Puri
-
విలన్‌గా తాతయ్య... హీరోగా మనవడి ఎంట్రీ.. అది కూడా ఏకంగా టాలీవుడ్లో! (ఫొటోలు)
-
పూరి జగన్నాథుడిని గణనాథుడిగా ఆరాధిస్తారని తెలుసా..!
భారతదేశంలో అత్యం ప్రసిద్ధి గాంచిన పూరీ క్షేత్రంలో జగన్నాథుడిని, బలభద్రుడిని ఏకదంతుడి రూపంలో ముస్తాబు చేసి మరీ పూజలు చేస్తారు. ఈ వేడుకనే ‘హాథీబేష’ (ఏనుగు వేషం) అని పిలుస్తారు. ఇలా ఆషాడ మాసంలో గణపతి రూపంలో ముస్తాబు చేసి మరీ జగన్నాథుడిని పూజిస్తారు. ఈ వేడు జేష్ట పౌర్ణమి రోజున జరగుతుంది. ఇలా పూరీ జగన్నాథుడుని పూజించడానికి కారణం ఉందంటూ.. మంచి ఆసక్తికర గాథ ఒకటి చెబుతుంటారు పండితలు. అదేంటంటే..పూర్వం రోజులలో పూరి రాజు దగ్గరికి గణపతి భక్తుడు అయిన గణపతి బప్ప అనే పండితుడు వచ్చాడు. ఆ సమయంలో పూరిలో జగన్నాథుడిని స్నాన యాత్ర వేడుకకు సిద్ధం చేస్తున్నారు. ఆ వేడుకలో పాల్గొనవల్సిందిగా గణపతి బట్టను రాజు ఆహ్వానిస్తాడు.దానికి ఆయన తాను గణపతిని మాత్రమే పూజిస్తానని, ఆయన తనకు అన్నీ అని చెబుతాడు. అయితే రాజు ఒత్తిడి చేయడంతో అయిష్టపూర్వకంగానే జగన్నాధుడి స్నాన యాత్రకు గణపతి బప్ప రావడం జరగుతుంది. అయితే అక్కడికి వెళ్లేసరికి ఊహకే అందని లీలా వినోదం సృష్టిస్తాడు ఆ దేవాదిదేవుడు జగన్నాథుడు. ఆ పూరీ క్షేతంలోని జగన్నాథుడు, పండితుడి గణపతి బప్ప కంటికి ఏకదంతుడి రూపంలో రూపంలో కనిపిస్తాడు. ఇదేంటి జగన్నాథుడు గణనాథుని రూపంలో కనిపించడం ఏంటని ఆశ్చర్యపోతాడు. ఇది కల మాయా అని గందరగోళానకి లోనవ్వుతాడు. విచిత్రంగా బలభద్రుడు కూడా ఏకందంతుడి రూపంల కనిపించడంతో మరంత విస్తుపోతాడు. అప్పుడు గణపతి బప్పకి తన అజ్ఞానానికి కన్నీరుమున్నీరుగా విలపిస్తాడు. తనకు బుద్ధి చెప్పాలనే ఆ చిలిపి కృష్ణుడు ఇలాంటి మాయ చేశాడని గ్రహిస్తాడు. భగవంతుడు ఏ రూపంలో ఉన్న పరమాత్మ అనేది ఒక్కటే అనే విషయం తెలుసుకుంటాడు. ఆనాటి నుంచే పూరి జనన్నాథుని రథయాత్రకు ముందు అనగా జేష్ట పౌర్ణమి రోజు జరిపే స్నాన యాత్ర సమయంలో ఆలయ పూజరులు జగన్నాథ, బలభద్రుల ముఖాలకు ఏనుగు తొడుగులు ధరింపజేస్తారు.బలరాముడు తెల్ల ఏనుగు రూపంలో, జగన్నాథుడు నల్ల ఏనుగు రూపంలో భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిస్తాడు. దీన్ని పూరి దేవాలయా సంప్రదాయంలో హాథిబేష అని పిలుస్థారు. ఇలా పూరీ జగన్నాథుని ఏకదంతుడి రూపంలో ధరిస్తే తమకు మంచి జరగుతుందని భక్తలు ప్రగాఢ నమ్మకం.(చదవండి: సకలకార్యాల సిద్ధికై.. తొలిపూజ మహాగణపతికే!) -
ఫ్లఫ్ఫీ పూరీ.. వెజిటబుల్ కాజు సాగ్ కాంబినేషన్‌తో.. ఆరోగ్యం!
ఫ్లఫ్ఫీ పూరీ ఇందులోకి వెజిటబుల్ కాజు సాగ్ హెల్దీ కాంబినేషన్. దీనిని ఎలా చేయాలో చూద్దాం.కావలసినవి..గోధుమపిండి– కప్పు;నీరు– పావు కప్పు లేదా అవసరాన్ని బట్టి;చక్కెర – పావు టీ స్పూన్;నెయ్యి– 2 టీ స్పూన్లు;నూనె – వేయించడానికి తగినంత.తయారీ..– నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ ఒక పాత్రలో వేసి పూరీల పిండిని కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు పక్కన పెట్టాలి.– ఈ పిండిని ఎనిమిది భాగలుగా చేసి పూరీలు వత్తి ఫ్లవర్ మౌల్డ్‌తో వత్తాలి.– బాణలిలో నూనె వేడి చేసి పూరీలను రెండు వైపులా కాల్చి తీస్తే ఫ్లఫ్ఫీ పూరీలు రెడీ.వెజిటబుల్ కాజు సాగ్..కావలసినవి..జీడిపప్పు – 10;పచ్చి కొబ్బరి తురుము– టేబుల్ స్పూన్;కొత్తిమీర తరుగు– టీ స్పూన్;పుదీన ఆకులు– 8;ధనియాల సొడి– పావు టీ స్పూన్;పచ్చిమిర్చి – అర కాయ;ఉడికించిన కూరగాయలు – కప్పు (క్యారట్, బీన్స్, బంగాళదుంప, మొక్కజొన్న, పచ్చి బఠాణీలు కలిపి);అల్లం తరుగు– అర టీ స్పూన్;ఉల్లిపాయ ముక్కలు– 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నిమ్మరసం– టీ స్పూన్; నూనె – టీ స్పూన్.తయారీ..కూరగాయ ముక్కలను ఉడికించి పక్కన పెట్టాలి. జీడిపప్పు, కొబ్బరితురుము, కొత్తిమీర, ధనియాల సొడి, అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తని పేస్ట్ చేయాలి ∙బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయించి అందులో జీడిపప్పుతోపాటు గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు, కొద్దిగా నీటిని వేసి ఐదు నిమిషాల సేపు ఉడికిస్తే వెజిటబుల్ కాజు సాగ్ రెడీ.పోషకాలు: పూరీలో... ఫ్యాట్ – 9.8 గ్రాములు, ్రసొటీన్ – 2.3 గ్రాములు, కార్బొహైడ్రేట్లు – 12 గ్రాములు. కర్రీలో... ్రసొటీన్– 4 గ్రాములు, కార్బొహైడ్రేట్లు – 13 గ్రాములు, ఫైబర్– 5 గ్రాములు.– డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ -
పూరీలో తెరుచుకున్న.. రత్నభండార్
భువనేశ్వర్: అశేష భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచి్చంది. ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ స్వామికి శతాబ్దాలుగా రాజులు, భక్తులు కానుకగా సమరి్పంచిన వజ్రాభరణాలు, వెండి, బంగారు నిల్వలను దాదాపు 46 ఏళ్ల తర్వాత తొలిసారిగా తనిఖీచేయనున్నారు. ఆభరణాలను తూకం వేసి, నాణ్యత లెక్కించి, అవసరమైతే మరమ్మతులు చేయనున్నారు. ఆలయంలోని రహస్య ఖజానా గది జీర్ణావస్థకు చేరిన నేపథ్యంలో గదికి మరమ్మతులు చేయనున్నారు. అంతవరకు అపారమైన ఖజానాను జాగ్రత్తగా వేరేచోట భద్రపరచనున్నారు. ప్రభుత్వ కమిటీ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేసి ఖజానా యజమానులైన విమలా మాత, మహాలక్షీ ఆజ్ఞ తీసుకున్నారు. తర్వాత ఖజానాకు రక్షకుడైన లోకనాథ్ స్వామి అనుమతి తీసుకున్నారు. మధ్యాహ్నం 1.28 గంటలకు ఖజానా గది తలుపులు తెరిచారు. 11 మంది మాత్రమే సంప్రదాయ దుస్తుల్లో గదిలోకి వెళ్లారు. ఆభరణాలను లెక్కించకుండానే సాయంత్రం 5.20కి బయటికి వచ్చారు. తరలింపు మరో రోజున‘‘లోపలి గది తాళాలు తెరుచుకోకపోవడంతో వాటిని పగలగొట్టి తెరిచాం. ఆభరణాలు, విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌లోకి తరలించి సీల్ వేశాం. అన్నింటినీ ఒకే రోజు తరలించడం కష్టం. త్వరలో తేదీని నిర్ణయించి తరలింపు మొదలెడతాం. రిపేర్ల తర్వాత ఆభరణాలకు విలువ కట్టే పని మొదలుపెడతాం’ అని ఏఎస్ఐ శాఖ అధికారులు వెల్లడించారు. గదిలోని ఆభరణాలను తరలించేందుకు సిద్ధం చేసిన 4.5 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల లోతున్న పెద్ద టేకు చెక్కపెట్టెలను గది వద్దకు తెప్పించారు. గదిలో పాములేవీ లేవని తేలింది. -
జగన్నాథ రహస్యం!
