మిర్యాలగూడ అర్బన్: ఉల్లిపాయ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రైతు బజారుల్లో కిలో ఉల్లిగడ్డలు రూ.20 కే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైతు బజారులో కౌంటర్ ఏర్పాటు చేశారు. తక్కువ ధరలో ఉల్లిపాయలు అందుబాటులో ఉన్నాయని తెలిసిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో భారీ క్యూ ఏర్పడింది.
కుటుంబానికి కిలో చొప్పున ఇచ్చే ఉల్లిగడ్డల కోసం గంటల తరబడి క్యూలో ఎదురుచూపులు చూశారు. పట్టణంలో ఒకే కౌంటర్ ఏర్పాటు చేసిన అధికారులు జనం భారీగా వచ్చినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో స్థానికులు ముఖ్యంగా మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారు.
కిలో ఉల్లి కోసం గంటల నిరీక్షణ
Published Thu, Aug 6 2015 6:32 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement