mirchi
-
Guntur: రోడ్డెక్కిన మిర్చి రైతులు
-
ఎన్టీఆర్ జిల్లా: ఘోర అగ్నిప్రమాదం.. కోల్డ్‌స్టోరేజ్‌లో కాలిబూడిదైన మిర్చి
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: జగ్గయ్యపేట పట్టణంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కోల్డ్ స్టోరేజ్‌లో మిర్చి బస్తాలు తగలబడిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.తొర్రగుంటపాలెంలోని సాయి తిరుమలగిరి అగ్రి ప్రొడక్ట్స్ కోల్డ్ స్టోరేజ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు నలభై వేల మిర్చి బస్తాలు తగలబడినట్లు సమాచారం. నాలుగు ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. మిర్చి ఘాటుకు తుమ్ములు, దగ్గులతో పరిసరి గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు. నష్టంపై ఇప్పుడే అంచనాకి రాలేమంటున్న అధికారులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. -
తెలుగులో ఆ సినిమాతోనే ఫేమ్.. ఇకపై ఆ పాత్రలు చేయను: సత్యరాజ్
కట్టప్పగా తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు సత్యరాజ్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంతో కట్టప్పగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. తాజాగా ఆయన జీబ్రా మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన సత్యరాజ్ తెలుగు ఇండస్ట్రీలో తన ప్రస్థానంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.సత్యరాజ్ మాట్లాడుతూ..'విలన్‌గానే నా కెరీర్ ప్రారంభించా. మిర్చి సినిమాతో తెలుగులో ఓ మంచి తండ్రిగా ఫేమస్ అయ్యాను. ఆ తర్వాత బాహుబలిలో కట్టప్పగా నటించా. ఇలాంటి పాత్రలు మళ్లీ చేసే అవకాశం రావడం చాలా అరుదు. మిర్చి మూవీతోనే తెలుగులో నాకు ఇమేజ్ వచ్చింది. ఇక నుంచి రెగ్యులర్ విలన్ పాత్రలు చెయ్యను. హీరో ముందు మోకరిల్లే పాత్రల్లో ఇకపై కనిపించను.' అని అన్నారు. (ఇది చదవండి: సత్యదేవ్ 'జీబ్రా' టీజర్ విడుదల)సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా జీబ్రా. ఈ ఏడాదిలో కృష్ణమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. ఇప్పుడు జీబ్రా అనే చిత్రంతో రానున్నాడు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబరు 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందించారు. -
ప్రభాస్‌కి చాలా సిగ్గు.. టికెట్ కొనిచ్చి థియేటర్‌కి పంపాడు: హంసనందిని
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రియల్ లైఫ్‌కి, రీల్ లైఫ్‌కి చాలా తేడా ఉంటుంది. సినిమాల్లో చాలా చలాకీగా ఉంటూ..ఎలాంటి పాత్రనైనా తనదైన నటనతో ఆకట్టుకుంటాడు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం ఇంట్రోవర్ట్. ఎక్కువగా మాట్లాడడు. స్టైజ్‌పై మాట్లాడమంటే సిగ్గుపడుతుంటాడు. అంతేకాదు ఇతరులతో మాటలు కలిపేందుకు కూడా వెనుక ముందు ఆలోచిస్తుంటాడు. తనకు క్లోజ్ అయిన వారితో సరదాగే ఉన్నా..కొత్త వారితో మింగిల్ అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటాడని ప్రభాస్ సన్నిహితులు చెబుతుంటారు. ఒక్కసారి తనతో స్నేహం ఏర్పడితే.. వారిని తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటాడట. ఇక షూటింగ్ టైమ్‌లో అందరికి భోజనాలు తెప్పించే అలవాటు డార్లింగ్‌కి ముందు నుంచే ఉంది.(చదవండి: బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న కల్కి.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?)తాజాగా టాలీవుడ్ హీరోయిన్ హంసనందిని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ‘మిర్చి’ సినిమాలో టైటిల్ సాంగ్‌కి ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేసింది ఈ బ్యూటీ. అయితే వేరే సినిమా షూటింగ్ కారణంగా ఆ సినిమా తాను చూడలేకపోయానని.. ఈ విషయం తెలిసి ప్రభాసే టికెట్ బుక్ చేసి సినిమా చూపించారని హంసనందిని చెప్పింది.(చదవండి: నాగ్ అశ్విన్.. మీ చెప్పులిస్తే ముద్దు పెట్టుకుంటా: బ్రహ్మాజీ)‘ప్రభాస్‌కి చాలా సిగ్గు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. మిర్చి సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత నేను వేరే సినిమాలో బిజీ అయ్యాడు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌ని అందుబాటులో లేను. అలాగే రిలీజ్ టైమ్‌లో కూడా నేను హైదరాబాద్‌కి రాలేదు. కొద్ది రోజుల తర్వాత వేరే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఓ పార్టీలో ప్రభాస్ కలిసి.. ‘నీ సాంగ్ పెద్ద హిట్ అయిందని నీకు తెలుసా?’అని అడిగాడు. నేను సినిమా చూడలేదని చెప్పాను. వెంటనే టికెట్ బుక్ చేసి సినిమా చూడమని చెప్పాడు. అంతేకాదు సినిమాలో నా సాంగ్ ఏ టైమ్‌కి వస్తుందో కూడా చెప్పాడు. నేను అదే టైమ్‌కి థియేటర్‌కి వెళ్లి సినిమా చూశాను’ అని హంసనందిని చెప్పుకొచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 మూవీ తాజాగా రిలీజై బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లో 625 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.#Prabhas Anna Mirchi Movie ki Ticket book chesi, ‘Mirchi’ Song oche timing cheppi mari Theatre ki pampadu anta Hamsa ni! 🥰😅❤️ pic.twitter.com/CgVqqKlkzg— . (@charanvicky_) July 2, 2024 -
అ'ధర'గొట్టిన గుంటూరు మిర్చి ఎగుమతులు
-
మిర్చి ఘాటు.. ఏఐ చెబుతుంది!
రైతులు మార్కెట్ యార్డుకు పంటను తీసుకెళ్తే.. అక్కడి వ్యాపారులు, నిపుణులు ఆ పంటను పరిశీలించి, వాసన చూసి, తేమ ఎంత ఉంటుందో అంచనా వేసి ధర కడతారు. అలా కాకుండా కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే యంత్రాలే.. కాస్త శాంపిల్ చూసి పంట నాణ్యత, తేమశాతం కచ్చితంగా చెప్పేస్తే రైతులకు ఎంతో ఊరట. పని త్వరగా పూర్తవుతుంది, మోసాలకు తావుండదు. వ్యాపారులు కొర్రీపెట్టి ధర తగ్గించేసే అవకాశం ఉండదు. ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్), ఏజీనెక్ట్స్ స్టార్టప్ సంస్థల సహకారంతో ఇలా ఏఐతో పనిచేసే మెషీన్లతో మిర్చి పంట విక్రయాలు కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ (ఏఐ4ఏఐ)’కార్యక్రమంలో భాగంగా.. ‘సాగు–బాగు’పేరిట ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. దీనితో మొత్తం ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – ఖమ్మం వ్యవసాయం మూడు యంత్రాలతో.. మూడు ప్రమాణాల గుర్తింపు మిర్చి పంట నాణ్యతను తేల్చేందుకు ఏఐ ఆధారిత ‘విజియో బాక్స్, 7స్పెక్‌ఎక్స్ ప్రో, 7స్పెక్‌ఎక్స్ కనెక్ట్’గా పిలిచే మూడు యంత్రాలను వినియోగిస్తున్నారు. దీనిలో విజియో బాక్స్‌లో మిర్చిని పెడితే.. అది కాయ పరిమాణం, రంగు, మచ్చలు ఇతర అంశాలను పరిశీలించి నాణ్యతను నిర్ధారిస్తుంది. ♦ 100 గ్రాముల మిర్చిని పరిశీలించి నాణ్యత, రసాయనాల శాతం, తేమశాతాన్ని పరిశీలించడం కేవలం 20–25 నిమిషాల్లో పూర్తవుతుంది. అదే ప్రస్తుత సాధారణ పద్ధతిలో ఒక రోజు వరకు పడుతుంది. ♦ ఏఐ పరికరాల్లో పరిశీలన పూర్తయిన వెంటనే.. మిర్చికి ఏ, బీ, సీ, డీ అంటూ గ్రేడింగ్ ఇస్తుంది. ఈ వివరాలతో ఆటోమేటిగ్గా రైతుల ఫోన్ నంబర్లకు సంబంధిత ఎస్సెమ్మెస్ కూడా వస్తుంది. ♦ నిపుణులు, రైతుల సహకారంతో మిర్చికి సంబంధించిన వేలాది ఫొటోలను అప్లోడ్ చేసి ఏఐ ప్రోగ్రామ్‌ను రూపొందించామని.. దీనితో మంచి నిపుణులతో పోల్చితే 98శాతం కచ్చితత్వంతో ఏఐ యంత్రాలు పనిచేస్తున్నాయని ఏజీ నెక్ట్స్ స్టార్టప్ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. పొలాల వద్దే మిర్చి కొనుగోళ్లు కూడా.. రాష్ట్ర ప్రభుత్వం ‘సాగు– బాగు’కార్యక్రమాన్ని మిర్చి సాగు మొదలు పంట అమ్మకం వరకు తగిన సాయం అందేలా రూపొందించింది. ఈ పైలట్ ప్రాజెక్టు కోసం.. ఎగుమతులకు పేరున్న ‘తేజ’రకం మిర్చిని సాగుచేసే ఖమ్మం జిల్లా కూసుమంచి వ్యవసాయ డివిజన్లోని ఏడు వేల మంది రైతులను ఎంపిక చేశారు. వారికి కొత్త విధానంపై అవగాహన కల్పించేందుకు 25 మంది సీఆర్పీలను నియమించారు. రైతుల భూముల్లో భూసార పరీక్షలు నిర్వహించి.. ఎరువులు, పురుగు మందుల వాడకం తదితర అంశాలపై తగిన సూచనలు అందించారు. రైతులు మిర్చి పంటను పొలాల వద్దే విక్రయించుకునేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించారు. ఇందుకోసం రైతువేదికల్లో పంట నాణ్యత పరిశీలన కోసం ఏఐ మెషీన్లను ఏర్పాటు చేశారు. గత ఏడాది ప్రాజెక్టు అమలు చేసిన మూడు మండలాల్లో 150 టన్నుల మిర్చిని విక్రయించగా.. క్వింటాల్‌కు రూ.19,500 నుంచి రూ.22వేల వరకు ధర దక్కడం గమనార్హం. పొలం వద్దే పంట విక్రయించా.. మిర్చి తోటలోనే పంటను విక్రయించా. సాగు–బాగు ప్రాజెక్టు ప్రయోజనకరంగా ఉంది. నేరుగా శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇచ్చారు. పంట నాణ్యతను రైతువేదిక వద్దే పరీక్షించి, తోటలోనే విక్రయించాను. మార్కెట్లో కంటే మెరుగ్గా క్వింటాల్‌కు రూ.22 వేల ధర లభించింది. కమీషన్, రవాణా చార్జీలు కూడా మిగిలాయి. వెంటనే సొమ్ము చెల్లించారు. – వి.రమేశ్, లింగారం తండా, కూసుమంచి మండలం -
'మిర్చి' హీరోయిన్ ఇప్పుడెలా ఉంది? భర్త,కొడుకును చూశారా?
లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రీచా గంగోపాధ్యాయ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రిచా ఆ తర్వాత ‘మిరపకాయ్’, నాగవల్లి, సారొచ్చారు వంటి సినిమాల్లో నటించింది. ప్రభాస్ సరసన నటించిన మిర్చి సినిమాతో సూపర్ హిట్ అందుకొని క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ సక్సెస్‌ను ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోయింది. సరైన అవకాశాలు లేక కొంతకాలానికే ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది.2013లో భాయ్ సినిమాలో చివరిసారిగా నటించిన రీచా సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత బాయ్‌ఫ్రెండ్ జో లాంగేల్లాను ప్రేమించి పెళ్లి చేసుకొని అమెరికాలోనే సెటిల్ అయిపోయింది. 2021లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన రీచా ప్రస్తుతం కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా మథర్స్ డే సందర్భంగా కొడుకుతో ఉన్న స్పెషల్ మూమెంట్స్‌ని షేర్ చేసుకుంది.అమ్మగా మారి రెండు సంవత్సరాలు అవుతోంది. తల్లి కావడం గొప్ప బహుమతి అంటూ కొడుకుతో దిగిన పలు ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Richa Langella (@richalangella) -
మిరప ‘తేజ’స్సు
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం మిర్చి ధర చరిత్ర సృష్టించింది. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి క్వింటాకు శనివారం రూ.25,800 ధర పలికింది. చరిత్రలోనే తేజా రకం మిర్చికి ఇంతటి ధర ఎప్పుడూ లభించలేదు. విదేశాల్లో ఈ రకం మిర్చికి డిమాండ్ ఉండటంతో ధర పెరుగుతోందని విశ్లేíÙస్తున్నారు. భద్రా ద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన అనంత లక్ష్మి పేరిట కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసిన 25 బస్తాల మిర్చిని ఎస్వీఎస్ చిల్లీస్ ట్రేడర్స్ బాధ్యులు అత్యధిక ధరకు కొనుగోలు చేశారు. తేజా రకం మిర్చి ఈ ఏడాది మార్చి 20న రూ.25,550 ధర పలికింది. అదే రికార్డుగా భావిస్తుండగా.. ఇప్పుడు రూ.25,800 ధరతో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది పంట సాగు కూడా బాగా తగ్గడం, చీడపీడలతో దిగుబడి తగ్గడానికి తోడు దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తుండటంతో ధరకు రెక్కలొచ్చాయి. -
కర్నూలు మిర్చికి రికార్డు ధర.. క్వింటా రూ.50,618..
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి ధర బంగారంతో పోటీగా పెరుగుతోంది. ఈ నెల 18న గరిష్టంగా క్వింటా మిర్చి ధర రూ.48,699లు పలకగా, దానిని అధిగమిస్తూ సోమవారం రికార్డు స్థాయిలో రూ.50,618లకు చేరింది. వెల్దుర్తి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన మోహన్ అనే రైతు క్వింటా మిర్చిని మార్కెట్‌కు తెచ్చారు. మార్కెట్లో 309 లాట్లు ఉండగా.. మోహన్‌కు చెందిన లాట్‌కు రూ.50,618 ధర లభించింది. మద్దూరుకు చెందిన ప్రవీణ్ అనే రైతు తీసుకొచ్చిన మిర్చి క్వింటా రూ.49,699లు పలికింది. కర్నూలు మార్కెట్ యార్డులో సోమవారం క్వింటాకు కనిష్టంగా రూ.3,519, గరిష్టంగా రూ.50,618, మోడల్ ధర రూ.20,589లు చొప్పున నమోదైంది. రోజురోజుకూ ధర అనూహ్యంగా పెరుగుతుండటంతో గోడౌన్లలో నిల్వ చేసిన మిర్చిని రైతులు పెద్దఎత్తున మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. మిర్చి ధరలు 2021–22 నుంచి ఆశాజనకంగా ఉండటంతో 2022–23లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1.28 లక్షల ఎకరాల్లో మిర్చి సాగుచేశారు. చదవండి: చుక్కల భూములపై.. రైతులకు పూర్తి హక్కులు -
చిట్టి చిల్లీ.. చాలా ఘాటు గురూ! ఒక్కసారి కొరికితే..
సాక్షి, కాకినాడ(పిఠాపురం): చిట్టి చిల్లీ... చూడటానికి చెర్రీ పండులా ఎర్రగా గుండ్రంగా ఉంటుంది. నోరూరిస్తుంది. కానీ ఒక్కసారి కొరికితే చెంబుడు నీళ్లు తాగినా మంట తగ్గదు. అంతటి ఘాటు ఉన్న ఈ చిట్టి మిరపకాయల ధర కూడా సాధారణ మిర్చి కన్నా మూడు రెట్లు అధికంగా ఉంటుంది. ఈ చిట్టి మిర్చికి పుట్టినిల్లు కాకినాడ జిల్లా గొల్లప్రోలు ప్రాంతమైనా... మరాఠా వాసులతోపాటు దుబాయ్, మలేషియా దేశాల ప్రజలకు దీనిపై మక్కువ ఎక్కువ. సొంతగా విత్తనం తయారీ... గొల్లప్రోలు మండలంలోని రేగడి భూములు పొట్టి మిరప సాగుకు అనుకూలం. గొల్లప్రోలు, చేబ్రోలు, దుర్గాడ, చెందుర్తి, తాటిపర్తి, ఎ.విజయనగరం గ్రామాలలో సుమారు 600 ఎకరాలలో పొట్టి మిరపను సాగు చేస్తున్నారు. రైతులే సొంతగా విత్తనాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. తమకు పండిన పంటలో నాణ్యమైన కాయలను ఎంపిక చేసుకుని ఎండబెట్టి విత్తనాన్ని సిద్ధం చేసుకుంటారు. ఎకరాకు 70 నుంచి 80 బస్తాలు దిగుబడి వస్తుంది. వాతావరణం అనుకూలిస్తే పెట్టుబడి పోను ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈ చిట్టి మిరపకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ముంబై, పుణె ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి దుబాయ్, మలేషియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 250 నుంచి 350 టన్నుల వరకు ఎగుమతి చేస్తారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లోని స్టార్ హోటళ్లకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు టన్ను పొట్టి మిర్చిని విదేశాల్లో రూ.7లక్షల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. పదేళ్లుగా సాగు చేస్తున్నా పదేళ్లుగా పొట్టి మిరప సాగు చేస్తున్నా. మొత్తం మీద మిరప సాగు లాభదాయకంగా ఉంది. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేయడం వల్ల మంచి దిగుబడి వస్తోంది. ఆదాయం కూడా బాగుంది. – వెలుగుల బాబ్జి, మిరప రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం రైతులే మార్కెటింగ్ చేసుకునేలా చర్యలు ప్రస్తుతం రైతు దగ్గర వ్యాపారులు కేజీ రూ.300 వరకు కొంటున్నారు. దానిని రూ.1.200లకు అమ్ముకుంటున్నారు. రైతులే స్వయంగా విక్రయించుకునేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. – ఎలియాజర్, డీపీఎం ప్రకృతి వ్యవసాయ శాఖ, కాకినాడ 410 ఎకరాల్లో పొట్టి మిర్చి సాగు గొల్లప్రోలు మండలంలో ఈ ఏడాది 410 ఎకరాల్లో పొట్టి మిర్చి సాగు చేశారు. ఉద్యానశాఖ ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు అందిస్తున్నాము. మంచి డిమాండ్ ఉన్న పంట కావడంతో రైతులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. – బీవీ రమణ, జిల్లా ఉద్యాన శాఖాధికారి, కాకినాడ -
ఖమ్మం మిర్చి.. విదేశాల్లో క్రేజీ!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మిర్చి అంటేనే హాట్.. కానీ ఖమ్మం మిర్చి మరింత హాట్.. ఎందుకంటే విదేశాల్లో ఈ మిర్చికి హాట్ హాట్‌గా డిమాండ్ పెరిగిపోతోంది. ఖమ్మం రైతులు పండిస్తున్న మిర్చిలో 70శాతం మేర చైనా, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతి అవుతోంది. ఘాటు ఎక్కువగా ఉండే తేజ రకం మిర్చి ఎక్కువగా సాగు చేయడం, తెగుళ్లు వంటివి పెద్దగా లేకుండా నాణ్యమైన దిగుబడులు రావడంతో డిమాండ్ మరింత పెరిగిందని రైతులు, వ్యాపారులు చెప్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి ఏటా రూ.2 వేల కోట్లకుపైగా మిర్చి ఎగుమతి అవుతుండటం గమనార్హం. ఖమ్మం టు చైనా.. వయా చెన్నై తామర పురుగు బెడదతో రైతులు ఈసారి ముందుగానే మిర్చిని సాగు చేయగా జనవరి నుంచే ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షకుపైగా ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. సమీపంలోని సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, హనుమకొండ, ఏపీలోని కృష్ణా, గుంటూరు రైతులు కూడా ఖమ్మం మార్కెట్లో మిర్చి విక్రయిస్తారు. వ్యాపారులు విదేశాల నుంచి ఆర్డర్లు తీసుకుని ఇక్కడ మిర్చిని కొనుగోలు చేస్తున్నారు. ఆ మిర్చిని వాహనాల్లో చెన్నైతోపాటు తమిళనాడులోని కాట్పల్లి, ఆంధ్రాలోని కృష్ణపట్నం, విశాఖపట్నం, ముంబై పోర్టులకు తరలించి నౌకల్లో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రధానంగా చైనాలో ఎక్కువ కారం ఉండే మిర్చి దొరకకపోవడంతో.. ఖమ్మం మిర్చిని దిగుమతి చేసుకుంటారని వ్యాపారులు చెప్తున్నారు. 3రూపాల్లో ఎగుమతి.. మన దేశంలో ఎక్కువగా పొడి కారం వినియోగిస్తారు. విదేశాల్లో నేరుగా ఎక్కువగా వాడుతారు. ఈ క్రమంలోనే మూడు రకాలుగా.. ఫుల్ మిర్చి (పూర్తిస్థాయి మిరప), స్టెమ్కట్ (తొడిమ కత్తిరించి), స్టెమ్‌లెస్ (తొడిమ పూర్తిగా తొలగించి) మిర్చిగా ఎగుమతులు జరుగుతాయి. స్టెమ్కట్ కోసం యంత్రాలను ఉపయోగిస్తారు. స్టెమ్‌లెస్ విధానంలో పంపే వ్యాపారులు మహారాష్ట్ర, నాగ్‌పూర్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఖమ్మంలో కొనుగోలు చేసి తీసుకెళ్లారు. మిర్చి ఆయిల్ రూపంలోనూ.. చైనా వంటి దేశాల్లో మిర్చిని కాయల రూపంలో వాడితే.. ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో మిర్చి నుంచి తీసిన ఆయిల్‌ను ఉపయోగిస్తారు. ఇందుకోసం మిర్చి నుంచి నూనె తీసే కంపెనీలు ఖమ్మం జిల్లా ముదిగొండ, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మన్నెగూడం, మరిపెడ బంగ్లా, హైదరాబాద్‌లోని శ్రీశైలం రోడ్డులో ఉన్న కందుకూరు తదితర ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. 100 కేజీల మిర్చిని ప్రాసెస్ చేస్తే 8.50 కేజీల పొడి, కేజీన్నర ఆయిల్, మిగతా పిప్పి వస్తుందని చెప్తున్నారు. మిర్చి ఆయిల్‌ను ఆహార పదార్థాల్లో వినియోగించడంతోపాటు సుగంధ ద్రవ్యాలు, ఔషధాలు, టియర్ గ్యాస్, కాస్మొటిక్స్, సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. చైనా రెస్టారెంట్లలో మన మిర్చే.. చైనాలో హాట్ పాట్ రెస్టారెంట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే సిద్ధం చేసిన ఆహారం కాకుండా.. దినుసులు అందజేస్తారు. వాటితో సిద్ధం చేసుకుని తింటుంటారు. ఈ క్రమంలో వినియోగదారులకు 10 నుంచి 15 వరకు స్టెమ్‌లెస్ మిర్చి ఇస్తారు. ఇందుకోసం ఖమ్మం నుంచి దిగుమతి చేసుకునే మిర్చినే వినియోగిస్తారని వ్యాపారులు చెప్తున్నారు. విదేశాల్లో ఖమ్మం మార్కెట్‌కు గుర్తింపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పండే మిర్చి నాణ్యత బాగుండటంతో ఎగుమతులు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వం కూడా వ్యాపారులను ప్రోత్సహిస్తోంది. దీంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. – దోరేపల్లి శ్వేత, చైర్పర్సన్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎనిమిదేళ్లుగా ఎగుమతి చేస్తున్నా.. మా నాన్న మిర్చి రైతు. నేను ఎనిమిదేళ్లుగా విదేశాలకు ఎగు మతి చేస్తున్నాను. తేజ రకానికి విదేశాల్లో డిమాండ్ ఉంది. – బొప్పన జగన్మోహన్రావు, మిర్చి ఎగుమతిదారు, ఖమ్మం దిగుబడి బాగుంది ఐదేళ్లుగా తేజ రకం సాగు చేస్తున్నా. ఈసారి మూడెకరాల్లో సాగు చేశా. మొదటితీతలో 30 క్వింటాళ్ల దిగుబడి రాగా.. మరో 30 క్వింటాళ్లు వస్తుంది. క్వింటాల్‌కు రూ.18,200 ధర వచ్చింది. – బానోత్ శంకర్, రైతు, మహబూబాబాద్ జిల్లా -
విదేశాలకు గుంటూరు ఘాటు.. మలేషియా, థాయ్‌లాండ్‌పై స్పెషల్ ఫోకస్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సన్న రకం మిర్చి ఘాటును మరిన్ని దేశాలకు రుచి చూపేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచి ఏటా రూ.3,502 కోట్ల విలువైన మిర్చి ఎగుమతులు జరుగుతుండగా 2024–25 నాటికి రూ.4,661 కోట్లకు పెంచేలా ప్రణాళిక రూపొందించింది. జిల్లాల వారీగా ఉత్పత్తులను గుర్తించి ఎగుమతులను పెంచేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన వెల్లడించారు. ప్రస్తుతం గుంటూరు నుంచి సుమారు 16 దేశాలకు మిర్చి ఎగుమతి అవుతుండగా అత్యధికంగా చైనా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియాకు అత్యధికంగా జరుగుతున్నాయి. మిగిలిన దేశాలకు ఎగుమతులు నామమాత్రంగా ఉన్నాయి. థాయ్‌లాండ్ ఏటా దిగుమతి చేసుకుంటున్న మిర్చిలో గుంటూరు నుంచి 56.7 శాతం, మలేషియా 45.6 శాతం మాత్రమే ఉండటంతో ఎగుమతులు మరింత పెంచేలా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ జీఎస్ రావు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా ప్యాకింగ్ లేకపోవడం, ఎండబెట్టడం లాంటి సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు సరిపడా లేకపోవటాన్ని ప్రధాన సమస్యలుగా గుర్తించారు. దీన్ని అధిగమించేందుకు 121.6 ఎకర్లాల్లో స్పైసెస్ పార్క్‌తో పాటు క్లస్టర్ వ్యవస్థ అభివృద్ధి, ఎగుమతుల అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేయనున్నారు. మిర్చి ఉప ఉత్పత్తులను ప్రోత్సహించేలా చిల్లీసాస్, చిల్లీ పికిల్, చిల్లీ పేస్ట్, చిల్లీ ఆయిల్ లాంటి తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూత అందించనున్నారు. గుంటూరు మిర్చి ప్రత్యేకతలివే.. మూడు నుంచి 5 సెంటీమీటర్ల పొడవైన గుంటూరు సన్న రకం మిరప ఎర్రటి ఎరుపుతో ఘాటు అధికంగా ఉంటుంది. విటమిన్ సి, ప్రోటీన్లు అధికంగా ఉండటం దీని ప్రత్యేకత. గుంటూరు మిర్చికి 2009లో భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. సన్న రకం మిర్చి సాగుకు గుంటూరు జిల్లా వాతావరణం అనుకూలం కావడంతో 77,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఈ మిర్చిని వంటల్లోనే కాకుండా సహజ సిద్ధమైన రంగుల తయారీలో వినియోగిస్తారు. కాస్మొటిక్స్, పానియాలు, ఫార్మా స్యూటికల్స్, వైన్ తయారీతో పాటు పలు రంగాల్లో ఈ మిర్చి ఉత్పత్తులను వినియోగిస్తారు. ఇన్ని విశిష్టతలున్న గుంటూరు మిర్చిపై చైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది. చైనా ఏటా దిగుమతి చేసుకునే మిర్చిలో 86.7 శాతం భారత్ నుంచే కావడం గమనార్హం. గుంటూరు జిల్లా నుంచి 2021–22లో చైనాకు రూ.1,296 కోట్ల విలువైన మిర్చి ఎగుమతులు జరిగాయి. చదవండి: ఓర్చుకోలేక.. ‘ఈనాడు’ విషపు రాతలు.. సీమను సుభిక్షం చేస్తున్నదెవ్వరు? -
Recipe: ఘుమఘుమలాడే ఎగ్ చపాతీ తయారీ ఇలా!
