Ganapathi
-
రేణూ దేశాయ్ ఇంట గణపతి, చండీ హోమం.. పాల్గొన్న అకీరా (ఫోటోలు)
-
రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం లడ్డూ వేలం విరాళాలు
-
బాలాపూర్ లడ్డు వేలం పాట ఫుల్ వీడియో
-
Karnataka: గణపతి నిమజ్జనంలో ఉద్రిక్తత
మాండ్య: కర్ణాటకలోని మాండ్యలో గణేష్ నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్లు రువ్వడం, విధ్వంసం సృష్టించడం వంటి ఘటనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనల్లో పలు దుకాణాలు, వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘర్షణలు మైసూరు రోడ్డులోని దర్గా సమీపంలో చోటుచేసుకున్నాయి. ఈ ఉదంతంలో పోలీసులు 46 మందిని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జి చేశారు. నాగమంగళ పట్టణంలో గణేష్ విగ్రహ నిమజ్జనం కోసం బద్రికొప్పలు గ్రామానికి చెందిన కొందరు యువకులు ఊరేగింపు నిర్వహిస్తుండగా, రెండు వర్గాల యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. తరువాత ఊరేగింపుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.రాళ్లదాడిలో కొందరు గాయపడ్డారని, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని సమాచారం. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు ఈ ప్రాంతంలో సీఆర్పీసీ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. అల్లర్లుకు పాల్పడిన 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని మాండ్యా కంటే ముందు గుజరాత్‌లోని సూరత్‌లోనూ ఇలాంటి దృశ్యమే కనిపించింది. అల్లరి మూకలు గణపతి మండపంపై రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. ఈ ఉదంతంలో 28 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇది కూడా చదవండి: గణేష్ లడ్డూ చోరీ VIDEO | Tensions gripped Nagamangala town in Karnataka's Mandya district earlier today (Wednesday) following clashes between two groups during Ganpati Visarjan. Stones were allegedly thrown on the procession, which led to the clashes. Section 144 has been imposed in the area.… pic.twitter.com/mlx8b4DzgQ— Press Trust of India (@PTI_News) September 11, 2024 -
పూరి జగన్నాథుడిని గణనాథుడిగా ఆరాధిస్తారని తెలుసా..!
భారతదేశంలో అత్యం ప్రసిద్ధి గాంచిన పూరీ క్షేత్రంలో జగన్నాథుడిని, బలభద్రుడిని ఏకదంతుడి రూపంలో ముస్తాబు చేసి మరీ పూజలు చేస్తారు. ఈ వేడుకనే ‘హాథీబేష’ (ఏనుగు వేషం) అని పిలుస్తారు. ఇలా ఆషాడ మాసంలో గణపతి రూపంలో ముస్తాబు చేసి మరీ జగన్నాథుడిని పూజిస్తారు. ఈ వేడు జేష్ట పౌర్ణమి రోజున జరగుతుంది. ఇలా పూరీ జగన్నాథుడుని పూజించడానికి కారణం ఉందంటూ.. మంచి ఆసక్తికర గాథ ఒకటి చెబుతుంటారు పండితలు. అదేంటంటే..పూర్వం రోజులలో పూరి రాజు దగ్గరికి గణపతి భక్తుడు అయిన గణపతి బప్ప అనే పండితుడు వచ్చాడు. ఆ సమయంలో పూరిలో జగన్నాథుడిని స్నాన యాత్ర వేడుకకు సిద్ధం చేస్తున్నారు. ఆ వేడుకలో పాల్గొనవల్సిందిగా గణపతి బట్టను రాజు ఆహ్వానిస్తాడు.దానికి ఆయన తాను గణపతిని మాత్రమే పూజిస్తానని, ఆయన తనకు అన్నీ అని చెబుతాడు. అయితే రాజు ఒత్తిడి చేయడంతో అయిష్టపూర్వకంగానే జగన్నాధుడి స్నాన యాత్రకు గణపతి బప్ప రావడం జరగుతుంది. అయితే అక్కడికి వెళ్లేసరికి ఊహకే అందని లీలా వినోదం సృష్టిస్తాడు ఆ దేవాదిదేవుడు జగన్నాథుడు. ఆ పూరీ క్షేతంలోని జగన్నాథుడు, పండితుడి గణపతి బప్ప కంటికి ఏకదంతుడి రూపంలో రూపంలో కనిపిస్తాడు. ఇదేంటి జగన్నాథుడు గణనాథుని రూపంలో కనిపించడం ఏంటని ఆశ్చర్యపోతాడు. ఇది కల మాయా అని గందరగోళానకి లోనవ్వుతాడు. విచిత్రంగా బలభద్రుడు కూడా ఏకందంతుడి రూపంల కనిపించడంతో మరంత విస్తుపోతాడు. అప్పుడు గణపతి బప్పకి తన అజ్ఞానానికి కన్నీరుమున్నీరుగా విలపిస్తాడు. తనకు బుద్ధి చెప్పాలనే ఆ చిలిపి కృష్ణుడు ఇలాంటి మాయ చేశాడని గ్రహిస్తాడు. భగవంతుడు ఏ రూపంలో ఉన్న పరమాత్మ అనేది ఒక్కటే అనే విషయం తెలుసుకుంటాడు. ఆనాటి నుంచే పూరి జనన్నాథుని రథయాత్రకు ముందు అనగా జేష్ట పౌర్ణమి రోజు జరిపే స్నాన యాత్ర సమయంలో ఆలయ పూజరులు జగన్నాథ, బలభద్రుల ముఖాలకు ఏనుగు తొడుగులు ధరింపజేస్తారు.బలరాముడు తెల్ల ఏనుగు రూపంలో, జగన్నాథుడు నల్ల ఏనుగు రూపంలో భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిస్తాడు. దీన్ని పూరి దేవాలయా సంప్రదాయంలో హాథిబేష అని పిలుస్థారు. ఇలా పూరీ జగన్నాథుని ఏకదంతుడి రూపంలో ధరిస్తే తమకు మంచి జరగుతుందని భక్తలు ప్రగాఢ నమ్మకం.(చదవండి: సకలకార్యాల సిద్ధికై.. తొలిపూజ మహాగణపతికే!) -
Mumbai: తప్పక చూడాల్సిన ఐదు అద్భుత గణపతులు
ముంబై: సెప్టెంబర్ 7 నుంచి దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. వినాయకుని జన్మదినోత్సవం సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. మహారాష్ట్రలో 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలను భారీ స్థాయిలో నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో గణపతి భారీ విగ్రహాలను వీధుల్లోని అద్భుత వేదికలలో ప్రతిష్టిస్తారు. ముంబైలో ఏర్పాటు చేసే ఐదు గణపతి విగ్రహాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. వాటిని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు.లాల్బాగ్చా రాజాసెంట్రల్ ముంబైలోని లాల్బాగ్ మార్కెట్లోని లాల్బాగ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని 'లాల్బాగ్చా రాజా' అత్యంత ప్రసిద్ది చెందిన వినాయక మండపంగా పేరొందింది. లాల్‌బాగ్‌లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాన్ని నవసాచ గణపతి అంటారు. ఈ రూపంలోని గణేశుడు అన్ని కోరికలను తీరుస్తుంటాడని చెబుతారు. 10 రోజుల పాటు ఇక్కడ జరిగే గణేష్ ఉత్సవాల్లో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనం కోసం క్యూ కడతారు.అంధేరీచా రాజాముంబయిలో గణేశోత్సవాలను చూసేందుకు వచ్చే భక్తులు తప్పనిసరిగా అంధేరీచా రాజాను సందర్శిస్తుంటారు. అంధేరీచా రాజాను 'నవసాల పవనార గణపతి' లేదా 'కోరికలను నెరవేర్చే గణేశుడు' అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం అంధేరీచా మండపం థీమ్ విభిన్నంగా ఉంటుంది. ఇది భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది.ముంబైచా రాజాముంబైలోని అత్యంత ప్రసిద్ధి చెందిన లాల్బాగ్చా రాజా గణేష్ మండపానికి కొద్ది దూరంలో మరొక ప్రసిద్ధ గణపతి మండపం ఉంది. గణేష్ గల్లీలో ఉన్న ఈ మండపంలో కొలువైన గణపతిని ముంబైచా రాజా అని పిలుస్తారు. ముంబైలోని పురాతన గణేష్ మండపాలలో ఒకటైన ముంబైచా రాజా 1928 నుండి పూజలందుకుంటున్నాడు. ఈ గణేష్ మండపం థీమ్ ప్రతి సంవత్సరం ఎంతో భిన్నంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ముంబై చా రాజాను సందర్శించి, ఆశీస్సులు పొందుతారు.జీఎస్బీ సేవా మండల్ముంబైలోని కింగ్స్ సర్కిల్లో ఉన్న జీఎస్బీ సేవా మండల్లోని గణపతి విగ్రహం దేశంలోనే అత్యంత సంపన్నమైనదిగా చెబుతారు. ఈ ఆకర్షణీయమైన విగ్రహాన్ని బంగారు, వెండి ఆభరణాలతో అలంకరిస్తారు. పంచధాతు (బంగారం, వెండి, రాగి, జింక్,తగరం) మిశ్రమంతో ఈ విగ్రహాన్ని రూపొందిస్తారు.ఖేత్వాడిచా గణరాజ్ప్రకాశవంతమైన లైట్లు, పూలతో అలంకరించిన ఖేత్వాడిచా గణరాజ్ మండపం దక్షిణ ముంబైలోని ఖేత్వాడి ప్రాంతంలో ఉంది. ఇది 40 అడుగులకుపైగా ఎత్తు కలిగివుంటుంది. 1959లో తొలిసారి ఇక్కడ గణపతిని నెలకొల్పారు. ఈ పూజా వేదిక ముంబైలోని ప్రముఖ గణపతి మండపాలలో ఒకటి. -
సకుటుంబ సమేత.. త్రినేత్ర గణపతి!
సకల విఘ్నాలనూ తొలగించే దైవంగా తొలి పూజలు అందుకొనే వేలుపు గణనాథుడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని సూచించే పురాణగాథలు ఉన్నప్పటికీ, ఏ ఆలయంలోనైనా గణేశుడు ఒక్కడే దర్శనమిస్తాడు. ఇద్దరు భార్యలతోనూ కనిపించే ఆలయాలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి అరుదైన కోవెళ్ళలోకెల్లా అరుదైన ఆలయం ఒకటుంది. ఇక్కడ భార్యలతో పాటు పుత్రులతో కూడా కలిసి కొలువు తీరాడు పార్వతీ తనయుడు.రణథంబోర్ వినాయకుడిని పరమ శక్తిమంతునిగా, రాజ్య రక్షకునిగా స్థానిక చరిత్ర అభివర్ణిస్తోంది. అది క్రీస్తుశకం 1299వ సంవత్సరం. రణథంబోర్ రాజు హమీర్‌కూ, ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకీ మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధ సమయంలో సైనికుల కోసం ఆహారాన్నీ, అవసరమైన ఇతర సరుకులనూ కోటలోని గోదాముల్లో నిల్వ చేశారు. ఈ యుద్ధం చాలా సంవత్సరాలు సాగడంతో గోదాముల్లో నిల్వలు నిండుకున్నాయి. వినాయకునికి పరమ భక్తుడైన హమీర్‌కు ఏం చెయ్యాలో పాలు΄ోలేదు. భారమంతా గణపతి మీద వేశాడు.ఒక రోజు రాత్రి అతను నిద్ర΄ోతూండగా ఏకదంతుడు కలలోకి వచ్చాడు. సమస్యలన్నీ మర్నాటి పొద్దుటికల్లా తీరి΄ోతాయని అభయం ఇచ్చాడు. మరునాడు కోటలోని ఒక గోడ మీద మూడు నేత్రాలున్న వినాయకుని ఆకృతి దర్శనం ఇచ్చింది. దరిమిలా యుద్ధం ముగిసి΄ోయింది. ఖిల్జీ సేనలు వెనుతిరిగాయి. మరో చిత్రం ఏమిటంటే కోటలోని గోదాములన్నీ సరుకులతో నిండి ఉన్నాయి. గణేశుడే తన రాజ్యాన్ని రక్షించాడనీ, ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటాడనీ భావించిన హమీర్ క్రీ.శ. 1300 సంవత్సరంలో కోటలోనే వినాయక ఆలయాన్ని నిర్మించాడు.ఇదీ విశిష్టత..ఈ ఆలయంలో వినాయకుడు మూడు నేత్రాలతో దర్శనం ఇస్తాడు. భార్యలైన సిద్ధి, బుద్ధి తోపాటు కుమారులైన శుభ్, లాభ్ కూడా గణేశునితో పాటు కొలువు తీరి పూజలందుకోవడం ఈ ఆలయ విశిష్టత. ఇలాంటిది మరే వినాయక ఆలయంలోనూ కనిపించదు. స్వామికి ప్రతిరోజూ అయిదు సార్లు హారతులు ఇస్తారు. అర్చకులతోపాటు భక్తులు కూడా సామూహిక ్రపార్థనలూ, భజనగీతాలాపనలూ చేస్తారు. ఈ స్వామిని పూజిస్తే విద్య, విజ్ఞానాలతోపాటు సంపదనూ, సౌభాగ్యాన్నీ అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం.ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి?రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మధోపూర్ జిల్లా రణథంబోర్‌లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల నుంచి సవాయ్ మాధోపూర్ జంక్షన్‌కు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 17 కి.మీ. దూరంలో ఉన్న రణథంబోర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రణథంబోర్‌కు సమీప విమానాశ్రయం సుమారు 150 కి.మీ. దూరంలోని జైపూర్ లో ఉంది.ఇవి చదవండి: డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్! -
గణపతిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తాం?అసలు కారణమిదే!
అందరి విఘ్నాలు తొలగించే వినాయకుడ్ని నవరాత్రుల అనంతరం నిమజ్జనం చేయడం ఆచారంగా వస్తుంది. సాధారణంగా హిందూ పండగల్లో వినాయక చవితికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశవ్యాప్తంగా గణనాథుడికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు. మండపాలు వేసి అందంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు పూజలు చేసి తర్వాత గంగమ్మ ఒడికి సాగనంపుతారు. హిందూ దేవుళ్లలో ఎవరికి పూజలు చేసినా ఆ ప్రతిమలను ఇంట్లోనే పెట్టుకుంటాం. కానీ ఒక్క వినాయకుడిని మాత్రమే నిమజ్జనం ఎందుకు చేస్తాం?దీని వెనకున్న కారణం ఏంటన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. గణపతి కేవలం గణాలకు అధిపతి మాత్రమే కాదు... ఘనమైన దైవం కూడా. ఎందుకంటే, ఈ సృష్టి యావత్తూ అనేకమైన గణాలతో కూడిన మహాగణమే. ఈ గణాలన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటూ, సృష్టిని శాసించే మహా శక్తిమంతుడు. అంతటి శక్తిమంతమైన దైవం కాబట్టే గణపతికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు భక్తులు. అందుకే ఆయన ఘనులకే ఘనుడు. రుతుధర్మాన్ననుసరించి జరుపుకునే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైనది. యేటా వర్షరుతువు చివర్లో భాద్రపద శుద్ధ చవితినాడు వస్తుందీ పండుగ. వేసవి తాపం తగ్గి, బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పుష్పాలు విచ్చి పరిమళం వెదజల్లుతుంటాయి. నదులలో నీరు నిండి జీవనతత్వం అభివృద్ధి చెందుతుంది. బుధుడు అధిపతియైన హస్త... వినాయకుని జన్మనక్షత్రం. బుధగ్రహానికి ఆకుపచ్చనివంటే ఇష్టం. వినాయకునికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనను గరికతోనూ, వివిధ ఆకులతోనూ పూజిస్తాం. మట్టితోనే ఎందుకు? గణేశుని మట్టితో చేయడం వెనుక కూడా విశేషముంది. ఈ కాలంలో జలాశయాల్లో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. నీళ్లు తేటపడతాయి. మట్టితో బొమ్మను చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి అంటితే మంచిది. ఒండ్రుమట్టిలో నానడం శరీరానికి మంచిదని ప్రకృతి చికిత్స వైద్యులు చెబుతుంటారు. ప్రకృతి చికిత్సకు ఒండ్రుమట్టిని వాడటం మనకు తెలిసిందే. షోడశోపచార పూజల్లో వాడే పత్రిని మనం తాకడం వల్ల కూడా వాటిలోని ఔషధ గుణాలు మనలోకి ప్రవేశిస్తాయి. తొమ్మిది రోజులు విగ్రహాన్ని, పత్రాలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో గాలి ఔషధ గుణాల్ని పంచుతుంది. ఎంతో మేలు చేస్తుంది. వినాయకుడిని దగ్గరలో ఉన్న చెరువు, నది లేదంటే బావిలో నిమజ్జనం చేస్తారు. అందుకు తగ్గట్లుగా ఈ కాలంలో నదులు, చెరువులు నిండుగా కళకళలాడుతుంటాయి. మట్టి విగ్రహాల్ని, పత్రిని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీటిలో ఉండే క్రిమి కీటకాలు చనిపోతాయి. కానీ ఈమధ్యకాలంలో గణపతికి రసాయనిక రంగులు వేస్తున్నారు. ఇలాంటి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటిలో నివసించే జీవులకు హానికారకమవుతుంది.అందుకే మట్టి గణపతులనే పూజించాలని చెబుతారు. నిమజ్జనమెందుకు? అయితే పదిరోజుల పాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని పదకొండోరోజున మేళతాళాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది. పాంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం, అంటే పంచభూతాల(భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం) నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్థమూ మధ్యలో ఎంత వైభవంగా, ఇంకెంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలసిపోవాల్సిందే.అలా ఎందుకంటే, భూమినుంచి పుట్టింది ఎంత గొప్పగా పెరిగినా, తిరిగి భూమిలోనే కలిసిపోతుందన్న సత్యాన్ని చాటేందుకే. దేనిమీదా వ్యామోహాన్ని పెంచుకోకూడదన్న నీతిని చెప్పేందుకే!ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేస్తారు. శాస్త్రీయ కారణాలు.. వినాయక నిమజ్జనం వేనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. వినాయక చవితి నాటికి.. జోరుగా వానలు కురిసి.. వాగులు, వంకలు, నదులు, చెరువులు పొంగి పొర్లుతుంటాయి. వరదలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక అలాంటి సమయంలో మట్టితో చేసిన గణపయ్య విగ్రహాలను నీళ్లల్లో నిమజ్జనం చేయడం వల్ల.. వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. అలానే వానాకాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు అధికంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా.. ఆయన పూజకు వాడిన ఆకులను కూడా నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు పరిశుభ్రంగా మారుతుందని చెబుతున్నారు. మట్టి గణపతి నీటిలో కలిశాక 23 గంటలకు తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగి ఉన్న రహస్యం. -
ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం సందడి
-
వినాయకుడి తొండం ఎటువైపు తిరిగి ఉంటే శ్రేయస్కరం
-
వినాయక చవితి విశిష్టత..!
-
ధన త్రయోదశి రోజున పూజ ఏ విధంగా చేయాలి ?
-
గణపతి రూపంలో కాకుండా వేరే రూపాల్లో గణపతిని తయారు చేయవచ్చా..?
-
గాజువాకలో కళ్లు చెదిరేలా భారీ గణపతి విగ్రహం..
-
ఎంత స్టార్ హీరో సినిమా అయినా వినాయకుడి పూజతో ప్రారంభించాల్సిందే!
శివపార్వతుల ముద్దుల కొడుకు విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈపర్వదినాన్ని కన్నులపండుగగా జరుపుకొంటారు. భారతీయ సమాజంలో వినాయక చవితికి విశిష్టమైన ప్రాముఖ్యం ఉంది, ఆది దంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుడిని పూజించనిదే ఏ పనీ ప్రారంభించరు, ఆ గణనాథుని కృప ఉంటే అన్నీ విజయాలే లభిస్తాయనేది ప్రజల విశ్వాసం. అందుకే ఇండస్ట్రీలో ఏ సినిమా ప్రారంభించినా మొదట వినాయకుడి పూజతోనే ప్రారంభం అవుతుంది. బేబీ నుంచి భగవంత్ కేసరి వరకు బొజ్జ గణపయ్యే వినాయక చవితి వస్తుందంటే గ్రామీణ ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా వినాయకుడి మండపాలతో పాటు భక్తుల కోలాహలం కనిపిస్తుంది. అలా నవరాత్రుల్లో ఊరూవాడల్లో సందడి కనిపిస్తుంది. సినిమా అంటే ఎవరికైనా ఒక ఎమోషన్ అందుకే మన ప్రతి పండుగలో సినిమా ఉంటుంది. అలాగే చాలా సినిమాల్లో మన పండుగలు, సంప్రదాయాలు కనిపించేలా మేకర్స్ చిత్రీకరిస్తారు. అందులో భాగంగా చాలా సినిమాల్లో వినాయకుడు ప్రతిమ ఇతి వృత్తంగా సినిమాలు చాలానే వచ్చాయి. మెగాస్టార్ కూడా జై చిరంజీవ సినిమాలో వినాయకుడి గొప్పతనాన్ని చాటుతూ స్టెప్పులేశాడు. ఈ మధ్య విడుదలైన బేబీ సినిమాలో కూడా హీరోయిన్ వైష్ణవి ఎంట్రీ కూడా మన గణపతి ముందు వేసిన స్టెప్పులతోనే ప్రారంభం అవుతుంది. బాలయ్య భగవంత్ కేసరి నుంచి తాజాగా విడుదులైన మొదటి పాట కూడా బొజ్జ గణపయ్యతోనే ప్రారంభం అవుతుంది. అందులో శ్రీలీల వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పుడు ప్రతి గణేషుడి మండపం వద్ద ఈ పాటు మారుమ్రోగుతుంది. అంతలా వినాయకుడు సినిమాలో భాగం అయిపోయాడు. వినాయకుడిలో తమ హీరోను చూసుకుంటున్న ఫ్యాన్స్ వినాయకుడు అంటే అందరికీ ఎంతో ప్రీతి.. ఆయన రూపం అందరినీ మెప్పిస్తుంది. అందుకే పలువురి హీరోల ఫ్యాన్స్ ఈ వేడుకలకు సినిమాలనూ జోడించి సంబరాలు చేసుకుంటారు. ఈ ట్రెండ్ చాలా ఏళ్ల నుంచే ప్రారంభం అయింది. ఈ ఏడాది కూడా ప్రేక్షకాదరణ పొందిన సినిమాలలోని పాత్రల రూపంలో గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి యువత గణపతి పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. అందులో భాగంగా ఈ వినాయక పండగకు కూడా కొలువుదీరిన విగ్రహాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాహుబలి వినాయకుడు భారతీయ సినీ అభిమానులను విశేషంగా అలరించిన సినిమా బాహుబలి. అందులో ప్రభాస్ మహేంద్ర బాహుబలిగా భారత ప్రజలందరికీ దగ్గరయ్యాడు అంతలా ఆ పాత్రకు గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ బాహుబలి రూపంలో గణేశుడి విగ్రహాలు ట్రెండ్‌లో ఉన్నాయి. ఇలా ప్రత్యేకంగా తమ ఫ్యాన్స్ అడిగి మరీ తయారు చేయించుకుంటున్నారు. వినాయకుడి రూట్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్‌తో పాటు నేషనల్ అవార్డ్ రావడంతో మళ్లీ ఈ మూవీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తే ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించాడు. ఇప్పుడు ఫ్యాన్స్ వారిని వినాయకుడి రూపంలో విగ్రహాలు చేపించి తమ భక్తితో పాటు అభిమానాన్ని చాటుతున్నారు. అల్లూరి పాత్రలో రామ్ చరణ్ విల్లు చేతబట్టి బాణాలు సందిస్తూ కనిపించిన చరణ్ ఇప్పుడు అదే లుక్‌లో గణేశుడి విగ్రహాలు రెడీ అయ్యాయి. మరోవైపు కొమురం భీం (ఎన్టీఆర్) ఇంటర్వెల్ సీన్లో ఎంట్రీ అదుర్స్ అనేలా ఉంటుంది. తారక్ ఒక వాహనం నుంచి దుకుతుంటే ఆయన చుట్టూ అడివి జంతువులు కూడా ముందుకు దూకుతాయి. ఇదే సింబల్ కనిపించేలా వినాయకుడి ప్రతిమలు రెడీ అయ్యాయి. ఈ ట్రెండ్ కోలీవుడ్‌లోనూ ఉంది.. లియో- గణనాథుడు విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న లియో సినిమా ప్రకటన సందర్భంగా వారిద్దరినీ కలుపుతూ ఓ వైపు గణేశుడు, మరోవైపు సింహంతో విగ్రహాన్ని రూపొందించారు. అలాగే, లియో సినిమా పేరు ప్రకటన వీడియోలో నటుడు విజయ్ బ్లడీ స్వీట్ చెప్పే సన్నివేశం చుట్టూ రూపొందించిన మరో విగ్రహం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ విగ్రహం 8 అడుగుల పొడవు ఉండగా లక్షకు పైగా ఖర్చు అయినట్లు సమాచారం. 25 రోజుల పాటు, ఐదుగురు శిల్పులు ఈ విగ్రహాన్ని రూపొందించారు. నేషనల్ అవార్డుతో తగ్గేదే లే అంటున్న పుష్ప- వినాయకుడు గత సంవత్సరం ఎక్కడ చూసినా కూడా వినాయకుడి రూపంలో అల్లు అర్జున్ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాతో ఆయనకు నేషనల్ అవార్డు దక్కడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అందుకే బన్నీపై అభిమానంతో తమకు ఎంతో ఇష్టమైన బొజ్జ గణపయ్య రూపంలో విగ్రహాలు రెడీ చేపించారు. ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
వినాయకచవితి స్పెషల్.. బన్నీ కూతురు ఏం చేసిందో తెలుసా?
