chapathi
-
డైట్ ప్లాన్‌లో ఉన్నారా : డిన్నర్ కోసం అదిరిపోయే పరాటా
పోషకాలు విరివిగా లభించే ఆకుకూరల్లో ముఖ్యమైంది సోయా ఆకు. దీన్నే దిల్ఆకులు, సోయా లేదా సావా కూర అని కూడా పిలుస్తారు. సోయా ఆకులలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, మాంగనీస్ పుష్కలంగా లభిస్తాయి. ఆకారంలో కొత్తిమీర లా, మొక్క సోంప్ మొక్కలాగా కనిపిస్తుంది. సువాసనకు ఇది పెట్టింది పేరు. సోయా ఆకుతోఅనేక రకాల వంటకాలను చేసుకోవచ్చు. ఈ రోజు సోయా, ఓట్స్ పరాటా ఎలా తయారు చేయాలో చూద్దాం.సోయాకూరలోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీవక్రియ నియంత్రలో ఉంటుంది. గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలకు సోయాకూర మంచిది. అలాగే గాయాలను వేగంగా నయం చేయడానికి సహాయ పడుతుంది. విటమిన్ ఏతో కంటిచూపును మెరుగుపడుతుంది.ఇందులోని కాల్షియం మన ఎముకలను దృఢంగా మారుస్తుంది. మాంగనీస్ నాడీ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేయంలో సహాయపడుతుంది. తద్వారా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.సోయా, ఓట్స్ పరాటాకావాల్సినవి :దిల్ ఆకులు : ఒక కప్పు ఓట్స్ : ఒక టేబుల్ స్పూన్ గోధుమపిండి : ఒక కప్పు నెయ్యి రెండు టీస్పూన్లునాలుగు పచ్చిమిర్చి జీలకర్ర పొడి, ధనియాలపొడి, ఉప్పు, ఉల్లిగడ్డ తరుగు : అర కప్పుతయారీ : గోధుమపిండిలో ఉప్పు వేసి, నీళ్లు పోసి మృదువుగా, మెత్తగా కలిపి పక్కన పెట్టాలి. శుభ్రంగా కడిగి, సోయా ఆకును తరిగి నేతిలో వేయించుకోవాలి. తరువాత ఉలిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి అందులో ఓట్స్ వేసి రెండు నిమిషాలు ఉంచి బాగా కలపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇపుడు ముందుగానే కలిపి ఉంచుకున్న చపాతీ పిండిలో, కావాల్సిన సైజులో చపాతీలా వత్తి, మధ్యలో సోయా ఆకులకూరను స్టఫ్చేసి పరాటాలాగ వత్తాలి. వీటిని పెనం మీద నెయ్యివేసి, సన్నని మంటమీద కాల్చుకుంటే, టేస్టీ , టేస్టీ సోయా, ఓట్స్ పరాటా రెడీ. దీన్ని ఇలాగే తినేయొచ్చు. లేదంటే మీకు పచ్చడిని కొద్దిగా అద్దుకోవచ్చు. -
కొంచెం స్మార్ట్‌గా..అదిరిపోయే వంటింటి చిట్కాలు
వంట చేయం అనుకున్నంత ఈజీకాదు. భయపడినంత కష్టమూ కాదు. కాస్త స్మార్ట్‌గా ముందస్తు ప్రిపరేషన్ చేసుకుంటే చాలు. అన్నం వండాలా,చపాతీ చేయాలి అనేక ముందు నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి ఎలాంటి కూరలు చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. చపాతీ అయితే, పప్పు, లేదా మసాలా కూర చేసుకుంటే సరిపోతుంది. అదే అన్నం అయితే, పప్పు, కూర, పచ్చడి, సాంబారు లేదా చారు, ఇంకా వడియాలు అప్పడాలు ఇలా బోలెడంత తతంగం ఉంటుంది. అంతేకాదు వీటికి సరిపడా కూరగాయలు, ఉల్లిపాయలు కట్ చేయడం ఒక పెద్ద పని. అయితే ఎలాంటి పని అయినా, ఇబ్బంది లేకుండా కొన్ని చిట్కాలతో సులువుగా చేసుకోవచ్చు. అలాంటివి మచ్చుకు కొన్ని చూద్దాం.చిట్కాలుపచ్చిమిర్చి కట్ చేసినపుడు చేతులు మండకుండా ఉండాలంటే కత్తెరతో కట్ చేసు కోవాలి. చాకుతో కోసినపుడు చేతుల మండుతోంటే పంచదారతో చేతులను రుద్దుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయలను కట్ చేయాలంటే, వాటిని ముందు కొంచెం సేపు చల్లని నీటిలో ఉంచాలి.ఉల్లిపాయలు కట్ చేసిన అనంతరం చేతులు ఉల్లి వాసన రాకుండా ఉండాలంటే, నిమ్మరసం చేతులకు పట్టిస్తే ఉల్లి వాసన పోతుంది.చపాతీగాని, పరోటాగాని, మెత్తగా ఉండాలంటే 1 స్పూన్ మైదా, ఒక స్పూన్ పెరుగుని గోధుమ పిండిలో వేసి తడిపితే మెత్తగా వస్తాయి.చిటికెడు సోడా వేసి గోధుమ పిండిని తడపితే పూరి మెత్తగా, రుచిగా ఉంటుంది. పచ్చకూరలు వండేటప్పుడు చిటికెడు సోడా వేసి వండితే చూడ్డానికి కంటికి మంచి ఇంపుగా కనబడ్డమే కాకుండా రుచిగా ఉంటాయి.పంచదార జార్లో రెండు లవంగాలు వేస్తే చీమల దరి చేరవు.కోడిగుడ్లను ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా, ఉడికించిన వెంటనే వాటిని చన్నీళ్ళలో వేసినా పెంకు సులభంగా వస్తుంది టమోటా ఫ్రెష్‌గా ఉండాలంటే ఉప్పునీటిలో ఒక రాత్రంతా ఉంచితేచాలు.ఒక్కోసారి గ్లాస్లు, స్టీల్ గిన్నెలు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయి భలే ఇబ్బంది పెడతాయి. ఆ సమయంలో కంగారుపడి, కిందికి మీదికి కొట్టకుండా, పై గ్లాసును చల్లటి నీటితో నింప్పి వేడి నీటిలో కాసేపు ఉంచితే ఇరుక్కున్న గ్లాసు ఈజీగా వచ్చేస్తుంది. శుభ్రమైన వాతావరణంలో శుభ్రం చేసుకున్న చేతులతో వంటను పూర్తి చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఇదీ చదవండి : విడాకుల తరువాత పిల్లలకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా? -
సొరకాయ చపాతీలు: ఇలా చేస్తే...ఆ టేస్ట్ వేరు!
పాలక్ చపాతీ, ఆలూ చపాతీ, మేతీ చపాతీ ఇలా చాలా రకాలుగా రుచికరమై చపాతీలను చేసుకోవచ్చు. కానీ చపాతీలు చేయాలంటే.. మెత్తగా వస్తాయో రావోనని చాలామందికి భయం. పిండి సరిగ్గా కలపకపోయినా, ఇంగ్రీడియంట్స్ సమ పాళ్లలో పడకపోయినా, చపాతీలు మన మాట వినవు. మరి సొరకాయ (లౌకీ, బాటిల్ గార్డ్, ఆనపకాయ) చపాతీ ఎపుడైనా ట్రై చేశారా? మెత్తగా దూదుల్లాంటి సొరకాయ చపాతీ ఎలా చేయాలో చూద్దాం. కావలసినవి: సొరకాయ తురుము – రెండు కప్పులు; పచ్చిమిర్చి తరుగు–టీ స్పూన్, గోధుమపిండి – రెండున్నర కప్పులు, గరం మసాలా – అర టీ స్పూన్ ; ఉప్పు – చిటికెడు; ఇంగువ– చిటికెడు, నూనె – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ: ∙వెడల్పుగా ఉన్న పాత్రలో గోధుమపిండి, సొరకాయ తురుము, తరిగిన పచ్చిమిర్చి, గరం మసాలా పొడి, ఉప్పు, ఇంగువ వేసి కలపాలి. మొదట తేమ సరిపోదనిపించినప్పటికీ సొరకాయలో నీరు వదిలేకొద్దీ సరిపోతుంది. పది నిమిషాల సేపు పక్కన ఉంచితే నీరు బయటకు వస్తుంది. నీరు వదిలిన తర్వాత పిండిని కలిపి చూసుకుని అప్పటికీ పొడిగా అనిపిస్తే కొద్దిగా నీటిని చిలకరించుకుని మిశ్రమం మొత్తాన్ని చపాతీ పిండిలా చేసుకుని వస్త్రాన్ని కప్పి పావు గంట సేపు పక్కన ఉంచాలి. పిండిని పెద్ద నిమ్మకాయంత గోళీలు చేసుకుని చ΄ాతీల్లా వత్తుకుని పెనం వేడి చేసి నూనె వేస్తూ చపాతీని రెండు వైపులా కాల్చాలి. గమనిక: చపాతీ వత్తేటప్పుడు పిండి జారుడుగా ఉన్నట్లనిపిస్తే పొడి పిండి చల్లుకుని బాగా కలిసే వరకు మర్దనా చేసి అప్పుడు చపాతీ చేసుకోవాలి. సొరకాయ చపాతీ సాధారణ గోధుమ పిండి చపాతీలా సమంగా ఒకే మందంలో రావడం కష్టం. మరీ పలుచగా కూడా వత్తకూడదు. కొంచెం మందంగానే ఉండాలి. వేడిగా తింటే మృదువుగా, రుచిగా ఉంటాయి. వేసవిలో చపాతీలు తింటే వేడి చేస్తుందని భయపడేవాళ్లు సొరకాయ చపాతీ ప్రయత్నించవచ్చు. ఈ చపాతీలను మనకు నచ్చిన కూర, చట్నీతోగానీ, లేదంటే వేసవి కాలం చల్లని పెరుగుతో తిన్న బావుంటుంది. -
భారత్, అమెరికా సంబంధాలు.. చపాతి, పూరీలతో పోలిక
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలపై అమెరికా ఉన్నతాధికారి జెఫ్రీ ఆర్ ప్యాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు చపాతీలా చదునుగా లేవని పూరీలా పొంగి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయన్నారు. ఇంధనం, భద్రత అంశాల పరంగా భారత్‌తో తమకున్న సంబంధాలు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనవని చెప్పారు. అయితే భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై (ఎఫ్‌టీఏ)పై ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరో దశకు తీసుకెళ్లడంపైనే దృష్టిపెట్టినట్లు తెలిపారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రెండు