా, కేరళ రాష్ట్రాల్లో అంతా సవ్యంగానే ఉన్నదని నివేదికలు రాగా ఢిల్లీలో మాత్రం వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. నెస్లే సంస్థ ఇచ్చిన సంజాయిషీతో సంతృప్తి చెందని ఆప్ సర్కారు... తుది నిర్ణయం తీసుకోవడానికి వీలుగా పక్షం రోజులపాటు మ్యాగీ అమ్మకాలను ఆపేయాలని దుకాణాలకు ఆదేశాలిచ్చింది. మరికొన్ని రాష్ట్రాలు నివేదికల కోసం ఎదురు చూస్తున్నామని చెబుతున్నాయి. ఈలోగా నెస్లేపై వినియోగదారుల వివాద పరిష్కార సంఘం (ఎన్సీడీఆర్సీ)లో ఫిర్యాదుచేయాలని కేంద్రం నిర్ణయించింది. తాము జరిపించిన పరీక్షల్లో అంతా సవ్యంగానే ఉన్నట్టు తేలిందని నెస్లే సంస్థ చెబుతోంది. హఠాత్తుగా మొదలై కొనసాగుతున్న ఈ హడావుడి అంతా గమనిస్తే పదేళ్లక్రితం బహుళజాతి సంస్థలు ఉత్పత్తిచేసే శీతల పానీయాల్లో పురుగుమందుల అవశేషాలున్నా యని వెలువడిన కథనాలు గుర్తొస్తాయి. అప్పుడు కూడా శీతల పానీయాలపై నలు మూలల నుంచీ దాడి జరిగింది. వాటి అమ్మకాలపై అప్పట్లో కేరళ ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, ఆహార ఉత్పత్తులను నిషేధించే అధికారం రాష్ట్రాలకు లేదని కేరళ హైకోర్టు కొట్టేయడంతో అమ్మకాలు యధావిధిగా మొదలయ్యాయి. అటు తర్వాత బహుళజాతి సంస్థలు దారికొచ్చి స్వచ్ఛమైన పానీయాలు అందిస్తున్నాయా లేక అదే తంతు కొనసాగుతున్నదా అనేది ఎవరికీ తెలియదు. వాటి సామ్రాజ్యాలు మాత్రం అప్పటితో పోలిస్తే బాగా విస్తరించాయి. మారిన కాలమాన పరిస్థితుల్లో అలాంటి సంస్థలు బాట్లింగ్ యూనిట్లు స్థాపించడం ఏ రాష్ట్రానికైనా ప్రతిష్టాత్మకమైన అంశంగా మారింది. ఆహార పదార్థాల్లో కల్తీ, హానికారక పదార్థాలుండటంవంటి అంశాల్లో ఎప్పటి కప్పుడు తనిఖీలు చేసి చర్యలు తీసుకునేందుకు మన దేశంలో చాలా వ్యవస్థలు న్నాయి. కానీ, అవి సక్రమంగా పనిచేస్తున్న దాఖలాలు కనబడవు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) మొదలుకొని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏ) వరకూ ఎన్నో ఉన్నాయి. ఆసియాలో చైనా తర్వాత అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న మన దేశంలోకి ఎన్నో ఉత్పత్తులు వచ్చిపడుతున్నాయి. ఈ ఉత్పత్తులపై సక్రమంగా పరీక్షలు నిర్వహిస్తున్నారా... అవి సురక్షితమైనవేనని నిర్ధారణ కొచ్చిన తర్వాతనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు అంగీకరిస్తున్నారా అనేది ఎవరికీ తెలియదు. ఆకర్షణీయమైన ప్యాక్‌లతో, అదరగొట్టే ప్రకటనలతో జనంలోకి చొచ్చుకుపోతున్న బహుళజాతి సంస్థల ఉత్పత్తులకు స్వల్పకాలంలోనే కావలసినంత ప్రచారం లభించి అమ్మకాలు పెరుగుతాయి. సినీతారలను, క్రీడా దిగ్గజాలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుని తమ ఉత్పత్తులు వాడటం ఆధునికతకూ, ఉత్తమాభిరుచికీ నిదర్శన మని వారితో చెప్పిస్తుంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి జనం మోసపోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. మ్యాగీ నూడిల్స్ ద్వారానే నెస్లే సంస్థ ఏటా రూ. 