
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాబా యజమాని
లక్నో : చపాతీల విషయంలో చోటు చేసుకున్న గొడవ ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. చల్లని చపాతీలు తినడానికి ఇచ్చాడన్న కోపంతో ఓ డాబా యజమానిని తుపాకితో కాల్చాడో వ్యక్తి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమిత్ చౌహాన్, కసుస్తాబ్ సింగ్ అనే ఇద్దరు యువకులు గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఓ డాబా దగ్గరకు వెళ్లారు. చపాతీలను ఆర్డర్ చేశారు. డాబాను మూయటానికి సిద్ధంగా ఉన్న దాని యజమాని మిగిలి ఉన్న చపాతీలను వారికి పెట్టాడు. అయితే చపాతీలు చల్లగా ఉన్నాయంటూ వారు అతడితో గొడవపడ్డారు. ( టాయిలెట్ గోడలపై నంబర్.. అసభ్య కాల్స్! )
ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన కసుస్తాబ్ సింగ్ జేబులోని తుపాకి తీసి డాబా యజమానిని కాల్చేశాడు. బుల్లెట్ కుడి తొడలోకి దూసుకుపోయింది. దీంతో అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు బుల్లెట్‌ను బయటకు తీశారు. అతడికి ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment