Onions
-
‘టాప్’ మోతపై ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: ప్రతీ ఏడాది ఏదో ఒక సీజన్లో టమాటాలు, ఉల్లిగడ్డల ధరలు ఒకేసారి పెరిగి ‘సెంచరీ’కొట్టడం...మనందరి గుండెలు గుభిల్లుమనడం...మళ్లీ ఒక్కసారే వాటి ధరలు పడిపోవడం షరామామూలై పోతున్న విషయం మనకు తెలిసిందే. దక్షిణాదిలో ఈ సమస్య ఉండగా...టమాటా, ఉల్లిగడ్డల ధరల మోతతో పాటు దేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ తదితర ప్రాంతాల్లో ఆలుగడ్డల ధరలు బెంబేలెత్తిస్తున్న సంగతి కూడా విదితమే. ఏ యేడాదికి ఆ ఏడాది ఇలా ధరల పిడుగు మనపై పడుతూ, ఉత్పత్తి, సరఫరా సరిగా లేక ఈ సమస్య తీవ్రంగా ఉన్న రోజుల్లో ‘కిచెన్ బడ్జెట్’ను కిందా మీదా చేస్తున్నా దీనికి తగిన పరిష్కారమంటూ లభించకపోవడం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. భారత రిజర్వ్ బ్యాంక్ వర్కింగ్ పేపర్ సిరీస్‌లో భాగంగా... డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ పాలసీ రీసెర్చ్ అక్టోబర్–2024లో విడుదల చేసిన ‘వెజిటబుల్స్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా :ఏ స్టడీ ఆఫ్ టమాటో, ఆనియన్ అండ్ పొటాటో (టాప్)’నివేదికలో వివిధ అంశాలను పొందుపరిచారు. కన్జూమర్ ప్రైజ్ ఇండెక్స్ (సీపీఐ)లో పెద్దగా ప్రాధాన్యత లేని టమాట, ఉల్లిగడ్డ, ఆలుగడ్డలు «వివిధ సందర్భాల్లో అధిక ధరల పెరుగుదల కారణంగా ఆహారపదార్థాలపై ప్రభావం పడటంతో పాటు ద్రవ్యోల్బణం విషయంలో వార్తాపత్రికలు, దృశ్యమాధ్యమాల పతాక శీర్షికలకు కారణమవుతోంది. ఈ నివేదికలో భాగంగా...వివిధ అంశాలను పరిశీలించారు. వాల్యూచెయిన్తో ముడిపడిన అంశాలు తదితరాలపై అధ్యయనం చేశారు. వీటిధరల్లో రైతుల భాగస్వామ్యం అనే విషయానికొస్తే...టమాటాల్లో 33 శాతం, ఉల్లిపాయల్లో 36 శాతం, ఆలుగడ్డల్లో 37 శాతం రైతుల ‘షేర్’ఉన్నట్టుగా పేర్కొన్నారు. వీటి పెట్టుబడి ఖర్చులు, వర్షపాతం, కూలీల వేతనాలు ఇంకా... సీజనల్ ఆటోరిగ్రెసివ్ ఇంటిగ్రేటెడ్ మూవింగ్ యావరేజ్ విత్ ఎక్సోజీనోస్ వేరియబుల్ (సారిమాక్స్) ప్రభావితం చేస్తున్నట్టుగా అంచనావేస్తున్నారు. చాలా దేశాల్లో మాదిరిగానే భారత్‌లోనూ...కరోనా మహమ్మారి అనంతర పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తుతున్న పరిణామాల ప్రభావంతో సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఇందులో భాగంగా... భారత్‌లో ఆహార పదార్థాల ధరల ద్రవ్యోల్బణానికి కన్జూమర్ ప్రైస్ఇండెక్స్ (సీపీఐ)లో ఇవి మూడు అధిక ప్రాధాన్యతను పొందే పరిస్థితి ఏర్పడింది. మనదేశంలో అత్యధికంగా ఉత్పత్తి అయ్యి, అధికంగా వినియోగించే కూరగాయల్లో ఈ మూడు ఉండటంతో కొరత ఏర్పడినప్పుడు ధరల పెరుగుదలతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇవి మూడు కూడా ప్రధానంగా స్వల్పకాలిక పంటలు, (షార్ట్ సీజనల్ క్రాప్స్) త్వరగా కుళ్లిపోవడం, కొన్ని ప్రాంతాల్లోనే వీటి ఉత్పత్తి కేంద్రీకృతం కావడం, వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ప్రభావం వీటిపై తీవ్రంగా పడడం వంటి కారణాల వల్ల ధరల హెచ్చుతగ్గులకు అవకాశం ఏర్పడుతోందని ఈ నివేదికలో పేర్కొన్నారు. సూచించిన పరిష్కారాలు... » నెలవారీగా ఈ మూడింటి సప్లయ్, డిమాండ్‌ను రూపొందించి, దీనికి తగ్గట్టుగా మార్కెట్ స్పందనలు.. మరీముఖ్యంగా రైతులు, వ్యాపారులు, దిగుమతిదారులు, స్టాకిస్ట్‌లు, వినియోగదారుల కొనుగోలుతీరును పరిశీలించాలి.» వీటి ధరలు అకస్మాత్తుగా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి స్టాక్‌లు అందుబాటులో ఉండేలా చూసుకుంటూ ధరల పెరుగుదలలు స్వల్పంగా ఉండేలా చూసుకోవాలి.» వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుచేర్పులను ఎప్పటికప్పుడు అంచనావేస్తూ...వచ్చే 12 నెలలకుగాను ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూసుకోవడంతో పాటు ఇతర ఆహార పదార్థాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి వాటిని ముందుగానే ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ూ ఈ మూడింటి ధరలు పెరగకుండా జాగరూకతతో వ్యవహరించడంలో భాగంగా వీటికి సంబంధించి వాల్యూ చెయిన్‌ను అర్థం చేసుకుని, వినియోగదారులు చెల్లించే మొత్తంలో వీటిని పండించే రైతుల వాటాను పెంచేలా చర్యలు చేపట్టాలి. -
కిలో ఉల్లి రూ. 35.. ఎక్కడంటే?