దేశాల మధ్య మంచి సంబంధాలున్నట్లు తెలిపారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌కు చెందిన గ్రీన్ కో కంపెనీతో చర్చలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. హౌతీల దాడులతో అంతర్జాతీయ సముద్ర రవాణా సమస్యలు ఎదుర్కొంటోందన్నారు. హౌతీల దాడికి గురైన నౌకలను కాపాడేందుకు భారత నేవీ చేసిన కృషి గొప్పదని, ఇది భారత సామరర్థ్యాన్ని తెలియజేస్తోందని కొనియాడారు. #WATCH | On Foreign Trade Agreements between US and India, US Secretary of State for Energy Resources Geoffrey R. Pyatt says, "Nobody today characterises their trade relationship as flat as a 'chapati'. It has become big and puffed up like a big 'puri'... I think we are not… pic.twitter.com/Gf5Tw7o8Ee — ANI (@ANI) February 5, 2024 ఇదీ.. చదవండి.. వెనక్కు తగ్గని హౌతీలు -
చదువు మాని.. చపాతీల తయారీ.. గురుకులంలో విద్యార్థుల వంటావార్పు
చేర్యాల(సిద్దిపేట): వసతి గృహంలో హాయిగా చదువుకోవలసిన విద్యార్థులు వంట పనివారిగా మారి చపాతీలు తయారు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని గురుకుల పాఠశాలలో ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం ఉదయం అల్పాహారంలో చపాతీలు అందించాల్సి ఉంటుంది. కానీ వాటి తయారీకి సరిపడా మనుషులు లేకపోవడంతో విద్యార్థులతో చేయించారు. ప్రిన్సిపాల్ సహకారంతోనే కాంట్రాక్టర్ ఇలా పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గురుకుల ప్రిన్సిపాల్ అశోక్‌బాబు వద్ద ప్రస్తావించగా.. తమకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి ఉందని స్పష్టం చేశారు. అందువల్లే విద్యార్థులతో వంట పని చేయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
ఎంతో టేస్టీగా ఉండే మిల్లీ మేకర్ రోల్స్ చేసుకోండి ఇలా!
మీల్ మేకర్ రోల్స్ కావలసినవి: చపాతీలు– 5 (గోధుమ పిండిలో తగినన్ని నీళ్లు పోసుకుని చపాతీలు చేసుకుని, వేయించి పక్కన పెట్టుకోవాలి) మీల్ మేకర్ – 2 కప్పులు (ముందుగా వేడినీళ్లలో వేసుకుని కాసేపు ఉంచి.. నీళ్లు వాడిన వెంటనే కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 నిమిషం పాటు అటూ ఇటూగా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి) క్యాప్సికమ్, టొమాటో– 2 చొప్పున (ముక్కలు కట్ చేసుకోవాలి) ఉల్లిపాయలు– 2 (సగం గార్నిష్‌కి), పచ్చిమిర్చి– 4 (చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి) బ్రెడ్ పౌడర్, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, మిరియాల పొడి, జీలకర్ర పొడి – అర టీ స్పూన్ చొప్పున, పసుపు – చిటికెడు, టొమాటో కెచప్ – 1 టీ స్పూన్ ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ముందుగా నూనెలో సగం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కాసేపు వేగించి.. అందులో పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, మీల్ మేకర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుని కూరలా దగ్గరపడే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత బ్రెడ్ పౌడర్, మొక్కజొన్న పిండి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, టొమాటో కెచప్ వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా కాల్చిన చపాతీలలో.. ఓవైపు ఈ కర్రీ వేసుకుని రోల్స్‌లా చుట్టుకోవాలి. మిగిలిన ఉల్లిపాయ ముక్కలతో వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. (చదవండి: వడలు పులుసుపోకుండా ఉండాలంటే ఇలా చేయండి!) -
వీడియో వైరల్ చిట్టి చేతులతో చపాతీ చేస్తున్న చిన్నారి
-
Health Tips: రాత్రి భోజనంలో ఇవి తిన్నారంటే...