రొటీన్‌గా కాకుండా ఇలా వెరైటీగా ఎగ్ చపాతి సులువుగా ఇంట్లోనే చేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఎగ్ చపాతి తయారీకి కావలసినవి: ►గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు (ఓ అరగంట ముందు గోరువెచ్చటి నీళ్లు, ఉప్పు వేసుకుని బాగా కలిపిపెట్టుకోవాలి) ►గుడ్లు – 4 లేదా 5 ►ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్(చిన్నగా కట్ చేసుకోవాలి) ►పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్(చిన్నగా కట్ చేసుకోవాలి) ►ఉప్పు –తగినంత ►పసుపు – చిటికెడు ►కారం – 1 టీ స్పూన్ ►చిక్కటిపాలు – 1 టేబుల్ స్పూన్ ఎగ్ చపాతి తయారీ విధానం: ►ముందుగా గుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, పాలు పోసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ►తర్వాత చపాతీలు చేసి పెట్టుకోవాలి. ►అనంతరం రెండు స్టవ్‌లు ఆన్ చేసుకుని, రెండింటిపైన రెండు పెనాలు పెట్టుకుని, ఒకవైపు చపాతీ కాలుస్తూ.. మరోవైపు ఆమ్లెట్ వేసుకోవాలి. ►ఇరువైపులా దోరగా కాలిన చపాతిని ఒకవైపు కాలని ఆమ్లెట్‌పై వేసుకుని రెండు అతుక్కున్నాక అటు, ఇటు తిప్పి.. సర్వ్ చేసుకోవాలి. చదవండి👉🏾Recipes: తోతాపురి మామిడికాయలు, అరకేజీ బెల్లం.. సింపుల్‌గా ఇలా ఆవకాయ పెట్టేయండి! చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా తయారీ ఇలా! -
దాహార్తిని ఇట్టే తీర్చే మసాలా ఛాస్.. రుచికి రుచి.. ఇంకా
Summer Drink- Masala Chaas: ఎండాకాలంలో మసాలా చాస్ మంచి రిఫ్రెషింగ్ డ్రింక్‌గా పనిచేస్తుంది. శరీరాన్ని చల్లబరిచి వేడిచేయకుండా చూస్తుంది. కేలరీలు తక్కువగా ఉండి, మంచి రుచితో దాహార్తిని ఇట్టే తీరుస్తుంది. మసాలా చాస్ కావలసిన పదార్థాలు: పెరుగు – కప్పు, పచ్చిమిర్చి – ఒకటి, అల్లం – చిన్నముక్క, పుదీనా ఆకులు – నాలుగు, కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – ఒక రెమ్మ, నెయ్యి – టీస్పూను, జీలకర్ర – అరటీస్పూను, ఉప్పు – రుచికి సరిపడినంత. తయారీ: పెరుగుని బ్లెండర్లో వేయాలి. దీనిలోనే పచ్చిమిర్చి, అల్లం, పుదీనా ఆకులను ముక్కలుగా తరిగి వేయాలి తరువాత కొద్దిగా కరివేపాకు, ఇంగువ, సగం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మూడు కప్పులు నీళ్లుపోసి మరోసారి గ్రైండ్ చేయాలి. బాణలిలో నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తరువాత జీలకర్ర, రెండు కరివేపాకు రెబ్బలు వేసి దోరగా వేయించి గ్రైండ్ చేసిన మజ్జిగను వేయాలి. దీనిలో రెండు మూడు ఐస్‌ముక్కలు వేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి: Health Tips: పాలకూర, టీ, చేపలు.. ఇంకా.. వీటితో బ్రెయిన్ పవర్ పెంచుకోవచ్చు! -
34 వేల ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 34 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఇందులో మొక్కజొన్నతో పా టు వేరుశనగ, పెసలు, జొన్న, మినుములు, మిర్చి, వరి, కంది పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొంది. వరంగల్, హనుమకొండ, మహ బూబాబాద్ జిల్లాల పరిధిలో ఎక్కువగా పంట నష్టం జరిగిందని నివేదించింది. అత్యధికంగా మిర్చి పంట 20 వేల ఎకరాల్లో దెబ్బతిన్నది. మరో 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, ఇంకో 4 వేల ఎకరాలు ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమా లేక సబ్సిడీపై విత్తనాలు అందజేయడమా అనే విషయంపై సర్కారు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, సూర్యాపేట జిల్లాలో జరిగిన పంట నష్టంపై అంచనాలు వేస్తున్నామని తెలిపారు. 3 రోజుల్లో .. 300 గ్రామాల్లో వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వారం పాటు వడగళ్లు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. మొదటి మూడు రోజుల్లోనే 20 మండలాల్లోని 300 గ్రామాల్లో కోట్ల రూపాయల విలువైన పంటలకు నష్టం జరిగిందని అంచనా. ఒక్క వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనే ఎక్కువ పంట నష్టం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. బీమా లేక నష్టపోయిన రైతాంగం రెండేళ్లుగా రాష్ట్రంలో పంటల బీమా అమలు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ బీమా పథకాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలగింది. దీంతో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నప్పటికీ రైతులకు పరిహారం అందని పరిస్థితి ఏర్పడింది. నష్ట పరిహారం చెల్లించాలి వారం రోజులు కురిసిన వడగండ్ల వర్షం వలన పొలాల్లో పంటలు దెబ్బతినడమే కాక, మార్కెట్‌కు వచ్చిన ధాన్యం, మిర్చి తడిచిపోయింది. కొంత ధాన్యం వరద లో కొట్టుకుపోయింది. దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని కోరుతున్నాం. గత సంవత్సరం 12.60 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, ఈ సం వత్సరం 8.5 లక్షల ఎకరాల్లో వరదల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. దీనికి తో డు ఈ నెలలో వచ్చిన అధిక వర్షాలు, రా ళ్ళ వర్షాల వల్ల రైతుల పంటలకు నష్టం వాటిల్లింది. అయినా ఇంతవరకు ప్రభు త్వం ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. వెంటనే నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలి. – సాగర్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం -
సూర్యాపేటలో మేఘ గర్జన
సాక్షి నెట్వర్క్: సూర్యాపేట, నల్లగొండ జిల్లాలతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఇప్పటికే వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఈ వర్షాలకు కుదేలయ్యారు. సూర్యాపేట జిల్లాలో, ప్రధానంగా సూర్యాపేట పట్టణంలో శనివారం రాత్రినుంచి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపిలేకుండా దాదాపు పదిగంటల పాటు వర్షం కురిసింది. దీంతో సద్దుల చెరువు కట్ట అలుగు తెగిపోయింది. దీని కారణంగా పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. కొన్ని చోట్ల కార్లు కూడా నీటమునిగాయి. ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా రోడ్డుపైకి భారీగా నీళ్లు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుమలగిరిలో ఈదురుగాలులకు 11 కేవీ విద్యుత్ స్తంభాలు 8 నేలకూలాయి. నెల్లిబండతండాలో వడగళ్ల వర్షానికి 30 ఎకరాల్లో టమాట, మిర్చి, ఇతర కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. నూతనకల్,మోతెలో ఏరిన మిర్చి వరదలో కొట్టుకుపోయింది. ఆత్మకూర్–ఎస్ మండలం నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయానికి సమీపంలో సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై నుంచి భారీగా వరద నీరు ప్రవహించింది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు సరాసరి 226.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా సూర్యాపేటలో 145 మి.మీ.వర్షం పడింది.నల్లగొండ జిల్లా కట్టంగూరు, నకిరేకల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్‌లో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి కురిసిన వర్షానికి మిర్చి, మొక్కజొన్న, కంది, టమాటా, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి కొట్టుకుపోయింది. వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారుగూడ, మొండ్రాయి, నల్లబెల్లి, నార్లవాయి గ్రామాల్లో కురిసిన వడగళ్ల వర్షానికి మిర్చి, మొక్కజొన్న, కంది, టమాటా, బొప్పాయి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. హనుమకొండ జిల్లా పరకాల, ఆత్మకూరు, నడికూడ తదితర మండలాల్లో వడగళ్ల వర్షం కురిసి పంటలకు నష్టం వాటిల్లింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దెముత్తారం, అందుకుతండా, వెంచరామి, వరికోల్‌పల్లి గ్రామాల్లో వర్షానికి మిర్చి, మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రెడ్యాతండా, కోమటికుంటతండా, బొత్తలతండాల్లో రైతులు కల్లాల్లో ఆరబోసిన మిర్చి నీటిలో కొట్టుకుపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారం కొండాయి, మల్యాల గ్రామాల్లో మిర్చి, మినుము, పెసర, బొబ్బెర, జనుముల పంట నీటి పాలైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జంపన్నవాగు ఉప్పొంగడంతో నీరంతా పంట చేలల్లోకి చేరింది. వెంకటాపురం మండల పరిధిలోని పాలెం ప్రాజెక్టుకు గండిపడింది. -
ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అక్కడ రూ.1కే మిర్చిబజ్జి !
సాక్షి, కామారెడ్డి: నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్నంటాయి. ఏది కొనాలన్నా అగ్గిపిరమే. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆ ఊళ్లో రూ. 1 కి ఒక మిర్చిబజ్జి అమ్ముతున్నారు. మీరు చదివేది నిజమే. యాబై ఏళ్ల క్రితం మొదలైన వాళ్ల దందా ఏడు పదుల వయసులోనూ నిరాటంకంగా కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఆముద సత్యనారాయణ–ఊర్మిల దంపతులు యాబై ఏళ్ల కిందట మిర్చిబజ్జీల అమ్మకాలు మొదలుపెట్టారు. అప్పట్లో అంగళ్లలో, పండుగ ఉత్సవాల్లో వేడివేడి బజ్జీలు తయారు చేస్తూ అమ్ముతుండేవారు. మిగతా రోజుల్లో రాజంపేట గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద బండీపై పెట్టుకుని అమ్మేవారు. అయితే వయస్సు పైబడడంతో బయటకు వెళ్లడం మానేశారు. ఇంటి దగ్గరే పొయ్యిమీద మిర్చీలు గోలించి బండిపై పెట్టుకుని అమ్ముతున్నారు. ప్రతీ రోజూ ఐదు వేలకు పైగా మిర్చిలు అమ్ముడవుతాయిని సత్యనారాయణ పేర్కొన్నారు. ఒక్కోసారి ఎనిమిది వేల నుంచి పది వేల దాకా అమ్ముడుపోతాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు అంటే దాదాపు 12 గంటల పాటు శ్రమిస్తారు. సత్యనారాయణ కొడుకు రాము బీఈడీ పూర్తి చేశాడు. ఉద్యోగాల నోటిఫికేషన్ రాకపోవడంతో తండ్రికి తోడుగా మిర్చిబజ్జీ దందాలో భాగమవుతున్నాడు. రాజంపేట మండల కేంద్రంలో సత్యనారాయణ దగ్గర మిర్చిబజ్జీల కోసం జనం ఎగబడతారు. ప్రతీ రోజూ తయారీ అమ్మకం సాగిస్తుంటారు. నలుగురు కలిస్తే చాలు మిర్చిలు తెప్పించుకుని తినడం ఆ ఊరిలో చాలా మందికి అలవాటు. దీంతో సత్యనారాయణ మిర్చిల దందా నిరాటంకంగా సాగుతోంది. అప్పుడు ఏకాన...ఇప్పుడు ఏక్ రూపియే నాలుగైదు దశాబ్దాల నాడు సత్యనారాయణ దంపతులు మిర్చిదందా మొదలుపెట్టినపుడు ఏకాణాకు ఒక మిర్చి అమ్మేవారని సత్యనారాయణ తెలిపారు. రూపాయికి 16 అణాలు కాగా, ఒక్క రూపాయికి 16 మిర్చిలు ఇచ్చేవారమని పేర్కొన్నారు. తరువాత రూపాయకి నాలుగు, ఆ తరువాత రూపాయికి రెండు మిర్చిలు అమ్మామని, ఇప్పుడు ఒక్క రూపాయికి ఒక మిర్చి అమ్ముతున్నట్టు పేర్కొన్నారు. శనగ పప్పు, బియ్యంతో కలిపి పిండితయారీ.... సత్యనారాయణ మిర్చిల కోసం శనగ పప్పుతో పాటు బియ్యం కలిపి గిర్నీ పట్టిస్తాడు. క్వింటాళ్ల కొద్ది పిండి పట్టించి మిర్చిల తయారీకి వాడుతున్నారు. అప్పట్లో రూ.2.50 కి కిలో నూనె, రూ.1.25 కు కిలో పప్పు దొరికే దని, ఇప్పుడు రూ.140 కిలో పామాయిల్, రూ.65 కిలో శనగపప్పు దొరుకుతున్నాయని తెలిపాడు. అప్పట్లో రూపాయికి కిలో పచ్చిమిర్చి దొరికేది, ఇప్పుడేమో రూ.40 నుంచి రూ.80 వరకు కొంటున్నామని పేర్కొన్నాడు. కొంత కాలం గ్యాస్ పొయ్యి మీద మిర్చిలు గోలించామని, అయితే గ్యాస్ ధర భాగా పెరగడంతో మళ్లీ కట్టెల పొయ్యిమీదనే చేయాల్సి వస్తోందని తెలిపాడు. చదవండి: Kalyana Lakshmi Scheme: 50 ఏళ్ల కింద పెళ్లయిన వారికి.. ‘కల్యాణలక్ష్మి’! -
నిండా ముంచిన మిర్చి
-
స్పైసీ మ్యాగీ మిర్చి గురూ
న్యూఢిల్లీ: కొంత కాలం నుంచి చిత్ర విచిత్రమైన వంటకాలతో ప్రముఖ పాకశాస్త్ర నిపుణులు వాళ్ల కళా నైపుణ్యాలను ప్రదర్శించడమే కాక చాలామంది భోజన ప్రియుల మనస్సులను గెలుచుకున్నారు. అలాగే ఇటీవల కాలంలో మ్యాగీ మిల్క్ షేక్, చాకోలెట్ మ్యాగీ వంటి రకరకాల వంటకాలు చాలానే వచ్చాయి. (చదవండి: "ఆధార్ తప్పనిసరి కాదు") ప్రస్తుతం ఆ జాబితాలోకి స్పైసీ మ్యాగీ మిర్చి బజ్జీ అనే ఒక సరికొత్త వంటకం చేరనుంది. దీనికి సంబంధించిన ఇమేజ్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా మిర్చి బజ్జీ అనగానే దానిలోకి నంజుకునే ఉల్లిపాయలు, బఠాణి కూర, కొత్తిమీరతో చక్కగా గార్నిష్ చేసి ఉంటుంది. ఇక ఈ బజ్జీని చూసే వాళ్లకి ఎప్పుడేప్పుడు తినేద్దాం అని తహతహ లాడుతుంటుంది. అలాంటిది మ్యాగీ ప్రియుల కోసం వచ్చిన ఈ సరికొత్త స్పైసీ వంటకం నెటిజన్లను నోరూరిస్తూ ఫిదా చేస్తోంది. ఇది కూడా మిర్చి బజ్జీలానే కాకపోతే సెనగపిండితో కాకుండా కేవలం వేయించిన మిర్చిలోనే న్యూడిల్స్‌ని స్టవ్ చేసి సర్వ్ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు వాట్ ఏ స్పైసీ మ్యాగీ మిర్చి అంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. (చదవండి: పెట్రోల్ సంక్షోభానికి చక్కటి పరిష్కారం!) -
తెప్పల పోటీ కాదు.. చేపల వేట
ఉరకలెత్తుతున్న గోదారి.. ఉత్సాహంగా తెప్పలపై సాగిపోతూ వీరు.. మంచిర్యాల జిల్లా లక్సెట్టి పేట మండలం గుళ్లకోట గ్రామ శివారులోని గోదావరిలో మత్స్యకారులు శుక్రవారం ఇలా చేపల వేట సాగించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల దాతృత్వానికి గుర్తింపు సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండటంతో పూర్వ విద్యార్థి తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి స్పందించి రూ.3.50 కోట్లతో భవనం నిర్మించి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. దీనికి గుర్తింపుగా సుభాష్‌రెడ్డి తల్లిదండ్రుల పేరు ‘తిమ్మయ్యగారి సుశీల–నారాయణరెడ్డి జెడ్పీహెచ్ఎస్ బాయ్స్, బీబీపేట పాఠశాల’గా ఖరారు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధరలో తేజం ఖమ్మం వ్యవసాయం: ‘తేజ’రకం మిర్చి ధర పుంజుకుంటోంది. విదేశాల నుంచి ఆర్డర్లు పెరుగుతుండడంతో ధర పెరుగుతున్నట్లు చెబుతున్నారు. శుక్రవారం పలువురు రైతులు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వచేసిన మిర్చిని శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా క్వింటా ధర రూ.16,100గా నమోదైంది. గురువారం రూ.15,800 పలికిన ధర ఒకేరోజు వ్యవధిలో రూ.300కి పెరగడం విశేషం. -
మానాపురం మిర్చి యమా హాట్ గురూ!
సాక్షి, ప్రతినిధి, సూర్యాపేట: మానాపురం మాగాణంలో పచ్చళ్లమిర్చి ‘ఎర్ర బంగారం’లా మెరుస్తోంది. కల్లాల్లో ఎర్రగా నిగనిగలాడే మిర్చికుప్పలు బంగారం రాశుల్లా తళుక్కుమంటున్నాయి. మిర్చి పంటకు మానాపురం తండా కేరాఫ్‌గా నిలిచింది.. మానాపురం మిర్చి ఘాటే కాదు, యమా హాట్ కూడా! 8 జిల్లాలకు ఈ మిర్చి రుచి చూపిస్తోంది ఈ తండా.. ఈ తండా సూర్యాపేట జిల్లాలో ఓ మారుమూల ప్రాంతం. హైబ్రిడ్, లబ్బ విత్తన రకాల సాగు ఈ ప్రాంతం ప్రత్యేకత. మానాపురంతోపాటు ఏనెకుంట తండా, రావులపల్లి క్రాస్ రోడ్డు తండా, పప్పుల తండాలో పచ్చళ్ల మిర్చి పంట సాగవుతోంది. నాలుగు తండాల్లో 500 ఎకరాలపై చిలుకు ఈ పంట ఉంటే, అందులో 300 ఎకరాల వరకు మానాపురంలోనే సాగైంది. పదిహేనేళ్లుగా సాగు.. తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం మండలం మానాపురంలో 150 కుటుంబాలు, ఏనెకుంట తండాలో 100, పప్పుల తండాలో 60, రావులపల్లి క్రాస్‌రోడ్డులో 200 గిరిజన కుటుంబాలున్నాయి. బోర్లు, బావుల కింద పదిహేనేళ్లుగా గిరిజన రైతులు సాధారణ మిర్చిని సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి కొద్దోగొప్పో బావులు, బోర్లలో నీళ్లున్న కాలంలోనూ ఇతర పంటలు వేయకుండా పచ్చళ్ల మిర్చినే సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ జలాలు వచ్చి భూగర్భ జలాలు పెరగడంతో దీని సాగుకు ఢోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి.. తండాలకు కాంతి సెపె్టంబర్లో మిర్చిపంట సాగు చేస్తే సంక్రాంతికల్లా కోతకు వస్తుంది. సంక్రాంతి వచి్చందంటే తండాలకు కొత్తకాంతి వచి్చ నట్టే. చేలల్లో కూలీలు పంటను కోయడం, వీటిని ఆటోలు, ట్రాలీల్లో అమ్మకపు ప్రాంతాలకు తరలించడంతో ఈ తండాల్లో సందడి నెలకొంటుంది. ఎర్రగా నిగనిగలాడే మిర్చిని కోత కోసి చేలల్లోనే రాసులుగా పోస్తారు. కూరగాయల వ్యాపారులు చేల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తారు. సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, జనగామ, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాలతోపాటు హైదరాబాద్‌కు కూడా ఈ మిర్చి వెళుతోంది. ఆదాయం భళా పంటకాలం నాలుగున్నర నెలలు. ఎకరా సాగుకు లక్ష ఖర్చవుతుంది. ఎకరానికి 40 – 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే రూ.2 లక్షలకుపైగా ఆదాయం సమకూరుతుంది. తొలి కాయ కిలో రూ.50 – రూ.70 మధ్య ధర పలికితే, ఆ తర్వాత వచ్చే కాయ ధర రూ.50 నుంచి రూ.60 వరకు ఉంటుంది. ఈ పంటకు నీళ్లు ఎక్కువ కావాల్సి ఉండటం, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో తక్కువ విస్తీర్ణంలోనే సాగు చేస్తున్నారు. మా మిర్చికి హైదరాబాద్‌లో గిరాకీ పచ్చళ్లకు ఉపయోగించే లబ్బ మిర్చికి హైదరాబాద్‌లో బాగా గిరాకీ ఉంటుంది. ధర కూడా కేజీకి రూ.100 పైనే ఉం టుంది. అంత దూ రం వెళ్లలేక చుట్టుపక్కల ఉన్న మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, జనగామ తీసుకెళ్తాం. పిల్లల చదువులు, వ్యవసాయ ఖర్చు ఈ పంట పైనే వెళ్లదీస్తున్నాం. – జాటోతు విజయ, మానాపురం, నాగారం మండలం లాభాలొస్తున్నందునే.. ఏటా ఎకరంలో నాటు, హైబ్రిడ్ లబ్బమిర్చి, బజ్జీ మిర్చి సాగు చేస్తాం. ఎకరానికి రూ.లక్షన్నర ఖర్చు చేస్తే ఈ పెట్టుబడి పోను ఎకరానికి రూ.రెండు లక్షల వరకు లాభం వస్తుంది. 20 ఏళ్లుగా ఈ పంట పెడుతున్నాం. ఎన్నడూ నష్టం రాలేదు. –ఆంగోతు రంగమ్మ, ఏనెకుంట తండా, నాగారం మండలం విదేశాలకు మా మిర్చి పచ్చడి లబ్బమిర్చి మాకు ఎర్ర బంగారం. ఈసారి రెండు ఎకరా ల్లో పెట్టాం. పదిహే ను రోజుల నుంచి కాయ కోస్తున్నాం. ‘మీ మిర్చితో పచ్చడి చేసి ఇతర దేశాల్లో ఉన్న తమ పిల్లలకు పంపిస్తున్నామ’ని ఇక్కడికి వచ్చి కాయ కొనుక్కొనేవారు చెబుతుంటారు. - లకావత్ తావు, మానాపురం, నాగారం మండలం -
హైస్పీడ్ రైళ్లలో బంగ్లాకు మిర్చి ఎగుమతి
సాక్షి, అమరావతి/ సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ –19 నేపథ్యంలో గుంటూరు వ్యాపారులు ఎగుమతులకు కొత్త మార్గం ఎంచుకున్నారు. గతంలో మాదిరిగా నౌకలు, లారీలు, గూడ్స్‌ల్లో కాకుండా హైస్పీడ్ పార్శిల్ రైళ్లలో విదేశాలకు వాణిజ్య పంటలు ఎగుమతి చేసి లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం ఈ విధానంలో బంగ్లాదేశ్‌కు మిర్చి ఎగుమతి చేస్తుండగా త్వరలో చైనా, వియత్నాం దేశాలకు కూడా ఎగుమతులకు హైస్పీడ్ రైళ్లు వినియోగించాలని యోచిస్తున్నారు. తక్కువ కాలంలో సరుకు ఎగుమతి అవుతుండటంతోపాటు సరిహద్దుల్లో ఎటువంటి సమస్యలు లేకపోవడంతో వ్యాపారులు ఈ విధానం పట్ల మొగ్గు చూపుతున్నారు. గుంటూరు రైల్వే డివిజన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. హైస్పీడ్ రైళ్లలో మిర్చి ఎగుమతికి ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందింది. విదేశాలకు ఏటా రూ.3 వేల కోట్ల మిర్చి ► బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం మిర్చికి మంచి డిమాండ్ ఉంది. గుంటూరు కేంద్రంగా కొన్ని సంస్థలు ఏటా రూ.3 వేల కోట్ల విలువైన మిర్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ► చైనాకు రూ.1500 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.1000 కోట్లు, వియత్నాంకు రూ.500 కోట్ల విలువైన పంట ఎగుమతి చేస్తున్నాయి. ► బంగ్లాదేశ్‌లో క్వింటా మిర్చికి రూ.13,500 నుంచి రూ.14,500 (తేజరకం) ధర లభిస్తోంది. లాక్డౌన్ ముగిశాక వ్యాపారులు నౌకలు, లారీలు, గూడ్స్‌ల్లో ఎగుమతి చేస్తున్నారు. ► అయితే ఎగుమతికి ఏడెనిమిది రోజుల సమయం పట్టడంతోపాటు దేశ సరిహద్దుల వద్ద లారీల అనుమతికి ఆలస్యమవుతోంది. ఈ లోగా ధరల్లో మార్పులు వస్తుండటంతో వ్యాపారులు, ఎగుమతిదారుల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ► గుంటూరు రైల్వే డివిజన్ మిర్చి, అల్లం, ఉల్లి, పసుపు పంటల ఎగుమతికి హైస్పీడ్ పార్శిల్ రైళ్లను ప్రవేశపెడతామని ప్రకటించింది. లారీల కంటే తక్కువ ధర.. ► లారీలకు చెల్లించే సరుకు రవాణా చార్జీల కంటే రైళ్లలో ధరలు తక్కువగా ఉండటంతో వ్యాపారులు హైస్పీడ్ రైళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ► రోడ్డు మార్గం ద్వారా బంగ్లాదేశ్‌కు ఎండు మిర్చి రవాణాకు టన్నుకు రూ.7 వేలు. అదే పార్శిల్ రైళ్ల ద్వారా అయితే రూ.4,608 మాత్రమే. ► ఈ నెల 9 న గుంటూరు నుంచి బంగ్లాదేశ్‌లోని బెనాపోల్‌కు 16 పార్శిల్ వ్యాన్లతో కూడిన పార్శిల్ ఎక్స్‌ప్రెస్‌లో 384 టన్నుల ఎండు మిర్చి ఎగుమతి చేసిన వ్యాపారులు చార్జీలకింద రైల్వేకి రూ.17.60 లక్షలు చెల్లించారు. ► ఇతర రాష్ట్రాలకు బాయిల్డ్ రైస్ ఎగుమతికి ఎఫ్‌సీఐ అధికారులు తమను కలిసినట్టు గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ మోహన్‌రాజా మీడియాకు తెలిపారు. -
విజిలెన్స్ దాడులు నకిలీ కారం పట్టివేత
పశ్చిమగోదావరి, ఆకివీడు: ఆకివీడులోకి కారం మిల్లుపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. మిల్లులో నకిలీ కారం అమ్ముతున్నారన్న సమాచారం మేరకు విజిలెన్స్ ఎస్పీ వరదరాజు ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు. కారం మిల్లులో తనిఖీలు చేయగా రంగుపొడి లభ్యమైంది. భారీ మొత్తంలో దొరికిన రంగు పొడి శాంపిల్స్‌ను విజిలెన్స్ సీఐ విల్సన్ ఆధ్వర్యంలో విజిలెన్స్ ఎమ్మార్వో రవికుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకట్రామయ్య సేకరించారు. అనంతరం విలేకర్లతో విల్సన్ మాట్లాడుతూ కారం మిల్లులో రంగు కలిపి అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీ చేశామన్నారు. మిల్లులో రంగు పొడి అధిక మొత్తంలో కన్పించిందని, దీనిని శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపుతున్నట్లు చెప్పారు. పరీక్షల అనంతరం నకిలీదైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఆకివీడు, దుంపగడపలోని రెండు రేషన్ షాపుల్ని తనిఖీ చేశామని విల్సన్ చెప్పారు. రెండు షాపుల్లో రికార్డులకు అనుగుణంగా స్టాక్ లేదని, వాటిపై సెక్షన్ 6ఏ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. కాగా కారంమిల్లు యజమాని రంగు పొడిని కుంకుమ పొడి అని, వినియోగదారుడు తీసుకువచ్చాడని చెప్పారు. -
గుంటూరు: టిక్కీకి రూ.150 అద్దె
సాక్షి, అమరావతి: మిర్చిని నిల్వ చేసుకునే రైతుల నుంచి టిక్కీకి రూ.150 అద్దె వసూలు చేసేందుకు గుంటూరు కోల్డ్ స్టోరేజి ప్లాంట్ల నిర్వాహకులు అంగీకరించారు. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డును ప్రభుత్వం మూసివేసింది. దీంతో కొందరు రైతులు తమ పంటను కోల్డ్ స్టోరేజి ప్లాంట్లలో నిల్వ చేసుకుంటున్నారు. దీన్ని తమకు అనుకూలంగా చేసుకునేందుకు కొందరు నిర్వాహకులు రైతుల నుంచి రూ.200 అద్దెను వసూలు చేస్తున్నారు. దీనిపై రైతులు బుధవారం మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదనరెడ్డికి ఫిర్యాదు చేశారు. వివరాలను సేకరించిన ముఖ్యకార్యదర్శి కోల్డ్ స్టోరేజి ప్లాంట్ల నిర్వాహకులతో గురువారం చర్చలు జరిపి, ఇరువర్గాలకు ఆమోదయోగ్యంగా అద్దెను నిర్ణయించారు. సీజను పూర్తయ్యేవరకు రైతుల నుంచి ఒక్కో టిక్కీకి రూ.150 అద్దెను వసూలు చేసే విధంగా, హమాలీల ఎగుమతి, దిగుమతి ఖర్చులను నిర్వాహకులే భరించాలని నిర్ణయించారు. (259 మంది ఖైదీల విడుదల) -
వింతగా కాసిన మిరప
సాక్షి, మహబూబ్‌నగర్ : ధారణంగా ఏ చెట్టుకైనా పండ్లు గాని, కూరగాయలు గాని కొమ్మ కిందకు వేలాడుతూ కాస్తాయి. కానీ ఇక్కడ కన్పించే మిరప చెట్టుకు మాత్రం మిరపకాయలు వింతగా ఆకాశం వైపు చూస్తూ పైకి కాశాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిర గ్రామంలోని కుర్వ చంద్రశేఖర్ ఇంట్లోని చెట్టుకు వింతగా మిరప కాయలు కాయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
‘మిర్చి’ భామకు పెళ్లి కుదిరింది..!
రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన భామ రిచా గంగోపాధ్యాయ. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తరువాత మిరపకాయ్, మిర్చి సినిమాలతో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్నారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే భాయ్ సినిమా తరువాత నటనకు బ్రేక్ ఇచ్చి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయారు. ఆ తరువాత అభిమానులకు దూరమైన ఈ భామ తాజాగా ఓ శుభవార్త చెప్పారు. తనకు బిజినెస్ స్కూల్లో పరిచయం అయిన జోయ్ అనే వ్యక్తితో తన నిశ్చితార్థం జరిగినట్టుగా రిచా ప్రకటించారు. ప్రస్తుతానికి పెళ్లికి ముహూర్తం నిర్ణయించలేదని, జీవితంలో కొత్త మార్పుకోసం ఆనందంగా ఎదురుచూస్తున్నట్టుగా రిచా తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, బెంగాళీ చిత్రాల్లోనూ నటించిన రిచా గంగోపాధ్యాయ సైమా వేడుకల్లో ఉత్తమ నటి (క్రిటిక్స్ ఛాయిస్) అవార్డును అందుకున్నారు. Just wanted to share that I am engaged ❤! Joe and I met in business school and it has been two wonderful years! Looking forward to the next phase of my life. Wedding date not set yet!😊 pic.twitter.com/7ozwry8Zg9 — Richa Gangopadhyay (@richyricha) 15 January 2019 -
మార్కెట్ కార్యదర్శి ఆకస్మిక తనిఖీ
వరంగల్ సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి పొలెపాక నిర్మల గురువారం మిర్చి యార్డును ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యదర్శిని చూడగానే చిల్లర దొంగలు దొంగలించిన మిర్చి బస్తాలను వదిలివేసి పారిపోయారు. అప్పటికి సెక్యూరిటీ గార్డులు అందుబాటులో లేకపోయో సరికి కార్యదర్శినే స్వ యంగా దొంగ బస్తాలను యార్డులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న యార్డు ఇంచార్జీలు జన్ను భాస్కర్, బీ.వెంకన్న, సెక్యూరిటీ గార్డులు కార్యదర్శి వద్దకు చేరుకొని తనిఖీలో పాల్గొన్నారు.అనంతరం యార్డు ఏఎస్.వేముల వెంకటేశ్వర్లు దగ్గరుండి కార్యదర్శికి సహకరిస్తూ..చిల్లర దందాగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. సెక్యూరిటీ గార్డులు సరిగా విధులు నిర్వర్తించడం లేదని కార్యదర్శి వారిపై అసహనం వ్యక్తం చేశారు. మరోసారి చిల్లర దొంగలు, వ్యాపారులు మిర్చి దందా చేస్తున్నట్లు తన దృష్టికి వస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని హెచ్చరించారు. బస్తాలు దొరికిన చిల్లర దొంగలు తమ బస్తాలను తీసుకెళ్లడానికి వివిధ రకాలుగా ఫైరవీలు చేసినా కార్యదర్శి ససేమీరా ఒప్పుకోలేదు. తనిఖీలో స్వా« దీనం చేసుకున్న 1.38 క్వింటాళ్ల మిర్చిని యార్డులోనే అమ్మి, మార్కెట్ ఫీజు కింద జమచేశారు. రైతులను ఇబ్బంది పెడితే సహించం.. మార్కెట్‌కు మిర్చి అమ్మకానికి వచ్చిన రైతులను మునీమ్, దానం, దయ పేరుతో మిర్చిని తీసుకోవడానికి ఇబ్బంది పెడితే సహించేదిలేదని మార్కెట్ కార్యదర్శి పి.నిర్మల హమాలీ కార్మికులను హెచ్చరించారు. గురువారం మిర్చి మార్కెట్లో కార్యదర్శి అకస్మిక తనిఖీ నిర్వహించిన సమయంలో కొందరు హమాలీల వద్ద చిల్లర మిర్చి బస్తాలను గుర్తించిన కార్యదర్శి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. హమాలీలు సక్రమంగా డ్యూటీ చేయాలని, లేదంటే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. -
మిర్చి అ‘ధర’హో!
ఖమ్మం వ్యవసాయం : మిర్చి రైతులకు శుభవార్త. శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి క్వింటా ధర రూ. 9,950 పలకగా, సోమవారానికి ఏకంగా రూ. 450లు పెరిగి రూ. 10,400కు చేరింది. పంట సాగు తగ్గడం, ఆశించిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో ధర పెరుగుతోంది. మార్చి నెల ఆరంభంలో రూ. 9,200లు పలికిన ధర క్రమంగా పెరుగుతూ 19 రోజుల వ్యవధిలో దాదాపు రూ.1,200పైకి వెళ్లడం విశేషం. ప్రతి ఏటా మార్చిలో మార్కెట్‌కు నిత్యం 70 వేల నుంచి లక్ష బస్తాల వరకు విక్రయానికి వస్తుంది. ఈ ఏడాది ప్రస్తుతం 20 వేల నుంచి 30 వేలకు మించి రావట్లేదు. అంతర్జాతీయంగా తేజా రకం మిర్చికి డిమాండ్ ఉండటంతో ఆ రకం ధర పెరుగుతోందని అంచనా వేస్తున్నారు. -
మిరపలో ‘సెప్టెంబర్’ యాజమాన్యం
అనంతపురం అగ్రికల్చర్: ఇటీవల కురుస్తున్న వర్షాలకు మిరప తోటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్ల నివారణ, పోషకాలకు సంబంధించి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మిదుర్గ తెలిపారు. మిరపలో సమగ్ర సస్యరక్షణ ఇలా : జూలైలో విత్తిన మిరప నారును ప్రస్తుతం నాటుకోవచ్చు. జూలైలో నాటిన మిరప తోటలకు ఎకరాకు 65 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ) వేసుకోవాలి. కలుపు లేకుండా గొర్రు, గుంటకతో అంతరకృషి చేయాలి. ఆగస్టులో నాటుకున్న పంటకు తామర పురుగులు లేదా పైముడుత నివారణకు 1.5 గ్రాములు అసిఫేట్ లేదా 2 మి.లీ పిప్రొనిల్ లేదా 0.2 మి.లీ స్పైనోసాడ్, 1.25 గ్రాములు డైపెంథియురాన్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. నల్లి లేదా కిందిముడుత నివారణకు 5 మి.లీ డైకోఫాల్ లేదా 0.3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ స్పైరోమెసిఫిన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మిరపకు ఆశించిన పేనుబంక నివారణకు 1.5 గ్రాములు అసిఫేట్ లేదా 2 మి.లీ డైమిథోయేట్ లేదా 0.3 మి.లీ ఇమిడిక్లోప్రిడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ ఎలా నివారించుకోవచ్చంటే : తెల్లదోమ నివారణకు 1.25 మి.లీ ట్రైజోఫాస్ లేదా 1 మి.లీ స్పైరోమెసిఫిన్ లేదా 0.3 గ్రాములు అసిటమాప్రిడ్ లేదా 0.2 గ్రాములు థయోమిథాక్సామ్ లేదా 1.25 గ్రాములు డైఫెంథియురాన్ లేదా 3 మి.లీ వేపనూనె (10,000 పీపీఎం) లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. కాయతొలుచు పురుగు నివారణ ఇలా: కాయతొలుచు పురుగు నివారణకు 1.5 గ్రాము అసిఫేట్ లేదా 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లేదా 1 గ్రాము థయోడికార్బ్ లేదా 0.75 మి.లీ నొవాల్యురాన్ లేదా 0.3 మి.లీ క్లొరాన్ట్రనిప్రోల్ లేదా 0.3 మి.లీ ఫ్లూబెండమైడ్ లేదా 0.5 మి.లీ ఇమామెక్టిన్బెంజుయేట్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. సెర్కొస్పోరా ఆకుమచ్చ తెగులు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణకు 2.5 గ్రాములు మాంకోజెబ్ + 2.5 గ్రాములు కార్బండిజమ్ లేదంటే 30 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ + 1 గ్రాము స్ట్రెప్టోసైక్లీన్ 10 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. -
సగం మిర్చికే రాయితీ
► ఇప్పటి వరకు ఈ పథకం వర్తించింది 5.25 లక్షల క్వింటాళ్లకే.. ► ఇంకా రైతుల వద్ద 5 లక్షల క్వింటాళ్లకుపైగా సరుకు ► కోల్డ్‌స్టోరేజీల్లో మిర్చికి వర్తించని రాయితీ పథకం మిర్చి..ఈ పేరు వింటేనే రైతుల కళ్లలో సుడులు తిరుగుతున్నాయి. ఒకప్పుడు రైతు లోగిలిలో బంగారు సిరులు కురిపించిన పంట..గతేడాది ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, పెరిగిన పెట్టుబడులు, ధరల పతనంతో కుదేలైంది. ప్రతి ఇంటా అప్పుల కుంపటి రగిలించి రైతు గుండెల్లో ఆరని మంటలు మిగిల్చింది. పైపూతగా ప్రభుత్వం రాయితీ ప్రకటించినా..అదీ సగం సరుకుకు మాత్రమే అమలైంది. చివరకు మిర్చి రైతులను అప్పుల ఉరికొయ్యకు వేలాడదీసింది. సాక్షి, అమరావతి బ్యూరో: మిర్చి రైతులకు ఈ ఏడాది కోలుకోలేని దెబ్బ తగిలింది. మిర్చి రైతులను ఆదుకొంటామని, మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి కోనుగోలు చేస్తామని ప్రభుత్వం మొదట్లో మభ్య పెట్టింది. చివరకు క్వింటాకు రూ.1500 రాయితీ ఇస్తామని ప్రకటించింది. అదీ 30 క్వింటాళ్ల వరకు మాత్రమే అంటూ పరిమితి విధించింది. దీనిని నమ్ముకొని గుంటూరు మార్కెట్ యార్డుకు మిర్చిని తీసుకొచ్చిన రైతులు నిలువునా మునిగిపోయారు. రాయితీ ప«థకం ప్రకటించాక మూడు రెట్లకుపైగా ధరలు పతనమయ్యాయి. సరుకు పెద్ద ఎత్తున యార్డుకు రావడంతో అమ్ముకోవటానికి రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రతిపక్ష నేత ధర్నాతో.. మిర్చి రైతుల అవస్థలు చూసి చలించిపోయిన ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి గుంటూరులో రెండు రోజులపాటు దీక్ష చేశారు. వెల్దుర్తి మండలంలో ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాన్ని పరామర్శించారు. సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో హడావుడిగా మంత్రులు గుంటూరులో సమావేశం ఏర్పాటు చేసి మిర్చి యార్డుకు సెలవులు రద్దు చేస్తున్నామని, రైతుల నుంచి మిర్చి కోనుగోలు చేస్తామని ప్రకటించారు. అయితే అక్కడ హమాలీలు, వేమెన్, వ్యాపారులు, దిగుమతిదారులు మార్కెట్ యార్డు పాలకవర్గానికి సహకరించకపోవడంతో కొనుగోళ్లు నామమాత్రంగా జరిగాయి. సగం సరుకు రైతుల వద్దే.. ప్రస్తుతం ఇంకా రైతుల వద్ద 5 లక్షల క్వింటాళ్ల సరుకు ఉన్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో మార్కెట్ యార్డుకు సరుకు రాక తగ్గింది. ప్రస్తుతం యార్డులో మిర్చి బస్తాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. రాయితీ సొమ్ము చెల్లింపులో జాప్యం.. సరుకు కొనుగోలు చేసిన వ్యాపారులు రైతుల ఖాతాల్లో నగదు జమ చేశాక..ఆ బ్యాంకు జిరాక్స్ కాపీ మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో ఇవ్వాలి. అప్పుడు మార్కెటింగ్ శాఖ రాయితీ సొమ్ము రూ.1500(క్వింటాకు) రైతుల ఖాతాకు జమ చేస్తుంది. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో రైతులకు వచ్చే కొద్దీగొప్పా మొత్తం కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ధర ప్రకటన చూసి మోసపోతున్నాం మార్కెటింగ్ శాఖ రోజూ ప్రకటిస్తున్న మోడల్ ధరను చూసి మోసపోతున్నామని కొంత మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా ఇక్కడికి మిర్చిని తీసుకొస్తే ధరలకు పొంతన ఉండడం లేదని పేర్కొంటున్నారు. మరో వైపు రైతుల వద్ద ఉన్న సరుకు నెలాఖరులోగా క్లియర్ కావడం గగనమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ యార్డుకు సరుకు తక్కువగా వస్తున్నా..నాణ్యత సాకుతో వ్యాపారులు ధరలో కోత పెడుతున్నారు. దీంతో మిర్చి రైతులు అన్ని విధాలా మునిగిపోతున్నారు. నెలాఖరు వరకు కోల్డ్‌స్టోరేజీల్లోనే.. ఈ నెల 30వ తేదీ వరకు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ ఉన్న మిర్చిని బయటకు తీయొద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో కోల్డ్ స్టోరేజీల్లో సరుకు తీసి పెట్టుబడులకు ఉపయోగించుకుందామనుకున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నెలాఖరు వరకు ఆగాల్సి రావడంతో పెట్టుబడుల కోసం మళ్లీ వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. -
రైతు మెడపై నకిలీ కత్తి
► గతేడాది జిల్లాలో నకిలీ విత్తనాల జోరు ► మిరప సాగు చేసి నిండా మునిగిన అన్నదాతలు ► జిల్లాలో 12 మంది మిర్చి రైతుల ఆత్మహత్యలు ► అక్రమార్కులకు ప్రభుత్వం అండదండలు ► ఈ ఏడాదైనా నాణ్యమైన విత్తనాలు అందించాలని డిమాండ్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో నకిలీ విత్తనాల జోరు పెరిగింది. అప్పనంగా ఆర్జించేందుకు వ్యాపారులు నకిలీ విత్తనాలు తెచ్చి రైతులకు అంటగడుతున్నారు. ఆ విత్తనాలు వేసి పంట దిగుబడులు రాక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. కోలుకోలేని పరిస్థితుల్లో ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఏడాది జిల్లాలో మిర్చి పంట దెబ్బతినటంతో ఇప్పటి వరకు 12 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వం నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారుల కొమ్ముకాస్తోంది. వారిపై ఎటువంటి చర్యలు లేవు. జిల్లావ్యాప్తంగా అద్దంకి, దర్శి, పర్చూరు, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల్లో వేలాది హెక్టార్లలో రైతులు మిరప సాగు చేస్తారు. గతేడాది 58 వేల హెక్టార్లలో మిరపను సాగు చేసిన విషయం తెలిసిందే. గుంటూరు, నర్సరావుపేట ప్రాంతాల్లో విత్తనాలు తెచ్చి నర్సరీల్లో నారు పెంచి వ్యాపారులు రైతులకు అమ్మారు. కొందరు రైతులు స్వయంగా విత్తనాలను కొని తెచ్చుకొని నర్సరీల్లో నార్లు పోయించుకున్నారు. గతేడాది మిరపకు అధికంగా ధరలు ఉండటంతో ఈ ఏడాది ఆశతో రైతులు అధికంగా మిరప సాగు వైపు మొగ్గు చూపారు. ముందస్తుగా గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం ప్రాంతాల్లో రైతులు మిరప సాగు చేశారు. ఆది నుండే మిరపకు తెగుళ్లు సోకాయి. జెమిని వైరస్‌తో పాటు పలు రకాల చీడపీడలు చుట్టుముట్టాయి. అధికంగా పెట్టుబడి పెట్టిన రైతులు పురుగుమందులను సైతం అంతేస్థాయిలో పిచికారి చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఎకరానికి రూ.50 నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. నకిలీల జోరు: తక్కువ ధరలకు గుంటూరు, విజయవాడ, నంద్యాల తదితర ప్రాంతాల్లో విత్తనాలు కొని అవే నాణ్యమైన విత్తనాలు అంటూ జిల్లాలో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. అత్యధిక ధరలకు విత్తనాలు కొని వేసినా మొలక సక్రమంగా రావడం లేదు. ఒక వేళ మొలక వచ్చినా పూత దశ నాటికే పనికి రాకుండాపోతున్నాయి. కాపు కాసే పరిస్థితి లేదు. ఇక నర్సరీల్లో ఉత్పత్తి చేసిన మిరప నారు కొని రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాసిరకం విత్తనాల వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది. జిల్లాలో విత్తన వ్యాపారులు వేల సంఖ్యలో ఉన్నారు. నర్సరీలు సైతం వేలాదిగా వెలిశాయి. నిబంధనల మేరకు నర్సరీలు కొనే విత్తనాలు లాట్ నంబర్లతో సహా నమోదు చేయాలి. రైతులకు నారు ఇచ్చే సమయంలో ఏ విత్తనాలకు సంబంధించిన నారు ఏయే రైతుకు అమ్ముతున్నారన్న విషయాలు కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంది. కానీ వారు ఎటువంటి రికార్డులు నిర్వహించడం లేదు. కొందరు నర్సరీ యజమానులు నాణ్యమైన విత్తనాలు కాకుండా తక్కువ ధరలకు నకిలీ విత్తనాలు తెచ్చి నార్లు పోసి మరీ రైతులకు అంటగడుతున్నారు. దీంతో దిగుబడులు రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, అద్దంకి, దర్శి, పర్చూరు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు 30 వేల ఎకరాలకుపైగా పంట పనికి రాకుండాపోయింది. అయినా ప్రభుత్వం విత్తన వ్యాపారులపై మొక్కుబడిగా మాత్రమే చర్యలు తీసుకొని వదిలేసింది. యర్రగొండపాలెం ప్రాంతంలో ఒకరిద్దరు వ్యాపారులపై నామమాత్రంగానే కేసులు నమోదు చేశారు తప్ప... కఠిన చర్యల్లేవు... రైతులు తీవ్రంగా నష్టపోయినా వ్యవసాయశాఖ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ ఏడాదైనా ప్రభుత్వం వచ్చే ఖరీఫ్‌కు నకిలీ విత్తనాలు కాకుండా నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
గుండె మంట
-
మిర్చి రైతు కంట కన్నీరు!