1,500 కోట్ల వ్యాపారం చేస్తున్నదని మార్కెట్ నిపుణుల అంచనా. మ్యాగీ నూడిల్స్ వంటివి ప్రాచుర్యం పొందడానికి జీవితంలో వచ్చిన వేగం కూడా ఒక కారణం. నోరూరించే రుచితో పిల్లల్ని ఆకట్టుకున్నది గనుక.... ఇంట్లో తినడానికి ఏం ఉండాలో నిర్ణయించేది వారే గనుక మ్యాగీ అమ్మకాలు బాగా పెరిగాయని చెబుతున్నారు. అంతకుమించి వంటిళ్లలో మగ్గిపోతున్న ఇల్లాళ్ల శ్రమను అది బాగా తగ్గించడం కూడా ఒక కారణమని చెప్పాలి. అది చెప్పుకుంటున్నట్టు రెండు నిమిషాల్లో కాకపోయినా పది నిమిషాల్లో ఆ నూడిల్స్ రెడీ అవుతుంటే గంటల సమయం పట్టే ఇతర వంటకాల జోలికి వెళ్లడానికి ఎవరూ సిద్ధపడరు. అలాగే మహానగరాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం వచ్చి ఒంటరిగా ఉండే యువతకూ, హాస్టల్స్‌లో ఉంటూ వేళపట్టున భోజనం చేయడం వీలుగానివారికి నెస్లే వంటి సంస్థలు ఉత్పత్తి చేసే ఫాస్ట్ ఫుడ్స్ వరంగా మారతాయి. ఆకర్షణీయంగా కనబడే ప్యాక్‌లపై ఏం రాసివుందో, అలా రాసినవన్నీ అందులో ఉన్నాయో, లేదో...అందులో పేర్కొనని ప్రమాదకర పదార్ధాలు ఇంకేమి ఉన్నాయో ఆరా తీసే ఓపికా, తీరికా ఎవరికీ ఉండవు. ఆ పని చేయాల్సిన సంస్థలు ఎన్నో కారణాలతో నిర్లిప్తంగా ఉండిపోతాయి. ఇప్పుడు మ్యాగీలో ఉన్నాయని చెబుతున్న హానికర పదార్థాల వల్ల పిల్లల్లో మేధో శక్తి తగ్గిపోతుందని, నరాల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నదని, గుండె సంబంధ వ్యాధులు పెరగవచ్చునని, కిడ్నీలు దెబ్బతినవచ్చునని చెబుతున్నారు. దీర్ఘకాలం తింటే లివర్ పనితీరు పాడయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇన్ని రకాలుగా ముప్పు పొంచివుండే ఆహార ఉత్పత్తులపై నిఘా ఉంచాల్సిన సంస్థలు మరి ఇన్నాళ్లుగా ఎందుకు మౌనంగా ఉండిపోయాయో అర్ధంకాని విషయం. మ్యాగీ నూడిల్స్‌కు జనాదరణ బాగా ఉండొచ్చుగానీ, దాంతోపాటే చాలా సంస్థల ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. నూడిల్స్ మాత్రమే కాదు... ఇంకా ఎన్నో రకాల ఫాస్ట్ఫుడ్స్ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఈ అనుభవంతోనైనా వాటన్నిటిపైనా సమగ్రంగా పరీక్షలు నిర్వహించి ప్రజలకు సురక్షితమైన ఆహార పదార్థాలు లభ్యమయ్యేలా చూడటం తమ కనీస బాధ్యతని ప్రభుత్వాలు గుర్తించాలి. మ్యాగీ సంగతి ఎలా ఉన్నా... ఏదైనా ఉత్పత్తిని కొనాలని చెప్పే ముందు ఆ సంస్థలిచ్చే సొమ్ములే కాక ఇతరత్రా అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సెలబ్రిటీలు తెలుసుకోవాలి. -
ఢిల్లీలో మ్యాగీపై నిషేధం
15 రోజుల పాటు వేటు వేసిన రాష్ట్ర సర్కారు ♦ నూడుల్స్‌లో సీసం మోతాదు అధికంగా ఉందని పరీక్షల్లో వెల్లడి ♦ మ్యాగీ నూడుల్స్ వినియోగాన్ని నిలిపివేయాలని సైన్యం ఆదేశం ♦ బిగ్‌బజార్, కేంద్రీయ భండార్లలో మ్యాగీ విక్రయాల నిలిపివేత ♦ తెలుగు రాష్ట్రాలు సహా అన్ని రాష్ట్రాల్లోనూ నూడుల్స్‌కు పరీక్షలు ♦ తమిళనాడులో నెస్లే పాలపొడిలో బయటపడ్డ సజీవ లార్వా! సాక్షి, న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించిన హానికర రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. వాటి విక్రయాలపై ఢిల్లీ ప్రభుత్వం 15 రోజుల పాటు నిషేధం విధించింది. ఈ ఫాస్ట్ ఫుడ్ (తక్షణ ఆహారం)ను వినియోగించరాదని సైన్యం కూడా బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ సూపర్ మాల్స్ అయిన బిగ్ బజార్, కేంద్రీయ భండార్లు దేశవ్యాప్తంగా గల తమ దుకాణాల్లో వీటి విక్రయాలను నిలిపివేశాయి. ఇతర రాష్ట్రాలు సైతం మ్యాగీ నూడుల్స్ సహా వివిధ రకాల ఫాస్ట్ ఫుడ్లపై నాణ్యతా పరీక్షలకు ఆదేశాలిచ్చాయి. మరోవైపు.. గతంలో ఎన్నడూ లేని విధంగా మ్యాగీ నూడుల్స్ తయారు చేస్తున్న ‘నెస్లే ఇండియా’ సంస్థపై కేంద్ర ప్రభుత్వం సైతం జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆహార భద్రతా ప్రమాణాలను ఆ సంస్థ ఉల్లంఘించిందని ఆరోపించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన బహుళజాతి సంస్థ భారతీయ విభాగమైన నెస్లే ఇండియా సంస్థ తయారు చేసి, పంపిణీ చేస్తున్న ఫాస్ట్ ఫుడ్ ఉత్పత్తుల్లో ‘2 మినిట్ మ్యాగీ నూడుల్స్’ విస్తృత ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. ఈ నూడుల్స్‌లో పరిమితికి మించిన హానికర రసాయనాలు ఉన్నట్లు ఫిర్యాదులు రావటంతో.. ఈ ఉత్పత్తి వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్న సినీనటులు అమితాబ్‌బచ్చన్, మాధురీదీక్షిత్, ప్రీతిజింటాలపై కేసులు నమోదు చేయాలని బిహార్ కోర్టు మంగళవారం ఆదేశాలు ఇచ్చిన విషయమూ విదితమే. ఈ కేసు విషయంలో చట్ట ప్రకారం సహకరిస్తానని అమితాబ్ చెప్పారు. 13 నమూనాల్లో పదింట అధికంగా సీసం మ్యాగీ నూడుల్స్‌కు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో 13 మాగీ నూడుల్స్ నమూనాలను పరీక్షించగా 10 నమూనాల్లో సీసం మోతాదు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఢిల్లీ సర్కారు తెలిపింది. ఈ విషయమై నెస్లే ఇండియా ప్రతినిధులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ పేర్కొన్నారు. దీంతో.. రాష్ట్రంలో వీటి విక్రయాలపై 15 రోజులు నిషేధం విధించినట్లు తెలిపారు. నగరంలో ప్రస్తతం ఉన్న మ్యాగీ నూడుల్స్ స్టాకును 15 రోజుల్లో వెనక్కి తీసుకుని.. కొత్త స్టాకును అందుబాటులోకి తేవాలని నెస్లే ఇండియాను ఆదేశించామన్నారు. కొత్త స్టాకును కూడా పరీక్షించి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విక్రయించటానికి అనుమతిస్తామని చెప్పారు. ఆహార కల్తీ చట్టంలోని నిబంధనల కింద నెస్లే ఇండియా సంస్థపై కోర్టులో కేసు దాఖలు చేస్తామన్నారు. ఆహార కల్తీకి పాల్పడే వారిని కఠినంగా శిక్షించే విధంగా చట్టాన్ని కూడా సమీక్షించి మార్పులు చేస్తామని తెలిపారు. అలాగే.. ఇతర సంస్థలు ఉత్పత్తి చేసి విక్రయిస్తున్న నూడుల్స్పైనా పరీక్షలకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లోనూ నూడుల్స్‌కు పరీక్షలు మరోవైపు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్, హరియాణా తదితర రాష్ట్రాలు కూడా మాగీ నూడుల్స్ నమూనాలను సేకరించి ఆహార భద్రతా ప్రమాణాల పరీక్షలు చేపట్టాయి. పశ్చిమబెంగాల్లో కురుకురే, లేస్ వంటి ప్రజాదరణ పొందిన చిరుతిళ్ల నమూనాలనూ పరీక్షిస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి సాధన్ పాండే తెలిపారు. అయితే.. మహారాష్ట్ర, కేరళ, గోవా ప్రభుత్వాలు మాత్రం తాము నిర్వహించిన పరీక్షల్లో ప్రతికూల నివేదికలేవీ రాలేదని పేర్కొనటం నెస్లే ఇండియాకు కాస్త ఊరటనిస్తోంది. ఇదిలావుంటే.. నెస్లే ఇండియా తయారు చేసే పాల పొడి ఉత్పత్తిలో సజీవ లార్వా ఉందని, ఇది వినియోగించటం ప్రమాదకరమని పరీక్షల్లో ప్రాథమికంగా తేలిందని తమిళనాడు అధికారులు అనధికారికంగా తెలిపారు. సరైన అవగాహన లేదు.. ఆహార పదార్థాల ప్యాకెట్లపై ముద్రించే సమాచారం గురించి వినియోగదారులకు సరైన అవగాహన లేదని, ప్యాకెట్లలో ఉన్న ఆహారం గురించి కచ్చితమైన వివరాలు తెలుసుకోవడం వారి హక్కు అని బుధవారం ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ)’ సంస్థ పేర్కొంది. దేశంలో సెలబ్రిటీల వ్యాపార ప్రకటనలను నియంత్రించేందుకు చట్టపరంగా నిబంధనలు లేవని, అలాంటి ప్రకటనలను కచ్చితంగా నియంత్రించేందుకు నిబంధనలు రూపొందించాలని సూచించింది. వివాదం ఎలా మొదలైంది..? మ్యాగీ.. రెండు నిమిషాల్లోనే నూడుల్స్! దేశంలోనే తొలి ఇన్స్టంట్ నూడుల్స్ బ్రాండ్ ఇది. అంతర్జాతీయ కంపెనీ నెస్లే 1947 నుంచే అందిస్తున్న ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దలనూ బాగా ఆకట్టుకుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లో విక్రయిస్తున్న మ్యాగీ నూడుల్స్‌లో సీసం(లెడ్), మోనోసోడియం గ్లుటామేట్‌లు అనుమతించిన మోతాదు కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు గతనెలలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించడంతో వివాదం మొదలైంది. ఆహార పదార్థాల్లో సీసం 0.01 పీపీఎం మాత్రమే ఉండాలి. కానీ లక్నోలో స్వాధీనం చేసుకున్న మ్యాగీ శాంపిళ్లలో ఏకంగా 17 పీపీఎంల సీసం ఉన్నట్లు తేలింది. దీంతో దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇందులో మోతాదుకు మించి ఉన్నాయంటున్న లెడ్(సీసం), మోనోసోడియం గ్లుటామేట్(ఎంఎస్‌జీ)ల వల్ల మన ఆరోగ్యానికి ఎంత హానికరం అని పరిశీలిస్తే... మోనోసోడియం గ్లుటామేట్ (ఎంఎస్‌జీ) గ్లుటామిక్ యాసిడ్, దాని గ్లుటామేట్‌లు(అయాన్లు, లవణాలు) కలిపితే మోనోసోడియం గ్లుటామేట్ ఏర్పడుతుంది. ఆహార పదార్థాల రుచిని పెంచేందుకు దీనిని కలుపుతారు. ఇది మోతాదుకు మించితే.. ♦ తలనొప్పి, చికాకు, అసౌకర్యం కలుగుతాయి. ♦ కొంతమందిలో ‘చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్’ వస్తుంది. ♦ ఈ సిండ్రోమ్ వల్ల తలపోటు, వెన్ను, నొప్పులు, మగత కలుగుతాయి. ♦ ఛాతీలో మంట, దవడలు బిగుసుకుపోవడం, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. సీసం(లెడ్) ♦ ప్రాథమికంగా ఇది లోహం. విషపూరితం. ♦ గాలి, నీరు, ఆహారం, అనేక రకాలుగా మనుషుల్లోకి చేరుతుంది. ♦ ఆహార పదార్థాల్లోకి నీరు, పదార్థాలు, ప్యాకేజింగ్, ఇతర మార్గాల్లో వస్తుంది. ఇది మోతాదుకు మించితే.. ♦ కడుపు నొప్పి, తలనొప్పి వస్తాయి. ♦ గందరగోళం, చికాకు కలుగుతాయి. ♦ రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ♦ మోతాదు మరీ మించితే.. మూర్ఛ. కోమాలోకి వెళతారు. మరణమూ సంభవించవచ్చు. -
బిగ్బజార్లలో మ్యాగీపై నిషేధం
-
కుప్పకూలిన నెస్లే ఇండియా షేర్లు
ముంబై: ముదురుతున్న మ్యాగీ వివాదం నెస్లే ఇండియా కంపెనీని ఘోరంగా దెబ్బతీస్తోంది. బుధవారం స్టాక్మార్కెట్లో నెస్లే ఇండియా కంపెనీ లిమిటెడ్ షేర్ భారీగా పతనమైంది. ఈ కంపెనీ షేర్ 10.11 శాతం మేర నష్టపోయింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో దాదాపు రూ. 600 మేరకు నష్టపోయింది. ఒక దశలో 6 వేల రూపాయల దగ్గర ట్రేడయిన షేర్ చివర్లో తేరుకుని చివరికి 6,191 దగ్గర క్లోజ్ అయింది. గత 24 రోజులుగా రగులుతున్న ఈ వివాదంపై నెస్లే ఇండియా కంపెనీని బీఎస్ఈ వివరణ కోరింది. సీసం మోతాదు ఎక్కువైందని చిన్నారులకు ప్రాణాంతంకంగా మారే ప్రమాదముందన్న అధికారుల హెచ్చరికలతో మ్యాగీ నూడుల్స్ తయారీ సంస్థ నెస్లే చిక్కుల్లో పడింది. యూపీలో కేరళలో మ్యాగీ ఉత్పత్తులను నిషేధించారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, బీహార్, హర్యానా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోను మ్యాగీ శ్యాంపిళ్ల పరీక్షలు మొదలయ్యాయి. మరోవైపు దీనిపై కొత్త చట్టం చేయాలని కేంద్రం యోచిస్తోందని కేంద్ర ఆహారమంత్రి రాం విలాస్ పాశ్వాన్ ప్రకటించారు. ఈ వివాదం ఇలా ఉండగానే ఇదే సంస్థకు (నెస్లే) చెందిన పాల పొడిలో పురుగులు ఉన్నాయన్న వార్త మరింత సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ కంపెనీ అధికారులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సెస్లే షేర్లను కొనుక్కోవడానికి ఇది మంచి సమయమని ప్రముఖ ఫండ్ మేనేజర్ అశ్విని గుజ్రాల్ ఇన్వెస్టర్లకు సలహా ఇస్తున్నారు. -
బిగ్బజార్లలో మ్యాగీపై నిషేధం
మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ దుకాణాలన్నింటి నుంచి తక్షణం మ్యాగీని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం తెలిపింది. దాంతో బిగ్ బజార్ కూడా తమ మాల్స్ అన్నింటి నుంచి మ్యాగీని ఉపసంహరించాలని నిర్ణయించుకుంది. అంటే ఇక బిగ్ బజార్లలో మ్యాగీ ప్యాకెట్లు దొరకవు మాట. సీసంతో పాటు మోనోసోడియం గ్లూటామేట్ మోతాదును మించి అధిక పరిమాణంలో ఉండటంతో దీన్ని నిషేధించారు. మొత్తం 13 శాంపిళ్లను పరీక్షించగా.. వాటిలో 10 శాంపిళ్లలో అనుమతించిన దానికంటే అత్యధిక మోతాదులో సీసం, ఎంఎస్‌జీ ఉన్నట్లు తేలింది. కేంద్రీయ భండార్ సహా ఢిల్లీ ప్రభుత్వ దుకాణాలు అన్నింటిలోనూ మ్యాగీ అమ్మకాలను నిషేధించారు. మ్యాగీ నూడుల్స్‌ను మిస్‌బ్రాండింగ్ చేసింనదుకు జరిమానా వేస్తామని, అలాగే అరక్షిత ఉత్పత్తులను అమ్ముతున్నందుకు నెస్లెపై కేసు పెడతామని ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 10 రాష్ట్రాలు మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం విధించడమో.. లేదా శాంపిళ్లను పరీక్షలకు పంపడమో చేశాయి. ఇప్పటివరకు పరీక్షించిన శాంపిళ్లలో 80 శాతం వరకు మనుషులు ఉపయోగించడానికి ప్రమాదకరం అని తేలడంతో మార్కెట్ నుంచి తక్షణం మ్యాగీ ప్యాకెట్లను ఉపసంహరించాలని ఆదేశించినట్లు ఢిల్లీ ఆరోగ్యమంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. -
కేరళను ఫాలో అవుతున్న కర్ణాటక!
బెంగళూరు: మ్యాగీ నూడుల్స్ వ్యవహారంలో కేరళ రాష్ట్రాన్ని కర్ణాటక కూడా అనుసరిస్తోంది. కేరళతో సహా మొత్తం అయిదు రాష్ట్రాల్లో మ్యాగీపై నిషేధాన్ని విధించిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సైతం మ్యాగీ అమ్మకాలను నిషేధించే దిశగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని వివిధ షాపింగ్ మాల్స్, దుకాణాల నుంచి మ్యాగీ శాంపిల్స్‌ను రాష్ట్ర ఆహార భద్రతా విభాగం అధికారులు సేకరించి, పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల నివేదిక అందిన అనంతరం కర్ణాటకలో మ్యాగీ అమ్మకాలను కొనసాగించాలా లేక నిషేధించాలా అనే అంశంపై రాష్ట్రా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కాగా కేరళ రాష్ట్రంలో ఎక్కడా పౌరసరఫరాల కార్పొరేషన్ దుకాణాల్లో మ్యాగీ నూడుల్స్ అమ్మకూడదంటూ నిషేధం విధించారు. మనుషుల ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే కొన్ని రసాయనాలు మోతాదుకు మించి అందులో ఉన్నట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. -
మ్యాగీ నూడుల్స్ సురక్షితం కాదు
-
మ్యాగీ తరహా కేసులకు కొత్త చట్టం!