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పండుగల సీజన్లో ఉల్లికి మరింత డిమాండ్ ఉంటుంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.ఢిల్లీలో ఉల్లి ధరలు మండుతున్న నేపధ్యంలో ప్రభుత్వం మహారాష్ట్ర నుంచి ఉల్లిని భారీగా దిగుమతి చేసుకుంది. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయల లోడుతో బయలు దేరిన కందా ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీకి చేరుకుంది. ఈ ఉల్లిని ఢిల్లీలోని ఎన్సీసీఎఫ్, ఎన్‌ఏఎఫ్‌ఈడీలతో పాటు వ్యాన్ల ద్వారా ప్రభుత్వం కేజీ రూ. 35కు విక్రయిస్తోంది. ఢిల్లీ రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర కిలో 75 రూపాయలకు చేరుకుంది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీపావళికి ముందుగానే ఉల్లి ధరలను నియంత్రించేందుకు భారతీయ రైల్వే సహాయంతో ఢిల్లీలోని హోల్‌సేల్ మార్కెట్లకు 1,600 టన్నుల ఉల్లిపాయలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబరు నెల నుండి ఉల్లిపాయలు, టమోటాలు, కూరగాయల ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.ఇది కూడా చదవండి: భారతీయులకు ఏ సీజన్ అంటే ఇష్టం? -
కొంచెం స్మార్ట్‌గా..అదిరిపోయే వంటింటి చిట్కాలు
వంట చేయం అనుకున్నంత ఈజీకాదు. భయపడినంత కష్టమూ కాదు. కాస్త స్మార్ట్‌గా ముందస్తు ప్రిపరేషన్ చేసుకుంటే చాలు. అన్నం వండాలా,చపాతీ చేయాలి అనేక ముందు నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి ఎలాంటి కూరలు చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. చపాతీ అయితే, పప్పు, లేదా మసాలా కూర చేసుకుంటే సరిపోతుంది. అదే అన్నం అయితే, పప్పు, కూర, పచ్చడి, సాంబారు లేదా చారు, ఇంకా వడియాలు అప్పడాలు ఇలా బోలెడంత తతంగం ఉంటుంది. అంతేకాదు వీటికి సరిపడా కూరగాయలు, ఉల్లిపాయలు కట్ చేయడం ఒక పెద్ద పని. అయితే ఎలాంటి పని అయినా, ఇబ్బంది లేకుండా కొన్ని చిట్కాలతో సులువుగా చేసుకోవచ్చు. అలాంటివి మచ్చుకు కొన్ని చూద్దాం.చిట్కాలుపచ్చిమిర్చి కట్ చేసినపుడు చేతులు మండకుండా ఉండాలంటే కత్తెరతో కట్ చేసు కోవాలి. చాకుతో కోసినపుడు చేతుల మండుతోంటే పంచదారతో చేతులను రుద్దుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయలను కట్ చేయాలంటే, వాటిని ముందు కొంచెం సేపు చల్లని నీటిలో ఉంచాలి.ఉల్లిపాయలు కట్ చేసిన అనంతరం చేతులు ఉల్లి వాసన రాకుండా ఉండాలంటే, నిమ్మరసం చేతులకు పట్టిస్తే ఉల్లి వాసన పోతుంది.చపాతీగాని, పరోటాగాని, మెత్తగా ఉండాలంటే 1 స్పూన్ మైదా, ఒక స్పూన్ పెరుగుని గోధుమ పిండిలో వేసి తడిపితే మెత్తగా వస్తాయి.చిటికెడు సోడా వేసి గోధుమ పిండిని తడపితే పూరి మెత్తగా, రుచిగా ఉంటుంది. పచ్చకూరలు వండేటప్పుడు చిటికెడు సోడా వేసి వండితే చూడ్డానికి కంటికి మంచి ఇంపుగా కనబడ్డమే కాకుండా రుచిగా ఉంటాయి.పంచదార జార్లో రెండు లవంగాలు వేస్తే చీమల దరి చేరవు.కోడిగుడ్లను ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా, ఉడికించిన వెంటనే వాటిని చన్నీళ్ళలో వేసినా పెంకు సులభంగా వస్తుంది టమోటా ఫ్రెష్‌గా ఉండాలంటే ఉప్పునీటిలో ఒక రాత్రంతా ఉంచితేచాలు.ఒక్కోసారి గ్లాస్లు, స్టీల్ గిన్నెలు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయి భలే ఇబ్బంది పెడతాయి. ఆ సమయంలో కంగారుపడి, కిందికి మీదికి కొట్టకుండా, పై గ్లాసును చల్లటి నీటితో నింప్పి వేడి నీటిలో కాసేపు ఉంచితే ఇరుక్కున్న గ్లాసు ఈజీగా వచ్చేస్తుంది. శుభ్రమైన వాతావరణంలో శుభ్రం చేసుకున్న చేతులతో వంటను పూర్తి చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఇదీ చదవండి : విడాకుల తరువాత పిల్లలకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా? -
ఉల్లిపాయలు తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా..!
ఉల్లి లేనిదే ఏ కూరకు రుచి రాదు. అలాంటి ఉల్లిపాయను సామాన్యుడు కొనుగోలు చేసేలా లేదు. ఏందిరా ఈ ధర అన్నట్లుగా ఉంది. ఇలాంటి టైంలో అసలు ఉల్లిపాయ లేకుండా కూరలు వండుకోవడం బెటర్ అనుకుంటుంటారు చాలామంది. కొందరూ ఉల్లికి దూరంగా ఉండటం లేదా వాడకం తగ్గించేస్తారు. నిజానికి ఇలా ఉల్లిపాయలు తీసుకోకుంటే ఏం జరుగుతుంది..?. మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి. తదితరాలు గురించి తెలుసుకుందాం..!.ఉల్లిపాయలకు పూర్తిగా దూరంగా ఉండటం వల్ల మలబద్ధకం నుంచి కంటి చూపు వరకు చాలా రకాల సమస్యలు వస్తాయంటున్ననారు నిపుణులు. సీనియర్ డైటీషియన్లు, నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం ఉల్లిపాయల్లో విటమిన్లు, మినరల్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. ఇందులో ఎక్కువ మొత్తంలో లభించే విటమిన్-సీ, విటమిన్-బీ6, ఫోలేట్లు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు, కణాల ఎదుగులకు, ఆరోగ్యకరమైన జీవక్రియకు సహాయపడతాయి. ఉల్లిపాయల్లో అలిసిన్, క్వెర్సెటిన్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు, యాంటీ ఆక్సిండెంట్లు, యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా మెండుగా లభిస్తాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.ఉల్లిపాయలకు దూరంగా ఉంటే ఏం జరుగుతుందంటే..ఉల్లిపాయలు తినడం మానేస్తే శరీరంలో పెద్దగా మార్పులు కనిపించకపోయినా..కొద్దికొద్ది మార్పులు కచ్చితంగా జరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఉల్లిలో ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు అవసరమైన డైటరీ ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం వల్ల మలబద్ధకంతో పాటు జీర్ణసమస్యలు తలెత్తుతాయి.అంతేకాదు, ఉల్లిపాయలను తినకపోవడం వల్ల రోగనిరోధక వ్యవస్ధను బలహీనపరిచే మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్-సీ, విటమిన్-బీ6, ఫోలేట్ లోపాలు వస్తాయి. ఫలితంగా శరీరంలో అలసట ఏర్పడి ఎర్రరక్త కణాలు పడిపోవడం, రక్తం గడ్డ కట్టడం లాంటి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. కాబట్టి ఉల్లిపాయలు తినడం పూర్తిగా మానేయకుండా మితంగా తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందుకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యుల సలహాల మేరుకు పాటించటం ఉత్తమం. (చదవండి: రాధిక మర్చంట్ 'విదాయి'వేడుక..భావోద్వేగానికి గురైన ముఖేష్ అంబానీ!) -
ఆ ఒక్కటీ తప్ప.. ఉల్లితో చాలా ప్రయోజనాలు
ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతీయ వంటకాల్లో కనిపించే వాటిల్లో చాలా ముఖ్యమైంది ఉల్లిపాయ. పసుపు, తెలుపు , ఎరుపు రంగుల్లో ప్రత్యేకమైన ఘాటైన రుచి, వాసనతో లభిస్తుంది. దాదాపు అన్ని కూరల్లో దీన్ని విరివిగా వాడతాం. అయితే పచ్చిగా తీసుకోవడం వల్ల కూడా ఉల్లితో చాలా ఔషధ ప్రయోజనాలున్నాయి. ‘ఉల్లి చేసిన మేలు తల్లి అయినా చేయదు’ అన్నట్టు దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్య , షుగర్ తదితర సమస్యలకు చక్కటి పరిష్కారం ఉల్లి.ఇందులో క్రోమియం షుగర్ స్థాయిలనుఅదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.రోగనిరోధక శక్తిని పెంచుతుందిపచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సీ అధికంగా లభిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇంకా డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. దగ్గు, జలుబు, ఫ్లూ లాంటి వాటికి సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ బయోటిక్ గుణాలతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిదిఉల్లిపాయలలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా అధిక రక్తపోటు ముప్పు కూడా తగ్గుతుంది.జీర్ణక్రియలో పచ్చి ఉల్లిపాయలలో డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు ఊతమిస్తుంది. శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది. ఫైబర్ పోషకాల శోషణను పెంచుతుంది మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ , హేమోరాయిడ్స్ వంటి వివిధ వ్యాధులను నివారిస్తుంది.వాపును తగ్గిస్తుందిక్వెర్సెటిన్ అధికంగా ఉండే పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రాంకైటిస్ వ్యాధులకు ఉపశమనానికి అందిస్తుంది.ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందిఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదపడే సల్ఫర్-రిచ్ కాంపౌండ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కాల్షియం శోషణను ప్రోత్సహించి, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని నివారిస్తుంది.మెదడు పనితీరును పెంచుతుందిపచ్చి ఉల్లిపాయలు సల్ఫర్ సమ్మేళనాలు మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఇది మెరుగైన జ్ఞాపకశక్తి, శ్రద్ధ , ఏకాగ్రత పెరగడానికి దోహదపడతాయి.కేన్సర్ నివారణలోపచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ , యాంటీఆక్సిడెంట్లు కేన్సర్ నివారణలో సాయపడతాయి. క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్స్ ,అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో కేన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.చర్మ ఆరోగ్యానికి కూడా పచ్చి ఉల్లిపాయల్లోని అధికంగా లభించే యాంటీఆక్సిడెంట్లు ,విటమిన్ సీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. ముడతలు, వయసు మచ్చలు , పిగ్మెంటేషన్ స్థాయిలను తగ్గించి, ఆరోగ్యకరమైన , మెరిసే చర్మాన్ని అందిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందిపచ్చి ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన క్రోమియం అనే ఖనిజం ఉంటుంది. క్రోమియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దారితీస్తుంది, తద్వారా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బరువు తగ్గడంలో తక్కువ కేలరీలు , అధిక ఫైబర్ కంటెంట్ ఎక్కువ. అతిగా తినే అవకాశాలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది.నోట్: ఏదైనా మితంగా తీసుకోవడం ఉత్తమం. అధిక వినియోగం జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తుంది. ప్రధానంగా పచ్చి ఉల్లిపాయ తింటే నోటి దుర్వాసన వస్తుందనిది గమనించాలి. -
నెలలో రెట్టింపైన ఉల్లి ధర.. ఎగుమతి సుంకంపై మంత్రి ఏమన్నారంటే..