వినాయకచవితి వచ్చిందంటే చాలు ఏ గల్లీలో చూసిన సందడే సందడి. ముఖ్యంగా చిన్నపిల్లల హడావుడి అంతా ఇంతా కాదు. ఎలాగైనా సరే గణపతి తయారు చేసి మరీ సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు మట్టితో చాలా సరదాగా వినాయక విగ్రహాన్ని తయారు చేయడం మనం చూస్తుంటాం. అలా ఐకాన్ స్టార్ గారాల పట్టి అల్లు అర్హ వినాయకచవితి కోసం బుజ్జి వినాయకుడిని తయారు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: Allu Arha In Devara: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ! ) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ అంటే టాలీవుడ్లో తెలియని వారుండరు. కాగా.. అల్లు అర్హ ఇప్పటికే సినిమాల్లో నటిస్తోంది. ఈ ఏడాది సమంత నటించిన శాకుంతలం చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో అర్హ భరతుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంలో అల్లు అర్హ నటించనున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జాన్వీ చిన్ననాటి పాత్రలో అర్హ నటించనుందని సమాచారం. ఇప్పటికైతే మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) -
గణనాయకుడు ఎలా అయ్యాడు? నవరాత్రులు ఎందుకు చేస్తారు?
వినాయకచతుర్థి రోజు అందరూ పొద్దున్నే లేచి తలంటి స్నానం చేసి పట్టు వస్త్రాలు లేదా శుభ్రమైన వస్త్రాలు ధరించి, పూజా సామాగ్రినంతా సిద్ధం చేసుకొని, మండపాన్ని ఏర్పరచి మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఆవాహన చేసి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, స్వామికి ఇష్టమైన కుడుములు, అపూపాలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పాయసం, పానకం, వడపప్పు మొదలైన నైవేద్యాలు సమర్పించి, వ్రతకథను చదువుకొని, కథాక్షతలని శిరస్సున ధరించి, బ్రాహ్మణులను సత్కరించి, ఆనందంతో అందరూ కలసి ప్రసాదాలని స్వీకరించి, గణేశ భజనలతో, కీర్తనలతో, పురాణశ్రవణంతో ఆయన మీదే మనసు లగ్నం చేసి, ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పండగను మనం జరుపుకుంటాం. నేడు వినాయక చవితి సందర్భంగా ఈ పండుగ ప్రాధాన్యతను, వినాయకుని విశిష్టతను మరోసారి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధి రోజు మనం వినాయకచవితి పండుగని జరుపుకుంటాము. గణపతిని పూజించకుండా ఎలాంటి శుభ కార్యమూ తలపెట్టం. ఎందుకంటే, ఆయన కృపాకటాక్షాలతో సకల కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయని శాస్త్రవచనం. విఘ్ననిర్మూలనకు అవతరించి మంగళస్వరూపుడై సకల మానవాళికి ఆరాధ్యమూర్తియై నిలిచాడు. గణపతి సర్వవిద్యాధి దేవతగా, వేదకాలంనుండి ఆరాధనలందుకుంటున్న దైవం, వేదాలలో స్తుతించబడి, గణాలకు అధిపతియై, శబ్దాలకు రాజుగా, ప్రణవ స్వరూపుడై శబ్దబ్రహ్మగా ‘గ’ శబ్దం బుద్ధికి ‘ణ’ శబ్దం జ్ఞానానికి ప్రతీక. సమస్త మంత్రాలలోను శక్తికి కారణాలైన బీజాక్షరాలన్నింటిలోకి ముందుగా ఉచ్చరించేదే ‘ఓంకారం’ అందుచేత ఈ గణపతిని ఓంకార స్వరూపుడిగా ‘గణపత్యధర్వ శీర్షం’లో వర్ణించారు. గణాలంటే అక్షరాలతో ఏర్పడే ఛందస్సు – గురువు, లఘువు, పూర్ణానుస్వార, అర్ధానుస్వార రూపమై శబ్దంగా వెలువడే మంత్రస్వరూపమైన శబ్దాలకి అధిపతే ఈ ‘గణపతి ‘. అంతేకాకుండా ‘బ్రహ్మణస్పతి’ అంటే వేదాలకి నాయకుడివి అని కీర్తించారు. సృష్టి ఆదిలో దేవతా గణాల ప్రారంభం కంటే ముందే గణనాథుని తో సృష్టి ప్రారంభించినట్లు గణేశ పురాణం తదితర పురాణాలు మనకి సూచిస్తున్నాయి. సృష్టి ప్రారంభానికి ముందు ఒకప్పుడు అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేస్తున్నది. ఇంకా మనుషులే పుట్టకముందు అన్నమాట. అమ్మవారు పరమేశ్వరుణ్ణి తలచుకొన్నది. ఆయన అక్కడ ఉన్నారు. వారి చూపులు కలసినవి. ఆ చూపుల కలయికకి విఘ్నేశ్వరుడు పుట్టాడు. అంతటి పూర్వుడాయన. ఆయన పేరు మహాగణపతి. ఆ మహాగణపతి అవతారాలనే ఇప్పుడు మనం ప్రతి కల్పంలోనూ పూజిస్తున్నాం. శరీరంలోని షట్చక్రాలలో అన్నిటికన్నా అడుగున ఉండే చక్రం ‘మూలాధార చక్రం‘. ఈ మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. దీనిలో ఇంకో రహస్యం కూడా ఉంది. ‘మహాశక్తి’ అయిన పార్వతీదేవికి ‘ద్వారపాలకుడుగా’ గణపతిని పెట్టినట్టు మన పురాణగాధ, దీనిలో అంతరార్థం ఏమిటంటే మూలాధారంలో కుండలినీశక్తి యోగనిద్రలో ఉంటుంది అని, ఈ కుండలిని శక్తియే మహాశక్తి –ఆ మూలాధారంలో కుండలిని శక్తిని మేల్కొలపడానికి ప్రవేశించే ద్వారం వద్దనే గణపతి కావలిగా ఉన్నాడు. అంటే గణపతి బీజాక్షరంతో మూలాధారాన్ని చైతన్యవంతం చేస్తే శక్తిని మేల్కొల్పటం సాధ్యపడుతుంది. మూలాధారంలో మేల్కొన్న కుండలినిశక్తి ‘ఇడ’,‘పింగళ’ నాడులద్వార షట్చక్రాలను భేదించి సహస్రారం చేరుతుంది. యోగికి ‘సిద్ధి‘ ‘బుద్ధి‘ కలుగుతుంది. ఈ బుద్ధి, సిద్ధి ఇడా, పింగళ అనే జంటలే సుషుమ్నా నాడిలో నివసించు గణపతికి భార్యలు అని చెప్పబడినాయి. గణనాయకుడు ఎలా అయ్యాడు? వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. అవి 1. వక్రతుండుడు; 2. ఏకదంతుడు; 3 మహోదరుడు; 4. లంబోదరుడు; 5. గజాననుడు; 6. వికటుడు; 7. విఘ్నరాజు; 8. ధూమ్రవర్ణుడు. తల్లిదండ్రులు పూజ్యులని వారిని సేవిస్తే పవిత్ర నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందని చాటి చెప్పడంతో విఘ్నాధిపత్యం వహించి గణాలను నాయకుడయ్యాడు. అలా వినాయకుడు గణనాయకుడయ్యాడు. వినాయకుని ఆసనంలో గల అంతరార్థం: తనను చేరిన భక్తులకు సకల శుభాలను చేకూర్చే వినాయకుడు తాను భక్తుల పాలిట కల్పతరువు అని సూచించకనే సూచిస్తూ ఉంటాడు! ఆయన భంగిమలను కాస్త గమనిస్తే అవుననే అనిపిస్తుంది. చాలా ప్రతిమలలో వినాయకుడు తన ఎడమ కాలుని ముడుచుకుని, కుడి పాదాన్ని కిందకి ఉంచి కనిపిస్తాడు. దీనినే యోగశాస్త్రంలో లలితాసనం అంటారు. సాక్షాత్తూ జ్ఞానానికి ప్రతిబింబమైన లలితాదేవి కూడా ఈ ఆసనంలోనే కనిపిస్తుంది. భారతీయ ప్రతిమలలో ఇది కాస్త అరుదైనప్పటికీ, బౌద్ధానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు ఈ ఆసనాన్ని సూచిస్తుంటాయి. ఒక పక్క ప్రశాంతంగా ఉంటూనే అవసరమైనప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే తత్వానికి ఈ ఆసనాన్ని ప్రతీకగా భావిస్తారు. కర్మయోగులకు ఈ రెండూ అవసరమే కదా! ఒక పక్క జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే, మనసుని స్థిరంగా నిలుపుకోగలడమే మానవులకి నిజమైన సవాలు. తాను అలాంటి స్థితిలో ఉన్నానని గణేశుడు చెప్పకనే చెబుతున్నాడన్నమాట. తనను కొలిచే భక్తుల విఘ్నాలను తొలగించి వారిని కూడా పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాడు. అందుకనే భక్తులు ఎక్కువగా లలితాసనంలో ఉన్న వినాయకునికే పూజలు చేస్తుంటారు. గణపతి నవరాత్రులు ఎందుకు? భాద్రపదమాసంలో వానలు పడుతూ, ఎక్కడికక్కడ చిత్తడిగా, బురదగా ఉంటుంది. గుంటల్లో నీళ్ళు నిలిచి సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో వినాయకునికి ఔషధ గుణాలున్న పత్రితో పూజ చేయడంవల్ల ఇంట్లో వాతావరణం బాగుండి, సూక్ష్మ క్రిములను నశింపజేస్తుంది. గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో తొమ్మిది రోజులు పూజ చేయడం ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు యథావిధిగా వ్రతం చేసే ఆచారం ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉంది. కొన్నిచోట్ల రానురాను మరుగున పడుతోంది. కొందరు పూజ ముగిసిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని తొలగించినప్పటికీ పత్రిని మాత్రం కనీసం తొమ్మిది రోజులు ఇంట్లోనే ఉంచి తర్వాత నదిలో నిమజ్జనం చేస్తారు. అంటే, పదిరోజులపాటు మనం ఔషధ గుణాలున్న పత్రి నుండి వచ్చే గాలిని పీలుస్తాం. తొమ్మిది రోజుల తర్వాత సమీపంలోని నదిలోనో, చెరువులోనో నిమజ్జనం చేయడం వల్ల కూడా లాభమే చేకూరుతుంది. పత్రిలోని ఔషదగుణాలలో కొన్నయినా ఆ నీటిలో చేరతాయి. ఆ రకంగా అవి నీటిలోని క్రిములను నశింపజేస్తాయి. ఆ నీటిని తాగినప్పుడు అనారోగ్యాలు కలగవు. తొమ్మిది రోజులు జరిపే పూజ వల్ల ఆరోగ్యపరంగా సత్ఫలితం కలుగుతుందని నమ్మటం మూఢనమ్మకం కాదు! శాస్త్రీయంగా ఇది నిజమే. వినాయక వ్రతం ఆచారం వెనుక ఉన్న ఆయుర్వేద పరమైన కారణం ఇది. --డి వి ఆర్ భాస్కర్ (చదవండి: వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే!) -
కాశీ క్షేత్రానికి ఎనిమిది దిక్కుల్లో 56 గణేషుడి దేవాలయాలు
-
ఎవరైతే “ఈ వృత్తాన్ని" వినాయక చవితి రోజు వింటారో వాళ్లకు అనుగ్రహం కలుగుతుంది
-
క్రతువు ముగిసింది.. కాలుష్యం మిగిలింది!
సాక్షి, హైదరాబాద్: మహా నగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. హుస్సేన్‌సాగర్ సహా సుమారు వంద జలాశయాల్లో వేలాదిగా గణపతి ప్రతిమలను నిమజ్జనం చేశారు. నిమజ్జన క్రతువు ముగిసిన వెంటనే వ్యర్థాలను గణనీయంగా తొలగించినట్లు బల్దియా యంత్రాంగం ప్రకటించినప్పటికీ.. ప్లాస్టర్‌ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం కారణంగా టన్నుల కొద్దీ ఘన వ్యర్థాలు, అధిక గాఢత రసాయనాలు, హానికారక మూలకాలు, ఇనుము, కలప, పీఓపీ ఆయా జలాశయాల్లో కలిసినట్లు పీసీబీ నిపుణులు చెబుతున్నారు. త్వరలో నిమజ్జన కాలుష్యంపై తుది నివేదిక విడుదల చేయనున్నట్లు తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లో అంచనా ఇలా.. జలాశయంలోకి సుమారు 5 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 30 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 2 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ సాగరంలో కలిసినట్లు పీసీబీ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ఇనుము, కలపను బల్దియా ఆధ్వర్యంలో తొలగించినా.. పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో హుస్సేన్‌సాగర్ మరింత గరళమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధిక మోతాదులో హానికారక రసాయనాలు, వ్యర్థాలు, మూలకాలు ప్రవేశించడంతో జలాశయంలో ప్రతి లీటరు నీటిలో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్లు పరిమితులకు మించి నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. రసాయనాలు, మూలకాలిలా.. రసాయన రంగుల అవశేషాలు: లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టరీ్పన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్ని‹Ù. హానికారక మూలకాలు: కోబాల్ట్, మాంగనీస్, డయాక్సైడ్, మాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జిక్ సలై్ఫడ్, మెర్క్యురీ, మైకా. తలెత్తే అనర్థాలు.. ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను పలువురు మత్స్యకారులు నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసి తిన్న వారికి శరీరంలోకి హానికారక మూలకాలు చేరుతున్నాయి. మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం మాలిబ్డనమ్, సిలికాన్లు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాలు అవక్షేపాలుగా ఏర్పడతాయి. (చదవండి: రూబీ లాడ్జీ: ఎనమిదికి చేరిన మృతుల సంఖ్య..ఫైర్ అధికారి కీలక వ్యాఖ్యలు) -
ఆకట్టుకుంటున్న బుల్లెట్‌బండి గణపతి
-
పాపం గణపయ్య
-
గణపతి లొంగుబాటు కట్టుకథ
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగిపోతున్నాడంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు మావోయిస్టు పార్టీ స్పందిం చింది. ఇదంతా కల్పిత కథ అని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ గురువారం ఓ లేఖ విడుదల చేశారు. గణపతి లొంగు బాటు మొత్తం ఒక కట్టుకథ అని, ఇదంతా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మీడియాకు కావాలని ఇచ్చిన లీకు అని ఆరోపించారు. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా మావో యిస్టు పార్టీ బలపడుతున్న క్రమంలో తమ పార్టీ శ్రేణుల నైతిక స్థైర్యం దెబ్బ తీయడానికి ఆడిన ఆట అని అభివర్ణిం చారు. కామ్రేడ్ గణపతి వయోభారం, చిన్నచిన్న ఆరోగ్య సమస్యల కారణంగా స్వచ్ఛందంగా తప్పుకుని, ఆ బాధ్యతలను ఇతరులకు అప్పగించారని వివరించారు. ప్రపంచ చరిత్రలోని పోరాటాల్లో ఇదంతా స్వరసాధారణ మార్పు అని పేర్కొన్నారు. తమ నాయకత్వం దృఢంగా ఉండి ప్రభుత్వాలకు, పాలకవర్గాలకు ముచ్చెమటలు పట్టిస్తుందోని.. అందుకే ఇలాంటి బూట కపు ప్రచారాలు పుట్టుకొస్తున్నాయని విమర్శించారు. కార్పొరేట్ సేవలో తరిస్తున్నారు.. దేశ ఆర్థిక వ్యవస్థ పతనమై, దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నా.. మోదీ సర్కారుకు పట్టడం లేదని లేఖలో దుయ్యబట్టారు. కోవిడ్ ఉపద్రవంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం పెడచెవిన పెట్టారని ఆరోపించారు. లాక్డౌన్ కాలంలో కార్పొరేట్ కంపెనీల సేవలో తరిస్తోందని ధ్వజమెత్తారు. వరవరరావు, సాయిబాబా వంటి ప్రశ్నించే గొంతులను ఎక్కడికక్కడ అణిచివేస్తున్నారని.. కశ్మీర్‌ను మరో పాలస్తీనాగా మార్చారని మండిపడ్డారు. చైనాతో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అమెరికా–చైనా వాణిజ్యపోరులో.. అమెరికా చేతిలో మోదీ పావులా మారారని పేర్కొన్నారు. 2022నాటి దేశంలో మావోల నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర లక్ష్యం నెరవేరడం లేదని, ఆపరేషన్ సమాధాన్‌ను తట్టుకుని మావోయిస్టు పార్టీ నిలబడుతోందని స్పష్టంచేశారు. దేశంలో సమస్యలు పెరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఒక్కటే శరణ్యమని ప్రజలు భావిస్తున్న తరుణంలో మోదీ ప్రభుత్వం మీడియా ద్వారా ఇలాంటి అసత్య ప్రచారాలకు దిగుతోందని విమర్శించారు. -
గణపతి సరెండర్ ఒక హైటెన్షన్ కల్పిత కథ
-
గణపతి లొంగుబాటు : కేంద్ర కమిటీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటు వార్తలపై ఆ పార్టీ తొలిసారి స్పందించింది. గత మూడు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను మావోయిస్టు కేంద్ర కమిటీ ఖండించింది. గణపతి సరెండర్ పోలీసుల కల్పిత కథగా కొట్టిపారేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో రెండు పేజీల లేఖను గురువారం విడుదల చేసింది. గణపతి సరెండర్ ఒక హైటెన్షన్ కల్పిత కథ అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకమని పేర్కొంది. తెలంగాణ, చత్తీస్‌గఢ్ ఇంటెలిజెన్స్ అధికారుల కట్టు కథలతో పాటు, పోలీసులు అల్లిన నాటకంలో మీడియా పావులుగా వాడుకున్నారని లేఖలో స్పష్టం చేసింది. కామ్రేడ్ గణపతి చిన్న చిన్న అనారోగ్య కారణాల రీత్యా స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకున్నారని లేఖ ద్వారా వివరించింది. కేంద్ర కమిటీ బాధ్యతల నుంచి తప్పుకున్నా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నాడని పేర్కొంది. (గణపతి ఎక్కడ?) ‘సిద్ధాంత పరంగా, రాజకీయంగా మా నాయకత్వం దృఢంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాం. మా నాయకత్వపు ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే ఇటువంటి కట్టుకథలు అల్లుతున్నారు. ఈ కట్టుకథలు పై మీడియా ప్రచారం చేయడం సరికాదు. ప్రభుత్వాల దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా అనారోగ్య సమస్యలతో బాధపతుడున్న గణపతి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం జాతీయ స్థాయిలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ కేంద్రకమిటీ స్పందించి ఆ వార్తలను కొట్టిపారేసింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన 73 ఏళ్ల గణపతి 40 ఏళ్ల పాటు విప్లవోద్యమంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. (మావో గణపతి.. ఎప్పుడొచ్చారు?) -
గణపతి ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు ఆచూకీపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, త్వరలో లొంగిపోతాడని వస్తున్న వార్తలపై ఏపీ– తెలంగాణతోపాటు జాతీయ మీడియాలోనూ వరుస కథనాలు వస్తున్నాయి. తెలంగాణ పోలీసుల సహకారం మేరకు గణపతి లొంగుబాటుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, లొంగుబాటులోని సాధ్యాసాధ్యాలపై అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. కేవలం తెలంగాణ రాష్ట్ర పోలీసులు అంగీకరించినంత మాత్రాన ఈ వ్యవహారానికి తెరపడుతుందా అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. 13 రాష్ట్రాలు, 2 జాతీయ దర్యాప్తు సంస్థలు గణపతి నేతృత్వంలోనే దేశంలో మావోయిస్టు పార్టీ బాగా విస్తరించిందనే అభిప్రాయం ఉంది. దేశ విదేశాల నుంచి నిధులను సమీకరించడంలో, పార్టీ కేడర్‌కు ఆధునిక టెక్నాలజీ, నవీన ఆయుధాలు సమకూర్చడంలో, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పార్టీ విధానాలు మార్చుకోవడంలో ఆయన వ్యూహాలు చాలా ముందుచూపుతో ఉంటాయి. అనవసర హింసాచర్యలకు ఈయన వ్యతిరేకం. పీపుల్స్ వార్ గ్రూపు (పీడబ్ల్యూజీ), మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా(ఎంసీసీఐ) విలీనంలో గణపతి కీలక పాత్ర పోషించారు. 13 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీని నడిపించిన గణపతిపై వేలాది కేసులున్నాయి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కోసం జాతీయ దర్యాప్త సంస్థ(ఎన్.ఐ.ఏ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్(రా) వంటి జాతీయదర్యాప్తు సంస్థలు వెదుకుతున్నాయి. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం.. గణపతి లొంగిపోవడానికి అంగీకరించాడునుకున్నా.. ఒక్క తెలంగాణ పోలీసులు పాత కేసులు మాఫీ చేసినా.. మిగిలిన 12 రాష్ట్రాల పోలీసులు కేసుల ఎత్తివేతకు సుముఖంగా ఉంటారా? ఎన్,ఐ.ఏ, రా వంటి సంస్థల విచారించకుండా ఉంటాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులన్నీ ఎత్తేయాలంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంగీకారం తెలపాల్సి ఉంటుంది. అదేవిధంగా 43 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పతిప్పలు పెట్టి, దండకారణ్యంలో సమాంతర ప్రభుత్వాలు నడిపిన గణపతి తన లొంగుబాటుకు షరతులకు విధించకుండా ఉంటారా? వాటిని కేంద్రం ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తారా? అన్నది అనుమానమే. ఖండించని మావోయిస్టు పార్టీ.. ఈ మొత్తం వ్యవహారంలో ఇటు పోలీసులు, అటు మావోయిస్టులు మౌనం వహించడం అనేక సందేహాలకు, అనుమానాలకు తావిస్తోంది. ఓవైపు గణపతి ఇప్పటికే లొంగిపోవడానికి అంగీకరించాడని, మరికొన్ని రోజుల్లో లొంగుబాటు చూపుతారంటూ సాగుతున్న ప్రచారంపై పోలీసులు పెదవి విప్పడంలేదు. ఆయన లొంగిపోతే మాత్రం స్వాగతిస్తామని, ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని భరోసా ఇస్తున్నారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారం పోలీసులు వేసిన ఎత్తగడ అన్న ప్రచారమూ ఉంది. మావోయిస్టు కేడర్‌ను గందరగోళంలో నెట్టేయడానికి, అగ్రనేతల ఫోన్ సంభాషణలను విని, గణపతి ఉనికి కనుక్కునేందుకు బిగించిన ఉచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గణపతి లొంగిపోనున్నారనే ప్రచారాన్ని ఖండిస్తూ ఇంతవరకూ మావోయిస్టు పార్టీ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. లొంగిపోతాడని అనుకోవడం లేదు: జంపన్న సాక్షి, హైదరాబాద్: గణపతి లొంగుబాటుపై మాజీ మావోయిస్టు, కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న స్పందించారు. గణపతి వంటి అగ్రనేత లొంగిపోతాడని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ వస్తున్న వార్తల విశ్వసనీయతపై కూడా అనుమానాలు వ్యక్తంచేశారు. గత 40 ఏళ్లుగా గణపతి తన కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలూ కలిగి లేడని, ఈ నేపథ్యంలో ఆయన లొంగుబాటుకు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. -