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా మ్యాగీ నూడుల్స్ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తులు సురక్షితం కాదని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వినియోగదారులకు అత్యంత హానికరంగా మారిన మ్యాగీ తరహా కేసుల్లో కఠిన శిక్షలకు అవకాశమున్న కొత్త చట్టాన్ని రూపొందించడానికి కేంద్ర కసరత్తులు చేస్తోంది. ఈ తరహా కేసులకు కొత్త చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. నిత్యావసర వస్తువులు, ఆహార పదార్ధాలను ఉత్పత్తి చేస్తూ వినియోగదారులను మోసం చేసేవారికి, అలాంటి హానికర పదార్ధాలు, వస్తువులకు ప్రచారం కల్పిస్తున్న వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలన్నప్రతిపాదన ఆ చట్టంలో పొందుపరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమితాబ్, మాధురీ, ప్రీతి జింటాలపై కేసు నమోదు.. యాగీ నూడుల్స్ వివాదం దాని ప్రచారకర్తలు, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటాలను వెంటాడుతోంది. యూపీలో ఈ ముగ్గురిపై కేసులు నమోదు చేయగా, తాజాగా బీహార్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. అమితాబ్, మాధురీ, ప్రీతిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ముజఫర్‌పూర్ కోర్టు ఆదేశించింది. -
ఆ ముగ్గురు నటులపై బీహార్‌లోనూ కేసు
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ వివాదం దాని ప్రచారకర్తలు, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటాలను వెంటాడుతోంది. యూపీలో ఈ ముగ్గురిపై కేసులు నమోదు చేయగా, తాజాగా బీహార్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. అమితాబ్, మాధురీ, ప్రీతిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ముజఫర్‌పూర్ కోర్టు ఆదేశించింది. ఇక మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తిదారులకు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. మ్యాగీ ఉత్పత్తులు సురక్షితం కాదని లాబ్ పరీక్షల్లో తేలినట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. కేరళలో వీటిపై నిషేధం విధించారు. -
మ్యాగీ నూడుల్స్ సురక్షితం కాదు
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తులు సురక్షితం కాదని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. మ్యాగీ శాంపిల్స్‌ను లాబ్‌లో పరీక్షించగా, మోతాదుకు మించి సీసం వాడినట్టు తేలినట్టు వెల్లడించింది. దీంతో మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తిదారులకు, ప్రచారకర్తలకు చిక్కులు తప్పకుపోవచ్చు. కేరళ రాష్ట్రంలో ఎక్కడా పౌరసరఫరాల కార్పొరేషన్ దుకాణాల్లో మ్యాగీ నూడుల్స్ అమ్మకూడదంటూ నిషేధం విధించారు. మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను తక్షణం నిలిపివేయాలని కేరళ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్ పౌరసరఫరాల కార్పొరేషన్‌కు సూచించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ విషయంపై బుధవారం నిర్ణయం తీసుకోనుంది. ఇక బీహార్, ఉత్తరాఖండ్‌లోనూ కేసులు నమోదయ్యాయి. -
మ్యాగీ నూడుల్స్‌ను నిషేధించిన కేరళ
కేరళ రాష్ట్రంలో ఎక్కడా పౌరసరఫరాల కార్పొరేషన్ దుకాణాల్లో మ్యాగీ నూడుల్స్ అమ్మకూడదంటూ నిషేధం విధించారు. మనుషుల ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే కొన్ని రసాయనాలు మోతాదుకు మించి అందులో ఉన్నట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను తక్షణం నిలిపివేయాలని కేరళ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్ పౌరసరఫరాల కార్పొరేషన్‌కు సూచించారు. నూడుల్స్ నాణ్యత మీద ఒక స్పష్టత వచ్చేవరకు ఈ నిషేధం కొనసాగుతుందని పైర సరఫరాల కార్పొరేషన్ తెలిపింది. ఇప్పటివరకు అమ్ముడుపోకుండా మిగిలిన నిల్వలను నెస్లె కంపెనీకి తిప్పి పంపేస్తారు. కేరళ పౌరసరఫరాల కార్పొరేషన్‌కు ఆ రాష్ట్రంలో 1355 ఔట్లెట్లు ఉన్నాయి. -