– క్వింటం ధర రూ.350 – కర్నూలు మార్కెట్ యార్డులో రికార్డు స్థాయిలో పతనమైన ధర – చెప్పుకోలేక మొహం చాటేస్తున్న అన్నదాతలు ‘‘ ఐదు ఎకరాల్లో మిరప సాగు చేశాను.. రూ.4 లక్షల పెట్టుబడి పెట్టాను. 20 క్వింటాళ్ల పంట చేతికి రావడంతో అమ్మడానికి కర్నూలు తీసుకొచ్చాను. క్వింటా రూ.350కి అడుతున్నారు. గత ఏడాది క్వింటా రూ.16 వేలు ధర పలికింది. ఈ ఏడు ఇలా ఎందుకుందో అర్థం కావడం లేదు. ఇలాగైతే రైతు ఎలా బతకాలి’’ -ఎల్లారెడ్డి, లాలుమానుపల్లె, కృష్ణగిరి మండలం కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్): ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి, చీడపీడలను సమర్థంగా ఎదుర్కొని మంచి దిగుబడి సాధించినా ఫలితం ఉండడం లేదు. అన్నదాత రెక్కల కష్టానికి ధర పలకడం లేదు. మిరప రైతు కంట కన్నీరే మిగులుతోంది. పంటను రోజుల తరబడి మార్కెట్ యార్డులో ఉంచినా కొనేవారు కరువయ్యారు. శుక్రవారం కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటానికి కనిష్ట ధర రూ.350 పలికింది. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమయ్యారు. శీతల గోదాములలో నిల్వ ఉంచుదామనుకున్నా ఖాళీ లేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం, అనంతపురం జిల్లాల నుంచి కర్నూలు మార్కెట్‌కు మిర్చి వస్తోంది. మద్దతు ధర ఉన్నా నిష్ప్రయోజనమే మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కర్నూలు యార్డులో నిష్ప్రయోజనంగా మారింది. రైతుల డిమాండ్‌ను బట్టి వారం రోజుల క్రితం గుంటూరు మిర్చి యార్డుతో పాటు కర్నూలు, కోస్తా జిల్లాలోని పర్చూరు, దాచేపల్లి మార్కెట్ యార్డులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజులుగా ఉత్తర్వులు జారీ అయినా ఇప్పటివరకు కర్నూలు మార్కెట్ యార్డులో 82 మంది రైతులు మాత్రమే మద్దతు ధర కోసం పేర్లను నమోదు చేసుకున్నారు. అవగాహన కరువు.. మద్దతు ధర కల్పించి వారం రోజులు గడుస్తున్నా ఈ అంశంపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మద్దతు ధర కోసం ఆయా గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ అధికారుల అనుమతి పత్రంతో పాటు పట్టాదారు పాసు పుస్తకాలు, మార్కెట్ యార్డు జారీ చేసిన తక్‌పట్టీలు తదితర వాటితో దరఖాస్తుదారులుగా నమోదు చేసుకోవాల్సి ఉంది. రైతులకు వీటిపై అవగాహన లేక మద్దతు ధర పొందలేకపోతున్నారు. -
16 నుంచి 24 వరకు మిర్చి కొనుగోళ్లు బంద్
కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్) : కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోఈనెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మిర్చి కొనుగోళ్లను బంద్ చేస్తున్నట్లు మార్కెట్ యార్డు కార్యదర్శి శివరామకృష్ణ శాస్త్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవంగా 13వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మిర్చి కొనుగోళ్లను నిలిపివేస్తామని కమీషన్ ఏజెంట్లు పట్టుపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమీషన్ ఏజెంట్లను, వ్యాపారులను చర్చలకు పిలిపించి ఒప్పందం కుదిర్చారు. పక్షం రోజుల పాటు కాకుండా వారం రోజుల వరకు కొనుగోళ్లు బంద్ చేయవచ్చన్నారు. ఈ మేరకు మార్కెట్ యార్డు శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రకటన జారీ చేశారు. ప్రకటించిన రోజుల్లో మిర్చిని యార్డుకు తీసుకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. -
ధర.. కన్నీటి ధార..
► దిగజారుతున్న ధరలు ► దయనీయంగా మిర్చి రైతు స్థితి ► ఖాతాల్లోకి రాని ‘రాయితీ’ సొమ్ము ► వ్యాపారులకే అండగా నిలుస్తున్న మంత్రి ► రైతుకు ప్రయోజనం కలిగే చర్యలు శూన్యం మిర్చి రైతులను ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. ధరల పతనానికి కారకులైన వ్యాపారులపై గానీ.. యార్డు సిబ్బందిపై గానీ ఇంతవరకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. మద్దతు ధరపై ఆశలు వదులుకున్న రైతులు ప్రభుత్వం ఇచ్చే రాయితీ కోసం ఎదురుచూస్తున్నారు. అన్నదాతల ఖాతాల్లో రాయితీ సొమ్ము పడేందుకు తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిని నిరోధించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఎప్పుడో ఖాతాలో పడే రాయితీ కోసం ఎదురుచూడటం దండగ.. వచ్చినకాడికి అమ్ముకుపొండని వే మన్లు, కమీషన్ ఏజెంట్లు రైతులను మభ్యపెడుతున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో : మిర్చి రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. ధరల పతనాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వ పెద్దలు సమీక్షలతో సరిపెడుతుండటంతో ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో తేజ రకం.. క్వింటా రూ.11,200 పలుకగా.. ప్రస్తుతం రూ.2000–2500కు దిగజారిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సాధారణ రకం మిర్చి సైతం ప్రారంభంలో క్వింటా రూ.8000 పలుకగా ప్రస్తుతం క్వింటా రూ.1500కు పడిపోయింది. ఇబ్బడిముబ్బడిగా సరుకు వచ్చిందన్న సాకు చూపి ధరలు తగ్గిస్తున్నా మార్కెటింగ్ శాఖ చోద్యం చూస్తోంది. భారీగా ధరలుపతనం అవుతున్నా ఇంతవరకు వ్యాపారులపై గానీ, మార్కెటింగ్ సిబ్బందిపై గానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అపోహలు సృష్టిస్తున్న వ్యాపారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు రూ.1500 పథకంపై వ్యాపారులు అపోహలు సృష్టించి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. క్వింటా రూ.2000 పైన కొనుగోలు చేసిన మిర్చికి ఈ పథకం వర్తించదని వ్యాపారులు రైతులను మభ్యపెడుతున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. పథకం కింద అమ్ముకుంటే డబ్బులు వచ్చేందుకు ఎక్కువ సమయం పడుతుందని.. వే మన్లు, కమీషన్ ఏజెంట్లు, గుమాస్తాలు రైతులను భయపెడుతున్నట్లు సమాచారం. ఖాతాలో డబ్బులు వేయడం ఇదంతా ఎందుకు, వచ్చిన కాడికి డబ్బులు తీసుకుపోవాలని వ్యాపారులు చెబుతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండను తవ్వి.. ఎలుకను పట్టారు.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న క్వింటా రూ.1500 పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ కావటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రైతులకు ఇబ్బంది కలుగకుండా, మార్కెట్ యార్డు చుట్టూ తిరగకుండా ఐడీఎఫ్సీ బ్యాంకు అధికారులతో కలిసి మార్కెటింగ్ అధికారులు గత పది రోజులుగా కసరత్తు చేసి ఆధార్ ఆధారంగా కమీషన్ ఏజెంట్లు వారి పేరుతో ఖాతాలు ఏర్పాటు చేసుకుని, సొమ్మును రైతు ఖాతాల్లో వేయగానే ప్రభుత్వ రాయితీ పడేలా సీఎం కోర్ డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేశారు. ట్రేడింగ్ అకౌంట్ ద్వారానే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని, వ్యక్తిగతంగా ఖాతాల ద్వారా డబ్బు చెల్లిస్తే ఆదాయపన్ను ఇబ్బందులు తలెత్తుతాయని కమీషన్ ఏజెంట్ల సంఘం నాయకుడు సాంబిరెడ్డి, సుధాకర్ గట్టిగా వాదించారు. మంత్రి పుల్లారావు సైతం వ్యాపారులకు దన్నుగా నిలవడంతో పదిరోజుల నుంచి చేసిన హంగామా ఎందుకూ పనికిరాకుండా పోయింది. జిల్లాలో పలు మార్కెట్ల పరిధిలో రైతుల పేరుతో పన్ను కట్టకుండా జీరో వ్యాపారం చేస్తున్నారని, తాము అలా చేయడం లేదని, దీంతో నష్టపోవాల్సి వస్తోందని పలువురు వ్యాపారులు మంత్రి దృష్టికి తెచ్చారు. రైతులకు లారీ బాడుగలు, ఖర్చులు, పెట్టుబడులకు డబ్బులు ఇచ్చామని, రైతుల ఖాతాల్లో వేస్తే తమ డబ్బులు ఎలా వస్తాయని పలువురు పేర్కొన్నారు. ప్రభుత్వానికి మైలేజీ వచ్చేలా చూడాలి: మంత్రి ప్రత్తిపాటి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, మైలేజీ వచ్చేలా చూడాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాపారులను కోరారు. గుంటూరు మిర్చి యార్డులో సోమవారం సాయంత్రం ఆయన కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు, అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల ఖాతాల్లో కమీషన్ ఏజెంట్లు వెంటనే డబ్బు జమ చేయాలని సూచించారు. రైతు ఖాతాల్లో డబ్బు పడితేనే ప్రభుత్వ రాయితీ సొమ్ము వస్తుంది కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వానికి మైలేజీ వచ్చేలా చూడాలని కోరారు. పథకంపై పలువురు వ్యాపారులు దుష్ప్రచారం చేస్తున్నారని, ధరలు తగ్గిస్తున్నవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా మిర్చి కొనుగోలు ప్రారంభించిన ఐదు మార్కెట్ యార్డుల్లో కొనుగోలు చేస్తే పన్ను మినహాయింపు, రవాణా చార్జిల్లో రాయితీలు ఇస్తామని ప్రకటించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా, జేసీ–2 ముంగా వెంకటేశ్వర్లు, మార్కెట్ యార్డు సెక్రటరీ దివాకర్, కమీషన్ ఏజెంట్లు పాల్గొన్నారు. నష్ట నివారణ చర్యలేవీ... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీంకు సంబంధించి ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రైతుకు నష్టం జరుగుతుందని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఫైన్ వెరైటీ క్వాలిటీ మిర్చి క్వింటా రూ.6000కు పైగా ఉందని రైతును మభ్యపెడుతున్నారు. లక్ష టిక్కీల్లో ఏదో నామమాత్రంగా అంటే సుమారు 1000 టిక్కీల్లోపు మాత్రమే రూ.6000 ధర పలకడం గమనార్హం. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వ పథకంతో రైతులకు నష్టం జరుగుతుందని అపోహలు సృష్టిస్తోంది. అయితే హైబ్రిడ్ రకాల్లో సైతం ప్రస్తుతం క్వింటా ధర రూ.2500–3000 ఉంది. సాధారణ రకాల్లో ఫైన్ క్వాలిటీ రకం మిర్చి సైతం క్వింటా రూ.1500 మించి ధర పలకడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాన్ని అమలు చేసి అన్ని రకాల మిర్చిని కొనుగోలు చేస్తే కొంతవరకైనా తమకు మేలు కలుగుతుందని రైతులు కోరుతున్నారు. క్వింటా మిర్చి ఉత్పత్తికి రూ.7500 అవుతుందని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపిన విషయాన్ని కొంత మంది రైతులు గుర్తు చేçస్తున్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం అమలు చేస్తే కొంత మేరకు నష్టం అయినా తగ్గుతుందని రైతులు భావిస్తున్నారు. భిన్నాభిప్రాయాలు లేవు: పరమేశ్వర్ పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ మాట్లాడుతూ... పార్టీలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవని, 2013 ఎన్నికల్లో మాదిరిగానే వచ్చే ఏడాది కూడా కాంగ్రెస్‌ను కలిసికట్టుగా అధికారంలోకి తేవడానికి కృషిచేయాలన్నారు. కాగా కేపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకంతో పాటు పార్టీ బలోపేతం చేయడానికి,వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి ఏం చేయాలన్నదానిపై ఈ సమావేశంలో సలహాలను స్వీకరించారు. -
మిర్చి ఎందుకు కొనడం లేదు?
- దళారులతో టీఆర్ఎస్ నేతల ఒప్పందం - బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి విమర్శ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద రూ.5 వేల చొప్పున క్వింటాల్ మిర్చిని కొనుగోలు చేయాలని చెప్పి వారం రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో చర్యలెందుకు తీసుకోవడం లేదని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. మిర్చిని ఆ ధరకు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం కొనడం లేదంటూ రైతుల నుంచి బీజేపీ నాయకులకు పలు ఫోన్ కాల్స్ వస్తున్నాయని అన్నారు. మిర్చి యార్డుల్లో క్రయవిక్రయాలు జరుగుతున్న తీరు తెన్నులను పరిశీలించేందుకు, రైతులను కలుసుకునేందుకు ప్రతిపక్షాలను, రైతు సంఘాలను ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదని ఆయన నిలదీశారు. మార్కెట్ యార్డును సందర్శించకుండా సోమవారం వరంగల్ మార్కెట్లో బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఇతర నాయ కులను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిం చారు. పార్టీ నాయకులు చింతా సాంబ మూర్తి, ఎన్.వి.సుభాష్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యాపా రులు, దళారులతో టీఆర్ఎస్ నాయకులు ఒప్పందం చేసుకుని అతి తక్కువ ధరకు మిర్చి కొనుగోళ్లు జరిపిస్తున్నారని ఆరో పించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను ప్రభుత్వం అరెస్ట్ చేసిందని చింతా సాంబమూర్తి విమర్శించారు. -
మిర్చి రూ.10 వేలకు కొనేలా చూడాలి
ఆ మేరకు సీఎం కేంద్రాన్ని ఒప్పించాలి: చాడ సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. మిర్చి క్వింటాల్ రూ.10 వేలకు కొనేలా కేంద్రాన్ని ఒప్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బ్యాంకు నుంచి అప్పు తీసుకొనైనా రైతుల పంటలను కొనడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. మిర్చి క్వింటాల్‌కు కేంద్రం ప్రకటించిన రూ.5 వేలు ఏమాత్రం సరిపోదన్నారు. రైతే రాజు అంటున్న సీఎం, గిట్టుబాటు ధర లేక ఆందోళనలో ఉన్న మిర్చి రైతులను ఆదుకునే విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు బాధ్యతను నెట్టేస్తూ సమస్యను జఠిలం చేస్తున్నాయన్నారు. రైతులపై కేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. -
మిర్చి కొనుగోలు చేయలేం!
– కర్నూలు మార్కెట్లో చేతులెత్తేసిన వ్యాపారులు – మార్కెట్ కమిటీ అధికారులో కలెక్టర్ సమీక్ష కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ప్రభుత్వం మిర్చికి క్వింటాకు రూ.1500 మద్దతు ధర ప్రకటించి.. కర్నూలు మార్కెట్ యార్డులో కూడా కొనుగోళ్లు జరపాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కర్నూలు మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలు చేయలేమని వ్యాపారులు చేతులెత్తేశారు. శనివారం..మార్కెట్ కమిటీ అధికారులు, కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులతో జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తన చాంబరులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్కెట్లో కొనుగోళ్లు జరిపేందుకు సహకరించాలని వ్యాపారులకు సూచించారు. అయితే కర్నూలు మార్కెట్‌కు వస్తున్న మిర్చిలో నాణ్యత లేదని, ప్రభుత్వం రూ.1500 మద్దతు ప్రకటించిన నేపథ్యంలో కొనుగోళ్లు జరుపడం సాధ్యం కాదని వ్యాపారులు పేర్కొన్నారు. తాము తొమ్మిది మందిమి ఉన్నామని.. స్థానిక అవసరాలకు అనుగుణంగా మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నామని, వేలాది క్వింటాళ్లు అయితే తమకు చేతకాదని చేతులెత్తేశారు. మార్కెట్ కమిటీ సెక్రటరీ శాస్త్రీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ కర్నూలు మార్కెట్ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకపోతామని, అక్కడి నుంచి వచ్చే స్పందనను బట్టి తర్వాత నిర్ణయం తీసుకుందామని తెలిపారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, కమిషన్ ఏజెంట్ల అసోషియేషన్ నేతలు కట్టా శేఖర్, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కంటితుడుపే!
-
కంటితుడుపే!
మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద మిర్చి కొనుగోలుకు కేంద్రం అంగీకారం - అడిగింది క్వింటాల్‌కు రూ. 7,000 - కేంద్రం అంగీకరించింది రూ. 5,000 - 3.3 లక్షల క్వింటాళ్ల కొనుగోలుకే పరిమితి - తక్కువ ధర నిర్ణయించడంపై రాష్ట్రం అసంతృప్తి - కేంద్ర నిర్ణయాన్ని అంగీకరించాలా? బోనస్ ఇవ్వాలా?.. అధికారుల తర్జనభర్జన - ఈ నెల 2 నుంచి 31 వరకు కొనుగోళ్లు - రైతుల వద్ద ఇంకా 30 లక్షల టన్నులున్నట్లు మార్కెటింగ్ శాఖ అంచనా సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్రంలో మిర్చి రైతుల కష్టాలు కేంద్రం కంటికి కనిపించడం లేదు. ధర పతనమై గగ్గోలు పెడుతున్న రైతులకు కంటితుడుపు చర్యగా క్వింటాల్‌కు రూ.5 వేల ధర ప్రకటించి చేతులు దులుపుకొంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా కొనుగోళ్లు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వివరాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు బుధవారం ఢిల్లీలో వెల్లడించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రైతుల నుంచి, రైతు సంస్థల నుంచి, కోఆపరేటివ్ మార్కెట్ల నుంచి మిర్చిని క్వింటాలుకు రూ.5 వేలు చెల్లించి కొనుగోలు చేస్తాయని చెప్పారు. తెలంగాణలో 33,700 టన్నులు, ఏపీలో 88,300 టన్నుల మిర్చిని సేకరిస్తారని, ఈ కొనుగోలు ద్వారా నష్టం వచ్చినట్టయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 చొప్పున భరిస్తాయని తెలిపారు. ఈ పథకం కింద ఈ నెల 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కొనుగోళ్లు చేయాలని పేర్కొన్నారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం రూ.7 వేలు ఇవ్వాలని కోరితే.. కేంద్రం కేవలం రూ.5 వేలు ఇస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. మిర్చిని రూ.4–5 వేల మధ్య దళారులు కొనుగోలు చేస్తున్నందునే రూ.7 వేలకు కొనుగోలు చేయాలంటూ కేంద్రానికి విన్నవించామని, కానీ కేంద్రం కూడా దళారుల మాదిరే వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం నిర్ణయించిన ధర, పరిమితి వల్ల మళ్లీ మిర్చి మంటలు చెలరేగుతాయని అంటున్నారు. అమలు చేద్దామా? బోనస్ ఇద్దామా? రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కేవలం 33,700 టన్నుల (3.3 లక్షల క్వింటాళ్లు) మిర్చి మాత్రమే కొనుగోలు చేయాలంటూ కేంద్రం పరిమితి విధించింది. కొనుగోలు పన్ను, గోదాముల చార్జీలు, ప్యాకింగ్ మెటీరియల్, లోడింగ్, అన్లోడింగ్ ఇతరత్రా చార్జీలు కలిపి క్వింటాలుకు రూ.1,250గా నిర్ణయించారు. రైతుల నుంచి ప్రభుత్వ సంస్థల ద్వారా అంటే సహకార సంఘాలు, రైతు సంస్థలే చేయాలి. దళారులను దూరం పెట్టాలి. సేకరించిన మిర్చి నిల్వలను బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవాలి. రైతులకు చెల్లింపులను డిజిటల్ లేదా నగదు రహిత లావాదేవీల ద్వారానే చేయాలని కేంద్రం సూచించింది. కేంద్రం రూ.5 వేలే ప్రకటించడంపై రాష్ట్ర సర్కారు అసంతృప్తితో ఉంది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కేంద్రం నిర్ణయాన్ని అమలు చేయాలా? లేక తామే క్వింటాలుకు రూ.1500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలా అన్న తర్జనభర్జనలో అధికారులున్నారు. కొనాల్సింది ఇంకా 30 లక్షల క్వింటాళ్లు రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 30 లక్షల క్వింటాళ్ల మిర్చిని రైతులు అమ్మేశారు. ఇంకా 30 లక్షల క్వింటాళ్లు రైతుల వద్ద ఉందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. ధాన్యం, కందులు, మొక్కజొన్న తదితర పంటల కొనుగోలుకు కేంద్రం 100 శాతం అనుమతి ఇచ్చింది. కానీ మిర్చి కొనుగోలు వద్దకు వచ్చేసరికి మార్కెట్‌కు వచ్చిన వాటిల్లో కేవలం 10 శాతం మాత్రమే అనుమతిచ్చింది. ఇంకా 30 లక్షల క్వింటాళ్లు రైతుల వద్ద ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం 3.3 లక్షల క్వింటాళ్లకే అనుమతి ఇచ్చింది. మిగిలిన 26.70 లక్షల క్వింటాళ్ల మిర్చి సంగతేంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రోజుకు లక్ష క్వింటాళ్లు మార్కెట్‌కు వస్తోంది. కేంద్రం అనుమతించిన ప్రకారం మూడు రోజుల్లోనే కొనుగోళ్లు పూర్తవుతాయి. ప్రస్తుతం శీతల గిడ్డంగులు లేని పరిస్థితుల్లో నష్టం ఎక్కువగా ఉండే అవకాశముంది. కానీ కేంద్రం మొత్తం నష్టాన్ని 25 శాతానికి కుదించినందున అందులో సగం మాత్రమే భరించేందుకు ముందుకొచ్చింది. అంటే ఇచ్చిన అనుమతికి అయ్యే ఖర్చు రూ. 212 కోట్లలో కేంద్రం వాటా రూ.26 కోట్లు మాత్రమే. మిగిలినదంతా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారు. ఇది కూడా కేవలం 3.3 లక్షల క్వింటాళ్లకే. మిగిలిన 26.70 లక్షల క్వింటాళ్లకు మరో రూ.1,800 కోట్లు వర్కింగ్ కేపిటల్ అవసరం. దీనికి కేంద్రం బాధ్యత లేదంటున్నారు. 30 నుంచి 50 శాతం వరకు నష్టం అనుకున్నా.. రూ.600 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశముంది. నిల్వ చేసుకునే సదుపాయం కూడా లేదు. కాబట్టి ఎక్కువగా నష్టం వచ్చే అవకాశం ఉందని మార్కెటింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఆగని ‘మిర్చి’ సెగలు
-
ఆగని ‘మిర్చి’ సెగలు
సాక్షి, ఖమ్మం/లీగల్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏప్రిల్ 28న జరిగిన ఆందోళన, విధ్వంసం చేసిన ఘటనలో పది మంది రైతులను త్రీటౌన్ పోలీసులు ఆదివారం ఖమ్మం స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ ఘటనలో ముదిగొండ మండలం చిరుమర్రికి చెందిన మండెపుడి ఆనందరావు, బాణాపురానికి చెందిన నెల్లూరి వెంకటేశ్వర్లు, సత్తు కొండయ్య, కల్లూరు మండలం లక్ష్మీపురంతండాకు చెందిన ఇస్రాల బాలు, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లికి చెందిన భుక్యా అశోక్, ఏన్కూరు మండలం శ్రీరామపురంతండాకు చెందిన భుక్యా నర్సింహారావు, తిరుమలాయపాలెం మండలం బచ్చోడుతండాకు చెందిన భూక్యాశ్రీను, బానోతు సైదులు, కారేపల్లి మండలం దుబ్బతండాకు చెందిన తేజావత్ భావ్‌సింగ్, నేలకొండపల్లి మండలం శంకరగిరితండాకు చెందిన బానోతు ఉపేందర్లను ఖమ్మం మొదటి అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి ఎన్. అమరావతి ఎదుట హాజరు పరచగా, వారికి మే 11 వరకు రిమాండ్ విధించారు. వీరిలో ఏ–2ముద్దాయి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను పరారీలో ఉన్నట్లు చూపించారు. కాగా, రైతులపై సెక్షన్లు 147(దాడి చేయటానికి వెళ్లడం), 148(మారణ ఆయుధాలతో దాడి చేయటం), 353(ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం), 427(ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించుట), 446, 448( అక్రమంగా, దురుద్దేశంగా ప్రవేశించుట) 120(బి)(నేరం చేయటానికి ముందస్తు ప్రణాళిక, llనేరపూరిత కుట్ర) రెడ్‌విత్ 149, సెక్షన్ 3 అండ్ 4 పీడీ పీపీ యాక్ట్ (ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించుట) కింద రిమాండ్ చేశారు. రాజకీయ కుట్రతోనే కేసు : సండ్ర రాజకీయ కుట్రతోనే తనపై కేసు పెట్టారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఖమ్మం మార్కెట్లో మిర్చికి మద్దతుధర అందకనే రైతులే ఆవేశంగా మార్కెట్ కార్యాలయాలపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన శుక్రవారం రోజు రైతులు మార్కెట్లో ఉదయం 7.30 గంటల నుంచే ధర విషయంలో ఆందోళన చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీంతో రైతులను పరామర్శించేందుకు, చైర్మన్‌తో మాట్లాడదామని మార్కెట్‌కు ఉదయం 10.30 గంటలకు వెళ్లానని, అప్పటికే రైతులు మార్కెట్లో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌తో ఆయన చాంబర్లో ధర విషయమై మాట్లాడానని చెప్పారు. అప్పుడు చాంబర్లో చైర్మన్‌తోపాటు ఇద్దరు సీఐలు కూడా ఉన్నారన్నారు. ఆందోళన అంతకు ముందు జరుగుతున్నట్లు వాళ్లకు తెలిసినా, తాను వచ్చినప్పుడే రైతులు ఒక్కసారిగా ఆందోళన చేశారని, తానే ఈ విధ్వంసానికి కారకుడినని ప్రచారం చేస్తుండటం రాజకీయ కుట్రేనని అన్నారు. అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ కూడా రైతుల వద్దకు వెళ్లిందని, అప్పుడు జరిగిన ఇలాంటి సంఘటనలకు కూడా ఆ పార్టీ బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్న తాము రైతులు, ప్రజల కష్టాలను చూస్తామని, ఇలాంటి కేసులకు భయపడబోమని అన్నారు. మార్కెట్‌కు పంటను అమ్ముకోడానికి వచ్చిన రైతులపై ఖమ్మం మార్కెట్ నుంచే కేసులు పెట్టడం హేయమైనచర్య అని పేర్కొన్నారు. -
మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి
గౌరు వెంకటరెడ్డి ఇల్లూరుకొత్తపేట(బనగానపల్లె) : మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు గౌరువెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఇల్లూరుకొత్తపేటలో కల్లాల్లో నిల్వ ఉంచిన మిరప పంటను నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డితో కలిసి పరిశీలించారు. గతేడాది కిలో మిర్చి రూ.125 పలికిందని, ప్రస్తుతం రూ.40 కూడా మించడం లేదని మిర్చి రైతులు గౌరు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌరు మాట్లాడుతూ మిరప పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నుంచి గుంటూరులో దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. రూ.5వేల కోట్లతో రైతు సంక్షేమ ని«ధిని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కిలో రూ.80 ప్రకారం కొనుగోలు చేసినా రైతులకు కనీసం పెట్టుబడైనా దక్కుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కువ విస్తీర్ణంలో రైతులు మిరప సాగు చేశారన్నారు. గిట్టుబాటు ధర లభించక ఆత్యహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షకు రైతులు పూర్తిగా మద్దతు ప్రకటించాలని కోరారు. వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి గుండం శేషిరెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, స్థానిక నాయకులు రమణ, వెంకటసుబ్బారెడ్డి, కూరంరామిరెడ్డి, ఈశ్వరయ్య, చాంద్‌బాషా, సర్వేశ్వరరెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం సీరియస్.. ఏ2గా టీడీపీ ఎమ్మెల్యే
ఖమ్మం: ఖమ్మం మిర్చి యార్డు రణరంగంగా మారిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో పాటు 11 మందిపై కేసు నమోదైంది. 147, 148, 353, 427, 448, 420(బి) సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ-2గా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర పేరును చేర్చారు. మార్కెట్ కమిటీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసు బలగాలు వచ్చినా మిర్చి ధర రోజురోజుకు తగ్గడంతో చేపట్టిన ఆందోళనను రైతులు అంత సులువుగా విరమించలేదు. మిర్చి ధరను రోజు రోజుకు ఎందుకిలా తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. శనివారం నాడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగి చైర్మన్, కార్యదర్శుల కార్యాలయాలకు నిప్పుపెట్టారు. అంతటితో ఆగకుండా మార్కెట్లోని సుమారు 1000 కాంటాలు ధ్వంసం చేశారు. ఆ సమయంలో ప్రాణభయంతో ఉద్యోగులు, కార్యదర్శి పరుగులు తీసిన విషయం తెలిసిందే. రైతులకు మద్దతుగా మార్కెట్‌కు వచ్చిన ఎమ్మెల్యే సండ్ర ఆందోళన జరుగుతున్న సమయంలో చైర్మన్ చాంబర్లోకి వెళ్లి మిర్చి ధరపై చర్చించారు. అయితే సండ్ర రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టంతో వారు తీవ్ర ఆవేశానికిలోనై కంప్యూటర్లు, ఫర్నీచర్, ద్విచక్రవాహనాలను ధ్వంసం చేశారని ఆరోపణలున్నాయి. దీంతో ఏ-2గా ఆయన పేరును చేర్చారు. -
ఖమ్మం మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు ప్రారంభం
ఖమ్మం: స్థానిక మార్కెట్ యార్డ్‌లో శనివారం ఉదయం మిర్చి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వ్యాపారులతో మార్కెట్‌యార్డు చైర్మన్ కృష్ణ చర్చలు సఫలం కావడంతో ట్రేడింగ్ మొదలైంది. ధర విషయంలో నాణ్యత చూసి కొనుగోళ్లు చేస్తామని వ్యాపారులు తెలిపారు. రైతులు తెచ్చిన మిర్చి నాణ్యత ఆధారంగా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. రైతులకు సరైన ధర కల్పించాలని, వ్యాపారులు అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని మార్కెట్ కమిటీ చైర్మన్ హెచ్చరించారు. మార్కెట్ యార్డులోని రాజకీయ నాయకులు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలీసులకు ఆదేశించారు. మిర్చీకి సరైన ధర ఇచ్చి, తొందరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. -
రణరంగంగా మారిన ఖమ్మం మార్కెట్
-
మిర్చి మంటలు
ధర పతనంతో పెల్లుబిక్కిన రైతన్న ఆగ్రహం - రణరంగంగా మారిన ఖమ్మం మార్కెట్ - చైర్మన్, కార్యదర్శుల కార్యాలయాలు ధ్వంసం - ‘ఈ–నామ్’లో కంప్యూటర్లు, ఫర్నిచర్‌కు నిప్పు - మార్కెట్లోని సుమారు 1,000 కాంటాలు ధ్వంసం - పరుగులు తీసిన ఉద్యోగులు, కార్యదర్శి - రూ. 8 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా - క్వింటాల్‌కు 2 వేలకు పైగా పడిపోయిన ధర సాక్షి, ఖమ్మం: మిర్చి ధర ఒక్కసారిగా పతనం కావడంతో రైతన్న కడుపు రగిలింది. కొద్దిరోజుల కింద ఐదారు వేల వరకు పలికిన మిర్చి ధరను శుక్రవారం మూడు నాలుగు వేలకు తగ్గించడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ధర తగ్గించడాన్ని నిరసిస్తూ రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఆందోళనకు దిగారు. మార్కెట్ కమిటీ కార్యాలయంపై దాడి చేశారు. రాళ్లు రువ్వడంతోపాటు కార్యాలయంలోకి ప్రవేశించి కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను తగలబెట్టారు. మార్కెట్లోని తూకం కాంటాలనూ ధ్వంసం చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు వచ్చి రైతులను చెదరగొట్టారు. ఆందోళన మొదలైందిలా.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం సుమారు 1.5 లక్షల మిర్చి బస్తాలు వచ్చాయి. ఫిబ్రవరి, మార్చి నుంచి క్రమంగా తగ్గుతున్న మిర్చి ధర ఈ నెలలో అమాంతం పడిపోయింది. గత వారం వరకు సగటున రూ.4,500 నుంచి రూ.5వేల వరకు పలికినా.. శుక్రవారం వ్యాపారులు ఏకంగా రూ.2 వేల నుంచి రూ.4వేల వరకు తగ్గించారు. తొలుత ఉదయం 7 గంటల సమయంలో మార్కెట్ యార్డుల వెలుపల రహదారులపై వేసిన మిర్చి బస్తాల ధరలు నిర్ణయించారు. సరుకు తూకం వేసేందుకు కాంటాలను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ధర బాగా తగ్గించడంపై మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో అక్కడి కాంటాలను ధ్వంసం చేసి.. మూకుమ్మడిగా మార్కెట్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మార్కెట్ అధికారులు, చైర్మన్ వచ్చి దీనిపై సమాధానం చెప్పాలని, మిర్చికి తగిన ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న మార్కెట్ కార్యదర్శి ప్రసాదరావు రైతుల వద్దకు వచ్చి.. ధర నిర్ణయం తమ చేతుల్లో లేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో మరింతగా ఆగ్రహించిన రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట కొంత మిర్చి దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కొద్దిసేపటికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ మార్కెట్ కార్యాలయానికి వచ్చి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మార్కెట్‌కు చేరుకుని.. రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. ఒక్కసారిగా ఉద్రిక్తత.. రైతులకు మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చైర్మన్ చాంబర్లోకి వెళ్లి మిర్చి ధరపై చైర్మన్‌తో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో మార్కెట్ యార్డుల నుంచి రైతులంతా ఒక్కసారిగా మార్కెట్ కార్యాలయం వద్దకు వచ్చారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బయటకు వెళ్లిపోయారు. చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, కార్యదర్శి పాలకుర్తి ప్రసాదరావు, ఉద్యోగులు చాంబర్‌ను వీడి పక్కకు వెళ్లిపోయారు. రైతులు చైర్మన్ చాంబర్లోకి ప్రవేశించి.. అక్కడి కంప్యూటర్, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. తర్వాత కార్యదర్శి కార్యాలయంలో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, ఏసీ, ఫ్యాన్లను, పక్కనే ఉన్న ఉద్యోగుల కార్యాలయానికి వెళ్లి రణరంగం సృష్టించారు. కంప్యూటర్లు, ఫర్నీచర్, బీరువాలు, ద్విచక్ర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన కొందరు ఉద్యోగులపైనా దాడి చేయడంతో వారు పరుగులు తీశారు. కొందరు ఉద్యోగులకు రాళ్ల దెబ్బలు తగిలాయి. పోలీసు బలగాలు వచ్చినా ఆగని ఆందోళన మార్కెట్ కమిటీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసు బలగాలు వచ్చినా.. రైతులు తమ ఆందోళన విరమించలేదు. మిర్చి ధరను రోజు రోజుకు ఎందుకిలా తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. ధరను బాగా తగ్గించేడంతో తీవ్రంగా నష్టపోతున్నామని, అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతసేపు సంయమనం పాటించిన పోలీసులు.. రైతులు తిరిగి మార్కెట్ కార్యాలయం వైపు వస్తుండటంతో రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. దీంతో మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత రైతుల ఆందోళన తగ్గింది. ఫర్నీచర్, ఇతర సామగ్రి దహనమవుతుండగా.. ఫైరింజన్లను తెప్పించి మంటలు ఆర్పించారు. రైతుల ఆగ్రహానికి మార్కెట్ ధ్వంసం కావడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మార్కెట్లో ధ్వంసమైన కార్యాలయాలను పరిశీలించి, మార్కెట్ కమిటీ చైర్మన్, సిబ్బందితో మాట్లాడారు. రైతుల ఆందోళన, మార్కెట్లో పరిస్థితిపై పోలీసు, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. రూ.8 కోట్ల ఆస్తి నష్టం రైతుల ఆగ్రహానికి మార్కెట్లోని కార్యాలయాల్లో ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. సుమారు 40 కంప్యూటర్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఎనిమిది ఏసీలు, ఐదు జీపీఆర్ఎస్ కాంటాలు, 20 హ్యాండ్పాస్లు, 35 టేబుళ్లతోపాటు ప్రింటర్లు, జిరాక్స్ యంత్రాలు, సీసీ కెమెరాలు, స్మార్ట్‌టీవీలు, ఫ్యాన్లు, కూలర్లు, బీరువాలు, ఆఫీస్ ఫైళ్లు, రికార్డులు, వేబ్రిడ్జి యంత్రం ధ్వంసమయ్యాయి. వీటితోపాటు వ్యాపారులకు చెందిన సుమారు వెయ్యి ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ధ్వంసం చేశారు. మొత్తంగా రూ.8 కోట్ల మేరకు ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. మరోవైపు వ్యాపారుల ఎలక్ట్రానిక్ కాంటాలు ధ్వంసం కావడంతో.. మార్కెట్లో పంటలను కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. తప్పిన పెను ప్రమాదం! రైతులు ఈ–నామ్ కేంద్రంలోని ఫర్నీచర్‌ను, ఎలక్ట్రానిక్ వస్తువులను దహనం చేసిన సమయంలో పక్కనే మిర్చి బస్తాలున్నాయి. ఆ యార్డుతోపాటు పక్క యార్డులలో, రహదారులపై, సమీప ప్రాంతాల నిండా మిర్చి బస్తాలున్నాయి. అసలే మండుతున్న ఎండ.. ఇటు ఫర్నీచర్ దహనంతో మంటలు చెలరేగుతాయేమోననే ఆందోళన వ్యక్తమైంది. అంతేకాదు మార్కెట్యార్డులోగానీ, సమీపంలోగానీ ఫైరింజన్ అందుబాటులో లేదు. ఒకవేళ యార్డులో మిర్చి బస్తాలకు మంటలు అంటుకుని ఉంటే.. పెద్ద ప్రమాదమే తలెత్తేది. పరిస్థితి చేయి దాటిపోయేది. ఖమ్మం నగరమంతా అతలాకుతలమయ్యేది. పోలీసులు అప్రమత్తమై రైతులను చెల్లాచెదురు చేయడం, మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. ఈ–నామ్ కార్యాలయం అగ్నికి ఆహుతి మార్కెట్లో ఓ పక్కగా ఉన్న పత్తియార్డులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘జాతీయ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం (ఈ–నామ్)’పైనా రైతులు దాడిచేశారు. అందులోని కంప్యూటర్లు, ఫర్నీచర్, ల్యాప్‌టాప్‌లు, ఏసీలను బయటపడేసి నిప్పంటించారు. కంప్యూటర్ క్యాబిన్ అద్దాలన్నీ ధ్వంసం చేశారు. అయితే ఈ–నామ్ కేంద్రాన్ని ప్రస్తుతం పత్తి లావాదేవీల కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. ఇటీవలే అధునాతన హంగులతో ప్రారంభించారు. అది మిర్చికి సంబంధించినది కాకున్నా రైతులు దానిని ధ్వంసం చేయడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. దాడి చేసింది రాజకీయ పార్టీల కార్యకర్తలు ‘‘మిర్చికి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విన్నవించాం. స్పందన రాలేదు. కానీ దీనిపై కొన్ని పార్టీలు రాజకీయ డ్రామాలు చేస్తున్నాయి. ఖమ్మంలో మార్కెట్ యార్డుపై దాడి అలాంటిదే. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు రైతుల ముసుగులో వచ్చి దాడికి పాల్పడ్డారు. మార్కెట్లోని సీసీ కెమెరాల వీడియోలు చూస్తే.. దాడిలో ముసుగేసుకుని వచ్చినవారున్నారు. వారెవరూ రైతులు కాదు. రైతులెవరూ అలా దాడులు చేయరు. మిర్చి ధరపై రైతులకు సరైన న్యాయం చేస్తాం..’’ – టి.హరీశ్‌రావు, మార్కెటింగ్‌శాఖ మంత్రి ధర లేదని మిర్చి పంటను తగలబెట్టాడు మిర్చి ధర పడిపోవడంతో పెట్టుబడి కూడా రాదని మనస్తాపం చెందిన రైతు.. తాను పండించిన పంటకు తనే నిప్పుపెట్టాడు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం కౌకొండకు చెందిన చుక్క రాజయ్య తన రెండెకరాల పొలంలో మిర్చి పంట సాగు చేశాడు. ఇప్పుడు పంట దిగుబడికి వచ్చి, అమ్ముదామనుకునే సరికి ధర బాగా పడిపోయింది. దీంతో ఆందోళనకు లోనైన రాజయ్య.. దిక్కుతోచని పరిస్థితిలో శుక్రవారం మిర్చి పంటకు నిప్పు పెట్టుకున్నాడు. తగిన మద్దతు ధరకు కొంటామంటూ ఒప్పందం చేసుకున్న ఐటీసీ కంపెనీ వారు చెప్పినట్లుగానే పంట పండిచానని.. కానీ వారు పంటను కొనకుండా మొండిచేయి చూపారని తెలిపారు. -
కౌలు రైతు బలవన్మరణం
- మిరప సాగులో నష్టాలు - శనగ మాత్రలు మింగి ఆత్మహత్య - తమ్మడపల్లెలో విషాదం బనగానపల్లె రూరల్: మిరప సాగులో నష్టాలు రావడంతో బనగానపల్లె మండలం తమ్మడపల్లె గ్రామానికి చెందిన కౌలు రైతు ఆదిమూల బాలన్న(57) బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాలన్న మూడెకరాలను రూ.60వేలకు కౌలుకు తీసుకుని మిరప పంట సాగుచేశాడు. పంట దిగుబడి 70 క్వింటాళ్లు వచ్చింది. ఈ పంటను అమ్మేందుకు నాలుగు రోజుల క్రితం గుంటూరు మిర్చియార్డుకు తీసుకు వెళ్లారు. అక్కడ ఆశించిన ధర లభించకపోవడంతో గిడ్డంగిలో పెట్టి వచ్చాడు. పెట్టుబడి కోసం రూ.3లక్షల వరకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పు చేశారు. అంతేకాకుండా రూ.20వేలు కేడీసీసీ బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. వచ్చిన పంటకు ధర లేక వడ్డీలు అధికం కావడంతో మనస్తాపం చెంది గురువారం రాత్రి శనగ మాత్రలు మింగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం మృతి చెందాడు. మృతునికి భార్య సుంకమ్మ, కుమారుడు బాలకృష్ణ, కుమార్తెలు సువర్ణ, భార్గవిలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాకేష్ తెలిపారు. -
కడుపు మండి.. మిర్చికి నిప్పు
వేమనపల్లి(బెల్లంపల్లి): ఆరుగాలం పండించిన మిర్చి పంటకు ధర కరువై.. మార్కెట్ దూరమై.. పెట్టుబడీ వచ్చే అవకాశం లేక రైతు కడుపు మండింది. పంటను మార్కెట్‌కు తరలించి అప్పులపాలు కాలేక కళ్లంలోనే 38 క్వింటాళ్ల మిర్చికి నిప్పు పెట్టాడు. ఈ సంఘటన మంచి ర్యాల జిల్లా వేమనపల్లి మండలం కల్మలపేట శివారు నడిమిగడ్డ ప్రాంతంలో సోమవారం జరి గింది. గ్రామానికి చెందిన ఛటారి రామన్న తనకున్న రెండు ఎకరాలతో పాటు, మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి వేశాడు. ధర లేకున్నా వారం రోజుల క్రితం రూ. మూడు వేలకు క్వింటాల్ చొప్పున 100 క్వింటాళ్లు విక్రయించాడు. ఇంకా 50 క్వింటాళ్ల మిర్చి కళ్లంలోనే ఉంది. కొనేవారు లేక.. ధర కరువై దిగులు చెందుతున్నాడు. మిర్చి విక్రయించాలంటే ఇక్కడి నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ్‌పూర్ మార్కెట్‌కు తరలించాలి. ఇక్కడ దళారులు రూ. 2,500 క్వింటాల్ చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పడంతో కుమిలిపోయాడు. నాగ్‌పూర్ మార్కెట్‌కు తరలిస్తే రవాణా ఖర్చులు కూడా వచ్చే అవకాశం లేకపోవడం, ట్రాక్టర్లో ఇంటికి తరలించడానికి కూడా డబ్బులు లేకపోవడంతో కళ్లంలోనే సోమవారం సాయంత్రం మిర్చికి నిప్పంటించాడు. 38 క్వింటాళ్ల మిర్చి అగ్నికి ఆహుతైపోయింది. -
రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
అమరావతి: కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైతులు పండించే మిర్చిని కొనుగోలు చేయాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు గురువారం సాయంత్రంలోగా విధివిధానాలను ఖరారు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఒక్కో మిర్చి రైతు వద్ద నుంచి క్వింటాల్‌కు రూ.1500 చొప్పున గరిష్టంగా 20 క్వింటాళ్ల మిర్చిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏటా రూ. 300-400 కోట్లు వెచ్చించనుంది. మిర్చి కొనుగోలు అనంతరం ఆన్లైన్లో రైతులకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్ చెల్లింపుల విధానం శుక్రవారం నుంచి అమలు కానుంది. -
మిర్చికి మద్దతు ధర ఇవ్వండి
ఒంగోలు టౌన్: మిర్చి క్వింటా 10వేల రూపాయలకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని నాలుగు వామపక్ష రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం స్థానిక ఎల్బీజీ భవన్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించాయి. రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి. హనుమారెడ్డి మాట్లాడుతూ మిర్చి రైతులు ఈ ఏడాది పంట పండించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 70వేల రూపాయల వరకు ఖర్చు చేశారన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు మాట్లాడుతూ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించినా మిర్చి పంటను ఇంతవరకు నమోదు చేయకపోవడం దారుణమని తెలిపారు. ఎండిపోయిన మిర్చి పంటను వెంటనే నమోదుచేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు రామారావు మాట్లాడుతూ సాగు విస్తీర్ణం పెరగడం వల్ల ధరలు తగ్గాయని అధికారులు చెప్పడం సరికాదన్నారు. ఈ ఏడాది విస్తీర్ణం పెరిగినా దిగుబడి తగ్గిన విషయాన్ని గుర్తెరగాలన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకుడు ఆర్. మోహన్ మాట్లాడుతూ మిర్చి ధరలు రోజురోజుకు పతనం అవుతున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని విమర్శించారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెంట్యాల హనుమంతరావు మాట్లాడుతూ ఐక్య ఉద్యమాల ద్వారా గతంలో అనేక ఫలితాలు సాధించుకోవచ్చని చెప్పారు. మిర్చి రైతుల సమస్యలపై ఐక్య పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం జిల్లా నాయకురాలు ఎస్. లలితకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు పరిటాల నాగేశ్వరరావు, నాంచార్లు, కె. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇలా అయితే బ్రతికేదెట్ట చంద్రబాబు !
-
గుండెపోటు రైతు మృతి
పాణ్యం: వేలకువేలు పెట్టుబడి పెట్టి పండించిన మిరపకు ఆశించిన మేరకు ధర రాకపోవడంతో దిగాలుగా ఉన్న ఓ రైతు గుండెపోటుతో మరణించాడు. మండల పరిధిలోని నెరవాడ గ్రామానికి చెందిన ఒడ్డు రామచంద్రారెడ్డి(58) నాలుగు ఎకరాల సొంత పొలంతోపాటు అదనంగా మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని మిరప సాగు చేశాడు. ఎకరానికి 12-15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అంతకు ముందు కిలో రూ. 80 వరకు ఉన్న ధర పది రోజుల క్రితం నాటికి రూ. 60కి పడిపోయింది. అరకొరగా వచ్చిన పంటను రెండు రోజుల క్రితం గంటూరు మార్కెట్‌కు తీసుకెళ్లగా ధర రాకపోవడంతో దిగుబడిని అక్కడే ఉంచి ఇంటికి వచ్చాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక బాధపడుతున్న రైతు ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. -
రేపటి నుంచి మిర్చి కొనుగోళ్లు బంద్
- ఏప్రిల్ 9 వరకు ఇదే పరిస్థితి - నగదు కొరతే కారణం కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): రైతులు ఎవరూ మిర్చిని కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు తీసుకురావద్దని, శుక్రవారం 24వ తేదీ నుంచి కొనుగోళ్లు బంద్ చేస్తున్నామని యార్డు కార్యదర్శి శివరామకృష్ణ శాస్త్రి తెలిపారు. బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు మిర్చి కొనుగోళ్లు ఉండబోవని పేర్కొన్నారు. మార్చి మాసాంతంలో బ్యాంకుల నుంచి నగదు తీసుకోలేకపోతున్నామని కర్నూలు కమిషన్ మండి మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు అభ్యర్థించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. అమవాస్యతోపాటు ఉగాది, శ్రీరామనవమి పర్వదినాలు కలిసి రావడంతో పక్షం రోజుల పాటు మిర్చి కొనుగోళ్లను నిలుపుదల చేసినట్లు తెలిపారు. నగదు కొరతతో కలుగుతున్న అసౌకర్యానికి రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దిక్కుతోచని స్థితిలో రైతులు.. ఇప్పటికే యార్డుకు మిర్చిని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రకృతి వైపరిత్యాల కారణంగా ఆశించిన దిగుబడి రాకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో వారు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. కొనుగోళ్లు కూడా బంద్ కావడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షం రోజులపాటు దిగుబడిని ఎలా కాపాడుకోవాలనే సంశయం వారిని వెన్నాడుతోంది. -
కురిస్తే కష్టమే..!
మార్కాపురం : సాధారణంగా వర్షం కోసం రైతులు పూజలు చేస్తుంటారు. కానీ, ప్రస్తుతం వర్షం పడితే తమకు నష్టం వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, పెద్దదోర్నాల, కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట, యర్రగొండపాలెం, పుల్లలచెరువు తదితర మండలాల్లో సుమారు 18 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగుచేశారు. గ్రేడింగ్ కోసం పొలాల్లోనే మిర్చిని ఆరబోశారు. కూలీలు దొరక్క కొంత మంది రైతులు పత్తిని కూడా పొలంలోనే వదిలేశారు. మరి కొంత మంది మిరపకాయలు కోసి అమ్మేందుకు సిద్ధంగా పొలాల్లోనే ఉంచారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల నుంచి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతుండటంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం సాయంత్రం మార్కాపురం ప్రాంతంలో వర్షం కురిసింది. రెండు రోజుల నుంచి సాయంత్రం వేళల్లో ఆకాశమంతా మేఘావృతమై ఉంటోంది. దీంతో వర్షం కురుస్తుందనే ఆందోళన రైతుల్లో ఏర్పడింది. మండలంలోని వేములకోట, కొట్టాలపల్లె, నికరంపల్లె, చింతగుంట్ల, తిప్పాయపాలెం, మిట్టమీదపల్లె, కొండేపల్లి, గజ్జలకొండ, రాయవరం, మొద్దులపల్లి, యాచవరం, తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం, మీర్జపేట, తాడివారిపల్లె, నాగెళ్లముడుపు, కలుజువ్వలపాడు, పెద్దారవీడు మండలంలోని పెద్దారవీడు, దేవరాజుగట్టు, తోకపల్లె, బద్వీడు చెర్లోపల్లె, పుచ్చకాయలపల్లె, తదితర గ్రామాల్లో పొలాల్లోనే మిర్చి పంట ఉంది. క్వింటా ధర మార్కెట్లో రూ.5,500 నుంచి రూ.6,500 మధ్య ఉంది. కూలీలు దొరక్క కొంత మంది రైతులు పొలాల్లోనే మిర్చి పంట ఉంచా రు. వర్షం పడితే కల్లాల్లో ఆరబోసిన మిర్చికి తీవ్ర నష్టం కలుగుతుంది. బాగా ఎండిన తరువాత గిట్టుబాటు ధర ఉంటే అమ్మాలని కొంత మంది రైతులు భావిస్తున్నారు. పత్తి కూడా సుమారు వెయ్యి హెక్టార్లలో సాగుచేశారు. వర్షం పడితే పత్తి పంట తడిసి నాణ్యత తగ్గే ప్రమాదం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, కోల్డ్‌స్టోరేజీ సౌకర్యాన్ని కల్పించాలని రైతులు కోరుతున్నారు. మొక్కజొన్న పంటను కూడా సుమారు 500 హెక్టార్లలో సాగు చేశారు. క్వింటాను సుమారు 10 వేల రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. మండలంలోని కొట్టాలపల్లె, వేములపేట, వేములకోట గ్రామాల్లో రైతులు అధికంగా మొక్కజొన్న సాగుచేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. ఈ నేపథ్యంలో మేఘాలు కమ్ముకుంటుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ వర్షాలు కురవాలని కోరుకునే రైతులు.. ఇప్పుడు మాత్రం కురిస్తే కష్టమే అనుకుంటూ బిక్కుబిక్కుమంటున్నారు. -
అన్నదాత ఆక్రందన.
-
నకిలీ విత్తనాలతో నట్టేట మునిగాం
లింగపాలెం: కల్తీ మిర్చి విత్తనాలు ఇచ్చి దుకాణ యజమాని తమను మోసగించారంటూ పలువురు రైతులు ఫిర్యాదు చేశారని జిల్లా ప్లాంట్ ప్రొడక్షన్ డీడీఏ బీజీవీ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ధర్మాజీగూడెంలోని సాయి శివ సీడ్స్ షాపులో రికార్డులు, బిల్లులను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా ముసునూరు మండలం వలసపల్లి గ్రామానికి చెందిన 15 మంది రైతులు ధర్మాజీగూడెం సాయి శివ సీడ్స్ దుకాణంలో సన్‌స్టార్ కంపెనీకి చెందిన ‘లక్ష్మి 90’ రకం మిర్చి విత్తనాలను కొద్దినెలల క్రితం కొనుగోలు చేశారన్నారు. ఈ విత్తనాలతో 21 ఎకరాల్లో మిరప సాగు చేయగా సక్రమంగా మెలకలు రాక, చెట్లు పూత పూయక దిగుబడులు తగ్గి తీవ్రంగా నష్టపోయినట్టు రైతులు ఫి ర్యాదు చేశారని చెప్పారు. తమకు జరిగిన నష్టంపై కంపెనీ ప్రతినిధులు, డీలర్‌కు పలు మార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఈ మేరకు తాను విచారణ చేపట్టానని చెప్పారు. దుకాణ యజమాని వి.రామకృష్ణ నుంచి వివరాలు సేకరించామని, నివేదికను కలెక్టర్, జేడీకి అందజేస్తానని డీడీఏ ప్రసాద్ చెప్పారు. చింతలపూడి ఏడీఏ పీజీ బుజ్జిబాబు, ఏవో డి.రాధిక, ఏఈవో సిద్దయ్య ఉన్నారు. డీలర్లపై చర్యలకు డిమాండ్ ఏలూరు (సెంట్రల్): నకిలీ విత్తనాలు అమ్మిన డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలతో నష్టపోయిన తమకు నష్టపరిహారం ఇవ్వాలని కృష్ణా జిల్లా ముసునూరు మండలం వలసపల్లి గ్రామానికి చెందిన మిర్చి రైతులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పిచ్చుక ఆదిశేషు మాట్లాడుతూ వలసపల్లి గ్రామానికి చెందిన 17 మంది రైతులు నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయారని, వీరిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీ పి.కోటేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. రైతులు గొల్లపల్లి బాలస్వామి, సొంగా మధు, సుబ్బారావు, కె.వెంకటేశ్వరరావు, పా మర్తి ప్రసాద్, వీర్ల కృష్ణవేణి, కొల్లేటి రాజు, చలసాని మురళీకృష్ణ తదిత రులు పాల్గొన్నారు. -
పండిన మిర్చి
గత ఐదేళ్లుగా ప్రకటించకుండా జాప్యంలో ఉంచిన నంది అవార్డులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. 2012, 2013 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ‘నంది అవార్డు’లను ప్రకటించింది. 2012కు సీనియర్ నటి జయసుధ, 2013కు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అవార్డు కమిటీలకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ రెండు కమిటీలు ఎంట్రీలను పరిశీలించి, విజేతలను నిర్ణయించాయి. జనరంజక సినిమాలుగా రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ‘ఈగ’, ‘మిర్చి’ ఉత్తమ చిత్రాలుగా ఎంపిక కావడం గమనార్హం. 2012లో ఉత్తమ జాతీయ సమైక్యత, ఉత్తమ లఘు చిత్రం, ఉత్తమ బాలల చిత్రాల విభాగాల్లో ఎవరికీ అవార్డు దక్కకపోవడం బాధాకరం. 2013లో ఉత్తమ బాలల చిత్రం విభాగంలో మినహా అన్ని విభాగాల్లోనూ విజేతలను ఎంపిక చేశారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు విభాగాల్లో అవార్డులు గెలుచుకొని ‘మిర్చి’ 2013 సంవత్సరంలో సత్తా చాటింది. పల్నాటి కక్షలు, కార్పణ్యాలను కథావస్తువుగా తీసుకొని వినోదాత్మకంగా కథను నడపటమే ఈ అవార్డుల గెలుపుకు కారణం అని చెప్పుకోవచ్చు. అమ్మ ఉండి ఉంటే ఆనందపడేది నమ్మి చేసిన ప్రయత్నానికి ప్రభుత్వం ఇచ్చే అవార్డు తోడైనప్పుడు ఆనందం వేరే స్థాయిలో ఉంటుంది. ‘మిర్చి’ తీసేటప్పుడు అవార్డుల గురించి ఆలోచించే స్థితిలో లేను. డైరెక్టర్‌గా మొదటి సినిమా కాబట్టి, కమర్షియల్ సక్సెస్ పైనే దృష్టి పెట్టాను. కెరీర్లో మొదటి అడుగు కాబట్టి, టెన్షన్‌గా ఉండేది. ప్రభాస్ డేట్స్ ఇవ్వడం, యూవీ క్రియేషన్స్ సినిమా తీయడానికి ముందుకు రావడంతో వాళ్ల నమ్మకం వమ్ము కాకూడదనే ఫీలింగ్ ఉండేది. చివరికి నిలబెట్టగలిగాను. నన్ను ఉన్నత స్థానంలో చూడాలనుకున్న మా అమ్మగారు ‘మిర్చి’ షూటింగ్ అప్పుడు చనిపోయారు. ఆవిడ ఉండి ఉంటే ఆనందించేది. నేను డైరెక్టర్ కావడానికి నా భార్య ప్రోత్సాహం చాలా ఉంది. – దర్శకుడు కొరటాల శివ ఆరు నందులు... ఎంతో ఆనందం మా స్నేహితుడు ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’తో మా సంస్థ ప్రయాణం మొదలైంది. తొలి చిత్రంతోనే 6 నందులు రావడం ఆనందంగా ఉంది. ఉత్తమ హీరోగా ప్రభాస్‌కి పురస్కారం రావడం, అది కూడా మా చిత్రంతో రావడం మరింత సంతోషంగా ఉంది. మరిన్ని మంచి చిత్రాలు, నాణ్యత గలవి నిర్మించడానికి ఈ పురస్కారాలు ఉత్సాహం అందించాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – నిర్మాతలు వంశీ, ప్రమోద్ ఈ నంది ఆ ఇద్దరిదే! నంది పురస్కారం రావడం సంతోషం. అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా పురస్కారం ప్రకటించారు. ‘అత్తారింటికి దారేది’ ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పేదేముంది. సమిష్టి కృషితో తీసిన చిత్రమిది. హీరో పవన్‌కల్యాణ్‌గారు బ్రహ్మాండంగా నటించారు. దర్శకుడు త్రివిక్రమ్‌గారు అద్భుతంగా తీశారు. ఈ నంది పురస్కారం వాళ్లిద్దరికీ చెందుతుంది. – నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ గురువుగారి ఆశీర్వాద ఫలమే.. మంగళవారం నా గురువుగారు మాండలిన్ శ్రీనివాస్‌కు నివాళిగా ‘గురవ్వే నమః’ పాటను విడుదల చేశాను. తెలుగు చిత్రపరిశ్రమలో విజయం సాధించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి సంగీత దర్శకునిగా వ్యవహరించినందుకు ఏపీ ప్రభుత్వం నంది అవార్డు పురస్కారాన్ని బుధవారం నాకు ప్రకటించింది. నా గురువుగారి ఆశీర్వాద ఫలంగానే ఈ అవార్డు వచ్చిందని భావిస్తున్నాను. – సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ప్రేక్షకులకు సలామ్ ‘‘20 ఏళ్లుగా నేను ఉద్యమంలో ఉన్నాను. ఎన్నో స్పీచ్‌లు ఇచ్చినా తీసుకురాలేని చైతన్యం.. రెండు గంటల సినిమా ‘నా బంగారు తల్లి’ తీసుకొచ్చింది. విజువల్ మీడియాకి అంత పవర్, రీచ్ ఉన్నాయి. మసాలా, కమర్షియల్ పేరుతో ప్రేక్షకుల బలహీనతలు సొమ్ము చేసుకుంటున్నారు. అలాంటి టైమ్‌లో ఓ ఐటమ్ సాంగ్, ఒక యాక్షన్ సీక్వెన్స్ లేని మా సినిమాకు కమర్షియల్ సినిమాలతో సమానంగా గుర్తింపు వచ్చింది. ఓ సామాజిక ఉద్యమకర్తగా ఈ అవార్డుని నేనో గొప్ప విజయంగా, ఉద్యమానికి వచ్చినట్టుగా భావిస్తున్నా. ఈ సినిమా చేయడానికి మా ఇల్లు, మా ఆస్తులన్నీ అమ్మేశాను. మంచి సినిమా చేస్తే... ఇండస్ట్రీ గుర్తిస్తుంది, సులభంగా విడుదల చేసేయొచ్చు అనుకున్నా. కానీ, విడుదలకు చాలా ఇబ్బందులు పడ్డా. ఆ టైమ్‌లో ఎవరూ గుర్తించలేదు. ఎక్కడ చూసినా తిరస్కరణే ఎదురైంది. ఎన్ని అవమానాలు ఎదురయ్యాయో మాటల్లో చెప్పలేను. ఇప్పుడు వాటి గురించి ఆలోచిస్తుంటే నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే... నాతో మంచిగా మాట్లాడేవారు. నాతో ప్రివ్యూ షో వేయించుకుని చూసేవారు. ప్రివ్యూ తర్వాత ‘అమ్మా... సునీత! ఎంత మంచి సినిమా తీశావమ్మా. అద్భుతంగా ఉంది. నాకు నా బిడ్డ గుర్తొచ్చింది’ అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పేవారు. ‘సార్... మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారా?’ అనడిగితే.. ‘లేదమ్మా. ఇలాంటి సినిమాను మేము డిస్ట్రిబ్యూట్ చేయం’ అనేవారు. ‘మంచి చిత్రానికి కావలసినవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అద్భుతంగా ఉందంటున్నారు కదా. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద భావించి ఈ సినిమా విడుదల చేయండి’ అని ఓ పెద్ద డిస్ట్రిబ్యూటర్ కాళ్ల మీద పడ్డాను. కానీ, కనికరించలేదు. రివర్స్‌లో ‘ఎవరన్నా ఇలాంటి సినిమా చూడడానికి వెళతారా?’ అని నన్ను ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించిన ప్రతి ఒక్కరి నోరు మూయించిన ప్రేక్షకులకు నేను సలాం చేస్తున్నా. పబ్లిక్ డిమాండ్ మీద టీవీలో 18 సార్లు ప్రదర్శించారు. భవిష్యత్తులోనూ సినిమాల ద్వారా సామాజిక మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తా. ప్రస్తుతం ‘రక్తం’ అనే సినిమా చేస్తున్నా. – నిర్మాత సునీతా కృష్ణన్ నంది వస్తుందని నమ్మాను ‘సినిమా గా సినిమా’.. ‘బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్’గా పలు అవార్డులు అందుకుని, పాత్రికేయునిగా, రచయితగా గొప్ప పేరు, ప్రఖ్యాతులు సంపాదించిన నందగోపాల్ నాదెళ్ల రాసిన పుస్తకం ఇది. 61వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ గ్రంథం’ అవార్డు గెల్చుకున్న పుస్తకం ఇది. ఇప్పుడు 2013 నంది అవార్డులలోనూ ‘తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం’ విభాగంలో ‘సినిమా గా సినిమా’ ఎంపికైంది. జాతీయ అవార్డుకు దాదాపు 45 పుస్తకాలకు పైగా పోటీ పడగా, నా ‘సినిమా గా సినిమా’కు అవార్డు వచ్చింది. నంది అవార్డు కూడా వస్తుందని నమ్మాను. అది నిజమైంది. – సీనియర్ పాత్రికేయులు నందగోపాల్ మరిన్ని మంచి సినిమాలొస్తాయి చిన్న సినిమాలకు అవార్డు వస్తే ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరిన్ని మంచి సినిమాలు రావడానికి కారణమవుతుంది. అందుకని ‘ఉయ్యాల జంపాల’ను ఎంపిక చేసిన ‘నంది అవార్డు’ జ్యూరీకి, ప్రభుత్వానికి ధన్యవాదాలు. సురేశ్‌బాబు, నాగార్జునల సహకారంతోనే ఈ సినిమా సాధ్యమైంది. ఈ సినిమాలో నటించిన రాజ్‌తరుణ్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా మంచి స్థాయికి వెళ్లడం పట్ల మీ ఫీలింగ్? అనడిగితే – ‘‘ఆనందంగా ఉంది. ఆ మాటకొస్తే ‘అష్టా చమ్మా’ తర్వాత నాని, ఇందగ్రంటి మోహనకృష్ణల కెరీర్ మంచి స్థాయికి వెళ్లడం, ‘గోల్కొండ హైస్కూల్’లో చైల్డ్ ఆర్టిస్‌గా చేసి, ‘తను నేను’ ద్వారా మేం హీరోగా పరిచయం చేసిన సంతోష్ శోభన్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అందరూ బాగుంటే ఆనందమే కదా. – నిర్మాత పి. రామ్మోహన్ అది నా పూర్వజన్మ సుకృతం ఎస్వీ రంగారావుగారి పురస్కారం రావడం ఫుల్ హ్యాపీ. సమాజంలో ఓ మార్పు తెచ్చే కథాంశంతో తెరకెక్కిన ‘పరంపర’ చిత్రానికి ‘జకర్తా ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్లాటినమ్ డిస్క్ వచ్చింది. ఇప్పుడు నంది అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. నా సినిమా జీవితం ‘పండంటి కాపురం’ చిత్రంలో మహానటుడు ఎస్వీ రంగారావుతో ప్రారంభమైంది. ఎటువంటి పాత్ర అయినా అవలీలగా పోషించే ఎస్వీఆర్ వంటి నటులు భారతదేశంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన్ను నటనలో నేను ఆదర్శంగా తీసుకున్నా. ఇప్పుడు ‘ఎస్వీ రంగారావు’ పురస్కారం అందుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ‘చిత్రం ¿¶ ళారే విచిత్రం’, ‘సొగసు చూడ తరమా’, ముణిమాణిక్యం నరసింహారావు ‘కాంతం కథలు’(టీవీ)... ఇప్పటికి మూడుసార్లు నంది అవార్డులు సొంతం చేసుకున్నా. ఇప్పుడిది నాలుగో నంది. ఈ నంది అవార్డును నా గురువులైన జంధ్యాల, అమ్మ (విజయ నిర్మల)కు అంకితం చేస్తున్నా. నా దర్శకులందరికీ కృతజ్ఞతలు. – నటుడు ‘సీనియర్’ నరేశ్ నన్ను ‘యాంగ్రీ మేన్’ అని పిలిచేవాళ్లు! ‘అత్తారింటికి దారేది’లో నేను చేసిన క్యారెక్టర్ని అన్ని ఏజ్ గ్రూప్లవాళ్లూ ఇష్టపడ్డారు. అది హ్యాపీ. ఆ పాత్రను త్రివిక్రమ్ అద్భుతంగా రాశారు. ఆర్టిస్టులకు స్వేచ్ఛ ఇచ్చే దర్శకుడు. అందుకే నేను బాగా చేయగలిగాను. పవన్ కల్యాణ్‌తో పెద్ద స్టార్ అయినప్పటికీ సింపుల్‌గా, ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆయన అలా ఉండటంవల్లే నేను బాగా చేయగలిగాను. క్లైమాక్స్ సీన్లో మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదరడానికి అదే రీజన్. ఈ సినిమా తాలూకు స్వీట్ మెమరీ ఏదైనా? యాక్చువల్‌గా ఇందులో నాది టఫ్ ఉమన్ రోల్. రియల్‌గా కూడా అలానే ఉంటాననుకునేవాళ్లు. కానీ, అంత టఫ్ కాదని తెలుసుకున్నారు. అయినప్పటికీ నేను లొకేషన్లోకి ఎంటర్వ్వగానే ‘రండి.. రండి.. యాంగ్రీ యంగ్ మేన్’ అని పిలిచేవాళ్లు. ఆ పిలుపుని ఎంజాయ్ చేసేదాన్ని. – నటి నదియా ఈ అవార్డు ప్రత్యేకం ఉత్తమ కథా రచయితగా నాకు మొదటిసారి అవార్డు వచ్చింది. ‘అంతకు ముందు ఆ తర్వాత’ రచన, స్క్రీన్‌ప్లే... పరిపూర్ణంగా నా సొంత కథ. నా జీవితానుభవాల్లో కొన్ని అందులో ఉన్నాయి. ఈ అవార్డు నాకు ప్రత్యేకం. ఈ సందర్భంగా నటీనటులతో పాటు మా నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్‌గారికి థ్యాంక్స్. – దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. గొప్ప అదృష్టం వెరీ హ్యాపీ. తొలి చిత్రానికి (‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’) ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా నంది అవార్డు రావడం అదృష్టంగా ఫీలవుతున్నా. త్రివిక్రమ్ శ్రీనివాస్‌గారు, కొరటాల శివగారు.. హేమాహేమీలతో వేదికను పంచుకునే అవకాశం దక్కడం గొప్ప అదృష్టం. ‘తాగుబోతు’ రమేశ్‌కి ఉత్తమ హాస్య నటుడిగా అవార్డు రావడం హ్యాపీ. మరిన్ని మంచి చిత్రాలు తీసి ప్రేక్షకులను నవ్వించాలని కోరుకుంటున్నా. – దర్శకుడు మేర్లపాక గాంధీ. -
బేబీ కార్న్ విత్ కోకోనట్
హెల్దీ కుకింగ్ కావలసినవి బేబీకార్న్ – 10 నూనె – 1 టీ స్పూన్ పచ్చికొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు ఆవాలు – పావు టీ స్పూన్ పచ్చి మిర్చి – 1 (సన్నగా తరగాలి) వెల్లుల్లి – 2 రెబ్బలు (సన్నగా తరగాలి) ఉప్పు – రుచికి తగినంత తయారి 1. ఒక్కొక్క బేబీకార్న్‌ను ముక్కలుగా కట్‌చేసి వెడల్పాటి పాత్రలో వేసుకోవాలి. 2. పైన కొద్దిగా వెల్లుల్లి, పచ్చి మిర్చి చల్లుకోవాలి. 3. కడాయిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, వెల్లుల్లి, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. 4. బేబీకార్న్‌ను ఈ పోపులో వేసి, ఉప్పు చల్లి కలిపి, నిమిషం సేపు ఉంచాలి. 5. తురిమిన కొబ్బరి చల్లి, కలిపి దించుకోవాలి. నోట్: అన్నంలోకి సైడ్ డిష్‌లా, ఈవెనింగ్ స్నాక్స్‌లా తీసుకుంటే బాగుంటుంది. -
నీ ప్రాణం కోసమే...నేను ప్రాణాలతో ఉన్నానురా!
అతనేమిటి అలా ఉన్నాడు? దేనికీ చలించకుండా? ఆ హృదయంలో జాలి, క్షమా...అనేవి పొరపాటున కూడా కనిపించవా? అందరూ తనకు దాసోహం కావాలనుకునే ఉమా... ఎవరినైనా ఎప్పుడైనా ‘నేను నీకు దాసోహం అవుతాను’ అని అడిగాడా? అవును అడిగాడు! అయితే... అది తనను తాను తగ్గించుకోవడానికి కాదు. అతని మంచితనం కూడా కాదు. కేవలం తన ‘పగ’ చల్లార్చుకోవడానికే! అందుకే హీరోతో ఈ విలన్ ఇలా అంటాడు... ‘ఆ ఊళ్లో అణువణువూ పౌరుషంతో రక్తం మరిగే ఒక మగాడున్నాడు. వాడిని ఒక్కడిని చంపి నా పగను పంచుకోరా... జీవితాంతం నీకు దాసోహం అంటాను’ ‘మిర్చీ’ సినిమాలో ఘాటైన విలన్‌గా కనిపించాడు సంపత్‌రాజ్. మంచి ఒడ్డూ పొడుగు, నల్లటి మీసాలు, నలుపు తెలుపు రంగు జుట్టు... చూడగానే ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపించాడు సంపత్‌రాజ్. ఎప్పుడు గొడవ జరుగుతుందా? ఎప్పుడు శత్రువు చేతికి చిక్కుతాడా? ఎప్పుడు వాడి రక్తం కళ్ల చూద్దామా... అన్నట్లుగా కనిపిస్తూ... ‘కనురెప్పలు వాల్చకుండా చూడన్నా కొడుకులు... దేవాగాడి మనుషుల పీకలు తెంపుతున్నాను’ అని రక్తం కళ్లజూస్తూ... ‘మిర్చీ’లో ‘ఉమా’గా విలనిజాన్ని వీర లెవెల్లో ప్రదర్శించాడు సంపత్‌రాజ్. సినిమాల్లోకి రావాలనుకునేవారు ‘హీరో సింహాసం’ మీదే మొదట కన్నేస్తారు. సంపత్‌రాజ్ మాత్రం చిన్నప్పటి నుంచి విలన్నే ఇష్టపడేవాడు. అద్దం ముందు విలన్‌గా రకరకాల హావభావాలతో నటిస్తుండేవాడు. ఈ హోంవర్క్ వృథా పోలేదు. అతని నటనకు ఆ కృషి పునాదిగా నిలిచింది. సంపత్‌రాజ్ మాతృభాష తమిళం. పద్నాలుగు సంవత్సరాలు ఎడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీలో పనిచేసిన సంపత్ ఎన్నో యాడ్ ఫిల్మ్స్, జింగిల్స్ చేశాడు. ఆ సమయంలోనే సినిమాల మీద ప్రేమ చెన్నైకి తీసుకొచ్చింది. కెప్టెన్ విజయకాంత్ హీరోగా నటించిన ‘నెరంజ మనసు’తో తమిళచిత్రసీమలో తన కెరీర్ ప్రారంభించాడు సంపత్‌రాజ్. ఈ బిగ్ బడ్జెట్ సినిమాకు సముద్రఖని దర్శకుడు. ఈ సినిమా మీద సంపత్‌కు చాలా అంచనాలు ఉన్నాయి. తండ్రి, కొడుకులుగా డ్యూయెల్ రోల్ చేశాడు. అయితే... మొదటి రోజే సినిమా ఫ్లాప్ అంటూ ఫలితం తెలిసిపోయింది. భారీ నిరాశ! ఒక సినిమా ఫ్లాప్ అయితే...ఆ సినిమా గురించిగానీ, అందులో నటించిన నటులు, సాంకేతిక నిపుణుల గురించిగానీ ఇండస్ట్రీలో దాదాపుగా పట్టించుకోరు. అయితే ఇక్కడ జరిగిందేమిటంటే..‘నెరంజ మనసు’ సినిమా ఫ్లాప్ అయినా... సుమారు ఆరు ఏడు మంది దర్శకుల నుంచి సంపత్‌కు ఆఫర్లు వచ్చాయి! ఇది తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దీని తరువాత మరోసారి విజయ్‌కాంత్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అలా తమిళ సినిమాల జర్నీ మొదలైంది. తమిళ సినిమాకు ముందు రెండు కన్నడ చిత్రాల్లో నటించాడు. అందులో ఒకటి జాతీయ అవార్డ్ కూడా గెలుచుకుంది. ఆ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించాడు సంపత్. ‘దమ్ము’ ‘మిర్చీ’ ‘ఓమ్’ ‘రన్ రాజా రన్’ ‘పవర్’ ‘లౌక్యం’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘శ్రీమంతుడు’ ‘సోగ్గాడే చిన్నినాయనా’... మొదలైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు సంపత్‌రాజ్. ఒక పాత్ర చేయాలని నిర్ణయించుకున్నాక... చేశాను అంటే చేశాను అన్నట్లు కాకుండా మానసికంగా ఆ పాత్రను విజువలైజ్ చేసుకుంటూ ‘ఇలా చేస్తే ఎలా ఉంటుంది?’ ‘అలా చేస్తే ఎలా ఉంటుంది?’ అని ఆలోచించుకొనిగానీ రంగంలోకి దిగడు. గుడ్డిగా నటించడం కాకుండా పాత్ర గురించి తనకు ఏవైనా సందేహాలు ఉంటే డెరైక్టర్ని అడిగి తీర్చుకుంటాడు. ‘చిన్న పిల్లలు, గర్భిణి స్త్రీల మీద అఘాయిత్యానికి ఒడిగట్టే పాత్రల్లో నటించను’ అని చెబుతున్నాడు ఈ మోస్ట్ వాంటెడ్ విలన్. హీరోగా నటించమని ఇప్పటి వరకు పద్నాలుగు ఆఫర్లు వచ్చాయట. అయినా సరే... ‘నో’ అంటున్నాడు. ‘ఉత్తమ విలన్’ అనిపించుకోవడమే తన తొలి ప్రాధాన్యం అంటున్న సంపత్‌రాజ్... మరిన్ని ‘చెడ్డ’ విలన్ పాత్రలతో ‘మంచి’ పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. -
‘మిర్చి’ రైతు భగీరథయత్నం
-
మిర్చికి నకిలీ పురుగు
మిర్చి రైతులను నిండా ముంచిన విత్తనాలు మొక్కలకు కానరాని పూత, కాత ఎకరానికి రూ.25 వేల నుంచి 35 వేల పెట్టుబడి రెక్కల కష్టం, పెట్టిన పెట్టుబడి రెండూ నేలపాలు చేనును చెడగొడుతున్న రైతులు ప్రత్యామ్నాయంగా అపరాల సాగు బయ్యారం : నకిలీ విత్తనాలు మండలంలోని మిర్చి రైతులను నట్టేట ముంచాయి. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన మిర్చి పంటలను నకిలీ చీడ పట్టి పీడిస్తోంది. మిర్చి మొక్కలకు కాత, పూత లేకపోవటంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. పంటల సాగుకు మూలమైన విత్తనాల నాణ్యతపై పాలకులు దృష్టి సారించకపోవటంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో మార్కెట్లోకి వచ్చిన నకిలీ విత్తనాలు రైతులను నిండా ముంచాయి. దీంతో తాము ఎంతో ఆశతో నాటిన మొక్కలను రైతులు పుట్టెడు దుఃఖంతో పీకేస్తున్నారు. మండలంలోని బయ్యారం, కొత్తపేట గ్రామాలకు చెందిన రైతులు జీవ–801 రకం మిర్చి విత్తనాలను గంధంపల్లి, మహబూబాబాద్లలోని డీలర్ల వద్ద కొనుగోలు చేసి 50 ఎకరాల్లో సాగు చేశారు. పంట సాగు చేసిన నెల రోజులైనా ఏపుగా పెరిగిన మొక్కలకు పూత, కాత లేదు. తీరా ఆ సమయంలో జీవ–801 రకం విత్తనాలు నకిలీవని వ్యవసాయశాఖ ప్రకటించడంతో జీవ విత్తనాలు సాగు చేసిన రైతుల్లో ఆందోళన మొదలైంది. అప్పటికే విత్తనం తీసుకొచ్చి నారు పోయడం నుంచి పంట సాగుతోపాటు ఎరువులు, పురుగుల మందులు, పాట్లకు ఒక్కో ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. పెట్టిన పెట్టుబడులు నష్టపోవడంతోపాటు పంటపై ఆశలు లేకపోవడంతో రైతులు నకిలీ విత్తనాలతో సాగు చేసిన మిరప పంటను కొన్ని చోట్ల పీకివేయగా మరికొన్ని చోట్ల మినుము పంట సాగు చేశారు. నకిలీ విత్తనాల మూలంగా ఒక్కో ఎకరానికి వేలాది రూపాయలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించి మరోసారి ఇలాంటి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, రైతుసంఘాల నాయకులు కోరుతున్నారు. పెట్టుబడులు ఇప్పించాలి మిర్చి పంటలో మంచి విత్తనం కావాలని మా ఊరిలో ఉన్న విత్తనాల దుకాణానికి వెళితే అక్కడి వ్యాపారి జీవ రకం విత్తనం బాగా దిగుబడి వస్తుందని చెప్పాడు. అతడిపై నమ్మకంతో ఒక్కో ప్యాకెట్‌కు రూ.350 చొప్పున చెల్లించి 10 ప్యాకెట్లు కొనుగోలు చేశాను. ఆ విత్తనాలను నారు పోయగా బాగానే మొలక వచ్చింది. మొక్కలు నాటిన తర్వాత పూత, కాత లేదు. నకిలీ విత్తనాల మూలంగా ఎకరం మిర్చి పంటను నష్టపోయా. ఈ పంటకు ఎకరంకు 35 వేలు పెట్టుబడులు పెట్టా. నకిలీ విత్తనం వలన నష్టపోయిన నా లాంటి రైతులకు పెట్టిన పెట్టుబడులనైనా ఇప్పించాలి. మల్సూర్, కొత్తపేట మిర్చి పంటను దున్నించి మినుములు వేశా ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు సరిగా పడకపోవటంతో బావి నీళ్లతోనైనా మిర్చి పంటను సాగు చేద్దామని రెండు ఎకరాల్లో సాగు చేశా. అయితే పంట సాగు చేసిన నెల తర్వాత నాటిన మొక్కలు నకిలీ విత్తనాలని తేలటంతో చేసేది లేక సాగు చేసిన పంట మొత్తాన్ని ట్రాక్టర్‌తో దున్నించా. ప్రస్తుతం ఆ భూమిలో మినుము విత్తనాలు చల్లగా మొలిచాయి. పెట్టిన పెట్టుబడులు, చేసిన కష్టం నష్టపోవాల్సి వచ్చింది. పోలవరపు శ్రీనివాసరావు(రైతు, బయ్యారం) -
డై..లాగి కొడితే....
సినిమా : మిర్చి దర్శక-రచయిత: కొరటాల శివ హీరో ఇంట్రడక్షన్ సీన్ అది. అర్ధరాత్రి ఓ అమ్మాయి కాపాడమన్నట్లు హీరో దగ్గరకొచ్చింది. హీరోయిజమ్ చూపించాలంటే విలన్లను చితక్కొట్టాలి. ప్రభాస్ ‘మిర్చి’లో అటువంటి ఫార్ములా సీన్స్, ఫైట్స్ లేవు. దర్శక-రచయిత కొరటాల శివ కొత్తగా ఆలోచించారు. హీరో డైలాగ్ కొడుతుంటే.. విలన్స్ ఫైట్‌ను విజువలైజ్ చేసుకున్నట్టు చూపించారు. సీన్ ఎండింగ్లో ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అని పంచ్ డైలాగ్ చెబుతూ గాల్లో ఎగిరి కాలితో గట్టిగా కార్ బ్యానెట్ మీద ప్రభాస్ ఒక్క కిక్ ఇస్తాడు. స్మాష్.. కటౌట్ దెబ్బకు కారు టైర్ ఊడింది. విలన్స్‌లో మార్పు వచ్చింది. అప్పుడు హీరోగారు ‘వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు’ అనే మరో డైలాగ్ చెబుతాడు. ఈసారి అమ్మాయి కూడా ఫ్లాట్.. ‘ఐ లవ్ యూ’ చెప్పకుండానే ప్రేమలో పడింది. -
ఘాటు తగ్గిన మిర్చి
– ధర పతనంతో రైతుల కుదేలు – గత సీజన్లో పది కిలోలు రూ. 500 – ప్రస్తుతం రూ.80 – కూలి ఖర్చులు కూడా రాక వదిలేస్తున్న రైతులు ఆచంట : అన్నదాతను కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. అయితే అతివష్టి లేకపోతే అనావష్టి. రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పడిస్తున్నా ఫలితం మాత్రం పూర్తిస్థాయిలో దక్కడం లేదు. దిగుబడులు బాగుంటే ధరలు ఉండటం లేదు. ధర ఉంటే ప్రకతి వైపరీత్యాలు తెగుళ్లు. ప్రతి సీజన్లోనూ రైతుకు ఏదో ఒక విధంగా ఆపద వచ్చి పడుతూనే ఉంది. ఈసారి పచ్చిమిర్చి పండించిన రైతులదీ ఇదే దుస్థితి. జిల్లాలో 3,500 వేల ఎకరాల్లో సాగు ఈ వేసవిలో పచ్చిమిర్చి ధర హోల్‌సేల్ మార్కెట్లో పది కేజీలు రూ. 400 నుంచి రూ.500 పలికింది. ధర బాగుండడంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో రైతులు మిర్చి సాగుపై ఎక్కువ ఆసక్తి చూపారు. ప్రస్తుతం జిల్లాలో 3,500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గోదావరి తీరప్రాంతంలోని మండలాలు, లంక భూములతో పాటు పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులో ఎక్కువగా మిర్చిని సాగు చేస్తున్నారు. ధర పతనం.. రైతుల దైన్యం మిర్చి ధర గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి పతనమైంది. వేసవి సీజన్లో పది కేజీలు రూ.400 పైగా పలకగా ప్రస్తుతం రూ.70 నుంచి రూ.80 పలుకుతోంది. ధర ఒక్కసారిగా పతనం కావడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వరితో పోలిస్తే పచ్చిమిర్చి ఖర్చుతో కూడిన సాగు. ఎకరాకు సుమారు రూ.40 వేలుపైనే ఖర్చవుతుంది. నెలా 15 రోజుల వరకూ పంట కాపుకు రాదు. దాదాపు నాలుగు నెలల వరకూ కోతలు కోయవచ్చు. రైతులు ఆశించినట్టుగానే ఈసారి మిర్చిసాగు ఆశాజనకంగానే ఉంది. చీడ పీడల ప్రభావం ఉన్నా అది దిగుబడిపై పెద్దగా ప్రభావం చూపలేదు. గుత్తులు గుత్తులుగా కాయలు కాశాయి. ఎకరాకు మూడు క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వస్తోంది. దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో మార్కెట్లను ముంచెత్తింది. దీంతో ధరలు నేలచూపులు చూశాయి. మొక్కలనే కాయలు వదిలేస్తున్న రైతులు ప్రస్తుతం మార్కెట్లో పలుకుకుతున్న ధరలు చూస్తుంటే మిుర్చి కోయకుండా వదిలివేయడమే ఉత్తమమని రైతులు భావిస్తున్నారు. పంటను నెలకు మూడుసార్లు వరకూ కోత కోస్తారు. ఎకరాకు కనీసం ఆరుగురు కూలీలను వినియోగిస్తే రెండు రోజులపాటు కోత సాగుతుంది. ఒక్కో కూలీకి రోజుకు రూ.200 చెల్లించాలి. రెండు రోజుల పాటు కోత సాగితే రూ.2,400 కోత కూలి ఖర్చు అవుతుంది. దిగుబడి మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకూ వస్తోంది. మార్కెట్లో క్వింటాల్ రూ.700– రూ.800 మధ్య పలుకుతోంది. మూడు క్వింటాళ్లకు రూ.2,100 నుంచి రూ.2,400లోపు ఆదాయం వస్తోంది. లాభం సంగతి అలా ఉంచితే రవాణా ఖర్చులకు చేతి సొమ్ము వదులుతోంది. రెండు రోజుల శ్రమా వథాగా మారుతోంది. దీంతో రైతులు ఎందుకొచ్చిందిలే అని తయారైన కాయలను మొక్కలనే వదిలేస్తున్నారు. కొంతమంది రైతులు మాత్రం పరువుకోసం పంటను కోస్తున్నారు. దళారుల దందా ఆరుగాలం శ్రమించిన రైతులకు ఏమీ మిగలకపోయినా దళారులు మాత్రం దండుకుంటున్నారు. రైతుల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్న కమీషన్‌దారులు చిరు వ్యాపారులకు పది కేజీలు రూ.120 వరకూ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాపారులు చిల్లరగా కేజీ రూ.20 చేసి విక్రయాలు సాగిస్తున్నారు. 30 ఏళ్లుగా సాగు చేస్తున్నా ఇతడు పెనుగొడం మండలం మదనగూడెంకు చెందిన కౌలు రైతు కుడిపూడి వెంకటేశ్వరరావు. 30 ఏళ్లుగా పచ్చిమిర్చి సాగుచేస్తున్నాడు. ఈ ఏడాది 8 కుంచాల్లో సాగు చేశాడు. ఎకరాకు 35 బస్తాలు మక్తా చెల్లించేలా రైతుతో ఒప్పందం చేసుకున్నాడు. అప్పులు చేసి 30 వేలకుపైనే పెట్టుబడులు పెట్టాడు. పంట బాగా పండింది. దిగుబడులు బాగున్నాయి. కోసిన కాయలు సిద్ధాంతం మార్కెట్‌కు తీసుకెళితే పది కేజీలు రూ.70 చేసి కొనుగోలు చేశారు. దిగుబడి ఎక్కువగా ఉండడంతో ధర లేదని కమీషన్ వ్యాపారులు చెప్పుకొచ్చారు. కనీసం కూలీలకు కూడా సొమ్ములు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో లాభం రాకున్నా పరువు పోకూడదని సాగు చేస్తున్నానని ఆవేదనతో చెప్పారు. ‘ కుడిపూడి వెంకటేశ్వరరావు, మదనగూడెం, పెనుగొండ మండలం -
కాపు రాని మిర్చి విత్తనం
అమరావతి: మండల పరిధిలోని గ్రామాల్లో విత్తిన జీవా కంపెనీకి చెందిన మిర్చి రకం విత్తనం ఎదుగుదలలో తేడా గమనించి నకిలీ విత్తనాలుగా గుర్తించి సోమవారం ఉదయం రైతులు విత్తన దుకాణం వద్ద ఆందోళన చేపట్టారు. వివరాలలో కెళితే మండలంలోని అత్తలూరు, నూతలపాటివారిపాలెం, తురగా వారిపాలెం, బయ్యవరం, పెదకూరపాడు మండలంలోని పలుగ్రామాల రైతులు రెండు నెలలక్రితం జీవా కంపెనీకి చెందిన (జేసీహెచ్ 802) మిరప విత్తనాలను పెదకూరపాడు మండలంలో 75 త్యాళ్ళూరులో ఉన్న త్రివేణి పెస్టిసైడ్స్ దుకాణంలో కొనుగోలు చేశారు. అత్తలూరుకు చెందిన మదమంచి ఆదిశేషగిరిరావు మిరపతోటలో పెరుగుదల, కాపు విషయంలో తేడా ఉండడం గుర్తించి అదే విత్తనం వేసిన మిగిలిన పొలాలు కూడా పరిశీలించారు. మిగతా రైతులతో కలిసి సోమవారం దుకాణదారుడి వద్దకు వచ్చి ప్రశ్నించారు. తమకు ఎకరానికి సుమారు రూ.30 నుంచి రూ.40 వేల వరకు ఖర్చయిందని రైతులు వాపోతున్నారు. దీనిపై దుకాణదారుడు సరైన రీతిలో స్పందించకపోవడంతో రైతులు వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. -
నీరు కరువాయె.. సాగు బరువాయె..
వాడి.. మాడి మురిపించి ముఖం చాటేసిన వరుణుడు ∙జిల్లాలో అధ్వానంగా ఖరీఫ్ సాగు ∙25 రోజుల నుంచి కురవని వర్షాలు ∙నీటి కోసం ఇబ్బందులు పడుతున్న రైతులు ∙పలు చోట్ల పశువులకు మేతగా పంటలు మహబూబాబాద్ : మండలంలో ఈ ఏడాది 1850 హెక్టార్లలో వరి, 352 హెక్టార్లలో మిర్చి, 1075 హెక్టార్లలో మెుక్కజొన్న, 2250 హెక్టార్లలో పెసర, 3050 హెక్టార్లలో పత్తిని సాగు చేశారు. అయితే ప్రారంభంలో కురిసిన వర్షాలు తప్ప.. ఇప్పటివరకు ఆశించిన మేరకు కురవకపోవడం తో పంటలు ఎండిపోతున్నాయి. నీరులేక మాడిపోతున్నాయి. మరో వా రంలోగా వర్షాలు కురవకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వరి.. హరి జఫర్‌గఢ్ : వర్షాభావ పరిస్థితుల కారణంగా మండలంలోని వరిపొలాలు నెర్రెలు బారుతున్నాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనే ఆశతో మండలంలోని రైతులు బోరు బావుల కింద వరిని విస్తారంగా సాగు చేశారు. అలాగే పత్తి, కంది, మొక్కజొన్న, వేరుశనగ పంటలను కూడా వేశారు. మొదట్లో వర్షాలు మురిపించినప్పటికి క్రమంగా తగ్గిపోయాయి. 20 రోజుల నుంచి చినుకు కూడా లేకపోవడంతో పొలాలు నెర్రలు బారి దుర్భరంగా కనిపిస్తున్నాయి. ఆరుతడి పంటలకు నీరందక మొక్కలు వాడిపోతున్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో మండలంలో 5,800 ఎకరాల్లో వరి, 16,600 ఎకరాల్లో పత్తి, 1100 ఎకరాల్లో కంది, మొక్కజొన్న 1500 ఎకరాల్లో సాగుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెట్టుబడి వృథా రఘునాథపల్లి : నీరు లేక మండలంలో సాగుచేస్తున్న పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన దోరగొల్ల రాజు ప్రభుత్వ సూచన మేరకు ఈ ఏడాది ఒక ఎకరంలో పత్తి, మరో ఎకరంలో కందిని సాగుచేశారు. అలాగే కందిలో అంతరపంటగా పెసర వేశారు. మొదట వర్షాలు బాగా కురవడంతో పెసర పూత బాగా వచ్చిం దని.. కాత దశలోకి చేరుకున్న క్రమంలో వర్షాలు లేక ఎండుముఖం పట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెసర, పత్తి పంటలు నీరు లేక పూర్తిగా ఎండిపోయాయని తెలిపారు. పంటల వద్దకు వెళ్లాలంటేనే ఏడుపు వస్తుందని, పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయిందని ఆయన పేర్కొన్నారు. పంట మీద ఆశలు పోయినయ్.. పాలకుర్తి : మండలంలోని బమ్మెర గ్రామ శివారు దుబ్బతండాకు చెందిన మహిళా రైతు లకావత్ భద్రమ్మ పంటలకు సాగు నీరందించలేక ఆందోళనకు గురవుతోంది. ఈ ఏడాది ఆమె తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న పంట వేసింది. అయితే 20 రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో చేను ఎండిపోతుంది. కంకి తోలేటప్పుడు వానలు లేక పదునుపోతోందని, మొక్కజొన్న కర్రలు, ఆకులు వాడిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. వర్షాల జాడలేకపోవడంతో పంట మీద ఆశలు పోయాయని విలపిస్తోంది. రెండెకరాల పంటను సాగు చేసేందుకు రూ.15 వేల పెట్టుబడి అయిందని ఆమె తెలిపారు. బోరుమంటున్న బావులు కేసముద్రం : మండలంలోని కల్వలకు చెందిన తాడబోయిన శ్రీశైలం ఈ ఏడాది తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న, మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని కందిపంటను సాగుచేశారు. మొక్కజొన్నకు రూ.20 వేలు, కంది పంటకు రూ. 30 వేల పెట్టుబడి పెట్టారు. సీజన్ ప్రారంభంలో వర్షాలు సమృద్ధిగా కురవడం తో మొక్కజొన్న బాగా పెరిగి కంకులు వేసే వరకు వచ్చింది. కంది కూడా మంచి గానే పెరిగింది. ప్రస్తుత నెల నుంచి చినుకు కూడా పడకపోవడంతో రెండు పంటలు ఎండి పోతుం డడంతో ఆందోళనకు గురవుతున్నారు. బావిలో నీరు అడుగంటిపోవడంతో దిగాలు పడుతున్నారు. మరో పది రోజుల్లోగా వర్షాలు పడకుంటే పంటలు చేతికి రావని ఆయన పేర్కొన్నారు. పశువులకు ఆహారం కొత్తగూడ : వర్షాభావ పరిస్థితుల కారణంగా కొత్తగూడ ఏజెన్సీ బోరుమంటోంది. గత జూన్, జూలైలో మురి పించిన వర్షాలు ఒక్కసారిగా ముఖం చాటేయడంతో అన్నదాతలు ఆక్రందనలకు గురవుతున్నారు. మండలంలో ఈ ఏడాది 40 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 20 వేల ఎకరాల్లో వరి పంటను సాగుచేస్తున్నారు. అయితే 20 రోజుల నుంచి ఎండలు మండిపోతుండడంతో పంటలు మాడిపోతున్నాయి. బావులు, చెరువుల్లో నీరు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల సాగు నీరు లేక చేతికొచ్చిన పంటలను పశువులకు మేతగా అందిస్తున్నారు. అన్నదాతల ఆక్రందన నెల్లికుదురు : మండలంలో సాగు చేస్తున్న పంటలు నీరులేక ఎండిపోతున్నాయి. వర్షాలు కురవకపోవడంతో సాగుకోసం తీసుకొచ్చిన అప్పులు ఎ లా తీర్చాలో తెలియక రైతులు ఆక్రందనలకు గురవుతున్నారు. మండలం లో ఈ ఏడాది వరి 1560, పత్తి 3200, పసుపు 1500, కందులు 360, మెు క్కజొన్న 850 హెక్టార్లలో సాగు చేశారు. అయితే నీరు లేక ఇందులో సగం పంటలు ఇప్పటికే ఎండిపోవడంతో రైతులు విలపిస్తున్నారు. మేతగా మొక్కజొన్న దుగ్గొండి : వరుణు డు ముఖం చాటేయడంతో పంటలు పా డవుతున్నాయి. బా వుల్లో నీరు అడుగంటిపోవడంతో సాగు చేస్తున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. మం డలంలో ఈ ఏడాది 6 వేల ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. అయితే ఆశించిన వర్షాలు లేకపోవడంతోపాటు భూగర్భజలాలు అడుగంటిపోవడంతో 2 వేల ఎకరాల్లో పంట పాడైపోయింది. నీరు లేక కొంతమంది రైతులు తమ చేలల్లో పశువులు, గొర్రెలను మేపుతున్నారు. -
మెరిసిన ఎర్ర బంగారం
క్వింటాకు రూ.18వేల ధరతో రికార్డు మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర వరంగల్ సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చికి రికార్డు ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా దేశి(టమాటా, దొడ్డు) రకం మిర్చికి పలికిన ధరతో రైతుల్లో ఆనం దం వెల్లువెత్తుతోంది. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు గురువారం భూపాలపల్లి మండలం పుల్లూరు రామయ్యపల్లెకి చెందిన రైతు పి.సంపత్ మొదటిసారి చేతికొచ్చిన దేశీ రకం మిర్చిని 13బస్తాల్లో భగవాన్ అడ్తికి తీసుకువచ్చాడు. ఈ మిర్చిని ఖరీదు దారుడు రాంగణేష్ క్వింటాకు రూ.18వేలతో కొనుగోలు చేశాడు. గతంలో మార్కెట్ చరిత్రలోనే ఏ రకం మిర్చికి కూడా ఈ ధర పలికిన దాఖ లాలు లేవని మార్కెట్ వర్గాలు తెలిపాయి. 2013లోనే అత్యధికం దేశీ రకం మిర్చి క్వింటాకు వరంగల్ మార్కెట్లో 2013 సంవత్సరంలో రూ.15,100 ధర పలికింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు ధరగా చెబుతున్నా రు. ఇక గత సంవత్సరం దేశీ రకం మిర్చికి రూ.12వేల ధర పలకగా, అంతకుముందు ఏడాది రూ.13వేల ధర పలికింది. మామూలుగా ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి మొదటి వారంలో మాత్రమే అమ్మకానికి వచ్చే దేశి రకం మిర్చి ఈసారి 15రోజుల ముం దే రావడం.. అత్యధిక ధర పలక డం విశేషం. ఈ సంవత్సరం వర్షాభావంతో పాటు చీడపీడల కారణంగా మిర్చి దిగుబడి తగ్గుతుందని భావి స్తుం డగా.. ధర మాత్రం మెరుగుగా ఉండడంతో రైతు ల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నేను ఉహించలేదు... మా గ్రామంలో రైతులందరం దేశీ రకం మిర్చి పండిస్తాం. ముందుగా మార్కెట్‌కు వస్తే మంచి ధర పలుకుతుందని అందరికీ తెలుసు. కానీ క్వింటాల్‌కు రూ.18వేలు పలుకుతుందని మాత్రం నాతో పాటు ఎవరూ ఊహించలేదు. గతంలో మా ఊరి రైతు తెచ్చిన మిర్చి క్వింటాకు రూ.15,100 ధర పలికింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు ధరగా చెప్పుకుంటున్నారు. ఇక నుంచి నాకు లభించిన ధరే రికార్డుగా చెబుతారు. - పి.సంపత్, పుల్లూరు రంగయ్యపల్లె -
ప్రభాస్‌ని భయపెడుతున్న నిర్మాతలెవరు ?
-
నిండుగా.. దండిగా
మార్కెట్‌ను ముంచెత్తిన మిర్చి 25వేల పైచిలుకు బస్తాల రాకా వ్యాపారుల సిండికేటు, పడిపోయిన ధర శివరాత్రికి ముందు మూడు రోజులు బంద్.. శనివారం నుంచి మళ్లీ మూడు దినాలు వరంగల్ మార్కెట్‌కు సెలవు కావడంతో శుక్రవారం మిర్చి పోటెత్తింది. ఒక్క రోజే సుమారు 25 వేలకు పైగా బస్తాలను రైతులు తీసుకురావడంతో యార్డులన్నీ ఎర్రబంగారమయ్యూరుు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ ఎరుపెక్కింది. శుక్రవారం పెద్ద ఎత్తున మిర్చి ముంచెత్తింది. ఈ సీజన్లో తొలిసారిగా అన్ని రకాల మిర్చి కలిపి దాదాపుగా 25 వేల బస్తాలు వచ్చారుు. మార్కెట్‌కు సెలవుల తర్వాత మళ్లీ మూడు రోజులు వరుసగా సెలవులున్నాయనే సమాచారంతో రైతులు త్వరపడ్డారు. దీంతో వ్యాపారులు సిండికేటై ధరను ఒక్కసారిగా త గ్గించారు. నాలుగు రోజుల కిందట తేజ రకం మిర్చి క్వింటాల్ ధర రూ.8వేలు పై చిలుకు పలికింది. వండర్ హాట్, దీపిక, యూఎస్-341 రకాలకు రూ.10వేల ధర పలికింది. శుక్రవారం వీటిలో సగానికి ధర తగ్గించేశారు. అధికారులు, యూర్డు ఇన్చార్జి కల్పించుకోకపోవడంతో.. అడ్తిదారుల మాటలు న మ్మి ఎంతోకొంతకు అమ్ముకున్నారు కొందరు రైతులు. పూర్తిస్థాయి మిర్చి సీజన్ ప్రారంభం కాకముందే ఇలాంటి పరిస్థితి ఉండడం రైతులను కలవరపెడుతోంది. మార్కెట్ అధికారులు, యార్డు ఇన్చార్జిలు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తే తప్ప మిర్చి ధర పెరిగే అవకాశాల్లేవు. ఇదే జరిగితే రైతులు ఇతర రాష్ట్రాల మార్కెట్లకు మిర్చి తరలించే అవకాశం ఉంది. - వరంగల్‌సిటీ -
ట‘మోత’
సాక్షి, సిటీబ్యూరో: మార్కెట్లో టమాట ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఇటీవల ధర తగ్గినట్టేతగ్గి మళ్లీ పైపైకి ఎగబాకుతోంది. వారం కిందట కిలో రూ. 12-15 ఉన్న టమాట ధర ఒక్కసారిగా రూ. 30 లకు పెరిగింది. ఇళ్లవద్దకు వచ్చే తోపుడు బండ్ల వారైతే కేజీ రూ. 35కు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరుగుతుండడంతో ఆ ప్రభావం పంట దిగుబడిపై పడిందని, ఈ కారణంగానే ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. స్థానికంగా సాగవుతున్న టమాట పంట కూడా చివరి దశకు చేరడం నగరంలో కొరతకు ఓ కారణంగా నిలిచింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి దిగుమతి అయ్యే టమాటపైనే నగరం ఆధార పడాల్సి వస్తోంది. నగర డిమాండ్‌కు తగ్గట్టు సరుకు సరఫరా కాకపోవడంతో ఇదే అదనుగా భావించి వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. నిజానికి హోల్ సేల్ మార్కెట్లో ఆదివారం కిలో రూ. 20లు ధర పలికింది. దీనికి రూ. 3లు అదనంగా వేసి రైతుబజార్లలో ధర నిర్ణయించడంతో అక్కడ కిలో రూ.23లకు విక్రయించారు. ఇదే సరుకు బహిరంగ మార్కెట్లోకి వచ్చేసరికి కిలో రూ. 30-35 ప్రకారం వసూలు చేస్తున్నారు. ఘాటెక్కిన మిర్చి హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.26లున్న పచ్చిమిర్చి ధర రిటైల్ మార్కెట్లో కేజీ రూ.40లకు చేరింది. నగర అవసరాలకు నిత్యం 100-150 టన్నుల మిర్చి దిగుమతి అయ్యేది. ప్రస్తుతం 100 టన్నుల లోపే మిర్చి దిగుమతి అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం లోకల్‌గా మిర్చి సరఫరా తగ్గిపోవడంతో గుంటూరు, విజయవాడ, అనంతపురం, బెంగళూరుల నుంచి దిగుమతి చేసుకొంటున్నారు. బెండ, దొండ, బీర, కాకర, దోస తదితరాల ధరలు కేజీ రూ.40లకు చేరువయ్యాయి. ఇక క్యారెట్, చిక్కుడు, గోకర, ఫ్రెంచ్ బీన్స్ ధరలైతే సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. -
మిర్చిఘాటుతో ఎన్నికల సిబ్బంది పరుగులు!
వరంగల్: ఎన్నికల సిబ్బందికి ప్రభుత్వ అధికారులు మిర్చి ఘాటును గట్టిగానే చూపించారు. మిర్చి ఘాటుకు తట్టుకోలేక ఎన్నికల సిబ్బంది నానా కష్టాలు పడ్డారు. అంతేకాకుండా ఆ ప్రదేశం నుంచి ఈవీఎంలను వదిలేసి బయటకు పరుగుతీసినట్టు సమాచారం. ఏప్రిల్ 30న జరిగే ఎన్నికల కోసం సిబ్బందికి వరంగల్ లోని ఎనుమాముల మార్కెట్ ను ఈవీఎంల పంపిణీ కేంద్రంగా ఎంపిక చేశారు. అయితే మిర్చి సీజన్ కావడంతో పెద్ద ఎత్తున పంట మార్కెట్ వచ్చింది. వ్యాపారవేత్తలు, రైతులు భారీగా మిర్చిని ఎనుమాముల మార్కెట్ లో నిల్వ చేశారు. మార్కెట్ చుట్టూ ఉన్న సమీప ప్రాంతాలకు మిర్చి ఘాటు పెద్ద ఎత్తున వ్యాపించినట్టు స్థానికులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే అదే ప్రాంతాన్ని ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు పంపిణీ చేసే కేంద్రంగా ఎంచుకోవడంతో గందరగోళం నెలకొంది. మిర్చి ఘాటు తట్టుకునేందుకు చేతి రుమాల్లు, కండువాలను సిబ్బంది వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
వినియోగదారులకు ‘చింత’
పచ్చిచింత ధరాభారం ఈ యేడాది తగ్గుతున్న దిగుబడి ఇబ్బందుల్లో వ్యాపారులు కిలో రూ.35నుంచి రూ.40వరకు అమ్మకాలు భువనగిరి, న్యూస్‌లైన్ చింతకాయ పచ్చడి అంటే నోరూరని వారుం డరు. ఎండకాలం వచ్చిందంటే చాటు.. పచ్చి చింతకాయ, పండు మిరపకాయలతో పచ్చడి చేసుకునేందుకు ఇష్టపడతారు. దీంతో వీటి అమ్మకాలు జోరుగా సాగుతాయి. అయితే, ఈసారి చింతకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత సంవత్సరం కిలో చింతకాయలు రూ.30కు అమ్మారు. ఈ సంవత్సరం వాటిని రూ.35నుంచి రూ.40వరకు అమ్ముతున్నారు. దీంతో వినియోగదారులు తక్కువ కొంటున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే చింతకాయ కాపు తగ్గింది. గత ఏడాది మంచి చెట్టుకు సుమారుగా 10క్వింటాల కాయ కాసేది. ఈ యేడా ది 4క్వింటాళ్లకు తగ్గింది. చిగురు కోయడం, మంచు కురవడంతో దిగుబడిపై ప్రభావం చూపిం ది. దీనికితోడు కాయ తెంపడానికి కూలీలు దొరకడం లేదు. కూలిరేట్లు, రవాణా చార్జీలు కూడా భారీగా పెరి గాయి. చింతకాయకంటే పండుకు ఎక్కువ ధర వస్తుందని భావించిన కొందరు చెట్ల యజమానులు కాయ తెంపడం లేదు. దీంతో ధరలు పెరిగాయి. ధరలు గిట్టుబాటు కావడం లేదు : సుగుణమ్మ, చింతకాయ వ్యాపారి, భువనగిరి ధరలు గిట్టుబాటు కావడంలేదు. గత ఏడాదితో పోలిస్తే దిగుబడి బాగా తగ్గింది. చెట్లు లీజుకు తీసుకున్న వారికి లాభం రావడం లేదు. చెట్ల యజమానులు ఎక్కువ ధర చెబుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పట్టిన చింతచెట్ల నుంచి దిగుబడి రావడంలేదు. ఈసారి ఎంతో వ్యాపారం సాగుతుందని ఆశపడ్డాం, కానీ లాభం చేకూరడం లేదు. -
రైతులకు షాక్
సాక్షి, నరసరావుపేట: జిల్లాలోని అనేక మండలాల్లోని రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1.15 లక్షల విద్యుత్ మోటార్ల కింద సుమారు మూడున్నర లక్షల ఎకరాల్లో పంటలు సాగులో వున్నాయి. ముఖ్యంగా పత్తి, మిర్చి వంటి వాణిజ్యపంటలను లక్షల పెట్టుబడులతో సాగు చేస్తూ పంట చేతికొచ్చేవరకు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పత్తి , మిర్చికి సంబంధించి ఎకరాకు సుమారు 50 నుంచి 70 వేల రూపాయల పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే సమయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా లేక నీరు తగ్గి పొలాలు తడవక ఎండిపోతున్నాయి. వ్యవసాయ మోటార్లకు ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం, విద్యుత్‌శాఖ అధికారులు మాట నిలబెట్టుకోకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 2, 3 విడతలుగా కేవలం 4 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతుందని రైతులు వాపోతున్నారు. అది కూడా అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇస్తుండటంతో పొలాలకు నీటిని పెట్టుకోలేకపోతున్నామని చె బుతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు అర్ధరాత్రి, అపరాత్రని లేకుండా పొలాల్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యుత్ సరఫరా చేయలేకపోతున్నాం .. జిల్లాలో మొత్తం 11.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. ప్రస్తుతం 8.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతుంది. వ్యవసాయ విద్యుత్ విషయానికొస్తే జిల్లాలో మొత్తం 1.15 లక్షల విద్యుత్ మోటార్లు ఉన్నాయి.వీటికి 1.8 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో రెండు, మూడు విడతలుగా ఏడుగంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం. సరఫరా తక్కువగా ఉండటం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఏడుగంటలు విద్యుత్ సరఫరా చేయలేకపోతున్న మాట వాస్తవమే. -
రికార్డు స్థాయికి చేరిన మిర్చి ధర
-
కొత్త సంవత్సరంలో కొరటాల శివ సినిమా
ప్రతిభ అనే పదానికి పర్యాయపదం తారక్. నూనూగు మీసాల ప్రాయంలోనే చిరంజీవి, బాలకృష్ణ లాంటి గ్రేటెస్ట్ మాస్ హీరోలు చేయాల్సిన పాత్రలను చేసేసి శభాష్ అనిపించుకున్నారాయన. అయితే... తారక్ టాలెంట్‌ని సరిగ్గా ఉపయోగించుకునే దర్శకులే ప్రస్తుతం కరువయ్యారు. కథ, కథనం, పాత్ర, దర్శకుడు.. ఇలా అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయితే... తెరపై తారక్ నట విశ్వరూపాన్నే చూడచ్చు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. గత రెండేళ్ళ కాలంలో తారక్ నుంచి వచ్చిన సినిమాలు... గతంలో ఆయన చేసిన సినిమాల స్థాయిలో ఉండటంలేదన్నది పలువురి అభిప్రాయం. ఆ మాటకొస్తే ప్రేక్షకాభిప్రాయం కూడా అదే. అందుకే... మాస్లో తారక్‌కు ఉన్న అనూహ్యమైన ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన కథను తయారు చేశారు దర్శకుడు కొరటాల శివ. ‘మిర్చి’తో బాక్సాఫీస్‌కి ఘాటెక్కించిన శివ... తారక్‌ను ఆయుధంగా తీసుకొని ద్వితీయ విఘ్నాన్ని అధిగమించడానికి సమాయత్తమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు. డిసెంబర్లో ఈ చిత్రం ముహూర్తం జరుపుకోబోతోంది. కొత్త సంవత్సరంలో చిత్రీకరణ మొదలుకానుంది. ఎన్టీఆర్ గత విజయాలకు దీటుగా అత్యంత శక్తిమంతంగా ఈ చిత్ర కథా కథనాలు ఉంటాయని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలందించనున్నారు. ఇంకా ఈ సినిమాలో నటించే కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ఖమ్మంలో మిర్చి రైతుల ఆగ్రహం
-
ఖమ్మంలో మిర్చి రైతుల ఆగ్రహం
ఖమ్మం : ఖమ్మంలో మిర్చి రైతులు మరోసారి భగ్గుమన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర రాకపోవటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ రేటుకే మిర్చి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ధ గతరాత్రి ఏడు గంటల సమయంలో మార్కెటుకు వచ్చిన పచ్చిమిర్చిని క్వింటాకు రూ.1390 చొప్పున వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. అయితే ఆ తరువాత మిర్చి భారీగా రావటంతో వ్యాపారులు సిండికేట్ అయి క్వింటాకు రూ.800 నుంచి రూ.1000 మాత్రమే చెల్లిస్తామని చెప్పటంతో అన్యాయమని రైతులు నిలదీశారు. ధర విషయమై వారు వ్యాపారులతో వాగ్వివాదానికి దిగారు. దుకాణాల ముందున్న ట్రేలను ధ్వంసం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి చర్చలు జరిపినా వివాదం సమసిపోలేదు. దాంతో రైతులు రాత్రంతా బైపాస్ రోడ్డుపై ధర్నా చేపట్టారు. -
భద్రత లోపంతోనే అగ్నిప్రమాదాలు
గుంటూరు రూరల్, న్యూస్‌లైన్ : గుంటూరు నగర శివారుల్లోని కోల్డ్ స్టోరేజీల్లో చేటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు కేవలం భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే జరిగాయని అగ్నిమాపకశాఖ ప్రాంతీయ అధికారి(ఆర్.ఎఫ్.ఓ) వెంకటరమణ పేర్కొన్నారు. ఆయన సోమవారం అంకిరెడ్డిపాలెం జాతీయ రహదారి సమీపంలోని గుంటూరు కోల్డ్ స్టోరేజ్ వద్దకు వచ్చి అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతు కోల్డ్ స్టోరేజీల్లో భద్రతను రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖలు సమన్వయంతో పర్యవేక్షించాలని సూచించారు. ఇకపై ఈ మూడు శాఖలతో స్టోరేజీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 25 వేల మిర్చి బస్తాలు బుగ్గి.. మూడో రోజు సోమవారం కూడా కోల్డ్ స్టోరేజ్‌లో మంటలు ఎగసి పడటంతో అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖలు కలసి అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఎ-ఛాంబర్లో ఉన్న 25 వేల మిర్చి బస్తాలు అగ్నికి ఆహుతి కాగా బి- ఛాంబర్లో ఉన్న 25 వేల బస్తాలను జాగ్త్రత్త చేయగలిగారు. ఘటనపై జిల్లా అర్బన్ ఎస్పీ రమణకుమార్ ప్రత్యేక బృందంతో విచారణ చేయిస్తున్నాట్లు సమాచారం. స్టోరేజీ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ బి ఛాంబర్లోని మిర్చికి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందన్నారు. మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాత కాలిపోయిన ప్రదేశాల నుంచి నమూనాలను పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలుగ కుండా విచారణ జరిపి, నివేదికను అందించాల్సిందిగా సౌత్ జోన్ డీఎస్పీ జోసఫ్ రాజ్‌కుమార్, సీఐ మోజెస్పాల్లను ఆదేశించినట్లు తెలిసింది. అగ్నిమాపకశాఖ అధికారులు నాగేశ్వరరావు, వినయ్‌కుమార్‌లు పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో మంటలు అదుపు చేసేందుకు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రమాదంపై అనుమానాలు.. గుంటూరు కోల్డ్‌స్టోరేజీలో సంభవించిన అగ్ని ప్రమాదంపై రైతుల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పొక్లెయిన్‌తో గోడలు పగులకొట్టి బి-చాంబర్‌లోని మిర్చిని ప్రమాదం జరగకుండా కాపాడినట్టే ముందుగా ఎ-చాంబర్ గోడలను కూడా పగులకొట్టి ఉంటే అందులోని మిర్చిని కూడా కొంతమేర దక్కించుకునే అవకాశం ఉండేదని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీల్లో ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో అధికభాగం శనివారమే కావడం కూడా సందేహాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా గుంటూరు కోల్డ్ స్టోరేజీ నిర్వాహకులు ప్రమాదం జరిగిన మర్నాడు రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బి చాంబర్లో కూడా మూడే వేలకు పైగా బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయని చెప్పడం, ట్రాన్సఫార్మర్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందనడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
కోల్ట్‌స్టోరేజీలో ఎగసిపడుతున్న మంటలు
గుంటూరు రూరల్, న్యూస్‌లైన్ : గుంటూరు శివారు అంకిరెడ్డిపాలెం జాతీయరహదారి పక్కన శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకున్న గుంటూరు కోల్డ్‌స్టోరేజీలో ఆదివారం మంటలు చెలరేగాయి. కోల్ట్‌స్టోరేజీ ఏ చాంబర్లో ఉన్న మిర్చిబస్తాలు కొన్నిం టిని బయటకు వేయడంతో దట్టమైన పొగల నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. మంటలను చూసిన రైతులు కన్నీటి పర్యతమయ్యారు. ఈ ప్రమాదంపై బాధిత రైతులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పాతికేళ్ల కిందట కట్టిన ఈ కోల్డ్‌స్టోరేజీ ఏ, బీ చాంబర్లలో సుమారు 60 వేల మిర్చి బస్తాలు ఉన్నాయి. బీ చాంబర్‌లోని గదులను అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది చాకచక్యంగా పొక్లెయిన్‌తో పగులగొట్టించి సుమారు 25 వేల మిర్చి బస్తాలను బయటకు తెచ్చారు. ఆదివారం కూడా గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ బీవీ రమణకుమార్ ఘటనాస్థలానికి వచ్చి క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు, సౌత్ జోన్ డీఎస్పీ ఎన్జే రాజ్‌కుమార్, రూరల్ సీఐ మోజెస్పాల్లను ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఆందోళనలకు దిగకుం డా.. మిర్చి బస్తాలు చోరీకి పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ రమణకుమార్ విలేకరులతో మాట్లాడుతూ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల లేక ఇతర కారణాల వల్ల అనేది విచారణలో తేలాల్సివుందన్నారు. ప్రమాదం జరిగిన తక్షణమే తమ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఈ రెండు రోజుల్లో ఒక్క బస్తా కూడా బయటకు వెళ్లనివ్వకుండానిఘా ఏర్పాటు చేశామన్నారు. కోల్డ్ స్టోరేజీ పై భాగాన్ని పగులగొట్టించి అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అగ్నిమాపక, పోలీస్‌సిబ్బంది.. కోల్డ్‌స్టోరేజీ బీ చాంబర్‌లోని మిర్చి బస్తాలు కాలిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. వైఎస్సార్ సీపీ నేతలు సందర్శన.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ పెదకూరపాడు సమన్వయ కర్త రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), పలువురు నాయకులు స్టోరేజిని సంద ర్శించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ కోల్డ్‌స్టోరేజి ప్రమాదంపై విచారణ జరిపించాలని డిమాండ్‌చేశారు. రైతుల రెక్కల కష్టం మంటల్లో కాలిపోకుండా.. ప్రభుత్వం అత్యాధునిక సదుపాయాలు కల్పించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాతంశెట్టి మాట్లాడుతూ ప్రమాదం పై సమగ్ర విచారణ జరిపి బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి..టీడీపీ నేత ప్రత్తిపాటి డిమాండ్ కొరిటెపాడు: అగ్నికి ఆహుతైన మిర్చి రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. అగ్నిప్రమాదానికి గురైన గుంటూరు కోల్డ్‌స్టోరేజ్‌ను ఆదివారం టీడీపీ, సీపీఐ నాయకులు సందర్శించారు. బాధిత రైతులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ సుమారు 200మంది రైతులకు సంబంధించి 25వేల మిర్చి బస్తాలు అగ్నికి ఆహుతి అయ్యాయన్నారు. గుంటూరులోని కోల్డ్‌స్టోరేజ్‌ల్లో వరుస అగ్ని ప్రమాదాలు జరగడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతాంగానికి క్వింటాల్‌కు రూ. 10వేలు చెల్లించాలని డిమాండ్‌చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ వరుస అగ్నిప్రమాదాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు మన్నవ సుబ్బారావు, చంద్రగిరి ఏడుకొండలు, సుఖవాసి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఉల్లిపోటు.. మిర్చి ఘాటు
కామారెడ్డి/ నిజాంసాగర్, న్యూస్‌లైన్ : నిత్యావసరాలు, కూరగాయలు, ఉల్లి, పచ్చి మిర్చి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో కూరగాయల ధరలు అడ్డగోలుగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి మార్కెట్లో కిలో ఉల్లి రూ. 50 కి చేరింది. ఎర్రగడ్డ మాత్రం కిలోకు రూ. 40కి అమ్ముతున్నారు. పచ్చిమిర్చి కిలో ధర రూ. 80 నుంచి రూ. 100 వరకు అమ్ముతున్నారు. నిజాంసాగర్ ఎల్లారెడ్డి వారాంతపు సంతలలో ధరలు చూసి ప్రజలు బెంబేలెత్తారు.జిల్లావ్యాప్తంగా చికెన్ రూ. 150 నుంచి రూ.160 వరకు అమ్ముతున్నా రు. శ్రావణ మాసంలో మాంసాహార విని యోగం తక్కువగా ఉంటుంది. అయినా ధరలు భగ్గుమనడం విశేషం. -
ధరల ఘాటు
తణుకు టౌన్, న్యూస్‌లైన్ : ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ధరలు ఘాటెక్కారుు. ఉల్లి ధర కనీవినీ ఎరుగని రీతిలో కిలో రూ.50కి ఎగబాకింది. గత వారం కిలో రూ.20 పలికిన పచ్చిమిర్చి ఆదివారం ఏకంగా రూ.80కు చేరి వినియోగదారుల నషాళమెక్కించింది. నెల రోజులుగా తారాజువ్వల మాదిరిగా ఉల్లి ధరలు ఆకాశం వైపు దూసుకుపోతున్నారుు. అరుుతే, మిగిలిన కూరగాయల ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టడం వినియోగదారులకు ఊరటనిచ్చింది. తణుకు మార్కెట్లో టమాటాలు గత వారం కిలో రూ.40కి అమ్మగా, ఈ వారం రూ.20కి, బీరకాయలు రూ.30, వంకాయలు రూ.32, గోరుచిక్కుడు రూ.40, క్యాప్సికంరూ.50, బీన్స్ రూ.60, దొండకాయలు రూ.20, బంగాళా దుంపలు రూ.20, దోసకాయ కిలో రూ.20 చొప్పున పలికారుు. ములక్కాడలు జత రూ.10, పొట్లకాయ రూ.12, అరటి కాయలు జత రూ.10, ఆనపకాయ రూ.10కి విక్రరుుంచారు. -
‘మిర్చి’సినిమా రీమేక్‌లో చేస్తున్న సుదీప్
‘‘రవిచంద్రన్‌గారు ప్రధాన పాత్రలో నేనో సినిమాకి దర్శకత్వం వహించబోతున్న మాట నిజమే. ఈ సినిమా గురించి చెప్పగానే ఆయన ఓకే చెప్పడానికి ఒక్క నిమిషం కూడా తీసుకోలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ నెల 19న షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నాం’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు కన్నడ నటుడు, దర్శకుడు సుదీప్. వీర మడకరి, కెంపెగౌడ, జస్ట్ మాత్ మాతల్లి.. ఇలా సుదీప్ పలు సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిలో రీమేక్స్ శాతం ఎక్కువ. కాగా, రవిచంద్రన్ కీలక పాత్రలో తను నటించి, దర్శకత్వం వహించబోతున్న చిత్రం తెలుగు ‘మిర్చి’కి రీమేక్ అని సమాచారం. ఈ చిత్రాన్ని ఎన్. కుమార్ నిర్మించబోతున్నారట. తెలుగు ‘మిర్చి’ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఆల్రెడీ రీమేక్ రాజాగా కన్నడంలో గుర్తింపు ఉన్న సుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండటంతో అంచనాలు ప్రారంభమయ్యాయి. క్రేజీ స్టార్ రవించంద్రన్, సుదీప్ కాంబినేషన్ కూడా కావడంతో క్రేజ్ నెలకొంది.