లక్షలాది భక్తజనం పాల్గొనే విశ్వవిఖ్యాత రథయాత్రతో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పూరీ జగన్నాథుని ఆలయం మరోమారు పతాక శీర్షికలకెక్కింది. రాజుల నుంచి మొదలుకుని సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథస్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వీడబోతోంది. ఆదివారం ఆలయం దిగువన ఉన్న ఆభరణాల నిల్వ గది(రత్న భండార్)ని దాదాపు 40 సంవత్సరాల తర్వాత లెక్కింపు కోసం తెరవబోతున్నారు. విషసర్పాలు ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో అత్యయిక ఔషధాలను సిద్ధంచేసి వైద్యులు, పాములు పట్టే వాళ్లను వెంటబెట్టుకునిమరీ పురావస్తు, ప్రభుత్వ అధికారులు లోనికి వెళ్లబోతున్నారు. జగన్నాథుడికి చెందిన వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరాల బరువును తూచి, వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని నిర్ణయించారు. చాన్నాళ్ల క్రితం గది తాళం చెవులు పోగొట్టి ఒడిశాలోని బిజూజనతాదళ్ సర్కార్ ఆలయ సంపద సంరక్షణలో విఫలమైందని బీజేపీ అసెంబ్లీ ఎన్నికలవేళ ఆరోపణలు గుప్పించడంతో గది తలుపులు తెరచి సంపదను సరిచూడాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. అయితే గది తెరవడంపై శనివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శుక్రవారం చెప్పారు.180 రకాల ఆభరణాలు1978లో గదిని తెరచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్కపెట్టెల్లో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజులు పట్టింది. గదిలో 180 రకాలకు చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు సమాచారం. స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలున్నాయి. ఒక్కోటి 100 తులాల బరువైన పురాతన ఆభరణాలూ ఉన్నాయి. ‘‘ 1978లో సంపద లెక్కించారు. అయితే జీర్ణావస్థకు చేరిన కొన్ని ఆభరణాల రిపేర్ పనుల కోసం 1985 జూలై 14వ తేదీన గది తెరిచారు. అప్పుడు నేనూ వెళ్లా. 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 15 చెక్కపెట్టెల్లో ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరిచారు. వెలకట్టలేని ఆభరణాలతోపాటు ఎంతో బంగారం, వెండి నిల్వలు గదిలో దాచారు. పెద్ద సింహాసనం, ఉత్తరభారత భక్తులు జగన్నాథ, బలభద్రులకు సమర్పించిన అరటిపువ్వు ఆకృతి చెవిదిద్దులు ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు అక్కడున్నాయి. తర్వాత గది తలుపులు మూసి రెండు రకాల తాళాలు వేసి సీల్‌వేశారు. తాళం చెవులను ట్రెజరీ ఆఫీస్ నుంచి వచ్చిన కలెక్టర్‌కు అందజేశాం’ అని ఆనాటి ఆలయ నిర్వహణ అధికారి రవీంద్ర నారాయణ మిశ్రా రెండేళ్ల క్రితం ఒక టీవీచానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. 12వ శతాబ్దంలో పూరీ ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంతరాజుల కిరీటాలు, యుద్ధంలో గెల్చుకున్న విలువైన సొత్తునూ రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది.2018లో మరోసారి ప్రయత్నించి..పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత, ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశాల మేరకు 2018 ఏప్రిల్ 4వ తేదీన 16 మంది సభ్యుల భారత పురావస్తుశాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్లింది. అయితే తాళం చెవి అదృశ్యమయిందన్న వార్తల నడుమ వెనుతిరిగింది. అయితే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్లు, పైకప్పు పెచ్చులు ఊడినట్లు నిర్ధారించుకున్నారు. ఈ తతంగం అంతా 40 నిమిషాల్లో ముగిసింది. చీకటిగదిని మళ్లీ 40 ఏళ్ల తర్వాత తెరుస్తున్న నేపథ్యంలో ఈసారైనా అన్ని ఆభరణాలు, బంగారం, వెండి నిల్వలను సరిచూసి శిథిల గదికి బదులు నూతన గదిలో సురక్షితంగా దాచాలని సగటు పూరీ జగన్నాథుని భక్తుడు కోరుకుంటున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంగరంగ వైభవంగా పూరీ జగన్నాథుని రథయాత్ర (ఫోటోలు)
-
Jagannath Rath Yatra 2024: పూరీలో వైభవంగా రథయాత్ర
భువనేశ్వర్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీలోని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. సాయంత్రం లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి. 5.20 గంటలకు రథాలు కదిలాయి. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు పూజలు చేశారు. ఆమె, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, సీఎం మోహన్ చరణ్ మాఝి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జగన్నాథ రథం తాళ్లను లాగి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ముందున్న బలభద్రుని ప్రతిష్టించిన 45 అడుగుల ఎత్తైన రథాన్ని దేవీ సుభద్ర, జగన్నాథుని రథాలు అనుసరించాయి. రథయాత్రకు ముందు భక్తుల బృందాలు జగన్నాథుని కీర్తనలను ఆలపిస్తూ ముందుకు సాగారు. రెండు రోజులపాటు సాగే యాత్ర కోసం భారీగా బందోబస్తు చేపట్టారు.సాయంత్రం వేళ బలభద్రుని రథం లాగుతున్న చోట ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరాడక తొమ్మిది మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా ఒడిశాలోని బాలాంగిర్ జిల్లాకు చెందిన లలిత్ బాగార్తి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. భక్తుని మృతి పట్ల సీఎం చరన్ మాఝీ సంతాపం వ్యక్తంచేశారు. అయితే 300 మందిదాకా గాయపడినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. -
పూరీ జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధం.. భారీగా తరలివచ్చిన భక్తులు
Live Updates..🙏జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్.🙏హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.🙏ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం అందరిది.. సర్వమతాలకు స్వేచ్ఛ, అవకాశాలను ఇస్తుంది. మా ప్రభుత్వం మత సామరస్యాన్ని పాటిస్తుంది. ఇస్కాన్ సంస్థ ప్రార్ధనలతో రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా. మానవ సేవే మాధవ సేవ అనే సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు కూడా పాల్గొన్నారు. 🙏 నేడు ఒడిశాలోని పూరీ జగన్నాథుడి విశ్వప్రసిద్ద రథయాత్ర జరుగనుంది. ఈ వేడుకలను చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పూరీ చేరుకున్నారు. రథయాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. #WATCH | Odisha: Two-day Lord Jagannath Rath Yatra in Puri to commence today. Along with lakhs of devotees, President Droupadi Murmu will also attend the annual festival. pic.twitter.com/7Q9WYQCJw5— ANI (@ANI) July 7, 2024 🙏ఇంత వరకు భారత రాష్ట్రపతులు ఎవరూ పూరీ రథయాత్రలో పాల్గొనలేదు. తొలిసారి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు. ఆమె గవర్నర్ రఘుబర్‌దాస్‌తో కలిసి సుభద్రమ్మ రథం లాగుతారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. రెండురోజుల రథయాత్రలో 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకొని పూరీ పట్టణానికి మూడంచెల భద్రత కల్పించారు. #WATCH | Odisha: Security around Lord Jagannath temple in Puri increased ahead of the Rath Yatra which will commence today. pic.twitter.com/ExMFCNfAuu— ANI (@ANI) July 7, 2024 🙏కాగా, నేడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా వెళ్లి పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. గర్భగుడిలోని దివ్య(దారు) విగ్రహాలు భక్త జనఘోష మధ్య రథాలపై మూడు కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి. #WATCH | Bhubaneswar: Odisha-based miniature artist L Eswar Rao crafts an eco-friendly chariot in connection with the Jagannath Puri Rath Yatra. (06.07) pic.twitter.com/Hgpxl8Eym2— ANI (@ANI) July 7, 2024 🙏ఇక, ఈసారి రథయాత్రకు ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకేరోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. మూడు వేడుకలు ఆదివారం ఉండడంతో జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళన్ రథాలు ఆదివారం సాయంత్రానికి అమ్మ ఆలయానికి చేరుకొనే పరిస్థితి లేదు. #WATCH | Ahmedabad, Gujarat: Union Home Minister Amit Shah along with his wife Sonal Shah at Jagannath Temple. pic.twitter.com/FQ6FeFytyz— ANI (@ANI) July 6, 2024 🙏మరోవైపు.. పూరీ రథయాత్ర నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని జగన్నాథుని ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. గుజరాత్‌లోని పూరీ ఆలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
‘రత్న భాండార్’లో ఏముంది? తాళాలు ఏమయ్యాయి?