మావో గణపతి.. ఎప్పుడొచ్చారు?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత గణపతి ఆరోగ్యం క్షీణించిందని, ఆయన త్వరలోనే జన జీవన స్రవంతిలో కలుస్తారన్న ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఆయన విదేశాలకు దేని కోసం వెళ్లారు?.. అక్కడి నుంచి ఎప్పుడొచ్చారు?.. ఎందుకు వచ్చారు?.. అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకడంలేదు. మావోయిస్టు కేంద్ర కార్యదర్శి పదవి నుంచి 2018 నవంబర్‌లో తప్పుకున్నాక గణపతి ప్రస్థానం సందేహంలో పడింది. ఆయన స్థానంలో నంబాల కేశవరావు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ సీనియర్ పోలీసు ఉన్నతాధికారి గణపతి ఆచూకీపై సంచలన విషయం వెల్లడించారు. గణపతి ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం నుంచి బిహార్ మీదుగా నేపాల్ వెళ్లాడని, అక్కడ నుంచి ఫిలిప్పీన్స్‌కు వెళ్లిపోయాడని తమ వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు. మావోయిస్టుల టెలిఫోన్ సంభాషణలపై నిఘా ఉంచగా తమకు ఈ విషయం తెలిసిందని ఆయన అన్నారు. చివరిసారిగా కనిపించింది అక్కడే..! ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి కోసం పలు రాష్ట్రాల పోలీసులే కాకుండా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా అన్వేషిస్తోంది. చివరిసారిగా 2017లో బిహార్‌లోని గయ ప్రాంతంలో సంచరించినట్లుగా నిఘా వర్గాలు అప్పట్లో పేర్కొన్నాయి. నేపాల్ మీదుగా ఫిలిప్పీన్స్‌కు వెళ్లడం కోసమే ఆయన అక్కడ ఉన్నట్లు విశ్లేషణలు ఉన్నాయి. గణపతిపై ఎన్ఐఏ రూ.15 లక్షల రివార్డు ప్రకటించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపితే ఆయన తలపై రూ.3.6 కోట్ల వరకు రివార్డు ఉంది. ఒకవేళ గణపతి విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించి ఉంటే.. సదరు పోలీసు అధికారి కథనం నమ్మదగినదే అని పలువురు అంగీకరిస్తున్నారు. భారతీయులంతా బిహార్ ద్వారా రోడ్డు మార్గంలో నేపాల్‌కు వెళ్లడం సర్వసాధారణమే. అక్కడి నుంచి విమానాల్లో పలు దేశాలకు వెళ్లడం పెద్ద విషయమేమీ కాదు. భారతదేశంలో అశాంతికి పాల్పడే అంతర్జాతీయ ఉగ్ర సంస్థల సభ్యులు ఇదే పంథాను అనుసరిస్తారు. (చదవండి: కీలక నిర్ణయం తీసుకోనున్న మావో గణపతి) నేడు గణపతి.. నాడు కత్తుల సమ్మయ్య గతంలో లొంగిపోయిన కరీంనగర్ జిల్లా కాచాపూర్‌కు చెందిన కత్తుల సమ్మయ్య కూడా నక్సలైట్లలో ఉండగా పలుమార్లు విదేశాలకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. అదే క్రమంలో 1993లో దళంతో విభేదించి.. తోటి సభ్యులను కాల్చిచంపిన అనంతరం అతడు పోలీసులకు లొంగిపోయాడు. తరువాత హైదరాబాద్‌లో కొందరు అవినీతి ఉన్నతాధికారుల పరిచయాలతో రియల్ ఎస్టేట్ వ్యవహారాలతో పాటు అనేక దందాలు నడిపాడు. 2001లో కొలంబోలో జరిగిన విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించాడు. ఫిలిప్పీన్స్‌కు ఎందుకు వెళ్లాడు? గణపతి.. ఫిలిప్పీన్స్‌కు వెళ్లి ఉంటే.. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనారోగ్యంతో ఉన్న ఆయన చికిత్స కోసమే వెళ్లారా? అక్కడ ఆయనకు ఆశ్రయం కల్పించిందెవరు? అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. జీవితంలో అధిక భాగం దండకారణ్యంలో ఉన్న గణపతికి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చక్కటి సంబంధాలు ఉన్నాయన్న పేరుంది. పార్టీకి పలువురు ప్రవాసీయుల నుంచి రూ.కోట్ల చందాలు తీసుకురావడంలో ఆయనది కీలకపాత్రగా పలువురు పేర్కొంటారు. నేపాల్, ఫిలిప్పీన్స్‌లోనూ మావోయిస్టు పార్టీ క్రియాశీలకంగా ఉండటం ఆయనకు కలిసి వచ్చిన అంశాలుగా పరిశీలకులు భావిస్తున్నారు. మంచి వ్యూహకర్త, సిద్ధాంతకర్త అయిన గణపతి.. మావోయిస్టు పార్టీకి అంతర్జాతీయ సంబం ధాల బలోపేతం కోసం ఫిలిప్పీన్స్ వెళ్లి ఉండొచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. (చదవండి: గణపతి లొంగుబాటుకు లైన్‌క్లియర్..!) -
గణపతి లొంగుబాటుకు లైన్‌క్లియర్..!
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ అగ్రనేత ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుకు పోలీసుల నుంచి లైన్‌క్లియర్ అయ్యింది. 74 ఏళ్ల గణపతి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ఉద్యమం నుంచి బయటకు వచ్చిపోలీసులకు లొంగిపోతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసు శాఖ గణపతి సహా ఎవరు లొంగిపోయినా స్వాగతిస్తామని ప్రకటించారు. గణపతి లొంగిపోవాలి అనుకుంటే కుటుంబసభ్యుల, బంధువులతో సంప్రదించవచ్చని తెలిపారు. పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. రానున్న రెండురోజుల్లో లొంగిపోయే అవకాశం ఉంది. ఆయనతో పాటు మరికొంతమంది సీనియర్ నేతలు, ఆయన అంగరక్షకులు కూడా లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామానికి చెందిన గణపతి 40 ఏళ్ల పాటు విప్లయోధ్యమంలో కీలక పదవులు అనుభవించారు. అనారోగ్య కారణాలతో 2018 లో కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన అనంతరం నంబాల కేశవరావు కేంద్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. అయితే లొంగుబాటుపై ఆయన తీసుకునే అనూహ్య నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన గణపతి వయసురిత్యా పోరాటానికి స్వస్తి పలికే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
కీలక నిర్ణయం తీసుకోనున్న మావో గణపతి
సాక్షి, కరీంనగర్: మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోయేందుకు యత్నిస్తున్నట్టు వార్తలు రావడం సంచలనంగా మారింది. సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన గణపతి వయసురిత్యా పోరాటానికి స్వస్తి పలికే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన లొంగుబాటుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. కుటుంబ సభ్యులతో మంతనాలు జరుపుతున్న ఆయన కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. కాగా, 74 ఏళ్ల గణపతి తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మోకాళ్ల నొప్పులు, మధుమేహంతో సమస్యలు ఆయనను వెంటాడుతున్నాయి. గణపతి స్వస్థలం జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామం. ఇక ఎంపీసీ, నక్సలైట్ పార్టీల విలీనం తర్వాత కేంద్ర కార్యదర్శిగా గణపతి పనిచేశారు. అనారోగ్య కారణాలతో 2018 లో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన అనంతరం నంబాల కేశవరావు కేంద్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. అనారోగ్య సమస్యలతో సతమవుతున్న గణపతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి రాగానే లొంగుబాటుకు సిద్ధమవుతారని గత రాత్రి నుంచి కరీంనగర్ వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన లొంగుబాటు నిజమే అయితే విప్లవోద్యమ చరిత్రలో పెద్ద కుదుపుగానే భావించాలి. మరోవైపు గణపతితోపాటు మరో నలుగురు మవోయిస్టు నేతలు కూడా లొంగుబాటు దిశగా పయనిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. (చదవండి: మావోయిస్టు కేంద్ర కమిటీ.. 10 మంది వారే..!) -
రూ.17.75 లక్షలు పలికిన ఫిల్మ్ నగర్ లడ్డూ
-
ఫిల్మ్ నగర్ గణపతి లడ్డూ సరికొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో లంబోదరుడి లడ్డూ ప్రసాదాలకు ఉన్న క్రేజ్ ఆ ‘ధర’హో అనిపిస్తోంది. లడ్డూ ప్రసాదమంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగే బాలాపూర్ లడ్డూ ధరను ఈసారి ఫిల్మ్‌నగర్ బస్తీ వినాయక్ నగర్ గణపతి లడ్డూ ధర దాటేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ కన్నా వినాయక్ నగర్ లడ్డూ ధర ఎక్కువ పలికింది. బీజీపీ నేత పల్లపు గోవర్ధన్ ఈ లడ్డూను రూ.17.75 లక్షలకు సొంతం చేసుకున్నారు. గత ఏడాది వినాయక్ నగర్ లడ్డూ రూ.15.1 లక్షలు పలికి నగరంలో రెండో స్థానం దక్కించుకుంది. ఇక ఈ ఏడాది బాలాపూర్ వినాయకుడి లడ్డూ 17.60 లక్షలు పలికింది. దీన్ని కొలను రాంరెడ్డి అనే భక్తుడు దక్కించుకున్నాడు. -
దళపతి కేశవరావు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నూతన ప్రధాన కార్యదర్శిగా నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న, 1992 నుంచి 25 ఏళ్లపాటు పార్టీని వ్యూహాత్మకంగా ముందుకు నడిపించిన సీనియర్ మావోయిస్టు నేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి అనారోగ్యం, వయోభారం దృష్ట్యా కేంద్ర కమిటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. పీపుల్స్‌వార్ గ్రూపులో ఉన్న అనేక పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చి 2004 సెప్టెంబర్ 21న మావోయిస్టు పార్టీగా ఏర్పడగా నూతన పార్టీకి గణపతే నాయకత్వం వహించాలని అప్పటి పార్టీలన్నీ ప్రతిపాదించాయి. దీంతో గణపతి అప్పుడు కార్యదర్శిగా నియమితులయ్యారు. పీపుల్స్‌వార్ గ్రూప్ ద్వారా 14 రాష్ట్రాలను ప్రభావితం చేసిన మావోయిస్టు పార్టీకినాయకత్వ బాధ్యతలు వహించిన గణపతి.. ఉద్యమం నడపడంలో నిష్ణాతుడిగా పేరు సంపాదించారు. అన్ని రాష్ట్రాల కమిటీలను వ్యూహాత్మకంగా ముందుకు నడిపించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ 8 రాష్ట్రాల్లోనే కార్యకలాపాలు సాగిస్తుండటం, కార్యకలాపాలు సైతం ఆశించినట్లుగా లేకపోవడంతో పార్టీ కుదేలైనట్లు పోలీసు వర్గాలు ప్రకటిస్తూ వచ్చాయి. మరోవైపు గణపతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటం పార్టీని తీవ్ర ఒత్తిడిలోకి నెడుతూ వచ్చింది. దీంతో స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగి యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలని ఇటీవల జరిగిన కేంద్ర కమిటీ ఐదో సమావేశంలో గణపతి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో కేశవరావుకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్టీ బాధ్యతలను కేశవరావు పర్యవేక్షించనున్నారు. మావోయిస్టు పార్టీ వివిధ రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను కేశవరావు పరిష్కరిస్తారని కమిటీ ఆశిస్తోంది. అదే సమయంలో పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా కొత్త నియామకాలపై ఆయన దృష్టి పెడతారా అనే దానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరీ కేశవరావు? గాగన్న అలియాస్ ప్రకాష్, అలియాస్ క్రిష్ణ, అలియాస్ విజయ్, అలియాస్ కేశవ్, అలియాస్ బస్వరాజు, అలియాస్ బీఆర్, అలియాస్ దారపు నరసింహారెడ్డి, అలియాస్ నరసింహ. మావోయుస్టు పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవరావుకు ఉన్న వివిధ పేర్లు ఇవి.æ కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియ్యన్నపేట. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని ఆయన అతిదగ్గర నుంచి చూశారు. విద్యార్థి దశ నుంచే విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితుడై అంచెలంచెలుగా ఎదిగారు. సూరపనేని జనార్దన్ తర్వాతి తరంవాడైన కేశవరావు... వరంగల్‌లోని రీజనల్ ఇంజనీరింగ్ (ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కాలేజీలో 1974లో ఇంజనీరింగ్ చదివారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. కేశవరావుది మిలిటరీ వ్యూహరచనలో అందెవేసిన చేయి. అత్యాధునిక పేలుడు పదార్థాల వినియోగంలో, పేలుళ్లకు సంబంధించిన అ«ధునాతన ప్రక్రియల ఆచరణలోనూ కేశవరావు నిపుణుడు. గెరిల్లా పోరాట వ్యూహకర్తగా, ఆయు«ధ శిక్షణలోనూ ఆయన సిద్ధహస్తుడు. మావోయుస్టు పార్టీ సైనిక విభాగానికి కేశవరావు కీలక వ్యూహకర్త. మావోయుస్టు పార్టీలోని అత్యున్నత సైనిక విభాగం సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. అంతేకాకుండా జోనల్ కమిటీ, స్పెషల్ ఏరియా కమిటీ లాంటి పార్టీలోని మిలిటరీ సబ్కమిటీల బాధ్యత కూడా కేశవరావుదేనని పోలీసుల అంచనా. మావోయుస్టు ప్రాబల్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది. ఆరు నెలల క్రితం నుంచే కేశవరావు మావోయిస్టు పార్టీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నప్పటికీ తాజాగా అధికారికంగా ఈ నిర్ణయం వెలువడిందని తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయడంలో, కేడర్ రిక్రూట్మెంట్లో కేశవరావు బాధ్యత కీలకమని తెలుస్తోంది. 1980లో అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ విద్యార్థి సంఘం ఆర్ఎస్యూ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ సందర్భంగా ఒకే ఒక్కసారి కేశవరావు శ్రీకాకుళంలో అరెస్టయ్యారు. ఆయన తండ్రి వాసుదేవరావు అధ్యాపకుడిగా పనిచేసేవారు. ఆయన కళింగ సామాజిక వర్గానికి చెందిన వారు. మావోయుస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పలు దాడుల్లో కేశవరావు కీలక నిందితుడిగా ఉన్నారు. తాజాగా ఏపీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సోములపై దాడి వ్యూహకర్త కేశవరావేనని అంచనా. కేశవరావుపై కేంద్రం రూ. 10 లక్షల రివార్డు ప్రకటించింది. మావోయిస్టు పార్టీలో వ్యవస్థ ఇలా... 1. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీకి ప్రధాన కార్యదర్శి కేశవరావు బాధ్యుడిగా ఉంటారు. సెంట్రల్ కమిటీలో ప్రస్తుతం 19 మంది సభ్యులుంటే అందులో 13 మంది ఏపీ, తెలంగాణలకు చెందినవారే ఉన్నారు. 2. సెంట్రల్ కమిటీ కింద సెంట్రల్ మిలిటరీ కమిషన్, పోలిట్‌బ్యూరో ఉంటాయి. 3. మిలిటరీ కమిషన్‌కు ఇప్పటివరకు కేశవరావు బాధ్యత వహించారు. పోలిట్‌బ్యూరోకు సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి, మిలిటరీ కమిషన్‌కు సారథ్యం వహిస్తున్నవారు ఇద్దరూ కలసి బాధ్యత వహిస్తారు. (పోలిట్‌బ్యూరోలో మొత్తం 9 మంది సభ్యులుంటారు.) 4. ఈ మూడు విభాగాల కింద తూర్పు, మధ్య, ఉత్తర, దక్షిణ ప్రాంతాల పార్టీ రీజనల్ విభాగాలు, స్పెషల్ జోనల్ కమిటీలు, రీజనల్ కమిటీలు, డివిజనల్ కమిటీలు, ఏరియా కమిటీలు, స్థానిక గెరిల్లా దళాలతో కూడిన అంచెలంచెల వ్యవస్థ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటుంది. -
దళపతిగా గణపతి పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్ : సీపీఐ (మావోయిస్టు) పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి (ముప్పాళ్ల నాగేశ్వరరావు) పదవీ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఆయన స్థానంలో పార్టీ సీనియరైన బసవరాజు (నంబాళ్ల కేశవరావు)ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది. ఆయన ఎన్నికపై ఇదివరకే కేంద్ర కమిటీలో చర్చజరగగా నేడు (బుధవారం) ప్రధాన కార్యదర్శిగా బసవరాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగిన గణపతి వయోభారంతో, ఆరోగ్య సమస్యలతో పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర కమిటీని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో నూతన నాయకత్వానికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కేంద్ర కమిటీ తెలిపింది. 1992 జూన్‌లో మావోయిస్టు పార్టీకి గణపతి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. పార్టీ కష్టకాలములో ఉన్న సమయంలో కీలక బాధ్యతలు స్వీకరించిన గణపతి.. పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసే పనిని తన భుజాలకెత్తుకున్నారు. ఆ సమయంలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న కొండపల్లి సీతారామయ్య కమిటీకి నాయకత్వం వహిస్తూ సమస్యలు పరిష్కరించగలిగే స్థితిలో లేరు. ఆ సమయంలో కేంద్రకమిటీలో అంతర్గత సవాళ్లు, కొన్ని అవకాశవాద ముఠాలు పార్టీని చీల్చడానికి ప్రయత్నించాయి. వాటిన్నింటిని తిప్పికొట్టేందుకు కేంద్ర కమిటీ గణపతిని ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 1998లో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్, సీపీఐ (ఎంఎల్, యూనిట్) విలీనమై సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్‌గా ఆవిర్భవించింది. ఈ పరిణామంతో పార్టీ అనేక రాష్ట్రాలకు విస్తరించి మరింత బలంగా మారింది. ఈ సందర్భంగా ఏర్పడిన నూతన కమిటీకి గణపతి నూతన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2000 నాటికి మిలటరీ పంథాను అభివృద్ధి చేసుకుని ప్రజావిముక్తి గెరిల్లా సైన్యాన్ని నిర్మించుకుంది. అనేక పరిణామాల నేపథ్యంలో 2004లో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్, కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీపీఐ)లు విలీనమై సీపీఐ (మావోయిస్టు)గా ఆవిర్భవించింది. రెండు పార్టీలు విలీనం కావడంతో భారత విప్లవోద్యమంలో మావోయిస్టు పార్టీ మహా స్రవంతిగా మారింది. ఈ పార్టీలో ఎంతో కీలకమైన నేతలతో సహా, నక్సల్బరీ తరం నాయకులు కూడా ఉన్నారు. 1992 నుంచి 2018 వరకు దాదాపు 26 ఏళ్లు గణపతి ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నిర్వహించిన కాలమంతా ఉద్యమం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ కేంద్ర నాయకత్వంలో పురోగమించింది. ఈ నేపథ్యంలో నూతన నాయకత్వాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా బసవరాజును కేంద్రకమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. ఆయన 17 ఏళ్లకు పైగా కేంద్రకమిటీ సభ్యుడుగా కొనసాగుతూ వస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వ నిర్భందం మరోవైపు విప్లవ బాటలో అనేక సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్లటం నూతన నాయకత్వం ముందు ఉన్న పరీక్ష అని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. -
మావోయిస్ట్ చీఫ్‌గా బసవరాజ్
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్ట్ చీఫ్ ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి) స్ధానంలో శ్రీకాకుళంకు చెందిన నంబళ్ల కేశవరావు ఎంపికయ్యారు. వయోభారం కారణంగా గణపతి (72)ని పార్టీ ప్రధాన కార్యదర్శిగా వైదొలగాలని మావోయిస్ట్ కేంద్ర కమిటీ కోరింది. బసవరాజ్‌గా పార్టీ వర్గాలు పిలుచుకునే కేశవరావు (63) కేంద్ర మిలిటరీ కమిషన్ సారథిగా వ్యవహరిస్తున్నారు.విద్యార్ధి దశలోనే మావోయిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులైన కేశవరావు వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పట్టభద్రులు కావడం గమనార్హం. కాగా గణపతి తలపై రూ 49 లక్షల రివార్డు ప్రకటించగా, బసవరాజ్‌కు పట్టిఇచ్చిన వారికి రూ 36 లక్షల రివార్డును పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. మరోవైపు రెండు నెలల కిందటే మావోయిస్టు పార్టీలో నాయకత్వ మార్పు చోటుచేసుకుందని తెలంగాణ పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. అరకులో ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యకు బసవరాజు వ్యూహం రూపొందించారని తాము భావిస్తున్నామని తెలిపాయి. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న గణపతి స్ధానంలో చురుకుగా ఉండే యువ నేతను ఎంపిక చేసుకునేందుకు వీలుగా పార్టీ పగ్గాలను వీడాలని గణపతికి కేంద్ర నాయకత్వం స్పష్టం చేయడంతో నాయకత్వ మార్పు జరిగిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. సైన్స్, బీఈడీల్లో గ్రాడ్యుయేట్ అయిన భూస్వామ్య రైతు కుటుంబానికి చెందిన గణపతి మూడు దశాబ్ధాలుగా మావోయిస్టు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారు. -
మావోయిస్టు పార్టీలో కీలక మార్పులు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీలో కీలకమార్పులు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి పదవీ బాధ్యతలు నిర్వహించిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతిని ఆ పదవి నుంచి తొలగాలని పోలిట్ బ్యూరో సభ్యులు అడిగినట్లు సమాచారం అందింది. ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడంపై బాధ్యత వహిస్తున్నానని, తన పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు కూడా గణపతి ప్రకటించినట్లు వెల్లడైంది. గణపతి స్థానంలో నంబాలా కేశవరావు అలియాస్ బస్వరాజ్ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిసింది. నంబాలా కేశరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియోనిపేట. వరంగల్ ఆర్ఈసీలో కేశవరావు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 28 సంవత్సరాలుగా కేశవరావు అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1980 జనవరి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. 2005లోనే కేశవరావుపై రూ.50 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. వయోభారంతోనే పార్టీ బాధ్యతలను, తన వద్ద ఉన్న ఏకే-47 తుపాకీని కూడా గణపతి, పార్టీకి అప్పగించినట్లు సమాచారం. -
గణపతి, వరవరరావుల మధ్య ఈమెయిల్స్!
పుణె: మావోయిస్టులతో సంబంధం ఉందనే ఆరోపణలపై జూన్‌లో అరెస్టైన ఐదుగురు హక్కుల కార్యకర్తల బెయిల్ పిటిషన్లను మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వ్యతిరేకించింది. విరసం నేత వరవరరావు, పరారీలో ఉన్న సీపీఐ (మావోయిస్టు) నేత గణపతిల మధ్య జరిగిన ఈ–మెయిల్ సంభాషణలను మహారాష్ట్ర తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. హక్కుల కార్యకర్తలు సురేంద్ర గాడ్లింగ్, సోమసేన్, వెర్నన్ గోన్సాల్వేజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్‌లు జూన్‌లో అరెస్టయ్యారు. ఆ తర్వాతనే ఈ ఈ–మెయిల్ సంభాషణలు జరిగాయని ప్రభుత్వ తరపు న్యాయవాది ఉజ్వలా పవార్ కోర్టుకు తెలిపారు. ఈ–మెయిల్స్‌ను గణపతి వరవరరావుకు పంపారనీ, హక్కుల కార్యకర్తలు అరెస్టైన అంశంపై సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ ఆందోళన చెందినట్లు ఈ–మెయిల్ ద్వారా తెలుస్తోందని పవార్ పేర్కొన్నారు. -
శ్వేతార్క గణపతి
అపురూపమైన ఆధ్యాత్మిక వస్తువులలో శ్వేతార్కమూలం చాలా విశిష్టమైనది. శ్వేతార్కమూలం అంటే తెల్ల జిల్లేడు వేరు. దీనిని సాక్షాత్తు గణపతి స్వరూపంగా పరిగణిస్తారు. అరుదుగా ఒక్కొక్కసారి శ్వేతార్కమూలం గణపతి ఆకారంలో లభిస్తూ ఉంటుంది. అది మరింత విశిష్టమైనది. శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల జాతకంలోని కేతు గ్రహ దోషాలు, వాటి వల్ల కలిగే అనవసర భయాలు తొలగిపోతాయి. ఆర్థిక కష్టాలు, శత్రుబాధలు, రుణబాధలు తొలగిపోతాయి. ఇంట్లోని దుష్టశక్తులు నశిస్తాయి. శ్వేతార్క మూలాన్ని ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలసి వచ్చేటప్పుడు సేకరించడం అత్యంత శ్రేష్టం. ఇవన్నీ ఒకేసారి కుదరడం చాలా దుర్లభం. అందువల్ల ఈ మూడింటిలో ఏ రెండు కలసి వచ్చిన రోజునైనా ఉదయం వేళలో శ్వేతార్కమూలాన్ని సేకరించడం మంచిది. శుచిగా స్నానం చేసిన తర్వాత మట్టి నుంచి తవ్వి సేకరించిన శ్వేతార్క మూలాన్ని మంచినీటితో శుభ్రం చేయాలి. తర్వాత దానిని ఇంట్లోని పూజమందిరంలో ఎర్రని వస్త్రంపై ఉంచి ధూప దీప నైవేద్యాలతో పూజించాలి. శ్వేతార్క గణపతిని పూజించడానికి ఎర్రని పూలు, ఎర్రని అక్షతలు, రక్తచందనం ఉపయోగించాలి. – పన్యాల జగన్నాథ దాసు -
దళిత నేతకు మావోయిస్టు మకుటం?
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ నాయకత్వం మారిపోతోందా?.. కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆ హోదా నుంచి తప్పుకొని, ఇతరులకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారా..? ఈసారి దళిత వర్గానికి చెందిన వారికి పగ్గాలు అప్పగించాలని.. తద్వారా బలహీనవర్గాల్లోకి మరింతగా వెళ్లవచ్చని భావిస్తున్నారా? అన్నింటికన్నా ముఖ్యంగా కేంద్ర కమిటీలో చిన్న వయసు వారికి బాధ్యతలు ఇవ్వనున్నారా..?.. ఈ ప్రశ్నలన్నింటికీ మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, నిఘా వ్యవహారాల్లో నిమగ్నమైన పోలీసువర్గాలు, కొన్ని జాతీయ ఆంగ్ల పత్రికలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. కొంతకాలంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల సరిహద్దుల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరగడంతో పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు చెందిన పలు కీలక పత్రాలు లభించాయి. వాటిని విశ్లేషించగా మావోయిస్టు పార్టీలో నాయకత్వం మార్పు అంశం వెల్లడైనట్లు తెలిసింది. దీంతో మావోయిస్టు పార్టీలో రెండో స్థానంలో ఉన్న నంబాళ కేశవరావు అలియాస్ బసవరాజ్‌ను కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమించవచ్చని తొలుత ప్రచారం జరిగింది. కానీ, పార్టీలో ఇటీవలి పరిణామాలతోపాటు, దళితవర్గానికి చెందిన వారికి నాయకత్వం అప్పగించాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీకి పగ్గాలు అప్పగించనున్నట్లుగా పోలీసు వర్గాలు నిర్ధారించుకున్నట్లు తెలిసింది. కేంద్ర కమిటీలో చిన్నవారు.. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న 19 మందిలో తిరుపతి అలియాస్ దేవ్‌జీ అందరికన్నా వయసులో చిన్నవారు. దళిత వర్గానికి చెందిన ఆయన పార్టీ కేంద్ర కమిటీలో సీసీ మెంబర్‌గా ఉన్నారు. చదువుకునే రోజుల నుంచి తిరుపతి తన ప్రియ శిష్యుడు కావడంతో ఆయన వైపే గణపతి మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం దేశంలోని విప్లవ సంస్థలు మావోయిజాన్ని, అంబేడ్కరిజాన్ని కలిపి ఉద్యమం నిర్మించాలని మేధావులు సూచిస్తున్నారు. పలు సందర్భాల్లో విప్లవ సంస్థల్లోనూ అగ్రవర్ణాల పెత్తనం నడుస్తోందని పరోక్షంగా గణపతిని ఉదహరిస్తూ విమర్శలు కూడా వచ్చాయి. దాంతో మావోయిస్టు పార్టీలోని కేంద్ర కమిటీలో రిజర్వేషన్లు అమలు చేస్తూ మహిళలు, దళితులకు అవకాశమిచ్చారు. తాజాగా గణపతి తప్పుకోనుండటంతో అందరి దృష్టి దళితుడైన తిరుపతిపై పడింది. తెరపైకి 2007 ప్లీనరీ అంశాలు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న పీపుల్స్‌వార్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొండపల్లి సీతారామయ్యను 1992లో తొలగించారు. అప్పటినుంచి గణపతి ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, 2004లో విప్లవ సంస్థలన్నీ కలసి ఏర్పాటైన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగు తున్నారు. ప్రస్తుతం ఆయనకు వయసు మీదపడటం, అనారోగ్యం కారణంగా కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2007లో మావోయిస్టు పార్టీ నిర్వహించుకున్న ప్లీనరీ సందర్భంగా నాయకత్వం వహించేవారి వయసు 60 ఏళ్ల వరకే ఉండాలన్న చర్చ జరిగిందని... ఇప్పుడా అంశాన్ని పరిగణనలోకి తీసుకుని గణపతి స్థానంలో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అప్పట్లో కేంద్ర కమిటీలో ఉన్న నంబాళ కేశవరావు, ఎన్కౌంటర్లో చనిపోయిన ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజ్‌కుమార్, ప్రస్తుతం జైలులో ఉన్న కోబాడ్ గాంధీలలో ఒకరు కార్యదర్శిగా ఎంపికకా వొచ్చని ప్రచారం సాగింది. ఇక వీరితోపాటు పార్టీ కేంద్ర కమిటీలో కటకం సుదర్శన్, మల్లా రాజిరెడ్డి, వేణుగోపాల్‌రావు, అక్కిరాజు హరగోపాల్, మోడెం బాలకృష్ణ, ఒగ్గు సత్వాజీ, రావుల శ్రీనివాస్, పిప్పిరి తిరుపతి, జీనుగు నర్సింహారెడ్డిలతోపాటు బిహార్ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్, బిహార్ మావోయిస్టు పార్టీ యూనిట్ల నుంచి మరో పది మంది సీనియర్ నాయకులు ఉన్నారు. మొత్తంగా వీరందరూ 50 ఏళ్ల పైబడిన వారే. 12 మందికి 60 ఏళ్ల వయసు కూడా నిండింది. మరో ‘కొండపల్లి’ కావొద్దని.. పీపుల్స్‌వార్ పార్టీ వ్యవస్థాపకుడైన కొండపల్లి సీతారామయ్య అనారోగ్యం, మతిమరుపుతో బాధపడటం, పార్టీలో పలు విభేదాలకు కారణంగా మారడంతో ఆయనను పార్టీ కార్యదర్శి పదవి నుంచి తప్పించే వరకూ వెళ్లింది. 1992లో పదవి నుంచి తొలగించాక పలు సందర్భాల్లో ఆయన పరిస్థితి, ఆయన బయటకు వెళ్లిన తీరుపై పార్టీలోని సీనియర్లు ఆందోళనకు గురయ్యారు. దాంతో వయసు పైబడిన నాయకులకు అత్యున్నత స్థానం కల్పిస్తూ.. యువతకే నాయకత్వ బాధ్యతలు అప్పగిం చాలని 2007 ప్లీనరీలో మావోయిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడా అంశం తెరపైకి రావడంతో నాయకత్వ మార్పుకు బీజం పడినట్లు తెలుస్తోంది. రష్యాలో తప్పుకున్న లెనిన్.. చైనాలో కొనసాగిన మావో మావోయిస్టు పార్టీలో కొండపల్లి సీతారామయ్య పరిణామం తర్వాత నాయకత్వం వయసుపై చర్చలు సాగాయి. వృద్ధులు పార్టీని ఏలుతున్నారని.. చైనాలో మావో చనిపోయే వరకు కార్యదర్శిగా పనిచేసి, విప్లవం విజయవంతమైన తర్వాత దేశాధ్యక్షుడిగా సుదీర్ఘకాలం ఉన్నారని వ్యాఖ్యానాలు వినిపించేవి. అటు రష్యాలో మాత్రం లెనిన్ అనారోగ్యానికి గురికావడంతో పార్టీ కార్యదర్శి పదవిని స్టాలిన్‌కు అప్పగించారు. ఆ దేశంలో విప్లవం విజయవంతం అయ్యేందుకు స్టాలిన్ సారథ్యం వహించారు. రష్యా, చైనాల విప్లవ ఉద్యమ స్ఫూర్తిగా భారత్‌లో మావోయిస్టు పార్టీని నడుపుతున్న గణపతి.. అనారోగ్యం కారణంగా లెనిన్ తరహాలో ఇతరులకు బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం సాగుతోంది. అయితే కార్యదర్శి బాధ్యతలు నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ రెడ్ ఆర్మీని నడుపుతూ, విదేశీ విప్లవ సంస్థలను సమన్వయపరుస్తూ, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టు పార్టీకి నేతృత్వం వహించడం అసాధారణమైన విషయమని ఆ పార్టీకి చెందిన కొందరు మాజీలు పేర్కొంటున్నారు. నంబాళ కేశవరావు పేరు కూడా.. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పార్టీ సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్ కమాండర్‌గా ఉన్న నంబాళ కేశవరావు అలియాస్ బసవరాజ్‌ను నియమించవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. రెండు నెలల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌లో నిర్వహించిన మావోయిస్టు ప్లీనరీలో ఈ దిశగా చర్చించినట్లు తెలిసిందని ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలలుగా అరెస్టయిన మావోయిస్టుల విచారణలో, ఎన్కౌంటర్ల సందర్భంగా లభించిన పత్రాల విశ్లేషణలో ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జీఎన్పేటకు చెందిన నంబాళ కేశవరావు ప్రస్తుతం పార్టీ సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) చీఫ్ కమాండర్‌గా ఉన్నారు. ఇక ఎంసీసీఐ నుంచి వచ్చిన ప్రశాంత్‌బోస్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హిడుమ అలియాస్ వినోద్‌ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ముగిసిన గణపతి నవరాత్రోత్సవాలు
శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో ఈ నెల 5న ప్రారంభమైన గణపతి నవరాత్రోత్సవాలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. ముగింపు పూజల్లో భాగంగా స్వామివార్ల రుద్రయాగశాలలో జయాదిహోమం, పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబధోత్సవం, కలశోద్వాసన నిర్వహించారు. నారికేళాలు, సుగంధద్రవ్యాలు, ముత్యం, పగడం, బంగారం, వెండి, నూతనవస్త్రాలు తదితర ద్రవ్యాలను ఈఓ నారాయణ భరత్ గుప్త,జెఈఓ హరినాథ్‌రెడ్డి, అర్చకులు, వేదపంyì తులు హోమగుండానికి సమర్పించారు. అనంతరం యాగశాలలో నెలకొల్పబడిన పంచలోహ వరసిద్ధి వినాయకుడికి వ్రతకల్పపూర్వక ప్రత్యేకపూజలు చేశారు.ఆలయప్రాంగణంలోని మల్లికాగుండంలోఅభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. తొమ్మిదిరోజులపాటు ఆగమ శాస్త్రానుసారం గణపతికి వేదపండితులు, అర్చకులు మండపారాధనలు, ఉపనిషత్తు పారాయణలు, జపానుష్టానాలు, హోమం, సాయంకాల పూజలు నిర్వహించినట్లు ఈఓ తెలిపారు. -
పెన్సిల్ ములికిపై పార్వతీపుత్రుడు
పెద్దాపురం : గణపతి నవరాత్రులను పురస్కరించుకుని స్వర్ణకారుడు తాళాబత్తుల సాయి పెన్సిల్ ములికిపై వినాయక ఆకృతిని చెక్కారు. ఇందుకు మెుత్తం 3 గంటల 30 నిమిషాల 30 సెకన్ల సమయంలో ఆరు రోజుల వ్యవధిలో ఈ ఆకృతిని చెక్కినట్టు సాయి తెలిపారు. నైపుణ్యంతో గణనాథుని ఆకృతిని మలచిన ఆయనను పట్టణంలోని పలువురు ప్రముఖులు,కళాభిమానులు అభినందించారు. -
రూ.72 లక్షలతో ధనగణపతి
గుంటూరు : గుంటూరు నగరంలోని ఆర్ అగ్రహారంలో వాసవీ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం వినాయక విగ్రహానికి రూ.72 లక్షలతో ధనగణపతి అలంకారం చేశారు. విషయం పట్టణంలో ప్రచారం జరగడంతో భక్తులు అధిక సంఖ్యలో విగ్రహాన్ని సందర్శిస్తున్నారు. -
ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలి వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా వరంగల్ : రూరల్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా ఒక ప్రకటనలో కోరారు. సోమవారం నుంచి జిల్లాలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఉత్సవ కమిటీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఉత్సవ కమి టీ వారి పరిధిలోని స్థానిక పోలీస్‌స్టేష న్లకుతప్పకుండాసమాచారం అందించాలన్నారు. పట్టణాల్లో ఉత్సవ విగ్రహాలు ఇతరుల స్థలంలో పెడితే సంబంధిత యజమాని అనుమతి తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అనుమతులు తీసుకుని మండపాలను ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరుగకుండా కమిటీ సభ్యులు తీసుకోవాలని వివరించారు. విద్యుత్, మైక్‌ల పర్మిషన్లు తీసుకోవాలని, ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచిం చారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని, మండపాల వద్ద ఉత్సవ కమిటీలు పర్యవేక్షణ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి విగ్రహానికి సంబంధించిన ఉత్సవ కమిటీల సెల్ నంబర్లు, సభ్యుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లలో అందించాలని కోరారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు, వాట్సాప్, కమాండ్ కంట్రోల్ నంబర్ 85009 27777కు ఫోన్ చేయాలని ఎస్పీ సూచించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఉత్సవ కమిటీలు మట్టి వినాయక విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. -
లడ్డూ కావాలా ..గణనాథా!
వినాయక చవితి ... ప్రకృతితో అనుబంధం ... పండ్లు, పత్రాలు, తోరణాలే గుర్తుకు వస్తాయి... పిండి వంటల్లోకి వస్తే ఉండ్రాళ్లు. ఇదంతా గతం. నేటితరం గణనాథులు కొంగొత్త అవతారాల్లో సాక్షాత్కరిస్తున్నారు. ఆ అలంకరణలకు అనుగుణంగా హైటెక్ పూజలు అందుకుంటున్నాడు ఆ పార్వతీ పుత్రుడు. విగ్రహం ఎత్తులోనే కాదు పెట్టే ప్రసాదంలోనూ పోటాపోటీయే. ఉండ్రాళ్ల స్థానంలో లడ్డూలు ప్రత్యక్షమయ్యాయి. ‘ఇంతింతై వటుడింతై..’ చందంగా కొండంతై ప్రపంచ రికార్డుల కోసం పరుగులు తీస్తున్నాయి. ఇందుకు జిల్లాలోని మండపేట మండలం తాపేశ్వరం కొన్నేళ్లుగా వేదికవుతోంది. ఇక్కడి ప్రముఖ స్వీట్ సంస్థలు ‘దీక్షా’దక్షతలతో సృష్టిస్తున్న మహాలడ్డూలు భక్తులకు కను‘విందు’ చేస్తున్నాయి. -
సాక్షి గణపతి వద్ద రోడ్డు ప్రమాదం
– ఆస్పరి గ్రామస్తులపై దూసుకెళ్లిన బస్సు – ఒకరికి తీవ్రగాయాలు – కర్నూలుకు తర లింపు శ్రీశైలం : శ్రీశైలమహాక్షేత్రానికి మూడు కి.మీ. దూరంలో ఉన్న సాక్షిగణపతి వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆస్పరికి చెందిన సురేంద్ర గోపాల్, మరికొందరు గాయపడ్డారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా మల్లన్న దర్శనార్థం ఆస్పరికి చెందిన 22 మంది కాలినడకన బుధవారం సాయంత్రం శ్రీశైలం చేరుకున్నారు. స్వామిఅమ్మవార్ల దర్శనం తర్వాత రాత్రి సాక్షిగణపతి దర్శనార్థం నడిచి వెళ్తుండగా కుప్పంకు చెందిన టూరిస్ట్ బస్సు వారి పక్కగా దూసుకెళ్లింది. ప్రమాదంలో సురేంద్ర గోపాల్ తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు స్వల్పగాయాలకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను శ్రీశైలదేవస్థానం ఆసుపత్రికి చేర్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఆకె రవికష్ణ ఆసుపత్రికి వెళ్లి ద్వారా డీఎంహెచ్ఓ ద్వారా వివరాలు ఆరా తీశారు. గాయాలు తీవ్రంగా ఉండడంతో వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ వెంట ఓఎస్డి రవిప్రకాశ్, డీఎస్పీ వినోద్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
జార్జ్‌ను బలిపశువు చేస్తున్నారు
జీవవైవిధ్య ఉద్యానవనం ప్రారంభోత్సవంలో సీఎం బెంగళూరు(బనశంకరి) : డీవైఎస్పీ గణపతి ఆత్మహత్య వ్యవహారంలో మంత్రి జార్జ్‌కు ఎలాంటి సంబంధం లేదని, అయితే విపక్షాలు తమ స్వార్థం కోసం ఆయన్ను బలిపశువును చేస్తున్నాయని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. నాగవారలోని హెణ్ణూరు చెరువు వద్ద జీవ వైవిధ్య వనాన్ని సీఎం శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. 99 కేసుల్లో నిందితులు తప్పించుకున్న పర్వాలేదని, అయితే ఓ నిరపరాది శిక్షపడకూడదనే చట్టం ఆశయమని తెలిపారు. అయితే గణపతి ఆత్మహత్య విషయంలో ఎలాంటి సంబంధం లేని జార్జ్‌ని రాజీనామా చేయాలని కోరడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటికే విపక్షాలు సంధించిన ప్రశ్నలంటికీ సమాధానమిచ్చామని, విచారణ అనంతరం నిజానిజాలు వెలుగులోకి వస్తామన్నారు. ప్రారంభించిన ఉద్యానవనానికి బసవలింగప్ప ఉద్యానవనంగా పేరుపెట్టామన్నారు. గతంలో అటవీశాఖామంత్రిగా ఉన్న బసవలింగప్ప ఈ ప్రదేశాన్ని రక్షించారని గుర్తు చేశారు. బెంగళూరు నగరం సౌందర్యం పెంచడానికి చెరువులు, ఉద్యానవనాలను అభివృద్ధి చేస్తామన్నారు. కబ్జాకు గురైన చెరువులు, ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంద ని తెలిపారు. హెణ్ణూరు చెరువు 34 ఎకరాల విస్తీర్ణం ఉందని దీనిని ఆదర్శ ఉద్యానవనంగా తీర్చిదిద్దుతామన్నారు. 21 శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెంచే అవసరముందన్నారు. నగరాబివృద్ధి శాఖామంత్రి కేజే.జార్జ్ మాట్లాడుతూ.....గణపతి ఆత్మహత్య విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అటవీశాఖమంత్రి రామనాథ రై, మేయర్ మంజునాథరెడ్డి, ఎమ్మెల్యే బీఏ.బసవరాజు, పరిసరాల మాలిన్య నియంత్రణ మండలి అద్యక్షుడు లక్ష్మణ్, ప్రభుత్వ కార్యదర్శి విజయభాస్కర్, బీబీఎంపీ సభ్యులు ఆనంద్, రాదమ్మవెంకటేశ్, ఎస్జీ.నాగరాజ్, కాంగ్రేస్ నేతలు సునీల్‌కుమార్, సొణప్ప, జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్పీ మృతిపై జ్యూడీషియల్ విచారణకు సీఎం ఆదేశం
బెంగళూరు: మంగళూరు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ ఎంకే గణపతి (51) ఆత్మహత్య కేసుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం దిగివచ్చింది. సీఎం సిద్దరామయ్య జ్యూడీషియల్ విచారణకు ఆదేశించారు. తన చావుకు బెంగళూరు అభివృద్ధి, పట్టణ ప్రణాళిక శాఖ మంత్రి కేజే జార్జ్‌తో పాటు ఆయన కుమారుడు రాణా జార్జ్లే కారణమని ఆరోపిస్తూ గణపతి తన సూసైడ్ లేఖలో రాసినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని కేసుల విషయంలో సీనియర్ అధికారులు తనను వేధించారని, వారి నుంచి ఒత్తిళ్లు తట్టుకోలేకపోయినట్లు ఆయన అంతకు ముందు ఆరోపించారు. వారం రోజుల వ్యవధిలో కర్ణాటకలో ఇద్దరు పోలీస్ అధికారులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలోనూ బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్పీ అనుపమ షణై రాజీనామా వ్యవహారం ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. నిజాయితీగా పని చేస్తున్నందుకు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల రాజీనామా చేసినట్లు విమర్శలు వచ్చాయి. -
గందరగోళం...