ప్రభుత్వం ఉల్లిపై విధించిన 40 శాతం ఎగుమతి సుంకాన్ని తొలగించే అవకాశం లేదని ఇటీవల కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన వాణిజ్య వర్గాలు తెలిపాయి. ఉల్లి ధర గడిచిన 15 రోజుల్లో దాదాపు 40 శాతం పెరిగింది. గత నెలతో పోలిస్తే ఏకంగా రెట్టింపైందని మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. లాసల్గావ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) ధరల ప్రకారం కేజీ ఉల్లి ధర మంగళవారం రూ.28గా ఉంది.ఉల్లి ధరల పెరుగుదలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గతనెలలో ఏకంగా 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. ఈ చర్యతో ఉల్లి ఎగుమతులు భారీగా తగ్గి, వాటి ధరలు నిలకడగా ఉంటాయన్నది ప్రభుత్వ యోచన. మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్నా దాన్ని గరిష్ఠ స్థాయిలో పండించే రాష్ట్రాల్లో గతంలో వర్షాభావం వల్ల దిగుబడి తగ్గింది. కర్ణాటకలోని రైతులు ఉల్లిని అధికంగా పండిస్తుంటారు. అయితే హీట్‌వేవ్స్ వల్ల రబీలో రైతులు ఉల్లి సాగుపై ఆసక్తి చూపించలేదు.దేశీయంగా ప్రతి నెలా దాదాపు 13 లక్షల టన్నుల ఉల్లి వినియోగమవుతుంది. దేశంలో ఉల్లి ఎక్కువగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పండుతుంది. 65 శాతం పంట ఒక్క రబీలోనే వస్తుంది. అది ఏప్రిల్-మే మధ్య మార్కెట్లోకి వచ్చి అక్టోబరు-నవంబరు వరకు ఉంటుంది. అయితే నిల్వ ప్రక్రియలోనే ఉల్లిపాయలు ఉత్పత్తి బరువులో 30-40 శాతం కోల్పోతాయి. కుళ్లిపోవడంవల్ల కొన్ని వృథా అవుతాయి. అలా పరిమాణంతో పాటు నాణ్యతపరంగానూ నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఉల్లిపాయలను నిల్వ చేసేందుకు నాణ్యమైన ఏర్పాట్లు లేకపోవడంవల్ల ఏటా రూ.11 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని అంచనా.పెరుగుతున్న ఉల్లి ధరల స్థిరీకరణ కోసం ఎగుమతి సుంకాన్ని పెంచి వ్యూహాత్మక నిల్వలను సృష్టించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉల్లి ధరలు మరింత పెరిగితే బఫర్ స్టాక్ కింద ఉల్లిని సేకరించడం ప్రభుత్వానికి సవాలుగా మారుతుంది. 2022-23లో 25 లక్షల టన్నులుగా ఉండే ఉల్లి ఎగుమతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17 లక్షల టన్నులకు తగ్గాయి. 2024 ఏప్రిల్ నుంచి ఈ ఎగుమతులు కేవలం లక్ష టన్నులు మాత్రమే ఉండవచ్చని సమాచారం.ఇదీ చదవండి: వ్యక్తులను గుర్తించే ‘దివ్యదృష్టి’!కొన్నిచోట్ల వ్యాపారస్థులు సిండికేట్‌గామారి ఇదే అదనుగా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. మహారాష్ట్ర ఉల్లి ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు భరత్ డిఘోలే ఒక వీడియోలో మాట్లాడుతూ..‘రైతులు ప్రభుత్వ సంస్థలైన నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్‌లకు కిలో రూ.40 కంటే తక్కువ ధరకు ఉల్లిని విక్రయించకూడదు. భవిష్యత్తులో ఉల్లి ధరలను తగ్గించేందుకు బఫర్ స్టాక్‌ను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది’ అని తెలిపారు. -
Onions: ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: దేశంలో ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని సడలించింది. మార్చి 31 వరకు బంగ్లాదేశ్, మారిషస్, బెహ్రెయిన్, భూటాన్‌లకు 54,760 టన్నుల ఉల్లిపాయల్ని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. బంగ్లాదేశ్‌కు 50 వేల టన్నులు, మారిషస్‌కు 1,200 టన్నులు, బహ్రెయిన్‌కు 3 వేల టన్నులు, భూటాన్‌కు 560 టన్నుల చొప్పున ఉల్లిని ఎగుమతి చేసేందుకు అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు.. కానీ మార్చి 31 వరకు మాత్రమే నిర్దేశించిన విధంగా ఉల్లిని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతి ఉందని, దీనికి సంబంధించిన విధివిధానాల్ని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, దేశంలో ఉల్లి ధరల పెరుగుదలను నియంత్రించి దేశీయంగా సరఫరా పెంచేందుకు కేంద్రం గతేడాది డిసెంబర్ 8న ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం మార్చి 31 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో విదేశాంగ శాఖ చేసిన సూచన మేరకు తాజాగా నాలుగు దేశాలకు ఎగుమతి చేసేందుకు రైతులకు అవకాశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు? ఎలా దరఖాస్తు చేయాలి? -
క్యాప్సికం, స్ప్రింగ్ ఆనియన్స్ తాజాగా ఉండాలంటే..!
కొన్ని రకాల కాయగూరలని ఫ్రిజ్‌లో ఉంచిన వెంటనే పాడైపోతాయి. ఎలా నిలువ చేయలో అర్థంకాక సతమతమవుతుంటాం. పైగా అవి ఖరీదు కూడా. పోనీ వెంటనే వండటం కుదురుతుందా అంటే ఒక్కొసారి అస్సలు కుదరదు. అలాంటి టైంతో మన పెద్దవాళ్లు లేదా కొందరూ చెఫ్‌లు చెప్పే చిట్కాలు బాగా పనిచేస్తాయి. మన ఇబ్బంది తీరిపోతుంది. అలాంటి కొన్ని ఇంటి చిట్కాలు మీ కోసం.. గాజుసీసాలో నీళ్లుపోసి స్ప్రింగ్ ఆనియన్స్ వేర్లు మునిగేలా పెడితే ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటాయి. పచ్చని భాగం పెరుగుతూ ఉంటుంది కాబట్టి అవసరం ఉన్నప్పుడల్లా కాస్త కట్ చేసుకోని వాడుకోవచ్చు. మిగిలిపోయిన బ్రెడ్ స్లైసులను మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని దోరగా వేయించి గాలి చొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. మార్కెట్లో దొరికే బ్రెడ్ క్రంప్స్లా ఇది ఉపయోగపడుతుంది. క్రిస్పీ వెజ్ నాన్‌వెజ్ డిష్‌లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. క్యాప్సికాన్ని పేపర్ బ్యాగ్‌లో చుట్టిపెట్టి, రిఫ్రిజిరేటర్లో పెడితే ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటుంది. బేకింగ్ సోడాలో కాస్త వెనిగర్ వేసి నల్లగా జిడ్డుపట్టిన పాత్రలపైన రాసి పదినిమిషాలు నానబెట్టాలి. తరువాత డిష్వాషర్తో తోమితే నలుపంతా పోయి పాత్ర కొత్తదానిలా మెరుస్తుంది. (చదవండి: దానిమ్మ ఎన్ని వ్యాధులకు చెక్‌పెడుతుందో తెలుసా! అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..) -
రైతన్నలకు మరింత ఆదాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికే ప్రత్యేకమైన ప్రసిద్ధి చెందిన ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) తేవడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర, అదనపు విలువ చేకూర్చడం ద్వారా వారు మరింత ఆదాయం పొందేలా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మరో కీలక ముందడుగు వేసింది. ఒకేసారి మూడు సంస్థలతో గురువారం మౌలిక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సహకార, వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి సమక్షంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ), రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎస్ఎఫ్పీఎల్), దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎంవోయూలు చేసుకుంది. ఈ మేరకు ఆయా సంస్థల ఉన్నతాధికారులతో కలిసి సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్ రెడ్డి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. భౌగోళిక గుర్తింపు కోసం సాంకేతిక సహకారం రాష్ట్రానికే ప్రత్యేకమైన ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్, భౌగోళిక గుర్తింపు (జీఐ) తీసుకొచ్చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ఇప్పటికే ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ వచ్చింది. ఇదే రీతిలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 32కు పైగా ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు కోసం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ చేస్తున్న కృషికి వర్సిటీ సాంకేతిక సహకారం అందించనుంది. తద్వారా రాష్ట్రానికే ప్రత్యేకమైన ఆయా గొప్ప వంటల వారసత్వాన్ని సంరక్షించడంతోపాటు వాటిని భవిష్యత్ తరాలకు అందించేందుకు తగు రీతిలో ప్రచారం చేయడానికి వీలవుతుంది. రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు.. సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లకు అవసరమైన సాంకేతికతను ఇప్పటివరకు మహారాష్ట్రకు చెందిన ఎస్4ఎస్ అనే సంస్థ అందిస్తోంది. ఈ యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేసే ఉల్లి, టమాటా ఫ్లేక్స్ (ముక్కలు)ను కిలో రూ.2.50 చొప్పున కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తోంది. అదే రీతిలో రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటవుతున్న మిగిలిన యూనిట్లకు సాంకేతిక సహకారం, మద్దతు అందించేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన రహేజా సోలార్ ఫుడ్స్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. కనీసం 2 వేల యూనిట్లకు సహకారం అందిస్తుంది. ఉల్లి, టమాటాలను సమకూర్చడంతో పాటు రైతుల నుంచి ఉల్లి, టమాటా ఫ్లేక్స్‌ను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఏపీజీబీ చైర్మన్ రాకేశ్ కష్యప్, జీఎం పీఆర్ పడ్గెటా్వర్, దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం రిజి్రస్టార్ జోగినాయుడు, రహేజా సంస్థ వైస్ చైర్మన్ సౌరబ్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ స్టేట్ లీడ్ సుభాష్, మేనేజర్ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లకు ఆర్థిక చేయూత టమాటా, ఉల్లి పంటలకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర, పొదుపు సంఘాలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాయలసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రత్యేకంగా 5 వేల సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా సొసైటీ ముందుకెళ్తోంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మిగిలిన జిల్లాల్లో కూడా ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ) ముందుకొచ్చింది. సొసైటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన లబి్ధదారులకు రూ.10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలను బ్యాంక్ అందించనుంది. యూనిట్ మొత్తంలో 35 శాతాన్ని సొసైటీ సబ్సిడీ రూపంలో అందిస్తుంది. 9 శాతం వడ్డీతో మంజూరు చేసే ఈ రుణాలపై అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కింద అదనంగా మరో 3 శాతం వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది. -
ఉల్లిపాయలు ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అలా అస్సలు చేయకండి
కిచెన్ టిప్స్: వర్షాకాలంలో ఉల్లిపాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి. ఉల్లి ఎక్కువ రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. ► ఇతర కూరగాయలు ఉన్న బుట్టలో ఉల్లిపాయలను ఉంచకూడదు. దుంపలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వంటి వాటితో కలిపి ఉల్లిపాయలు ఉంచడం వల్ల త్వరగా మొలకలు వస్తాయి. కూరగాయల్లో ఇథలిన్ ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తడానికి దోహదపడుతుంది. ►ఉల్లిపాయలను నిల్వచేసేందుకు పేపర్ బ్యాగ్‌లనే వాడాలి. పేపర్ బ్యాగ్స్‌లో ఉల్లిపాయలు ఉంచడం వల్ల ఉల్లిపాయల్లో ఉత్పన్నమయ్యే తేమను పేపర్ పీల్చుకుంటుంది. తేమ లేకపోతే ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తవు. ►రిఫ్రిజిరేటర్లో ఉల్లిపాయలను నిల్వచేయకూడదు. రిఫ్రిజిరేటర్లోని ఇతర కూరగాయల వల్ల, లోపలి తేమ వాతావరణం ఉల్లి త్వరగా మొలకెత్తేలా చేస్తాయి. ►ప్లాస్టిక్ సంచుల్లో ఉల్లిపాయలను ఎప్పుడూ నిల్వ చేయకూడదు. మార్కెట్ నుంచి తెచ్చిన ప్లాస్టిక్ సంచిలో నుంచి ఉల్లిపాయలు తీయడం మర్చిపోతుంటాము. ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేడికి ఉల్లిపాయలు పాడవుతాయి. -
వేడి వేడి ఉల్లి పుష్పము
పకోడీలు, బజ్జీలు తెలుసు. కాని ఉల్లిపాయను తామరపువ్వులా ఒలిచి శనగపిండిలో కలిపి నూనెలో వేయించి ఉల్లి పుష్పంగా తయారు చేసి సర్వ్ చేస్తే 11 లక్షల వ్యూస్ లొట్టలేశాయి. వడోదర స్ట్రీట్‌ఫుడ్‌లో తాజా హల్చల్ ఇది. స్ట్రీట్‌ఫుడ్ ఎంత నోరూరించేదిగా ఉన్నా శుభ్రత పాటించరనే కంప్లయింట్‌తో కొందరు తినరు. కాని వడోదరలోని ఈ తాజా చిరుతిండి హల్చల్ చేయడమే కాక అందరి మన్ననా పొందింది. ‘చేస్తే ఇంత శుభ్రంగా చేయాలి’ అనే మెచ్చుకోలు అందుకుంది. వడోదర (గుజరాత్)లోని ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకమైన స్టాల్ పెట్టి ఈ ‘ఉల్లి పుష్పం’ (ఉల్లి బజ్జీ) అమ్ముతున్నారు. ఇందుకు పెద్దసైజు ఉల్లిగడ్డలను వాడుతున్నారు. వాటిని పువ్వులా కట్ చేసే మిషన్‌ను తయారు చేయించుకున్నారు. శుభ్రంగా వొలిచిన ఉల్లిపాయను ఈ మిషన్ కింద పెడితే పువ్వులా రెక్కలు వచ్చేలా కట్ చేస్తుంది. దానిని శనగపిండిలో ముంచి వేడి వేడి నూనెలో వేయిస్తే ఉల్లిపువ్వు ఆకారంలో బజ్జీలు తయారవుతున్నాయి. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంతో జనం ఎగబడుతున్నారు. అంతే కాదు చేస్తున్న పద్ధతి శుభ్రంగా ఉండటంతో సంకోచం లేకుండా తింటున్నారు. ఒక వ్లోగర్ ఈ ఉల్లిపువ్వు బజ్జీ తయారీని వీడియో తీసి ఇన్‌స్టాలో పెడితే క్షణాల్లో 11 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘కొత్త కొత్త ఆలోచనలే వ్యాపారాన్ని నిలబెడతాయి’ అంటున్నారు. అందరి దగ్గరా ఉల్లిపాయలు ఉంటాయి. అందరూ బజ్జీలు వేస్తారు. కాని ‘ఉల్లిపువ్వు బజ్జీ’ అనే ఐడియా వీరికే వచ్చింది. ఆ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ ఉన్నవాళ్లనే విజయం వరిస్తుంది. కొత్తగా ఆలోచించండి... పెద్ద విజయం సాధించండి... అని ఈ ఉల్లిపువ్వు కరకరలాడుతూ సందేశం ఇస్తోంది. -
ఇక ఉల్లి కూడా..ఈ నెలాఖరుకు: క్రిసిల్ షాకింగ్ రిపోర్ట్
Onion prices ఇప్పటికే కొండెక్కి కూచున్న టమాట ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో పాటు చింతపండు, వెల్లుల్లి, అల్లంతో పాటు ఇతర కూరగాయలు ధలు కూడా మండిస్తున్నాయి. తాజాగా ఉల్లిపాయ ధరలపై క్రిసిల్ షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ఉల్లి ధరలు కూడా టమాటా బాట పట్టనుందని క్రిసిల్ పరిశోధన వెల్లడించింది. ఆగస్టు నెలాఖరు నాటికి ఉల్లి ధరలు 150 శాతం ఎగిసి కిలో రూ.60/70కి చేరవచ్చని క్రిసిల్ పేర్కొంది. సప్లయ్ కూడా కష్టంగా మారితే ధరలు మరింత అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. (మహిళల రికార్డ్: వారి టార్గెట్ పక్షి కన్నే, గర్వంగా ఉంది: ఆనంద్ మహీంద్ర ప్రశంసలు) శుక్రవారం విడుదల చేసిన అధ్యయనం, ఫిబ్రవరి ,మార్చి 2023లో నమోదైన అమ్మకాల కారణంగా రబీ ఉల్లిపాయల షెల్ఫ్ లైఫ్ ఒకటి నుండి రెండు నెలల వరకు తగ్గిందని ఫలితంగా, గత రబీ సీజన్‌లోని ఉల్లి నిల్వలు సెప్టెంబర్ కంటేముందే ఆగస్టు నాటికే గణనీయంగా క్షీణించవచ్చని తెలిపింది. ప్రస్తుతం, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ డేటా ప్రకారం, ఢిల్లీ మార్కెట్లలో ఉల్లిపాయల రిటైల్ ధర కిలోకు సుమారు రూ.30. క్రిసిల్ నివేదిక నిజమైతే, నెలాఖరు నాటికి ధరలు రెట్టింపు కావచ్చు. (పండగ సందడి షురూ: టాటా సీఎన్జీ కార్లు వచ్చేశాయ్!) అయితే దీంతోపాటు ఈ నివేదిక కొన్ని సానుకూల అంశాలను కూడా వెల్లడించింది.ఈ పెరుగుదల 2020లో కనిపించిన గరిష్ట స్థాయిల కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. మరీ ముఖ్యంగా, ఖరీఫ్ పంట అక్టోబర్ నుండి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. అయినప్పటికీ, ఖరీఫ్ ఉల్లి పంట మార్పిడి , పంటను నిర్ణయించడంలో ఆగస్టు , సెప్టెంబర్లలో వర్షపాతం కీలక పాత్ర పోషిస్తుందని నివేదిక హెచ్చరించింది.సెప్టెంబర్‌లో ఉన్న అధిక ధరలతో పోలిస్తే, పండుగ నెలల్లో (అక్టోబర్-డిసెంబర్) ధరల హెచ్చుతగ్గులు స్థిరంగా ఉంటాయని అంచనా వేస్తోంది" అని నివేదిక స్పష్టం చేసింది. దేశంలో ఉల్లి ప్రస్తుత రిటైల్ ధరలు కిలోకు రూ. 25 వద్ద ఉన్నాయి. -
ఈ ఉల్లిపాయాలు కోస్తే కన్నీళ్లు రావు!..కానీ ధర వింటే కన్నీళ్లు ఖాయం!
ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్లు వస్తాయి. ఉల్లి ధరలు పెరిగినప్పుడు వాటిని కోయకపోయినా కన్నీళ్లు వస్తాయి, అది వేరే విషయం! కోసినా కన్నీళ్లు తెప్పించని ఉల్లిపాయలు ఇటీవల ఆస్ట్రేలియా మార్కెట్లోకి వచ్చాయి. మిగిలిన కూరగాయల్లాగానే వీటిని కూడా సంతోషంగా తరుక్కోవచ్చని, వీటిని కోసినప్పుడు కళ్లుమండటం, కన్నీళ్లు రావడం జరగదని చెబుతున్నారు. ఈ రకం ఉల్లిపాయలను ‘హ్యాపీ చాప్స్’ బ్రాండ్ పేరుతో విడుదల చేశారు. తొలిసారిగా ఈ ఉల్లిపాయలను ఆస్ట్రేలియాలోని వూల్‌వర్త్స్ సపర్మార్కెట్లలోకి జూలై 12 నుంచి అందుబాటులోకి తెచ్చారు. జన్యుమార్పిడి ద్వారా ఉల్లిపాయల్లోని కన్నీళ్లు తెప్పించే రసాయనాలు లేకుండా చేసి, వీటిని ప్రత్యేకంగా పండించారు. వీటిని కోసిన తర్వాత వీటిలో కన్నీళ్లు తెప్పించే రసాయనాలు తగ్గిపోతాయి. రోజులు గడిచేకొద్దీ పూర్తిగా లేకుండాపోతాయి. సాధారణ రకాలకు చెందిన ఉల్లిపాయల్లో రోజులు గడిచేకొద్దీ ఈ రసాయనాలు ఎక్కువై, మరింతగా కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే, ఈ ఉల్లిపాయలను కోసినప్పుడు కన్నీళ్లు రాకున్నా, వీటి ధర వింటే కన్నీళ్లు రావడం ఖాయం. ‘హ్యాపీచాప్స్’ ఉల్లి కిలో ధర 5 డాలర్లు (ర.411) వత్రమే!. (చదవండి: పార్కుగా మారనున్న పాడుబడ్డ స్టేషన్) -
70 కి.మీ దూరం వెళ్లి 512 కిలోల ఉల్లి అమ్మితే మిగిలింది రూ.2.. ఓ రైతు దీనగాథ!
ముంబై: మన దేశంలో రైతుల అప్పులు, వ్యవసాయం సాగించేందుకు వారు పడే తిప్పల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఏటా ఎరువులు, పురుగులు మందు, కూలి ఖర్చులు, కావాల్సిన ఇతర సామాగ్రి ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. ముఖ్యంగా రైతుకు గిట్టు ధర తప్ప మిగతావన్నీ పైపైకి పోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ జీవితాల్లో మార్పు రావడం లేదని చివరికి మిగిలేది అప్పులు మాత్రమే అని రైతులు వాపోతున్నారు. మరీ రూ.2 ఇచ్చాడు తాజాగా ఓ రైతు ఎన్నో కష్టాలు, ఖర్చులు పెట్టి పండించిన పంటకు అన్నీ పోనూ చివరికి రూ. 2 మిగిలింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ దేశంలో ప్రస్తుతం రైతుల దుస్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది. ఈ చేదు అనుభవం మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ఓ రైతుకు ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. షోలాపూర్ జిల్లా బార్షి జిల్లాకు చెందిన రాజేంద్ర చవాన్ అనే రైతు ఫిబ్రవరి 17న 10 బస్తాల ఉల్లిగడ్డలను వ్యవసాయ మార్కెట్ కమిటీకి తీసుకొచ్చాడు. ఉల్లి ధరలు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో రైతులకు క్వింటాల్‌కు రూ.100 ధర లభించింది. రైతు తెచ్చిన ఉల్లిపాయలను అమ్మగా వచ్చిన మొత్తం బిల్లు 512 రూపాయలు. అందులో రవాణా, తూకం, వాహన ఛార్జీల కింద రూ. 509.51 పోయాయి. చివరికి రూ.2.49 మిగిలింది. దీంతో వ్యాపారి రౌండాఫ్ ఫిగర్ చేసి 2 రూపాయలు చెక్కును రైతుకు ఇచ్చాడు. చెక్కుపై తేదీ మార్చి 8, 2023 అని కూడా పేర్కొనడంతో రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్నో రోజులు శ్రమించి, ఎంతో కష్టపడి, పెట్టుబడి పెట్టి పంట పండిస్తే తనకు మిగిలేది రెండు రూపాయలా అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు ఇచ్చిన రశీదు, చెక్కు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా! -
మహబూబ్‌నగర్: ఉల్లి ధరలు పడిపోవడంతో ఆందోళనలో రైతులు
-
అక్కడ ఉల్లి ధర వింటే..కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం!
మన దేశంలో ఎప్పుడైన పెట్రోల్ ధరలు పెరిగినప్పుడో లేక అనావృష్టి సమయాల్లోనో ధరలు అధికమవుతాయి. అప్పుడే మనకు ఉల్లి ధర ఆకాశన్నంటుతుంది. పైగా అది కూడా మహా అయితే కేజి 30 నుంచి 70 మధ్యలో పెరుగుతుంది. దానికే మనవాళ్లు చేసే హడావిడి అంతా ఇంతకాదు. ఇదే అదనుగా రెస్టారెంట్ నుంచి చిన్న కాక హోటల్ వరకు రేట్లు పెంచేయడం, ఉల్లి లేని వంటకాలు అందించడం వంటివి చేస్తారు. కానీ ఇక్కడ ఈ దేశంలోని ఉల్లి పాయాల ధర వింటే అమ్మ బాబోయ్ అంటారు. కచ్చితంగా కొనేందుకు ముందుకు రావడానికి కూడా జంకుతారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. వివరాల్లోకెళ్తే...ఫిలిప్పీన్స్‌లో ఉల్లిపాయాల ధర చాలా ఘోరంగా ఉంటుంది. ఏకంగా కేజీ ఉల్లిపాయాలు సుమారు వెయ్యి రూపాయాలు వరకు పలుకుతోంది. అక్కడ ప్రస్తుతం ఉల్లి చాలా విలాసవంతమైన వస్తువుగా మారింది. ఇంతకు మునుపు అక్కడ ప్రజలు మూడు నుంచి నాలుగు కేజీల ఉల్లిపాయాలు కొనేవారు. ప్రస్తుతం అక్కడ ఎంతో అవసరం అనుకుంటే గానీ, అదికూడా కేవలం అరకేజీనే కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. గత మూడు నెలల నుంచే ఈ దారుణమైన ధర పలుకుతోందని చెబుతున్నారు. వాస్తవానికి ఫిలిప్పీన్స్ వాసులు ఆహారంలో ప్రధానంగా ఉల్లిని విరివిగా ఉపయోగిస్తారు. ఇప్పుడు వారంతా దాని ప్లేస్‌లో మరోదాన్ని జోడించి తినాల్సి వస్తోందని వాపోయారు. ఈ మేరకు అక్కడ వ్యవసాయ కార్యదర్శి ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఈ పెరుగతున్న ఆహార ధరల పరిస్థితిని అత్యవసర పరిస్థితిగా పేర్కొన్నారు. ఆయన ఉత్పత్తిని పెంచే దిశగా పలు ప్రత్యామ్నాయ పద్ధతుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. కొన్ని నెలల క్రితం ఫిలిప్పీన్స్ రెండు భారీ తుపాన్లను ఎదుర్కొంది. దీంతో అక్కడ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. అక్కడ ప్రజలు పెళ్లిళ్లకు ఉపయోగించే డెకరేషన్లో ఉల్లిని ఉపయోగించాలని చూస్తున్నారు కొందరూ. ఎందుకంటే ఆ తతంగం తర్వాత ఆ ఉల్లిపాయాలు కొందరూ పేద ప్రజలకు ఉపయోగపడతాయని, అదే పూలు అయితే వాడిపోతాయి ఉపయోగం ఉండదు అనేది వారి ఆలోచన. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. పాపం అక్కడి ప్రభుత్వం సైతం ప్రజలకు భారం తగ్గించేలా...ధరల పెరుగుదలను నియంత్రించటానికి నానా అగచాట్లు పడుతోంది. (చదవండి: పాక్‌లో భూకంపం) -
Health Benefits of Onions: ఉల్లితో మధుమేహం దూరం!
కాలిఫోర్నియా: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఈ మాటల్లో నిజముందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. మధుమేహ రోగులకు ఉల్లిపాయ సూపర్ ఫుడ్ అని, రోజూ ఉల్లిపాయ తింటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని అమెరికాలోని కాలిఫోర్నియాలో శాన్ డియోగాలోని ఎండోక్రైన్ సొసైటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. టైప్ 2 డయాబెటీస్ రోగులకు ఇచ్చే యాంటీ డయాబెటిక్ డ్రగ్ మెట్‌ఫార్మిన్‌తో పాటు ఉల్లిపాయ కూడా తీసుకుంటే షుగర్ లెవల్స్ 50శాతం వరకు తగ్గే అవకాశం మెరుగ్గా ఉందని ఆ అధ్యయనంలో తేలినట్టు ది ఇండిపెండెంట్ పత్రిక ప్రచురించింది. మధుమేహ రోగుల చికిత్సలో భాగంగా ఉల్లిపాయను కూడా సూచించవచ్చునని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన నైజీరియాలో డెల్టా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆంటోని ఒజిహె అన్నారు. అయితే తమ పరిశోధనలు ప్రస్తుతం ఇంకా ఎలుకలపైనే చేశామని, త్వరలో మానవ ప్రయోగాలు నిర్వహిస్తామని చెప్పారు. ‘‘ఉల్లిపాయ తక్కువ ధరకి లభిస్తుంది. డయాబెటీస్‌కి వాడే మందుతో పాటు ఉల్లిపాయ కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే ఆ మందు ఇంకా బాగా పని చేస్తుంది. అయితే ఇంకా ఎలుకల్లోనే ఈ ప్రయోగం జరిగింది’’ అని ఆంటోని వెల్లడించారు. మధుమేహం ఉన్న ఎలుకల్లో రోజుకి 400 ఎంజీ, 600 ఎంజీ ఉల్లిని ఇవ్వడంతో చక్కెర స్థాయి బాగా తగ్గిందని, అంతేకాకుండా కొలస్ట్రాల్ కూడా తగ్గినట్టు తేలినట్టుగా వివరించారు. మరోవైపు సెంటర్ ఫర్ డయోబెటిస్ చైర్మన్ డాక్టర్ అనూప్ శర్మ ఈ అధ్యయనంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారతీయులు ఉల్లిపాయ చాలా ఎక్కువగా తింటారని అలాంటప్పుడు భారత్ మధుమేహగ్రస్తులకు ఎందుకు హాట్‌స్పాట్‌గా మారిందని ప్రశ్నించారు. మానవ ప్రయోగాలు జరిగేంతవరకు ఒక నిర్ధారణకు రాలేమన్నారు. -
Hair Care Tips: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే!
Hair Care Tips In Telugu: ఉల్లి లేని కూరలను.. ఉప్పు లేని పప్పు చారుతో పోల్చుతారు కొంతమంది. ఎందుకంటే ఉల్లి వల్ల వంట రుచికరంగా ఉండడంతోపాటు ఆరోగ్యానికీ ఎంతో మేలు. అలాగే. ఉల్లి వల్ల జుట్టుకు కూడా ఎంతో మంచిదని ఇటీవల కాలంలో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ►ఉల్లి రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇది జుట్టును ఊడిపోకుండా కాపాడుతుంది. అందుకు ఏం చేయాలంటే..? ►ఉల్లిని మెత్తగా గ్రైండ్ చేసి.. దాన్నుంచి రసాన్ని తీసి.. ఒక గిన్నెలో నిల్వ చేసి కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు రాసుకుంటూ ఉండాలి. ►ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ►ఈ నూనెను గోరువెచ్చగా వేడి చేసు రాసుకున్నా మంచిదే. ఈ నూనె బట్టతల సమస్యలు రాకుండా కాపాడుతుంది. మెరిసే జుట్టును సొంతం చేసుకునేందుకు ఇలా చేయండి తేనె, ఆలివ్ ఆయిల్.. ►టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీస్పూన్ నిమ్మరసం కలపాలి. ►ఈ మిశ్రమాన్ని కోడిగుడ్డులోని తెల్లసొనని వేసి కలపాలి. ►దీనిని కుదుళ్ల నుంచి జుట్టుకి పట్టించాలి. ►20 నిమిషాల తరువాత తల స్నానం చేయాలి. కరివేపాకుతో.. ►కప్పు కొబ్బరినూనె, ఒక కప్పు ఆవాల నూనె కలపాలి. ►ఈ మిశ్రమంలో ఒక కప్పు కరివేపాకుల్ని వేసి రాత్రంతా నానబెట్టాలి. ►మరుసటి రోజు ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి చిన్న మంట పై వేడి చేయాలి. ►కరివేపాకు కాస్త వేగగానే నూనె మిశ్రమంలోంచి తీసేయాలి. ►ఆ తరువాత దింపేసి మూడు కర్పూరం బిళ్లలు వేయాలి. ►చల్లారిన తరువాత నూనె మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి జుట్టుకంతా పట్టించి రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు తలస్నానం చేయా లి. ►ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చదవండి: Health Tips: కాలీఫ్లవర్, క్యారెట్లు, బీట్రూట్, పుట్టగొడుగులు అతిగా తింటే అంతే సంగతులు! కాస్త.. -
Hair Care: వర్షంలో తడిసినపుడు జుట్టుకు ఆయిల్ పెడితే!
రాబోయేది వర్షాల సీజన్. ఈ కాలంలో కురులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రత్యేకమైన శ్రద్ద పెట్టాలి. వర్షంలో తడిచినా వెంటనే తలస్నానం చేసి జుట్టుని ఆరబెట్టాలి. జుట్టుకు ఆయిల్ పట్టించి గంటతరువాతే తలస్నానం చేయాలి. అదే విధంగా... వారానికి రెండు మూడు సార్లు తలస్నానం చేయాలి. నాలుగు టీస్పూన్ల ఉల్లిపాయ రసంలో మరో నాలుగు టీస్పూన్ల కొబ్బరి నూనె వేసి కలిపి జుట్టు కుదళ్ల నుంచి చివర్లకు పట్టించాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇవన్నీ పాటించడం ద్వారా వర్షాకాలంలోనూ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చదవండి👉🏾: Hair Care Tips: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల -
అమెరికాలో ‘ఉల్లి’ హడల్!
అమెరికాలోని టెక్సాస్ ప్రాంతం. హుషారుగా రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ దంపతులు.. తినేసి ఇంటికి వచ్చారు. కాసేపటికే ఇద్దరికీ జ్వరం, వాంతులు, విరేచనాలు.. వెంటనే వెళ్లి ఆస్పత్రిలో చేరారు. అక్కడే మరో పట్టణం.. ఇంట్లో భోజనం చేసి పడుకున్న కుటుంబ సభ్యులంతా తెల్లారే సరికి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇలా కొద్దిరోజుల్లోనే వందల మంది అనారోగ్యం పాలయ్యారు. అందరికీ ఒకే సమస్య ‘సాల్మోనెల్లోసిస్’. సాల్మోనెల్లాగా పిలిచే ఓ రకం బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధి. అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు లోతుగా ఆరా తీసి.. ఇదెలా వ్యాపిస్తోందన్నది తేల్చారు. ఆ కారణం ఏమిటో తెలుసా.. జస్ట్ ఉల్లిపాయలు. దీంతో అమెరికావ్యాప్తంగా ఒక్కసారిగా ఉల్లి అంటే హడల్ మొదలైంది. ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు.. అక్కడి 37 రాష్ట్రాల్లో సాల్మోనెల్లోసిస్ బారినపడ్డ పేషెంట్ల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. వారు కొద్దిరోజులుగా ఏమేం తిన్నారు, ఎక్కడెక్కడికి వెళ్లారనేది ఆరా తీశారు. అన్నిచోట్లా కామన్‌గా వచ్చిన సమాధానం ఉల్లిపాయలే. ఇందులో చాలావరకు అమెరికాకు చెందిన ప్రోసోర్స్ అనే సంస్థ.. పొరుగుదేశమైన మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్నవే. దీంతో అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెంటనే హైఅలర్ట్ జారీ చేసింది. ప్రోసోర్స్ సంస్థ ద్వారా సరఫరా అయిన ఉల్లిపాయలన్నింటినీ.. వెంటనే పారబోయాలని ఆదేశించింది. ఆ ఉల్లిపాయలతో కలిపి నిల్వ చేసిన పండ్లు, కూరగాయలు, ఇతర సామగ్రిని కూడా పడేయాలని.. ఆయా ప్రాంతాలను శానిటైజ్ చేయాలని సూచించింది. ► అమెరికాలో సిట్టెరో బ్రాండ్ పేరిట విక్రయిస్తున్న ‘సలామీ స్టిక్స్ (మాంసాహార వంటకం)’తోనూ సాల్మోనెల్లా వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే రెస్టారెంట్లు, సూపర్మార్కెట్లు, ఇతర దుకాణాల్లో ఉన్న స్టాక్‌ను పడేయాలని ఆదేశించారు. వృద్ధులు, పిల్లలకు డేంజర్! సాల్మోనెల్లా మరీ ప్రమాదకరం కాకున్నా.. వృద్ధులు, చిన్నపిల్లలకు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి మాత్రం డేంజరేనని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాంటి వారిలో తీవ్ర జ్వరం, రక్త విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయని.. శరీరంలో డీహైడ్రేషన్, ఇతర ఇన్ఫెక్షన్లు ఏర్పడి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పరిశుభ్రతే పరిష్కారం అపరిశుభ్ర పరిస్థితులు, ఈగలు వంటివాటి ద్వారా సాల్మోనెల్లాతోపాటు ఈకొలి బ్యాక్టీరియా కూడా సోకుతుందని వైద్యులు చెప్తున్నారు. ► పరిసరాల పరిశుభ్రత, కలుషిత ఆహారానికి దూరంగా ఉండటం, మాంసం, పండ్లు, కూరగాయలు వంటివాటిని శుభ్రంగా కడిగి ఉపయోగించడం, ఆహారాన్ని సరిగా ఉడికించడం, పాలను బాగా మరగబెట్టడం వంటివాటి ద్వారా సాల్మొనెల్లా, ఈకొలికి దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. ఏమిటీ ‘సాల్మోనెల్లా’? సాల్మోనెల్లా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్యాక్టీరియా. కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది. ఎక్కువగా మాంసాహారం, గుడ్లలో ఈ బ్యాక్టీరియా ఎదుగుతుంది. సరిగా కడగని పండ్లు, కూరగాయల మీద కూడా ఉంటుంది. అపరిశుభ్ర పరిస్థితులు, ఈగలు వంటివి ఈ బ్యాక్టీరియా పెరగడానికి, వ్యాపించడానికి కారణం. ► ప్రస్తుతం అమెరికాలో సాల్మోనెల్లా బారినపడ్డ వారిలో చాలా మంది.. సరిగా కడగని, పచ్చి ఉల్లిపాయలు తిన్నట్టు గుర్తించారు. ► శరీరంలో ప్రవేశించిన నాలుగైదు గంటల్లో ప్రభావం చూపించడం మొదలవుతుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి వస్తాయి. తీవ్ర నీరసం ఆవహిస్తుంది. సాధారణంగా వారం రోజుల్లోపే ఈ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. మందులు వాడితే వేగంగా కోలుకోవచ్చు. -
------------
అమెరికాలోని టెక్సాస్ ప్రాంతం. హుషారుగా రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ దంపతులు.. తినేసి ఇంటికి వచ్చారు. కాసేపటికే ఇద్దరికీ జ్వరం, వాంతులు, విరేచనాలు.. వెంటనే వెళ్లి ఆస్పత్రిలో చేరారు. అక్కడే మరో పట్టణం.. ఇంట్లో భోజనం చేసి పడుకున్న కుటుంబ సభ్యులంతా తెల్లారే సరికి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇలా కొద్దిరోజుల్లోనే వందల మంది అనారోగ్యం పాలయ్యారు. అందరికీ ఒకే సమస్య ‘సాల్మోనెల్లోసిస్’. సాల్మోనెల్లాగా పిలిచే ఓ రకం బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధి. అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు లోతుగా ఆరా తీసి.. ఇదెలా వ్యాపిస్తోందన్నది తేల్చారు. ఆ కారణం ఏమిటో తెలుసా.. జస్ట్ ఉల్లిపాయలు. దీంతో అమెరికావ్యాప్తంగా ఒక్కసారిగా ఉల్లి అంటే హడల్ మొదలైంది. ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు.. అక్కడి 37 రాష్ట్రాల్లో సాల్మోనెల్లోసిస్ బారినపడ్డ పేషెంట్ల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. వారు కొద్దిరోజులుగా ఏమేం తిన్నారు, ఎక్కడెక్కడికి వెళ్లారనేది ఆరా తీశారు. అన్నిచోట్లా కామన్‌గా వచ్చిన సమాధానం ఉల్లిపాయలే. ఇందులో చాలావరకు అమెరికాకు చెందిన ప్రోసోర్స్ అనే సంస్థ.. పొరుగుదేశమైన మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్నవే. దీంతో అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెంటనే హైఅలర్ట్ జారీ చేసింది. ప్రోసోర్స్ సంస్థ ద్వారా సరఫరా అయిన ఉల్లిపాయలన్నింటినీ.. వెంటనే పారబోయాలని ఆదేశించింది. ఆ ఉల్లిపాయలతో కలిపి నిల్వ చేసిన పండ్లు, కూరగాయలు, ఇతర సామగ్రిని కూడా పడేయాలని.. ఆయా ప్రాంతాలను శానిటైజ్ చేయాలని సూచించింది. ► అమెరికాలో సిట్టెరో బ్రాండ్ పేరిట విక్రయిస్తున్న ‘సలామీ స్టిక్స్ (మాంసాహార వంటకం)’తోనూ సాల్మోనెల్లా వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే రెస్టారెంట్లు, సూపర్మార్కెట్లు, ఇతర దుకాణాల్లో ఉన్న స్టాక్‌ను పడేయాలని ఆదేశించారు. వృద్ధులు, పిల్లలకు డేంజర్! సాల్మోనెల్లా మరీ ప్రమాదకరం కాకున్నా.. వృద్ధులు, చిన్నపిల్లలకు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి మాత్రం డేంజరేనని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాంటి వారిలో తీవ్ర జ్వరం, రక్త విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయని.. శరీరంలో డీహైడ్రేషన్, ఇతర ఇన్ఫెక్షన్లు ఏర్పడి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పరిశుభ్రతే పరిష్కారం అపరిశుభ్ర పరిస్థితులు, ఈగలు వంటివాటి ద్వారా సాల్మోనెల్లాతోపాటు ఈకొలి బ్యాక్టీరియా కూడా సోకుతుందని వైద్యులు చెప్తున్నారు. ► పరిసరాల పరిశుభ్రత, కలుషిత ఆహారానికి దూరంగా ఉండటం, మాంసం, పండ్లు, కూరగాయలు వంటివాటిని శుభ్రంగా కడిగి ఉపయోగించడం, ఆహారాన్ని సరిగా ఉడికించడం, పాలను బాగా మరగబెట్టడం వంటివాటి ద్వారా సాల్మొనెల్లా, ఈకొలికి దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. ఏమిటీ ‘సాల్మోనెల్లా’? సాల్మోనెల్లా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్యాక్టీరియా. కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది. ఎక్కువగా మాంసాహారం, గుడ్లలో ఈ బ్యాక్టీరియా ఎదుగుతుంది. సరిగా కడగని పండ్లు, కూరగాయల మీద కూడా ఉంటుంది. అపరిశుభ్ర పరిస్థితులు, ఈగలు వంటివి ఈ బ్యాక్టీరియా పెరగడానికి, వ్యాపించడానికి కారణం. ► ప్రస్తుతం అమెరికాలో సాల్మోనెల్లా బారినపడ్డ వారిలో చాలా మంది.. సరిగా కడగని, పచ్చి ఉల్లిపాయలు తిన్నట్టు గుర్తించారు. ► శరీరంలో ప్రవేశించిన నాలుగైదు గంటల్లో ప్రభావం చూపించడం మొదలవుతుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి వస్తాయి. తీవ్ర నీరసం ఆవహిస్తుంది. సాధారణంగా వారం రోజుల్లోపే ఈ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. మందులు వాడితే వేగంగా కోలుకోవచ్చు. -
Salmonella Outbreak: ఉల్లి ఎంత పని చేసింది?.. 650 మందికి తీవ్ర అస్వస్థత..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదని అంటారు.. ఉల్లిలోని ఔషధగుణాలు ఆరోగ్యానికి అంత మేలు చేస్తుందని దానర్థం. కానీ ఈ దేశ ప్రజలు కేవలం ఉల్లి తినడం మూలంగానే వింత వ్యాధి భారీన పడి తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు. అమెరికాలో దాదాపు 37 రాష్ట్రాల్లో 650 మందికి పైగా ప్రజలకు సాల్మొనెల్లా అనే వ్యాధి వ్యాపించింది. మెక్సికోలోని చివావా నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలే అందుకు కారణమట. దీంతో ప్యాకింగ్, స్టిక్కర్ లేని ఉల్లిపాయలన్నింటినీ వెంటనే పారవేయాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరికలు జారీ చేసింది. పచ్చి ఉల్లి తిన్న వెంటనే తాము అనారోగ్యబారిన పడ్డట్టు 75% మంది బాధితులు వెల్లడించారు. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! సీడీసీ నివేదిక ప్రకారం ఇప్పటివరకూ 129 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఐతే ఎటువంటి మరణాలు సంభవించలేదని, అత్యధికంగా సాల్మొనెల్లా కేసులు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో నమోదయ్యాయని వెల్లడించింది. టెక్సాస్, ఓక్లహోమా ప్రావిన్స్‌లలో మొదట ఈ వ్యాధి తాలూకుకేసులు నమోదయ్యాయని మీడియాకు తెల్పింది. ఏమిటీ సాల్మొనెల్లా..? సాల్మొనెల్లా లేదా సాల్మొనెల్లోసిస్ అనేది సాధారణ బ్యాక్టీరియా సంబంధిత వ్యాధి. ఇది పేగులను ప్రభావితం చేసి, జీర్ణసంబంధిత సమస్యలకు కారణమౌతుంది. కొన్ని సందర్భాల్లో టైఫాయిడ్, పారా టైఫాయిడ్ జ్వరాలకు కూడా దారితీస్తుందని సీడీసీ పేర్కొంది. ఐతే సాల్మొనెల్లా బ్యాక్టీరియా సాధారణంగా జంతువుల్లో, మనుషుల పేగుల్లో ఉంటుంది. ఇది మల విసర్జన ద్వారా బయటికి పోతుంది. ఈ వ్యాధి కలుషిత నీరు, ఆహారం తీసుకున్న 6 గంటలకు సాల్మొనెల్లా వ్యాపిస్తుంది. డయేరియా, జ్వరం, కడుపు నొప్పి వంటివి ఈ వ్యాధి తాలూకు లక్షణాలు. ఈ వ్యాధి 4 నుంచి 7 రోజుల పాటు బాధిస్తుంది. కొన్ని రకాల బాక్టీరియాలు మూత్రం, రక్తం, ఎముకలు, కీళ్ళు లేదా నాడీ వ్యవస్థల్లో తీవ్ర ఇన్ఫెక్షన్కు కారణమౌతాయి కూడా. చదవండి: Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట! -
తాడేపల్లిగూడెం నుంచి బెంగాల్‌కు కిసాన్ రైలు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి పశ్చిమబెంగాల్లోని మాల్దా పట్టణానికి ఆదివారం ఉల్లిపాయల లోడ్‌తో కిసాన్ రైలు బయల్దేరి వెళ్లింది. విజయవాడ డివిజన్లోని బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్(బీడీయూ) బృందం తాడేపల్లిగూడెం నుంచి ఉల్లిపాయలు రవాణా చేసేందుకు.. పరిసర ప్రాంతాల్లోని రైతులు, వ్యాపారవేత్తలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి దీన్ని ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంది. తక్కువ ఖర్చు, సురక్షిత రవాణా, సరుకు భద్రత, ప్రభుత్వం అందించే రాయితీల గురించి రైతులు, వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించడం ద్వారా మొదటిసారిగా తాడేపల్లిగూడెం నుంచి మాల్దా పట్టణానికి 246 టన్నుల ఉల్లిపాయలను రవాణా చేశారు. కిసాన్ రైలును విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అభినందించారు. -
కర్నూలు: కోవిడ్ నిబంధలను అనుసరించి ఉల్లి క్రయవిక్రయాలు
-
ఉల్లిగడ్డల చోరీకి వచ్చాడని చంపేశారు..
కోసిగి(కర్నూలు జిల్లా): పొలాల్లో ఆరబోసిన ఉల్లి గడ్డలను అపహరించేందుకు వచ్చాడనే అనుమానంతో రైతులు ఓ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేయడంతో మృతి చెందాడు. కోసిగి సీఐ ఈశ్వరయ్య, ఎస్ఐ ధనుంజయ తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం కపటి నాగాలపురం గ్రామానికి చెందిన ఢణాపురం నసరన్న(55) శనివారం సాయంత్రం కోసిగిలో జరిగిన సిద్ధరూఢ స్వామి జాతరకు వెళ్లాడు. రాత్రి కావడంతో ఆశ్రమంలోనే నిద్రపోయాడు. ఆదివారం తెల్లవారుజామున సజ్జలగుడ్డం గ్రామానికి వెళ్లే రోడ్డులో కాల్వలో సాన్నం చేసేందుకు అడ్డదారిలో పొలాల్లో వెళ్తుండగా.. ఆరబెట్టిన ఉల్లి పంటకు కాపలా ఉన్న రైతులు చీకటిలో అతడిని దొంగగా అనుమానించి చితక బాదారు. తీవ్రంగా గాయ పడి అపస్మారక స్థితికి చేరుకోవడంతో 108లో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, వ్యక్తి మృతికి కారణమైన రైతులు కిందిగేరి ఈరన్న, కపటి ఈరన్న, కోసిగయ్య, తాయన్నతో పాటు మరొకరిపై కేసు నమోదు చేశారు. చదవండి: చూస్తుండగానే రైతును నీళ్లల్లోకి లాక్కెళ్లిన మొసలి రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు హైడ్రామా