పాలపొడిలో పురుగులు.. నెస్లెకు మరిన్ని కష్టాలు
ఇప్పటికే మ్యాగీ నూడుల్స్ వివాదంతో తలపట్టుకున్న నెస్లె ఇండియా కంపెనీకి మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. తమిళనాడులో ఓ వ్యక్తి కొనుగోలు చేసిన పిల్లల పాలపొడిలో పురుగులు కనిపించాయి. కోయంబత్తూరుకు చెందిన కె. ప్రేమ్ అనంత్ అనే టాక్సీ డ్రైవర్ తన కవల పిల్లల కోసం నెస్లె వారి నాన్ ప్రో3 అనే పాల పొడిని కొన్నారు. కానీ అందులో లార్వాతో పాటు.. సాధారణంగా బియ్యంలో కనిపించే పెంకిపురుగులు కూడా వచ్చాయి. 28 లార్వా, 22 పెంకి పురుగులు ఆ పాలపొడి డబ్బాలో ఉండటంతో.. ఆ పాలపొడి సురక్షితమైనది కాదని తమిళనాడు ఆహారభద్రతా విభాగం ప్రకటించింది. 18 నెలల వయసున్న తన కవల పిల్లల్లో ఒకరికి అనంత్ ఆ పాలపొడితో కలిపిన పాలు పట్టేశారు. మరొకరికి కూడా పట్టబోతుంటే.. అప్పుడు పురుగులను గమనించారు. పాలు పట్టిన రెండు రోజుల తర్వాత చర్మం మీద ఎలర్జీ రావడంతో.. ఆ పాపను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. దాంతో అనంత్ నెస్లె కస్టమర్ సపోర్ట్ నెంబరుకు ఫిర్యాదు చేయగా, వాళ్లు ఈ విషయం ఏంటో చూడాలని స్థానిక ఏరియా మేనేజర్ కృష్ణపెరుమాళ్ను పంపారు. ఆయన ఆ డబ్బాకు బదులు మరో డబ్బా ఇస్తామని చెప్పగా, అనంత్ తిరస్కరించారు. దాంతో తమ కంపెనీ ల్యాబ్‌లో దాన్ని పరీక్షిస్తామని తెలిపినా ఒప్పుకోలేదు. తమిళనాడు ఆహారభద్రత, ఔషధ నియంత్రణ విభాగం వద్దకు వెళ్లి శాంపిళ్లను ఇచ్చారు. దాంతో విషయం తేలింది. -
మాధురీ దీక్షిత్‌కు నెస్లె భరోసా
ముంబై: మ్యాగీ నూడిల్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించిన మాధురీ దీక్షిత్.. ఈ ఉత్పత్తుల నాణ్యత లోపాలకు సంబంధించి నోటీసులు రావడంతో కలత చెందారు. మాధురీ శనివారం నెస్లె అధికారులను కలసి వివరణ కోరారు. మ్యాగీ నూడిల్స్ నాణ్యతపై ఎలాంటి సందేహం అక్కర్లేదని నెస్లె అధికారులు ఆమెకు భరోసా ఇచ్చారు. మ్యాగీ ఉత్పత్తులపై విమర్శలు రావడంతో తాను కలత చెందానని మాధురీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ విషయంలో వివరణ కోరేందుకు నెస్లె అధికారులను కలిశానని, నాణ్యత విషయంలో వారు భరోసా ఇచ్చారని మాధురీ తెలిపారు. 'మ్యాగీ.. 2 మినిట్ నూడుల్స్' ప్రచారకర్తగా వ్యవహరించిన మాధురీకి హరిద్వార్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. మాధురితో పాటు బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ప్రీతి జింటాలపైనా వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. మ్యాగీ నూడిల్స్‌లో అనుమతించిన మోతాదు కంటే అధికంగా సీసం వాడారని తేలడంతో వీరిపై కేసులు పెట్టారు. -
అమితాబ్, మాధురి, ప్రీతిలపై మ్యాగీ కేసు
మ్యాగీ వివాదంలో కేసు నమోదైంది. దాని ప్రమాణాల విషయంలో నెస్లె ఇండియా సంస్థతో పాటు.. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, ప్రీతి జింటాలపైనా వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. నెస్లె సంస్థ తయారుచేసే 'మ్యాగీ.. 2 మినిట్ నూడుల్స్' ఉత్పత్తిని ప్రమోట్ చేసినందుకు వారిని కూడా కోర్టుకు లాగారు. నెస్లె ఇండియా, మరో ఐదుగురిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, మరో స్థానిక న్యాయవాది కూడా వేర్వేరుగా కేసులు పెట్టారు. మ్యాగీ నూడుల్స్‌లో అనుమతించిన స్థాయికి మించి సీసం, మోనోసోడియం గ్లుటామేట్ అనే పదార్థాలు ఉన్నాయన్న కారణంతో ఎఫ్ఎస్డీఏ కమిషనర్ పిపి సింగ్ అనుమతి ఇవ్వడంతో.. శనివారం సాయంత్రం ఈ కేసులు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసులు నమోదయ్యాయి. మ్యాగీ శాంపిళ్లను ల్యాబ్‌లో పరిశీలించగా.. అందులో అనుమతించిన మోతాదు కంటే 17 రెట్లు ఎక్కువగా సీసం ఉందని తేలింది. ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అంటున్నారు. ఈ వ్యవహారం ఏంటో చూడాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ కూడా కేంద్ర ఆహారభద్రతా ప్రమాణాల సంస్థను ఆదేశించింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో కూడా ఫిర్యాదు చేస్తే, క్లాస్ యాక్షన్ సూట్‌ను ప్రారంభించొచ్చని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ అంటున్నారు. -
మాధురికి 'మ్యాగీ' చిక్కులు
తప్పుచేసివారితోపాటు అందుకు పలువిధాలుగా సహకరించినవారు కూడా నిందార్హులేనన్న న్యాయసూత్రం బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ విషయంలో మరోసారి రుజువైంది. ప్రకటనల్లో నటించేటప్పుడు పారితోషికమే కాదు సదరు ఉత్పత్తి ఎలాంటిది? జనానికి మంచి చేసేదా.. చెడు చేసేదా అనే విషయాలపై నటీనటులు ఇకనైనా దృష్టిసారించాల్సిన అవసరాన్ని గుర్తుచేసేలా హరిద్వార్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయం సంచలనం రేపింది. ఇంతకీ మాధురీ దీక్షిత్ ఏం చేసింది? ప్రస్తుతం టీవీల్లో ప్రసారమవుతోన్న 'రెండు నిమిషాల్లో నూడుల్స్' ప్రకటనలో మాధురీ దీక్షిత్.. 'అలసిపోయిన పిల్లలు మ్యాగీ నూడుల్స్ తింటే ఇట్టే శక్తి వస్తుంది. నేను తినిపిస్తున్నాను. మీరూ తినిపించండి' అని అంటుంది. ఈ ప్రకటనలో ఆమె చెప్పినట్లుగా నూడుల్స్‌లో న్యూట్రిషన్ విలువలన్నాయన్న మాటలను ఏవిధంగా నిరూపిస్తారో చెప్పాల్సిందిగా హరిద్వార్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం మాధురీ దీక్షిత్ కు నోటీసులు జారీచేసింది. 15 రోజుల్లోగా సంతృప్తికరమైన సమాధానం చెప్పకుంటే కేసు నమోదు చేస్తామని ఫుడ్ సెక్యూరిటీ అధికారి మహిమానంద్ జోషి తెలిపారు. మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించి సీసీం (లెడ్), మోనో సోడియం గ్లూటమేన్ ఉన్నట్లు ఇటీవలే వెలుగులోకి రావడంతో ఒక బ్యాచ్ ఉత్పత్తుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు మ్యాగీ నూడుల్స్ తయారీదారు నెస్లే సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మేగీ నూడుల్స్‌కు మరిన్ని కష్టాలు
చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా తినే మేగీ నూడుల్స్‌కు కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మేగీని తయారుచేసే నెస్లె కంపెనీపై కఠిన చర్యలకు దిగేలా కనిపిస్తోంది. దాదాపు 2 లక్షల ప్యాకెట్లతో కూడిన బ్యాచ్‌ని మార్కెట్ల నుంచి ఉపసంహరించాలని ఆదేశించిన ఎఫ్డిఏ.. ఇప్పుడు మరిన్ని బ్యాచ్‌లను కూడా పరీక్షిస్తోంది. వాటిలో అనుమతించిన స్థాయి కంటే ఎక్కువ మోతాదులో సీసం, ఆహారంలో ఉపయోగించే రంగులు ఉన్నాయని ఎఫ్‌డీఏ తేల్చింది. రుచిని పెంచేందుకు మోనో సోడియం గ్లుటామేట్ (ఎంఎస్‌జీ) అనే రసాయనం చాలా ఎక్కువ మోతాదులో ఉన్నట్లు ఎఫ్‌డీఏ కనుగొంది. దాంతోపాటు సీసం కూడా ఎక్కువగానే ఉన్నట్లు తేల్చింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదలైన మరో మూడు నాలుగు బ్యాచ్‌లను కూడా యూపీ ఎఫ్‌డీఏ పరీక్షిస్తోంది. ఈ పరీక్ష ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఆ నివేదికలో కూడా తేడా కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని బారాబంకి జిల్లా ఆహార అధికారి వీకే పాండే తెలిపారు. ఆహార పదార్థాల్లో సీసం పరిమాణం కేవలం 2.5 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) మాత్రమే ఉండాలని నిబంధనలుండగా.. మేగీలో ఏకంగా 17.2 పీపీఎం ఉందని ఆయన చెప్పారు. అయితే, ఈ నివేదికలను నెస్లే సంస్థ కొట్టిపారేస్తోంది. తాము ఓ స్వతంత్ర సంస్థతో మళ్లీ పరీక్షలు చేయిస్తున్నామని.. దాని ఫలితాలు వచ్చిన తర్వాత వాటిని కూడా అధికారులకు సమర్పిస్తామని చెబుతోంది.