భారతదేశంలో అత్యం ప్రసిద్ధి గాంచిన పూరీ క్షేత్రంలో జగన్నాథుడిని, బలభద్రుడిని ఏకదంతుడి రూపంలో ముస్తాబు చేసి మరీ పూజలు చేస్తారు. ఈ వేడుకనే ‘హాథీబేష’ (ఏనుగు వేషం) అని పిలుస్తారు. ఇలా ఆషాడ మాసంలో గణపతి రూపంలో ముస్తాబు చేసి మరీ జగన్నాథుడిని పూజిస్తారు. ఈ వేడు జేష్ట పౌర్ణమి రోజున జరగుతుంది. ఇలా పూరీ జగన్నాథుడుని పూజించడానికి కారణం ఉందంటూ.. మంచి ఆసక్తికర గాథ ఒకటి చెబుతుంటారు పండితలు. అదేంటంటే..
పూర్వం రోజులలో పూరి రాజు దగ్గరికి గణపతి భక్తుడు అయిన గణపతి బప్ప అనే పండితుడు వచ్చాడు. ఆ సమయంలో పూరిలో జగన్నాథుడిని స్నాన యాత్ర వేడుకకు సిద్ధం చేస్తున్నారు. ఆ వేడుకలో పాల్గొనవల్సిందిగా గణపతి బట్టను రాజు ఆహ్వానిస్తాడు.దానికి ఆయన తాను గణపతిని మాత్రమే పూజిస్తానని, ఆయన తనకు అన్నీ అని చెబుతాడు. అయితే రాజు ఒత్తిడి చేయడంతో అయిష్టపూర్వకంగానే జగన్నాధుడి స్నాన యాత్రకు గణపతి బప్ప రావడం జరగుతుంది.
అయితే అక్కడికి వెళ్లేసరికి ఊహకే అందని లీలా వినోదం సృష్టిస్తాడు ఆ దేవాదిదేవుడు జగన్నాథుడు. ఆ పూరీ క్షేతంలోని జగన్నాథుడు, పండితుడి గణపతి బప్ప కంటికి ఏకదంతుడి రూపంలో రూపంలో కనిపిస్తాడు. ఇదేంటి జగన్నాథుడు గణనాథుని రూపంలో కనిపించడం ఏంటని ఆశ్చర్యపోతాడు. ఇది కల మాయా అని గందరగోళానకి లోనవ్వుతాడు. విచిత్రంగా బలభద్రుడు కూడా ఏకందంతుడి రూపంల కనిపించడంతో మరంత విస్తుపోతాడు. అప్పుడు గణపతి బప్పకి తన అజ్ఞానానికి కన్నీరుమున్నీరుగా విలపిస్తాడు. తనకు బుద్ధి చెప్పాలనే ఆ చిలిపి కృష్ణుడు ఇలాంటి మాయ చేశాడని గ్రహిస్తాడు.
భగవంతుడు ఏ రూపంలో ఉన్న పరమాత్మ అనేది ఒక్కటే అనే విషయం తెలుసుకుంటాడు. ఆనాటి నుంచే పూరి జనన్నాథుని రథయాత్రకు ముందు అనగా జేష్ట పౌర్ణమి రోజు జరిపే స్నాన యాత్ర సమయంలో ఆలయ పూజరులు జగన్నాథ, బలభద్రుల ముఖాలకు ఏనుగు తొడుగులు ధరింపజేస్తారు.బలరాముడు తెల్ల ఏనుగు రూపంలో, జగన్నాథుడు నల్ల ఏనుగు రూపంలో భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిస్తాడు. దీన్ని పూరి దేవాలయా సంప్రదాయంలో హాథిబేష అని పిలుస్థారు. ఇలా పూరీ జగన్నాథుని ఏకదంతుడి రూపంలో ధరిస్తే తమకు మంచి జరగుతుందని భక్తలు ప్రగాఢ నమ్మకం.
Comments
Please login to add a commentAdd a comment