డిన్నర్లో ఏం తింటామో వాటిపై మన రాత్రి నిద్ర ఆధారపడి ఉంటుంది. చాలామంది రకరకాల ఫుడ్స్ తిని అర్ధరాత్రి నిద్రపట్టక ఇబ్బందిపడుతుంటారు. జీర్ణక్రియకు భంగం కలిగించే ఆహారాన్ని తింటే ఉదయాన్నే పొట్టను క్లియర్ చేయడంలో సమస్య ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. తొంభైశాతం సరైన ఆహారం ఎంచుకోకపోవడం వల్ల రాత్రి నిద్ర పాడవుతుంది. అయితే రాత్రి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. మీ విందు చాలా తేలికగా, జీర్ణమయ్యేలా ఉండాలి. అంటే రాత్రి భోజనం చేసిన తర్వాత కడుపు లో భారం గా ఉండకూడదు. డిన్నర్లో తినే ఆహార పదార్థాలు గ్యాస్ ఉత్పత్తి చేయకూడదు. ఎందుకంటే ఇది నిద్రిస్తున్నప్పుడు కడుపు నొప్పికి కారణమవుతుంది. అంతేకాదు నిద్రలేమికి కూడా కారణం అవుతుంది. డిన్నర్ చాలా కారంగా కూడా ఉండకూడదు. ఇది డీహైడ్రేషన్ సమస్యని సృష్టిస్తుంది. రాత్రి తరచుగా దాహం ఉండవచ్చు. రాత్రి భోజనంలో తేలికపాటి సుగంధ ద్రవ్యాలు, ఆవుపాలతో తయారు చేసిన దేశీ నెయ్యిని ఉపయోగించాలి. ఓట్స్ లేదా శనగ పిండితో చేసిన ఆహారాలని ఉపయోగించవచ్చు. పప్పు, చపాతీ అన్ని విధాలా బాగుంటుంది. అలాగే బ్రోకలీ, కొబ్బరి, పుదీనా ఉపయోగించిన వంటకాలు సులభంగా జీర్ణమవుతాయి. చదవండి: Health Tips: నిద్ర లేచిన వెంటనే కాఫీలు, టీలు.. కుకీలు, బిస్కట్లు అస్సలు వద్దు! ఇవి తింటే మేలు! -
చపాతీలు కోసం చంపేశారు..!
జైపూర్: చాలా చాలా చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యల వరకు వెళ్లిపోవడం చూశాం. కానీ ఈ మధ్యకాలంలో మరీచిన్న చిన్న సమస్యలకే హత్యలు చేయడం, నరుక్కోవడం వరకు వెళ్లిపోతున్నారు. అంతేకాదు ఆ క్షణికావేశంతో జీవితాలను నాశనం చేసుకుని జైలు గోడలకు అంకితమవుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే జైపూర్‌లో చోటు చేసుకుంది. (చదవండి: నువ్వా!...నేనా.. అంటూ ఒక ఆట ఆడించిన సింహం!) అసలు విషయంలోకెళ్లితే...ఆల్వార్ నివాసితులైన సంతోష్ మీనా (45), లీలా రామ్ మీనా (36), గంగా లహేరి (35), జై ప్రకాశ్ నారాయణ(27) విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పని చేస్తున్నారు. అంతేకాదు వారంతా ఐస్ ఫ్యాక్టరీకి సమీపంలో ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. అయితే చపాతీలు తయారు చేసే వంట విషయంలో వాళ్ల నలుగురి మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. అయితే వారితో జై ప్రకాశ్‌నారాయణ్ అనే వ్యక్తి తాను ఇతరుల కోసం చపాతీలను చేయను అని చెప్పడమే కాక ఆ ముగ్గురి పై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆ ముగ్గురు ఆవేశంతో జైప్రకాశ్ నారాయణని చంపేయాలని నిర్ణయించుకుంటారు. అంతేకాదు అనుకున్నదే తడువుగా జై నారాయణ్ వాష్‌రూమ్‌కి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించి గొంతుకోసి చంపేశారు. ఆ తర్వాత ఆ ముగ్గురు బాధితుడిని వదిలి వెళ్లిపోయారు. ఈ మేరకు జైపూర్ పోలీసుల ఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి విచారించడమే కాక ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఆ వైరస్‌ని చూసి భయపడుతూ.. తిట్టుకుంటూ కూర్చోవద్దు!!) -
హుజురాబాద్ ఉప ఎన్నిక: వజ్రం, రోటీమేకర్, నోటాకు భారీగానే ఓట్లు
సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నిక ఫలితాల్లో నోటాకు 1,036 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో 2,867 ఓట్లు వచ్చాయి. అప్పుడు బీజేపీ అభ్యర్థి పుప్పాల రఘుకు 1,683 ఓట్లు వచ్చాయి. అప్పుడు నోటా కంటే తక్కువగా ఉన్న బీజేపీ ఇప్పుడు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది. చదవండి: కాంగ్రెస్‌లో కాక రేపుతున్న ‘హుజురాబాద్’ ఫలితం వజ్రం: ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కంటె సాయన్న 1,942 ఓట్లు సాధించి మూడు ప్రధాన పార్టీల తర్వాత నాలుగో స్థానంలో నిలిచారు. రోటీమేకర్: ప్రజా ఏక్తా పార్టీ నుంచి పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్ 1,913తో ఐదోస్థానం సంపాదించారు. ఉంగరం: స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బుట్టెంగారి మాధవరెడ్డి కేవలం 36 ఓట్లతో అందరి కంటే ఆఖరు స్థానంలో నిలిచారు. చదవండి: హుజురాబాద్ ఫలితాలు: వెక్కి వెక్కి ఏడ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు? పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ హవా.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగింది. 777 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గాను, 455 ఓట్లు టీఆర్ఎస్కు, 242 ఓట్లు బీజేపీకి, కాంగ్రెస్‌కు 2 పోల్ కాగా.. 48 ఓట్లు చెల్లలేదు. -
చపాతీలు చల్లగా ఉన్నాయని డాబా యజమానిని కాల్చేశాడు
లక్నో : చపాతీల విషయంలో చోటు చేసుకున్న గొడవ ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. చల్లని చపాతీలు తినడానికి ఇచ్చాడన్న కోపంతో ఓ డాబా యజమానిని తుపాకితో కాల్చాడో వ్యక్తి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమిత్ చౌహాన్, కసుస్తాబ్ సింగ్ అనే ఇద్దరు యువకులు గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఓ డాబా దగ్గరకు వెళ్లారు. చపాతీలను ఆర్డర్ చేశారు. డాబాను మూయటానికి సిద్ధంగా ఉన్న దాని యజమాని మిగిలి ఉన్న చపాతీలను వారికి పెట్టాడు. అయితే చపాతీలు చల్లగా ఉన్నాయంటూ వారు అతడితో గొడవపడ్డారు. ( టాయిలెట్ గోడలపై నంబర్.. అసభ్య కాల్స్! ) ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన కసుస్తాబ్ సింగ్ జేబులోని తుపాకి తీసి డాబా యజమానిని కాల్చేశాడు. బుల్లెట్ కుడి తొడలోకి దూసుకుపోయింది. దీంతో అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు బుల్లెట్‌ను బయటకు తీశారు. అతడికి ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. -
అమ్మమ్మాస్ చపాతీ రూ. 7
హైదరాబాద్: రెడీ టు కుక్ ఫుడ్ విభాగంలోకి హైదరాబాద్‌కు చెందిన మంగమ్మ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎఫ్‌పిఎల్)ప్రవేశించింది. ‘అమ్మమ్మాస్’ బ్రాండ్ పేరుతో చపాతీ, పూరీ, పరోటా శ్రేణిలో పలు రుచులను పరిచయం చేసింది. రెడీ-టు-కుక్ విభాగంలో ఈ స్టార్టప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి వేగంగా వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తమ ఉత్పత్తులకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ధ్రువీకరణ ఉందని మంగమ్మ ఫుడ్స్ కో–ఫౌండర్ నాగసాయి విశ్వనాథ్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రొడక్టులు ఏడు రోజులపాటు మన్నికగా ఉంటాయని వివరించారు. మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో రెడీ టు కుక్ ప్రొడక్టుల ఉత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటికే టెస్ట్ మార్కెట్లో 30,000 పైగా కుటుంబాలకు చేరువయ్యామని చెప్పారు. ఔత్సాహికులు ఎవరైనా రూ.2,500ల పెట్టుబడితో తమ కంపెనీ ఉత్పత్తుల విక్రయం చేపట్టవచ్చని వివరించారు. తాజా, అధిక పోషకాహార విలువ కలిగిన ఆహార పదార్థాలే తమ ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది. అమ్మమ్మాస్ బ్రాండ్ పేరుతో 'చపాతీ' (రాగి, మెంతీ, మల్టీ గ్రెయిన్,మోరింగ చపాతి) ' పరోటా '' లను వినియోగదారులకు అందించనుంది. ఒక్కో చపాతీ ధర రూ .7 గా విక్రయిస్తుంది. రోజుకు లక్ష చపాతీలు: మంగమ్మ ఫుడ్స్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో రూ.25 లక్షలతో తయారీ కేంద్రం ఏర్పాటు చేసింది. రోజుకు 40,000 యూనిట్లు తయారు చేయగల సామర్థ్యం ఉందని కో–ఫౌండర్ ప్రతిమ విశ్వనాథ్ వెల్లడించారు. ‘2020 మార్చికల్లా దీనిని ఒక లక్ష యూనిట్ల స్థాయికి తీసుకు వెళతాం. జనవరి నాటికి రెడీ టు కుక్ కర్రీస్, రెడీ టు ఈట్ స్నాక్స్ విభాగంలోకి ప్రవేశిస్తాం. ప్రస్తుతం విక్రయిస్తున్న ప్యాక్‌ల ఖరీదు రకాన్నిబట్టి రూ.45–70 మధ్య ఉంది. ఒక్కో ప్యాక్‌లో 10 చపాతీలుఉంటాయ’ అని వివరించారు. శ్రామిక మహిళలు, సీనియర్ సిటిజన్లు తమ ఆహార అవసరాలకు, ఆరోగ్యకరమైన కానీ రడీ టూ కుక్ ఫుడ్, స్నాక్స్ కోసం ఎదురుచూస్తున్నారని, ఈ క్రమంలో వైవిధ్యంగా వారి ఆహార అవసరాలకు తోడ్పడటమే తమ లక్ష్యమని సహ వ్యవస్థకురాలు ప్రతిమ విశ్వనాథ్ తెలిపారు. కాగా నాగసాయి విశ్వనాథ్ ఘనాలోని టెలికాం సంస్థ గ్లోబాకామ్‌కు బిజినెస్ హెడ్‌గా పనిచేశారు. అలాగే కోకాకోలా, సాబ్-మిల్లెర్, మారికో ఇండస్ట్రీస్ , పార్లే బిస్కెట్స్ సహా వివిధ సంస్థలతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. -
చలితిళ్లు
ఈ సీజన్లో దవడపళ్లపై లోడ్ ఎక్కువ! చలికి పళ్లు పటపట కొట్టుకుంటుంటాయి. ఆకలికి... పిండిమరలా ఆడుతుంటాయి. పళ్లు పటపటలాడినా, పిండిమరలా ఆడినా... కాస్త వెచ్చదనం కోసమే! షాళ్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్‌లు, స్వెటర్లు... ఇవన్నీ... బయటి వెచ్చదనాలు. మరి లోపలి బాడీకి? అసలే అలవికాని కాలం, ఆవురావురు కాలం. బెల్లీ మాటిమాటికీ బెల్ కొడుతుంది. ఏదో ఒకటి పడేయ్ బాస్ అంటుంది. ఈ వేడుకోలంతా ఉష్ణోగ్రత కోసమే. అలాగని ఏది పడితే అది పడేస్తే లావైపోతాం! కడుపునిండా లాగిస్తే కదల్లేకపోతాం! మరేది సుఖం? మరేది శ్రేష్ఠం? మరేది ఉష్ణం? ఓసారి ఈ పేజ్ చూడండి. మీకు నచ్చిన ఐటమ్‌కి టిక్ పెట్టుకోండి. ఇవి చిరుతిళ్లు మాత్రమే కాదు, చలితిళ్లు కూడా! రవ్వ ఊతప్పం కావలసినవి: బొంబాయిరవ్వ - కప్పు, పెరుగు - కప్పు, ఉల్లితరుగు - అర కప్పు, టొమాటో తరుగు - అర కప్పు, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి తరుగు - రెండు టేబుల్ స్పూన్లు, అల్లం తురుము - టీ స్పూను, కొత్తిమీర తరుగు - కొద్దిగా, నూనె - తగినంత తయారి: ఒక గిన్నెలో బొంబాయిరవ్వ, పెరుగు, ఉప్పు వేసి కలపాలి ఉల్లితరుగు, టొమాటో తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం తురుము జత చేసి బాగా కలిపి సుమారు రెండు గంటలు నాననివ్వాలి స్టౌ మీద పెనం ఉంచి కాగాక, నానబెట్టుకున్న పిండిని గరిటెడు తీసుకుని, పెనం మీద మందంగా వేసి, చుట్టూ నూనె వేసి మూత ఉంచాలి ఎర్రగా కాలాక రెండవవైపు తిప్పి కాల్చి తీసేయాలి. చలైటీగా... ఇంట్లో పెద్దవాళ్లు ఎవ్వరూ లేరు. కడుపులో నకనకలాడుతోంది. మరి ఏం చేయాలి? మరమరాలు/ అటుకులు, ఉల్లిపాయ ఉంటే చాలు... ఒక గిన్నెలో అటుకులు లేదా మరమరాలు/ అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి బాగా కలపండి. నిమ్మకాయ పిండండి. ఇవేవీ లేకుంటే మరో పని చేయవచ్చు. అటుకులకు లేదా మరమరాలకు ఆవకాయనో, గోంగూర పచ్చడినో జత చేసి బాగా కలపండి. అంతే మీరు చేసిన, మీకు నచ్చిన సరదా సరదా చిరుతిండి ఈ చలికాలంలో కారకారంగా రెడీ అయినట్లే. ధేబ్రా కావలసినవి: కార్న్‌ఫ్లోర్ - కప్పు, జొన్నపిండి - అర కప్పు, గోధుమపిండి - అర కప్పు, కసూరీమేథీ - 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు, నువ్వులు - టేబుల్ స్పూను, వాము - టీ స్పూను, బెల్లం - టీ స్పూను, ఉప్పు - తగినంత, పసుపు - పావు టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, పెరుగు - 3 టేబుల్ స్పూన్లు, నీరు - కొద్దిగా, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారి: ఒక పాత్రలో నూనె, నీరు, పెరుగు మినహా అన్ని పదార్థాలను వేసి బాగా కలపాలి పెరుగు జత చేసి చపాతీ పిండిలా కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి పాలిథిన్ కవర్ మీద కొద్దిగా నూనె రాసి ఒక్కో ఉండను దాని మీద ఉంచి, చెక్కవడల మాదిరిగా చేతితో అద్దాలి స్టౌ మీద బాణలి ఉంచి అందులో నూనె పోసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న ఒక్కో ధేబ్రా (గుజరాతీ వంటకం) ను వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీయాలి ఇవి సుమారు నెలరోజుల వరకు నిల్వ ఉంటాయి. మిక్స్డ్ వెజిటబుల్ రవ్వ పకోడీ కావలసినవి: బొంబాయిరవ్వ - కప్పు, బియ్యప్పిండి - టేబుల్ స్పూను, కూరముక్కల తురుము - 2 కప్పులు (రెడ్‌క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారట్, ఉల్లిపాయ... వీటిని సన్నగా తరగాలి), పెరుగు - అర కప్పు, అల్లం + వెల్లుల్లి + కొత్తిమీర పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - అర టీ స్పూను, నూనె - వేయించడానికి తగినంత తయారి: ఒక పాత్రలో కూరల తురుము, పెరుగు, బొంబాయిరవ్వ, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, కలిపి ఉంచుకున్న పిండిని పకోడీలుగా వేసి వేయించాలి బాగా వేగాక పకోడీలను పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి వేడివేడిగా సర్వ్ చేయాలి. సాబూదాన్ క్యారట్ పాయసం కావలసినవి: సగ్గుబియ్యం (సాబూదాన్) - అరకప్పు, పాలు - ఏడు కప్పులు, పంచదార - 2 కప్పులు, క్యారట్ తురుము - కప్పు, బాదంపప్పులు - పావు కప్పు (దోరగా వేయించి పొడి చేయాలి), ఏలకుల పొడి - టీస్పూను, కుంకుమపువ్వు - చిటికెడు, నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు, కిస్మిస్ - గార్నిషింగ్‌కి సరిపడా తయారి: సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి కప్పు నీటిలో సుమారు అరగంటసేపు నాననివ్వాలి పాలను మరిగించాలి సగ్గుబియ్యంలో తగినంత నీరు పోసి ఉడికించి ఎక్కువగా ఉన్న నీటిని ఒంపేయాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక, క్యారట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి తీసేయాలి అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్లు వేయించి తీసేయాలి ఒక చిన్న పాత్రలో టీ స్పూను పాలు, కుంకుమపువ్వు వేసి కలపాలి మరుగుతున్న పాలలో ఉడికించిన సగ్గుబియ్యం, వేయించి ఉంచుకున్న క్యారట్ తురుము, ఏలకులపొడి, కుంకుమపువ్వు పాలు వేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉంచాలి వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు వేసి కలిపి దించేయాలి. చిలగడదుంప పూరీ కావలసినవి: చిలగడదుంపలు - పావు కిలో (ఉడికించి తొక్క తీసి బాగా మెదపాలి), బెల్లంతురుము - పావు కప్పు, గోధుమపిండి - కప్పు, ఉప్పు - తగినంత, ఏలకుల పొడి - టీ స్పూను, నీరు - పిండి కలపడానికి తగినంత. తయారి: ఒక గిన్నెలో కొద్దిగా నీరు, బెల్లంతురుము వేసి గరిటెతో కలిపి, కరిగించి, వడకట్టాలి అదే పాత్రలో మెత్తగా చేసిన చిలగడదుంప పేస్ట్, ఏలకులపొడి, గోధుమపిండి వేసి బాగా కలపాలి తగినంత నీరు జత చేసి పూరీ పిండి మాదిరిగా కలిపి అరగంట పాటు పక్కన