వంట చేయం అనుకున్నంత ఈజీకాదు. భయపడినంత కష్టమూ కాదు. కాస్త స్మార్ట్‌గా ముందస్తు ప్రిపరేషన్ చేసుకుంటే చాలు. అన్నం వండాలా,చపాతీ చేయాలి అనేక ముందు నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి ఎలాంటి కూరలు చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. చపాతీ అయితే, పప్పు, లేదా మసాలా కూర చేసుకుంటే సరిపోతుంది. అదే అన్నం అయితే, పప్పు, కూర, పచ్చడి, సాంబారు లేదా చారు, ఇంకా వడియాలు అప్పడాలు ఇలా బోలెడంత తతంగం ఉంటుంది. అంతేకాదు వీటికి సరిపడా కూరగాయలు, ఉల్లిపాయలు కట్ చేయడం ఒక పెద్ద పని. అయితే ఎలాంటి పని అయినా, ఇబ్బంది లేకుండా కొన్ని చిట్కాలతో సులువుగా చేసుకోవచ్చు. అలాంటివి మచ్చుకు కొన్ని చూద్దాం.
చిట్కాలు
పచ్చిమిర్చి కట్ చేసినపుడు చేతులు మండకుండా ఉండాలంటే కత్తెరతో కట్ చేసు కోవాలి. చాకుతో కోసినపుడు చేతుల మండుతోంటే పంచదారతో చేతులను రుద్దుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయలను కట్ చేయాలంటే, వాటిని ముందు కొంచెం సేపు చల్లని నీటిలో ఉంచాలి.ఉల్లిపాయలు కట్ చేసిన అనంతరం చేతులు ఉల్లి వాసన రాకుండా ఉండాలంటే, నిమ్మరసం చేతులకు పట్టిస్తే ఉల్లి వాసన పోతుంది.
చపాతీగాని, పరోటాగాని, మెత్తగా ఉండాలంటే 1 స్పూన్ మైదా, ఒక స్పూన్ పెరుగుని గోధుమ పిండిలో వేసి తడిపితే మెత్తగా వస్తాయి.
చిటికెడు సోడా వేసి గోధుమ పిండిని తడపితే పూరి మెత్తగా, రుచిగా ఉంటుంది.
పచ్చకూరలు వండేటప్పుడు చిటికెడు సోడా వేసి వండితే చూడ్డానికి కంటికి మంచి ఇంపుగా కనబడ్డమే కాకుండా రుచిగా ఉంటాయి.పంచదార జార్‌లో రెండు లవంగాలు వేస్తే చీమల దరి చేరవు.
కోడిగుడ్లను ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా, ఉడికించిన వెంటనే వాటిని చన్నీళ్ళలో వేసినా పెంకు సులభంగా వస్తుంది టమోటా ఫ్రెష్‌గా ఉండాలంటే ఉప్పునీటిలో ఒక రాత్రంతా ఉంచితేచాలు.
ఒక్కోసారి గ్లాస్‌లు, స్టీల్ గిన్నెలు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయి భలే ఇబ్బంది పెడతాయి. ఆ సమయంలో కంగారుపడి, కిందికి మీదికి కొట్టకుండా, పై గ్లాసును చల్లటి నీటితో నింప్పి వేడి నీటిలో కాసేపు ఉంచితే ఇరుక్కున్న గ్లాసు ఈజీగా వచ్చేస్తుంది. శుభ్రమైన వాతావరణంలో శుభ్రం చేసుకున్న చేతులతో వంటను పూర్తి చేస్తే ఆరోగ్యానికి మంచిది.
ఇదీ చదవండి : విడాకుల తరువాత పిల్లలకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా?
Comments
Please login to add a commentAdd a comment