తణుకు టౌన్, న్యూస్‌లైన్ : ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ధరలు ఘాటెక్కారుు. ఉల్లి ధర కనీవినీ ఎరుగని రీతిలో కిలో రూ.50కి ఎగబాకింది. గత వారం కిలో రూ.20 పలికిన పచ్చిమిర్చి ఆదివారం ఏకంగా రూ.80కు చేరి వినియోగదారుల నషాళమెక్కించింది. నెల రోజులుగా తారాజువ్వల మాదిరిగా ఉల్లి ధరలు ఆకాశం వైపు దూసుకుపోతున్నారుు. అరుుతే, మిగిలిన కూరగాయల ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టడం వినియోగదారులకు ఊరటనిచ్చింది.
తణుకు మార్కెట్‌లో టమాటాలు గత వారం కిలో రూ.40కి అమ్మగా, ఈ వారం రూ.20కి, బీరకాయలు రూ.30, వంకాయలు రూ.32, గోరుచిక్కుడు రూ.40, క్యాప్సికంరూ.50, బీన్స్ రూ.60, దొండకాయలు రూ.20, బంగాళా దుంపలు రూ.20, దోసకాయ కిలో రూ.20 చొప్పున పలికారుు. ములక్కాడలు జత రూ.10, పొట్లకాయ రూ.12, అరటి కాయలు జత రూ.10, ఆనపకాయ రూ.10కి విక్రరుుంచారు.
ధరల ఘాటు
Published Mon, Aug 12 2013 1:30 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement
Advertisement