వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలపై అమెరికా ఉన్నతాధికారి జెఫ్రీ ఆర్ ప్యాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు చపాతీలా చదునుగా లేవని పూరీలా పొంగి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయన్నారు.
ఇంధనం, భద్రత అంశాల పరంగా భారత్‌తో తమకున్న సంబంధాలు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనవని చెప్పారు. అయితే భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై (ఎఫ్‌టీఏ)పై ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరో దశకు తీసుకెళ్లడంపైనే దృష్టిపెట్టినట్లు తెలిపారు.
రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రెండు దేశాల మధ్య మంచి సంబంధాలున్నట్లు తెలిపారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌కు చెందిన గ్రీన్ కో కంపెనీతో చర్చలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. హౌతీల దాడులతో అంతర్జాతీయ సముద్ర రవాణా సమస్యలు ఎదుర్కొంటోందన్నారు. హౌతీల దాడికి గురైన నౌకలను కాపాడేందుకు భారత నేవీ చేసిన కృషి గొప్పదని, ఇది భారత సామరర్థ్యాన్ని తెలియజేస్తోందని కొనియాడారు.
#WATCH | On Foreign Trade Agreements between US and India, US Secretary of State for Energy Resources Geoffrey R. Pyatt says, "Nobody today characterises their trade relationship as flat as a 'chapati'. It has become big and puffed up like a big 'puri'... I think we are not… pic.twitter.com/Gf5Tw7o8Ee
— ANI (@ANI) February 5, 2024
Comments
Please login to add a commentAdd a comment