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా జగన్నాథ ఆలయానికి సంబంధించిన రత్న భాండార్ గురించి ప్రస్తావించారు. ఈ రత్న భాండార్ తాళాలు గత ఆరేళ్లుగా కనిపించడం లేదని, అవి ఏమైపోయాయనేది ఒడిశా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. ఈ భాండాగారంలో అపారమైన సంపద దాగి ఉందని మోదీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన దర్యాప్తు నివేదిక బయటపెట్టేందుకు ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసమో ఈ విషయాన్ని దాచి ఉంచుతున్నారని మోదీ ఆరోపించారు. మోదీ విమర్శల నేపధ్యంలో ‘రత్న భాండార్’ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ ‘రత్న భాండార్’లో ఏముంది? పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారంలోని అంతులేని శ్రీవారి ఆభరణాలు, బంగారు, వెండి,వజ్ర వైఢూర్యాలు క్షేమంగా ఉన్నాయా? ఖజానాకు సంబంధించిన కీలక తాళం పోయి యాభై ఏళ్లు దాటినా ఇంత వరకు దాన్ని ఎందుకు చేధించలేదు?ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు అనుమానస్పద మౌనాన్ని కొనసాగిస్తోంది? శ్రీవారి నిధి ఉన్న గదిలోంచి బుస బుసలు వినిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అది వేయి పడగల ఆదిశేషునివేనా? అసలు జగన్నాధుని కొలువులో ఏం జరుగుతోంది? దేవుడి ఆస్తులకే మనిషి శఠగోపం పెడుతున్నాడా?అక్కడున్న రహస్యం ఏంటి?అందరినీ కాపాడ్డానికి ఆ దేవుడు ఉన్నాడు. మరి దేవుడి సంపద కాపాడటానికి ఎవరున్నారు? కచ్చితంగా మనిషిని నమ్మడానికి వీల్లేదు. తన సంపదను దేవుడే కాపాడుకోవాలి. ఇదంతా ఎందుకంటే ఒడిషా లోని అత్యంత ప్రాచీనమైన పూరీ జగన్నాథుని దేవాలయంలో అంతులేని శ్రీవారి సంపదలు ఉన్న భాండాగారం గది తాళాల మిస్సింగ్ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. తాళాలు ఎలా పోయాయో ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఆలయ కమిటీ ఏమీ తెలీదంటోంది. తాళాలు పోయిన యాభై ఏళ్ల తర్వాత కూడా ఎవ్వరిలోనూ కంగారు లేదు. వాటిని వెతికి పట్టుకోవాలన్న ఆతృత లేదు. పాలకుల వైఖరిని చూసి భక్తులు మండిపడుతున్నారు. దేవ దేవుడి ఆభరణాలు ఉన్నాయా? దిగమింగేశారా? చెప్పండంటూ నినదిస్తున్నారు.దేశంలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి. ఈ నాలిగింటినీ కలిపి చార్ ధామ్ ఆలయాలుగా పిలుస్తారు. వీటితో పాటు మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం. 12వ శతాబ్ధంలో రాజా అనంత వర్మ చోడగంగదేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలై ఆయన మనవడు అనంగ భీమ్ దేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువు తీరి ఉంటాయి. కృష్ణుని ఆరాధించే వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం.దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారి అయినా జగన్నాథుని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు.ఇక్కడ నిత్యం దేవ దేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండల్లోనే వండుతారు.ఇక ఏటా జూన్, జులై నెలల్లో జరిగే జగన్నాథ రథ యాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ మరీ వస్తారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్ధం. అంటే ముల్లోకాలనూ చల్లగా చూసే విష్ణుమూర్తే అని అర్ధం చేసుకోవాలి.ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్ధిగా ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. సమాధానం లేని ప్రశ్నలా అందరినీ వేధిస్తోంది. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే 12వ శతాబ్ధం నుండి 18వ శతాబ్ధం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవ దేవుడికి విలువైన ఆభరణాలు, బంగారం వెండి వజ్ర వైఢూర్యాలు వంటి ఎన్నో కానుకలను భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు.ఈ సంపదలన్నింటినీ శ్రీక్షేత్రంలోని రత్నభండాగారంలోని మూడో గదిలో దాచారు. ఎప్పుడో 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్నభాండాగారాన్ని తెరిపించినపుడు అందులో 597కి పైగా రక రకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి సంపదను వెలగట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైఢూర్య, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాశులు రాశులుగా పోసి ఉన్నట్లు గురించారు. రత్నభాండాగారంలోని రహస్యగదిగా పిలుస్తోన్న మూడో గది కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళ్తే మరిన్ని గదుల్లోకి వెళ్లచ్చని, వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని వందేళ్ల క్రితం నాటి నిపుణులు అంచనా వేశారు.అంతా బానే ఉంది కానీ కొన్నేళ్లుగా ఈ రహస్య గదే పెద్ద మిస్టరీగా మారింది. రత్నభాండాగారంలోని మూడో గదికి మూడు తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున మూడు తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళంచెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది. మరో తాళంచెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది. ఇక మూడో తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది.ఈ మూడు తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తెరవడం కుదరదు. రత్నభాండాగారంలోని మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినపుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు. పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఈ గదిలో భద్రపరుస్తారు. రెండో గదిలోనూ విలువైన వస్తువులున్నాయి. అయితే మూడో గదిని మాత్రం దశాబ్ధాలుగా తెరవనే లేదు. ఎందుకు తెరవడం లేదో ఎవరికీ అర్దం కావడం లేదు. మొత్తానికి భక్తులు, ప్రజాసంఘాలు పదే పదే అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత తేలిందేంటంటే ఈ మూడు తాళాల్లో ఒక తాళం కనిపించడం లేదని.దేవాలయం ఉండే ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ 2018లో అధికారికంగా రత్నభాండాగారానికి చెందిన మూడో గదికి సంబంధించిన ఒక తాళం పోయిందని అది ఎక్కడికిపోయిందో తెలవడం లేదని ప్రకటించారు. దాంతో ప్రభుత్వంపైనా ఆలయ పాలనా యంత్రాంగం పైనా విమర్శలు వెల్లువెత్తాయి.1964లో చివరి సారి మూడో గదిని తెరిచినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత తాళం కనిపించకపోవడంతో తెరవలేదని అంటున్నారు. దీనిపై విపక్షాలు విరుచుకుపడటంతో కొన్నాళ్ల కింద పాలక పక్ష మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ దేవ దేవుడి ఆభరణాలు కానీ సంపద కానీ ఎక్కడికీ పోలేదని.. పూచిక పుల్ల కూడా ఎవరూ దోచుకుపోలేదని అన్నీ భద్రంగానే ఉన్నాయని వివరణ ఇచ్చారు.అసలు తాళాలు పోయాయని ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జస్టిస్ రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని నియమించారు. తాళాలు పోవడంలో ఎవరి పాత్ర ఉందో తేల్చడంతో పాటు మొత్తం వ్యవహారంలో ఎవరు బాధ్యులో తేల్చాలని ఆయన ఆదేశించారు. రఘువీర్ దాస్ కమిటీ నెలల తరబడి దర్యాప్తు చేసిన తర్వాత 324 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఆ నివేదికలో ఏం ఉందన్నది మిస్టరీగా మారింది. 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న రెండు తాళాలతో మూడో గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు.అయితే రెండు తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు భయానక శబ్ధాలు రావడంతో భయంతో ఆ తలుపులను తిరిగి మూసివేసి వెనక్కి వెళ్లిపోయారని చెబుతారు. ఆలయం నిర్మించిన నాటి నుండి ఇక్కడ పనిచేసే అర్చకులు, సేవకులు, ఇతర సిబ్బంది కూడా వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల వాళ్లే కొనసాగుతున్నారు.ప్రధాన అర్చకులయితే.. ఓ అడుగు ముందుకేసి దేవాలయ రత్నభాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టం అని హెచ్చరిస్తున్నారు.దేవుడి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనం అయిపోతుందని పెను విపత్తులు తరుముకు వస్తాయని వారు బెదిరిస్తున్నారు.జగన్నాధుని భక్తితో కొలిచే వారు మాత్రం తమ దేవుడి సంపద భద్రంగా ఉందో లేదో స్పష్టం చేయాలంటున్నారు. మూడో గది తాళాలు ఎలా పోయాయో ఎవరు కొట్టేశారో ఎందుకు తేల్చడం లేదంటూ వారు నిలదీస్తున్నారు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనూ నేలమాళిగల్లో అపార ధనరాశులు ఉన్నాయన్న సమాచారంతో కోర్టు ఆదేశాలతో నేలమాళిగలను తెరిచారు. అయితే అందులో ఆరు నేలమాళిగలు ఉండగా అధికారులు కేవలం అయిదు నేలమాళిగలను మాత్రమే తెరిచారు. నిజానికి ఈ ఆరో నేలమాళిగే అన్నింటిలోకీ కీలకమైందని అప్పుడు ప్రచారం చేశారు. ఎందుకంటే మిగతా అయిదు నేలమాళిగలతో పోలిస్తే ఆరో నేలమాళిగ చాలా పెద్దదని ఆలయ సిబ్బంది కూడా చెబుతున్నారు.ఆరో నేలమాళిగ కన్నా చాలా చిన్నవైన ఇతర నేలమాళిగల్లోనే ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే ఆరో నేలమాళిగలో దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ ధనరాశులు కచ్చితంగా ఉంటాయన్నది వారి వాదన. అయితే అధికారులు మాత్రం ఆరో నేలమాళిగను ఈ రోజుకీ తెరవలేదు. ఆరో నేలమాళిగ ను మూసి ఉంచిన ఇనుప తలుపులపై నాగసర్పం బొమ్మ ఉంది. ఆ తలుపులను నాగబంధంతో బంధించారని ప్రచారం జరుగుతోంది. ఆ నాగబంధాన్ని ఖాతరు చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికే అరిష్టమని దేవుడి ఉగ్రరూపం విలయ రూపంలో విరుచుకుపడి మానవాళిని నాశనం చేసేస్తుందని ఆలయ పూజారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడే ఏదో మెలిక ఉందనిపిస్తుందంటున్నారు హేతువాదులు.ఒకే దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో అయిదు మాళిగల తలుపులు తెరిస్తే ఏమీ కానిది ఆరో మాళిగ తెరిస్తేనే ఏదో అయిపోతుందని అనడంలో అర్ధం ఏముందని వారు నిలదీస్తున్నారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న సున్నితమైన ఆలోచనతో ఆరో నేలమాళిగ తెరవకూడదని నిర్ణయించేసుకున్నారు.పూరీలోని జగన్నాథుని ఆలయంలోనూ కీలకమైన మూడో గదిలోనే లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా లక్షలాది పాములే ఉఏనేన్నాయా? లేక వేయి పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా? అన్నది అర్ధం కావడం లేదు. పాముల బుస బుసలు మాత్రం వినిపిస్తున్నాయని అధికారులు అన్నారన్న ప్రచారంలో ఎంత వరకు నిజముంది? వెంటనే ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని పూజారులు హెచ్చరించడం దీనికి కొనసాగింపా? అన్నది తెలియాల్సి ఉంది.అసలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? కొందరు భక్తులు అయితే మూడో గదిలోని విలువైన ఆభరణాలు, సంపదలను రాబందులు తన్నుకుపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టే మూడో గది తాళాల గురించి కానీ రఘువీర్ దాస్ కమిటీ నివేదిక గురించి కానీ ప్రభుత్వం మాట్లాడ్డం లేదని వారంటున్నారు.మూడో గదిని ప్రజల సమక్షంలో తెరిస్తే నిజా నిజాలు బయటకు వస్తాయని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు.అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరో నేలమాళిగ తరహాలోనే పూరీ జగన్నాథ ఆలయంలోని కీలకమైన ఈ మూడోగది మిస్టరీ కూడా ఎప్పటికీ వీడకపోవచ్చునని కొందరు మేథావులు అంటున్నారు. పాలకులు మాత్రం ఏమీ అనడం లేదు. ఆలయ సిబ్బంది కూడా బెల్లంకొట్టిన రాయిలా మాట్లాడ్డం లేదు. భక్తులు మాత్రం దేవుడికి అపచారం జరిగిందని బాధపడుతున్నారు. అది దేశానికి ఏ మాత్రం మంచిది కాదని ఏ క్షణంలో ఏం ముంచుకు వస్తుందోనని వారు భయపడుతున్నారు. ఇక నిజా నిజాలు వెలికి తీసి దోషులకు శిక్షపడేలా చేయాల్సింది ఆ జగన్నాథుడే. ఆయనే కద జగన్నాటక సూత్రధారి. తన ఆస్తులను ఎవరు కొట్టేశారో పట్టుకుని బోనులో పెట్టాల్సింది దేవుడే ఇక.భక్తుల మనోభావాలను అడ్డుపెట్టుకుని దేవుడి సంపదలు కొల్లగొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆధ్యాత్మిక వాదులు హెచ్చరిస్తున్నారు. వెలకట్టలేని అపార దేవుడి సంపదకు రక్షణ కల్పించాల్సిన పాలకులు ఘోరంగా విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిజానిజలేంటో వెలుగులోకి తీసుకురావాలని వారు పట్టుబడుతున్నారు. -
బీజేపీ ఎంపీ అభ్యర్థి సంబీత్ పాత్ర వివాదాస్పద వ్యాఖ్యలు
భువనేశ్వర్: లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీల నేతలు ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. పూరీ జగన్నాథ స్వామిపై పూరీ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సంబిత్ పాత్ర ఆదివారం పాల్గొన్న ప్రచార ర్యాలీ అనంతం మీడియాతో మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ స్వామి ప్రధాని మోదీకి భక్తుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండింస్తూ.. విమర్శలు గుప్పించారు.సంబిత్ పాత్ర వ్యాఖ్యలపై ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. ‘శ్రీ జగన్నాథ్ మహాప్రభు విశ్వానికినే దేవుడు. అటువంటి దేవుడినే మోదీకి భక్తుడు అనటం భగవంతున్ని కించపర్చడమే.దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జగన్నాథ్ స్వామి కోట్లాది మంది భక్తుల విశ్వాసలను కించిపర్చినట్లే’ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.BJP नेता संबित पात्रा का कहना है कि महाप्रभु भगवान श्री जगन्नाथ नरेंद्र मोदी के भक्त हैं। यह महाप्रभु का घोर अपमान है। इस बयान से करोड़ों भक्तों की आस्था को चोट पहुंची है।मोदी भक्ति में लीन संबित पात्रा को यह पाप नहीं करना चाहिए था। इस घृणित बयान के लिए खुद नरेंद्र मोदी को… pic.twitter.com/di0So3FxCz— Congress (@INCIndia) May 20, 2024 సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ‘అధికార మత్తులో ఉన్న బీజేపీ.. మన దేవుళ్లను సైతం విడిచిపెట్టడం లేదు. ఇక ప్రజలను మాత్రం ఎలా విడిచిపెడుతుంది. జగన్నాథ్ స్వామిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండింస్తున్నాం. కోట్లాది మంది జగన్నాథ్ స్వామి భక్తులను కించిపర్చినట్లే. జూన్ 4న ప్రజల సంకల్పం ముందు బీజేపీ అహకారం నాశనం అవుతుంది’ అని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు.విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి సంబిత్ పాత్ర స్పందించారు. ‘నమస్కార్ నవీన్ జీ. ఈ రోజు నరేంద్ర మోదీ రోడ్డు షోకు సంబంధించిన పలు న్యూస్ చానెల్స్‌తో మాట్లాడాను. ఎక్కడ మాట్లడినా ప్రధాని మోదీ.. శ్రీ జగన్నాథ్ స్వామికి పెద్ద భక్తుడని చెబుతా వస్తున్నా. అదేవిధంగా మోదీ.. జనన్నాథ్ స్వామికి భక్తుడు అనబోయి పొరపాటున వ్యతిరేకార్థంలో మాట్లాడాను. దీనిని పెద్ద విషయం చేయకండి. మనమంతా కొన్ని నోరుజారీ మాట్లాడుతాం’ అని సంబిత్ పాత్ర వివరణ ఇచ్చారు.Naveen Ji Namaskar!I gave number of bytes today to multiple media channels after the massive success of Shri Narendra Modiji’s Road Show in Puri today, everywhere I mentioned that Modi ji is an ardent “Bhakt” of Shri Jagannath Mahaprabhu ..by mistake during one of the bytes I… https://t.co/6Q1Kuj5E6O— Sambit Patra (Modi Ka Parivar) (@sambitswaraj) May 20, 2024 -
సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
పూరీ: ఒడిశా కాంగ్రెస్‌లో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా పూరీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ మరో అభ్యర్థిని ప్రకటించింది. జై నారాయణ్ పట్నాయక్‌ను కాంగ్రెస్ పార్టీ పూరీ నుంచి బరిలోకి దిపింది. కాగా, సుచారితా మొహంతీ టికెట్ తిరస్కరణ కారణంగా ఇక్కడ అభ్యర్థి మార్పు జరిగింది.వివరాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ పూరీలో మరో అభ్యర్థిని ఖరారు చేసింది. జై నారాయణ్ పట్నాయక్‌ను పూరీ అభ్యర్థిగా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేశారు. కాగా, మొహంతీ స్థానంలో పట్నాయక్ అభ్యర్థిత్వానికి ఐఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఓకే చేశారు. The Congress President, Shri Mallikarjun Kharge, has approved the candidature of Shri Jay Narayan Patnaik (In place of Smt. Sucharita Mohanty) as party candidate for the ensuing general elections to the Lok Sabha from 17 - Puri Parliamentary Constituency of Odisha. pic.twitter.com/1NkkGH73Y1— INC Sandesh (@INCSandesh) May 5, 2024ఇక, అంతకుముందు.. మాజీ ఎంపీ బ్రజామోహన్ మహంతీ కుమార్తె, మాజీ జర్నలిస్టు అయిన సుచరితా మొహంతీని కాంగ్రెస్ పార్టీ పూరీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే తాను పోటీ చేయనని, టికెట్‌ను తిరస్కరించారు. తనవద్ద ఉన్న డబ్బును ఖర్చు చేసేశానని, ఆర్థిక సహకారం అందించేందుకు పార్టీ అధిష్ఠానం నిరాకరించిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని ఆమె.. కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు. దీంతో పార్టీ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది.కాగా, పూరీ లోక్‌సభ స్థానానికి ఆరో విడుతలో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల సమర్పణకు మే ఆరో తేదీ వరకు సమయం ఉంది. అందుకే సుచరిత ఇప్పటివరకు తన నామినేషన్ దాఖలు చేయలేదు. -
కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
లోక్‌సభ ఎన్నికలవేళ కాంగ్రెస్ పార్టీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొందరు నేతలు పార్టీ మారగా.. మరికొందరు పలు కారణాలతో పోటీ నుంచి వైదోలుగుతున్నారు. తాజాగా ఒడిషా రాష్టంలో పూరీ లోక్‌భ స్థానంలో బరిలో ఉన్న సుచరిత మొహంతి.. పోటి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి పార్టీ నుంచి తగిన నిధులు అందకపోవటంతో సుచరిత మొహంతి.. తనకు కేటాయించిన టికెట్‌ను తిరిగి ఇస్తున్నట్లు తెలియజేశారు. పబ్లిక్ డొనేషన్ డ్రైవ్ చేపట్టి, ఎంత ఖర్చ తగ్గించినా.. తాను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.‘నాకు పార్టీ నుంచి రావాల్సిన ఎన్నికల ప్రచార నిధులు నిరాకరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలహీన అభ్యర్థులకు టికెట్లు కేటాయించారు. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీజేడీ చాలినంత నిధులు, ధన బలంతో ఉన్నారు. ఇది చాలా కష్టమైన పరిస్థితి. ప్రతిచోట చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. నేను వారిలా పోటీలో ఉండలేను. డబ్బుతో కాకుండా ప్రజలతో ప్రచారం చేయాలనుకున్నా. కానీ, అది కూడా నిధుల కొరతతో సాధ్యపడటం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత తీసుకోవటం లేదు’ అని సుచరిత తెలిపారు.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు రాసిన లేఖలో సుచరిత.. పార్టీ ప్రచార నిధుల నిరాకరించటంతో తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి చాలా ఇబ్బంది అవుతోదని తెలిపారు. ‘‘సాధారణ జర్నలిస్ట్‌గా పనిచేసిన నేను పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చాను. అన్ని రకాలుగా నేను పూరీలో ప్రచారం చేస్తున్నా. నిధుల కోసం పబ్లిక్ డొనేషన్ డ్రైవ్ కూడా చేట్టాను. చాలా వరకు ప్రచార ఖర్చును కూడా తగ్గించాను. కానీ, ప్రచార నిధుల కొరత కారణంగా విజయావకాశాలు ఉన్న పూరీ నియోజకవర్గంలో వెనకబడి ఉన్నాం. పార్టీ నిధులు లేకుండా ప్రచారం కొనసాగించలేకపోవటంపై చింతిస్తున్నా. అందుకే నాకు కేటాయించిన టికెట్‌ను తిరిగి ఇస్తున్నా’’ అని కేసీ వేణుగోపాల్‌కు రాసిన లేఖలో వివరించారు. -
Book Fair: వెలుగులు విరజిమ్మనీ
-
ఆ మహిళ గ్యాస్ సేవింగ్ టెక్నిక్‌కి ఫిదా అవ్వాల్సిందే! ఒకేసారి..
ప్రస్తుతం గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. అందుకోసం అని మధ్యతరగతి మహిళలు ఎన్నో పాట్లు పడుతుంటారు. గ్యాస్ ఆదా చేసే ఒక్క చిన్న అవకాశాన్ని కూడా మిస్ చెయ్యరు. అయినా ఇంట్లో అందరికీ కావాల్సినవి అమర్చి పెట్టే క్రమంలో గ్యాస్ ఆదా చేయలేక సతమతమవుతుంటారు మహిళలు. పోనీ కట్టెల పొయ్యి వంటివి ఏమైనా ట్రై చేద్దామా అంటే..అంతా అపార్ట్మెంట్లో నివాసం ఉండే పరిస్థితి. అలాంటప్పుడూ ఇది అస్సలు కుదరదు. కానీ ఇక్కడొక మహిళ గ్యాస్‌ని ఆదా చేస్తూ ఒకేసారి రెండు వంటకాలు చేసి శభాష్ అనిపించుకుంది. ఆమె ఎలా చేసిందో చూస్తే మాత్రం తప్పక ఆశ్చర్యపోతారు. అబ్బా..! ఇలా కూడా గ్యాస్ ఆదా చేసుకోవచ్చా అనుకుంటారు. ఏం జరిగిందంటే..ఓ మహిళ గ్యాస్ ఆదా చేసేలా వండిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో ఆ మహిళ పూరీలు, అందులోకి బంగాళదుంప కూర చేయాలనుకుంది. అందుకని ముందుగా ఓ గిన్నేలో బంగాళ దుంపలను ఉడకబెట్టింది. ఆ ఆవిరిపైనే వేడితోనే పూరీలను కూడా చక్కగా ప్రీపేర్ చేసేంది. ఈ ఐడియాని చూసి నెటిజన్లు ఆమెది ఏం తెలివి అంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. అలా ఎలా అనుకుంటున్నారా..?. ఏం లేదండి ఓ స్టీల్ గిన్నేలో బంగాళ దుంపలు పెట్టింది. దానిపై ఓ మూకిడి పెట్టి నూనె పోసి చక్కగా పూరీలను వేయించింది. ఆ బంగాళ దుంపల ఆవిరిపైనే పూరీలను ప్రీపేర్ చేసేసింది అంతే. ఓహో ఇలా కూడా గ్యాస్ ఆదా చేయొచ్చా..!. ఇంతవరకు మాకు ఇలాంటి ఐడియా రాలేదబ్బా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి. View this post on Instagram A post shared by Rekha Sharma (@rekha_sharma.001) (చదవండి: అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా పైలట్!) -
పూరీ ఆలయంలోనికి అక్రమంగా బంగ్లాదేశీయులు
ఒడిశాలోని పూరీలో గల జగన్నాథ ఆలయంలోకి అనధికారికంగా తొమ్మిది మంది బంగ్లాదేశీయులు ప్రవేశించారు. వీరిని ఒడిశా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కొందరు బంగ్లాదేశ్ జాతీయులు ఆలయంలోకి వెళ్లడాన్ని తాము చూశామని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తమకు చెప్పారని ఒక అధికారి మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై వీహెచ్‌పీ కార్యకర్తలు సింగ్‌ద్వార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆ బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. కొందరు హిందూయేతర బంగ్లాదేశీయులు ఆలయంలోకి ప్రవేశించినట్లు తమకు ఫిర్యాదు అందిందని, ఇద్దరు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నామని పూరీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఎస్పీ సుశీల్ మిశ్రా తెలిపారు. ఆలయ నిబంధనల ప్రకారం హిందువులకు మాత్రమే ఆలయంలోనికి ప్రవేశం ఉంది. ఈ ఆలయంలోనికి హిందువులు కానివారు ప్రవేశిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశీయుల పాస్‌పోర్టులను తనిఖీ చేస్తున్నామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. విచారణ సమయంలో ఒకరు హిందువని తేలింది. మిగిలిన పాస్‌పోర్టులపై విచారణ కొనసాగుతోంది. ఆలయ పరిసరాల్లోకి వచ్చిన తొమ్మిది మందిలో నలుగురు ఆలయంలోనికి ప్రవేశించినట్లు విచారణలో తేలింది. -
భారత్, అమెరికా సంబంధాలు.. చపాతి, పూరీలతో పోలిక
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలపై అమెరికా ఉన్నతాధికారి జెఫ్రీ ఆర్ ప్యాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు చపాతీలా చదునుగా లేవని పూరీలా పొంగి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయన్నారు. ఇంధనం, భద్రత అంశాల పరంగా భారత్‌తో తమకున్న సంబంధాలు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనవని చెప్పారు. అయితే భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై (ఎఫ్‌టీఏ)పై ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరో దశకు తీసుకెళ్లడంపైనే దృష్టిపెట్టినట్లు తెలిపారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రెండు దేశాల మధ్య మంచి సంబంధాలున్నట్లు తెలిపారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌కు చెందిన గ్రీన్ కో కంపెనీతో చర్చలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. హౌతీల దాడులతో అంతర్జాతీయ సముద్ర రవాణా సమస్యలు ఎదుర్కొంటోందన్నారు. హౌతీల దాడికి గురైన నౌకలను కాపాడేందుకు భారత నేవీ చేసిన కృషి గొప్పదని, ఇది భారత సామరర్థ్యాన్ని తెలియజేస్తోందని కొనియాడారు. #WATCH | On Foreign Trade Agreements between US and India, US Secretary of State for Energy Resources Geoffrey R. Pyatt says, "Nobody today characterises their trade relationship as flat as a 'chapati'. It has become big and puffed up like a big 'puri'... I think we are not… pic.twitter.com/Gf5Tw7o8Ee — ANI (@ANI) February 5, 2024 ఇదీ.. చదవండి.. వెనక్కు తగ్గని హౌతీలు -
పాలక్ మేథీ పూరీ..ఇలా చేస్తే లొట్టలేసుకొని తింటారు
పాలక్ మేథీ పూరీ తయారీకి కావల్సినవి: జీలకర్ర – టేబుల్ స్పూను; సోంపు – టేబుల్ స్పూను; వాము – టీస్పూను; నువ్వులు – టేబుల్ స్పూను; ధనియాల పొడి – టేబుల్ స్పూను; రెండు కప్పులు; శనగపిండి – పావు కప్పు; పసుపు – అరటేబుల్ స్పూను; ఉప్పు – రుచికి సరిపడా; కారం – టేబుల్ స్పూను; నూనె –డీప్‌ఫ్రైకి సరిపడా పచ్చిమిర్చి – మూడు; అల్లం తరుగు – టీస్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పాలకూర తరుగు – రెండు కప్పులు; మెంతికూర తరుగు – కప్పు; గోధుమ పిండి –రెండు కప్పులు తయారీ విధానం: జీలకర్ర, సోంపు, నువ్వులు, వాము, ధనియాల పొడి, పచ్చిమిర్చి; అల్లం తరుగు, కరివేపాకుని మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాలకూర, మెంతికూర తరుగుని గిన్నెలో వేయాలి. దీనిలోనే గోధుమపిండి, శనగపిండి, కారం, పసుపు, గ్రైండ్ చేసిన మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూను నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేడినీళ్లు చల్లుకుంటూ ముద్దలా కలపాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలా మందంగా వత్తుకోవాలి ∙గుండ్రని గిన్నె లేదా చిన్న గ్లాసుతో పూరీని చిన్న చిన్న చెక్కల్లా కట్ చేయాలి ∙అన్నీ రెడీ అయ్యాక క్రిస్పీగా మారేంత వరకు డీప్ ఫ్రై చేస్తే రుచికరమైన పాలక్ మేథీ పూరీ రెడీ. -
పూరీ రథయాత్ర ప్రారంభం.. భారీగా భక్తుల రాక
భువనేశ్వర్: దేశంలో ప్రఖ్యాత జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. ఇక, రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది. రథయాత్రలో పాల్గొనేందుకు ఒడిశాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీక్షేత్రం పరిసరాలతో పాటు అక్కడి వీధులన్నీ కిక్కిరిపోతున్నాయి. ‘జై జగన్నాథ’ నినాదాలతో పూరీ నగరం మార్మోగుతోంది. ఇదిలా ఉండగా, మంగళవారం ఉదయం జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించి తరువాత మంగళహారతి చేపట్టారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్ రథాలపై చెరాపహర (బంగారు చీపురుతో ఊడ్చడం) చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు భక్తులు రథాలను లాగుతారు. సాయంత్రం రథాలు గుండిచా మందిరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక, పూరీ రథయాత్రకు పలువరు ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. #WATCH | A large number of devotees gather in Odisha's Puri for the #JagannathRathYatra_2023 pic.twitter.com/CzRrc3hZHI — ANI (@ANI) June 20, 2023 Puri Ratha Yatra,Odisha 🌅🌺🌺🌺🌺👏👏👏🐚🐚🐚🐚🐚🐚 pic.twitter.com/2K6tOzGmCp — SATYAJIT PRADHAN (@Satyaji56683529) June 20, 2023 ఇది కూడా చదవండి: వీడియో: కేదార్నాథ్ ఆలయ గర్భగుడిలో అపచారం.. మహిళ ఓవరాక్షన్.. శివలింగంపై కరెన్సీ నోట్లు.. -
Vande Bharat: వడగళ్లు, పిడుగుపడి దెబ్బతిన్న వందేభారత్
భువనేశ్వర్: దేశంలో అత్యంత వేగంగా పేరున్న సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్. అయితే ఈ రైలు నాణ్యత విషయంలోనే పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలు అందుకు కారణం. తాజాగా.. వడగండ్ల వానకు, పిడుగుపడి ఓ వందేభారత్ రైలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఒడిషాలో ఈమధ్యే ప్రారంభమైన పూరీ-హౌరా వందేభారత్ ఎక్స్‌ప్రెస్(22896) ఆదివారం మధ్యాహ్నం ముందు భాగం దెబ్బతింది. భద్రాక్ రైల్వే స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో.. పిడుగుపడి డ్రైవర్ క్యాబిన్ విండ్‌స్క్రీన్, సైడ్ విండోలు పగుళ్లు వచ్చాయి. అయితే ఎవరికీ ఏం కాలేదు. అలాగే వడగండ్ల వాన కురిసి.. పలు కోచ్‌ల సైడ్ విండోలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇదేకాదు.. ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ వైర్ తెగిపోవడంతో వైతరణి రోడ్డు రైల్వే బ్రిడ్జి వద్ద రెండు గంటలపాటు రైలు ఆగిపోయింది. రైలులో పవర్ సప్లై నిలిచిపోవడంతో చాలామంది ప్రయాణికులు.. సామాజిక మాధ్యమాల్లో ఆ ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక.. ఓ డీజిల్ ఇంజిన్‌ను పంపించి రైలును అక్కడి నుంచి తరలించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మరమ్మత్తుల నేపథ్యంలో.. ఇవాళ(సోమవారం) రైలును రద్దు చేశారు. ఒడిషా పూరీ నుంచి పశ్చిమ బెంగాల్ హౌరాను కనెక్ట్ చేస్తూ ఈ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా గత గురువారం ప్రారంభించారు. వచ్చే నెల ముగింపు లోపు దేశంలోని అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ వందేభారత్ రైళ్లను ప్రారంభించే యోచనలో ఉంది భారత రైల్వేస్. Odisha | Puri-Howrah Vande Bharat Express halted between Dulakhapatna-Manjuri Road Station after the overhead wire was damaged due to thunderstorms and lightning. Purna Chandra Shahu, Station Manager, Bhadrak said, "Front glass and side windows of the driver cabin were damaged… pic.twitter.com/bhuAIGQFiI — ANI (@ANI) May 21, 2023 -
Puri Jagannath Temple: ఆ మూడో గదిలో అంతులేని ధనరాశులున్నాయా?
పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారంలోని అంతులేని శ్రీవారి ఆభరణాలు, బంగారు, వెండి,వజ్ర వైఢూర్యాలు క్షేమంగా ఉన్నాయా? ఖజానాకు సంబంధించిన కీలక తాళం పోయి యాభై ఏళ్లు దాటినా ఇంత వరకు దాన్ని ఎందుకు చేధించలేదు?ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు అనుమానస్పద మౌనాన్ని కొనసాగిస్తోంది? శ్రీవారి నిధి ఉన్న గదిలోంచి బుస బుసలు వినిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అది వేయి పడగల ఆదిశేషునివేనా? అసలు జగన్నాధుని కొలువులో ఏం జరుగుతోంది? దేవుడి ఆస్తులకే మనిషి శఠగోపం పెడుతున్నాడా?అక్కడున్న రహస్యం ఏంటి? అందరినీ కాపాడ్డానికి ఆ దేవుడు ఉన్నాడు. మరి దేవుడి సంపద కాపాడటానికి ఎవరున్నారు? కచ్చితంగా మనిషిని నమ్మడానికి వీల్లేదు. తన సంపదను దేవుడే కాపాడుకోవాలి. ఇదంతా ఎందుకంటే ఒడిషా లోని అత్యంత ప్రాచీనమైన పూరీ జగన్నాథుని దేవాలయంలో అంతులేని శ్రీవారి సంపదలు ఉన్న భాండాగారం గది తాళాల మిస్సింగ్ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. తాళాలు ఎలా పోయాయో ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఆలయ కమిటీ ఏమీ తెలీదంటోంది. తాళాలు పోయిన యాభై ఏళ్ల తర్వాత కూడా ఎవ్వరిలోనూ కంగారు లేదు. వాటిని వెతికి పట్టుకోవాలన్న ఆతృత లేదు. పాలకుల వైఖరిని చూసి భక్తులు మండిపడుతున్నారు. దేవ దేవుడి ఆభరణాలు ఉన్నాయా? దిగమింగేశారా? చెప్పండంటూ నినదిస్తున్నారు. దేశంలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి. ఈ నాలిగింటినీ కలిపి చార్ ధామ్ ఆలయాలుగా పిలుస్తారు. వీటితో పాటు మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం. 12వ శతాబ్ధంలో రాజా అనంత వర్మ చోడగంగదేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలై ఆయన మనవడు అనంగ భీమ్ దేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువు తీరి ఉంటాయి. కృష్ణుని ఆరాధించే వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం. దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారి అయినా జగన్నాథుని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు.ఇక్కడ నిత్యం దేవ దేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండల్లోనే వండుతారు.ఇక ఏటా జూన్, జులై నెలల్లో జరిగే జగన్నాథ రథ యాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ మరీ వస్తారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్ధం. అంటే ముల్లోకాలనూ చల్లగా చూసే విష్ణుమూర్తే అని అర్ధం చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్ధిగా ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. సమాధానం లేని ప్రశ్నలా అందరినీ వేధిస్తోంది. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే 12వ శతాబ్ధం నుండి 18వ శతాబ్ధం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవ దేవుడికి విలువైన ఆభరణాలు, బంగారం వెండి వజ్ర వైఢూర్యాలు వంటి ఎన్నో కానుకలను భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు. ఈ సంపదలన్నింటినీ శ్రీక్షేత్రంలోని రత్నభండాగారంలోని మూడో గదిలో దాచారు. ఎప్పుడో 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్నభాండాగారాన్ని తెరిపించినపుడు అందులో 597కి పైగా రక రకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి సంపదను వెలగట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైఢూర్య, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాశులు రాశులుగా పోసి ఉన్నట్లు గురించారు. రత్నభాండాగారంలోని రహస్యగదిగా పిలుస్తోన్న మూడో గది కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళ్తే మరిన్ని గదుల్లోకి వెళ్లచ్చని, వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని వందేళ్ల క్రితం నాటి నిపుణులు అంచనా వేశారు. అంతా బానే ఉంది కానీ కొన్నేళ్లుగా ఈ రహస్య గదే పెద్ద మిస్టరీగా మారింది. రత్నభాండాగారంలోని మూడో గదికి మూడు తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున మూడు తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళంచెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది. మరో తాళంచెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది. ఇక మూడో తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది. ఈ మూడు తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తెరవడం కుదరదు. రత్నభాండాగారంలోని మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినపుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు. పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఈ గదిలో భద్రపరుస్తారు. రెండో గదిలోనూ విలువైన వస్తువులున్నాయి. అయితే మూడో గదిని మాత్రం దశాబ్ధాలుగా తెరవనే లేదు. ఎందుకు తెరవడం లేదో ఎవరికీ అర్దం కావడం లేదు. మొత్తానికి భక్తులు, ప్రజాసంఘాలు పదే పదే అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత తేలిందేంటంటే ఈ మూడు తాళాల్లో ఒక తాళం కనిపించడం లేదని. దేవాలయం ఉండే ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ 2018లో అధికారికంగా రత్నభాండాగారానికి చెందిన మూడో గదికి సంబంధించిన ఒక తాళం పోయిందని అది ఎక్కడికిపోయిందో తెలవడం లేదని ప్రకటించారు. దాంతో ప్రభుత్వంపైనా ఆలయ పాలనా యంత్రాంగం పైనా విమర్శలు వెల్లువెత్తాయి.1964లో చివరి సారి మూడో గదిని తెరిచినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత తాళం కనిపించకపోవడంతో తెరవలేదని అంటున్నారు. దీనిపై విపక్షాలు విరుచుకుపడటంతో కొన్నాళ్ల కింద పాలక పక్ష మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ దేవ దేవుడి ఆభరణాలు కానీ సంపద కానీ ఎక్కడికీ పోలేదని.. పూచిక పుల్ల కూడా ఎవరూ దోచుకుపోలేదని అన్నీ భద్రంగానే ఉన్నాయని వివరణ ఇచ్చారు. అసలు తాళాలు పోయాయని ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జస్టిస్ రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని నియమించారు. తాళాలు పోవడంలో ఎవరి పాత్ర ఉందో తేల్చడంతో పాటు మొత్తం వ్యవహారంలో ఎవరు బాధ్యులో తేల్చాలని ఆయన ఆదేశించారు. రఘువీర్ దాస్ కమిటీ నెలల తరబడి దర్యాప్తు చేసిన తర్వాత 324 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఆ నివేదికలో ఏం ఉందన్నది మిస్టరీగా మారింది. 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న రెండు తాళాలతో మూడో గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. అయితే రెండు తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు భయానక శబ్ధాలు రావడంతో భయంతో ఆ తలుపులను తిరిగి మూసివేసి వెనక్కి వెళ్లిపోయారని చెబుతారు. ఆలయం నిర్మించిన నాటి నుండి ఇక్కడ పనిచేసే అర్చకులు, సేవకులు, ఇతర సిబ్బంది కూడా వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల వాళ్లే కొనసాగుతున్నారు.ప్రధాన అర్చకులయితే.. ఓ అడుగు ముందుకేసి దేవాలయ రత్నభాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టం అని హెచ్చరిస్తున్నారు. దేవుడి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనం అయిపోతుందని పెను విపత్తులు తరుముకు వస్తాయని వారు బెదిరిస్తున్నారు. జగన్నాధుని భక్తితో కొలిచే వారు మాత్రం తమ దేవుడి సంపద భద్రంగా ఉందో లేదో స్పష్టం చేయాలంటున్నారు. మూడో గది తాళాలు ఎలా పోయాయో ఎవరు కొట్టేశారో ఎందుకు తేల్చడం లేదంటూ వారు నిలదీస్తున్నారు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనూ నేలమాళిగల్లో అపార ధనరాశులు ఉన్నాయన్న సమాచారంతో కోర్టు ఆదేశాలతో నేలమాళిగలను తెరిచారు. అయితే అందులో ఆరు నేలమాళిగలు ఉండగా అధికారులు కేవలం అయిదు నేలమాళిగలను మాత్రమే తెరిచారు. నిజానికి ఈ ఆరో నేలమాళిగే అన్నింటిలోకీ కీలకమైందని అప్పుడు ప్రచారం చేశారు. ఎందుకంటే మిగతా అయిదు నేలమాళిగలతో పోలిస్తే ఆరో నేలమాళిగ చాలా పెద్దదని ఆలయ సిబ్బంది కూడా చెబుతున్నారు. ఆరో నేలమాళిగ కన్నా చాలా చిన్నవైన ఇతర నేలమాళిగల్లోనే ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే ఆరో నేలమాళిగలో దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ ధనరాశులు కచ్చితంగా ఉంటాయన్నది వారి వాదన. అయితే అధికారులు మాత్రం ఆరో నేలమాళిగను ఈ రోజుకీ తెరవలేదు. ఆరో నేలమాళిగ ను మూసి ఉంచిన ఇనుప తలుపులపై నాగసర్పం బొమ్మ ఉంది. ఆ తలుపులను నాగబంధంతో బంధించారని ప్రచారం జరుగుతోంది. ఆ నాగబంధాన్ని ఖాతరు చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికే అరిష్టమని దేవుడి ఉగ్రరూపం విలయ రూపంలో విరుచుకుపడి మానవాళిని నాశనం చేసేస్తుందని ఆలయ పూజారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడే ఏదో మెలిక ఉందనిపిస్తుందంటున్నారు హేతువాదులు. ఒకే దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో అయిదు మాళిగల తలుపులు తెరిస్తే ఏమీ కానిది ఆరో మాళిగ తెరిస్తేనే ఏదో అయిపోతుందని అనడంలో అర్ధం ఏముందని వారు నిలదీస్తున్నారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న సున్నితమైన ఆలోచనతో ఆరో నేలమాళిగ తెరవకూడదని నిర్ణయించేసుకున్నారు. పూరీలోని జగన్నాథుని ఆలయంలోనూ కీలకమైన మూడో గదిలోనే లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా లక్షలాది పాములే ఉఏనేన్నాయా? లేక వేయి పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా? అన్నది అర్ధం కావడం లేదు. పాముల బుస బుసలు మాత్రం వినిపిస్తున్నాయని అధికారులు అన్నారన్న ప్రచారంలో ఎంత వరకు నిజముంది? వెంటనే ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని పూజారులు హెచ్చరించడం దీనికి కొనసాగింపా? అన్నది తెలియాల్సి ఉంది. అసలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? కొందరు భక్తులు అయితే మూడో గదిలోని విలువైన ఆభరణాలు, సంపదలను రాబందులు తన్నుకుపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టే మూడో గది తాళాల గురించి కానీ రఘువీర్ దాస్ కమిటీ నివేదిక గురించి కానీ ప్రభుత్వం మాట్లాడ్డం లేదని వారంటున్నారు.మూడో గదిని ప్రజల సమక్షంలో తెరిస్తే నిజా నిజాలు బయటకు వస్తాయని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరో నేలమాళిగ తరహాలోనే పూరీ జగన్నాథ ఆలయంలోని కీలకమైన ఈ మూడోగది మిస్టరీ కూడా ఎప్పటికీ వీడకపోవచ్చునని కొందరు మేథావులు అంటున్నారు. పాలకులు మాత్రం ఏమీ అనడం లేదు. ఆలయ సిబ్బంది కూడా బెల్లంకొట్టిన రాయిలా మాట్లాడ్డం లేదు. భక్తులు మాత్రం దేవుడికి అపచారం జరిగిందని బాధపడుతున్నారు. అది దేశానికి ఏ మాత్రం మంచిది కాదని ఏ క్షణంలో ఏం ముంచుకు వస్తుందోనని వారు భయపడుతున్నారు. ఇక నిజా నిజాలు వెలికి తీసి దోషులకు శిక్షపడేలా చేయాల్సింది ఆ జగన్నాథుడే. ఆయనే కద జగన్నాటక సూత్రధారి. తన ఆస్తులను ఎవరు కొట్టేశారో పట్టుకుని బోనులో పెట్టాల్సింది దేవుడే ఇక. భక్తుల మనోభావాలను అడ్డుపెట్టుకుని దేవుడి సంపదలు కొల్లగొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆధ్యాత్మిక వాదులు హెచ్చరిస్తున్నారు. వెలకట్టలేని అపార దేవుడి సంపదకు రక్షణ కల్పించాల్సిన పాలకులు ఘోరంగా విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిజానిజలేంటో వెలుగులోకి తీసుకురావాలని వారు పట్టుబడుతున్నారు. -
దేవుడి సొమ్ము భద్రమేనా?
-
ఒడిశా సీఎం కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్‌పై భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. పూరీ నగరంలోని దర్జీపోఖారీ ఛక్ వద్ద బుధవారం ఈ దాడి జరిగింది. శ్రీ జగన్నాథ్ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం పట్నాయక్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని బీజేవైఎం కార్యకర్తలు అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్‌పైకి కోడిగుడ్లు విసిరారు. ఇవి నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోంశాఖ సహాయ మంత్రి దిబ్య శంకర్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మంత్రుల వాహనాలపై కోడిగుడ్ల దాడులకు పాల్పడింది. మహిళా టీచర్ మమతా మెహర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు గోబింద సాహుతో శంకర్ మిశ్రాకు సంబంధాలున్నాయని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోడిగుడ్ల దాడులు జరుగుతున్నాయి. సీఎం కాన్యాయ్‌పై కోడిగుడ్ల దాడి చేసింది తామేనని బీజేవైఎం ఒడిశా అధ్యక్షుడు ఇరాసిస్ ఆచార్య తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా నిరసన తెలుపుతుంటామన్నారు. దిబ్య శంకర్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించే వరకు ఇదే తరహాలో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. (చదవండి: పెళ్లి బాజాలతో.. 65 కోళ్లు మృతి!.. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో!!) -
రాత్రి బహిర్భూమికి వెళ్లిన వివాహిత చేతులు కాళ్లను టవల్‌తో కట్టేసి..
భువనేశ్వర్: దేశంలో ప్రతి రోజు ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరిని వదలం లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో వైపు నుంచి ప్రమాదాలు ఉప్పెనల పొంచుకొస్తున్నాయి. తాజాగా మరో అఘాయిత్యం వెలుగు చూసింది. రాత్రి పూట కాల కృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒడిశాలోని పూరి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిమపరా ప్రాంతంలో శనివారం రాత్రి 22 ఏళ్ల వివాహిత బహిర్భూమికి ఒంటరిగా గ్రామంలోని నది ఒడ్డుకు వెళ్లింది. చదవండి: యూట్యూబర్ మరోసారి అరెస్ట్.. పవిత్ర స్థలంలో వీడియో చిత్రీకరణ అయితే ఆమె ఒంటరిగా వచ్చిందనే విషయన్ని నలుగురు వ్యక్తులు గమనించారు. మహిళ నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లే వరకు వేచి చూసి ఆపై ఆమె చేతులు కాళ్లను బలవంతంగా టవల్‌తో కట్టేసి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎంతసేపటికీ మహిళ తిరిగి రాకపోవడంతో భర్త, కుటుంబ సభ్యులు వివాహితను వెతకడానికి వెళ్లారు. అదే సమయంలో నదీ ఒడ్డున మహిళ ఏడుస్తూ కనిపించింది. కుటుంబ సభ్యులకు జరిగిన విషయం వివరించగా.. ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి నిందితులపై కేసు నమోదు చేశారు. చదవండి: విషాదం: తల్లీకూతుళ్లను కబళించిన మృత్యువు నిందితులు.. బలరాం భోయి, అతని సహచరులు కన్హయి భోయి, బిద్యాధర్, అజిత్ దాస్‌గా పోలీసులు గుర్తించారు. నలుగురు నిందితులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో త్వరితగతిన చర్యలు తీసుకుంటామని పూరీ ఎస్పీ కన్వర్ విశాల్ సింగ్ హామీ ఇచ్చారు. నిందితులపై 30 రోజుల్లోగా చార్జిషీట్‌ను ఫైల్ చేసి కోర్టులో సమర్పిస్తామని పేర్కొన్నారు. -
ఈ దసరా పండగకు ప్రముఖ పుణ్యక్షేత్రం మూసివేత
పూరీ: ప్రముఖ పుణ్యక్షేత్రంగా అలరారుతండే పూరీ జగన్నాథుని ఆలయాన్ని కోవిడ్ -19 దృష్ట్యా కొత్త నిబంధనల కారణంగా తొమ్మిది రోజులు మూసేస్తున్నట్లు అలయ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా దసరా సందర్భంగా జగన్నాథుడు 'సున భేష' (బంగారు వస్త్రధారణ)లో దర్శనమిస్తాడు. పైగా ఈ దసరా సమయంలో భక్తుల తాకిడి అధికమవుతుందన్న నేపథ్యంలోనే వారి ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. త్రిమూర్తులు భగవాన్ బలభద్రడు, దేవి సుభద్ర దేవి జగన్నాథుడుని దసరాలో విజయ దశమి పర్వదినం రోజుతో సహా సంవత్సరంలో ఐదుసార్లు 'సునా భేస' (బంగారు వస్త్రధారణతో) అలంకరిస్తారు. (చదవండి: ఎర్ర జెండాలనే ఎందుకు వాడుతున్నారో తెలుసా?) అయితే ఈ ఉత్సవానికి 12వ శతాబ్దకాలం నుంచి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అటువంటి ప్రత్యేకతను సంతరించకున్న ఈ దర్శనం కోసం ఏటా కొన్ని లక్షల మంది భక్తులు ఆర్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే మళ్లీ అక్టోబర్ 20 నుంచి ఆలయం తెరిచి ఉంటుందని, ఈ మేరకు ప్రజలు యథావిధిగా దర్శనం చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాదు వచ్చే నెలలో 'దీపావళి' (నవంబర్ 4), 'బడా ఏకాదశి' (నవంబర్ 15) 'కార్తీక పూర్ణిమ' (నవంబర్ 19) వంటి పర్వదినాల్లో కూడా ఆలయానన్ని మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పడం గమనార్హం. (చదవండి: మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే అటా!) -
నేడు జగన్నాథుని రథయాత్ర.. వారికి నో ఎంట్రీ
సాక్షి, భువనేశ్వర్/పూరీ: జగన్నాథుని రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతం. జనసంద్రం నడుమ అత్యంత వైభవంగా జరగాల్సిన యాత్ర ఆద్యంతాలు ఈ ఏడాది కరోనా కారణంగా జనసంచారం లేని వీధుల గుండా సోమవారం జరగబోతోంది. శ్రీమందిరం నుంచి గుండిచామందిరం వరకు సాగే ఈ యాత్రలో బొడొదండొ దారి పొడవునా బలభద్ర, సుభద్ర, జగ న్నాథుని రథాలను లాగే గొప్ప కార్యక్రమం చోటుచేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో తగిన ఏర్పాట్లను నిర్వాహకులు చేశారు. కోవిడ్ నియంత్రణ చర్యల దృష్ట్యా గతేడాది తరహాలో లాగే ఈసారి కూడా యాత్రకు భక్తులకు ప్రవేశం నిషేధిస్తూ చర్యలు చేపట్టడం గమనార్హం. సింహద్వారం ప్రాంగణంలో శానిటైజ్ చేస్తున్న సిబ్బంది పరిమితమైన సిబ్బంది, సేవాయత్‌లతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలతో యాత్ర నిర్వహిస్తారు. ఇప్పటికే యాత్రలో పాల్గొనే వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అంతకుముందే ఆయా వర్గాల వారికి కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేశారు. పోలీస్ సిబ్బంది, సేవాయత్‌లు మినహాయిస్తే యాత్ర కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు దాదాపు 1000 మంది అధికారులు వరకు అందుబాటులో ఉంటారని పూరీ జిల్లా కలెక్టర్ సమర్థ వర్మ తెలిపారు. సుప్రీంకోర్టు ఆంక్షలకు అనుగుణంగా రథాలను లాగేందుకు సేవాయత్‌లు, పోలీసులను మాత్రమే నియమించారు. ఈ క్రమంలో ఒక్కోరథం లాగేందుకు గరిష్టంగా 500 మంది ఉంటారని అధికారులు తెలిపారు. యాత్రా స్థలంలో మోహరించిన భద్రతా బలగాలు భద్రత కట్టుదిట్టం.. కరోనా కట్టడిలో భాగంగా యాత్రలో జనసమూహం నివారణకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పూరీ జిల్లా రైల్వేస్టేషన్‌ని చేరుకునే రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో పాటు పట్టణంలో కర్ఫ్యూ విధించి, పట్టణ సరిహద్దుల్లో ఇతర ప్రాంతాల వారి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఈ నెల 13వ తేదీ వరకు కర్ఫ్యూ నిబంధనలు కొనసాగుతాయి. ఇదిలా ఉండగా, రథయాత్ర ఏర్పాట్లను ఆదివారం సమీక్షించిన అదనపు డీజీపీ ఆర్.కె.శర్మ మాట్లాడుతూ పూరీ పట్టణాన్ని 12 జోన్లుగా విభజించి, 65 ప్లాటూన్ల పోలీస్ బలగాలతో భద్రతా చర్యలు చేపట్టామన్నారు. భద్రతా బలగాల్లో 10 మంది అదనపు పోలీస్ సూపరింటెండెంట్లు, 31 మంది డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్లు, 64 మంది ఇన్స్పెక్టర్లు, 222 మంది సహాయ సబ్–ఇన్స్పెక్టర్లు, సబ్–ఇన్‌స్పెక్టర్లుని నియమించినట్లు పూరీ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె.వి.సింఘ్ తెలిపారు. నందిఘోష్ రథం వద్దకు ఆజ్ఞామాలను తీసుకువెళ్తున్న దృశ్యం ఆజ్ఞామాలలతో పూజలు.. రథ నిర్మాణ శాల శ్రీమందిరం ఆవరణకు చేర్చిన జగన్నాథ, సుభద్ర, బలభద్రుని రథాలకు మూలవిరాట్ల దగ్గరి నుంచి బాజాభజంత్రీలు, మేళతా ళాలు, ఘంటానాదంతో తీసుకువచ్చిన ఆజ్ఞామాలలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక గోవర్థన పీఠాధిపతి, ఆదిశంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతికి ఆలయ సంప్రదాయ రీతిలో అధికారిక పిలుపు చేశారు. రథాలపై యాత్రకు ఆసీనులైన మూలవిరాట్లను తొలుత ఆదిశంకరాచార్యులు ప్రత్యక్షంగా దర్శించుకుని, స్వామి తొలి దర్శనం స్వీకరిస్తారు. సూక్ష్మ రథాలు.. సూపర్! జగన్నాథుని రథయాత్ర పురస్కరించుకుని, నగరంలోని శ్రీరామ్‌నగర్‌కి చెందిన ప్రముఖ శిల్పి హరగోవింద మహరణ తన కళా నైపుణ్యం ఉపయోగించి, బియ్యం, గోదుమలతో తయారు చేసిన బలభద్ర, సుభద్ర, జగన్నాథుని సూక్ష్మ రథాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రోజుకు మూడు గంటలు చొప్పున కష్టపడగా, వారం రోజుల్లో ఇవి పూర్తయినట్లు సమాచారం. – బరంపురం