ఉభయ సభలను కుదిపేసిన ‘గణపతి’ ఆత్మహత్య కేసును పక్కదారి పట్టిస్తున్నారు : శెట్టర్ మంత్రి కె.జె.జార్జ్ రాజీనామాకు విపక్షాల పట్టు బెంగళూరు: మంగళూరు డీఎస్పీ ఎం.కె.గణపతి ఆత్మహత్య ఉదంతం ఉభయ సభలను కుదిపేసింది. గణపతి ఆత్మహత్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో నిలదీశాయి. సోమవారం ఉదయం ఉభయసభల కార్యకలాపాలు ప్రారంభం కాగానే బీజేపీ, జేడీఎస్‌లు డీఎస్పీ గణపతి ఆత్మహత్య విషయాన్ని సభల్లో చర్చకు తీసుకువచ్చాయి. ఆత్మహత్యకు ముందు గణపతి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను పరిగణలోకి తీసుకొని మంత్రి కె.జె.జార్జ్‌ను తక్షణమే పదవి నుంచి తప్పించాలని శాసనసభతో పాటు శాసనమండలిలోనూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అంతేకాక ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లి తమ నిరసనను తెలియజేశాయి. దీంతో అటు శాసనసభ, ఇటు శాసనమండలిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. శాసనసభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ డీఎస్పీ గణపతి ఆత్మహత్య విషయంపై చర్చకు అనుమతించాల్సిందిగా స్పీకర్ కె.బి.కోళివాడను కోరారు. ఇందుకు జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి సైతం గళం కలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ ప్రభుత్వం తరఫున లిఖిత పూర్వక వివరణ ఇచ్చేందుకు సన్నద్ధం కాగా తమ అసమ్మతిని తెలియజేసిన ప్రతిపక్ష నేతలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసనకు దిగారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంలో సీఎం సిద్ధరామయ్య కలగజేసుకొని చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ముందుగా రాష్ట్ర హోం శాఖ మంత్రి ఈ విషయంపై స్వయం ప్రేరిత వివరణ ఇవ్వనున్నారని, అనంతరం చర్చకు తాము సిద్ధమని తెలిపారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్య విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సైతం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. గణపతి ఆత్మహత్యపై తాము తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ....‘డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గణపతిని ఓ మానసిక రోగిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో మరింత గందరగోళాన్ని సృష్టించేందుకే గణపతి తండ్రి, సోదరుడి వాంగ్మూలాలు తీసుకున్నారు. అయితే ఇవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. తనకు ఏదైనా జరిగితే అందుకు బాధ్యులు మంత్రి కె.జె.జార్జ్ అని డీఎస్పీ గణపతి చెప్పినప్పటికీ చర్యలు మాత్రం తీసుకోలేదు. సీఎం సిద్ధరామయ్య తనకు అత్యంత ఆప్తుడైన జార్జ్‌పై చర్యలు తీసుకునేందుకు మాత్రం ఒప్పుకోవడం లేదు’ అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలీసు శాఖలో బదిలీల దందా జరుగుతోందంటూ ఈ సందర్భంగా జగదీష్ శెట్టర్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. రూ.20-రూ.50 లక్షలు ఇచ్చి బదిలీలు చేయించుకుంటున్నారని, ఈ ప్రభుత్వంలో ఏదైనా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. జార్జ్‌పై చర్యలు తీసుకోకపోతే పోరాటం తప్పదు.... ఇక శాసనమండలిలో సైతం డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశం ప్రతిధ్వనించింది. ఉదయం శాసనమండలి కార్యకలాపాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత కె.ఎస్.ఈశ్వరప్ప డీఎస్పీ గణపతి ఆత్మహత్య విషయాన్ని చర్చకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కె.జె.జార్జ్‌పై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్ట్ చేయాలి. ఆయన్ను మంత్రి వర్గం నుంచి తప్పించాలి. లేదంటే బీజేపీ సభ లోపల, బయట కూడా పోరాటానికి సన్నద్ధమవుతుంది’ అని హెచ్చరించారు. గణపతిది ఆత్మహత్య కాదని, అది హత్య అని పేర్కొన్నారు. ఈ విషయంలో నిజానిజాలు బయటకు రాకుండా ఉండేందుకు గణపతి డెత్‌నోట్‌ను కూడా మాయం చేశారని ఆరోపించారు. అంతేకాక గణపతి డైరీ, ల్యాప్‌టాప్‌లోని విషయాలను సైతం డిలీట్ చేశారని పేర్కొన్నారు. జార్జ్ మంత్రి స్థానంలోనే కొనసాగితే సాక్ష్యాలను నాశనం చేసేందుకు ఆస్కారం ఉందని మండిపడ్డారు. అందువల్ల తక్షణమే జార్జ్‌ను మంత్రి పదవి నుంచి తప్పించి, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కె.ఎస్.ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. హత్య అనే అనుమానం! కాగా, డీఎస్పీ గణపతి ఆత్మహత్య ఉదంతాన్ని సరిగ్గా పరిశీలిస్తే ఇది హత్యా అనే అనుమానం కలుగుతోందని గణపతి సోదరుడు ఎం.కె.మాచయ్య పేర్కొన్నారు. మడికెరిలోని అదనపు జేఎంఎఫ్‌సీ కోర్టులో ఇందుకు సంబంధించి ఓ ప్రైవేటు కంప్లైంట్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా గణపతి సోదరుడు ఎం.కె.మాచయ్య మాట్లాడుతూ....‘గణపతి ఆత్మహత్య ఉదంతంపై మాకు అనుమానాలు కలుగుతున్నాయి. ఇది ఆత్మహత్యే అయి ఉంటే ఆ గదిలో కాల్పులు ఎందుకు జరుగుతాయి. గణపతి బస చేసిన గది కూడా అంత సురక్షితంగా లేదు. ఆ గదిలోని కిటికీ నుంచి ఓ వ్యక్తి లోనికి వచ్చి వెళ్లేలా పరిస్థితులు ఉన్నాయి. గణపతిని నేను చిన్నప్పటిని నుండి చూస్తున్నా. మేమిద్దరం కలిసే పెరిగాము. గణపతి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా కేసును సీబీఐకి అప్పగించాలి’ అని డిమాండ్ చేశారు. -
తెలంగాణలో మావోయిస్టులు 93 మంది...
రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాభవం తగ్గిపోతున్నట్లు పోలీసులు అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల సంఖ్య 93 ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలోనూ రివార్డులున్న అగ్రనేతలు 28 మంది మాత్రమే ఉన్నట్లు అంచనా వేసింది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని మావోయిస్టు పార్టీ కార్యకలాపాలపై రాష్ట్ర ఇంటలిజెన్స్ విభాగం ఒక నివేదిక రూపొందించింది. దీని ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం మావోయిస్టులు 93 మందిలో వరంగల్ జిల్లాకు చెందిన వారు 35 మంది కాగా, కరీంనగర్‌కు చెందిన వారు 30 మంది ఉన్నట్లు గుర్తించింది. అలాగే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో చత్తీస్‌గఢ్ సరిహద్దు వెంట మావోల కదలికలున్నట్లు పోలీసుశాఖ నిర్ధారించింది. కొత్తగా రిక్రూట్మెంట్ లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టు పార్టీ గత కొంత కాలంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో జాడే లేకుండా పోయినట్లు ఇంటలిజెన్స్ అధికారులు అంచనా వేశారు. అయితే రాష్ట్రంలో మావోయిస్టుల సంఖ్య తగ్గినప్పటికీ సెంట్రల్ కమిటీలో మాత్రం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి హవా కొనసాగుతోంది. పార్టీ సెంట్రల్ కమిటీలో 20 మందికిగాను ఏపీ, తెలంగాణకు చెందిన వారు 12 మంది ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ హరిభూషణ్ నేతృత్వంలో కొనసాగుతున్నట్లు పోలీసుల సమాచారం. వరుస ఎదురుదెబ్బలతో కుదేలు.. రాష్ట్రంలో పోలీసులు రచిస్తున్న వ్యూహ రచనతో మావోయిస్టు పార్టీ కుదేలవుతోంది. వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బలతో కీలకనేతలను పొగొట్టుకొని అతలాకుతలమైంది. రాష్ట్ర సరిహద్దుల్లో ముఖ్యంగా చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలు జరిపిన ఎన్కౌంటర్లలో మావోయిస్టులు భారీగా హతమయ్యారు. ఈ ఏడాది మార్చి నెలలో ఖమ్మం, చత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో ఒకేసారి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గడ్చిరోలి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కీలక నేత ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు ఆత్రం శోభన్ సైతం ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో అండర్ గ్రౌండ్లో 180 మంది మావోయిస్టులు ఉండగా ప్రస్తుతం 140కి పడిపోయింది. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 93 మంది ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం. అందులోనూ ముఖ్యనేతలు రివార్డులున్న వారు కేవలం 28 మంది మాత్రమే ఉన్నారు. సెంట్రల్ కమిటీలో ఉన్న గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, గణపతి, మల్లా రాజిరెడ్డి, నంబాల కేశవరావు, మల్లోజుల వేణుగోపాలరావు వంటి వారిపై రూ.25లక్షలు, అలాగే స్టేట్ కమిటీలో ఉన్న వారిపై రూ.20 లక్షలు, జిల్లా కమిటీలో ఉన్న వారిపై రూ.10లక్షలు ఉన్న వారున్నారు. వ్యూహాత్మకంగా కట్టడి.. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో విరివిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో వారిని కట్టడి చేయగలిగారు. ఇన్ఫార్మర్ల సహాయంతో గ్రేహౌండ్స్ బలగాలు అనుక్షణం జల్లెడ పట్టడంతో మావోలు కోలుకోలేకపోయారు. పోలీసులు వ్యూహత్మకంగా కట్టడి చేసి.. రాష్ట్రంలో నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితం చేయగలిగారు. ఒకప్పుడు నల్లమల్ల అటవీ కేంద్రంగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో విస్తృత కార్యకలాపాలు జరిపిన మావోయిస్టులు ప్రస్తుతం ఉనికే లేకుండా పోయింది. రాష్ట్రంలో అర్బన్ జిల్లాలైన హైదరాబాద్, రంగారెడ్డిలతో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో మావోయిస్టుల జాడ లేదని ఇంటలిజెన్స్ రూపొందించిన నివేదికలో స్పష్టం చేసింది. కేవలం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే నక్సల్స్ కదలికలున్నట్లు పేర్కొంది. కొత్త రిక్రూట్మెంట్కు దెబ్బకొట్టిన పోలీసులు.. వరుస ఎన్కౌంటర్లతో క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు కొత్త రిక్రూట్మెంట్కు అవకాశం లేకుండా పోలీసులు గట్టిదెబ్బ కొట్టారు. ఏడాది క్రితం కొత్త రిక్రూట్మెంట్ కోసం నక్సల్స్ చేసిన ప్రయత్నాలను పోలీసులు అణిచివేశారు. కొన్ని విద్యాలయాల వేదికగా మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. వెంటనే అనుమానితులందరిపై డేగకన్ను వేసిన పోలీసులు అణుక్షణం వెంటాడారు. కొత్తగా రిక్రూట్ అయిన వారిలో ఎంటెక్ విద్యార్థిని మహిత అలియాస్ శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిలను పోలీసులు ఎన్కౌంటర్ చేసి భయబ్రాంతులకు గురిచేశారు. ఎన్కౌంటర్ జరిగిన తీరుతో కొత్త వారు పార్టీలో చేరేందుకు విముఖత చేపేలా చేశారు. -
కారు ఢీకొని సింగరేణి కార్మికుడి మృతి
ఖమ్మం జిల్లా మణుగూరు మండలం సింగరేణి సీటైప్ కాలనీలో కారు ఢీకొనడంతో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. గురువారం అర్ధరాత్రి గణపతి (55) అనే సింగరేణి కార్మికుడు కాలనీలో నివాసం ముందు ఉండగా ప్రాజెక్టు అధికారి టీవీ రావు కారు ఢీకొనడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
పరారైన రిమాండ్ ఖైదీ కోసం పోలీసుల వేట
కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగరాజు ఆలియాస్ గణపతి పరార్ కావడంతో అతని కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఈ నెల 12న పలు చోరీ కేసుల్లో నాగరాజుతోపాటు మరొక దొంగను కళ్యాణదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. నాగరాజు ఆలియాస్ గణపతి తనకు ఆరోగ్యం సరిగా లేదని సబ్ జైలు అధికారులతో విన్నవించుకోవడంతో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీస్టేషన్ కానిస్టేబుల్ భూపతి ద్వారా నాగరాజును శనివారం వైద్య పరిక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మూత్ర విసర్జన కోసం పక్కకు వెళ్లిన అతడు పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. ఈ విషయాన్ని పోలీసులు బయటకు పొక్కుకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా పరారైన ఖైదీ కోసం పలు పోలీసుల బృందాలు వివిధ ప్రాంతాల్లో అన్వేషిస్తున్నట్లు సమాచారం. కళ్యాణదుర్గం, అనంతపురం, బెలుగుప్ప, ఉరవకొండ, రాయదుర్గం తదితర ప్రాంతాలలో పోలీసులు అన్వేషిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై టౌన్ ఎస్ఐ శంకర్‌రెడ్డిని వివరణ కోరగా సబ్ జైలు అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. సబ్‌జైల్ సూపరిండెంట్ ధనుంజయ్య నాయుడును వివరణ కోరగా రిమాండ్ ఖైదీ నాగరాజు ఆలియాస్ గణపతిని పట్టణ పోలీసులు వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరారైన విషయాన్ని సబ్‌జైలు ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. -
మనుషులు చేసిన దేవుడు
ఇంటికి తీసుకొచ్చి... ప్రతిష్ఠించి... మనస్ఫూర్తిగా ఆరాధించి... తనకి నచ్చినవన్నీ వడ్డించి... భజన చేసి... గుంజీలు తీసి... పండగ చేసి... అదేంటో... తీసుకె ళ్లి నీళ్లల్లో వేసేస్తాం. పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించిన గణపతిని... ఆయనతో కొద్దిరోజుల్లోనే పెంచుకున్న అపార మైన ఆప్యాయతని... అంత సులువుగా తెంపుకుని... ఎలా? దేవాలయంలో ప్రతిష్ఠిస్తే మనం మునకలు తీస్తాం. ఏంటో... బొజ్జ గణపయ్యని... అలా?! ఈ సినిమాలో వినాయకుడి బొజ్జలో స్మగుల్డ్ గూడ్స్ పెడతారు. కథ రాసేటప్పుడు అపచారం అనిపించే ఉంటుంది. సెంటిమెంట్‌ని దెబ్బతీస్తామేమో అన్న భయం కూడా ఉండే ఉంటుంది. అయినా... అలా చేశారంటే... దేవుడు... దేవుడు చేసిన మనుషుల్లోనే ఉంటాడు... మనుషులు చేసిన దేవుళ్లలో ఇహబంధాలే ఉంటాయి... వాటిని నిమజ్జనం చేయగలిగితేనే... పరిహారం అవుతుందని కావచ్చు. నిమజ్జనాలు మొదలయ్యాయి. పెద్ద నిమజ్జనం... వచ్చే ఆదివారం. కానీ ఈ ఆదివారం ఫ్యామిలీలో మీరు కనులారా వీక్షించబోయే నిమజ్జనం దానికన్నా పెద్దది! సొసైటీలో పెద్దవాళ్లుగా చెలామణి అవుతున్నవారు సర్వసంగ పరిత్యాగుల్లా తయారై దేవుణ్ని తలకెత్తుకుని నిర్వహిస్తున్న మహాయజ్ఞంలాంటి మహా నిమజ్జనం ఇది. కొద్ది క్షణాల్లో రథంపై ఊరేగబోతున్న ఈ వినాయకుడిని అడుగుల్లో కాదు, తులాల్లో కొలవాలి. విగ్రహంలోని మట్టిని కాదు, బంగారాన్ని తూచాలి. గోల్డ్ గణేశ! ఊరేగింపు ఎటు వెళ్లాలో, ఎలా వెళ్లాలో స్కెచ్ గీసి చెబుతున్నాడు కొంగర జగ్గయ్య. శ్రద్ధగా వింటున్నాడు విదేశీ ఏజెంటు. ‘వెల్. హియర్ ఇటీజ్. వినాయకుడి రథం ఈ స్పాట్ నుంచి బయల్దేరుతుంది. పురవీధుల గుండా ఊరేగిస్తాం. చిట్టచివరకు ఈ సముద్రపుపాయ ఒడ్డుకు చేరుకుంటుంది. అక్కడ ప్రజలందరూ చూస్తుండగా... ఈ విగ్రహాన్ని నీళ్లల్లో తోసేస్తాం. నీళ్ల అడుగున మీ మనుషులు హుక్స్‌తో రెడీగా ఉంటారు. నీళ్లలో పడగానే విగ్రహానికి ఆ హుక్స్ తగిలిస్తారు. అటు తర్వాత నీళ్ల అడుగు నుంచి దాన్ని షిప్ వరకు లాక్కెళతారు. దట్సాల్. ‘డన్’ అన్నాడు ఏజెంటు. లోపల ఉన్నది కోటి రూపాయల సరుకు! వట్టి సరుకు కాదు. భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వ సంపద. జగ్గయ్య స్మగ్లర్. ఎప్పుడూ పూల కుండీల్లో దేవతా విగ్రహాలు పెట్టి స్మగుల్ చేసే జగ్గయ్య... ఈసారి హోల్‌సేల్‌గా బొజ్జ గణపయ్య కడుపులో ఉండ్రాళ్లలా దాచి బంగారు విగ్రహాలను విదేశాలకు తరలించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. సీన్ క్లైమాక్స్‌కి వచ్చింది! అడ్డు పడేవాళ్లెవరూ లేరు. అడ్డు పడబోయిన ఎన్టీఆర్ ఆల్రెడీ జగ్గయ్య డెన్‌లో బందీగా చిక్కుకొని ఉన్నాడు. ఎన్టీఆర్‌తో పాటు అతడికి మనసిచ్చిన చిన్నది జయలలిత కూడా అతడితోపాటు బందీగా ఉంది. ఎన్టీఆర్ చెల్లెలు కాంచన మరో సెల్లో బందీగా ఉంది. కాంచన ప్రియుడు జగ్గయ్య అదే సెల్లో బందీగా ఉన్నాడు. జగ్గయ్య అంటే స్మగ్లర్ జగ్గయ్య కాదు. సాఫ్ట్ క్యారెక్టర్ జగ్గయ్య. (డబుల్ యాక్షన్). ఎన్టీఆర్‌ను ‘బావా’ అంటుండే తాగుబోతు సత్యనారాయణ సేమ్ డెన్‌లో తప్పతాగి పడి ఉన్నాడు. అప్పుడొచ్చాడు కృష్ణ. దారి వెతుక్కుంటూ డెన్లోకి ప్రవేశించాడు. ‘అన్నయ్యా’ అన్నాడు ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి. ‘తమ్ముడూ.. ఆ దుర్మార్గులు మమ్మల్నందర్నీ అంతం చెయ్యడానికి టైమ్ బాంబ్ పెట్టారు’ చెప్పాడు ఎన్టీఆర్. ఎక్కడుందా టైమ్బాంబ్? స్పృహలేకుండా పడివున్న సత్యనారాయణ చేతుల్లో ఉంది. ఏ క్షణమైనా పేలడానికి సిద్ధంగా ఉంది. అక్కడ ఇంకో టైమ్ బాంబ్! అక్కడ నిమజ్జనం స్టార్ట్ అయింది. వినాయకుడి భారీ విగ్రహం ఊరేగింపునకు సిద్ధమైంది. అదీ ఒక టైమ్ బాంబులా ఉంది. బొజ్జ గణపయ్య కడుపులో బోలెడంత గోల్డ్. ఎన్టీఆర్, కృష్ణ... సమయానికి అక్కడికి చేరుకోలేకపోతే అది విదేశాలకు తరలి వెళుతుంది. ఆపాలి. ఎలా? ఎన్టీఆర్‌లో టెన్షన్. కృష్ణలో టెన్షన్. ప్రేక్షకులలో టెన్షన్. విలన్ జగ్గయ్య మాత్రం కూల్‌గా ఉన్నాడు. ఎప్పుడూ కనిపించే దానికి భిన్నంగా సూటూబూటులో కాకుండా తెల్లటి లాల్చీ పైజమాలో ఉన్నాడు. మెడలో మాల. ముఖంపై చిరునవ్వు. నుదుటిపై నిలుపు బొట్టు. ‘భక్త మహాజనురాలా... పవిత్రమైన మన భారతదేశం ఈనాడు అనేక ఈతిబాధలకు గురవుతున్నదంటే అందుకు కారణం ప్రజల్లో దైవభక్తి లోపించడమే. అందుచేత దేశక్షేమం, ప్రజాక్షేమం కోరి ఈ ఆస్తికతా మహాయజ్ఞాన్ని ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలుసు’ అని ప్రారంభోపన్యాసం చేశాడు. జై విఘ్నరాజా... జై గణాధిపా... ఊరేగింపు మొదలైంది. ఊరేగింపు చాటున బంగారు విగ్రహాల తరలింపూ మొదలైంది. బందిఖానా బద్దలు కొట్టుకుని వచ్చేశారు మన హీరోలు! ‘పాపం బద్దలు కావాలి. మోసం బయటికి రావాలి’ అని పాడారు. ‘నాటి గణపతికి పొట్ట పగిలితే రాలేను ఉండ్రాళ్లు... ఉండ్రాళ్లు. నేటి గణపతికి బొజ్జ పగలితే రాలను రత్నాలు... రత్నాలు’ అని జనానికి హింట్ ఇచ్చారు. జగ్గయ్య షాక్ తిన్నాడు. ‘భక్తులారా... వీళ్లెవరో మన ఆస్తికత్వాన్ని నాశనం చెయ్యడానికి వచ్చిన మతద్రోహులు. జాతిద్రోహులు. ఇలాంటి దైవద్రోహులను ఊరికే విడిచిపెట్టకూడదు. కొట్టండి. పెడ రెక్కలు విరవండి. రథచక్రాలకు కట్టిండి. ఈ నాస్తికుల శవాల మీదుగా మన జగన్నాథ రథాన్ని నడపండి. జై గణాధిపా...’ అని పిలుపునిచ్చాడు జగ్గయ్య. కలకలం మొదలైంది. భక్తజనం కకావికలం అయ్యారు. కోపోద్రిక్తులు అయ్యారు. గాలిలోకి రెండు కాల్పులు కాల్చి వారి దారికి తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణ. టెంకాయతో గణపతి పొట్టను పగులగొట్టారు. రత్నాలు, వజ్రాలు పొదిగిన విగ్రహాలు బయటపడ్డాయి. జగ్గయ్య బండారమూ బద్దలైంది. ఎన్టీఆర్‌దే కీ రోల్ దేవుడు చేసిన మనుషులు 1973లో విడుదలైంది. క్లైమాక్స్‌లో నిమజ్జనం సీన్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. మాటలు త్రిపురనేని మహారథి. పాటలు శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి. నిమజ్జనం సీన్, మాటలు, పాటలు... ఈ మూడూ... సినిమాను సూపర్ హిట్ చేశాయి. వాటితో పాటు రమేశ్‌నాయుడు సంగీతం. అప్పటి వరకు మాయాబజార్, గుండమ్మ కథ, పాండవ వనవాసం... ఇవే తెలుగు సినిమా హిట్స్. ఆ వరుసలోకి దేవుడు చేసిన మనుషులు కూడా చేరింది. నిజానికప్పుడు ఎన్టీఆర్ ఏవరేజ్లో ఉన్నాడు. కృష్ణ సాహసం చేసి ఎన్టీఆర్‌ని హీరోగా తీసుకున్నాడు. సినిమా ఎన్టీఆర్‌తో మొదలౌతుంది. ‘దేవుడు చేసిన మనుషుల్లారా..’ అనే పాటతో ప్రారంభం అవుతుంది. ఎండ్ సీన్లో కూడా ఎన్టీఆర్‌దే కీ రోల్. దేవుడు చేసిన మనుషుల్లారా.. అనేదే కీ సాంగ్. అలా అడుగుడుగునా... ఇరవై రీళ్ల పాటు చిక్కగా కథలను అల్లుకొచ్చారు దర్శకుడు వి.రామచంద్రరావు. ‘పోయిన’ కొడుకుపై ఎస్వీఆర్ బెంగ ఎస్వీరంగారావు పెద్ద జమీందారు. టీ ఎస్టేట్ ఓనర్. ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు ఎన్టీఆర్. చిన్నకొడుకు కృష్ణ. కూతురు కాంచన. భార్య ఎస్. వరలక్ష్మి. వారితో పాటు వాళ్ల ఇంట్లో భార్యగారి తమ్ముడు సాక్షి రంగారావు. ఎన్టీఆర్ చిన్నప్పుడే తప్పిపోతాడు. (తిప్పిపోలేదు, సాక్షి రంగారావే తప్పిస్తాడని తర్వాత తెలుస్తుంది). ‘పోయిన’ కొడుకు కోసం ఎస్వీఆర్ బెంగపెట్టుకుంటాడు. చివర్లో తను చేరదీసిన రామూనే ఎన్టీఆర్ అని తెలుస్తుంది. ఎస్వీరంగారావు (చనిపోయిన) మొదటి భార్య కొడుకే ఎన్టీయార్. చిన్నప్పుడు ఎన్టీఆర్ బర్త్‌డే పార్టీ జరుగుతుంటే... ఆస్తి దక్కకుండా ఉండడం కోసం సాక్షి రంగారావే అక్కతో కలిసి ప్లాన్ వేసి, అతణ్ణి నీళ్లలో తోసేస్తాడు. అలా నిర్మలమ్మకు దొరుకుతాడు ఎన్టీఆర్. కథ మొత్తం ఎస్వీఆర్, ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతుంది. ఇంకో ట్రాక్‌లో జగ్గయ్య అండ్ గ్యాంగ్. కామెడీ ఉండీలేనట్లు ఉంటుంది. అల్లురామలింగయ్యకు, సత్యనారాయణకు మధ్య నాలుగు ముక్కలేవో ఉంటాయి. సినిమా అంతా ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. ఒక రొమాంటిక్ సాంగ్ (దోరవయసు చిన్నది). ఒక ఐటమ్ సాంగ్ (మసక మసక చీకట్లో). ఒక లవర్‌బాయ్ సాంగ్ (ఏ తారలోనూ, నీ తీరు లేదు...) దీన్ని కృష్ణ పాడతాడు. కాసేపు జమునతో, కాసేపు మంజులతో. ఆ తర్వాత వాళ్లిద్దరూ కనిపించరు. గెస్ట్‌రోల్‌లో ఇలా మెరిసి, అలా వెళ్లిపోతారు. ఇవి కాకుండా, ఒక ఉద్వేగ గీతం.. ‘అలనాటి వేణుగానం మోగింది మరల...’ ఇంకోసాంగ్... ‘నీ దగ్గర ఏదో ఏదో ఉంది...’ వలపు సంకెల వేసే పాట. కాంతారావును మాయ చేసి ధ్యాస మళ్లించడానికి జయలలిత పాడుతుంది. నాన్నగారిపై కృష్ణ కినుక ఎన్టీఆర్ మొదట దొంగ! ఇంటినుంచి తప్పిపోయాక, ఎక్కడెక్కడో పెరిగి, దొంగల సావాసం పట్టి అలా అవుతాడు. ఓ సంఘటనతో అతడికి జయలలిత పరిచయం అవుతుంది. అమె జగ్గయ్య చెల్లెలు (సొంత చెల్లి కాదు). ఇంకో సంఘటనతో అతడు ఎస్వీరంగారావు ఇంటి మనిషి అవుతాడు. ఇది కృష్ణకు ఇష్టం ఉండదు. ఎవడినో తెచ్చి నాన్నగారు ఇంట్లో పెట్టుకున్నారు అనే కోపంతో ఉంటాడు. ఎన్టీఆరే తన అన్న అని తెలిసేంతవరకు అలానే ఉంటాడు. ఈ వాస్తవాలన్నీ ఎన్టీఆర్‌కు తెలిసినా, సమయం వచ్చే వరకు బయటపెట్టడు. చెడపకురా చెడేవు ఇక విజయనిర్మల పేదింటి అమ్మాయి. సత్యనారాయణ చెల్లెలు. ఎస్టేట్‌లో పని చేస్తుంటుంది. కృష్ణ ఆమె మీద మనసు పడతాడు. ఆ అమ్మాయి కాదంటుంది. ఇతడి పంతం పెరుగుతుంది. అదో ట్రాక్. విజయనిర్మల తల్లి నిర్మలమ్మ చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు కృష్ణ వెళ్లి ఆదుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ సత్యనారాయణ తన అలవాటుగా రోడ్డుపై నాడా విసిరి, కృష్ణ కారుకు పంక్చర్ వేయడానికి వస్తాడు. టైరు మార్చడానికి వచ్చి కారులో ఉన్న తల్లిని చూసి కుప్పకూలిపోతాడు. సినిమాలో ఇదొక హృద్యమైన సన్నివేశం. చెరపకురా చెడేవు అన్నది నీతి. ఇన్ని ట్విస్టులతో సాగే ఈ కథలో మొదట చెడ్డవాళ్లుగా ఉన్న ఒక్కొక్కరూ ఒక్కో గుణపాఠంతో మారుతూ వస్తారు. ఎట్ ది ఎండ్... చెడ్డవాళ్లు జైలుకు వెళతారు. మంచివారు అనుబంధాలలో చిక్కుకుంటారు. ఎన్టీఆర్‌కి జయలలితకి, కృష్ణకి విజయనిర్మలకి, కాంచనకీ, మంచి జగ్గయ్యకి పెళ్లి. ఎస్వీరంగారావు ఎస్టేట్ మళ్లీ కళకళలాడుతుంది. స్మగ్లర్లు దొంగిలించుకెళ్లిన శ్రీకృష్ణుడి విగ్రహం తిరిగి ఆ ఇంటికి చేరి శ్రీరామరక్షలా ఉంటుంది. దేవుడు చేసిన మనుషులు రకరకాలు. ఆ మనుషుల్లో కొందరు సాటి మనుషులకు దేవుళ్లలా అనిపిస్తారు. అలాంటి ఒక దేవుడే... కుటుంబాన్ని చక్కదిద్ది, సమాజాన్ని మేల్కొలిపిన ‘రాము’ పాత్రధారి ఎన్టీఆర్. విశేషాలు ఎన్టీఆర్ తొలిసారిగా బెల్‌బాటమ్ ప్యాంట్‌తో ఈ సినిమాలో కనిపిస్తారు. కాంతారావు (స్మగ్లింగ్ ముఠా సభ్యుడు)ఇందులో చిన్నపాటి విలన్. అప్పటివరకు తెలుగు ప్రేక్షకులు ఆయన్ని హీరోగా మాత్రమే చూశారు. ఈ చిత్రంలో సూటు బూటుతో కనిపించే కాంతారావు ఆ తర్వాత జానపద చిత్రాలలో నటించడం తగ్గించారు. ఈ చిత్రం సమయంలోనే ఎన్టీఆర్ నా అభిమాన నటుడని కృష్ణ ప్రకటించారు. దేవుడు చేసిన మనుషులు 29 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. మళ్లీ చూడండి రామ్ ఎడిటర్, ఫీచర్స్ -
బాహుబలి గణపతి
హైదరాబాద్: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్‌లో వినాయక విగ్రహాలను వినూత్న రీతిలో తయారు చేస్తున్నారు. కాచిగూడకు చెందిన కొందరు భక్తులు ప్రత్యేకంగా పర్యావరణ సహిత మట్టి వినాయ విగ్రహాన్ని తయారు చేయించారు. శివలింగాన్ని భుజాన పెట్టుకుని గంగ దరికి చేర్చిన బాహుబలి వలే ఈ గణపతి ఆకర్షిస్తున్నాడు. ప్రతిమను సోమవారం శివం రోడ్డు గుండా ట్రాలీపై తరలిస్తుండగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు. -
100 రోజులు.. 50 లక్షలు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి తయారీకి అయ్యే ఖర్చెంతో తెలుసా..! అక్షరాలా అరకోటి రూపాయలు. దాదాపు వందరోజుల పాటు జరిగే నిర్మాణ పనులకు అవసరమయ్యే ముడిసరుకులు, కళాకారుల జీతభత్యాల కోసం ఉత్సవ కమిటీ ఈ ఏడాది రూ.50 లక్షలు ఖర్చు చేసింది. దేనికెంత ఎంత ఖర్చయిందంటే... స్టీలు - రూ.8 లక్షలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ - రూ.4 లక్షలు షెడ్డు కర్రలు - రూ.5 లక్షలు మోల్డింగ్ పనులకు - రూ.10 లక్షలు ఫినిషింగ్ పనులకు - రూ.5 లక్షలు షెడ్డు నిర్మాణం - రూ.3 లక్షలు వెల్డింగ్ - రూ.8 లక్షలు పెయింటింగ్ - రూ.7 లక్షలు -
మావోయిస్టు అగ్రనేత గణపతి ఇంటర్వ్యూ...
-
దేశాన్ని అమ్మేస్తున్నారు
(గణపతి ఇంటర్వ్యూ పూర్తిపాఠం...) మోదీ సర్కారుపై మావోయిస్టు దళపతి గణపతి ధ్వజం ఎన్డీఏ సర్కారు హిందూ ఫాసిస్టు ఎజెండాను ముందుకు తీసుకుపోతోంది గత దశాబ్ద కాలంలో మావోయిస్టు పార్టీ గణనీయమైన విజయాలు సాధించింది ప్రపంచంలోనూ, దేశంలోనూ విప్లవ పురోగమనఅనుకూల పరిస్థితులు పెరుగుతున్నాయి మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి దశాబ్దమైన సందర్భంగా గణపతి ఇంటర్వ్యూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విదేశీ, భారతదేశ బడా బూర్జువా బడా భూస్వాముల అవసరాలకు అనుగుణంగా సామ్రాజ్యవాద అనుకూల, దేశాన్ని విక్రయించే విధానాలను ప్రమాదకర వేగంతో అమలు చేస్తోందని.. దేశాన్ని హోల్‌సేల్‌గా అమ్మేస్తున్నారని.. అదే సమయంలో వివిధ రూపాల్లో హిందూ ఫాసిస్టు ఎజెండాను ముందుకు తీసుకుపోతోందని.. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అగ్రనేత గణపతి ధ్వజమెత్తారు. ఇది ఇప్పటికే యాతనలు పడుతున్న శ్రామికులు, రైతులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువత వంటి వర్గాల ప్రజల కష్టాలను మరింత దుర్భరం చేస్తోందన్నారు. దేశంలోని వామపక్ష విప్లవ పార్టీలు విలీనమై మావోయిస్టు పార్టీగా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాకు కాలం చెల్లిందన్న వాదనలు.. దోపిడీదారులూ, ప్రగతి నిరోధక శక్తులూ చేస్తున్న దుష్ర్పచారమని తోసిపుచ్చారు. భారతదేశంలో మావోయిస్టు పార్టీ గత దశాబ్ద కాలంలో పలు విజయాలు సాధించినప్పటికీ.. ఇటీవలి కాలంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని.. గ్రామీణ మైదాన ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో విప్లవోద్యమం బలహీనపడిందని గణపతి ఈ ఇంటర్వ్యూలో అంగీకరించారు. మోదీ సర్కారు అభివృద్ధి నిరోధక విధానాలను, ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ప్రజలపై చేస్తున్న యుద్ధాన్ని తిప్పికొట్టడానికి.. మొత్తం ప్రజాస్వామిక, ప్రగతిశీల, లౌకిక, దేశభక్తి శక్తులన్నీ ప్రజల పక్షాన నిలవాలని.. పార్లమెంటరీ ‘వామపక్షాలు’ కూడా కలిసిరావాలని పిలుపునిచ్చారు. గణపతి ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలివీ... ప్రశ్న: మావోయిస్టు పార్టీ ఈ పదేళ్లలో సాధించిన ప్రత్యేక విజయాలు ఏవి? గణపతి: మన దేశ విప్లవోద్యమ చరిత్రలో గత దశాబ్దకాలం సాటిలేనిది. భారత నూతన ప్రజాస్వామిక విప్లవానికి ఏకైక మార్గదర్శక కేంద్రంగా ముందు నడవడంలో.. ఈ విప్లవానికి మూడు మంత్రదండాలైన పార్టీ, సైన్యం, ఐక్య సంఘటనలు ముందుకన్నా మరింత బలోపేతం కావడంలో.. దీర్ఘకాలిక ప్రజాయుద్ధానికి వాస్తవమైన ప్రజా స్వభావాన్నివ్వడంలో.. సామ్రాజ్యవాదం, భూస్వామ్యం, నిరంకుశ పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలను నిర్మించడంలో.. ‘జల్, జంగల్, జమీన్, ఇజ్జత్, అధికార్’ వంటి సమస్యలపై విశాల ప్రజా సమూహాలను, రైతాంగాన్ని సమీకరించడంలో విలువైన అనుభవాలను గడించడం జరిగింది. ప్రశ్న: ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమిటి? వాటిని అధిగమించేందుకు గల అవకాశాలేమిటి? గణపతి: కొత్త పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచీ గ్రామ స్థాయి నుంచి కేంద్ర కమిటీ వరకూ అనేక మంది నాయకత్వాన్ని కోల్పోయాము. శత్రు దాడుల నుంచి పార్టీ వ్యూహాత్మక నాయకత్వాన్ని కాపాడుకోవటం ప్రధాన కర్తవ్యాల్లో మొదటిది. గ్రామీణ మైదాన ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో విప్లవోద్యమం బలహీనపడింది. ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేసి, విస్తరించడం ఒక సవాలు. అయితే.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విదేశీ, భారతదేశ బడా బూర్జువాజీ, బడా భూస్వాముల అవసరాలకు అనుగుణంగా సామ్రాజ్యవాద అనుకూల, దేశాన్ని విక్రయించే విధానాలను ప్రమాదకర వేగంతో అమలు చేస్తుండటం, హిందూ ఫాసిస్టు అజెండాను వివిధ రూపాల్లో ముందుకు తీసుకుపోతుండటం వల్ల.. ప్రజాస్వామిక, పురోగామి, లౌకిక, దేశభక్త శక్తులన్నీ పోరాటంలో ఏకమయ్యేందుకు కొత్త దారులు తెరుచుకుంటాయి. విప్లవ పురోగమనానికి అనుకూలంగా పెరిగిపోతున్న ఈ పరిస్థితులను వినియోగించుకుని గడ్డు పరిస్థితిని అధిగమించగలం. ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోగలం. ప్రశ్న: పార్టీల విలీనం తర్వాత పీఎల్జీఏలోనూ, గెరిల్లా యుద్ధాన్ని తీవ్రతరం చేయడంలోనూ విస్తరించడంలోనూ పరిణామాత్మక మార్పు ఉండగా.. ఇప్పుడు మందకొడితనం కనిపిస్తోంది. దీనిని మళ్లీ వేగవంతం చేయడానికి, పురోగమింపచేయడానికి పార్టీ ఏం చేయబోతోంది? గణపతి: గత దశాబ్ద కాలంలో కొన్ని అద్భుత విజయాలను గెలుచుకున్నాం. అయితే.. 2011 నుంచీ మందకొడితనం కనిపిస్తోంది. విప్లవ ప్రతీఘాతక యుద్ధాన్ని తిప్పికొట్టడంలో.. విప్లవ శక్తులకు - విప్లవ ప్రతీఘాతక శక్తుల బలాలకు ఉన్న తేడా చాలా పెద్దది. ఈ ఎదురెదురు బలగాల బలాలలో ఉన్న తేడా వలన పార్టీ గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించడానికి అననుకూల పరిస్థితులు తలెత్తాయి. ఇది పార్టీ స్వీయ బలహీనతల దుష్ఫలితమే. ఉద్యమంలో ఆటుపోట్లు ఒక కొత్త పరిస్థితి ఏర్పడేందుకు దారితీస్తాయి. దీనిని అర్థం చేసుకొని.. పార్టీని, పీఎల్‌జీఏని, ప్రజానీకాన్ని సిద్ధం చేయడంలో పార్టీ నుంచి కొన్ని తీవ్రమైన తప్పులు జరిగాయి. కొత్త సవాళ్లను ఎదుర్కోవడంలో పార్టీకున్న లోపాల వల్ల నష్టాలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు.. తప్పులనూ, బలహీనతలనూ గుర్తించి, పార్టీ, పీఎల్జీఏ ప్రజా ఉద్యమాల బోల్షెవీకరణకు పూనుకుంది. ప్రశ్న: పార్టీ ప్రధాన కార్యకలాపాలన్నీ ఆదివాసీ ప్రాంతాలకే పరిమితమైపోవటం.. దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా అటువంటి ప్రాంతాలకే తప్ప మొత్తంగా దేశానికి వర్తించదని కొందరు వాదిస్తున్నారు. దీనికి మీ స్పందన ఏమిటి? ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఎలా విస్తరిస్తారు? గణపతి: భారతదేశం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అసమాన అభివృద్ధి కలిగిన విశాలమైన అర్ధ వలస, అర్ధ భూస్వామ్య దేశం. ఈ అభివృద్ధిలోని అసమానతే దేశవ్యాప్తంగా ఏక కాలంలో విప్లవాన్ని లేదా సాయుధ తిరుగుబాటును చేసే అవకాశం లేకుండా చేస్తోంది. పెపైచ్చు పాలక వర్గాల చేతిలో శక్తివంతమైన కేంద్రీకృత రాజ్యంతో పాటు సుశిక్షితమైన, ఆధునిక ఆయుధ సంపత్తి కలిగిన సైన్యంతో.. బలమైన అణచివేత యంత్రాంగం ఉంది. అందుచేత.. శత్రువు పరిపాలన అమిత బలహీనంగా ఉండే గ్రామీణ ప్రాంతం నుంచి విప్లవ యుద్ధాన్ని సాగించాల్సి ఉంటుంది. గత దశాబ్ద కాలంగా దండకారణ్యం, బీహార్ - జార్ఖండ్ గెరిల్లా జోన్లను గుండెకాయగా చేసుకొని ఉద్యమం ముందడుగు వేసింది. (విప్లవ పార్టీల) విలీనం జరిగిన గత దశాబ్ద కాలంలో గడించిన నూతన అనుభవాలు.. పార్టీ వెనుకంజ వేసిన ప్రాంతాల్లో తిరిగి ఉద్యమ నిర్మాణాన్ని చేపట్టడానికి, బలహీనమైన ప్రాంతాల్లో తిరిగి బలం పుంజుకోవడానికి, అసలు పార్టీ ఉనికే లేని ప్రాంతాలకు విస్తరించడానికి సహాయపడతాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పీడిత ప్రజానీకంపై సానుకూల ప్రభావం చూపిన.. కళింగనగర్, సింగూర్, నందిగ్రామ్, లాల్‌గఢ్, నారాయణపట్న, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వంటి ప్రజా తిరుగుబాట్ల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి. ప్రశ్న: దీర్ఘ కాలిక ప్రజాయుద్ధ పంథాకు కాలం చెల్లిందని కొందరు అంటున్నారు. చావెజ్ 21వ శతాబ్దపు సోషలిజం గురించి కొందరు ప్రచారం చేస్తున్నారు. నేపాల్ మావోయిస్టు పార్టీ ప్రజాయుద్ధ పంథాని వదిలివేసి పార్లమెంటరీ బాట పట్టిందంటున్నారు. ఈ వాదనలకు పార్టీ జవాబేమిటి? గణపతి: దీర్ఘ కాలిక ప్రజాయుద్ధ పంథాకు కాలం చెల్లిందని ఎలా చెప్పగలరు? మావో మరణం తర్వాత, ప్రపంచంలోని విప్లవ పోరాటాలన్నీ - అవి నూతన ప్రజాస్వామిక విప్లవాలు గానీ, జాతి విముక్తి పోరాటాలు గానీ - దీర్ఘకాలికమయ్యాయి. ఒక వర్గ రహిత సమాజం వైపు వెళ్లాలనే దృష్టికోణం లేకుండా.. ఉనికిలో ఉన్న శిథిల వ్యవస్థనే సంస్కరించే ప్రయత్నం చేయడం వల్ల ఉపయోగం లేదు. చావెజ్ నమూనా కేవలం సంస్కరణ మాత్రమే.. విప్లవం కాదు. రూపంలో గానీ, వస్తురీత్యా గానీ అది సోషలిజమే కాదు. చావెజ్ శ్రామిక వర్గానికీ, రైతాంగానికీ ప్రయోజనకరంగా ఉండేలా కొన్ని చర్యలు చేపట్టాడు. చమురు, కొన్ని ఇతర పరిశ్రమలను అనేక పరిమితులతో జాతీయం చేసినా.. భూస్వామ్య, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ విధానం రూపుమాసిపోలేదు. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థతో వారు వేరు పడలేదు కూడా. కాబట్టి చావెజ్ పాలనలో ఆ దేశ వ్యవస్థలో వచ్చిన మౌలిక మార్పేమీ లేదు. ఇక.. నేపాల్‌లో పార్లమెంటరీ వ్యవస్థ అర్ధభూస్వామ్య విధానంపై ఆధారపడినదీ, సామ్రాజ్యవాద కాడి కింద నలుగుతున్నదీ. అటువంటి వ్యవస్థలో చేరిన ఎవరైనా విప్లవాన్ని వదిలివేయాల్సిందే. నూతన ప్రజాస్వామిక విప్లవంలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించినప్పటికీ.. యునెటైడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు)కు చెందిన ప్రచండ - భట్టారాయ్ ఆధునిక రివిజనిస్టు ముఠా ఈ రివిజనిస్టు మార్గాన్నే ఎంచుకుంది. లక్షలాది మంది ప్రజలకూ, వేలాది మంది అమరులకూ వారు నమ్మక ద్రోహం చేశారు. ఎప్పటివరకూ వెనుకబడిన దేశాల అర్థభూస్వామ్య వ్యవస్థ రూపం మారకుండా ఉంటుందో, ఎంతకాలం సామ్రాజ్యవాదం మన దేశం లాంటి దేశాలను తన క్రూరమైన పట్టులో బిగించి ఉంచి వాటిని స్వతంత్రంగా అభివృద్ధి చెందనీయదో.. అంతవరకూ విముక్తి కోసం దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా తప్ప మరో మార్గమే లేదు. ప్రశ్న: ‘వస్తుగత ప్రపంచ పరిస్థితి విప్లవానికి మరింత అనువుగా మలుపు తిరుగుతోంది’ అని పార్టీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? గణపతి: వస్తుగత ప్రపంచ పరిస్థితి విప్లవ పురోగమనానికి అద్భుతంగా ఉంది. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ‘మహామాంద్యం’ నాటి నుండి తీవ్రమైన సంక్షోభంలో కొనసాగుతోంది. విచ్చలవిడి లే-ఆఫ్‌లు, ఉద్యోగావకాశాలు కుంచించుకుపోవడం, నిరుద్యోగం, దారిద్య్రం ఒకవైపున.. శ్రామిక ప్రజానీకంపై తీవ్రతరమైన దోపిడీ, అణగారిన దేశాలూ, ప్రజలపై నయా వలసవాద దోపిడీ మరోవైపున కొనసాగుతున్నాయి. సామ్రాజ్యవాదానికీ, దాని స్థానిక తొత్తులకూ వ్యతిరేకంగా విప్లవ, ప్రజాస్వామిక, జాతి విముక్తి పోరాట శక్తులు ప్రపంచ వ్యాప్తంగా బలోపేతమవుతున్నాయి. అయితే.. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ శక్తులు ఈ పరిస్థితిని అందిపుచ్చుకోవడంలో వెనుకబడి ఉన్నాయి. ఆయా దేశాల నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా విప్లవాన్ని కొనసాగించి ఈ బలహీనతను అధిగమించగలమని చారిత్రక పాఠాలు నేర్పాయి. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రివిజనిస్టు, సంస్కరణవాద శక్తుల అసమర్థత రుజువవుతుండటంతో.. ప్రజలు మావోయిస్టు శక్తులతో కలిసి ముందుకు సాగే అవకాశాలు పెరుగుతున్నాయి. అనేక దేశాలలో మావోయిస్టు పార్టీలు, సంస్థలు బలం పుంజుకుంటున్నాయి. కొన్ని కొత్త పార్టీలు ఆవిర్భావ క్రమంలో ఉన్నాయి. మావోయిస్టు పార్టీల, సంస్థల, శక్తుల మధ్య ఐక్యత కూడా పెరుగుతున్నది. ప్రశ్న: ఎన్డీఏ అనుసరిస్తున్న విధానాలను, ఆర్ఎస్ఎస్ హిందూత్వ ఎజెండాను తిప్పికొట్టేందుకు పార్టీ ప్రణాళిక ఏమిటి? గణపతి: ఉదారవాద, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను యూపీఏ ప్రభుత్వాల కంటే వేగంగా, మరింత దూకుడుగా అమలు చేయాలనే ఉద్దేశంతోనే సామ్రాజ్యవాదులు, దళారీ బడా పెట్టుబడిదారులు, బడా భూస్వాములు.. మోదీ, బీజేపీలను అధికార పీఠంపై కూర్చోబెట్టారు. మోదీ ప్రభుత్వ నయా ఉదారవాద దుర్మార్గ విధానాలు ఇప్పటికే యాతనలు పడుతున్న శ్రామికులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువత వంటి వివిధ వర్గాల ప్రజల కష్టాలను మరింత తీవ్రతరం చేస్తాయి. ముస్లిములపైనా హిందూ ఫాసిస్టు దాడులు మరింతగా పెరిగిపోతాయి. భూస్వామ్య, అభివృద్ధి నిరోధక శక్తులు బలం పుంజుకోవడంతో దళితులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అణగారిన జాతులు మరింత పీడనకు గురవుతున్నాయి. ఇటువంటి విషయాలలో పార్టీ జోక్యం చేసుకుని ప్రజలను పోరాటాలలోకి సమీకరించాలి. దేశాన్ని హోల్‌సేల్‌గా అమ్మేస్తున్న మోదీ ప్రభుత్వ నిజస్వరూపాన్ని బహిర్గతం చేయడానికి, ఎండగట్టటానికి విశాల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలి. విప్లవ, ప్రజాస్వామిక, లౌకిక, దేశభక్త సంస్థలనూ, శక్తులనూ, వ్యక్తులనూ, ప్రజా సమూహాలనూ ఏకంచేసి బలమైన విశాల పునాదిగల ప్రజా ఉద్యమాలను నిర్మించడం ద్వారా.. దేశవ్యాప్తంగా బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు శక్తులను సమర్థవంతంగా తిప్పికొట్టవచ్చు. ప్రశ్న: మావోయిస్టులను ఇప్పటికీ భారతదేశ అంతర్గత భద్రతకు అతి పెద్ద ముప్పుగా భారత రాజ్యం పరిగణిస్తోందని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నొక్కి చెప్తున్నారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్ మూడవ దశను ఎదుర్కొనేందుకు పార్టీ ఎలా సిద్ధమవుతోంది? గణపతి: 2009 మధ్య కాలంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ప్రజలపై యుద్ధాన్ని ప్రారంభించింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దీనినే మరింత దూకుడుగా, మరింత నిర్దాక్షిణ్యంగా కొనసాగిస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆపరేషన్ గ్రీన్‌హంట్ మూడో దశ ప్రారంభమయింది. దీనిద్వారా.. మధ్య, తూర్పు భారతదేశ ప్రాంతాల్లో విప్లవోద్యమానికి దృఢమైన దుర్గాలను నాశనం చేయాలని శత్రువు చూస్తున్నాడు. అయితే.. వారు ఒక్క మావోయిస్టులనే టార్గెట్ చేయడం లేదు. ఈ యుద్ధం మొత్తం అణగారిన ప్రజలకు విస్తరిస్తుంది. యుద్ధ రంగం విస్తారమవుతుంది. బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సిద్ధాంతం, దేశాన్ని తెగనమ్మే మోడీ ప్రభుత్వ విధానాల మేళవింపైన శ్రతుదాడిపై రాజకీయంగా, మిలటరీ పరంగా ఎదురు దాడి చేయాలి. వీటి ప్రభావానికి గురయ్యే అన్ని వర్గాల వారితో ఏకమై ఈ దాడిని దృఢంగా ఎదుర్కొని ఓడించాల్సి ఉంది. ఈ పోరాటంలో కలిసేందుకు పార్లమెంటరీ ‘వామపక్షాలు’ కూడా ముందుకు రావాలని పిలుపునిస్తున్నా. -
మావో అగ్రనేత గణపతి ఆస్తులపై ఎన్ఐఏ విచారణ
కరీంనగర్: మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు ఉరఫ్ గణపతి ఆస్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ) మంగళవారం విచారణ నిర్వహించింది. గణపతి స్వగ్రామమైన కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం బీర్పూర్లో శిథిలమైన ఇంటిని అధికారులు పరిశీలించారు. మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి గణపతిపై బిలాస్పూర్ కోర్టులో పలు కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో కోర్టుకు హాజరు కావడం లేదని గత ఏప్రిల్‌లో లక్ష్మణ్‌రావు ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. అయినా హాజరుకాకపోవడంతో బిలాస్పూర్ ప్రత్యేక కోర్టు తీవ్రంగా పరిగణించి లక్ష్మణ్‌రావుకు చెందిన ఆస్తుల జప్తుకోసం వివరాలు సేకరించాలని ఎన్ఐఏను ఆదేశించింది. ఇందులో భాగంగా మంగళవారం ఎన్ఐఏ అధికారి బీర్‌పూర్‌లోని లక్ష్మణ్‌రావు ఇంటిని పరిశీలించారు. ఆయనకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా అనే విషయంపై గ్రామంలో విచారణ జరిపారు. శిథిలమైన ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తులు లేవని గ్రామస్తులు అధికారికి తెలిపారు. అనంతరం సారంగాపూర్‌లో రెవెన్యూ అధికారులను కలిసి లక్ష్మణ్‌రావుకు చెందిన ఆస్తులపైనా ఆరా తీశారు. -
గణపతిని పట్టిస్తే రూ.2.52 కోట్లు....
-
గణపతిని పట్టిస్తే 2.5 కోట్ల నజరానా
న్యూఢిల్లీ: సీపీఐ మావోయిస్టు పార్టీ సారథి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి(65)... ఇతడిని పట్టుకునేందుకు వీలుగా పోలీసులకు తగిన సమాచారం అందిస్తే రూ.2.52 కోట్ల రూపాయల నజరానా దక్కుతుంది. ఈ ముఖ్యనేతను ఎలాగైనా పట్టుకునేందుకు నాలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కలసి భారీ బహుమానాన్ని ప్రకటించాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ కోటిరూపాయల చొప్పున, ఆంధ్రప్రదేశ్ రూ.25 లక్షలు, ఎన్ఐఏ రూ.15 లక్షలు, జార్ఖండ్ రూ.12 లక్షల చొప్పున ప్రకటించాయి. మావోయిస్టు సెంట్రల్ కమిటీలోని ఏదేనీ సభ్యుడి సమాచారం అందించినా, కోటి రూపాయల నగదు బహుమానాన్ని అందించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు నక్సలిజాన్ని ఎదుర్కోవడంపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. -
వినాయక విగ్రహం వద్ద పాము సందడి
-
పుణేలో మహాగణపతులకు పూజలు
మొదట నిమజ్జనం చేసేది ఈ గణనాథులనే పుణే సిటీ, న్యూస్‌లైన్: గణేష్ చతుర్థి ఉత్సవాల్లో పుణే గణపతులకు ప్రత్యేక ఉంది. ఇక్కడ స్థాపించిన ఐదు పురాతన మహా గణపతులకు ఒక్కో గణపతికీ ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ గణపతులనే మొదట నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాతనే నగరంలో మిగతా గణనాథులను నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఈ గణనాథులను దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నగరం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పుణేలోని మహా గణనాథులను దర్శించుకుకుని మొక్కులు తీర్చుకోవడానికి పెద్దఎత్తున భక్తులు తరలి వస్తారు. మొదటి గణపతి ‘కస్బా’ గణపతి నగరంలో కస్బా గణపతి మొదటి గణపతి. కస్బాపేట్లో 1893లో ఆలయం నిర్మించారు. 1894 నుంచి నిమజ్జన ఉరేగింపులో మొదట ఈ వినాయకుడే ఊరేగుతాడు. వినాయక్ ఠాకూర్ తన ఇంటి సమీపంలోనే ఈ గణనాథునికి అందమైన మందిరాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఈ విఘ్నేశ్వరుడు పుణే వాసుల గ్రామ దైవంగా విరాజిల్లుతున్నాడు. కస్భా గణపతి మండల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణపతి వేడుకలను జరుపుకుంటున్నారు. 1925 వరకు కస్బా గణపతి ఆలయం లోపల వేడుకలు జరిగేవి. 1926 నుంచి గణపతి ఉత్సవాలను ప్రత్యేక మండపంలో జరుపుతున్నారు. కళాకారులు తమ కళలు ప్రదర్శించేందుకు దీనికి ఒక వేదికలాగా ఉపయోగిస్తున్నారు. ఈ ప్రదర్శనలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి గణేష్ భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది పుణే మేయర్ చంచల కోద్రే గననాథుడికి హారతి నిచ్చి ప్రతిష్ఠించారు. రెండో గణపతి.. తాంబడి జోఘేశ్వరి గణపతి తాంబడి జోగేశ్వరి ఆలయం నగరంలో పురాతన ఆలయాలలో ఒకటి. 1636లో చత్రపతి శివాజీ మహారాజ్ తన తల్లి జిజాబాయ్‌తో పుణే వచ్చి దేవత దీవెనలు తీసుకున్నట్లు ఇక్కడేనని చరిత్ర చెబుతోంది. పీష్వాల కాలంలో ఆలయానికి కేటాయించిన భూమిలో 1705లో పెద్ద మందిరాన్ని నిర్మించారు. 1893లో లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ సార్వజనీక వినాయక చవితి ఉత్సవాలు ఇక్కడే ప్రారంభించారు. గణేష్ ఉత్సవం వేడుకలు 1893లో ప్రారంభం కాగా, ఇప్పటికీ ప్రతీఏటా కొనసాగిస్తున్నామని తాంబడి జోగేశ్వరి గణేష్ మండల్ కార్యనిర్వాహక సభ్యులు తెలిపారు. 2000 వరకు గణేష్ వేడుకలు ఆలయంలోనే జరుపుకునే వారు. ప్రతి ఏటా భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహిస్తున్నారు. వివేక్ గోలే చేతుల మీదుగా విగ్ర ప్రతిష్ఠాపన చేశారు. మూడో గణపతి గురుజీ తాలీం... పుణేలోని లక్ష్మి రోడ్ సమీనంలోని గణపతి చౌక్ వద్ద 1887లో దీనిని స్థాపించారు. ఇది హిందూ, ముస్లింల ఐకమత్యానికి చిహ్నంగా నిలిస్తోంది. గురూజీ తాలీం గణపతి మండల్ నగరంలో అత్యంత గౌరవించే గణపతి. భికు పాండురంగ్ షిండే, వస్తాద్ నలబంద్ కుటుంబాలు మండల్ ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించాయి. 1987లో శత జయంతి వేడుకలు జరుపుకున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త మనోజ్ చాజెడ్ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. నాలుగవ గణపతి తులసి బాగ్ గణపతి... తులసి బాగ్ రామ్ మందిరంలో 1901లో దీనిని స్థాపించారు. పుణేలో పురాతన ప్రసిద్ధ గణేష్ మండల్లలో ఇదొకటి. ఈ ఆలయం ప్రముఖ తులసి బాగ్ మార్కెట్ మధ్యలో ఉంది. 10-15 అడుగుల గణేష్ విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. లార్డ్ గణేష్ ధరించే బంగారు, వెండి ఆభరణాలు భక్తులకు ఇట్టే ఆకట్టుకుంటాయి. వినాయకుడు అతని రెండు చేతులలో పాషా, అంకుశ్ లాంటి ఆయుధాలు కలిగి ఉన్నాడు. గనేష్ విగ్రహం పక్కన ఆయన వాహనమైన మూషికం అందంగా కనిపిస్తోంది. అయితే వెండితో ఈ మూషికాన్ని తయారు చేశారు. వినాయకుని రెండు వైపులా అందమైన ఏనుగు చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి. దీనిని కల్నల్ సంభాజీ పాటిల్ ప్రతిష్టాపన చేశారు. ఐదవ గణపతి కేసరివాడ గణపతి నారాయణ పేట్లో తిలక్ వాడలో 1893లో ఈ వినాయక మందిరాన్ని స్థాపించారు. తిలక్ కుటుంబం వారసులు ఈ ఉత్సవ ఊరేగింపులో పాల్గొన్న తర్వాత కేసరి వాడా వేడకలు ప్రారంభం అవుతాయి. ఈ ఏడాది రోహిత తిలక్ ఈ వేడకల్లో పాల్గొన్నారు. లోకమాన్య తిలక్ 1893లో విగ్రహం ఏర్పాటు చేశారు. గొప్ప గొప్ప వ్యక్తుల ప్రసంగాలు ఇక్కడ చూడవచ్చు. పండుగ సమయంలో ప్రఖ్యాత కళాకారులు అనేక ప్రదర్శనలు నిర్వహిస్తారు. -
రామ్‌గోపాల్ వర్మపై ఫిర్యాదు
-
రామ్‌గోపాల్ వర్మపై ఫిర్యాదు
హైదరాబాద్: ట్విట్టర్లో వినాయకుడిపై సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని సృష్టించాయి. హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యానించిన వర్మపై చర్యతీసుకోవాలంటూ చంపాపేటకు చెందిన న్యాయవాది కె.కరుణసాగర్ సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘ఇది గణేషుడు పుట్టిన రోజా... తండ్రి శివుడు అతని తల నరికిన రోజా...’ అంటూ ట్విట్టర్లో రాంగోపాల్‌వర్మ పోస్ట్ చేశాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై 295ఏ, 298, 504 ఐపీసీ, ఐటీయాక్ట్ కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కరుణాసాగర్ ఫిర్యాదులో కోరారు. అలాగే, బీజేపీ యువ మోర్చా హైదరాబాద్ ఉపాధ్యక్షుడు నిరంజన్ యాదవ్ కూడా శనివారం మాదన్నపేట పోలీస్‌స్టేషన్‌లో వర్మపై ఫిర్యాదు చేశారు. వర్మ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ముంబై శాఖ చీఫ్ సుమిత్ ఖంబేకర్, సామాజిక కార్యకర్త షాజాద్ మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రాంగోపాల్ వర్మపై పలు కేసులు నమోదు
పుణే: వినాయకుడిపై ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై పలు కేసులు నమోదయ్యాయి. వినాయక చవితి సందర్భంగా శుక్రవారం వర్మ ట్విట్టర్లో గణనాథునిపై అనేక వ్యాఖ్యలు చేశారు.ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ముంబై శాఖ చీఫ్ సుమిత్ ఖంబేకర్, సామాజిక కార్యకర్త షాజాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మ వ్యాఖ్యలు మహారాష్ట్రలోని హిందువులకే కాక ముస్లింలకూ తీవ్ర ఆగ్రహం కలిగించాయన్నారు. ఈ ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వహిందూ పరిషత్ కూడా వర్మ వ్యాఖ్యలను ఖండించింది. వర్మ వెంటనే తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని, ఆయనపై పోలీసులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. వర్మ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కంటూ హిందూ జనజాగృతి సమితి కూడా ఫిర్యాదు చేసింది. వర్మ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని చేయాలని హిందూ జనజాగృతి సమితి కార్యకర్త సూర్జిత్ కుమార్ డిమాండ్ చేశారు. -
మావోయిస్ట్ గణపతి తలపై 2.45కోట్లు
-
గణపతిని పట్టిస్తే రూ. కోటి
మహారాష్ట్ర ప్రభుత్వం రివార్డు ప్రకటన న్యూఢిల్లీ/ముంబై: మావోయిస్టు అధినేత ముప్పాళ లక్ష్మణరావు అలియాస్ గణపతిపై మహారాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని భారీస్థాయిలో రివార్డును ప్రకటించింది. గణపతి అరెస్ట్‌కు దోహదపడే సమాచారం అందించే వారికి కోటి రూపాయల బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది. మావోయిస్టు గ్రూపు సెంట్రల్ కమిటీ సభ్యుడు లేదా పోలిట్ బ్యూరో సభ్యుడి అరెస్టుకు ఉపకరించే సమాచారం అందిస్తే రూ. 60 లక్షల రివార్డు ఇస్తామని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గణపతితోపాటు దాదాపు డజన్ మంది మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులకోసం పోలీసులు చాలాకాలంగా గాలింపు కొనసాగిస్తూ వస్తున్నారు. -
అడవిలో అన్నలు
దేశంలో పదహారు రాష్ట్రాలకు విస్తరించి, ఆయా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మావోయిస్టు పార్టీని నడుపుతున్నది మన జిల్లావాసులే. వీరిలో సారంగాపూర్ మండలం బీర్పూర్ గ్రామానికి చెందిన ముపాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈయనపై కేంద్రం రూ.25 లక్షల రివార్డును ప్రకటించగా, ఆయా రాష్ట్రాలు ప్రకటించిన దానితో కలిపి రూ.కోటి రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీతో పాటు ఇతర ముఖ్య విభాగాల్లో మన జిల్లాకు చెందిన వారే పది మంది వరకు ఉన్నారు. మొత్తంగా కరీంనగర్ జిల్లా నుంచి 31 మంది మావోయిస్టులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు పోలీస్ రికార్డులు వెల్లడిస్తున్నాయి. - మనోళ్లు 31 మంది - కేంద్ర కమిటీ కార్యదర్శి సహా కీలక నేతలు జిల్లావాసులే పెద్దపల్లి/కరీంనగర్ క్రైం : మావోయిస్టు పార్టీ చీఫ్ సెక్రెటరీ గణపతి సొంత గడ్డ కరీంనగర్ జిల్లాలోనే ఆ పార్టీ తీవ్ర సంక్షోభంలో పడింది. నూతన ప్రజాస్వామిక విప్లవ సాధన కోసం సాయుధ పోరాటం నడుపుతున్న మావోయిస్టు పార్టీకి వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర కమిటీ కార్యదర్శులుగా పనిచేసిన వారు కరీంనగర్ జిల్లాకు చెందిన వారే . కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల కు కార్యదర్శిగా పనిచేసిన బుర్ర చిన్నన్న, గూడెం ప్రసాద్, వడ్కాపూర్ చంద్రమౌళి ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో ఆర్నెల్ల వ్యవధిలోనే ఈ ముగ్గురు నేతలు హతమయ్యారు. కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహించిన మల్లోజుల కోటేశ్వరరావు ఎన్కౌంటర్ పార్టీని తీవ్రంగా కుంగతీసింది. అజ్ఞాతవాసం వెళ్లిన తొలితరం నాయకులు ఎత్తిన తుపాకీ దించకుండా మూడు దశాబ్దాలుగా పార్టీలోనే కొనసాగుతున్నారు. వారిలో మన జిల్లాకు చెందిన వారు ఇంకా 31 మంది మాత్రమే మిగిలిఉన్నారని పోలీస్ రికార్డులు తెలుపుతున్నాయి. పార్టీ తొలినాళ్ల నుంచి నేటి వరకు పది మంది వరకు కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1992లో ప్రభుత్వం మావోయిస్టు పార్టీని నిషేధించిన సమయంలో ఇదే జిల్లాకు చెందిన 300 మందిని పోలీసులు గుర్తిం చి.. అందులో 89 మందికి రివార్డులు సైతం ప్రకటించారు. నిషేధానికి గురై రివార్డుల్లో ప్రకటించబడ్డ వారు చాలామంది ఎన్కౌంటర్లో మరణించారు. మరో వందమంది వరకు ప్రభుత్వానికి లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత రాష్ట్రంలో తమకు వెసులుబాటు లభిస్తుందని ఆశపడ్డ మావోయిస్టులకు నిరాశే ఎదురైంది. కేసీఆర్ పలు సందర్భాల్లో ‘మావోయిస్టు పార్టీది తమ ఉద్యమ పార్టీది ఒకే సిద్ధాంతమని’ ప్రకటించండం తెలిసిందే. రూ.3.08 కోట్ల రివార్డు పలు రాష్ట్రాల్లో అయా ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మావోయిస్టుల్లో అగ్ర నాయకులు అత్యధికంగా జిల్లాకు చెందినవారే. మావోయిస్టు పార్టీకి కీలకమైన కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతితోపాటు మరో ఆరుగురు ఇదే జిల్లాకు చెందినవారున్నారు. ప్రస్తుతం జిల్లాకు చెందిన అంతా కలిసి 31 మంది మావోయిస్టులుండగా వీరు వివిధ ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా పోలీసు రికార్డుల ప్రకారం వారి తలలపై సుమారు రూ.3.08 కోట్ల రివార్డ్ ఉంది. కొన్నేళ్ల క్రితం తెలంగాణ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపిన మావోయిస్టు పార్టీ.. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ‘వేట’కే సై..! మావోయిస్టుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, వారి వేటకు కావాల్సిన పోలీస్ బలగాలకు అధునాతనమైన ఆయుధాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శుక్రవారం ఢిల్లీలో జరిగిన వివిధ రాష్ట్రాల అధికారుల సమావేశంలో ప్రకటించారు. మావోయిస్టులతో చర్చలు ఉండవు, అణచివేత కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా మావోయిస్టుపార్టీ పట్ల కఠినవైఖరి కొనసాగుతుందనే విషయం స్పష్టమైంది. మావోయిస్టులతో పాటు అభ్యుదయవాదులు, సంఘాలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా కేంద్ర ప్రభుత్వ విధానమే ఇక్కడ అమలు కాబోతోంది. స్వయంగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సైతం నక్సల్స్ వ్యవహారం కేంద్రమే చూసుకుంటుందని వ్యూహాత్మకంగా ప్రకటించిన నేపథ్యంలో నక్సలైట్లపై నిషేధం కొనసాగుతుందని తేటతెల్లమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో మావోయిస్టులకు లీగల్ అవకాశాల వెసులుబాటుకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ.రామారావు, మర్రి చెన్నారెడ్డి సీఎంలుగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అప్పటి పీపుల్స్‌వార్ పార్టీకి లీగల్ అవకాశాలు కల్పించారు. వైఎస్.రాజశేఖరరెడ్డి కాలంలో ఏకంగా మావోయిస్టులను శాంతిచర్చలకు ఆహ్వానించారు. మావోయిస్టు పార్టీ.. పోలీసుల మధ్య ఘర్షణలతో శాంతిచర్చలకు విఘాతం కలిగింది. ఐదారేళ్లుగా రాష్ట్రంలోనున్న ప్రధాన నాయకులు ఎన్కౌంటర్లలో మరణించడంతో ఆ పార్టీకి కోలుకోని దెబ్బలు తగిలాయి. మావోయిస్టు పార్టీకి అగ్రనేతల పుట్టినిల్లు కరీంనగర్ జిల్లాలోనే తన ఉనికిని కోల్పోయింది. కేవలం తూర్పు డివిజన్లోని అటవీ ప్రాంతంలోనే మావోయిస్టు పార్టీ ఒక దళం... అది కూడా దండకార ణ్యం ప్రాంతంతో కలసి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీరి ‘తల’పై రూ.25 లక్షలు - సారంగపూర్ మండలం బీర్పూర్కు చెందిన ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి అలియాస్ రమణ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయనపై రూ.25 లక్షల రివార్డు ఉంది. వివిధ రాష్ట్రాల రివార్డ్ కలిపితే రూ.కోటి వరకు చేరింది. - సిరిసిల్ల మండలం గోపాల్రావుపల్లికి చెందిన కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ సాదు అలియాస్ గోపన్న, వినోద్, కోసా బుచ్చన్న. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, సెంట్రల్ రిజర్వ్ బెటాలియన్ ఇన్చార్జి. - ముత్తారం మండలం ఎగ్లాస్పూర్ పరిధిలోని శాస్త్రులపల్లికి చెందిన మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న, సాయన్న, మీసాల సాయన్న, సాగర్, అశోక్, దేశ్‌పాండే. కేంద్ర కమిటీ సభ్యుడు. - పెద్దపల్లి పట్టణం శివాలయం వీధికి చెందిన మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ వివేక్, భూపతి, సోను. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మావోయిస్టు అధికార ప్రతినిధి. - జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ శంకరన్న, చంద్రన్న. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, నార్త్ తెలంగాణ స్పెషల్ కమిటీ సభ్యుడు. - కోరుట్లలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ సంజీవ్, సుదర్శన్.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు. రూ.20 లక్షల రివార్డు - సారంగాపూర్ మండలం బీర్పూర్కు చెందిన బల్మూరి నారాయణరావు అలియాస్ నారాయణ, వెంకన్న మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. - పెద్దపల్లి మండలం సబ్బితంకు చెందిన గంగిడి సత్యనారాయణరెడ్డి అలియాస్ విజయ్ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. - కోహెడ మండలం తీగలగుట్టపల్లికి చెందిన కె.రాంచంద్రారెడ్డి అలియాస్ విజయ్, గుడిసె ఉసెండి, రాజుదాదా. ఇంతకుముందు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, దక్షిణ కోస్తా స్పెషల్ జోన్ కమిటి సభ్యుడు. రూ.8 లక్షల రివార్డు - పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన అలేటి రామలచ్చులు అలియాస్ రాయలచ్చు, దక్షిణ బస్తర్ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు. - కమాన్‌పూర్ మండలంలోని రాణాపూర్ గ్రామానికి చెందిన వేగోలపు మల్లయ్య అలియాస్ మల్లేశం, కమలాకర్, మాన్పూర్ జిల్లా కమిటీ సభ్యుడు. రూ. 5 లక్షల రివార్డు - కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్, మావోయిస్టు నార్త్ తెలంగాణ స్పెషల్ కమిటీ సభ్యుడు. - కాటారం మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన అన్రే సంతోష్ అలియాస్ శ్రీధర్, మావోయిస్టు ఏ-ప్లాటూన్ కేంద్ర రిజినల్ కమిటీ కమాండర్, దక్షిణ బస్తర్ జోన్ కమిటీ సభ్యుడు. - రామగుండంకు చెందిన అప్పాసి నారాయణ అలియాస్ శంకర్ జిల్లా కమిటీ సభ్యుడు, దక్షిణ బస్తర్ స్పెషల్ జోన్ కమిటీ ప్రొటక్షన్ గ్రూప్ కమాండర్. - రాయికల్ మండలం సింగరావుపేటకు చెందిన బంతుల కాశీరాం అలియాస్ సత్యం, మావోయిస్టు టెక్నికల్ కమిటీ సభ్యుడు. - హుస్నాబాద్‌లోని సుభాష్‌నగర్‌కు చెందిన బుర్ర భాగ్య అలియాస్ అరుణ, మావోయిస్టు గడ్చిరోలి యాక్షన్ కమిటీ సభ్యురాలు. - రామగుండం మండలం జయ్యారం గ్రామానికి చెందిన చీమల నర్సయ్య అలియాస్ పాశం నర్సయ్య, జోగన్న. మావోయిస్టు ఉత్తర గడ్చిరోలి జిల్లా కమిటీ సభ్యుడు. - జగిత్యాల మండలం మోరపల్లికి చెందిన గుండారం అనందం అలియాస్ భూమయ్య మావోయిస్టు జిల్లా కమిటీ సభ్యుడు. - మల్హర్ మండలం పేట రుద్రారం గ్రామానికి చెందిన లోక సారమ్మ అలియాస్ సుజాత. మావోయిస్టు ఉత్తర జోన్ స్పెషల్ కమిటీ సభ్యురాలు. - కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన మేకల మనోజ్ అలియాస్ వినోద్, వికాస్ మావోయిస్టు మహారాష్ట్ర గుండాల డివిజన్ కమాండర్, కొర్చి-కుకేడ యాక్షన్ టీం సభ్యురాలు. - కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన పాసుల గంబాల అలియాస్ వసంత, మమత, మావోయిస్టు దక్షిణ బస్తర్ స్పెషల్ కమిటీ, మాడ జిల్లా కమిటీ సభ్యురాలు. - కోరుట్ల పట్టణం ఇందిరా రోడ్‌కు చెందిన కిషన్ దక్షిణ బస్త ర్ స్పెషల్ జోన్ కమిటీ, టెక్నికల్ జిల్లా కమిటీ మెంబర్. - ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన సందె గంగయ్య అలియాస్ అశోక్, దక్షిణ కోస్తా స్పెషల్ కమిటీ సభ్యుడు. రూ. 4 లక్షల రివార్డు - మహాముత్తారం మండలంలోని కనుకునూర్ గ్రామానికి చెందిన చెన్నురి స్వర్ణక్క అలియాస్ స్వరూప మావోయిస్టు పార్టీ నార్త్‌జోన్ స్పెషల్ కమిటీ సభ్యురాలు, ఖమ్మం జిల్లాలోని వెంకటాపూర్ యాక్షన్ కమిటీ డెప్యూటీ కమాండర్. - పెద్దపల్లి మండలం గోపయ్యపల్లె గ్రామానికి చెందిన దాతు ఐలయ్య అలియాస్ గట్టయ్య, మావోయిస్టు పార్టీ యాక్షన్ కమిటీ కమాండర్. - జూలపల్లి మండలంలోని వెంకట్రావ్పల్లి గ్రామానికి చెందిన దీకొండ శంకరయ్య అలియాస్ శేషన్న, పార్టీ యాక్షన్ కమిటీ కమాండర్. - కోనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామానికి చెందిన నేరళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క, పార్టీ దక్షిణకోస్తా స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు. రూ. 2లక్షల లోపు రివార్డు ఉన్నవారు - రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామానికి చెందిన ముందం లక్ష్మణ్ అలియాస్ స్వామి, ప్లాటూన్ సభ్యుడు. - హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన దేవరకొండ సత్యనారాయణ అలియాస్ సత్తన్న, దళ సభ్యుడు. - సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన జువ్వాడి వెంకటేశ్వర్రావు అలియాస్ ధర్మన్న, పార్టీ దళ సభ్యుడు. - కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామానికి చెందిన కనగర్తి రజినికర్‌రెడ్డి అలియాస్ నారాయణ మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు. - హుస్నాబాద్ మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన కాసబోయిన స్వరూప దళ సభ్యురాలు. -
నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్: పది రోజులుగా వాడవాడలా ఘనంగా పూజలందుకున్న గణపయ్య బుధవారం అంతకంటే ఘనంగా నిమజ్జనానికి తరలనున్నాడు. ఈ సందర్భంగా జరిగే శోభాయాత్ర కోసం నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. అధికారులు కావలసిన సౌకర్యాలను కల్పించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. శోభాయాత్రలు జరిగే దారి పొడవునా, నిమజ్జనం జరిగే నీటి వనరుల వద్ద తగిన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలలో నేడు నిమజ్జనం జరుగనుంది. నగరంలో నగరంలోని దుబ్బ వద్ద మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్య శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఆనవాయితీగా సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు గంజుల పోశెట్టి పచ్చ జెండా ఊరి రథాన్ని ప్రారంభి స్తారు. ఆ వెనుక గణపతులు బయలుదేరుతాయి. గత 67 సంవత్సరాలుగా ఈ రథోత్సవం కొనసాగుతున్నట్లు సార్వజనిక్ గణేష్ మండలి నిర్వాహకులు తె లిపారు. బాలగంగాధర్ తిలక్‌ను ఆదర్శంగా తీసుకొ ని నగరంలో గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు. 1946లో ఇందూరు నగరానికి చెందిన పది మంది పురప్రముఖులు వినాయక శోభాయాత్రకు శ్రీకారం చుట్టారు. గణపతి బావి వరకు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి నిమజ్జనం చేసేవారు. 1946 నుంచి 1953 వరకు ఎడ్లబండ్లపై గణపతులను ఊరేగించేవారు. 1975లో నిజామాబాద్ ఫర్టిలైజర్ మర్చంట్స్ అసోసియేషన్ సహకారంతో ఆధునిక సౌకర్యాలు సమకూర్చారు. అప్పటి నుంచి రంగులతో తీర్చిదిద్దిన 40 జతల ఎడ్లతో రథయాత్ర సాగుతోంది. ఈ యేడు 25 జతల ఎడ్లతో రథయాత్ర నిర్ణీత సమయంలో ప్రారంభిస్తామని సార్వజనిక్ గణేష్ మండలి బాధ్యులు బంటు బాలవర్ధి, బంటు గణేష్ తెలిపారు. ప్రారంభోత్సవానికి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పురప్రముఖులు హాజరవుతారని తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాట్లు నిజామాబాద్ సిటీ : నిమజ్జనానికి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. దుబ్బ నుంచి గణేష్ బావి వరకు రోడ్లకు మరమ్మతులు చేశారు.ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్ ముందు, రైల్వేగేట్ సమీపంలో బీటీ రోడ్డు వేశారు. వీధిలైట్లు అన్ని వెలిగేలా చర్యలు తీసుకున్నారు. వినాయక్‌నగర్ నిమజ్జనం బావి వద్ద, నగర శివారు బోర్గాం (పీ) బ్రిడ్జి వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కలెక్టర్, ఎస్పీలు మూడుసార్లు నిమజ్జనం కొనసాగే మార్గాన్ని పరిశీలించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు ఎప్పటికప్పుడు సల హా లు,సూచనలు ఇచ్చారు. నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగేందుకు పోలీస్ శాఖ బందోబస్తు చర్యలు చేపట్టింది.డీఎస్పీ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు. నగరంలో అనుమానిత ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశారు. డిచ్పల్లి నుంచి ఏపీఎస్పీ బలగాలను రంగంలోకి దింపారు. -
విలక్షణ స్వరూపుడికి వేవేల దండాలు!
దేవతలందరిలోనూ విశ్వవ్యాప్తమైన విలక్షణ స్వరూపం గణపతిది. ఆసియాఖండంలోని అనేకప్రాంతాలలో గణపతి ఆరాధన ఉంది. మనస్సుపెట్టి ప్రార్థించాలేగాని, వెంటనే అన్నీ ప్రసాదించే భక్తసులభుడు. మనదేశంలో సుప్రసిద్ధమైన గణపతి క్షేత్రాలు అనేకం ఉన్నాయి. గణపతి నవరాత్రి ఉత్సవాలలో చాలామంది ఇంట్లోనే గణపతిని ప్రతిష్ఠించి పూజాదికాలు నిర్వహిస్తారు. కాస్త సమయం, డబ్బు వ్యయం చేయదలచుకున్నవారు దేశంలో ఉన్న గణపతి క్షేత్రాలకు వెళ్లి ఆయా క్షేత్రాలలో గణపతి దేవుని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శ్రీవరసిద్ధి వినాయక ఆలయం - కాణిపాకం: మన రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధమైనది కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. ఇది చిత్తూరు జిల్లాలో తిరుపతికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈయన స్వయంభువు. పవిత్ర బాహుదానది ఒడ్డున అలరారుతున్న ఈ క్షేత్రంలో స్వామివారి ఎదుట చేసే ప్రమాణాలు ఎంతో ప్రామాణికంగా ప్రసిద్ధి చెందాయి. కాణిపాకం పూర్వనామం విహారపురి. సాక్షి గణపతి ఆలయం - శ్రీశైలం: శ్రీశైల ప్రధానాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లు కైలాసంలో శివుని వద్ద సాక్ష్యం చెబుతాడు కనుక, ఈ స్వామి సాక్షి గణపతిగా ప్రసిద్ధుడు. చక్కని నల్లరాతితో మలచబడి, కుడివైపునకు తిప్పిన తొండంతో చేతిలో భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లున్న ఈ సాక్షి గణపతి ప్రస్తావన శ్రీనాథుని కాశీఖండంలో కనిపిస్తుంది. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించ వచ్చే యాత్రికులు ఈ స్వామిని దర్శిస్తారు. సిద్ధి వినాయక స్వామి ఆలయం - అయినవిల్లి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని శ్రీసిద్ధి వినాయకస్వామి ఆలయం అత్యంత ప్రాచీనమైనది. దక్షప్రజాపతి తాను తలపెట్టిన యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగాలన్న సంకల్పంతో ఇక్కడున్న సిద్ధివినాయకస్వామిని పూజించినట్లు స్థలపురాణాలు చెబుతున్నాయి. దక్షిణాభిముఖంగా దర్శనమిచ్చే ఈ స్వామిని కొలిచేవారికి సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఇక్కడి స్వామిని దర్భగడ్డితో పూజిస్తే పాతకాలన్నీ పటాపంచలయి సకల శుభాలు చేకూరుతాయి. పాతాళ వినాయకాలయం - కాళహస్తి: శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయ ఉత్తర గోపురానికి సమీపంలో ఉన్న ఈ ఆలయంలో వినాయకుడు పాతాళంలో కొలువుదీరి ఉంటాడు. శ్రీ కాళహస్తీశ్వరస్వామివారిని సందర్శించుకున్న భక్తులంతా ఈ స్వామిని సేవించుకోవడం పరిపాటి. పాతాళ వినాయకుడి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. చిత్తూరు జిల్లా తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. సిద్ధి వినాయకస్వామి ఆలయం - ముంబై: ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉన్న అత్యాధునికమైన విఘ్నేశ్వరాలయమిది. దేశంలోనే అత్యంత అధికాదాయాన్ని ఇచ్చే వినాయకాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయానికి ఏటా 15 కోట్ల రూపాయల ఆదాయం విరాళాల రూపంలో వస్తోంది. 1801వ సంవత్సరంలో నిర్మాణం జరుపుకున్న ఈ ఆలయాన్ని లక్ష్మణ్ వితు పాటిల్, దేవ్భాయ్ పాటిల్ అనే భక్తులు నిర్మించారు. ఈ ఆలయ గర్భాలయంలో కొలువుదీరిన విఘ్నేశ్వరుని మూర్తి బంగారంతో నిర్మితమైంది. ఇక్కడ కొలువైన స్వర్ణసిద్ధి వినాయక స్వామిని పూజిస్తే, కోర్కెలు నెరవేరతాయని, సంతానంలేనివారు ఈ స్వామిని సేవిస్తే, సంతానభాగ్యం కలుగుతుందని విశ్వాసం. శ్రీ వినాయక ఆలయం - గణపతి పూలె: మహారాష్ర్టకు పశ్చిమాన రత్నగిరి జిల్లాలో ఉన్న వినాయక ఆలయమిది. సముద్ర తీరాన, ప్రకృతి అందాల నడుమ అలారుతున్న ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. గర్భాలయంలో కొలువుదీరిన వినాయకుడు స్వయంభువు. కొల్హాపూర్ పట్టణానికి 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ముంబై, రత్నగిరిల నుంచి బస్ సౌకర్యం ఉంది. అష్ట వినాయక ఆలయాలు: మహారాష్ట్రలోని పూణె, రాయగఢ్ జిల్లాల్లో ఎనిమిది వినాయక ఆలయాలున్నాయి. ఇవి అష్టవినాయక ఆలయాలుగా ప్రసిద్ధి. వీటిలో ఆరు ఆలయాలు పుణె జిల్లాలో ఉండగా, రెండు రాయగఢ్ జిల్లాలో ఉన్నాయి. ప్రత్యేతకను సంతరించుకున్న ఆయా క్షేత్రాలలో వినాయకుడు మయూరేశ్వరుడు, మహాగణపతి, చింతామణి గణపతి, గిరిజాత్మక్ గణపతి, విఘ్నేశ్వరుడు, సిద్ధి వినాయకుడు, బల్లలేశ్వరుడు, వరద వినాయకుడు నామధేయాలతో వర్థిల్లుతున్నాడు. మహాగణపతి ఆలయం - రంజన్ గావ్: పూర్వం మణిపూర్‌గా పేరుగాంచిన ఈ క్షేత్రంలోని వినాయకుణ్ణి సాక్షాత్తూ శివుడే ప్రతిష్ఠించాడని ప్రతీతి. 1790వ సంవత్సరంలో మాధవరావు పేష్వా... స్వామివారికి గర్భాలయాన్ని నిర్మించాడు. అయితే ఈ ఆలయం 8, 9 శతాబ్దాల నాటిదిగా ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. - దాసరి దుర్గాప్రసాద్ వినాయకుడు అవతరించిన నక్షత్రం హస్త. ఈ నక్షత్రం కన్యారాశికి సంబంధించినది. కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుడంటే పండితుడని అర్థం చెబుతారు. అందుకే పిల్లలకు చదువు రావాలంటే గణపతి అనుగ్రహం ఉండాలంటారు. ఏ విద్యలో రాణించాలన్నా, ఏ ఆటంకాలను అధిగమించాలన్నా, ఏ శుభకార్యం చేయాలన్నా సర్వశాస్త్రాలకు అధిపతి అయిన గణపతి అనుగ్రహం తప్పనిసరి. ఆ స్వామిని రోజూ పూజించలేనివారు ఏడాదిలో ఒకసారి వచ్చే భాద్రపద శుక్ల చతుర్థినాడు తప్పక పూజించాలని శాస్త్రం చెబుతోంది.