
న్యూఢిల్లీ: కొంత కాలం నుంచి చిత్ర విచిత్రమైన వంటకాలతో ప్రముఖ పాకశాస్త్ర నిపుణులు వాళ్ల కళా నైపుణ్యాలను ప్రదర్శించడమే కాక చాలామంది భోజన ప్రియుల మనస్సులను గెలుచుకున్నారు. అలాగే ఇటీవల కాలంలో మ్యాగీ మిల్క్ షేక్, చాకోలెట్ మ్యాగీ వంటి రకరకాల వంటకాలు చాలానే వచ్చాయి.
(చదవండి: "ఆధార్ తప్పనిసరి కాదు")
ప్రస్తుతం ఆ జాబితాలోకి స్పైసీ మ్యాగీ మిర్చి బజ్జీ అనే ఒక సరికొత్త వంటకం చేరనుంది. దీనికి సంబంధించిన ఇమేజ్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా మిర్చి బజ్జీ అనగానే దానిలోకి నంజుకునే ఉల్లిపాయలు, బఠాణి కూర, కొత్తిమీరతో చక్కగా గార్నిష్ చేసి ఉంటుంది. ఇక ఈ బజ్జీని చూసే వాళ్లకి ఎప్పుడేప్పుడు తినేద్దాం అని తహతహ లాడుతుంటుంది. అలాంటిది మ్యాగీ ప్రియుల కోసం వచ్చిన ఈ సరికొత్త స్పైసీ వంటకం నెటిజన్లను నోరూరిస్తూ ఫిదా చేస్తోంది.
ఇది కూడా మిర్చి బజ్జీలానే కాకపోతే సెనగపిండితో కాకుండా కేవలం వేయించిన మిర్చిలోనే న్యూడిల్స్‌ని స్టవ్ చేసి సర్వ్ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు వాట్ ఏ స్పైసీ మ్యాగీ మిర్చి అంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.
(చదవండి: పెట్రోల్ సంక్షోభానికి చక్కటి పరిష్కారం!)
Comments
Please login to add a commentAdd a comment