ఉంచాలి పిండిని చిన్న ఉండలుగా చేసి పూరీలు ఒత్తుకోవాలి బాణలిలో తగినంత నూనె పోసి కాగాక, ఒక్కో పూరీ వేసి వేయించి తీసేయాలి. దహీ బ్రెడ్ కావలసినవి: బ్రెడ్ స్లైస్‌లు - 8, పెరుగు - 2 కప్పులు, పచ్చిమిర్చి + కొత్తిమీర పేస్ట్ - టీ స్పూను, ఉప్పు - తగినంత, అల్లంతురుము - అర టీ స్పూను, ఖర్జూరం + చింతపండు చట్నీ - రెండు టీ స్పూన్లు తయారి: స్టౌ మీద పెనం ఉంచి కాలాక, బ్రెడ్‌స్లైసులు వేసి బటర్ జత చేసి రెండువైపులా దోరగా కాల్చి తీసేయాలి మిక్సీలో పెరుగు, పచ్చిమిర్చి+కొత్తిమీర పేస్ట్, ఉప్పు, అల్లం తురుము వేసి మిక్స్ చేయాలి బ్రెడ్‌ను త్రికోణాకారంలో కట్ చేసి, ప్లేట్లో ఉంచి, వాటి మీద మసాలా పెరుగు వేయాలి పైన ఖర్జూరం పచ్చడితో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి. రవ్వ వేఫిల్స్ కావలసినవి: బొంబాయిరవ్వ - కప్పు, గోధుమపిండి - అర కప్పు, పెరుగు - పావు కప్పు, క్యారట్ తురుము - 2 టేబుల్ స్పూన్లు, ఉల్లితరుగు - 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి తరుగు - టేబుల్ స్పూను, జీలకర్ర - టీ స్పూను, ఇంగువ - చిటికెడు, ఈనో సాల్ట్ లేదా బేకింగ్ సోడా - టీ స్పూను, నీరు - పిండి కలపడానికి తగినంత, నూనె - టీ స్పూను తయారి: నీరు, బేకింగ్ సోడా మినహాయించి మిగిలిన పదార్థాలను ఒక పాత్రలో వేసి బాగా కలపాలి మిగతా పదార్థాలను జత చేసి మరోమారు కలపాలి నీరు కొద్దికొద్దిగా జత చేస్తూ మిశ్రమాన్ని గట్టిగా ఉండేలా కలపాలి వేఫిల్ ఐరన్‌ను ముందుగా వేడి చేసి పైన కొద్దిగా నూనె వేయాలి పిండిని తగినంత తీసుకుని వేఫిల్ మీద వేసి మూత బిగించాలి ఇండికేటర్ ఆకుపచ్చ రంగులోకి వచ్చిన తరువాత దించేయాలి చట్నీతో సర్వ్ చేయాలి. సేకరణ: డా. వైజయంతి -
అమ్మ క్యాంటిన్లో చపాతి
తక్కువ ధరకే టిఫిన్, భోజనాల అమ్మకాలతో ఆకట్టుకున్న అమ్మ క్యాంటిన్లో త్వరలో చపాతీ ప్రవేశించనుంది. రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి (జీహెచ్)లో వినియోగదారుల సౌకర్యార్థం చపాతీ సేవలు వినియోగంలోకి రానున్నాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి: పేద, బడుగు తరగతి ప్రజలకు చేరువకావడమే లక్ష్యంగా సాగుతున్న అమ్మ పాలనలో అనేక పథకాలు అమలులోకి వచ్చాయి. వీటిల్లో అమ్మ క్యాంటిన్ల పథకం ఎంతో ఆకట్టుకుంది. ఒక్క రూపాయికే ఇడ్లీ, మూడు రూపాయలకు సాంబార్ అన్నం, పెరుగన్నం అందిస్తున్నారు. నగరంలోని 200 వార్డుల్లోనూ అమ్మక్యాంటిన్లు వెలిశాయి. వైద్య చికిత్సల కోసం రాష్ట్రం నలుమూలల నుంచేకాక, పొరుగురాష్ట్రాల నుంచి వచ్చేరోగులతో కిటకిటలాడే జీహెచ్‌లో సైతం అమ్మ క్యాంటిన్ వెలిసింది. గత నెల 20వ తేదీన సీఎం జయలలిత ప్రారంభించారు. జీహెచ్‌లోని రోగులు, వారి బంధువులు, ఆస్పత్రి సిబ్బంది, ఆటో కార్మికులకు అమ్మ క్యాంటిన్ వసతిగా మారింది. గత 15 రోజుల్లో 75 వేల ఇడ్లీ, 13 వేల పొంగల్, 13 వేల సాంబారన్నం, 8 వేల పెరుగున్నం అమ్మకాలు సాగాయి. రోజూ పెద్ద సంఖ్యలో క్యూ కట్టడంతో పోలీసు బందోబస్తు అనివార్యమైంది. ప్రస్తుతం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం మాత్రమే అందుతోంది. రాత్రి వేళల్లో అందుబాటులో హోటళ్లులేనందున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా త్వరలో రాత్రి వేళల్లో కేవలం రూ3లకు చపాతి, దాల్, కుర్మా అమ్మకాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జీహెచ్ క్యాంటిన్లో ఏర్పాట్లు ప్రారంభమైనాయి. మరో పదిరోజుల్లో చపాతీ అమ్మకాలను ప్రారంభించే అవకాశం ఉందని చెన్నై కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి.